
వధూవరులను ఆశీర్వదిస్తున్న వైఎస్ విజయమ్మ
కావలి: కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి – ఆదిలక్ష్మి దంపతుల కుమారుడు బాలసాకేత్‌రెడ్డి – మహిమల వివాహం గురువారం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో ఉన్న జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకలో వైఎస్ విజయమ్మ, సజ్జల రామకృష్ణారెడ్డి, డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు, మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్‌రావు, ఎంపీలు బీద మస్తాన్‌రావు, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆనం రామానారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఏపీ, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలకు చెందిన నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. కావలి నియోజకవర్గం నుంచి ఏఎంసీ చైర్మెన్ మన్నెమాల సుకుమార్‌రెడ్డి, కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి, పెద్ద సంఖ్యలో వైఎస్సార్‌సీపీ నాయకులు వివాహ వేడుకల్లో పాల్గొన్నారు.
వధూవరులను ఆశీర్వదిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి దంపతులు
చదవండి: (భారీ పరిశ్రమలకు కేంద్ర బిందువుగా శ్రీసత్యసాయి జిల్లా)
Comments
Please login to add a commentAdd a comment