హరికృష్ణ మృతి.. కళ్యాణమండపంలో విషాద ఛాయలు | Tragedy Shades In Mohan Family With Nandamuri Harikrishna Dies | Sakshi
Sakshi News home page

Published Wed, Aug 29 2018 10:53 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

Tragedy Shades In Mohan Family With Nandamuri Harikrishna Dies - Sakshi

సాక్షి, నెల్లూరు : సినీ నటుడు, రాజ్యసభ మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ మృతితో నెల్లూరు జిల్లా కావలిలోని బృందావన్‌ కళ్యాణమండపంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హరికృష్ణ ఆకస్మిక మరణవార్త  విని ఆయన మిత్రుడు మోహన్‌ దిగ్ర్భాంతికి గురయ్యారు. తన కుమారుడి పెళ్లికి వస్తాడనుకున్న హరికృష్ణ దుర్మరణం చెందారని తెలిసి భోరున విలపించారు. దీంతో పెళ్లి మండపంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. 

నెల్లూరు జిల్లా కావలిలో జరగనున్న తన స్నేహితుడి కుమారుడి వివాహానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వస్తున్న హరికృష్ణ కారు అన్నెపర్తి వద్ద అదుపు తప్పి ముందు వాహనాన్ని ఢికొట్టింది. అనంతరం డివైడర్‌ను తాకుతూ ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢికొట్టింది. దీంతో హరికృష్ణ కారు గాల్లో పల్టీలు కొడుతూ రోడ్డు పక్కకు పడిపోయింది. తీవ్రగాయాలైన హరికృష్ణను నార్కెట్‌పల్లి కామినేని ఆస్పత్రి తరలించారు. అయినప్పటికీ పరిస్థితి విషమించడంతో హరికృష్ణ మృతి చెందారు. పెళ్లికి వస్తాడనుకున్న మిత్రుడు హరికృష్ణ ఇక లేడని వార్త విన్న మోహన్‌,అతని కుటుంబ సభ్యులు  కన్నీరుమున్నీరవుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement