ramireddy pratap kumar reddy
-
సీఎం జగన్ ఋణం తీర్చుకోవడానికి కావలి ప్రజలు సిద్ధంగా ఉన్నారు
-
చంద్రబాబును రాష్ట్ర ప్రజలు మెడబెట్టి గెంటే రోజులు దగ్గరలోనే ఉన్నాయి : కావలి ఎమ్మెల్యే
-
డ్యాన్స్ అదరగొట్టిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే
-
చంద్రబాబుని ఏకిపారేసిన మహిళా..వైఎస్సార్సీపీలో చేరిన మహిళలు
-
చంద్రబాబు కంటి జబ్బు దొంగ నాటకం..కావలి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
-
బావ మీద ఎప్పుడు లేని ప్రేమ ఇప్పుడు..రామిరెడ్డి ప్రతాప్ కౌంటర్
-
ఆమె ఇంటికి వెళ్లి స్వయంగా పింఛన్ అందజేసిన ఎమ్మెల్యే
ఒక దీపం వెలిగింది. మౌనరోదన మోములో సంతోషం వెల్లివిరిసింది. జీవన తేజంతో నవ్వులు పూయించింది. చీకట్లు ముసిరిన ఆ ఇంట ప్రభాత వెలుగులు నింపాయి. ఆ దివ్యాంగురాలి జీవనానికి ఆసరా దొరికింది. ఆమె జీవితానికి భరోసాగా నిలిచింది. ఆ ప్రభావ ప్రభాత దీపిక పేరే ‘పింఛన్’. అర్హులైన అభాగ్యులపై ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధికి నిలువెత్తు నిదర్శనం. కావలి: ఆమెకు 28 ఏళ్లు. పుట్టుక నుంచే శరీరంలో ఏ అవయవం పని చేయదు. కదల్లేదు. మాట్లాడలేదు. శారీరకంగా.. మానసికంగా దివ్యాంగురాలు. 20 ఏళ్లుగా ఆమె బతుకు దెరువుకు ఆసరాగా సామాజిక పింఛన్ కోసం కుటుంబ సభ్యులు అలుపెరగని పోరాటం చేసి అలసిపోయారు. కావలి పట్టణం 39వ వార్డులోని మూర్తిశెట్టివారివీధికి చెందిన ఈశ్వరమ్మ దివ్యాంగురాలు. తండ్రి చనిపోయాడు. తల్లి సైతం మానసికంగా కుంగిపోవడంతో ఆమె పనులే ఆమె చేసుకోలేని దయనీయ పరిస్థితి. తల్లికి వైఎస్సార్ వితంతు పింఛన్ కానుక వస్తోంది. తల్లిని, చెల్లిని సోదరుడు కూలి పనులు చేసి పోషిస్తున్నాడు. అతని భార్యే ఇటు అత్తను, అటు దివ్యాంగురాలైన ఆడపడుచుకు సపర్యాలు చేస్తోంది. వలంటీర్ చొరవతో.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ వచ్చాక ఆ దివ్యాంగురాలి దయనీయ పరిస్థితిని తెలుసుకున్న ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆమెకు పింఛన్ మంజూరు చేయించేందుకు కృషి చేశారు. ఆమెకు ఆధార్‌కార్డు లేదు. రేషన్ కార్డులేదు. దీంతో ఆమెకు పింఛన్ మంజూరు చేయలేని పరిస్థితి నెలకొంది. ఆమెకు వేలిముద్రలు ఆధార్ కార్డుకు సరిపోవడం లేదు. కుడి చేయిలో ఒక వేలి ముద్ర మాత్రమే రికగ్నైజ్ అవుతోంది. అధికారులు చర్యలు చేపట్టి ఆమెకు ఆధార్ కార్డు ను వచ్చేలా చేశారు. ఈలోగా సచివాలయ, వలంటీర్ల వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ఆమె నివాసం ఉంటున్న వార్డుకు ఎంపికైన వలంటీర్ గణవరపు అనూషా ఆమెకు పింఛన్ కల్పించేందుకు స్వయంగా తన సొంత డబ్బులు ఖర్చులు పెట్టుకుని తిరిగి కృషి చేసింది. పింఛన్ మంజూరు కోసం తొలుత రేషన్‌కార్డు మంజూరు చేయడానికి సాంకేతిక కారణాలతో ఆధార్ లింక్ కాక పెండింగ్‌లో పడింది. దీంతో రెండు మూడు సార్లు ఆధార్ కార్డును అప్డేట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరికి పర్మినెంట్ నంబరుతో తల్లి రేషన్‌కార్డులో ఈశ్వరమ్మను యాడ్ చేయించింది. చివరగా సదరం సర్టిఫికెట్ కోసం నాలుగైదు సార్లు నెల్లూరుకు తిరిగింది. కరోనా రావడం తో సదరం సర్టిఫికెట్ల మంజూరు నిలిచిపోయింది. ఇటీవల సదరం సెంటర్ పునః ప్రారంభం కావడంతో ఎట్టకేలకు సదరం సర్టిఫికెట్ మంజూరు కావడంతో పింఛన్‌కు నమోదు చేసింది. తాజాగా మంజూరు అయిన పింఛన్ల జాబితాలో ఆమె పేరు వచ్చింది. ప్రభాత వేళ.. ఆనంద హేళ ఆమెకు పింఛన్ మంజూరు కావడంతో ప్రభాత వేళ మంచు తెరలను దాటుకుంటూ స్వయంగా ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి వలంటీరు, సచివాలయ ఉద్యోగులను వెంట పెట్టుకొని ఆ యువతి ఇంటికి వెళ్లి పింఛన్ వచ్చిన విషయాన్ని తెలియజేశారు. దీంతో భావోద్వేగంతో ఆనంద భాష్పాలు కార్చింది. చాలా కాలం తర్వాత తనకు పింఛన్ వచ్చేలా చేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ సైగలు చేసింది. ఎమ్మెల్యే సైతం ఆమెను అభినందిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాసిన లేఖతో పాటు రూ.3 వేల నగదు అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హత ఉంటే ప్రతి ఒక్కరికీ పింఛన్ అందుతుందని చెప్పారు. అన్ని విధాలా వలంటీర్లు స్వయంగా సేవా దృక్పథంతో పని చేసి ప్రజలకు అండగా ఉంటారని ఈ ఉదంతం ఆదర్శంగా నిలుస్తోందన్నారు. (క్లిక్: సినిమా రేంజ్లో డ్రామా నడిపిన చంద్రబాబు.. అంతా డూపే..) -
సినిమా రేంజ్లో డ్రామా నడిపిన చంద్రబాబు.. అంతా డూపే..
కావలి: దామవరం విమానాశ్రయాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆద్యంతం డూప్ షోగా సాగించింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించాల్సిన ఎయిర్‌పోర్టు శంకుస్థాపన డూప్ షో చేసింది. ఐదేళ్లూ అధికారంలో ఉండీ ఏ బడ్జెట్లోనూ రూపాయి నిధులు కేటాంచని చంద్రబాబు ఎన్నికల నోటిఫికేషన్‌కు రెండు వారాల ముందు హడావుడిగా స్టిక్కర్లతో శిలాఫలాలు వేసి శంకుస్థాపన చేశారు. ఎయిర్‌పోర్టు నిర్మాణ కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థ ప్రతిపాదిత భూముల్లో పిచ్చిమొక్క కూడా పీకలేదు. దీన్ని బట్టి కాంట్రాక్టర్ డూప్ అని తేటతెల్లమైంది. జిల్లాకే ప్రతిష్టాత్మకమైన దామవరం ఎయిర్‌పోర్టుకు టీడీపీ నేతల భూ దోపిడీనే శాపంగా మారింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు భూ దోపిడీ పర్వాన్ని కొనసాగించారు. ఆ శాపం నుంచి విముక్తి కలిగించేందుకు మూడున్నరేళ్లుగా ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా సానుకూల ఫలితాలు రావడం లేదు. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన ప్రతిపక్ష నేత చంద్రబాబు దామవరంలో విమానాశ్రయ నిర్మాణం చేపట్టలేదని రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన విమర్శలు స్వయంగా ఆ పార్టీ నేతలనే ఖంగుతినేలా చేశాయి. భూ రాబందుల్లా మారిన టీడీపీ నేతల నిర్వాకం కారణంగానే విమానాశ్రయ నిర్మాణం నిలిచిపోయిందని జిల్లా అంతా తెలిసినా చంద్రబాబు మాత్రం యథావిధిగా ప్రభుత్వంపైనే ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా మారింది. భూ దోపిడీ ద్వారా విమానాశ్రయ నిర్మాణానికి సైంధవుల్లా అడ్డుపడిన జిల్లా నేత, భూ దందా చేసిన నియోజకవర్గ ఇన్చార్జి, అతని బినామీని పక్కన పెట్టుకునే చంద్రబాబు పసలేని విమర్శలు చేయడం విశేషం. ఇదీ విమానాశ్రయం కథ జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసే క్రమంలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో జిల్లా పర్యటనలో విమానాశ్రయాన్ని ప్రకటించారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉండేలా, జాతీయ రహదారిని ఆనుకుని రవాణాకు సౌకర్యంగా ఉండేలా కావలి నియోజకవర్గంలోని దామవరం వద్ద విమానాశ్రయ నిర్మాణానికి అధికారులు ప్రణాళికలు రూపొందించారు. మొత్తం 2,300 ఎకరాల్లో భారీ విమానాశ్రయం నిర్మించేలా డీపీఆర్ కూడా సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే దురదృష్టవశాత్తు ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అకాల మరణం చెందడంతో అనంతరం ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన కొణిజేటి రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదు. 2009–2014 మధ్య విమానాశ్రయ నిర్మాణంపై నిర్లిప్తత ఆవరించగా భూసేకరణ ప్రక్రియ నత్తనడకన సాగింది. 2014లో టీడీపీ అధికారంలో రావడంతో విమానాశ్రయ అంశం మరోమారు తెరపైకి వచ్చింది. అధికారం అండ చూసుకుని టీడీపీ నేతలు విమానాశ్రయం నిర్మించ తలపెట్టిన భూములు ఉన్న ప్రాంతంపై రాబంధుల్లా వాలిపోయారు. ఎయిర్‌పోర్టు ప్రతిపాదిత ప్రభుత్వ, ప్రైవేట్ భూములపై పడి నకిలీ రిజిస్ట్రేషన్లు, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. దీంతో మండల స్థాయి అధికారుల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు విమానాశ్రయం కోసం భూసేకరణ వ్యవహారం తల»ొప్పి కట్టేలా చేసింది. దామవరం ప్రతిపాదిత విమానాశ్రయ నిర్మాణ భూముల అసలు యజమానులు ఎవరో, నకిలీలు ఎవరో తేల్చుకోలేక అధికారులు భీతిల్లిపోయారు. ఏ నిర్ణయం తీసుకుంటే తమ ఉద్యోగాలకు ఎసరు తెస్తుందో అని వణికిపోయారు. ఈ క్రమంలో 2016లో అప్పటి కలెక్టర్‌గా ఉన్న జానకి దామవరంలో విమానాశ్రయ నిర్మాణానికి భూసేకరణ చేయడం సాధ్యం కాదని, అన్నీ కూడా వివాదాస్పద భూములే అని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ నేపథ్యంలో 2017 మే నెల 18న నెల్లూరుకు వచ్చిన అప్పటి రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు కల్పన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్‌జైన్, కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌తో సమావేశం ఏర్పాటు చేసి, దామవరంలో విమానాశ్రయం నిర్మాణ ప్రతిపాదనలను రద్దు చేసి, దానిని పక్క జిల్లాలకు తరలించడానికి చర్యలు తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. దీంతో అన్ని రాజకీయ పారీ్టలు అధికార టీడీపీ నేతల వైఖరిని తూర్పార బట్టాయి. ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే కదలిక 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వచ్చాక విమానాశ్రయ నిర్మాణానికి భూ సేకరణపై దృష్టి పెట్టి వివాదాలు పరిష్కరిస్తూ 1,310 ఎకరాలు సేకరిచింది. కేంద్ర విమానాయన శాఖకు చెందిన ‘ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా’ దామవరంలో విమానాశ్రయ నిర్మాణానికి సాంకేతిక అనుమతులు మంజూరు చేసింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన విమానాశ్రయ నిర్మాణ సంస్థ తమ వద్ద నిధులు లేవని ఏడాదిన్నర తర్వాత చావు కబురు చల్లగా చెప్పింది. ఈ క్రమంలో నిర్మాణ ప్రక్రియ మొదటికి వచ్చింది. ఈ నేపథ్యంలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఇటీవల ముంబయికి చెందిన విమానానాశ్రయ నిర్మాణ సంస్థ ప్రతినిధులను సంప్రదించి వారిని దామవరం తీసుకొచ్చి భూములు, విమానాశ్రయ లాభదాయక నిర్వహణ అంశాలను తెలియజేశారు. ఇది ప్రైవేట్, ప్రభుత్వం భాగస్వామ్యంతో నిర్మించి, నిర్వహించే విమానాశ్రయం కావడంతో ఈ రంగంలో అనుభవం ఉన్న పెట్టుబడిదారులను ఆకర్షించే పనిలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వం నడిపిన డ్రామా దామవరం వద్ద ఎయిర్‌పోర్టు రద్దు వివాదం నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం సరికొత్త డ్రామాకు తెరతీసింది. ఇక్కడే