Kavali mla
-
ఆమె ఇంటికి వెళ్లి స్వయంగా పింఛన్ అందజేసిన ఎమ్మెల్యే
ఒక దీపం వెలిగింది. మౌనరోదన మోములో సంతోషం వెల్లివిరిసింది. జీవన తేజంతో నవ్వులు పూయించింది. చీకట్లు ముసిరిన ఆ ఇంట ప్రభాత వెలుగులు నింపాయి. ఆ దివ్యాంగురాలి జీవనానికి ఆసరా దొరికింది. ఆమె జీవితానికి భరోసాగా నిలిచింది. ఆ ప్రభావ ప్రభాత దీపిక పేరే ‘పింఛన్’. అర్హులైన అభాగ్యులపై ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధికి నిలువెత్తు నిదర్శనం. కావలి: ఆమెకు 28 ఏళ్లు. పుట్టుక నుంచే శరీరంలో ఏ అవయవం పని చేయదు. కదల్లేదు. మాట్లాడలేదు. శారీరకంగా.. మానసికంగా దివ్యాంగురాలు. 20 ఏళ్లుగా ఆమె బతుకు దెరువుకు ఆసరాగా సామాజిక పింఛన్ కోసం కుటుంబ సభ్యులు అలుపెరగని పోరాటం చేసి అలసిపోయారు. కావలి పట్టణం 39వ వార్డులోని మూర్తిశెట్టివారివీధికి చెందిన ఈశ్వరమ్మ దివ్యాంగురాలు. తండ్రి చనిపోయాడు. తల్లి సైతం మానసికంగా కుంగిపోవడంతో ఆమె పనులే ఆమె చేసుకోలేని దయనీయ పరిస్థితి. తల్లికి వైఎస్సార్ వితంతు పింఛన్ కానుక వస్తోంది. తల్లిని, చెల్లిని సోదరుడు కూలి పనులు చేసి పోషిస్తున్నాడు. అతని భార్యే ఇటు అత్తను, అటు దివ్యాంగురాలైన ఆడపడుచుకు సపర్యాలు చేస్తోంది. వలంటీర్ చొరవతో.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ వచ్చాక ఆ దివ్యాంగురాలి దయనీయ పరిస్థితిని తెలుసుకున్న ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆమెకు పింఛన్ మంజూరు చేయించేందుకు కృషి చేశారు. ఆమెకు ఆధార్‌కార్డు లేదు. రేషన్ కార్డులేదు. దీంతో ఆమెకు పింఛన్ మంజూరు చేయలేని పరిస్థితి నెలకొంది. ఆమెకు వేలిముద్రలు ఆధార్ కార్డుకు సరిపోవడం లేదు. కుడి చేయిలో ఒక వేలి ముద్ర మాత్రమే రికగ్నైజ్ అవుతోంది. అధికారులు చర్యలు చేపట్టి ఆమెకు ఆధార్ కార్డు ను వచ్చేలా చేశారు. ఈలోగా సచివాలయ, వలంటీర్ల వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ఆమె నివాసం ఉంటున్న వార్డుకు ఎంపికైన వలంటీర్ గణవరపు అనూషా ఆమెకు పింఛన్ కల్పించేందుకు స్వయంగా తన సొంత డబ్బులు ఖర్చులు పెట్టుకుని తిరిగి కృషి చేసింది. పింఛన్ మంజూరు కోసం తొలుత రేషన్‌కార్డు మంజూరు చేయడానికి సాంకేతిక కారణాలతో ఆధార్ లింక్ కాక పెండింగ్‌లో పడింది. దీంతో రెండు మూడు సార్లు ఆధార్ కార్డును అప్డేట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరికి పర్మినెంట్ నంబరుతో తల్లి రేషన్‌కార్డులో ఈశ్వరమ్మను యాడ్ చేయించింది. చివరగా సదరం సర్టిఫికెట్ కోసం నాలుగైదు సార్లు నెల్లూరుకు తిరిగింది. కరోనా రావడం తో సదరం సర్టిఫికెట్ల మంజూరు నిలిచిపోయింది. ఇటీవల సదరం సెంటర్ పునః ప్రారంభం కావడంతో ఎట్టకేలకు సదరం సర్టిఫికెట్ మంజూరు కావడంతో పింఛన్‌కు నమోదు చేసింది. తాజాగా మంజూరు అయిన పింఛన్ల జాబితాలో ఆమె పేరు వచ్చింది. ప్రభాత వేళ.. ఆనంద హేళ ఆమెకు పింఛన్ మంజూరు కావడంతో ప్రభాత వేళ మంచు తెరలను దాటుకుంటూ స్వయంగా ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి వలంటీరు, సచివాలయ ఉద్యోగులను వెంట పెట్టుకొని ఆ యువతి ఇంటికి వెళ్లి పింఛన్ వచ్చిన విషయాన్ని తెలియజేశారు. దీంతో భావోద్వేగంతో ఆనంద భాష్పాలు కార్చింది. చాలా కాలం తర్వాత తనకు పింఛన్ వచ్చేలా చేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ సైగలు చేసింది. ఎమ్మెల్యే సైతం ఆమెను అభినందిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాసిన లేఖతో పాటు రూ.3 వేల నగదు అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హత ఉంటే ప్రతి ఒక్కరికీ పింఛన్ అందుతుందని చెప్పారు. అన్ని విధాలా వలంటీర్లు స్వయంగా సేవా దృక్పథంతో పని చేసి ప్రజలకు అండగా ఉంటారని ఈ ఉదంతం ఆదర్శంగా నిలుస్తోందన్నారు. (క్లిక్: సినిమా రేంజ్లో డ్రామా నడిపిన చంద్రబాబు.. అంతా డూపే..) -
అంతా అయిపోయింది.. అమ్మకానికి కావలి టీడీపీ టికెట్.. ఆయన పరిస్థితేంటో?
వరుస ఓటములు.. పటిష్ట నాయకత్వ లేమితో కకావికలమైన కావలి టీడీపీ టికెట్‌ను ఆ పార్టీ అమ్మకానికి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. కావలి నియోజకవర్గంలో గత సార్వత్రిక ఎన్నికల తర్వాత చతికిలపడిన టీడీపీ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత క్షేత్రస్థాయిలో పూర్తిగా అంతర్థానం అయినట్లే అనిపిస్తోంది. నియోజకవర్గంలో ఉనికిని కాపాడుకునేందుకు ఆ పార్టీ తన స్వగ్రామంలోనే రాజకీయ పరిపతి లేని ఒక ఫైనాన్షియర్‌ను నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించింది. అయితే సదరు నేతను కార్యకర్త నుంచి పార్టీ షాడో లీడర్ వరకు ఆసాంతం నాకేశారు. తాజాగా షాడో ఇన్చార్జి పెట్టుబడిదారులతో బేరసారాలు మొదలు పెట్టిన విషయం తెలుసుకుని సదరు ఇన్చార్జి గొల్లుముంటున్నాడు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు: సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తుండడంతో కావలి నియోజకవర్గం టికెట్‌ను పెట్టుబడిదారులకు బేరం పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. నియోజకవర్గంలో అధికార పార్టీ క్షేత్రస్థాయి నుంచి బలంగా ఉంది. 2014 సార్వత్రిక ఎన్నికలకంటే 2019 ఎన్నికలకు మరింతగా బలపడిన వైఎస్సార్సీపీ తాజాగా క్షేత్రస్థాయిలో ఎదురులేని స్థాయిలో వేళ్లూనుకునిపోయింది. ఇదే సమయంలో వరుసగా రెండు దఫాలు ఓటమిని చవిచూసిన తెలుగుదేశం పార్టీకి నియోజకవర్గంలో బలమైన నేత లేకపోవడం చూస్తే ఆ పార్టీ స్థాయిని తెలియజేస్తోంది. ఎన్నికలు సమీపిస్తుండడంతో అధికార పార్టీపై పైచేయి సాధించేందు డబ్బులు కుమ్మరించే పెట్టుబడిదారుడి కోసం వెతుకుతోంది. ఫైనాన్షియర్‌కు నియోజకవర్గ బాధ్యతలు ఏడాదిన్నర క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలతో పూర్తిగా ప్రాభవం కోల్పోయిన టీడీపీ కావలి నియోజకవర్గంలో ఉనికిని కాపాడుకునేందుకు పార్టీ కార్యకర్తలకు పెట్టుబడిదారుడిగా ఉండే నేత కోసం అన్వేషణ చేసింది. నియోజకవర్గంలోని దగదర్తి మండలానికి చెందిన గ్రామ స్థాయిలో కూడా రాజకీయ పరిపతి లేని వ్యక్తిని ఇన్చార్జిగా నియమించింది. ఫైనాన్షియర్ అయిన ఆయన ఏడాది కాలంగా కార్యకర్తల నుంచి నియోజకవర్గ షాడో ఇన్చార్జి వరకు వారి గొంతెమ్మ కోర్కెలు తీర్చడంలో తన శక్తి మేరకు పాకులాడుతున్నాడు. సదరు నేత రాజకీయంగా స్వగ్రామంలోనే విఫల నేత అని తెలిసినా.. ఏదోక రకంగా పార్టీ నావను నడిపించాలని పార్టీ అగ్ర నాయకత్వం ఇన్చార్జి బాధ్యతలు అప్పగించినట్లు ఆ పార్టీ శ్రేణులే బాహాటంగా చెప్పుకుంటున్నారు. ఔత్సాహికులకు షాడో నేత గాలం టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న కావలి నియోజకవర్గానికి చెందిన షాడో నేత కావలి టీడీపీ టికెట్ ఇప్పిస్తానని ఔత్సాహికులకు గాలం వేస్తున్నట్లు సమాచారం. గడిచిన రెండు దఫాల సార్వత్రిక ఎన్నికల్లో కావలి టికెట్ ఆశించి చివరి క్షణంలో భంగపడిన సదరు నేత, ఆ పార్టీ వరుస ఓటములతో నియోజకవర్గానికి షాడో నేతగా మారారు. పార్టీని కాపాడుతున్నానని అధిష్టానం వద్ద మార్కులు కొట్టేస్తూ.. రాజకీయాలు నెరుపుతున్న ఆ షాడో నేత రాజకీయ ఖర్చులకు ప్రస్తుత ఇన్చార్జిని వాడేసుకుని, తాజాగా కొత్త వ్యక్తులకు టికెట్ ఇప్పిస్తానని బేరం పెట్టినట్లు రాజకీయ గుసగసలు ఇప్పుడు కావలి టీడీపీలో హాట్ టాపిక్‌గా మారాయి. కావలిలో ఒకరిద్దరు ద్వితీయ శ్రేణి నేతలకు తప్ప కార్యకర్తలకు కనీసం అందుబాటులో ఉండని సదరు షాడో ఇప్పుడు పార్టీ శ్రేణులను మభ్యపెట్టిందుకు ఇటీవల కావలిలో సమావేశం ఏర్పాటు చేసి పార్టీ పతనం కావడానికి మాజీనే కారణమని బుకాయించే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో కావలి టీడీపీకి సమర్థ నాయకుడు కావాలంటూ ఇన్చార్జిగా ఉన్న నేత ఎమ్మెల్యే అభ్యర్ధిత్వానికి సమర్థవంతుడు కాదనే భావం కలిగేలా ఆయన నాయకత్వాన్ని బలహీన పరిచేలా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీ శ్రేణుల్లో చర్చనీయాంశమయ్యాయి. మొత్తం మీద ‘కావలి టీడీపీ టికెట్ ఫర్ సేల్’ అనే ట్యాగ్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పకనే చెబుతోంది. మనస్తాపంలో టీడీపీ ఇన్చార్జి సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో క్షేత్రస్థాయిలో ప్రజాదరణ కోల్పోయిన టీడీపీ అధికార పార్టీపై పైచేయికి సర్వే రిపోర్ట్ ఆధారంగా రాబోయే ఎన్నికల్లో ధన బలం, అంగబలం ఉన్న వారికే టికెట్లు కేటాయించాలని అధినేత భావిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే టీడీపీ రాజకీయ వ్యూహకర్త టీమ్ క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టింది. అంతర్గత రహస్య సర్వేలో నియోజకవర్గానికి చెందిన ఒకరిద్దరు ధనవంతులైన ఆశావహుల పేర్లను సర్వే టీమ్ ప్రతిపాదించినట్లు తెలిసింది. ఏడాదిగా తన శక్తికి మించి కావలిలో పార్టీ కోసం డబ్బు ఖర్చు పెట్టినప్పటికీ పార్టీ అగ్ర నాయకత్వం తనను గుర్తించకపోవడం, రానున్న ఎన్నికల్లో ప్రస్తుతం ఇన్చార్జిగా ఉన్న తనను కాదని మరొకరికి అవకాశం కల్పించామన్నారనే విషయం తెలిసి మనస్తాపానికి గురైనట్లు సమాచారం. -
కావలి ఎమ్మెల్యే కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్
-
Hyderabad: ఘనంగా కావలి ఎమ్మెల్యే కుమారుడి వివాహం
కావలి: కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి – ఆదిలక్ష్మి దంపతుల కుమారుడు బాలసాకేత్‌రెడ్డి – మహిమల వివాహం గురువారం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో ఉన్న జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకలో వైఎస్ విజయమ్మ, సజ్జల రామకృష్ణారెడ్డి, డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు, మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్‌రావు, ఎంపీలు బీద మస్తాన్‌రావు, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆనం రామానారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఏపీ, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలకు చెందిన నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. కావలి నియోజకవర్గం నుంచి ఏఎంసీ చైర్మెన్ మన్నెమాల సుకుమార్‌రెడ్డి, కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి, పెద్ద సంఖ్యలో వైఎస్సార్సీపీ నాయకులు వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. వధూవరులను ఆశీర్వదిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి దంపతులు చదవండి: (భారీ పరిశ్రమలకు కేంద్ర బిందువుగా శ్రీసత్యసాయి జిల్లా) -
12న కావలికి సీఎం వైఎస్ జగన్
కావలి (నెల్లూరు): సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 12వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు కావలికి రానున్నారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, ఆదిలక్ష్మి దంపతుల కుమారుడు సాకేత్‌కుమార్‌రెడ్డి, మహిమల వివాహ రిసెప్షన్ కావలిలోని జాతీయ రహదారిపై ఉన్న ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్లో 12న జరుగనుంది. నూతన వధూవరులను ఆశీర్వదించడానికి సీఎం హెలికాప్టర్లో కావలికి వస్తారని సమాచారం. ఈ నేపథ్యంలో ఎస్పీ సీహెచ్ విజయారావు బుధవారం కావలికి విచ్చేసి హెలిప్యాడ్ ఏర్పాటు చేసే ప్రదేశాలను పరిశీలించారు. కాగా సీఎం పర్యటనకు సంబంధించి అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. ఎమ్మెల్యే కుమారుడి వివాహం హైదరాబాద్‌లో గురువారం ఉదయం జరుగుతుంది. చదవండి: (Maha Samprokshanam: మహా సంప్రోక్షణ కార్యక్రమంలో సీఎం జగన్) -
కావలిని కనకపట్నం చేసుకుందాం
కావలి: మరో 50 రోజుల్లో రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏర్పడుతుందని, ప్రజల సంక్షేమం కోసం గత తొమ్మిదేళ్లుగా పోరాటాలు చేస్తున్న జగన్మోహన్రెడ్డి చేతులు మీదగా కావలిని కనకపట్నం చేసుకుందామని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం పట్టణంలోని పాతూరులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కావలి నియోజకవర్గంలో కుల, మత, వర్గాలకు అతీతంగా ప్రజలందరికి అవసరమైన సువర్ణ పాలనను అందిస్తామన్నారు. ప్రజలు అత్యంత ముఖ్యమైన తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. విద్యార్థుల ఉన్నత చదువులు చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఇక కావలి సమీపంలో దామవరం వద్ద విమానాశ్రయాన్ని నిర్మిస్తామని టీడీపీ నాయకులు శంకుస్థాపన చేసి చేతులు దులుపుకున్నారని, కానీ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే నిర్మాణ పనులు ప్రారంభించి ఏడాదిలో విమానాశ్రయం ప్రజలకు అందుబాటులో వచ్చేలా చేస్తానన్నారు. అలాగే పరిశ్రమలు కనీసం 20కి తగ్గకుండా ఏర్పాటు చేసి, స్థానికంగా ఉన్న నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తానన్నారు. కావలి నుంచి అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా ఆదాల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని కొరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు పొనుగోటి అనురాధ, నాయకులు బ్రహ్మారెడ్డి, కిషోర్, రమణారెడ్డి, భాస్కర్‌రెడ్డి, మహేష్‌రెడ్డి, బుజ్జి, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కావలి ఎమ్మెల్యేకు అంబటి పరామర్శ
కావలి ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు పరామర్శించారు. సోమశిల ఆయకట్టు భూములకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించాలని డిమాండ్‌తో ప్రతాప్ కుమార్ రెడ్డి చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. కాగా కావలి ఎమ్మెల్యే దీక్షపై మంత్రి నారాయణ విమర్శలు ఆయన అవగాహన రాహిత్యాన్ని తెలిపేలా ఉన్నాయని అంబటి అన్నారు. వైఎస్ పాలనలో తప్ప రైతులకు ఏనాడూ సుఖం లేదని, చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత ప్రజలకు కష్టాలు ఎక్కువయ్యాయన్నారు. -
సాగునీటి కోసం కావలి ఎమ్మెల్యే నిరాహార దీక్ష
-
బెదిరింపులకు భయపడను
► జెడ్పీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకోవడంతో గ్రామాల్లో పండగ వాతావరణం ► కావలి జెడ్పీటీసీ మత్స్యకారుల ఆత్మగౌరవం కాపాడుతుందనుకున్నాం ► ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కావలి : తనకు సంబంధంలేని మద్యం కేసును అంటకడుతూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు విషపు రాతలతో చేస్తున్న బెదిరింపులకు తాను భయపడేది లేదని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం పుల్లారెడ్డినగర్‌లోని తన నివాసంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను 28 ఏళ్ల పాటు వ్యాపార రంగంలో ఉన్నానన్నారు. తన స్నేహితులు ఎందరికో మద్యం అలవాటు ఉ న్నా.. తాను మాత్రం దానికి దూరమన్నారు. మద్యం తాగేవాళ్లను కూడా తాగొద్దని ఎన్నోసార్లు చెబుతుం టానన్నారు. అలాంటి తనపై ఎన్నికల మద్యం కేసంటూ తప్పుడు కథనాలతో అసత్య ప్రచారాన్ని చేస్తున్నాయన్నారు. అసలు ఆ కేసుతో తనకు సంబంధం లేదన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్‌గా బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి గెలవడంతో నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో పండగ వాతావరణం నెలకొందన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రతి ఒక్కరూ ధర్మం, న్యాయం ఈ ఎన్నికల్లో గెలిచాయని, దేవుడు ఉన్నాడంటూ ఉద్వేగంతో చెబుతున్నారన్నారు. నీచ రాజకీయాలతో కావలి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల సమయంలో టీడీపీ ప్రవర్తించిన తీరు ప్రతి ఒక్కరికి తెలుసునన్నారు. అదే పంథాను జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూడా అవలంబించిందన్నారు. తమ పార్టీ నుంచి గెలిచిన కావలిరూరల్ జెడ్పీటీసీ ఎస్.పెంచలమ్మ మత్స్యకారుల ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా వైఎస్సార్సీపీ చైర్మన్ అభ్యర్థికి ఓటు వేస్తుందని తాను అనుకున్నానన్నారు. టీడీపీ అభ్యర్థికి ఓటు వేసే జాబితాలో ముందు వరుసలో ఆమె చేయి ఎత్తడం చూసి తనకు ఎంతో బాధ వేసిందన్నారు. జెడ్పీటీసీ సభ్యురాలు విప్ ధిక్కారణపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు. నిబంధనల ప్రకారం తప్పకుండా ఆమెపై అనర్హత వేటు పడుతుందన్నారు. తర్వాత జరిగే జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా తాను మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వారినే పోటీలో నిలుపుతామన్నారు. అందరి సహకారంతో నియోజకవర్గం అభివృద్ధి అన్ని రాజకీయ పార్టీల సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి తెలిపారు. జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, కావలికి చెందిన బీజేపీ రాష్ట్ర నేత కందుకూరి వెంకట సత్యనారాయణతో పాటు రాష్ట్ర రాజధాని నిర్మాణ సలహామండలి సభ్యుడిగా ఎంపికైన మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు సహకారాన్ని తాను తీసుకుంటానన్నారు. -
'కావలి ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయలేదు'
నెల్లూరు: నకిలీ మద్యం కేసులో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని నెల్లూరు ఎక్సైజ్ అధికారులు స్పష్టం చేశారు. కొన్ని పత్రికలు, చానల్స్‌ల్లో వచ్చిన వార్తలను అధికారులు ఖండించారు. కేసు నమోదు చేసినట్లు వచ్చిన కథనాలు అవాస్తవాలని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. కాగా నకిలీ మద్యం కేసులో కావలి ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసినట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే.