idupulapaya Ghat
-
ఇడుపులపాయలో వైఎస్ జగన్ (ఫొటోలు)
-
వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం
సాక్షి కడప/వేంపల్లె: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 15వ వర్థంతిని పురస్కరించుకుని వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌వద్ద ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులరి్పంచారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతీరెడ్డితోపాటు ఇతర కుటుంబ సభ్యులు సోమవారం ఉదయాన్నే ఘాట్ వద్ద పూలమాలలు వేసి ఘన నివాళి అరి్పంచారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆయన అభిమానులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలు ఇడుపులపాయకు కదిలివచ్చారు. ముందుగా వైఎస్ జగన్ కుటుంబమంతా ఘాట్ ప్రాంగణంలో దివంగత నేతను స్మరించుకున్నారు. వైఎస్ జగన్‌తోపాటు తల్లి విజయమ్మ నివాళులరి్పంచే క్షణంలో భావోద్వేగానికి గురయ్యారు. ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు.. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద మాజీ సీఎం వైఎస్ జగన్‌తోపాటు కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చర్చి పాస్టర్లు దేవుని వాక్యంతోపాటు వైఎస్సార్ హయాంలో జరిగిన మంచి పనులను వివరించారు. వైఎస్సార్ సువర్ణ పాలనలో ప్రజలంతా సంక్షేమంలో మునిగిపోయారని కొనియాడారు.అంతేకాక.. 108, ఆరోగ్యశ్రీ, 104, ఫీజు రీయింబర్స్మెంట్, రైతుల కోసం రుణమాఫీ అమలుచేసి ప్రజల కష్టాల నుంచి మహానేత రక్షించారని స్మరించుకున్నారు. మహానేత సేవలు చిరస్మరణీయమన్నారు. వైఎస్సార్ అడుగుజాడల్లోనే వైఎస్ జగన్ ధైర్యంగా ముందుకెళ్తున్నారని పాస్టర్లు కొనియాడారు. కష్టకాలంలో దేవునితోపాటు నాన్న ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆయనకు ఉంటాయన్నారు. ప్రతి ఒక్కరూ వైఎస్ జగన్‌కు తోడుగా నిలబడాలని వారు ఆకాంక్షించారు. ఇక ప్రత్యేక ప్రార్థనల్లో చిన్నాన్న వైఎస్ సు«దీకర్‌రెడ్డి, అత్తమ్మ ఈసీ సుగుణమ్మ, సోదరుడు, కడప ఎంపీ వైఎస్ అవినా‹Ùరెడ్డి, మేనమామ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, అన్నమయ్య జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, కడప నగర మేయర్ కె. సురేష్‌బాబు, ఎమ్మెల్యేలు డాక్టర్ సుధ, టి. చంద్రశేఖర్, విరూపాక్షి, ఎమ్మెల్సీలు పి. రామసుబ్బారెడ్డి, రమేష్ యాదవ్, గోవిందరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్‌బాషా, వైఎస్సార్సీపీ రాష్ట్ర నేతలు ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, ఆర్. రమే‹Ùకుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మరోవైపు.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచి్చన వైఎస్సార్ అభిమానులు, పార్టీ శ్రేణులు, నేతలు అందరికీ వైఎస్ జగన్ అభివాదం చేశారు. ఒక్కొక్కరిని పేరుపేరునా పలకరిస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. -
సంక్షేమాభివృద్ధి సారథి వైఎస్సార్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమానంగా ముందుకు తీసుకెళ్తూ పరిపాలనలో సమానత్వాన్ని చాటుకుంటూ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుని పాలకుడంటే ఎలా ఉండాలో చాటిచెప్పిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అని ప్రజలు, అభిమానులు, వైఎస్సార్సీపీ శ్రేణులు కొనియాడారు. దివంగత వైఎస్ 75వ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ఘనంగా నివాళులర్పించారు. ‘జోహార్ వైఎస్సార్.. వైఎస్సార్ అమర్ రహే’ అంటూ వాడవాడలా నినదించారు.ఈ సందర్భంగా మహానేత అందించిన పథకాలను ప్రజలు గుర్తుచేసుకున్నారు. గ్రామ గ్రామాన, వాడవాడలా కేక్‌లు కట్‌చేసి, పేదలకు వస్త్ర, అన్నదానం చేసి మహానేతపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. రాష్ట్రంలో 26 జిల్లాలు, 175 నియోజకవర్గాల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు పండుగలా నిర్వహించారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ సహా వివిధ రాష్ట్రాల్లో మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయంలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తదితరులు కేక్ కట్‌చేసి వైఎస్సార్ చిత్రపటానికి నివాళులర్పించారు.