Dr. Bhavana Kasu
-
Health Tips: వైట్ డిశ్చార్జ్ అవ్వడం సాధారణమేనా?
నాకిప్పుడు ఏడవ నెల. బేబీకి కిడ్నీలో వాపు ఉందన్నారు. దీని వలన బేబీ పుట్టిన తర్వాత ఏమైనా సమస్య వస్తుందా? ఇది అందరికీ ఉంటుందా? – నీరజ, కర్నూలుమీరు చెప్పిన సమస్యను ఫీటల్ హైడ్రోనెఫ్రోసిస్ అంటారు. ఇది సర్వసాధారణ సమస్య. సాధారణంగా ఐదవ నెల స్కాన్‌లో బయటపడుతుంది. కొద్దిమందికి మాత్రమే ఏడవ నెల, ఎనిమిదో నెల స్కానింగ్‌లలో కనబడుతుంది. ప్రెగ్నెన్సీలో తల్లి శరీరంలోని తాత్కాలికంగా కండరాలు సాగడం వలన బేబీకి కిడ్నీ వాపు కనిపించవచ్చు. ఇది డెలివరీ తరువాత తగ్గిపోతుంది. కానీ కొన్నిసార్లు కిడ్నీకి, యురేటర్కి మధ్య బ్లాకేజ్ రావచ్చు లేదా యూరేటర్కి , బ్లాడర్కి మధ్య వాల్వ్ పనిచేయకపోవచ్చు. కిడ్నీలో సిస్ట్ ఉన్నప్పుడు బేబీ కిడ్నీలో వాపు ఎక్కువగా ఉంటుంది. డెలివరీ తర్వాత స్కానింగ్‌లో బేబీ సైజును బట్టి పీడియాట్రిక్ నెఫ్రాలజిస్ట్‌ను సంప్రదించి జాగ్రత్తలు తీసుకోవాలి. చాలావరకు మందులతోనే తగ్గిపోతుంది. అరుదుగా కొంతమందికి చిన్న సర్జరీ చేయాల్సి వస్తుంది. గర్భిణీలకు 8వ నెల, 9వ నెలలో చేసే స్కాన్‌లో బేబీ కిడ్నీ వాపును బట్టి పీడియాట్రిక్ నెఫ్రాలాజిస్ట్ను సంప్రదించి తగిన చికిత్స చేయాల్సి ఉంటుంది. డెలివరీ తర్వాత పేరెంట్స్‌కు కౌన్సెలింగ్ చేసి, అవసరమైతే సర్జరీకి ప్లాన్ చేస్తారు. బేబీ స్కాన్‌లో రీనల్ పెల్విస్ వాపు 7 మి.మీ. కంటే ఎక్కువగా ఉన్నట్లయితే సర్జరీ అవసరమవుతుంది. సాధారణంగా 4 వారాల తరువాత మళ్లీ స్కానింగ్ చేసి, కణితి ఏమైనా ఉందో లేదో చూస్తారు. కణితి ఉన్నట్లయితే, హిస్ట్టరోస్కోపీ చేసి, దాన్ని చిన్న ప్రక్రియ ద్వారా తీసివేసి, బయాప్సీకి పంపుతారు. డెలివరీ తర్వాత బేబీకి ఇంకా కిడ్నీ సమస్య ఉందో లేదో తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్ స్కాన్, కొందరికి అవసరాన్ని బట్టి ఎక్స్‌రే తీస్తారు. డెలివరీ తర్వాత స్కాన్‌లో నార్మల్‌గా ఉంటే ఆ తర్వాత ఏ పరీక్షలూ అవసరం ఉండవు.నాకు 25 ఏళ్లు. ఈ మధ్యే పెళ్లయింది. మొదటి నుంచీ వైట్ డిశ్చార్జ్ ఉంది. పెళ్లయ్యాక మరీ ఎక్కువైంది. కొన్నిసార్లు బ్లడ్ స్టెయిన్స్ కూడా ఉంటున్నాయి. డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుందా? లేదంటే మెడికల్ షాప్‌లో మందులు అడిగి వేసుకోవచ్చా?– సంధ్యారాణి, కామారెడ్డియంగ్ ఏజ్‌లో వైట్ డిశ్చార్జ్‌ని నిర్లక్ష్యం చేయకూడదు. చాలామందికి వైట్ డిశ్చార్జ్‌తో పాటు దుర్వాసన, దురద, మంట కూడా ఉంటాయి. ఇవన్నీ ఉంటే వెజైనల్ ఇన్ఫెక్షన్ అని అర్థం. ఇది యాంటీబయాటిక్స్‌తో తగ్గవచ్చు. కానీ డాక్టర్ని సంప్రదించకుండా మెడికల్ షాప్‌లో మందులు కొని వేసుకోవద్దు. గైనకాలజిస్ట్‌ని సంప్రదిస్తే వెజైనల్ స్పెక్యులమ్ ఎగ్జామ్ చేసి సమస్యను తెలుసుకుంటారు. గర్భసంచి ముఖద్వారానికి ఇన్ఫెక్షన్ రావడం మంచిది కాదు. భవిష్యత్తులో ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి కూడా అది హాని చేస్తుంది. అందుకే డాక్టర్‌కి చూపించుకుంటే అసలు సమస్య ఏంటనేది తెలుస్తుంది. కొంతమందికి గర్భసంచి ముఖద్వారం పైన కొన్ని గ్రోత్స్ ఉంటాయి. అదనంగా టిష్యూ పెరగడం వల్ల వస్తాయివి. వీటిని పాలిప్స్ అంటారు. సాధారణంగా ఇవి రెడ్ లేదా గ్రే కలర్లో ఉంటాయి. వీటికి సంబంధించి చాలావరకు ఏ సింప్టమ్ ఉండకపోవచ్చు. చెక్ చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. కానీ కొంతమందికి ఎప్పుడూ నీళ్లలా వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. లైంగికచర్యలో పాల్గొన్నప్పుడు స్పాటింగ్, బ్లీడింగ్ అవుతుంది. ఇలాంటివి కనిపిస్తే కచ్చితంగా తగిన వైద్య పరీక్షలు చేయించుకోవాలి. సెలైన్ సోనోగ్రఫీ ద్వారా ఈ పాలిప్ గర్భసంచిలో ఉందా లేదా గర్భసంచి ముఖద్వారం మీద ఉందా అని చెక్ చేస్తారు. పాలిప్ సైజ్, నేచర్ కూడా తెలుస్తాయి. హిస్టరోస్కోపీ ప్రక్రియ ద్వారా ఈ పాలిప్ని డే కేర్‌లోనే రిమూవ్ చేస్తారు. దాన్ని బయాప్సీకి పంపితే, అది ఎలాంటి పాలిప్, మళ్లీ వచ్చే చాన్స్ ఉందా, ఫాలో అప్ ఎలా చెయ్యాలి అనేవి డీటెయిల్డ్‌గా తెలుస్తాయి. ఏడాదికోసారి రెగ్యులర్ పెల్విక్ పరీక్ష చేయించుకోవాలి. డా‘‘ భావన కాసుగైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్హైదరాబాద్ -
Health: పందొమ్మిదేళ్లు.. తొలి చూలు ప్రెగ్నెంట్.. నార్మల్ డెలివరీ కావాలంటే?!
నాకు పందొమ్మిదేళ్లు. ఇప్పుడు నేను తొలి చూలు ప్రెగ్నెంట్‌ని. టీటీ ఇంజెక్షన్ ఎప్పుడు తీసుకోవాలి? ఎన్ని రోజులకు ఒకసారి డాక్టర్ చెకప్‌కి వెళ్లాలి? ఆపరేషన్ లేకుండా ప్రసవం కావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పగలరు. – టీ. ప్రణీత, ధర్మవరం ప్రెగ్నెన్సీలో వేసుకునే టెటనస్ ఇంజెక్షన్ వాక్సినేషన్లో ఇటీవల చాలా మార్పులు వచ్చాయి. మన గవర్నమెంట్ సెటప్‌లో T.T plain ఇంజెక్షన్‌ను 13–39 వారాల మధ్యలో నాలుగు వారాల తేడాతో రెండు డోస్‌లు ఇస్తారు. సెకండ్ డోస్ టీటీ వాక్సీన్‌ను ప్రసవానికి కనీసం మూడు నెలల ముందు తీసుకునేట్టు చూడాలి. దీనివల్ల తల్లి నుంచి బిడ్డకి యాంటీబాడీస్ పాస్ అవడానికి.. హైకాన్సంట్రేషన్ ఉండటానికి సహాయపడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు.. ప్రెగ్నెన్సీ సమయంలో 27– 36 వారాల మధ్య.. Tdap అనే కాంబినేషన్ వాక్సిన్ సింగిల్ డోస్‌ను ఇస్తున్నారు. దీన్ని మన దేశంలో కూడా ఐఏపీ (ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్), ఎఫ్ఓజీఎస్ఐ (ది ఫెడరేషన్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్ అండ్ గైనకాలాజికల్ సొసైటీస్ ఆఫ్ ఇండియా) అనుమతించాయి. చెకప్స్ విషయానికి వస్తే ఇక ప్రెగ్నెన్సీ సమయంలో చెకప్స్ విషయానికి వస్తే.. మొదటి ఏడు నెలల వరకు నెలకు ఒకసారి చెకప్‌కి వెళ్లాలి. ఏడవ నెల నుంచి తొమ్మిదవ నెలదాకా రెండు వారాలకు ఒకసారి చెకప్స్‌కి వెళ్లాలి. తొమ్మిదవ నెలలో వారానికి ఒకసారి చెకప్‌కి వెళ్లాలి. ఇలా కరెక్ట్‌గా చెకప్స్‌కి వెళ్తే తల్లీ, పొట్టలోని శిశువు ఆరోగ్యపరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయవచ్చు. బీపీ, సుగర్, థైరాయిడ్లాంటివి డిటెక్ట్ చేసి.. వెంటనే చికిత్సను అందించే వీలు ఉంటుంది. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన మందులను ఇస్తూ ప్రసవం సాఫీగా అయ్యేలా చూసే చాన్స్ ఉంటుంది. గర్భస్థ శిశువు పెరుగుదలను చూడ్డానికి స్కాన్, TIFFA స్కాన్, NT స్కాన్‌ను సజెస్ట్ చేస్తారు. ఆపరేషన్ లేకుండా నార్మల్ డెలివరీ కావడానికి ప్రెగ్నెన్సీ మొదలు పోషకాహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కాంప్లికేషన్స్ లేకపోతే నార్మల్ డెలివరీ కొన్ని మెడికల్, ప్రెగ్నెన్సీకి సంబంధించిన కాంప్లికేషన్స్ ఉంటే మాత్రం ముందుగానే డాక్టర్‌ను కలిస్తే.. మెడికల్ హిస్టరీ తెలుసుకుని.. ప్రెజెంట్ కండిషన్‌ను అంచనా వేస్తారు. రిస్క్ ఉంది అనుకుంటే.. తొమ్మిదవ నెల నిండాక ఆపరేషన్ తప్పనిసరి అని చెబుతారు. ఎలాంటి కాంప్లికేషన్స్ లేకపోతే మాత్రం వంద శాతం నార్మల్ డెలివరీకి ప్రయత్నిస్తారు. తొమ్మిదవ నెలలో పెరినియల్ మసాజెస్.. నార్మల్ డెలివరీకి కొంతవరకు సాయపడవచ్చు. కనీసం ఒక గంట వాకింగ్, 15– 20 స్క్వాట్స్ చేయడం వల్ల పెల్విక్ ఫ్లోర్ కండరాలకు వ్యాయామం అందుతుంది. అధిక బరువు లేకుండా, బీపీ, సుగర్, థైరాయిడ్లు రాకుండా స్ట్రిక్ట్ డైట్ ఫాలో కావాలి. రెగ్యులర్ చెకప్స్‌లో ఇంటర్నల్ పెల్విస్ చెక్ చేసి నార్మల్ డెలివరీ చాన్స్ ఎంత ఉందో మీ డాక్టర్ చెబుతారు. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
ఆ సర్జరీ చేయించుకుంటే .. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుందా?
బేరియాట్రిక్ సర్జరీ వల్ల వైవాహిక జీవితం సాఫీగా సాగుతుందా? పిల్లల్ని కనడంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తుతాయా? – జి. పూర్ణిమ, వేములవాడ బాడీమాస్ ఇండెక్స్ (బీఎమ్ఐ) అంటే మీ ఎత్తుకు ఎంత బరువు ఉండాలో కాలిక్యులేట్ చేసే పద్ధతి. ఈ బీఎమ్ఐ 40 .. అంతకన్నా ఎక్కువ ఉన్నవారిలో ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ. వైవాహిక జీవితంలో సమస్యలు? అధిక బరువుతో ఉండీ.. ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నవారికి.. డయాబెటిస్, హై బీపీ, స్లీప్ ఆప్నియా వంటివి తగ్గించుకోవడానికి కొన్నిసార్లు బేరియాట్రిక్ సర్జరీని సూచిస్తున్నారు. బేరియాట్రిక్ సర్జరీ చేసుకున్న తరువాత వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలూ ఉండవు. కానీ భవిష్యత్‌లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి కనీసం ఏడాది నుంచి రెండేళ్లు గ్యాప్ ఇవ్వాలి. ప్రత్యేకంగా టెస్టులు విటమిన్ సప్లిమెంట్స్, మైక్రోన్యూట్రైంట్స్, ఫోలిక్ యాసిడ్ వంటివి ముందుగానే ఇవ్వాలి. హైరిస్క్ ప్రెగ్నెన్సీలాగా ప్రెగ్నెన్సీ టైమ్ అంతా మల్టీడిసిప్లినరీ టీమ్‌తో చూపించుకోవాలి. బీఎమ్ఐ తగ్గటం వల్ల హై బీపీ, హై సుగర్ చాన్సెస్ తగ్గుతాయి. జెస్టేషనల్ డయాబెటిస్ ఉందా అని అందరికీ చేసే టెస్ట్స్ కాకుండా వాళ్లకు ప్రత్యేకంగా టెస్ట్స్ చేస్తారు. బేరియాట్రిక్ సర్జరీ కాంప్లికేషన్స్ కూడా అబ్జర్వ్ చేయాలి. సర్జన్, డైటీషియన్, సైకాలజిస్ట్‌ల ఫాలో అప్‌లో ఉండాలి. డెలివరీ డెసిషన్ అనేది ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్‌ని బట్టి తీసుకోవాలి. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
Health: తొలి చూలు అలా.. ఇప్పుడు మళ్లీ ఇలా! భయంగా ఉంది..
ఒకసారి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వస్తే తర్వాత వచ్చే గర్భం కూడా ఎక్టోపిక్ అయ్యే ప్రమాదం ఉంటుందా? ఎందుకంటే నాకు తొలి చూలు ముత్యాల గర్భమని తేలడంతో సర్జరీ చేసి ఆ గర్భాన్ని తొలగించారు. ఇప్పుడు మళ్లీ ప్రెగ్నెన్సీ వచ్చింది. అందుకే భయంగా ఉంది. – బి. రాధిక మూర్తి, విశాఖపట్టణం. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే గర్భం గర్భసంచిలో కాకుండా బయట అంటే ఫాలోపియన్ ట్యూబ్స్‌లో, అండాశయాల్లో, పొత్తికడుపులో నిలవడం. దీన్ని రక్త పరీక్షలు, స్కానింగ్ ద్వారా కనిపెడ్తారు. ఈ గర్భం నిలిచిన స్థానం, పరిమాణం, బ్లడ్ వాల్యూ మీద దీని చికిత్స ఆధారపడి ఉంటుంది. ఫాలోపియన్ ట్యూబ్స్‌లో గర్భం నిలవడమనేది సాధారణంగా అంటే ఒక శాతం మందిలో చూస్తాం. కారణాలివే ఇంతకు ముందు ఎక్టోపిక్ వచ్చినవారిలో మళ్లీ 11 నుంచి 20 శాతం వరకు వచ్చే చాన్స్ ఉంటుంది. అందుకే కొన్ని కేసెస్‌లో కారణం తెలిసినప్పుడు దానికి సరైన చికిత్స చేస్తే.. ఎక్టోపిక్ మళ్లీ వచ్చే చాన్స్‌ని తగ్గించవచ్చు. ట్యూబ్స్ డామేజ్ అవడం, ఇన్ఫెక్షన్స్, పెల్విక్ ఇన్ఫెక్షన్స్, పెల్విక్ సర్జరీ, అతుక్కుని ఉండడం.. వంటివి కొన్ని కారణాలు. ట్యూబ్స్‌లో, ఓవరీస్‌లో నిలిచే ప్రెగ్నెన్సీ వల్ల లైఫ్ రిస్క్ ఉంటుంది. అందుకే ఇంతకు ముందు ఎక్టోపిక్ వచ్చిన వారు.. ప్రెగ్నెన్సీ అని తెలిసిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. కొంతమందిలో కాపర్ – టీ అనే గర్భనిరోధక డివైజ్ గర్భసంచిలో ఉన్నప్పుడు.. ట్యూబ్స్‌లో ప్రెగ్నెన్సీ వచ్చే చాన్సెస్ ఎక్కువ. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీల్లోనూ ఎక్టోపిక్ చాన్సెస్ ఎక్కువే. 6 – 7 వారాల ప్రెగ్నెన్సీలోనే ట్రాన్స్ వెజైనల్ స్కాన్ ద్వారా ఎక్టోపిక్ను కనిపెట్టవచ్చు. ప్రెగ్నెన్సీ సక్సెస్ అయ్యే చాన్సెస్ ఎక్కువే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయితే దానికి మందులు, శస్త్రచికిత్స .. ఈ రెండు ఆప్షన్స్ ఉంటాయి. మందులతో చికిత్స అనేది కొన్ని సెలెక్టెడ్ కేసెస్‌లో చేస్తాం. Methotrexate అనే ఇంజెక్షన్ ఇస్తాం. ఇది తీసుకున్న తరువాత మూడు నెలల వరకు ప్రెగ్నెన్సీని అవాయిడ్ చెయ్యాలి. తర్వాత వచ్చే ప్రెగ్నెన్సీ సక్సెస్ అయ్యే చాన్సెస్ ఎక్కువే ఉంటాయి. ఈ ఎక్టోపిక్ వచ్చే చాన్స్ అరుదుగా ఉండొచ్చు. మీకు ఇంతకుముందు ముత్యాల గర్భం వచ్చింది అన్నారు. అది క్రోమోజోమ్స్ ఇంబాలెన్స్ వల్ల అవుతుంది. దీన్ని సర్జరీ ద్వారా తొలగించినా ఏడాది వరకు ఫాలో అప్ కేర్ అవసరం ఉంటుంది. మీకు హెచ్‌సీజీ హార్మోన్ లెవెల్స్‌ను బ్లడ్ టెస్ట్ ద్వారా పరీక్షించి కంట్రోల్ అయిందా లేదా చూస్తారు. అయితే వందలో ఒకరికి ఈ ముత్యాల గర్భం రిపీట్ అయ్యే చాన్స్ ఉంది. ఎక్టోపిక్ లాగే దీన్ని కూడా తక్కువ వారాల వ్యవధిలోనే స్కానింగ్‌లో గుర్తుపట్టవచ్చు. ఇప్పుడు గర్భంతో ఉన్నాను అంటున్నారు కాబట్టి.. మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించండి. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ చదవండి: పెళ్లయిన 15 రోజులకే భర్తతో అమెరికాకు.. నిజస్వరూపం బయటపడటంతో.. ఆఖరికిలా! ముందే తెలుసుకుంటే.. -
Health: టాబ్లెట్ల ద్వారా హార్మోన్స్‌ను రీప్లేస్ చేయొచ్చా? వారికైతే సురక్షితం కాదు..
మెనోపాజ్ వల్ల హార్మోన్స్ తగ్గిపోతాయి కదా.. దాని ప్రభావం ఆరోగ్యం మీద పడకుండా ఉండడానికి మాత్రల ద్వారా హార్మోన్స్‌ను రీప్లేస్ చేయవచ్చా? – సీహెచ్. వెంకటలక్ష్మి, సామర్లకోట మెనోపాజ్ తరువాత హార్మోన్స్ డెఫిషియెన్సీ వల్ల సైడ్ఎఫెక్ట్స్, ఇబ్బందులతో చాలామంది బాధపడుతుంటారు. వాటిని తగ్గించడానికి చాలామంది హెచ్ఆర్టీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారిప్పుడు. అయితే దీనిని డాక్టర్ పర్యవేక్షణలోనే తీసుకోవాలి. అదికూడా వైద్య పరీక్షల అనంతరం. ఈ హెచ్ఆర్టీ అందరికీ సరిపడకపోవచ్చు. మెనోసాజ్ వచ్చిన కొన్ని నెలల తర్వాత ఈ హార్మోన్స్ థెరపీతో ముఖ్యంగా హాట్ ఫ్లషెస్, రాత్రిళ్లు చెమటలు పట్టడం, మూడ్ స్వింగ్స్, వెజైనా పొడిబారిపోవడం వంటి సమస్యలను పరిష్కరించవచ్చు. ఆస్టియోపొరాసిస్ అంటే ఎముకలు గుల్లబారడం వంటి సమస్యనూ నివారిస్తుందీ హెచ్ఆర్టీ. ఈ సింప్టమ్స్ అన్నీ మెనోసాజ్ వచ్చిన కొన్నినెలలకు కనపడతాయి. ట్రీట్మెంట్ మొదలుపెట్టాక కనీసం మూడు నెలలు అయితే కానీ దాని ప్రభావం కనిపించదు. వారికి హెచ్ఆర్టీ సురక్షితం కాదు ఒకవైళ ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తే డోస్, ప్రిపరేషన్ మార్చేయవచ్చు. అయితే బ్రెస్ట్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, అంతకుముందు బ్లడ్ క్లాట్స్ ఉన్నా, హై బీపీ, లివర్ ప్రాబ్లమ్ ఉన్నవారిలో హెచ్ఆర్టీ సురక్షితం కాదు. హెచ్ఆర్టీలో హార్మోన్స్‌ను సింగిల్ డోస్‌గా కానీ.. కంబైన్డ్ డోస్ టాబ్లెట్స్‌గా కానీ ఇస్తారు. ఇవి ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్స్‌తో ఉంటాయి. స్కిన్ పాచెస్, జెల్స్, పెసరీస్ కూడా ఉంటాయి. హెచ్ఆర్టీకి ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి. జీవనశైలిలో మార్పులు అంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పోషకాహారం తీసుకోవడం, మసాలా ఆహారపదార్థాలు, టీ, కాఫీ, ఆల్కహాల్ వంటివాటికి దూరంగా ఉంటూ.. తాజా ఆకుకూరలు,బాదం పప్పు, అక్రోట్స్, సోయా బీన్స్ వంటివి తీసుకుంటూంటే మెనోపాజ్ సింప్టమ్స్ అంతగా బాధించవు.. తగ్గుతాయి కూడా. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ చదవండి: Unwanted Hair: పై పెదవి మీద, చుబుకం కింద డార్క్ హెయిర్.. పీసీఓఎస్ వల్లేనా? పరిష్కారం? పిల్లల్లో రోజూ 80 – 100 వరకు తల వెంట్రుకలు రాలుతుంటే ఓసారి... -
పై పెదవి మీద, చుబుకం కింద డార్క్ హెయిర్.. పీసీఓఎస్ వల్లేనా? పరిష్కారం?
నాకు 26 ఏళ్లు. సడెన్‌గా అన్వాంటెడ్ హెయిర్ ప్రాబ్లమ్ మొదలైంది. పీరియడ్స్ రెగ్యులర్‌గానే వస్తాయి. అయినా ఇలా పై పెదవి మీద, చుబుకం కింద, చెంపలకు డార్క్‌గా హెయిర్ వస్తోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి ప్లీజ్! – మాన్విత, హైదరాబాద్ అన్వాంటెడ్ హెయిర్‌ని హర్సుటిజమ్ (Hirsutism)అంటారు. శరీరంలో ఆండ్రోజెన్ స్థాయి పెరిగినప్పుడు ఇలా సడెన్‌గా మొహం, ఛాతి, పొత్తి కడుపు మీద, వీపు, తొడల మీద ఇలా డార్క్‌గా హెయిర్ వస్తుంది.ఈ సమస్య కనపడగానే వెంటనే ఎండోక్రైనాలజిస్ట్ లేదా స్కిన్ స్పెషలిస్ట్‌ని సంప్రదించాలి. సాధారణంగా పీసీఓఎస్‌తో బాధపడుతున్న వాళ్లలో ఇలా అన్వాంటెడ్ హెయిర్ ప్రాబ్లమ్‌ను చూస్తాం. అయితే ఈ పీసీఓఎస్‌లో నెలసరి క్రమం తప్పడం, స్థూలకాయం వంటి సమస్యలూ ఉంటాయి. కుషింగ్ సిండ్రోమ్ అనే కండిషన్లో కాటిసాల్ (Cartisol) స్థాయి పెరిగి అవాంఛిత రోమాల సమస్య వస్తుంది. స్టెరాయిడ్స్ ఎక్కువ రోజులు వాడినా ఈ సమస్య తలెత్తవచ్చు. క్రీమ్స్ వాడుతున్నట్టయితే కేశ, చర్మ సంరక్షణకు సంబంధించిన మినాక్సిడిల్, డనేజోల్ వంటి మందుల వల్లా ఈ సమస్య రావచ్చు. మీరు స్కిన్ కోసం ఏవైనా క్రీమ్స్ వాడుతున్నట్టయితే ఒకసారి దాని కంపోజిషన్ చెక్ చేసుకోండి. ఒకసారి డాక్టర్‌ను సంప్రదిస్తే మీ హెల్త్ హిస్టరీలో పైన వివరించిన కండిషన్స్ గురించి తెలుసుకుంటారు. కొన్ని రక్తపరీక్షలు చేసి టెస్టోస్టిరాన్ స్థాయి, ఆండ్రోజెన్ స్థాయిలను చెక్ చేస్తారు. అబ్డామిన్ స్కాన్ చేసి.. అడ్రినల్ గ్లాండ్‌లో ఏవైనా గడ్డలున్నాయా అని కూడా చెక్ చేస్తారు. కొన్నిసార్లు సీటీ స్కాన్ అవసరం కావచ్చు. ఇవన్నీ లేవని తేలి.. నెలసరి క్రమం తప్పకుండా వస్తూంటే.. తాత్కాలిక హెయిర్ రిమూవల్ సొల్యూషన్స్‌ను సూచిస్తారు. కొంతమందికి గర్భనిరోధక మాత్రలు, స్పైరనోలాక్టోన్ వంటి మందులు ఇస్తారు. శాశ్వత చికిత్స అవసరం లేదు ఎండోక్రైన్ అంటే హార్మోన్ సమస్య లేకపోతే అవాంఛిత రోమాలకు శాశ్వత చికిత్స అవసరం లేదు. ఉన్న కండిషన్, సమస్యకు తగ్గట్టుగా చికిత్సను అందించాలి. ట్రీట్మెంట్ ప్రభావం కనిపించడానికి ఆరు నుంచి ఎనిమిది నెలల టైమ్ పడుతుంది. ప్రెగ్నెన్సీతో ఉన్నా.. ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌లో ఉన్నా ఈ ట్రీట్మెంట్ను తీసుకోకూడదు. అవాయిడ్ చేయాలి. చాలామందిలో ఏ ఆరోగ్యసమస్య లేకుండా కూడా ఈ అన్వాంటెడ్ హెయిర్ రావచ్చు. అలాంటివారు లేజర్, ఎలక్ట్రాలిసిస్ వంటి హెయిర్ రిమూవల్ ఆప్షన్స్ గురించి ఆలోచించవచ్చు. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ చదవండి: Sara Ali Khan: పండ్లే కాదు.. వాటి తొక్కలు కూడా వదలను! నా బ్యూటీ సీక్రెట్ ఇదే -
Health: పదిహేడేళ్లు.. ఏ అనారోగ్యం లేదు.. అయినా ఎందుకిలా?!
మా అమ్మాయికి పదిహేడేళ్లు. ఇంకా రజస్వల కాలేదు. ఏ అనారోగ్యమూ లేదు. అయినా రజస్వల ఎందుకు కావట్లేదో తెలియడం లేదు. – అనూరాధ, చింతలపూడి డిలేయ్డ్ మెనాకీ సాధారణంగా పదమూడేళ్ల లోపు బ్రెస్ట్ డెవలప్మెంట్, పదహారేళ్లలోపు నెలసరి మొదలు అవుతాయి. పదహారేళ్ల తర్వాత కూడా రాకపోతే డిలేయ్డ్ మెనాకీ (delayed menarche) అంటాము. చాలామంది అమ్మాయిలు తక్కువ బీఎమ్ఐ.. అంటే ఎత్తుకు తగ్గ బరువు నిష్పత్తి 17 కన్నా తక్కువ ఉంటే బరువు పెరిగిన తర్వాతే నెలసరి మొదలవుతుంది. కొంమందిలో హార్మోన్స్ ఇంబాలెన్స్, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇలా ఆలస్యంగా రజస్వల అవుతారు. ఎండోక్రైనాలజిస్ట్ (హార్మన్ డాక్టర్)ను సంప్రదించాల్సి రావచ్చు. సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అంటే ఆక్సిలా, ప్యూబిక్ ఏరియాలో హెయిర్ గ్రోత్ ఉండడం, బ్రెస్ట్ డెవలప్మెంట్ మొదలవడం కనుక ఉంటే హార్మోన్ల పరీక్ష అవసరం లేదు. తక్కువ బరువు ఉన్నా ఆలస్యంగానైనా నెలసరి మొదలవ్వొచ్చు. కానీ పదిహేడేళ్లు దాటినా ఇలాంటి మార్పులేనప్పుడు వెంటనే గైనకాలజిస్ట్ లేదా ఎండోక్రైనాలజిస్ట్‌ను సంప్రదించాలి. స్పోర్ట్స్‌లో యాక్టివ్‌గా ఉన్నవారిలో కూడా పీరియడ్స్ లేట్‌గానే మొదలవుతాయి. వయస్సుకి ఉండాల్సిన బరువు కన్నా తక్కువ బరువు ఉన్నా నెలసరి ఆలస్యంగానే మొదలువుతుంది. ఒకసారి స్కానింగ్ చేయించి, డాక్టర్‌ను సంప్రదిస్తే .. థైరాయిడ్ పరీక్ష చేసి ఏ సమస్యాలేదు అంటే.. నెలసరి కోసం వేచి చూడవచ్చు. -డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ చదవండి: ఫోర్స్ చేస్తున్నారు -
Health: డెలివరీ తర్వాత తన ప్రవర్తనలో చాలా మార్పు! కారణమేంటి?
Postnatal Stress Disorder: మా అక్క రీసెంట్గా డెలివరీ అయింది. నార్మల్ డెలివరీకి చాలా ట్రై చేశారు. హఠాత్తుగా బేబీ హార్ట్ బీట్ తగ్గడంతో వెంటనే ఆపరేషన్ చేశారు. డెలివరీ అయినప్పటి నుంచి తన ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. కంగారుగా ఉంటోంది. నిద్ర పోవడం లేదు. కోపమూ ఎక్కువైంది. అగ్రెసివ్‌గా బిహేవ్ చేస్తోంది. ఎవరితోనూ మాట్లాడ్డం లేదు. ప్రసవం తర్వాత సహజంగానే ఇలా ప్రవర్తిస్తారా? – రమణి మీరు చెప్పినదాన్ని బట్టి తనకి యాంగ్జైటీ ఉన్నట్టుంది. మామూలుగా డెలివరీ టైమ్‌లో చాలా మార్పులు ఉంటాయి. హార్మోన్స్ చేంజెస్ ఉంటాయి. డెలివరీ హఠాత్తుగా కాంప్లికేట్ అయినా, వాళ్లు ఊహించినట్లు కాకపోయినా, బర్త్ ట్రామాతో మానసికంగా డిస్టర్బ్ అవుతారు. దీనిని పీఎన్ఎస్డీ.. పోస్ట్‌నాటల్ స్ట్రెస్ డిజార్డర్ అంటారు. దీన్ని ఎమోషనల్ కేర్, సపోర్ట్‌తో సంభాళించాలి. చాలామందికి మందుల అవసరం ఉండదు. కొంతమంది తమ ప్రసవం తాలూకు విషయాలను పదే పదే గుర్తుతెచ్చుకుంటూ.. అదే పునరావృతమవుతున్నట్టు భావిస్తారు. దీనివల్ల చురుకుదనం, బిడ్డ మీద శ్రద్ధ, ఆత్మవిశ్వాసమూ తగ్గుతాయి. తమను తామే నిందించుకునే స్థితిలోకి వెళ్లిపోతారు. వీళ్లకు టాకింగ్ థెరపీ అనేది బాగా పనిచేస్తుంది. ప్రసవమప్పుడు జరిగిన అనుకోని సంఘటలను వాళ్ల మెదడు యాక్సెప్ట్ చేయడానికి ఈ టాకింగ్ థెరపీ దోహదపడుతుంది. డాక్టర్‌ను సంప్రదిస్తే ఈ థెరపీ గురించి చెప్తారు. ఏ సమయంలో వాళ్ల మూడ్ చేంజ్ అవుతోందో గమనించాలి. కొన్ని తేదీలు.. వాసనలు.. మనుషులను చూసినప్పుడు పాత విషయాలు, ఎక్స్పీరియెన్సెస్ గుర్తుకువచ్చి డిప్రెస్ అవుతారు. డిప్రెషన్ ఎక్కువగా ఉంది అంటే దానికి సంబంధించి మందులు వాడాలి. కొన్నిసార్లు నమ్మకం ఉన్నవారితో తమ ఆలోచనలను షేర్ చేసుకొమ్మని సూచిస్తాం. చాలాసార్లు కౌన్సెలింగ్‌తో సమస్యను పరిష్కరించవచ్చు. పాత అనుభవంతో కొంతమందికి భవిష్యత్‌లో ప్రెగ్నెన్సీ అంటేనే భయం పట్టుకోవచ్చు. అందుకే సమస్య కొంచెంగా ఉన్నప్పుడే డాక్టర్‌ను సంప్రదిస్తే ఏ విధమైన కౌన్సెలింగ్ ఇవ్వాలి అనేది నిర్ణయించవచ్చు. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
Health: మేనరికపు పెళ్లి.. నాలుగు సార్లు అబార్షన్.. పరిష్కారం ఏమిటి?
మాది మేనరికం. పెళ్లై మూడేళ్లవుతోంది. పిల్లల్లేరు. నెల నిలిచినా ఆగట్లేదు. నాలుగు సార్లు అబార్షన్ అయింది. నాకింకా పిల్లలు పుట్టరా? – కె. ఇందుమతి, మెదక్ నాలుగు సార్లు అబార్షన్ అవడం అనేది చాలా అరుదు. కారణం తెలుసుకోవడానికి కంప్లీట్ ఓవ్యులేషన్ చేయించుకోవాలి. మేనరికం ఒక్కటే కారణం కాకపోవచ్చు. రెండుసార్లు అబార్షన్ అయిన తరువాత ఇటు పిండానిదీ, అటు తల్లిదండ్రులదీ జెనెటిక్ మేకప్ అనేది కచ్చితంగా చేయించాలి. మూడు నాలుగుసార్లు గర్భస్రావం అయిన తరువాత కూడా గర్భం వచ్చి.. నిలిచే అవకాశం లేకపోలేదు. అయితే మీరు ఒకసారి గర్భసంచి లోపల సెప్టమ్ లేదా ఫైబ్రాయిడ్స్ ఏమైనా ఉన్నాయా.. గర్భసంచి ముఖద్వారం అంటే సెర్విక్స్ ఏమైనా వీక్‌గా ఉందా డిటైల్డ్ పెల్విక్ ఆల్ట్రాసౌండ్ చేయించుకోవాలి. కొంతమందిలో రక్తం గడ్డకట్టడం ఎక్కువగా ఉంటుంది. వీళ్లకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే బిడ్డకి వెళ్లే రక్తనాళాల్లో గడ్డకడితే బిడ్డ ఎదుగుదల లేకపోవడం.. గర్భస్రావం జరగడం వంటివి సంభవిస్తాయి. దీనిని అ్కఔఅ సిండ్రోమ్ అంటారు. దీనిని రక్త పరీక్షల ద్వారా కనిపెట్టవచ్చు. థైరాయిడ్, డయాబెటిస్, ఎనీమియా వంటివి కూడా ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి ముందే సరైన రేంజ్లో ఉండేట్టు చూడాలి. జెనెటిక్, క్రోమోజోమ్స్ కారణాలతో గర్భస్రావం అవుతుంటే అది ప్రతిసారి రిపీట్ అయ్యే చాన్సెస్ తక్కువ. కానీ మీది మేనరికం అంటున్నారు కాబట్టి ఒకసారి మీది, మీవారిది కార్యోటైప్ టెస్ట్ చేయాలి. జెనెటిక్ కౌన్సెలింగ్‌కి తప్పనిసరిగా వెళ్లాలి. కొన్ని టెస్ట్‌లు చేసి మళ్లీ గర్భస్రావం అయ్యే రిస్క్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. ఏ ట్రీట్మెంట్ లేకపోయినా మళ్లీ హెల్దీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం 60 శాతం ఉంటుంది. అయినా ఒకసారి పైన చెప్పిన పరీక్షలన్నీ చేయించుకోండి. ప్రెగ్నెన్సీ కంటే మూడు నెలల ముందు నుంచే బీ–కాంప్లెక్స్, ఫోలిక్ యాసిడ్ మాత్రలను తీసుకోవడం మొదలుపెట్టాలి. హెల్దీ, బ్యాలెన్స్డ్ డైట్ తప్పనిసరి. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
Health: సంబంధాలు చూస్తున్నారు... కానీ ఆ సమస్య! వాళ్ల మాటలు నిజమే అంటారా?
Thyroid- Pregnancy Possibilities: నాకిప్పుడు 22 ఏళ్లు. మొన్ననే ఉద్యోగంలో చేరాను. పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే అయిదేళ్ల కిందట నాకు థైరాయిడ్ ప్రాబ్లమ్ వచ్చింది. దీనివల్ల పిల్లలు పుట్టడం కష్టమవుతుంది అంటున్నారు నా సన్నిహితులు. అది నిజమేనా? – వీణ, భైంస ఫెర్టిలిటీకి సంబంధించిన హార్మోన్స్ థైరాయిడ్ డిజార్డర్స్ అనేది ఈ రోజుల్లో సర్వసాధారణంగా చూస్తున్న సమస్య. సరైన సమయంలో సరైన చికిత్సతో ఫెర్టిలిటీ, గర్భధారణ, ప్రసవం వంటి వాటి మీద ఈ సమస్య ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. థైరాయిడ్ గ్రంథిని HPO axis అనేది బ్రెయిన్లో కంట్రోల్ చేస్తుంది. ఇదే HPO axis ఫెర్టిలిటీకి సంబంధించిన హార్మోన్స్‌ను కూడా రిలీజ్ చేస్తుంది. కాబట్టి థైరాయిడ్ సమస్య పునరుత్పత్తి అవయవాలైన గర్భసంచి, అండాశయాల మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే గర్భందాల్చే అవకాశాలు, హెల్దీ ప్రెగ్నెన్సీ, ఆరోగ్యవంతమైన బిడ్డ పుట్టే అవకాశాలు తక్కువ. అందుకే 25–5 ఏళ్ల మధ్య ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకునే వారికి తప్పనిసరిగా మొదట టీఎస్‌హెచ్ పరీక్ష చేస్తాం. గర్భస్రావం అయ్యే రిస్క్ ఈ వాల్యూ 2.5 కన్నా తక్కువ ఉంటే అవుట్‌కమ్ బాగుంటుందని అర్థం. గర్భస్రావం అయ్యే రిస్క్ తగ్గుతుంది. కొన్నిసార్లు థైరాయిడ్ లెవెల్ సరిగ్గానే ఉన్నా థైరాయిడ్ యాంటీబాడీస్ పాజిటివ్‌గా ఉంటాయి. ఈ యాంటీబాడీస్ గర్భధారణ అవకాశాలను తగ్గిస్తాయి. గర్భస్రావం అయ్యే రిస్క్‌ని పెంచుతాయి. కడుపులో బిడ్డ మెదడు పెరుగుదల మీదా ప్రభావం పడుతుంది. థైరాయిడ్ సమస్యకు క్రమం తప్పకుండా చికిత్స తీసుకుంటూంటే ఈ రిస్క్ తగ్గుతుంది. కొంతమందిలో ఈ థైరాయిడ్ సమస్య వల్ల నెలసరి క్రమం తప్పుతుంది. దీనివల్ల గర్భధారణా ఆలస్యం అవుతుంది. వెంటనే చికిత్స మొదలుపెడితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ప్రతి నెల టీఎస్‌హెచ్ టెస్ట్ చేస్తూ థైరాయిడ్ కంట్రోల్లో ఉందా లేదా అని చూస్తాం. దాన్నిబట్టి మందుల డోస్‌ను అడ్జస్ట్ చేస్తాం. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ చదవండి: Birth Control Methods: ఇప్పుడే ఇంకో బిడ్డ వద్దు! మధుమేహం, మూర్చ వ్యాధికి మందులు వాడుతున్నా.. ఇలా చేశారంటే! Black Sesame- Dandruff Control: నల్ల నువ్వుల ప్రయోజనాలు.. చుండ్రుకు చెక్! ఒత్తైన జుట్టు ఇంకా.. -
ఇప్పుడే ఇంకో బిడ్డ వద్దు! మధుమేహం, మూర్చ వ్యాధికి మందులు వాడుతున్నా సరే..
Health- Safest Contraceptive Methods: నాకు మూడేళ్ల బాబు ఉన్నాడు. ఇంకో బిడ్డను కనడానికి రెండు మూడేళ్ల సమయం ఉంచాలనుకుంటున్నాం. ప్రస్తుతం సేఫ్టీ మెథడ్స్ వాడుతున్నాం కాని ఎటువంటి టెన్షన్ లేని, ఎక్కువ కాలం ఉండే సైడ్ ఎఫెక్ట్స్ లేని కాంట్రాసెప్టివ్ పద్ధతి ఏదైనా ఉంటే సూచించండి. – లక్ష్మీ వాసంతి, కడప ప్రెగ్నెన్సీని దీర్ఘకాలం వాయిదా వేసుకునే సురక్షితమైన పద్ధతులు ఇప్పుడు చాలానే వచ్చాయి. తొలి కాన్పు తర్వాత .. రెండో బిడ్డ కోసం మూడు నుంచి అయిదేళ్ల పాటు గ్యాప్ ఇవ్వాలనుకునే వారు.. ఇంట్రాయుటెరిన్ డివైజ్ (ఐయూడీ) కాపర్ టీ కాయిల్, ఇంట్రాయుటెరిన్ సిస్టమ్ మరేనా కాయిల్, కాంట్రాసెప్టివ్ ఇంప్లాంట్ వంటి పద్ధతులను అవలంబించవచ్చు. సమస్యలు ఉండవు అవి శరీరంలోకి ఇన్సెర్ట్ చేసేవి. ఒక్కసారి శరీరంలో అమర్చితే ఆటోమేటిగ్గా వాటి పని అవి చేసుకుంటూ పోతాయి. వీటిని డాక్టర్ పర్యవేక్షణలోనే అమర్చాలి. ఈ పద్ధతుల వల్ల గర్భం రాకపోవడమే కాదు.. నెలసరి సమయంలో అధిక రక్తస్రావం, కడుపునొప్పి వంటివీ తగ్గుతాయి. అంతేకాదు బరువు పెరగడమనే సమస్యా ఉండదు. వీటిని స్థూలకాయులూ వాడొచ్చు. మధుమేహం, మూర్చ వ్యాధికి మందులు వాడుతున్నా ఈ పైన చెప్పిన గర్భనిరోధక పద్ధతులను అవలంబించవచ్చు. మళ్లీ గర్భం దాల్చాలనుకున్నప్పుడు డాక్టర్ దగ్గరకు వెళితే లోపల అమర్చిన ఈ డివైజ్‌ను తీసేస్తారు. నెలసరి సమయంలో అధిక రక్తస్రావంతో బాధపడుతూ, పిల్లల్ని కూడా వద్దు అనుకునేవాళ్లు ఈ మరేనా కాయిల్‌ను వాడొచ్చు. దీనికి హార్మోన్ కాయిల్ ఉంటుంది. అది రోజు కొంచెం హార్మోన్‌ను విడుదల చేస్తూ బ్లీడింగ్‌ని తగ్గిస్తుంది. కాపర్ టీ కాయిల్ ఎందుకంటే! ఆ హార్మోన్ వల్ల గర్భధారణ కూడా జరగదు. కాపర్ టీ కాయిల్‌ను గర్భాన్ని నిరోధించడానికి వేస్తాం. ఈ పద్ధతుల గురించి డాక్టర్‌తో డిస్కస్ చేస్తే.. పరీక్షించి.. మీకు సూటయ్యే మెథడ్‌ను సూచిస్తారు. అవుట్ పేషంట్‌గానే ఈ ప్రక్రియను పూర్తిచేస్తారు. పీరియడ్స్ అయిన వెంటనే ఈ డివైజ్‌ను అమరుస్తారు. ఒకసారి వేసిన తర్వాత అయిదేళ్ల వరకు మార్చాల్సిన అవసరం ఉండదు. మీరు డాక్టర్‌ను సంప్రదిస్తే ఏ డివైజ్ వెయ్యాలి అనేది డాక్టర్ మీతో డిస్కస్ చేస్తారు. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ చదవండి: Essential Bath Rules: స్నానానికి వేణ్ణీళ్లా? చన్నీళ్లా? కడుపు నిండా తిన్న వెంటనే స్నానం చేయవద్దు! -
Health: పబ్లిక్ టాయిలెట్స్ వాడటం వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయా? అంతకంటే ఎక్కువగా
Health Tips By Bhavana Kasu: ప్రయాణాల సమయంలో లేదా ఎక్కువ గంటలు ఇల్లు దాటి బయటి ప్రదేశాలలో గడిపినప్పుడు ఎక్కువమంది ఉపయోగించే టాయిలెట్‌ను ఉపయోగించవలసి వస్తుంది. ఏవైనా వెజైనల్ ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంటుందా? –వి. అనిల, పెద్దపల్లి ఉద్యోగాలు, వృత్తిరీత్యా ప్రయాణాలు చేసేవాళ్లల్లో బయట వాష్‌రూమ్స్‌ను ఉపయోగించక తప్పదు. కానీ చాలామంది అనుకున్నట్టు పబ్లిక్ టాయిలెట్స్ వాడడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ కన్నా వ్యక్తిగత శుభ్రత పాటించకపోతే వచ్చే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ. వెజైనాలో మామూలుగా ఉండే మంచి బ్యాక్టీరియా ప్రపోర్షన్ చేంజ్ అయ్యి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ పెరిగి, వెజైనా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. బయట వాష్‌రూమ్స్ వల్ల చాలా అరుదుగా ఇన్ఫెక్షన్స్ రిస్క్ ఉంటుంది. చర్మం మీద గాయాలు, పుళ్లతో చర్మం ఎక్స్పోజ్ అయితే పబ్లిక్ టాయిలెట్స్ నుంచి కొన్ని వైరల్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి. టాయిలెట్ సీట్‌పై నుంచి వ్యాపించే అవకాశం తక్కువ. ఎందుకంటే చాలా బ్యాక్టీరియా, వైరస్లు బయట వాతావరణంలో ఎక్కువకాలం జీవించలేవు. మానవ శరీరానికి బయట.. టాయిలెట్ సీట్ పైన అవి ఎక్కువసేపు బతకలేవు. డైరెక్ట్ ఎక్స్పోజ్డ్ స్కిన్ కాంటాక్ట్తోనే వ్యాపిస్తాయి. వెజైనిటిస్ అంటే వెజైనల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వెజైనాలో దురద, మంట, ఎరుపెక్కిపోవడం, వాపు, పొడిబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మూత్రంలో నొప్పీ రావచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. యూరినరీ, వెజైనల్ ఇన్ఫెక్షన్స్ను నివారించడానికి.. వెజైనాను డూషింగ్ అంటే సిరంజితో వాటర్‌తో శుభ్రం చెయ్యకూడదు, ఇన్నర్‌వేర్‌ను రెండు పూటలూ మార్చుకోవాలి, అంతేకాదు ఎంతటి అత్యవసర పరిస్థితుల్లోనైనా ఇతరులు వాడిన ఇన్నర్‌వేర్ మళ్లీ వాడకూడదు, మంచినీళ్లు ఎక్కువగా తాగాలి, మూత్రవిసర్జనను ఆపుకోకూడదు, నెలసరి సమయంలో తరచుగా ప్యాడ్స్ మార్చుకుంటూండాలి, టాయిలెట్‌కి వెళ్లేముందు, వెళ్లొచ్చాక కచ్చితంగా శుభ్రంగా చేతులు కడుక్కోవాలి, టాయిలెట్స్ అపరిశుభ్రంగా ఉంటే టిష్యూ వైపర్, హ్యాండ్ శానిటైజర్ ఉపయోగించండి, డోర్ హ్యాండిల్స్, ఫ్లష్ నాబ్స్‌ను టిష్యూ పేపర్‌తో పట్టుకొని వాడాలి, మీరు వాడే వస్తువులేవీ టాయిలెట్ ఫ్లోర్ మీద పెట్టొద్దు.. లాంటి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మీరు పబ్లిక్ టాయిలెట్స్ వాడినా ప్రమాదమేమీ ఉండదు. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ చదవండి: 5AM Club: వాళ్లంతా ఉదయం ఐదింటికే నిద్రలేస్తారు! ప్రయోజనాలెన్నో! చూడ్డానికి ఎంతో ఆరోగ్యంగా కనిపించినా.. ఉన్నట్టుండి కిందపడిపోయి -
Health Tips: బర్త్ ప్లాన్ అంటే ఏమిటి? డెలివరీ టైమ్‌లో..
నాకు ఇప్పుడు తొమ్మిదవ నెల. చాలా ఆసుపత్రుల్లో బర్త్ ప్లాన్ ఆఫర్ చేస్తున్నారని తెలిసింది. అసలు ఈ బర్త్ ప్లాన్ అంటే ఏంటండీ? – కె. అమరజ, నాగర్ కర్నూల్ బిడ్డకు జన్మనివ్వడం అనేది ప్రతి తల్లికి మరచిపోలేని అనుభవం.. అనుభూతి. అలాంటి ప్రసూతికోసం ఉన్న చాయిసెస్ ఏంటో తెలుసుకుని వాటిల్లో మీరు సెలెక్ట్ చేసుకున్న చాయిస్‌ను ముందుగానే డాక్టర్‌కు, స్టాఫ్, నర్సెస్, మిడ్వైఫ్కి తెలియజెప్పే అవకాశాన్ని బర్త్ ప్లాన్ ఇస్తుంది. ప్రసవ ప్రక్రియ ఎప్పుడు ఎలా మొదలవుతుందో చెప్పడం కష్టం. డెలివరీ టైమ్‌లో ఎలా ఉండాలనుకుంటున్నారు డాక్టర్, స్టాఫ్ సపోర్ట్ ఎంత వరకు కావాలనుకుంటున్నారు.. ఎలాంటి వాతావరణంలో ప్రసవాన్ని కోరుకుంటున్నారు.. ఎలాంటి మందులు వాడాలి.. పెయిన్ రిలీఫ్‌కి ఏవి కావాలి .. ప్రసవమప్పుడు ఎలాంటి సాయం పొందాలనుకుంటున్నారు.. వంటి విషయాలన్నిటినీ మీరు, మీ భర్త ఇద్దరూ కలసి డాక్టర్స్‌తో చర్చించే అవకాశాన్ని ఈ బర్త్ ప్లాన్ ఇస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే బర్త్ ప్లాన్ అనేది మీ ప్రసవానికి ఒక గైడ్ లాంటిది. దీని గురించి ఏడవ నెల నుంచి తొమ్మిదవ నెల మధ్యలో ఎప్పుడైనా గైనకాలజిస్ట్‌తో డిస్కస్ చేయొచ్చు. మీకు ప్రెగ్నెన్సీతో పాటు ఏ ఇతర అనారోగ్య సమస్యలు లేకపోతే ఇప్పుడు మీరు మీ బర్త్ ప్లాన్‌ను పూర్తిగా ఫాలో అవడానికి అవకాశం ఉంది. ఒకవేళ మీకు కానీ.. బిడ్డకు కానీ మెడికల్ ఇంటర్వెన్షన్ అవసరమయ్యి డాక్టర్ మీ బర్త్ ప్లాన్‌ను ఫాలో కాలేకపోతే ఆ విషయాన్ని మీకు ముందుగానే చెప్పి మీకున్న ఆప్షన్స్ గురించి డిస్కస్ చేస్తారు. ఈ బర్త్ ప్లాన్‌లో.. మీ డెలివరీ టైమ్‌లో మీతోపాటు ఎవరు ఉండాలనుకుంటున్నారు.. మీ హజ్బెండ్ లేక మీ అమ్మగారు, లేదంటే మిడ్వైఫ్ లేక ఫ్రెండ్ .. ఇలా మీరు ఎవరిని కోరుకుంటున్నారు.. మీతో పాటు ఎవరు ఉండాలనుకుంటున్నారో సజెషన్స్‌లో ముందే పేర్కొనవచ్చు.. మీ ప్రసవమప్పుడు బీన్ బాగ్స్, బర్తింగ్ బాల్స్, మాసాజెస్, లేదా అటూ ఇటూ నడవడం వంటి వాటిలో ఏవి కావాలనుకుంటున్నారు.., సంగీతం వినాలనుకుంటున్నారా? ఒకవేళ సంగీతం వినాలనుకుంటున్నట్టయితే మంద్రమైన సంగీతాన్ని ఇష్టపడ్తారా? పెద్ద సౌండ్ అంటే చిరాకుగా ఉందా? మంద్రమైన కాంతి లేదా బ్రైట్ లైట్.. మరీ చల్లగా ఇష్టమా? లేక వేడిగా.. వెచ్చగా ఇష్టమా? ఎలాంటి పెయిన్ రిలీఫ్ కావాలనుకుంటున్నారు? పారాసిటమాల్, ఎంటోనాక్స్ (గ్యాస్), ఇంజెక్షన్స్, ఎపిడ్యూరల్ ఎనాల్జెసికా? సహజంగా నొప్పులు పెరగాలనుకుంటున్నారా? లేక ఇంజెక్షన్స్, మాత్రలతో నొప్పులను పెంచమంటారా? ముందే వాటర్ బ్రేక్ (ఉమ్మనీరు పోయేలా)అయ్యేలా చేయమంటారా? లేదా సహజంగా బ్రేక్ అయ్యేవరకు వేచి చూస్తారా? మాయ సహజంగానే పడిపోవాలా? లేక ఇంజెక్షన్స్ ద్వారానా? బిడ్డ బొడ్డు తాడు ఎవరు కట్ చేయాలి? మీరా? మీ భర్తా? లేక మిడ్వైఫ్ చెయ్యాలా? బిడ్డకు మీ పాలు పడతారా? లేక పోత పాలా? వంటి కొన్ని ఆప్షన్స్‌ను గైనకాలజిస్ట్ ఒక బుక్లెట్ రూపంలో మీకు తెలియజేస్తారు. మీరు చర్చించుకొని ఆ ఆప్షన్స్‌ను ఎంచుకోవచ్చు. మీకు ఎప్పుడు నొప్పులు వచ్చినా ఈ బుక్‌లెట్‌లో మీరు ఇచ్చిన ఆప్షన్స్‌ను డాక్టర్లు ఫాలో అవుతారు. ఒకవేళ మీది హై రిస్క్ ప్రెగ్నెన్సీ అయితే ఎలాంటి ఆప్షన్స్‌ను ఫాలో అయితే మీకు సేఫ్‌గా ఉంటుందో వాటిని డాక్టర్లు మీకు సూచిస్తారు. వీటిన్నిటి వల్ల ప్రసవాన్ని గొప్ప అనుభవంగా.. మంచి అనుభూతిగా మలచుకునే వీలు ఉంటుందన్నమాట. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ చదవండి: Health Tips: పదే పదే గర్భస్రావం కావడానికి అది కూడా ఓ కారణమే! పార్ట్నర్కు సంబంధించి Beard Shaving: రోజూ షేవింగ్ చేస్తున్నారా? ఈ విషయాలు తెలిస్తే! -
Health: ఐదో నెల ప్రెగ్నెన్సీ.. కాళ్ల వాపులు.. నొప్పిగా ఉన్నా, పాదాలు ఎర్రగా అవుతున్నా..
నేనిప్పుడు ప్రెగ్నెంట్‌ని. అయిదవ నెల. కాళ్లకు వాపులు వచ్చాయి. భయంగా ఉంది. డాక్టర్‌ను కన్సల్ట్ చేయాలా? – ఎన్. ప్రగతి, సూరారం ప్రెగ్నెన్సీలో కాళ్ల వాపులు అనేది సర్వసాధారణం. అయితే నొప్పిగా ఉన్నా, పాదాలు ఎర్రగా అవుతున్నా వెంటనే డాక్టర్ని కలవాలి. ఇన్ఫెక్షన్ ఉన్నా.. బ్లడ్ క్లాట్స్ ఉన్నా నొప్పి, ఎరుపు రంగు ఉంటాయి. బ్లడ్ థిక్‌గా అయినప్పుడు గర్భిణీల్లో బ్లడ్ క్లాట్స్ రిస్క్ ఎక్కువ అవుతుంది. ఇవి కాళ్లల్లో, చెస్ట్‌లో ఎక్కువగా వస్తాయి. వెంటనే వైద్యపరీక్షలు నిర్వహించి.. నిర్ధారణ చేసి చికిత్స అందిస్తే రిస్కేమీ ఉండదు. ఒకవేళ ఇవి బ్లడ్ క్లాట్స్ అయితే కొన్నిసార్లు అవి కాళ్ల నుంచి రక్తం ద్వారా చెస్ట్‌కి వ్యాపిస్తే దమ్ము, ఆయాసం వచ్చి ఎమర్జెన్సీకి దారి తీస్తుంది. అందుకే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి. రెండు కాళ్లకు డాప్లర్ అల్ట్రాసౌండ్ అనే స్కానింగ్ చేస్తారు. బ్లడ్ క్లాట్స్ ఉన్నాయేమో చెక్ చేస్తారు. సురక్షితమైన యాంటీబయాటిక్స్‌ను సూచిస్తారు. కాపడం పెట్టుకోవచ్చు. ఒకటి.. రెండు రోజుల్లో తగ్గకపోతే తదుపరి పరీక్షలను సూచిస్తారు. కొంతమందికి Heparin అనే ఇంజెక్షన్ అవసరం అవుతుంది. మీరు ఒకసారి బాడీ టెంపరేచర్ చెక్ చేయించండి. డీవీటీ/ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనేది ప్రెగ్నెన్సీలో వెయ్యిలో ఒకరికి వస్తుంది. దీనివల్ల కాళ్ల వాపులు, కాళ్లు బరువుగా ఉండడం, నొప్పి, కాళ్లు ఎర్రబాడడం వంటివి ఉంటాయి. కొన్ని కేసెస్‌లో ఎమ్ఆర్ఐ స్కాన్ కూడా చేస్తారు. - డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ చదవండి: తరచుగా హై బీపీ వస్తోందా? కంట్రోల్ చేయలేకపోతున్నారా? ఇవి తింటే.. -
Health Tips: గర్భసంచి జారిందన్నారు.. ఆపరేషన్ లేకుండా మందులతో తగ్గుతుందా?
నాకు 55 ఏళ్లు. ఏడాదిగా యూరినరీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. గర్భసంచి జారింది, ఆపరేషన్ చేయాలి అన్నారు. ఆపరేషన్ లేకుండా మందులతో నా సమస్య తగ్గే మార్గం లేదా? – ఎన్. విజయలక్ష్మి, బాల్కొండ గర్భసంచికి ఉండే సపోర్ట్ స్ట్రక్చర్స్ అయిన లిగమెంట్స్, మజిల్స్‌ని పెల్విక్ ఫ్లోర్ అంటారు. వయసు పైబడుతున్న కొద్దీ పెల్విక్ ఫ్లోర్ బలహీనమవుతూ ఉంటుంది. దాంతో గర్భసంచి, యూరిన్ బ్యాగ్, మోషన్ ఏరియా వదులై జారుతుంది. యూరిన్ బ్యాగ్ ఉన్న స్థానం నుంచి కిందికి జారినప్పుడు యూరిన్ పూర్తిగా ఖాళీ అవకపోవడం, పదేపదే యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడం, కాళ్లు, నడుము నొప్పి ఉంటాయి. దీనిని పెల్విక్ ఆర్గాన్ ప్రొలాప్స్ అంటాం. కారణాలు ఇవే! యూరిన్ బ్యాగ్ మాత్రమే జారితే cystocele qgzeg.యాభై ఏళ్లు దాటిన వాళ్లలో పదిలో ఎనిమిది మందికి ఇలాంటివి ఉంటాయి. ప్రసవాలు, అధిక బరువు, తీవ్రమైన మలబద్ధకం, తీవ్రమైన దగ్గు, అధిక బరువులను ఎత్తడం, పైబడుతున్న వయసు వంటి కారణాల వల్ల గర్భసంచి జారుతుంది. ఇది డాక్టర్ చేసే ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ ద్వారా తెలుస్తుంది. యూరినరీ ఇన్ఫెక్షన్ కనుక్కోవడానికి వైద్య పరీక్షలు చేస్తారు. అల్ట్రాస్కానింగ్ చేస్తారు. కొందరి విషయంలో యూరోడైనమిక్ స్టడీస్ అవసరం ఉంటుంది. ఈ సమస్యకు చాలా చికిత్సా పద్ధతులున్నాయి. చిన్న ప్రొలాప్స్ అయితే కనుక జీవన శైలిని మార్చుకుని అంటే అధిక బరువు ఉంటే వ్యాయామాలు చేసి బరువు తగ్గించుకోవడం, దగ్గు, మలబద్ధకానికి చికిత్స తీసుకోవడం, అధిక బరువులు ఎత్తకుండా చూసుకోవడం వంటివాటి పట్ల శ్రద్ధ పెట్టి సమస్యను తగ్గించుకోవచ్చు. చాలా మందికి సర్జరీని అవాయిడ్ చేస్తాం పెల్విక్ ఫ్లోర్ మజిల్ ఎక్సర్సైజెస్ కూడా ఈ సమస్యను తగ్గించుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. ఇవి పెల్విక్ ఫ్లోర్ పటుత్వాన్ని కాపాడుతాయి. బలహీనమైన కండరాలను బలోపేతం చేస్తాయి. మూడు నుంచి ఆరు నెలల వరకు నిపుణుల పర్యవేక్షణలో ఈ వ్యాయామాలను చేస్తే చాలా ప్రయోజనం ఉంటుంది. వెజైనల్ హార్మోన్ క్రీమ్స్ .. ఈస్ట్రోజెన్ క్రీమ్‌తో కూడా ఆ అసౌకర్యం కొంత తగ్గే అవకాశం ఉంది. vaginal pessary అని సిలికాన్ రింగ్ దొరుకుతుంది. దీన్ని డాక్టర్ పర్యవేక్షణలో వెజైనాలో అమర్చి.. ప్రొలాప్స్ తగ్గుతుందా లేదా అని చూస్తారు. ఈ pessaryని డాక్టరే ప్రిస్క్రైబ్ చేస్తారు. దీంతో చాలా మందికి సర్జరీని అవాయిడ్ చేస్తాం. పైన విధానాలేవీ పనిచేయనప్పుడు సర్జరీ చేయాల్సి వస్తుంది. ఈ ఆపరేషన్‌లో యూరిన్ బ్యాగ్‌ని, గర్భసంచిని పైకి లిఫ్ట్ చేసి సపోర్ట్ చేస్తారు. దీంతో యూరినరీ, పెల్విక్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. - డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్. చదవండి: Health: ప్రెగ్నెన్సీలో మైగ్రేన్ వస్తే? ఈ టాబ్లెట్లు మాత్రం అస్సలు వాడొద్దు! Health Tips: ఏడో నెల.. ఆకు కూరలు, పప్పులు, దానిమ్మ రోజూ తినాలి! ఇంకా.. -
Health: ప్రెగ్నెన్సీలో మైగ్రేన్ వస్తే? ఈ టాబ్లెట్లు మాత్రం అస్సలు వాడొద్దు!
చాలా ఏళ్లుగా మైగ్రేన్‌తో బాధపడుతున్నాను. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్‌ను. మూడవ నెల. ప్రెగ్నెన్సీలో మైగ్రేన్ వస్తే మందుల్లేకుండా ఎలాంటి జాగ్రత్తలతో తలనొప్పిని కంట్రోల్ చేసుకోవచ్చో చెప్పగలరు. – సి. కళ్యాణి, మండపేట మైగ్రేన్ అనేది చాలా కామన్‌గా చూసే తలనొప్పిలో ఒక రకం. చాలామందికి ఈ తలనొప్పితో వాంతులు, ఎసిడిటీ వస్తాయి. మైగ్రేన్‌ను సరిగ్గా కంట్రోల్ చేయకపోతే కొంతమందికి ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చే ప్రమాదం ఉంది. మైల్డ్ హెడేక్ అయితే నీళ్లు ఎక్కువగా తాగడం, విశ్రాంతి తీసుకోవడం, పారాసిటమాల్ తక్కువ డోస్ మాత్ర వేసుకోవడం వంటివి ప్రయత్నించవచ్చు. గర్భం దాల్చిన నాటి నుంచే... ఒత్తిడి వల్ల కూడా మైగ్రేన్ పెరుగుతుంది. రిలాక్సేషన్ టెక్నిక్స్‌ను అలవాటు చేసుకోవాలి. గర్భం దాల్చిన దగ్గర్నుంచే మెడిటేషన్, యోగా ప్రాక్టీస్ చేయాలి. శ్రావ్యమైన సంగీతం వింటూండాలి. మైగ్రేన్ రావడానికి కారణాలు ఏముంటున్నాయో గుర్తించాలి. కొంతమందికి సమయానికి భోజనం చేయకపోయినా.. లేదా భోజనం స్కిప్ అయినా, నిద్రలేకపోయినా మైగ్రేన్ అటాక్ అవుతుంది. సురక్షితమేనా? ఈ ట్రిగ్గర్ పాయింట్లను గ్రహించి.. సమయానికి భోజనం.. 8– 10 గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి. పారాసిటమాల్, వాంతులు తగ్గే మందులతో మైగ్రేన్‌ను చాలా కంట్రోల్ చేయవచ్చు. తరచుగా మైగ్రేన్ వచ్చే వాళ్లకు ప్రెగ్నెన్సీలో ప్రభావం చూపని సురక్షితమైన మందులను డాక్టర్లు సూచిస్తారు. వాటిని ఎలా వాడాలో కూడా చెబుతారు. మీరు ఆల్రెడీ మైగ్రేన్‌కి మందులు వాడుతున్నట్లయితే.. అవి ప్రెగ్నెన్సీలో సేఫ్ అవునో కాదో మీ డాక్టర్‌ను అడిగి తెలుసుకోండి. Brufen, Ergotamine వంటి మందులు అసలు వాడకూడదు. ఆరవ నెల తర్వాత పెయిన్ కిల్లర్స్ వంటివి వాడకూడదు. ఎపిలెప్సీ మందులను కొంతమంది మైగ్రేన్‌కి కూడా వాడుతుంటారు. అలాంటివి మీరు వాడితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. వాటివల్ల పొట్టలో బిడ్డకు బర్త్ డిఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కొంతమంది విషయంలో న్యురాలజిస్ట్ అభిప్రాయం తీసుకుని మందులు మార్చటం జరుగుతుంది. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ చదవండి: Pregnancy- Iron Rich Foods: ఏడో నెల.. ఐరన్ మాత్రలు వేసుకుంటే వాంతులు! ఇవి తిన్నారంటే.. Tips To Recover From C Section: ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. డెలివరీ అయిన మొదటి 6 వారాలు... -
Health Tips: రెండో నెల.. హైపో థైరాయిడ్! డైట్‌తో కంట్రోల్ చెయ్యొచ్చా?
Hypothyroidism During 2nd month Pregnancy: నాకిప్పుడు రెండవ నెల. నాకు హైపో థైరాయిడ్ ఉందని డాక్టర్ చెప్పారు. దీనికి ట్రీట్మెంట్ స్టార్ట్ చెయ్యమన్నారు. దీన్ని డైట్‌తో కంట్రోల్ చెయ్యొచ్చా? మందులు తప్పనిసరిగా వేసుకోవాలా? – ఎన్. సీతాలక్ష్మి, గణపవరం థైరాయిడ్ గ్రంథి కొన్ని హార్మోన్స్‌ను విడుదల చేస్తుంది. ఈ గ్రంథి రిలీజ్ చేయవలసిన దానికన్నా తక్కువ విడుదల చేస్తుంది అని గ్రహించగానే దానికి బ్రెయిన్ సిగ్నల్స్ ఇస్తుంది ఎక్కువ విడుదల చేయమని. అందుకే టీఎస్‌హెచ్ అనేది పెరుగుతుంది. ఈ గ్రంథి నుంచి వచ్చే థైరోక్సిన్ హార్మోన్ బాగా పనిచెయ్యాలంటే మీరు తినే ఆహారంలో అయోడిన్ ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకోవాలి. తొలి పన్నెండు వారాల ప్రెగ్నెన్సీలో.. టీఎస్‌హెచ్ ఎక్కువ అయితే హైపోథైరాయిడిజం అంటారు. బిడ్డకు తల్లి నుంచే థైరాయిడ్ హార్మోన్స్ వెళ్తాయి. మీకు హార్మోన్స్ తక్కువ ఉంటే అది బిడ్డ మీద కూడా ప్రభావం చూపుతుంది. తొలి పన్నెండు వారాల ప్రెగ్నెన్సీలో బిడ్డ థైరాయిడ్ గ్రంథి ఇంకా వృద్ధి చెందదు. ఈ థైరాయిడ్.. బిడ్డ మెదడు ఎదుగుదలకు చాలా అవసరం. అందుకే మీకు థైరాయిడ్ డెఫిషియెన్సీ ఉంటే వెంటనే మెడికేషన్ తీసుకోవాలి. డాక్టర్ తొలి పన్నెండు వారాల్లో టీఎస్‌హెచ్ హార్మోన్ 2–5 కన్నా ఎక్కువ ఉంటే థైరాయిడ్ ట్రీట్మెంట్ను సూచిస్తారు. ప్రతి నెల లేదా మూడు నెలలకు ఒకసారి టీఎస్‌హెచ్ చెక్ చేస్తారు. థైరాయిడ్ యాంటీబాడీస్ బ్లడ్ టెస్ట్ కూడా చేస్తారు. మూడవ నెల తరువాత టీఎస్‌హెచ్ మూడు కన్నా తక్కువ ఉండాలి. ఆ విధంగా మందుల మోతాదును నిర్ణయిస్తారు. కొన్నిసార్లు తల్లికి ఏ సింప్టమ్స్ ఉండవు కానీ టీఎస్‌హెచ్ ఎక్కువ అవుతుంది. దీనిని సబ్కెమికల్ థైరాయిడ్ అంటారు. వీళ్లకు యాంటీబాడీస్ ఫర్ థైరాయిడ్ చెక్ చేస్తారు. టీపీఓ యాంటీబాడీస్ నెగెటివ్ ఉంటే ట్రీట్మెంట్ అవసరం లేదు. క్రమం తప్పకుండా టీఎస్‌హెచ్ చెక్ చేసుకోవాలి. ప్రసవం అయిన ఆరువారాలకు తల్లికి మళ్లీ టీఎస్‌హెచ్ చెక్ చేసి మందులు కొనసాగించాలా.. వద్దా అనేది చెప్తారు. - డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్. చదవండి: Pregnancy- Iron Rich Foods: ఏడో నెల.. ఐరన్ మాత్రలు వేసుకుంటే వాంతులు! ఇవి తిన్నారంటే.. Pregnancy 1st Trimester: మూడో నెల.. ప్రెగ్నెన్సీలో ఇవి చేయాల్సిన అవసరం ఉంటుందా? -
Health Tips: ఏడో నెల.. ఆకు కూరలు, పప్పులు, దానిమ్మ రోజూ తినాలి! ఇంకా..
నాకు ఏడవనెల నడుస్తోంది. రక్తహీనత ఉందని చెప్పారు డాక్టర్. తొమ్మిది గ్రాముల కన్నా పెరగడం లేదు. ఐరన్ మాత్రలు వేసుకుంటే వాంతులు అవుతున్నాయి. ఏదైనా పరిష్కారం చెప్పండి.. ప్లీజ్! – దుర్గా వాణి, విజయవాడ Pregnancy Tips- Iron Rich Foods: ప్రెగ్నెన్సీలో రక్తహీనత ఉంటే విపరీతమైన నీరసం, అలసట ఉంటాయి. ఏ పనినీ చురుకుగా చేసుకోలేరు. ఐరన్ లోపంతో కడుపులో బిడ్డకూ ఎదుగుదల సమస్యలు ఉంటాయి. అందుకే ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ఆకు కూరలు, పప్పులు, దానిమ్మ, అంజీర్ (డ్రై ఫ్రూట్స్) రోజూ తినాలి. అలాగే క్యారెట్, బీట్రూట్ , టమాటా జ్యూసెస్ను తాగొచ్చు. విటమిన్ సి ఎక్కువగా ఉండే కమలాపళ్లు, నిమ్మ వంటి వాటిని తీసుకోవాలి. చాలామందికి ఐరన్ మాత్రల వల్ల వికారం, వాంతులు ఉంటాయి. కొంతమందికి తిన్న వెంటనే విటమిన్ సి ( చప్పరించే) మాత్రలతో ఐరన్ మాత్రలు ఇస్తే వాంతులు కావు. మీరు ఈ పై పద్ధతులను ప్రయత్నించి చూడండి. మాత్రలు అసలే సరిపడకపోతే ఐరన్ ఇంజెక్షన్స్ (ఇప్పుడు ఇస్తున్నారు) తీసుకోవచ్చు. ఐరన్ అనేది హిమోగ్లోబిన్లో చాలా ముఖ్యమైనది. ఇది మన శరీరంలోకి ఆక్సిజన్‌ను క్యారీ చేస్తుంది. ఈ ఇంజెక్షన్స్ హిమోగ్లోబిన్లో ఐరన్ కంటెంట్‌ను త్వరగా పెరిగేట్టు చేస్తాయి. వికారం వల్ల మీరు తినలేకపోయినా పొట్టలో బిడ్డకు పోషకాల లోపం లేకుండా చూస్తాయి. ఈ ఐరన్ ఇంజెక్షన్స్ ఇచ్చే ముందు మీకు ఐరన్ మోతాదు ఎంత ఉంది? ఏదైనా జెనెటిక్ సమస్యలు, సికెల్ సెల్, తలసీమియా వల్ల బ్లడ్ లెవెల్స్ తగ్గాయా? వంటివన్నీ చెక్ చేసి, బరువును బట్టి మోతాదును లెక్కగడతారు. ఎలాంటి జెనెటిక్ సమస్యలు లేనివారికి ఐరన్ ఇంజెక్షన్స్ బాగా పనిచేస్తాయి. కనీసం వారానికొకటి ఐవీ ఇంజెక్షన్ ఐరన్‌ను చేయించుకోవాలి. ఇలా రెండు వారాలు ఇస్తాం. ఒక నెల తరువాత ఎంత పెరిగిందో చెక్ చేస్తాం. ఈ ఇంజెక్షన్‌ను ఆసుపత్రిలో డాక్టర్ పర్యవేక్షణలోనే చేయించుకోవాలి. కొంతమందికి వీటివల్ల శ్వాసలో ఇబ్బంది, దద్దుర్లు వంటి రియాక్షన్స్ ఉంటాయి. అందుకే డాక్టర్ పర్యవేక్షణలోనే చేయించుకోవాలి. మీకు ఆస్తమా, ఎలర్జీలు, లివర్ సమస్యలు, ఇన్ఫెక్షన్స్ ఉంటే మోతాదును మార్చాల్సి ఉంటుంది. ఈ ఇంజెక్షన్స్ చేయించుకున్న వారం తరువాత మీకు కొంచెం నీరసం తగ్గి ఓపిక పెరుగుతుంది. ఐరన్‌ను పెంచే ఆహారం తప్పకుండా తీసుకోవాలి. ఈ ఇంజెక్షన్స్‌ను గర్భం దాల్చిన మొదటి మూడు నెలల్లో చేయకూడదు. - డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్. చదవండి: Tips To Recover From C Section: ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. డెలివరీ అయిన మొదటి 6 వారాలు... Solution For Vaginal Boil: ఏడాదిగా అక్కడ సెగ గడ్డలు.. ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి? -
Health Tips: ప్రెగ్నెన్సీలో ఈ టెస్టులు చేయాల్సిన అవసరం ఉంటుందా?
Health Tips- Pregnancy 1st Trimester: నాకు 25 ఏళ్లు. ఇప్పుడు మూడో నెల. మా ఫ్రెండ్‌కి ఫస్ట్ ట్రైమిస్టర్ స్క్రీనింగ్ అనే బ్లడ్ టెస్ట్ చేశారు. మా డాక్టర్ నాకు అలాంటి టెస్ట్ చెప్పలేదు. ఈ టెస్ట్ ఎవరు చేసుకోవాలి? ప్రెగ్నెన్సీలో ఇవి చేయాల్సిన అవసరం ఉంటుందా? – కె. పూర్ణిమ, ఉమ్నాబాద్ ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి మూడు నెలల ప్రెగ్నెన్సీ. ఈ టైమ్‌లో కొన్ని ఇంపార్టెంట్ స్కాన్, బ్లడ్‌టెస్ట్‌లు ప్రతి గర్భిణీకి సూచిస్తారు. ఫస్ట్ ట్రైమిస్టర్ స్క్రీనింగ్ లేక డబుల్ మార్కర్ అనే టెస్ట్‌లు తల్లి రక్తంలో చెక్ చేస్తారు. ఈ టెస్ట్ ద్వారా బేబీకి ఉన్న కొన్ని క్రోమోజోమ్ సమస్యలు తెలుస్తాయి. డౌన్ సిండ్రోమ్ అనే క్రోమోజోమ్ లోపం వల్ల బిడ్డకు మెదడు, బాడీ సరిగా డెవలప్ కాదు. ఇంటెలిజెన్స్ తక్కువ ఉంటుంది. ఈ టెస్ట్స్లో మూడు క్రోమోజోమ్ డిజార్డర్స్ అంటూ టీ 21, టీ 18, టీ13ను చెక్ చేసి మీకు ఎంత చాన్స్ ఉంది అనేది చెప్తారు. ఈ రోజుల్లో ప్రతి గర్భిణీకి ఈ పరీక్షలను సూచిస్తున్నాం. ముందుగా రిస్క్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ పరీక్షలు రిస్క్‌ను మాత్రమే చెప్తాయి. కచ్చితమైన నిర్ధారణ, హైరిస్క్ వచ్చిన వాళ్లకు తదుపరి పరీక్షలను ఫీటల్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో చేస్తారు. ఈ ఫీటల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ అనేది స్పెషలైజ్డ్ స్కాన్స్ చేసే ప్రదేశం. Nuchal translucency స్కాన్ అనేది చేస్తారు. ఈ టెస్ట్ ద్వారా మీకు తరువాత ప్రెగ్నెన్సీలో బీపీ, బిడ్డ ఎదుగుదలకు సంబంధించిన సమస్యలేమైనా వస్తాయా అని కూడా అంచనా వేస్తారు. దీనివల్ల తగిన జాగ్రత్తలను ముందే తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఎన్టీ స్కాన్, బ్లడ్ టెస్ట్‌ల ద్వారా స్కాన్ సాఫ్ట్‌వేర్‌తో రిస్క్ కాలిక్యులేషన్ చేస్తారు. మీకు 1:150 కన్నా తక్కువ రిస్క్ ఉంటే టెస్ట్‌లు అవసరం లేదు. హై రిస్క్ అంటే 1:150 కన్నా ఎక్కువ రిస్క్ ఉందని అర్థం. అంటే వాళ్లకు ఉమ్మనీరు టెస్ట్ గానీ లేక NIPS (Non invasive prenatal screenings) గానీ చేస్తారు. అందుకే అందరూ గర్భిణీలు ఈ టెస్ట్‌లు చేయించుకోవాలి. ఇలాంటి ఫ్యామిలీ హిస్టరీ లేకపోయినా ఈ టెస్ట్‌లు చేస్తే మంచిది. మీరు డాక్టర్‌ను సంప్రదించినప్పుడు ఈ టెస్ట్‌ల గురించి వివరంగా కౌన్సెలింగ్ చేస్తారు. ఎన్టీ స్కాన్, ఈ ఎఫ్టీఎస్ టెస్ట్ ద్వారా 90 శాతం రిస్క్‌ను అంచనా వేయొచ్చు. ఇది స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే. -- డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్. చదవండి: Tips To Recover From C Section: ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. డెలివరీ అయిన మొదటి 6 వారాలు... -
Health Tips: సిజేరియన్ అయింది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
డెలివరీ అయ్యి వారమవుతోంది. సిజేరియన్ అయింది. ఇంటికి వెళ్లాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – జి. సంధ్యారాణి, కొత్తపేట ఈరోజుల్లో సిజేరియన్‌ను చాలా అడ్వాన్స్డ్ మెథడ్స్‌లో చేయడం వలన రికవరీ చాలా వేగంగా ఉంటోంది. కొన్ని జాగ్రత్తలను ఆసుపత్రిలో ఉన్నప్పుడు, ఇంటికి వెళ్లాకా తీసుకుంటే దాదాపుగా సాధారణ ప్రసవంలో ఎంత త్వరగా కోలుకుంటారో.. సిజేరియన్లోనూ అంతే త్వరగా కోలుకుంటారు. ఆసుపత్రిలో డాక్టర్ సలహా ప్రకారం యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ తీసుకోవాలి. పోషక ఆహారం తీసుకోవాలి. కుట్లకు సపోర్ట్ చాలా అవసరం మొదటి మూడురోజుల వరకు ఆపరేషన్ కుట్లు వంటివన్నీ ఆసుపత్రిలో చూస్తారు. వాళ్లు సూచించిన ఆయింట్మెంట్, పౌడర్ ఇంటికి వచ్చాక కూడా అప్లయ్ చేసుకోవాలి. మీరు బెడ్ మీద ఎలాగంటే అలా కదలకూడదు. మంచం దిగేప్పుడు ఒక పక్కకి తిరిగి కూర్చుని, కాసేపు ఆగి ఆ తర్వాత నెమ్మదిగా దిగాలి. కుట్లకు సపోర్ట్ చాలా అవసరం. దగ్గు, తమ్ములు వచ్చినప్పుడు కుట్ల మీద దిండు కానీ, చేయి కానీ పెట్టి మెల్లగా ప్రెస్ చేస్తే నొప్పి ఉండదు. ఆరు వారాల తర్వాత మీరు చేసే రోజూవారీ పనులు ఒక వారం తరువాత మొదలుపెట్టవచ్చు. ప్రతి పనికి మధ్య విశ్రాంతి తీసుకోవాలి. బిడ్డను ఎత్తుకోవచ్చు. బరువులు ఎత్తే పనులు ఆరు వారాల తరువాతనే చేయాలి. పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజులు చేయాలి. కార్ డ్రైవింగ్‌ను మీరు కాన్ఫిడెంట్‌గా ఉన్నప్పుడు మొదలుపెట్టవచ్చు. సాధారణంగా సిజేరియన్ అయిన ఆరు వారాల తరువాత చేయవచ్చు. వాకింగ్ చేయవచ్చు అవుతూ.. ఆగిపోతూ అలా ఓ నెల వరకూ బ్లీడింగ్ ఉంటుంది. డెలివరీ అయిన మొదటి ఆరువారాలు మంచి పోషకాహారం తీసుకోవాలి. రోజుకు రెండు మూడు లీటర్ల నీళ్లు తప్పకుండా తాగాలి. 20 నిమిషాలపాటు వాకింగ్ చేయవచ్చు. స్విమ్మింగ్ లాంటివి ఆరు వారాల తరువాత చేయాలి. కూర్చునేటప్పుడు వెనుక నడుముకి సపోర్ట్ అందేలా పోశ్చర్ కరెక్ట్‌గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. కుట్లు మానిన రెండు వారాలకు నడుము బెల్ట్ పెట్టుకోవాలి. డెలివరీ అయిన ఆరు, ఎనిమిది వారాల తరువాత కూడా పొట్టలో నొప్పి, జ్వరం ఉన్నా.. కుట్ల దగ్గర నొప్పి లేదా చీము వస్తున్నా, తీవ్రమైన బ్యాక్ పెయిన్ ఉన్నా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. డెలివరీ తర్వాత చేసే వ్యాయామాలను ఇప్పుడు ఆన్లైన్లోనే నేర్పిస్తున్నారు. మీ డాక్టర్ సూచించిన వ్యాయామాలను ఇలా మీరూ ఆన్లైన్ ద్వారా నేర్చుకుంటూ చేయొచ్చు. - డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్. చదవండి: Solution For Vaginal Boil: ఏడాదిగా అక్కడ సెగ గడ్డలు.. ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి? -
Health Tips: ఏడాదిగా అక్కడ సెగ గడ్డలు.. ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి?
నా వయసు 25 సంవత్సరాలు. నాకు ఏడాదిగా వజైనా దగ్గర బయట భాగంలో సెగ్గడ్డలు వస్తున్నాయి. డాక్టర్ని సంప్రదిస్తే యాంటీబయోటిక్స్ ఇచ్చారు. కానీ మూడు నెలల్లోనే మళ్లీ వస్తున్నాయి. ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలో చెప్పగలరు. చాలా నొప్పిగా, ఇబ్బందిగా ఉంటోంది. – స్వర్ణ, కర్నూలు దీనిని ‘బార్తోలిన్ అబ్సెస్’ అంటారు. చాలామందికి మీ ఏజ్ గ్రూప్‌లో వస్తుంది. ‘బార్తోలిన్ సిస్ట్స్’ అని వజైనా ఎంట్రన్స్‌లో రెండువైపులా ఉంటాయి. ఇవి కొంత డిశ్చార్జ్ చేసి, వజైనాని తేమగా ఉంచుతాయి. ఈ సిస్ట్స్లో ఏదైనా ఇన్ఫెక్షన్తో బ్లాక్ అయితే, చీము పట్టి, వాపు వచ్చి, నొప్పిగా ఉంటాయి. మూత్రవిసర్జన కూడా కష్టంగా ఉంటుంది. చాలామందికి ఏ కారణంగా ఇన్ఫెక్షన్ వచ్చిందో చెప్పడం కూడా కష్టమే! బ్యాక్టీరియా, క్లామిడియా, గనేరియా వంటి ఇన్ఫెక్షన్లు వజైనాలో ఉంటే, ఈ సిస్ట్స్ బ్లాక్ అయి, గడ్డలు కడతాయి. వజైనల్ స్వాబ్ టెస్ట్ చేసి, ఏ బ్యాక్టీరియా ఉందో పరీక్షించాల్సి ఉంటుంది. ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఇన్ఫెక్షన్తో సిస్ట్స్ పగిలి, చీము బయటకు వచ్చి విపరీతమైన నొప్పి ఉంటుంది. మళ్లీ గడ్డ వచ్చే అవకాశం ఉంటుంది. యాంటీబయోటిక్స్ ఇచ్చినా మళ్లీ గడ్డలు వస్తున్నాయంటే, సిస్ట్స్‌ని ఆపరేషన్ థియేటర్లో పూర్తిగా డ్రెయిన్ చేయాల్సి ఉంటుంది. అబ్జార్బబుల్ మత్తు ఇచ్చి, ఈ శస్త్రచికిత్స చేస్తారు. సిస్ట్స్ డ్రెయిన్ చేశాక, కుట్లు వేస్తారు. వారం రోజుల పాటు పెయిన్ కిల్లర్స్, యాంటీబయోటిక్స్ డాక్టర్ సూచన మేరకు వాడుకోవాల్సి ఉంటుంది. దీనికి డాక్టర్‌తో రెగ్యులర్ ఫాలోఅప్‌తో ఉండాలి. ఈ మైనర్ ప్రొసీజర్ మీకు డేకేర్‌లో అవుతుంది. ఆపరేషన్ తర్వాత మళ్లీ ఇన్ఫెక్షన్ రాకుండా, వజైనా భాగాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. పొడిగా ఉంచుకోవాలి. కొన్ని రోజులు బరువులు ఎత్తడం, వ్యాయామాలు మానుకోవాలి. దీనికి ముందు డయాబెటిస్, రక్తహీనత ఉంటే వాటిని పరీక్షించి, తగిన మందులు సూచిస్తారు. యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండా ఎక్కువ నీరు తాగాలి. జ్వరం, బ్లీడింగ్, చీము ఉన్నట్లయితే, వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. - డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్. చదవండి: Tips For Healthy Pregnancy: గర్భసంచి వదులుగా ఉంది.. కుట్లు వేయాలి? ఏమైనా ప్రమాదమా? -
Health: నార్మల్ డెలివరీ.. దగ్గితే... తుమ్మితే... యూరిన్ లీక్ అవుతోంది? ఎందుకిలా?
