pellakuru
-
జగన్ మరో 30 ఏళ్లు సీఎంగా ఉండాలి: టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు
సాక్షి, పెళ్లకూరు(తిరుపతి జిల్లా): పార్టీటలకు అతీతంగా పారదర్శకమైన పాలన అందిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా మరో 30 ఏళ్ల పాటు కొనసాగాలని పెళ్లకూరు టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు బత్తిన రత్నయ్యనాయుడు ఆకాంక్షించారు. ఆయన 1985లో టీడీపీ పెళ్లకూరు మండల అధ్యక్షుడిగా పనిచేశారు. ఇటీవల స్వగ్రామానికి చేరుకుని ఇంటి వద్ద ఉంటున్నారు. గ్రామ వలంటీర్, సచివాలయ సిబ్బంది నేరుగా ఇంటికి వెళ్లి పలకరించడంతో ఆయన తన వయస్సు 70 ఏళ్లు అని చెప్పడం, దానికి సంబంధించిన ధ్రువపత్రాలను ఆన్లైన్లో పొందుపరిచిన వెంటనే కొత్తగా పింఛన్ మంజూరైంది. పెళ్లకూరు మండల పరిషత్ కార్యాలయంలో గురువారం కొత్తగా పింఛన్లు మంజూరైన వారికి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా బత్తిన రత్నయ్య నాయుడు కూడా పింఛన్ అందుకున్నారు. ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా సీఎం జగన్ పారదర్శకమైన పాలన అందిస్తున్నారని కొనియాడారు. చదవండి: (Graduates MLC: పట్టం కట్టేదెవరికి.. పాఠం కలిసొచ్చేదెవరికి?) -
నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు దుర్మరణం
సాక్షి, నెల్లూరు: జిల్లాలోని పెళ్లకూరు మండలం నాయుడుపేట - పూతలపట్టు జాతీయ రహదారిపై తల్వాయిపాడువద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది . కూలీలతో ప్రయాణిస్తున్న ఆటోను వెనుక నుంచి వస్తున్నా కారు ఢీకొనడంతో ఒక్కసారిగా ఎదురుగా వస్తున్న టిప్పర్ వైపు దూసుకెళ్లింది. అప్పటికే వేగంగా వస్తున్న టిప్పర్ ఆటోను ఢీకొనింది. దీంతో ఆటో ప్రయాణిస్తున్న ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు.. నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం మోదుగుల పాలెం గ్రామానికి చెందిన కూలీలు ప్రతిరోజూ నాయుడుపేటకు వచ్చి లారీ కాటా పనులు జీవనం సాగిస్తుంటారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం స్వగ్రామం నుంచి నాయుడుపేటకు పనుల నిమిత్తం ఆటోలో వస్తుండగా వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. ధీంతో ఆటో ఒక్కసారిగా ఎదురుగా వస్తున్న టిప్పర్ వైపు దూసుకెళ్లింది. అప్పటికే వేగంగా ఉన్న టిప్పర్ ఆటోను ఢీకోనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న అప్పాడి రమేష్ (39), వెంకటేశ్వర్లు (28) అక్కడికక్కడే మృతి చెందారు. ఇక గురవయ్య, మునుస్వామి, గురునాధం,చెంగయ్య ల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్సల నిమ్మిత్తం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసున మోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు -
టీడీపీకి ఓటడిగే హక్కు లేదు
సాక్షి, పెళ్లకూరు: అవినీతి, అక్రమాలకు పాల్పడిన టీడీపీ నాయకులకు ఓటడిగే హక్కు లేదని సూళ్లూరుపేట ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థి కిలివేటి సంజీవయ్య అన్నారు. సోమవారం మండలంలోని పుల్లూరు, ముమ్మారెడ్డిగుంట, చింతపూడి, యాలకారికండ్రిగ, ముప్పాళ్లవారికండ్రిగ తదితర గ్రామాల్లో ఎంపీపీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 2015లో వచ్చిన వరదలకు ఈ ప్రాంతంలో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకుంటామని చెప్పిన చంద్రబాబు ఒక్క పైసా కూడా అన్నదాతలకు ఇవ్వలేదన్నారు. నీరు – చెట్టు కింద మంజూరైన పనులను, రైతు రథాలపై అందించిన ట్రాక్టర్లను పర్సంటేజీలు తీసుకుని అప్పగించిన నాయకుడికి ఓట్లు వేయడం ఎంతవరకు న్యాయమో టీడీపీ శ్రేణులే ఆలోచించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు చిందేపల్లి మధుసూదన్‌రెడ్డి, డాక్టర్ పాలూరు మహేంద్రరెడ్డి, పార్టీ మండల కన్వీనర్ మారాబత్తిన సుధాకర్ నాయకులు చైతన్యకృష్ణారెడ్డి, లక్ష్మీనారాయణ, సుబ్బారెడ్డి, శంకరయ్య, బాలాజీ, శేఖర్‌రెడ్డి, గోపాల్, రాజారెడ్డి, బాబు, మురళి, కేశవ్‌రెడ్డి, చంద్రయ్య, రఘురామయ్య తదితరులు పాల్గొన్నారు. చమరగీతం పాడాలి నాయుడుపేటటౌన్: టీడీపీ అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థి కిలివేటి సంజీవయ్య పిలుపునిచ్చారు. పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద వైఎస్సార్సీపీ నాయకులు ఓట్టురు కిషోర్‌యాదవ్, మల్లెలా మనోహర్‌రెడ్డిల సారథ్యంలో మండల పరిధిలోని కలిపేడు గ్రామానికి చెందిన 50 కుటుంబాల పెద్దలు సంజీవయ్య సమక్షంలో పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యేతోపాటు ఆ పార్టీ మండల కన్వీనర్ తంబిరెడ్డి సుబ్రహ్మణ్యంరెడ్డి, జిల్లా కార్యదర్శి పాదర్తి హరినాథ్‌రెడ్డి, బీసీ నాయకులు గంధవళ్లి సిద్ధయ్య, భరత్ తదితర నాయకులు పార్టీ కండువాలను కప్పి ఘనంగా స్వాగతించారు. -
మంచి జీవితం నవరత్నాలతోనే సాధ్యం ..
సాక్షి, పెళ్లకూరు: చంద్రబాబు నిరంకుశ పాలనలో అన్నివర్గాల ప్రజలు తీవ్ర కష్టాలు ఎదుర్కొన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల అధికారాలను తుంగలో తొక్కి ‘జన్మభూమి కమిటీలు’ ఏర్పాటుచేసి నిధులను టీడీపీ నేతలు స్వాహా చేసేలా చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేశారు. సంక్షేమం పేరుతో ఆయన ప్రవేశపెట్టిన పథకాలు అర్హుల చెంతకు చేరలేదు. తెలుగుదేశం ప్రభుత్వ అవినీతి పాలన చూసిన ప్రజలు ‘మార్పు’ కోరుకుంటున్నారు. వారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలు భరోసా కల్పిస్తున్నాయి. జగన్ సీఎం అయితే ప్రతి ఇంట ఆనందం ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురి అభిప్రాయాలు వారి మాటల్లోనే.. రూ.40 వేలు రుణమాఫీ అయింది.. వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పంటపై తీసుకున్న రుణం రూ.40 వేలు ఒకే దఫా రుణమాఫీ జరిగింది. చంద్రబాబునాయుడిని నమ్మి నిండా మునిగాం. ఆయన రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేశాడు. బ్యాంక్ నుంచి నోటీసులు రావడంతో రుణాన్ని విడతల వారీగా చెల్లించాల్సి వచ్చింది. వైఎస్సార్ అడుగుజాడల్లో నడిచే వ్యక్తి జగన్. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో రైతుల కష్టాలు తీరిపోతాయి. – కొండా చిన్నఅంకయ్య, రైతు, తల్లంపాడు గ్రామం నిరుద్యోగ సమస్య ఉండదు.. వైఎస్సార్ హయాంలో సెజ్ భూముల్లో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా అధికారంలోకి వస్తే జగన్మోహన్రెడ్డి పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా బిల్లు తెస్తామన్నారు. దీంతో నిరుద్యోగ సమస్య ఉండదు. జగన్‌పై నమ్మకం ఉంది. – పి.సుబ్బలక్ష్మి, ఎగువచావలి న్యాయం జరుగుతుంది.. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే అన్నివర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది. ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటుచేసి అన్నివర్గాలకు న్యాయం చేస్తామని చెప్పారు. ఆయన ఇచ్చిన మాటపై నిలబడతారు. – ఎ.రామకృష్ణ, గోమతి గార్డెన్, తాళ్వాయిపాడు రైతులు రారాజుల్లా బతుకుతారు వైఎస్సార్ రైతు భరోసాతో రైతులందరూ రారాజుల్లా బతుకుతారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ, రూ.4 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయక నిధి ఏర్పాటు చేస్తామని చెప్పడంతో అన్నదాతలకు భవిష్యత్‌పై భరోసా ఏర్పడింది. – రఘునాయుడు, పెళ్లకూరు మిట్ట పేదలకు కార్పొరేట్ వైద్యం వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తించేలా చేస్తామని జగన్ ప్రకటించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే ఆరోగ్యశ్రీ బాగా అమలవుతుంది. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10 వేలు పెన్షన్ అందించి జగనన్న ఆదుకుంటారు. – పోలంరెడ్డి శ్రీదేవి, నెలబల్లి -
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా, పలువురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే... పెళ్లకూరు సమీపంలో శనివారం తెల్లవారుజామున జీపును ...ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరో ఎనిమిదిమంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు వినుకొండ నుంచి తిరుమల వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా గుంటూరు జిల్లా బొల్లపల్లి మండలం నాయుడుపాలెంకు చెందినవారు. మృతుల్లో డ్రైవర్, ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మరోవైపు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
అమ్మను రైలెక్కించి వచ్చేస్తున్నా..
పెళ్లకూరు: ఆస్పత్రికి వెళ్లేందుకు అమ్మను రైలెక్కించి త్వరగా వచ్చేస్తున్నానంటూ భార్యకు చెప్పిన పది నిమిషాలకే ఓ యువకుడు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. అతి వేగంగా వచ్చిన లారీ ఆ కుటుంబానికి తీరని విషాదం మిగిల్చింది. స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు.. మండలంలోని చింతపూడికి చెందిన మల్లారపు నాగేంద్రబాబు (23) శనివారం తన తల్లి కృష్ణమ్మను నెల్లూరులోని ఆస్పత్రికి పంపించేందుకు బైక్‌లో నాయుడుపేటకు తీసుకువచ్చి రైలెక్కించాడు. అంతలో భార్యకు ఫోన్ చేయడంతో అమ్మను జాగ్రత్తగా రైలెక్కించాను.. తిరిగి వచ్చేస్తున్నానంటూ చెప్పాడు. నాయుడుపేట నుంచి చింతపూడికి వెళుతుండగా మార్గ మధ్యంలో ఎగువచావలి వద్ద గేదెలు అడ్డు రావడంతో అదుపుతప్పి రోడ్డుమీద పడ్డాడు. అదే సమయంలో తమిళనాడు రాష్ట్రం ఆరణి ప్రాంతం నుంచి తవుడు లోడుతో హైదరాబాదుకు వెళుతున్న లారీ అతివేగంగా నాగేంద్ర నడుము మీద ఎక్కింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నాగేంద్రబాబును నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న నాయుడుపేట సీఐ మల్లికార్జున్‌రావు, ఏఎస్సై కోటీశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని పరి శీలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నాగేంద్రబాబు మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లారీని స్వా« దీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లైన తొమ్మిది నెలలకే.. నాగేంద్రబాబుకు తొమ్మిది నెలల కిందట నాయుడుపేట మండలం పండ్లూరుకు చెందిన ప్రమీలతో వివాహం అయింది. నాగేంద్రబాబు తండ్రి అంతకు ముందే చనిపోయాడు. నాగేంద్రబాబు ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పెళ్లైన తొమ్మిది నెలలకే భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఇక మాకు దిక్కెవరంటూ భార్య ప్రమీల, తల్లి కృష్ణమ్మ కన్నీరుమున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పరసా వెంకటరత్నం నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట నాయకులు పోలయ్య, చెంగయ్య, పరశురాం, నాగభూషణం ఉన్నారు. లారీ ఢీకొని యువకుడి దుర్మరణం మరొకరికి గాయాలు వరికుంటపాడు: లారీ ఢీకొని ఓ యు వకుడు దుర్మరణం పాలవగా, మ రొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈఘటన ప్రకాశం జిల్లా పామూరు విరాట్‌నగర్ సమీపంలో శనివారం జరిగింది. తొడుగుపల్లికి చెందిన ఎన్.నవీన్ (21), టి. సుబ్బరాయు డు బైక్‌పై పామూరు మీదుగా వరికుంటపాడు వెళ్లేందుకు బ యల్దేరారు. పామూరు పట్టణంలో నుంచి వరికుంటపాడు వెళ్లేందుకు బైపాస్‌రోడ్డు ఎక్కుతుండగా దుత్తలూరు వైపు నుంచి కలిగిరి వైపు వెళుతున్న లారీ బైక్‌ను ఢీకొంది. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం పామూరులోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోనం నెల్లూరు తరలించగా సింహపురి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నవీన్ మృతి చెందాడు. -
కోతుల నుంచి తప్పించుకునేందుకు..దూకేసింది
నెల్లూరు : కోతుల గుంపు నుంచి తప్పించుకునే యత్నంలో ఓ బాలిక భవనంపై నుంచి కింద పడి తీవ్రగాయాలపాలైంది. ఈ సంఘటన బుధవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు సమీపంలోని పెళ్లకూరులో చోటు చేసుకుంది. నాలుగో తరగతి చదువుతున్న పల్లవి భవనంపై ఆడుకుంటున్న సమయంలో కోతుల గుంపు ఒక్కసారిగా ఆమెపైకి వచ్చాయి. దీంతో భయపడిన పల్లవి భవనంపై నుంచి కిందకి దూకింది.ఈ ప్రమాదంలో పల్లవి తీవ్రంగా గాయపడింది. తల్లిదండ్రులు వెంటనే స్పందించి... బాలికను నెల్లూరులోని రామచంద్రారెడ్డి ఆసుపత్రికి తరలించారు. -
నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.