Confrontation
-
భారత్‌పై ‘బంగ్లా’ విషం.. ఈ అంశాలతో స్పష్టం
ఒకప్పుడు భారత్‌తో చెలిమిచేసిన బంగ్లాదేశ్ ఇప్పుడు విషం చిమ్ముతోంది. ఆ దేశంలో హిందువులపై తరచూ దాడులు జరగుతున్నా మౌనం వహిస్తోంది. అక్కడి నేతలు అనునిత్యం భారత్‌పై నిరంకుశ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. అయినా బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ ఏమీ మాట్లాడటంలేదు. పైగా బంగ్లాదేశ్ హోమ్ మంత్రి అక్కడి సైన్యాన్ని భారత్ ముందు గట్టిగా నిలబెట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు యూనస్ ప్రభుత్వం మాజీ ప్రధాని షేక్ హసీనాను భారత్ నుంచి రప్పించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది.షేక్ హసీనా అధికారానికి దూరమైన తర్వాత, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భారత్‌కు ఏమాత్రం ఇష్టంలేని పలు నిర్ణయాలు తీసుకుంటోంది. అయినప్పటికీ భారత్ ఆ దేశంతో స్నేహపూర్వకంగానే మెలుగుతోంది. బంగ్లాదేశ్‌కు చెందిన పలువురు నేతలు తమ వ్యాఖ్యలతో విషం చిమ్ముతున్నా, భారత్ ఇంకా మాటల యుద్దం ప్రారంభించలేదు. భారత్.. బంగ్లాదేశ్ విషయంలో ఎంతో సంయమనం పాటిస్తోంది.బంగ్లాదేశ్‌లో భారత్‌కు వ్యతిరేకంగా..1. హిందువులపై దాడిబంగ్లాదేశ్లో హిందువులపై తరచూ దాడులు జరుగుతున్నాయి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం ఈ సంవత్సరంలో ఇప్పటివరకు బంగ్లాదేశ్‌లో హిందువులపై 2,200కి పైగా అఘాయిత్యాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. ఇది పాకిస్తాన్లో జరిగినదాని కంటే 10 రెట్లు అధికం.2. పాకిస్తాన్‌తో చెలిమిబంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ తాజాగా పాకిస్తాన్‌తో చెలిమి కోరుకుంటున్నారు. పాక్ నేతలతో సంబంధాలు నెరపుతున్నారు. పాకిస్తాన్ నుండి షిప్ కంటైనర్లు తరచూ చిట్టగాంగ్ నౌకాశ్రయానికి చేరుకుంటున్నాయి. పాక్ సైన్యం బంగ్లాదేశ్ ఆర్మీకి శిక్షణ ఇవ్వబోతోంది.3. సార్క్ పునరుద్ధరణకు యత్నంసౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కోఆపరేషన్ (సార్క్)పై దృష్టి సారించడంపై భారత్ సుముఖంగా లేదు. అయతే బంగ్లాదేశ్ ప్రభుత్వం దానిని పునరుద్ధరణకు ప్రయత్నాలు సాగిస్తోంది.4. దౌత్య సంబంధాలను విచ్ఛిన్నంబంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్‌తో దౌత్య సంబంధాలను విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశ్యంలో ఉంది. ఈ నేపధ్యంలో బంగ్లాదేశ్ హైకమిషనర్ ప్రణయ్ వర్మను వెనక్కి పిలిపించింది. ఇలాగే మరో ఇద్దరు దౌత్యవేత్తలను కూడా వెనక్కి పిలిపించింది.5. సాధారణ సంబంధాలలోనూ..మన విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ బంగ్లాదేశ్‌ను సందర్శించినప్పుడు, యూనస్ లేదా బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన సోషల్ మీడియా ఖాతాలలో ఇందుకు సంబంధించిన ఫొటో పోస్ట్ చేయలేదు. సాధారణ విధివిధానాలను కూడా బంగ్లాదేశ్ పాటించలేదు. ప్రధాని మోదీ బంగ్లా ప్రధాని యూనస్‌కు ఫోన్ చేసినప్పటికీ ఆయన చర్చల కోసం ఏ ప్రతినిధి బృందాన్నీ భారత్‌కు పంపలేదు. దీనిని చూస్తుంటే భారత్‌తో బంధాన్ని చెడగొట్టుకుంటోందని స్పష్టమవుతోంది.6. షేక్ హసీనా అప్పగింత షేక్ హసీనాను బంగ్లాదేశ్‌కు వెళ్లేందుకు భారత్ అంత తేలిగ్గా అనుమతించదని బంగ్లాదేశ్‌కు తెలుసు. అయినా భారత్ పరువు తీయాలనే ఉద్దేశంతో షేక్ హసీనాను రప్పించేందుకు ప్రయత్నిస్తోంది. భారత్‌తో సంబంధాలు చెడగొట్టేందుకే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.ఇది కూడా కారణమేబంగ్లాదేశ్ ప్రజలు షేక్ హసీనాపై ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపధ్యంలో ఆమెకు ఆశ్రయం ఇచ్చిన భారత్‌పై మండిపడుతున్నారు. షేక్ హసీనాకు భారతదేశం మద్దతు ఇస్తున్నదని, అందుకే ఆమె నియంతగా మారిందని వారు ఆరోపిస్తున్నారు. ఇటువంటి సమయంలో ముహమ్మద్ యూనస్ ప్రభుత్వం అక్కడి ప్రజల కోపాన్ని చల్లార్చడానికి బదులుగా, రెచ్చగొట్టేటట్లు చేస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.బంగ్లాదేశ్ ఈ తీరులో ప్రవర్తిస్తున్నా భారత్.. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాను దౌత్య ఆయుధంగా ఉపయోగించలేదు. ఆమెను అడ్డుపెట్టుకుని బంగ్లాదేశ్‌ను అస్థిరపరిచేందుకు ఎలాంటి ప్రణాళిక చేయలేదు. షేక్ హసీనాను మాజీ ప్రధానిగా గౌరవిస్తున్నామని, అందుకే కొత్త ప్రభుత్వంతో చర్చలు ప్రారంభించామని భారత్ స్పష్టం చేసింది. రాజకీయ నిపుణుల అభిప్రాయం ప్రకారం ముహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్‌లో తన అధికారాన్ని కాపాడుకోవాలని అనుకుంటున్నారు. అందుకే బంగ్లాదేశ్ వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకోకూడదని కోరుకుంటున్నారు.ఇది కూడా చదవండి: World Year Ender 2024: హద్దులు దాటిన విమర్శలు.. వివాదాల్లో రాజకీయ ప్రముఖులు -
'క్షమించండి.. మళ్లీ రిపీట్ కానివ్వను'
ఢాకా : బంగ్లాదేశ్ క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్ బంగబంధు టీ20 కప్‌లో సోమవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో సహచర ఆటగాడు నజుమ్ అహ్మద్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఒక జూనియర్ క్రికెటర్‌పై రహీమ్ ఇలా ప్రవర్తించడమేంటని పలువురు మాజీ, సీనియర్ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. రహీమ్ చర్యకు మ్యాచ్ రిఫరీ అతని ఫీజులో 25శాతం జరిమానా విధించాడు.తాజాగా రహీమ్ తాను చేసిన పనికి బాధపడుతున్నానని.. మళ్లీ ఇలాంటిది రిపీట్ కాకుండా చూసుకుంటాని ఫేస్బుక్ వేదికగా అభిమానులకు చెప్పుకొచ్చాడు. (చదవండి : కొట్టేస్తా... ఏమనుకున్నావ్!) 'మ్యాచ్ సందర్భంగా తోటి క్రికెటర్‌పై నేను చేసిన పనికి సిగ్గుపడుతున్నా. మ్యాచ్ ముగిసిన వెంటనే నజుమ్ అహ్మద్‌కు క్షమాపణ కోరాను. ఒక మనిషిగా నేను అలా ప్రవర్తించడం తప్పు. అతన్ని కొట్టడానికి చేయి చూపించడం సరైనది కాదు. అందుకే నా చర్యను తప్పుబడుతూ క్రికెట్ అభిమానులకు.. ఆరోజు మైదానంలో ఉన్న ప్రేక్షకులకు మరోసారి క్షమాపణలు కోరుతున్నా. ఇలాంటి ఘటన నానుంచి మళ్లీ పునరావృతం కావని మీకు ప్రామిస్ చేస్తున్నా.' అంటూ ఉద్వేగంతో పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో రహీమ్ జట్టు బెక్సింకో ఢాకా 9 పరుగులతో ఫార్చున్ బరిషల్‌పై నెగ్గి ప్లే ఆఫ్‌కు చేరింది. -
కమిషనర్, మాజీ కార్పొరేటర్ మధ్య వివాదం
కాకినాడ: నగరపాలక సంస్థ కమిషనర్ కె.రమేష్, మాజీ కార్పొరేటర్ బసవా చంద్రమౌళి మధ్య చోటు చేసుకున్న సంవాదం చిలికిచిలికి గాలివానగా మారింది. తన ఇంటి సమీపంలో గబ్బిలాలు తిరుగుతున్నాయంటూ ఫోన్ చేసిన మాజీ కార్పొరేటర్.. తనను దుర్భాషలాడుతూ, అసభ్య పదజాలంతో దూషించారని కమిషనర్ కె.రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తరువాత కొంతమంది పారిశుద్ధ్య కార్మికులతో కమిషనర్ తనపై దాడి చేశారంటూ మాజీ కార్పొరేటర్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం రచ్చకెక్కింది. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో కమిషనర్‌కు చంద్రమౌళి ఫోన్ చేశారు. తమ ఇంటి చుట్టూ పెద్ద ఎత్తున గబ్బిలాలు తిరుగుతున్నాయని కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ఆ సమయంలో మాజీ కార్పొరేటర్ అసహనంతో తనను, తన కుటుంబ సభ్యులను కించపరిచేలా దుర్భాషలాడరని కమిషనర్ చెబుతున్నారు. ఆ తరువాత కూడా రాత్రి పదేపదే చంద్రమౌళి తనకు ఫోన్లు చేశారని కమిషనర్ తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో కొంతమంది పారిశుద్ధ్య కార్మికులతో మాజీ కార్పొరేటర్ ఇంటి వద్దకు కమిషనర్ రమేష్ వెళ్లారు. అక్కడ ఇద్దరి మధ్య మరోసారి వివాదం రాజుకుంది. తన ఇంటికి వచ్చిన కమిషనర్, దాడి చేసి కొట్టారంటూ చంద్రమౌళి ప్రభుత్వాస్పత్రికి వెళ్లి ఎంఎల్సీ చేయించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వివాదం నేపథ్యంలో మున్సిపల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీవీఎస్ఎన్ మూర్తి, రాష్ట్ర ఎన్జీఓ సంఘ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌తో పాటు వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు కమిషనర్ రమేష్‌ను కలిసి సంఘీభావం ప్రకటించాయి. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలు ఇళ్లకు పరిమితమైతే మున్సిపల్ ఉద్యోగులు ఎంతో శ్రమకోర్చి పని చేస్తున్నారని, వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా మాజీ కార్పొరేటర్ వ్యవహరించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రమౌళి మాట్లాడుతూ తన ఇంటికి వచ్చి దాడి చేసి గాయపర్చిన కమిషనర్‌పై చర్య తీసుకోవాలని టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. జీజీహెచ్‌లో మాజీ కార్పొరేటర్‌ను ద్వారంపూడి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వీరభద్రారెడ్డి, వైఎస్సార్ సీపీ నగరాధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్ పరామర్శించారు. -
‘వ్యవసాయ’ బదిలీల్లో రసాభాస
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ శాఖలో బదిలీలు ఉద్రిక్తతకు దారితీశాయి. ఉద్యోగ సంఘాల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. దీంతో ధర్నాలు, నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో బదిలీ కౌన్సెలింగ్‌ను మరో రోజుకు వాయిదా వేస్తూ వ్యవసాయశాఖ కమిషనర్ జగన్మోహన్ నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ శాఖలో బదిలీ ప్రక్రియ సోమవారం మొదలైంది. వ్యవసాయ శాఖ శిక్షణ కేంద్రంలో కమిషనర్ కౌన్సెలింగ్ చేపట్టా రు. ఐదో జోన్‌కు చెందిన వ్యవసాయ ఉద్యోగులు, అధికారుల బదిలీ ప్రక్రియ నిర్వహించారు. జూనియర్, సీనియర్ అసిస్టెం ట్లు, సూపరింటెండెంట్ల బదిలీ ప్రశాంతంగానే ముగిసింది. ఆ తర్వాత సహాయ వ్యవసాయాధికారుల(ఏడీఏ) కౌన్సెలింగ్‌ను ప్రారంభించడంతో రెండు వ్యవసాయ సంఘాల మధ్య వివాదం నెలకొంది. తమకు అన్యాయం జరుగుతుందని వారు నిరసనకు దిగారు. జీవోకు వ్యతిరేకంగా కమిషనర్ బదిలీలు చేపడుతున్నా రని ఓ సంఘం, నిబంధనల ప్రకారం చేస్తున్నా అతనికి అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ మరో సంఘం ఆరోపించాయి. ఏడీఏ ల్లో ఏడెనిమిది మందికి అర్హత ఉన్నా పోస్టింగులు సరిగా ఇవ్వలేదని ఓ సంఘం ఆరోపించింది. మండల వ్యవసాయాధికారుల(ఏవో) బదిలీ ప్రక్రియలో 7 నుంచి పదేళ్ల సర్వీసు దాటిన ఉద్యోగులను బదిలీ చేయలేదని పలువురు ఆరోపించారు. ఉన్న ఉద్యోగుల్లో 40% బదిలీ చేయాల్సి ఉండగా, కట్ ఆఫ్ పరిధిని మించి బదిలీ చేస్తున్నారని మరో సంఘం ఆరోపించింది. నేడూ ఐదో జోన్ బదిలీలే... ఐదో జోన్ బదిలీలు వాయిదా పడటంతో మంగళవారం అదే జోన్‌కు చెందిన ఏవోల బదిలీలు పూర్తిచేస్తామని వ్యవసాయశాఖ కమిషనర్ ‘సాక్షి’కి తెలిపారు. మంగళవారం జరగాల్సిన ఆరో జోన్ బదిలీలను బుధవారానికి వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. ఐదో జోన్ ఏడీఏల బదిలీ ప్రక్రియ ముగిసిందని, అదే జోన్ ఏవో ల కౌన్సెలింగ్ నిర్వహణకు సమయం సరిపోకపోవడంతో వాయి దా వేశామన్నారు. నిబంధనల ప్రకారం కమిషనర్ బదిలీ కౌన్సెలింగ్ చేపట్టడం లేదని తెలంగాణ వ్యవసాయాధికారుల సంఘం చైర్మన్ కృపాకర్‌రెడ్డి ఆరోపించారు. కాగా, కౌన్సెలింగ్ ప్రక్రియ నిబంధనల ప్రకారం జరుగుతుందని తెలంగాణ అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు రాములు అన్నారు. -
అన్నదమ్ముల మధ్య గొడవలో చిన్నారి మృతి
నెక్కొండ(నర్సంపేట) : ఇద్దరు అన్నదమ్ముల మ« ద్య జరుగుతున్న గొడవను చూసేందుకు వెళ్లిన ఓ చిన్నారి తలకు తీవ్ర గాయమై మృతి చెందిన సంఘటన వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మం డలంలో గురువారం చోటుచేసుకుంది. తండావా సులు, బంధువుల కథనం ప్రకారం.. మండలం లోని గొల్లపెల్లి శివారు ధర్మతండలో బుధవారం రాత్రి అన్నదమ్ములు బాదావతు శంకర్, నర్సింహలు ఇంటి వద్ద బాట విషయంలో గొడవకు దిగారు. తమ్ముడు నర్సింహ తాగిన మైకంలో శంకర్ కుటుంబ సభ్యులను తిట్టడంతో ఇరువురి మధ్య గొడవ ముదిరి దాడులకు దారితీసింది. దీంతో నర్సింహ రాళ్లతో దాడి చేయడగా శంకర్ భార్య తార చాతికి తగలడంతో ఆమె కేకలు వేసింది. ఈ క్రమంలో బాదావతు లక్ష్మీ–వీరన్న కుమార్తె అఖిల(11) పెద్దమ్మా అంటూ తార దగ్గరికి వెళ్లింది. ఈ క్రమంలో నర్సింహ విసిరిన బండరాయి అఖిల తల వెనుక భాగంలో గట్టిగా తగలడంతో స్పృహ కోల్పోయింది. తండావాసులు అందించిన సమాచారంతో 108 సిబ్బంది అక్కడికి చేరుకుని అఖిలను ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలో మృతి చెందిం ది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. చిన్నారి కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై నవీన్‌కుమార్ తెలిపారు. -
‘ఆళ్లగడ్డ పంచాయితీ’ నేటికి వాయిదా
సాక్షి, అమరావతి: పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి వర్గాల మధ్య కర్నూలు జిల్లాలో సయోధ్య కుదిర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో జరగాల్సిన సమావేశం శుక్రవారానికి వాయిదా పడింది. సైకిల్ యాత్ర చేస్తున్న సుబ్బారెడ్డిపై రాళ్లదాడి జరగడంతో టీడీపీలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడడంతో ఇద్దరినీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో పంచాయితీకి పిలిచిన విషయం తెలిసిందే. మంత్రి అఖిలప్రియ రెండు రోజులపాటు రకరకాల కారణాలతో సమావేశానికి గైర్హాజరయ్యారు. అఖిలప్రియ గురువారం రాత్రి తన సోదరి మౌనిక, ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డితో పాటు సీఎంను ఆయన నివాసంలో కలిశారు. ఏవీ సుబ్బారెడ్డి కూడా అదే సమయానికి వెళ్లటంతో మీ పద్ధతి బాగోలేదంటూ ఇద్దరిపైనా ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు సమయం లేనందున శుక్రవారం రావాలని వారిని చంద్రబాబు ఆదేశించారు. అదే సమయంలో చింతలపూడి నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు కూడా వచ్చారు. గొడవలు పడితే సహించేది లేదని ముఖ్యమంత్రి వారిని హెచ్చరిస్తూ శుక్రవారం తనను కలవాలని చెప్పి పంపించేశారు. -
శ్రీరామనవమి ఊరేగింపులో ఉద్రిక్తత
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో శ్రీరామనవమి ఊరేగింపు సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పురూలియా జిల్లాలోని ఆర్షాలో ఆదివారం ర్యాలీ సందర్భంగా తలెత్తిన ఘర్షణలో ఒకరు మృతిచెందారు. డీఎస్పీ స్థాయి అధికారి సహా ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. రామనవమి సందర్భంగా రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించాయి. పురూలియాలో బీజేపీ ఆధ్వర్యంలో ఆయుధాలు ధరించి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎంసీ, బీజేపీ మధ్య ఘర్షణ జరిగింది. వర్దమాన్ జిల్లాలో ర్యాలీ సందర్భంగా బీజేపీ, వీహెచ్‌పీ కార్యకర్తలపై దాడులు జరిగాయని, దీని వెనక టీఎంసీ హస్తముందని బీజేపీ ఆరోపించింది. ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందిన పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ర్యాలీలు మమత సర్కారుకు వ్యతిరేకంగా ‘హిందువులను ఏకం చేసే’వంటూ బీజేపీ పేర్కొంది. మిడ్నాపూర్ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ భారీ ఖడ్గాన్ని చేతబూని ర్యాలీలో పాల్గొన్నారు. రామనవమి సందర్భంగా అస్త్ర పూజ చేయటం సంప్రదాయమన్నారు. బీజేపీ చేపట్టిన ర్యాలీల్లో చిన్నారుల చేతికి ఆయుధాలిచ్చారని తృణమూల్ బాలల హక్కుల అధికారులకు ఫిర్యాదు చేసింది. -
మథుర ఆలయంలో పూజరుల మధ్య ఘర్షణ
-
ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ మధ్య ఘర్షణ
క్రిష్ణగిరి (సూళగిరి): క్రిష్ణగిరి జిల్లా మత్తూరు పోలీస్‌స్టేషన్‌లో ఇన్స్పెక్టర్, ప్రత్యేక బృందం సబ్ ఇన్స్పెక్టర్ల మధ్య ఏర్పడిన గొడవల్లో ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. గాయాలపాలైన వీరు మత్తూరు ఫ్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. క్రిష్ణగిరి జిల్లా మత్తూరు పోలీస్‌స్టేషన్‌లో తేని జిల్లాకు చెందిన రామ్ ఆండవర్(53) ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు. ఇతడు సేలం, హొగేనకల్ పోలీస్స్టేషన్లలో పనిచేశాడు. మత్తూరు పోలీస్‌స్టేషన్‌లో పోచ్చంపల్లి సమీపంలోని జింగల్కదిరంబట్టి గ్రామానికి చెందిన పార్థిభన్(52) ప్రత్యేక బృందం సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం పార్థిభన్ యూనిఫాం ధరించక కుండా ఆలస్యంగా విధులకు రావడంతో ఇన్ స్పెక్టర్ నిలదీశాడు. దీంతో వీరిమధ్య గొడవ జరిగింది. ఈ గొడవల్లో ఆవేశం చెందిన ఇరువురు ఒకరిపై ఒకరు దాడి చేసుకొన్నారు. గాయాలపాలైన వీరిని తోటి ఉద్యోగులు మత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకొన్న జిల్లా ఎస్పీ మహేస్కుమార్ విచారణ చేపట్టాలని ఊత్తంగేరి డీఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. -