నాకు 30 ఏళ్లు. ఏడాదిన్నర కిందట డెలివరీ అయింది. నార్మల్ డెలివరీనే. ఇప్పుడు దగ్గినా.. తుమ్మినా కొంచెం యూరిన్ లీక్ అవుతోంది. ఇదేమైనా పెద్ద సమస్యా? దీనికి ట్రీట్మెంట్ ఉందా? – బి. ప్రసూన, నందిగామ చాలా మంది ఆడవాళ్లకు పెల్విక్ ఫ్లోర్ మజిల్ వీక్నెస్ ఉంటుంది. ఈ కండరాలు కింది భాగంలో ఉంటాయి. ఇవి ఒక స్లిప్లాగా ఉండి, పైన ఉన్న బ్లాడర్, గర్భసంచి, రెక్టమ్ (మలవిసర్జన పైప్)ను సపోర్ట్ చేస్తాయి. వయసు పెరిగేకొద్దీ సహజంగానే ఇవి కొంత వీక్ అవుతాయి. ఇవి నడుము కింద టైల్బోన్ నుంచి ముందు వైపున్న ప్యూబిక్ బోన్‌కు అటాచ్ అవుతాయి. ఈ కండరాలనూ శరీరంలోని అన్ని కండరాల్లాగే శక్తిమంతం చేసుకోవాలి. దానికోసం కొన్ని వ్యాయామాలు చేయాలి. దాంతో కండరాలు పటుత్వం కోల్పోవు. దగ్గినప్పుడు.. తుమ్మినప్పుడు యూరిన్ లీక్ కాదు. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఈ కండరాలు ఆటోమేటిగ్గా టైట్ అయి ఆ ఓపెనింగ్స్‌ను క్లోజ్ చేసి లీక్ అవకుండా చేస్తాయి. కానీ ఈ కండరాలు ఆల్రెడీ వదులైపోతే లీకేజ్ తప్పదు. ప్రసవం తర్వాత ఎక్కువగా దగ్గు, ఎక్కవ కాలం శ్వాస సంబంధమైన ఇన్ఫెక్షన్స్ ఉన్నా, అధిక బరువుతో బాధపడుతున్నా, ఎక్కువ కాలం బరువు పనులు చేస్తున్నా.. రుతుక్రమం ఆగిన తరువాత వీక్ అవుతాయి. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తూ ఈ సమస్యను నియంత్రించవచ్చు. ప్రసవం తరువాత వెజైనా స్ట్రెచ్ అయి ఈ కండరాలు వదులవుతాయి. వ్యాయామాల ద్వారా ఈ కండరాలను టైట్ చేయవచ్చు. బరువు తగ్గడం, పోషకాహారం తీసుకోవడం వంటి జాగ్రత్తలతో ఈ యూరిన్ లీక్ ప్రాబ్లమ్ 80 శాతం కేసెస్‌లో తగ్గుతుంది. ఏ రిజల్ట్ లేనప్పుడు యూరో గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి. ప్రతిరోజు కనీసం మూడుసార్లయినా ఈ వ్యాయామాలు చేయాలి. ప్రతిసారి 8 కాంట్రాక్షన్స్ చేయాలి. ఇలా మూడు నెలలు చేస్తే చాలా ఫలితం కనిపిస్తుంది. డాక్టర్‌ను సంప్రదిస్తే వాళ్లు ఈ వ్యాయామాలు ఎలా చేయాలో వివరిస్తారు. - డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్. చదవండి: Tips For Healthy Pregnancy: గర్భసంచి వదులుగా ఉంది.. కుట్లు వేయాలి? ఏమైనా ప్రమాదమా? Gynecology: 60 ఏళ్ల వయసులో ఎందుకిలా? ఏదైనా ప్రమాదమా? -
Health: గర్భసంచి వదులుగా ఉంది.. ! ఏమైనా ప్రమాదమా?
నాకిప్పుడు మూడో నెల. గర్భసంచి వదులుగా ఉంది.. కుట్లు వేయాలి అంటున్నారు. దీనివల్ల ఏమైనా ప్రమాదమా? అందరికీ ఇలాగే ఉంటుందా? – ముంజుష కొండపాక, జహీరాబాద్ గర్భసంచి ముఖ ద్వారం చిన్నగా ఉన్నా, ముందుగానే తెరుచుకుంటున్నా (అంటే 34 వారాలకు ముందు) సర్వైకల్ స్టిచ్ వేస్తారు. ఈ పరిస్థితిని అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా గుర్తిస్తారు. గర్భస్రావం అవకుండా, సమయానికి ముందే కాన్పు కాకుండా ఈ సర్వైకల్ స్టిచ్ ఆపుతుంది. కొంతమందిలో ముందు ప్రెగ్నెన్సీలో సమస్యలు తలెత్తినా, సెర్విక్స్ చిన్నదైపోయి సమయానికి ముందే కాన్పు అయినా, లేదా సెర్విక్స్ పైన ఏదైనా ఆపరేషన్ చేసినా తర్వాత ప్రెగ్నెన్సీలో మూడవ నెలలోనే ఇలా కుట్లు వేస్తారు. సర్వైకల్ స్టిచ్‌ను 12 – 24 వారాల్లోపు వేస్తారు. అవసరమైన కేసెస్‌లో మాత్రమే నెలలు నిండిన తరువాత అంటే 37 – 38 వారంలో ఓపీలోనే ఇంటర్నల్ ఎగ్జామ్ చేసి ఈ కుట్లను విడిచి.. నార్మల్ డెలివరీ కోసం వెయిట్ చేయొచ్చు. నొప్పులు వస్తే ఈ కుట్లను ముందుగానే తీసేస్తారు. ట్రాన్స్‌వెజైనల్ స్కాన్‌లో సెర్విక్స్ 25ఎమ్ఎమ్ కన్నా తక్కువ వస్తే స్టిచ్ వేస్తారు. లో రిస్క్ కేసెస్‌లో కేవలం కొన్ని హార్మోన్ మాత్రలతో లేదా ఇంజెక్షన్స్‌తో సర్వైకల్ స్టిచ్ వేయకుండానే అబ్జర్వ్ చేయవచ్చు. దీనికి సంబంధించి సీనియర్ డాక్టర్ పర్యవేక్షణలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ స్టిచ్ వేసే ముందు యూరిన్, వెజైనాలో ఇన్ఫెక్షన్స్ ఏమీ లేవని టెస్టుల ద్వారా నిర్ధారిస్తారు. ఉమ్మనీరు పోయినా, బ్లీడింగ్ అవుతున్నా నొప్పులు వస్తున్నా ఈ సర్వైకల్ స్టిచ్ వేయకూడదు. అంటే డెలవరీ ప్రాసెస్ స్టార్ట్ అయిన తరువాత ఇలాంటి ప్రక్రియతో దాన్ని ఆపలేం. అందుకే హై రిస్క్ కేసెస్‌లో సెర్విక్స్ లెంగ్త్ ఎలా ఉంది అని 12వ వారం నుంచి 24వ వారం వరకు రెండు వారాలకొకసారి అల్ట్రాసౌండ్‌లో చెక్ చేసి సెర్విక్స్ చిన్నదవుతుంటే స్టిచ్ వేయడం జరుగుతుంది. తొలిచూలు కాన్పులో కొంతమందికి ఏవిధమైన స్పాటింగ్, బ్లీడింగ్ లేకున్నా కూడా హఠాత్తుగా గర్భసంచి ముఖద్వారం చిన్నదైపోవడం, తెరుచుకొని, సమయానికి కన్నా ముందే కాన్పు అవడం సంభవిస్తాయి. దీనిని సర్వైకల్ ఇన్‌కాంపిటెన్స్ అంటారు. కొన్ని కేసెస్‌లో రెస్క్యూ స్టిచ్ వేసి కాన్పును తాత్కాలికంగా ఆపే ప్రయత్నం చేయగలం. కానీ నొప్పులు, బ్లీడింగ్ ఉంటే ఏమీ చేయలేం. ఇలాంటి కేసెస్‌లో తర్వాత ప్రెగ్నెన్సీలో మూడవ నెలలోనే స్టిచ్ వేసేస్తారు. సర్వైకల్ స్టిచ్ అనేది ఆసుపత్రిలో చేర్చుకుని, ఎనస్తీషియా ఇచ్చి చేసే ప్రక్రియ. ఇందులో కొంత రిస్క్ కూడా ఉంటుంది. ఈ ప్రక్రియకు ముందు డాక్టర్ అన్నీ వివరిస్తారు. మీకు కచ్చితంగా సర్వైకల్ స్టిచ్ అవసరమైతేనే డాక్టర్ ఆ నిర్ణయం తీసుకుంటారు. ఈ స్టిచ్ వేసిన తరువాత అవసరమైనవారికి మాత్రమే బెడ్ రెస్ట్ సూచిస్తాం. చాలా మంది మామూలుగానే రోజూవారి పనులు చేసుకోవచ్చు. డాక్టర్ ఫాలో అప్‌లో మాత్రం ఉండాలి. - డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్. -
Health: 60 ఏళ్ల వయసులో ఎందుకిలా? ఏదైనా ప్రమాదమా?
నాకిప్పుడు 60 ఏళ్లు. వెజైనా దగ్గర చర్మం కలర్ చేంజ్ అయింది. చిన్న గడ్డలాగా కూడా తెలుస్తోంది. ఏమైనా ప్రమాదమా? డాక్టర్‌ను సంప్రదించాలా? – సీహెచ్. సుజాత, కరీంనగర్ మీ వయసును బట్టి చూస్తే మీ సమస్యను ఫాలో అప్ కేస్‌గా పరిగణించాలి. డాక్టర్‌ను సంప్రదిస్తే.. ముందుగా బయట నుంచే చెక్ చేస్తారు. కొన్ని రకాల స్కిన్ ఇన్ఫెక్షన్స్లో కూడా ఇలా కలర్ మార్పు కనపడుతుంది. ఇంటర్నల్ ఎగ్జామినేషన్ ద్వారా లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా అని చూస్తారు. యూరిన్ టెస్ట్ చేస్తారు. కొన్నిసార్లు పులిపిర్లు కూడా ఇలానే ఉంటాయి. అవేం ప్రమాదకరం కావు. కానీ కొంతమందిలో vulval lesions(వల్వల్ లీజన్స్) అని ఉంటాయి. ఇవి కొంతవరకు ఇన్వెస్టిగేషన్స్, ఫాలో అప్స్లోనే తెలుస్తాయి ప్రమాదకరమా .. కాదా అని. స్కిన్ బయాప్సీ చేయవలసి రావచ్చు. కొన్ని ప్రత్యేకమైన క్రీమ్స్ వాడమని చెప్తారు. రోగనిరోధక శక్తి పెరగడానికి కొన్ని మల్టీవిటమిన్ మాత్రలను సూచిస్తారు. ఫాలో అప్ ట్రీట్మెంట్లో లేకపోతే వంద మందిలో అయిదుగురికి ఇవి క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఉంటుంది. వల్వల్ హైజీన్ అంటే మంచి నీటితో శుభ్రం చేసుకోవడం. ఏ మార్పు కనిపించినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం వల్ల ప్రమాదాన్ని అరికట్టవచ్చు. - డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్. చదవండి: Health Tips: రోజూ క్యారెట్ తినే అలవాటుందా? దీనిలోని బీటా కెరోటిన్ వల్ల.. -
Health: పెళ్లయి ఆరునెలలవుతోంది.. ప్రెగ్నెన్సీ ఎలా ప్లాన్ చేసుకోవాలి?
మాకు పెళ్లయి ఆరునెలలవుతోంది. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాం. ఏవైనా టెస్ట్‌లు చేయించుకోవాలా? ఏవైనా వ్యాక్సిన్స్ అవసరమా? – పి. సుమీల, విజయవాడ బిడ్డను కనాలనే ప్లానింగ్‌కు కనీసం మూడు నెలల ముందు గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి. ఇది మీ ఇద్దరి శారీరక ఆరోగ్యానికి సంబంధించిన వైద్య పరీక్షలు, మీ ఫ్యామిలీ హిస్టరీని బట్టి అవసరమైన జెనెటిక్ టెస్ట్స్ చేయడానికి సహాయపడుతుంది. ఈ పరీక్షల వల్ల ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటే తెలుస్తాయి. ఇవి ప్రెగ్నెన్సీ కంటే ముందుగానే తెలియడం వల్ల ట్రీట్మెంట్ సులువవుతుంది. కొన్ని రకాల అలర్జీలకు ముందుగానే చికిత్సను అందించే వీలుంటుంది. ఫ్యామిలీలో ఏవైనా జన్యుపరమైన లోపాలు ఉంటే జెనెటిక్ కౌన్సెలర్‌ను సంప్రదిస్తే.. రిస్క్ ఎంతో తెలుసుకుని.. ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు. ప్రెగ్నెన్సీలో ఎలాంటి పరీక్షలు చేసి సమస్యలను కనిపెట్టవచ్చో చెప్తారు. అమ్మాయిల్లో రక్తహీనత అనేది సర్వసాధారణమైన సమస్య. పోషకా హారం, తగిన మందులతో ముందుగానే దాన్ని అరికట్టవచ్చు. ప్రెగ్నెన్సీకి మూడు నెలల ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ మాత్రలను వేసుకుంటే బిడ్డకు స్పైన్, నెర్వ్ ప్రాబ్లమ్స్ వచ్చే చాన్సెస్ తగ్గుతాయి. రుబెల్లా వ్యాక్సిన్, చికెన్‌పాక్స్ వ్యాక్సిన్, కోవిడ్ వ్యాక్సిన్స్ ముందే తీసుకోవాలి. థైరాయిడ్, సుగర్ టెస్ట్స్ చేసి .. ట్రీట్మెంట్ అవసరమైతే చేస్తారు. యూరిన్, వెజైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయేమో చెక్ చేసి.. అవసరమైన యాంటీబయాటిక్స్ ఇస్తారు. ఇలా ప్రెగ్నెన్సీకి మూడు నెలల ముందే కౌన్సెలింగ్‌కి వెళితే పండంటి బిడ్డను కనొచ్చు. -- డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్. చదవండి: Health Tips: నెలసరి మొదలయ్యే ముందు కూడా ఇలా జరగొచ్చు! ఇరిటేటింగ్‌గా ఉంటే..