తెల్లతోలు పిల్లకు చుక్కలు చూపించింది | The shocking moment a black girl punches and knocks a white girl to the floor after she called her the n-word | Sakshi
Sakshi News home page

తెల్లతోలు పిల్లకు చుక్కలు చూపించింది

Published Fri, Mar 18 2016 11:13 AM | Last Updated on Sun, Sep 3 2017 8:04 PM

తెల్లతోలు పిల్లకు చుక్కలు చూపించింది

తెల్లతోలు పిల్లకు చుక్కలు చూపించింది

ఓక్లామా: ఓక్లామాలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తన జాతిని కించపరిచేలా మాట్లాడినందుకు ఓ నల్లజాతి యువతి, తెల్లజాతి యువతికి చుక్కలు చూపించింది. బతికుంటే చాలురా బాబు అనుకునేంత భయంకరంగా ఆ తెల్లతోలు అమ్మాయిపై శివంగిలా దాడి చేసింది. ఓ వీడియోలో రికార్డయిన ఈ దృశ్యాల ప్రకారం.. ఓక్లామాలో అలెయా అనే ఓ నల్లజాతి యువతి జాగింగ్కు వస్తున్న సమయంలో ఆమెకు ఓ తెల్లజాతి అమ్మాయి తారసపడింది.

అప్పుడు నువ్వు ఎందులోనైనా పోటీ చేస్తున్నావా అని ప్రశ్నించగా అలాంటిదేం లేదనడంతోపాటు దానికి అలెయా జాతిని కించపరిచేలా ఒక పదాన్ని చేర్చింది. దీంతో అలా ఎందుకు అన్నావు? అలా అనడానికి నువ్వు ఎవరూ అని మెల్లగా వాగ్వాదానికి దిగింది. దానికి బదులిచ్చిన ఆ యువతి నువ్వు నా నేలపై ఉంటున్నావని మర్చిపోకు అంటూ మరోసారి అంతకుముందు అన్న అసభ్యకరమైన మాటను జారవిడిచింది. దీంతో అలెయా ఒక్కసారిగా శివంగిలా మారి ఒక్క పంచ్తో ఆ యువతిని కింద పడేసింది. అంతటితో ఆగకుండా వరుస పంచ్ లు ఇచ్చింది. పక్కనే ఉన్నవారు వచ్చి ఆపడంతో అలెయా శాంతించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement