ప్రతీకాత్మక చిత్రం
బేరియాట్రిక్ సర్జరీ వల్ల వైవాహిక జీవితం సాఫీగా సాగుతుందా? పిల్లల్ని కనడంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తుతాయా? – జి. పూర్ణిమ, వేములవాడ
బాడీమాస్ ఇండెక్స్ (బీఎమ్‌ఐ) అంటే మీ ఎత్తుకు ఎంత బరువు ఉండాలో కాలిక్యులేట్ చేసే పద్ధతి. ఈ బీఎమ్‌ఐ 40 .. అంతకన్నా ఎక్కువ ఉన్నవారిలో ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ.
వైవాహిక జీవితంలో సమస్యలు?
అధిక బరువుతో ఉండీ.. ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నవారికి.. డయాబెటిస్, హై బీపీ, స్లీప్ ఆప్నియా వంటివి తగ్గించుకోవడానికి కొన్నిసార్లు బేరియాట్రిక్ సర్జరీని సూచిస్తున్నారు. బేరియాట్రిక్ సర్జరీ చేసుకున్న తరువాత వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలూ ఉండవు. కానీ భవిష్యత్‌లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి కనీసం ఏడాది నుంచి రెండేళ్లు గ్యాప్ ఇవ్వాలి.
ప్రత్యేకంగా టెస్టులు
విటమిన్ సప్లిమెంట్స్, మైక్రోన్యూట్రైంట్స్, ఫోలిక్ యాసిడ్ వంటివి ముందుగానే ఇవ్వాలి. హైరిస్క్ ప్రెగ్నెన్సీలాగా ప్రెగ్నెన్సీ టైమ్ అంతా మల్టీడిసిప్లినరీ టీమ్‌తో చూపించుకోవాలి. బీఎమ్‌ఐ తగ్గటం వల్ల హై బీపీ, హై సుగర్ చాన్సెస్ తగ్గుతాయి.
జెస్టేషనల్ డయాబెటిస్ ఉందా అని అందరికీ చేసే టెస్ట్స్ కాకుండా వాళ్లకు ప్రత్యేకంగా టెస్ట్స్ చేస్తారు. బేరియాట్రిక్ సర్జరీ కాంప్లికేషన్స్ కూడా అబ్జర్వ్ చేయాలి. సర్జన్, డైటీషియన్, సైకాలజిస్ట్‌ల ఫాలో అప్‌లో ఉండాలి. డెలివరీ డెసిషన్ అనేది ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్‌ని బట్టి తీసుకోవాలి.
-డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment