రోడ్డు నిర్మాణం విషయంలో ఇరు వర్గాల మధ్య చెలరేగిన వివాదం ఘర్షణలకు దారితీసింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన నెల్లూరు జిల్లా హనుమసముద్రంపేట మండలం చౌట భీమవరం గ్రామంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండగా.. అక్కడికి వచ్చిన కొందరు గ్రామస్థులు ఎవరు చెప్తే ఈ పని చేస్తున్నారని ఆగ్రహించి మరో వర్గం వారిపై దాడికి పాల్పడ్డారు. దీంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. ముగ్గురికి గాయాలు
Published Sun, Feb 7 2016 9:06 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement