ఆపరేషన్ చేసి తొలగించినా దక్కని బాలుడి ప్రాణాలు
హథ్రాస్(యూపీ): వాచీ బ్యాటరీలు, బ్లేడ్లు, మేకులు ఇలా ఇంట్లో కనిపించే చిన్నపాటి వస్తువులన్నీ 15 ఏళ్ల బాలుడి కడుపులో కనిపించేసరికి ఢిల్లీ సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి వైద్యులు అవాక్కయ్యారు. వెంటనే పెద్ద శస్త్రచికిత్స చేసి అన్నింటినీ బయటకు తీశారు. అయితే ఆ తర్వాతి రోజు బాలుడి గుండెవేగం విపరీతంగా పెరిగి, రక్తపోటు తగ్గి అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయారు. వివరాలను బాలుడి తండ్రి సంచిత్ శర్మ మీడియాతో చెబుతూ వాపోయారు.
ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రాస్ పట్టణంలోని రత్నగర్భ కాలనీలో సంచిత్ కుటుంబం ఉంటోంది. అతనికి 9వ తరగతి చదివే 15 ఏళ్ల కుమారుడు ఆదిత్య శర్మ ఉన్నాడు. గత కొద్ది రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతుండటంతో హాథ్రాస్ ఆస్పత్రిలో చూపించారు. తర్వాత జైపూర్ ఆస్పత్రిలో చూపించారు. కొద్దిరోజుల ట్రీట్‌మెంట్ తర్వాత ఇంటికొచి్చనా రోగం మళ్లీ తిరగబెట్టింది. తర్వాత అలీగఢ్‌లో శ్వాససంబంధ సర్జరీ తర్వాత కూడా ఎలాంటి మార్పు రాలేదు.
తర్వాత అక్టోబర్ 26న అలీగఢ్‌లో అ్రల్టాసౌండ్ పరీక్ష చేయగా 19 చిన్నపాటి వస్తువులు కడుపులో ఉన్నట్లు గుర్తించారు. నోయిడాలో చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించారు. నోయిడా వైద్యుల పరీక్షలో 56 వస్తువులు ఉన్నట్లు బయటపడింది. తర్వాత ఢిల్లీలోని సఫ్డర్‌జంగ్ ఆస్పత్రిలో అక్టోబర్ 27న టీనేజర్‌కు శస్త్రచికిత్స చేసి అన్నింటినీ బయటకుతీశారు. ఇన్ని వస్తువులు తెలీసో తెలీకో మింగినా నోటికిగానీ, గొంతుకుగానీ ఎలాంటి గాయలు లేకపోవడం చూసి వైద్యులు ఆశ్చర్యం వ్యక్తంచేశారు. సర్జరీ చేసిన ఒక రోజు తర్వాత టీనేజర్ మరణంపై ఆస్పత్రి వర్గాలు ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
Comments
Please login to add a commentAdd a comment