ప్రతీకాత్మక చిత్రం
What Painkillers Are Safe During Pregnancy?: నేను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ని. ఇప్పుడు నాకు ఆరోనెల. నాకు నడుము నొప్పి, కాళ్ల నొప్పులు వస్తున్నాయి. ఎలాంటి పెయిన్ కిల్లర్స్‌ను సేఫ్‌గా వాడుకోవచ్చు.
– దేవి, ఏలూరు
ప్రెగ్నెన్సీలో పెయిన్ కిల్లర్స్ సేఫ్ కాదు. మెడికల్ షాపుల్లో అడిగి ఓవర్ ది కౌంటర్ దొరికే పెయిన్ కిల్లర్ మందులను అసలే వాడకూడదు. చాలా పెయిన్ కిల్లర్స్ రక్తం ద్వారా కడుపులోని బిడ్డకు వెళతాయి. ఇవి బిడ్డలోని అవయవాల ఎదుగుదలపై ప్రభావం చూపుతాయి.
డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే నొప్పి నివారణ కోసం మందులు వాడాలి. ప్రెగ్నెన్సీలో ఎక్కువసేపు ఒకేచోట కూర్చుని పనిచేసినప్పుడు కాళ్లవాపులు, నొప్పి రావడం సహజం. ప్రెగ్నెన్సీలో బరువు పెరిగినందు వల్ల ఈ నొప్పి ఇంకా ఎక్కువగా ఉండవచ్చు. అందుకే వ్యాయామాలు మొదలుపెట్టాలి.
గంట గంటకూ ఓ ఐదు – పది నిమిషాలు నెమ్మదిగా నడవడం అలవాటు చేసుకోవాలి. కాల్షియం, విటమిన్ టాబ్లెట్స్, పోషకాహారం, పాలు తీసుకోవాలి. ఫిజియో థెరపిస్టును సంప్రదిస్తే, సరైన భంగిమలో కూర్చోవడంతో పాటు కూర్చుని చేసే ఎక్సర్‌సైజెస్ నేర్పిస్తారు. వీటితో నొప్పి తగ్గకపోతే డాక్టర్‌ను సంప్రదించాలి.
ప్రెగ్నెన్సీ సమయంలో పారాసెటమాల్‌ను సేఫ్‌గా వాడుకోవచ్చు. అలాగే, తగినంత విశ్రాంతి, హాట్ అండ్ కోల్డ్ మసాజ్‌లు కూడా నొప్పి నివారణకు ఉపయోగపడతాయి. మొదటి మూడు నెలలు.. కడుపులో బిడ్డ అవయవాలు ఏర్పడుతూ ఉండే దశ. ఆ సమయంలో ఎలాంటి పెయిన్ కిల్లర్స్ వాడకపోవడమే మంచిది.
అయితే, పారాసెటమాల్ వల్ల బిడ్డపై పెద్దగా దుష్ప్రభావాలు ఉండవని పరిశోధనల్లో తేలింది. కొన్ని దగ్గు మందులు, సిరప్‌లలో కూడా పారాసెటమాల్ ఉంటుంది. అన్నీ కలిపి తీసుకున్నప్పుడు మనకు తెలియకుండానే పారాసెటమాల్ ఎక్కువ మోతాదులో శరీరంలోకి వెళ్లవచ్చు. అందుకే ఓవర్ ది కౌంటర్ మందులు తీసుకోకూడదు.
పెయిన్ కిల్లర్స్ సేఫ్‌గా వాడుకోవాలంటే, తక్కువ మోతాదు, తక్కువ రోజులు వాడేలా చూసుకోవాలి. నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్ (ఎన్‌ఏఐడీస్) అనే కొన్ని రకాల మందులు మెడికల్ షాప్స్‌లో దొరుకుతాయి. ఇబుప్రొఫెన్, నాప్రోక్సెన్, మెఫెనామిక్ యాసిడ్‌లాంటివి.. డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా అసలు వాడకూడదు.
ఏడో నెల తర్వాత ఇవి వాడినట్లయితే, కడుపులోని బిడ్డకు గుండె సంబంధిత సమస్యలు, కిడ్నీ సమస్యలు వస్తాయి. అందుకే వీటిని ప్రెగ్నెన్సీలో వాడకూడదు. ఓపియాయిడ్స్ అనే కొన్నిరకాల పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల పుట్టే బిడ్డలకు ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి.
ట్రామడాల్ అనే మందు ఈ కోవలోకి వస్తుంది. తీవ్రమైన నొప్పులు ఉన్నప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో సరైన మోతాదులో మాత్రమే పెయిన్ కిల్లర్స్ వాడుకోవలసి ఉంటుంది.
-డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్, హైదరాబాద్
చదవండి: Gynecology: పిల్లలు కాకుండా ఆపరేషన్.. శారీరకంగా, మానసికంగా కోలుకున్న తర్వాతే..
Comments
Please login to add a commentAdd a comment