నాకు 55 ఏళ్లు. ఏడాదిగా యూరినరీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. గర్భసంచి జారింది, ఆపరేషన్ చేయాలి అన్నారు. ఆపరేషన్ లేకుండా మందులతో నా సమస్య తగ్గే మార్గం లేదా? – ఎన్. విజయలక్ష్మి, బాల్కొండ
గర్భసంచికి ఉండే సపోర్ట్ స్ట్రక్చర్స్ అయిన లిగమెంట్స్, మజిల్స్‌ని పెల్విక్ ఫ్లోర్ అంటారు. వయసు పైబడుతున్న కొద్దీ పెల్విక్ ఫ్లోర్ బలహీనమవుతూ ఉంటుంది. దాంతో గర్భసంచి, యూరిన్ బ్యాగ్, మోషన్ ఏరియా వదులై జారుతుంది. యూరిన్ బ్యాగ్ ఉన్న స్థానం నుంచి కిందికి జారినప్పుడు యూరిన్ పూర్తిగా ఖాళీ అవకపోవడం, పదేపదే యూరినరీ ఇన్‌ఫెక్షన్స్ రావడం, కాళ్లు, నడుము నొప్పి ఉంటాయి. దీనిని పెల్విక్ ఆర్గాన్ ప్రొలాప్స్ అంటాం.
కారణాలు ఇవే!
యూరిన్ బ్యాగ్ మాత్రమే జారితే cystocele qgzeg.యాభై ఏళ్లు దాటిన వాళ్లలో పదిలో ఎనిమిది మందికి ఇలాంటివి ఉంటాయి. ప్రసవాలు, అధిక బరువు, తీవ్రమైన మలబద్ధకం, తీవ్రమైన దగ్గు, అధిక బరువులను ఎత్తడం, పైబడుతున్న వయసు వంటి కారణాల వల్ల గర్భసంచి జారుతుంది. ఇది డాక్టర్ చేసే ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ ద్వారా తెలుస్తుంది.
యూరినరీ ఇన్‌ఫెక్షన్ కనుక్కోవడానికి వైద్య పరీక్షలు చేస్తారు. అల్ట్రాస్కానింగ్ చేస్తారు. కొందరి విషయంలో యూరోడైనమిక్ స్టడీస్ అవసరం ఉంటుంది. ఈ సమస్యకు చాలా చికిత్సా పద్ధతులున్నాయి. చిన్న ప్రొలాప్స్ అయితే కనుక జీవన శైలిని మార్చుకుని అంటే అధిక బరువు ఉంటే వ్యాయామాలు చేసి బరువు తగ్గించుకోవడం, దగ్గు, మలబద్ధకానికి చికిత్స తీసుకోవడం, అధిక బరువులు ఎత్తకుండా చూసుకోవడం వంటివాటి పట్ల శ్రద్ధ పెట్టి సమస్యను తగ్గించుకోవచ్చు.
చాలా మందికి సర్జరీని అవాయిడ్ చేస్తాం
పెల్విక్ ఫ్లోర్ మజిల్ ఎక్సర్‌సైజెస్ కూడా ఈ సమస్యను తగ్గించుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. ఇవి పెల్విక్ ఫ్లోర్ పటుత్వాన్ని కాపాడుతాయి. బలహీనమైన కండరాలను బలోపేతం చేస్తాయి. మూడు నుంచి ఆరు నెలల వరకు నిపుణుల పర్యవేక్షణలో ఈ వ్యాయామాలను చేస్తే చాలా ప్రయోజనం ఉంటుంది. వెజైనల్ హార్మోన్ క్రీమ్స్ .. ఈస్ట్రోజెన్ క్రీమ్‌తో కూడా ఆ అసౌకర్యం కొంత తగ్గే అవకాశం ఉంది.
vaginal pessary అని సిలికాన్ రింగ్ దొరుకుతుంది. దీన్ని డాక్టర్ పర్యవేక్షణలో వెజైనాలో అమర్చి.. ప్రొలాప్స్ తగ్గుతుందా లేదా అని చూస్తారు. ఈ pessaryని డాక్టరే ప్రిస్క్రైబ్ చేస్తారు. దీంతో చాలా మందికి సర్జరీని అవాయిడ్ చేస్తాం. పైన విధానాలేవీ పనిచేయనప్పుడు సర్జరీ చేయాల్సి వస్తుంది. ఈ ఆపరేషన్‌లో యూరిన్ బ్యాగ్‌ని, గర్భసంచిని పైకి లిఫ్ట్ చేసి సపోర్ట్ చేస్తారు. దీంతో యూరినరీ, పెల్విక్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి.
- డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్, హైదరాబాద్.
చదవండి: Health: ప్రెగ్నెన్సీలో మైగ్రేన్ వస్తే? ఈ టాబ్లెట్లు మాత్రం అస్సలు వాడొద్దు!
Health Tips: ఏడో నెల.. ఆకు కూరలు, పప్పులు, దానిమ్మ రోజూ తినాలి! ఇంకా..
Comments
Please login to add a commentAdd a comment