
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో అజయ్ విక్రాంత్‌రెడ్డి, దీప్తి దంపతులు
సాక్షి, రాప్తాడురూరల్: అనంతపురం రూరల్ మండలం పూలకుంట సర్పంచ్ కాటప్పగారి కృష్ణారెడ్డి కుమారుడు కాటప్పగారి అజయ్ విక్రాంత్‌రెడ్డి దంపతులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి ఆశీర్వదించారు.
అజయ్ విక్రాంత్‌రెడ్డికి 10 రోజుల క్రితం పులివెందులకు చెందిన దీప్తితో వివాహమైంది. నవ దంపతులు శనివారం రాత్రి ఇడుపులపాయలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతిని కలిసి ఆశీర్వాదం అందుకున్నారు.
చదవండి: (భారీ వరదకూ చెక్కుచెదరకుండా పింఛా ప్రాజెక్టు పునరుద్ధరణ)