
ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కరపత్రాలను ప్రదర్శిస్తున్న ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి
కావలి: మరో 50 రోజుల్లో రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పడుతుందని, ప్రజల సంక్షేమం కోసం గత తొమ్మిదేళ్లుగా పోరాటాలు చేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి చేతులు మీదగా కావలిని కనకపట్నం చేసుకుందామని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం పట్టణంలోని పాతూరులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కావలి నియోజకవర్గంలో కుల, మత, వర్గాలకు అతీతంగా ప్రజలందరికి అవసరమైన సువర్ణ పాలనను అందిస్తామన్నారు.
ప్రజలు అత్యంత ముఖ్యమైన తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. విద్యార్థుల ఉన్నత చదువులు చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఇక కావలి సమీపంలో దామవరం వద్ద విమానాశ్రయాన్ని నిర్మిస్తామని టీడీపీ నాయకులు శంకుస్థాపన చేసి చేతులు దులుపుకున్నారని, కానీ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే నిర్మాణ పనులు ప్రారంభించి ఏడాదిలో విమానాశ్రయం ప్రజలకు అందుబాటులో వచ్చేలా చేస్తానన్నారు.
అలాగే పరిశ్రమలు కనీసం 20కి తగ్గకుండా ఏర్పాటు చేసి, స్థానికంగా ఉన్న నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తానన్నారు. కావలి నుంచి అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా ఆదాల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని కొరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు పొనుగోటి అనురాధ, నాయకులు బ్రహ్మారెడ్డి, కిషోర్, రమణారెడ్డి, భాస్కర్‌రెడ్డి, మహేష్‌రెడ్డి, బుజ్జి, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment