సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా, పలువురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే... పెళ్లకూరు సమీపంలో శనివారం తెల్లవారుజామున జీపును ...ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరో ఎనిమిదిమంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు వినుకొండ నుంచి తిరుమల వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా గుంటూరు జిల్లా బొల్లపల్లి మండలం నాయుడుపాలెంకు చెందినవారు. మృతుల్లో డ్రైవర్, ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మరోవైపు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
Published Sat, May 26 2018 8:39 AM | Last Updated on Thu, Apr 4 2019 5:24 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment