Gynecologist
-
ఈ వయసులో ఇలాంటి సర్జరీతో కాంప్లికేషన్స్ అంటున్నారు.. నిజమేనా?
నా వయసు 35 సంవత్సరాలు. ముగ్గురు పిల్లలు. నాకు ట్యూబ్స్, ఓవరీస్‌లో ఇన్ఫెక్షన్ ఉందని ఈమధ్యే సర్జరీ చేసి రెండు ఓవరీస్‌ను తీసేశారు. ఈ వయసులో ఇలాంటి సర్జరీతో కాంప్లికేషన్స్ ఉంటాయి అంటున్నారు. నిజమేనా? – లక్ష్మీపద్మజ, కిసాన్నగర్ఓవరీస్ అనేవి పిల్లలు కావటానికి మాత్రమే కాదు, అవి కొన్ని హార్మోన్స్‌ని రిలీజ్ చేయ్యటం వలన ఆరోగ్యానికీ చాలా అవసరం. 50 నుంచి 55 సంవత్సరాల మధ్య అండాల విడుదల ఆగిపోయా, ఓవరీస్ ఎండిపోతాయి. అప్పుడు ఇంక హార్మోన్స్ విడుదల ఉండదు. నెలసరి కూడా ఆగిపోతుంది. దాన్ని నేచురల్ మెనోపాజ్ అంటాం. కానీ 50 ఏళ్లలోపు ఏ కారణంతో అయినా సర్జరీ ద్వారా ఓవరీస్‌ను తొలగిస్తే దానిని సర్జికల్ మెనోపాజ్ అంటాం. చిన్న వయసులో హఠాత్తుగా పీరియడ్స్ ఆగిపోతాయి. హర్మోన్స్ రిలీజ్ ఆగిపోతుంది. ఇలా సర్జరీ తర్వాత మెనోపాజ్ వచ్చిన వాళ్లకి చాలా సింప్టమ్స్ ఉంటాయి. ఒంట్లోంచి వేడివేడి పొగలు రావడం, రాత్రుళ్లు చెమటపట్టడం, గుండె దడ, మూడ్ స్వింగ్స్, యాంగ్జయిటీ, నిద్ర పట్టకపోవడం, నీరసం, మతిమరుపు, వజైనల్ డ్రైనెస్, యూరీనరీ ఇన్ఫెక్షన్స్, జాయింట్ పెయిన్స్, చర్మం పొడిబారిపోవడం వంటివి ఉంటాయి. అయితే వీటన్నిటినీ జీవనశైలి మార్పుతో తగ్గించుకోవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం, పోషకాహారాన్ని తీసుకోవడం, కాఫీ, టీలను తగ్గించడం, మసాలా ఫుడ్‌కి దూరంగా ఉండటం, ఒత్తిడి తగ్గించుకోవటం, మెడిటేషన్, రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ వంటివాటితో మెనోపాజ్ ఇబ్బందులను చాలావరకు పరిష్కరించుకోవచ్చు. ఆరోగ్య సమస్యలను విభజించి.. పాజిటివ్ అప్రోచ్‌తో డీల్ చెయ్యడాన్ని టాకింగ్ థెరపీ అంటారు. దీంతో కూడా ప్రిమెనోపాజ్ సింప్టమ్స్‌ను తగ్గించవచ్చు. సింప్టమ్స్ తీవ్రంగా ఉన్న వారికి ఇలాంటివేమీ పనిచేయకపోవచ్చు. అలాంటివారికి డాక్టర్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ (హెచ్ఆర్టీ)ని సూచిస్తారు. హార్మోన్స్‌ని టాబ్లెట్ రూపంలో ఇవ్వడమే హెచ్ఆర్టీ. ఇవి జెల్స్, ప్యాచెస్, స్ప్రేలుగానూ అందుబాటులో ఉన్నాయి. ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది గుండె, ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం. ప్రొజెస్టిరాన్ హార్మోన్ గర్భసంచి ఆరోగ్యానికి అవసరం. మీకు గర్భసంచి తీయలేదు కాబట్టి కేవలం ఈస్ట్రోజన్ మాత్రమే ఇస్తే సరిపోదు. ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ రెండూ ఇవ్వాలి. కుటుంబంలో గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ల చరిత్ర ఉన్నవారికి హెచ్ఆర్టీ మంచిది కాదు. అలాంటివారికి కొన్ని ప్రత్యామ్నాయ మందులను సూచిస్తారు. వాటిని ఎస్సెస్సారై ( ఖఐ) అంటారు. ఈ మెడిసిన్‌ను డాక్టర్ మాత్రమే ప్రిస్క్రైబ్ చేస్తారు. వజైనా డ్రైనెస్, ఇచింగ్ తగ్గడానికి వజైనల్ ఈస్ట్రోజన్ క్రీమ్స్‌ను సూచిస్తారు. ఇలా ఒక్కోవ్యక్తికి వాళ్ల వాళ్ల ఆరోగ్యపరిస్థితిని బట్టి సరైన చికిత్సను అందిస్తే రిస్క్, కాంప్లికేషన్స్ తగ్గి, ఆరోగ్యం మెరుగుపడుతుంది.నాకు మూడు సిజేరియన్స్ అయ్యాయి. మొదటి ఆపరేషన్ తర్వాత కుట్ల మీద నల్లటి పెద్ద మచ్చ ఏర్పడింది. దాన్ని కెలాయిడ్ అంటారని చెప్పారు. చివరి రెండు సర్జరీల్లో దాన్ని తొలగించినా, మళ్లీ ఏర్పడింది. అక్కడ చర్మం పొడిబారిపోయి.. దురదగా ఉంటోంది. ఇది శాశ్వతంగా ఉంటుందా? దీనికి ట్రీట్మెంట్ లేదా? – అంజలి, వైజాగ్సిజేరియన్స్కి పెద్దగా కోత పెడతాం కాబట్టి ఆ ఆపరేషన్ తర్వాత వచ్చే కెలాయిడ్స్ పెద్దగానే ఉంటాయి. ఈ టెండెన్సీ ఉన్న వారిలో తర్వాత డెలివరీలో ఆ కెలాయిడ్ స్కార్ను తీసేసినా హీలింగ్ ప్రాసెస్‌లో మళ్లీ ఫామ్ అవుతుంది. కొంచెం లైట్‌గా ఉన్న కెలాయిడ్ స్కార్‌కి అయితే కార్టిసోన్ అనే స్టెరాయిడ్ క్రీమ్ లేదా ఇంజెక్షన్స్‌ని ట్రై చేస్తారు. వీటిని అనుభవజ్ఞులైన డెర్మటాలజిస్ట్ పర్యవేక్షణలోనే తీసుకోవాలి. ఈ ఇంజెక్షన్లను నెలకొకటి చొప్పున ఆరునెలల పాటు వాడినవారిలో ఈ మచ్చ ఫేడ్ అవటం కనిపించింది. అయితే కొంతమందికి పిగ్మెంటేషన్ స్కార్స్ కూడా రావచ్చు. కొంతమందిలో ఈ స్టెరాయిడ్ క్రీమ్ వల్ల సైడ్ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. క్రిప్టోథెరపీ అని.. లిక్విడ్ నైట్రోజన్‌ను అప్లై చేసిన కొంతమందిలో మంచి రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. Pulsed dye laser థెరపీ ద్వారా 80 నుంచి 90 శాతం కెలాయిడ్ స్కార్‌ని తగ్గించవచ్చు. ఈ ట్రీట్మెంట్ 4 నంచి 8 వారాలుంటుంది. లో లెవెల్ రేడియోథెరపీ అనేది అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్. దీంతో మచ్చ మాసిపోవడమే కాక, దురద, అనీజీనెస్ కూడా తగ్గుతాయి. ఈ చికిత్సను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలోనే తీసుకోవాలి. కెలాయిడ్ స్కార్‌ని ఆపరేషన్ ద్వారా తీసేసి, 48 గంటల్లోపే ఫస్ట్ డాక్స్ ఆఫ్ ఎక్స్–రే థెరపీని ఇస్తారు. వారం తర్వాత రెండో డాక్స్‌ను ఇస్తారు. ఈ ప్రోసీజర్కు 2 నుంచి 3 గంటలు పడుతుంది. నొప్పి ఉండదు. కొన్ని షార్ట్‌టర్మ్ సైడ్ఎఫెక్ట్స్ 2 నుంచి 3 వారాలు ఉండి తగ్గిపోతాయి. కొంచెం మంట ఉంటుంది. దీనికి డ్రెస్సింగ్‌ను సూచిస్తారు. లాంగ్‌టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్.. అంటే కొంతమందికి 3 నుంచి 6 నెలల తర్వాత స్కిన్ డార్క్ అవటం, పింగ్మేంటేషన్ కనిపిస్తుంది. సన్‌స్క్రీన్ వాడాల్సి వస్తుంది. పాజిటివ్ అప్రోచ్‌తో డీల్ చెయ్యడాన్ని టాకింగ్ థెరపీ అంటారు. దీంతో కూడా ప్రిమెనోపాజ్ సింప్టమ్స్‌ను తగ్గించవచ్చు. సింప్టమ్స్ తీవ్రంగా ఉన్న వారికి ఇలాంటివేమీ పనిచేయకపోవచ్చు. -
ప్రెగ్నెన్సీలో కాఫీ తాగడం.. ఎంతవరకూ మంచిదంటే?
నాకిప్పుడు 4వ నెల. రోజుకు అయిదారుసార్లు కాఫీ తాగుతాను. ప్రెగ్నెన్సీలో కాఫీ అంత మంచిది కాదు మానేయమని మా ఫ్రెండ్స్ చెబుతున్నారు. కానీ కాఫీ తాగకపోతే నాకు తలనొప్పి వచ్చేస్తుంది. నిజంగానే ప్రెగ్నెన్సీ టైమ్‌లో కాఫీ మంచిది కాదా? – సంగీత కృష్ణ, హైదరాబాద్కెఫీన్ అనేది చాలా ఫుడ్ అండ్ బేవరేజెస్లో ఉంటుంది. కాఫీ, టీ, చాకోలెట్, కోకో ప్రొడక్ట్స్, కోలాస్, సాఫ్ట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, జలుబు, జ్వరానికి సంబంధించిన కొన్ని మందుల్లో, ఎలర్జీ, డైట్ పిల్స్, డైటరీ సప్లిమెంట్స్‌లో కూడా కొంత శాతం కలుస్తుంది. ప్రత్యేకించి కాఫీలో అయితే 50 నుంచి 70 శాతం కెఫీన్ ఉంటుంది. కెఫీన్ వల్ల గర్భిణీల్లో వచ్చే మార్పుల మీద చాలా థియరీలే ఉన్నాయి.కానీ వంద శాతం ఏదీ నిర్ధారణ కాలేదు. అయితే కాఫీ తీసుకోవడం వల్ల అందులోని కెఫీన్ ప్లసెంటా ద్వారా పొట్టలోని బిడ్డకూ చేరుతుంది. ఈ క్రమంలో బిడ్డ ఎదుగుదల మీద ఏదైనా ప్రభావం కనపడితే దానికి చాలా రకాల కారణాలూ తోడవుతాయి తప్ప ఆ ప్రభావానికి కెఫీనే ప్రధాన కారణమని ప్రూవ్ చేయడం కష్టం. సాధారణంగా ఒక కప్పు కాఫీలో వంద మిల్లీగ్రాముల దాకా కెఫీన్ ఉండవచ్చు. కెఫీన్ మెటబాలైట్స్ని గర్భిణీ రక్తంలో మాత్రమే చెక్ చేయగలం. కానీ అలా ప్రతిరోజూ టెస్ట్ చేయడం ప్రాక్టికల్‌గా అసాధ్యం.కెఫీన్ మీద ఇప్పటివరకు జరిగిన అన్నిరకాల అధ్యయనాల్లో .. తక్కువ నుంచి ఓ మోస్తరు వరకు కాఫీ సేవనం వల్ల గర్భిణీలకు పెద్ద హాని ఏమీ ఉండకపోవచ్చనే తేలింది. అధిక మోతాదులో అంటే రోజుకు 300 మిల్లీగ్రాముల కన్నా ఎక్కువ కెఫీన్‌ని తీసుకునే వారిలో గర్భస్రావాలు, తక్కువ బరువుతో శిశు జననం వంటి ప్రమాదాలు ఉండవచ్చు. ఏదేమైనా ప్రెగ్నెన్సీ సమయంలో కెఫీన్‌తో పాటు పొగాకు, సిగరెట్ , మద్యం లాంటి వాటికి దూరంగా ఉండటమే క్షేమం. – డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
ఇక్కడంతా ప్రసెస్డ్.. ఎలాంటి ఫుడ్ తినాలి
నేను దుబాయ్‌లో ఉంటాను. ఇప్పుడు నాకు మూడో నెల. ఇక్కడంతా ప్రాసెస్డ్ అండ్ క్యాన్డ్ ఫుడ్ ఎక్కువగా వాడతారు. హెల్దీ బేబీ కోసం నేను ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో సజెస్ట్ చేయగలరు. – చరిత రెడ్డి. తాజా పళ్లు, ఆకు కూరలు, కూరగాయలు అన్నీ తినొచ్చు. పాశ్చరైజ్డ్ సాఫ్ట్ చీజ్ అంటే కాటేజ్ చీజ్ (పనీర్), మోజారెల్లా క్రీమ్ చీజ్ వంటివి తీసుకోవచ్చు. పాశ్చరైజ్డ్ మిల్క్, యోగర్ట్, క్రీమ్, ఐస్‌క్రీమ్ తినొచ్చు. అన్‌పాశ్చరైజ్డ్ చీజ్, మిల్క్, బ్లూ చీజ్, పాశ్చరైజ్ చేయని గేదె పాలు, మేక పాలు తీసుకోకూడదు. ఎందుకంటే పాశ్చరైజ్ చేయనివాటిలో Listeria బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ప్రెగ్నెన్సీలో listeriosis అనే ఇన్ఫెక్షన్ని కలగజేసి గర్భస్రావానికి కారణమవుతుంది. కడుపులోని బిడ్డ ఆరోగ్యం మీదా ప్రభావం చూపిస్తుంది. మాంసాహారం తినేవారు చికెన్‌ని బాగా ఉడికించి తినాలి. ప్రెగ్నెన్సీలో ఇంట్లో వండిన ఆహారాన్నే తీసుకుంటే మంచిది. రా, అన్కుక్డ్ మీట్, లివర్ ప్రొడక్ట్స్‌ని అసలు తీసుకోకూడదు. అన్కుక్డ్ మీట్ వల్ల Toxoplasmosis అనే ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇది తల్లి నుంచి బిడ్డకు చేరుతుంది. గర్భస్రావానికి ఈ ఇన్ఫెక్షనూ ఒక కారణమవుతుంది. లివర్‌లో అధిక మోతాదులో విటమిన్ ఎ ఉంటుంది. ఇది గర్భస్థ శిశువుకు హాని చేస్తుంది. కోడిగుడ్లను బాగా ఉడికించి తినొచ్చు. హాఫ్ బాయిల్డ్, హాఫ్ కుక్డ్ ఎగ్స్‌ని అసలు తినకూడదు. ఇలా సగం ఉడికిన ఆహారం వల్ల సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ వస్తుంది. ఫిష్ విషయానికి వస్తే సీ ఫిష్, షెల్ ఫిష్, రొయ్యలను కూడా పూర్తిగా వండినవే తినాలి. అదీ వేడివేడి ఆహారపదార్థాలనే తీసుకోవాలి. నాకు తరచు యూరినరీ ఇన్ఫెక్షన్ వస్తోంది. రోజూవారీ జాగ్రత్తలేమైనా చెప్పగలరా? – సరిత పవార్, భైంసా యూరినరీ ఇన్ఫెక్షన్ అనేది సర్వసాధారణంగా కనిపించే సమస్య. దీనికి ప్రధాన కారణం తగినంత నీరు తాగకపోవటం. ప్రతి ఒక్కరూ వాళ్ల బరువుని బట్టి రోజూ లిక్విడ్స్ తీసుకోవాలి. ఒక కేజీకి ఇరవై ఐదు ఎమ్.ఎల్ అని సూచిస్తాం. అంటే యాభై కేజీల బరువున్నవారు 1.2 లీటర్లు తీసుకోవాలి. ఎప్పుడైతే మీరు తక్కువ నీరు తీసుకుంటారో యూరినరీ బ్లాడర్‌లో ఇరిటేషన్ స్టార్ట్ అయి, ఎక్కువ సార్లు యూరిన్ వస్తుంది. దీంతోపాటు తొందరగా వెళ్లాలనీ అనిపిస్తుంది. అప్పుడు యూరిన్ ముదురు పసుపు రంగు, గాఢమైన వాసనతో ఉంటుంది. హెల్దీ బ్లాడర్ కోసం రోజూ 1.5 లీటర్ల నుంచి 2 లీటర్ల నీరు తాగాలి. చల్లటి పండ్ల రసాలు, కూల్ డ్రింక్స్‌లలో స్పార్కి్లంగ్ వాటర్‌తో కార్బన్‌డైయాక్సైడ్ కలసి యూరిన్‌ని అసిడిక్‌గా మారుస్తుంది. ఇది యూరినరీ ఇన్ఫెక్షన్కు కారణంగా చెప్పచ్చు. అందుకే కార్బొనేటెడ్ డ్రింక్స్ తాగకూడదు. కెఫీన్ బ్లాడర్‌ని ఉత్తేజపరస్తుంది. టీ, గ్రీన్ టీ, కాఫీ, హాట్ చాక్లెట్, ఎనర్జీ డ్రింక్స్‌లో కెఫీన్ ఉంటుంది. కొన్ని పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్‌లలో కూడా ఉంటుంది. ఇవి ఎక్కువగా తీసుకుంటే బ్లాడర్‌లో యూరిన్ పెరిగి ఎక్కువ సార్లు యూరిన్‌కి వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు కూడా ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి. ద్రాక్ష , నిమ్మ, పైనాపిల్, ఆరెంజ్ పండ్ల రసాలు అసిడిక్‌గా ఉంటాయి. ఇవి కూడా బ్లాడర్‌ని ఇరిటేట్ చేస్తాయి. ఈ పండ్ల రసాలను ఒక గ్లాసు కంటే ఎక్కువ తాగకూడదు. హెర్బల్ టీ, బార్లీ వాటర్ మంచివి. ఇవి ఎంత తాగినా అసిడిక్ గా ఉండవు కాబట్టి యూరినరీ ఇన్ఫెక్షన్స్ తక్కువ. అయితే, యూరిన్‌లో రక్తం కనిపిస్తే వెంటనే డాక్టర్ని కలవాలి. కొన్ని బ్లడ్ ఇన్ఫెక్షన్ పరీక్షలు చేయించుకోవాలి. చాలామందికి చాలాసార్లు యూరిన్‌కి వెళ్తే ఫ్రీక్వెంట్ యూరిన్ అంటారనే అనుమానం ఉంటుంది. రోజుకు 8 నుంచి 10 సార్ల కన్నా ఎక్కువసార్లు యూరిన్‌కి వెళ్లాల్సివస్తే.. దానిని ఫ్రీక్వెంట్ యూరిన్ అంటారు. సాధారణంగా రోజుకు 4 నుంచి 7 సార్లు కామన్. ఈ సంఖ్య పెరిగినప్పుడు డాక్టర్ని కలవటం మంచిది. మలబద్ధకం, యూరిన్ ఇన్ఫెక్షన్స్కు ఎక్కువగా టీ, కాఫీ, చల్లటి పానీయాలు కారణం. ఇందుకు రెగ్యులర్‌గా ‘బ్లాడర్ ట్రైనింగ్’ను సూచిస్తాం. అంటే బ్లాడర్ మజిల్ శక్తిని పెంచటం. అప్పుడు బ్లాడర్ ఎక్కువ కెపాసిటీ యూరిన్‌ను హోల్డ్ చేస్తుంది. యూరిన్‌కి వెళ్లే ముందు ఐదు నిమిషాల పాటు హోల్డ్ చేయటానికి ప్రయత్నించండి. దీంతో యూరిన్ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. ఎక్కువ లిక్విడ్స్ తీసుకుంటూ ఈ స్థితితో బ్లాడర్‌ని ట్రైన్ చేయొచ్చు. అయినా మూత్ర పరీక్షలో యూరిన్ ఇన్ఫెక్షన్స్ నిర్ధారణైతే, ట్రీట్మెంట్ తీసుకోవాలి. తర్వాత ఈ బ్లాడర్ ట్రైనింగ్ చేయాలి. యూరిన్ ఫ్లో టెస్ట్, కొన్ని యూరిన్ డయాగ్నసిస్ స్టడీస్ పరీక్షల ద్వారా యూరినరీ బ్లాడర్ ప్రాబ్లమ్స్‌ను తెలుసుకోవచ్చు. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
అది ఏ వయసు వారికి?
సర్విక్స్ క్యాన్సర్ రాకుండా టీకా ఉంది అంటున్నారు కదా.. దాన్ని ఏ వయసువారైనా తీసుకోవచ్చా? – ఎన్. విజయలక్ష్మి, హిందూపూర్ సర్విక్స్ క్యాన్సర్ అనేది చాలావరకు 65 ఏళ్లు దాటినవారిలో ఎక్కువగా కనపడుతుంది. కానీ కొన్నిసార్లు చిన్న వయసులోనే అంటే 25 ఏళ్లకి కూడా రావచ్చు. చాలా అధ్యయనాల తరువాత టీనేజ్లోనే అమ్మాయిలకు వ్యాక్సీన్ ఇస్తే భవిష్యత్‌లో సర్విక్స్ క్యాన్సర్‌ని నివారించవచ్చు అని రుజువు అయింది. హ్యూమన్ పాపిలోమా వైరస్ టైప్స్ 16, 18 ద్వారా సర్విక్స్ క్యాన్సర్ వస్తుంది. కాబట్టి అది రాకుండా చిన్న వయసులోనే వ్యాక్సీన్ ఇస్తున్నారు. 9 ఏళ్ల నుంచి ఈ వ్యాక్సీన్ ఇవ్వొచ్చు. పిల్లల డాక్టర్, గైనకాలజిస్ట్‌లను సంప్రదిస్తే ఎవరికి ఎప్పుడు ఇవ్వాలో సూచిస్తారు. 11–12 ఏళ్ల వయసులో కనీసం మొదటి డోస్ వ్యాక్సీన్ ఇస్తే మంచిది. ఈ వ్యాక్సీన్ మూడు డోసుల్లో ఉంటుంది. నెలకి, 6 నెలలకి రెండవ, మూడవ డోసులను ఇస్తారు. ఈ వ్యాక్సీన్‌తో చాలావరకు.. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 9 ఏళ్ల నుంచి 26 ఏళ్ల లోపు వ్యాక్సీన్ తీసుకున్నవారిలో వ్యాక్సీన్ బాగా పనిచేస్తుంది. కొంతమందికి అంటే క్యాన్సర్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారికి మాత్రం 27–45 ఏళ్లకి కూడా ఇస్తున్నారు. కానీ ఇది డాక్టర్ పర్యవేక్షణలోనే తీసుకోవాలి. హ్యూమన్ పాపిలోమా వైరస్ ఎక్కువగా లైంగిక సంపర్కం ద్వారా వ్యాపిస్తుంది. అందుకే పెళ్లికి ముందే వ్యాక్సీన్ ఇవ్వటం మంచిది. చిన్న వయసులో ఇమ్యూనిటీ కూడా బాగుంటుంది కాబట్టి ఇమ్యూన్ రెస్పాన్స్ ఎక్కువకాలం ఉంటుంది. ఇప్పుడు Gardasil 9 అనే సర్విక్స్ క్యాన్సర్ వ్యాక్సీన్‌ను ఇస్తున్నారు. యీస్ట్ అలెర్జీ ఉన్నా.. ఫస్ట్ డోస్ హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సీన్‌కి అలెర్జీ వచ్చినా తరువాత డోస్‌లను తీసుకోకూడదు. 25 ఏళ్లు దాటిన వారికి పాప్ స్మియర్ టెస్ట్ చేసి.. సర్విక్స్ క్యాన్సర్ వ్యాక్సీన్‌ను ఇస్తారు. నాకిప్పుడు పాతికేళ్లు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ని. రోజుకి పది గంటలు వర్క్ చేస్తాను. కొన్నాళ్లుగా నడుము కింది భాగమంతా నొప్పిగా ఉంటోంది. అది కాళ్ల దాకా లాగుతోంది. ఈ నొప్పికి పెయిన్ కిల్లర్స్ వాడొచ్చా? మెడికల్ షాప్‌లో అడిగి కొనుక్కోవచ్చా? – పేరు రాయలేదు, హైదరాబాద్ నడుము కింది భాగంలో నొప్పి అంటే నడుము నొప్పి, సోర్నెస్, స్టిఫ్‌గా ఉండి సయాటికా పెయిన్ అంటే నొప్పి వెనుక నుంచి రెండు కాళ్లల్లోకి రావడం. కొంతమందికి తిమ్మిర్లు కూడా వస్తాయి. సయాటికా నర్వ్ అనేది బ్యాక్ నుంచి నడుము, కాళ్లు, పాదాల్లోకి వెళ్తుంది. ఈ నర్వ్ ఒత్తిడికి గురైనా.. ఇరిటేట్ అయినా నొప్పి వస్తుంది. మీరు ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తే.. ఈ పెయిన్ ఏమైనా బోన్ ఇన్ఫెక్షన్కి సంబంధించిందా లేక వెంట్రుక మందం ఫ్రాక్చర్ ఏమైనా ఉందా లేదా అరుదుగా బోన్ క్యాన్సర్ ఏమైనా కావచ్చా అని మొదటగా రూల్ అవుట్ చేస్తారు. చేసి.. ఫిజియోథెరపిస్ట్, పెయిన్ స్పెషలిస్ట్ టీమ్‌కి రిఫర్ చేసి.. ఆ నొప్పికి కారణమేంటో కనిపెడతారు. ఎక్స్‌రే లేదా ఎమ్ఆర్ఐ తీస్తారు. మీ రోజూవారీ పనికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. అలాగే ఏ మందులు వాడాలో సూచిస్తారు. కొంతమందిలో మందుల్లేకుండానే కొన్ని స్పెషల్ ఎక్సర్సైజెస్, ఫిజికల్ యాక్టివిటీస్ ద్వారా లో బ్యాక్ పెయిన్‌ని మేనేజ్ చేయవచ్చు. బెల్టులు, corsets, ఫుట్ సపోర్ట్ షూస్ వంటివేమీ నొప్పిని తగ్గించడంలో సహాయపడవు. అలాగే ఆక్యూపంక్చర్,ట్రాక్షన్, ఎలక్ట్రోథెరపీ లాంటివీ చాలామందికి పనిచేయవు. వీటివల్ల కొన్నిసార్లు ఇబ్బంది ఎక్కువయ్యే ప్రమాదమూ ఉంటుంది. డాక్టర్ మిమ్మల్ని పరీక్షించి.. మీ వయసు, మీ వృత్తిని బట్టి మీకు ఏ విధమైన చికిత్స సరిపోతుందో ఆ చికిత్సను సూచిస్తారు. NSAIDs(పెయిన్ కిల్లర్స్)ని సాధారణంగా మొదటి దశలో నొప్పి నుంచి ఉపశమనానికి వాడొచ్చు. కానీ వీటివల్ల కడుపులో నొప్పి, అల్సర్లు కావచ్చు. అందుకే యాంటాసిడ్స్ కూడా తీసుకోవాలి. opioids అనేవి చాలా బాగా రిలీఫ్‌నిస్తాయి. అయితే వీటిని తక్కువ మోతాదులో.. చాలా తక్కువ రోజులు మాత్రమే వాడాలి. ఇవేవీ పనిచేయనప్పుడు ఆపరేషన్ గురించి ఆలోచించవచ్చు. అంటే ఈ బ్యాక్ పెయిన్‌కి కారణమవుతున్న నర్వ్‌ని బ్లాక్ చేయడం, లోకల్ ఎనస్తీషియా లేదా స్పైన్‌లోకి స్టెరాయిడ్స్ ఇంజెక్షన్స్ ఇవ్వడం, బ్యాక్ సర్జరీతో నర్వ్ మీద ఒత్తిడి తగ్గించడం లాంటి పరిష్కారాలన్నమాట. స్ట్రెయిన్, స్లిప్డ్ డిస్క్ లాంటివి మందులతో తగ్గుతాయి. మీ జీవనశైలిని కొంత మారిస్తే కూడా బ్యాక్ పెయిన్ తగ్గవచ్చు. బరువు పెరగకుండా చూసుకోవడం, యాక్టివ్‌గా ఉండడం, రోజూవారీ ఇంటి పనులను మీరే చేసుకోవడం, కాల్షియం సప్లిమెంట్స్‌ని తీసుకోవడం, Ibuprofen, పారాసిటమాల్ లాంటి మాత్రలను తక్కువ మోతాదులో వాడటం, ఐస్ ప్యాక్‌తో బ్యాక్ పెయిన్‌కి కాపడం పెట్టుకోవడం, హాట్ ప్యాక్‌తో జాయింట్స్ దగ్గర స్టిఫ్నెస్ను, మజిల్స్ స్పాజమ్ని తగ్గించడం, క్రమం తప్పకుండా బ్యాక్ స్ట్రెచెస్ చెయ్యడం లాంటివాటితో నొప్పిని తగ్గించే వీలుంది. ఎక్కువ సమయం బెడ్ రెస్ట్ తీసుకోకూడదు. సైకలాజికల్ థెరపీస్ అంటే కాగ్నిటివ్ బిహేవియరల్ అప్రోచ్‌తో కూడా బ్యాక్ పెయిన్‌ను మేనేజ్ చేయొచ్చు. చాలామందికి ఇది పనిచేస్తుంది. మందులను మాత్రం డాక్టర్లు తక్కువ మోతాదులో.. అదీ అతి తక్కువ రోజులకు మాత్రమే ప్రిస్క్రైబ్ చేస్తారు. నొప్పి తీవ్రత తగ్గాక.. స్ట్రెచింగ్, మసాజ్‌లు, కొన్ని రకాల ఎక్సర్‌సైజ్‌లను సూచిస్తారు. మూడు నెలల కంటే తక్కువ రోజులు బ్యాక్ పెయిన్ ఉంటే దాన్ని అక్యూట్ పెయిన్ అంటారు. ఆ నొప్పికి పెయిన్ రిలీఫ్ మందులు పనిచేస్తాయి. మూడు నెలల కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని క్రానిక్ పెయిన్ అంటారు. దీని చికిత్సకు టీమ్ అప్రోచ్ అవసరం. డా.భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్,హైదరాబాద్ -
ఆ వయసులో పెళ్లి చేసుకుంటే పిల్లలు వైకల్యంతో పుడతారా?
నాకిప్పుడు 30 ఏళ్లు. పెళ్లై ఏడాది అవుతోంది. ఈ వయసులో ప్రెగ్నెన్సీ వస్తే మానసిక వైకల్యం ఉన్న పిల్లలు పుట్టే చాన్స్ ఎక్కువ అంటున్నారు. నాకు భయంగా ఉంది. పిల్లల కోసం మందులు వాడాలా? నిజంగానే మానసిక వైకల్యంతో పిల్లలు పుడతారా? – మాదిరాజు శ్యామల, కొల్లాపూర్ మీకు పెళ్లై ఏడాది అవుతోంది అంటున్నారు. మీరిప్పటికిప్పుడు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసినా పరవాలేదు. 35 ఏళ్లు దాటిన తరువాత జన్యులోపాలు, మెదడులోపాలు.. ముఖ్యంగా డౌన్ సిండ్రోమ్‌తో పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువ. లేట్ మ్యారెజెస్ వల్ల ఈ రోజుల్లో 30 ఏళ్లు దాటిన తర్వాతే తొలిచూలు కాన్పులను చూస్తున్నాం. ఒకవేళ మీరు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే గనుక ఫోలిక్ యాసిడ్ 5ఎమ్జీ మాత్రలు, బి– కాంప్లెక్స్ మాత్రలను తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల పుట్టబోయే బిడ్డలో స్పైన్, నర్వ్ ప్రాబ్లమ్స్ తక్కువుంటాయి. మీది మేనరికం అయితే.. ఒకసారి జెనెటిక్ కౌన్సెలర్స్‌ని కలవాలి. కేవలం వయసు ఎక్కువ ఉండటం వల్ల మాత్రమే అంగవైకల్యం వస్తుందనే భయాన్ని పెట్టుకోకండి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తరువాత హైరిస్క్ ప్రెగ్నెన్సీస్‌ని చూసే ఆసుపత్రిలోని డాక్టర్ని సంప్రదించండి. 3వ నెల, 5వ నెలల్లో ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్‌తో స్కాన్స్ చేయించుకుంటే చాలావరకు కంజెనిటల్ అబ్నార్మలిటీస్ని కనిపెడతారు. 30 ఏళ్ల వయసు దాటిన గర్భిణీలకు.. 11–12 వారాల ప్రెగ్నెన్సీలో డౌన్ సిండ్రోమ్ స్క్రీనింగ్ అని స్కాన్, రక్త పరీక్ష తప్పకుండా చేస్తారు. దీనిద్వారా మూడు రకాల క్రోమోజోమ్ ప్రాబ్లమ్స్‌ని కనిపెట్టవచ్చు. ఒకవేళ వాటి ఫలితం పాజిటివ్‌గా వస్తే అడ్వాన్స్డ్ టెస్ట్స్ లాంటివి హైరిస్క్ ప్రెగ్నెన్సీస్‌ని చూసే ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంటాయి. మీరు ప్రెగ్నెన్సీ కోసం ఇప్పటికే ఏమైనా ప్రయత్నించారా? ఒకవేళ ప్రయత్నించినా రాకపోతే .. భార్య, భర్తకు కొన్ని పరీక్షలను చేయించుకోమని సూచిస్తారు. ఆ పరీక్షల్లో ఏమైనా సమస్యలు ఉన్నట్లు తేలితే అవి సరిచేసి.. ప్రెగ్నెన్సీ రావడానికి మందులు ఇస్తారు. మీరు ఒకసారి గైనకాలజిస్ట్‌ని కలసి రొటీన్ చెకప్ చేయించుకోండి. ప్రెగ్నెన్సీకి ప్లాన్చేసే వాళ్లు ప్రెగ్నెన్సీకి ముందే ప్రికాన్సెప్షనల్ కౌన్సెలింగ్‌కి వెళితే మంచిది. ప్రాపర్ మెడికేషన్స్, సమస్యల నివారణ గురించి చర్చిస్తారు. -డా.భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
నెలసరి సమయంలో విపరీతమైన కడుపునొప్పి.. సిస్ట్స్ ఉంటే?
నాకు 45 ఏళ్లు. నెలసరి రెగ్యులర్‌గానే వస్తోంది. రొటీన్ స్కాన్‌లో కుడివైపు ఓవరీలో 4 సెం.మీ సిస్ట్ ఉందని తేలింది. ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? – సీహెచ్. కాత్యాయిని, విజయవాడ ఒవేరియన్ సిస్ట్లు అనేవి ప్రీమెనోపాజ్ ఏజ్‌లో సర్వసాధారణం. రక్తపు అవశేషాలు లేకుండా ఫ్లూయిడ్‌తో నిండి ఉన్న సింపుల్ సిస్ట్స్ ఉంటాయి. వీటితో ఎలాంటి ప్రమాదమూ ఉండదు. వీటికి ఎలాంటి చికిత్సా అవసరం ఉందు. అండాశయంలో సాధారణంగా అండాలు రెండు నుంచి మూడు సెం.మీ. ఉంటాయి. సిస్ట్ అంటే 3 సెం.మీ. కన్నా ఎక్కువ సైజులో ఉండడం. కాంప్లెక్స్ సిస్ట్ అంటే బ్లడ్, సాలిడ్ కూడా ఉంటాయి. వీటిని ఎండోమెట్రియోమా, డెర్మోయిడ్ సిస్ట్ అంటారు. నెలసరి క్రమం తప్పడం.. పీరియడ్స్ టైమ్‌లో విపరీతమైన కడుపు నొప్పి, యూరిన్లోనూ నొప్పి ఉంటాయి. ఇలాంటి సిస్ట్స్కి చికిత్స అవసరం. అందుకే మీరు ఒకసారి డీటెయిల్డ్ హై రిజల్యుషన్ అల్ట్రాసౌండ్ లేదా సీటీ పెల్విక్ స్కాన్ చేయించండి. సిస్ట్ నేచర్‌ను బట్టి తర్వాత చికిత్స ఉంటుంది. సింపుల్ సిస్ట్స్కి అయితే ఆరునెలలకు ఒకసారి ఫాలో అప్ స్కాన్స్ చేస్తాం. -డా. భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
''పీరియడ్స్ ప్రాబ్లమ్..పిల్లలు పుట్టే అవకాశం ఉందా?''
నాకు 20 ఏళ్లు. పీరియడ్స్ రెగ్యులర్‌గా రావు. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నా సమస్య వల్ల రేపు పెళ్లి అయ్యాక పిల్లలు పుట్టరేమోనని భయంగా ఉంది. దీనికేమైనా ట్రీట్మెంట్ ఉందా? – పి.రజిత, మామిడిపల్లి నెలసరి రెగ్యులర్‌గా ఉన్నప్పుడు చాలామంది అమ్మాయిలకు ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయి. భవిష్యత్తులో గర్భందాల్చే అవకాశాలు కూడా తగ్గవు. ఇరవై ఏళ్ల వయసులో టీనేజ్లోలా కాకుండా శరీరంలోని హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు ఇర్రెగ్యులర్గా రెండు మూడు నెలలకోసారి రావడం లేదా మందులు వాడితేనే గాని రాకపోవడం కనుక ఉంటే, వెంటనే డీటెయిల్డ్ హార్మోనల్ ఎవాల్యుయేషన్ చేయించుకోవాలి. కొందరిలో ఇర్రెగ్యులర్ సైకిల్స్‌తో పాటు మొటిమలు, అవాంఛిత రోమాలు, గడ్డంపైన, పైపెదవిపైన వెంట్రుకలు రావడం, తలమీద జుట్టు రాలిపోవడం, బరువు పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనిని పోలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్) అంటాం. కొందరికి షుగర్, బీపీ కూడా ఉండవచ్చు. అధిక బరువు ఉంటే శరీరంలో కొవ్వులు అసాధారణంగా ఉంటాయి. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు స్కానింగ్, రక్తపరీక్షలు చేయించుకుని, సమస్యను గుర్తించి తగిన మందులు వాడితే పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి. భవిష్యత్తులో ప్రెగ్నెన్సీ అవకాశాలు తగ్గకుండా ఉంటాయి. దీనికి మొదటి చికిత్స ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలి అనే చెబుతాం. థైరాయిడ్ సమస్య ఏదైనా ఉందా అని పరీక్షలు చేస్తాం. అలాగే టీబీ వంటి ఇతర ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేదా పరీక్షిస్తాం. క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం, యోగా, నడక, డాన్సింగ్, సైక్లింగ్ వంటివి కచ్చితంగా చేయాలి. డైట్ కౌన్సెలర్‌ను సంప్రదించి, ఆహార విషయంలో వారి సలహాలను పాటించాలి. రక్తపరీక్షల రిపోర్ట్స్ బట్టి హార్మోనల్ ట్రీట్మెంట్ చేయాలా లేదా నాన్‌హార్మోనల్ ట్రీట్మెంట్ చేయాలా అని గైనకాలజిస్ట్ నిర్ణయం తీసుకుంటారు. ఈ సమస్యకు మూడు నుంచి ఆరునెలల ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. -డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
ప్రెగ్నెన్సీలో షుగర్.. తల్లీ, బిడ్డకు ప్రమాదం, ఆ ట్యాబ్లెట్‌తో..
నాకిప్పుడు ఏడో నెల. షుగర్ ఉందని చెప్పారు. Metformin 100mg అనే మాత్రలు వేసుకోమన్నారు. ఇది ప్రెగ్నెన్సీలో వేసుకోవచ్చా? మాత్రలు వేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఏం చేయాలి? – పి. కృష్ణశ్రీ, భీమవరం Metformin అనే మాత్రలను ప్రెగ్నెన్సీలో వాడవచ్చు. డయాబెటిస్‌కి ఇది మంచి మెడిసిన్. ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్‌ని 80 శాతం స్ట్రిక్ట్ డైట్‌తో మేనేజ్‌చేస్తారు. కానీ షుగర్ పెరిగినప్పుడు మాత్రలు లేదా ఇన్సులిన్‌ను సజెస్ట్ చేస్తారు. షుగర్ నియంత్రణలో లేకపోతే తల్లికి, బిడ్డకు ప్రమాదం ఉంటుంది. ఈ జెస్టేషనల్ డయాబెటిస్‌ని సులభంగా గుర్తించి .. స్ట్రిక్ట్‌గా హోమ్ మానిటరింగ్ చేసి నియంత్రణలోకి తెస్తే షుగర్ వల్ల తలెత్తే సమస్యల ప్రభావం పుట్టబోయే బిడ్డ మీద ఉండదు. బిడ్డ అధిక బరువుతో పుట్టడం, ప్రసవమప్పుడు ఇబ్బందులు, అధిక రక్తస్రావం, అత్యవసరంగా ఆపరేషన్ చేయాల్సి రావడం వంటి చాన్సెస్ తగ్గుతాయి. Metformin .. .. షుగర్ మరీ డౌన్ కాకుండా.. hypoglycemia episodes రిస్క్‌ను తగ్గిస్తుంది. ఇన్సులిన్‌తో ఈ ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. ఈ మాత్రతో ఉండే ఏకైక ఇబ్బంది.. కడుపు ఉబ్బరం. అందుకే మాత్రలను ఎప్పుడూ తిన్న వెంటనే వేసుకోవాలి. తక్కువ మోతాదులో మొదలుపెట్టి.. నాలుగు రోజులకు మోతాదు పెంచి కావలసిన మోతాదుకు అడ్జస్ట్ చేస్తారు. షుగర్ రీడింగ్స్ నార్మల్ అయితే అదే మోతాదును కొనసాగిస్తారు. రెండు వారాల్లో కంట్రోల్ కాకపోతే ఇన్సులిన్ ఇంజెక్షన్ సజెస్ట్ చేస్తారు. మాత్రల విషయానికి వస్తే.. రోజూ ఇంట్లో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని మానిటరింగ్ చేస్తూ మాత్రల మోతాదును నిర్ధారిస్తారు. -
''43 ఏళ్లకు ప్రెగ్నెన్సీ వచ్చింది.. పిల్లలు ఆరోగ్యంగా పుడతారా''?
నాకిప్పుడు 43 ఏళ్లు. అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చింది. ఈ వయసులో పిల్లల్ని కంటే ఆరోగ్యంగా పుడతారా? ఇది నాకు తొలి కాన్పు. పిల్లల కోసం మందులు వాడీవాడీ విసిగిపోయి ఆపేశాక వచ్చిన ప్రెగ్నెన్సీ అండీ...! – ఎన్. చంద్రప్రభ, సిర్పూర్ కాగజ్‌నగర్ నలభై ఏళ్లు దాటిన ప్రెగ్నెన్సీలో చాలా రిస్క్స్ ఉంటాయి అనేది చాలామంది భయం. కానీ సింగిల్టన్ ప్రెగ్నెన్సీ సాఫీగా సాగే అవకాశం లేకపోలేదు. 25– 35 ఏళ్ల మధ్య ఉండే కాంప్లికేషన్స్ కన్నా కొంచెం ఎక్కువ రిస్క్ ఉండొచ్చు. వాటిలో ఆపరేషన్ ద్వారా డెలివరీ అవటం, నెలలు నిండక ముందే కాన్పు అయ్యే రిస్క్ వంటివి ఎక్కువ. ఐవీఎఫ్, కవలల ప్రెగ్నెన్సీలో ఈ రిస్క్ ఇంకాస్త పెరుగుతుంది. మొదటి మూడునెలల్లో పుట్టుక లోపాలు ..డౌన్‌సిండ్రోమ్ లాంటివి, గర్భస్రావం, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వంటి ప్రమాదాలు ఎక్కువుంటాయి. బాడీ పెయిన్స్, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులూ ఎక్కువుండొచ్చు. డాక్టర్ని సంప్రదించినప్పుడు వాటికి తగిన ట్రీట్మెంట్ను ఇస్తారు. తొలి మూడునెలల్లో తప్పనిసరిగా జెనెటిక్ స్క్రీనింగ్ టెస్ట్స్ చేయించుకోవాలి. ప్రతినెల బీపీ, సుగర్, థైరాయిడ్ పరీక్షలూ చేయించుకోవాలి. ప్రతినెల తప్పకుండా గైనకాలజిస్ట్‌ను సంప్రదిస్తూ టైమ్‌కి చేయవలసిన స్కానింగ్‌లు, పరీక్షలు చేయించుకుంటూండాలి. సరైన చికిత్సతో నలభై ఏళ్లు దాటిన తర్వాత కూడా సురక్షితమైన, ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీ, కాన్పూ సాధ్యమే. - డా భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
మేనరికం పెళ్లి చేసుకోవచ్చా? జెనెటికల్ కౌన్సెలింగ్ హెల్ప్ అవుతుందా?