ఫేస్బుక్ పోస్టింగ్‌తో ఇరువర్గాల మధ్య ఘర్షణ
సాక్షి, ఆసిఫాబాద్: ఒక వర్గానికి చెందిన యువకుడు మరో వర్గం మనోభావాలు దెబ్బతినే రీతిలో ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఫేస్బుక్ పోస్టింగ్ విషయం తెలిసి ఓ వర్గం యువకులు కాగజ్‌నగర్‌లోని రాజీవ్‌గాంధీచౌక్ వద్ద శుక్రవారం రాత్రి ఆందోళన చేపట్టి నినాదాలు చేశారు. దీంతో వెంటనే రూరల్ ఎస్ఐ రాజేశ్, దహెగాం ఎస్ఐ రమేశ్‌లు వచ్చి యువకులను అక్కడ నుంచి పంపించేశారు. యువకులు ర్యాలీగా వెళ్తుం డగా మరో వర్గం యువకులు వీరిపై రాళ్లు రువ్వారు. దీంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత చెలరేగింది. ఇరువర్గాల మధ్య జరిగిన రాళ్ల దాడిలో ఎస్ఐ రాజేశ్ తలకు గాయాలయ్యా యి. ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్, డీఎస్పీ హబీబ్‌ఖాన్‌లు సీఐ వెంకటేశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘటనకు దారి తీసిన సంఘటనలపై ఆయన ఆరా తీశారు. -
శ్వేతజాతీయుల నిరసనలో హింస
అమెరికాలోని చార్లట్స్‌విల్‌లో ఘటన ► గుంపులోకి కారు దూసుకురావడంతో ఒకరి మృతి ► సమీపంలో పోలీసు హెలికాప్టర్ కూలి ఇద్దరి దుర్మరణం ► అంతర్యుద్ధ కమాండర్ విగ్రహం తొలగింపు ప్రతిపాదనపై శ్వేతజాతీయుల నిరసన ► వారికి వ్యతిరేకంగా మరో వర్గం ప్రజల ఆందోళన వాషింగ్టన్: అమెరికాలో వర్జీనియా రాష్ట్రంలో శ్వేతజాతీయవాదులు చేపట్టిన నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారింది. గుంపులోకి ఓ కారు దూసుకురావడంతో ఒక మహిళ మృతిచెందగా, 19 మంది గాయపడ్డారు. మరోపక్క.. ఆందోళనను గమనిస్తున్న పోలీసు హెలికాప్టర్ ఘటనాస్థలానికి సమీపంలో కూలిపోవడంతో అందులోని ఇద్దరు పోలీసు అధికారులు చనిపోయారు. అమెరికా అంతర్యుద్ధంలో పాల్గొన్న కాన్ఫెడరేట్ కమాండర్ రాబర్ట్ లీ విగ్రహాన్ని తొలగించాలన్న అధికారుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ వేలాది శ్వేతజాతీయవాదులు, నయా నాజీలు శనివారం ఆ విగ్రహం ఉన్న చార్లట్స్‌విల్ నగరంలోని పార్కును ఆక్రమించుకుని నిరసనకు దిగారు. ఈ సందర్భంగా నిరసనకారులకు, వారు పార్కును ఆక్రమించుకోవడాన్ని వ్యతిరేకిస్తున్న ప్రజలకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఇరుపక్షాలు పిడిగుద్దులు, రసాయనిక స్ప్రేలు, వాటర్‌బాటిళ్లతో పర స్పర దాడులు చేసుకున్నాయి. ఘర్షణలు సద్దుమణిగాక శ్వేతజాతీయులకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న జనంలోకి ఒక కారు వేగం గా దూసుకొచ్చి, మళ్లీ వెనక్కి వెళ్లిపోయింది. ఈ ఘటనలో 32 ఏళ్ల మహిళ ఒకరు మృతిచెందారు. కారును నడిపిన ఒహాయో రాష్ట్రవాసి జేమ్స్ ఫీల్డ్స్(20)ను పోలీసులు అరెస్ట్ చేసి హత్యాభియోగాలు నమోదు చేశారు. ఘర్షణల్లో మరో 15 మంది గాయపడ్డారు. నగరంలో శాంతిభద్రతలను అదుపుచేస్తున్న బలగాలకు సాయపడుతున్న హెలికాప్టర్ ప్రమాదవశాత్తూ కూలిపోవడంతో అందులోని ఇద్దరు పోలీసులు దుర్మరణం చెందారు. ఉద్రిక్తత నేపథ్యంలో అధికారులు వర్జీనియా రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధించి, పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించారు. ఇటీవలి కాలంలో తాము నిర్వహించిన అతిపెద్ద ర్యాలీ ఇదేనని శ్వేతజాతీయవాదులు చెప్పారు. హింసకు అమెరికాలో చోటులేదు: ట్రంప్ చార్లట్స్‌విల్‌లో జరిగిన హింస భయంకర ఘటన అని దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ‘దారుణమైన విద్వేషాన్ని, దురభిమాన ప్రదర్శనను, హింసను గట్టిగా ఖండిస్తున్నాం.. ఇలాంటివి మన దేశంలో చాలా కాలం నుంచి సాగుతున్నాయి. వీటికి అమెరికాలో స్థానం లేదు. అమాయకుల ప్రాణాలను రక్షించి, శాంతిభద్రతలను త్వరగా పునరుద్ధరించడమే తక్షణ కర్తవ్యం’ అని ఆయన న్యూజెర్సీలో విలేకర్లతో అన్నారు. ఆందోళనకారులు తిరిగి ఇళ్లకు వెళ్లాలని చార్లట్స్‌విల్ మేయర్ మైక్ సింగ్ కోరారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని విపక్ష డెమోక్రటిక్ పార్టీ అధినేత టామ్ పెరెజ్ వ్యాఖ్యానించారు. జాత్యహంకారులను నియంత్రించడానికి అన్ని చర్యలూ తీసుకోవాలని భారత సంతతికి చెందిన కాంగ్రెస్ సభ్యుడు రాజాకృష్ణమూర్తి.. అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్‌ను కోరారు. ఈ ఉదంతంపై విచారణ జరిపించాలని మానవ హక్కుల నేత వనితా గుప్తా.. ఎఫ్‌బీఐని డిమాండ్ చేశారు. 50వేల జనాభా ఉన్న చార్లట్స్‌విల్‌లో పరిమిత సంఖ్యలో భారతీయ అమెరికన్లు కూడా ఉన్నారు. -
సినిమా థియేటర్లో ఘర్షణ
నంద్యాల : సినిమా థియేటర్లో జరిగిన చిన్న ఘర్షణ తీవ్రమై ముగ్గురు కత్తిపోట్లకు గురయ్యారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి శ్రీనివాస సెంటర్ సమీపంలోని ఓ థియేటర్లో చోటు చేసుకుంది. డీజే సినిమాను తిలకిస్తున్న అభిమానులు తెర సమీపంలో కాగితాలు చల్లుతుండగా థియేటర్ సిబ్బంది మందలించారు. అయినా అభిమానులు పట్టించుకోకుండా రెచ్చిపోవడంతో థియేటర్ సిబ్బంది దాడికి దిగారు. థియేటర్‌కు చెందిన సుబ్బరాయుడు, రఫీ ఆగ్రహంతో నడిగడ్డ ప్రాంతానికి చెందిన రెహమాన్, సమీర్, అరబాబర్లను కత్తులతో పొడిచారు. వెంటనే పోలీసులు వీరిని నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. సీఐ ప్రవీణ్‌కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గాయపడినవారి ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని ఆయన చెప్పారు. -
ఉట్నూరులో వాట్సాప్ మంట
ఓ వర్గాన్ని కించపరుస్తూ పోస్టు చేసిన యువకుడు ► చర్యలు తీసుకోవాలంటూ మరో వర్గం ఆందోళన ► ఇరువర్గాల మధ్య రాళ్లదాడులు.. దుకాణాలు, వాహనాలు ధ్వంసం ఉట్నూర్/ఉట్నూర్‌రూరల్ (ఖానాపూర్): ఓ వర్గాన్ని కించపరుస్తూ ఓ యువకుడు వాట్సాప్‌లో చేసిన పోస్టు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో మంటపెట్టింది. ఇరువర్గాల మధ్య ఘర్షణకు, రాళ్ల దాడులకు దారితీసింది. శనివారం రాత్రి నుంచి మొదలైన ఈ ఆందోళన ఆదివారం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఆందోళన చేస్తున్న ఇరువర్గాలు దుకాణాలు, వాహనాల ధ్వంసానికీ దిగాయి. దీంతో పోలీసులు లాఠీచార్జి, బాష్పవాయు ప్రయోగం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. 144 సెక్షన్ విధించారు. సమీపంలోని నాలుగు జిల్లాల నుంచి వందలాది మంది పోలీసులను రప్పించి.. భారీ స్థాయిలో మోహరించారు. అయినా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. లాఠీచార్జి.. రబ్బరు బులెట్ల ప్రయోగం ఉట్నూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు మరో వర్గానికి చెందిన వారిని కించపరుస్తూ వాట్సప్‌లో వీడియోను పోస్టు చేశాడు. దీంతో ఆ వర్గానికి చెందిన వారు సదరు యువకుడిని అరెస్టు చేయాలంటూ శనివారం రాత్రి స్థానిక పోలీసుస్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. రహదారి వెంట పలు దుకాణాలను ధ్వంసం చేశారు. ఆదివారం ఉట్నూర్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం కూడా ఆ యువకుడిని అరెస్టు చేయాలంటూ పోలీసుస్టేషన్ ఎదుట బైఠాయించారు. ఎస్పీ ఎం.శ్రీనివాస్ వచ్చి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా పరిస్థితి అదుపులోకి రాలేదు. అయితే బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఓ దుకాణ సముదాయం వద్ద చోటు చేసుకున్న ఘర్షణ.. ఇరువర్గాల మధ్య దాడులు, ప్రతిదాడులకు దారి తీసింది. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. దుకాణా లు, వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో ఇరువర్గాలను అదుపు చేసేందుకు పోలీసులు పలుసార్లు లాఠీచార్జీ చేశారు. బాష్పవాయు గోళాలను, రబ్బరు బులెట్లను ప్రయోగించారు. ఎక్కడిక్కడ ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. రాళ్ల దాడిలో ఎస్పీ శ్రీనివాస్, ఉట్నూర్ ఇన్చార్జి డీఎస్పీ లక్ష్మీనారా యణ సహా పలువురు పోలీసులు గాయపడ్డారు. శాంతి చర్యలు చేపట్టిన కలెక్టర్ కరీంనగర్ రేంజ్ డీఐజీ రవివర్మ, కలెక్టర్ జ్యోతి బుద్దప్రకాశ్, జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి, అధికారులు ఉట్నూర్ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇరువర్గాలకు చెందిన పెద్దలతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. తరతరాలుగా కలసి మెలసి జీవిస్తున్నవారంతా ఓ వ్యక్తి చేసిన అనుచిత పని కారణంగా ఘర్షణలకు దిగడం సరికాదని సూచించారు. వివాదాస్పద పోస్టు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఇరువర్గాల పెద్దలు కోరారు. పోలీసులు అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని ఓ వర్గం వారు డిమాండ్ చేశారు. మరోవైపు ప్రతి ఆదివారం ఉట్నూర్ మండల కేంద్రంలో వార సంత కొనసాగుతంది. దీంతో ఆదివారం పలు ప్రాంతాల నుంచి వ్యాపారులు ఇక్కడికి చేరుకున్నారు. ఘర్షణలు చెలరేగడంతో భయాందోళనతో తిరుగుముఖం పట్టారు. నాలుగు జిల్లాల నుంచి పోలీసులు ఉట్నూరులో ఘర్షణలను అదుపు చేసేందుకు పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఆదిలాబా ద్‌తో పాటు కుమ్రం భీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లోని సమీప మండలాల నుంచి పోలీసు సిబ్బందిని.. ఏపీఎస్పీ బెటాలియన్ ప్రత్యేక బృందాన్ని హుటాహుటిన ఉట్నూరు రప్పించారు. సుమారు 500 మందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఐదు కేసులు నమోదు వాట్సప్‌లో అనుచిత వాఖ్యలు చేస్తూ పోస్టు చేసిన యువకుడిపై కేసులు నమోదు చేశామని కరీంనగర్ రేంజ్ డీఐజీ రవివర్మ తెలిపారు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు, వీడియోలు పోస్టులు చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. దుకాణ సముదాయాలను ధ్వంసం చేసిన వారిపై, ఆందోళనకారులపై ఐదు కేసులు నమోదు చేశామని తెలిపారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని, 144 సెక్షన్ కొనసాగుతుందని తెలిపారు. -
ఆద్యంతం నాటకీయం..
► సీపీఎంలో ఆరని చిచ్చు ► బహిష్కృత, పార్టీ నేతల మధ్య వాగ్వాదం ► రంగంలోకి రాష్ట్ర కమిటీ సభ్యులు హన్మకొండ చౌరస్తా : నిత్యం పేదల జపం చేసే ఎర్రచొక్కాల కుమ్మలాటలు ఆద్యంతం నాటకీయతను తలపిస్తున్నాయి. బహిష్కృత, పార్టీ నేతల మధ్య ఘర్షణ ఆఫీసులో కుర్చీలను పగలగొట్టడం వరకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆది వారం ఇరువర్గాలు నిరసనలనుకాస్త డోస్ పెం చాయి. బహిషృత నేతలు పార్టీ ఆఫీసు ప్రధాన గేటుకు తాళం వేసి అక్కడే గేటు ఎదుట బైఠాయించగా, మిగిలిన నేతలు పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రంగంలోకి రాష్ట్ర కమిటీ మూడు రోజులుగా వరంగల్ అర్బన్ జిల్లా సీపీఎం కమిటీలో జరుగుతున్న కుమ్ములాటలను చ ల్లార్చేందుకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నేతలు రంగంలోకి దిగారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, సీపీఎం తెలంగాణ రాష్ట్ర ఇన్ చార్జి కార్యదర్శి జి.నాగయ్య, జి.రాములు, వెంకట్ రాంనగర్‌లోని పార్టీ కార్యాలయానికి సాయంత్రం చేరుకున్నారు. ఆఫీసులోకి నేతలు వెళ్తుండగా అప్పటికే గేటుకు తాళం వేసి, కార్యకర్తలు బహిష్కరణలను ఎత్తివేయాలని నినాదాలు చేస్తూ వారిని అడ్డుకున్నారు. దీంతో ఆఫీసుకు కొద్ది దూరంలో బహిష్కృత నేతలు దుబ్బ శ్రీని వాస్, కారు ఉపేందర్, పల్లం రవి, కొప్పుల శ్రీని వాస్‌తో నాగయ్య బృందం మాట్లాడే ప్రయత్నం చేశారు. ముందుగా గేటుకు తాళం తీసి కార్యకర్తలను పంపించాలని సూచిం చారు. అందుకు శ్రీనివాస్ తమ కార్యకర్తలనే కాదు అందరినీ పం పించాలని చెప్పడంతో వారు ఒప్పుకోలేదు.ఈ సమస్యను రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకెళ్తామని గేటుకు తాళం తీసి కార్యకర్తలను పంపించాలని మరోసారి చెప్పడంతో వారు ససేమిరా అన్నారు. ఘటన దురదృష్టకరం పార్టీ కార్యాలయం ఎదుట సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జి. నాగయ్య మీడియాతో మా ట్లాడారు. సీపీఎం వరంగల్ చరిత్రలో ఎన్నడూ లేని సంఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టక రం, సమస్య త్వరలోనే పరిష్కారం అయ్యేలా రాష్ట్ర కమిటీ, అవసరమైతే కేంద్ర కమిటీ పెద్దల దృష్టికి తీసుకెళ్తానన్నారు. పార్టీ ఆఫీసులోకి కొన్ని అరాచకశక్తులు చేరి ద్వంసం చేయడం భాదాకరమన్నారు. ఇప్పటిౖMðనా పలువురు పద్దతులను మా ర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. -
తెల్లతోలు పిల్లకు చుక్కలు చూపించింది
ఓక్లామా: ఓక్లామాలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తన జాతిని కించపరిచేలా మాట్లాడినందుకు ఓ నల్లజాతి యువతి, తెల్లజాతి యువతికి చుక్కలు చూపించింది. బతికుంటే చాలురా బాబు అనుకునేంత భయంకరంగా ఆ తెల్లతోలు అమ్మాయిపై శివంగిలా దాడి చేసింది. ఓ వీడియోలో రికార్డయిన ఈ దృశ్యాల ప్రకారం.. ఓక్లామాలో అలెయా అనే ఓ నల్లజాతి యువతి జాగింగ్‌కు వస్తున్న సమయంలో ఆమెకు ఓ తెల్లజాతి అమ్మాయి తారసపడింది. అప్పుడు నువ్వు ఎందులోనైనా పోటీ చేస్తున్నావా అని ప్రశ్నించగా అలాంటిదేం లేదనడంతోపాటు దానికి అలెయా జాతిని కించపరిచేలా ఒక పదాన్ని చేర్చింది. దీంతో అలా ఎందుకు అన్నావు? అలా అనడానికి నువ్వు ఎవరూ అని మెల్లగా వాగ్వాదానికి దిగింది. దానికి బదులిచ్చిన ఆ యువతి నువ్వు నా నేలపై ఉంటున్నావని మర్చిపోకు అంటూ మరోసారి అంతకుముందు అన్న అసభ్యకరమైన మాటను జారవిడిచింది. దీంతో అలెయా ఒక్కసారిగా శివంగిలా మారి ఒక్క పంచ్‌తో ఆ యువతిని కింద పడేసింది. అంతటితో ఆగకుండా వరుస పంచ్ లు ఇచ్చింది. పక్కనే ఉన్నవారు వచ్చి ఆపడంతో అలెయా శాంతించింది. -
ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. ముగ్గురికి గాయాలు
రోడ్డు నిర్మాణం విషయంలో ఇరు వర్గాల మధ్య చెలరేగిన వివాదం ఘర్షణలకు దారితీసింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన నెల్లూరు జిల్లా హనుమసముద్రంపేట మండలం చౌట భీమవరం గ్రామంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండగా.. అక్కడికి వచ్చిన కొందరు గ్రామస్థులు ఎవరు చెప్తే ఈ పని చేస్తున్నారని ఆగ్రహించి మరో వర్గం వారిపై దాడికి పాల్పడ్డారు. దీంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
ఇంజినీరింగ్ విద్యార్థుల మధ్య ఘర్షణ
-
పండ్ల రేటు విషయంలో ఘర్షణ: ఒకరి మృతి
భైంసా (ఆదిలాబాద్): ఇద్దరు చిరు వ్యాపారుల మధ్య పండ్లు అమ్మే విషయంలో తలెత్తిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా భైంసాలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలు.. భైంసాకు చెందిన మహ్మద్ ఫారూక్, జలీల్, షేక్ మహ్మద్‌లు, మార్కెట్ సెంటర్లో పండ్లు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. అయితే శుక్రవారం పండ్ల రేటు విషయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. దీంతో జలీల్, ఫారూక్‌లు ఇద్దరు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. జలీల్‌కు సన్నిహితుడైన షేక్ మహ్మద్ కూడా ఫారూక్ పై దాడి చేశాడు. దీంతో ఫారూక్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో స్థానికులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఫారూక్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. -
ఘర్షణలో విద్యార్థులకు గాయాలు
కడప అర్బన్ : కడప నగరంలోని ఆర్ట్స్ కళాశాల సమీపంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నాయకులు తమ సంఘానికి సంబంధించిన జెండాను ఆవిష్కరించుకునేందుకు స్తంభం నిర్మాణం కోసం ప్రయత్నించారు. అదే కళాశాలకు చెందిన మరికొంతమంది విద్యార్థులు కళాశాల ఆవరణంలో విద్యార్థి సంఘం జెండాను ఆవిష్కరించుకునేందుకు అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో ఆ ఇరు వర్గాల వారు పరస్పరం ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో ఎస్ఎఫ్ఐకి చెందిన ఏకాంబరంతోపాటు రవి, భరత్, అంకిరెడ్డిలు గాయపడ్డారు. మరోవైపు ఇరువురు విద్యార్థులను ఘర్షణకు కారణం వారేనని ఆరోపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుస్టేషన్ ఎదుట ఆందోళన ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులపై జరిగిన దాడిని నిరసిస్తూ సీఐటీయూ జిల్లా కార్యదర్శి శివశంకర్, సీపీఎం నగర ప్రధాన కార్యదర్శి రవిశంకర్‌రెడ్డి, సీపీఎం నాయకులు వన్‌టౌన్ పోలీసుస్టేషన్ వద్దకు వచ్చి ఆందోళన చేశారు. తమ విద్యార్థి సంఘం నాయకులపై దాడులు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా వన్‌టౌన్ సీఐ కె.రమేష్ మాట్లాడుతూ ఘర్షణ జరిగింది చిన్నచౌకు పరిధిలోనని, జెండా స్తంభాన్ని నాటుకునే వ్యవహారం తమ పరిధిలోకి వస్తుందని, విచారిస్తామన్నారు. ఘర్షణ జరిగిన ప్రాంతంలో ఉన్న విద్యార్థులను చిన్నచౌకు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చిన్నచౌకు సీఐ యుగంధర్‌బాబు తెలిపారు.