ప్రాణాలు తీసిన అతి వేగం
మితిమీరిన వేగం ఇద్దరి ప్రాణాలు తీసింది. విధి నిర్వహణ కోసం బైక్‌పై బయల్దేరిన పంచాయతీని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లి ఆస్పత్రిలో తనువు చాలించాడు. బతుకుతెరువు కోసం కూలి పనులకు వెళ్లి బైక్ వెళ్తున్న ఓ వ్యక్తి టాటా మ్యాజిక్ వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు.సంగం : గుర్తు తెలియని వాహనం ఢీకొని పంచాయతీ కార్యదర్శి దుర్మరణం చెందారు. ఈ సంఘటన మండలంలోని పెరమన సమీపంలో నెల్లూరు–ముంబాయి రోడ్డుపై శనివారం తెల్లవారు జామున జరిగింది. పోలీసుల కథనం మేరకు.. సీతారామపురానికి చెందిన పంది వెంకటసుబ్బయ్య (26) డక్కిలి మండలం మోపూరు, మోపూరు వెల్లంపల్లి పంచాయతీల కార్యదర్శిగా పనిచేస్తున్నారు. శుక్రవారం స్వగ్రామానికి వెళ్లిన వెంకటసుబ్బయ్య శనివారం 1వ తేదీ కావడంతో తన పరిధిలోని లబ్ధిదారులకు సామాజిక పింఛన్లు పంపిణీ చేసేందుకు తెల్లవారుజామునే బైక్‌పై బయలుదేరాడు. పెరమన సమీపంలో వచ్చే సరికి గుర్తుతెలియని వాహనం ఢీకొని అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఆత్మకూరు 108 సిబ్బం ది వెంకట సుబ్బయ్యను ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొం దుతూ మృతి చెందాడు. వెంకటసుబ్బయ్య సెల్‌ఫో¯ŒS ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆస్పత్రికి చేరు కున్న భార్య భారతి, బంధువుల రో దనలు మిన్నంటాయి. మృతి చెందిన వెంకట సుబ్బయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. వెంకట సుబ్బయ్య మృతదేహానికి పోస్ట్ మార్టం చేసి బంధువులకు అప్పగించారు.బైక్‌ను ఢీకొన్న టాటామ్యాజిక్ఒకరి మృతి, మరొకరికి గాయాలుకోట : బైక్‌ను టాటా మ్యాజిక్ ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయ పడ్డాడు. కొండుగుంట సమీపంలో కేసవరం చెరువు వద్ద శనివారం రాత్రి జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. మద్దాలికి చెందిన బేల్దారి మేస్త్రీ ముమ్మడి శీనయ్య అదే గ్రా మానికి చెందిన మునెయ్య(47)తో కలిసి కమ్మవారిపాళెంలో పనులకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తుండగా కొండుగుంట సమీపాన గూడూరుకు ప్రయాణికుల తో వెళ్తున్న టాటామ్యాజిక్ వాహనం వారి బైక్‌ను ఢీకొంది.ప్రమాదంలో మునెయ్య మృతి చెందగా, గాయపడిన శీనయ్యను చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు. ఎస్సై అజయ్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.