►రోజూ నాలుగైదు తులసి ఆకులు తింటే హెపటైటిస్, థైరాయిడ్ సమస్యలు రావు.
►పంటి నొప్పితో బాధపడుతుంటే ఆ ప్రాంతంలో లవంగం పెడితే తగ్గుతుంది.
►రుతుక్రమం ముందు వచ్చే ఆరోగ్య సమస్యలు తగ్గాలంటే జింజర్లీ ఆయిల్, గుడ్డు కలిపి తినాలి.
►క్రమం తప్పకుండా రోజ్‌బెర్రీ తింటే నెలసరి బాధలనుంచి విముక్తి లభిస్తుంది.
►మలబార్ ఆకును నీళ్లలో మరిగించి రసం తీసి ఆ రసానికి గుడ్డులోని తెల్లసొన కలిపి తీసుకుంటే దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది.
►శొంఠి పొడిలో గసాల పొడి, చక్కెర కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది.
►ఆవాల పేస్టులో తేనె కలిపి తీసుకుంటే శీతాకాలంలో వదలకుండా వేధిస్తున్న దగ్గును హరిస్తుంది.
►తులసిఆకు రసం, వాము నీరు, తేనె సమపాళ్లలో కలిపి పరగడుపున తీసుకుంటే దగ్గు తగ్గిపోతుంది.
►మూత్ర సంబంధ వ్యాధులతో బాధపడుతుంటే ఒక గ్లాసు నీటిలో చిటికెడు ఏలకుల పొడి కలిపి పరగడుపునే తాగాలి.
► కడుపు నొప్పి తగ్గాలంటే జీలకర్ర పొడిలో చక్కెర కలిపి బాగా నమిలి తినాలి.
ఇంటిప్స్
Published Sat, Sep 23 2017 12:39 AM | Last Updated on Sat, Sep 23 2017 3:41 AM
Advertisement
Advertisement