నెల్లూరు: పార్టీ మారతారంటూ తమపై జరుగుతున్న ప్రచారాన్ని నెల్లూరు జిల్లాకు చెందిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు ఖండించారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా పార్టీ మారబోమని బుధవారం మీడియాకు స్పష్టం చేశారు. ఎల్లో మీడియా అసత్య ప్రచారం మానుకోవాలని హితవు పలికారు.
మమ్మల్ని ఎంత బెదిరించినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు. కృష్ణా నదిలో పడవ ప్రమాదానికి సీఎం చంద్రబాబే బాధ్యత వహించాలి. భద్రతా ప్రమాణాలు పాటించని బోట్లను ఎలా అనుమతిస్తార’ని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్థన్‌రెడ్డి అన్నారు.
‘ఎల్లో మీడియా నాపై తప్పుడు ప్రచారం చేస్తోంది. టీడీపీ నేత రవిచంద్ర యాదవ్ అవినీతిపై ప్రశ్నించానన్న అక్కసుతో నేను పార్టీ మారతానని విష ప్రచారం చేస్తున్నార’ని కావాలి ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment