Oklahoma
-
కుక్కలతో ఈ డేంజర్ కూడా ఉంది, ఈ వీడియో చూడండి!
పెంపుడు జంతువు అనగానే ప్రధానంగా గుర్తొచ్చేది కుక్క. విశ్వాసానికి మారు పేరు. యజమానికోసం, కుటుంబ రక్షణ కోసం తన ప్రాణాల్ని ఫణంగా పెడుతుంది. కానీ ఇవి తెలిసీ తెలియక కొన్ని ప్రమాదాలను కొన్ని తెచ్చుకుంటాయి. అజాగ్రత్తగా ఉంటే ఒక్కోసారి వీటి వల్ల ప్రమాదం కూడా పొంచి ఉంది. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ అమెరికాలోని అగ్నిమాపక విభాగం ఒక షాకింగ్ వీడియోను విడుదల చేసింది. అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించింది. అసలు విషయం ఏమిటంటే.. సాధారణగా పెంపుడు కుక్కలు ఇంట్లో ఏదో ఒక వస్తువును నములుతూ ఉంటాయి. రబ్బర్ వస్తువులు, చెప్పులను కొరికి, కొరికి అవతల పాడేస్తాయి. ఆఖరికి పరుపులు, దిండ్లను కూడా నాశనం చేస్తాయి. అలాగే వైర్లు, ఎలక్ట్రిక్ పరికరాలను నోట్లో పెట్టుకుని ప్రమాదాల్ని కొని తెచ్చుకుంటూ ఉంటాయి. అమెరికాలోని, ఓక్లహోమా రాష్ట్రంలోని తుల్సా నగరంలో అలాంటిదే జరిగింది. ఒక గదిలో రెండు కుక్కలు, పిల్లి ఉన్నాయి. ఇందులో ఓ కుక్క పోర్టబుల్ లిథియం, అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో ఆడలాడుకుంటూ గలాటా సృష్టించింది. ఒక్కసారిగా ఆ బాటరీ ఒక్కసారిగా పేలడంతో గదిలో మంటలంటుకున్నాయి. దీంతో భయపడిన మిగిలిన రెండూ అక్కడినుంచి తప్పించుకున్నాయి. గదిలోని ఇండోర్ మానిటరింగ్ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.NEW: Dog starts a house fire in Tulsa, Oklahoma after chewing through a portable lithium-ion battery. The Tulsa Fire Department released the following video to warn people about the "dangers of lithium-ion batteries." Two dogs and a cat were filmed hanging out before one… pic.twitter.com/skTb8YEzJ6— Collin Rugg (@CollinRugg) August 6, 2024 "లిథియం-అయాన్ బ్యాటరీల ప్రమాదాల" గురించి ప్రజలను హెచ్చరించడానికి తుల్సా అగ్నిమాపక విభాగం క్రింది వీడియోను ఎక్స్‌లో షేర్ చేసింది. వీటిని పవర్అనియంత్రితంగా విడుదలైతే, వేడిని ఉత్పత్తి చేస్తుంది, మండే , విషపూరిత వాయువులను ఉత్పత్తి చేస్తుంది ,పేలుళ్లకు కూడా దారితీస్తుందని హెచ్చరించింది. కాగా లిథియం అయాన్ బ్యాటరీ అనేది రీచార్జ్ చేసుకొనే బ్యాటరీ. వీటిని సాధారణంగా తేలికపాటి ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎలక్ట్రిక్ వాహనాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు కానీ ఇవి మండే స్వభావం కలిగిన ఎలక్ట్రోలైట్లు కలిగి ఉంటాయి. అందుకే ఒక్కోసారి ప్రమాదకరంగా పరిణమించవచ్చు. ఈ బ్యాటరీలు పాడైనా, లేదా సరైన పద్ధతుల్లో చార్జింగ్ చేయకపోయినా మండిపోవచ్చు, లేదా పేలిపోవచ్చు. సో.. బీ కేర్‌ఫుల్. -
యువకుడి దాడిలో భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలో మరో దారుణం చోటు చేసుకోంది. భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి ఓక్లహోమా రాష్ట్రంలో మృతి చెందారు. ఆయన గుజరాత్‌కు చెందిన హెమంత్ మిశ్రాగా పోలీసులు గుర్తించారు. ఆయన ఓక్లహోమాలోని ఓ హోటల్లో మేనేజర్‌గా పని చేస్తున్నారు. జూన్ 22 రాత్రి 10 గంటల సమయంలో హోటల్ నుంచి వెళ్లిపోవాలని రిచర్డ్ లూయిస్ అనే వ్యక్తిని హెమంత్ కోరారు. దీంతో అతను కోపంతో హెమంత్ మిశ్రా ముఖంపై దాడి చేశాడు. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ హెమంత్ మిశ్రా మరణించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఓ హోట్ల్లో దాక్కున్న నిందితుడు రిచర్డ్ లూయిస్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. రిచర్డ్‌ను హోటల్ నుంచి హెమంత్ ఎందుకు వెళ్లిపోవాలన్నాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు బంపరాఫర్.. ఐడియా వర్కవుట్!
