ప్రపంచవ్యాప్తంగా లిథియం బ్యాటరీలకు డిమాండ్ బాగా పెరిగింది. స్మార్ట్‌ఫోన్‌ల నుంచి ల్యాప్‌టాప్‌ల వరకు, వైద్య పరికరాల నుంచి ఎలక్ట్రిక్ కార్ల వరకు అన్నింటినిలోనూ లిథియం-అయాన్ బ్యాటరీలు వినియోగం ఎక్కువైంది. అందుకే వాటి డిమాండ్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అందుకే దీన్ని ‘వైట్ గోల్డ్’ అని పిలుస్తున్నారు.
గ్లోబల్ లిథియం మార్కెట్ పరిమాణం 2021లో 6.83 బిలియన్ డాలర్లుగా ఉంది. గ్రాండ్ వ్యూ రీసెర్చ్ ప్రకారం... 2022 నుంచి 2030 నాటికి దీని సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 12 శాతం పెరగనుంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ వాడకం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో లిథియం-అయాన్ బ్యాటరీలకు డిమాండ్ అదే స్థాయిలో పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలకు రాయితీలు ఇస్తుండటం లిథియం బ్యాటరీ మార్కెట్ వృద్ధికి అదనపు బూస్టర్‌గా పనిచేస్తోంది.
2030 నాటికి 5రెట్లకు పైగా..
పబ్లిక్-ప్రైవేట్ అలయన్స్ లీ-బ్రిడ్జ్ ప్రకారం... లిథియం బ్యాటరీలకు డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి ఐదు రెట్ల కంటే ఎక్కువగా పెరుగుతుందని అంచనా. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. 2021లో ప్రపంచవ్యాప్తంగా లిథియం ఉత్పత్తి లక్ష టన్నులు (90.7 మిలియన్ కిలోలు), ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 22 మిలియన్ టన్నుల (20 బిలియన్ కిలోలు) లిథియం నిల్వలు ఉన్నాయి.
2022లో చిలీలో అత్యధికంగా 9.3 మిలియన్ మెట్రిక్ టన్నుల లిథియం నిల్వలు, ఆస్ట్రేలియాలో 6.2 మిలియన్ మెట్రిక్ టన్నులు, అమెరికా వద్ద ఒక మిలియన్ మెట్రిక్ టన్నుల లిథియం నిల్వలు ఉంటాయని అంచనా తాజాగా జమ్ము కశ్మీర్‌లో 5.9 మిలియన్ టన్నుల లిథియం కనుగొనడంతో భారత్ కూడా లిథియం సూపర్ పవర్ క్లబ్‌లో చేరింది.
(ఇదీ చదవండి: Thomas Lee: ప్రముఖ బిలియనీర్, ఫైనాన్షియర్ ఆత్మహత్య)
2025 నాటికి లిథియం కొరత
లిథియం వినియోగంలో అత్యధిక వాటా బ్యాటరీలదే. రీచార్జబుల్ లిథియం బ్యాటరీల ఆధారితమైన ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో వృద్ధి కారణంగా గ్లోబల్ లిథియం డిమాండ్ 2025 నాటికి ఒక మిలియన్ మెట్రిక్ టన్నులకు, 2030 నాటికి రెండు మిలియన్ టన్నులకు చేరుకుంటుందని అంచనా. ఇదే క్రమంలో 2025 నాటికి ప్రపంచం లిథియం కొరతను ఎదుర్కొంటుందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ పేర్కొంటోంది.
(ఇదీ చదవండి: అతిగా ఫోన్ వాడుతున్నారా.. ఈమెకు జరిగిందే మీకూ జరగొచ్చు!)
Comments
Please login to add a commentAdd a comment