Thyroid problem
-
ఈ లక్షణాలుంటే మీకు థైరాయిడ్ సమస్య ఉన్నట్లే..
-
Health: సంబంధాలు చూస్తున్నారు... కానీ ఆ సమస్య! వాళ్ల మాటలు నిజమే అంటారా?
Thyroid- Pregnancy Possibilities: నాకిప్పుడు 22 ఏళ్లు. మొన్ననే ఉద్యోగంలో చేరాను. పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే అయిదేళ్ల కిందట నాకు థైరాయిడ్ ప్రాబ్లమ్ వచ్చింది. దీనివల్ల పిల్లలు పుట్టడం కష్టమవుతుంది అంటున్నారు నా సన్నిహితులు. అది నిజమేనా? – వీణ, భైంస ఫెర్టిలిటీకి సంబంధించిన హార్మోన్స్ థైరాయిడ్ డిజార్డర్స్ అనేది ఈ రోజుల్లో సర్వసాధారణంగా చూస్తున్న సమస్య. సరైన సమయంలో సరైన చికిత్సతో ఫెర్టిలిటీ, గర్భధారణ, ప్రసవం వంటి వాటి మీద ఈ సమస్య ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. థైరాయిడ్ గ్రంథిని HPO axis అనేది బ్రెయిన్లో కంట్రోల్ చేస్తుంది. ఇదే HPO axis ఫెర్టిలిటీకి సంబంధించిన హార్మోన్స్‌ను కూడా రిలీజ్ చేస్తుంది. కాబట్టి థైరాయిడ్ సమస్య పునరుత్పత్తి అవయవాలైన గర్భసంచి, అండాశయాల మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే గర్భందాల్చే అవకాశాలు, హెల్దీ ప్రెగ్నెన్సీ, ఆరోగ్యవంతమైన బిడ్డ పుట్టే అవకాశాలు తక్కువ. అందుకే 25–5 ఏళ్ల మధ్య ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకునే వారికి తప్పనిసరిగా మొదట టీఎస్‌హెచ్ పరీక్ష చేస్తాం. గర్భస్రావం అయ్యే రిస్క్ ఈ వాల్యూ 2.5 కన్నా తక్కువ ఉంటే అవుట్‌కమ్ బాగుంటుందని అర్థం. గర్భస్రావం అయ్యే రిస్క్ తగ్గుతుంది. కొన్నిసార్లు థైరాయిడ్ లెవెల్ సరిగ్గానే ఉన్నా థైరాయిడ్ యాంటీబాడీస్ పాజిటివ్‌గా ఉంటాయి. ఈ యాంటీబాడీస్ గర్భధారణ అవకాశాలను తగ్గిస్తాయి. గర్భస్రావం అయ్యే రిస్క్‌ని పెంచుతాయి. కడుపులో బిడ్డ మెదడు పెరుగుదల మీదా ప్రభావం పడుతుంది. థైరాయిడ్ సమస్యకు క్రమం తప్పకుండా చికిత్స తీసుకుంటూంటే ఈ రిస్క్ తగ్గుతుంది. కొంతమందిలో ఈ థైరాయిడ్ సమస్య వల్ల నెలసరి క్రమం తప్పుతుంది. దీనివల్ల గర్భధారణా ఆలస్యం అవుతుంది. వెంటనే చికిత్స మొదలుపెడితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ప్రతి నెల టీఎస్‌హెచ్ టెస్ట్ చేస్తూ థైరాయిడ్ కంట్రోల్లో ఉందా లేదా అని చూస్తాం. దాన్నిబట్టి మందుల డోస్‌ను అడ్జస్ట్ చేస్తాం. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ చదవండి: Birth Control Methods: ఇప్పుడే ఇంకో బిడ్డ వద్దు! మధుమేహం, మూర్చ వ్యాధికి మందులు వాడుతున్నా.. ఇలా చేశారంటే! Black Sesame- Dandruff Control: నల్ల నువ్వుల ప్రయోజనాలు.. చుండ్రుకు చెక్! ఒత్తైన జుట్టు ఇంకా.. -
గాయిటర్ సమస్యల్లో రకాలు... పరిష్కారాలు
మన శరీరంలో జరిగే అనేక జీవక్రియలకు గ్రంథుల నుంచి స్రవించే హార్మోన్లు అవసరం. అందులో థైరాయిడ్ గ్రంథి చాలా ముఖ్యమైనది. ఇది మెడ ముందు భాగంలో శ్వాసనాళానికి రెండువైపులా సీతాకోకచిలుక రెక్కల ఆకృతిలో ఉంటుంది. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ప్రభావంతో థైరాయిడ్ గ్రంథి టీ3, టీ4 హార్మోన్లను వెలువరిస్తుంది. థైరాయిడ్ గ్రంథిలో అసాధారణ పెరుగుదలను గాయిటర్ అంటారు. ఇందులోనూ రెండు రకాలు ఉంటాయి.మొదటది డిఫ్యూస్ గాయిటర్, రెండోది నాడ్యులార్ గాయిటర్. థైరాయిడ్ గ్రంథి ఉబ్బిపోయి... ఇరువైపులా సమానంగా పెరగడాన్ని డిఫ్యూస్ గాయిటర్‌గా అంటారు. ఇక నాడ్యులార్ గాయిటర్‌లో థైరాయిడ్ గ్రంథికి ఒక భాగంలో ఒకటి లేదా మరిన్ని గడ్డలు ఏర్పడతాయి. ఇలా గడ్డల్లాంటివి పెరగడాన్ని నాడ్యులార్ గాయిటర్ అంటారు. గాయిటర్ సమస్య వచ్చిన కొందరిలో థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి సంబంధించి ఎలాంటి మార్పులూ ఉండవు. కానీ మరి కొందరిలో మాత్రం థైరాయిడ్ హార్మోన్ల స్రావంలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. అంటే... హార్మోన్స్రావాలు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. హార్మోన్ల ఉత్పత్తి పెరిగితే ఆ కండిషన్‌ను హైపర్ థైరాయిడిజం అని, తగ్గితే హైపోథైరాయిడిజమ్ అని అంటారు. శరీరంలో అయోడిన్ లోపం వల్ల ఇలాంటి సమస్య వస్తుంది. థైరాయిడ్‌కు సంబంధించిన సమస్యలు ఉన్నవారికి థైరాయిడ్ ప్రొఫైల్ పరీక్షలైన టీ3, టీ4, టీఎస్‌హెచ్, యాంటీ థైరాయిడ్ యాంటీబాడీస్ వంటి పరీక్షలు చేసి, సమస్యను నిర్ధారణ చేస్తారు. ఫలితాలను బట్టి చికిత్స అవసరమవుతుంది. థైరాయిడ్ క్యాన్సర్ సమస్యను మినహాయించి... సాధారణంగా థెరాయిడ్ గ్రంథి వాపు (గాయిటర్) సమస్యను ఎలాంటి శస్త్రచికిత్స అవసరం లేకుండానే నయం చేయవచ్చు. -
హైపో థైరాయిడిజమ్.. ఏం తినాలి? ఏం తినకూడదు!!
లైఫ్ స్టయిల్ ఆరోగ్య సమస్యలకు ఒక దశాబ్దకాలంగా థైరాయిడ్ కూడా తోడయింది. మధ్య వయసు వచ్చిన తర్వాత బీపీ, డయాబెటిస్లకు మందులు వేసుకునే వాళ్లు ఎంతమంది ఉన్నారో ఇరవైలలోనే థైరాయిడ్ సమస్యతో బాధపడేవాళ్లు కూడా అంతగా ఉన్నారంటే ఆశ్చర్యం కాదు. హైపో థైరాయిడిజమ్ అనేది అనారోగ్యం కాదు, థైరాయిడ్ స్టిములేటింగ్ హార్మోన్ (టీఎస్‌హెచ్) దేహానికి తగినంతగా అందని స్థితి. అలాగే హైపర్ థైరాయిడిజమ్ అంటే ఆ హార్మోన్ అవసరానికి మించి అందడం అన్నమాట. హైపో థైరాయిడిజమ్ విషయానికి వస్తే... ఇది మగవాళ్లలో కంటే మహిళల్లో రెండింతలు ఎక్కువగా ఉంటోంది. ఆహారంలో అందాల్సిన సూక్ష్మ పోషకాలు అందకపోవడం కూడా ఒక కారణమే. అందుకే ఈ సమస్య నుంచి బయటపడడానికి మందులతోపాటు తీసుకోవాల్సిన ఆహారం ఏమిటో చూద్దాం. హైపో థైరాయిడిజమ్ నుంచి బయటపడడానికి అయోడిన్ అనే ఖనిజం చాలా అవసరం. ఈ ఖనిజం సహజంగా అందే ఆహారం తినదగిన (పఫర్ ఫిష్ వంటి విషపూరితం కాని)అన్ని రకాల చేపలు, గుడ్లు, పాలు–పాల ఉత్పత్తులు. వీటిలో అయోడిన్ సమృద్ధిగా ఉంటుంది. అలాగే వంటల్లో అయోడిన్‌తో కూడిన ఉప్పు వాడడం మంచిది. అలాగే సెలీనియం బ్రెజిల్ నట్స్ (డ్రై ఫ్రూట్స్ దుకాణంలో ఈ పేరుతోనే లభిస్తాయి) రోజుకు రెండు తినాలి. రోజూ ఒక స్పూన్ అవిసె గింజలు, సబ్జా గింజలు తీసుకోవాలి. వెజ్ సలాడ్, చికెన్, మాంసం, రొయ్యలు వారానికి ఒకటి – రెండుసార్లు తీసుకోవాలి. పండ్ల విషయానికి వస్తే... స్ట్రాబెర్రీ, పీచ్ పండ్లను మినహాయించి మిగిలిన అన్ని పండ్లనూ తీసుకోవాలి. ఇక ప్రధాన ఆహారంగా మామూలుగానే అన్నం, గోధుమ రొట్టెల వంటివి తీసుకోవచ్చు. తెల్లసొన, పచ్చసొన అనే విభజన లేకుండా గుడ్డు మొత్తాన్ని తీసుకోవాలి. (చదవండి: నిద్ర పట్టడం లేదా..? ఇవి చేస్తే ఈజీగా..) వీటికి దూరం! ► మిల్లెట్స్, సోయా గింజలు, టోఫు వంటి సోయా పనీర్, ఇతర సోయా ఉత్పత్తులను, చిలగడ దుంపలను మానేయాలి. వేరుశనగ గింజలు, క్యాబేజ్, బ్రోకలీ, క్యాలీఫ్లవర్, పాలకూర వంటివి బాగా తగ్గించాలి. అయోడిన్ లోపం లేని వాళ్లు కొన్ని రకాల మిల్లెట్స్‌ను తీసుకోవచ్చు. ఇది డాక్టర్ సలహా మేరకు పాటించాల్సిన జాగ్రత్త. ఇది దేహతత్వాన్ని బట్టి వ్యక్తికీ వ్యక్తికీ మారుతుంది. అలాగే పూర్తిగా మానేయాల్సిన జాబితాలో మర్చిపోకూడని మరికొన్ని... బేకరీ ఉత్పత్తులు. లక్షణాలివి ఎప్పుడూ అలసట, బరువు పెరగడం, ఎప్పుడూ జలుబు చేసినట్లు అసౌకర్యంగా అనిపించడం, జుట్టు రాలిపోవడం, మానసికంగా న్యూనతకు లోనుకావడం వంటి ప్రధానంగా కనిపించే లక్షణాలతోపాటు మరికొన్ని ఇతర లక్షణాలు కూడా ఉంటాయి. -
ఆపద్బాంధవుడు శ్రీనివాస్
నిర్మల్అర్బన్: ఆపదలో ఉన్నారు.. రక్తం అవసరం ఉంది.. అని తెలిస్తే చాలు ఆదుకుంటూ ఆపద్బాంధవుడవుతున్నాడు. ఎలాంటి సమయాల్లో పిలుపు వచ్చినా వెనుకడుగు వేయకుండా వెంటనే స్పందించి రక్తదానం చేస్తుంటాడు. 18 సార్లు రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు ఆదుముల్ల శ్రీనివాస్. నిర్మల్‌లోని బుధవార్‌పేట్‌కు చెందిన శ్రీనివాస్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. సారంగాపూర్ మండలం కౌట్ల (బి) గ్రామానికి చెందిన పోసవ్వ థైరాయిడ్‌తో బాధపడుతోంది. విషమ పరిస్థితిలో మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో నిర్మల్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. పరీక్షించిన వైద్యులు ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ కోసం ఓ పాజిటివ్ రక్తం సిద్ధం చేసుకోవాలని సూచించారు. దీంతో కుటుంభీకులు రక్తం కోసం నిర్మల్‌లోని బ్లడ్‌బ్యాంక్‌ను సంప్రదించారు. అక్కడ రక్తం లభించలేదు. రాత్రి సమయంలో ఏం చేయాలో పాలుపోలేదు. పోసవ్వ పరిస్థితిని గురించి తెలుసుకున్న వైద్యుడు శశికాంత్ తనకు పరిచయస్తుడు, రక్తదాతలను సమీకరిస్తూ అవసరమైన వారికి రక్తం అందేలా ఏర్పాటు చేస్తున్న నిగులపు సంజీవ్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వెంటనే సంజీవ్ తన మిత్రుడైన ఆదుముల్ల శ్రీనివాస్‌కు పరిస్థితిని వివరించాడు. రాత్రి అని చూడకుండా శ్రీనివాస్ వెంటనే తన స్నేహితుడు మొగిలి రాజేశ్ సహాయంతో ఆసుపత్రికి వచ్చి రక్తదానం చేశాడు. దీంతో పోసవ్వకు ప్రాణపాయం తప్పింది. రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచిన శ్రీనివాస్‌ను పలువురు అభినందించారు. -
ఇంటిప్స్
►రోజూ నాలుగైదు తులసి ఆకులు తింటే హెపటైటిస్, థైరాయిడ్ సమస్యలు రావు. ►పంటి నొప్పితో బాధపడుతుంటే ఆ ప్రాంతంలో లవంగం పెడితే తగ్గుతుంది. ►రుతుక్రమం ముందు వచ్చే ఆరోగ్య సమస్యలు తగ్గాలంటే జింజర్లీ ఆయిల్, గుడ్డు కలిపి తినాలి. ►క్రమం తప్పకుండా రోజ్బెర్రీ తింటే నెలసరి బాధలనుంచి విముక్తి లభిస్తుంది. ►మలబార్ ఆకును నీళ్లలో మరిగించి రసం తీసి ఆ రసానికి గుడ్డులోని తెల్లసొన కలిపి తీసుకుంటే దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. ►శొంఠి పొడిలో గసాల పొడి, చక్కెర కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. ►ఆవాల పేస్టులో తేనె కలిపి తీసుకుంటే శీతాకాలంలో వదలకుండా వేధిస్తున్న దగ్గును హరిస్తుంది. ►తులసిఆకు రసం, వాము నీరు, తేనె సమపాళ్లలో కలిపి పరగడుపున తీసుకుంటే దగ్గు తగ్గిపోతుంది. ►మూత్ర సంబంధ వ్యాధులతో బాధపడుతుంటే ఒక గ్లాసు నీటిలో చిటికెడు ఏలకుల పొడి కలిపి పరగడుపునే తాగాలి. ► కడుపు నొప్పి తగ్గాలంటే జీలకర్ర పొడిలో చక్కెర కలిపి బాగా నమిలి తినాలి. -
‘గొంతు’ సవరించండి
- హైదరాబాద్‌లో 8.88 శాతం మందిలో థైరాయిడ్ సమస్య - దేశంలో ఐదో స్థానం - వాతావరణ కాలుష్యమే ప్రధాన కారణం - ఇండియన్ థైరాయిడ్ ఎపిడమియాలజీ స్టడీ వెల్లడి ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్‌ను ఎప్పుడో అయోడిన్ లోపాన్ని అధిగమించిన దేశంగా ప్రకటించింది. కానీ వాహన, పారిశ్రామిక కాలుష్యం, హార్మోన్లలో లోపించిన సమతుల్యత వల్ల నేడు హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో సైతం థైరాయిడ్ కేసులు నమోదవుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. జాతీయ స్థాయిలో 18 ఏళ్లు పైబడిన వారిలో 10.95 శాతం మంది థైరాయిడ్‌తో బాధపడుతుంటే, అత్యధిక బాధితులతో కోల్‌కతా తొలి స్థానంలో, హైదరాబాద్ ఐదో స్థానంలో ఉన్నాయి. సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే అధికంగా కన్పించే హైపోథైరాయిడిజం కేసులు నేడు మెట్రోనగరాల్లోనూ పెరిగిపోతున్నాయి. మధుమేహం, గుండె జబ్బులకు మాత్రమే కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌లో తాజాగా హైపోథైరాయిడిజం కేసులూ అధికమవుతున్నాయి. ఇండియన్ థైరాయిడ్ ఎపిడమియాలజీ స్టడీ ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం జాతీయ స్థాయిలో 18 ఏళ్లు పైబడిన వారిలో 10.95 శాతం మంది థైరాయిడ్‌తో బాధ పడుతుంటే, వీరిలో 15.86 శాతం మంది మహిళలు, 5.02 శాతం మంది పురుషులు ఉన్నారు. హైదరాబాద్‌లో 8.88 శాతం బాధితులు ఉన్నట్లు నిర్ధారణయింది. వీరిలో 50 శాతం మందికి తమకు ఈ సమస్య ఉన్నట్లే తెలియకపోవడం గమనార్హం. కోల్‌కతా టాప్... 2012–2013లో దేశరాజధాని ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూర్, అహ్మదాబాద్, గోవా, చైన్నై, హైదరాబాద్‌ల్లో ఈ సంస్థ సర్వే నిర్వహించింది. వివిధ ప్రాంతాల్లో థైరాయిడ్ హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి, బాధితుల నుంచి వివరాలు సేకరించింది. దేశంలోనే అత్యధికంగా కోల్‌కతాలో 21.6, ఢిల్లీలో 11.07, అహ్మదాబాద్‌లో 10.6, ముంబైలో 9.6 శాతం ఉండగా... దక్షిణాది నగరాల్లో అత్యధికంగా హైదరాబాద్‌లో 8.88 శాతం బాధితులు ఉన్నట్లు తేలిందని ఉస్మానియా జనరల్ ఆస్పత్రి ఎండోక్రానాలజీ విభాగం వైద్యుడు రాకేష్సహాయ్ తెలిపారు. పౌష్టికాహార, అయోడిన్ లోపం, వాతావరణ కాలుష్యం, మానసిక ఒత్తిడే దీనికి ప్రధాన కారణమని చెప్పారు. ఏమిటీ థైరాయిడ్..! థైరాయిడ్ రెండు రకాలు. ఒకటి హైపర్ థైరాయిడిజం, రెండోది హైపోథైరాయిడిజం. గొంతు భాగంలో ఉన్న థైరాయిడ్ గ్రంథి టి3, టి4 అనే రెండు రకాల హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఇవి శరీర ఎదుగుదలకు ఉపయోగపడటంతో పాటు అవయవాల పనితీరును మెరుగు పరుస్తాయి. ఈ గ్రంథి సరిగా విధులు నిర్వర్తించనప్పుడు సమస్య ఏర్పడుతోంది. అవసరం కంటే అధికంగా హార్మోన్లను ఉత్పత్తి చేసినప్పుడు అది హైపర్ థైరాయిడిజంకు కారణమవుతోంది. అకస్మాత్తుగా బరువు పెరిగితే హైపోథైరాయిడిజంకు సంకేతం. దీన్ని గుర్తించడం కష్టం. వాహన, పారిశ్రామిక కాలుష్యం ప్రధాన కారణం... శరీరంలో అయోడిన్ మూలకం లోపంవల్ల థైరాయిడ్ వస్తుంది. 