తల్లీ, సతీమణితో కలిసి మాజీ సీఎం వైఎస్ జగన్ మహానేతకు ఘన నివాళి
వైఎస్సార్ 15వ వర్ధంతి కార్యక్రమంలో వైఎస్ కుటుంబ సభ్యులు
సాక్షి కడప/వేంపల్లె: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 15వ వర్థంతిని పురస్కరించుకుని వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌వద్ద ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులరి్పంచారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతీరెడ్డితోపాటు ఇతర కుటుంబ సభ్యులు సోమవారం ఉదయాన్నే ఘాట్ వద్ద పూలమాలలు వేసి ఘన నివాళి అరి్పంచారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆయన అభిమానులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నేతలు ఇడుపులపాయకు కదిలివచ్చారు. ముందుగా వైఎస్ జగన్ కుటుంబమంతా ఘాట్ ప్రాంగణంలో దివంగత నేతను స్మరించుకున్నారు. వైఎస్ జగన్‌తోపాటు తల్లి విజయమ్మ నివాళులరి్పంచే క్షణంలో భావోద్వేగానికి గురయ్యారు.
ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు..
ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద మాజీ సీఎం వైఎస్ జగన్‌తోపాటు కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చర్చి పాస్టర్లు దేవుని వాక్యంతోపాటు వైఎస్సార్ హయాంలో జరిగిన మంచి పనులను వివరించారు. వైఎస్సార్ సువర్ణ పాలనలో ప్రజలంతా సంక్షేమంలో మునిగిపోయారని కొనియాడారు.
అంతేకాక.. 108, ఆరోగ్యశ్రీ, 104, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతుల కోసం రుణమాఫీ అమలుచేసి ప్రజల కష్టాల నుంచి మహానేత రక్షించారని స్మరించుకున్నారు. మహానేత సేవలు చిరస్మరణీయమన్నారు. వైఎస్సార్ అడుగుజాడల్లోనే వైఎస్ జగన్ ధైర్యంగా ముందుకెళ్తున్నారని పాస్టర్లు కొనియాడారు. కష్టకాలంలో దేవునితోపాటు నాన్న ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆయనకు ఉంటాయన్నారు.
ప్రతి ఒక్కరూ వైఎస్ జగన్‌కు తోడుగా నిలబడాలని వారు ఆకాంక్షించారు. ఇక ప్రత్యేక ప్రార్థనల్లో చిన్నాన్న వైఎస్ సు«దీకర్‌రెడ్డి, అత్తమ్మ ఈసీ సుగుణమ్మ, సోదరుడు, కడప ఎంపీ వైఎస్ అవినా‹Ùరెడ్డి, మేనమామ, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, అన్నమయ్య జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, కడప నగర మేయర్ కె. సురేష్‌బాబు, ఎమ్మెల్యేలు డాక్టర్ సుధ, టి. చంద్రశేఖర్, విరూపాక్షి, ఎమ్మెల్సీలు పి. రామసుబ్బారెడ్డి, రమేష్ యాదవ్, గోవిందరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజద్‌బాషా, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నేతలు ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, ఆర్. రమే‹Ùకుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మరోవైపు.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచి్చన వైఎస్సార్ అభిమానులు, పార్టీ శ్రేణులు, నేతలు అందరికీ వైఎస్ జగన్ అభివాదం చేశారు. ఒక్కొక్కరిని పేరుపేరునా పలకరిస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment