ys vijayamma
-
కుటుంబంతో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్ (ఫొటోలు)
-
విజయమ్మ కారు ప్రమాదం వార్తలపై జగన్ కౌంటర్
-
అలాగైతే రాధాకృష్ణ, లోకేష్‌లను జైల్లో పెట్టాలి: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: టీడీపీ అధికారిక వెబ్సైట్లో చేసేవన్నీ ఫేక్ పోస్టులేనని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియాతో ప్రస్తావించారు. తల్లిని చంపడానికి జగన్ ప్రయత్నిస్తున్నాడని టీడీపీ అధికారిక వెబ్ సైట్లో ఓ పోస్ట్ చేశారు. దానికి కారు టైర్ పేలిన పాత కథనం ఒకటి జత చేశారు. స్వయంగా విజయమ్మే ఇది ఫేక్ న్యూస్ అని లేఖ ఇచ్చారు. కానీ, ఆ లేఖ కూడా ఫేక్ అని ప్రచారం చేశారు. చివరకు.. అదంతా అబద్ధమని విజయమ్మ టీవీ ముందుకు వచ్చి చెప్పుకోవాల్సి వచ్చింది. ఇదంతా టీడీపీ అధికారిక వెబ్సైట్లోనే జరిగింది. మరి నారా లోకేష్‌ను ఎందుకు అరెస్టు చేయలేదు?. ఇంతకుమించి దిగజారిపోయి.. దారుణంగా వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. నా భార్య(వైఎస్ భారతి) కడప పోలీస్ అధికారితో ఫోన్లో మాట్లాడిందని ఆంధ్రజ్యోతిలో ఓ కథనం ఇచ్చింది. అది ఫేక్ కథనం. అలాంటప్పుడు రాధాకృష్ణను జైల్లో పెడతారా?. ఎల్లో మీడియా అలానే ఉంది.. సోషల్ మీడియా అలానే ఉంది అని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. -
ప్రజల దృష్టిని మళ్లించేందుకే బాబు కుట్రలు
నెల్లూరు(బారకాసు)/ఒంగోలు సిటీ/ప్రొద్దుటూరు: ‘దుష్ప్రచారం, డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబుకు రెండు కళ్లు. అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అయినా సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీల అమలులో పూర్తిగా విఫలమయ్యారు. అందువల్లే వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నిత్యం బురదచల్లుతూ తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలని కుట్రలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే విజయమ్మ కారుకు ప్రమాదం.. అంటూ కొత్త నాటకానికి తెరతీశారు.రెండేళ్ల క్రితం విజయమ్మ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైతే, టీడీపీ సోషల్ మీడియాలో ఇప్పుడు దు్రష్పచారం చేయడం సిగ్గుచేటు’ అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాకర్‌బాబు, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. వివిధ ప్రాంతాల్లో వారు శనివారం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్‌పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, కుట్రలను ఎండగట్టారు. మేం మాట్లాడితే తట్టుకోలేరు: కాకాణి రాష్ట్రంలో 1.47 కోట్ల రేషన్ కార్డులు ఉంటే వాటిలో 50లక్షల మందికి మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వకుండా మొండిచేయి చూపుతున్నారని వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. ‘మా పార్టీ అధినేత వైఎస్ జగన్, ఆయన కుటుంబ వ్యవహారాలపై కొందరు పిచి్చపిచ్చి విమర్శలు చేస్తున్నారు. మేం కూడా అదేవిధంగా మాట్లాడితే తట్టుకోలేరు. ఎనీ్టఆర్ ఎవరి వల్ల చనిపోయారు? ఆయన స్థాపించిన పారీ్టని ఎలా చేజిక్కించుకున్నారనే ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?’ అని ప్రశ్నించారు. ‘ఇసుక, మద్యం మాఫియాలో మీ ఎమ్మెల్యేలు ఏయే ఘోరాలు చేస్తున్నారో తెలుసుకుని వారిని తొక్కిపెట్టి నార తీయండి. హామీలు అమలుచేయని చంద్రబాబు, లోకేశ్‌ను తొక్కి పెట్టి నార తీయాలి.’ అని పవన్‌కళ్యాణ్‌కు కాకాణి సూచించారు. హామీల అమలుపై ప్రజలు ప్రశ్నిస్తారనే: టీజేఆర్ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి ప్రజలకు ఆశలు కల్పించిన చంద్రబాబు ఎప్పటిలాగే మళ్లీ వమ్ము చేశారని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు విమర్శించారు. కూటమి ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ ముగిసిందని, హామీల అమలుపై ప్రజలు ఇక ప్రశ్నిస్తారని పేర్కొన్నారు. అందువల్లే ప్రజల దృష్టిని మళ్లించేందుకు వైఎస్ జగన్ కుటుంబ వ్యవహారాలను తెరపైకి తెచ్చి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.‘దేశంలో అనేక రాజకీయ కుటుంబాల్లో విభేదాలు ఉన్నాయి. చంద్రబాబుకు గతంలో హరికృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరితో విబేధాలు లేవా? తమ్ముడు రామ్మూర్తినాయుడుతోపాటు అనేక మంది కుటుంబ సభ్యులతో గొడవలు లేవా? హెరిటేజ్‌లో చంద్రబాబు తన తమ్ముడు, చెల్లెళ్లకు వాటాలు పంచారా?’ అని ఆయన నిలదీశారు. ‘కూటమి అధికారంలోకి వచి్చన నాలుగు నెలల్లోనే 77మంది మహిళలు మాయమైపోయారని వారి రక్షణ సంగతి చూడండి..’ అని పవన్‌కళ్యాణ్‌కు హితవుపలికారు. తన కుటుంబంలో జరిగిన ఘటనలను కూడా పవన్ గుర్తుచేసుకోవాలని సూచించారు. అవన్నీ కుట్రలేనా బాబూ?: రాచమల్లు వైఎస్ విజయమ్మ కారు ప్రమాదంపై తప్పుడు ప్రచారాలు, కథనాలను ఆపాలని టీడీపీ శ్రేణులను మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి హెచ్చరించారు. ‘హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించడం, జూనియర్ ఎనీ్టఆర్ కారు రోడ్డు ప్రమాదానికి గురికావడం, చంద్రబాబు ఇంట్లో మహిళ ఆత్మహత్య, బాలకృష్ణ ఇంట్లో హత్యాయత్నం, సెక్యూరిటీ గార్డు అనుమానాస్పద మృతి.. ఇవన్నీ కుట్రలేనా’ అని రాచమల్లు సూటిగా ప్రశ్నించారు. వాటన్నింటికి తాము లింక్ పెట్టి రాస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవాలని చంద్రబాబును హెచ్చరించారు. -
వైఎస్ విజయమ్మ వాస్తవాలు చూడలేని స్థితిలో ఉన్నారా?