2004కు ముందు ఎక్కువ మంది ఇదే కారణంతో దీని బారిన పడేవారు. నగరంలో ఇప్పుడా పరిస్థితి లేదు. 90 శాతం మంది ఆహారంలో అయోడిన్ ఉప్పునే వాడుతున్నారు. అంతేకాకుండా భారత్‌ను ఎప్పుడో అయోడిన్ లోపాన్ని అధిగమించిన దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కానీ రకరకాల వ్యాధులకు కారణం అవుతున్న బ్యాక్టీరియా, వైరస్‌తో పోరాడాల్సిన రోగనిరోధక శక్తి... అందుకు విరుద్ధంగా అంతర్గత అవయవాలతో పోరాడుతోంది. దీనికి తోడు వాహన, పారిశ్రామిక కాలుష్యం కూడా దీనికి కారణం అవుతోంది. థైరాయిడ్‌ను సకాలంలో గుర్తించి మందులు వాడితే కొంత వరకు కాపాడుకోవచ్చు. లేదంటే ఆరోగ్యానికి నష్టం. – డాక్టర్ శ్రీనగేష్, ఎండోక్రైనాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్ వయసుల వారీగా థైరాయిడ్ బాధితుల వివరాలు (శాతాల్లో)... 18 నుంచి 35 ఏళ్లలోపు 7.53 36 నుంచి 45 ఏళ్లలోపు 12.22 46 నుంచి 54 ఏళ్లలోపు 13.11 55 ఏళ్లు పైబడిన వారిలో 11.62 -
ఈ పరిస్థితుల్లో పిల్లలు కలుగుతారా?
సందేహం నా వయసు 25 ఏళ్లు. ఎత్తు 5.4 అడుగులు. బరువు 55 కిలోలు. నాకు ఏడాది కిందట పెళ్లయింది. మేనరికం సంబంధం. త్వరలోనే పిల్లలు కావాలనుకుంటున్నాం. అయితే, నాకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తున్నాయి. పరీక్షలు జరిపిస్తే ఓవరీస్ ఎన్లార్జ్ అయ్యాయని, థైరాయిడ్ సమస్య కూడా ఉందని చెప్పారు. ఈ పరిస్థితిలో పిల్లలు కలుగుతారా? దీనికి తగిన చికిత్స ఉందా? - శ్రావణి, ఆదోని థైరాయిడ్ సమస్యల వల్ల కొందరిలో పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావడం జరుగుతుంది. దానివల్ల అండం సరిగా తయారు కాకపోవడం వల్ల పిల్లలు కలగడానికి ఇబ్బంది కావచ్చు. డాక్టర్ని సంప్రదించి థైరాయిడ్ హార్మోన్ మాత్రలు తగిన మోతాదులో క్రమం తప్పకుండా వేసుకోవాల్సి ఉంటుంది. థైరాయిడ్ హర్మోన్ కంట్రోల్ కావడంతో పాటు ఇతరత్రా హార్మోన్ల ఇబ్బందులు ఏవీ లేనట్లయితే, పీరియడ్స్ రెగ్యులర్ అయ్యి, కొద్ది కాలంలోనే గర్భందాల్చే అవకాశాలు పెరుగుతాయి. ఇక ఓవరీస్ ఎన్లార్జ్ కావడం అంటే కొందరిలో కొన్ని హార్మోన్లలో మార్పుల వల్ల ఓవరీలో ఉండే కణజాలం పెరగడం అన్న మాట. దీనినే స్ట్రోమల్ హైపర్ ప్లేసియా అంటారు. మగవారిలో ఎక్కువగా విడుదలయ్యే టెస్టోస్టిరాన్ హార్మోన్ కొందరు ఆడవాళ్లలోనూ మోతాదుకు మించి విడుదలైనప్పుడు ఇలాంటి సమస్య తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి వారిలో అవాంఛిత రోమాలు పెరగడం, మొటిమలు ఎక్కువగా రావడం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. హార్మోన్ల మార్పు వల్ల అండం తయారు కాకపోవడం, దానివల్ల గర్భందాల్చలేకపోవడం వంటి ఇబ్బందులు కలుగుతాయి. ఈ సమస్యలకు డాక్టర్ పర్యవేక్షణలో క్రమం తప్పకుండా చికిత్స తీసుకోవడం వల్ల పిల్లలు కలిగే అవకాశాలు బాగా ఉన్నాయి. మీ బరువు కూడా ఎత్తుకు తగినంతే ఉంది. మరింత బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటే చాలు. నేను ఇంటర్ చదువుతున్నాను. ఫిట్నెస్ కోసం కొన్నాళ్లుగా స్కిప్పింగ్ చేస్తున్నాను. అయితే, స్కిప్పింగ్ వల్ల బ్రెస్ట్ లూజ్ అయిపోతుందని మా ఫ్రెండ్స్ చెబుతున్నారు. స్కిప్పింగ్ వల్ల బ్రెస్ట్ లూజ్ అయిపోయే అవకాశాలు ఉంటాయా? - అను, ఈ-మెయిల్ స్కిప్పింగ్ చేయడం వల్ల రొమ్ములు సాగడమేమీ ఉండదు. స్కిప్పింగ్ చేసేటప్పుడు రొమ్ములు ఎక్కువగా కదలడం వల్ల కొందరిలో నొప్పిగా ఉండవచ్చు. రొమ్ములో ఎలాస్టిక్ టిష్యూ ఉంటుంది కాబట్టి, స్కిప్పింగ్ చేసినప్పుడు ఊగినా, తర్వాత సాధారణ స్థితికి వచ్చేస్తాయి. కాకపోతే స్కిప్పింగ్ చేసేటప్పుడు కరెక్ట్ సైజ్ సపోర్టింగ్ స్పోర్ట్స్ బ్రా వేసుకోవడం మంచిది. దానివల్ల స్కిప్పింగ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా, సౌకర్యవంతంగా ఉంటుంది. బరువు తగ్గడానికి, శరీరం నాజూకుగా ఉండటానికి స్కిప్పింగ్ మంచి వ్యాయామం. నా వయసు 16 ఏళ్లు. ఎత్తు 5.4 అడుగులు. బరువు 37 కిలోలు. నాకు పీరియడ్స్ సక్రమంగా రావడం లేదు. రెండు నెలలకోసారి వస్తున్నాయి. ఒక్కోసారి రెండు నెలలకు పైన కొన్నిరోజుల ఆలస్యం కూడా అవుతోంది. మొహం మీద మొటిమలు విపరీతంగా వస్తున్నాయి. ఈ సమస్యకు ఏమైనా మందులు ఉన్నాయా? - విజయ, నెల్లూరు నీ ఎత్తుకు కనీసం 55-60 కిలోల వరకు బరువు ఉండాలి. నువ్వు కేవలం 37 కిలోల బరువే ఉన్నావు. అంటే దాదాపు 20 కిలోల బరువు తక్కువగా ఉన్నావు. బరువు మరీ తక్కువగా ఉండటం, రక్తహీనత, థైరాయిడ్ లోపాలు వంటి కారణాల వల్ల పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. పౌష్టికాహార లోపం వల్ల నువ్వు బరువు తక్కువగా ఉండి ఉండవచ్చు. కడుపులో నులిపురుగులు ఉండటం వల్ల కూడా రక్తహీనత, బరువు పెరగకపోవడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. అలాంటి పరిస్థితిలో పీరియడ్స్ సక్రమంగా రాకపోవచ్చు. కొందరిలో అండాశయంలో నీటిబుడగలు (పాలీసిస్టిక్ ఓవరీస్) ఉండటం వల్ల కూడా పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తుంటాయి. హార్మోన్లలో మార్పుల వల్ల అవాంఛిత రోమాలు, మొటిమలు ఎక్కువగా రావడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. నీ వయసు 16 ఏళ్లు.. ఇలాంటి యుక్తవయసులో కొందరి శరీర తత్వాన్ని బట్టి మొటిమలు ఎక్కువగా రావచ్చు. ఒకసారి గైనకాలజిస్టును కలుసుకుని అవసరమైన రక్తపరీక్షలు, థైరాయిడ్, పాలీసిస్టిక్ ఓవరీస్ పరీక్షలు, ప్రోలాక్టిన్ వంటి హార్మోన్ పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలు చేయించుకుని, సమస్య ఎక్కడ ఉందో తెలుసుకుని చికిత్స తీసుకుంటే మంచిది. ఆరోగ్యంగా బరువు పెరిగేందుకు పాలు, పండ్లు, ఆకుకూరలు, పప్పులు వంటి పోషకాహారం తీసుకోవడం మంచిది. - డా॥వేనాటి శోభ లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్ -
భుజంగాసనం
భుజంగం అంటే సర్పం. ఈ ఆసనం వేసినప్పుడు ఛాతీ, మెడ, తల పెకైత్తి ఉండడంతో ఈ భంగిమ పడగ విప్పిన పామును పోలి ఉంటుంది. కాబట్టి దీనిని భుజంగాసనం అంటారు. ఇదే ఆసనాన్ని కొద్దిపాటి మార్పులతో నాలుగు రకాలుగా సాధన చేయవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది వాటిలో ఒక పద్ధతి. ఎలా చేయాలి? బోర్లా పడుకుని రెండు చేతులను (ఎడమ అరచేతి మీద కుడి అరచేతిని ఉంచాలి. ఫొటోని గమనించండి) గడ్డం కింద ఉంచుకుని కొద్ది క్షణాలు విశ్రాంతి స్థితిలో ఉండాలి. బోర్లించి ఉంచిన అరచేతులను ఛాతీ కిందకు తెచ్చుకోవాలి. ఇప్పుడు పూర్తిగా శ్వాస తీసుకుని దేహం బరువుని రెండు చేతుల మీద మోపుతూ తలను పైకి లేపాలి. ఇలానే ఉండి, నాభి దిగువ ప్రాంతం వరకు పైకి లేపాలి. ఈ స్థితిలో చేతులు నిటారుగా (మోచేతుల దగ్గర వంచకుండా) ఉండాలి, చూపు ఆకాశం వైపు ఉండాలి. రెండు కాళ్లు భుజాలకు సమాంతరంగా ఉండాలి. మనసును వీపు దిగువ భాగం మీద కేంద్రీకరించాలి. ఇలా ఉండగలిగినంతసేపు ఉన్న తర్వాత తిరిగి యథాస్థితికి రావాలి. ఇలా ప్రతిరోజూ మూడు నుంచి ఐదుసార్లు చేయాలి. ఉపయోగాలు వెన్నుపాము శక్తిమంతం అవుతుంది. వెన్నునొప్పి తగ్గిపోతుంది. ఛాతీ విశాలమవుతుంది. ఉబ్బసం వంటి శ్వాసకోశ సంబంధ వ్యాధులు తగ్గుతాయి. థైరాయిడ్ సమస్య తొలగిపోతుంది. మెడ కండరాలకు బలం వస్తుంది. గొంతు సంబంధ వ్యాధులు నయవుతాయి. స్వరం సరళతరమవుతుంది కాబట్టి గాయకులు, న్యూస్ రీడర్లు, వాయిస్ ఓవర్ ఆర్టిస్టులకు ఈ ఆసనం బాగా దోహదం చేస్తుంది. పొట్ట కండరాలు, పొట్టలోని ఇతర భాగాలు సాగడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. మలబద్దకం సమస్య కూడా తగ్గుతుంది. చేతులకు, భుజాలకు శక్తి పెరుగుతుంది. రుతుక్రమ సమస్యలు నివారణ అవుతాయి, ఇతర గర్భాశయ సమస్యలతోపాటు గర్భధారణ సమస్యలు కూడా తొలగిపోతాయి. జాగ్రత్త హెర్నియా ఉన్నవాళ్లు, భుజాలు అరిగిపోయిన వాళ్లు ఈ ఆసనాన్ని సాధన చేయరాదు. మోడల్ ఎస్. దుర్గాహర్షిత నేషనల్ యోగా చాంపియన్ ఫొటోలు: శివ మల్లాల బీరెల్లి చంద్రారెడ్డి యోగా గురువు, సప్తరుషి యోగ విద్యాకేంద్రం, హైదరాబాద్