ఇడుపులపాయలో..ఇక ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్ తన తండ్రికి ఘన నివాళులర్పించారు. ఆయనతోపాటు వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మహానేతకు నివాళులర్పించారు. అలాగే, పామర్రు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కైలే అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహాలకు భారీ పూలమాలలు వేసి నివాళులర్పించారు.విదేశాల్లోనూ ఘనంగా..వివిధ దేశాల్లోనూ ప్రవాసాంధ్రులు వైఎస్‌కు ఘనంగా నివాళులు అర్పించారు. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, యూకే, జర్మనీ, దక్షిణాఫ్రికా, సింగపూర్, మలేసియా, ఒమన్, యూఏఈ, సౌదీ అరేబియా తదితర దేశాల్లో ప్రవాసాంధ్రులు, భారతీయులు వైఎస్సార్ సేవలను గుర్తుచేసుకున్నారు. మెల్బోర్న్లో వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా కన్వీనర్ చింతలచెరువు సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో కేక్‌ను కట్ చేశారు. తెలుగు ప్రజల గుండెల్లో వైఎస్సార్: డాక్టర్ ప్రదీప్ చింతా తెలుగుజాతి ఉన్నంత వరకు తెలుగు ప్రజల హృదయాల్లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పదిలంగా ఉంటారని వైఎస్సార్సీపీ యూకే కన్వీనర్ డాక్టర్ ప్రదీప్ చింతా తెలిపారు. పేదల దేవుడు వైఎస్సార్ అని, మనసున్న మారాజు వైఎస్సార్‌కు నీరాజనం పలుకుతున్నామన్నారు. ఇక యూకే టీం ఆధ్వర్యంలో నంద్యాలలోని పరివర్తన్ లైఫ్ సెంటర్లోనూ వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పిల్లలకు మందులు, దుస్తులు, ఫ్రిజ్, మంచాలు, బెడ్స్ పంపిణీ చేసి అన్నదానం చేశారు. అలాగే, ఆయన కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో వైఎస్సార్ జిల్లా ముద్దనూరులోని సాంఘిక సంక్షేమ హాస్టల్లో కేక్ కట్‌చేసి దుప్పట్లు పంపిణీ చేశారు. -
మరో యాత్రకు సిద్ధం.. నేటి నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర
సాక్షి, అమరావతి: పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రగతిపథంలో నిలిపేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఇడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచారభేరి మోగించనున్నారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నివాళులు అర్పించిన అనంతరం ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రను ప్రారంభిస్తారు. తొలి రోజు బస్సు యాత్ర కడప పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో జరగనుంది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం 21 రోజులపాటు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తూ ‘సిద్ధం’ సభలు నిర్వహించిన నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు మినహా మిగతా పార్లమెంట్ స్థానాల పరిధిలో బస్సు యాత్రను నిర్వహించనున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తాను చేసిన ప్రజా సంకల్ప పాదయాత్ర తరహాలోనే బస్సు యాత్రలోనూ రోజూ ఉదయం వివిధ వర్గాల ప్రజలు, మేధావులతో సీఎం జగన్ మమేకమవుతారు. ప్రభుత్వ పనితీరును మరింతగా మెరుగుపర్చుకోవడానికి వారి నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. సాయంత్రం ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. మోసాలను ఎండగడుతూ.. బస్సు యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యేవరకూ సీఎం జగన్ పూర్తిగా ప్రజలతో మమేకమవుతారు. యాత్ర సందర్భంగా ఎక్కడికక్కడ ఆయా ప్రాంతాల్లో విడిది చేయనున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసి ప్రతి ఇంటికీ మేలు చేసిన అంశాన్ని సీఎం జగన్ యాత్రలో వివరించనున్నారు. విభజన నేపథ్యంలో 2014 ఎన్నికల్లో జనసేన–బీజేపీతో జట్టుకట్టిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలకు గుర్తు చేయనున్నారు. వ్యవసాయ, డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని, ఆడపిల్ల పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు డిపాజిట్ చేస్తామని, ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతిగా ఇస్తామని, చేనేత, పవర్ లూమ్స్ రుణాలు పూర్తిగా మాఫీ.. లాంటి 650కిపైగా వాగ్దానాలు గుప్పించి పది శాతం కూడా అమలు చేయకుండా వంచించిన వైనాన్ని సీఎం జగన్ ఎండగట్టనున్నారు. నాడు మోసం చేసిన కూటమితోనే జట్టు కట్టి చంద్రబాబు మళ్లీ వస్తున్నారని ప్రజలను అప్రమత్తం చేయనున్నారు. మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మీ ఇంటికి మంచి జరిగి ఉంటే ఓటు వేసి ఆశీర్వదించాలని వినమ్రంగా ప్రజలకు విజ్ఞప్తి చేయనున్నారు. వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నయా జోష్ చేసిన మంచిని ప్రతి ఇంటికి వివరించి ప్రజల ఆశీర్వాదం తీసుకునేందుకు చేపట్టిన గడప గడపకూ మన ప్రభుత్వం, వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాలకు జనం బ్రహ్మరథం పట్టారు. సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో బలంగా నాటుకుపోయిన నమ్మకాన్ని ఈ రెండు కార్యక్రమాలు ప్రతిబింబించాయి. గత 58 నెలల పాలనలో సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా ప్రతి ఇంటా.. ప్రతి గ్రామం.. ప్రతి నియోజకవర్గంలో విప్లవాత్మక మార్పులు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నప్పుడు 175కు 175 శాసనసభ స్థానాలు, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయబావుటా ఎగురవేయడం కచ్చితంగా సాధ్యమేనని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ సీఎం జగన్ సిద్ధం సభలు నిర్వహించారు. భీమిలి (ఉత్తరాంధ్ర), దెందులూరు (ఉత్తర కోస్తా), రాప్తాడు (రాయలసీమ), మేదరమెట్ల (ఉత్తర కోస్తా)లలో నిర్వహించిన నాలుగు సభలకు జనం కడలితో పోటీపడుతూ పోటెత్తడంతో ఒకదానికి మించి మరొకటి గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఉమ్మడి రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల చరిత్రలో రాప్తాడు, మేదరమెట్ల సభలు అతి పెద్ద ప్రజాసభలుగా నిలిచిపోయాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందే వైఎస్సార్సీపీ మరోసారి ప్రభంజనం సృష్టించడం ఖాయమని సిద్ధం సభలతో తేటతెల్లమైందని రాజకీయ పరిశీలకులు విశ్లేషించారు. జనసేన–బీజేపీతో టీడీపీ జతకట్టినా... సార్వత్రిక ఎన్నికల్లో వార్ వన్‌సైడేనని, వైఎస్సార్సీపీ మరోసారి చారిత్రక విజయం సాధించడం తథ్యమని టైమ్స్‌నౌ–ఈటీజీ, జీన్యూస్–మాట్రిజ్ లాంటి డజనుకుపైగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థల సర్వేలు తేల్చి చెప్పాయి. ఇప్పటికే 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించిన సీఎం జగన్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి ముందే బస్సు యాత్ర ద్వారా తొలి విడత ప్రచారాన్ని పూర్తి చేసేందుకు సిద్ధమవడంతో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నయా జోష్ కనిపిస్తోంది. కూటమి అష్టకష్టాలు.. వైఎస్సార్సీపీని ప్రజాక్షేత్రంలో ఒంటరిగా ఎదుర్కోవడం అసాధ్యమని బెంబేలెత్తిన చంద్రబాబు ఉనికి కోసం జనసేన అధ్యక్షుడుతో జట్టు కట్టారు. టీడీపీ–జనసేన పొత్తుల లెక్క తేలాక ఉమ్మడిగా తాడేపల్లిగూడెంలో 2 పార్టీలూ నిర్వహించిన జెండా సభకు జనం మొహం చాటేయడంతో అట్టర్ ప్లాప్ అయ్యింది. ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు బీజేపీ పెద్దల కాళ్లావేళ్లా పడి ఆ పార్టీతో జత కలిశారు. మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరాక ప్రధాని మోదీని రప్పించి చిలకలూరిపేటలో నిర్వహించిన ప్రజాగళం సభకు జనం కదలిరాలేదు. ఆ సభా పేలవంగా సాగడంతో మూడు పార్టీలదీ అవకాశవాద పొత్తులని ప్రజలు తేల్చి చెప్పినట్లయింది. పొత్తు కుదిరినా ఇప్పటికీ మూడు పార్టీలు తమ అభ్యర్థులను పూరిగా ప్రకటించలేని స్థితి నెలకొంది. మరింత పెరిగిన విశ్వసనీయత.. ఎన్నికల్లో హామీల్లో 99 శాతం అమలు చేసి చిత్తశుద్ధి చాటుకున్న సీఎం జగన్ మేనిఫెస్టోకు సరికొత్త నిర్వచనం ఇచ్చారు. గత 58 నెలల్లో నవరత్నాలు, సంక్షేమ పథకాల ద్వారా అర్హతే ప్రామాణికంగా వివక్ష, లంచాలకు