ప్రతీకాత్మక చిత్రం
మా అమ్మాయికి పదిహేడేళ్లు. ఇంకా రజస్వల కాలేదు. ఏ అనారోగ్యమూ లేదు. అయినా రజస్వల ఎందుకు కావట్లేదో తెలియడం లేదు. – అనూరాధ, చింతలపూడి
డిలేయ్డ్ మెనాకీ
సాధారణంగా పదమూడేళ్ల లోపు బ్రెస్ట్ డెవలప్‌మెంట్, పదహారేళ్లలోపు నెలసరి మొదలు అవుతాయి. పదహారేళ్ల తర్వాత కూడా రాకపోతే డిలేయ్డ్ మెనాకీ (delayed menarche) అంటాము. చాలామంది అమ్మాయిలు తక్కువ బీఎమ్‌ఐ.. అంటే ఎత్తుకు తగ్గ బరువు నిష్పత్తి 17 కన్నా తక్కువ ఉంటే బరువు పెరిగిన తర్వాతే నెలసరి మొదలవుతుంది.
కొంమందిలో హార్మోన్స్ ఇంబాలెన్స్, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇలా ఆలస్యంగా రజస్వల అవుతారు. ఎండోక్రైనాలజిస్ట్ (హార్మన్ డాక్టర్)ను సంప్రదించాల్సి రావచ్చు. సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అంటే ఆక్సిలా, ప్యూబిక్ ఏరియాలో హెయిర్ గ్రోత్ ఉండడం, బ్రెస్ట్ డెవలప్‌మెంట్ మొదలవడం కనుక ఉంటే హార్మోన్ల పరీక్ష అవసరం లేదు.
తక్కువ బరువు ఉన్నా
ఆలస్యంగానైనా నెలసరి మొదలవ్వొచ్చు. కానీ పదిహేడేళ్లు దాటినా ఇలాంటి మార్పులేనప్పుడు వెంటనే గైనకాలజిస్ట్ లేదా ఎండోక్రైనాలజిస్ట్‌ను సంప్రదించాలి. స్పోర్ట్స్‌లో యాక్టివ్‌గా ఉన్నవారిలో కూడా పీరియడ్స్ లేట్‌గానే మొదలవుతాయి.
వయస్సుకి ఉండాల్సిన బరువు కన్నా తక్కువ బరువు ఉన్నా నెలసరి ఆలస్యంగానే మొదలువుతుంది. ఒకసారి స్కానింగ్ చేయించి, డాక్టర్‌ను సంప్రదిస్తే .. థైరాయిడ్ పరీక్ష చేసి ఏ సమస్యాలేదు అంటే.. నెలసరి కోసం వేచి చూడవచ్చు.
-డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్, హైదరాబాద్
చదవండి: ఫోర్స్ చేస్తున్నారు
Comments
Please login to add a commentAdd a comment