kavali town
-
నెల్లూరులో కుంభవృష్టి.. టెన్షన్ పెడుతున్న మరో మరో అల్పపీడనం
ఆకాశానికి చిల్లు పడినట్లు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కుండపోతగా వర్షం కురిసింది. మూడు రోజులుగా సాధారణ స్థాయిలో కురిసిన వర్షం.. శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు ఎడతెరపి లేకుండా కుంభవృష్టిగా పడింది. ప్రధానంగా జిల్లాలో కావలి, కొండాపురం, గుడ్లూరు, ఉలవపాడు, కందుకూరు మండలాల్లో కురిసిన వర్షానికి వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కావలి మండలంలోని పలు గ్రామాల్లో వీధుల్లో నడుము లోతు నీళ్లు చేరగా, నివాస గృహాల్లోకి వర్షపు నీరు చేరింది. మరోవైపు.. మంగళవారం నాటికి తూర్పు ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించడంతో వర్షాలు ఇప్పట్లో ఆగే అవకాశాలు కనిపించడం లేదు. లోతట్టు ప్రాంతాలు జలమయం ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు నెల్లూరు నగరం జలమయమైంది. ఆత్మకూరు బస్టాండ్, రామలింగాపురం, మాగుంట లేఅవుట్లోని అండర్ బ్రిడ్జిల్లోకి నీరు చేరడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మాగుంట లే అవుట్ అండర్ బ్రిడ్జిని బ్యారికేడ్లు పెట్టి మూసేశారు. ఉమ్మారెడ్డిగుంటలోని పలు పల్లపు ప్రాంతాల ఇళ్లలోకి నీరు చేరింది. మన్సూర్‌నగర్, మనుమసిద్ధినగర్, జనార్దన్‌రెడ్డి కాలనీ, ఆర్టీసీ కాలనీ, టీచర్స్ కాలనీ ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. గాంధీబొమ్మ, రాయాజీవీధి, పొగతోట తదితర ప్రాంతాల్లో రోడ్లపై పెద్ద ఎత్తున వర్షపునీరు డ్రైయినేజీతో కలిసి ప్రవహిస్తోంది. కార్పొరేషన్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నిలిచిన నీరు పోయేందుకు తాత్కాలిక అవుట్లెట్లు ఏర్పాటు చేస్తున్నారు. కాల్ సెంటర్ ఏర్పాటు.. భారీ వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడకుండా సహాయక చర్యలు చేపట్టేందుకు జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. 9492691428, 9154636795, 9494070212 కాల్ సెంటర్ ఫోన్ నంబర్లు అందుబాటులో ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలు, తీర ప్రాంతాల ప్రజలు కాల్ సెంటర్ ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి సహాయక చర్యలు పొందవచ్చునని డీపీఓ ఎం ధనలక్ష్మి తెలిపారు. పోలీసు యంత్రాంగం అప్రమత్తం భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. అగ్నిమాపక, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీ, ఇరిగేషన్, ఆర్అండ్బీ తదితరశాఖల సమన్వయంతో అవసరమైన చర్యలు చేపట్టింది. ఎస్పీ సీహెచ్ విజయారావు ఆదేశాల మేరకు పోలీసు సిబ్బంది భద్రతా చర్యలు చేపట్టారు. మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని తీర ప్రాంతాల్లో ప్రచారం చేయడంతో పాటు సముద్రం వద్ద పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు. వర్ష ప్రభావం అధికంగా ఉండే ప్రాంతాలతో పాటు లోతట్టు, శివారు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొన్ని చోట్ల రోడ్లపై చెట్లు కూలి రవాణాకు అడ్డంకి ఏర్పడడంతో పోలీసు సిబ్బంది హుటాహుటిన తొలగించి రాకపోకలను పునరుద్ధరిస్తున్నారు. ఆదివారం నెల్లూరు నగరంలోని జయలలితానగర్, పొర్లుకట్ట, బోడిగాడితోట, అహ్మద్‌నగర్, మన్సూర్‌నగర్, ఖుద్దూస్‌నగర్ తదితర ప్రాంతాల్లో ఆయా ప్రాంత పోలీసు అధికారులు పర్యటించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే డయల్ 100 లేదా పోలీసు కంట్రోల్ రూమ్ నంబర్ 9440796383కు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామని సూచిస్తున్నారు. బుచ్చి, కోవూరు, పొదలకూరు, కలువాయి. రాపూరు. వింజమూరు, అనంతసాగరం, గుడ్లూరు, కందుకూరు పోలీసులు వాగులు, వంకలు, చెరువులు, జలాశయాల వద్ద సిబ్బందిని ఏర్పాటు చేసి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు. కొన్ని చోట్ల వాగులు, వంకలు పొంగి రోడ్లపై ప్రవహిస్తుండటంతో అటుగా రాకపోకలను నిషేధించారు. వర్షపాతం నమోదు.. అత్యధికంగా కావలి మండలంలో 227.5 మి.మీ., అత్యల్పంగా చేజర్ల మండలంలో 24.8 మి.మీ. వర్షం కురిసింది. జలదంకి మండలంలో 191.0, బోగోలు 154.8, లింగసముద్రం 150.2, ఉలవపాడు 149.4, నెల్లూరురూరల్ 141.2, గుడ్లూరు 137.8, వెంకటాచలం 137, కందుకూరు 134 విడవలూరు 124. ముత్తుకూరు 122.2, కొండాపురం 120.8, దగదర్తి 117.4, నెల్లూరు అర్బన్ 111.6, తోటపల్లి గూడూరు 109.8, కొడవలూరు 109.4, పొదలకూరు 107.2, మనుబోలు 104.2, కలిగిరి 99.2, ఉదయగిరి 99.0, బుచ్చిరెడ్డిపాళెం 98.6, అనుమసముద్రంపేట 95.0, సైదాపురం 94.6, అల్లూరు 92.2, ఇందుకూరుపేట 89.8, కోవూరు 86.6, వింజమూరు 86.4, ఆత్మకూరు 78.6, రాపూరు 66.8, అనంతసాగరం 61.8, మర్రిపాడు 61.4, వరికుంటపాడు 61.2, వలేటివారిపాళెం 58.0, దుత్తలూరు 57.6, కలువాయి 53.8, సీతారామపురం 50.0, సంగం 45.2 మి.మీ. వర్షం కురిసింది. -
బిల్లులు లేకుండా బిస్కెట్లు.. బంగారు వ్యాపారుల్లో వణుకు
బిల్లులు లేకుండా వ్యాపారం సాగిస్తున్న కావలి బంగారు వ్యాపారుల వ్యవహారం మరోసారి బట్టబయలు అయింది. కొంత కాలంగా గుట్టుగా సాగుతున్న వ్యాపార లావాదేవీల్లో ఒకే రోజు రెండు ఘటనలు వణుకుపుట్టిస్తున్నాయి. బంగారం కొనుగోలు కోసం రైల్లో కావలి నుంచి చెన్నైకు ఓ దళారీ తీసుకెళ్తున్న నగదు పోలీసుల తనిఖీల్లో పట్టుబడడంతో ఐటీ అధికారులు రంగ ప్రవేశం చేశారు. మరో దళారీ తీసుకెళ్తున్న నగదును గుర్తు తెలియని దుండగులు దోచుకోవడం కలకలం రేగింది. కావలి (నెల్లూరు): కావలిలోని బంగారు వ్యాపారులపై ఆదాయపన్ను శాఖకు చెందిన అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. కొంత కాలంగా బిల్లులు లేకుండా చెన్నై నుంచి బంగారు బిస్కెట్లు కొనుగోలు చేసి వాటిని కావలికి తీసుకువచ్చి ఇక్కడ ఆభరణాలుగా తయారు చేసి అమ్మకాలు చేస్తున్నారు. గతంలో ఇదే పరిస్థితిపై ఐటీ అధికారులు దృష్టి పెట్టి చర్యలు చేపట్టారు. కొంత కాలంగా లావాదేవీలు పారదర్శకంగా సాగాయి. మళ్లీ వ్యాపారులు అక్రమ మార్గం పట్టారు. చెన్నైలో బంగారం కొనుగోలు చేసినా.. ఆభరణాలుగా విక్రయించినా ఎక్కడా బిల్లులు కానీ, చిత్తు కాగితం కూడా ఉండదు. ఈ క్రమంలో ఆదాయపన్ను శాఖ అధికారులు కావలికి రావడం వ్యాపారులు వణికిపోతున్నారు. అసలేం జరిగింది.. సోమవారం ఒకే రోజు రెండు ఘటనలు జరిగాయి. ఇదే బంగారు వ్యాపారుల్లో వణుకుపుట్టిస్తోంది. కావలికి చెందిన ఒక బంగారు వ్యాపారి చెన్నైలో బంగారు బిస్కెట్లు కొనుగోలు చేసి తీసుకువచ్చేందుకు సోమవారం ఓ దళారీకి రూ.60 లక్షలు నగదు ఇచ్చి పంపించాడు. అయితే మార్గంమధ్యలో పోలీసుల తనిఖీల్లో ఈ రూ. 60 లక్షలు నగదు పట్టుబడింది. ఈ నగదును పోలీసులు ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగించారు. దీంతో గుంటూరు నుంచి ఐటీ అధికారులు కావలికి చేరుకున్నారు. రూ.60 లక్షలు నగదు ఇచ్చిన బంగారు వ్యాపారి షాపు, నివాసంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ వ్యాపారి చేస్తున్న లావాదేవీలపై పూర్తిస్థాయిలో లావాదేవీల నిర్వహణపై విచారణ చేపడుతున్నారు. మరి కొన్ని దుకాణాలపై దాడులు చేసే అవకాశం ఉండడంతో వ్యాపారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చదవండి: (ఫలించిన ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి కృషి.. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు) రూ.30 లక్షల అపహరణ కావలిలోని మరో బంగారు వ్యాపారి చెన్నై నుంచి బంగారు బిస్కెట్ కొనుగోలు చేసి తీసుకు వచ్చేందుకు సోమవారం ఓ దళారీకి రూ.30 లక్షలు నగదు ఇచ్చాడు. అతను రైల్లో వెళ్తుండగా గుర్తు తెలియని దుండగులు దోచుకెళ్లారు. అయితే ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సదరు వ్యాపారి సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. బంగారం వ్యాపారం అంతా బిల్లులు లేకుండా చేస్తుండడంతో పాటు ఈ నగదుకు లెక్కలు చూపించాల్సి వస్తుందని సదరు వ్యాపారి మౌనంగా ఉన్నట్లు సమాచారం. -
టీడీపీ పాలనలో నిర్లక్ష్యం.. కావలివాసులకు విషమైన ‘అమృత్’
కావలి పట్టణ ప్రజలకు తాగునీటిని పుష్కలంగా అందించేందుకు ఉద్దేశించిన ‘అమృత్’ పథకం ఆలస్యం.. శాపంగా మారింది. గత ప్రభుత్వ హయాంలోనే పూర్తి కావాల్సిన పథకానికి నిధులు మంజూరు చేయకపోవడంతో పనులకు తీవ్ర జాప్యం ఏర్పడింది. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి కారణంగా పనులు చేపట్టలేకపోయామని, మరి కొంత సమయం కావాలని కాంట్రాక్ట్ సంస్థ ప్రతిపాదన మేరకు మరో ఏడాది పాటు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు నిధులు మంజూరు చేసింది. ఈలోగా సంస్థ వేరే చోట కాంట్రాక్ట్ ఒప్పందం చేసుకోవడంతో.. గడువు తీసుకున్నా.. తిరిగి పనులు ప్రారంభించడంలో సంస్థ మూడేళ్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఈ సంస్థ కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలని మున్సిపల్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. కావలి: ప్రతి ఇంటికి తాగునీటిని అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు మున్సిపాలిటీ భాగస్వామ్యంతో ప్రారంభించిన ‘అమృత్ పథకం’ ప్రజలకు విషంగా మారితే.. మున్సిపాలిటీకి పెనుభారంగా మారింది. గత ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడింది. నాలుగేళ్లుగా నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం కొనసాగుతోంది. పట్టణ ప్రజలకు తాగునీరు పూర్తిస్థాయిలో సరఫరా చేయడానికి అవసరమైన నిర్మాణాలు, మురికినీటిని శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడం ఈ పథకం ప్రణాళిక. రూ.86.92 కోట్ల పథకం అంచనాలో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.32 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.16.92 కోట్లు, కావలి మున్సిపాలిటీ రూ.38 కోట్ల వాటాగా ఉంది. 2018 ఏప్రిల్‌లో ఈ పథకం పనులు ప్రారంభమయ్యాయి. 2019 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాల్సి పట్టణ ప్రజలకు సంపూర్ణంగా తాగునీరు అందించాల్సి ఉంది. అయితే కేంద్రం తన వాటా నిధులు మంజూరు చేసినా.. ఆ నాటి ప్రభుత్వం, మున్సిపాలిటీ తమ వాటాలను చెల్లించకుండా పదవీ కాలాన్ని పూర్తి చేసింది. దీంతో నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం వల్ల పనులు నత్తనడకన సాగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం మారడంతో గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని చూపించి నిధులు మంజూరు చేసి, గడువు ఇవ్వాలని కాంట్రాక్ట్ సంస్థ కోరింది. ఈ మేరకు 2020 ఆగస్టు వరకు గడువు పొడిగించింది. అయితే ఈ గడువు తీరి మరో రెండేళ్లు గడిచినా పనుల పురోగతి లేకుండాపోయింది. మున్సిపాలిటీపై వడ్డీ భారం 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను చెల్లించడమే కాకుండా, కావలి మున్సిపాలిటీ వాటా రూ. 38 కోట్లు కూడా జమ అయ్యేలా చర్యలు తీసుకుంది. అయితే మున్సిపాలిటీ వాటాలో రూ. 23 కోట్లు ‘పంజాబ్ నేషనల్ బ్యాంక్’ నుంచి రుణంగా తీసుకొని అమృత్ పథకానికి జమ చేసింది. బ్యాంక్ రుణం కు వడ్డీ కింద మున్సిపాలిటీ ప్రతి నెలా రూ. 15 లక్షలు చెల్లిస్తూనే ఉంది. ఇది మున్సిపాలిటీకి ఆర్థిక గుదిబండగా మారింది. అదే పనులు సకాలంలో పూర్తి చేసి ఉంటే.. కుళాయిలకు డిపాజిట్లు, నీటి పనులు వసూలు చేసే అవకాశం ఉండేది. పనులే జరగకపోవడంతో ఏ విధంగా నిధులు సమకూరే అవకాశం లేక బ్యాంక్‌కు అప్పు చెల్లించలేక.. వడ్డీ కట్టలేక ఇబ్బందులు పడుతోంది. ఏమైందంటే.. ఈ పథకానికి సంబంధించి నిర్మాణ పనులు 2018లో ప్రారంభం కాగానే మున్సిపల్ అధికారులు, పాలకులు హడావుడి మొదలు పెట్టింది. అమృత్ పథకం అమల్లో భాగంగా వీధుల్లో ఉన్న మున్సిపాలిటీకి చెందిన కుళాయిలన్నింటినీ తొలగించేశారు. దీంతో స్థానికులు, ముఖ్యంగా పేదలు నివసించే ప్రాంతాల్లో ప్రజలు నీటి సమస్యను ఎదుర్కొన్నారు. మున్సిపాలిటీకి నిర్దిష్టమైన డిపాజిట్ చెల్లించి, ప్రతి ఒక్క ఇంటికి నీటి కుళాయి కనెక్షన్ తీసుకోవాల్సిందే అని మున్సిపాలిటీ అధికారులు తేల్చి చెప్పారు. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ నాయకులు కూడా తాగునీటి వసతి మెరుగు పడాలంటే కుళాయి కనెక్షన్ తీసుకోవాల్సిందేనని మున్సిపాలిటీ అధికారుల మాటలనే సమర్థించారు. దీంతో స్థానికులు నిస్సహాయులై మౌనంగా ఉండిపోయారు. మున్సిపాలిటీ తన వాటా కింద చెల్లించాల్సిన రూ.38 కోట్లు కూడా జమ చేయకుండా చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.16.92 కోట్లు కూడా ఈ పథకానికి చెల్లించలేదు. దీంతో పనుల్లో జాప్యమైంది. నత్తనడకన పనులు అమృత్ పథకంలో రూ.57.92 కోట్లు తాగునీరు సరఫరాకు సంబంధించి పనులు, రూ.29 కోట్లు మురికి నీటి శుద్ధి కేంద్రం పనులు చేయాలి. తాగునీటి పనుల్లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద రోజుకు 14 లక్షల మిలియన్ లీటర్లు నీటిని శుద్ధి చేసే ప్లాంట్ 77.85 కిలో మీటర్లు పైప్లైన్లు, మద్దూరుపాడు, బుడమగుంట, ఐడీఎస్ఎంటీ ప్లాట్స్‌లో ఒక్కో ఓవర్ హెడ్ ట్యాంక్, ముసునూరులో రెండు ఓవర్ హెడ్ ట్యాంక్‌లు నిర్మాణం పూర్తయ్యాయి. తాగునీటి సరఫరాకు సంబంధించి 70 శాతం, మురికి నీటిని శుద్ధి చేసే కేంద్ర పనులు 75 శాతం పూర్తయ్యాయి. నిర్మాణ సంస్థకు ప్రభుత్వం నోటీసులు జారీ చేస్తూ పనులు వేగవంతమయ్యేలా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. మూడు నెలల్లో పూర్తయ్యేలా చేస్తాం నేను కొత్తగా బాధ్యతలు తీసుకున్నాను. ఈ పథకం పనులపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి, రానున్న మూడు నెలల్లో అమృత్ పథకం నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. పట్టణ ప్రజలకు తాగునీటిని సత్వరమే అందించాలనే లక్ష్యంతో ఉన్నాం. – విజయలక్ష్మి, డీఈ, పబ్లిక్‌హెల్త్ డిపార్ట్మెంట్, కావలి ఇది కూడా చదవండి: పోర్టులను రాష్ట్రాలే అభివృద్ధి చేసుకోవచ్చు -
లోన్ యాప్ దుర్మార్గం
కావలి: లోన్ యాప్ యాజమానుల దుర్మార్గాలు రోజుకొకటి వెలుగుచూస్తున్నాయి. తాజాగా అప్పు చెల్లించలేదని శ్రీపొట్టిశ్రీరామలు నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఓ మహిళ ఫొటోను నగ్న చిత్రాలతో మార్ఫింగ్ చేసి ఆమె కాంటాక్ట్ లిస్ట్‌లోని వారికి పంపించి వేధింపులకు గురి చేసిన ఘటన ఆదివారం వెలుగుచూసింది. ఈ మేరకు కావలి ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ పి.ఆదిలక్ష్మి కథనం మేరకు.. కావలిలోని కచ్చేరిమిట్టకు చెందిన పసుపులేటి మౌనికను భర్త వదిలేశాడు. ఆమె తన ముగ్గురు కుమార్తెలను ఉపాధి పనులు చేసుకుంటూ పోషించుకుంటోంది. ప్రస్తుతం ఒక హోటల్లో దినసరి కూలీగా పని చేస్తోంది. అయితే, ఆరు నెలల క్రితం ఆన్లైన్లో ‘స్పీడ్’ అనే యాప్‌లో రూ.5,000 అప్పు కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే ఆమె అకౌంట్లో రూ.2,500 నగదు జమ అయింది. అప్పటి నుంచి ఆమెను యాప్‌కు సంబంధించిన వ్యక్తి బ్లాక్మెయిల్ చేస్తూ రూ.70 వేల వరకు నగదు ఆమె వద్ద నుంచి కట్టించుకున్నారు. అయినా ఇంకా బాకీ ఉందని వేధిస్తుండడంతో, ఆమె తనకు ఆర్థిక స్థోమత లేదని చెప్పింది. దీంతో ఆమె ఫొటోను నగ్న చిత్రంతో మార్ఫింగ్ చేసి ‘స్పీడ్’ యాప్ ద్వారా ఆమె కాంటాక్ట్ లిస్ట్‌లోని వారందరికీ పంపారు. బాధితురాలు నుంచి ఫిర్యాదు అందుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఎమ్మెల్యే టికెట్ కోసం ఇంతగా దిగజారాలా..?
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సీటు కోసం నోటి దురుసు..! రాజకీయ గుర్తింపు కోసం నీచాతినీచంగా మాట్లాడాలా? బాస్ మెప్పు కోసం నోటికి పని చెప్పాలా..? అంటూ మాజీ స్పీకర్ కావలి ప్రతిభాభారతి కుమార్తె గ్రీష్మ పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సామాన్యులే కాకుండా టీడీపీ వర్గాలు సైతం ఆమె వ్యాఖ్యల పట్ల విస్మ యం వ్యక్తం చేస్తున్నారు. కావలి ప్రతిభాభారతి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో నాయకురాలిగా పేరు సంపాదించారు. ప్రస్తుతం విజయనగరంలో కలిసిపోయిన రాజాం నుంచి ఆమె ప్రాతినిథ్యం వహించారు. ప్రతిభాభారతి వారసురాలి గా గ్రీష్మ కొన్నాళ్లు ఇక్కడ హల్చల్ చేసినా ఆ తర్వాత పత్తా లేకుండా పోయారు. ఎక్కడో హైదరాబాద్‌లో ఇన్నాళ్లూ ఉండి మరో రెండేళ్లలో ఎన్నికలు వస్తున్నాయనగా మళ్లీ జిల్లాకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే ఒంగోలు వేదికగా జరిగి న టీడీపీ మహానాడులో అసభ్య పదజాలంతో ప్రసంగించి అధినేత చంద్రబాబు దృష్టిలో పడడానికి ప్రయత్నించారు. కానీ ఆ ప్రసంగంతో పాటు ఆమె వైఖరి కూడా సర్వత్రా విమర్శల పాలవుతోంది. సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఆమెను సమర్థించలేకపోతున్నారు. ఉన్నత పద వులు అలంకరించిన కుటుంబానికి చెందిన వ్యక్తిగా.. హుందాగా వ్యవహరించాల్సిన మహిళ ఇలా నిండు సభలో నోటి కి అదుపు లేకుండా మాట్లాడడాన్ని అంతా ఖండిస్తున్నారు. టిక్కెట్ కోసమేనా ఇదంతా..? గ్రీష్మ తల్లి ప్రతిభా భారతి ఎచ్చెర్ల నుంచి పలు పర్యాయాలు ఎమ్మెల్యేగా, స్పీకర్‌గా, మంత్రిగా ప్రాతినిధ్యం వహించారు. రాజకీయంగా జిల్లాలో తనకంటూ స్థానం సంపాదించుకున్నారు. కాలక్రమేణా ఆమె రాజకీయంగా బలహీనమయ్యా రు. ఆ పార్టీలోని గ్రూపు తగాదాలు, నేతల మధ్య విభేదాల తో పట్టు కోల్పోయారు. ఈ క్రమంలో తల్లి స్థానాన్ని తాను భర్తీ చేయాలని గ్రీష్మ తాపత్రయ పడుతున్నారు. ప్రస్తుతం రిజర్వ్డ్ నియోజకవర్గంగా ఉన్న రాజాం నుంచి పోటీ చే యాలని అనుకుంటున్నారు. ఈ నియోజకవర్గం ఇప్పుడు వి జయనగరం జిల్లాలో ఉంది. అక్కడ టీడీపీలో తనకు పో టీగా కోండ్రు మురళీమోహన్ ఉండటం, ఆయనకు టిక్కె ట్ వస్తుందేమోనన్న అభద్రతాభావంతో ఇలా అధినేత దృష్టిలో పడడానికి పాట్లు పడుతున్నట్లు ఆ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. -
రాచబాటలు; రూ.322.11 కోట్లతో 84 రోడ్ల అభివృద్ధి
నెల్లూరు జిల్లాలో రహదారులు కళకళలాడుతున్నాయి. గత ప్రభుత్వ పాలనకు చిహ్నాలుగా మారిన గతుకులు, గుంతల రోడ్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. రెండేళ్లుగా తరచూ భారీ వర్షాలకు రోడ్లు మరింతగా దెబ్బతిన్నాయి. కరోనా మహమ్మారి కారణంగా నిధుల కొరత, పనుల నిర్వహణ చేపట్టలేని పరిస్థితుల్లో మరమ్మతులు, అభివృద్ధికి ఆటంకం ఏర్పడింది. రోడ్ల అభివృద్ధికి గతేడాదే నిధులు కేటాయించడంతో రాచబాటలు రూపుదిద్దుకుంటున్నాయి. నెల్లూరు (బారకాసు): జిల్లాలో రోడ్లకు మహర్దశ పట్టింది. జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలను కలుపుతూ వెళ్లే ప్రధాన రహదారులతో పాటు గ్రామీణ రోడ్లు సైతం అభివృద్ధి బాట పట్టాయి. రోడ్ల మరమ్మతులు, బాగా దెబ్బతిన్న రోడ్ల పునర్నిర్మాణాలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందుకు నిధులు కూడా మంజూరు చేయడంతో శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే పలు ప్రధాన రహదారులు కళకళలాడుతున్నాయి. రోడ్ల అభివృద్ధిని విస్మరించిన గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఐదేళ్లు జిల్లాలో ప్రధాన రహదారుల అభివృద్ధిని విస్మరించింది. ఉపాధి హామీ పథకం నిధులతో పల్లెల్లో సిమెంట్ రోడ్లు వేసి గొప్పగా చెప్పుకుంది. దశాబ్దాల కాలం నుంచి అభివృద్ధికి నోచుకోని రహదారులతో పాటు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు ప్రజల విన్నపాలను పట్టించుకోలేదు. ప్రమాదాలు జరుగుతున్నా స్పందించలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక రోడ్ల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించింది. అయితే నిధులు సమీకరించే లోగా తరచూ భారీ వర్షాలు, ఆ తర్వాత కరోనా విపత్తు కారణంగా రోడ్ల అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడింది. భారీ వర్షాలకు రోడ్లు మరింతగా దెబ్బతిన్నాయి. 84 రోడ్లకు రూ.322.11 కోట్లు మంజూరు గతేడాది ఆగస్టులోనే రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. నిధులు కేటాయించింది. అక్టోబరు నుంచి దాదాపు డిసెంబరు ప్రారంభం వరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు వరదలు వచ్చాయి. వర్షాలు, కరోనా తగ్గుముఖం పట్టడంతో పనులు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని పలు రోడ్లు మరమ్మతులు, బాగా దెబ్బతిన్న రోడ్ల పటిష్టత కోసం వివిధ స్కీంల కింద ప్రభుత్వం రూ.322.11 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో 337 కి.మీ. మేర మొత్తం 84 రోడ్లను అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే పలు రోడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో మూడు నెలల్లో జిల్లా వ్యాప్తంగా పూర్తిస్థాయిలో రోడ్లు నిర్మాణాలను పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. కళకళలాడుతున్న రోడ్లు జిల్లాలో గతంలో పది నియోజకవర్గాలుండేవి. ఆర్‌అండ్‌బీశాఖ పరిధిలో కావలి, నెల్లూరు, గూడూరు మూడు డివిజన్లు ఉండేవి. అయితే జిల్లాల పునర్వి భజన తర్వాత నెల్లూరు, కావలి రెండు డివిజన్లు మాత్రమే ఈ శాఖ పరిధిలో ఉన్నాయి. నెల్లూరు డివిజన్ పరిధిలో 64 రోడ్ల నిర్మాణాల పనులు చేపడుతున్నారు. రూ.153.63 కోట్ల నిధులతో 363.23 కి.మీ మేర మరమ్మతులు, పునర్నిర్మాణాలు చేపడుతున్నారు. ఇప్పటికే రూ.46.44 కోట్లు ఖర్చు చేసి 65.23 కి.మీ. మేర రోడ్లు పూర్తి చేశారు. ఇందులో పొదలకూరు–రాపూరు, నెల్లూరు నగరం నుంచి ములుముడి–తాటిపర్తి, కృష్ణపట్నంపోర్టు రోడ్డు–గొలగముడి రోడ్డు, ఆత్మకూరు–సోమశిల, నెల్లూరుపాళెం–ఆత్మకూరు తదితర రోడ్ల నిర్మాణాలు పూర్తయి కళకళలాడుతున్నాయి. కావలి డివిజన్ పరిధిలో రూ.198 కోట్లతో 196 కి.మీ మేర 26 రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. కావలి–ఉదయగిరి, సీతారామపురం రోడ్డు నుంచి గంగిరెడ్డిపల్లి మీదుగా తెల్లపాడు వరకు రోడ్డు నిర్మాణం పూర్తయింది. చిలకపాడు, బ్రాహ్మణక్రాక, ఏపిలగుంట, కావలి పట్టణ ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణాలు జరుగుతున్నాయి. జూలై లోపు పూర్తి చేసేలా చర్యలు జిల్లాలో మరమ్మతులకు గురైన రోడ్లు, బాగా దెబ్బతిన్న రోడ్ల నిర్మాణాలను శరవేగంగా చేపడుతున్నాం. ఇప్పటికే పలు రోడ్ల నిర్మాణాలు పూర్తి చేశాం. మరో మూడు నెలల్లో జూలై నెలాఖరులోపు పూర్తి స్థాయిలో నిర్మాణాలను చేపట్టేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం – రామాంజనేయులు, ఇన్చార్జి ఎస్ఈ, ఆర్అండ్బీ -
వస్త్ర రంగం: ఏపీలో ఉన్న మినీ ముంబై ఏదో తెలుసా?
కావలి రూరల్: దేశవ్యాప్తంగా వస్త్ర రంగంలో ముంబైదే పైచేయి.. అయితే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఆ స్థానం నెల్లూరు జిల్లా కావలికే దక్కింది. దీంతో మినీ ముంబైగా పేరు గాంచింది. 1930.. దేశానికి స్వాతంత్య్రం రాక ముందు నుంచే వస్త్ర రంగంలో కావలి కీలకంగా ఉండేది. అప్పట్లో వస్త్రాలకు సంబంధించిన రా మెటీరియల్ (వస్త్రాల బ్లీచింగ్, నీలి రంగు) లాంటి ముడి పదార్ధాలను కావలిలోనే తయారు చేసి సముద్ర మార్గం ద్వారా లండన్‌కు పంపేవారని వాటి ఆనవాళ్లుగా పెద్ద పెద్ద తయారీ తొట్టేలు గత 30 సంవత్సరాల క్రితం వరకు ఉండేవని ప్రచారం. (చదవండి: కర్రల సమరం: ‘గట్టు’ మీద ఒట్టు!) 1933వ సంవత్సరంలోనే కావలి ట్రంకు రోడ్డు వెంబడి 100 వస్త్ర దుకాణాలు ఉండేవని అవి కాస్త ప్రస్తుతం ప్రధానంగా 4 వస్త్ర మార్కెట్లు, 2 గార్మెంట్లు, 1 తయారీ పరిశ్రమ, 500లకు పైగా వస్త్ర దుకాణాలు ఉండటంతో ఇక్కడ అన్నీ రకాల వస్త్రాలు హోల్‌సేల్ ధరలకే లభిస్తూ చూపరులను ఆకట్టుకునేలా ఆకర్షణీయంగా క్వాలిటీతో కూడిన వస్త్రాలు అందుబాటులో ఉంటాయి. ప్రధానంగా కావలి నడిబొడ్డులో రైలు మార్గం, జాతీయ రహదారి ఉండటంతో వ్యాపారాలకు అనుగుణంగా సుదూర ప్రాంతాలైన ముంబాయి, అహ్మాదాబాద్, కలకత్తా, సూరత్, వారణాసి, చెన్నై వంటి మహా నగరాల నుంచి నేరుగా పరిశ్రమల నుంచి డీలర్ షిప్ పొంది నాణ్యమైన వస్త్రాలను దిగుమతి చేసుకుని.. దేశంలోని పలు రాష్ట్రాలకు కావలి నుంచే ఎగుమతులు జరుగుతుంటాయి. వస్త్ర వ్యాపార రంగంపై దాదాపు 15 వేల మందికి పైగా ఆధారపడి జీవిస్తుంటారు. వస్త్ర రంగంలో కావలిలో సంవత్సరానికి సరాసరి రూ.500 నుంచి 800 కోట్లుపైగా అమ్మకాలు సాగిస్తూ నిరుద్యోగులకు జీవనోపాధి కల్పిస్తున్నారు. నగరాలలోని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లేకపోయిన క్వాలిటీ వస్త్రాలకు కావలి పేరుగడించి ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటుంది. -
మద్యం మత్తులో దారుణం..
కావలి (నెల్లూరు జిల్లా): మద్యం మత్తులో భార్యను భర్త హత్య చేసిన ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలోని వాయునందన ప్రెస్ వీధిలో జరిగింది. కర్నూలు జిల్లా శ్రీశైలానికి చెందిన అనురాధ (32)తో కావలికి చెందిన పెసల మాల్యాద్రితో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. మాల్యాద్రి మద్యానికి బానిసై నిత్యం భార్యతో ఘర్షణ పడేవాడు. గత నెల 25న ఇద్దరికి కరోనా సోకడంతో పిల్లలను ఇతరుల ఇంట్లో పెట్టి, వారు తమ ఇంట్లోనే హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. తాజాగా మళ్లీ పరీక్షలు చేయించుకోగా ఇద్దరికీ నెగిటివ్ వచ్చింది. గురువారం రాత్రి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని మాల్యాద్రితో అనురాధ చెప్పింది. అప్పటికే చిత్తుగా మద్యం తాగి ఉన్న మాల్యాద్రి, ఇద్దరం కలసి చనిపోదామని భార్యతో చెప్పి ఆమె చేతి మణికట్టుపై బ్లేడ్‌తో కోశాడు. నరం తెగిపోవడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. మాల్యాద్రి కూడా బ్లేడ్‌తో చేతిని కోసుకున్నాడు. శుక్రవారం ఉదయం మాల్యాద్రి స్థానిక వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన భార్యను చంపేసినట్లు చెప్పి లొంగిపోయాడు. కాగా, కరోనాతో ఇబ్బంది పడుతున్నామని, ఇద్దరం చనిపోదాం అని చెప్పడంతో అందుకు తన భార్య కూడా అంగీకరించిందని అందుకే ఈ ఘాతుకానికి పాల్పడ్డానని నిందితుడు చెబుతున్నాడు. చదవండి: రూ.కోట్ల ఆస్తులు ఉన్నా.. అనాథే..! బద్వేలులో దారుణం: పెళ్లయిన నాలుగు నెలలకే.. -
స్థానిక ఎన్నికలు: బీజేపీ.. ఓటుకు రేటు
కావలి(నెల్లూరు జిల్లా): ఎన్నికల్లో ఉనికి కోసం బీజేపీ ఓటుకు రేటు నిర్ణయించి విచ్చలవిడిగా ఓట్ల కొనుగోలుకు తెగబడుతోంది. కావలి నియోజకవర్గంలో కావలి, అల్లూరు, బోగోలు, దగదర్తి మండలాల పరిధిలో 63 పంచాయతీలు ఉండగా 386 మంది అభ్యర్థులు సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. 636 వార్డులకు 1,617 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వీరిలో బీజేపీ మద్దతుదారులుగా నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు చాలా మంది రాజకీయాలకు పూర్తిగా కొత్త. స్థానికంగా వీరికి ఎటువంటి మద్దతు కూడా లేదు. (చదవండి: ‘దొంగ’దెబ్బ.. ఇది టీడీపీ పనేనా?) కేవలం ఓట్ల కొనుగోలే లక్ష్యంగా బీజేపీ నాయకులు వీరిని బరిలో నిలిపారు. ఓటుకు రూ. 5 వేల వంతునైనా ఇచ్చి ఉనికి కాపాడుకోవాలనే ఉద్దేశంతో గ్రామాల్లో నోట్ల కట్టలు వెదజల్లుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కావలి మండలం లక్ష్మీపురం పంచాయతీలోని గిరిజనులకు ఓటుకు రూ. 5వేల వంతున బలవంతంగా ఇచ్చే ప్రయత్నం చేయడంతో గిరిపుత్రుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. బీజేపీ నాయకులు మంచాలపై పెట్టి వెళ్లిన డబ్బులను రూ.1.24 లక్షలు అధికారులకు అప్పగించి ఫిర్యాదు చేశారు.(చదవండి: పల్లెల్లో చిచ్చు: టీడీపీ-జనసేన అడ్డదారులు..) బీజేపీ జిల్లా అధ్యక్షుడి స్వగ్రామంలోనే.. కావలి మండలం నెల్లూరు–ప్రకాశం జిల్లాల సరిహద్దులో ఉన్న కావలి మండలం లక్ష్మీపురం బీజేపీ జిల్లా అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్‌కుమార్ స్వగ్రామం. ఆయన తన స్వగ్రామంలో బీజేపీ సర్పంచ్ అభ్యర్థిని గెలిపిస్తానని కొద్ది రోజులుగా సవాళ్లు విసురుతున్నాడు. జనవరి 31వ తేదీ అర్థరాత్రి భరత్‌కుమార్ కుటుంబ సభ్యులు గ్రామంలోని గిరిజన కాలనీలో ఓటరు జాబితాలో పేర్లు ఉన్న వారి ఇంటికి వెళ్లి ఓటుకు రూ.5 వేల చొప్పున ఇవ్వసాగారు. గాఢ నిద్రలో ఉన్న గిరిజనులు లేచి బయటకు రాగానే ఈ మాట చెప్పే సరికి, తమకు డబ్బులు వద్దని చెప్పినా బీజేపీ నాయకులు బలవంతంగా ఇళ్లల్లో మంచాలపై నగదు పెట్టేసి వెళ్లిపోయారు. ఇలా రూ.1.25 లక్షలు పంపిణీ చేశారు. అయితే గిరిజనులు తాము డబ్బులు తీసుకొని ఓటు వేస్తే అభివృద్ధి పనులు అడగలేమని ఆ డబ్బులు మాకొద్దని తీసుకెళ్లమని గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు బూచి మాల్యాద్రి, మద్దూరి రవి, గుండ్లపల్లి లక్ష్మీనారాయణకు మొర పెట్టుకున్నారు. అయినప్పటికీ బీజేపీ నాయకులు ఆ డబ్బులు తీసుకోకపోగా, చాలకపోతే రూ.10 వేల చొప్పున ఇస్తామని అనడంతో గిరిజనులు నిర్ఘాంతపోయారు. ఇక చేసేది లేక ఈ విషయాన్ని బుధవారం అధికారులకు తెలియజేశారు. ఇదే విషయాన్ని కావలిలోని బీజేపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు భరత్‌కుమార్ ఇంటికి వచ్చి చెప్పినా, ఆయన వినిపించుకోలేదు. దీంతో ఈ విషయాన్ని పోలీసులు, రెవెన్యూ అధికారులు లక్ష్మీపురం గ్రామంలోని గిరిజన కాలనినీకి చేరుకుని వారి నుంచి ఫిర్యాదును అందుకొని నగదును స్వాధీనం చేసుకొన్నారు. -
బాలుపై అభిమానంతో ‘బామా’
కావలి: ఎస్పీబీ అంటే కావలికి చెందిన బ్యాంకు ఉద్యోగి లేబాకుల సుధాకర్‌రెడ్డికి వల్లమానిన అభిమానం. తన అభిమాన గాయకుడి పేరుతో సాంస్కృతిక సేవా సంస్థను ఏర్పాటు చేసి, ఆ సంస్థ ద్వారా వర్ధమాన గాయకులను వెలుగులోకి తీసుకురావాలని సుధాకర్‌రెడ్డి భావించారు. దీంతో ‘బాలసుబ్రహ్మణ్యం ఆర్ట్స్ అండ్ మ్యూజిక్ అకాడమీ’ (బామా) కావలిలో 2004లో పురుడుపోసుకుంది. ఈ సంస్థను బాలు ప్రారంభించారు. చెన్నైలో వైద్యుడిగా స్థిరపడ్డాక ‘కళాసాగర్’ అనే సాంస్కృతిక సంస్థను స్థాపించిన కావలికి చెందిన డాక్టర్ సీఎంకే రెడ్డితో కలసి సుధాకర్‌రెడ్డి.. బాలు వద్దకు వెళ్లి ‘బామా’ను నెలకొల్పడానికి ఒప్పించారు. ఏటా ఈ సంస్థ నిర్వహించే పోటీల్లో తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి యువతీ యువకులు పాల్గొంటారు. ఇక్కడి పోటీల్లో గెలిచినవాళ్లలో పలువురు సినీ నేపథ్యగాయకులుగా ఉన్నారు. 2013లో జరిగిన ‘బామా’ పదో వార్షికోత్సవ వేడుకల్లో ఎస్పీ బాలు పాల్గొన్నారు. -
దారుణం : కన్నకూతురుపై తండ్రి లైంగిక దాడి
సాక్షి, నెల్లూరు : నెల్లూరు జిల్లా కావలిలో దారుణం చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కూతురుపై లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.వివరాల్లోకి వెళితే.. తుఫాన్‌నగర్‌కు చెందిన కోటేశ్వరరావు మద్యానికి బానిసయ్యాడు. కొద్ది రోజులుగా చిన్న కూతురుపై కన్నేసిన కాసాయి తండ్రి ఇంట్లో ఎవరు లేని సమయం చూసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గతంలో కూడా ఇలానే పెద్ద కూతురుపై అత్యాచారం చేసి కటకటాలు పాలైనా బుద్ది మారలేదని స్థానికులు పేర్కొన్నారు. కన్న కూతురిపైనే ఇలాంటి దారుణానికి ఒడిగట్టిన కోటేశ్వరరావు ను కఠినంగా శిక్షించాలని బందువులు కోరారు. ఇలాంటి వ్యక్తులను సమాజం నుంచి తరిమేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
నెల్లూరు: పచ్చడ్రామా గుట్టు రట్టు
సరైన కార్యాచరణ ప్రణాళిక లేకుండా గత ప్రభుత్వ నేతలు ఆడిన హౌసింగ్ డ్రామా ఇప్పుడు బట్టబయలైంది. ఎన్నికలకు ముందు పక్కాగృహాల పందేరానికి అప్పటి టీడీపీ ప్రభుత్వం హడావుడి చేసింది. ఉచితం అని చెబుతూనే లబ్ధిదారులపై 20 నుంచి 30 ఏళ్ల పాటు రుణ భారం పెట్టేలా అపార్ట్మెంట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఎన్నికలు సమీపించడంతో నిర్మాణం పూర్తి కాకుండానే ఫ్లాట్లలో గృహ ప్రవేశాలు చేపట్టింది. అయితే రుణభారాన్ని గ్రహించిన లబ్ధిదారులు ప్లాట్లు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో పంపిణీ ఆగిపోయింది. కావలి: పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నామంటూ టీడీపీ నేతలు ఆడిన డ్రామాలు, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కావలి పట్టణంలోని పేదలకు గూడు కల్పించేందుకు మద్దూరుపాడు ప్రాంతంలో గత ప్రభుత్వం అపార్ట్మెంట్ తరహాలో 2,112 ఫ్లాట్లు నిర్మించింది. వీటిలో అర్హులైన వారి కంటే అనర్హులకే కట్టబెట్టేందుకు టీడీపీ నాయకులు లబి్ధ దారులను ఎంపిక చేశారు. స్థానికేతరులు, బీపీఎల్‌కు ఎగువ ఉండే వారితో జాబితాలను సిద్ధం చేశారు. వీరి నుంచి 300 చ.అ. ఫ్లాట్‌కు రూ.500, 360 చ.అ. ప్లాట్‌కు రూ.12,500, 430 చ.అ. ఫ్లాట్‌కు రూ.25,000 వంతున డిపాజిట్లు కట్టించుకున్నారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రూ.3 లక్షల ఆర్థిక సాయం పోను మిగిలిన మొత్తాన్ని బ్యాంకు రుణంగా మంజూరు చేయిస్తామని, ఈ అప్పును 360 నెలలపాటు ప్రతి నెలా వడ్డీతో సహా చెల్లించాలని తిరకాసు పెట్టారు. ఎన్నికలు సమీపించడంతో.. ఇంతలో సార్వత్రిక ఎన్నికలు సమీపించడంతో అపార్ట్మెంట్లలో ఫ్లాట్ల కేటాయింపు కార్యక్రమాన్ని అప్పట్లో టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా హడావుడిగా చేసింది. ఫ్లాట్ల కేటాయింపు అంటూ తాళాలు ఇచ్చినట్లుగా అప్పట్లో టీడీపీ మంత్రులు, నాయకులు హంగామా సృష్టించారు. అయితే తీసుకున్న ప్లాట్లకు 20 నుంచి 30 ఏళ్లపాటు అసలు వడ్డీతో కలిపి బ్యాంక్‌లకు చెల్లించాలనే షరతు పెట్టడడంతో ఈ ప్లాట్లు తీసుకునేందుకు లబ్ధిదారులు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఈ ప్రక్రియ ఆగిపోయింది. ఇల్లు లేని మహిళల పేరుతోనే.. ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్లలో మూడు కేటగిరీల్లోనూ ఇల్లు లేని మహిళల పేర్లతో ప్రభుత్వం మంజూరు చేయాలని నిర్ధిష్టమైన నిబంధనలు పొందుపరిచింది. దీంతో జాబితాలో భర్తల పేర్ల స్థానంలో భార్యల పేర్లు చేర్చడానికి, కుటుంబంలో భార్య లేదా భర్తకు ఇప్పటివరకు ఇల్లు లేదనే అంశాన్ని ప్రాతిపదికగా చేసుకుని క్షేత్రస్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. టీడీపీ నేతల మోసంపై మండిపాటు తొలుత ఉచితంగా ఇళ్లు ఇస్తామని డిపాజిట్లు కట్టించుకుని, ఆ తర్వాత బ్యాంక్ రుణాలంటూ మోసం చేశారని దరఖాస్తు చేసుకున్న ఎంతోమంది లబి్ధదారులు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇళ్ల స్థలం, ఇల్లు నిర్మించి ఇస్తారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడెక్కడో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇల్లు కట్టించేందుకు ఉప్రకమించింది. గత ప్రభుత్వ హయాంలో మద్దూరుపాడులో నిర్మించిన 2,112 ఫ్లాట్లను లబ్ధిదారులపై ఎటువంటి భారం లేకుండా ఇవ్వాలని భావించింది. ►ఇందులో రూ.500 చెల్లించిన లబ్ధిదారులకు 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఫ్లాట్లను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. ►ఈ కేటగిరీలో 704 మంది ఉన్నారు. వీరి రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, కరెంట్ బిల్లు తదితర వాటిని సేకరించి దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారిగా గుర్తించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ►కావలి మున్సిపల్ కమిషనర్ బి.శివారెడ్డి లబ్ధిదారులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ►మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ అధికారి దశయ్య సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. ►రూ.12,500 చెల్లించిన వారికి 360 చ.అ., రూ.25,000 చెల్లించిన వారికి 430 చ.అ. విస్తీర్ణంలో ఉన్న ఫ్లాట్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధపడింది. ►మిగిలిన వారు రూ.3.65 లక్షలు, రూ.4.65 లక్షలు చొప్పున చెల్లించాల్సి ఉంటుందని, అందుకు అవసరమైన బ్యాంక్ రుణాలు మంజూరు చేయిస్తామని అధికారులు చెబుతున్నారు. ►ఈ మూడు రకాల విస్తీర్ణంలోని అపార్ట్మెంట్ ఫ్లాట్లను లబ్ధిదారులకు మంజూరు చేయాలంటే, వ్యక్తిగతంగా వారు అంగీకార పత్రంపై సంతకాలు చేయాల్సి ఉంది. ►సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు ఫ్లాట్ల కోసం నగదు చెల్లించిన వారి చిరునామాలకు వెళ్లి సంప్రదిస్తుంటే, తమకెందుకు బ్యాంక్ రుణాలు, టీడీపీ నాయకులు ఉచితంగా ప్లాట్లు ఇస్తామంటే కట్టామని, వారు మోసం చేశారంటూ మండిపడుతున్నారు. ►అయితే డిపాజిట్లు చెల్లించిన వారి చిరునామాలకు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు వెళ్తే అసలు ఆ పేర్లు కలిగిన వ్యక్తులు కావలి పట్టణాన్ని వదిలి ఏళ్లు అయిందని ఇరుగుపొరుగువారు చెబుతుండటం విస్తుగొలుపుతోంది. ►ఇచ్చిన ఫోన్ నంబర్లో సంప్రదిస్తే అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు కోసం తాము దరఖాస్తు పెట్టలేదని, కావలి విడిచి ఏళ్లు అవుతుందని చెబుతున్నారు. -
భార్యను డ్రైనేజీలో పడేసిన భర్త
-
భార్యను చిత్రహింసలు పెట్టి.. డ్రైనేజీలో..
సాక్షి, నెల్లూరు: అనుమానంతో కట్టుకున్న భార్యను చిత్రహింసలు పెట్టాడో భర్త. అనంతరం ఆమెను డ్రైనేజీలో పడేశాడు. ఈ అమానుష ఘటన నెల్లూరు జిల్లా కావలిలో చోటుచేసుకుంది. వివరాలు.. షేక్ షరీఫ్, రమీజా భార్యభర్తలు. కొద్దికాలంగా రమీజాపై అనుమానం పెంచుకున్న షరీఫ్ బుధవారం రాత్రి ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఇందుకు అతడి సోదరి కూడా సహకరించింది. అనంతరం ఇద్దరూ కలిసి రమీజాను తమ ఇంటి ముందు ఉన్న డ్రైనేజీలో పడేశారు. ఈ క్రమంలో అపస్మారక స్థితిలోకి వెళ్లిన రమీజా రాత్రంతా డ్రైనేజీలోనే ఉండిపోయింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు.. ఉదయం పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రమీజా ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఇక ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. చదవండి: పాడేరు టు తమిళనాడు వివాహితతో సాన్నిహిత్యం: ఆటోడ్రైవర్ దారుణ హత్య -
ఆ ఎమ్మెల్సీతో మాట్లాడితే రూ.10వేల జరిమానా
కావలి : ఆ ఎమ్మెల్సీతో నేరుగా మాట్లాడితే రూ.10వేలు.. ఫోన్లో మాట్లాడితే రూ.3వేల జరిమానా విధించాలని అక్కడి గ్రామస్తులు కట్టుబాటు విధించారు. తమ గ్రామాన్ని ఉద్దేశించి ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కలకలం రేపిన ఈ ఉదంతం వివరాల్లోకి వెళ్తే.. కావలి నియోజకవర్గం అల్లూరు మండలం ఇస్కపల్లి గ్రామంలో శివాలయాన్ని పునర్నిర్మాణంలో భాగంగా మంగళ, బుధ, గురువారాలు ప్రత్యేక కార్యక్రమాలను తలపెట్టారు. తొలిరోజు స్థానిక ఎమ్మెల్సీ బీద రవిచంద్ర హాజరయ్యారు. ఈ గ్రామం సమీపంలోని ఇస్కపల్లిపాలేనికి చెందిన మత్స్యకారులూ తరలివచ్చారు. ఇంతలో.. ‘ఇలాంటి దరిద్రపు ఊరు జిల్లాలో లేదు’.. అంటూ రవిచంద్ర తన స్వగ్రామం ఇస్కపల్లిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతేకాక.. మత్స్యకార మహిళల వద్ద మరోమారు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో మహిళలు ఒక్కసారిగా భగ్గుమన్నారు. ‘మేం దరిద్రపు వాళ్లమా, 30 ఏళ్లుగా మా గ్రామాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు రాజకీయంగా రాష్ట్రస్థాయికి ఎదిగి, మమ్మల్ని దూషిస్తావా’.. అంటూ మండిపడ్డారు. కలశాల్లో సముద్రపు నీరు ఇవ్వబోమని, అక్కడ నుంచి వెళ్లిపోవాలని వారు హెచ్చరించారు. అనంతరం ఇస్కపల్లిపాలెంలో మత్స్యకారులంతా సమావేశమయ్యారు. బీద రవిచంద్రతో మాట్లాడితే రూ.10,000, ఫోన్లో మాట్లాడితే రూ.3,000 జరిమానా చెల్లించాలని మత్స్యకారులు కట్టుబాటు పెట్టుకున్నారు. -
కుప్పకూలిన భవనం
సాక్షి,కావలి(నెల్లూరు) : పట్టణంలో సుమారు 90 ఏళ్ల నాటి కాలం చెల్లిన శిథిల భవనం శనివారం రాత్రి కుప్పకూలిపోయింది. ఐదు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు శిథిల భవనం కూలిన వేళ రాత్రి కావడంతో పెను ప్రమాదం తప్పింది. పగలు కూలిపోయి ఉంటే పరిస్థితి ఊహకే అందడం లేదు. దేశానికి స్వాతంత్రం రాక ముందే నిర్మించి ఈ భవనం శిథిలమైపోయింది. ఈ భవనంలో పండ్లు, పూలు అమ్మకాలు చేసే వ్యాపారులు ఉంటారు. నిత్యం ఈ భవనం వద్ద కొనుగోలుదారులు కిక్కిరిసి ఉంటారు. ట్రంక్‌రోడ్డులోని నిత్యం జనాలతో అత్యంత రద్దీగా ఉండే వాణిజ్య కూడలి ప్రాంతంలోనే ఈ శిధిల భవనం ఉండడం గమనార్హం. శిథిలమైన ఈ భవనం ఏ క్షణమైనా కూలిపోవచ్చని మునిసిపాలిటీ అధికారులు 2013లోనే గుర్తించారు. అయితే 2015లో మునిసిపాలిటీ అధికారులు ఈ కాలం చెల్లిన భవన యజమాని నల్లూరి రమేష్‌కు నోటీసులు జారీ చేసి, కూల్చేయాలని తెలియజేశారు. అయితే భవన యజమాని ఈ భవనాన్ని పండ్లు, కూరగాయలు అమ్మకాలు చేసే వారికి అద్దెకు ఇచ్చాడు. కేవలం అద్దెలకు కక్కుర్తి పడిన భవన యజమాని నల్లూరి రమేష్‌తో మునిసిపాలిటీ అధికారులు అమ్యామ్యాలతో చేతులు తడుపుకుని, ఇక ఈ భవనం వైపు కన్నెత్తి చూడడం మానుకొన్నారు. ఇలా ఆరేళ్లుగా మునిసిపాలిటీ ఈ కాలం చెల్లిన శిథిల భవనం సంగతిని పట్టించుకోకపోవడంతో, భవన యజమాని నల్లూరి రమేష్ అత్యంత రద్దీగా ఉండే వాణిజ్య కూడలిలో ఈ భవనాన్ని అద్దెకు ఇచ్చి సంపాదించుకుంటున్నాడు. ఈ క్రమంలో భవనం కుప్ప కూలిపోయింది. శిథిలమైన భవనం కూలిపోగా, మిగిలిన భవనంతోనే పండ్లు అమ్మకాలు చేసే వారితో వ్యాపారాలు చేయిస్తూ అద్దె రాబడిని శిథిల భవన యజమాని కొనసాగిస్తున్నాడు. రద్దీగా ఉన్న వాణిజ్య ప్రదేశంలో శిథిలమైపోయిన కాలం చెల్లిన భవనం కూలిపోతే వెంటనే రంగంలోకి దిగి చర్యలు తీసుకోవాల్సిన మునిసిపాలిటీ, ఆ దిశగా అడుగులు వేయడానికి కూడా ఇష్టపడలేదు. కేవలం భవన యజమాని విదిల్చే కాసులకు కక్కుర్తిపడి మునిసిపాలిటీ ప్రజల ప్రాణాలకు ముప్పుతో ముడిపడి ఉన్న కాలం చెల్లిన భవనాన్ని తొలిగించేందుకు చర్యలు తీసుకోవలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
భార్య.. భర్త, ఓ స్నేహితుడు..
సాక్షి, కావలి (నెల్లూరు): భార్య..భర్త.. ఓ స్నేహితుడు దారి దోపిడీ దొంగలుగా మారి దోపిడీకి పాల్పడ్డారు. తమకు సన్నిహిత పరిచయం ఉన్న ఓ ఆర్ఎంపీ ని దోచుకున్న ఈ ముగ్గురి ముఠాను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. కావలి డీఎస్పీ డి.ప్రసాద్ విలేకరుల సమావేశంలో వివరాలు వివరించారు. పట్టణంలోని వెంగళరావునగర్‌కు చెందిన కందుల రాజేష్, పర్వీన్ భార్యాభర్తలు. ఆ ప్రాంతంలో ఆర్ఎంపీగా ఉన్న తాళ్లపాళెం రాఘవేంద్రరావుతో పర్వీన్ పరిచయం ఏర్పడింది. సన్నిహితంగా ఉంటుండేది. ఆర్ఎంపీ ఒంటిపై ధరించిన బంగారు నగలపై పర్వీన్ కన్నుపడింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మనం గట్టెక్కడానికి ఆర్ఎంపీ ధరించిన బంగారాన్ని ఎలాగైనా కొట్టేయాలని ఆమె భర్తకు చెప్పింది. దీంతో దంపతులతో పాటు రామ్మూర్తిపేటలో నివాసం ఉండే వారి స్నేహితుడు కనమర్లపూడి సాయికుమార్‌తో కలిసి స్కెచ్ వేశారు. అందులో భాగంగా పర్వీన్ గత నెల 8న పట్టణంలో శుభకార్యానికి వెళ్లాల్సి ఉందని, తన భర్త అందుబాటులో లేడని రాఘవేంద్రరావుకు చెప్పింది. తనను బైక్‌పై శుభకార్యం వరకు తీసుకెళ్లి, మళ్లీ బైక్‌పైనే ఇంటికి తీసుకురావాలని పర్వీన్ కోరడంతో రాఘవేంద్రరావు ఆ రోజు రాత్రి 10–11 గంటల సమయంలో శుభకార్యం నుంచి తన బైక్‌పై పర్వీన్‌ను ఎక్కించుకొని వెంగళరావునగర్‌కు వస్తున్నాడు. మార్గమధ్యంలో కచేరిమిట్ట ప్రాంతంలోని రైల్వే ట్రాక్ సమీపంలో ఇద్దరు వ్యక్తులు ముఖాలకు ముసుగులు ధరించి బైక్‌ను అడ్డగించారు. ఆర్ఎంపీ పై దాడి చేసి చంపుతామని బెదిరించి అతని వద్ద ఉన్న బంగారు చైను, రెండు ఉంగరాలు దోచుకెళ్లారు. ఈ ఘటనపై బాధితుడు తాళ్లపాళెం రాఘవేంద్రరావు కావలి రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ బీవీవీ సుబ్బారావు, ఎస్సైలు, సిబ్బంది లోతుగా విచారణ జరపడంతో భార్య, భర్త, వారి స్నేహితుడు దోపిడీకి పాల్పడ్డారని గుర్తించారు. నిందితులైన దంపతులు రాజేష్, పర్వీన్, సాయి కుమార్‌ను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి దోపిడీ చేసిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. లక్ష ఉంటుందని డీఎస్పీ చెప్పారు. -
కాంపౌండర్.. ఆసుపత్రి నడపటమేంటి?
అతనొక కాంపౌండర్. ఏడాదిన్నర నుంచి స్కిన్, హెయిర్ స్పెషలిస్ట్ ఎండీ, ఎంఎస్సీ, పీజీడీసీసీ అర్హతల డాక్టర్‌గా కొనసాగుతున్నాడు. పట్టణంలో ప్రైవేట్ ఆస్పత్రులను తలదన్నే రీతిలో లేజర్ ట్రీట్మెంట్ మెషిన్లు, బెడ్లు ఏర్పాటు చేసుకున్నాడు. శంకర్‌దాదా.. ఎంబీబీఎస్ సినిమా తరహా అవతారమెత్తి స్పెషలిస్ట్ డాక్టర్‌గా దర్జాగా ఆస్పత్రినే నిర్వహిస్తున్నాడు. పట్టణంలో ప్రముఖ స్పెషలిస్ట్ డాక్టర్ల ఆస్పత్రులు కేంద్రీకృతమై ఉండే క్రిస్టియన్ పేటలో ఏర్పాటు చేయడం గమనార్హం. ఈ కొత్త డాక్టర్, ఆస్పత్రి విషయమై స్థానికంగా ఉండే డాక్టర్లకు అనుమానాలు ఉన్నా.. ఆయన ఎవరో ఎవరికీ తెలియకుండా వ్యవహరిస్తున్నాడు. అదీ ఏడాదికి పైగా కొనసాగుతుండడం వైద్యశాఖ నిర్లక్యానికి అద్దం పడుతోంది. సాక్షి, కావలి: వైద్యులుగా సాధారణంగా ఎంబీబీఎస్ చదివిన వారు ఉంటారు. ఇక ఒక్కో రకం వైద్యంలో స్పెషలైజేషన్ చేసిన వారు ఆపై చదువు అయిన ఎండీ చేసి ఉంటారు. కానీ కావలిలో సాధారణ వ్యక్తి చర్మ వ్యాధులకు సంబంధించి స్పెషలైజేషన్ ఎండీ చేసినట్లుగా ఏకంగా బోర్డు పెట్టి పెద్ద భవంతిలోనే ఆస్పత్రిని నిర్వహిస్తున్నాడు. పట్టణానికి సమీపంలో ఉన్న ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం పాజర్ల గ్రామానికి చెందిన ఓ సురేష్ చాలా కాలంగా కావలిలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో కంపౌండర్‌గా పని చేస్తున్నాడు. కొంతకాలంగా అతను కావలిలో కనిపించకుండా పోయాడు. ఈ నేపథ్యంలో ఏడాదిన్నర క్రితం పట్టణంలోని క్రిస్టియన్‌పేట ఐదో లైన్లో ఒక భవనంలో ఏకంగా ఎస్ఎస్ఎం క్లినిక్ అనే పేరుతో ఆస్పత్రిని ప్రారంభించాడు. ఆ ఆస్పత్రి వద్ద డాక్టర్ ఓ.సురేష్ అనే బోర్డు తగిలించాడు. ఆ బోర్డులో ఎండీ, ఎంఎస్సీ, పీజీడీసీసీ తన విద్యార్హతలుగా పేర్కొన్నాడు. స్కిన్, హెయిర్, లేజర్ వైద్య నిపుణుడిగా కనపరిచాడు. ఆస్పత్రిలో చికిత్స చేయడానికి రెండు మెషిన్లు, బెడ్లు సమకూర్చాడు. ఒక యువతిని నర్సుగా పెట్టుకొన్నాడు. రోగులకు మందులు రాసి ఇచ్చే ప్రిస్కిప్షన్ పై భాగంలో డాక్టరు పేరుతో పాటు మెడికల్ బోర్డులో వైద్యుడిగా రిజస్ట్రేషన్ చేసుకున్న నంబర్ తప్పనిసరిగా ఉంటుంది. కానీ ఈ నకిలీ డాక్టర్ ప్రిస్కిప్షన్ కాగితంలో ఎక్కడా రిజిస్ట్రేషన్ నంబర్ లేదు. సమాచారం తెలుసుకున్న కావలి సబ్ కలెక్టర్ చామకూరి శ్రీధర్ వైద్య శాఖ డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ టి.విజయకుమార్, డాక్టర్ పీసీ కోటేశ్వరరావు, సిబ్బంది కలిసి సంయుక్తంగా గురువారం ఆస్పత్రిలో తనిఖీకి వచ్చారు. ఈ విషయం తెలుసుకుని నకిలీ డాక్టర్ ఆస్పత్రి నుంచి పరారయ్యాడు. అక్కడ నర్సుగా ఉన్న యువతి అధికారులకు డాక్టర్ లేరు, పనిమీద బయటకు వెళ్లారు అని చెప్పింది. దీంతో వైద్య అధికారులు ఆస్పత్రి భవనంలోకి వెళ్లి రోగులకు చికిత్స చేసే మిషన్లు, బెడ్లు, ఓపీ పరీక్షలు చేసే గది, శతక్కోప్ తదితర వాటిని చూసి నివ్వెరపోయారు. -
రండి.. కూర్చోండి.. మేమున్నాం
సాక్షి, కావలి (నెల్లూరు): మార్పు సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతోంది. పాలనలో కింది స్థాయి అధికారులు కూడా ప్రజలకు బాధ్యాతాయుతంగా పని చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్న ‘స్పందన’ను జిల్లా ఎస్పీ ఆదర్శంగా తీసుకున్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు కావలి పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా మెలగడానికి పోలీస్ స్టేషన్లలో మహిళా కానిస్టేబుళ్లను రిసెప్షనిస్టులుగా నియమించారు. దీంతో ఫిర్యాదుదారులు, బాధితులు పోలీస్ స్టేషన్‌కు వస్తే ఆత్మీయంగా పలకరించి వారి సమస్యను, బాధలను, కష్టాన్ని ఓపికగా వింటున్నారు, ఓదార్చుతున్నారు. దీంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లే వారికి ప్రారంభంలోనే మనసు కాస్త ఊరట కలుగుతుండటంతో నూతన ఒరవడిని అమలు చేస్తున్న పోలీసుల వైఖరిని అభినందిస్తున్నారు. పట్టణంలో ఉన్న వన్ టౌన్, టూ టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్లతో పాటు బిట్రగుంట పోలీస్ స్టేషన్లలో జీహెచ్ సౌమ్య, కె.రామసుబ్బమ్మ, జె.రజనీ, కె.అనూష తదితర మహిళా కానిస్టేబుళ్లు రిసెప్షనిస్ట్‌లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఫిర్యాదు దారులు, బాధితులు పోలీస్ స్టేషన్‌కు రాగానే విధుల్లో ఉన్న వారు కస్సుబుస్సుమంటూ కసురుకుంటూ చీదరించుకొనేవారు. కాగితంపై రాసుకొని రాపో అంటూ విసుక్కొనేవారు. అయితే మహిళా రిసెప్షనిస్ట్‌లు మాత్రం రండి కూర్చోండి అంటూ పలకరిస్తున్న తీరు ఆకట్టుకుంటుంది. బాధితులు చెప్పే విషయాలు అన్నీ ఓపిగ్గా విని వారే కాగితంపై బాధితులు చెప్పే అంశాలన్నింటినీ నిదానంగా ఫిర్యాదు రూపంలో రాస్తున్నారు. దీనివల్ల ఫిర్యాదు దారునికి న్యాయం జరగడానికి అవకాశం ఏర్పడుతుంది. ఫిర్యాదు ఇచ్చిన తర్వాత రశీదును అందచేస్తున్నారు. ఈ నూతన ప్రకియ వల్ల న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించే బాధితులు మారిన పరిస్థితులను చూసి మంత్రముగ్ధులవుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విధులు నిర్వర్తించే మహిళా రిసెప్షనిస్ట్‌లు ఎటూ కదలకుండా పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించగానే ఉండే ప్రదేశంలో కూర్చొనే ఉంటున్నారు. కాగా రిసెప్షనిస్ట్‌ల వద్ద ఆయా స్టేషన్లలో విధులు నిర్వర్తించే ముదురు కానిస్టేబుళ్లు తిష్టవేసి, ఫోన్లలో మాట్లాడుకుంటూ ఉండటం, వచ్చిన బాధితుల వద్ద బడాయి మాటలు చెప్పుకొంటున్న తీరు మాత్రం వాతావరణాన్ని చెడకొడుతున్నట్లుగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారాలను అరికట్టాలని పలువురు కోరుతున్నారు. సమస్యలు వింటుంటే బాధగా ఉంటుంది పోలీస్ స్టేషన్‌కు ఏదో కష్టం వస్తేనే కదా వచ్చేది. బాధతో వచ్చిన వారితో నిదానంగా వారి బాధలు ఓపిగ్గా వినాలి. వారి బాధలు వింటూ పోలీస్ అధికారులకు అన్ని విషయాలు తెలియజేసి న్యాయం జరిగేలా చేస్తానని చెబుతాను. బాధలు వింటుంటే ఇలాగా కూడా జరుగుతుందా అని బాధగా ఉంటుంది. – సీహెచ్ సౌమ్య, మహిళా రిసెప్షనిస్ట్, కావలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఫలితాలు బాగున్నాయి మహిళలు రిసెప్షనిస్ట్‌గా ఉండటం వల్ల ఫిర్యాదుదారులపై గౌరవంగా ఉంటారు. తొందరపాటుగా ప్రవర్తించరు. అలాగే మహిళలు వస్తే వారి సమస్యలు తెలుసుకోవడానికి ఇబ్బంది ఉండదు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారి వద్ద సమస్య తలెత్తితే పోలీస్ స్టేషన్లో ఉండే రైటర్ వచ్చి చూసుకొంటారు. అతనికి మించిన సమస్య వస్తే నేనే అక్కడకు చేరుకొంటాను. మహిళా కానిస్టేబుల్‌ను రిసెప్షనిస్ట్ గా నియమించడం వల్ల ఫలితాలు బాగున్నాయి. – ఎం.రోశయ్య, సీఐ, కావలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ -
యువతిని గర్భవతిని చేసి.. కానిస్టేబుల్ నిర్వాకం
సాక్షి, నెల్లూరు : యువతిని ప్రేమించి.. పెళ్లి పేరుతో మోసగించి గర్భవతిని చేసి.. మరో పెళ్లికి సిద్ధమైన ఓ కానిస్టేబుల్ బాగోతం ఇది. ప్రేమించిన వాడే తనతో పెళ్లికి నిరాకరిస్తుండటంతో బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. మహిళా సంఘాలు ఆమెకు అండగా నిలిచాయి. ఈ ఘటన నెల్లూరు జిల్లా కావలిలో చోటుచేసుకుంది. వివరాలివి.. నెల్లూరు ఐదో నగర పోలీసు స్టేషన్లో సాయి కిరణ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అతను-అనూష అనే యువతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని సాయికిరణ్ తనను నమ్మించి.. తనను గర్భవతిని చేశాడని బాధిత యువతి తెలిపారు. పెళ్లి విషయంలో ముఖం చాటేస్తూ వచ్చిన సాయికిరణ్ ఇప్పుడు మరో పెళ్లికి సిద్ధమయ్యాడని, ఈ విషయంలో తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ వ్యవహారంలో బాధిత యువతికి అండగా నిలిచిన మహిళా సంఘాలు.. పోలీస్‌శాఖలో పనిచేస్తున్న సాయికిరణ్‌పై సత్వరమే చర్యలు తీసుకోవాలని, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. -
మెట్టకు ‘రైలు’ వచ్చేనా!
సాక్షి, కావలి: జిల్లాలోని మెట్టప్రాంత ప్రజల దశాబ్దాల స్వప్నం శ్రీకాళహస్తి–నడికుడి రైలు మార్గం. 