Batteries
-
ఐదు లక్షల మందితో భారత్ బ్యాటరీ షో!
రెండో విడత ‘భారత్ బ్యాటరీ షో 2025’ జనవరి 19 నుంచి 21 వరకు న్యూఢిల్లీలో నిర్వహించనున్నారు. ఇందులో భారత్‌తో పాటు అమెరికా, జపాన్, చైనా తదితర దేశాల నుంచి 100కు పైగా కంపెనీలు పాల్గోనున్నాయి. ఈ రంగంలో అధునాతన ఉత్పత్తులను ప్రదర్శించనున్నట్లు ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.సుమారు 50 దేశాల నుంచి 5,00,000 మంది పైగా సందర్శకులు దీన్ని సందర్శించనున్నట్లు ప్రభుత్వం వివరించింది. ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ (ఐఈఎస్ఏ) ఈ మెగా కార్యక్రమానికి భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఇందులో ప్రధానంగా లిథియం అయాన్ బ్యాటరీలు, బ్యాటరీ విడిభాగాలు, టెస్టింగ్ సొల్యూషన్స్, తయారీ పరికరాలు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు, బ్యాటరీ స్వాపింగ్ సొల్యూషన్స్ మొదలైన వాటిని ప్రదర్శించనున్నారు. బ్యాటరీ టెక్ పెవిలియన్, సప్లై చెయిన్ పెవిలియన్, ఛార్జింగ్ ఇన్ఫ్రా పెవిలియన్ మొదలైన ప్రత్యేక పెవిలియన్లు ఉంటాయని ఐఈఎస్ఏ ప్రెసిడెంట్ దేవి ప్రసాద్ దాష్ తెలిపారు. ఐఈఎస్ఏ జనవరి 16–17 మధ్య ఇండియా బ్యాటరీ మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై చెయిన్ సదస్సును (ఐబీఎంఎస్సీఎస్), జనవరి 18న ఇండియా బ్యాటరీ రీసైక్లింగ్ అండ్ రీ–యూజ్ సదస్సును నిర్వహించనున్నట్లు వివరించారు.ఇదీ చదవండి: ఏడేళ్లలో 600 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లువ్యాపార విస్తరణపై ఎల్అండ్టీ ఫైనాన్స్ దృష్టిఎల్అండ్టీ ఫైనాన్స్ కార్యకలాపాలు ప్రారంభించి మూడు దశాబ్దాలు పూర్తయిన నేపథ్యంలో రుణ లభ్యత, ఆర్థిక అక్షరాస్యత పెంపు, వ్యాపార విస్తరణపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు సంస్థ ఎండీ సుదీప్త రాయ్ తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంత కస్టమర్లకు ఆర్థిక సేవలు అందించేందుకు సాంకేతికతను వినియోగించుకుంటున్నట్లు వివరించారు. ప్రస్తుతం 20 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో 35,000 పైగా సిబ్బందితో కార్యకలాపాలు సాగిస్తున్నట్లు రాయ్ పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కంపెనీ రూ. 696 కోట్ల నికర లాభం నమోదు చేసింది. -
బ్యాటరీలు, బ్లేడ్లు సహా పొట్టలో 56 వస్తువులు
హథ్రాస్(యూపీ): వాచీ బ్యాటరీలు, బ్లేడ్లు, మేకులు ఇలా ఇంట్లో కనిపించే చిన్నపాటి వస్తువులన్నీ 15 ఏళ్ల బాలుడి కడుపులో కనిపించేసరికి ఢిల్లీ సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి వైద్యులు అవాక్కయ్యారు. వెంటనే పెద్ద శస్త్రచికిత్స చేసి అన్నింటినీ బయటకు తీశారు. అయితే ఆ తర్వాతి రోజు బాలుడి గుండెవేగం విపరీతంగా పెరిగి, రక్తపోటు తగ్గి అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయారు. వివరాలను బాలుడి తండ్రి సంచిత్ శర్మ మీడియాతో చెబుతూ వాపోయారు. ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రాస్ పట్టణంలోని రత్నగర్భ కాలనీలో సంచిత్ కుటుంబం ఉంటోంది. అతనికి 9వ తరగతి చదివే 15 ఏళ్ల కుమారుడు ఆదిత్య శర్మ ఉన్నాడు. గత కొద్ది రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతుండటంతో హాథ్రాస్ ఆస్పత్రిలో చూపించారు. తర్వాత జైపూర్ ఆస్పత్రిలో చూపించారు. కొద్దిరోజుల ట్రీట్మెంట్ తర్వాత ఇంటికొచి్చనా రోగం మళ్లీ తిరగబెట్టింది. తర్వాత అలీగఢ్‌లో శ్వాససంబంధ సర్జరీ తర్వాత కూడా ఎలాంటి మార్పు రాలేదు. తర్వాత అక్టోబర్ 26న అలీగఢ్‌లో అ్రల్టాసౌండ్ పరీక్ష చేయగా 19 చిన్నపాటి వస్తువులు కడుపులో ఉన్నట్లు గుర్తించారు. నోయిడాలో చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించారు. నోయిడా వైద్యుల పరీక్షలో 56 వస్తువులు ఉన్నట్లు బయటపడింది. తర్వాత ఢిల్లీలోని సఫ్డర్‌జంగ్ ఆస్పత్రిలో అక్టోబర్ 27న టీనేజర్‌కు శస్త్రచికిత్స చేసి అన్నింటినీ బయటకుతీశారు. ఇన్ని వస్తువులు తెలీసో తెలీకో మింగినా నోటికిగానీ, గొంతుకుగానీ ఎలాంటి గాయలు లేకపోవడం చూసి వైద్యులు ఆశ్చర్యం వ్యక్తంచేశారు. సర్జరీ చేసిన ఒక రోజు తర్వాత టీనేజర్ మరణంపై ఆస్పత్రి వర్గాలు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. -
ఈ స్మార్ట్ ఫోన్ల బ్యాటరీ కెపాసిటీ అదుర్స్! (ఫొటోలు)
-
భవిష్యత్తులో డిమాండ్ ఏర్పడే విభాగం..!
భారతదేశం కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీని పెంచుతోంది. ఈవీలో ప్రధానపాత్ర పోషించేది బ్యాటరీలే. వీటిలో లిథియం బ్యాటరీలను ఎక్కువగా వాడుతున్నారు. భవిష్యత్తులో వీటి సామర్థ్యం తగ్గాక తిరిగి రీసైక్లింగ్ చేసే వ్యవస్థను రూపొందించాలి. ప్రస్తుత రీసైక్లింగ్ మౌలిక సదుపాయాలు భవిష్యత్ డిమాండ్లను తీర్చలేవని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా స్థిరమైన వ్యవస్థను ఏర్పరచాలని సూచిస్తున్నారు. ఈమేరకు ప్రభుత్వం మరిన్ని స్టార్టప్‌లను ప్రోత్సహించాలని చెబుతున్నారు.కార్లలో ఉపయోగించే లిథియం అయాన్ బ్యాటరీలు సగటున 7-8 సంవత్సరాలు పనిచేస్తాయి. కస్టమర్ల వినియోగాన్ని బట్టి ఒక దశాబ్దం వరకు మన్నిక రావొచ్చు. అన్ని రకాల లిథియం అయాన్ బ్యాటరీల్లో లిథియం ఫెర్రో ఫాస్ఫేట్, నికెల్ మాంగనీస్ కోబాల్ట్ ఆక్సైడ్ (ఎన్ఎంసీ), లిథియం నికెల్ కోబాల్ట్ అల్యూమినియం ఆక్సైడ్(ఎన్సీఏ)లను విరివిగా వాడుతారు. భారత్‌లో ఈవీలు వేగంగా విస్తరిస్తున్నాయి. దాంతో ఈ దాతువుల వినియోగం పెరుగుతోంది.ఈ బ్యాటరీల తయారీలో రెండు ప్రధాన సమస్యలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకటి, బ్యాటరీల్లో వాడే రసాయన దాతువులను సంగ్రహించడం. రెండు, ఈ బ్యాటరీలను వాడిన తర్వాత భూమిలో వేస్తే కలిగే ప్రమాదాలు. ఈ సమస్యలకు ‘రిసైక్లింగ్’ పరిష్కారమని సూచిస్తున్నారు. ప్రస్తుతం రీసైక్లింగ్ పద్ధతుల్లో హైడ్రోమెటలర్జీ, పైరోమెటలర్జీ, డైరెక్ట్ రీసైక్లింగ్, ఇంటిగ్రేటెడ్ కార్బోథర్మల్ రిడక్షన్ వంటి మెకానికల్ ప్రక్రియలు అనుసరిస్తున్నారు. ఈ పద్ధతుల్లో బ్యాటరీలను కంప్రెస్ చేయడం, ముక్కలు చేయడం, ప్రత్యేక ద్రావకాలు లేదా వేడితో కరిగించి విలువైన పదార్థాలను వెలికితీస్తారు. ఈ ప్రక్రియనంతటిని ‘బ్లాక్ మాస్’ అని పిలుస్తారు. భారత్‌లో పైరోమెటలర్జీ(అధిక ఉష్ణోగ్రతల వద్ద బ్యాటరీలను కరిగించడం)తో పోలిస్తే తక్కువ ఉద్గారాలతో కూడిన హైడ్రోమెటలర్జికల్(ప్రత్యేక ద్రావణాలతో కరిగించడం) ప్రక్రియను ఎక్కువగా వాడుతున్నారు. ఇందులో దాదాపు 95 శాతం యానోడ్, కేథోడ్లను సంగ్రహిస్తున్నారు. దేశీయంగా 80% హైడ్రోమెటలర్జీ ప్రక్రియనే వాడుతున్నారు.ఇదీ చదవండి: నెట్‌వర్క్‌లో అంతరాయం.. బిల్లులో రాయితీ!అభివృద్ధి చెందుతున్న ఈవీ రంగంలో మరిన్ని స్టార్టప్‌లకు అవకాశం ఉంది. ఈవీ తయారీ వైపే కాకుండా బ్యాటరీ రీసైక్లింగ్ విభాగంలోనూ కంపెనీలు పుట్టుకొచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో రాబోయే ఈ ట్రెండ్‌ను స్టార్టప్‌లు అందిపుచ్చుకోవాలని చెబుతున్నారు. ఈవీ రంగంలో పెట్టుబడి పెట్టే వెంచర్ కాపిటలిస్ట్‌లు ఈ విభాగాన్ని కూడా గమనించాలని సూచిస్తున్నారు. -
సియోల్: బ్యాటరీల ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం.. 20 మంది మృతి
సియోల్: దక్షిణ కొరియాలోని లిథియం బ్యాటరీల ఫ్యాక్టరీలో సోమవారం(జూన్24) ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో 20 మంది మృతి చెందినట్లు సమాచారం. రాజధాని సియోల్ దక్షిణ ప్రాంతంలో ఆరిసెల్ బ్యాటరీ ప్లాంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.దాదాపు 35 వేల బ్యాటరీ సెల్స్‌ను ఉంచిన గోదాములో పేలుళ్లు జరగడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన చోట ఇప్పటివరకు 20 మృతదేహాలను అధికారులు గుర్తించారు. డజన్లకొద్దీ ఫైర్ ఇంజిన్లు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. లిథియం బ్యాటరీల నుంచి వెలువడే మంటలార్పడానికి డ్రైశాండ్‌ను వినియోగించారు. నీళ్లు ఈ మంటలను ఆర్పలేవు. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 100 మంది దాకా పని చేస్తున్నారు. వీరిలో 78 మంది ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. మంటలు అదుపులోకి రావడంతో సహాయక బృందాలు కర్మాగారం లోపలికి చేరుకొని మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ప్రమాదంపై దేశాధ్యక్షుడు యూన్‌సుక్ యోల్ స్పందించారు. మంటలను అదుపుచేయాలని అధికారులను ఆదేశించారు. కాగా, విద్యుత్ వాహనాల్లో వాడే లిథియం అయాన్ బ్యాటరీల తయారీలో సౌత్ కొరియా ముందుంది. -
ముఖానికి రాసుకునే అలోవెరాతో బ్యాటరీ సెల్స్ !
అలోవెరాని తెలుగులో కలబంద అంటాం. దీన్ని ముఖానికి, శిరోజాల సంరక్షణకు ఉపయోగిస్తుంటారు. అంతేగాదు ఆరోగ్యానికి మంచిదని ఆహారం కూడా వినియోగిస్తుంటారు. ముఖ్యంగా ఆయుర్వేదంలో ఎక్కువగా వినియోగిస్తుంటారు. అలాంటి అలోవెరాతో బ్యాటరీల తయారు చేశారు ఇద్దరు టెక్కీలు. నూటికి నూరు శాతం పర్యావరణ హితమైన బ్యాటరీలు రూపొందించి అందరిచేత శభాష్ అనిపించుకున్నారు. పైగా కేంద్ర ప్రభుత్వంచే నేషనల్ స్టార్టప్ అవార్డును కూడా అందుకున్నారు. ఎవరా టెక్కీలు..? ఎలా ఈ ఆవిష్కరణకు పూనకున్నారంటే..మనం సాధారణంగా వాడే బ్యాటరీల్లో కాడ్మియం వంటి విషపదార్థాలు ఉంటాయి. ప్రతి ఏడాది లక్షలకొద్ది బ్యాటరీ వ్యర్థాలు భూమిపై పేరుకుపోతున్నాయి. వాటివల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుంది. వాటిని ఒకవేళ మండించిన విడుదల అయ్యే వాయువుల వల్ల ప్రజలు అనారోగ్యం బారినపడతారు. దీనికి ఎలా చెక్‌పెట్టాలని ఆలోచించారు జైపూర్ బీటెక్ విద్యార్థులు నిమిషా వర్మ, నవీన్ సుమన్‌లు. ఆ దిశగా వివిధ ప్రయోగాలు చేశారు. పర్యావరణ హితమైన బ్యాటరీలు చేయాలన్నది వారి లక్ష్యం. ఆ ప్రయత్నాల్లో ఈ వినూత్న ఆలోచన తట్టింది. కలబంద పదార్థాలతో పర్యావరణ అనూకూల బ్యాటరీలను రూపొందిచొచ్చని కనుగొన్నారు. దీన్నే ఆచరణలో పెట్టి అలో ఇ సెల్ పేరుతో స్టార్టప్‌ని 2018 ఏర్పాటు చేసి.. అలోవెరాతో బ్యాటరీలను ఉత్పత్తి చేశారు. ఈ బ్యాటరీలను మార్కెట్లో రూ. 9 నుంచి రూ.10 ధరల్లో అందుబాటులో ఉంచారు. బార్సిలోనాలో ష్నెడర్ ఎలక్ట్రిక్ నిర్వహించిన ఇన్నోవేషన్ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది స్టార్ట్‌ప్‌లో ఈ ఆవిష్కరణ కూడా ఒకటి. అకడున్న వారందర్నీ ఈ ఆవిష్కరణ ఎంతగానో ఆకట్టుకుంది. అంతేగా ఈఅద్భుత ఆవిష్కరణగానూ ఆ టెక్కీలిద్దర్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ స్టార్టప్ అవార్డుతో సత్కరించింది.(చదవండి: వ్యాయామం చేయని మహిళలు తీసుకోవాల్సిన డైట్ ఇదే! ఐసీఎంఆర్ మార్గదర్శకాలు) -
టీవీ రిమోట్ పనిచేయడం లేదా..? చిట్కా మీ కోసమే..
టీవీ రిమోట్..గోడగడియారం..పిల్లల ఆటబొమ్మలు..వంటి బ్యాటరీ ఉన్న వస్తువులు కొన్నిరోజుల తర్వాత పనిచేయకపోవడం గమనిస్తుంటాం. వాటిలో ఏదైనా సాంకేతిక సమస్యా..? లేదా బ్యాటరీ పాడైందా..అనే అనుమానాలు వ్యక్తమవుతాయి. సాంకేతిక సమస్య తలెత్తితే రిపేర్ సెంటర్‌కు తీసుకెళ్తాం. కానీ బ్యాటరీ సమస్య వల్ల పనిచేయకపోతే ఎలా నిర్ధారించుకోవాలనే అంశాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.బ్యాటరీని పరీక్షించండిలా..కొత్త బ్యాటరీని సుమారు 20 సెంటీమీటర్ల(8 ఇంచులు) ఎత్తు నుంచి గట్టి ఉపరితలంపై నిటారుగా జారవిడిచినపుడు అది బౌన్స్ అవ్వదు. ఉపరితలాన్ని తాకినచోటే కిందపడడం గమనిస్తాం. కొత్త ఆల్కలీన్ బ్యాటరీల్లో రసాయన శక్తిని విద్యుత్‌శక్తిగా మార్చే జెల్ వంటి పదార్థం సమృద్ధిగా ఉంటుంది. అది పైనుంచి విసిరిన బలాన్ని నిరోదిస్తుంది. దాంతో బౌన్స్ అవ్వదు. అదే అప్పటికే వాడిన బ్యాటరీలో ఆ జెల్ పదార్థం అంతా అయిపోతుంది. కాబట్టి ఆ జెల్ ఉన్న ప్రాంతమంతా గట్టిగా మారుతుంది. దాంతో పాత బ్యాటరీను పైనుంచి విసిరినపుడు కొంత బౌన్స్ అవుతుంది. అలాజరిగితే అందులో సమస్య ఉన్నట్లు నిర్ధారణకు రావచ్చు. ఈ సాధారణ పరీక్షతో పనిచేయని ఎలక్ట్రానిక్ పరికరంలో బ్యాటరీను మారిస్తే సరిపోతుంది.ఇదీ చదవండి: వినియోగంలోకి రానున్న క్వాంటమ్ కంప్యూటింగ్ఎక్కువకాలం రావాలంటే..చిన్నపిల్లల ఆటవస్తువులు వంటి పరికరాలు ఉపయోగించనపుడు వెంటనే వాటిని స్విచ్ ఆఫ్ చేయాలి. స్టాండ్‌బై మోడ్‌లో కూడా కొన్ని పరికరాలకు ఎనర్జీ అవసరమవుతుంది. దాంతో బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది. కాబట్టి వాడిన తర్వాత వెంటనే స్విచ్ఆఫ్ చేయాలి.పరికరాలను ఎక్కువకాలం ఉపయోగించకుంటే అందులోనుంచి బ్యాటరీలను పూర్తిగా తొలగించాలి. అందువల్ల ఎనర్జీ నష్టాన్ని నివారించవచ్చు.అధిక లేదా తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న ప్రదేశాల్లో బ్యాటరీలను నిల్వ చేయరాదు. ఉష్ణోగ్రతల్లోని వ్యత్యాసం వల్ల బ్యాటరీ రసాయన ప్రక్రియలో తేడాలేర్పడుతాయి. వాతావరణంలోని భారీ ఉష్ణోగ్రతల వల్ల జెల్ సామర్థ్యం దెబ్బతింటుంది.పాత బ్యాటరీలను, కొత్తవాటిని కలిపి ఒకేచోట నిల్వచేయకూడదు. ఏదైనా పరికరంలో రెండు బ్యాటరీలు వేయాల్సివస్తే పాత బ్యాటరీ, కొత్త బ్యాటరీను కలిపి వాడకూడదు. దాంతో పాత దానివల్ల కొత్తది త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. కంపెనీలనుబట్టి కూడా సామర్థ్యాల్లో తేడాలుంటాయి. వోల్టేజ్స్థాయుల్లోనూ వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి ఒకే రకమైన బ్యాటరీలను ఉపయోగించడం మేలు. -
దేశీయంగా ఈవీ బ్యాటరీల తయారీ
న్యూఢిల్లీ: దేశీయంగా ఎలక్ట్రిక్ వాహన బ్యాటరీల తయారీని చేపట్టే దిశగా ఎక్సైడ్ ఎనర్జీ సొల్యూషన్స్‌తో దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజాలు హ్యుందాయ్, కియా జట్టు కట్టాయి. భారత్‌లో తమ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విస్తరణ ప్రణాళికలకు అనుగుణంగా ఇందుకు సంబంధించి ఎక్సైడ్ ఎనర్జీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు హ్యుందాయ్ తెలిపింది. దీని ప్రకారం లిథియం–ఐరన్–ఫాస్ఫేట్ (ఎల్ఎఫ్పీ) సెల్స్ తయారీపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు వివరించింది. స్థానికంగా తయారీ వల్ల బ్యాటరీ వ్యయాలు కొంత మేర తగ్గగలవని, తద్వారా ఇతర సంస్థలతో మరింత మెరుగ్గా పోటీపడగలమని హ్యుందాయ్ మోటర్ .. కియా ఆర్అండ్డీ విభాగం హెడ్ హుయి వాన్ యాంగ్ తెలిపారు. భారత మార్కెట్లో తమ బ్యాటరీల అభివృద్ధి, ఉత్పత్తి, సరఫరా తదితర కార్యకలాపాల విస్తరణకు ఎక్సైడ్ ఎనర్జీతో వ్యూహాత్మక భాగస్వామ్యం తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. హ్యుందాయ్ ప్రస్తుతం భారత్‌లో అయోనిక్ 5, కోనా ఎలక్ట్రిక్ వాహనాలను, కియా ఇండియా ఈవీ6 మోడల్‌ను విక్రయిస్తున్నాయి. -
ఆ బ్యాటరీలు మన నెత్తిన పడతాయా?
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం( ఐఎస్ఎస్) నుంచి మూడు టన్నుల బరువైన తొమ్మిది బ్యాటరీలు నేడు (శనివారం) భూమిపైకి దూసుకురానున్నాయి. 2021లో ఐఎస్ఎస్ నుంచి వేరుపడిన ఈ బ్యాటరీలు ఇప్పుడు భూమిపై పడనున్నాయి. దీనిపై పలువురు శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యంత బరువైన ఎక్స్పోజ్డ్ ప్యాలెట్ 9 (ఈపీ9)ను 2021, మార్చి లో అంతరిక్ష కేంద్రం నుంచి తొలగించారు. దీనిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి పైకి విసిరిన అత్యంత భారీ వస్తువుగా గుర్తించారు. ఉపయోగించిన లేదా అనవసరమైన పరికరాలను ఈ విధంగా పారవేయడం అంతరిక్ష కేంద్రంలో సాధారణంగా జరుగుతుంటుంది. ఇవి భూ వాతావరణంలో ఎటువంటి హాని లేకుండా కాలిపోతాయి. ఈపీ9 దూసుకువచ్చే ముందు జర్మనీలోని నేషనల్ వార్నింగ్ సెంటర్ పౌర రక్షణ, విపత్తు ఉపశమనం కోసం ఈ సమాచారాన్ని విడుదల చేసింది. ‘మార్చి 8 మధ్యాహ్నం నుంచి, మార్చి 9 మధ్యాహ్నం మధ్య భారీ అంతరిక్ష శకలం భూ వాతావరణంలోకి ప్రవేశించనుంది’ అని తెలిపింది. హార్వర్డ్-స్మిత్సోనియన్ సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్‌కు చెందిన ఖగోళ శాస్త్రవేత్త జోనాథన్ మెక్‌డోవెల్ చేసిన సోషల్ మీడియా పోస్ట్‌లోని వివరాల ప్రకారం ఈ ఖగోళ వ్యర్థాలు మార్చి 9న ఉదయం 7:30 నుంచి మార్చి 9 ఉదయం 3:30 మధ్య భూ వాతావరణంలోకి ప్రవేశించనున్నాయి. పలు నివేదికల ప్రకారం ఈ బ్యాటరీలు భూమికి ఎటువంటి హాని కలిగించవు. ఎందుకంటే అవి భూ వాతావరణంలోకి ప్రవేశించగానే, కాలిపోయి బూడిదగా మారతాయి. అయితే వాటిలోని కొన్ని శకలాలు భూమికి చేరవచ్చు. అయితే వీటి వలన భూమికి ఎలాంటి హాని జరగదని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చెబుతోంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంతరిక్షం నుంచి దూసుకు వస్తున్న ఈ బ్యాటరీలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. అయితే ఇవి ఎక్కడ, ఎప్పుడు పడతాయనే దానిపై పలు అంచనాలు వేస్తోంది. దీనిపై ఖచ్చితమైన సమాచారం ఏజెన్సీకి ఇంకా అందుబాటులో రాలేదు. వాతావరణం తీరుతెన్నుల కారణంగా ఈ బ్యాటరీలు భూమిపై పడే ప్రాంతాన్ని ఖచ్చితంగా చెప్పడం శాస్త్రవేత్తలకు అసాధ్యంగా మారింది. అంతరిక్షం నుంచి భూమిపైకి శకలాలు దూసుకు రావడం కొత్తేమీ కాదు. ప్రతిరోజూ ఉపగ్రహాల నుండి వ్యర్థాలు భూమిపై పడుతుంటాయి. కొన్ని వేల సంవత్సరాలుగా ఇలా జరుగుతోంది. అయితే భారీ బ్యాటరీలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి భూమికి దూసుకు వస్తున్నప్పుడు శాస్త్రవేత్తలలోనూ ఆందోళన నెలకొనడం సహజం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఇది అంతరిక్ష శాస్త్రవేత్తల పరిశోధనా కేంద్రం. ఇది అమెరికా, రష్యాతో సహా అనేక దేశాల ఉమ్మడి ప్రాజెక్ట్. శాస్త్రవేత్తల బృందం అంతరిక్ష సంబంధిత ప్రయోగాలను ఇక్కడ నిర్వహిస్తుంటుంది. అంతరిక్షంలో మరో అంతరిక్ష కేంద్రం కూడా ఉంది. దానిని చైనా నిర్మించింది. -
ఎలక్ట్రిక్ వాహనదారులకు ఊరట.. తగ్గనున్న బ్యాటరీల ధరలు!
