ప్రతీకాత్మక చిత్రం
Thyroid- Pregnancy Possibilities: నాకిప్పుడు 22 ఏళ్లు. మొన్ననే ఉద్యోగంలో చేరాను. పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే అయిదేళ్ల కిందట నాకు థైరాయిడ్ ప్రాబ్లమ్ వచ్చింది. దీనివల్ల పిల్లలు పుట్టడం కష్టమవుతుంది అంటున్నారు నా సన్నిహితులు. అది నిజమేనా? – వీణ, భైంస
ఫెర్టిలిటీకి సంబంధించిన హార్మోన్స్
థైరాయిడ్ డిజార్డర్స్ అనేది ఈ రోజుల్లో సర్వసాధారణంగా చూస్తున్న సమస్య. సరైన సమయంలో సరైన చికిత్సతో ఫెర్టిలిటీ, గర్భధారణ, ప్రసవం వంటి వాటి మీద ఈ సమస్య ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. థైరాయిడ్ గ్రంథిని HPO axis అనేది బ్రెయిన్‌లో కంట్రోల్ చేస్తుంది. ఇదే HPO axis ఫెర్టిలిటీకి సంబంధించిన హార్మోన్స్‌ను కూడా రిలీజ్ చేస్తుంది.
కాబట్టి థైరాయిడ్ సమస్య పునరుత్పత్తి అవయవాలైన గర్భసంచి, అండాశయాల మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే గర్భందాల్చే అవకాశాలు, హెల్దీ ప్రెగ్నెన్సీ, ఆరోగ్యవంతమైన బిడ్డ పుట్టే అవకాశాలు తక్కువ. అందుకే 25–5 ఏళ్ల మధ్య ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకునే వారికి తప్పనిసరిగా మొదట టీఎస్‌హెచ్ పరీక్ష చేస్తాం.
గర్భస్రావం అయ్యే రిస్క్
ఈ వాల్యూ 2.5 కన్నా తక్కువ ఉంటే అవుట్‌కమ్ బాగుంటుందని అర్థం. గర్భస్రావం అయ్యే రిస్క్ తగ్గుతుంది. కొన్నిసార్లు థైరాయిడ్ లెవెల్ సరిగ్గానే ఉన్నా థైరాయిడ్ యాంటీబాడీస్ పాజిటివ్‌గా ఉంటాయి. ఈ యాంటీబాడీస్ గర్భధారణ అవకాశాలను తగ్గిస్తాయి. గర్భస్రావం అయ్యే రిస్క్‌ని పెంచుతాయి.
కడుపులో బిడ్డ మెదడు పెరుగుదల మీదా ప్రభావం పడుతుంది. థైరాయిడ్ సమస్యకు క్రమం తప్పకుండా చికిత్స తీసుకుంటూంటే ఈ రిస్క్ తగ్గుతుంది. కొంతమందిలో ఈ థైరాయిడ్ సమస్య వల్ల నెలసరి క్రమం తప్పుతుంది. దీనివల్ల గర్భధారణా ఆలస్యం అవుతుంది.
వెంటనే చికిత్స మొదలుపెడితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ప్రతి నెల టీఎస్‌హెచ్ టెస్ట్ చేస్తూ థైరాయిడ్ కంట్రోల్లో ఉందా లేదా అని చూస్తాం. దాన్నిబట్టి మందుల డోస్‌ను అడ్జస్ట్ చేస్తాం.
-డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్, హైదరాబాద్
చదవండి: Birth Control Methods: ఇప్పుడే ఇంకో బిడ్డ వద్దు! మధుమేహం, మూర్చ వ్యాధికి మందులు వాడుతున్నా.. ఇలా చేశారంటే!
Black Sesame- Dandruff Control: నల్ల నువ్వుల ప్రయోజనాలు.. చుండ్రుకు చెక్! ఒత్తైన జుట్టు ఇంకా..
Comments
Please login to add a commentAdd a comment