నాకు మా బావ అంటే చాలా ఇష్టం. మేనరికం పెళ్లి మంచిదికాదని తెలిసినా ఈ పెళ్లిని అవాయిడ్ చేయలేను. పెళ్లికి ముందే జెనెటికల్ కౌన్సెలింగ్ తీసుకుంటే నాకేమైనా హెల్ప్ అవుతుందా? – ఎన్‌కేఎస్, గుంటూరు మేనరికం పెళ్లి అనుకుంటే.. పెళ్లికి ముందే ఫ్యామిలీ అండ్ కపుల్ జెనిటిక్ కౌన్సెలింగ్ తీసుకోవడం చాలా అవసరం. దీనిని ప్రీకన్సెప్షనల్ జెనెటిక్ కౌన్సెలింగ్ అంటారు. మేనరికం పెళ్లిళ్లలో తరతరాలుగా అంటే తాతముత్తాతల నుంచి వస్తున్న సేమ్ జీన్స్‌తో కొన్ని జన్యుపరమైన లోపాలతో పిల్లలు పుట్టే రిస్క్ లేకపోలేదు. రక్తసంబంధీకుల మధ్య పెళ్లిళ్లు జరిగినప్పుడు కొన్ని రెసెసివ్ జెనెటిక్ వ్యాధులను చూస్తాం. మేనరికం పెళ్లిళ్లలో కాగ్నీషియల్ డిసీజెస్ అంటే పుట్టుకతో వచ్చే లోపాలు రెండు.. మూడు రెట్లు ఎక్కువ. మీరు కౌన్సెలింగ్ వెళ్లినప్పుడు మీ ఇద్దరి ఫ్యామిలీ ట్రీలో వంశపారంపర్యమైన జబ్బులు, డిజార్డర్స్ ఏవైనా ఉన్నాయా అని మీ మీ కుటుంబాల ఆరోగ్య చరిత్రను క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. జన్యుపరమైన వ్యాధి ఉన్న కుటుంబసభ్యుల వ్యాధి నిర్ధారణ, ఆ జన్యువుకి సంబంధించి ఎలాంటి మ్యుటేషన్ ఉంది వగైరా వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అది క్యారియర్‌గా కపుల్కీ ఉన్నట్టయితే అది పిల్లలకు వచ్చే రిస్క్ ఎంత ఉందో చెప్తారు క్యారియర్ టెస్టింగ్‌లో.. భవిష్యత్‌లో గర్భస్థ శిశువుకి చేసే శాంప్లింగ్ ద్వారా ఆ వ్యాధి బిడ్డకు వస్తుందా లేదా అని కూడా తెలిపే డిటెక్షన్ టెస్ట్స్ ఉంటాయి. పుట్టే పిల్లలకు అవకరాలు ఉండే రిస్క్ ఎక్కువగా ఉంటే ప్రెగ్నెన్సీ మూడవ నెల, అయిదవ నెలలో వైద్యపరీక్షలతో కనిపెట్టి గర్భస్రావం చేయించుకోమని సూచిస్తాం. అందుకే బేసిక్ టెస్ట్స్కి హాజరవడం చాలా అవసరం. సాధారణంగా మేనరికం పెళ్లిళ్లలో బెటా తలసీమియా, సిస్టిక్ ఫైబ్రోసిస్, సికిల్ సెల్ అనీమియా వంటివి ఎక్కువ. వీటిని పెళ్లిచేసుకునే జంటకు చేసే మామూలు రక్తపరీక్షతో కూడా కనిపెట్టి రిస్క్‌ను అంచనావేయొచ్చు. జన్యుపరమైన వ్యాధులకు చికిత్స లేదు.. నివారణ మాత్రమే చేయగలం. డా. భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
గైనిక్ సర్జరీల్లోనూ రోబోలు
సాక్షి, హైదరాబాద్: వైద్య రంగంలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రొబోటిక్ సర్జరీలు హైదరాబాద్‌లోనూ విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. పేరొందిన దాదాపు ప్రతి ఆసుపత్రీ ఈ శస్త్రచికిత్సా విధానాన్ని ఉపయోగిస్తోంది. చికిత్సా వ్యయం ఎక్కువైనప్పటికీ ఎక్కువ మంది రోగులకు నప్పే అనేక ప్రయోజనాల వల్ల రానురానూ రొబోటిక్ సర్జరీల ఎంపిక కూడా పెరుగుతోంది. విభిన్న రకాల శస్త్రచికిత్సల్లో దోహదపడుతున్న రొబోటిక్ సర్జరీ గైనకాలజీ విభాగంలోనూ ఇప్పుడిప్పుడే వేగం పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలో గైనకాలజీ శస్త్రచికిత్సల్లో రోబోల వాడకం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అపోలో ఆసుపత్రికి చెందిన కన్సెల్టెంట్ అబ్స్ట్రిటిషియన్ అండ్ గైనకాలజిస్ట్ డాక్టర్ అనురాధా పాండా మరిన్ని వివరాలు తెలియజేశారు. అవి ఏమిటంటే... మరింత కచ్చితత్వం... ‘‘గైనకాలజీలో రోబో అసిస్టెడ్ కీహోల్ సర్జరీని కొత్త ఆవిష్కరణగా చెప్పొచ్చు. సాధారణ లేపరోస్కోపిక్ సర్జరీలతో పోలిస్తే రోబో సాయంతో చేసే సర్జరీల్లో త్రీడీ విజన్ (త్రిమితీయ ఆకారం) ఎక్కువ కచ్చితత్వాన్ని అందిస్తుంది. శస్త్ర చికిత్సలకు ఉపయోగించే పరికరాలను 360 డిగ్రీల కోణంలో తిప్పడానికి వీలుండటం వల్ల శరీరంలో సంక్లిష్టమైన ప్రదేశాలను సైతం చేరుకోవచ్చు. ఈ శస్త్రచికిత్సా విధానంలో తక్కువ రక్త నష్టంతోపాటు నొప్పి, ఇన్ఫెక్షన్ ముప్పు కూడా తక్కువగా ఉంటుంది. తద్వారా రోగులు ఆసుపత్రిలో ఉండాల్సిన వ్యవధి కూడా తగ్గుతుంది. ఈ శస్త్రచికిత్సల్లో సర్జన్ ఒక కంప్యూటర్ కన్సోల్ నుంచి పనిచేస్తారు. తన చేతి కదలికలతో రొబోటిక్ చేతులను కదిలిస్తూ ఆపరేషన్ నిర్వహిస్తారు. ‘‘క్లిష్టమైన హిస్టెరెక్టమీ (గర్భాశయం తొలగింపు) ఆపరేషన్లకు రోబో సాయాన్ని ఉపయోగించవచ్చు. ప్రత్యేకించి ఊబకాయంతో ఉన్న రోగి పొత్తికడుపుపై పలు శస్త్రచికిత్సలు నిర్వహించాల్సి వచ్చినప్పుడు ఈ విధానాన్ని ఉపయోగిస్తారు. కచ్చితత్వం, తక్కువ నొప్పితోపాటు చిన్న కోతల ద్వారానే శస్త్రచికిత్స చేయడానికి ఈ విధానం వీలు కల్పిస్తుంది’’అని డాక్టర్ అనురాధా పాండా వివరించారు. గైనిక్ రొబోటిక్ సర్జరీలతో ప్రయోజనాలు... మయోమెక్టమీ అనేది గర్భాశయ కండరాల గోడ (ఫైబ్రాయిడ్) నుంచి నిరపాయకరమైన కణుతులను తొలగించడానికి ఉపయోగించే ఒక ప్రక్రియ. రొబోటిక్ సర్జరీ ఫైబ్రాయిడ్ కుట్టు తొలగింపునకు కూడా వీలు కల్పిస్తుంది. ఎండోమెట్రియోసిస్ అనేది గర్భాశయం వెలుపల గర్భాశయ లైనింగ్ వంటి కణజాలాలు పెరిగే పరిస్థితి. ఈ కణజాలాలు హార్మోన్లకు ప్రతిస్పందిస్తాయి. పీరియడ్స్ సమయంలో రక్తస్రావం, నొప్పి ఉంటుంది. ఎండోమెట్రియోసిస్ శస్త్రచికిత్స ఒక సవాలు వంటిది. దీనికోసం పెల్విస్, పెల్విక్ సైడ్ వాల్స్‌లో లోతుగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. రోబో అసిస్టెడ్ ఎండోమెట్రియోసిస్ శస్త్రచికిత్స ద్వారా మరింత కచ్చితమైన రీతిలో అండాశయ తిత్తిని తొలగించడం సాధ్యపడుతుంది. పేగు, మూత్రాశయం, మూత్ర నాళానికి అతుక్కొని ఉండే డీప్ ఇన్ఫిల్ట్రేటింగ్ ఎండోమెట్రియోసిస్ వ్యాధి చికిత్సలోనూ రొబోటిక్ సర్జరీ తక్కువ సంక్లిష్టతతో కూడుకుంటున్నదని పలు అధ్యయనాలు తెలిపాయి. హిస్టెరెక్టమీ సర్జరీ తర్వాత కొందరిలో తలెత్తే వాల్ట్ ప్రోలాప్స్ అనే పరిస్థితిని సరిదిద్దడంలోనూ రొబోటిక్ సర్జరీ ఉపకరిస్తుంది. ఊబకాయ రోగుల్లో శస్త్రచికిత్సలకు లేపరోస్కోపీతో పోలిస్తే రోబోటిక్ సర్జరీ వారి అనారోగ్యాన్ని, ఆసుపత్రిలో ఉండే వ్యవధిని తగ్గిస్తుంది. లేపరోస్కోపీతో పోల్చినప్పుడు రొబోటిక్ శస్త్రచికిత్స ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. అయితే భవిష్యత్తులో ఈ చికిత్సా విధానం వాడకం మరింత విస్తృతమైతే ఈ సర్జరీల ధరలు తగ్గే అవకాశం ఉంది. -
మా అమ్మాయికి పదమూడేళ్లు... పీరియడ్స్ రావడం లేదు కారణం?
మా అమ్మాయికి పదమూడేళ్లు. పెద్దమనిషి అయినప్పటి నుంచీ పీరియడ్స్ రెగ్యులర్‌గా రావడంలేదు. కారణం ఏంటంటారు? – వి. భావన, ఖమ్మం రజస్వల అయిన 11– 19 ఏళ్ల మధ్య ఆడపిల్లల్లో చాలామందిలో నెలసరి క్రమం తప్పడం చూస్తుంటాం. ఈ టైమ్‌లో చాలామందికి బాడీ హార్మోన్స్ ఇంబాలెన్స్ ఉంటుంది. అధి బీఎమ్ఐ .. అంటే అధిక బరువు ఉండి.. 30 దాటినప్పుడు.. థైరాయిడ్, ఫిట్స్, అనీమియా వంటి ఆరోగ్య సమస్యలున్నప్పుడు.. ఫైబ్రాయిడ్స్.. సిస్ట్లు వంటి గైనిక్ సమస్యలు ఉన్నప్పుడు నెలసరి క్రమం తప్పుతుంది. ఒక్కోసారి నెలలో రెండుసార్లు రావడం.. లేదంటే రెండు నెలలకు ఒకసారి రావడం.. విపరీతమైన నొప్పి.. స్పాటింగ్.. రక్తస్రావం తక్కువగా అవడం.. లేదంటే ఎక్కువగా అవడం.. వంటి సమస్యలను చూస్తాం. పీరియడ్ పెయిన్ చాలా ఇబ్బంది పెడుతుంది. స్కల్, కాలేజీలో ఉన్నప్పుడు మరింత ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే మొదట పారాసిటవల్, డ్రాటిన్ వంటి పెయిన్ రిలీఫ్ మాత్రలను సచిస్తాం. అధిక రక్తస్రావంతో కూడిన ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటే ఒకసారి స్కాన్ చేసి సిస్ట్స్ ఏమైనా ఉన్నా అని చెక్ చేస్తాం. రెండు .. మూడు నెలలు ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఇస్తే చాలామందిలో ఈ ప్రాబ్లం తగ్గుతుంది. కొన్నిసార్లు యూరిన్, వెజైనల్ ఇన్ఫెక్షన్ ఉంటే ఇర్రెగ్యులర్ స్పాటింగ్ కావచ్చు. దీనికి ఒకసారి యూరిన్ .. థైరాయిడ్ టెస్ట్స్ చేస్తాం. నెలసరి 21 – 35 రోజుల వరకు రెండుసార్లు వస్తే స్కాన్‌లో ఏమైనా మార్పులు ఉన్నాయా అని చూస్తాం. చాలామందిలో పీసీఓస్ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఒవేరియన్ హార్మోన్స్ స్టడీ చెయ్యాలి. క్రమం తప్పకుండా వ్యామం.. పౌష్టికాహారంతో పీసీఓస్ని మేనేజ్ చెయ్యవచ్చు. 20 ఏళ్లలోపు అమ్మాయిలకు అంతగా మందులు అవసరం లేదు. చిన్న వయసులో హార్మోన్స్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. ముందు సమస్య ఏంటో కనిపెట్టి.. ఆ తర్వాత చికిత్స మొదలుపెట్టడం మంచిది. నాకిప్పుడు 55 ఏళ్లు. హాట్ ఫ్లషెస్ విపరీతంగా ఉంటున్నాయి. హార్మోన్స్ ట్రీట్మెంట్ని సజెస్ట్ చేశారు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని వద్దనుకుంటున్నాను. మీరు ఆల్టర్నేట్ ఏదైనా సజెస్ట్ చేయగలరా? – గీత కురువెళ్లి, బెంగళూరు మెనోపాజ్ అంటే నెలసరి పూర్తిగా ఆగిపోవడం. సాధారణంగా దీన్ని 50 నుంచి 60 ఏళ్ల మధ్య చూస్తాం. ఈ సమయంలో హార్మోన్స్ స్థాయిల్లో సమతుల్యం లోపించడం వల్ల రకరకాల సింప్టమ్స్, ఇబ్బందులు ఉంటాయి. హెచ్ఆర్టీ హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అని.. అసమతుల్యంగా ఉన్న హార్మోన్స్‌ని మాత్రల రపంలో ఇస్తారు. కానీ ఈ చికిత్స వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు తగ్గినందువల్ల స్కిన్ చెంజెస్, వెజైనల్ డ్రైనెస్, యూరినరీ ఇన్ఫెక్షన్, హార్ట్ ఇష్యస్ వంటివాటిని 50 ఏళ్లు పైబడిన వాళ్లలో చూస్తాం. ఈ హార్మోన్లను బయట నుంచి సప్లిమెంట్స్‌గా ఇస్తే కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకే చాలామంది నాన్‌హార్మోనల్ ట్రీట్మెంట్నే కోరుకుంటారు. దీనివల్ల మెనోపాజ్ సింప్టమ్స్ తగ్గడమే కాకుండా.. సైడ్ ఎఫెక్ట్స్ కూడా అంతగా కనిపించవు. ఖీఐఆౖఔౖNఉ అనేది అందులో ఒకరకం. దీనిలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ , ఆండ్రోజెన్ ఉంటాయి. అలసట, నీరసం, లో మూడ్, రాకు వంటి సైకలాజికల్ సింప్టమ్స్ ఈ ఖీఐఆౖఔౖNఉతో చాలా తగ్గుతాయి. చాలామందిని మెనోపాజ్ తర్వాత ఒకటి రెండేళ్ల వరకు హాట్ ఫ్లషెస్.. చలి చెమటలు తీవ్రంగా బాధిస్తాయి. వీటిని ట్రీట్మెంట్తో తగ్గించవచ్చు. మీకు ఫ్యామిలీ హిస్టరీ క్యాన్సర్స్ ఏవైనా ఉన్నాయా అని చెక్ చేసి .. తర్వాత కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ని సూస్తాము. సాధారణంగా మూడు నెలల నుంచి ఆరు నెలల కోర్స్‌తో సింప్టమ్స్ తగ్గి.. పరిస్థితి మెరుగుపడుతుంది. -
జిమ్ చేస్తున్నా బరువు తగ్గడం లేదు.. సర్జరీ చేయించుకోవచ్చా?
కొందరు ఎంత తిన్నా శరీరానికి కొవ్వు పట్టదు. జీరో సైజ్‌లోనే కనిపిస్తుంటారు. మరికొందరికేమో కొంచెం తిన్నా లావెక్కిపోతారు. ఈ రోజుల్లో బరువు పెరగడం అనేది అన్ని వయసుల వారికి పెద్ద సమస్యలా మారింది. బరువు అదుపులో ఉంచుకునేందుకు గంటల తరబడి జిమ్‌లో వర్కవుట్స్ చేసినా, డైట్ కంట్రోల్ చేసినా ఏ మాత్రం రిజల్ట్ ఉండటం లేదు. ''నాకు 24 ఏళ్లు. నా హైట్ 5.2. బరువు 92 కిలోలు ఉన్నాను. యోగా, రెగ్యులర్‌గా జిమ్‌కి వెళుతున్నా, డైటింగ్ కూడా చేస్తున్నా. అయినా బరువు తగ్గడం లేదు. బేరియాట్రిక్ సర్జరీ చేయించుకోవచ్చా? భవిష్యత్‌లో ప్రెగ్నెన్సీ మీద ఏమైనా ప్రభావం ఉంటుందా?'' మీ వయసు 24 కాబట్టి డైటింగ్, ఎక్సర్సైజెస్ కొంతవరకు బరువు తగ్గడానికి దోహద పడతాయి. మీరు చెప్పిన మీ ఎత్తు, బరువు వివరాలను బట్టి మీ బీఎమ్ఐ (బాడీ మాస్ ఇండెక్స్) 40 పైనే వస్తుంది. అంటే అధిక బరువు ఉన్నారని అర్థం. మార్బిడ్ ఒబేసిటీ అంటాం. బేరియాట్రిక్ సర్జరీ అనేది ఫస్ట్ ఆప్షన్‌గా తీసుకోకండి. ప్రొఫెషనల్ జిమ్ ఇన్స్ట్రక్టర్, డైట్ కౌన్సెలర్‌ని కలవండి. ఒకసారి హార్మోన్స్, థైరాయిడ్, సుగర్ టెస్ట్‌లు చేసుకోండి. జీవన శైలిని మార్చుకోవడం ద్వారా బరువు తగ్గించుకునే వీలు ఉంటుంది. బీఎమ్ఐ 40 దాటిన వారికి బేరియాట్రిక్ సర్జరీని సూచిస్తాం. బీఎమ్ఐ 35 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ప్రెగ్నెన్సీకి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అయినా స్పెషలిస్ట్‌ని సంప్రదించిన తరువాతే మీకు ఏది సరిపోతుందో అంచనా వేస్తాను. మామూలుగా బేరియాట్రిక్ సర్జరీ అయిన 12– 18 నెలల తరువాత మాత్రమే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ స్టార్ట్ చెయ్యాలి. ఎందుకంటే బరువు తగ్గే క్రమంలో మొదట్లో పోషకాల లోపం తలెత్తుతుంది. వాటిని మల్టీ విటమిన్స్‌తో కవర్ చేసి అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చెయ్యాలి. ప్రెగ్నెన్సీ సమయంలో చాలా జాగ్రత్తగా డైట్‌ని సూచించాల్సి ఉంటుంది. బీపీ, సుగర్ సమస్యలు తలెత్తకుండా టెస్ట్ చెయ్యాలి. బేరియాట్రిక్ సర్జరీ తరువాత ప్రెగ్నెన్సీలో చాలా వరకు ఏ సమస్యలూ ఉండకపోవచ్చు. కానీ కొన్ని కేసెస్‌లో తక్కువ బరువుతో బిడ్డ పుట్టడం, నెలలు నిండకుండానే ప్రసవమవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే ఒబేసిటీతో ఉన్నప్పటి రిస్క్ కంటే ఈ రిస్క్ చాన్సెస్ చాలా తక్కువ. కాబట్టి మంచి స్పెషలిస్ట్‌ని కలిసిన తరువాత అన్ని విషయాలు అసెస్ చేసుకుని అప్పుడు బేరియాట్రిక్ సర్జన్‌ని కలిస్తే మంచిది. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
ప్రెగ్నెన్సీ మూడో నెలలో అబార్షన్..మళ్లీ గర్భం వచ్చే ఛాన్స్ ఉందా?
అయిదు నెలల కిందట నాకు మూడో నెల ప్రెగ్రెన్సీ అబార్షన్ అయిపోయింది. డాక్టర్ దగ్గరకేమీ వెళ్లలేదు. తర్వాత నెల నుంచి కూడా మామూలుగానే పీరియడ్స్ వస్తున్నాయి. కానీ కొంచెం కడుపు నొప్పి ఉంటోంది. ఇది అబార్షన్ వల్లే అంటారా? ఇప్పుడు డాక్టర్‌కి చూపించు కోవాలా? మళ్లీ గర్భం వచ్చే చాన్స్ ఉంటుందా? – మమత గ్రేస్, సామర్లకోట ప్రతి అయిదుగురిలో ఒకరికి ఇలా మూడునెలల లోపే గర్భస్రావం అవుతుంటుంది. అయితే ఇది మళ్లీ మళ్లీ రిపీట్ అయ్యే చాన్సెస్ తక్కువ. మళ్లీ గర్భం దాల్చినప్పుడు సక్సెస్ అయ్యే చాన్స్ 90 శాతం పైనే ఉంటుంది. సాధారణంగా.. క్రోమోజోమ్స్, జన్యు లోపాలతో కూడిన పిండం వల్లే గర్భస్రావం అవుతూంటుంది. కానీ ఇలా గర్భస్రావం అయినప్పుడు కచ్చితంగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ తప్పకుండా చేయించుకుని అంతా నార్మల్‌గానే ఉందా.. ఏమైనా ముక్కలు ఉండిపోయాయా అని చెక్ చేయడం మంచిది. కడుపు నొప్పి చాలారోజుల వరకు కొనసాగుతుంటే ఇంటర్నల్ వెజైనల్ ఎగ్జామినేషన్ చేసి లోపల ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా అని కూడా చెక్ చేయాలి. మీకు మళ్లీ నెలసరి సరిగ్గా వస్తోంది అంటే గర్భసంచికి ప్రాబ్లమ్ ఏమీ లేదు అనే అర్థమవుతోంది. అయితే ఎందుకు మీకు మూడో నెలకు అబార్షన్ అయింది.. ఇప్పుడు కడుపు నొప్పి ఎందుకు వస్తోంది అనేది తేలాలి. ఇందుకు ఒకసారి మీరు డాక్టర్‌ను సంప్రదించాలి. కొన్ని రకాల రక్తపరీక్షలు, మూత్ర పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు. తరువాత ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి ముందు మీరు థైరాయిడ్, బ్లడ్ సుగర్ టెస్ట్‌లు చేయించుకోవాలి. అలాగే ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి కనీసం నెల ముందు నుంచి ఫోలిక్ యాసిడ్ మాత్రలను తీసుకుంటే మంచిది. పౌష్టికాహారం తప్పనిసరి. అధిక రక్తస్రావం, దుర్వాసన, జ్వరం ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. -
పిజ్జాలు, బర్గర్ల వల్ల మహిళల్లో పీసీఓడీ సమస్యా? అసలెందుకు వస్తుంది?
మాతృత్వం.. మహిళలకు దేవుడిచ్చిన వరం. మరోజీవికి ప్రాణం పోసే అపూర్వమైన అవకాశం. అయితే హార్మోన్ల అసమతుల్యత కారణంగా పలువురు స్త్రీలు ఈ అపురూప భాగ్యానికి దూరమవుతున్నారు. పీసీఓడీ (నీటి బుడగలు) సమస్యలతో నెలసరి గాడి తప్పి గర్భధారణకు నోచుకోలేకపోతున్నారు. అమ్మా అనే పిలుపు కోసం అలమటిస్తున్నారు. పల్లె సీమల్లో కంటే పట్టణా ప్రాంతాల్లోనే బాధితులు పెరుగుతున్నారు. ఈ క్రమంలో పిల్లలపై ప్రేమను చంపుకోలేక నిత్యం వందల మంది ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. రూ.లక్షల్లో ఫీజులు ముట్టజెప్పి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నెలల తరబడి చికిత్సలు పొందుతున్నారు. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. మందులను క్రమం తప్పకుండా వాడడంతోపాటు ఆరోగ్య జాగ్రత్తలను పాటిస్తే ప్రయోజనం ఉంటుందని వివరిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వాస్పత్రులోనే ట్రీట్మెంట్ పొందే వెసులుబాటు ఉందని వెల్లడిస్తున్నారు. ►తిరుపతి ఎమ్మార్పల్లెకు చెందిన కోమల అనే మహిళకు 36ఏళ్లు. ఇంతవరకు సంతానం కలగలేదు. టీవీలో ప్రకటనలు చూసి రెండేళ్ల క్రితం చెన్నైలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిని ఆశ్రయించారు. రూ.30 వేలు చెల్లించి భార్యభర్తలు అన్ని రకాల పరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్ వారి ఫలితాలను పరిశీలించి గర్భధారణ కలగాలంటే ఫీజుగా రూ.5 లక్షలు అడిగారు. ఆ దంపతులు ఖర్చుకు వెనకాడకుండా అడిగినంతా ముట్టజెప్పారు. అయినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో నిరాశగా ఇంటి ముఖం పట్టారు. ► చిత్తూరు మండలానికి చెందిన సుమనప్రియ (28)కు 9ఏళ్ల క్రితం వివాహమైంది. కానీ సంతానం కలగలేదు. తీరా ఆస్పత్రిలో పరీక్షిస్తే.. పీసీఓడీ ఉందని డాక్టర్లు నిర్ధారించారు. అయితే ఆమె ఓ నాటు వైద్యుడిని ఆశ్రయించారు. ఆరు నెలల పాటు ఆకు మందు తీసుకున్నారు. ఇందుకోసం ప్రతి నెల రూ. 2వేలు చెల్లించారు. అయినప్పటికీ గర్భం రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నార. ► చిత్తూరు నగరం తోటపాళ్యానికి చెందిన దంపతులకు పిల్లలు లేరు. వివాహమై రెండేళ్లు గడుస్తున్నా గర్భం దాల్చకపోవడంతో జిల్లా ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. ఆమెకు పీసీఓడీ సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో 8నెలల పాటు ఆమెను పర్యవేక్షణలో ఉంచారు. ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ మందులు వాడేలా జాగ్రత్తలు తీసుకున్నారు. 10వ నెలలో ఆమె గర్భం దాల్చింది. ప్రస్తుతం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పీసీఓడీ ఎందుకొస్తుందంటే... ప్రతి స్త్రీలోనూ రుతు క్రమం వచ్చినప్పుడు అండాశయంలో అండం పరిపక్వత చెంది విడుదల అవుతంంది. నెలసరి తర్వాత 11–18 రోజుల మధ్యకాలంలో అండం విడుదల ప్రక్రియ జరుగుతుంది. ఇందుకు ఈస్ట్రోజన్ హార్మోన్ అవసరమవుతుంది. ఈ హార్మోన్ లోపం తలెత్తినప్పుడు క్రమంగా పీసీఓడీకి దారితీస్తుంది. ఈ సమస్యతో బాధపడే వారిలో విడుదలయ్యే అండం పూర్తి ఎదగక, అది అండాశయంలో నీటి బుడగ రూపంలో ఉండిపోతుంది. అలాగే జీవనశైలిలో వచ్చిన మార్పులు, నిద్రలేమి, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, ఎత్తుకు తగ్గ బరువు ఉండకపోవడం, పని ఒత్తిడి, బయట తిండికి అలవాటు పడడం వంటి కారణాలతో కూడా పీసీఓడీ బారినపడుతుంటారని వైద్యనిపుణులు తెలియజేస్తున్నారు. లక్షణాలు ఇలా ఉంటాయి నెలసరి సక్రమంగా రాదు ఎక్కువగా బ్లీడింగ్, రుతుక్రమం సమయంలో కడుపు నొప్పి ఉంటుంది అధిక బరువు, ఆకారణంగా జుట్టు రాలడం నెలసరి రాకపోవడంతో ముఖం, కాళ్ల మీద అవాంఛిత రోమాలు పుట్టుకొస్తాయి. బరువు పెరిగిపోతారు. శరరీంలో ఇన్సులిన్ నిరోధకత కూడా పెరిగిపోతుంది. వ్యాధులు ఇలా ఎండోమెట్రియల్ క్యాన్సర్ కొలెస్ట్రాల్ పెరుగుదల అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు గర్భస్రావాలు, సంతాన లేమి మధుమేహం మానసిక జబ్బులు అసాధారణ గర్భాశయ రక్తస్రావం క్రమ రహిత రుతుక్రమం పీసీఓడీని నిర్థారించడానికి గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి. వారి సూచనల మేరకు హార్మోన్ల స్థాయిని లెక్కించడానికి రక్త పరీక్షలు చేస్తారు. అండాశయం, గర్భాశయం రూపాన్ని తెలుసుకోవడానికి అ్రల్టాసౌండ్ స్కానింగ్ చేసి నిర్థారిస్తారు. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే... జీవనశైలిలోని మార్పులు కూడా పీసీఓడీకి కారణమవుతున్నాయి. ముఖ్యంగా ఫాస్ట్ఫుడ్లు అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. విటమిన్ –బి లోపం రాకుండా చేపలు, గుడ్డు, ఆకుకూరలు, క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇలాచేస్తే నెలసరి క్రమంగా వచ్చి సమస్య నుంచి బయటపడుతారు. దీనికి తగట్టు వ్యాయమం అవసరం. ఫీజులు గుంజేస్తున్నారు.. గతంలో పిల్లలు పుట్టకుంటే వ్రతాలు, నోములు నోచేవాళ్లు. దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. ప్రస్తుతం కార్పొరేట్ మాయాజాలంలో పలువురు దంపతులు కొట్టుకుపోతున్నారు. మాతృత్వం పొందేందుకు రూ.లక్షల్లో ఫీజులు ముట్టుజెబుతున్నారు. పీసీఓడీ సమస్యతో బాధపడేవారిని కార్పొరేట్ ఆస్పత్రుల వారు సైతం యథేచ్ఛగా దోచుకుంటున్నారు. దంపతుల బలహీనతను అడ్డుపెట్టుకుని రూ.3 నుంచి రూ.10లక్షల వరకు ఫీజులు గుంజేస్తున్నారు. చిత్తూరు, తిరుపతి వంటి నగరాల్లో సైతం రూ.లక్షలు వసూలు చేసేస్తున్నారు. మరికొందరు నాటువైద్యం అంటూ అనారోగ్య సమస్యలను తెచ్చుకుంటున్నారు. పీసీఓడీ నివారణకు ప్రభుత్వాస్పత్రిలోనే పూర్తి స్థాయిలో సేవలు ఉన్నాయని వైద్యులు గుర్తు చేస్తున్నారు. వైద్యులను సంప్రదించాలి మహిళలను ఇటీవల కాలంలో ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సమస్య పీసీఓడీ. దీని బారిన పడితే నెలసరి తప్పడం, అవాంఛిత రోమాలు రావడం ఉంటుంది. గర్బధారణ కూడా ఇబ్బందికరంగా మారుతుంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, వంశపారంపర్యంగా వస్తున్న సమస్యలతో ఇలాంటి కేసులు పెరుగుతున్నాయి. గర్బధారణకు చికిత్స పేరుతో మోసపోకండి. నాటు మందుల జోలికి వెళ్లొద్దు. సంబంధిత డాక్టర్లను సంప్రదించడం ఉత్తమం. ఇందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా మెరుగైన చికిత్స అందిస్తున్నారు. – డాక్టర్ ప్రభావతిదేవి, డీఎంహెచ్ఓ, చిత్తూరు నిర్లక్ష్యం చేస్తే సమస్యలు పీసీఓడీ అనేది 14–45 ఏళ్ల లోపు ఉన్న మహిళల్లో అధికంగా వస్తోంది. ఈ మధ్య కాలంలో పీసీఓడీ కేసులు పెరిగాయి. చాలా మందికి పని ఒత్తిడి, టీవీలు, మొబైల్ ఫోన్లు గంటల తరబడి చూడడం. పిజ్జాలు, బర్గర్లు తినడం. బరువు పెరగడం కారణంగా పీసీఓడీ సమస్య తలెత్తుతోంది. లక్షణాలు బట్టి లేదా..వివాహమై ఏడాది గడిచినా గర్భధారణ జరగకుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. నిర్లక్ష్యం వహిస్తే సమస్యలు తప్పవు. – డాక్టర్ ఉషశ్రీ, గైనకాలజిస్ట్, చిత్తూరు జిల్లా ప్రభుత్వాస్పత్రి -