న్యూఢిల్లీ: విద్యుత్తు వాహనం కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకిది శుభవార్తే. ఎందుకంటే విద్యుత్తు వాహనాల్లో అత్యంత ఖరీదైన భాగమైన బ్యాటరీల ధరలు తగ్గే అవకాశం ఏర్పడింది. దేశం విద్యుత్తు వాహనాల వినియోగాన్ని పెంచే లక్ష్యంలో భాగంగా బ్యాటరీలపై మరో ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకాన్ని (పీఎల్ఐ) ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ ప్రకటించారు. ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాన్ని చెప్పారు. అమ్మకాల పెరిగే బ్యాటరీల ధరలు తగ్గుతాయని మంత్రి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. అందుకే స్టోరేజీ బ్యాటరీలకు సంబంధించి పీఎల్ఐ పథకం అమలు చేస్తున్నట్టు చెప్పారు. ప్రపంచంలో బ్యాటరీల తయారీ సామర్థ్యం పరిమితంగా ఉన్నందునే ధరలు అధికంగా ఉన్నాయని, దీనికి తోడు ఒకసారి ఛార్జ్ చేస్తే ప్రయాణఙంచే దూరం కూడా తక్కువగా ఉండటం వల్లనే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం అంతగా ఊపందుకోవడం లేదని ఆయన వివరించారు. అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ) బ్యాటరీలకు రూ.18,100 కోట్లతో కేంద్ర సర్కారు 2021 మే నెలలో పీఎల్ఐ ప్రోత్సాహకాలను ప్రకటించడం గమనార్హం. దీని ద్వారా రూ.45,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలన్నది ఉద్దేశ్యం. దీని ద్వారా 50 గిగావాట్ల బ్యాటరీ స్టోరేజీ సామర్థ్యాన్ని దేశీయంగా సమకూర్చుకోవాలనే లక్ష్యంతో కేంద్రం ఉంది. ఏసీసీ అనేది బ్యాటరీ స్టోరేజీలో అత్యాధునిక టెక్నాలజీతో కూడినది. విద్యుత్‌ను ఎలక్ట్రో కెమికల్ లేదా కెమికల్ ఎనర్జీ రూపంలో నిల్వ చేసి, అవసరమైనప్పుడు తిరిగి విద్యుచ్ఛక్తి మారుస్తుంది. ఈవీల వాడకం వల్ల దేశీయంగా కాలుష్యం తగ్గుతుందని మంత్రి సింగ్ చెప్పారు. జమ్మూ కశ్మీర్లో లిథియం నిల్వలు బయటపడడాన్ని అదృష్టంగా పేర్కొన్నారు. విద్యుత్‌కు భారీ డిమండ్.. సోడియం అయాన్ బ్యాటరీలపై పరిశోధనలు జరుగుతున్నాయని, సత్పలితాలు వస్తే మంచిదని మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. ప్రత్యామ్నాయ కెమిస్ట్రీ అనేది తప్పనిసరిగా పేర్కొన్నారు. ‘‘విద్యుత్‌కు డిమాండ్ ఆగస్ట్‌లో 20 శాతం పెరిగినట్టు మంత్రి చెప్పారు. సెప్టెంబర్‌లోనూ 20 శాతం పెరిగిందని, అక్టోబర్‌లో మొదటి 14 రోజుల్లో 16 శాతం అధిక డిమాండ్ నమోదైనట్టు వెల్లడించారు. -
ఎవరెడీ అలి్టమా బ్యాటరీలు
కోల్‌కత: బ్యాటరీలు, లైటింగ్ ఉత్పత్తుల తయారీలో ఉన్న ఎవరెడీ ఇండస్ట్రీస్ అలి్టమా బ్రాండ్‌ను తిరిగి ప్రవేశపెట్టింది. జింక్ బ్యాటరీలతో పోలిస్తే అలి్టమా శ్రేణి 400 శాతం అధిక శక్తిని కలిగి ఉంటాయని కంపెనీ తెలిపింది. అలి్టమా ప్రో శ్రేణి 800 శాతం ఎక్కువ శక్తిని అందిస్తాయని వెల్లడించింది. అనుకూల రుతుపవనాల కారణంగా అక్టోబర్–మార్చి కాలంలో 13–14 శాతం వృద్ధి సాధిస్తామని ఎవరెడీ ఎండీ సువమోయ్ సాహ వెల్లడించారు. 2022–23లో 14 శాతం వృద్ధి నమోదైందన్నారు. ‘కంపెనీ అమ్మకాల్లో డ్రై సెల్ బ్యాటరీ విభాగంలో ప్రీమియం ఉత్పత్తుల వాటా 4–5 శాతం ఉంది. మూడు నాలుగేళ్లలో ఇది రెండింతలకు చేరుతుంది. నూతన ఉపకరణాల రాకతో అధిక శక్తిని అందించే బ్యాటరీలకు డిమాండ్ పెరగడమే ఈ వృద్ధికి కారణం. బ్యాటరీల విపణిలో ప్రీమియం విభాగం ఆరు శాతమే. ఏటా ఈ విభాగం 25 శాతం అధికం అవుతోంది. రూ.3,000 కోట్ల భారత బ్యాటరీల మార్కెట్లో ఎవరెడీ ఏకంగా 53 శాతం వాటా కైవసం చేసుకుంది’ అని వివరించారు. ఎవరెడీ ఇండస్ట్రీస్ జూన్ త్రైమాసికంలో రూ.363 కోట్ల టర్నోవర్‌పై రూ.24 కోట్ల నికరలాభం ఆర్జించింది. ముడి సరుకు ధరలు స్వల్పంగా తగ్గడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లాభాలు 2.5–3 శాతం మెరుగు పడతాయని కంపెనీ ఆశిస్తోంది. -
మీకు తెలుసా? టెస్లా బ్యాటరీలు ఇప్పుడు ఐవోసీఎల్ కేంద్రాల్లో..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ ఇంధన సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్) పెట్రోల్ పంపుల్లో టెస్లా పవర్ యూఎస్ఏ బ్యాటరీలను విక్రయించనున్నారు. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. విక్రయానంతర సేవలు కూడా ఉంటాయి. దేశవ్యాప్తంగా ఐవోసీఎల్కు చెందిన 36,000 పైచిలుకు పంపుల్లో టెస్లా బ్యాటరీలు లభిస్తాయి. ‘బ్యాటరీ పంపిణీ కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌తో ఇది మొదటి జాతీయ స్థాయి భాగస్వామ్యం అవుతుంది. బ్యాటరీలు తొలుత ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతంలో ఎంపిక చేసిన ఐవోసీఎల్ ఇంధన పంపుల వద్ద అందుబాటులో ఉంటాయి. తరువాత ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తాం’ అని టెస్లా పవర్ పేర్కొంది. ఇప్పటికే భారత్‌లో బ్యాటరీల విక్రయాలకు 5,000 పైచిలుకు పంపిణీ కేంద్రాలు ఉన్నాయని టెస్లా పవర్ యూఎస్ఏ ఎండీ కవీందర్ ఖురానా తెలిపారు. ఈ ఏడాది వీటిని రెండింతలు చేస్తామన్నారు. ఐవోసీఎల్ చేరికతో పంపిణీ కేంద్రాల సంఖ్య 40,000 మార్కును దాటుతుందని వివరించారు. టెస్లా పవర్ యూఎస్ఏ వాహన, సోలార్ బ్యాటరీలు, హోమ్ యూపీఎస్‌లను, వాటర్ ప్యూరిఫయర్లను విక్రయిస్తోంది. హర్యానాలోని గురుగ్రామ్‌తోపాటు యూఎస్ఏలో కార్యాలయాలు ఉన్నాయి. -
టెస్లా మెగా బ్యాటరీ ఫ్యాక్టరీ.. ఆ దేశంలో
వ్యాపార రంగంలో అమెరికా, చైనా మధ్య పోటీ తారస్థాయిలో ఉన్నప్పటికీ టెస్లా కంపెనీ సీఈఓ ఎలోన్ మస్క్ మాత్రం అవేవి ఎరగనట్టు చైనాలో వ్యాపారాన్ని విస్తరించే పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఇందులో భాగంగానే చైనాలో అతి పెద్ద బ్యాటరీ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సన్నద్ధమవుతున్నాడు. నివేదికల ప్రకారం, చైనాలోని షాంఘైలో భారీ బ్యాటరీ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి మస్క్ ముందడుగు వేశారు. ఇందులో భాగంగానే ఇక్కడ దాదాపు 10,000 మెగాఫ్యాక్ స్టోరేజీ యునిట్లను ఉత్పత్తి చేసేలా ఈ కంపెనీ నిర్మాణం చేపట్టనున్నట్లు టెస్లా ఆలోచిస్తోంది. ఇప్పటికే కాలిఫోర్నియాలో మెగా ప్లాంట్ కలిగి ఉన్న టెస్లా మరో భారీ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టనుంది. (ఇదీ చదవండి: నరేంద్ర మోదీని ఫాలో అవుతున్న మస్క్.. వైరల్ అవుతున్న నెటిజన్ల కామెంట్స్) అమెరికాలో ఉన్న టెస్లా ఫ్యాక్టరీకి అదనంగా చైనాలో ఈ కంపెనీ ప్రారంభించనున్నట్లు సీఈఓ మస్క్ వెల్లడించారు. ఈ సంవత్సరం చివరి నాటికి కొత్త ప్లాంట్ నిర్మాణం ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు మస్క్ చెబుతున్నారు. అంటే 2024 నాటికి ఇది వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని చైనా మీడియా వెల్లడించింది. చైనా ఇప్పటికే అత్యధికంగా బ్యాటరీలు ఉత్పత్తి చేసే దేశంగా కీర్తి గడించింది. దీనిని ఆసరాగా తీసుకుని టెస్లా అతి తక్కువ ధరకే బ్యాటరీలను తయారు చేయాలని సంకల్పించింది. 2019లో మొదటి సారి చైనాలో టెస్లా ఎలక్ట్రిక్ కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్ కూడా షాంఘైలో ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం సుమారు 22వేల కంటే ఎక్కువ వాహనాలు ఉత్పత్తి అవుతున్నాయి. (ఇదీ చదవండి: చదివింది ఐఐటీ.. చేసేది పశువుల వ్యాపారం.. ఆదాయం ఎంతనుకున్నార?) జర్మనీలోని బెర్లిన్ సమీపంలో ఇప్పటికే టెస్లాకు ఒక ప్లాంట్ ఉంది. ఇది కాకుండా కంపెనీ మెక్సికోలోని మాంటెర్రీలో ప్లాంట్ నిర్మించనున్నట్లు గతంలో వెల్లడించింది. అయితే ఇప్పుడు చైనాలో భారీ ప్లాంట్ ఏర్పాటుకు మస్క్ తీవ్రంగా యోచిస్తున్నాడు. నిజానికి గతంలో వాషింగ్టన్, బీజింగ్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని అమెరికా ప్రభుత్వం చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని అక్కడి సంస్థలకు సూచించింది. ఇదే సమయంలో చైనాలో కంపెనీలు ఏర్పాటు చేయాలనుకునే కొన్ని సంస్థలు వెనక్కి తగ్గాయి. ఇది ఇలాగే మరో పది సంవత్సరాలు కొనసాగే అవకాశం కూడా ఉంది. అయితే ఇప్పుడు ఈ నిబంధనలను అతిక్రమించి మస్క్ ప్లాంట్ ఏర్పాటు చేయడం విడ్డూరమే చెప్పాలి. -
ఎస్‌యూవీలతో పర్యావరణ ముప్పు
బెర్లిన్: పెద్ద కార్లతో పర్యావరణానికి సమస్య పెరుగుతోంది. కర్బన ఉద్గారాలను ఎక్కువగా ఉత్పత్తి చేయడమే ఇందుకు కారణం’ అని ప్యారిస్‌కు చెందిన ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ తెలిపింది. ఎస్యూవీ సగటు సైజు తగ్గించడం, బ్యాటరీ స్వాపింగ్ సౌకర్యాలు పెంచడం, వినూత్న బ్యాటరీ సాంకేతికతల్లో పెట్టుబడులు ఇందుకు పరిష్కారమని స్పష్టం చేసింది. ‘2022లో ప్రపంచవ్యాప్తంగా 33 కోట్ల స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ (ఎస్యూవీ) 100 కోట్ల మెట్రిక్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ను వెదజల్లాయి. ఇది జర్మనీ వంటి పారిశ్రామిక దేశ వార్షిక ఉద్గారాల కంటే ఎక్కువ. పెద్ద కార్ల వైపు మార్కెట్ మళ్లడం, తక్కువ ఇంధన సామర్థ్యం గల సంప్రదాయ వాహనాలతో చమురు డిమాండ్‌తోపాటు కర్బన ఉద్గారాలు అధికం అవుతాయి. ఎస్‌యూవీలు మినహా సంప్రదాయ కార్లు వినియోగించిన చమురు 2021, 2022లో దాదాపు సమానం. ఎస్‌యూవీల విషయంలో చమురు వాడకం రోజుకు 5 లక్షల బ్యారెల్స్ దూసుకెళ్లింది. 2022 అమ్మకాల్లో చిన్న కార్లు 10 లక్షల యూనిట్లు, ఎస్‌యూవీలు 10 లక్షల యూనిట్లు తగ్గాయి. ఎలక్ట్రిక్ వాహనాలు దాదాపు రెండింతలై 1 కోటి యూనిట్లకు చేరాయి. గతేడాది ఎలక్ట్రిక్ నాన్–ఎస్‌యూవీలు 53 లక్షల యూనిట్లు అమ్ముడైతే, ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు 55 లక్షల యూనిట్లు రోడ్డెక్కాయి. పెరుగుతున్న ఎలక్ట్రిక్ ఎస్యూవీ మార్కెట్‌తో బ్యాటరీ సరఫరా వ్యవస్థపై అదనపు ఒత్తిడి ఉంటుంది. బ్యాటరీలను తయారు చేయడానికి అవసరమైన క్లిష్ట ఖనిజాల కోసం డిమాండ్‌ను మరింత పెంచుతుంది’ అని ఏజెన్సీ వివరించింది. -
లిథియం బ్యాటరీలకు భారీ డిమాండ్.. ఏకంగా 5 రెట్లు!
ప్రపంచవ్యాప్తంగా లిథియం బ్యాటరీలకు డిమాండ్ బాగా పెరిగింది. స్మార్ట్ఫోన్ల నుంచి ల్యాప్‌టాప్‌ల వరకు, వైద్య పరికరాల నుంచి ఎలక్ట్రిక్ కార్ల వరకు అన్నింటినిలోనూ లిథియం-అయాన్ బ్యాటరీలు వినియోగం ఎక్కువైంది. అందుకే వాటి డిమాండ్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అందుకే దీన్ని ‘వైట్ గోల్డ్’ అని పిలుస్తున్నారు. గ్లోబల్ లిథియం మార్కెట్ పరిమాణం 2021లో 6.83 బిలియన్ డాలర్లుగా ఉంది. గ్రాండ్ వ్యూ రీసెర్చ్ ప్రకారం... 2022 నుంచి 2030 నాటికి దీని సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 12 శాతం పెరగనుంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ వాడకం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో లిథియం-అయాన్ బ్యాటరీలకు డిమాండ్ అదే స్థాయిలో పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలకు రాయితీలు ఇస్తుండటం లిథియం బ్యాటరీ మార్కెట్ వృద్ధికి అదనపు బూస్టర్‌గా పనిచేస్తోంది. 2030 నాటికి 5రెట్లకు పైగా.. పబ్లిక్-ప్రైవేట్ అలయన్స్ లీ-బ్రిడ్జ్ ప్రకారం... లిథియం బ్యాటరీలకు డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి ఐదు రెట్ల కంటే ఎక్కువగా పెరుగుతుందని అంచనా. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. 2021లో ప్రపంచవ్యాప్తంగా లిథియం ఉత్పత్తి లక్ష టన్నులు (90.7 మిలియన్ కిలోలు), ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 22 మిలియన్ టన్నుల (20 బిలియన్ కిలోలు) లిథియం నిల్వలు ఉన్నాయి. 2022లో చిలీలో అత్యధికంగా 9.3 మిలియన్ మెట్రిక్ టన్నుల లిథియం నిల్వలు, ఆస్ట్రేలియాలో 6.2 మిలియన్ మెట్రిక్ టన్నులు, అమెరికా వద్ద ఒక మిలియన్ మెట్రిక్ టన్నుల లిథియం నిల్వలు ఉంటాయని అంచనా తాజాగా జమ్ము కశ్మీర్లో 5.9 మిలియన్ టన్నుల లిథియం కనుగొనడంతో భారత్ కూడా లిథియం సూపర్ పవర్ క్లబ్లో చేరింది. (ఇదీ చదవండి: Thomas Lee: ప్రముఖ బిలియనీర్, ఫైనాన్షియర్ ఆత్మహత్య) 2025 నాటికి లిథియం కొరత లిథియం వినియోగంలో అత్యధిక వాటా బ్యాటరీలదే. రీచార్జబుల్ లిథియం బ్యాటరీల ఆధారితమైన ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో వృద్ధి కారణంగా గ్లోబల్ లిథియం డిమాండ్ 2025 నాటికి ఒక మిలియన్ మెట్రిక్ టన్నులకు, 2030 నాటికి రెండు మిలియన్ టన్నులకు చేరుకుంటుందని అంచనా. ఇదే క్రమంలో 2025 నాటికి ప్రపంచం లిథియం కొరతను ఎదుర్కొంటుందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ పేర్కొంటోంది. (ఇదీ చదవండి: అతిగా ఫోన్ వాడుతున్నారా.. ఈమెకు జరిగిందే మీకూ జరగొచ్చు!) -
చైనా కంపెనీ ‘స్వోల్ట్’తో జట్టు కట్టిన ఇండియన్ కంపెనీ
కోల్‌కతా: స్టోరేజీ బ్యాటరీ తయారీ సంస్థ ‘ఎక్సైడ్ ఇండస్ట్రీస్’ లిథియం అయాన్ బ్యాటరీల తయారీ దిశగా కీలక ముందడుగు వేసింది. చైనాకు చెందిన ‘స్వోల్ట్ ఎనర్జీ కంపెనీ లిమిటెడ్’తో బహుళ సంవత్సరాల సాంకేతిక సహకార ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ‘‘ఈ ఒప్పందం కింద.. లిథియం అయాన్ సెల్ తయారీకి అవసరమైన సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, టెక్నాలజీ వాణిజ్యీకరణకు అవసరమైన హక్కులు, లైసెన్స్ లభిస్తాయి. టర్న్‌కీ ప్రాతిపదికన గ్రీన్‌ఫీల్డ్ తయారీ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన సహకారాన్ని సైతం స్వోల్ట్ అందిస్తుంది. ఈ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన భూమికి సంబంధించి చర్చలు తుది దశలో ఉన్నాయి’’ అని ఎక్సైడ్ ఇండస్ట్రీస్ తెలిపింది. దేశంలో స్టోరేజీ బ్యాటరీలకు సంబంధించి కేంద్ర సర్కారు తీసుకొచ్చిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) కింద ఎక్సైడ్ ఇండస్ట్రీస్ సైతం ప్రోత్సాహకాలకు ఎంపికవడం తెలిసిందే. స్వోల్ట్‌కు ఉన్న పటిష్టమైన సాంకేతికతకుతోడు, లిథియం అయాన్ బ్యాటరీ తయారీలో ఉన్న గొప్ప అనుభవం ఆసరాగా.. మల్టీ గిగావాట్ లిథియం అయాన్ సెల్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్టు ఎక్సైడ్ తెలిపింది. -
నయా దొంగలు సెల్ టవరే లక్ష్యం.. అక్కడ ఏముంటుందని అనుకోవద్దు
కోదాడ రూరల్: సెల్ టవర్ టెక్నీషియన్లుగా పనిచేస్తూ టవర్లలో ఉండే బ్యాటరీలను చోరీ చేసి సొమ్ము చేసుకుంటున్న నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్లో బుదవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రఘు వెల్లడించిన వివరాల ప్రకారం.. కోదాడ పట్టణానికి చెందిన దీగుంట్ల లక్ష్మీనారాయణ, కోదాడ మండలం గుడిబండకు చెందిన బెజవాడ అశోక్‌కెడ్డి, చిలుకూరు మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన గన్నా భాస్కర్ కొన్నేళ్లుగా జియో టవర్ టెక్నీషియన్లుగా పనిచేస్తున్నారు. అక్రమంగా డబ్బులు సంపాదించాలనే దుర్భుద్ధితో టవర్లకు ఎవరూ కాపలా ఉండకపోవడంతో బ్యాటరీలు దొంగతనం చేయాలని పథకం రచించారు. ఈ మేరకు సెప్టెంబర్ 2019 నుంచి ఈ నెల వరకు కోదాడ పట్టణం, రూరల్ పరిధితో పాటు మునగాల, మఠంపల్లి, చిలుకూరు, మేళ్లచెర్వు, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని పలు టవర్లలో దొంగతనాలకు పాల్పడ్డారు. ఈ ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కాగా బుధవారం తెల్లవారుజామున పట్టణ పరిధిలోని మేళ్లచెర్వు రోడ్డు ఫ్లైఓవర్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆటోలో బ్యాటరీలు తరలిస్తూ ఈ ముగ్గురు పట్టుబడ్డారు. వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా మరో ముగ్గురితో కలిసి దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారని డీఎస్పీ తెలిపారు. వీరి వద్ద నుంచి రెండు ఆటోలు, ఒక వ్యాన్, రూ.2 లక్షలు, 5 బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన పట్టణ సీఐ ఏ. నర్సింహరావు, ఎస్ఐ రాంబాబు, రూరల్ ఎస్ఐ వై. సైదులు, చిలుకూరు ఎస్ఐ నాగభూషణరావు, సిబ్బందిని ఎస్పీ భాస్కరన్ అభినందించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. -
వన్‌ప్లస్ యూజర్లకు బంపర్ ఆఫర్!
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్ ఇండియా ఎంపిక చేసిన మోడల్స్ బ్యాటరీ రీప్లేస్ మెంట్ కోసం ఆఫర్ అందిస్తోంది. వన్‌ప్లస్ కంపెనీ భారతదేశంలో వన్‌ప్లస్ 3, వన్‌ప్లస్ 5 సిరీస్, వన్‌ప్లస్ 6 సిరీస్ ఫోన్ బ్యాటరీలను 50 శాతం ధరకే ఇవ్వనున్నట్లు తెలిపింది. మీ దగ్గర కనుక వన్‌ప్లస్ 3 - వన్‌ప్లస్ 6 సిరీస్ మధ్య గల ఫోన్ ఉంటే బ్యాటరీ రీప్లేస్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. కంపెనీ తన పోర్టల్ దీనికి సంబంధించిన వివరాలను పేర్కొంది. మీరు మీ మొబైల్ ఎక్కువ కాలం వాడాలి అనుకుంటే పాత మోడల్స్ బ్యాటరీ మార్చుకోవడం ఉత్తమం. కంపెనీ అధికారిక పోర్టల్ ద్వారా మీరు మీ వన్‌ప్లస్ బ్యాటరీని మార్చవచ్చు. ఇక్కడ లింక్ ఉంది. ఇక గత కొంత కాలంగా వన్‌ప్లస్ 9ఆర్ టీ స్మార్ట్ ఫోన్ తీసుకొస్తున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. లాంఛ్ కు ముందే ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్లు, ధర నెట్టింట్లో లీక్ అయ్యాయి. ఒక ప్రసిద్ధ టిప్ స్టార్ చైనీస్ మైక్రోబ్లాగింగ్ సైట్ వీబోలో ఫోన్ కు సంబంధించిన సమాచారాన్ని లీక్ చేశారు. వన్‌ప్లస్ 9ఆర్ టీ స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్ కలిగి ఉంటుందని, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని పోస్ట్ చేశారు. అలాగే, 9ఆర్ టీలో 65 డబ్ల్యు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుందని పేర్కొన్నారు.(చదవండి: చైనా దెబ్బకి పండగ సీజన్లో నో డిస్కౌంట్స్) -
ఎవరెడీ- వొడాఫోన్ ఐడియా జోరు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో బ్యాటరీల కంపెనీ ఎవరెడీ ఇండస్ట్రీస్ ఇండియా కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోపక్క ఈ ఏడాది చివరికల్లా టారిఫ్‌లను పెంచనున్నట్లు వెలువడిన వార్తలతో మొబైల్ టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. చదవండి: (వ్యాక్సిన్ ఆశలు- యూఎస్ కొత్త రికార్డ్స్) ఎవరెడీ ఇండస్ట్రీస్ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఎవరెడీ ఇండస్ట్రీస్ నికర లాభం మూడు రెట్లు ఎగసి రూ. 57 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం సైతం 7 శాతం పెరిగి రూ. 373 కోట్లకు చేరింది. ఈ కాలంలో మొత్తం వ్యయాలు 7 శాతం క్షీణించి రూ. 318 కోట్లను తాకాయి. స్టాండెలోన్ ప్రాతిపదికన నిర్వహణ లాభ మార్జిన్లు 9 శాతం నుంచి 20 శాతానికి ఎగశాయి. ఫలితాల నేపథ్యంలో ఎవరెడీ ఇండస్ట్రీస్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 10 శాతం దూసుకెళ్లి రూ. 172ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకావడం విశేషం! వొడాఫోన్ ఐడియా నష్టాలను తగ్గించుకోవడం, ఆర్థికంగా పటిష్టంకావడంపై దృష్టిపెట్టిన వొడాఫోన్ ఐడియా టారిఫ్‌లను 15-20 శాతంమేర పెంచనున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. డిసెంబర్లో పెంపును చేపట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టెలికం నియంత్రణ సంస్థ ఫ్లోర్ ధరలను నిర్ణయించనుందని, అయితే వొడాఫోన్ ఐడియా వచ్చే నెల మొదట్లోనే 25 శాతం వరకూ టారిఫ్‌లను పెంచే ప్రణాళికలు వేసినట్లు సంబంధితవర్గాలు చెబుతున్నాయి. 2016లో రిలయన్స్ జియో రంగ ప్రవేశం చేశాక టెలికం దిగ్గజాలు ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా 2019లో తొలిసారి రేట్లను పెంచినట్లు తెలియజేశాయి. ఈ నేపథ్యంలో తొలుత ఎన్ఎస్ఈలో వొడాఫోన్ ఐడియా షేరు 10 శాతం లాభపడి రూ. 10ను తాకింది. ప్రస్తుతం 6 శాతం ఎగసి రూ. 9.65 వద్ద ట్రేడవుతోంది. -
బ్యాటరీలను మింగిన చిన్నారి
సాక్షి, కర్నూలు : పిల్లలు ఆడుకునే ఫోన్ బ్యాటరీలను మింగిన చిన్నారికి ఎండోస్కోపి ద్వారా ప్రాణం పోశారు కర్నూలు వైద్యులు. చికిత్స వివరాలను కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో హెచ్ఓడీ డాక్టర్ శంకరశర్మ వెల్లడించారు. కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన 13 నెలల బి. వైష్నిక ప్రమాదవశాత్తూ చిన్న పిల్లలు ఆడుకునే ఫోన్ బ్యాటరీలు రెండింటిని మింగిందన్నారు. పాప వాంతులు చేసుకుంటూ ప్రాణాపాయ స్థితిలో ఉండగా బుధవారం గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగానికి తీసుకొచ్చారన్నారు. ఆ పాపకు ఎలాంటి శస్త్రచికిత్స, మత్తు మందు లేకుండా ఎండోస్కోపి ద్వారా బ్యాటరీలను బయటికి తీసినట్లు తెలిపారు. బ్యాటరీలను సరైన సమయంలో తీయకపోతే జీర్ణాశయంలో రంధ్రం పడి ప్రాణాపాయ స్థితి ఏర్పడే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ వెంకటరంగారెడ్డి, డాక్టర్ ప్రవీణ్‌కుమార్ రెడ్డి, డాక్టర్ అరుణ్, డాక్టర్ చౌహాన్, డాక్టర్ రేవంత్‌రెడ్డి, డాక్టర్ ధర్మేందర్త్యాగి పాల్గొన్నారు. -
భారీగా తగ్గిన ఎవరెడీ ఇండస్ట్రీస్ నికర లాభం
న్యూఢిల్లీ: బ్యాటరీలు, ఫ్లాష్లైట్లు తయారు చేసే ఎవరెడీ ఇండస్ట్రీస్ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో భారీగా తగ్గింది. గత క్యూ3లో రూ.21 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.18 లక్షలకు తగ్గిందని ఎవరెడీ ఇండస్ట్రీస్ తెలిపింది. చెన్నైలోని తిరువొత్తియూర్ ప్లాంట్‌లో కార్మికుల స్వచ్చంద పదవీ విరమణ(వీఆర్ఎస్) వ్యయాలు రూ.23 కోట్లుగా ఉండటంతో నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని వివరించింది. ఈ క్యూ3లోనే ఈ వీఆర్ఎస్ ప్రక్రియ పూర్తయిందని, ఈ భూమిని అళ్వార్‌పేట్ ప్రొపర్టీస్‌కు రూ.100 కోట్లకు విక్రయించడానికి గత డిసెంబర్లోనే ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపింది. మొత్తం ఆదాయం రూ.374 కోట్ల నుంచి రూ.388 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఈ క్యూ3లో బ్యాటరీ అమ్మకాలు 6 శాతం పెరిగాయని తెలిపింది. లైటింగ్ సెగ్మెంట్ టర్నోవర్ 11 శాతం తగ్గి రూ.88 కోట్లకు చేరిందని వివరించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఎవరెడీ ఇండస్ట్రీస్ షేర్ 0.17 శాతం తగ్గి రూ.202 వద్ద ముగిసింది. -
టయోటా– ప్యానాసోనిక్ జట్టు
టోక్యో: ఎలక్ట్రిక్ కార్లకు అవసరమైన బ్యాటరీల తయారీ కోసం జపాన్ వాహన దిగ్గజం టొయోటా కంపెనీ మరో జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం ప్యానాసోనిక్‌తో చేతులు కలుపుతోంది. ప్యానాసోనిక్‌తో కలసి 2020 నాటికల్లా ఒక జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేస్తామని, ఈ జేవీలో తమ వాటా 51 శాతంగా ఉండనున్నదని టయోటా తెలిపింది. బ్యాటరీలు కీలకం టయోటా కంపెనీ ప్రపంచ వ్యాప్త అమ్మకాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా 15% వరకూ ఉంటుంది. 2030 కల్లా ఈ వాటా 50%కి పెంచుకోవాలనుకుంటున్నట్లు టయోటా అధినేత అకియో టయోడా గతంలోనే వెల్లడించారు. ఎలక్ట్రిక్ కార్లకు బ్యాటరీలు కీలకమని టయోడా భావిస్తున్నారు. జపాన్‌లో సహజ వనరులకు సంబంధించి భారీ మార్పులేమీ లేనందున బ్యాటరీల తయారీ తమకు తప్పనిసరి అని, పుష్కలంగా బ్యాటరీల సరఫరా ఉండేలా చూడాల్సిన అవసరముందన్నారు. బ్యాటరీల రంగంలో ప్యానాసోనిక్ కంపెనీకి ప్రత్యేక సామర్థ్యాలున్నాయి. అంతర్జాతీయ ఎలక్ట్రిక్ వాహన కంపెనీ టెస్లాకు అమెరికాలో ఉన్న భారీ స్థాయి గిగా ఫ్యాక్టరీ నిర్వహణలో పాలు పంచుకోవడానికి ప్యానాసోనిక్ ఇటీవలే ఒక ఒప్పందం కూడా కుదుర్చుకుంది. -
టయోటా– ప్యానాసోనిక్ జట్టు
టోక్యో: ఎలక్ట్రిక్ కార్లకు అవసరమైన బ్యాటరీల తయారీ కోసం జపాన్ వాహన దిగ్గజం టొయోటా కంపెనీ మరో జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం ప్యానాసోనిక్‌తో చేతులు కలుపుతోంది. ప్యానాసోనిక్‌తో కలసి 2020 నాటికల్లా ఒక జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేస్తామని, ఈ జేవీలో తమ వాటా 51 శాతంగా ఉండనున్నదని టయోటా తెలిపింది. బ్యాటరీలు కీలకం టయోటా కంపెనీ ప్రపంచ వ్యాప్త అమ్మకాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా 15% వరకూ ఉంటుంది. 2030 కల్లా ఈ వాటా 50%కి పెంచుకోవాలనుకుంటున్నట్లు టయోటా అధినేత అకియో టయోడా గతంలోనే వెల్లడించారు. ఎలక్ట్రిక్ కార్లకు బ్యాటరీలు కీలకమని టయోడా భావిస్తున్నారు. జపాన్‌లో సహజ వనరులకు సంబంధించి భారీ మార్పులేమీ లేనందున బ్యాటరీల తయారీ తమకు తప్పనిసరి అని, పుష్కలంగా బ్యాటరీల సరఫరా ఉండేలా చూడాల్సిన అవసరముందన్నారు. బ్యాటరీల రంగంలో ప్యానాసోనిక్ కంపెనీకి ప్రత్యేక సామర్థ్యాలున్నాయి. అంతర్జాతీయ ఎలక్ట్రిక్ వాహన కంపెనీ టెస్లాకు అమెరికాలో ఉన్న భారీ స్థాయి గిగా ఫ్యాక్టరీ నిర్వహణలో పాలు పంచుకోవడానికి ప్యానాసోనిక్ ఇటీవలే ఒక ఒప్పందం కూడా కుదుర్చుకుంది. Toyota and Panasonic Charge Together Into Electric Car Batteries -
సౌర విద్యుత్ వైపు అడుగులు వేయాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ ఉద్యోగుల కృషితో కరెంటు కష్టాలు తగ్గాయని, సీఎం చొరవతో కొన్నాళ్లకే రాష్ట్రంలో విద్యుత్ సమస్యలను అధిగమించారని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ ఇంజనీర్స్ భవన్లో ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డుల ప్రదానోత్సవానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంధన పొదుపు పాటించిన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు గవర్నర్ అవార్డులను ప్రదానం చేశారు. ప్రతి ఒక్కరూ విద్యుత్ ఆదా చేయాలని సూచించారు. సౌర విద్యుత్ వైపు అడుగులు పడాలని, వ్యవసాయ రంగంలో సౌర శక్తి వినియోగాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. రాజ్‌భవన్‌లో వందశాతం సౌర విద్యుత్‌నే వాడుతున్నామని, వచ్చే ఏడాదికి ఇంజనీర్స్ భవనాన్ని సోలార్ ఎనర్జీ బిల్డింగ్‌గా మార్చాలని సూచించారు. కార్యక్రమంలో ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు, విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ మిశ్రా, విద్యుత్ రంగ నిపుణులు పాల్గొన్నారు. గోల్డ్ కేటగిరీలో.. కేటగిరీ: అవార్డు పొందిన సంస్థ ఇండస్ట్రీ సెక్టార్: ఐటీసీ లిమిటెడ్, భద్రాచలం గవర్నమెంట్ బిల్డింగ్ సెక్టార్: ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ కాంప్లెక్స్ బిల్డింగ్, సికింద్రాబాద్ కమర్షియల్ బిల్డింగ్ సెక్టార్: ఇన్ఫోసిస్ లిమిటెడ్ అర్బన్ లోకల్ బాడీ సెక్టార్: హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లయ్ అండ్ సివరేజ్ బోర్డు సిల్వర్ కేటగిరీలో.. ఇండస్ట్రీ సెక్టార్: థోషిబా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ (రుద్రారం) గవర్నమెంట్ బిల్డింగ్ సెక్టార్: రాజ్‌భవన్, జనరల్ పోస్ట్ ఆఫీస్ కమర్షియల్ బిల్డింగ్ సెక్టార్: టెక్ మహీంద్రా లిమిటెడ్ ట్రాన్స్పోర్ట్ సెక్టార్: ఆర్టీసీ వరంగల్ విభాగం అర్బన్ లోకల్ బాడీ సెక్టార్: జీహెచ్ఎంసీ -
నీరు + అల్యూమినియం= 1,000 కి.మీ ప్రయాణం
కాసిన్ని నీళ్లు.. ఇంకొంత అల్యూమినియం!.. ఓ కారు రయ్యి రయ్యిమని దూసుకెళ్లేందుకు..ఇవి మాత్రమే చాలని ఎవరైనా చెబితే?.. ఫక్కున నవ్వేస్తాం..అంత సీన్ లేదులే అని కొట్టిపారేస్తాం! కానీ... చెప్పేవాడు అక్షయ్ సింఘల్ అయితే? ఎవరీయన.. ఏమా కథా కమామిషు???? బెంగళూరులోని బోలెడన్ని స్టార్టప్ కంపెనీల్లో ‘లాగ్9 మెటీరియల్స్’కూడా ఒకటి. ఈ కంపెనీ సీఈవోనే అక్షయ్ సింఘల్. పట్టుమని పాతికేళ్లు కూడా నిండలేదుగానీ..ఈ రూర్కేలా ఐఐటీ విద్యార్థి బుర్రలో పుట్టిన ఐడియా మాత్రం సూపర్! కేవలం నీళ్లు, అల్యూమినియంతో విద్యుత్‌ను ఉత్పత్తి చేయగల ఓ సరికొత్త ఫ్యూయల్సెల్ బ్యాటరీని తయారు చేశాడు. ఎక్కడో ఉత్పత్తి అయిన విద్యుత్‌ను నిల్వ చేసుకోవడం కాకుండా ఈ కొత్త రకం బ్యాటరీలు అక్కడికక్కడే విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. అల్యూమినియం లాంటి అనేక లోహాలతో ఇలాంటి మెటల్ ఎయిర్ బ్యాటరీలను తయారు చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే వీటి ఖరీదెక్కువ. ఉత్పత్తి అయ్యే విద్యుత్ కూడా తక్కువగానే ఉండటంతో ఇప్పటివరకూ అవి విజయవంతం కాలేదు. అక్షయ్ సింఘల్ కంపెనీ మాత్రం ఈ సమస్యను గ్రాఫీన్‌తో అధిగమించింది. లీటర్ నీటికి 300 కి.మీ.. విద్యుత్‌తో నడిచే కార్లు మనకు కొత్త కాకపోవచ్చుగానీ.. వాటితో సమస్యలూ ఎక్కువే. బ్యాటరీ చార్జ్ చేసేందుకు ఎక్కువ సమయం పట్టడం, ఒకసారి చార్జ్ చేసుకుంటే ప్రయాణించగలిగే దూరం పరిమితంగా ఉండటంతో చాలామంది వీటి కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. గ్రాఫీన్, మెటల్ ఎయిర్ బ్యాటరీల వాడకం ద్వారా తాము ఈ సమస్యలను అధిగమించగలిగామని అక్షయ్ సింఘల్ ‘సాక్షి’కి తెలిపారు. బ్యాటరీలో వాడే అల్యూమినియం రేకులను వెయ్యి కిలోమీటర్లకు ఒకసారి మార్చుకోవాల్సి ఉంటుందని, ఒక్క లీటర్ నీరు పోసుకుంటే కనీసం 300 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు అవసరమైన విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చునని వివరించారు. ఈ బ్యాటరీలో ఉండే గ్రాఫీన్ కడ్డీ అల్యూమినియం, నీళ్ల మధ్య జరిగే రసాయన చర్య.. విద్యుత్ ఉత్పత్తికి సాయపడుతుందని పేర్కొన్నారు. ఈ కొత్త రకం బ్యాటరీని కేవలం విద్యుత్ వాహనాలకు మాత్రమే గాక.. ఇళ్లు, వాణిజ్య సంస్థల్లోనూ జనరేటర్ల మాదిరిగా వాడుకునే అవకాశం ఉందన్నారు. తాము ఇప్పటికే ఈ బ్యాటరీతో నమూనా కారు ఒకదాన్ని సిద్ధం చేసి పరీక్షిస్తున్నామని అక్షయ్ వివరించారు. ఖర్చు మాటేమిటి? నీళ్లతో పనిచేసే కారు అనగానే ఖర్చు చాలా తక్కువని అందరూ అనుకుంటారు. అయితే ప్రస్తుతానికి ఈ కారుతో ప్రయాణం ఖర్చు సాధారణ పెట్రోలు, డీజిల్ కార్లతో సమానంగానే ఉంటుంది. ఎందుకంటే ఇందులో వాడే అల్యూమినియం కారును ప్రతి వెయ్యి కిలోమీటర్లకు ఒకసారి మార్చుకోవాల్సి ఉంటుంది,. ప్రస్తుతానికి ఒక్కో అల్యూమినియం ప్లేటు ఖరీదు రూ.5,000 వరకూ ఉంది. అయితే ఈ కార్ల వాడకం పెరిగినా కొద్దీ దీని ఖరీదు గణనీయంగా తగ్గుతుందని అక్షయ్ అంటున్నారు. కేవలం 15 నిమిషాల్లోనే అల్యూమినియం ప్లేట్‌ను మార్చుకుని మళ్లీ ప్రయాణించ గలగడం ఈ కారుకు ఉన్న మరో విశేషం. అంటే చార్జింగ్ కోసం గంటల కొద్దీ వేచి చూడాల్సిన అవసరం లేదన్నమాట. లిథియం అయాన్ బ్యాటరీలతో పోలిస్తే ఈ మెటల్ ఎయిర్ బ్యాటరీల ధర సగం మాత్రమే ఉంటుందని.. ఫలితంగా ఈ కొత్త బ్యాటరీలతో నడిచే కారు ధర తక్కువగానే ఉంటుందని అక్షయ్ పేర్కొన్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్