మహా భారతం గాథలో ధృతరాష్ట్రుడు పుట్టు గుడ్డి. ఆయన అంధత్వాన్ని గౌరవిస్తూ భార్య గాంధారి కూడా ఆజన్మాంతం కళ్లకు గంతలు కట్టుకునే జీవిస్తుంది. కళ్లుండి కూడా ప్రపంచాన్ని చూడలేకపోయిందన్నమాట. గాంధారి, ధృతరాష్ట్రులకు పెద్దకొడుకు దుర్యోధనుడంటే విపరీతమైన ప్రేమ. ఈ అతి గారబం కారణంగా దుర్యోధనుడు అహంకారిగా, దుష్ట లక్షణాలు కలిగిన వ్యక్తిగా మారతాడు. తత్ఫలితంగా యుద్దానికి కాలుదువ్వి ఘోర పరాజయం చెందడం, కురు వంశ నాశనం జరిగాయని మహాభారతం చెబుతోంది. ఇది పురాణమో! లేక ఇతిహాసమో! మరేదైనా కానీ ఇందులో నేర్చుకోగలిగినవారికి నేర్చుకున్నంత జ్ఞానం ఉంది.ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో, సోదరి షర్మిల మధ్య కొంతకాలంగా నడుస్తున్న ఆస్తి తగాదా చూస్తుంటే, తల్లి విజయమ్మ తాజాగా విడుదల చేసిన బహిరంగ లేఖ చూసిన తరువాత ఎవరికైనా మహాభారతం గుర్తుకు రాకమానదు. తల్లిదండ్రులకు పిల్లలంటే ప్రేమ ఉంటుంది. అది అందరిపై సమానంగానే ఉండాలి. కానీ ఎందువల్లో కొన్నిసార్లు కొందరు అనూహ్యంగా ఒకరిపైనే ప్రేమ చూపుతుంటారు. ఇప్పుడు విజయమ్మ కూడా అచ్చం అలాగే వ్యవహరించినట్లు అనిపిస్తుంది. షర్మిలపై గుడ్డి ప్రేమో, లేక బెదిరించడం వల్ల అలా ప్రకటన చేశారో తెలియదు కాని, వైఎస్ఆర్ కుటుంబానికి ఇంతకాలం ఉన్న ప్రతిష్ట దెబ్బతినడానికి ఆమె కూడా కారణం అవడం విషాదమే. కుమారుడు, కుమార్తె మధ్య వివాదం వస్తే ఇద్దరిని కూర్చోబెట్టి సర్దుబాటు చేయాల్సిన ఆమె ఏకపక్షంగా షర్మిలకు అనుకూలంగా ప్రకటన చేయడం పద్దతి అనిపించుకోదు. తన ప్రకటన మొదటి భాగంలో ఇద్దరూ పరిష్కరించుకుంటారు అని చెప్పినప్పుడు, అంతటితో ముగించి ఉంటే బాగుండేది. అలాకాకుండా ఎంపీలు విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డిలు చేసిన ప్రకటనలను ఖండిస్తూ అంతా ఉమ్మడి కుటుంబ ఆస్తి అని, ఇతర అంశాలు ప్రస్తావించడం ద్వారా ఆమె తప్పు చేశారనిపిస్తుంది.విజయ సాయి కుటుంబ ఆడిటర్ అయితే, విజయమ్మ చెల్లిలి భర్త వైవి సుబ్బారెడ్డి. విజయ సాయిరెడ్డి తన ప్రకటనలో షర్మిలకు వైఎస్ ఏ ఏ ఆస్తులు ఇచ్చింది సవివరంగా చెప్పడంతో వాస్తవాలు బయటకు వచ్చాయి. అంతవరకు నిజంగానే షర్మిలకు తండ్రి ఆస్తి నుంచి ఏ వాటా దక్కలేదేమో అని భావించిన వారికి పరిస్థితి అర్థమైంది. అంతేకాకుండా షర్మిలకు గత పదేళ్లలో జగన్ నుంచి రూ.200 కోట్లు అందితే కూడా ఆ కృతజ్ఞత చూపకుండా నోటికొచ్చినట్టు మాట్లాడడాన్ని విజయమ్మ తప్పు పట్టకపోవడం ఘోరంగా ఉంది. కొడుకుని విషనాగు అని, జైలుకెళ్లినా ఫర్వాలేదు అని, చివరకు మరణం గురించి కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తే తన ప్రకటనలో విజయమ్మ మాట మాత్రం తప్పుపట్టకపోవడం ఆశ్చర్యంగా ఉంది. అసలు ఈ లేఖ ఆమె రాశారా? లేదా? అనే సందేహం కలుగుతోంది. గతంలో జగన్ పై ఆమె చూపిన ప్రేమ ఆప్యాయతలన్నీ ఏమైపోయాయన్న సందేహం కలుగుతోంది.జగన్ పేరుతో ఉన్న ఆస్తుల్లో ఏవి వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రిగా ఇచ్చినవి, జగన్ సొంతంగా సంపాదించుకున్నవి ఏమిటీ అనేదానిపై విజయమ్మకు క్లారిటీ లేకుండా ఉంటుందా? 1996 నుంచే పవర్ ప్రాజెక్టులు, రియల్ ఎస్టేట్ వంటి వ్యాపారాల్లో జగన్ ఉన్న సంగతి ఆమెకు తెలుసు కదా! తన పవర్ ప్రాజెక్ట్ అమ్మి 2004 ఎన్నికల్లో తండ్రికి నిధులు సమకూర్చిన మాట అవాస్తవమా? అదే సమయంలో షర్మిల గానీ, ఆమె భర్త అనిల్ గానీ ఏ వ్యాపారాలు చేశారు? ఎంత సంపాదించారు? నిజంగా షర్మిలకు సొంత ఆస్తులు ఉంటే సోదరుడు ఇచ్చిన డబ్బులు ఎందుకు తీసుకునేవారు? జగన్ ఆస్తులపై ఎందుకు ఆశపడేవారు? ఎందుకు ఇంత రచ్చ చేసేవారు? జగన్ ప్రేమతో ఎంఓయు చేస్తే ఆయనకు తెలియకుండానే సరస్వతి పవర్ షేర్లను బదలాయించుకోవడాన్ని విజయమ్మ ఎలా సమర్థించుకుంటారు?అందుకే ఆ విషయాలేవీ చెప్పకుండా షర్మిలకు విజయమ్మ ఏకపక్షంగా మద్దతు ఇచ్చి వైఎస్ అభిమానులకు ఆవేదన కలిగించారు. జగన్ ఎప్పుడు తన చెల్లి గురించి ఒక్క మాట అనకపోయినా షర్మిల మాత్రం అన్నను దూషిస్తున్నా, రాజకీయ ప్రత్యర్థులతో మిలాఖత్ అయినా, విజయమ్మ ఎందుకు ఆమెను మందలించలేదో అర్థం కావడం లేదు. ఏ కాంగ్రెస్ అయితే జగన్ ను జైలు పాలు చేసిందో ఆ కాంగ్రెస్ కే ఇప్పుడు షర్మిల అధ్యక్షురాలు అవ్వడం, ఆ పార్టీ పక్షాన కడప నుంచి పోటీ చేయడం విజయమ్మ ఎలా జీర్ణించుకోగలిగారు?పైగా కడపలో ఆమెను గెలిపించాలని ప్రజలకు ఎలా విజ్ఞప్తి చేశారు? అయినా షర్మిలకు డిపాజిట్ రాలేదు. దీన్నిబట్టి ఏం అర్థమవుతోంది? అటు వ్యాపారపరంగానైనా, ఇటు రాజకీయంగానైనా జగన్ చేసిన కృషి వల్లనే ఆయన పైకి వచ్చారు. ముఖ్యమంత్రి అయ్యారు. అలా అని 2019 ఎన్నికల్లో అంతకు ముందు జగన్ కు వీళ్లిద్దరూ సాయపడలేదని ఎవరూ అనరు. అంతవరకూ ఉన్న ప్రేమ అభిమానాల కారణంగానే జగన్ కూడా షర్మిల కుటుంబాన్ని ఆదరిస్తూ వచ్చారు. కానీ షర్మిల రాజకీయంగా పెడదారిపట్టి చివరకు తనకే చికాకుగా మారితే ఆ విషయం విజయమ్మ అర్థం చేసుకోకపోవడం దురదృష్టకరం.ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. షర్మిల, విజయమ్మల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి సడన్ గా ప్రేమ నటిస్తుండడంలో ఆంతర్యాన్ని విజయమ్మ పసిగట్టలేకపోవడం బాధాకరం. చంద్రబాబుతో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటివారితో షర్మిల చేతులు కలపడాన్ని విజయమ్మ ఎలా సహిస్తున్నారోగానీ వైఎస్సార్ అభిమానులు ఎవ్వరూ భరించలేకపోతున్నారు! ఒకప్పుడు విజయమ్మ చేతిలో బైబిల్ ఉంటేనే ఫోటోలు వేసి మరీ నానారకాలుగా ప్రజల్లో అప్రతిష్టపాలు చేయడానికి కథనాలు రాసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇప్పుడు అమ్మ.. ఆవేదన అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నాయి. ఏది ఏమైనా ఒకటి మాత్రం వాస్తవం షర్మిల చేస్తున్న పిచ్చి పనులను విజయమ్మ నియంత్రించలేక చివరకు గుడ్డి ప్రేమ వల్లనో, ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కారణమో గానీ షర్మిలకు మద్దతిచ్చే దయనీయ పరిస్థుతుల్లో పడ్డారు. ఒకవైపు షర్మిల, విజయమ్మలకు అనుకూలంగా రాస్తున్నట్టు డ్రామా ఆడుతూనే, ఇంకోవైపు షర్మిల కోరుతున్న ఆస్తులన్నీ అక్రమాస్తులనీ ప్రచారం చేస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా శకుని పాత్రను వీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. చివరగా ఒక మాట! జరగకూడనివి అన్నీ తన కళ్ల ముందే జరుగుతున్నాయని విజయమ్మ ఆవేదన చెందారు. నిజమే! కళ్లముందు జరుగుతున్నవాటిలో వాస్తవం ఏదో, అవాస్తవం ఏదో తెలుసుకోకుండా కళ్లకు గంతలు కట్టుకున్నట్టుగా గాంధారి పాత్ర పోషిస్తే ఎవరు సానుభూతి చూపుతారు? -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
జగనన్ను జైలుకు పంపే కుట్ర?.. వైఎస్ విజయమ్మ లేఖకు స్ట్రాంగ్ కౌంటర్
-
KSR Live Show: విజయమ్మ లేఖ చెల్లుతుందా?.. అడ్వకేట్ చెప్పిన కీలక విషయాలు
-
విజయమ్మ లేఖపై వైఎస్ఆర్ సీపీ బహిరంగ లేఖ
-
బెయిల్ రద్దుకే కుట్ర.. బాధితుడు జగనే
సాక్షి, అమరావతి: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి న్యాయపరమైన ఇబ్బందులు కలిగించి ఆయన బెయిల్ రద్దుకు జరుగుతున్న కుట్రపూరిత వ్యవహారాలను వైఎస్ విజయమ్మ తన లేఖలో ఎందుకు ప్రస్తావించలేదని వైఎస్సార్సీపీ ప్రశ్నించింది. షర్మిల భావోద్వేగాలు, ఒత్తిళ్లకు లొంగి సరస్వతి కంపెనీ షేర్ల సర్టిఫికెట్లు పోయాయంటూ.. జగన్ సంతకాలు లేకుండానే షేర్లు బదిలీ చేయడం మోసపూరితం కాదా? అని నిలదీసింది. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును ఎఫ్ఐఆర్లో నమోదు చేయడమే కాకుండా ఆయన కుమారుడు వైఎస్ జగన్‌ను అక్రమంగా 16 నెలలు జైల్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలంటూ ఎన్నికలకు కొద్ది గంటల ముందు విజయమ్మ వీడియో రికార్డింగ్‌ను విడుదల చేసినప్పుడు వైఎస్సార్ అభిమానులు తీవ్రంగా కలతచెందారని తెలిపింది. వైఎస్ విజయమ్మ రాసిన లేఖపై స్పందిస్తూ ఈమేరకు వైఎస్సార్సీపీ ఆమెను ఉద్దేశించి ఓ లేఖను విడుదల చేసింది. షర్మిల ఎన్నో రకాలుగా తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా జగన్ ఒక్కరోజు కూడా తన చెల్లెలిని ఒక్క మాట కూడా అనలేదనే విషయాన్ని గుర్తు చేసింది. చెల్లెలుపై ప్రేమాభిమానాలతోనే జగన్ తన స్వార్జిత ఆస్తుల్లో షర్మిలకు వాటా ఇచ్చేందుకు ఎంవోయూ చేశారని... అవి కుటుంబ ఆస్తులే అయితే ఎంవోయూ చేయాల్సిన అవసరం ఉండదు..చట్టా రీత్యా హక్కు వస్తుంది కదా? అని పేర్కొంది. అసలైన బాధితుడైన జగన్‌కు బాసటగా ఉండటం విజయమ్మ ధర్మమని స్పష్టం చేసింది. వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణిగా, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాతృమూర్తిగా విజయమ్మను అమితంగా గౌరవిస్తామని పేర్కొంది. వాస్తవాలను ఆమెకు, ప్రజల ముందు ఉంచేందుకు వైఎస్సార్సీపీ విడుదల చేసిన లేఖ పూర్తి పాఠం ఇదీ... కాంగ్రెస్‌కు ఓటేయమని విజయమ్మ ఎలా అంటారు? ఆనాడే వైఎస్సార్ అభిమానులు తీవ్ర కలత చెందారు 2024 ఎన్నికల్లో జగన్ ఒక్కరే ఒకవైపున ఉంటే... అటువైపు చంద్రబాబు నేతృత్వంలో రాజకీయ ప్రత్యర్థులు అంతా జట్టు కట్టారు. మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారం ముగుస్తుందనగా.. వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును ఎఫ్ఐఆర్లో పెట్టిన కాంగ్రెస్ పార్టికి, తన కుమారుడు జగన్‌ను అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టిన కాంగ్రెస్ పార్టికి ఓటేయమని కోరుతూ విజయమ్మ వీడియో విడుదల చేశారు. వైఎస్సార్సీపీని ఇబ్బంది పెడుతూ.. తాను షర్మిలవైపు ఉన్నాననే విషయాన్ని తద్వారా చాలా స్పష్టంగా చెప్పారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ ప్రత్యర్థులకు, వైఎస్ కుటుంబంపై నిరంతరం కుట్రలు పన్నే చంద్రబాబుకు రాజకీయంగా మేలుచేసేలా ఇలా వ్యవహరించడం ధర్మమేనా..! రాజకీయాలు పక్కనపెడితే ఒక తల్లిగా ఆరోజు విజయమ్మ మద్దతు సంగతి దేవుడెరుగు...కనీసం తటస్థ వైఖరిని మరిచిపోయి పక్షపాతం వహించిన వైనం చూసి వైఎస్సార్ అభిమానులు తీవ్ర కలత చెందారు. బాధపడ్డారు. సర్టిఫికెట్లు పోయాయని.. మోసపూరితంగా షేర్ల బదలాయింపు సరస్వతీ కంపెనీ వ్యవహారంలో షర్మిల భావోద్వేగాలు, ఒత్తిళ్ల ప్రభావంతో షేర్ల సర్టిఫికెట్లు పోయాయని విజయమ్మ చెప్పారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు లేకుండానే, జగన్ సంతకాలు లేకుండానే ఎవరికీ తెలియకుండా మోసపూరితంగా షేర్లు బదిలీ చేశారు. తన కుమారుడికి న్యాయపరంగా ఇబ్బందులు వస్తాయని, అది బెయిల్ రద్దు కుట్రకు దారితీస్తుందని తెలిసినా అలా చేశారు. తద్వారా తాను షర్మిలతోనే ఉన్నానని మరోసారి స్పష్టంగా చెప్పారు. షర్మిలను ఏనాడూ ఒక్క మాట అనని జగన్.. వైఎస్ జగన్‌కు షర్మిల వ్యక్తిగతంగా రాసిన లేఖ టీడీపీ సోషల్ మీడియా ఖాతాలో ప్రత్యక్షమైంది. విజయమ్మ కూడా సంతకం చేసిన ఆ లేఖను టీడీపీ విడుదల చేయడం ఏమిటి...? ఇంత జరిగినా జగన్ ఏనాడూ తన చెల్లెలను ఉద్దేశించి ఒక్కమాట కూడా మాట్లాడ లేదు. కానీ షర్మిల ఎన్నోసార్లు వైఎస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో విజయవాడలో జగన్‌పై దాడి జరిగితే హేళనగా మాట్లాడారు. షర్మిలను సరిదిద్దాలని విజయమ్మ ఏనాడూ ప్రయత్నించకపోవడం ఆమె వైఖరిని ప్రశ్నిస్తున్నాయి. బాధితుడు జగనే... కోర్టు కేసులపై ప్రతికూల ప్రభావితం పడేలా షర్మిల ప్రవర్తన, చర్యలు ఉంటున్నాయి. ఓ వైపు ఆస్తులపై హక్కులు కోరుతూ మరోవైపు అందుకు విరుద్ధంగా ఆమె వ్యవహరిస్తున్నారు. అక్రమ కేసులపై వైఎస్ జగన్ పోరాటం చేస్తుంటే... వాటి ఫలితాలు ఎలా ఉంటాయన్న దానిపై తనకు ఎలాంటి ఆందోళనలేనట్టు ఆమె ప్రవర్తిస్తున్నారు. జగన్‌ను రాజకీయంగా, ఆర్థికంగా దెబ్బతీసేందుకు అనుగుణంగానే ఆమె వ్యవహరిస్తున్నారు. షర్మిల వేసే ప్రతి అడుగూ ప్రత్యర్థులకు లబ్ధి చేకూర్చేలా ఉంటోంది. మూడు నాలుగేళ్లుగా ఇంత జరుగుతున్నా జగన్ ఓపికతో, సహనంతో, మౌనంగా ఆ బాధను భరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు బాధితులు ఎవరు...? ఒక తల్లిగా విజయమ్మ ఎవరికి బాసటగా ఉండాలనే బలమైన ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. రచ్చ కెక్కిందీ... పరువు తీసిందీ షర్మిలే రాజకీయాల పేరిట తెలంగాణలో అడుగుపెట్టిన దగ్గరనుంచి అవకాశం వచ్చిన ప్రతిసారి జగన్‌ను షర్మిల ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. అక్కడ నుంచి ఒక్కసారిగా మాయమై వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ఎఫ్ఐఆర్లో పెట్టిన పార్టికి... అన్నను 16 నెలలు జైల్లో అక్రమంగా నిర్బంధించిన పార్టికి ఈ రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలిగా వచ్చారు. రాజకీయాలు ఇంతే అనుకున్నా ప్రజాస్వామ్య విమర్శల పరిధిని దాటి ఆజన్మ శత్రువు మాదిరిగా జగన్‌ను షర్మిల అనరాని మాటలు అంటున్నారు. ఎన్నికల సమయంలో జగన్‌పై దాడి జరిగితే ఎగతాళి చేసి అమానవీయంగా మాట్లాడింది షర్మిల కాదా..? వీటన్నింటినీ జగన్ ఓపికతో భరించారు. మరి రచ్చకెక్కింది ఎవరు... పరువుతీసింది ఎవరు... నిజమైన బాధితుడు ఎవరు... జగనే కదా..!! విచక్షణ విస్మరించిన విజయమ్మ కుమార్తె ప్రభావం, ఒత్తిళ్లతో విజయమ్మ విచక్షణ విస్మరించారు. కుమార్తెను వెనకేసుకువచ్చే ధోరణితో సరస్వతీ కంపెనీ విషయంలో తనవంతు పాత్ర పోషిస్తూ చట్టవ్యతిరేక పనులకు తోడ్పడ్డారు. తన కుమారుడు ఎదుర్కోబోయే చట్టపరమైన సంక్షిష్ట పరిస్థితులేంటో తెలిసి కూడా విజయమ్మ దాన్ని విస్మరించారు. ప్రస్తుత పరిస్థితులకు ప్రధాన కారణం ఇదే. ఉమ్మడి ఆస్తులే అయితే ఒకరి కంపెనీల్లో ఒకరికి ఎందుకు వాటాలు లేవు? వైఎస్సార్ ఆ ఆస్తులను షర్మిలకు ఎందుకు పంచలేదు? వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉన్నపుడే జగన్ కంపెనీలు నడిపారు. అలాగే షర్మిల తన కంపెనీలను తాను నడిపారు. ఉమ్మడి ఆస్తులు అయితే మరి ఒకరి కంపెనీల్లో ఒకరికి వాటాలు ఎందుకు లేవు? వైఎస్సార్ మనోభావాలు, ఆజ్ఞ వేరేలా ఉంటే ఇలా ఎందుకు జరిగింది ? తన కుమార్తెకు వైఎస్సార్ పూరీ్వకుల ఆస్తులతో పాటు తాను సంపాదించిన ఆస్తులను ఇచ్చారు. జగన్ ఆస్తులు తనవి కాదు కాబట్టే ఇవ్వలేదు. ఎందుకంటే అవన్నీ జగన్ స్వార్జితం కాబట్టి. తన స్వార్జిత ఆస్తులను షర్మిలకు ఇచ్చిన జగన్ షర్మిలకు వివాహమైన 20 ఏళ్ల తర్వాత జగన్ తన స్వార్జిత ఆస్తుల్లో కొన్నింటిని చెల్లెలిపై ప్రేమానురాగాలకొద్దీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కోర్టు కేసుల నేపథ్యంలో 2019లో ఆమెకు మంచి చేస్తూ ఒక ఎంఓయూ రాసి ఇచ్చారు. అంతేకాకుండా గడచిన పదేళ్లలో దాదాపు రూ.200 కోట్లు పైచిలుకు జగన్ ద్వారా షర్మిల పొందినా ఆమె తన సోదరుడిపట్ల ఏమాత్రం కృతజ్ఞత చూపలేదు. షర్మిల ఒక్క రూపాయి అయినా పెట్టుబడి పెట్టారా ? ఇంత యాగీ చేస్తున్న షర్మిల ఈ సంస్థల్లో ఒక్క రూపాయి అయినా పెట్టుబడి పెట్టారా? ఒక్కరోజైనా కంపెనీ కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారా? కంపెనీలకున్న రూ.1400 కోట్ల అప్పుల్లో తన వాటా కింద వ్యక్తిగత పూచీకత్తు ఇస్తూ సంతకం పెట్టారా? రూ.500 కోట్ల నష్టాల్లో అయినా ఆమె పాత్ర పోషించారా? ఈ కంపెనీలకు సంబంధించిన కష్టాల్లో, చిక్కుల్లో, కోర్టు కేసుల్లో ఏరోజైనా తానుగా బాధ్యత తీసుకున్నారా? వాటాలు ఉంటే ఇలా నష్టం చేస్తారా? ఈ కంపెనీల మీద, జగన్ మీద ఎవరైతే కేసులు పెట్టారో వారికి రాజకీయ ప్రయోజనం కల్పించేలా షర్మిల వారిని బలపరుస్తున్నారు. కంపెనీలను బలహీనపరుస్తున్నారు. ఆమె నడవడిక, వైఖరి చూస్తే ఈ కంపెనీల్లో వాటాలు ఉన్నాయని ఎవరికైనా అనిపిస్తుందా? నిజంగా వాటాలు ఉంటే ఇలా చేస్తారా? ఇలా జగన్‌ను, ఆయన కంపెనీలను ఇబ్బందులు పాలు చేస్తారా? కోర్టులే నిర్ణయిస్తాయి ఇప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబ వ్యవహారం కోర్టులో ఉంది. ఇరువురి వాదనలు ప్రజలముందు ఉన్నాయి. ఎవరు చేసింది సరైనదో, ఎవరివైపు న్యాయం ఉందో కోర్టులే నిర్ణయిస్తాయి.ఉమ్మడి ఆస్తులే అయితే ఎంవోయూ ఎందుకు? తన స్వార్జిత ఆస్తులను ప్రేమానురాగాలతో షర్మిలకు ఇస్తున్నట్లు జగన్ ఎంఓయూ రాస్తే... దానిపై విజయమ్మ, షర్మిల ఇద్దరూ సంతకాలు చేశారు. అంటే దీని అర్థం జగన్ స్వార్జిత ఆస్తుల్లో హక్కులేదని, ఆరోజు వారు మనస్ఫూర్తిగా అంగీకరించినట్టేగా? మరి ఇప్పుడు ఉమ్మడి ఆస్తులు అంటూ లేఖలో పేర్కొనడం ప్రజలను తప్పుదోవ పట్టించడానికే కదా. నిజంగా ఉమ్మడి ఆస్తులే అయితే వాటిని పంచుకునే పద్ధతి ఇలా ఎంఓయూల రూపంలో ఉండదు... చట్టరీత్యా హక్కుగా వస్తుందని ప్రతి కుటుంబానికి తెలుసు. జగన్ స్వార్జిత ఆస్తి కోసం షర్మిల యాగీ ఏమిటి? జగన్ స్వార్జితమైన ఆస్తిలో ఎలాంటి హక్కులేకపోయినా, ఆ ఆస్తిలో తనకు భాగం కావాలని షర్మిల ఇంత రాద్ధాంతం చేయడం ఏంటి? ఇంత యాగీ చేయడం ఏంటి? ఇన్ని లేఖలు రాయడం ఏంటి? ఆ లేఖను టీడీపీ విడుదల చేయడం ఏంటి? ఆమె పద్ధతి, ప్రవర్తన మారి తన ప్రేమానురాగాలను చూరగొంటే, కోర్టు కేసులు పరిష్కారం అయిన తర్వాత ఆమెకు ఏమేరకు మంచి చేయాలో, ఎంత చేయాలో, ఏం చేయాలో ఆరోజు నిర్ణయం తీసుకుంటానని జగన్ ఇదివరకే స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కుటుంబ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్‌లో ఇంకెంతమాత్రం మునిగిపోకూడదని, ప్రజాసమస్యలపై దృష్టిసారిస్తామని ఇదివరకే మా పార్టీ స్పష్టం చేసింది. బెయిల్ రద్దు కుట్రను విజయమ్మ ఎందుకు ప్రస్తావించ లేదు?ప్రజలను పక్కదోవ పట్టించడమే వైఎస్ జగన్మోహన్రెడ్డిని న్యాయపరంగా ఇబ్బంది పెట్టేందుకు... తద్వారా బెయిల్ రద్దుకు పన్నిన కుట్ర వ్యవహారాన్ని విజయమ్మ తన లేఖలో కనీసం ప్రస్తావించ లేదు. అది ప్రజలను పక్కదోవ పట్టించడమే. సరస్వతీ కంపెనీ విషయంలో ఈడీ అటాచ్మెంట్ ఉంది. తెలంగాణ హైకోర్టు స్టేటస్కో ఆదేశాలు ఉన్నాయి. యాజమాన్య బదిలీ జరిగేలా క్రయవిక్రయాలు చేయకూడదని అటాచ్మెంట్లో ఉందనే విషయం అందరికీ తెలుసు. సరస్వతీ కంపెనీ విషయంలో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయవద్దని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీలతో సహా పలువురి న్యాయసలహాలు ఉన్నాయి. అయినప్పటికీ తప్పని తెలిసినప్పటికీ.. మోసపూరితంగా, కుట్రపూరితంగా షేర్లు బదిలీ చేసిన మాట వాస్తవమే కదా...! షర్మిల భావోద్వేగాలకు, ఒత్తిళ్లకు గురై వైఎస్ జగన్మోహన్రెడ్డికి న్యాయపరంగా, చట్టపరంగా చిక్కులు తెచ్చే ఈ పనికి తెలిసి కూడా విజయమ్మ ఆమోదించి సంతకం పెట్టడం నిజమేకదా...! విజయమ్మ తన లేఖలో ఆ అంశాన్ని పూర్తిగా విస్మరించడం ప్రజలను, వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులను పక్కదోవ పట్టించడమే. -
వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం
సాక్షి కడప/వేంపల్లె: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 15వ వర్థంతిని పురస్కరించుకుని వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌వద్ద ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులరి్పంచారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతీరెడ్డితోపాటు ఇతర కుటుంబ సభ్యులు సోమవారం ఉదయాన్నే ఘాట్ వద్ద పూలమాలలు వేసి ఘన నివాళి అరి్పంచారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆయన అభిమానులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలు ఇడుపులపాయకు కదిలివచ్చారు. ముందుగా వైఎస్ జగన్ కుటుంబమంతా ఘాట్ ప్రాంగణంలో దివంగత నేతను స్మరించుకున్నారు. వైఎస్ జగన్‌తోపాటు తల్లి విజయమ్మ నివాళులరి్పంచే క్షణంలో భావోద్వేగానికి గురయ్యారు. ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు.. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద మాజీ సీఎం వైఎస్ జగన్‌తోపాటు కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చర్చి పాస్టర్లు దేవుని వాక్యంతోపాటు వైఎస్సార్ హయాంలో జరిగిన మంచి పనులను వివరించారు. వైఎస్సార్ సువర్ణ పాలనలో ప్రజలంతా సంక్షేమంలో మునిగిపోయారని కొనియాడారు.అంతేకాక.. 108, ఆరోగ్యశ్రీ, 104, ఫీజు రీయింబర్స్మెంట్, రైతుల కోసం రుణమాఫీ అమలుచేసి ప్రజల కష్టాల నుంచి మహానేత రక్షించారని స్మరించుకున్నారు. మహానేత సేవలు చిరస్మరణీయమన్నారు. వైఎస్సార్ అడుగుజాడల్లోనే వైఎస్ జగన్ ధైర్యంగా ముందుకెళ్తున్నారని పాస్టర్లు కొనియాడారు. కష్టకాలంలో దేవునితోపాటు నాన్న ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆయనకు ఉంటాయన్నారు. ప్రతి ఒక్కరూ వైఎస్ జగన్‌కు తోడుగా నిలబడాలని వారు ఆకాంక్షించారు. ఇక ప్రత్యేక ప్రార్థనల్లో చిన్నాన్న వైఎస్ సు«దీకర్‌రెడ్డి, అత్తమ్మ ఈసీ సుగుణమ్మ, సోదరుడు, కడప ఎంపీ వైఎస్ అవినా‹Ùరెడ్డి, మేనమామ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, అన్నమయ్య జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, కడప నగర మేయర్ కె. సురేష్‌బాబు, ఎమ్మెల్యేలు డాక్టర్ సుధ, టి. చంద్రశేఖర్, విరూపాక్షి, ఎమ్మెల్సీలు పి. రామసుబ్బారెడ్డి, రమేష్ యాదవ్, గోవిందరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్‌బాషా, వైఎస్సార్సీపీ రాష్ట్ర నేతలు ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, ఆర్. రమే‹Ùకుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మరోవైపు.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచి్చన వైఎస్సార్ అభిమానులు, పార్టీ శ్రేణులు, నేతలు అందరికీ వైఎస్ జగన్ అభివాదం చేశారు. ఒక్కొక్కరిని పేరుపేరునా పలకరిస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. -
వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ జగన్ నివాళులు
వైఎస్సార్, సాక్షి: సంక్షేమ ప్రదాత.. అభివృద్ధి విధాత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 15వ వర్ధంతి నేడు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. వైఎస్సార్ సతీమణి విజయమ్మ, తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నేతలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని మహానేతను స్మరించుకున్నారు.ఈ ప్రార్థనా కార్యక్రమంలో ఎంపీలు వైఎస్ అవినాష్ రెడ్డి, గురుమూర్తి, జిల్లా పార్టీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, దాసరి సుధ, మాజీ డిప్యూటీ సిఎం ఆంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్యేలు కోరుముట్ల శ్రీనివాస్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ విజయమ్మ పేరుతో టీడీపీ తప్పుడు లేఖ
విశాఖపట్నం: ఎన్నికల్లో ఓడిపోతున్నామనే నిస్పృహతో టీడీపీ నీచపు పనులకు పాల్పడుతోందని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మండిపడ్డారు. వైఎస్ విజయమ్మ రాసినట్టుగా టీడీపీ ఒక లేఖను సృష్టించి.. దాన్ని అడ్డుపెట్టుకుని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసి బురదజల్లుతోందని తెలిపారు.ఆ లేఖలో ఉపయోగించిన భాషను చూస్తే అది ఫేక్ అన్న సంగతి అందరికీ అర్థం అవుతోందని తెలిపారు. ఓడిపోతున్నామనే ఉక్రోషంతో టీడీపీ ఇలాంటి తప్పుడు పనులు చేస్తోందని విమర్శించారు. టీడీపీ ఫేక్ ప్రచారాలను ప్రజలు తిప్పికొడుతున్నారని తెలిపారు. విజయమ్మ పేరిట లేఖను సృష్టించి సర్క్యులేట్ చేయడంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరతామని ఆయన తెలిపారు. -
#MemanthaSiddham : జైత్రయాత్ర ఆరంభం
మేమంతా సిద్ధం బస్సు యాత్ర నుంచి సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: మండుటెండనూ లెక్క చేయకుండా కి.మీ. కొద్దీ రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన జనం.. నిప్పులు చిమ్ముతున్న సూరీడుతో పోటీపడుతూ చంటిబిడ్డలను చంకనేసుకుని బస్సు వెనుక పరుగులు తీసిన ఆడబిడ్డలు.. రోడ్డుకు ఇరువైపులా గ్రామాల్లో టెంట్లు వేసి వంటలు వండుకుని, సామూహికంగా భోజనాలు చేసి గంటల తరబడి నిరీక్షించిన ప్రజానీకం..! వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ ఇడుపులపాయ నుంచి ప్రారంభించిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో తొలిరోజు కనిపించిన దృశ్యాలు ఇవి. సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో బలంగా నాటుకుపోయిన నమ్మకానికి ఈ దృశ్యాలు ప్రతీకగా నిలిచాయి. వైఎస్సార్ జిల్లాలోని ఇడుపులపాయ నుంచి వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచార భేరిని సీఎం జగన్ బుధవారం మోగించారు. తాడేపల్లి నివాసం నుంచి ఉదయం 11.50 గంటలకు బయలుదేరిన సీఎం జగన్ ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్దకు మధ్యాహ్నం ఒంటి గంటకు చేరుకున్నారు. తన మాతృమూర్తి వైఎస్ విజయమ్మతో కలిసి వైఎస్సార్‌కు నివాళులు అర్పించారు. అనంతరం తల్లి విజయమ్మ ఆశీస్సులు తీసుకున్నారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించి భారీ ఎత్తున తరలివచ్చిన వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల నినాదాల నడుమ బస్సు యాత్రను సీఎం జగన్ ప్రారంభించారు. ఇడుపులపాయ నుంచి కుమారునిపల్లి వద్దకు బస్సు యాత్ర చేరుకునే సరికి రోడ్డుకు ఇరువైపులా భారీ ఎత్తున జనం బారులు తీరారు. భారీ క్రేన్‌తో గజమాల వేసి సీఎం జగన్‌కు ఆత్మీయ స్వాగతం పలికారు. జనసంద్రమైన వేంపల్లి.. ప్రజలు భారీ ఎత్తున తరలిరావడంతో వేంపల్లి జనసంద్రంగా మారింది. వేంపల్లి అడ్డ రోడ్డు నుంచి హనుమాన్ సర్కిల్ వరకూ సీఎం జగన్ రోడ్ షో నిర్వహించారు. సీఎం జగన్‌ను చూడగానే అవ్వాతాతల నుంచి చిన్న పిల్లల వరకూ హర్షద్వానాలతో ఘనస్వాగతం పలికారు. హనుమాన్ సర్కిల్ వరకూ కి.మీ. కొద్దీ ఇసుకేస్తే రాలనంత స్థాయిలో రోడ్డుపై కిక్కిరిసిన జనం సీఎం జగన్ బస్సు యాత్రకు నీరాజనాలు పలికారు. మండటెండను కూడా లెక్క చేయకుండా చంటిబిడ్డలను ఎత్తుకుని బస్సు వెంట నడుస్తూ సీఎం జగన్‌ను చూసేందుకు పోటీపడ్డారు. బస్సు యాత్ర సాగుతున్న రహదారికి ఇరువైపులా మారుమూల గ్రామాల ప్రజలు భారీ ఎత్తున రోడ్డుపైకి తరలివచ్చి టెంట్లు వేసుకుని, వంటలు వండుకుని, సామూహికంగా భోజనాలు చేస్తూ సీఎం జగన్ రాక కోసం గంటల కొద్దీ నిరీక్షించారు. బస్సు యాత్ర తమ వద్దకు చేరుకోగానే సీఎం జగన్‌పై బంతిపూల వర్షం కురిపిస్తూ అడుగడుగునా నీరాజనాలు పలకడంతో యాత్ర ఆలస్యంగా ముందుకు సాగింది. అమ్మ భావోద్వేగం... పులివెందుల: ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర ప్రారంభం సందర్భంగా వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రార్థన నిర్వహించిన వైఎస్ విజయమ్మ భావోద్వేగానికి గురయ్యారు. ‘నా బిడ్డను నీకే అప్పజెబుతున్నా దేవుడా..! నా బిడ్డ కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా ఉన్నావు..! ప్రతి బాధలోనూ తోడుగా ఉన్నావు..! నా బిడ్డ తలపెట్టిన కార్యక్రమాలను జయప్రదం చేయాలి..! నా బిడ్డను మళ్లీ సీఎంగా చేయాలని కోరుకుంటున్నా..!’ అంటూ ప్రార్థన చేసిన అనంతరం సీఎం జగన్‌ను ఆప్యాయంగా ముద్దాడగా.. ఆయన భావోద్వేగంతో తన తల్లిని ఆలింగనం చేసుకున్నారు. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన వారిలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు, మేడా రఘునాథరెడ్డి, ఎంపీలు వైఎస్ అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, చింతా అనూరాధ, ఎమ్మెల్యేలు రవీంద్రనాథరెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, శ్రీకాంత్‌రెడ్డి, సుధాకర్‌బాబు, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు రమేష్‌యాదవ్, రామచంద్రారెడ్డి, ప్రభాకర్, తలశిల రఘురాం, జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు, జడ్పీ ఛైర్మన్ అమర్నాథరెడ్డి, చల్లా మధుసూదన్‌రెడ్డి, దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డి, వైఎస్ కొండారెడ్డి, సీఎం కార్యాలయ కోఆర్డినేటర్ జనార్దన్‌రెడ్డి, ఎన్ఆర్ఐ రత్నాకర్ తదితరులున్నారు. జిల్లా చరిత్రలో అతి పెద్ద ప్రజాసభ.. ప్రొద్దుటూరులో బహిరంగ సభ షెడ్యూలు ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం కావాలి. కానీ.. రహదారి పొడవునా జనం బారులు తీరి స్వాగతం పలకడంతో బైపాస్ రోడ్డు సమీపంలోని సభా ప్రాంగణానికి సాయంత్రం 6.30 గంటలకు సీఎం చేరుకున్నారు. అప్పటికే 30 ఎకరాల్లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. సీఎం జగన్ వేదికపైకి చేరుకుని ర్యాంప్ వాక్ చేస్తూ అభివాదం చేస్తున్నంత సేపు ప్రాంగణం ప్రజల హర్షధ్వానాలతో మారుమోగిపోయింది. గత 58 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో చేసిన మంచిని వివరిస్తూ.. టీడీపీ– జనసేన–బీజేపీ కూటమి సర్కార్ 2014–19 మధ్య చేసిన మోసాలను ఎండగడుతూ సీఎం జగన్ చేసిన ప్రసంగానికి విశేష స్పందన లభించింది. ప్రొద్దుటూరులో సీఎం జగన్ నిర్వహించిన సభ వైఎస్సార్ కడప జిల్లా చరిత్రలో అతి పెద్ద ప్రజాసభగా నిలిచింది. ప్రచండ భానుడితో పోటీపడుతూ.. నిప్పులు గక్కుతున్న సూరీడుతో పోటీపడుతూ సీఎం జగన్ కోసం రహదారిపై భారీ ఎత్తున జనం గంటల కొద్దీ నిలబడ్డారు. కమలాపురం నియోజకవర్గంలో వీరపునాయునిపల్లె, గంగిరెడ్డిపల్లి, సంగాలపల్లిలో బస్సు యాత్రకు నీరాజనాలు పలికారు. మండల కేంద్రమైన వీరపునాయునిపల్లిలో సీఎం జగన్ నిర్వహించిన రోడ్ షోకు విశేష స్పందన లభించింది. జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్లలోని మెయిన్ రోడ్డు జనసంద్రంగా మారింది. ఎర్రగుంట్లలో సీఎం జగన్ నిర్వహించిన రోడ్ షో సూపర్ హిట్ అయ్యింది. రాత్రి పూట జన నీరాజనం.. ప్రొద్దుటూరు సభ రాత్రి 8 గంటలకు ముగిసింది. అనంతరం బస్సు యాత్ర మైదుకూరు నియోజకవర్గం దువ్వూరుకు చేరుకునే సమయంలో దారిలో రాత్రి పూట కూడా జనం భారీ ఎత్తున రహదారిపై గంటల తరబడి నిరీక్షించారు. సీఎం జగన్‌పై బంతి పూలవర్షం కురిపించి అభిమానాన్ని చాటుకున్నారు. వైఎస్సార్ కడప జిల్లాలో బస్సు యాత్ర ముగిసి బుధవారం రాత్రి 9.20 గంటలకు నంద్యాల జిల్లా చాగలమర్రిలో ప్రవేశించింది. చాగలమర్రిలో జనం సీఎం జగన్‌కు నీరాజనాలు పలికారు. దారి పొడవునా ఘనస్వాగతాల నడుమ ఆళ్లగడ్డ క్రాస్‌లో బస చేసేందుకు ఏర్పాటు చేసిన శిబిరానికి రాత్రి 10 గంటలకు చేరుకున్నారు. బస్సు యాత్ర తొలి రోజు గ్రాండ్ సక్సెస్ కావడంతో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నయా జోష్ నెలకొంది. నేడు నంద్యాలలో సీఎం జగన్ సభ ఆళ్లగడ్డ నుంచి రెండో రోజు మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభం సాక్షి, అమరావతి: మేమంతా సిద్ధం బస్సు యాత్ర రెండో రోజైన గురువారం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో సీఎం జగన్మోహన్రెడ్డి నైట్ హాల్ట్ ప్రాంతం నుంచి ప్రారంభంకానుంది. యాత్ర గురు వారం షెడ్యూల్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం.. ఉదయం 9 గంటలకు ఆళ్లగడ్డ నుంచి బయలుదేరి నల్లగట్ల, బత్తలూరు, ఎర్రగుంట్ల చేరుకొని గ్రామ స్థులతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. అనంతరం గోవిందపల్లి మీదుగా ప్రయాణించి చాబోలు శివారులో భోజన విరామం తీసుకుంటారు. తర్వాత నూనేపల్లి మీదుగా నంద్యాల చేరుకుని గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం పాణ్యం, సుగాలిమిట్ట, హుస్సేనాపురం, ఓర్వకల్, నన్నూర్, పెద్దటేకూరు, చిన్నకొట్టాల, కె.మార్కాపురం క్రాస్, నాగలాపురంలో ప్రజలతో మమేకమవుతూ పెంచికలపాడులో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. -
సీఎం జగనన్ను ఆశీర్వదించిన విజయమ్మ
-
పులివెందులలో సీఎం క్రిస్మస్ వేడుకలు
పులివెందుల: క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకుని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం వైఎస్సార్ జిల్లా పులివెందులలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వైఎస్సార్ జిల్లాలో మూడ్రోజుల పర్యటనలో భాగంగా మూడో రోజైన సోమవారం ఉదయం సీఎం ఇడుపులపాయ ఎస్టేట్ నుంచి హెలికాప్టర్ ద్వారా భాకరాపురం హెలిప్యాడ్, అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా పులివెందుల పట్టణానికి చేరుకున్నారు. ఉ.9.30 గంటలకు సీఎస్ఐ చర్చి ప్రాంగణానికి చేరుకుని అక్కడ హాజరైన వారిని ఆప్యాయంగా, చిరునవ్వుతో పలకరించారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం తన బంధువర్గానికి, స్నేహితులు, ఆప్తులు, అభిమానులకు క్రిస్మస్.. ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏటా క్రిస్మస్ రోజున తన సొంత గడ్డపై కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందాన్నిస్తుందన్నారు. అందరి అభిమానం, ఆశీస్సులు, దేవుని చల్లని దీవెనలు తనకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నానని ఆయన ప్రార్థించారు. రాష్ట్ర ప్రజల రుణం తీర్చుకునేందుకు ముఖ్యమంత్రిగా ప్రజాసేవలో తరిస్తున్నానని.. ఎప్పటికీ మీ హృదయాల్లో ప్రియమైన నాయకుడిగా సుస్థిర స్థానాన్ని పొందుతానన్నారు. అనంతరం.. ముఖ్యమంత్రి జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేశారు. 2024 నూతన సంవత్సర చర్చి క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఆ తర్వాత చర్చి నుంచి రోడ్డు మార్గాన సీఎం బయల్దేరి వైఎస్సార్సీపీ నేత నల్లచెరువుపల్లె రవి ఇంటికెళ్లి నూతన దంపతులు మంజ్రేకర్రెడ్డి, రేణుకారెడ్డిలను ఆశీర్వదించారు. ఇక ఉ.11.07 గంటలకు సీఎం జగన్ అక్కడ నుంచి బయల్దేరి 11.15 గంటలకు భాకరాపురం హెలిప్యాడ్ వద్దకు చేరుకుని అక్కడ స్థానిక నాయకులతో మాట్లాడారు. ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించారు. మ.12.19 గంటలకు హెలికాప్టర్లో బయల్దేరి మైదుకూరులోని జిల్లా వక్ఫ్‌బోర్డు చైర్మన్ దస్తగిరి నివాసంలో ఆయన కుమారుడు, ఇద్దరు కుమార్తెల వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. క్రిస్మస్ వేడుకల్లో కుటుంబ సభ్యులు.. ఇక క్రిస్మస్ వేడుకల్లో సీఎం జగన్ తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతీరెడ్డి, కుటుంబ సభ్యులు వైఎస్ ప్రకాష్‌రెడ్డి, వైఎస్ ప్రతాప్‌రెడ్డి, వైఎస్ మధురెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, ఆత్మీయులు, మిత్రులు, పుర ప్రజలు పాల్గొన్నారు. సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజాద్ బాషా, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ఎమ్మెల్యే డాక్టర్ డి. సుధ, జిల్లా కలెక్టర్ విజయరామరాజు, జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్, పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, ఆర్డీఓ వెంకటేశులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కరుణామయుని ఆశీస్సులు, దీవెనలు ప్రజలపై ఉండాలి సీఎం వైఎస్ జగన్ సాక్షి,అమరావతి: నిస్సహాయులపై కరుణ, సాటివారిపై ప్రేమ, క్షమ, సహనం, దాతృత్వం, త్యాగం.. ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలని సీఎం జగన్ పేర్కొన్నారు. ఎల్లప్పుడూ ఆ కరుణామయుని ఆశీస్సులు, దీవెనలు ప్రజలపై ఉండాలని కోరుకుంటూ క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అని సోమవారం ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. -
కుటుంబ సభ్యులతో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్ (ఫొటోలు)
-
7 రంగాల్లో విశిష్ట సేవలందించిన 27 మంది వ్యక్తులు, సంస్థలకు పురస్కారాలు
-
మార్మోగిన జగన్ నినాదం
ఒంగోలు: జై జగన్ అంటూ విద్యార్థినులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో ఒంగోలులోని పవిత్ర కాలేజీ క్యాంపస్ మార్మోగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాతృమూర్తి వైఎస్ విజయమ్మ ప్రైవేటు కార్యక్రమంలో భాగంగా ఒంగోలు వచ్చారు. స్థానిక పవిత్ర క్యాంపస్ (శ్రీహర్షిణీ డిగ్రీ కాలేజీ బాలికల క్యాంపస్) ఎదురుగా ఉన్న ఒక ప్రముఖ వ్యక్తితో మాట్లాడి బయటకు వస్తుండగా క్యాంపస్‌లో ఉన్న విద్యార్థినులు ఒక్కసారిగా బయటకు వచ్చారు. సిబ్బంది అదుపు చేస్తున్నా విద్యార్థినులు ససేమిరా అన్నారు. ఒక్కసారిగా వారందరినీ తోసుకుంటూ ముందుకు వచ్చారు. వారి ఉత్సాహాన్ని చూసిన విజయమ్మ విద్యార్థినులను దగ్గరకు తీసుకున్నారు. దీంతో వారి ఆనందానికి అవధులు లేవు. జై జగన్ అంటూ విద్యార్థినులు నినదిస్తూ ఆమెను కలిసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ఆమెకు షేక్ హ్యాండ్స్ ఇస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. -
మహానేత వైఎస్సార్‌కు వైఎస్ విజయమ్మ, షర్మిల నివాళులు
-
నన్ను ఆశీర్వదించిన నాన్నకు పక్కనే ఉన్న అమ్మకు పాదాభి వందనం చేస్తున్నా..
-
పుత్రోత్సాహంతో జగన్ ని హత్తుకుని కన్నీరు పెట్టుకున్న విజయమ్మ
-
ఎల్లో మీడియా ఓవరాక్షన్
సాక్షి ప్రతినిధి, కర్నూలు: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని అరెస్టు చేయబోతున్నారంటూ సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎల్లో మీడియా ఓవరాక్షన్ చేసింది. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న తల్లి శ్రీలక్ష్మి బాగోగులు చూసుకుంటున్న అవినాశ్ పట్ల కనీస మానవత్వాన్ని కూడా మరిచి ఎల్లో మీడియా అమానుష ధోరణిని బయటపెట్టుకుంది. సీబీఐ అధికారులు సోమవారం కర్నూలుకు రావడంతో అదే అదనుగా రెచ్చిపోయింది. అవినాశ్‌ను ఎలాగైనా అరెస్టు చేయించాలన్న విపరీత ధోరణి, కర్నూలు నగరంలో ఉద్రిక్తతలు సృష్టించాలన్న వ్యూహంతో క్షణక్షణం అసత్య ప్రచారంతో హోరెత్తించింది. గంట గంటకు ఎల్లో మీడియా పిచ్చి ముదిరి, మధ్యాహ్నానికి పీక్స్‌కు చేరుకొంది. స్థానిక పోలీసులు సహకరించడంలేదని, మధ్యాహ్నానికి కర్నూలుకు కేంద్ర బలగాలు వస్తున్నాయని, ఆ వెంటనే సీబీఐ అధికారులు అవినాశ్‌ను అరెస్టు చేస్తారంటూ తప్పుడు ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఎల్లో మీడియా విపరీత ధోరణిని రాష్ట్రవ్యాప్తంగా పలువురు తప్పుపట్టారు. తల్లి ఆరోగ్యం బాగోలేక బాధలో ఉన్న వ్యక్తిపట్ల అమానవీయంగా వ్యవహరించడాన్ని వైఎస్సార్సీపీ శ్రేణులు, సభ్య సమాజం ఖండించాయి. ఒక ఎంపీకి ఉండే హక్కులు, ఆయన ప్రైవసీని భంగపరిచే విధంగా పచ్చ పైత్యాన్ని వెళ్లగక్కుతున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంపై బురదజల్లే కుట్రలో భాగంగానే వైఎస్ అవినాశ్‌రెడ్డి లక్ష్యంగా ఎల్లోమీడియా ఈ దుర్నీతికి పాల్పడుతోందని స్పష్టమవుతోంది. అందులో భాగంగానే అర్ధరాత్రి వేళ ఆస్పత్రిలోకి చొరబడుతున్నారని, ఎంపీ తల్లికి అందిస్తున్న చికిత్సపై వైద్యులు సమాచారం అందిస్తున్నా, అసత్యాలను ప్రచారం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవినాశ్ సోమవారం సీబీఐ విచారణకు హాజరు కావల్సి ఉంది. అయితే, ఆయన తల్లి తీవ్ర అనారోగ్యంతో ఈనెల 20వ తేదీ నుంచి కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో ప్రత్యేక వైద్య బృందం ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తోంది. అవినాశ్ దగ్గరుండి ఆమె బాగోగులు చూసుకుంటున్నారు. తన తల్లి ఆరోగ్యం బాగోలేనందున విచారణకు హాజరు కాలేనని, ఈ నెల 27 తర్వాత హాజరవుతానని అవినాశ్ సీబీఐ అధికారులకు లేఖ పంపారు. అయినప్పటికీ, సీబీఐ అధికారులు సోమవారం ఉదయం కర్నూలు వచ్చారు. స్టేట్ గెస్ట్‌హౌస్‌లో బస చేశారు. దీనినే అవకాశంగా తీసుకున్న ఎల్లో మీడి యా వెంటనే తప్పుడు కథనాలు ప్రచారం చేయడం ప్రారంభించింది. అవినాశ్‌ను అరెస్టు చేయడానికే సీబీఐ అధికారులు వచ్చారంటూ అసత్య ప్రచారం మొదలెట్టింది. వారు పోలీసు అధికారులను కలిసినట్లు, అవినాశ్‌ను ఏ క్షణంలోనైనా అరెస్టు చేస్తారంటూ స్క్రోలింగ్‌లు, చర్చలు ప్రారంభించింది. అవినాశ్‌ను అరెస్టు చేయకపోవడంతో నిరాశ చెందిన ఈ మీడియా.. కొత్త వ్యూహా న్ని రచించింది. సీబీఐ అధికారులు పోలీసు అధికారులను సంప్రదిస్తున్నారని, ఎప్పుడైనా అరెస్టు జరగవచ్చని మరో ప్రచారం మొదలెట్టింది. ముఖ్యంగా టీవీ–5, ఏబీఎన్ తప్పుడు కథనాలు, చర్చలతో హోరెత్తించాయి. విశ్వభారతి హాస్పిటల్ వద్ద పోలీసు బందోబస్తు సీబీఐని కూడా ప్రభావితం చేస్తారా? సీబీఐ బృందం కర్నూలుకు రాగానే ఎల్లో మీడియా దుష్ప్రచారం మొదలైంది. సీబీఐ అధికారులు ఆస్పత్రికి కూడా వెళ్లలేదు. నేరుగా స్టేట్ గెస్ట్‌హౌస్‌కు వెళ్లి అక్కడే బస చేశారు. అయినా, పచ్చ మీడియా సీబీఐ వెంటనే అవినాశ్‌ను అరెస్టు చేసేస్తోందంటూ ప్రచారం మొదలెట్టింది. టీవీ చర్చల్లో తమకు అను కూలురను కూర్చోబెట్టి, అధికారులను ప్రభావితం చేసేలా చర్చలు సాగించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. మీడియా ట్రయల్ పేరిట వాస్తవాలను వక్రీకరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు ఎల్లో మీడియా తప్పుడు ప్రచారాన్ని చూసి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం ఉద యం నుంచే కర్నూలుకు తరలివచ్చారు. డిప్యుటీ సీఎం అంజాద్బాష,వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్, సుధాకర్, శ్రీదేవి, ఆర్థర్, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ఉదయాన్నే ఆస్పత్రికి చేరుకున్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, కడప మేయర్ సురేశ్‌బాబు, శాప్‌చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆస్పత్రికి వచ్చారు. కర్నూలుతోపాటు పులివెందుల, కడప, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల నుంచి కూడా వైఎస్సార్సీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఒక్కసారిగా ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తరలిరావడంతో ఆస్పత్రి పరిసరాలు జనంతో కిక్కిరిశాయి. డీఎస్పీ విజయశేఖర్ ఆధ్వర్యంలో ఆస్పత్రి వద్ద ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రానికి కార్యకర్తల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో మరిన్ని బలగాలు సోమవారం రాత్రికి కర్నూలుకు చేరుకున్నాయి. ఆస్పత్రి ముందు కార్యకర్తల నిరసన ఎల్లో మీడియా అబద్ధపు ప్రచారాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆస్పత్రి ముందు బైఠాయించారు. ‘తండ్రిని అకారణంగా జైలుకు పంపారు. తల్లి అనారోగ్యంతో ఉంటే బాగోగులు చూసుకుంటున్న అవినాశ్‌ను వెంటాడి, వేధించడం ఏంటని’ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వేళ ఆస్పత్రిలోకి చొరబాటు వందలాది రోగులు, వారి సహాయకులు ఉండే ఆస్పత్రిలోకి మీడియా పదే పదే జొరబడటంపై సీనియర్ విలేకరులే మండిపడుతున్నారు. కేవలం చంద్రబాబుకు ఏదో మేలు చేయాలన్న తపనతోనే ఎల్లో మీడియా పత్రికా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తోందని విమర్శిస్తున్నారు. ఇదే ఉద్దేశంతో ఆస్పత్రి పరిసరాల్లో ఆదివారం అర్ధరాత్రి, ఎల్లో మీడియా హంగామా చేసింది. రాత్రి 11గంటల తర్వాత ఎల్లో మీడియా ప్రతినిధి ఒకరు తాను పనిచేస్తున్న సంస్థ పేరు కాకుండా మరో పేరు చెప్పి ఆస్పత్రిలోకి వెళ్లారు. శ్రీలక్ష్మి ఉన్న ఐసీయూ సమీపంలో ఓ కానిస్టేబుల్ అతన్ని నిలువరించారు. తప్పుడు పేరు చెప్పి రావాల్సిన అవసరం ఏముందని అక్కడున్న వారు కూడా గట్టిగా నిలదీశారు. దీంతో మీడియా ప్రతినిధి ఆస్పత్రి గేటు వద్దకు వచ్చి అవినాశ్ అనుచరులపై దుందుడుకుగా వ్యవహరించారు. ఇదంతా మిగతా ఎల్లో మీడియా ప్రతినిధులు వీడియో తీయబోయారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. శ్రీలక్ష్మిని పరామర్శించిన వైఎస్ విజయమ్మ వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ సోమవారం సాయంత్రం విశ్వభారతి ఆస్పత్రికి వచ్చి ఐసీయూలో చికిత్స పొందుతున్న శ్రీలక్ష్మి ని పరామర్శించారు. శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అవినాశ్‌ను ఓదార్చారు. ధైర్యంగా ఉండాలని, అంతా మంచే జరుగుతుందని కాంక్షించారు. ఆందోళనకరంగానే శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితి అవినాశ్ తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితిపై విశ్వభారతి ఆస్పత్రి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది. ఆమెకు నాన్ ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫారేక్షన్ (గుండె పోటు) ఉందని పేర్కొంది. యాంజియోగ్రామ్ చేశామని, రెండు రక్తనాళాల్లో బ్లాక్‌లు గుర్తించామన్నా రు. క్రిటికల్ కేర్ యూనిట్లో వైద్యుల బృందం పర్యవేక్షిస్తోందని తెలిపారు. ఆమెకు రక్తపోటు ఇప్పటికీ తక్కువగా ఉండటంతో అయానోట్రోపిక్ సపోర్ట్‌తో ఉన్నారని తెలిపారు. ఆది, సోమవారాల్లో ఆమె వాంతులు చేసుకున్నారని, అల్ట్రాసౌండ్ చేయాల్సి ఉందని తెలిపారు. మరికొద్దిరోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని వెల్లడించారు. -
ప్రశ్నించే గొంతులను నొక్కేస్తారా : విజయమ్మ
-
‘హ్యాపీ బర్త్‌డే అమ్మ’
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన మాతృమూర్తి వైఎస్ విజయమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇవాళ (ఏప్రిల్ 19వ తేదీ) ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంలో తన ట్విటర్ ద్వారా ఆయన హ్యాపీ బర్త్ డే అమ్మ అంటూ ఓ ట్వీట్ చేశారు. తల్లిని ఆప్యాయంగా హత్తుకున్న ఫొటోను సీఎం జగన్ పోస్ట్ చేశారు. Happy Birthday Amma! pic.twitter.com/4VYU6vwDxB — YS Jagan Mohan Reddy (@ysjagan) April 19, 2023 -
YSR Congress Party: ఆత్మగౌరవానికి ప్రతీక.. సవాళ్లే సోపానాలుగా..
రాజకీయంగా వైరిపక్షాలైన కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై మొగ్గలోనే వైఎస్సార్సీపీని తుంచేసేందుకు కుట్రలు చేశాయి. ప్రపంచ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ ఎదుర్కోనన్ని సవాళ్లు.. దాడులను ఎదుర్కొంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి వాటినే సోపానాలుగా మలుచుకుంటూ.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అలుపెరుగని పోరాటం చేశారు. 45 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు.. విప్లవాత్మక సంస్కరణలతో సుపరిపాలన అందిస్తూ వైఎస్సార్సీపీని బలీయమైన శక్తిగా తీర్చిదిద్దారు. సాక్షి, అమరావతి: కాంగ్రెస్ పార్టీకి రెండుసార్లు ఒంటి చేత్తో అధికారాన్ని అందించిన వైఎస్ రాజశేఖరరెడ్డి 2009 సెప్టెంబరు 2న హెలికాప్టర్ ప్రమాదంలో హఠాన్మరణం చెందారు. ఆ విషాద వార్తను తాళలేక వందలాది మంది మరణించడం.. వైఎస్ జగన్‌ను, ఆయన కుటుంబీకులను కలిచి వేసింది. అలా మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడానికి ఓదార్పు యాత్ర చేపడతానని కర్నూలు జిల్లా నల్లకాలువ వద్ద 2009 సెప్టెంబరు 25న నిర్వహించిన వైఎస్సార్ సంస్మరణ సభలో వైఎస్ జగన్ ప్రకటించారు. 2010 ఏప్రిల్ 9న పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఓదార్పు యాత్ర ప్రారంభించారు. ఆ యాత్రను ఆపేయాలని కాంగ్రెస్ అధిష్టానం వైఎస్ జగన్‌ను ఆదేశించింది. ఇది రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేదని.. తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి షర్మిలతో కలిసి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాందీకి వైఎస్ జగన్ వివరించినా లాభం లేకపోయింది. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి... వైఎస్ జగన్ ఓదార్పు యాత్రను కొనసాగించారు. దీంతో కాంగ్రెస్‌లోని కొన్ని శక్తులు, టీడీపీతో కుమ్మక్కై కుట్రలకు తెరతీశాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు, పులివెందుల శాసనసభ, కడప లోక్‌సభ స్థానాలకు వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ రాజీనామా చేశారు. జనం పక్షాన పోరుబాట ప్రజా సమస్యలపై వైఎస్ జగన్ పోరుబాట పట్టారు. ఈ నేపథ్యంలో జగతి పబ్లికేషన్స్‌కు ఆదాయపు పన్ను శాఖతో నోటీసులు జారీ చేయించడం ద్వారా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వేధింపుల పర్వాన్ని ప్రారంభించారు. అయినా వాటిని లెక్క చేయని వైఎస్ జగన్.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనే లక్ష్యంగా, రాష్ట్ర సమగ్రాభివృద్ధే ధ్యేయంగా 2011 మార్చి 11న వైఎస్సార్సీపీ పేరును ప్రకటించారు. ఆ మరుసటి రోజే వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో వైఎస్ సమాధి వద్ద పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. 2011 ఏప్రిల్ 12న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. కడప లోక్‌సభ స్థానం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా వైఎస్ జగన్, పులివెందుల శాసనసభ స్థానం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా వైఎస్ విజయమ్మ పోటీ చేసి, రికార్డు మెజార్టీతో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలతో 2011 ఆగస్టు 10న వైఎస్ జగన్ ఆస్తులపై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించింది. నైతిక విలువలే పునాది నైతిక విలువలతో రాజకీయాలు చేయాలన్నది వైఎస్ జగన్ సిద్ధాంతం. వైఎస్సార్సీపీలో ఎవరైనా చేరాలంటే.. వారు ఆ పార్టీకి, ఆపార్టీ ద్వారా సంక్రమించిన పదవులకు రాజీనామా చేసి రావాలని షరతు విధించారు. దానికి కట్టుబడిన 19 మంది ఎమ్మెల్యేలు, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ ద్వారా సంక్రమించిన పదవులకు రాజీనామా చేసి, వైఎస్సార్సీపీలో చేరారు. వారిని తిరిగి గెలిపించుకునేందుకు వైఎస్ జగన్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అదే సమయంలో వైఎస్ జగన్‌ను విచారణ పేరుతో పిలిచిన సీబీఐ 2012, మే 27న అరెస్టు చేసింది. దీన్ని ప్రజలు నిరసిస్తూ ఉప ఎన్నికల్లో 17 శాసనసభ, నెల్లూరు లోక్‌సభ స్థానంలో వైఎస్సార్సీపీని గెలిపించారు. 2013 సెప్టెంబరు 24న వైఎస్ జగన్‌కు కోర్టు బెయిల్ ఇచ్చింది. 16 నెలలపాటు అక్రమంగా నిర్బంధించడం వల్ల ప్రజల్లో ఆదరణ మరింత పెరిగింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఒంటరిగా బరిలోకి దింగింది. టీడీపీ–బీజేపీ–జనసేనతో జట్టుకట్టి బరిలోకి దిగింది. మోదీ ప్రభంజనంలో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారానికి దూరమైంది. 67 శాసనసభ స్థానాలు గెలుచుకుని బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. చంద్రబాబు కుట్రతో వైఎస్ జగన్ రెక్కలకష్టంతో గెలిచిన∙23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించారు. వారిపై అనర్హత వేటు వేయాలని జగన్ పోరాటం చేశారు. ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో నలుగురిని మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా రాజకీయాల్లో నైతిక విలువకు నాటి సీఎం చంద్రబాబు సమాధి కట్టారు. దీన్ని నిరసిస్తూ.. ప్రజల్లోనే తేల్చుకుంటానని ప్రకటిస్తూ 2017 అక్టోబర్ 26న శాసనసభ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు వైఎస్ జగన్ ప్రకటించారు. చరిత్రాత్మకం.. ప్రజా సంకల్పం తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నుంచి 2017 నవంబర్ 6న ప్రజా సంకల్ప పాదయాత్రను వైఎస్ జగన్ ప్రారంభించారు. 14 నెలలుపాటు 3,648 కి.మీ.ల దూరం ఈ యాత్ర సాగింది. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ప్రజలు అఖండ విజయాన్ని అందించారు. దేశ చరిత్రలో 50 శాతానికిపైగా ఓట్లతో 151 శాసనసభ (87 శాతం), 22 లోక్‌సభ (88 శాతం) స్థానాలను వైఎస్సార్సీపీ దక్కించుకుంది. 2019 మే 30న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తొలి మంత్రివర్గంలో 56 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చి.. ఐదు డిప్యూటీ సీఎం పదవుల్లో నాలుగు ఆ వర్గాలకే ఇచ్చి.. హోంశాఖ మంత్రిగా తొలిసారిగా ఎస్సీ మహిళను నియమించి సామాజిక విప్లవానికి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. 2022 ఏప్రిల్ 11న పునర్ వ్యవస్థీకరణ ద్వారా మంత్రివర్గంలో ఏకంగా 70 శాతం పదవులు ఆ వర్గాల వారికి ఇచ్చి, సామాజిక సాధికారత సాధనలో దేశానికే రోల్ మోడల్‌గా నిలిచారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో నామినేటెడ్ పదవుల్లో, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు.. మహిళలకు రిజర్వు చేసేలా చట్టం తెచ్చి మరీ పదవులు ఇచ్చారు. ఎమ్మెల్సీ, రాజ్యసభ, స్థానిక సంస్థల పదవుల్లోనూ ఆ వర్గాలకే పెద్దపీట వేశారు. అధికారంలోకి వచ్చిన 45 నెలల్లోనే 98 శాతానికిపైగా హామీలను అమలు చేశారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు వెన్నుదన్నుగా నిలిచారు. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజల గుమ్మం వద్దకే ప్రభుత్వాన్ని తీసుకెళ్లారు. 13 జిల్లాలను పునర్ వ్యవస్థీకరించి.. 26 జిల్లాలను ఏర్పాటు చేశారు. ఎన్నో పథకాల ద్వారా పేద, దిగువ మధ్యతరగతి వర్గాలకు అండగా నిలిచారు. జనరంజక పాలన అందిస్తుండటంతో ప్రజలు పంచాయతీ, మున్సిపాలిటీ, జిల్లా పరిషత్, ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులు, అభ్యర్థులను గెలిపించారు. వైఎస్సార్సీపీ ప్రస్థానంలో కీలక ఘట్టాలు