తావులేకుండా 87 శాతం కుటుంబాల ప్రజలకు డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ)తో నేరుగా రూ.2.70 లక్షల కోట్లను ఖాతాల్లోకి జమ చేశారు. నాన్ డీబీటీతో మరో రూ.1.79 లక్షల కోట్ల మేర ప్రయోజనాన్ని చేకూర్చారు. డీబీటీ, నాన్ డీబీటీ కలిపి మొత్తం రూ.4.49 లక్షల కోట్ల మేర పేదలకు లబ్ధి చేకూర్చారు. దీన్ని సద్వినియోగం చేసుకున్న ప్రజలు పేదరికం నుంచి గట్టెక్కుతున్నారు. రాష్ట్రంలో పేదరికం 2015–16లో 11.77 శాతం ఉండగా 2022–23 నాటికి 4.19 శాతానికి తగ్గడమే అందుకు తార్కాణం. విప్లవాత్మక సంస్కరణల ద్వారా విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో రాష్ట్రాన్ని సీఎం జగన్ అభివృద్ధి పథంలో నిలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ, జిల్లాల పునర్వ్యవస్థీకరణ ద్వారా పరిపాలనను వికేంద్రీకరించి ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలను అందిస్తున్నారు. హామీలన్నీ అమలు చేయడం, సుపరిపాలన అందిస్తుండటంతో జగన్ నాయకత్వంపై ప్రజల్లో విశ్వసనీయత మరింతగా పెరిగింది. తొలి రోజు యాత్ర ఇలా.. ► సీఎం జగన్ బుధవారం ఉదయం తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు ఇడుపులపాయకు చేరుకుంటారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు. ► మధ్యాహ్నం 1.30 గంటలకు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రను సీఎం వైఎస్ జగన్ ప్రారంభిస్తారు. ► ఇడుపులపాయ నుంచి కుమారునిపల్లి, వేంపల్లి, సర్వరాజుపేట, వీరపునాయనిపల్లి (కమలాపురం), గంగిరెడ్డిపల్లి, ఊరుటూరు, యర్రగుంట్ల (జమ్మలమడుగు), పోట్లదుర్తి మీదుగా సాయంత్రం 4.30 గంటలకి ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డు సమీపంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభ వద్దకు సీఎం జగన్ చేరుకుంటారు. బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ► అనంతరం సున్నపురాళ్లపల్లి, దువ్వూరు, జిల్లెల, నాగలపాడు, బోధనం, రాంపల్లె క్రాస్, చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన శిబిరం వద్దకు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. -
ఇడుపులపాయ: మహానేత వైఎస్సార్‌కు సీఎం జగన్ నివాళి (ఫొటోలు)
-
వైఎస్సార్‌కు నివాళులర్పించిన సీఎం జగన్, కుటుంబ సభ్యులు (ఫోటోలు)
-
వైఎస్సార్‌కు నివాళులర్పించిన సీఎం జగన్, కుటుంబ సభ్యులు
సాక్షి, కడప జిల్లా: మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 73వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్ సమాధి వద్ద కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇదిలా ఉంటే, మహానేత వైఎస్సార్ జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహిస్తున్నారు. -
ఘాట్ వద్ద.. చెమర్చిన కళ్లతో
సాక్షి, కడప: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ కుటుంబ సభ్యులు ఘన నివాళులర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముందురోజే ఇడుపులపాయ చేరుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఉదయం 9.10 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులతో కలసి వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకున్నారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, సీఎం సతీమణి వైఎస్ భారతి, సోదరి షర్మిల, దివంగత జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ తదితరులు ఘాట్ వద్దకు చేరుకుని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముందుగా సమాధి ప్రాంగణం వద్ద కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధుమిత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. ప్రార్థనలు నిర్వహిస్తున్న సమయంలో వైఎస్సార్ జ్ఞాపకాలను గుర్తు చేసుకుని సీఎం జగన్, ఆయన తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతి, సోదరి షర్మిల, పెద్దమ్మ వైఎస్ భారతమ్మలు ఒకింత భావోద్వేగానికి గురై చెమర్చిన కళ్లతో కనిపించారు. అక్కడికి సమీపంలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి సీఎంతోపాటు కుటుంబ సభ్యులంతా పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం ముఖ్యమంత్రి జగన్ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని కుటుంబ సభ్యులతో కొద్దిసేపు గడిపారు. అల్పాహారం అనంతరం నేరుగా హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. అక్కడ తనను కలిసేందుకు నిరీక్షిస్తున్న వారిని పలకరించారు. ఒక్కొక్కరితో మాట్లాడుతూ సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉదయం 10.15 గంటలకు హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న ఆయన 11.10 గంటల వరకు వినతులు స్వీకరిస్తూ ప్రజలతో మమేకమయ్యారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 11.30 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి విమానంలో గన్నవరం బయలుదేరి వెళ్లారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్న దివంగత సీఎం వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి, సోదరి షర్మిల, మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు కార్యకర్త ‘సల్మా’కు ఫోన్లో పరామర్శ అనారోగ్యంతో కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వేంపల్లెకు చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త సల్మాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఫోన్లో పరామర్శించారు. పార్టీ కార్యకర్త భారతి ద్వారా సల్మా అనారోగ్యం గురించి తెలుసుకున్న సీఎం జగన్ వెంటనే వీడియో కాల్ ద్వారా ఆమెతో మాట్లాడారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పార్టీ నేత అనిల్ కుమార్తెకు నామకరణం చేసిన సీఎం లింగాల: వైఎస్సార్ జిల్లా లింగాల మండలం పెద్దకుడాల గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు పెద్దమల్లు అనిల్‌కుమార్‌రెడ్డి, పెద్దమల్లు అనూషల కుమార్తెకు ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా జగతి అని నామకరణం జరిగింది. అనిల్‌కుమార్‌రెడ్డి దంపతులు ఇడుపులపాయలో ముఖ్యమంత్రిని కలిశారు. పలువురు నివాళులు.. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలు నివాళులర్పించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ సోదరుడు వైఎస్ సుధీకర్‌రెడ్డి, డిప్యూటీ సీఎంలు ఎస్బీ అంజాద్‌బాషా, నారాయణస్వామి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, విప్ కొరముట్ల శ్రీనివాసులు, ఎంపీలు వైఎస్ అవినాష్‌రెడ్డి, గోరంట్ల మాధవ్, గురుమూర్తి, ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, డాక్టర్ సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు వెన్నపూస గోపాల్‌రెడ్డి, జకియాఖానమ్, కత్తి నరసింహారెడ్డి, కల్పలత, గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఆర్టీïసీ చైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, పరిశ్రమలశాఖ సలహాదారు రాజోలి వీరారెడ్డి, కలెక్టర్ విజయరామరాజు, డీఐజీ వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, వైఎస్సార్ సీపీ కడప, రాజంపేట పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు కె.సురేష్‌బాబు, ఆకేపాటి అమర్నాథరెడ్డి, చక్రాయపేట ఇన్చార్జి వైఎస్ కొండారెడ్డి, వైఎస్సార్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి తదితరులు వైఎస్సార్‌కు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. -
ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ : మహానేత వైఎస్సార్‌కు సీఎం వైఎస్ జగన్ నివాళి
-
మహానేత వైఎస్సార్‌కు సీఎం వైఎస్ జగన్ నివాళి
సాక్షి, పులివెందుల: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. తన కుటుంబ సభ్యులతో కలసి గురువారం ఉదయం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, వైఎస్ భారతి నివాళులర్పించారు. వైఎస్సార్‌ను స్మరించుకుంటూ మౌనం పాటించారు. ఇవీ చదవండి: మీ స్ఫూర్తి ముందుండి నడిపిస్తోంది నాన్న: సీఎం జగన్ భావోద్వేగ ట్వీట్ చిరునవ్వుల వేగుచుక్క (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆప్యాయంగా పలకరిస్తూ..
సాక్షి ప్రతినిధి, కడప/పులివెందుల: తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం వైఎస్సార్ కడప జిల్లాకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి జగన్ వారిని పేరుపేరున సాదరంగా పలకరించారు. సాయంత్రం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో సతీమణి వైఎస్ భారతితో కలిసి బయలుదేరిన ముఖ్యమంత్రి జగన్ 5.10 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి 5.35 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 5.50కి ఇడుపులపాయ హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. 6.30 గంటల వరకు అక్కడున్న వారిని ఆప్యాయంగా పలకరించి వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం ఇడుపులపాయ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేయనున్నారు. ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు, ఆర్టీసీ చైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఎస్.రఘురామిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బిజేంద్రనాథరెడ్డి, కలెక్టర్ వి.విజయరామరాజు, పరిశ్రమల శాఖ సలహాదారు రాజోలి వీరారెడ్డి తదితరులున్నారు. నేడు వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా గురువారం ఉదయం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ముఖ్యమంత్రి జగన్ కుటుంబ సభ్యులతో కలసి నివాళులర్పించనున్నారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి తిరిగి తాడేపల్లి బయలుదేరి వెళతారు. ఇడుపులపాయకు చేరుకున్నవైఎస్ విజయమ్మ, షర్మిల వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కుమార్తె, వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల, కుటుంబ సభ్యులు బుధవారం సాయంత్రం ఇడుపులపాయకు చేరుకున్నారు. గురువారం ఉదయం వైఎస్సార్ ఘాట్‌లో నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొంటారు. -
మహానేత వైఎస్సార్‌కు సీఎం జగన్ ఘన నివాళి
-
ఇడుపులపాయ: మహానేతకు నివాళులర్పించిన సీఎం జగన్
-
కడప బయల్దేరిన సీఎం వైఎస్ జగన్
సాక్షి, గన్నవరం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ జిల్లాకు బయల్దేరారు. సోమవారం ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ నుంచి సీఎం వైఎస్ జగన్ హెలికాఫ్టర్‌లో బయల్దేరి ఇడుపులపాయలోని వైఎస్సార్ ఎస్టేట్ వద్దకు చేరుకుంటారు. 8.45 గంటలకు వైఎస్సార్ ఘాట్ వద్దకు వెళతారు. 8.50 నుంచి 9.10 గంటల వరకూ ఘాట్ వద్ద వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులు అర్పించే కార్యక్రమంలో పాల్గొంటారు. 9.15 గంటలకు రోడ్డు మార్గాన బయల్దేరి 9.30 గంటలకు చక్రాయపేట మండలంలోని గండి క్షేత్రానికి చేరుకుంటారు. గండి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేస్తారు. 10 గంటల వరకూ అక్కడ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారు. అక్కడ నుంచి ఇడుపులపాయ ఎస్టేట్ వద్దకు చేరుకుంటారు. 10.20 గంటలకు హెలికాఫ్టర్‌లో బయల్దేరి 10.40 గంటలకు జమ్మలమడుగు మండలం కన్నెలూరు హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి బహిరంగ సభ ప్రదేశానికి వెళతారు. అక్కడ ఏర్పాటు చేసి స్టాల్స్‌ను ముఖ్యమంత్రి సందర్శిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరి వెళతారు. వైఎస్ జగన్ తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో జిల్లాకు వస్తున్నారు. మహానేత వైఎస్సార్ జయంతి సందర్భంగా జమ్మలమడుగు నియోజకవర్గం నుంచే రైతు దినోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అలాగే కడప, ఇడుపులపాయ, గండి, జమ్మలమడుగు ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు. -
వైఎస్ఆర్ సదాస్మరామి
