![Health Tips By Bhavana Kasu: Treatment To Heal Swollen Feet During Pregnancy - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/23/Pregnancy.jpg.webp?itok=oRcQ-vFk)
ప్రతీకాత్మక చిత్రం
నేనిప్పుడు ప్రెగ్నెంట్‌ని. అయిదవ నెల. కాళ్లకు వాపులు వచ్చాయి. భయంగా ఉంది. డాక్టర్‌ను కన్సల్ట్ చేయాలా? – ఎన్. ప్రగతి, సూరారం
ప్రెగ్నెన్సీలో కాళ్ల వాపులు అనేది సర్వసాధారణం. అయితే నొప్పిగా ఉన్నా, పాదాలు ఎర్రగా అవుతున్నా వెంటనే డాక్టర్‌ని కలవాలి. ఇన్‌ఫెక్షన్ ఉన్నా.. బ్లడ్ క్లాట్స్ ఉన్నా నొప్పి, ఎరుపు రంగు ఉంటాయి. బ్లడ్ థిక్‌గా అయినప్పుడు గర్భిణీల్లో బ్లడ్ క్లాట్స్ రిస్క్ ఎక్కువ అవుతుంది. ఇవి కాళ్లల్లో, చెస్ట్‌లో ఎక్కువగా వస్తాయి.
వెంటనే వైద్యపరీక్షలు నిర్వహించి.. నిర్ధారణ చేసి చికిత్స అందిస్తే రిస్కేమీ ఉండదు. ఒకవేళ ఇవి బ్లడ్ క్లాట్స్ అయితే కొన్నిసార్లు అవి కాళ్ల నుంచి రక్తం ద్వారా చెస్ట్‌కి వ్యాపిస్తే దమ్ము, ఆయాసం వచ్చి ఎమర్జెన్సీకి దారి తీస్తుంది. అందుకే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి. రెండు కాళ్లకు డాప్లర్ అల్ట్రాసౌండ్ అనే స్కానింగ్ చేస్తారు.
బ్లడ్ క్లాట్స్ ఉన్నాయేమో చెక్ చేస్తారు. సురక్షితమైన యాంటీబయాటిక్స్‌ను సూచిస్తారు. కాపడం పెట్టుకోవచ్చు. ఒకటి.. రెండు రోజుల్లో తగ్గకపోతే తదుపరి పరీక్షలను సూచిస్తారు. కొంతమందికి Heparin అనే ఇంజెక్షన్ అవసరం అవుతుంది. మీరు ఒకసారి బాడీ టెంపరేచర్ చెక్ చేయించండి. డీవీటీ/ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనేది ప్రెగ్నెన్సీలో వెయ్యిలో ఒకరికి వస్తుంది. దీనివల్ల కాళ్ల వాపులు, కాళ్లు బరువుగా ఉండడం, నొప్పి, కాళ్లు ఎర్రబాడడం వంటివి ఉంటాయి. కొన్ని కేసెస్‌లో ఎమ్‌ఆర్‌ఐ స్కాన్ కూడా చేస్తారు.
- డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్, హైదరాబాద్
చదవండి: తరచుగా హై బీపీ వస్తోందా? కంట్రోల్ చేయలేకపోతున్నారా? ఇవి తింటే..
Comments
Please login to add a commentAdd a comment