40లోనే మోనోపాజ్.. ఏమైనా ప్రమాదమా?డాక్టర్లు ఏమంటున్నారంటే
నాకు 43 ఏళ్లు. ఆరునెలలుగా పీరియడ్స్ రావడం లేదు. డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మెనోపాజ్ అంటున్నారు. ఇంత త్వరగా నెలసరి ఆగిపోతుందా? మా అక్కకి 50 ఏళ్ల తరువాత ఆగిపోయాయి. 43 ఏళ్లకే ఆగిపోవడం ఏదైనా ప్రమాదమా? – సీహెచ్. లావణ్య, కర్నూలు ఎర్లీ మెనోపాజ్ అంటే 45 ఏళ్లు నిండకుండా నెలసరి ఆగిపోవడం. 40 ఏళ్లలోపు ఆగిపోతే అది ప్రీమెనోపాజ్. ఈ రోజుల్లో చాలామందికి 45 ఏళ్లలోపే నెలసరి ఆగిపోతోంది. ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గినందువల్ల అండాలు విడుదలకాకుండా అండాశయాల్లోనే ఉండిపోయి నెలసరి రాదు. వీరిలో మస్కులోస్కెలిటల్ సమస్య ఎక్కువగా ఉంటుంది. మజిల్ మాస్ తగ్గినందువల్ల కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పితో బాధపడుతుంటారు. మీరు ఏడాదికోసారి కార్డియో వాస్కులర్ కన్సల్టెంట్, గైనకాలజిస్ట్‌లను సంప్రదిస్తుండాలి. వంద మందిలో అయిదుగురికి 45 ఏళ్లలోపు నెలసరి ఆగుతోంది. ఇలా మెనోపాజ్ త్వరగా వచ్చినా.. ఈస్ట్రోజెన్ థెరపీతో రిస్క్‌ని తగ్గించవచ్చు. జన్యుపరంగానైనా.. కాకపోయినా మీకు మెనోపాజ్ త్వరగా వచ్చి ఉండొచ్చు. సాధారణంగా 51 ఏళ్లకు మెనోపాజ్ వస్తుంది. మీరు ఎర్లీ మెనోపాజ్‌లో ఉన్నారు కాబట్టి.. మీకు ఈస్ట్రోజెన్ థెరపీతో గుండె, ఎముకలకు సంబంధించిన సమస్యలను తగ్గించవచ్చు. మీరు ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదిస్తే.. మీకు ఎలాంటి మందులు ఇవ్వాలి.. వాటితో భవిష్యత్‌లో ఇతర రిస్క్స్ అంటే క్యాన్సర్ లాంటిదేమైన పొంచి ఉండే ప్రమాదం ఉందా అని పరిశీలిస్తారు. కాల్షియం, విటమిన్ డి మాత్రలు కూడా తీసుకోవాలి. వెజైనా పొడిబారుతుంటే లూబ్రికెంట్ జెల్ లేదా ఈస్ట్రోజెన్ క్రీమ్‌ని సూచిస్తారు. హెచ్ఆర్టీ.. హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది ఎంత వరకు పనిచేస్తుందో చూస్తారు. కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉండే నాన్ హార్మోనల్ ట్రీట్మెంట్ను కూడా సూచిస్తున్నారు. -
మేడం.. నాకు 25 ఏళ్లు... మూడుసార్లు డాక్టర్ దగ్గరకు వెళ్లాను...
నాది నార్మల్ డెలివరీ. నెలవుతోంది. ఇంకా చాలా బ్లీడింగ్ అవుతోంది. మాది పల్లెటూరు. ఆసుపత్రి టౌన్లో ఉంది. డాక్టర్‌కి చూపించుకోవాలా? – డి. కృష్ణకుమారి, రంగరావు పేట ప్రసవమైన ఆరు వారాల వరకు అప్పడప్పుడు బ్లీడింగ్ అవడం సహజమే. కానీ అధిక రక్తస్రావం, క్లాట్స్, వాసన, జ్వరం, నొప్పి వంటి లక్షణాలు మాత్రం నార్మల్ కాదు. మీరు వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. అక్కడ మీ టెంపరేచర్, యూటరస్, వెజైనల్ బ్లీడింగ్ మొదలైనవి చెక్ చేస్తారు. ఇంటర్నల్ స్కాన్ చేసి ప్లెసెంటాకు సంబంధించినవేమైనా మిగిలిపోయాయా.. ఇన్ఫెక్షన్ ఏమైనా సోకిందా అనీ పరీక్షిస్తారు. నార్మల్ డెలివరీలో అయితే కుట్లు ఎలా ఉన్నాయో కూడా చూస్తారు. బ్లీడింగ్ కంట్రోల్ అయ్యేలా మందులు ఇస్తారు. యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేస్తారు. అయినా మీరు బిడ్డకు పాలివ్వచ్చు. రక్త, మూత్ర పరీక్షలు చేసి.. ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందేమో చూస్తారు. మీకు ఐరన్, కాల్షియం సప్లిమెంట్స్ అవసరం అవుతాయి. పప్పుధాన్యాలు, ఆకుకూరలు, తాజా కూరగాయలు, కోడిగుడ్లు, మాంసపు కూరలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. కాళ్లల్లో, ఛాతీలో కూడా బ్లడ్ క్లాట్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి టెడ్ స్టాకింగ్స్ను సజెస్ట్ చేస్తారు. మేడం.. నాకు 25 ఏళ్లు. ప్రైవేట్ పార్ట్స్‌లో తరచుగా ఇచ్చింగ్ వస్తూంటుంది. ఎన్నిసార్లు మందులు వాడినా.. మళ్లీ మళ్లీ తిరగబెడుతూనే ఉంది. కిందటేడాది మూడుసార్లు డాక్టర్ దగ్గరకు వెళ్లాను. అయినా తగ్గట్లేదు. ఎందుకు? – సరళ గ్రేస్, పెనుగొండ మీరు చెప్పేదాన్ని బట్టి మీకు వెజైనల్ యీస్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు అనిపిస్తోంది. దీన్ని వెజైనల్ కాండిడయాసిస్ అంటారు. ఈ కండిషన్లో దురద, డిశ్చార్జ్ ఉంటాయి. కానీ రికరెంట్ కాండిడయాసిస్ అంటే ఏడాదిలో నాలుగు లేదా అంతకంటే ఎక్కువసార్లు ఇన్ఫెక్షన్ వస్తే లాంగర్ ట్రీట్మెంట్ కోర్స్, మెయిన్టెనెన్స్ కోర్స్‌ను ప్రిస్క్రైబ్ చేయాలి. మామూలు మందులతో తగ్గదు. ఆయింట్మెంట్లు, క్రీములు, వెజైనాలో పెట్టుకునే మాత్రలతో తాత్కాలిక ఉపశమనం ఉంటుంది తప్ప ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గదు. సరైన చికిత్స అందాలంటే ఈ ఇన్ఫెక్షన్ రావడానికి గల కారణాలను అంచనా వెయ్యాలి. యాంటీబయాటిక్స్‌ను ఎక్కువగా వాడినా.. చక్కెర వ్యాధి అదుపులో లేకపోయినా, రోగనిరోధక శక్తి సన్నగిల్లినా, హార్మోన్స్ థెరపీ తీసుకుంటున్నా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా రిస్క్ పెరుగుతుంది. మీరు డాక్టర్ని సంప్రదించినప్పుడు వెజైనల్ ఎగ్జామినేషన్ – స్పెక్యులమ్ ఎగ్జామ్ చేయించుకోవాలి. వెజైనల్ స్వాబ్ కల్చర్ పంపించాలి. లాంగ్ కోర్స్ వెజైనల్ థెరపీలో రెండు వారాలపాటు కంటిన్యుయస్‌గా యాంటీఫంగల్ మెడిసిన్స్ తీసుకోవాలి. తరువాత వారానికి ఒకసారి అలా ఆరు నెలల వరకు కొనసాగించాలి. ఓరల్ యాంటీఫంగల్ మందులను కూడా ఇస్తారు. రక్త, మూత్ర పరీక్షలను చేస్తారు. ఇలా కంప్లీట్ కోర్స్‌తో ఫంగల్ ఇన్ఫెక్షన్కి చికిత్సను అందిస్తారు.. అది తిరగబెట్టకుండా ఉండడానికి! నా వయసు 25 సంవత్సరాలు. ఈ మధ్య నాకు నెలసరికి ముందు చాలా నొప్పి, మూడ్ స్వింగ్స్, తలనొప్పి అనిపిస్తున్నాయి. నా జాబ్‌లో కూడా నేను పని మీద దృష్టి పెట్టలేకపోతున్నాను. నాకేదైనా సమస్య ఉందా? – నైమిష, వైజాగ్ దీనిని ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ (పీఎంఎస్) అంటారు. ఇది ప్రతి వందమందిలో ఇద్దరికి మీలో ఉన్నంత తీవ్రంగా లక్షణాలు ఉండే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల వారి దినచర్యలో ఇబ్బందులు ఎదురవుతాయి. చాలామందికి నెలసరి మొదలవడానికి రెండువారాల ముందు నుంచి శారీరక, మానసిక మార్పులు కనిపిస్తాయి. బరువు పెరగడం, మానసికంగా బలహీనం కావడం, తలనొప్పి, చిరాకు, కోపం, నిద్రలేమి, నీరసం ఉంటాయి. పీఎంఎస్‌కి సరైన కారణం తెలియదు. హార్మోన్ల మార్పు వల్ల వస్తుందని అనుకుంటాం. మీలో ఉన్న మార్పులన్నీ ఒక కాగితంపై రాసుకోవాలి. దీనిని మెన్స్ట్రువల్ డైరీ అంటాం. దీనిని రెండు మూడు నెలలు రాసినప్పుడు కారణాలు తెలుస్తాయి. దినచర్యలో మార్పులతో దీనిని తగ్గించవచ్చు. ప్రతిరోజూ వ్యాయామం చేయడం, సమతుల పోషకాహారం తీసుకోవడం, నెలసరికి రెండు వారాల ముందు నుంచి కాఫీ, టీ, జంక్‌ఫుడ్ తగ్గించుకోవడం, మానసిక స్థైర్యాన్ని పెంచుకోవడానికి యోగా వంటివి అలవాటు చేసుకోవడం వల్ల పీఎంఎస్ లక్షణాలు చాలా వరకు తగ్గుతాయి. డాక్టర్ పర్యవేక్షణలో కొన్ని మందులు కూడా వాడుకోవలసి ఉంటుంది. విటమిన్–డి, విటమిన్–ఇ సప్లిమెంట్లు కూడా కొంత వరకు ఉపయోగపడతాయి. కొంతమందికి పైమార్పులతో కూడా లక్షణాలు తగ్గకపోతే, డాక్టర్లను సంప్రదిస్తే జీఎన్ఆర్హెచ్ ఎనలాగ్స్ మందులు ఇస్తారు. అత్యంత అరుదుగా ఈ సమస్యకు శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. డా‘‘ భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
Health: పందొమ్మిదేళ్లు.. తొలి చూలు ప్రెగ్నెంట్.. నార్మల్ డెలివరీ కావాలంటే?!
నాకు పందొమ్మిదేళ్లు. ఇప్పుడు నేను తొలి చూలు ప్రెగ్నెంట్‌ని. టీటీ ఇంజెక్షన్ ఎప్పుడు తీసుకోవాలి? ఎన్ని రోజులకు ఒకసారి డాక్టర్ చెకప్‌కి వెళ్లాలి? ఆపరేషన్ లేకుండా ప్రసవం కావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పగలరు. – టీ. ప్రణీత, ధర్మవరం ప్రెగ్నెన్సీలో వేసుకునే టెటనస్ ఇంజెక్షన్ వాక్సినేషన్లో ఇటీవల చాలా మార్పులు వచ్చాయి. మన గవర్నమెంట్ సెటప్‌లో T.T plain ఇంజెక్షన్‌ను 13–39 వారాల మధ్యలో నాలుగు వారాల తేడాతో రెండు డోస్‌లు ఇస్తారు. సెకండ్ డోస్ టీటీ వాక్సీన్‌ను ప్రసవానికి కనీసం మూడు నెలల ముందు తీసుకునేట్టు చూడాలి. దీనివల్ల తల్లి నుంచి బిడ్డకి యాంటీబాడీస్ పాస్ అవడానికి.. హైకాన్సంట్రేషన్ ఉండటానికి సహాయపడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు.. ప్రెగ్నెన్సీ సమయంలో 27– 36 వారాల మధ్య.. Tdap అనే కాంబినేషన్ వాక్సిన్ సింగిల్ డోస్‌ను ఇస్తున్నారు. దీన్ని మన దేశంలో కూడా ఐఏపీ (ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్), ఎఫ్ఓజీఎస్ఐ (ది ఫెడరేషన్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్ అండ్ గైనకాలాజికల్ సొసైటీస్ ఆఫ్ ఇండియా) అనుమతించాయి. చెకప్స్ విషయానికి వస్తే ఇక ప్రెగ్నెన్సీ సమయంలో చెకప్స్ విషయానికి వస్తే.. మొదటి ఏడు నెలల వరకు నెలకు ఒకసారి చెకప్‌కి వెళ్లాలి. ఏడవ నెల నుంచి తొమ్మిదవ నెలదాకా రెండు వారాలకు ఒకసారి చెకప్స్‌కి వెళ్లాలి. తొమ్మిదవ నెలలో వారానికి ఒకసారి చెకప్‌కి వెళ్లాలి. ఇలా కరెక్ట్‌గా చెకప్స్‌కి వెళ్తే తల్లీ, పొట్టలోని శిశువు ఆరోగ్యపరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయవచ్చు. బీపీ, సుగర్, థైరాయిడ్లాంటివి డిటెక్ట్ చేసి.. వెంటనే చికిత్సను అందించే వీలు ఉంటుంది. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన మందులను ఇస్తూ ప్రసవం సాఫీగా అయ్యేలా చూసే చాన్స్ ఉంటుంది. గర్భస్థ శిశువు పెరుగుదలను చూడ్డానికి స్కాన్, TIFFA స్కాన్, NT స్కాన్‌ను సజెస్ట్ చేస్తారు. ఆపరేషన్ లేకుండా నార్మల్ డెలివరీ కావడానికి ప్రెగ్నెన్సీ మొదలు పోషకాహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కాంప్లికేషన్స్ లేకపోతే నార్మల్ డెలివరీ కొన్ని మెడికల్, ప్రెగ్నెన్సీకి సంబంధించిన కాంప్లికేషన్స్ ఉంటే మాత్రం ముందుగానే డాక్టర్‌ను కలిస్తే.. మెడికల్ హిస్టరీ తెలుసుకుని.. ప్రెజెంట్ కండిషన్‌ను అంచనా వేస్తారు. రిస్క్ ఉంది అనుకుంటే.. తొమ్మిదవ నెల నిండాక ఆపరేషన్ తప్పనిసరి అని చెబుతారు. ఎలాంటి కాంప్లికేషన్స్ లేకపోతే మాత్రం వంద శాతం నార్మల్ డెలివరీకి ప్రయత్నిస్తారు. తొమ్మిదవ నెలలో పెరినియల్ మసాజెస్.. నార్మల్ డెలివరీకి కొంతవరకు సాయపడవచ్చు. కనీసం ఒక గంట వాకింగ్, 15– 20 స్క్వాట్స్ చేయడం వల్ల పెల్విక్ ఫ్లోర్ కండరాలకు వ్యాయామం అందుతుంది. అధిక బరువు లేకుండా, బీపీ, సుగర్, థైరాయిడ్లు రాకుండా స్ట్రిక్ట్ డైట్ ఫాలో కావాలి. రెగ్యులర్ చెకప్స్‌లో ఇంటర్నల్ పెల్విస్ చెక్ చేసి నార్మల్ డెలివరీ చాన్స్ ఎంత ఉందో మీ డాక్టర్ చెబుతారు. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
ఆ సర్జరీ చేయించుకుంటే .. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుందా?
బేరియాట్రిక్ సర్జరీ వల్ల వైవాహిక జీవితం సాఫీగా సాగుతుందా? పిల్లల్ని కనడంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తుతాయా? – జి. పూర్ణిమ, వేములవాడ బాడీమాస్ ఇండెక్స్ (బీఎమ్ఐ) అంటే మీ ఎత్తుకు ఎంత బరువు ఉండాలో కాలిక్యులేట్ చేసే పద్ధతి. ఈ బీఎమ్ఐ 40 .. అంతకన్నా ఎక్కువ ఉన్నవారిలో ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ. వైవాహిక జీవితంలో సమస్యలు? అధిక బరువుతో ఉండీ.. ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నవారికి.. డయాబెటిస్, హై బీపీ, స్లీప్ ఆప్నియా వంటివి తగ్గించుకోవడానికి కొన్నిసార్లు బేరియాట్రిక్ సర్జరీని సూచిస్తున్నారు. బేరియాట్రిక్ సర్జరీ చేసుకున్న తరువాత వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలూ ఉండవు. కానీ భవిష్యత్‌లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి కనీసం ఏడాది నుంచి రెండేళ్లు గ్యాప్ ఇవ్వాలి. ప్రత్యేకంగా టెస్టులు విటమిన్ సప్లిమెంట్స్, మైక్రోన్యూట్రైంట్స్, ఫోలిక్ యాసిడ్ వంటివి ముందుగానే ఇవ్వాలి. హైరిస్క్ ప్రెగ్నెన్సీలాగా ప్రెగ్నెన్సీ టైమ్ అంతా మల్టీడిసిప్లినరీ టీమ్‌తో చూపించుకోవాలి. బీఎమ్ఐ తగ్గటం వల్ల హై బీపీ, హై సుగర్ చాన్సెస్ తగ్గుతాయి. జెస్టేషనల్ డయాబెటిస్ ఉందా అని అందరికీ చేసే టెస్ట్స్ కాకుండా వాళ్లకు ప్రత్యేకంగా టెస్ట్స్ చేస్తారు. బేరియాట్రిక్ సర్జరీ కాంప్లికేషన్స్ కూడా అబ్జర్వ్ చేయాలి. సర్జన్, డైటీషియన్, సైకాలజిస్ట్‌ల ఫాలో అప్‌లో ఉండాలి. డెలివరీ డెసిషన్ అనేది ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్‌ని బట్టి తీసుకోవాలి. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
Health: సరోగసీకి ఎలాంటి వారు తమ గర్భాన్ని అద్దెకు ఇవ్వొచ్చు?
సరోగసీకి ఎలాంటి వారు తమ గర్భాన్ని అద్దెకు ఇవ్వొచ్చు?అంటే దానికి ఉండాల్సిన ఆరోగ్య లక్షణాలు ఏమిటి? – కొండపల్లి వాసవి, నందిగామ సరోగసీ అంటే అద్దెకు గర్భాన్ని తీసుకోవడం. ఎవరికైనా గర్భధారణ కష్టమైనప్పుడు గర్భకోశం బిడ్డని మొయ్యలేదని తేలినప్పుడు వాళ్ల అండం.. స్పెర్మ్ టెస్ట్ ట్యూబ్‌లో ఫలదీకరణం చెంది పిండంగా మారాక దాన్ని ఇంకొకరి గర్భంలో ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ఇంప్లాంట్ చేసి.. వారు డెలివరీ తరువాత బయోలాజికల్ పేరెంట్స్‌కి తిరిగి ఇచ్చేయడం.. ఇదన్న మాట ఆ ప్రక్రియ. మన దేశంలో అయితే కమర్షియల్ సరోగసీకి అనుమతి లేదు. ఎలాంటి డబ్బు ఆశ లేకుండా కేవలం స్వచ్ఛందంగా ఈ పని చేయాలి. ఇండియన్ సరోగసీ యాక్ట్ ప్రకారం పెళ్లయిన దంపతులు ఏవైనా అనారోగ్య సమస్యల వల్ల ప్రెగ్నెన్సీని క్యారీ చేయలేకపోతే.. ఒకసారి మాత్రమే సరోగేట్ ప్రెగ్నెన్సీని మోయాలి. ఐవీఎఫ్‌కి 3 అటెంప్ట్స్ మాత్రమే ప్రయత్నించాలి. శారీరకంగా.. మానసికంగా ఆరోగ్యంగా.. దృఢంగా ఉండాలి. వైద్య ఖర్చులు మాత్రమే తీసుకోవాలి. గోప్యతను పాటించాలి. సరోగసీ కోసం రిజిస్టర్ అయిన సంతానసాఫల్య కేంద్రంలో మాత్రమే ఈ ప్రక్రియను చేయాలి. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
Health: తొలి చూలు అలా.. ఇప్పుడు మళ్లీ ఇలా! భయంగా ఉంది..
ఒకసారి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వస్తే తర్వాత వచ్చే గర్భం కూడా ఎక్టోపిక్ అయ్యే ప్రమాదం ఉంటుందా? ఎందుకంటే నాకు తొలి చూలు ముత్యాల గర్భమని తేలడంతో సర్జరీ చేసి ఆ గర్భాన్ని తొలగించారు. ఇప్పుడు మళ్లీ ప్రెగ్నెన్సీ వచ్చింది. అందుకే భయంగా ఉంది. – బి. రాధిక మూర్తి, విశాఖపట్టణం. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే గర్భం గర్భసంచిలో కాకుండా బయట అంటే ఫాలోపియన్ ట్యూబ్స్‌లో, అండాశయాల్లో, పొత్తికడుపులో నిలవడం. దీన్ని రక్త పరీక్షలు, స్కానింగ్ ద్వారా కనిపెడ్తారు. ఈ గర్భం నిలిచిన స్థానం, పరిమాణం, బ్లడ్ వాల్యూ మీద దీని చికిత్స ఆధారపడి ఉంటుంది. ఫాలోపియన్ ట్యూబ్స్‌లో గర్భం నిలవడమనేది సాధారణంగా అంటే ఒక శాతం మందిలో చూస్తాం. కారణాలివే ఇంతకు ముందు ఎక్టోపిక్ వచ్చినవారిలో మళ్లీ 11 నుంచి 20 శాతం వరకు వచ్చే చాన్స్ ఉంటుంది. అందుకే కొన్ని కేసెస్‌లో కారణం తెలిసినప్పుడు దానికి సరైన చికిత్స చేస్తే.. ఎక్టోపిక్ మళ్లీ వచ్చే చాన్స్‌ని తగ్గించవచ్చు. ట్యూబ్స్ డామేజ్ అవడం, ఇన్ఫెక్షన్స్, పెల్విక్ ఇన్ఫెక్షన్స్, పెల్విక్ సర్జరీ, అతుక్కుని ఉండడం.. వంటివి కొన్ని కారణాలు. ట్యూబ్స్‌లో, ఓవరీస్‌లో నిలిచే ప్రెగ్నెన్సీ వల్ల లైఫ్ రిస్క్ ఉంటుంది. అందుకే ఇంతకు ముందు ఎక్టోపిక్ వచ్చిన వారు.. ప్రెగ్నెన్సీ అని తెలిసిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. కొంతమందిలో కాపర్ – టీ అనే గర్భనిరోధక డివైజ్ గర్భసంచిలో ఉన్నప్పుడు.. ట్యూబ్స్‌లో ప్రెగ్నెన్సీ వచ్చే చాన్సెస్ ఎక్కువ. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీల్లోనూ ఎక్టోపిక్ చాన్సెస్ ఎక్కువే. 6 – 7 వారాల ప్రెగ్నెన్సీలోనే ట్రాన్స్ వెజైనల్ స్కాన్ ద్వారా ఎక్టోపిక్ను కనిపెట్టవచ్చు. ప్రెగ్నెన్సీ సక్సెస్ అయ్యే చాన్సెస్ ఎక్కువే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయితే దానికి మందులు, శస్త్రచికిత్స .. ఈ రెండు ఆప్షన్స్ ఉంటాయి. మందులతో చికిత్స అనేది కొన్ని సెలెక్టెడ్ కేసెస్‌లో చేస్తాం. Methotrexate అనే ఇంజెక్షన్ ఇస్తాం. ఇది తీసుకున్న తరువాత మూడు నెలల వరకు ప్రెగ్నెన్సీని అవాయిడ్ చెయ్యాలి. తర్వాత వచ్చే ప్రెగ్నెన్సీ సక్సెస్ అయ్యే చాన్సెస్ ఎక్కువే ఉంటాయి. ఈ ఎక్టోపిక్ వచ్చే చాన్స్ అరుదుగా ఉండొచ్చు. మీకు ఇంతకుముందు ముత్యాల గర్భం వచ్చింది అన్నారు. అది క్రోమోజోమ్స్ ఇంబాలెన్స్ వల్ల అవుతుంది. దీన్ని సర్జరీ ద్వారా తొలగించినా ఏడాది వరకు ఫాలో అప్ కేర్ అవసరం ఉంటుంది. మీకు హెచ్‌సీజీ హార్మోన్ లెవెల్స్‌ను బ్లడ్ టెస్ట్ ద్వారా పరీక్షించి కంట్రోల్ అయిందా లేదా చూస్తారు. అయితే వందలో ఒకరికి ఈ ముత్యాల గర్భం రిపీట్ అయ్యే చాన్స్ ఉంది. ఎక్టోపిక్ లాగే దీన్ని కూడా తక్కువ వారాల వ్యవధిలోనే స్కానింగ్‌లో గుర్తుపట్టవచ్చు. ఇప్పుడు గర్భంతో ఉన్నాను అంటున్నారు కాబట్టి.. మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించండి. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ చదవండి: పెళ్లయిన 15 రోజులకే భర్తతో అమెరికాకు.. నిజస్వరూపం బయటపడటంతో.. ఆఖరికిలా! ముందే తెలుసుకుంటే.. -
నాకిప్పుడు 43 ఏళ్లు అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చింది..
మా పాపకు పద్దెనిమిదేళ్లు. ఛాతీ మరీ ఫ్లాట్‌గా ఉంది. ఇంప్రూవ్ అవడానికి ఏమైనా మందులు ఉన్నాయా? వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? – పి. పుష్పలత, అమలాపురం బ్రెస్ట్ డెవలప్మెంట్ సాధారణంగా తొమ్మిది నుంచి పదకొండేళ్ల మధ్య మొదలవుతుంది. ఈ గ్రోత్ ప్రతి అమ్మాయికి డిఫరెంట్‌గా ఉంటుంది. దాదాపుగా 17 – 18 ఏళ్లు వచ్చేసరికి బ్రెస్ట్ గ్రోత్ పూర్తవుతుంది. పరిమాణం, ఆకారం అందరమ్మాయిలకు ఒకేలా డెవలప్ అవదు. మస్సాజ్లు, క్రీములు, మాత్రలు, వ్యాయామం.. లాంటివేవీ కూడా బ్రెస్ట్ సైజ్‌ని, షేప్‌ని చేంజ్ చేయలేవు. రొమ్ములు ఫ్యాటీ టిష్యూతో ఉంటాయి. అది మజిల్ కాదు కాబట్టి వ్యాయామంతో బ్రెస్ట్స్ సైజ్‌ను పెంచలేం. బరువు తగ్గినప్పుడు బ్రెస్ట్ సైజ్ కూడా కొంత తగ్గవచ్చు. బరువు పెరిగినప్పుడు పెరగవచ్చు. కానీ ఇది తాత్కాలిక మార్పు మాత్రమే. కాస్మెటిక్ బ్రెస్ట్ సర్జరీ ద్వారా బ్రెస్ట్ సైజ్‌ను పెంచే అవకాశం ఉంది. కానీ దానికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలానే ఉంటాయి. స్కార్ టిష్యూ ఫామ్ అవడం, బ్రెస్ట్ ఫీడ్ చెయ్యలేకపోవడం వంటి శాశ్వత సమస్యలు కూడా ఉండొచ్చు. కొన్ని అరుదైన వ్యాధుల్లో కూడా బ్రెస్ట్ చాలా చిన్నగా ఉండొచ్చు. టర్నర్ సిండ్రోమ్ అనే జన్యుపరమైన డిజార్డర్‌లో కూడా ఫ్లాట్ చెస్ట్ అండ్ నిపుల్స్ ఉండొచ్చు. అలాంటి అనుమానాలేమైనా ఉంటే ఒకసారి గైనకాలజిస్ట్‌ని సంప్రదించండి. కొన్ని రక్తపరీక్షలు చేస్తారు. నాకిప్పుడు 43 ఏళ్లు. అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చింది. ఈ వయసులో పిల్లల్ని కంటే ఆరోగ్యంగా పుడతారా?ఇది నాకు తొలి కాన్పు. పిల్లల కోసం మందులు వాడీవాడీ విసిగిపోయి ఆపేశాక వచ్చిన ప్రెగ్నెన్సీ అండీ...! – ఎన్. చంద్రప్రభ, సిర్పూర్ కాగజ్‌నగర్ నలభై ఏళ్లు దాటిన ప్రెగ్నెన్సీలో చాలా రిస్క్స్ ఉంటాయి అనేది చాలామంది భయం. కానీ సింగిల్టన్ ప్రెగ్నెన్సీ సాఫీగా సాగే అవకాశం లేకపోలేదు. 25– 35 ఏళ్ల మధ్య ఉండే కాంప్లికేషన్స్ కన్నా కొంచెం ఎక్కువ రిస్క్ ఉండొచ్చు. వాటిలో ఆపరేషన్ ద్వారా డెలివరీ అవటం, నెలలు నిండక ముందే కాన్పు అయ్యే రిస్క్ వంటివి ఎక్కువ. ఐవీఎఫ్, కవలల ప్రెగ్నెన్సీలో ఈ రిస్క్ ఇంకాస్త పెరుగుతుంది. మొదటి మూడునెలల్లో పుట్టుక లోపాలు .. డౌన్‌సిండ్రోమ్ లాంటివి, గర్భస్రావం, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వంటి ప్రమాదాలు ఎక్కువుంటాయి. బాడీ పెయిన్స్, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులూ ఎక్కువుండొచ్చు. డాక్టర్ని సంప్రదించినప్పుడు వాటికి తగిన ట్రీట్మెంట్ను ఇస్తారు. తొలి మూడునెలల్లో తప్పనిసరిగా జెనెటిక్ స్క్రీనింగ్ టెస్ట్స్ చేయించుకోవాలి. ప్రతినెల బీపీ, సుగర్, థైరాయిడ్ పరీక్షలూ చేయించుకోవాలి. ప్రతినెల తప్పకుండా గైనకాలజిస్ట్‌ను సంప్రదిస్తూ టైమ్‌కి చేయవలసిన స్కానింగ్‌లు, పరీక్షలు చేయించుకుంటూండాలి. సరైన చికిత్సతో నలభై ఏళ్లు దాటిన తర్వాత కూడా సురక్షితమైన, ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీ, కాన్పూ సాధ్యమే. నేను కెరీర్ ఓరియెంటెడ్. సరోగసీ ద్వారా పిల్లల్ని కనాలనుకుంటున్నాను. దానివల్ల బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వడం కుదరదు కాబట్టి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందా? – రంజనీ ప్రసాద్, పుణె సరోగసీ ద్వారా పిల్లల కోసం ప్లాన్ చేసినా కొంతమంది.. మందుల ద్వారా బ్రెస్ట్ ఫీడ్‌కి ట్రై చేయవచ్చు. దాన్ని లాక్టేషన్ ఇండక్షన్ అంటారు. సరోగసీ బేబీ డెలివరీ టైమ్ కన్నా ముందు నుంచే మీరు బ్రెస్ట్ ఫీడ్ ట్రై చేయడానికి ప్రిపరేషన్ చేసుకోవాలి. అందరికీ ఇది సక్సెస్ కాకపోవచ్చు. కానీ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ప్రయోజనాలు అందరికీ తెలిసినవే. ఏడాది వరకు బ్రెస్ట్ ఫీడింగ్తో నాలుగు నుంచి అయిదు శాతం వరకు బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది హార్మోన్స్, జన్యుపరమైన, జీవనశైలి మీద ఆధారపడి పెరుగుతుంది. 5 నుంచి 10 శాతం జన్యుపరమైన కారణాలుంటాయి. బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వనందువల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ కొంచెం మాత్రమే మారుతుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి.. అంటే అధిక బరువు లేకుండా, సరైన బీఎమ్ఐ ఉండేలా క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తూ .. పోషకాహరం తీసుకుంటూ ఉంటే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. హైరిస్క్ జన్యుపరమైన కారణాలు ఉన్నవారిలో అంటే బీఆర్సీఏ (ఆఖఇఅ) జీన్ పాజిటివ్ అని స్క్రీనింగ్‌లో తేలినవారిలో ప్రాఫిలాక్టిక్ సర్జరీల ద్వారా ఆ రిస్క్‌ను తగ్గించవచ్చు. బ్రెస్ట్స్ అల్ట్రాసౌండ్, మామోగ్రఫీ ద్వారా తొలిదశలోనే క్యాన్సర్ మార్పులను కనిపెట్టవచ్చు. ఈ రోజుల్లో సరోగసీతో పిల్లల్ని కన్నా కొన్ని మందుల ద్వారా బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చేలా బిడ్డ.. తల్లి స్పర్శ పొందేలా చూస్తున్నాం. -
Health: టాబ్లెట్ల ద్వారా హార్మోన్స్‌ను రీప్లేస్ చేయొచ్చా? వారికైతే సురక్షితం కాదు..
మెనోపాజ్ వల్ల హార్మోన్స్ తగ్గిపోతాయి కదా.. దాని ప్రభావం ఆరోగ్యం మీద పడకుండా ఉండడానికి మాత్రల ద్వారా హార్మోన్స్‌ను రీప్లేస్ చేయవచ్చా? – సీహెచ్. వెంకటలక్ష్మి, సామర్లకోట మెనోపాజ్ తరువాత హార్మోన్స్ డెఫిషియెన్సీ వల్ల సైడ్ఎఫెక్ట్స్, ఇబ్బందులతో చాలామంది బాధపడుతుంటారు. వాటిని తగ్గించడానికి చాలామంది హెచ్ఆర్టీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారిప్పుడు. అయితే దీనిని డాక్టర్ పర్యవేక్షణలోనే తీసుకోవాలి. అదికూడా వైద్య పరీక్షల అనంతరం. ఈ హెచ్ఆర్టీ అందరికీ సరిపడకపోవచ్చు. మెనోసాజ్ వచ్చిన కొన్ని నెలల తర్వాత ఈ హార్మోన్స్ థెరపీతో ముఖ్యంగా హాట్ ఫ్లషెస్, రాత్రిళ్లు చెమటలు పట్టడం, మూడ్ స్వింగ్స్, వెజైనా పొడిబారిపోవడం వంటి సమస్యలను పరిష్కరించవచ్చు. ఆస్టియోపొరాసిస్ అంటే ఎముకలు గుల్లబారడం వంటి సమస్యనూ నివారిస్తుందీ హెచ్ఆర్టీ. ఈ సింప్టమ్స్ అన్నీ మెనోసాజ్ వచ్చిన కొన్నినెలలకు కనపడతాయి. ట్రీట్మెంట్ మొదలుపెట్టాక కనీసం మూడు నెలలు అయితే కానీ దాని ప్రభావం కనిపించదు. వారికి హెచ్ఆర్టీ సురక్షితం కాదు ఒకవైళ ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తే డోస్, ప్రిపరేషన్ మార్చేయవచ్చు. అయితే బ్రెస్ట్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, అంతకుముందు బ్లడ్ క్లాట్స్ ఉన్నా, హై బీపీ, లివర్ ప్రాబ్లమ్ ఉన్నవారిలో హెచ్ఆర్టీ సురక్షితం కాదు. హెచ్ఆర్టీలో హార్మోన్స్‌ను సింగిల్ డోస్‌గా కానీ.. కంబైన్డ్ డోస్ టాబ్లెట్స్‌గా కానీ ఇస్తారు. ఇవి ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్స్‌తో ఉంటాయి. స్కిన్ పాచెస్, జెల్స్, పెసరీస్ కూడా ఉంటాయి. హెచ్ఆర్టీకి ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి. జీవనశైలిలో మార్పులు అంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పోషకాహారం తీసుకోవడం, మసాలా ఆహారపదార్థాలు, టీ, కాఫీ, ఆల్కహాల్ వంటివాటికి దూరంగా ఉంటూ.. తాజా ఆకుకూరలు,బాదం పప్పు, అక్రోట్స్, సోయా బీన్స్ వంటివి తీసుకుంటూంటే మెనోపాజ్ సింప్టమ్స్ అంతగా బాధించవు.. తగ్గుతాయి కూడా. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ చదవండి: Unwanted Hair: పై పెదవి మీద, చుబుకం కింద డార్క్ హెయిర్.. పీసీఓఎస్ వల్లేనా? పరిష్కారం? పిల్లల్లో రోజూ 80 – 100 వరకు తల వెంట్రుకలు రాలుతుంటే ఓసారి... -
పై పెదవి మీద, చుబుకం కింద డార్క్ హెయిర్.. పీసీఓఎస్ వల్లేనా? పరిష్కారం?
నాకు 26 ఏళ్లు. సడెన్‌గా అన్వాంటెడ్ హెయిర్ ప్రాబ్లమ్ మొదలైంది. పీరియడ్స్ రెగ్యులర్‌గానే వస్తాయి. అయినా ఇలా పై పెదవి మీద, చుబుకం కింద, చెంపలకు డార్క్‌గా హెయిర్ వస్తోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి ప్లీజ్! – మాన్విత, హైదరాబాద్ అన్వాంటెడ్ హెయిర్‌ని హర్సుటిజమ్ (Hirsutism)అంటారు. శరీరంలో ఆండ్రోజెన్ స్థాయి పెరిగినప్పుడు ఇలా సడెన్‌గా మొహం, ఛాతి, పొత్తి కడుపు మీద, వీపు, తొడల మీద ఇలా డార్క్‌గా హెయిర్ వస్తుంది.ఈ సమస్య కనపడగానే వెంటనే ఎండోక్రైనాలజిస్ట్ లేదా స్కిన్ స్పెషలిస్ట్‌ని సంప్రదించాలి. సాధారణంగా పీసీఓఎస్‌తో బాధపడుతున్న వాళ్లలో ఇలా అన్వాంటెడ్ హెయిర్ ప్రాబ్లమ్‌ను చూస్తాం. అయితే ఈ పీసీఓఎస్‌లో నెలసరి క్రమం తప్పడం, స్థూలకాయం వంటి సమస్యలూ ఉంటాయి. కుషింగ్ సిండ్రోమ్ అనే కండిషన్లో కాటిసాల్ (Cartisol) స్థాయి పెరిగి అవాంఛిత రోమాల సమస్య వస్తుంది. స్టెరాయిడ్స్ ఎక్కువ రోజులు వాడినా ఈ సమస్య తలెత్తవచ్చు. క్రీమ్స్ వాడుతున్నట్టయితే కేశ, చర్మ సంరక్షణకు సంబంధించిన మినాక్సిడిల్, డనేజోల్ వంటి మందుల వల్లా ఈ సమస్య రావచ్చు. మీరు స్కిన్ కోసం ఏవైనా క్రీమ్స్ వాడుతున్నట్టయితే ఒకసారి దాని కంపోజిషన్ చెక్ చేసుకోండి. ఒకసారి డాక్టర్‌ను సంప్రదిస్తే మీ హెల్త్ హిస్టరీలో పైన వివరించిన కండిషన్స్ గురించి తెలుసుకుంటారు. కొన్ని రక్తపరీక్షలు చేసి టెస్టోస్టిరాన్ స్థాయి, ఆండ్రోజెన్ స్థాయిలను చెక్ చేస్తారు. అబ్డామిన్ స్కాన్ చేసి.. అడ్రినల్ గ్లాండ్‌లో ఏవైనా గడ్డలున్నాయా అని కూడా చెక్ చేస్తారు. కొన్నిసార్లు సీటీ స్కాన్ అవసరం కావచ్చు. ఇవన్నీ లేవని తేలి.. నెలసరి క్రమం తప్పకుండా వస్తూంటే.. తాత్కాలిక హెయిర్ రిమూవల్ సొల్యూషన్స్‌ను సూచిస్తారు. కొంతమందికి గర్భనిరోధక మాత్రలు, స్పైరనోలాక్టోన్ వంటి మందులు ఇస్తారు. శాశ్వత చికిత్స అవసరం లేదు ఎండోక్రైన్ అంటే హార్మోన్ సమస్య లేకపోతే అవాంఛిత రోమాలకు శాశ్వత చికిత్స అవసరం లేదు. ఉన్న కండిషన్, సమస్యకు తగ్గట్టుగా చికిత్సను అందించాలి. ట్రీట్మెంట్ ప్రభావం కనిపించడానికి ఆరు నుంచి ఎనిమిది నెలల టైమ్ పడుతుంది. ప్రెగ్నెన్సీతో ఉన్నా.. ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌లో ఉన్నా ఈ ట్రీట్మెంట్ను తీసుకోకూడదు. అవాయిడ్ చేయాలి. చాలామందిలో ఏ ఆరోగ్యసమస్య లేకుండా కూడా ఈ అన్వాంటెడ్ హెయిర్ రావచ్చు. అలాంటివారు లేజర్, ఎలక్ట్రాలిసిస్ వంటి హెయిర్ రిమూవల్ ఆప్షన్స్ గురించి ఆలోచించవచ్చు. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ చదవండి: Sara Ali Khan: పండ్లే కాదు.. వాటి తొక్కలు కూడా వదలను! నా బ్యూటీ సీక్రెట్ ఇదే -
Health: పదిహేడేళ్లు.. ఏ అనారోగ్యం లేదు.. అయినా ఎందుకిలా?!
మా అమ్మాయికి పదిహేడేళ్లు. ఇంకా రజస్వల కాలేదు. ఏ అనారోగ్యమూ లేదు. అయినా రజస్వల ఎందుకు కావట్లేదో తెలియడం లేదు. – అనూరాధ, చింతలపూడి డిలేయ్డ్ మెనాకీ సాధారణంగా పదమూడేళ్ల లోపు బ్రెస్ట్ డెవలప్మెంట్, పదహారేళ్లలోపు నెలసరి మొదలు అవుతాయి. పదహారేళ్ల తర్వాత కూడా రాకపోతే డిలేయ్డ్ మెనాకీ (delayed menarche) అంటాము. చాలామంది అమ్మాయిలు తక్కువ బీఎమ్ఐ.. అంటే ఎత్తుకు తగ్గ బరువు నిష్పత్తి 17 కన్నా తక్కువ ఉంటే బరువు పెరిగిన తర్వాతే నెలసరి మొదలవుతుంది. కొంమందిలో హార్మోన్స్ ఇంబాలెన్స్, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇలా ఆలస్యంగా రజస్వల అవుతారు. ఎండోక్రైనాలజిస్ట్ (హార్మన్ డాక్టర్)ను సంప్రదించాల్సి రావచ్చు. సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అంటే ఆక్సిలా, ప్యూబిక్ ఏరియాలో హెయిర్ గ్రోత్ ఉండడం, బ్రెస్ట్ డెవలప్మెంట్ మొదలవడం కనుక ఉంటే హార్మోన్ల పరీక్ష అవసరం లేదు. తక్కువ బరువు ఉన్నా ఆలస్యంగానైనా నెలసరి మొదలవ్వొచ్చు. కానీ పదిహేడేళ్లు దాటినా ఇలాంటి మార్పులేనప్పుడు వెంటనే గైనకాలజిస్ట్ లేదా ఎండోక్రైనాలజిస్ట్‌ను సంప్రదించాలి. స్పోర్ట్స్‌లో యాక్టివ్‌గా ఉన్నవారిలో కూడా పీరియడ్స్ లేట్‌గానే మొదలవుతాయి. వయస్సుకి ఉండాల్సిన బరువు కన్నా తక్కువ బరువు ఉన్నా నెలసరి ఆలస్యంగానే మొదలువుతుంది. ఒకసారి స్కానింగ్ చేయించి, డాక్టర్‌ను సంప్రదిస్తే .. థైరాయిడ్ పరీక్ష చేసి ఏ సమస్యాలేదు అంటే.. నెలసరి కోసం వేచి చూడవచ్చు. -డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ చదవండి: ఫోర్స్ చేస్తున్నారు