♦ జిల్లావ్యాప్తంగా ఘనంగా వైఎస్ జయంతి వేడుకలు ♦ ఇడుపులపాయ ఘాట్‌లో నివాళు లర్పించిన వైఎస్ కుటుంబసభ్యులు ♦ కడపలో రక్తదానం.. పలుచోట్ల అన్నదానాలు ♦ వైఎస్ఆర్ విగ్రహాలకు క్షీరాభిషేకం చేసిన అభిమానులు ♦ ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసిన నేతలు ♦ పాల్గొన్న ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ, మేయర్ సాక్షి కడప: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహాలకు పాలాభిషేకాలు చేశారు. ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. కాగా ఇడుపులపాయకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళి అర్పించారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ఇడుపులపాయ గ్రామంలో గ్రామస్తులు ఏర్పాటు చేసిన కేక్‌ను వైఎస్ జగన్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కట్ చేసి పంచిపెట్టారు. వాడ.. వాడలా వైఎస్ జయంతి వేడుకలు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కుల,మత, వర్గ, బేధాలు లేకుండా వైఎస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కడపలోని హెడ్ పోస్టాఫీసు వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే అంజాద్ బాషా, కడప మేయర్ సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి పాలాభిషేకం చేశారు. అలాగే పార్టీ ఆఫీసులో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున యువకులు రక్తదానం చేశారు. చాపాడు, దువ్వూరు, మైదుకూరులలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలువేసి నివాళులర్పించారు. మైదుకూరులోని వికలాంగుల పాఠశాల విద్యార్థులకు పార్టీ నేతలు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రాయచోటిలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి పూలమాలవేసి క్షీరాభిషేకం చేయడంతోపాటు పార్టీ కార్యాలయంలో మున్సిపల్ చెర్మైన్ నసిబున్ ఖానం ఆధ్వర్యంలో వైఎస్ఆర్ చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. రైల్వేకోడూరులోని టోల్గేట్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జి బ్రహ్మానందరెడ్డిలు పూలమాలలువేసి నివాళులర్పించారు. రాజంపేటలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ పట్టణ నాయకులు సుధాకర్ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, పోలా శ్రీనివాసరెడ్డిలు ప్రారంభించారు. రాష్ట్ర నేతలు ఆకేపాటి మురళిరెడ్డి, చొప్ప యల్లారెడ్డి పాల్గొన్నారు. అన్నదానం చేశారు. బద్వేలు నియోజకవర్గంతోపాటు పోరుమామిళ్లలో వైఎస్ఆర్ విగ్రహానికి ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, సమన్వయకర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య, ఎంపీపీ చిత్తా విజయప్రతాప్‌రెడ్డి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఎర్రగుంట్ల నాలుగు రోడ్ల కూడలి వద్ద వైఎస్ఆర్ చిత్ర పటానికి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలువేసి నివాళులర్పించారు. జమ్మలమడుగులో రాష్ట్ర నాయకులు హనుమంతురెడ్డి, శుద్దపల్లె శివుడు, పోరెడ్డి మహేశ్వరరెడ్డి, దన్నవాడ మహేశ్వరరెడ్డిల ఆధ్వర్యంలో చేయగా.. మైలవరం మండలం దన్నవాడలో రాష్ట్ర నాయకురాలు అల్లె ప్రభావతి, తాళ్లప్రొద్దుటూరులో సర్పంచ్ రామసుబ్బారెడ్డిల ఆధ్వర్యంలో పాలాభిషేకంతోపాటు స్వీట్లు పంపిణీ చేశారు. ప్రొద్దుటూరులోని అన్వర్ థియేటర్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పట్టణ అధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, జిల్లా కార్యదర్శి కల్లూరు నాగేందర్‌రెడ్డి, ఎంపీపీ మల్లెల ఝాన్సీరాణి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కొమ్మా శివచంద్రారెడ్డిల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి కేక్‌ను కట్ చేశారు. కమలాపురంలో పార్టీ కార్యాలయంలో మండల కన్వీనర్ ఉత్తమారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేయగా.. అప్పాయపల్లెలోని అనాథ శరణాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భారతి సిమెంటు కర్మాగార ఆవరణంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వర్క్స్ టి.సాయి రమేష్, అసిస్టెంటు వైస్ ప్రెసిడెంటు దత్తా, జనరల్ మేనేజర్ మధుసూదన్, మైన్స్ జీఎం నాగసుబ్బారెడ్డిల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.