ఎయిర్‌పోర్టును నిర్మిస్తున్నట్లు మళ్లీ ప్రకటించి రెండేళ్లకు పైగా షో చేసింది. తొలుత ప్రతిపాదిత భూ విస్తీర్ణాన్ని కుదించింది. - 1,352 ఎకరాల్లో రూ.398.56 కోట్లతో దామవరంలో విమానాశ్రయం నిర్మించడానికి సెప్టెంబర్ 2017లో ఓ నిర్మాణ సంస్థకు చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు. - ఈ మేరకు 21 జూన్ 2018లో ఆ నిర్మాణ సంస్థతో ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుంది. ఆ అగ్రిమెంట్లో నిర్మాణ సంస్థ తన ఆర్థిక వనరులను కనపరచాల్సి ఉంది. అయితే అదే ఏడాది డిసెంబర్ 21వ తేదీ వరకు కూడా నిర్మాణ సంస్థ తన ఆర్థిక వనరులను ప్రభుత్వానికి చూపలేదు. ఇదొక బోగస్ నిర్మాణ సంస్థ అని తెలిసినా.. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు అసెంబ్లీ ఎన్నికలు సమీపించడంతో ప్రజలను మభ్యపెట్టేందుకు విమానాశ్రయ నిర్మాణానికి 11 జనవరి 2019 శంకుస్థాపన చేశారు. - ఆ తర్వాత ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వం మారింది. ఎయిర్‌పోర్టు నిర్మాణ కాంట్రాక్ట్ పొందిన సంస్థ పనులు ప్రారంభిస్తుందని ఏడాది పాటు ప్రభుత్వం ఎదురు చూసింది. పలుమార్లు నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ నిర్మాణ సంస్థ నుంచి ఎటువంటి ప్రతిపాదనలు రాకపోవడంతో 15 జూలై 2019లో నిర్మాణ సంస్థతో ప్రభుత్వం అగ్రిమెంట్‌ను రద్దు చేసింది. - దీన్ని బట్టి నిర్మాణ సంస్థ ఓ బోగస్, శంకుస్థాపన ఒక డూప్ షో అని తేలిపోయింది. దామవరంలోనే విమానాశ్రయం దామవరంలో విమానాశ్రయ నిర్మాణానికి టీడీపీ నాయకులు చేసిన దుర్గార్మాలు దారుణాల వల్లే సమస్య జఠిలంగా మారింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే భూసేకరణ చిక్కుముళ్లను ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక అధికారులు దామవరంలో విమానాశ్రయం నిర్మించడానికి సాధ్యపడలేదన్నారు. ఎన్నికలకు ముందు అదే చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఇవన్నీ టీడీపీ ప్రజలను వంచిచే పనులకు పరాకాష్ట. దామవరం విమానాశ్రయ నిర్మాణానికి సంక్లిష్టతగా మారిన భూసేకరణ సమస్యను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధిగమించింది. కేంద్ర ప్రభుత్వ అనుమతులు కూడా మంజూరు చేయించగలిగింది. అయితే నిర్మాణానికి పెట్టుబడులు పెట్టే వారికి కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. – రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే, కావలి -
కావలి ఎమ్మెల్యే కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్
-
12న కావలికి సీఎం వైఎస్ జగన్
కావలి (నెల్లూరు): సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 12వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు కావలికి రానున్నారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, ఆదిలక్ష్మి దంపతుల కుమారుడు సాకేత్‌కుమార్‌రెడ్డి, మహిమల వివాహ రిసెప్షన్ కావలిలోని జాతీయ రహదారిపై ఉన్న ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్లో 12న జరుగనుంది. నూతన వధూవరులను ఆశీర్వదించడానికి సీఎం హెలికాప్టర్లో కావలికి వస్తారని సమాచారం. ఈ నేపథ్యంలో ఎస్పీ సీహెచ్ విజయారావు బుధవారం కావలికి విచ్చేసి హెలిప్యాడ్ ఏర్పాటు చేసే ప్రదేశాలను పరిశీలించారు. కాగా సీఎం పర్యటనకు సంబంధించి అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. ఎమ్మెల్యే కుమారుడి వివాహం హైదరాబాద్‌లో గురువారం ఉదయం జరుగుతుంది. చదవండి: (Maha Samprokshanam: మహా సంప్రోక్షణ కార్యక్రమంలో సీఎం జగన్) -
మీలా రాజకీయ వ్యాపారిని కాను..
సాక్షి, కావలి: ‘కర్ణాటకలో నిర్మాణ రంగంలో వ్యాపారం చేసుకుంటూ.. ఆర్థికంగా స్థిరపడ్డాక నేను పుట్టి పెరిగిన కావలి ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చాను.. మీలా రాజకీయాలతో వ్యాపారం చేసే వ్యక్తిని కాను’ అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్రకు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఎనిమిదేళ్లుగా మీ చెప్పు చేతల్లో ఉన్న పచ్చ మీడియాలో నీచమైన రాతలు, ప్రచారాలు చేయించిన బీద రవిచంద్ర ఇప్పుడు కూడా అదే సంస్కృతిని కొనసాగిస్తున్నారని విమర్శించారు. వ్యక్తిగతంగా తనపై కావలి నియోజకవర్గ ప్రజలకు అన్ని విషయాలు తెలుసునని, అందుకే తనను రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించారని గుర్తుచేశారు. తాను ఏ లక్ష్యం కోసం రాజకీయాల్లోకి వచ్చానో.. వాటిని సాధించాలనే పట్టుదలతో ఉన్నానని పేర్కొన్నారు. (అస్తిత్వాన్ని చాటుకునేందుకే చంద్రబాబు తంటాలు) అన్ని రంగాల్లో వెనుకబడిన కావలి నియోజకవర్గంలో సాగు, తాగునీరు, రామాయపట్నం పోర్టు, ఫిషింగ్ హార్బర్, పారిశ్రామికవాడ, విమానాశ్రయంతో పాటు రోడ్ల నిర్మాణం, ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల మెరుగు, ప్రభుత్వ వైద్యం నాణ్యతగా ప్రజలకు అందేందుకు కృషి చేస్తున్నానని చెప్పారు. రాజకీయ వ్యాపారైన బీద రవిచంద్ర నిత్యం రాజకీయాలు మాత్రమే చేస్తూ, అందర్నీ ఆ ఊబిలోకి లాగేందుకు చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. తాను సాధించాలనుకున్న కావలి అభివృద్ధి లక్ష్యాన్ని నీరుగార్చేందుకు బీద రవిచంద్ర రాజకీయ డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు. వ్యక్తిగతంగా తాను వీటిని పట్టించుకోనని, అయితే సందర్భం వచ్చినప్పుడు ప్రజలకు అన్ని విషయాలను తెలియజేస్తానన్నారు. అక్రమార్జనపై సీబీఐ, సీబీసీఐడీ, అఖిలపక్ష కమిటీ ద్వారా విచారణకు సిద్ధపడాలని బీద రవిచంద్రకు సూచించారు. -
'రెండేళ్లలో అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి'
సాక్షి, కావలి: జిల్లాలో దగదర్తి మండలం దామవరంలో నిర్మించ తలపెట్టిన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రెండేళ్లలో పూర్తి చేసి ప్రజలకు అంకితమిస్తామని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి చెప్పారు. విమానాశ్రయానికి అవసరమైన భూ సేకరణ, భూ వివాదాలపై జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్, కావలి సబ్‌కలెక్టర్ చామకూరి శ్రీధర్, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి శుక్రవారం కావలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా వివాదాస్పదంగా ఉన్న 300 ఎకరాల భూములపైనే వారు ప్రధానంగా దృష్టి సారించి, తక్షణమే తీసుకోవాల్సిన చర్యలు, విభిన్న అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ నేతలు చేసిన దుర్మార్గపు వ్యవహారాలు, అక్రమాలు వల్లనే విమానాశ్రయ భూములను వివాదాలు చుట్టుముట్టాయన్నారు. భూ వివాదాలు పరిష్కరించకుండానే చంద్రబాబు ఎన్నికల కోసం శంకుస్థాపన డ్రామాలు ఆడారన్నారు. టీడీపీ నేతల స్వార్థం కోసం పేద ప్రజల భూములకు అక్రమంగా రికార్డులు సృష్టించుకుని, పేదల పొట్ట కొట్టారన్నారు. ప్రజలు చాలా ఏళ్లుగా విమానాశ్రయం నిర్మించాలని కోరుతున్నారని, అందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా నిర్మాణ పనులు ఆలస్యం చేయకుండా ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. అందులో భాగంగానే తొలుత టీడీపీ నేతలు సృష్టించిన భూ సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. అధికారులతో ఒక ప్రత్యేక కమిటీని నియమించి భూములను పరిశీలించి, ఎవరి స్వాదీనంలో వాస్తవంగా ఉందో గుర్తించే ప్రక్రియను ప్రారంభించాలని అధికారులకు చెప్పినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మరో నెల రోజుల్లో విమానాశ్రయ భూములకు సంబంధించిన సమస్యలను కొలిక్కి తీసుకొస్తామని చెప్పారు. వీలైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో భూమి పూజ చేయించి విమానాశ్రయ నిర్మాణ పనులు ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఒంగోలు, నెల్లూరు నడుమ ఉన్న దామవరంలో నిర్మించే అంతర్జాతీయ విమానాశ్రయం ప్రజలు ప్రయాణాలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపాదించిన దగదర్తిలోని అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణాన్ని రెండేళ్లలో నిర్మించి ప్రజలకు కానుకగా ఇస్తామని ప్రకటించారు. విమానాశ్రయానికి డాక్టర్ వైఎస్సార్ పేరునే పెడుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు మన్నెమాల సుకుమార్‌రెడ్డి, కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి, పందిటి కామరాజు తదితరులు పాల్గొన్నారు. -
కావలిలో రాష్ట్రాస్థాయి ఓపెన్ షటిల్ బ్యాడ్మింటన్ పోటిలు ఫ్రారంభం
-
కావలిని కనకపట్నం చేసుకుందాం
కావలి: మరో 50 రోజుల్లో రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏర్పడుతుందని, ప్రజల సంక్షేమం కోసం గత తొమ్మిదేళ్లుగా పోరాటాలు చేస్తున్న జగన్మోహన్రెడ్డి చేతులు మీదగా కావలిని కనకపట్నం చేసుకుందామని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం పట్టణంలోని పాతూరులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కావలి నియోజకవర్గంలో కుల, మత, వర్గాలకు అతీతంగా ప్రజలందరికి అవసరమైన సువర్ణ పాలనను అందిస్తామన్నారు. ప్రజలు అత్యంత ముఖ్యమైన తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. విద్యార్థుల ఉన్నత చదువులు చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఇక కావలి సమీపంలో దామవరం వద్ద విమానాశ్రయాన్ని నిర్మిస్తామని టీడీపీ నాయకులు శంకుస్థాపన చేసి చేతులు దులుపుకున్నారని, కానీ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే నిర్మాణ పనులు ప్రారంభించి ఏడాదిలో విమానాశ్రయం ప్రజలకు అందుబాటులో వచ్చేలా చేస్తానన్నారు. అలాగే పరిశ్రమలు కనీసం 20కి తగ్గకుండా ఏర్పాటు చేసి, స్థానికంగా ఉన్న నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తానన్నారు. కావలి నుంచి అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా ఆదాల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని కొరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు పొనుగోటి అనురాధ, నాయకులు బ్రహ్మారెడ్డి, కిషోర్, రమణారెడ్డి, భాస్కర్‌రెడ్డి, మహేష్‌రెడ్డి, బుజ్జి, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కావలిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రచారం
-
హత్యలు చేసి ప్రజలను భయపెట్టలేరు
సాక్షి, కావలి: వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, వైఎస్ జగన్మోహన్రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసి ప్రజలను భయపెట్టి ఎన్నికల్లో లబ్ధిపొందాలనే టీడీపీ నాయకుల కుట్రలు ఫలించవని వైఎస్సార్సీపీ నాయకులు అన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు అయిన వైఎస్ వివేకానందరెడ్డిని అత్యంత పాశవికంగా హత్య చేయడాన్ని వైఎస్సార్సీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కార్యాలయంలో శుక్రవారం వివేకానందరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నాయకులు నివాళులు అర్పించారు. అలాగే పట్టణంలోని ముసునూరులో కూడా వైఎస్ వివేకానందరెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. నాయకులు మాట్లాడుతూ వైఎస్ వివేకానందరెడ్డి చాలా సౌమ్యుడన్నారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో ప్రజల ఓట్లను తొలిగించి నీచత్వానికి పాల్పడిన టీడీపీ నాయకులు, ఇప్పుడు మనుషులను అంతంమొందించే పనిలో ఉన్నట్లుగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రజలను భయపెట్టడానికి టీడీపీ నాయకులు చేస్తున్న దారుణాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. వచ్చేనెల 11 వతేదీ జరగనున్న పోలింగ్‌లో ప్రజలు టీడీపీ నాయకులు చేసిన పాపాలను గుర్తు చేసుకొని తగిన బుద్ధి చెబుతారని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి, కనుమర్లపూడి వెంకట నారాయణ, కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, కుందుర్తి కామయ్య, కేతిరెడ్డి శశిధర్‌రెడ్డి, కౌన్సిలర్లు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన చంద్రబాబు
కావలి: ప్రజలకు మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన తెలుగు తమ్ముళ్లతో కలిసి దోచుకోవడానికి రాష్ట్రాన్ని అప్పుల పాల్జేశారని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. కావలి పట్టణంలోని 10వ వార్డులో శుక్రవారం ‘రావాలి జగన్–కావాలి జగన్’ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఇంటింటికీ వెళ్లి నవరత్నాలు కర పత్రాలను ప్రజలకు అందజేశారు. ఎమ్మెల్యే రామిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ నాలుగున్నరేళ్ల కాలంలో ఆయనతో పాటు, ఆయన మంత్రలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జీలు, ఇతర నాయకులు ప్రభుత్వ నిధులు దోపిడీనే లక్ష్యంగా పెట్టుకుని దినచర్యను పాటిస్తున్నారని మండిపడ్డారు. అందుకే ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు ఏమీ జరగడం లేదన్నారు. అయినప్పటికీ చంద్రబాబు, టీడీపీ నాయకుల ధన దోపిడీ దాహం తీరకపోవడంతో రాష్ట్ర అభివృద్ధి పేరుతో ఎడాపెడా అప్పులు చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర విభజన సమయంలో రూ.97 వేల కోట్లు ఉన్న రాష్ట్ర అప్పులను, చంద్రబాబు రెండు లక్షలా 50 వేల కోట్లుకు పెంచారని తెలిపారు. రాజధాని కట్టడానికి రూ.లక్ష కోట్లు ఖర్చు అవుతాయని గతంలో చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు రెండు వేల కోట్లు ఇస్తే చాలు అనడం ఏమిటని ప్రశ్నించారు. అబద్ధపు మాటలను నిత్యం ప్రచారంలో పెట్టి పబ్బంగడుపుకునే విధానాన్ని నిత్యం అనుసరిస్తున్న చంద్రబాబు బుద్ధిని ప్రజలు అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పరిపాలనను గుర్తు చేసేలా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల సంక్షేమం, అభివృద్ధికి సరికొత్త విప్లవాన్ని ఆవిష్కరించేలా ప్రజారంజక పాలన అందుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. అందుకే దేశ చరిత్రలో ఎవరూ చేయని విధంగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి మన్నెమాల సుకుమార్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కనమర్లపూడి వెంకటనారాయణ, కావలి రూరల్, అల్లూరు మండలాల పార్టీ అధ్యక్షులు జంపాని రాఘవులు గౌడ్, దండా కృష్ణారెడ్డి, పార్టీ కార్మిక విభాగం రాష్ట్ర కార్యదర్శి కుందుర్తి శ్రీనివాసులు, సేవాదళ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, డీఆర్‌యూసీసీ సభ్యుడు కుందుర్తి కామయ్య, వార్డు కౌన్సిలర్ కుందుర్తి సునీత పాల్గొన్నారు. -
రామాయపట్నం పోర్టును కావలనే మైనర్ పోర్టుగా మారుస్తున్నారు
-
ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హౌస్ అరెస్ట్
సాక్షి, నెల్లూరు : వైఎస్సార్ సీపీ నేత, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సోమవారం అల్లూరు మండలం ఇసుకపల్లెలో ప్రతాప్ కుమార్ రెడ్డి పర్యటించకుండా పోలీసులు అడ్డుకున్నారు. మత్స్యకార గ్రామాలకు వెళ్లకుండా ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన నివాసం ముందు భారీగా భద్రతా దళాలు, పోలీసులు మోహరించారు. ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధిని పర్యటించకుండా అడ్డుకోవటం దారుణమన్నారు. పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వైఎస్సార్ సీపీని వీడం
నెల్లూరు: పార్టీ మారతారంటూ తమపై జరుగుతున్న ప్రచారాన్ని నెల్లూరు జిల్లాకు చెందిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు ఖండించారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా పార్టీ మారబోమని బుధవారం మీడియాకు స్పష్టం చేశారు. ఎల్లో మీడియా అసత్య ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. మమ్మల్ని ఎంత బెదిరించినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు. కృష్ణా నదిలో పడవ ప్రమాదానికి సీఎం చంద్రబాబే బాధ్యత వహించాలి. భద్రతా ప్రమాణాలు పాటించని బోట్లను ఎలా అనుమతిస్తార’ని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్థన్‌రెడ్డి అన్నారు. ‘ఎల్లో మీడియా నాపై తప్పుడు ప్రచారం చేస్తోంది. టీడీపీ నేత రవిచంద్ర యాదవ్ అవినీతిపై ప్రశ్నించానన్న అక్కసుతో నేను పార్టీ మారతానని విష ప్రచారం చేస్తున్నార’ని కావాలి ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి వాపోయారు. -
'చంద్రబాబును నిలదీయండి'
నెల్లూరు(కావలి): ఇష్టానుసారం హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలను మరిచిన ఏపీ సీఎం చంద్రబాబును, మహిళలు, రైతులు నిలదీయలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆయన శనివారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కావలి నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రైతులు, డ్వాక్రా మహిళల రుణాలన్నింటిని మాఫీ చేస్తానని, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగభృతి ఇస్తానని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు వాగ్దానం చేసి సీఎం అయ్యాక హామీల అమలు అట్టకెక్కించారన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నెల్లూరులో సన్మానం చేయించుకునేందుకు వస్తున్న చంద్రబాబును మహిళలు నిలదీయాలన్నారు.