Tulsa Remote program: వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు అమెరికాలోని ఓ నగరం కొన్నాళ్ల క్రితం బంపరాఫర్ ప్రకటించింది. యూఎస్‌లోని ఎక్కడ వర్క్ ఫ్రమ్ చేస్తున్న ఉద్యోగులైనా తమ నగరానికి వచ్చి నివాసం ఉంటే 10,000 డాలర్లు (సుమారు రూ.8 లక్షలు) డబ్బులిస్తామని వెల్లడించింది. ఇప్పుడా ఐడియా వర్కవుట్ అయినట్లు కనిస్తోంది. అమెరికాలో ఒక్లహామా రాష్ట్రంలో ఉన్న తుల్సా (Tulsa) అనే నగరం ఈ ఆఫర్ ప్రకటించింది. ‘తుల్సా రిమోట్’ అనే ప్రోగ్రామ్ ద్వారా అందించిన ఈ ఆఫర్ యూఎస్‌లోని ఇతర ప్రాంతాల నుంచి రిమోట్‌గా పూర్తి సమయం పని చేయగల నిపుణులను తమ నగరానికి ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. దీని వెనుక ఆలోచన ఏమిటంటే ఉద్యోగులు ఇక్కడికి స్థిరపడతారు. ఇక్కడే ఖర్చు చేస్తారు. తుల్సా నగరం తుల్సా రిమోట్ ప్రోగ్రామ్ పని చేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రోగ్రామ్ ఎకనమిక్ ఇంపాక్ట్ రిపోర్ట్ ప్రకారం.. 2022 డిసెంబర్ నాటికి తుల్సాకు 2,000 మందికి పైగా మకాం మార్చారు . 2022 చివరి నాటికి, తుల్సా రిమోట్ దాదాపు 307 మిలియన్ డాలర్ల ప్రత్యక్ష కార్మిక ఆదాయాన్ని ఆర్థిక వ్యవస్థకు తీసుకువచ్చింది. నగరానికి వచ్చిన ప్రతి ఇద్దరు తుల్సా రిమోట్ సభ్యులతోపాటు పాటు మరో ముగ్గురు వచ్చారు. 2019 నుంచి ఇప్పటి వరకు అక్కడ ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న వారిలో 76 శాతం మంది ఇక్కడే స్థిరపడిపోయారు. -
టెట్రిస్ గేమ్‌ను జయించిన బాలుడు
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా వీడియోగేమ్ ప్రియులకు చిరపరిచితమైన టెట్రిస్ గేమ్‌ను 13 ఏళ్ల అమెరికన్ టీనేజర్ ఎట్టకేలకు మొత్తం పూర్తిచేశాడు. ఈ గేమ్ విడుదలైన దాదాపు 40 ఏళ్ల తర్వాత తొలిసారిగా.. చివరి 157వ లెవల్ దాకా ఆడి చరిత్ర సృష్టించాడు. ఓక్లహామాకు చెందిన ఈ బుల్లోడి పేరు విల్లీస్ గిబ్సన్. తాను సాధించిన రికార్డు చూసి తెగ సంబరపడిపోతున్నాడు. ‘మొదటిసారి ఆట మొదలెట్టినపుడు దీన్ని పూర్తి/క్రాష్ చేయగలనని అస్సలు అనుకోలేదు. గెలుపుతో నా చేతి వేళ్ల స్పర్శనూ నేను నమ్మలేకపోతున్నా’ అంటూ గేమ్ చిట్టచివరి 38 నిమిషాల వీడియోను మంగళవారం యూట్యూబ్‌లో గిబ్సన్ పోస్ట్చేశాడు. టెట్రిస్ గేమ్ ఇప్పటిదాకా కనీసం 70 విధానాల్లో 200కుపైగా అధికారిక వేరియంట్లలో విడుదలైంది. కిందకు పడిపోతున్న భిన్న ఆకృతుల ‘బ్లాక్’లను వరసగా కిందివైపు పేర్చడమే ఈ ఆట. ఇవి చదవండి: ఏఐ చెప్పిన చిలక జోస్యం...రోబో మనుషులు వస్తున్నారు! -
Glynn Simmons: 48 ఏళ్ల తర్వాత నిర్దోషిగా..
చేయని తప్పునకు శిక్ష అనుభవించడం, నిందలు మోయడం నిజంగా బాధాకరమే. అమెరికాలోని ఒక్లహోమాకు చెందిన 70 సంవత్సరాల గ్లిన్ సైమన్స్‌కు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఏ నేరమూ చేయకపోయినా ఏకంగా 48 సంవత్సరాల ఒక నెల 18 రోజులు జైలు శిక్ష అనుభవించాల్సి వచి్చంది. జీవితంలో విలువైన సమయం జైలుపాలయ్యింది. న్యాయం అతడి పక్షాన ఉండడంతో ఎట్టకేలకు నిర్దోషిగా బయటపడ్డాడు. అమెరికాలో చేయని తప్పునకు అత్యధిక కాలం శిక్ష అనుభవించింది గ్లిన్ సైమన్స్ అని నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ ఎగ్జోజనరేషన్స్ అధికారులు చెప్పారు. 1974 డిసెంబర్లో ఒక్లహోమాలోని ఓ లిక్కర్ స్టోర్‌లో హత్య జరిగింది. ఇద్దరు దుండగులు లిక్కర్ స్టోర్ క్లర్క్‌ను కాల్చి చంపి, మద్యం సీసాలు ఎత్తుకెళ్లారు. అప్పుడు గ్లిన్ సైమన్స్ వయసు 22 ఏళ్లు. సైమన్స్తోపాటు డాన్ రాబర్ట్స్ అనే వ్యక్తి ఈ హత్య చేశారని పోలీసులు తేల్చారు. వారిద్దరికీ న్యాయస్థానం జైలుశిక్ష విధించింది. తాము ఈ నేరం చేయలేదని మొత్తుకున్నా అప్పట్లో ఎవరూ వినిపించుకోలేదు. పోలీసులు వారిని జైలుకు పంపించారు. డాన్ రాబర్ట్స్ 2008లో పెరోల్‌పై విడుదలయ్యాడు. కేసును మళ్లీ విచారించాలని సైమన్స్ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాడు. దాంతో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసును మళ్లీ విచారించారు. సైమన్స్ హత్య చేయలేదని గుర్తించారు. అతడిని జైలు నుంచి విడుదల చేస్తూ ఒక్లహోమా కంట్రీ జిల్లా కోర్టు రెండు రోజుల క్రితం తీర్పు ఇచ్చింది. అంతేకాదు అతడికి 1.75 లక్షల డాలర్ల (రూ.1.45 కోట్లు) నష్ట పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సైమన్స్ మంగళవారం కారాగారం నుంచి బయటకు వచ్చాడు. తాను నేరం చేయలేదు కాబట్టి శిక్షను ధైర్యంగా ఎదుర్కొన్నానని, ఎప్పటికైనా నిర్దోషిగా విడుదలవుతానన్న నమ్మకంతో ఉన్నానని సైమన్స్ చెప్పాడు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈ బీరు ఖరీదు 4 కోట్లు
హే... బీరుకు అంత ఖరీదుంటుందా? ఏదో పాత వైనో, విస్కీనో, షాంపేనో అయినా నమ్మొచ్చు. కానీ.. బీరు కు మరీ అంత కాస్ట్ ఉండటం ఏంటి? సహజంగా వచ్చే కామెంట్. కానీ, ఈ బీరు చాలా విలువైనది. ఎందుకంటే అది 140 ఏళ్ల కిందటిది. దీని వెనుక ఎంతో చరిత్ర ఉంది. అదే దీన్ని అత్యంత ఖరీదైన మద్యంగా చేసింది. ఒక్లోహామాకు చెందిన ఓ వ్యక్తి 2007లో ఈ బీర్ ‘ఆల్సాప్స్ ఆర్కిటిక్ ఆలె’ని మసాచుసెట్స్‌కు చెందిన ఓ సెల్లర్ నుంచి కొన్నాడు. షిప్పింగ్‌తో కలిపి రూ. 24 వేలు అయ్యింది. ఆ బాటిల్‌తో పాటు... లామినేట్ చేసిన చేతిరాత నోట్ ఒకటి వచ్చింది. ‘ఈ బాటిల్‌ను 1919లో నేను పొందాను. దీన్ని 1852లో ఆర్కిటిక్ యాత్ర కోసమే తయారు చేశారు’ అని ఆ బాటిల్ అమ్మిన పెర్సీ.జి.బోలస్టర్ పేర్కొన్నాడు. కొనుగోలు చేసిన వ్యక్తి ఆసక్తితో పరిశోధిస్తే ఈ చరిత్ర తెలిసింది. ‘ఆ బీర్‌ను సర్ జాన్ ఫ్రాంక్లిన్ ఆర్కిటిక్ యాత్ర కు వెళ్లేటప్పుడు వెంట తీసుకెళ్లారు. అప్పటికే ఆ వాయవ్య మార్గంలో రెండుసార్లు ప్రయాణించిన ఫ్రాంక్లిన్ బృందాన్ని ఆ యాత్ర మింగేసింది. రెండు ఓడలు మునిగిపోయాయి. 129 మంది మరణించారు. వారిని వెదకడానికి వెళ్లిన అడ్మిరల్ సర్ ఎడ్వర్డ్ బెల్చెర్కు.. వాళ్లు తీసుకెళ్లిన సరుకుల్లో ఈ బీర్ మాత్రమే దొరికింది’ అని తెలుసుకున్నాడు. ఆ అరుదైన బీర్‌ను ఈబేలో వేలం వేస్తే... 157కు పైగా బిడ్లు వచ్చాయి. చివరకు రూ.4 కోట్లకు ఆ బాటిల్‌ను ఎవరో కొనుగోలు చేశారు. దాన్ని తాగారా? లేదా? అనేది మాత్రం తెలియదు. -
భర్త మరణించిన ఆరు నెలలకు గర్భం..!
సృష్టిలో దేవతలకు కూడా దక్కని అపూర్వ బహుమతి మనుషులకు దక్కింది. అమృతం తాగిన వాళ్లు దేవతలు దేవుళ్లు.. అది కన్నబిడ్డలకు పంచే వాళ్లే అమ్మానాన్నలు అంటారు. ప్రతి మహిళ తన జీవితంలో అమ్మ అనిపించుకోవాలి అనుకుంటుంది. వాషింగ్టన్: ఓక్లహామాకు చెందిన సారా షెలెన్‌బెర్గర్(40) అనే మహిళ తన భర్త మరణించిన 14 నెలల తర్వాత ఓ బిడ్డకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఓక్లహామాకు చెందిన సారా మే 3న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బార్బడోస్ ఫెర్టిలిటీ క్లినిక్ సహకారంతో ఆమె ఈ ప్రక్రియను కంప్లీట్ చేసింది. ‘‘చిన్నారి రాకతో నా మాతృహృదయం ఉప్పొంగింది. బిడ్డను గుండెలకు హత్తుకోవడం గొప్ప అనుభవాన్ని ఇస్తోంది.’’ అని తెలిపింది. కాగా, దక్షిణ నజరేన్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడు సారా, స్కాట్ కలుసుకున్నారు. వారి పరిచయం ప్రేమగా మారింది. సెప్టెంబర్ 2018 లో వివాహం చేసుకున్నారు. కనీసం ముగ్గురు పిల్లలకు జన్మనివ్వాలని కోరుకున్నారు. కానీ వారి కోరిక నెరవేరలేదు. ఆమె భర్త స్కాట్(41) గతేడాది ఫిబ్రవరిలో గుండు పోటుతో కన్నుమూశారు. మరి ఎలా సాధ్యమైంది? పిల్లల కోసం ఈ జంట చాలాకాలం నిరీక్షించింది. అయితే వైద్యులు ఐవీఎఫ్‌ను ఎంచుకోవాలని వారికి సలహా ఇచ్చారు. యుఎస్‌లో ఐవిఎఫ్ పద్దతిలో బిడ్డను కనడం చాలా ఖర్చుతో కూడుకున్నది. దీంతో ఈ జంట బార్బడోస్ ఫెర్టిలిటీ సెంటర్‌కు వెళ్లారు. కానీ, బిడ్డ పుట్టకముందే ఆమె భర్త కన్నుమూశారు. అయితే పిండం ప్రక్రియను ప్రారంభించడానికి ముందు సారా, ఆమె భర్త అందుకు చేయాల్సిన పనులను పూర్తి చేశారు. జీవిత భాగస్వామి చనిపోతే పిండాలకు సంబంధించి తదుపరి ప్రక్రియ ఎలా అనుసరించాలో అందులో రాసుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం ఆమెకు బిడ్డను కనేందుకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదు. పిండాన్ని ఐవిఎఫ్ పద్దతిలో అప్పటికే స్టోర్ చేసి ఉంచడం ద్వారా సారా షెలెన్‌బెర్గర్ బిడ్డకు జన్మనిచ్చింది. రెండో బిడ్డను కనేందుకు ఆసక్తి ‘‘తన భర్త ఇప్పుడు లేడు. కానీ ఈ సమయంలో బిడ్డకు జన్మనివ్వాలన్న నిర్ణయానికి తన భర్త మద్దతు ఉందని కచ్చితంగా చెప్పగలను. బిడ్డ పుట్టినప్పటి నుంచి నా జీవితానికి ఓ అర్థం దొరికినట్లు ఉంది. పిల్లలకు తండ్రిలేని లోటు లేకుండా పెంచుతాను. అంతేకాకుండా మరో పిండం కూడా భద్రపరచి ఉంది. అదే చివరిది… దానితో వచ్చే ఏడాది చివరి నాటికి రెండో బిడ్డను కనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.’’ అని సారా షెలెన్‌బెర్గర్ చెప్పారు. ఇక సారా తన భర్త, బిడ్డతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి ప్రస్తుతం తెగ వైరలవుతున్నాయి. View this post on Instagram A post shared by 🌵Sarah Shellenberger🌵 (@sarahrshellenberger) -
‘ఇంట్లో రాక్షసులు: చంపి గుండెని కోసి కూర వండాడు’
వాషింగ్టన్: కొన్ని రకాల నేరాలు.. వాటికి పాల్పడిన వ్యక్తుల్ని చూస్తే.. మనుషుల్లో ఇంత రాక్షసత్వం దాగి ఉంటుందా.. ఇంత క్రూరంగా.. దారుణంగా ఓ మనిషిని చంపగలరా అనే అనుమానం, భయం కలుగుతాయి. వారిని తిట్టడానికి.. వారి చేష్ట గురించి వివరించడానికి ఏ భాష సరిపోదు. తాజాగా ఇలాంటి భయానక ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి అత్యంత పాశవీకంగా ఒకరిని చంపి.. గుండెని పెకిలించి.. దాన్ని కూర వండిన పైశాచిక చర్య వెలుగు చూసింది. నేరస్తుడు చెప్పిన విషయాలు విన్న పోలీసులకే వెన్నులో ఒణుకు వచ్చింది. ఓక్లహోమాలో చోటు చేసుకున్న ఈ భయానక దారుణం వివరాలు.. లారెన్స్ పౌల్ ఆండర్సన్ వ్యక్తి డ్రగ్స్ కేసులో దాదాపు 20 ఏళ్ల పాటు జైలులో గడిపి కొన్ని వారాల కిందటే విడుదలయ్యాడు. ఈ క్రమంలో రెండు వారాల క్రితం అతడు తన ఇంటి పక్క వ్యక్తిని కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత మరణించిన వ్యక్తి గుండెని బయటకు తీసి.. దాన్ని తన అంకుల్ వాళ్ల ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ గుండెని కోసి.. ఆలుగడ్డలతో కలిపి కూర వండాడు. ఆ తర్వాత అంకుల్ కుటుంబ సభ్యుల చేత దాన్ని తినిపించాలని భావించాడు. ఇతడి వికృత చేష్టలు చూసిన పౌల్ అంకుల్, అతడి కుటుంబ సభ్యులు భయపడి ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దాంతో పౌల్ అతడి అంకుల్ని, వారి నాలుగేళ్ల కుమార్తెని చంపేశాడు. అంకుల్ భార్యని చిత్రహింసలకు గురి చేశాడు. ఆమె ఎలానో తప్పించుకుని.. బయటపడగలిగింది. స్థానికులు ఆమెని ఆస్పత్రిలో చేర్చారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఓక్లహోమా పోలీసులు పౌల్‌ని అరెస్ట్ చేశారు. విచారణలో అతడు విస్తుపోయే అంశాలు వెల్లడించాడు. తన అంకుల్ ఇంట్లో రాక్షసులు ఉన్నారని.. వారిని తరమడం కోసం.. గుండెని వండి వారితో తినిపించాలని భావించాను అన్నాడు. కానీ వారు అంగీకరించకపోవడంతో చంపేయాల్సి వచ్చిందని తెలిపాడు. లేదంటే ఆ రాక్షసులు అంకుల్ కుటుంబాన్ని పీడించి.. వారిని ఆవహించి.. జనాలను చంపేసేవారు అన్నాడు పౌల్. చదవండి: కిడ్నాప్ డ్రామా ఆడి అడ్డంగా బుక్కయ్యాడు టిక్‌టాక్‌లో.. కాస్ట్లీ మిస్టేక్! -
చెప్పుల దుకాణంలో మహిళ అనుచిత ప్రవర్తన
-
మాస్కు ధరించమన్నందుకు షూ విసిరి..
ఓక్లహోమా: కరోనా వచ్చిన తర్వాత మాస్క్ కూడా మన జీవితంలో ఓ భాగంగా మారిపోయింది. అనేక చోట్ల మాస్కు లేకుండా గడప దాటితే జేబుకు చిల్లు పడేలా జరిమానా వసూలు చేస్తున్నారు. అటు కరోనా కూడా విపరీతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జనాలు స్వతాహాగానే మాస్కు ధరించే బయటకు వెళుతున్నారు. అయితే మాస్కు పెట్టుకోమని విజ్ఞప్తి చేసినందుకు ఓ మహిళ దురుసుగా ప్రవర్తించిన ఘటన అమెరికాలోని ఓక్లహోమాలో చోటు చేసుకుంది. ఓక్లహోమా సిటీకి చెందిన ఓ మహిళ మాస్కు లేకుండానే చెప్పుల షాపులోకి వెళ్లింది. అక్కడున్న మహిళా సిబ్బంది ఆమెను మాస్కు పెట్టుకోమని సూచించింది. సదరు వినియోగదారురాలు అదేమీ పట్టించుకోలేదు. (మాస్క్ చాలెంజ్!) దీంతో ఆమె మరోసారి చెప్పి చూసింది. అంతే.. ఆగ్రహంతో ఊగిపోయిన సదరు మహిళ దగ్గరున్న షూ బాక్సులను తీసుకుని సిబ్బందిపైకి విసిరిపారేసింది. అనంతరం ప్రధాన ద్వారం గుండా బయటకు నడుచుకుంటూ వెళ్లింది. ఈ హఠాత్పరిణామంతో షాక్ తిన్న మహిళా సిబ్బంది వెంటనే తేరుకుని "మీరు నాపై దాడి చేశారు.. మీ లైసెన్స్ నెంబర్ ఇవ్వండి" అంటూ ఆమె వెనకాలే వెళ్లింది. కానీ అప్పటికే ఆమె కారులో వెళ్లిపోయింది. అయితే ఆమె పర్సును కౌంటర్లో వదిలి వెళ్లిపోవడంతో దాని ఆధారంగా షాపు నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూలై 8న జరిగినట్లుగా భావిస్తున్న ఈ ఘటన తాలూకు వీడియో అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. (అడ్రస్: అక్కడకు వచ్చి నన్ను పిలవండి !) -
అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి
టెక్సాస్ : ఓక్లహామాలోని ఎత్తైన జలపాతమైన టర్నర్ ఫాల్స్‌లో మునిగిపోయి తెలుగు విద్యార్థి మృతిచెందాడని సిటీ ఆఫ్ డేవిస్ పోలీసులు తెలిపారు. టెక్సాస్‌లోని విచిత ఫాల్స్‌కు చెందిన నాగ సుభాష్ మోతురు(26) బ్లూ హోల్ పూల్‌లో పడి మృతిచెందినట్టు అధికారులు చెప్పారు. సుభాష్ టెక్సాస్‌లోని విచిత ఫాల్స్‌లోని మిడ్ వెస్ట్రన్ స్టేట్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి టర్నర్ ఫాల్స్‌జలపాతం సందర్శించడానికి వెళ్లినప్పుడు ఈ సంఘటన చోటుచేసుకుంది. కరోనా మహమ్మారితో జలపాతం వద్ద లైఫ్‌గార్డులు ఎవరూ విధుల్లో లేరు. అమెరికాలోనే ఉంటున్న సుభాష్ సోదరి మృధాలిని తన తమ్ముడిని ఇండియాకు తీసుకెళ్లడానికి సహాయం చేయాలని విజ్ఞప్తి చేస్తోంది. -
కామ పిశాచి.. సవతి కూతురిని దాచేసి
న్యూఢిల్లీ : మానవ మృగాల్లో కూడా అనిర్వచనీయ కరడుగట్టిన మృగాలు ఉంటాయని అమెరికాకు చెందిన హెన్రీ మిచెల్లీ పియెట్ నిరూపించాడు. 63 ఏళ్ల ఆ కామ పిశాచి తన సవతి కూతురిని 11 ఏళ్ల వయస్సులో కిడ్నాప్ చేసి అక్రమంగా పెళ్లి చేసుకున్నాడు. ఆమెను మెక్సికోకు తీసుకెళ్లి అక్కడ ఆమెపై ప్రతిరోజు భౌతికంగానే కాకుండా లైంగిక దాడి చేసి ఏకంగా తొమ్మిది మంది పిల్లలను కన్నాడు. తాను మాత్రం బీరు సీసాలతో, హోటల్ భోజనంతో కులాసాగానే బతుకుతూ భార్యా, పిల్లలను అర్ధాకలికి వదిలేసి భూలోక నరకం చూపించాడు. (బాయ్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో పెట్టి తాళం..) 1997 నుంచి 19 ఏళ్ల పాటు తన సవతి తండ్రి పియెట్ నిర్బంధంలో ప్రత్యక్ష నరకాన్ని అనుభవించిన రొసాలిన్ మ్యాక్గిన్నిస్, స్థానికుల సహాయంతో 2016 జూన్‌లో ఎనిమిది మంది పిల్లలతో తప్పించుకొని అమెరికాలోని ఓక్లహామ చేరుకున్నారు. పెద్ద కుమారుడు అంతకుముందే ఆ చెర నుంచి తప్పించుకొని ఎక్కడికో పారిపోయారు. రొసాలిన్ తన భర్తగానీ భర్త పియెట్‌పై కేసు పెట్టగా, ఆయన్ని ఓక్లహామ పోలీసులు 2017లో అరెస్ట్ చేశారు. ఈ కేసును విచారించిన ఓక్లహామ ఫెడరల్ కోర్టు పియెట్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ గత బుధవారం తీర్పు చెప్పింది. ఈ తీర్పు రొసాలిన్‌కు జరిగిన నష్టాన్ని పూడ్చ లేదని, ఆమె పట్ల సానుభూతి చూపడం తప్ప తాము చేయగలిగింది ఏమీ లేదని అమెరికా అటార్నీ బ్రియాన్ జే. కుస్టర్ వ్యాఖ్యానించారు. రొసాలిన్‌కు ప్రస్తుతం 34 ఏళ్లు. ఆమె ‘పీపుల్ టీవీ’కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూ ప్రకారం ఆమె తొమ్మిదవ ఏట, ఆమె తల్లి, పియెట్‌తో డేటింగ్ చేస్తూ కలిసి ఉన్నారు. అప్పుడే పియట్, రొసాలిన్‌ను లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. పియట్ భౌతికంగా కొడుతుండడంతో రొసాలిన్ తల్లి కూడా ఆయనతో విడిపోయింది. అప్పటికే తనకు ముగ్గురు పిల్లలున్న పియెట్ ఓ రోజు వారితో కలిసి రొసాలిన్ చదువుతున్న స్కూల్‌కు వ్యాన్‌లో వెళ్లి ఆమెను కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. అప్పటికి 11 ఏళ్లున్న రొసాలిన్‌ను పియెట్ తన పిల్లలకు తల్లిగా పరిచయం చేసి, వారి సాయంతో ఆమెను అక్రమంగా పెళ్లి చేసుకున్నాడు. మెక్సికో వెళ్లిన తర్వాత పియెట్ ఓ షెడ్డులో రొసాలిన్తో వేరు కాపురం పెట్టాడు. బయటకు వెళ్లేటప్పుడు పియెట్ షెడ్డుకు తాళం పెట్టి వెళ్లేవాడు. రొసాలిన్‌కు 15వ ఏట మొదటి సంతానం కలిగింది. అప్పటి వరకు పారిపోయేందుకు పలు సార్లు ప్రయత్నించి విఫలమైన రొసాలిన్ ఆ తర్వాత తెలియని మానసిక స్థితిలో నిస్తేజంగా ఉండిపోయి తొమ్మిది మంది పిల్లలకు తల్లయింది. పిల్లలు కూడా సరిగ్గా తిండిలేక ఇబ్బంది పడుతుండడంతో వారిని తీసుకొని ఎక్కడికన్నా పారిపోవాలనుకుంది. చేతిలో చిల్లి గవ్వా లేకపోవడం, ఇరుగు, పొరుగు వారితో కనీసం ముఖ పరిచయం కూడా లేకపోవడంతో పారిపోయేందుకు అంతగా సాహసం చేయలేక పోయింది. 2016లో కొద్దిగా పరిచయమైన పొరుగింటి మహిళ సహకారంతో రొసాలిన్, మెక్సికోలోని అమెరికా అంబసీని సందర్శించి అమెరికాలోని ఓక్లహామ చేరుకున్నారు. ‘నేను ఎలా బతికానో, ఎందుకు బతికానో తెలియదు. నా 19 ఏళ్ల జీవితం జీవచ్ఛవంలా, అగమ్య గోచరంగా, ఒకరకమైన అపస్మారక స్థితిలో సాగింది’ అంటూ ఆమె ఇంటర్వ్యూలో కన్నీళ్లు పెట్టుకుంది. పియెట్ పైసాచిక ఉదంతం ఆస్ట్రియా రేపిస్ట్ జోసఫ్ ఫ్రిజిల్ ఉదంతాన్ని గుర్తు చేస్తోంది. ఆ రాక్షసుడు సొంత కూతురిని నేల మాలిగలో 24 ఏళ్ల పాటు నిర్బంధించి ఏడుగురు సంతానాన్ని కన్నాడు. (చదవండి: చచ్చిపోతా.. చిన్నోడి కోసం 4 లక్షల డాలర్లు!) -
అమెరికాలో కాల్పుల కలకలం
లాస్ ఏంజలస్/ఒక్లహామా: అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం చెలరేగింది. సోమవారం రెండు వేర్వేరు చోట్ల జరిగిన కాల్పుల్లో 7 మంది మృతిచెందగా, 6 మంది గాయపడ్డారు. మొదటి ఘటన లాస్ ఏంజలస్‌కు 320 కిలోమీటర్ల దూరంలోని ఫ్రెస్నోలో జరిగింది. ఇక్కడ కాల్పుల్లో నలుగురు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. మరోఘటన ఒక్లహామాలోని వాల్‌మార్ట్ స్టోర్ వద్ద జరిగింది. ఈ కాల్పుల్లో మొత్తం ముగ్గురు మరణించారు. -
ఎన్నారైల నీటి ప్రమాదాలపై ‘టాటా’ ఆందోళన
ఎన్నో ఆశలతో, మరెన్నో ఆశయాలతో అమెరికా బాటపడుతున్న తెలుగు యువత అవి నెరవేరకముందే అర్ధాంతరంగా మృత్యువాత పడుతున్నారు. ఎన్నో కలల్ని మోసుకుంటూ ఉన్నత దిశగా ఎదగాలని, వారి మీదే ప్రాణాల్ని పెట్టుకున్న కుటుంబ సభ్యులకి మంచి జీవితం ఇవ్వాలనే కోరికలతో వెళ్లి ఇలా విదేశాల్లో ప్రమాదాల బారిన పడి అయినవారికి తీరని శోకాన్ని మిగల్చడం బాధాకరం. అమెరికా గడ్డపై ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. వాటిలో కూడా సరదా కోసం నీటిలోకి దిగి ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో పీజీ చేస్తున్న ఇద్దరు తెలుగు విద్యార్థులు కౌశిక్ ఓలేటి, కొయ్యలముడి అజయ్‌లు సెప్టెంబరు 3న నీట మునిగి ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. ఈ ప్రమాదాలపై తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(టాటా) ఆందోళన వ్యక్తం చేసింది. టాటా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మహేష్ ఆదిభట్ల దీనిపై ఒక ప్రెస్ నోట్‌ను విడుదల చేశారు. నీటిలో మునిగి చనిపోవడం వల్ల అమెరికాలో ఏడాదికి 3,72,000మంది చనిపోతున్నారు. ఈ మరణాలలో భారత సంతతికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. ఇటీవల కాలంలో ఈ ప్రమాదాలు ఎక్కువగా జరగడం మా దృష్టికి వచ్చింది. సరైన అవగాహన లేక నదులు, జలపాతాలలోకి దిగి ప్రాణాలు విడుస్తున్నారు. కొందరు తమ మాతృదేశంలో మంచి ఈత వచ్చిన వారు కావొచ్చు. అలా అని అమెరికాలోని నదులలో ఈత అంత సులభం కాదు. మన నదుల తీరు వేరు. ఇక్కడి పరిస్థితులు వేరు. ఇవేవి తెలియకుండా భారత్‌లో ఈత కొట్టాం.. అమెరికాలో కొట్టలేమా అని నదులలోకి దిగి మృత్యువాత పడుతున్నారు. భారత నదులకు పూర్తి భిన్నంగా ఇక్కడి నదులు ఉంటాయి. ఒక్లహామాలోని టర్నర్‌ఫాల్స్, డల్లాస్‌లోని గ్రేప్‌వైన్, క్రేటర్ లేక్, లివర్మోర్ నదులలో ఎక్కువగా భారతీయులు ప్రమాదాల బారిన పడుతున్నారు. టర్నర్‌ఫాల్స్ జలపాతంలో గత మూడు నెలల్లోనే నలుగురు భారతీయులు మృత్యువాత పడ్డారు. జులై నెలలో ఒకరు, ఆగస్టులో ఒకరు, సెప్టెంబర్‌లో ఇద్దరు ఈ జలపాతంలో మునిగి చనిపోయారు. భారతీయులకు ఈ నదులపై సరైన అవగాహనలేక వీటిని పర్యాటాక స్థావరాలుగా భావించి తెలియక నీటిలో దిగి మృత్యువాత పడుతున్నారు. ఈ ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకపోవడమే మంచిదని టాటా సూచిస్తోంది. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వీటిపై అవగాహన కల్పించేందుకు పలు సదస్సులు నిర్వహిస్తోంది. ఒత్తిడికి గురైన వారికి సహాయ సహకారాలు అందిస్తోంది. టాటా అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ పైల మల్లారెడ్డి, అధ్యక్షుడు విక్రమ్ జంగం సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. -
అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
వాషింగ్టన్: అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు నీట మునిగి చనిపోయిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. మృతులను కోయలమూడి అజయ్‌కుమార్ (23), వోలేటి తేజ కౌశిక్ (22)గా గుర్తించినట్లు మీడియా కథనం పేర్కొంది. అర్లింగ్టన్లోని టెక్సాస్ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న అజయ్, తేజ యూఎస్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఓక్లహోమాకు వెళ్లారు. మంగళవారం అక్కడి టర్నర్‌ఫాల్స్ అనే జలపాతంలో వారిలో ఓ వ్యక్తి ఈతకు వెళ్లి మునిగిపోగా, అతడ్ని రక్షించడానికి దూకిన మరో వ్యక్తి కూడా నీళ్లలో మునిగిపోయాడు. -
అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ దుర్మరణం
ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెరికాలోని ఓక్లహాం టర్నర్ జలపాతంలో పడి దుర్మరణం పాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. ఒంగోలుకు చెందిన నూనె సురేష్‌బాబు (41) అమెరికాలోని డల్లాస్ రాష్ట్రంలో సింటెల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. శుక్రవారం భార్య రూప, పిల్లలు గాయత్రీ అక్షయసంధ్య, సాయిమోహనీష్తో కలిసి ఓక్లహాం టర్నర్ జలపాతానికి హాలిడే ట్రిప్‌నకు వెళ్లి ప్రమాదవశాత్తు జలపాతంలో పడి దుర్మరణం పాలయ్యాడు. ‘రెండు నెలల్లో ఇంటికి వస్తానమ్మా అన్నాడు. కానరాని లోకాలకు వెళ్లాడని తెలిసింది. ఎదిగొచ్చిన కొడుకు చేతికి అందివచ్చాడనుకున్న సమయంలో జరిగిన ఈ దుర్ఘటనను ఎలా జీర్ణించుకోవాలో అర్థం కావడం లేదంటూ’ సురేష్‌బాబు తల్లిదండ్రులు వీరాస్వామి, సుబ్బరత్నం కన్నీరు మున్నీరయ్యారు. కుటుంబ నేపథ్యం ఇదీ.. ఒంగోలు మండలం కొప్పోలు గ్రామ నివాసి నూనె వీరాస్వామి. ఈయన భార్య సుబ్బరత్నం. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు వెంకట రమేష్. చిన్న కుమారుడు నూనె సురేష్‌బాబు (41). ప్రస్తుతం ఒంగోలు నగరంలోని రంగుతోట 5వ లైనులో ఉంటున్నారు. సురేష్‌బాబుకు 15 సంవత్సరాల క్రితం నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన రూపతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. పాప గాయత్రీ అక్షయ సంధ్య (13), బాబు సాయిమోహనీష్ (8). మూడేళ్ల క్రితం ఉద్యోగం నిమిత్తం వీరు అమెరికా వెళ్లారు. ఏడాది క్రితం తల్లిదండ్రులను చూసేందుకు వచ్చాడు. ఇటీవలే మరో రెండు నెలల్లో వస్తానని చెప్పాడు. ఈ లోపుగానే విషాద ఘటన సమాచారం అందింది. మృతదేహం తరలించేందుకు తెలుగు సంఘాల కృషి.. సురేష్‌బాబు మృతదేహాన్ని ఒంగోలుకు తరలించేందుకు కుటుంబ సభ్యులకు అండగా అమెరికాలో స్థిరపడ్డ తెలుగు సంఘాలు కృషి చేస్తున్నాయి. ఇప్పటికే సురేష్ మృతదేహాన్ని రెస్క్యూ టీం ఆస్పత్రికి తరలించింది. మృతదేహాన్ని డల్లాస్ నుంచి ఇండియాకు తరలించేందుకు 80 వేల డాలర్లు (రూ.53 లక్షలు) వ్యయం అవుతుందని అంచనా. ఈ మొత్తాన్ని ఆ కుటుంబం భరించడం అసాధ్యం అని భావించిన తెలుగు సంఘాలు సాయం అందించేందుకు ముందుకు వచ్చాయి. ఇప్పటికే ఫండ్ రైజింగ్ వెబ్సైట్లో తమవంతు సాయాన్ని వారు అందిస్తున్నారు. -
డోర్‌బెల్ దగ్గర అనుకోని అతిథి..!
-
వైరల్ : డోర్‌బెల్ దగ్గర అనుకోని అతిథి..!
ఓక్లహోమా : మిత్రున్ని కలిసి వెళ్దామని వచ్చిన ఓ వ్యక్తికి అనుకోని అతిథి ఎదురయ్యాడు. డోర్‌బెల్ దగ్గర నక్కి ప్రతాపం చూపాడు. ఊహించని ఆతిథ్యం లభించడంతో ఆ వచ్చిన వ్యక్తి భయంతో కంపించిపోయాడు. ప్రాణ భయంతో సాయం కోసం అర్థించాడు. జెరెల్ హేవుడ్ తన ఫ్రెండ్ రోడ్నీ కోప్ల్యాండ్ను చూడ్డానికి గత ఆదివారం ఓక్లహోమాలోని లాటన్కు వెళ్లాడు. కోప్‌ల్యాండ్ ఇంటి బయట ఉన్న డోర్‌బెల్ కొట్టగానే అతని మొహంపై పాము కాటు వేసింది. సరిగ్గా కుడికన్ను పైభాగంలో కోరలు దించింది. నొప్పితో తల్లడిల్లిపోయిన హేవుడ్.. షాక్ నుంచి తేరుకుని.. సాయం కోసం కేకలు వేశాడు. కోప్‌ల్యాండ్ సాయంతో హేవుడ్ ఆస్పత్రికి చేరుకున్నాడు. ‘నా ఫ్రెండ్‌ని పాము కాటేయడం.. సీసీ కెమెరాలో చూసి షాకయ్యాను. హేవుడ్‌ని కరిచిన పాము విషపూరితమైంది కాదు. అతను కోలుకుంటున్నాడు’ అని కోప్‌ల్యాండ్ తెలిపారు. హేవుడ్‌ని పాము కాటేస్తున్న వీడియో వైరల్ అయింది. ఇక ఇంట్లోకి దూరేందుకు యత్నించిన 5.5 అంగుళాల పొడవున్న ఆ పాముని కొట్టి చంపారు. -
స్టూడెంట్‌తో లైంగిక సంబంధం.. టీచర్ అరెస్ట్
ఓక్లహామా : అమెరికా ఓక్లహామాలోని యాకూన్ పాఠశాలలో కెమిస్ట్రీ టీచర్‌గా పనిచేస్తున్న హంటర్ డే (24) అనే మహిళను అక్రమ లైంగిక సంబంధాలు, నగ్న ఫొటోల మార్పిడి కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థి మొబైల్ ఫోన్‌ను తల్లిదండ్రులు అనుకోకుండా చూడడంతో ఈ వ్యవహరం బట్టబయలైంది. సెక్స్ చాటింగ్, న్యూడ్ ఫొటోల షేరింగ్ చేసుకుంటున్నట్లు బయటపడింది. అంతేకాక ఇద్దరి మధ్య అక్రమ లైంగిక సంబంధాలు ఏర్పడ్డట్లు విద్యార్థి తల్లిదండ్రులు గుర్తించారు. తమ కుమారుడిని హంటర్ డే లైంగికంగా వాడుకుంటోందని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. పోలీసులు స్టింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న విషయం తెలియని హంటర్ డే.. ఎప్పటిలానే లైంగిక కలయిక కోసం.. మైనర్ విద్యార్థికి మెసేజ్ చేశారు. విద్యార్థి కూడా వెంటనే స్పందించారు. అనుకున్న సమయానికి హంటర్ డే ఇంటికి విద్యార్థి వెళ్లాడు. క్యాండిల్ లైట్ వెలుగులో ఇద్దరూ శృంగారం జరుగుతున్న సమయంలో పోలీసులు ఎంటరై అమెను రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు. హంటర్ డే చర్యపై స్కూల్ యాజమాన్యం, ఇతర ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. అధ్యాపకుల మీద నమ్మకంతో విద్యార్థులను స్కూలకు పంపితే.. ఇటువంటి చర్యలకు దిగడం విద్యావ్యవస్థకే మచ్చని వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉండగా హంటర్ డేను స్కూల్ యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. -
అమెరికాలో భూకంపం
ఒక్లాహోమా: అమెరికాలోని ఒక్లాహోమా నగరంలో ఆదివారం భారీ భాకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.0గా నమోదయినట్లు యూఎస్ భూగర్భ శాస్త్రవేత్తలు తెలిపారు. నగరానికి ఈశాన్య దిశగా 50 మైళ్ల దూరంలో భూకంప కేంద్రంగా ప్రకంపనలు వచ్చినట్లు గుర్తించారు. భూకంప కేంద్రానికి చేరువలో ఉన్న కుషింగ్ పట్టణం ప్రకంపనల ధాటికి కుదేలైనట్లు తెలిసింది. పెద్ద మొత్తంలో భవనాలు, విద్యుత్తు స్తంభాలు కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని తెలిపారు. రెండు రోజుల పాటు పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు చెప్పారు. గత కొద్ది నెలలుగా ఒక్లహోమాలో భూకంపాలు సంభవించడం పెరిగింది. దాదాపు 4.5 తీవ్రతతో తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి. దీంతో భూగర్భ శాస్త్రవేత్తలు ఈ ప్రాంతంలో ఎక్కువగా పరిశోధనలు చేస్తున్నారు. -
నాడు భర్తను 25అంతస్తుల నుంచి తోసి..
ఓక్లాహామా: భర్తను హత్య చేసి ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న అంబర్ హిల్బర్లింగ్ అనే మహిళ జైలులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తాను శిక్ష అనుభవిస్తున్న సెల్ లోపల ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, జైలు అధికారులతోపాటు పలువురు ఆమె చాలా మంచి ప్రవర్తనగల మహిళ అంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. అంబర్ హిల్బర్లింగ్ 2011లో తన భర్త జోష్ హిల్బర్లింగ్ను తాము ఉంటున్న తుల్సా అపార్ట్మెంట్లో 25 వ అంతస్తులోని గది కిటికీలో నుంచి తోసేయడంతో అతడు చనిపోయాడు. దీంతో ఆమెను అరెస్టు చేసి జైలుకు తరలించారు. అయితే, గత ఏడాది జైలులో ఆమెను ఇంటర్వ్యూ చేయగా ఆ రోజు తన భర్త జోష్ తనను తీవ్రంగా కొట్టాడని, కిందపడేసి ఈడ్చానని, ఆ సమయంలో తాను గర్భవతిని అని, ఆ విషయం కూడా లెక్కచేయకుండా తనపై దాడి చేశాడని చెప్పింది. తనను తాను రక్షించుకునే క్రమంలో తోసివేయగా కిటికీలో నుంచి పడి చనిపోయాడని తెలిపింది. కానీ, అలా జరగకుండా ఉండాల్సిందని కూడా అభిప్రాయపడింది. జైలులో మంచి ప్రవర్తనతోనే ఉంటున్న అంబర్ అనూహ్యంగా సోమవారం తాను ఉంటున్న ఓక్లాహామాలోని మాబెల్ బాసెట్ కరెక్షనల్ సెంటర్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, ఆమె చనిపోవడానికి గల కారణాలను మాత్రం దర్యాప్తు అధికారులు అన్వేషిస్తున్నారు. -
సోలార్ ప్లేన్ ఇంపల్స్-2 మరో మజిలీ
వాషింగ్టన్: ప్రపంచ పర్యటన కోసం బయల్దేరిన అతిపెద్ద సోలార్ విమానం ఇంపల్స్-2 తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. పర్యటనలోభాగంగా ఆరిజోనా నుంచి ప్రారంభించిన ప్రయాణాన్ని అమెరికాలోని ఒక్లహామాలో ముగించి మరో మజిలీని విజయవంతంగా పూర్తిచేసింది. ఈ విమాన రూపకర్తల్లో ఒకరైన బెర్ట్రాండ్ పికార్డ్ పైలట్‌గా 1,568 కిలోమీటర్ల ప్రయాణాన్ని 17 గంటల 30 నిమిషాల్లో పూర్తిచేసింది. అదీ ఎటువంటి ఇంధనం లేకుండా కేవలం సౌరఫలకాల ఆధారంగా ఉత్పత్తి అయిన శక్తితోనే గమ్యాన్ని చేరుకుంది. మార్చి 9న ఇంపల్స్-2 తన ప్రపంచ ప్రయాణాన్ని మొదలుపెట్టగా మొదటి ప్రయాణానికి(శాన్ఫ్రాన్సిస్కో నుంచి ఫొనెక్స్ వరకు)ఆండ్రి బార్చ్‌బెర్గ్ పైలట్‌గా వ్యవహరించారు. సౌర ఇంధనంపై అవగాహన కల్పించేందుకే ఈ జైత్రయాత్ర చేపట్టామని దీని పైలట్లు చెబుతున్నారు. -
తెల్లతోలు పిల్లకు చుక్కలు చూపించింది
ఓక్లామా: ఓక్లామాలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తన జాతిని కించపరిచేలా మాట్లాడినందుకు ఓ నల్లజాతి యువతి, తెల్లజాతి యువతికి చుక్కలు చూపించింది. బతికుంటే చాలురా బాబు అనుకునేంత భయంకరంగా ఆ తెల్లతోలు అమ్మాయిపై శివంగిలా దాడి చేసింది. ఓ వీడియోలో రికార్డయిన ఈ దృశ్యాల ప్రకారం.. ఓక్లామాలో అలెయా అనే ఓ నల్లజాతి యువతి జాగింగ్‌కు వస్తున్న సమయంలో ఆమెకు ఓ తెల్లజాతి అమ్మాయి తారసపడింది. అప్పుడు నువ్వు ఎందులోనైనా పోటీ చేస్తున్నావా అని ప్రశ్నించగా అలాంటిదేం లేదనడంతోపాటు దానికి అలెయా జాతిని కించపరిచేలా ఒక పదాన్ని చేర్చింది. దీంతో అలా ఎందుకు అన్నావు? అలా అనడానికి నువ్వు ఎవరూ అని మెల్లగా వాగ్వాదానికి దిగింది. దానికి బదులిచ్చిన ఆ యువతి నువ్వు నా నేలపై ఉంటున్నావని మర్చిపోకు అంటూ మరోసారి అంతకుముందు అన్న అసభ్యకరమైన మాటను జారవిడిచింది. దీంతో అలెయా ఒక్కసారిగా శివంగిలా మారి ఒక్క పంచ్‌తో ఆ యువతిని కింద పడేసింది. అంతటితో ఆగకుండా వరుస పంచ్ లు ఇచ్చింది. పక్కనే ఉన్నవారు వచ్చి ఆపడంతో అలెయా శాంతించింది. -
యూఎస్ లోని రెండు రాష్ట్రాల్లో భూప్రకంనలు!
వాషింగ్లన్: అమెరికాలోని కన్సాస్, ఓక్లహామా రాష్ట్రాలను భూప్రకంపనలు వణికించాయి. భూప్రకంపనాల తీవ్రత రిక్టర్ స్ట్కేల్ పై 4.8గా నమోదైంది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.40 గంటల ప్రాంతంలో కన్సాస్ లోని కాన్ వే కు సమీపంలో సంభవించినట్టు సమాచారం. యూఎస్ లో సాధారణంగా భూకంప సంఘటనలు అరుదుగా కనిపిస్తాయి. భూకంప సమాచారాన్ని స్థానికులు ట్విటర్ లో కుప్పలుతెప్పలుగా పోస్ట్ చేశారు. భూప్రకంపనాలు ఇంత భయంకరంగా ఉంటుందని అనుకోలేదని కొందరు నెటిజన్లు ట్వీట్ చేశారు. అమెరికాలో ఎక్కువగా టోర్నాడోలు స్థానికులు భయభ్రాంతులకు గురిచేస్తాయి. తాజా అరుదైన భూప్రకంపనలు స్థానికులను ఆందోళనకు గురిచేశాయి. -
యూఎస్ లో టోర్నాడో విధ్వంసం!