లారీలు ఢీ: డ్రైవర్‌ మృతి | Lorries collide: Driver killed | Sakshi
Sakshi News home page

లారీలు ఢీ: డ్రైవర్‌ మృతి

Published Mon, Nov 14 2016 2:10 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

లారీలు ఢీ: డ్రైవర్‌ మృతి - Sakshi

లారీలు ఢీ: డ్రైవర్‌ మృతి

 
కొడవలూరు : ఆగి ఉన్న లారీని పాల ట్యాంకర్‌ ఢీకొనడంతో ట్యాంకర్‌ డ్రైవర్‌ నజీర్‌బాష (57) మృతిచెందిన మండలంలో ఆదివారం వేకుమజామున చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.  తమిళనాడులోని తిరువణ్ణామలై నుంచి జర్సీ పాల ట్యాంకర్‌ ఒంగోలుకు వెళుతుండగా ఆదివారం వేకువజామున నార్తురాజుపాలెం ఆంజనేయస్వామి విగ్రహం వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఆగి ఉన్న లారీ బాగా రోడ్డుకు పక్కగా ఉన్నప్పటికీ ట్యాంకర్‌ డ్రైవర్‌ నజీర్‌బాష నిద్రలోకి జారుకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా చెబుతున్నారు. ఇందులో గాయపడ్డ నజీర్‌బాషాను పోలీసులు నెల్లూరులోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం అతను మృతిచెందినట్లు ఎస్‌ఐ నారాయణరెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement