పెంపుడు జంతువు అనగానే ప్రధానంగా గుర్తొచ్చేది కుక్క. విశ్వాసానికి మారు పేరు. యజమానికోసం, కుటుంబ రక్షణ కోసం తన ప్రాణాల్ని ఫణంగా పెడుతుంది. కానీ ఇవి తెలిసీ తెలియక కొన్ని ప్రమాదాలను కొన్ని తెచ్చుకుంటాయి. అజాగ్రత్తగా ఉంటే ఒక్కోసారి వీటి వల్ల ప్రమాదం కూడా పొంచి ఉంది. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ అమెరికాలోని అగ్నిమాపక విభాగం ఒక షాకింగ్ వీడియోను విడుదల చేసింది. అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించింది.
అసలు విషయం ఏమిటంటే.. సాధారణగా పెంపుడు కుక్కలు ఇంట్లో ఏదో ఒక వస్తువును నములుతూ ఉంటాయి. రబ్బర్ వస్తువులు, చెప్పులను కొరికి, కొరికి అవతల పాడేస్తాయి. ఆఖరికి పరుపులు, దిండ్లను కూడా నాశనం చేస్తాయి. అలాగే వైర్లు, ఎలక్ట్రిక్ పరికరాలను నోట్లో పెట్టుకుని ప్రమాదాల్ని కొని తెచ్చుకుంటూ ఉంటాయి. అమెరికాలోని, ఓక్లహోమా రాష్ట్రంలోని తుల్సా నగరంలో అలాంటిదే జరిగింది. ఒక గదిలో రెండు కుక్కలు, పిల్లి ఉన్నాయి. ఇందులో ఓ కుక్క పోర్టబుల్ లిథియం, అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో ఆడలాడుకుంటూ గలాటా సృష్టించింది. ఒక్కసారిగా ఆ బాటరీ ఒక్కసారిగా పేలడంతో గదిలో మంటలంటుకున్నాయి. దీంతో భయపడిన మిగిలిన రెండూ అక్కడినుంచి తప్పించుకున్నాయి. గదిలోని ఇండోర్ మానిటరింగ్ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.
NEW: Dog starts a house fire in Tulsa, Oklahoma after chewing through a portable lithium-ion battery.
The Tulsa Fire Department released the following video to warn people about the "dangers of lithium-ion batteries."
Two dogs and a cat were filmed hanging out before one… pic.twitter.com/skTb8YEzJ6— Collin Rugg (@CollinRugg) August 6, 2024
"లిథియం-అయాన్ బ్యాటరీల ప్రమాదాల" గురించి ప్రజలను హెచ్చరించడానికి తుల్సా అగ్నిమాపక విభాగం క్రింది వీడియోను ఎక్స్‌లో షేర్ చేసింది. వీటిని పవర్‌అనియంత్రితంగా విడుదలైతే, వేడిని ఉత్పత్తి చేస్తుంది, మండే , విషపూరిత వాయువులను ఉత్పత్తి చేస్తుంది ,పేలుళ్లకు కూడా దారితీస్తుందని హెచ్చరించింది. కాగా లిథియం అయాన్ బ్యాటరీ అనేది రీచార్జ్ చేసుకొనే బ్యాటరీ. వీటిని సాధారణంగా తేలికపాటి ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎలక్ట్రిక్ వాహనాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు కానీ ఇవి మండే స్వభావం కలిగిన ఎలక్ట్రోలైట్లు కలిగి ఉంటాయి. అందుకే ఒక్కోసారి ప్రమాదకరంగా పరిణమించవచ్చు. ఈ బ్యాటరీలు పాడైనా, లేదా సరైన పద్ధతుల్లో చార్జింగ్ చేయకపోయినా మండిపోవచ్చు, లేదా పేలిపోవచ్చు. సో.. బీ కేర్‌ఫుల్.
Comments
Please login to add a commentAdd a comment