Lithium ion batteries
-
పానాసోనిక్ 4680 బ్యాటరీ: ఎక్కువ రేంజ్ కోసం..
జపాన్‌కు చెందిన పానాసోనిక్ కంపెనీ 4680 లిథియం అయాన్ బ్యాటరీ సెల్‌లను భారీగా ఉత్పత్తి చేయడానికి సన్నద్ధమైంది. ఎలక్ట్రిక్ వాహనాల పరిధిని (రేంజ్) పెంచడానికి ఈ కంపెనీ వీటిని తయారు చేయడానికి పూనుకుంది. ఈ బ్యాటరీల వినియోగంతో ఖర్చు కూడా తగ్గుతుందని తెలుస్తుంది.సాధారణంగా ఇప్పటి వరకు చాలా ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించిన 2170 సెల్స్ 21 మిమీ వ్యాసం, 70 మిమీ పొడవు (0.83 x 2.8 ఇంచెస్) ఉంటుంది. అయితే 4680 సెల్స్ మాత్రం 46 x 80 మిమీ (1.8 x 3.1 ఇంచెస్) వద్ద చాలా లావుగా, కొంచెం పొడవుగా ఉంటాయి. అంతే వీటి పనితీరు కూడా చాలా ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది.4680 సెల్స్ పరిమాణంలో లావుగా ఉండటం వల్ల.. చిన్న సెల్స్ కంటే కూడా ఐదు రెట్లు ఎక్కువ పవర్ డెలివరీ చేస్తాయి. వీటిని ఎలక్ట్రిక్ వాహనాల్లో వినియోగించినప్పుడు రేంజ్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వినియోగదారుడు పీక్ పవర్ ఆశించవచ్చు. ఛార్జింగ్ కూడా చాలా వేగంగా ఉంటుంది. టెస్లా 2020 బ్యాటరీ డేలో ప్రకటించిన సెల్ కూడా ఇదే పరిమాణంలో ఉంది.ఇదీ చదవండి: పసిడి పరుగు.. భారీగా పెరిగిన బంగారం ధరలు పానాసోనిక్ కంపెనీ 4680 బ్యాటరీల ఉత్పత్తిని త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది మార్చి నాటికి 400 మంది సిబ్బంది దీనికోసం పనిచేయనున్నట్లు సమాచారం. సంస్థ ఈ సెల్స్ ఉత్పత్తి చేసి టెస్లా, లూసిడ్, టయోటా, ఫోర్డ్ వంటి కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. -
'నేను విశ్వసిస్తున్నాను.. భారత్ సాధిస్తుంది'
భారతీయ ఆటోమొబైల్ రంగం దినదినాభివృద్ధి చెందుతోంది. దేశాభివృద్ధికి తయారీ రంగం కీలకమని రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి పేర్కొన్నారు. అంతే కాకుండా భారత్ లిథియం-అయాన్ బ్యాటరీలను ఎగుమతి చేసే స్థితికి చేరుకుంటుందని.. న్యూఢిల్లీలో జరిగిన సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) 64వ సదస్సులో నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.ఇప్పటికే భారత్ ఫ్యూయెల్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో వేగంగా ముందుకు సాగుతోంది. కాబట్టి రానున్న రోజుల్లో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు ఇండియా.. లిథియం అయాన్ బ్యాటరీలను ఎగుమతి చేయగలదని తాను విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. అదే సమయంలో, అల్యూమినియం, ఐరోనిక్ ఆయిల్, వివిధ రకాల రసాయన పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. ఇది దేశంలో మంచి మార్కెట్ అని గడ్కరీ అన్నారు.కొన్ని కంపెనీలు ఇప్పుడు లిథియం-అయాన్ బ్యాటరీ తయారీలోకి ప్రవేశిస్తున్నాయి. కాబట్టి తప్పకుండా భారత్ వీటిని ఎగుమతి చేయగలదు. కరోనా మహమ్మారి సమయంలో సెమికండక్టర్ల కొరత వల్ల ఆటోమొబైల్ రంగం కొంత డీలా పడింది. ఆ తరువాత మనదేశంలోని కంపెనీలు సెమికండక్టర్లను తయారు చేయడానికి పూనుకున్నాయి. మరో రెండేళ్లలో సెమీకండక్టర్ల తయారీలో మనమే నెంబర్‌వన్‌గా ఉంటామని గడ్కరీ అన్నారు.దేశంలో ఈవీ మార్కెట్ఎలక్ట్రిక్ వాహన ఉత్పత్తిలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ విభాగంలో 2030 నాటికి కోటి యూనిట్ల వార్షిక విక్రయాలు సాధ్యమవుతుంది. ఇందులో ఐదు కోట్ల ఉద్యోగాలు రానున్నాయి. ఎగుమతులు కూడా పెరగాలని, దీనివైపుగా కంపెనీలు కృషి చేయాలని గడ్కరీ సూచించారు.ఇదీ చదవండి: హైడ్రోజన్ ఉత్పత్తిలో అగ్రస్థానం!.. నితిన్ గడ్కరీవాహన తయారీకి సంబంధించి మెరుగైన పరిశోధన, పరీక్షల కోసం టెస్టింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికోసం సీఐఐటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రూ. 450 కోట్లతో పూణేలో ప్రారంభమవుతుంది. మరోవైపు స్క్రాపేజ్ విధానానికి కంపెనీలు సహకరించాలని ఆయన అన్నారు. భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడం, ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న ప్రధాన మంత్రి దార్శనికతను సాకారం చేయడంలో ఆటోమొబైల్ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుందని గడ్కరీ పేర్కొన్నారు. -
కుక్కలతో ఈ డేంజర్ కూడా ఉంది, ఈ వీడియో చూడండి!
పెంపుడు జంతువు అనగానే ప్రధానంగా గుర్తొచ్చేది కుక్క. విశ్వాసానికి మారు పేరు. యజమానికోసం, కుటుంబ రక్షణ కోసం తన ప్రాణాల్ని ఫణంగా పెడుతుంది. కానీ ఇవి తెలిసీ తెలియక కొన్ని ప్రమాదాలను కొన్ని తెచ్చుకుంటాయి. అజాగ్రత్తగా ఉంటే ఒక్కోసారి వీటి వల్ల ప్రమాదం కూడా పొంచి ఉంది. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ అమెరికాలోని అగ్నిమాపక విభాగం ఒక షాకింగ్ వీడియోను విడుదల చేసింది. అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించింది. అసలు విషయం ఏమిటంటే.. సాధారణగా పెంపుడు కుక్కలు ఇంట్లో ఏదో ఒక వస్తువును నములుతూ ఉంటాయి. రబ్బర్ వస్తువులు, చెప్పులను కొరికి, కొరికి అవతల పాడేస్తాయి. ఆఖరికి పరుపులు, దిండ్లను కూడా నాశనం చేస్తాయి. అలాగే వైర్లు, ఎలక్ట్రిక్ పరికరాలను నోట్లో పెట్టుకుని ప్రమాదాల్ని కొని తెచ్చుకుంటూ ఉంటాయి. అమెరికాలోని, ఓక్లహోమా రాష్ట్రంలోని తుల్సా నగరంలో అలాంటిదే జరిగింది. ఒక గదిలో రెండు కుక్కలు, పిల్లి ఉన్నాయి. ఇందులో ఓ కుక్క పోర్టబుల్ లిథియం, అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో ఆడలాడుకుంటూ గలాటా సృష్టించింది. ఒక్కసారిగా ఆ బాటరీ ఒక్కసారిగా పేలడంతో గదిలో మంటలంటుకున్నాయి. దీంతో భయపడిన మిగిలిన రెండూ అక్కడినుంచి తప్పించుకున్నాయి. గదిలోని ఇండోర్ మానిటరింగ్ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.NEW: Dog starts a house fire in Tulsa, Oklahoma after chewing through a portable lithium-ion battery. The Tulsa Fire Department released the following video to warn people about the "dangers of lithium-ion batteries." Two dogs and a cat were filmed hanging out before one… pic.twitter.com/skTb8YEzJ6— Collin Rugg (@CollinRugg) August 6, 2024 "లిథియం-అయాన్ బ్యాటరీల ప్రమాదాల" గురించి ప్రజలను హెచ్చరించడానికి తుల్సా అగ్నిమాపక విభాగం క్రింది వీడియోను ఎక్స్‌లో షేర్ చేసింది. వీటిని పవర్అనియంత్రితంగా విడుదలైతే, వేడిని ఉత్పత్తి చేస్తుంది, మండే , విషపూరిత వాయువులను ఉత్పత్తి చేస్తుంది ,పేలుళ్లకు కూడా దారితీస్తుందని హెచ్చరించింది. కాగా లిథియం అయాన్ బ్యాటరీ అనేది రీచార్జ్ చేసుకొనే బ్యాటరీ. వీటిని సాధారణంగా తేలికపాటి ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎలక్ట్రిక్ వాహనాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు కానీ ఇవి మండే స్వభావం కలిగిన ఎలక్ట్రోలైట్లు కలిగి ఉంటాయి. అందుకే ఒక్కోసారి ప్రమాదకరంగా పరిణమించవచ్చు. ఈ బ్యాటరీలు పాడైనా, లేదా సరైన పద్ధతుల్లో చార్జింగ్ చేయకపోయినా మండిపోవచ్చు, లేదా పేలిపోవచ్చు. సో.. బీ కేర్‌ఫుల్. -
లిథియం బ్యాటరీ ఫ్యాక్టరీలో పేలుడు
సియోల్: దక్షిణ కొరియాలోని లిథియం బ్యాటరీ తయారీ కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదంలో 22 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఎనిమిది మంది గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం దేశరాజధాని సియోల్ దగ్గర్లోని హవాసియాంగ్ సిటీలో ఎరీసెల్ కంపెనీకి చెందిన లిథియం బ్యాటరీ ఫ్యాక్టరీ ఉంది. సోమవారం ఉదయం 10.30గంటలపుడు 102 మంది కార్మికులు పనిచేస్తున్న సమయంలో అక్కడి కొన్ని బ్యాటరీలు పేలాయి. దీంతో రెండో అంతస్తుల్లో మంటలంటుకుని ఫ్యాక్టరీలో దావానంలా వ్యాపించాయి. దీంతో 22 మంది అగి్నకి ఆహుతయ్యారు. వీరిలో 18 మంది చైనా కార్మికులు ఉన్నారు. తయారైన బ్యాటరీలను తనిఖీచేసి ప్యాక్ చేస్తుండగా ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. అయితే పేలుడుకు ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అని అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఒకరి జాడ తెలీడంలేదు. ఘటనాస్థలిని ప్రధాని హాన్ డ్యూక్ సో సందర్శించారు. -
Anupam Kumar: 'మినీ మైన్స్'తో.. క్లీన్ ఎనర్జీ అండ్ క్లైమెట్ చేంజ్..
‘లో కాస్ట్ – జీరో వేస్ట్’ నినాదంతో ‘మినీ మైన్స్’ స్టార్టప్‌కు శ్రీకారం చుట్టారు అనుపమ్ కుమార్, అరవింద్ భరద్వాజ్. ఈ–వ్యర్థాల నుంచి లిథియం ఎక్స్ట్రాక్షన్ చేస్తూ ఎలక్ట్రిక్ వెహికిల్(ఈవి) పరిశ్రమకు ఖర్చులు తగ్గిస్తున్నారు. దిగుమతులకు ప్రత్నామ్యాయంగా స్వావలంబనకు ప్రాధాన్యత ఇస్తూ విజనరీ ఫౌండర్స్‌గా పేరు తెచ్చుకున్నారు.. ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ)కి సంబంధించి అతి పెద్ద ఖర్చు లిథియం–అయాన్ బ్యాటరీ. మన దేశంలో లిథియం వోర్ తక్కువగా ఉంది. దీంతో దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి. మరోవైపు చూస్తే ఎలక్ట్రిక్ వాహనాలు, మొబైల్ ఫోన్లు, లాప్టాప్ల బ్యాటరీలకు సంబంధించి ఈ–వ్యర్థాలు కొండలా పేరుకు పోయాయి. ఈ కొండల్లో నుంచి లిథియం వెలికి తీయగలిగితే నికెల్, కోబాల్టును సేకరించగలిగితే దిగుమతులపై అతిగా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. బ్యాటరీల ఖర్చు తగ్గుతుంది. బెంగళూరు కేంద్రంగా అనుపమ్ కుమార్, అరవింద్ భరద్వాజ్లుప్రారంభించిన ‘మినీ మైన్స్’ మన దేశంలోని ఈ–వ్యర్థాల నుంచి లిథియం, నికెల్, కోబాల్ట్‌లను సేకరించి వాటిని బ్యాటరీ తయారీదారులకు విక్రయిస్తుంది. మైనింగ్ కంటే లీ–అయాన్ బ్యాటరీల నుండి భాగాలను వెలికితీయడం మంచి రాబడి ఇస్తుంది. ఒక టన్ను లిథియం ఖనిజాన్ని తవ్విప్రాసెసింగ్ చేయడం వల్ల 2–3 కిలోల లిథియం లభిస్తుందని, ఒక టన్ను బ్యాటరీలను రీసైక్లింగ్ చేయడం వల్ల 20–30 కిలోల లిథియం లభిస్తుందని, నీటిని ఆదా చేస్తుందని, కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గిస్తుందని అంటున్నారు అనుపమ్, అరవింద్. ‘మన దేశంలోని స్పెంట్ బ్యాటరీల నుంచి 66 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలకు సరిపడా లిథియం అయాన్, నికెల్, కోబాల్ట్‌లను వెలికితీయవచ్చు’ అంటున్నాడు అనుపమ్ కుమార్. మొబైల్ ఫోన్, బటన్ సెల్స్, ల్యాప్‌టాప్ బ్యాటరీల తయారీకి కూడా లి–అయాన్‌ను ఉపయోగిస్తారు. లిథియం కార్బోనేట్‌ను ఫార్మాస్యూటికల్ రంగంలో, గ్లాస్ మాన్యుఫాక్చరింగ్లో ఉపయోగిస్తారు. బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కెమికల్ ఇంజనీరింగ్ చేసిన అనుపమ్ కుమార్ బాబా ఆటోమిక్ రిసెర్చ్ సెంటర్లో కెరీర్ప్రారంభించాడు. అక్కడ రియాక్టర్ల వ్యర్థాల నుంచి యురేనియం, నికెల్లను వేరు చేసేవాడు. ‘లాగ్9 మెటరీయల్స్’లో అనపమ్, అరవింద్ భరద్వాజ్‌లకు పరిచయం జరిగింది. అక్కడ భరద్వాజ్ లిథియం–అయాన్ బ్యాటరీస్ డివిజన్ హెడ్‌గా ఉండేవాడు. వీరి మధ్య జరిగిన సంభాషణల్లో ‘యురేకా’ మూమెంట్ ఆవిష్కారం అయింది. అది ‘మినీ మైన్స్’ స్టార్టప్ అయింది. తమ పొదుపు మొత్తాలు 6.5 కోట్లతో కంపెనీప్రారంభించారు. మినీమైన్స్ టెక్నాలజీని నీతి ఆయోగ్ ధృవీకరించింది. ఆయిల్ ఇండియా లిమిటెడ్, ది యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లు గ్రాంట్ ఇచ్చాయి. ‘ఎలక్ట్రిక్ వెహికిల్స్ రంగం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో మినీ మైన్స్ విలువైన లోహాలను పునర్వినియోగ రూపంలో ఈవీ పరిశ్రమకు మేలు చేస్తుంది’ అంటున్నాడు ఆవాజ్ ఫౌండేషన్ కన్వీనర్ సుమైరా అబ్దులాలీ. కమాడిటీ సేల్స్, లైసెన్సింగ్/రాయల్టీ....మొదలైన వాటితో కంపెనీకి సంబంధించిన రెవెన్యూ మోడల్‌ను రూపొందించుకుంది మినీ మైన్స్. ‘ఈ–వ్యర్థాలను రీసైకిల్ చేయగలిగితే మన దేశం మరింత స్వావలంబన దిశగా పయనించడమే కాదు ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమకు ఖర్చును తగ్గించవచ్చు అనుకున్నాం’ అంటాడు కంపెనీ సీయివో అనుపమ్ కుమార్. అతడి మాటలు వృథా పోలేదు అని చెప్పడానికి ‘మినీ మైన్స్’ సాధించిన విజయమే సాక్ష్యం. ఇవి చదవండి: Shambhavi Choudhary: అతి చిన్న వయసు దళిత అభ్యర్థి -
భారత్‌లో భారీ నిక్షేపాలు.. తేలిగ్గా, దృఢంగా మార్చే ధాతువు
జమ్ము కశ్మీర్లో లిథియం గనులు బయటపడిన విషయం తెలిసిందే. దక్షిణాన కర్ణాటకలోని మండ్యలో దాదాపు 1600 టన్నుల లిథియం నిక్షేపాలున్నట్లు కొన్ని వార్తా కథనాల ద్వారా తెలిసింది. అయితే ఏంటీ.. అదేమన్నా బంగారమా? అంటారా.. బంగారం కన్నా ఎక్కువే. చేతిలోని స్మార్ట్‌ఫోన్, కొత్తగా కొనుక్కున్న ఎలక్ట్రిక్ కారు, ఇంటి పైకప్పుమీది సోలార్ పవర్ యూనిట్..చివరికి పంటలకు వాడే ఎరువుల వరకూ లిథియం అవసరం లేని రంగం లేదు. దాంతో ఏటా వేలకోట్లు వెచ్చించి విదేశాల నుంచి కొనుక్కుంటున్నాం. అలాంటిది తాజాగా మనదేశంలోనే దాని నిక్షేపాలు బయటపడుతుండటం విశేషం. కరెంటు లేకపోయినా సెల్ ఫోను పనిచేస్తుంది. కారణం అందులో బ్యాటరీ ఉంటుంది. ఫోను ఒక్కటే కాదు; ల్యాప్‌టాప్, డిజిటల్ కెమెరా, ఎమర్జెన్సీ లైట్, పిల్లల బొమ్మలు, ఎలక్ట్రిక్ స్కూటర్, రోబో క్లీనర్.. ఇలా ప్రస్తుతం వాడే మరెన్నో పోర్టబుల్, స్మార్ట్ పరికరాలను చార్జింగ్ చేస్తూనే ఉంటారు. కరెంట్ ప్రతి సమయాల్లో, ప్రతి ప్రదేశాల్లో అందుబాటులో ఉండకపోవచ్చు. పైగా ఎక్కడికంటే అక్కడికి వెంట తీసుకెళ్లడమూ సాధ్యం కాదు. అందుకే బ్యాటరీల రూపంలో ఇంధనాన్ని నిల్వ చేస్తున్నారు. ఆ బ్యాటరీలు కూడా కొంతకాలం క్రితం వరకూ పెద్దసైజులో చాలా బరువుగా ఉండేవి. వాటిని తేలికగా ఉండేలా చేయడమే కాకుండా స్మార్ట్ ఫోన్ నుంచి విద్యుత్ వాహనాల వరకూ విప్లవాత్మకమైన మార్పులకు రంగాన్ని సిద్ధం చేసింది లిథియం అయాన్ బ్యాటరీలే. రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే గుణం లిథియంకి ఉంది. కొత్తలో పెద్దసైజులో తయారైన మొబైల్ ఫోను ఇప్పుడు చేతిలో ఇమిడేలా చిన్నగా వచ్చిందంటే అది లిథియంతో తయారవడమే అందుకు కారణం. కారుకి లెడ్ యాసిడ్ బ్యాటరీ వాడితే అది 4000 కిలోల బరువు ఉంటుంది. అదే లిథియం బ్యాటరీ అయితే 600 కిలోలే. అంత తేడా ఉంది కాబట్టే ఈ లోహానికి ఒక్కసారిగా బోలెడు ప్రాధాన్యం లభించింది. అసలేమిటీ లిథియం? ఇనుము, బంగారం, వెండిలాగే ఇదీ ఒక లోహం. ‘లిథోస్’ అంటే గ్రీకు భాషలో ‘రాయి’ అని అర్థం. చూడటానికిది వెండి రాయి లాగా కన్పిస్తుంది కానీ మెత్తగా ఉంటుంది. మండించినప్పుడు ఎర్రని మంట వస్తుంది. ఈ లోహాన్ని 1790లో బ్రెజిల్ దేశస్థుడు కనిపెట్టాడు. ఆ తర్వాత పలువురు రసాయన శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల ఫలితంగా ముడిఖనిజం నుంచి లిథియంని వేరుచేసే విధానాన్ని తెలుసుకున్నారు. వివిధ రూపాల్లో లభ్యం సహజంగా ఇది వెండి రంగులోనే ఉన్నప్పటికీ ఆక్సీకరణ వల్ల బూడిదరంగులోకి మారుతుంది. మంచి ఉష్ణ, విద్యుత్ వాహకం కూడా. చురుగ్గా స్పందిస్తుంది. నీటితో చర్య జరిపే గుణం ఉన్నందున ప్రకృతిలో లిథియం రూపంలో కాకుండా ఇతరపదార్థాలతో కలిసి భూమిమీదా, సముద్రంలోనూ ఇది దొరుకుతుంది. మండే స్వభావం ఉన్నందువల్ల దీన్ని ఏదైనా ఒక హైడ్రో కార్బన్ ద్రవంలో కానీ పెట్రోలియం జెల్లీలో కానీ ఉంచి భద్రపరుస్తారు. మెత్తగా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించడం సులువు. వెలికితీయడం సవాలే.. ముడి లిథియంను బయటకు తీయడం అంత తేలికైన పనేమీ కాదు. వాణిజ్యపరంగా లిథియంని కార్బొనేట్ రూపంలో ఎక్కువగా ఉత్పత్తి చేస్తారు. అయితే మామూలుగా ఇది గనుల్లో రెండు రకాలుగా దొరుకుతుంది. సోడియం క్లోరైడ్‌తో కలిసి ఉంటే ఆ ద్రవం ఆవిరైపోయి లిథియం మిగిలేవరకూ విశాలమైన మైదానంలో మడులు కట్టి ఆరబెడతారు. సముద్రతీరాల్లో ఎక్కువగా ఈ రూపంలో లభిస్తుంది. మనదేశంలో బాక్సైట్‌తో కలిసి రాళ్ల రూపంలో ఉంది. దాన్ని ఓపెన్ మైనింగ్ తరహాలో లోతుగా గోతులు తవ్వి వెలికి తీయాలి. అందుకోసం పరిసర ప్రాంతాల్లోని చెట్లన్నీ తొలగించాల్సి ఉంటుంది. తర్వాత దాన్ని శుద్ధి చేసే ప్రక్రియలో పెట్రోలు లేదా డీజిల్ ఉపయోగిస్తారు. ప్రయోజనాలివే.. అల్యూమినియం, రాగి లాంటి వాటి సామర్థ్యాన్ని పెంచడానికి లిథియం లోహాన్ని ఉపయోగిస్తారు. వివిధ పరికరాల్లో ఒకదానినొకటి రాసుకుంటూ కదిలే భాగాల మధ్య రాపిడిని తగ్గించే శక్తి లిథియంకి ఉండడంతో గ్రీజు లాంటి కందెనల తయారీలో వాడతారు. పింగాణీ, గాజు లాంటి వాటి మెల్టింగ్ పాయింట్‌ని తగ్గించే సామర్థ్యం లిథియంకి ఉంది. వాటి నాణ్యతనీ సామర్థ్యాన్నీ పెంచగలదు. దీన్ని ఆయా వస్తువుల తయారీ పరిశ్రమల్లో, శీతలీకరణ యంత్రాల్లో ఎక్కువగా వాడతారు. లిథియంని ఇతర లోహాలతో కలిపినప్పుడు తయారయ్యే మిశ్రధాతువులు చాలా తేలిగ్గానూ దృఢంగానూ ఉంటాయి. విమానాలూ అంతరిక్షనౌకలకు సంబంధించిన విడిభాగాల తయారీలో ఈ మిశ్రధాతు ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. రక్షణ సంబంధ పరికరాల్లోనూ, సైకిల్ ఫ్రేములూ, వేగంగా ప్రయాణించే రైళ్ల తయారీలో కూడా దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. తలనొప్పి, మూర్ఛ, మధుమేహం, కాలేయ, మూత్రపిండ వ్యాధులకు సంబంధించిన ఔషధాల్లోనే కాక బైపోలార్ డిజార్డర్, కుంగుబాటు, స్కిజోఫ్రెనియా లాంటి మానసిక రుగ్మతలకు వాడే పలు మందుల్లోనూ లిథియం ఉంటుంది. ఇదీ చదవండి.. అరచేతిలో ఇమిడే గాలి పంపు.. వీడియో వైరల్ రీచార్జబుల్ కాని, వాడి పారేసే మామూలు బ్యాటరీల్లో(టీవీ, ఏసీ రిమోట్లలో వాడేలాంటివి) కూడా లిథియం ఉంటుంది. ఎరువుల తయారీలో సూక్ష్మపోషకంగా దీన్ని వాడతారు. -
ఐదు నిమిషాల ఛార్జ్‌తో 482 కిమీ రేంజ్ అందించే బ్యాటరీ
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచంలోని చాలా దేశాలు శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే పెట్రోల్, డీజిల్ వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలుగా మారుతున్నాయి. పెరుగుతున్న కొత్త ఈవీల సంఖ్యకు తగ్గట్టుగా ఛార్జింగ్ సదుపాయాలు అందుబాటులో లేదు, కొన్ని దేశాల్లో ఉన్నప్పటికీ ఛార్జింగ్ కోసం గంటలు తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. ఛార్జింగ్ సమస్యలకు చెక్ పెట్టడానికి.. అమెరికాలోని కార్నెల్ యూనివర్శిటీ పరిశోధక బృందం ఓ సరికొత్త లిథియం బ్యాటరీని అభివృద్ధి చేసింది. ఈ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ కావడానికి పట్టే సమయం కేవలం ఐదు నిమిషాలే కావడం గమనార్హం. ఒక ఛార్జ్‌తో ఈ బ్యాటరీ 300 మైళ్లు లేదా 482 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో వినియోగంలో ఉన్న చాలా వాహనాలకు ఫాస్ట్ ఛార్జర్ అవకాశాలు ఉన్నప్పటికీ.. బ్యాటరీ ఫుల్ ఛార్జ్ కావడానికి కనీసం 30 నిమిషాల సమయం పడుతుంది. అయితే అమెరికన్ యూనివర్సిటీ బృందం రూపోంచిన బ్యాటరీ కేవలం 5 నిమిషాల్లో ఛార్జ్ చేసుకోవడం వల్ల వాహన వినియోగదారులకు సమయం చాలా ఆదా అవుతుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధిత కంపెనీలు నార్మల్ హోమ్ ఛార్జర్ ద్వారా ఛార్జ్ కావడానికి గంటల సమయం పడుతుంది. ఇలాంటి వాహనాలను ఉపయోగించాలంటే వినియోగదారుడు ముందుగానే ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: అంబానీ కంటే ముందే 'లోటస్' కారు కొన్న హైదరాబాద్ మహిళ అమెరికన్ పరిశోధక బృందం రూపొందించిన బ్యాటరీ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. ఇది ఎప్పుడు వినియోగంలోకి వస్తుంది, భారతదేశానికి ఈ బ్యాటరీలు వస్తాయా? వస్తే ఏ ఎలక్ట్రిక్ వాహనాలలో ఉపయోగిస్తారనే చాలా విషయాలు తెలియాల్సి ఉంది. వీటి గురించి మరిన్ని అధికారిక వివరాలు త్వరలోనే తెలుస్తాయని భావిస్తున్నాము. -
చైనాను బీట్ చేసే భారత్ ప్లాన్ ఇదేనా!
వాహనాలకు పెట్రోల్, డీజిల్ లాగే ఏ పరికరం పనిచేయాలన్నా ఎంతో కొంత ఇంధనం కావాలి. ఇన్నాళ్లూ కరెంటు ఆ అవసరాన్ని తీరుస్తోంది. అయితే ఎప్పుడూ అది అందుబాటులో ఉండకపోవచ్చు. పైగా ఎక్కడికంటే అక్కడికి వెంట తీసుకెళ్లడమూ సాధ్యం కాదు. అందుకే బ్యాటరీల రూపంలో ఇంధనాన్ని నిల్వ చేయాలని చాలామంది శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఆ బ్యాటరీలు కూడా కొంతకాలం క్రితం వరకూ పెద్దసైజులో చాలా బరువుగా ఉండేవి. వాటిని తేలికగా ఉండేలా చేయడమే కాకుండా స్మార్ట్ ఫోన్ నుంచి విద్యుత్ వాహనాల వరకూ విప్లవాత్మకమైన మార్పులకు ‘లిథియం’ అయాన్ బ్యాటరీలు నాంది పలికాయి. ఇప్పుడు ప్రపంచమంతా భూతాపాన్ని తగ్గించే దిశగా చేస్తున్న కృషిలో హరిత ఇంధనమూ అవసరం. ఈ బ్యాటరీలు అందులోనూ కీలకపాత్ర పోషించనున్నాయి. అయితే లిథియం అవసరాన్ని ముందుగానే గ్రహించిన చైనా ప్రపంచవ్యాప్తంగా ఉన్న లిథియాన్ని మైనింగ్ చేసేందుకు వివిధ దేశాలతో ఒప్పందాలు చేసుకుంటోంది. ఈ వ్యవహారాన్ని గమనించిన భారత్ గతంలోనే లిథియం కోసం అన్వేషణ ప్రారంభించింది. భవిష్యత్తులో చైనాతో పోలిస్తే లిథియంను సమర్థంగా వినియోగించుకునేందుకు ప్రణాళిక వేస్తున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో జమ్మూ-కశ్మీర్లో 59 లక్షల టన్నుల లిథియం నిల్వలు వెలుగు చూసినట్లు కేంద్ర గనుల శాఖ ఇప్పటికే ప్రకటించింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తొలిసారి జమ్మూ-కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలోని రియాసీ జిల్లాలోని సలాల్ హైమాన ప్రాంతంలో లిథియం నిల్వలను గుర్తించినట్లు గనుల శాఖ ట్విటర్ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా భారత్ అర్జెంటీనా దేశంతో లిథియం మైనింగ్‌కు సంబంధించి ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఖాంజీ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కాబిల్) అర్జెంటీనా దేశంలోని ‘కేమ్యాన్’ అనే సంస్థతో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఇదీ చదవండి: బీటావోల్ట్ బ్యాటరీ.. ఛార్జింగ్ లేకుండా 50 ఏళ్ళు పనిచేసే కెపాసిటీ! ఈ ఒప్పందంలో భాగంగా అర్జెంటీనాలోని ఐదు లిథియం బ్లాక్‌ల్లో భారత్ మైనింగ్ ప్రారంభించనుంది. ఇందుకోసం ప్రభుత్వం రూ.200 కోట్లు ఖర్చుచేయనుంది. అక్కడి అవసరాలను తీర్చేలా ప్రభుత్వం బ్రాంచి ఆఫీస్‌ను సైతం మొదలుపెట్టనున్నట్లు తెలిసింది. కాబిల్ నాల్కో, హిందుస్థాన్ కాపర్, ఎంఈసీఎల్ జాయింట్ వెంచర్ కంపెనీగా కార్యకలాపాలు సాగిస్తోంది. -
బొలీవియా కంపెనీతో చేతులు కలిపిన ఆల్ట్‌మిన్ - ఎందుకో తెలుసా?
దక్షిణ అమెరికాలో లిథియం అయాన్ బ్యాటరీలను తయారు చేయడానికి యాక్టివ్ మెటీరియల్స్ కోసం పైలట్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి బొలీవియన్ స్టేట్ కంపెనీ 'యాసిమియంటోస్ డి లిటియో బొలీవియానోస్' (YLB)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు హైదరాబాద్ బేస్డ్ బ్యాటరీ యాక్టివ్ మెటీరియల్స్ తయారీ కంపెనీ ఆల్ట్‌మిన్ ప్రైవేట్ లిమిటెడ్ తెలిపింది. ముడి పదార్థాల సరఫరాలను అభివృద్ధి చేయడం మాత్రమే కాకుండా.. లిథియం అయాన్ బ్యాటరీల కోసం కాథోడ్ యాక్టివ్ మెటీరియల్స్ (CAMs) ఉత్పత్తి కోసం ఈ ఒప్పదం జరిగినట్లు తెలుస్తోంది. స్వదేశీ లిథియం అయాన్ బ్యాటరీ తయారీలో పురోగతి కోసం ఏర్పడిన ఈ సహకారం మొదటిది. ఇది మొత్తం సరఫరా గొలుసును సానుకూలంగా ప్రభావితం చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ భాగస్వామ్యం లిథియం కోసం పరిశోధన, అభివృద్ధి, పైలటింగ్ కార్యకలాపాలను మెరుగుపరచడం.. ద్వైపాక్షిక ముడి పదార్థాల సరఫరా గొలుసును ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. గత నెలలో YLB నుంచి కొంత మంది నిపుణుల బృందం హైదరాబాద్‌లోని ఆల్ట్‌మిన్ ప్రైవేట్ లిమిటెడ్ సందర్శించింది. ఆ తరువాత బొలీవియన్ ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ ఈ ఒప్పందాన్ని ఆమోదించుకోవడానికి, 'ఆల్ట్‌మిన్'ను బొలీవియాకు ఆహ్వానించింది. ఈ ఒప్పందం ఏర్పర్చుకున్న సందర్భంగా YLB ప్రెసిడెంట్ 'కార్లా కాల్డెరాన్' మాట్లాడుతూ.. ఈ సమావేశం లిథియం అయాన్ బ్యాటరీల క్రియాశీల పదార్థాల సాంకేతిక అభివృద్ధికి సహకారాన్ని అందిస్తుంది, పోటోసిలో పైలట్ ప్లాంట్‌ను అమలు చేయడం ద్వారా, పైలట్ ప్లాంట్ ఈ సంవత్సరం 3 గిగావాట్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఇదీ చదవండి: దీపావళికి నెట్లో ఎక్కువగా ఏం సర్చ్ చేసారంటే..? రివీల్ చేసిన సుందర్ పిచాయ్ ఆల్ట్‌మిన్ వ్యవస్థాపకుడు,ఎండీ 'మౌర్య సుంకవల్లి' మాట్లాడుతూ.. YLBతో చేతులు కలపడంతో ప్రపంచ బ్యాటరీ మార్కెట్లో కంపెనీ గొప్ప స్థానం పొందుతుందని భవిస్తున్నాము. 2030 నాటికి ఆల్ట్‌మిన్ 10 GWh LFPని ఉత్పత్తి చేయడానికి వీలు కల్పిస్తుందని వెల్లడిస్తూ.. ఖనిజ విభాగంలో రెండు దేశాల మధ్య ఏర్పడిన ఈ ఒప్పందం ఓ ముఖ్యమైన మైలురాయి అని తెలిపారు. -
బ్యాటరీ అల్యుమినియం ఫాయిల్స్ తయారీలోకి శ్యామ్ మెటాలిక్స్
కోల్‌కతా: ఎస్–ఈ–ల్ టై గర్ టీఎంటీ రీ–బార్లను ఉత్పత్తి చేసే శ్యామ్ మెటా లిక్స్ అండ్ ఎనర్జీ కొత్తగా బ్యాటరీ–గ్రేడ్ అల్యుమినియం ఫాయిల్స్ తయారీలోకి ప్రవేశించింది. ఈ ఫాయిల్స్‌ను లిథియం అయాన్ సెల్స్ తయారీలో ఉపయోగిస్తారు. దీనితో అంతర్జాతీయంగా లిథియం అయాన్ సెల్ మార్కె ట్లో ముడివస్తువులకు సంబంధించి భారత్ గణనీయమైన వాటాను దక్కించుకోవడంలో శ్యామ్ మెటాలిక్స్ తోడ్పాటు అందించగలదని సంస్థ పేర్కొంది. 1 గిగావాట్‌అవర్ ఎల్ఎఫ్పీ (లిథియం ఐరన్ ఫాస్ఫేట్) సెల్స్ తయారీ కోసం 350 టన్నుల అత్యంత శుద్ధి చేసిన అల్యూమినియం ఫాయిల్ అవసరమవుతుందని తెలిపింది. -
టాటా మాస్టర్ ప్లాన్.. ప్రపంచ దేశాల్లో లిథియం అయాన్ బ్యాటరీల తయారీ!
దేశీయ ప్రముఖ వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్ ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలోకి అడుగుపెట్టింది. గుజరాత్ ప్రభుత్వ అంగీకారంతో ఆ రాష్ట్రంలో రూ.13,000 కోట్లతో ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో వినియోగించే లిథియం అయాన్ బ్యాటరీలను తయారు చేయనుంది. ఈ మేరకు టాటా గ్రూప్ అనుబంధ సంస్థ టాటా అగరాటాస్ ఎనర్జీ స్టోరేజ్ గుజరాత్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. గంటకు 20 గిగావాట్ల తయారీ సామర్ధ్యంతో ప్లాంట్‌ను విస్తరించనుంది. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 13,000 మంది ఉపాధి పొందనున్నారు. ఇక, టాటా గ్రూప్ లిథియం బ్యాటరీ మ్యానిఫ్యాక్చరింగ్ సంబంధించిన ప్రొడక్షన్ ఈకో సిస్టంలో తోడ్పాటునందించేందుకు సిద్ధంగా ఉన్నామని గుజరాత్ ప్రభుత్వం తెలిపింది. భారత్‌తో పాటు మరిన్ని దేశాల్లో టాటా గ్రూప్ మరో అనుబంధ ఆటోమొబైల్ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవడర్ బ్రిటన్‌లో ఎలక్ట్రిక్ బ్యాటరీ ప్లాంట్ నిర్మించేందుకు సిద్ధమైంది. బ్రిటన్‌తో పాటు ఇంగ్లాండ్, స్పెయిన్ దేశాలు సైతం ఈవీ బ్యాటరీ తయారీలో టాటా గ్రూప్‌కు తగిన ప్రోత్సాహకాల్ని అందించేందుకు ముందుకు వచ్చాయి. లిథియం అయాన్ నిల్వలు.. వెలిగిపోనున్న భారత్ 2021 సంవత్సరంలో కర్నాటకలోని మండ్యా జిల్లాలో 1,600 టన్నులు, ఈ ఏడాది ఫిబ్రవరిలో జమ్మూకశ్మీర్‌లోని రియాసి జిల్లా మాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్రం కొలువైన కొండల దిగువన సలాల్ హైమన గ్రామం వద్ద 59 లక్షల టన్నులు, రాజస్థాన్‌లోని డేగనా ప్రాంతంలో ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) గుర్తించింది.ఉప్పగా ఉండే రిజర్వాయర్లు, భూమి లోపల ఉండే రాళ్లలో దొరికే లిథియంతో ఎలక్ట్రిక్ విభాగంలో భారత్ వెలిగిపోనుంది. జీరో కార్బన్ ఉద్గారిణిగా ప్రధాని నరేంద్ర మోదీ 2027నాటికి భారత్‌ను నాటికి జీరో కార్బన్ ఉద్గారిణిగా తీర్చిదిద్దేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా చైనా, అమెరికాతో పోటీపడ్తూ ఎలక్ట్రిక్ వెహికల్ రవాణాను ప్రోత్సహిస్తున్నారు. చదవండి : ముద్ద ముట్టని పెంపుడు కుక్కలు, ప్రిన్స్ ఛార్లెస్ అవార్డు కార్యక్రమానికి ‘రతన్ టాటా’ డుమ్మా! -
దేశంలో తొలి లిథియం బ్యాటరీ ప్లాంటు షురూ
న్యూఢిల్లీ: లిథియం అయాన్ సెల్ తయారీలో దేశంలో తొలి ప్లాంటు బెంగళూరు సమీపంలో ప్రారంభం అయింది. బ్యాటరీ టెక్నాలజీ స్టార్టప్ లాగ్9 మెటీరియల్స్ దీనిని ఏర్పాటు చేసింది. ఈ కేంద్రం తొలి దశ సామర్థ్యం 50 మెగావాట్ అవర్. ‘దేశీయ మార్కెట్ కోసం సెల్స్‌ను భారత్‌లో రూపొందించాం. ఇదీ చదవండి: కియా, హ్యుందాయ్ కంపెనీలకు షాక్! ఆ కార్లు రీకాల్ చేసేయాలని అభ్యర్థనలు ఇక్కడి వాతావరణ పరిస్థితులు, కస్టమర్లకు అనువుగా ఉంటాయి. ఎలక్ట్రిక్ మొబిలిటీ లక్ష్యాన్ని సాకారం చేయడంలో సహాయం చేస్తూ భారత్‌ను స్వావలంబన చేయడంలో కీలక పాత్ర పోషించబోతున్నాం’ అని లాగ్9 కో–ఫౌండర్, సీఈవో అక్షయ్ సింఘాల్ ఈ సందర్భంగా తెలిపారు. కంపెనీ తయారీ బ్యాటరీలు 3,000 పైచిలుకు ఎలక్ట్రిక్ వాహనాల్లో వినియోగించారు. 20కిపైగా నగరాల్లో విస్తరించినట్టు సంస్థ తెలిపింది. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
లిథియం బ్యాటరీలకు భారీ డిమాండ్.. ఏకంగా 5 రెట్లు!
ప్రపంచవ్యాప్తంగా లిథియం బ్యాటరీలకు డిమాండ్ బాగా పెరిగింది. స్మార్ట్ఫోన్ల నుంచి ల్యాప్‌టాప్‌ల వరకు, వైద్య పరికరాల నుంచి ఎలక్ట్రిక్ కార్ల వరకు అన్నింటినిలోనూ లిథియం-అయాన్ బ్యాటరీలు వినియోగం ఎక్కువైంది. అందుకే వాటి డిమాండ్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అందుకే దీన్ని ‘వైట్ గోల్డ్’ అని పిలుస్తున్నారు. గ్లోబల్ లిథియం మార్కెట్ పరిమాణం 2021లో 6.83 బిలియన్ డాలర్లుగా ఉంది. గ్రాండ్ వ్యూ రీసెర్చ్ ప్రకారం... 2022 నుంచి 2030 నాటికి దీని సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 12 శాతం పెరగనుంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ వాడకం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో లిథియం-అయాన్ బ్యాటరీలకు డిమాండ్ అదే స్థాయిలో పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలకు రాయితీలు ఇస్తుండటం లిథియం బ్యాటరీ మార్కెట్ వృద్ధికి అదనపు బూస్టర్‌గా పనిచేస్తోంది. 2030 నాటికి 5రెట్లకు పైగా.. పబ్లిక్-ప్రైవేట్ అలయన్స్ లీ-బ్రిడ్జ్ ప్రకారం... లిథియం బ్యాటరీలకు డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి ఐదు రెట్ల కంటే ఎక్కువగా పెరుగుతుందని అంచనా. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. 2021లో ప్రపంచవ్యాప్తంగా లిథియం ఉత్పత్తి లక్ష టన్నులు (90.7 మిలియన్ కిలోలు), ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 22 మిలియన్ టన్నుల (20 బిలియన్ కిలోలు) లిథియం నిల్వలు ఉన్నాయి. 2022లో చిలీలో అత్యధికంగా 9.3 మిలియన్ మెట్రిక్ టన్నుల లిథియం నిల్వలు, ఆస్ట్రేలియాలో 6.2 మిలియన్ మెట్రిక్ టన్నులు, అమెరికా వద్ద ఒక మిలియన్ మెట్రిక్ టన్నుల లిథియం నిల్వలు ఉంటాయని అంచనా తాజాగా జమ్ము కశ్మీర్లో 5.9 మిలియన్ టన్నుల లిథియం కనుగొనడంతో భారత్ కూడా లిథియం సూపర్ పవర్ క్లబ్లో చేరింది. (ఇదీ చదవండి: Thomas Lee: ప్రముఖ బిలియనీర్, ఫైనాన్షియర్ ఆత్మహత్య) 2025 నాటికి లిథియం కొరత లిథియం వినియోగంలో అత్యధిక వాటా బ్యాటరీలదే. రీచార్జబుల్ లిథియం బ్యాటరీల ఆధారితమైన ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో వృద్ధి కారణంగా గ్లోబల్ లిథియం డిమాండ్ 2025 నాటికి ఒక మిలియన్ మెట్రిక్ టన్నులకు, 2030 నాటికి రెండు మిలియన్ టన్నులకు చేరుకుంటుందని అంచనా. ఇదే క్రమంలో 2025 నాటికి ప్రపంచం లిథియం కొరతను ఎదుర్కొంటుందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ పేర్కొంటోంది. (ఇదీ చదవండి: అతిగా ఫోన్ వాడుతున్నారా.. ఈమెకు జరిగిందే మీకూ జరగొచ్చు!) -
లిథియం బ్యాటరీ ప్లాంట్ల ఏర్పాటుకు రూ.33,750 కోట్లు కావాలా?
ముంబై: ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల కింద 50 గిగావాట్ల లిథియం అయాన్ సెల్, బ్యాటరీ తయారీ ప్లాంట్ల ఏర్పాటుకై భారత్‌కు రూ.33,750 కోట్లు కావాలి. మొబిలిటీ, విద్యుత్ రంగం 2030 నాటికి కర్బనరహితం కావడానికి 903 గిగావాట్ అవర్ విద్యుత్ నిల్వ సామర్థ్యం అవసరమని కౌన్సిల్ ఆఫ్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్, వాటర్ (సీఈఈడబ్ల్యూ) తన నివేదికలో తెలిపింది. ఈ డిమాండ్‌లో అత్యధికం లిథియం అయాన్ బ్యాటరీలు తీరుస్తాయని వివరించింది. చమురు, సహజ వాయువు మాదిరిగానే పర్యావరణ అనుకూల భవిష్యత్ కోసం లిథియం ముఖ్యమైనదని వెల్లడించింది. దేశంలోనే అవసరమైన సెల్, బ్యాటరీ తయారీ వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు భారత్ వ్యూహాత్మకంగా ఆసక్తి చూపుతోందని వివరించింది. దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుందని తెలిపింది. (ఇదీ చదవండి: రెపో రేటు పెంపును వ్యతిరేకించిన ఆ ఇద్దరు ఎంపీసీ సభ్యులు!) -
ఓలా సంచలనం: ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఈవీ హబ్, భారీ పెట్టుబడులు
చెన్నై: ఓలా సీఈవోభవిష్ అగర్వాల్ వ్యాపార విస్తరణలో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్న ఓలా తాజాగా మరో అడుగుముందుకేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద EV హబ్‌ను ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఎలక్ట్రిక్ కార్లు, లిథియం-అయాన్ సెల్‌లను తయారు చేసేందుకు ఓలా రూ.7,614 కోట్ల పెట్టనుంది. ఇందుకోసం తమిళనాడు ప్రభుత్వం ఎంఓయూ కూడా కుదుర్చుకుంది. ఓలా వ్యవస్థాపకుడు, సీఈవో భవిష్ అగర్వాల్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ తన అనుబంధ కంపెనీలైన ఓలా సెల్ టెక్నాలజీస్ (OCT) , ఓలా ఎలక్ట్రిక్ టెక్నాలజీస్ (OET) ద్వారా ఒక ఒప్పందంపై సంతకం చేసారని శనివారం ట్వీట్ చేశారు. (ఇవీ చదవండి: ఎయిరిండియా మెగా డీల్: 2 లక్షలకు పైగా ఉద్యోగాలు) (భారీగా లిథియం నిక్షేపాలు: ఇక భవిష్యత్తంతా అద్భుతమే! ఆనంద్ మహీంద్ర) తమిళనాడులో టూ వీలర్, కార్ల లిథియం సెల్ గిగాఫ్యాక్టరీలతో ప్రపంచంలోనే అతిపెద్ద EV హబ్‌ను ఏర్పాటు చేస్తుంది. తమిళనాడుతో ఈరోజు ఎంఓయూపై సంతకం చేశామని భవిష్ వెల్లడించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, అగర్వాల్ మధ్య ఒప్పందం కుదిరిందంటూ ఒక ఫోటోను కూడా షేర్ చేశారు. కృష్ణగిరి జిల్లాలో ఈ 20 గిగా వాట్ల బ్యాటరీ తయారీ యూనిట్ఏర్పాటు కానుంది. మొత్తం పెట్టుబడిలో దాదాపు రూ.5,114 కోట్లు సెల్ తయారీ ప్లాంట్‌లోకి, మిగిలిన రూ.2,500 కోట్లు కార్ల తయారీ యూనిట్లోకి వెళ్తాయి. Ola will setup the worlds largest EV hub with integrated 2W, Car and Lithium cell Gigafactories in Tamil Nadu. Signed MoU with Tamil Nadu today. Thanks to Hon. CM @mkstalin for the support and partnership of the TN govt! Accelerating India’s transition to full electric! 🇮🇳 pic.twitter.com/ToV2W2MOsx — Bhavish Aggarwal (@bhash) February 18, 2023 సంవత్సరానికి 140,000 ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్లను ఉత్పత్తి చేయడానికి ఒక యూనిట్‌ను ఏర్పాటు చేయాలనేది ప్రణాళిక. 2024 నాటికి కార్లను విడుదల చేయాలని యోచిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు 500కిలోమీటర్ల రేంజ్‌తో కారును తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. ఈ క్రమంలో ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ 2024 నాటికి ఫోర్-వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (EVలు) ప్రారంభించాలనే ప్రణాళికను మరింత ముందుకు తీసుకువెళ్లే క్రమంలో తాజా డీల్ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పెట్టుబడుదల ద్వారా 3,111 ఉద్యోగాలను సృష్టించనుందట. తమిళనాడు కొత్త ఈవీ పాలసీని తీసుకొచ్చిన కొన్ని రోజుల తర్వాత ఈ డీల్ వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఆటో హబ్‌గా ఉన్న తమిళనాడులో హోసూర్‌లోని కంపెనీ ప్రస్తుత సౌకర్యం ప్రపంచంలోనే అతిపెద్దఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ యూనిట్లలో ఒకటి అని తమిళనాడు ప్రభుత్వపెట్టుబడి ప్రమోషన్ ఏజెన్సీ గైడెన్స్ తమిళనాడు సీఎండీ విష్ణు అన్నారు. తమిళనాడు ఎలక్ట్రిక్ వెహికల్స్ పాలసీ 2023 ప్రకారం రాష్ట్ర వస్తువులు, సేవల పన్ను (SGST), పెట్టుబడి లేదా టర్నోవర్ ఆధారిత సబ్సిడీ , అధునాతన కెమిస్ట్రీ సెల్ సబ్సిడీ 100 శాతం రీయింబర్స్మెంట్ ఉన్నాయి. తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ నుండి కొనుగోలు చేసే విద్యుత్‌పై ఐదేళ్లపాటు విద్యుత్ పన్నుపై 100 శాతం మినహాయింపు, స్టాంప్ డ్యూటీపై మినహాయింపు ,భూమి ధరపై సబ్సిడీని కూడా రాష్ట్రం అందిస్తుంది. గత ఐదేళ్లలో, ఈవీ సె క్టార్లో 48,000 ఉద్యోగాల ఉపాధి అవకాశాలతో కూడిన ప్రాజెక్టులను సాధించింది. -
నాసా విద్యుత్ విమానం వచ్చేస్తోంది
కేంబ్రిడ్జ్: గగనతలంలో భారీ స్థాయిలో కర్భన ఉద్గారాలను వెదజల్లే చిన్న విమానాలకు చరమగీతం పాడేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా నడుం బిగించింది. వాయుకాలుష్యం లేని అధునాతన విద్యుత్ విమానాన్ని సిద్ధంచేస్తోంది. ఈ ప్రయోగాత్మక విమానానికి ఎక్స్–57 అని నామకరణం చేసింది. ఈ ఏడాదే ఈ బుల్లి విమానం గగనతల అరంగేట్రం చేయనుంది. దీనిని 14 ప్రొపెల్లర్లను అమర్చారు. ఇటలీ తయారీ టెక్నామ్ పీ2006టీ నాలుగు సీట్ల విమానానికి ఆధునికత జోడించి లిథియం అయాన్ బ్యాటరీలతో పనిచేసేలా కొత్త ఎలక్ట్రిక్ ఏరోప్లేన్‌ను సిద్ధంచేస్తున్నారు. సాధారణంగా ఉండే రెండు రెక్కలకే అటు నుంచి ఇటు చివరిదాకా సమ దూరంలో ఎక్కువ బ్యాటరీలు, చిన్న మోటార్ల కలయితో ప్రొపెల్లర్లను ప్రయోగాత్మక డిజైన్‌లో అమర్చడం విశేషం. ప్రయాణసమయంలో ప్రొపెల్లర్‌తో పనిలేనపుడు వెంటనే దాని బ్లేడ్లు వెనక్కి ముడుచుకుంటాయి. దీంతో వేగం తగ్గే ప్రసక్తే లేదు. కొత్త డిజైన్ ప్రొపెల్లర్లతో శబ్దకాలుష్యం తక్కువ. ఎక్కువ సాంద్రత ఉండే గాలిలోనూ అత్యంత వేగంగా దూసుకెళ్లేలా 11 బ్లేడ్లతో ప్రొపెలర్లను రీడిజైన్ చేశారు. ప్రొపెల్లర్లతో జనించే అత్యంత అధిక శక్తి కారణంగా ఈ విమానాలకు పొడవాటి రన్‌వేలతో పనిలేదు. అత్యల్ప దూరాలకు వెళ్లగానే గాల్లోకి దూసుకెళ్లగలవు. ప్రస్తుతానికి 200 కిలోమీటర్లలోపు, గంటలోపు ప్రయాణాల కేటగిరీలో దీనిని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు. -
తెలంగాణలో అమర రాజా బ్యాటరీ ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమర రాజా బ్యాటరీస్(ఏఆర్‌బీఎల్) తెలంగాణ లిథియం–అయాన్ బ్యాటరీల పరిశోధన, తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. వచ్చే పదేళ్లలో వీటిపై రూ. 9,500 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో కంపెనీ శుక్రవారం అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. దీని ప్రకారం మహబూబ్‌నగర్ జిల్లాలో 16 గిగావాట్‌అవర్ (జీడబ్ల్యూహెచ్) అంతిమ సామర్థ్యంతో లిథియం సెల్ గిగాఫ్యాక్టరీ, 5 జీడబ్ల్యూహెచ్ వరకూ సామర్థ్యంతో బ్యాటరీ ప్యాక్ అసెంబ్లీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. ‘లిథియం–అయాన్ సెల్ తయారీ రంగానికి సంబంధించి దేశంలోనే అతి పెద్ద పెట్టుబడుల్లో ఇది ఒకటి. తెలంగాణలో గిగాఫ్యాక్టరీ ఏర్పాటు కావడమనేది.. రాష్ట్రం ఈవీల తయారీ హబ్‌గా ఎదిగేందుకు, దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల విప్లవానికి సారథ్యం వహించాలన్న ఆకాంక్షను సాధించేందుకు దోహదపడగలదు‘ అని తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి కేటీఆర్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ‘అమర రాజా ఈ–హబ్ పేరిట అధునాతన పరిశోధన, ఇన్నోవేషన్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నాం. అని ఈ సందర్భంగా అమర రాజా బ్యాటరీస్ సీఎండీ జయదేవ్ గల్లా ఈ సందర్భంగా తెలిపారు. ఏపీకి కట్టుబడి ఉన్నాం.. ఆంధ్రప్రదేశ్‌లో తమ కార్యకలాపాలు తగ్గించుకోవడం లేదని, రాష్ట్రానికి కట్టుబడి ఉన్నామని జయదేవ్ చెప్పారు. తిరుపతి, చిత్తూరు సైట్లు గరిష్ట స్థాయికి చేరాయని, కీలకమైన ఉత్తరాది మార్కెట్‌కు లాజిస్టిక్స్‌పరంగా వెసులుబాటు ఉండే ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నామన్నారు. భారత ఉపఖండం పరిస్థితులకు అనువైన లిథియం–అయాన్ బ్యాటరీలపై చాలా కాలంగా పని చేస్తున్నామని, ఇప్పటికే కొన్ని ద్వి, త్రిచక్ర వాహనాల తయారీ సంస్థలకు లిథియం బ్యాటరీ ప్యాక్‌లను సరఫరా చేస్తున్నామని తెలిపారు. పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, సంస్థ న్యూ ఎనర్జీ బిజినెస్ ఈడీ విక్రమాదిత్య గౌరినేని తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
‘భారత్ ఈ విషయంలో చైనాను చూసి నేర్చుకోవాల్సిందే’
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) డిమాండ్‌ను తీర్చేందుకు వీలుగా.. లిథియం అయాన్ బ్యాటరీ సెల్స్ తయారీ, వాటి ముడి సరుకుల శుద్ధి కోసం 2030 నాటికి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు (రూ.80వేల కోట్లు) అవసరమని ఓ నివేదిక తెలియజేసింది. ప్రస్తుతం లిథియం అయాన్ బ్యాటరీ డిమాండ్ 3 గిగావాట్ హవర్ (జీడబ్ల్యూహెచ్)గా ఉంటే, 2026 నాటికి 20 గిగావాట్లకు, 2030 నాటికి 70 గిగావాట్లకు చేరుకుంటుందని పేర్కొంది. మేనేజ్మెంట్ కన్సల్టింగ్ కంపెనీ ఆర్థర్ డి లిటిల్ సంస్థ ఈ నివేదికను రూపొందించింది. ప్రస్తుత అవసరాల్లో 70 శాతం మేర లిథియం అయాన్ సెల్స్‌ను దిగుమతి చేసుకుంటున్నట్టు కేంద్ర గనుల శాఖ గణాంకాలను ప్రస్తావించింది. ‘‘2030 నాటికి కేవలం అదనపు లిథియం అయాన్ సెల్స్ డిమాండ్‌ను తీర్చేందుకే భారత్ 10 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఇది బ్యాటరీ తయారీ, దాని అనుబంధ విభాగాల్లో 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలను తీసుకొస్తుంది’’అని ఈ నివేదిక తెలిపింది. చైనాను చూసి నేర్చుకోవాలి ‘‘చైనా గడిచిన పదేళ్ల కాలంలో ఈవీ బ్యాటరీ విభాగంలో సామర్థ్యాలను పెద్ద ఎత్తున పెంచుకుంది. పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ)పై భారీ పెట్టుబడులు, సానుకూల ప్రభుత్వ విధానాలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ముడి సరుకుల వనరులను (గనులు) వివిధ ప్రాంతాల్లో వ్యూహాత్మకంగా సొంతం చేసుకోవడం ద్వారా చైనా ఇప్పుడు తదుపరి తరం ఈవీల్లో కీలకంగా వ్యవహరించనుంది. ముడి సరుకులపై దిగుమతి సుంకాలు తగ్గించడం, బ్యాటరీ ముడి సరుకులు దండిగా ఉన్న దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం చేసుకుంది. కనుక భారత్ తన పొరుగు దేశమైన చైనా అనుభవాల నుంచి నేర్చుకోవాలి’’అని ఈ నివేదిక సూచించింది.. ప్రభుత్వం, పరిశ్రమ మధ్య సహకారాత్మక విధానం ఉండాలని, భారత్‌ను ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు స్థానిక సరఫరా వ్యవస్థ నిర్మాణంపై దృష్టి సారించాలని కోరింది. ఈవీ బ్యాటరీల తయారీకి అవసరమయ్యే ముడి పదార్థాలను సొంతం చేసుకోవడంతోపాటు, బ్యాటరీల రీసైక్లింగ్‌కు సమగ్ర విధానం అవసమరని పేర్కొంది. పన్నుల్లో రాయితీలు ఇవ్వాలని, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, లిథియం పార్క్‌ల ఏర్పాటును సూచించింది. చదవండి: మామూలు లక్ కాదండోయ్, సంవత్సరంలో రూ.లక్ష పెట్టుబడితో రూ.20 లక్షలు! -
లిథియం అయాన్ నుంచి బయటకు రావాలి
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీలు) లిథియం అయాన్ బ్యాటరీ టెక్నాలజీ వాడకం విషయంలో భారత్ ఆరంభంలోనే బయటకు రావాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర రవాణా శాఖ సహాయ మంత్రి వీకే సింగ్. ఈ కమోడిటీపై మన దేశానికి ఎటువంటి నియంత్రణ లేదంటూ ఈ సూచన చేశారు. భవిష్యత్తులో గ్రీన్ రవాణా కోసం హైడ్రోజన్ ఫ్యుయల్ సెల్స్ కీలకమని, దీనికి ఎంతో భవిష్యత్తు ఉందని అభిప్రాయపడ్డారు. ఈ రంగంలోని కంపెనీలు ఏక కాలంలో కొత్త టెక్నాలజీలపైనా పనిచేయాలని సూచించారు. ఢిల్లీలో ‘ఈవీ ఇండియా 2022’ సదస్సు జరిగింది. కార్యక్రమం ప్రారంభం సందర్భంగా మంత్రి మాట్లాడారు. లిథియం అయాన్ బ్యాటరీలపై ఆధారపడడాన్ని తగ్గించడం ఎలా అన్న దానిపై దేశీయంగా ఎంతో పరిశోధన కొనసాగుతున్నట్టు చెప్పారు. సోడియం అయాన్, జింక్ అయాన్ టెక్నాలజీలపై పరిశోధనలు నడుస్తున్నాయని వివరించారు. లిథియం అయాన్‌ను మన దేశం ఉత్పత్తి చేయడం లేదంటూ.. దీనిపై మనకు ఎటువంటి నియంత్రణ లేని విషయాన్ని సింగ్ గుర్తు చేశారు. దీన్ని పూర్తిగా దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. ప్రస్తుతం మన దేశంలో విక్రయిస్తున్న ఈవీలన్నీ కూడా లిథియం అయాన్ బ్యాటరీతో తయారైనవే కావడం గమనార్హం. ‘‘గ్రీన్ హైడ్రోజన్ విషయంలో మనం జపాన్ స్థాయిలోనే ఉన్నాం. సోలార్ ఇంధనం ధర మన దగ్గర చాలా తక్కువ. కనుక గ్రీన్ హైడ్రోజన్ విషయంలో మనకు ఎంతో అనుకూలత ఉంది’’అని సింగ్ పేర్కొన్నారు. -
ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లోకి రిలయన్స్!
రిలయన్స్ ఇండస్ట్రీస్ 45వ ఏజీఎం సమావేశం కొనసాగుతుంది. ఈ సందర్భంగా ముఖేష్ అంబానీ మాట్లాడుతూ..వచ్చే ఏడాది నాటికి ఎలక్ట్రిక్ వెహికల్ విభాగంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించారు. ఎలక్ట్రిక్ వెహికల్ విభాగం అంటే వెహికల్స్‌ను తయారు చేయడం కాదు. వాటికి అవసరమైన పరికరాల్ని రిలయన్స్‌ను తయారు చేయనుంది. ఇందుకోసం గిగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు ముఖేష్ అంబానీ తెలిపారు. మనదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో ఉపయోగించే లిథియం అయాన్ బ్యాటరీ ఉత్పత్తి చాలా తక్కువ. అందుకే స్థానిక ఆటోమొబైల్ కంపెనీలు విదేశాల నుంచి ఆ బ్యాటరీలను దిగుమతి చేసుకుంటున్నాయి. తద్వారా దేశీయ ఈవీ వెహికల్స్ ధరలు ఎక్కువగా ఉంటున్నాయి. రిలయన్స్ ఇప్పుడు ఆ అవసరాన్ని తగ్గించేందుకు గిగా ఫ్యాక్టరీలో కార్యకలాపాల్ని ప్రారంభించనుంది. ముఖేష్ అంబానీ మాట్లాడుతూ, ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో వినియోగించే లిథియం అయాన్ "బ్యాటరీ మెటీరియల్‌ల నుండి సెల్ తయారీ వరకు ఎండ్-టు-ఎండ్ బ్యాటరీ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడం, ఫాస్ట్ ఛార్జింగ్, సురక్షితమైన బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్‌లను అందించడమే మా ఆశయం. "కెమిస్ట్రీ, మెటీరియల్స్‌పై లోతైన అవగాహన, పరిజ్ఞానం ప్రపంచ స్థాయిలో బ్యాటరీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంలో ఉపయోగపడుతుందన్నారు. కాగా, రిలయన్స్ గిగా ఫ్యాక్టరీలో ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో వినియోగించే ఎలక్ట్రిక్ బ్యాటరీ, సోలార్ ప్యానళ్లు, ఫ్యూయల్ సెల్స్, గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ బ్యాటరీలను తయారు చేయనుంది. మా లక్ష్యం అదే "గత సంవత్సరం, నేను నాలుగు గిగా ఫ్యాక్టరీలను స్థాపించడానికి జామ్ నగర్లో ధీరూభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాను. ఈ రోజు, పవర్ ఎలక్ట్రానిక్స్ కోసం మా కొత్త గిగా ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రకటన చేస్తున్నట్లు ముఖేష్ అంబానీ వెల్లడించారు. 2023 నాటికి ఈ గిగా ఫ్యాక్టరీలో ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో ఉపయోగించే బ్యాటరీలు (బ్యాటరీ ప్యాక్స్) తయారు చేయడం ప్రారంభిస్తాం.2024 నాటికి 5జీడబ్ల్యూహెచ్ ఎలక్ట్రిక్ బ్యాటరీలను తయారు చేసే దిశగా, 2027 నాటికి వార్షిక సామర్థ్యాన్ని 50 జీడబ్ల్యూహెచ్ పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాము" అని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. -
ఇండోనేషియా కంపెనీలతో ఎలాన్ మస్క్ భారీ ఒప్పందం!
మైక్రో బ్లాగింగ్ దిగ్గజం ట్విట్టర్ నుంచి టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ న్యాయపరమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయినా సరే మస్క్ తన వ్యాపార కార్యకలాపాల్ని ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో టెస్లా ఎలక్ట్రిక్ కార్ల లిథియం అయాన్ బ్యాటరీల్లో ఉపయోగించే నికెల్ కోసం ఇండోనేషియా ప్రాసెసింగ్ యూనిట్లతో 5 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాల్ని కుదుర్చుర్చుకున్నారు. ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలోని మొరోవాలీ కేంద్రంగా నికెల్ ప్రాసెసింగ్ కంపెనీలతో టెస్లా ఐదేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇండోనేషియా సీనియర్ క్యాబినెట్ మంత్రి తెలిపారు. టెస్లా లిథియం బ్యాటరీల్లో ఈ నికెల్ మెటీరియల్‌ను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఎలాన్ మస్క్ ఇండోనేషియాలో టెస్లా ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందా?అన్న ప్రశ్నలకు మంత్రి లుహుత్ పాండ్జైటన్ స్పందించారు. కార్ల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుపై ఆగస్ట్‌లో ఎలాన్ మస్క్‌తో భేటీ కానున్నట్లు వెల్లడించారు. "మేం టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌తో నిరంతరం చర్చలు జరుపుతున్నాం. ఈ చర్చల ఫలితంగా మస్క్ ఇండోనేషియా నుంచి రెండు ప్రొడక్ట్‌లను కొనుగోలు చేయడం ప్రారంభించారు. కానీ ఆ ప్రొడక్ట్‌లు ఏంటనేది చెప్పేందుకు మంత్రి లుహుత్ నిరాకరించారు. చదవండి👉 డబ్బు లేదు, టెస్లా షేర్లను మళ్లీ అమ్మేసిన ఎలాన్ మస్క్! -
గ్లాస్ సీలింగ్ బద్దలుకొట్టడం కొత్తేమీ కాదు..మరోసారి ఘనతను చాటుకున్న సైంటిస్ట్
సాక్షి,న్యూఢిల్లీ: సీనియర్ శాస్త్రవేత్త నల్లతంబి కలైసెల్వి మహిళా సైంటిస్టుగా రికార్డు సృష్టించారు. ఒకటి కాదు, రెండు కాదు దేశవ్యాప్తంగా 38 పరిశోధనా సంస్థల కన్సార్టియం కీలక బాధత్యలను చేపట్టిన తొలి మహిళగా నిలిచారు. 2019 ఫిబ్రవరిలో సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CSIR-CECRI)కి సారథ్యం వహించిన మొదటి మహిళా శాస్త్రవేత్తగా అవతరించిన ఘనత కూడా కలైసెల్వికే దక్కింది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) డైరెక్టర్ జనరల్‌గా కలైసెల్వి శనివారం నియమితు లయ్యారు. ఆమె నియామకం పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి రెండేళ్ల కాలం, లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు, ఏది ముందుగా అయితే అది అమలులో ఉంటుందని మంత్రిత్వ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కలైసెల్వి సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ విభాగం కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తారు. తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలోని అంబాసముద్రం అనే చిన్న పట్టణానికి చెందిన వారు కలైసెల్వి. లిథియం అయాన్ బ్యాటరీ రంగంలో విశేష కృషి చేసిన ఆమె ప్రస్తుతం తమిళనాడులోని కరైకుడిలో ఉన్న సెంట్రల్ ఎలక్ట్రో కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి డైరెక్టర్‌గా ఉన్నారు. ఇదే ఇన్స్టిట్యూట్లో ఎంట్రీ లెవల్ సైంటిస్ట్‌గా కరియర్‌ను ప్రారంభించడం విశేషం. 125కిపైగా ఎక్కువ పరిశోధనా పత్రాలు, ఆరు పేటెంట్లు ఆమె ఖాతాలోఉన్నాయి. పురుషాధిపత్య సవాళ్లను అధిగమించి అనేక ఉన్నత పదవులను చేపట్టిన కలైసెల్వి తాజాగా మరో అత్యున్నత సంస్థకు హెడ్‌గా ఎంపిక కావడంపై నారీశక్తి అంటూ పలువురు అభినందనలు ప్రకటిస్తున్నారు. Dr N Kalaiselvi has been appointed as the DG, CSIR & Secretary, DSIR. Hearty congratulations to Dr Kalaiselvi from the CSIR Family.@PMOIndia @DrJitendraSingh @PIB_India @DDNewslive pic.twitter.com/oHIZr9uoMG — CSIR (@CSIR_IND) August 6, 2022 -
లిథియం అయాన్ సెల్ తయారీలో ఓలా!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహన తయరీలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ లిథియం అయాన్ సెల్‌ను ఆవిష్కరించింది. దేశీయంగా అభివృద్ది చేసిన తొలి లిథియం అయాన్ సెల్ ఇదే కావడం విశేషం. వచ్చే ఏడాది నుంచి పెద్ద ఎత్తున వీటి ఉత్పత్తి చేపట్టనున్నట్టు కంపెనీ మంగళవారం ప్రకటించింది. నిర్దిష్ట రసాయనాలు, పదార్థాలు ఉపయోగించడం వల్ల తక్కువ స్థలంలో ఎక్కువ శక్తిని ఈ సెల్ నిక్షిప్తం చేస్తుంది. అలాగే సెల్ మొత్తం జీవిత కాలాన్ని మెరుగుపరుస్తుందని కంపెనీ వివరించింది. ‘ప్రపంచంలోని అత్యంత అధునాతన సెల్ రిసర్చ్ సెంటర్‌ను నిర్మిస్తున్నాం. ఇది సంస్థ సామర్థ్యం పెంచేందుకు, ఆవిష్కరణలకు దోహదం చేస్తుంది. ప్రపంచంలో అత్యంత అధునాతన, సరసమైన ఎలక్ట్రిక్ వాహన ఉత్పత్తులను వేగంగా నిర్మించడానికి వీలు కల్పిస్తుంది’ అని ఓలా ఎలక్ట్రిక్ ఫౌండర్, సీఈవో భవీశ్ అగర్వాల్ తెలిపారు. సెల్ తయారీ కేంద్రాన్ని స్థాపిస్తున్న ఓలా.. పరిశోధన, అభివృద్ధికై 500 మంది పీహెచ్డీ, ఇంజనీరింగ్ చదివిన వారిని నియమించుకుంటోంది. -
అమ్మ బాబోయ్! పేలుతున్న స్మార్ట్‌వాచ్‌లు, కాలిపోతున్న యూజర్ల చేతులు!
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌కు మరో భారీ షాక్ తగిలింది. ఉత్తర కాలిఫోర్నియాలోని యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో ఇద్దరు మహిళలు గూగుల్‌పై దావా వేశారు. గూగుల్‌కు చెందిన స్మార్ట్ వాచ్‌లు ధరించడం వల్ల తమ చేతులు కాలిపోయాంటూ యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో వేసిన దావాలో పేర్కొన్నారు. గూగుల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా 'ఫిట్‌బిట్' పేరుతో స్మార్ట్ వాచ్‌లను విడుదల చేసింది. ఏప్రిల్ 2018న ఫిట్ బిట్ వెర్సా 1, 2019 సెప్టెంబర్‌లో ఫిట్‌బిట్ వెర్సా 2, 2020 సెప్టెంబర్‌లో ఫిట్‌బిట్ వెర్సా 3ని విడుదల చేసింది. విడుదలైన ఈ స్మార్ట్‌వాచ్‌లు గూగుల్ సంస్థవి కావడంతో యూజర్లు సైతం వాటిని ధరించేందుకు మొగ్గుచూపారు. ఫలితంగా స్మార్ట్ వాచ్‌లను వినియోగించిన యూజర్లు చేతులు కాలి తీవ్రంగా గాయపడుతున్న వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వాచ్‌లో ఉండే లిథియం అయాన్ బ్యాటరీలు హీటెక్కీ పేలిపోవడంపై వరుస ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ ఏడాది మార్చి నెలలో యూజర్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నాసిరకం10మిలియన్ల ఫిట్‌బిట్ వాచ్‌లను వెంటనే రీకాల్ చేయాలని హెచ్చరింది. దీంతో కన్జ్యూమర్ సేఫ్టీ కమిషన్ హెచ్చరికలతో కంగుతిన్న గూగుల్ ఆ వాచ్‌లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం..జెన్నీ హౌచెన్స్, సమంతా రామిరేజ్ యూఎస్ డిస్ట్రిక్ కోర్ట్‌ను ఆశ్రయించారు. ఫిట్‌బిట్ స్మార్ట్ వాచ్ వెర్సాలైట్ మోడల్‌ను ధరించిన తన కుమార్తె చేయి కాలిపోయిందని జెన్నీ హౌచెన్స్, వెర్సా 2 స్మార్ట్ వాచ్ ధరిండం వల్ల తాను గాయపడినట్లు రామిరేజ్ గూగుల్‌పై వేసిన దావాలో పేర్కొన్నారు. అంతేకాదు ఇద్దరూ తమ ఫిట్బిట్ల ధర వాపస్ తో పాటు చట్టపరమైన ఖర్చులను తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా..బాధితుల తరుపు న్యాయ వాదులు కేలరీలను బర్న్ చేయడానికి స్మార్ట్‌వాచ్‌లను కొనుగోలు చేస్తారు. కానీ ఇలా చేతుల్ని కాల్చుకునేందుకు కాదంటూ కోర్ట్‌లో వాదించారు. చదవండి👉గూగుల్‌కు భారీషాక్..అమ్మ బాబోయ్!! ఈ స్మార్ట్ వాచ్‌తో చేతులు కాలిపోతున్నాయ్!! -
రీసైక్లింగే అసలు సమస్య
సాక్షి, అమరావతి : పెరుగుతున్న వాతావరణ కాలుష్యాన్ని అదుపుచేసేందుకు ప్రపంచమంతా విద్యుత్ వాహనాల వినియోగానికి మొగ్గు చూపుతోంది. 2040 నాటికి ప్రపంచంలోని పాసింజర్ వెహికిల్స్‌లో మూడింట రెండొంతులు విద్యుత్ వాహనాలే ఉంటాయని ‘బ్లూమ్‌బర్గ్’ అనే అంతర్జాతీయ మీడియా సంస్థ అంచనా వేసింది. మన దేశంలోనూ కేంద్ర ప్రభుత్వం 2070 నాటికి కర్బన ఉద్గారాలు సున్నాకు చేరేలా ప్రయత్నాలు చేస్తోంది. విద్యుత్ వాహనాల కోసం జాతీయ రహదారుల వెంబడి విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు మన రాష్ట్రం సన్నాహాలు చేస్తోంది. బ్యాటరీ స్టోరేజ్ సాంకేతికతలు అభివృద్ధి చెందుతుండడంతో విద్యుత్ నిల్వ వ్యవస్థలూ పెరుగుతున్నాయి. విశాఖలోనూ బ్యాటరీలతో విద్యుత్ నిల్వ చేసే ప్రాజెక్టుల స్థాపనకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ నిల్వ, వాహనాలు నడిచేందుకు ప్రధానాధారమైన బ్యాటరీలు ప్రస్తుతానికి ఖరీదైనవే కాకుండా రీసైక్లింగ్‌కు కష్టతరమవుతుండటంపై ఇప్పుడు చర్చ సాగుతోంది. వీటి రీసైక్లింగ్.. ప్రమాదకరం ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల్లో ఎక్కువగా లిథియం అయాన్ బ్యాటరీలను వినియోగిస్తున్నారు. కానీ, సాధారణ బ్యాటరీలను రీసైకిల్ చేసేందుకు ఉపయోగించే పద్ధతులు లిథియం బ్యాటరీ విషయంలో పనిచేయవు. లిథియం బ్యాటరీలు సాధారణ బ్యాటరీల కంటే పెద్దవి. వీటి నిర్మాణం సంక్లిష్టంగా ఉండటమే కాకుండా రీసైక్లింగ్‌లో ఏ మాత్రం తేడా జరిగినా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వీటిని ల్యాప్టాప్స్, వాహనాలు, పవర్ గ్రిడ్స్ వంటి అనేక రంగాల్లో వినియోగిస్తున్నారు. సాధారణంగా రీసైక్లింగ్ ప్లాంట్లలో బ్యాటరీ భాగాలను చూర్ణం చేస్తారు. ఆ చూర్ణాన్ని అలాగే కరిగించడం(పైరోమెటలర్జీ) లేదా, యాసిడ్‌లో కరిగించడం(హైడ్రో మెటలర్జీ) చేస్తారు. కానీ లిథియం బ్యాటరీలను అలా చేయడం సాధ్యం కాదు. అంతేకాదు రీసైక్లింగ్‌లో తిరిగి ఉపయోగించేందుకు పనికొచ్చే ఉత్పత్తుల విలువ కంటే రీసైక్లింగ్ ప్రక్రియకు అయ్యే ఖర్చు చాలా ఎక్కువ. దీంతో 5 శాతం లిథియం బ్యాటరీలు మాత్రమే రీసైక్లింగ్ అవుతున్నాయి. అదే జరిగితే ఇక తిరుగు లేదు.. ఒక టన్ను లిథియం తవ్వాలంటే 5 లక్షల గ్యాలన్ల(సుమారు 22,73,000 లీటర్ల) నీరు అవసరం. అలాగే పదేళ్ల తర్వాత.. వాడేసిన కోట్లాది లిథియం బ్యాటరీలను సమర్థంగా రీసైకిల్ చేసే వ్యవస్థలుండాలి. దీంతో లిథియం బ్యాటరీల రీసైక్లింగ్‌కు పర్యావరణ అనుకూల, తక్కువ ఖర్చు, సులభ పద్ధతుల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరో వైపు లిథియం బ్యాటరీలు కాకుండా.. పర్యావరణ అనుకూల బ్యాటరీలను తయారు చేసేందుకు మరికొన్ని ప్రయాత్నాలు జరుగుతున్నాయి. సేంద్రియ పదార్థాలను సింథసైజ్ చేసి ఎలక్ట్రాన్లను పుట్టించేలా ఆర్గానిక్ రాడికల్ బ్యాటరీ(ఓఆర్బీ)లను తయారు చేస్తున్నారు. 2025 సంవత్సరం చివరికల్లా లక్షలాది ఎలక్ట్రానిక్ వెహికిల్ బ్యాటరీల జీవిత కాలం ముగుస్తుంది. అప్పటిలోగా వాటిని సమర్థంగా రీసైక్లింగ్ చేయగలిగే విధానాలను గాడిలో పెట్టడంతో పాటు ఆర్గానిక్ బ్యాటరీలు అందుబాటులోకొస్తే విద్యుత్ వాహనాలకు రవాణా రంగంలో తిరుగుండదు.