2020 నాటికి ఈ రైలు మార్గం పూర్తి చేయాల్సి ఉన్నా చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా భూసేకరణే పూర్తి కాని పరిస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం అన్నింటికీ సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. జిల్లాలోని వందలాది పడమటి పల్లెల ప్రజలు శ్రీకాళహస్తి–నడికుడి మార్గంలో రైలు కూత వినాలనే ఆకాంక్షతో ఉన్నా చంద్రబాబు ప్రభుత్వ అటకెక్కించింది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నుంచి గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలోని నడికుడి వరకు పడమట పల్లెల్లో నూతన రైలు మార్గం నిర్మించాలని, ఆ రైలు మార్గం జిల్లాలో కూడా మెట్టప్రాంతంలోని పల్లెల మీదుగా నిర్మించాలని 50 ఏళ్ల నుంచి ప్రజలు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం ఈ రైలు మార్గాన్ని నిర్మించేందుకు అంగీకరించింది. అయితే గుంటూరు జిల్లాలోని నడికుడి జంక్షన్ రైల్వేస్టేషన్ నుంచి కాకుండా, అక్కడికి 25 కిలోమీటర్లు దూరంలో ఉన్న రాజుపాళెం మండలం అనుపాలెం అనే గ్రామం నుంచి ఈ రైలు మార్గాన్ని నిర్మిస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి నుంచి కాకుండా నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి వరకే ఈ రైలు మార్గాన్ని నిర్మించడానికి చర్యలు తీసుకున్నారు. అటకెక్కిన భూసేకరణ ఒప్పందం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా వ్యయాన్ని భరించి భూసేకరణ చేసి రైల్వేశాఖకు అప్పగించాల్సి ఉంది. జిల్లాలోని వరికుంటపాడు, కొండాపురం, కలిగిరి, వింజమూరు, ఏఎస్‌పేట, ఆత్మకూరు, చేజర్ల, పొదలకూరు, రాపూరు, డక్కిలి, వెంకటగిరి మండలాల్లోని 2,267.77 ఎకరాల భూమిని సేకరించాల్సిఉంది. ఇందులో ప్రభుత్వ భూమి 777.09 ఎకరాలు కాగా, మిగిలిన పట్టా భూములు 1,054.54 ఎకరాలు, అసైన్డ్ భూములు 436.14 ఎకరాలు గుర్తించారు. అంటే 1,590.68 ఎకరాల భూమికి సంబంధించిన యజమానులకు నష్టపరిహారం చెల్లించాల్సిఉంది. ఎకరాకు కనీసం రూ.4.25 లక్షల నుంచి గరిష్టం రూ.15 లక్షల వరకు ఆయా ప్రాంతాల్లో ఉన్న మార్కెట్ ధరను బట్టి నిర్ణయించాల్సిఉంది. రూ.100 కోట్ల వరకు నష్టపరిహారం చెల్లించాల్సివస్తుంది. చంద్రబాబు ప్రభుత్వం నిధుల విడుదలకు ఆసక్తి చూపకపోవడంతో అధికారులు కూడా భూములకు ప్రాంతాల వారీగా నష్టపరిహారం చెల్లించడానికి ధరలు కూడా ఖరారు చేయకుండా పక్కన పెట్టేశారు. నిర్మాణానికి నిధుల మాటేమిటో.. కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వంతో జరిగిన ఒప్పందం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తన నిధులతోనే భూసేకరణ జరిపి రైల్వేశాఖకు భూములు అప్పగించాల్సిఉంది. అలాగే రైలు మార్గం నిర్మాణంలో అయ్యే ఖర్చులో సగం రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. రైలు మార్గం ఖర్చు రూ.2,454 కోట్లు అవుతుంది. జిల్లాలో భూసేకరణకు నిధులు మంజూరు చేయకుండా రెండేళ్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇక నిర్మాణానికి నిధులు ఎప్పటికి మంజూరు చేస్తుందోనని అధికారవర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. కాగా చంద్రబాబు ప్రభుత్వ వైఖరి వల్ల 2020 నాటికి ఈ మార్గం పూర్తి కావాలనే లక్ష్యం నేరవేరే పరిస్థితి లేకుండాపోయింది. అసమగ్రంగా స్టేషన్ల ఏర్పాటు శ్రీకాళహస్తి–నడికుడి రైలు మార్గం పొడవు 308.7 కిలోమీటర్లు కాగా అందులో నెల్లూరు జిల్లాలోనే 146.11 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం రైల్వేస్టేషన్లు 33 కాగా, జిల్లాలో 15 ఉన్నాయి. గుంటూరు, ప్రకాశం జిల్లాల మీదుగా నెల్లూరు జిల్లాలో నిర్మిస్తున్న ఈ రైలు మార్గంలో జిల్లాలోనే ఎక్కువ స్టేషన్లు నిర్మించనున్నారు. అయితే కొండాపురం, కలిగిరి, పొదలకూరు మండలాల్లోని భూములు కూడా రైలు మార్గం నిర్మాణానికి తీసుకుంటున్నప్పటికీ ఆ మండలాల్లో ఒక్క రైల్వేస్టేషన్ కూడా నిర్మించడం లేదు. వరికుంటపాడు మండలంలోని కొల్లువారిపల్లె, వింజమూరు మండలంలో గోళ్లవారిపల్లె, రావిపాడు, వింజమూరు గ్రామాల్లో రైల్వేస్టేషన్లు ఏర్పాటు కావాల్సిఉంది. ఏఎస్‌పేట మండలంలో దూబగుంట, ఆత్మకూరు మండలంలో పమిడిపాడు, ఆత్మకూరు, చేజర్ల మండలంలో ఓబులాయపల్లె, కొత్తూరు, రాపూరు మండలంలో వెంకటాపురం, ఆదూరుపల్లి, రాపూరు, డక్కిలి మండలం వెల్లంపల్లి, ఆల్తూరుపాడు, వెంకటగిరి మండలంలో బాలసముద్రం గ్రామాల్లో రైల్వేస్టేషన్లు నిర్మించాల్సిఉంది. ఈ రైలు మార్గం నిర్మిస్తున్న జిల్లాలోని 11 మండలాల్లో పెద్ద మండలాలు పొదలకూరు, కలిగిరి. ఈ మండలాల్లో కనీసం ఒక్క రైల్వేస్టేషన్ కూడా నిర్మించడం లేదు. పొదలకూరు మండలంలో, పక్కనే ఉన్న సైదాపురం మండలంలో నిమ్మతోటలు భారీగా ఉన్నాయి. ఈ మండలాల్లోని నిమ్మకాయలు దక్షిణ, ఉత్తర భారతదేశంలోని చెన్నై, కోయంబత్తూరు, బెంగళూరు, కొచ్చిన్, త్రివేండ్రం, కలకత్తా, న్యూఢిల్లీ, హైదరాబాద్ వంటి ప్రాంతాల మార్కెట్‌కు రవాణా అవుతున్నాయి. పొదలకూరు మండలం మీదుగా రైలు మార్గం ఉన్నప్పటికీ కనీసం రైల్వేస్టేషన్‌ను లేకపోవడంతో గమనార్హం. భూసేకరణకే నిధులు మంజూరు చేయని చంద్రబాబు ప్రభుత్వం మెట్టప్రాంత ప్రజల దశబ్దాల నాటి రైలుమార్గం స్వప్నాన్ని నీరుగారుస్తోంది. రవాణాకు అనువు ప్రస్తుతం ఉన్న విజయవాడ–చెన్నై రైలు మార్గానికి శ్రీకాళహస్తి–నడికుడి రైలు మార్గం బలమైన ప్రత్యామ్నాయ రైలు మార్గంగా ఉపయోగపడుతుందని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి. తుపాన్లు, వరదలతో కోస్తా తీరానికి సమీపంలో ఉన్న విజయవాడ–చెన్నై రైలు మార్గంలో అంతరాయం ఏర్పడినప్పడు, రద్దీ ఏర్పడినప్పడు శ్రీకాళహస్తి–నడికుడి రైలుమార్గం అందుబాటులో ఉండడం వల్ల దక్షిణ–ఉత్తర భారతదేశాలకు అనుసంధానమైన వాణిజ్య రవాణాకు అనువుగా ఉంటుందని రైల్వే వర్గాలు విశ్లేషిస్తున్నాయి. -
మున్సిపాలిటీ నిధులు బొక్కేశారు
సాక్షి, కావలి : కావలి మున్సిపాలిటీలో టీడీపీ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిధులు ఇష్టారాజ్యంగా కాజేశారు. పట్టణంలో ఒక్క చెత్తను తరలించే పని వ్యహారంలోనే రూ. 6 కోట్లు నిధులు ఈ ఐదేళ్ల కాలంలో కాజేశారు. మున్సిపాలిటీకి అవసరం లేకపోయినప్పటికీ టీడీపీ నాయకులు తమ చేతుల్లో అధికారం ఉందని తమకు కావాల్సిన 50 మందిని పారిశుద్ధ్య కార్మికులుగా చేర్పించారు. వీరికి నెలకు రూ.10,000 జీతంగా పట్టణ ప్రజలు పన్నుల రూపంలో అందజేసిన నిధులను చెల్లిస్తున్నారు. ఈ ఐదేళ్లకాలంలో వీరికి రూ. 3 కోట్లు సమర్పించారు. అలాగే ఆటోలు అవసరం లేకపోయినప్పటికీ 5 ఆటోలను, వీధుల్లో చెత్త నిల్వ చేసే డంపర్లను ఏర్పాటు చేశారు. వీటికి డీజిల్, మరమ్మతులకు ఈ ఐదేళ్ల కాలంలో రూ.3 కోట్లు నిధులు కాజేశారు. పట్టణంలో రోజుకు 50 టన్నుల చెత్తను మున్సిపాలిటీ తరలించాల్సి ఉంది. వీటిని తరలించడానికి ఒక పెద్ద కంపాక్ట్ వాహనం, రెండు చిన్న కంపాక్ట్ వాహనాలు సరిపోతాయి. కావలి మున్సిపాలిటీలో అధికార పెత్తనం కోసం 1987 నుంచి నుంచి అర్రులు చాస్తున్న టీడీపీ నాయకులు, 2014 లో వైఎస్సార్సీపీలో గెలుపొందిన కౌన్సిలర్లను ఫిరాయింపులకు పాల్పడిన మున్సిపాలిటీలో అధికారాన్ని దక్కించుకొన్నారు. అప్పటి నుంచి మున్సిపాలిటీలోని ప్రతి విభాగంలో కూడా నిధులు లూటీకి స్కెచ్‌లు వేసి యథేచ్ఛగా కాజేశారు. ఈ క్రమంలో చెత్త తొలగింపు అంశాన్ని సైతం స్వాహాకు సద్వినియోగం చేసుకొన్నారు. -
చెరువుపై చెరో కన్ను..!
సాక్షి, కావలి (నెల్లూరు): అధికార పార్టీ నాయకుల హోదాలో కావలి టీడీపీ నాయకులైన బీద సోదరులు ప్రభుత్వ నిధులను లూటీ చేయడాన్ని అడ్డూ అదుపు లేకుండా ఐదేళ్లపాటు నిర్విఘ్నంగా కొనసాగించారు. ఈ క్రమంలో నియోజకవర్గంలోని మండల కేంద్రమైన అల్లూరు చెరువును అడ్డాగా చేసుకొని నిధుల దోపిడీకి రంగం సిద్ధం చేశారు. అయితే ఇరిగేషన్‌శాఖ అధికారులు బీద సోదరుల అడ్డమైన దోడిడీకి సహకరించి తాము ఎందుకు బలైపోవాలని ఆత్మపరిశీలన చేసుకున్నారు. రూ.3 కోట్లకు సరిపడే బిల్లులును అల్లూరు చెరువు, పంట కాలువలు మరమ్మతుల పేరుతో చెల్లింపులు చేయాలని బీద సోదరులు చేస్తున్న వత్తిళ్లకు అధికారులు లొంగలేదు. చెరువును అడ్డం పెట్టుకుని.. అల్లూరు చెరువు నుంచి 25 వేల ఎకరాలకు పైచిలుకు సాగునీరు అందుతుంది. అలాగే అల్లూరులోని 30 వేల జనాభాకు తాగునీరు అందించే వసతి ఉంది. అలాగే ఈ చెరువు నుంచి మరో మూడు చెరువులకు నీరు చేరుతోంది. ఇలా అల్లూరు చెరువుకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. సరిగ్గా ఈ అంశాన్ని టీడీపీ నాయకులు అడ్డం పెట్టుకొని చెరువు కట్టను, పంట కాలువ మరమ్మతులను, సిమెంట్ కాంక్రీట్‌తో లైనింగ్ పనులు ఇలా తమకు తోచిన పనులు అర్జెంట్‌గా చేయాల్సి ఉందని అధికారులతో ప్రతిపాదనలు తయారు చేయించారు. ఈ పనులన్నీ పూర్తి చేయడానికి అత్యవసరంగా రూ.3 కోట్లు నిధులు మంజూరు చేయాలని సదరు నివేదికలో అధికారులు పొందుపరిచేలా చేశారు. ఆ ప్రతిపాదనలకు సంబంధించిన ఫైలును అల్లూరు నుంచి జిల్లా కేంద్రమైన నెల్లూరు, అక్కడ్నుంచి రాష్ట్ర రాజధాని అమరావతికి చేరేలా పరుగులు తీయించారు. ఎట్టకేలకు ప్రభుత్వం రూ.3 కోట్లు నిధులు మంజూరు చేసింది. దీంతో టీడీపీ నాయకులైన బీద సోదరులు బినామీలుగా అవతరించి ఈ కాంట్రాక్ట్ పనులను సొంతం చేసుకొన్నారు. అధికారులపై గుర్రుగా బీద సోదరులు కాలువలు కాంక్రీట్ లైనింగ్ పనులు, చెరువు కట్ట బండ బలోపేతం చేసే పనులు, కలుజు మరమ్మత్తులు తదితర పనులు చేయాలని సోమశిల జలాలను సైతం చెరువు రాకుండా అడ్డుకొన్నారు. రైతులు తమ పొలాలకు నీరు ఇవ్వకపోతే పంటలు ఎలా పండించుకోవాలని అల్లూరు రైతులు నెత్తినోరు బాదుకున్నా బీద సోదరులు లెక్క చేయలేదు. అదేమంటే చెరువు, కలుజు, కాలువలు మరమ్మతు పనులు చేస్తున్నారు, సాగుకు నీరు వదిలితే పనులు ఆగిపోతాయని రైతులపైనే బీద సోదరులు గుడ్లురిమారు. క్రమంలో అల్లూరు చెరువు, పంట కాలువలు మెరుగుపడుతాయని రైతులు, అల్లూరు ప్రజలు ఆశించారు. అయితే బీద సోదరులు మొక్కుబడిగా ఈ పనులు చేసి రూ.3 కోట్లకు బిల్లులు చేసి, ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను తమ బ్యాంక్ ఖాతాలో జమచేయాలని ఇరిగేషన్ అధికారులను వేపుకుతిన్నారు. అయితే ఇరిగేషన్ అధికారులు బీద సోదరుల దోపిడీ దూకుడును గమనించి భీతిల్లిపోయారు. కనీసం కంటికి కనిపించే పనులు కూడా చేయకుండా రూ.3 కోట్ల నిధులను టీడీపీ నాయకులకు అప్పనంగా అప్పగిస్తే, అనంతరం వచ్చే సమస్యలకు తాము బలైపోవాల్సి వస్తుందని అధికారులు భావించారు. దీంతో బిల్లులు చేయకుండా పక్కన పెట్టేశారు. బీద సోదరులు మాత్రం తమ బిల్లులు చేయకుండా ఉంటారా.. అంటూ ఇరిగేషన్ అధికారులపై కత్తులు నూరుతున్నారు. -
నా మీద ఎందుకు ఏడుస్తున్నారు బాబు : వైఎస్ జగన్
సాక్షి, (కావలి) నెల్లూరు : ‘ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. గత 10 రోజులుగా చంద్రబాబునాయుడు నోట్లో నుంచి ఒకే పేరు వినిపిస్తోంది. జగన్.. జగన్.. జగన్.. జగన్... కనీసం రోజుకు వంద సార్లు జగన్ పేరే చెబుతున్నారు. అయ్యా.. చంద్రబాబు మీరు మంచి పాలన చేస్తే.. ఆ పరిపాలన చూపించి ఓటు ఎందుకు అడగలేకపోతున్నారు. నీ ఎల్లో మీడియా నీ మంచి పాలన మీద చర్చపెట్టకుండా మా మీద ఎందుకు ఏడుస్తోంది.’ అని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల ప్రచారలో భాగంగా బుధవారం ఆయన నెల్లూరు జిల్లా కావలి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. మండుటెండను కూడా లెక్కచేయకుండా భారీగా తరలివచ్చిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జగన్ ఈ సభలో ఇంకా ఏమన్నారంటే.. చేయని అన్యాయం.. చేయని మోసం లేదు.. ‘ఐదేళ్లుగా చంద్రబాబు ఆయన కొడుకు నారా లోకేష్ రాష్ట్రాన్ని అన్యాయంగా దోచేశారు. ఎప్పుడూ లేనంతగా దుష్టపాలన సాగిస్తున్నారు. వీరి పరిపాలన గురించి ఏ టీవీ చానెళ్లలో కూడా చర్చ జరగకుండా మ్యానేజ్ చేశారు. ప్రతిరోజు అధికారంలో లేని మమ్మల్ని విమర్శిస్తూ వారి డిబెట్లు జరుగుతూ ఉంటాయి. ఈ రోజు యుద్దం ధర్మానికి, అధర్మానికి జరుగుతోంది కాబట్టి వీటన్నిటిని మీరంతా గమనించాలి. ఈ దుర్మార్గపు చంద్రబాబు పాలన చూసి.. ఆయన కండువా కప్పుతానంటే కూడా దగ్గరకు వచ్చే వాళ్లు లేరు. ఆగండయ్యా అని ఆపితే కూడా ఎవ్వరు ఉండటం లేదు. చంద్రబాబుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో మనందరికి తెలుసు. 2014 ఎన్నికల్లో ఆయన ఏం చెప్పాడు.. ఏం చేశాడో అందరికి తెలుసు. అందుకే ఆయన పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. యాబై పేజీలతో మేనిఫెస్టో బుక్ ఇచ్చాడు. ఇందులో 12వ పేజీలో అయితే స్వయంగా చంద్రబాబు నాయుడు 12 వాగ్ధానాలు చేసి సంతకం కూడా పెట్టారు. ఇంటింటికి చంద్రబాబునాయుడు ఓ లేఖ కూడా పంపించారు. ఈ లెటర్ వచ్చినట్లు మీకు గుర్తుకుందా? ఈ ఎన్నికల ప్రణాళికలో దాదాపు 650 హామీలు ఇచ్చారు. రైతుల రుణమాఫీపై తొలి సంతకం. ఇవాళ అడుగుతున్నా.. మీ రుణాలు మాఫీ అయ్యాయా? ఆయన హయాంలో అధికారంలోకి వచ్చే నాటికి రూ. 87,612 కోట్ల వ్యవసాయ రుణాలు ఉంటే ఈయన చేసేంది వడ్డీలకు సరిపోలేదు. ఆ రుణాలు ఇవ్వాళ రూ. లక్షా 25 వేల కోట్లకు ఎగబాకాయి. డ్వాక్రా సంఘాలకు రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నారు. మాఫీ అయ్యాయా.. అక్కా? ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మీ కింద రూ.85 వేలు డిపాజిట్ చేస్తా అన్నారు. చేశాడా.. అక్కా? జాబు కావాలంటే బాబు రావాలన్నారు.. ఇంటికో ఉద్యోగమన్నారు.. ఉపాధి దొరికే వరకు ఇంటింటికి రెండు వేలన్నారు.. మరీ ఉద్యోగం వచ్చిందా అన్నా? అక్కా వచ్చిందా? 60 నెలలకు ప్రతి ఇంటికి రూ. లక్షా ఇరువై వేలు బాకీ పడ్డారు ఈ పెద్దమనిషి. ఎన్టీఆర్ సుజల పథకం కింద రూ. 2లకు మినరల్ వాటర్ అన్నారు.. కనిపించిందా? బీసీలకు సబ్ ప్లాన్.. పేదవారికి మూడు సెంట్ల స్థలం.. ఇళ్లు వచ్చిందా? ఇలా చదువుతూపోతే.. చంద్రబాబు దారుణ మోసాలు తెలుస్తాయి. మేనిఫెస్టో మాయం.. ఇవి సరిపోనట్లు ఎన్నికలు ముందు ఈ మాదిరిగానే మరోసారి ఫోజిస్తారు. మళ్లీ ఇటువంటివే చెప్పి.. మోసం చేసేందుకు కొత్త సినిమా స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాలు చూసి చూసి.. చాలైన పరిస్థితిలో మళ్లీ 25 ఏళ్ల కుర్రాడిగా సిద్దమై మరో సినిమాకు సిద్దమవుతున్నారు. ఈ ఐదేళ్లలో ఆయన ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి చేశాడా? ఈ పెద్దమనిషి ఏం చేశాడో తెలుసా.. ఈ మేనిఫెస్టోను మాయం చేశాడు. ప్రజలు ఛీ కొడతారని టీడీపీ వెబ్‌సైట్స్‌లో కనబడకుండా చేశారు. ఇదిగో ఈ మేనిఫెస్టోలో ఉన్నవన్నీ చేశా.. చేశాను కాబట్టి ఓట్లేయండి అన్నట్లు మేనిఫెస్టో ఉండాలి. కానీ చంద్రబాబు అలాకాకుండా దోపిడీ ముఠాగా రాష్ట్రాన్ని దోచుకున్నారు. సర్వం దోచేశారు. ఏ ఒక్క వర్గానికి తానిచ్చిన మాటను నిలబెట్టుకోలేదు. ఇప్పుడేం ఏమంటున్నాడో తెలుసా? నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేస్తాడు. ఆయన ఈయనను పొగడితే.. ఈయన ఆయన పొగుడుతాడు. మంత్రులుగా కొనసాగుతారు. ఇక చివరి ఏడాది వచ్చేసరికి తానే బీజేపీ మీద పోరాడుతున్నానని బిల్డప్ ఇస్తారు. సొంత బావమరిది హరికృష్ణ శవం పక్కనే టీఆర్ఎస్ నేత కేటీఆర్‌తో డీల్ మాట్లాడుతారు. వాళ్లు కుదరదన్నారు.. అప్పుడు ఏం అనడు. అదే టీఆర్ఎస్తో తాను పోరాటం చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తాడు. ఆయన చేస్తే సంసారం.. ఇంకొకరు చేస్తే వ్యభిచారం. ఈ ఐదేళ్లలో చంద్రబాబును మీరంతా అతి దగ్గరగా చూశారు. ఆయన నైజాన్నీ, మోసాలను చూడమంటున్నా. ఆయనకు అభ్యర్థులు కరువై 175 స్థానాలకు ఒకేసారి ప్రకటించలేకపోయారు. మళ్లీ తమ నేతలను టీఆర్ఎస్ బెదిరిస్తుందంటారు. చంద్రబాబు నాయుడు పాలనలో 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొన్నారు. చంద్రబాబు నాయుడు నీవు మంచి పాలన చేస్తే.. నీ ఎల్లో మీడియా నీ పాలన మీద చర్చ పెట్టకుండా మా మీదపడి ఎందుకు ఏడుస్తుంది. ఈయనకు సరైన పాలన చేతకాక.. దొంగ ఓట్లను నమోదు చేయడం.. ఉన్న ఓట్లను తొలగించడం చేశారు. అన్న అవకాశం ఇద్దామని చెప్పండి ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ చంద్రబాబు చేయని జిమ్మిక్కులు ఉండవు. గ్రామాల్లోకి డబ్బులు మూటలు పంపిస్తారు. అందుకే ప్రతి ఊరికి వెళ్లండి. ప్రతి ఒక్కరికీ చెప్పండి. చంద్రబాబుకు ఇచ్చే రూ.3వేలకు మోసపోవద్దని చెప్పండి. 20 రోజులు ఓపిక పట్టండి అక్కా అని చెప్పంది. - చంద్రబాబు ఇచ్చే డబ్బులకు ఆశ పడకండి, అన్న ముఖ్యమంత్రి అవుతాడు, మన పిల్లలను బడికి పంపిస్తే, ప్రతి కుటుంబానికి ఏటా రూ.15,000 ఇస్తాడని చెప్పండి. - విద్యార్థులు ఎక్కడ, ఏ కోర్సు చదివినా పూర్తి ఫీజు చెల్లిస్తాడని ప్రతి అక్కచెల్లెమ్మకు చెప్పండి. ఇంజనీరింగ్, డాక్టర్, ఎంబీఏ.. ఏ కోర్సు అయినా సరే, ఎంత ఫీజు అయినా సరే అన్న చదివిస్తాడని చెప్పండి. - అన్నను సీఎం చేసుకుందాం, పెట్టుబడి సాయం కింద నాలుగేళ్లలో రూ.50,000 ఇస్తాడని రైతన్నలకు చెప్పండి. ప్రతి ఏటా మేలో రూ.12,500 రైతుల చేతిలో పెడతాడని చెప్పండి. ప్రతి పంటకు కచ్చితంగా గిట్టుబాటు ధర కల్పిస్తాడని చెప్పండి. - ‘వైఎస్సార్ చేయూత’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుడతాడని చెప్పండి. ఈ కార్యక్రమం కింద 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు వయసు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్క చేతిలో రూ.75,000 పెడతాడని చెప్పండి. - అన్నను సీఎంను చేసుకుంటే, ఎన్నికల నాటికి ఉన్న అప్పును నాలుగు విడతల్లో నేరుగా మీ చేతికే ఇస్తాడని పొదుపు సంఘాల మహిళలకు చెప్పండి. సున్నా వడ్డీకే రుణాలు అందుతాయని, మీరు లక్షాధికారులు అవుతారని చెప్పండి. - అవ్వాతాతల దగ్గరకు వెళ్లి ఒక మాట అడగండి. మీకు మూడు నెలల క్రితం దాకా ఎంత పెన్షన్ వచ్చేదని అడగండి. తమకు పెన్షన్ రావడం లేదని కొందరు చెబుతారు. ఇంకొందరు రూ.2,000 వస్తున్నాయని చెబుతారు. మరి జగనన్న లేకపోతే ఆ పెన్షన్ వచ్చేదా? అని అడగండి. జగన్ అన్నకు భయపడే చంద్రబాబు ఎన్నికలకు కేవలం మూడు నెలల ముందే పెన్షన్ పెంచాడని చెప్పండి. - జగనన్న ముఖ్యమంత్రి అయితే పెన్షన్ రూ.3,000 దాకా పెంచుకుంటూ పోతాడని అవ్వాతాతలకు చెప్పండి. కావలి నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రతాప్ కుమార్ రెడ్డి, నెల్లూరు ఎంపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డిలకు మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు కావాలి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే మీ ఓటు వేయండి. వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి’ అని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. కావలిలో ఎగసిన జనకెరటం -
హత్యలు చేసి ప్రజలను భయపెట్టలేరు
సాక్షి, కావలి: వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, వైఎస్ జగన్మోహన్రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసి ప్రజలను భయపెట్టి ఎన్నికల్లో లబ్ధిపొందాలనే టీడీపీ నాయకుల కుట్రలు ఫలించవని వైఎస్సార్సీపీ నాయకులు అన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు అయిన వైఎస్ వివేకానందరెడ్డిని అత్యంత పాశవికంగా హత్య చేయడాన్ని వైఎస్సార్సీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కార్యాలయంలో శుక్రవారం వివేకానందరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నాయకులు నివాళులు అర్పించారు. అలాగే పట్టణంలోని ముసునూరులో కూడా వైఎస్ వివేకానందరెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. నాయకులు మాట్లాడుతూ వైఎస్ వివేకానందరెడ్డి చాలా సౌమ్యుడన్నారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో ప్రజల ఓట్లను తొలిగించి నీచత్వానికి పాల్పడిన టీడీపీ నాయకులు, ఇప్పుడు మనుషులను అంతంమొందించే పనిలో ఉన్నట్లుగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రజలను భయపెట్టడానికి టీడీపీ నాయకులు చేస్తున్న దారుణాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. వచ్చేనెల 11 వతేదీ జరగనున్న పోలింగ్‌లో ప్రజలు టీడీపీ నాయకులు చేసిన పాపాలను గుర్తు చేసుకొని తగిన బుద్ధి చెబుతారని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి, కనుమర్లపూడి వెంకట నారాయణ, కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, కుందుర్తి కామయ్య, కేతిరెడ్డి శశిధర్‌రెడ్డి, కౌన్సిలర్లు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.