
ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసం ముందు భారీగా మోహరించిన భద్రతా దళాలు, పోలీసులు
సాక్షి, నెల్లూరు : వైఎస్సార్ సీపీ నేత, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సోమవారం అల్లూరు మండలం ఇసుకపల్లెలో ప్రతాప్ కుమార్ రెడ్డి పర్యటించకుండా పోలీసులు అడ్డుకున్నారు. మత్స్యకార గ్రామాలకు వెళ్లకుండా ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన నివాసం ముందు భారీగా భద్రతా దళాలు, పోలీసులు మోహరించారు. ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధిని పర్యటించకుండా అడ్డుకోవటం దారుణమన్నారు. పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment