YSR Ghat
-
వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ జగన్..భారీగా చేరుకున్న కార్యకర్తలు
-
YS Jagan: వైఎస్సార్‌కు ఘన నివాళులు
-
వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం
సాక్షి కడప/వేంపల్లె: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 15వ వర్థంతిని పురస్కరించుకుని వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌వద్ద ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులరి్పంచారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతీరెడ్డితోపాటు ఇతర కుటుంబ సభ్యులు సోమవారం ఉదయాన్నే ఘాట్ వద్ద పూలమాలలు వేసి ఘన నివాళి అరి్పంచారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆయన అభిమానులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలు ఇడుపులపాయకు కదిలివచ్చారు. ముందుగా వైఎస్ జగన్ కుటుంబమంతా ఘాట్ ప్రాంగణంలో దివంగత నేతను స్మరించుకున్నారు. వైఎస్ జగన్‌తోపాటు తల్లి విజయమ్మ నివాళులరి్పంచే క్షణంలో భావోద్వేగానికి గురయ్యారు. ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు.. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద మాజీ సీఎం వైఎస్ జగన్‌తోపాటు కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చర్చి పాస్టర్లు దేవుని వాక్యంతోపాటు వైఎస్సార్ హయాంలో జరిగిన మంచి పనులను వివరించారు. వైఎస్సార్ సువర్ణ పాలనలో ప్రజలంతా సంక్షేమంలో మునిగిపోయారని కొనియాడారు.అంతేకాక.. 108, ఆరోగ్యశ్రీ, 104, ఫీజు రీయింబర్స్మెంట్, రైతుల కోసం రుణమాఫీ అమలుచేసి ప్రజల కష్టాల నుంచి మహానేత రక్షించారని స్మరించుకున్నారు. మహానేత సేవలు చిరస్మరణీయమన్నారు. వైఎస్సార్ అడుగుజాడల్లోనే వైఎస్ జగన్ ధైర్యంగా ముందుకెళ్తున్నారని పాస్టర్లు కొనియాడారు. కష్టకాలంలో దేవునితోపాటు నాన్న ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆయనకు ఉంటాయన్నారు. ప్రతి ఒక్కరూ వైఎస్ జగన్‌కు తోడుగా నిలబడాలని వారు ఆకాంక్షించారు. ఇక ప్రత్యేక ప్రార్థనల్లో చిన్నాన్న వైఎస్ సు«దీకర్‌రెడ్డి, అత్తమ్మ ఈసీ సుగుణమ్మ, సోదరుడు, కడప ఎంపీ వైఎస్ అవినా‹Ùరెడ్డి, మేనమామ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, అన్నమయ్య జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, కడప నగర మేయర్ కె. సురేష్‌బాబు, ఎమ్మెల్యేలు డాక్టర్ సుధ, టి. చంద్రశేఖర్, విరూపాక్షి, ఎమ్మెల్సీలు పి. రామసుబ్బారెడ్డి, రమేష్ యాదవ్, గోవిందరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్‌బాషా, వైఎస్సార్సీపీ రాష్ట్ర నేతలు ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, ఆర్. రమే‹Ùకుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మరోవైపు.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచి్చన వైఎస్సార్ అభిమానులు, పార్టీ శ్రేణులు, నేతలు అందరికీ వైఎస్ జగన్ అభివాదం చేశారు. ఒక్కొక్కరిని పేరుపేరునా పలకరిస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. -
వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ జగన్ నివాళులు
వైఎస్సార్, సాక్షి: సంక్షేమ ప్రదాత.. అభివృద్ధి విధాత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 15వ వర్ధంతి నేడు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. వైఎస్సార్ సతీమణి విజయమ్మ, తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నేతలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని మహానేతను స్మరించుకున్నారు.ఈ ప్రార్థనా కార్యక్రమంలో ఎంపీలు వైఎస్ అవినాష్ రెడ్డి, గురుమూర్తి, జిల్లా పార్టీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, దాసరి సుధ, మాజీ డిప్యూటీ సిఎం ఆంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్యేలు కోరుముట్ల శ్రీనివాస్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇడుపులపాయకు భారీగా తరలివచ్చిన YSR అభిమానులు
-
Watch Live: జన నేతకు వైఎస్ జగన్ నివాళి
-
వైఎస్ఆర్ ఘాట్ వద్ద సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు
-
Watch Live: ఇడుపులపాయలో సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం
-
సీఎం జగన్ హెలికాప్టర్ ల్యాండింగ్
-
YSRCP సిద్ధం : 175 ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా
వైఎస్సార్, సాక్షి: అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల జాబితాను ప్రకటించింది వైఎస్సార్సీపీ. శనివారం ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వేదికగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ప్రకటన వెలువడింది. 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాల్ని చదివి వినిపించారు ధర్మాన ప్రసాదరావు. సామాజిక సమీకరణాలు.. సర్వేల ఆధారంగా సేకరించిన అభ్యర్థుల గెలుపోటములను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేసినట్లు ప్రకటించింది పార్టీ అధిష్టానం. 175 అసెంబ్లీ సీట్లు గెలవడమే లక్ష్యంగా వైనాట్ 175 నినాదంతో ఈ ఎన్నికలకు వెళ్తున్నట్లు పార్టీ ప్రకటించింది. (జిల్లా మీద నొక్కండి.. అభ్యర్థుల పేర్లను చూడండి) శ్రీకాకుళం అభ్యర్థుల జాబితా విజయనగరం అభ్యర్థుల జాబితా పార్వతీపురం మన్యం జిల్లా అభ్యర్థుల జాబితా విశాఖపట్నం అభ్యర్థుల జాబితా అనకాపల్లి అభ్యర్థుల జాబితా అల్లూరి అభ్యర్థుల జాబితా కాకినాడ అభ్యర్థుల జాబితా తూర్పు గోదావరి అభ్యర్థుల జాబితా కోనసీమ అభ్యర్థుల జాబితా పశ్చిమ గోదావరి అభ్యర్థుల జాబితా ఏలూరు అభ్యర్థుల జాబితా ఎన్టీఆర్ అభ్యర్థుల జాబితా కృష్ణా అభ్యర్థుల జాబితా గుంటూరు అభ్యర్థుల జాబితా పల్నాడు అభ్యర్థుల జాబితా బాపట్ల అభ్యర్థుల జాబితా ప్రకాశం జిల్లా అభ్యర్థుల జాబితా నెల్లూరు అభ్యర్థుల జాబితా తిరుపతి అభ్యర్థుల జాబితా చిత్తూరు అభ్యర్థుల జాబితా అన్నమయ్య అభ్యర్థుల జాబితా వైఎస్సార్ జిల్లా అభ్యర్థుల జాబితా నంద్యాల అభ్యర్థుల జాబితా కర్నూలు అభ్యర్థుల జాబితా అనంతపురం అభ్యర్థుల జాబితా శ్రీసత్యసాయి అభ్యర్థుల జాబితా ఏపీ 175.. అన్ని పార్టీల పూర్తి జాబితా కోసం క్లిక్ చేయండి -
ఇడుపులపాయలో సీఎం వైఎస్ జగన్
-
అట్లాంటా: వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బొత్స
అట్లాంటా: వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైయస్ఆర్సీపీ శ్రేణులు వివిధ కార్యక్రమాలు చేపట్టారు. దివంగత మహానేత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నివాళులర్పించారు. ఇక అమెరికాలో సైతం వైఎస్సార్సీపీ శ్రేణులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అట్లాంటాలో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో విద్యాశాఖమంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొని దివంగత మహానేతకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహానేతతో తన అనుబంధాన్ని, ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మక కార్యక్రమలు పేదల జీవితాలను ప్రభావితం చేసిన తీరును బొత్స సత్యనారాయణ ప్రస్తావించారు. సమాజం బాగుండాలంటే ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు చదవాలి, నిరుపేదలు తమ పిల్లలను డాక్టర్లు, ఇంజినీర్లుగా చూడాలని దివంగత వైయస్ఆర్ ఆనాడే తపించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి లక్షలమంది పేద పిల్లలను ఉచితంగా చదివించారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా చదువుకున్న ఎంతో మంది పిల్లలు నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ఎంఎన్సీల్లో పెద్ద ఉద్యోగాలు చేస్తూ జీవితంలో గొప్పగా స్థిరపడ్డారని పేర్కొన్నారు. దేశానికే ఆదర్శం.. నాడు మహానేత వైఎస్సార్ చదువుల కోసం రెండు అడుగులు వేస్తే నేడు ముఖ్యమంత్రి జగన్ అదే స్ఫూర్తితో నాలుగడుగులు ముందుకు వేశారన్నారు. సీఎం జగన్ నేతృత్వంలో ఏపీ ప్రభుత్వం విద్యను ప్రధాన అంశంగా గుర్తించి అనేక విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. నాడు-నేడు, డిజిటల్ బోధనలు, విద్యాకానుక, అమ్మఒడి, గోరు ముద్ద వంటి పథకాలు దేశంలో మరెక్కడా లేవని, ఏపీ విద్యారంగం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు. కార్యక్రమం అనంతరం, ప్రవాస ఆంధ్రులతో చిట్ చాట్ లో పాల్గొన్నారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర- దేశ ఆర్ధిక, రాజకీయ పరిస్థితులు ఇతర అంశాలపై ఎన్నారైలతో ముచ్చటించారు. ఆ ఘనత వైఎస్సార్‌దే కనిగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు మాట్లాడుతూ.. ఆరోగ్య శ్రీ, 108 వంటి అద్భుతమైన కార్యక్రమాల ద్వారా దివంగత వైయస్ఆర్ ప్రపంచానికే స్ఫూర్తిగా నిలిచారని, పేదలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయించి ఎంతో మంది ప్రాణాలను కాపాడిన ఘనత వైయస్ఆర్దే అని అన్నారు. ఆయన సంక్షేమ పథకాల స్పూర్తితో మన దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలూ ఆరోగ్య శ్రీ వంటి పథకాలు ప్రవేశపెట్టాయన్నారు. వైయస్ జగన్ తండ్రిని మించిన తనయుడు.. ఉత్తర అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ మాట్లాడుతూ విశ్వసనీయతకు, మంచితనానికి మారుపేరు డాక్టర్ వైయస్ఆర్ అన్నారు. 14 ఏళ్ల తర్వాత కూడా ప్రజలకు వైయస్ఆర్ పై ఉన్న అభిమానం చెక్కుచెదర్లేదని, తెలుగు నేలపై ఆయన పేరు, ఆయన ప్రవేశపెట్టిన అజరామరంగా కీర్తింపబడతాయని పేర్కొన్నారు. ఆ మహానేత దారిలోనే ప్రయాణిస్తున్న వైయస్ జగన్ తండ్రిని మించిన తనయుడిగా ఏపీని తీర్చిదిద్దుతున్నారని అన్నారు. 4 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కాని విప్లవాత్మక మార్పులను సీఎం వైయస్ జగన్ తీసుకొచ్చారని, ఆంధ్రప్రదేశ్ సీఎంగా జగన్ ఉండటం మన అదృష్టం అని రత్నాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో IIIT మాజీ ప్రిన్సిపాల్ కృష్ణా రెడ్డి వైయస్ఆర్ గొప్పతనాన్ని పద్యరూపంలో చెప్పడం అలరించింది. సీఎం సలహాదారు ( విద్య ) కుమార్ అన్నవరపు కూడా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. అట్లాంటాలో నివాసముంటున్న వైఎస్సార్సీపీ శ్రేణులు, సోషల్ మీడియా యాక్టివిస్టులు, వైఎస్సార్ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదీ చదవండి: స్మృత్యంజలి -
వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళతాం
వేంపల్లె/వైరా/జడ్చర్ల: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్నదే తమ లక్ష్యమని తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఏపీలోని వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‌ను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రాజశేఖరరెడ్డి సమాధికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అక్కడే ఉన్న వైఎస్ విగ్రహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నమస్కరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ప్రారంభం నుంచి చివరి వరకు పాల్గొన్న తమ వ్యక్తి గత సిబ్బంది, నాయకులు అందరూ దివంగత వైఎస్ ఆశీస్సులు తీసుకోవాలని భావించి ఇక్కడకు వచ్చినట్లు చెప్పారు. వైఎస్ఆర్ హయాంలో తాను శాసన సభ్యుడిగా, అసెంబ్లీలో చీఫ్‌విప్‌గా పనిచేసినట్లు తెలిపారు. వైఎస్ఆర్కు తాను చాలా సన్నిహితంగా ఉండేవాడినన్నారు. ఆయ న ఆశయాలను గౌరవించే అందరూ కూడా సమాజ సేవచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కమలమ్మ, ఏఐసీసీ సభ్యుడు ధ్రువకుమార్‌రెడ్డి, ఇతర నేతలు నజీర్ అహ్మద్, ప్రభాకర్‌లు పాల్గొన్నారు. కార్పొరేట్ సంస్థల చేతుల్లో దేశ సంపద కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ సంస్థల చేతులకు అప్పగించిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర విజయవంతంగా ముగియడంతో తనతో పాటు యాత్రలో పాల్గొన్న నాయకులతో కలసి తిరుమల వెంకన్నస్వామిని దర్శించుకునేందుకు వెళుతూ.. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల శివారులోని ఓ హోటల్ వద్ద ఆయన కాసేపు విలేకరులతో మాట్లాడారు. దేశంలో సాగుతున్న ప్రజావ్యతిరేక పాలనకు అడ్డుకట్ట వేసేందుకు ప్రజలు సిద్ధమయ్యారని, అందులో భాగంగానే హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని భట్టి అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో తాము పేదలకు ఇచ్చిన భూములను సీఎం కేసీఆర్ గుంజుకుని కార్పొరేట్ సంస్థలకు అమ్ముకున్నారని విమర్శించారు. తాము తిరిగి అధికారంలోకి రాగానే ఆ భూములను వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 74 నుంచి 75 సీట్లలో గెలిచి అధికారంలోకి వస్తామన్నారు. బీఆర్ఎస్ నేతలు అహంకారంతో వ్యవహరిస్తున్నారని, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలను కాల్చి వేస్తానని బెదిరించడం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు. అసెంబ్లీ సీట్ల కేటాయింపులో ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను అనుసరిస్తామని తెలిపారు. -
Idupulapaya YSR Ghat: వైఎస్సార్‌కు సీఎం జగన్ నివాళులు (ఫొటోలు)
-
Idupulapaya YSR Ghat: వైఎస్సార్‌కు సీఎం జగన్ నివాళులు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దివంగత మహానేత వైఎస్సార్‌కు నివాళులర్పించారు. ఈరోజు(శనివారం) అనంతపురం జిల్లా పర్యటన ముగించుకుని నేరుగా సీఎం జగన్ వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులర్పించారు. జూలై 8న దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి. ఈ నేపథ్యంలో తన అనంత పర్యటన ముగిసిన వెంటనే.. వైఎస్సార్ ఘాట్‌కు చేరుకుని నివాళులు అర్పించారు. సీఎం జగన్‌తో పాటు ఆయన సతీమణి వైఎస్ భారతి, తల్లి వైఎస్ విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. చదవండి: మీ స్ఫూర్తి చేయిపట్టి నడిపిస్తోంది నాన్న.. సీఎం జగన్ భావోద్వేగ ట్వీట్ -
వైఎస్సార్‌కు నివాళులర్పించిన సీఎం జగన్
-
ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వైఎస్సార్
వేంపల్లె/ఇడుపులపాయ/ఒంటిమిట్ట: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ప్రశంసించారు. శనివారం ఆయన వైఎస్సార్ జిల్లా వేంపల్లె మండలం ఇడుపులపాయకు కుటుంబ సభ్యులతో కలిసి చేరుకున్నారు. ముందుగా గండి వీరాంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకుని దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ దివంగత వైఎస్సార్ అనుచరునిగా తనను గుర్తిస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తనకు కేబినేట్లో మంత్రి పదవి కల్పించడంతో పాటు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించారన్నారు. గండి క్షేత్రంలో వీరాంజనేయస్వామి 100 అడుగుల విగ్రహం ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో మాట్లాడి చర్యలు తీసుకుంటానని తెలిపారు. అనంతరం ఒంటిమిట్టకు చేరుకున్న ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోని పలు ప్రధాన ఆలయాలను తొలిదశలో మాస్టర్‌ప్లాన్ రూపకల్పనకు ఎంపిక చేసినట్లు తెలిపారు. అన్యాక్రాంతమైన, కబ్జాకు గురైన దేవదాయ శాఖ భూములను సంరక్షిస్తామని చెప్పారు. దేవదాయ శాఖలో టీటీడీ తరహా ఆన్లైన్ పద్ధతిని పాటించేలా ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. గండి వీరాంజనేయస్వామి దేవస్థాన చైర్మన్ పి.రాఘవేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
మహానేత వైఎస్సార్‌కు సీఎం వైఎస్ జగన్ నివాళి
-
వైఎస్ఆర్ ఘాట్ లో నివాళులు అర్పించిన వైఎస్ విజయమ్మ
-
ఘాట్ వద్ద.. చెమర్చిన కళ్లతో
సాక్షి, కడప: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ కుటుంబ సభ్యులు ఘన నివాళులర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముందురోజే ఇడుపులపాయ చేరుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఉదయం 9.10 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులతో కలసి వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకున్నారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, సీఎం సతీమణి వైఎస్ భారతి, సోదరి షర్మిల, దివంగత జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ తదితరులు ఘాట్ వద్దకు చేరుకుని పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముందుగా సమాధి ప్రాంగణం వద్ద కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధుమిత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. ప్రార్థనలు నిర్వహిస్తున్న సమయంలో వైఎస్సార్ జ్ఞాపకాలను గుర్తు చేసుకుని సీఎం జగన్, ఆయన తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతి, సోదరి షర్మిల, పెద్దమ్మ వైఎస్ భారతమ్మలు ఒకింత భావోద్వేగానికి గురై చెమర్చిన కళ్లతో కనిపించారు. అక్కడికి సమీపంలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి సీఎంతోపాటు కుటుంబ సభ్యులంతా పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం ముఖ్యమంత్రి జగన్ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని కుటుంబ సభ్యులతో కొద్దిసేపు గడిపారు. అల్పాహారం అనంతరం నేరుగా హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. అక్కడ తనను కలిసేందుకు నిరీక్షిస్తున్న వారిని పలకరించారు. ఒక్కొక్కరితో మాట్లాడుతూ సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉదయం 10.15 గంటలకు హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న ఆయన 11.10 గంటల వరకు వినతులు స్వీకరిస్తూ ప్రజలతో మమేకమయ్యారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 11.30 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి విమానంలో గన్నవరం బయలుదేరి వెళ్లారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్న దివంగత సీఎం వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి, సోదరి షర్మిల, మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు కార్యకర్త ‘సల్మా’కు ఫోన్లో పరామర్శ అనారోగ్యంతో కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వేంపల్లెకు చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త సల్మాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఫోన్లో పరామర్శించారు. పార్టీ కార్యకర్త భారతి ద్వారా సల్మా అనారోగ్యం గురించి తెలుసుకున్న సీఎం జగన్ వెంటనే వీడియో కాల్ ద్వారా ఆమెతో మాట్లాడారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పార్టీ నేత అనిల్ కుమార్తెకు నామకరణం చేసిన సీఎం లింగాల: వైఎస్సార్ జిల్లా లింగాల మండలం పెద్దకుడాల గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు పెద్దమల్లు అనిల్‌కుమార్‌రెడ్డి, పెద్దమల్లు అనూషల కుమార్తెకు ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా జగతి అని నామకరణం జరిగింది. అనిల్‌కుమార్‌రెడ్డి దంపతులు ఇడుపులపాయలో ముఖ్యమంత్రిని కలిశారు. పలువురు నివాళులు.. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలు నివాళులర్పించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ సోదరుడు వైఎస్ సుధీకర్‌రెడ్డి, డిప్యూటీ సీఎంలు ఎస్బీ అంజాద్‌బాషా, నారాయణస్వామి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, విప్ కొరముట్ల శ్రీనివాసులు, ఎంపీలు వైఎస్ అవినాష్‌రెడ్డి, గోరంట్ల మాధవ్, గురుమూర్తి, ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, డాక్టర్ సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు వెన్నపూస గోపాల్‌రెడ్డి, జకియాఖానమ్, కత్తి నరసింహారెడ్డి, కల్పలత, గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఆర్టీïసీ చైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, పరిశ్రమలశాఖ సలహాదారు రాజోలి వీరారెడ్డి, కలెక్టర్ విజయరామరాజు, డీఐజీ వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, వైఎస్సార్ సీపీ కడప, రాజంపేట పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు కె.సురేష్‌బాబు, ఆకేపాటి అమర్నాథరెడ్డి, చక్రాయపేట ఇన్చార్జి వైఎస్ కొండారెడ్డి, వైఎస్సార్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి తదితరులు వైఎస్సార్‌కు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. -
ఆప్యాయంగా పలకరిస్తూ..
సాక్షి ప్రతినిధి, కడప/పులివెందుల: తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం వైఎస్సార్ కడప జిల్లాకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి జగన్ వారిని పేరుపేరున సాదరంగా పలకరించారు. సాయంత్రం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో సతీమణి వైఎస్ భారతితో కలిసి బయలుదేరిన ముఖ్యమంత్రి జగన్ 5.10 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి 5.35 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 5.50కి ఇడుపులపాయ హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. 6.30 గంటల వరకు అక్కడున్న వారిని ఆప్యాయంగా పలకరించి వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం ఇడుపులపాయ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేయనున్నారు. ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు, ఆర్టీసీ చైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఎస్.రఘురామిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బిజేంద్రనాథరెడ్డి, కలెక్టర్ వి.విజయరామరాజు, పరిశ్రమల శాఖ సలహాదారు రాజోలి వీరారెడ్డి తదితరులున్నారు. నేడు వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా గురువారం ఉదయం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ముఖ్యమంత్రి జగన్ కుటుంబ సభ్యులతో కలసి నివాళులర్పించనున్నారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి తిరిగి తాడేపల్లి బయలుదేరి వెళతారు. ఇడుపులపాయకు చేరుకున్నవైఎస్ విజయమ్మ, షర్మిల వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కుమార్తె, వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల, కుటుంబ సభ్యులు బుధవారం సాయంత్రం ఇడుపులపాయకు చేరుకున్నారు. గురువారం ఉదయం వైఎస్సార్ ఘాట్‌లో నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొంటారు. -
మహానేత వైఎస్సార్‌కు సీఎం జగన్ ఘన నివాళి
-
మహానేత వైఎస్సార్‌కు సీఎం జగన్ ఘన నివాళి
సాక్షి, ఇడుపులపాయ: మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. గురువారం ఉదయం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్ సీపీ నేతలు పాల్గొన్నారు. ఆ తర్వాత ఇడుపులపాయలోని ప్రార్థన మందిరం లో కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం అక్కడ నిర్వహించిన మినీ క్రిస్మస్ వేడుకల్లోతల్లి విజయమ్మ ,సతీమణి భారతి రెడ్డితో కలిసి సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి,డిప్యూటీ సీఎం అంజాద్ భాష,ఇంచార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, వైఎస్ కొండారెడ్డి , వైఎస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వైఎస్సార్‌కు స్మృత్యంజలి
సాక్షి, కడప: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆయన తనయుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. బుధవారం వైఎస్ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద పూల మాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. బుధవారం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పిస్తున్న సీఎం జగన్, విజయమ్మ, భారతీ రెడ్డి, ఇతర కుటుంబసభ్యులు ► సీఎం వైఎస్ జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి, తల్లి వైఎస్ విజయమ్మ, దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణమ్మ, వైఎస్ సోదరులు వైఎస్ రవీంద్రనాథ్‌రెడ్డి, వైఎస్ సుధీకర్‌రెడ్డి తదితరులు ఉదయం 8.50 గంటలకు ఘాట్ వద్దకు చేరుకున్నారు. ► పాస్టర్ రెవరెండ్ నరేష్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్‌ను స్మరించుకోవడంతోపాటు ప్రజలకు జరిగిన మేలును గుర్తు చేసుకున్నారు. ► వైఎస్ అందించిన విధంగానే ఆయన తనయుడు రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. అదే సందర్భంలో వైఎస్ సతీమణి వైఎస్ విజయమ్మ ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. ► ప్రత్యేక ప్రార్థనల అనంతరం సీఎం వైఎస్ జగన్‌తోపాటు తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతిరెడ్డి, వైఎస్ జగన్ అత్తమామలు ఈసీ సుగుణమ్మ, ఈసీ గంగిరెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు వైఎస్ ఘాట్ వద్ద పూల మాలలు ఉంచి అంజలి ఘటించారు. ► డిప్యూటీ సీఎం ఎస్బీ అంజాద్‌బాషా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి, విప్ కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, ప్రసాద్‌రాజు, కడప, రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు సురేష్‌బాబు, ఆకేపాటి అమర్నాథరెడ్డి, ఎమ్మెల్సీలు వెన్నపూస గోపాలరెడ్డి, జకియాఖానమ్, చక్రాయపేట ఇన్చార్జ్ వైఎస్ కొండారెడ్డి, పరిశ్రమల మౌలిక సదుపాయాలు..పెట్టుబడి సలహాదారు రాజోలి వీరారెడ్డి, కలెక్టర్ హరి కిరణ్, డీఐజీ వెంకట్రామిరెడ్డి, ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్, జేసీ గౌతమి, వైఎస్ స్నేహితుడు అయ్యపురెడ్డి సతీమణి సరళాదేవి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ► అందరూ కొద్దిసేపు వైఎస్సార్‌ను స్మరించుకుంటూ మౌనం పాటించారు. సమీపంలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి సీఎం వైఎస్ జగన్‌తోపాటు కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ► ఇడుపులపాయలోని గెస్ట్‌హౌస్ వద్ద పులివెందులకు చెందిన జ్యోతి తన బిడ్డను ఆశీర్వదించాలని కోరగా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైఎస్ భారతిరెడ్డిలు బిడ్డను ఒడిలోకి తీసుకుని ఆశీర్వదించారు. హెలిప్యాడ్ వద్ద సీఎం ప్రజల వినతులు స్వీకరించారు. అనంతరం ముఖ్యమంత్రి విజయవాడకు బయలుదేరారు. పులివెందులకు చెందిన జ్యోతి బిడ్డను ఎత్తుకొని ఆశీర్వదిస్తున్న సీఎం వైఎస్ జగన్ దంపతులు మహానేత జ్ఞాపకాలకు, పథకాలకు ఎప్పటికీ మరణం ఉండదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ట్వీట్ మహానేత వైఎస్సార్ శరీరానికి మరణం ఉంటుంది కానీ, ఆయన జ్ఞాపకాలు, పథకాలకు ఎప్పుడూ మరణం ఉండదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. తన తండ్రి 11వ వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం ఆయన ట్విట్టర్లో... ‘నాన్న మన మధ్య నుంచి దూరమై నేటికి 11 ఏళ్లు. ఆ మహానేత శరీరానికి మరణం ఉంటుంది కానీ ఆయన జ్ఞాపకాలకు, పథకాలకు ఎప్పుడూ మరణం ఉండదు. నా ప్రతి అడుగులోనూ నాన్న తోడుగా ఉంటూ ముందుకు నడిపిస్తూనే ఉన్నారు’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
అదే స్ఫూర్తి.. అదే లక్ష్యం.. అదే గమ్యం
సాక్షి, అమరావతి: ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రతిపక్ష నేత హోదాలో చెప్పిన మాటలను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక నిజం చేస్తూ ప్రజాభ్యుదయమే లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి వడివడిగా అడుగులు వేస్తున్నారు. ‘పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం మా నాన్న గారు ఒక అడుగు ముందుకు వేస్తే.. ఆయన కొడుకుగా నేను రెండు అడుగులు ముందుకు వేస్తాను’ అని చెప్పిన మాటలను నిలుపుకుంటున్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదున్నరేళ్లపాటు ముఖ్యమంత్రిగా పని చేశారు. సంక్షేమానికి సరికొత్త నిర్వచనం ఇచ్చారు. కోటి ఎకరాలకు నీళ్లందించి.. రాష్ట్రాన్ని సుభిక్షం చేయడానికి జలయజ్ఞం కింద 84 ప్రాజెక్టులను చేపట్టి, సింహభాగం పూర్తి చేశారు. రికార్డు స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులు సాధించడం ద్వారా అన్నపూర్ణ నామధేయాన్ని రాష్ట్రానికి సార్థకం చేశారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టులను పూర్తి చేసి.. ఐటీ రంగం, పారిశ్రామికాభివృద్ధికి బాటలు వేయడం ద్వారా ప్రగతి రథాన్ని కొత్త పుంతలు తొక్కించారు. సంక్షేమాభివృద్ధి పథకాల అమలులో టార్చ్ బేరర్(మార్గ నిర్దేశకుడు)గా నిలిచిన వైఎస్ రాజశేఖరరెడ్డి అమరుడై నేటికి 11 ఏళ్లు. ఆ మహానేత దిశానిర్దేశం చేసిన మార్గంలోనే గత 15 నెలలుగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక రీతిలో సంక్షేమాభివృద్ధి పథకాలను పరుగులు పెట్టిస్తున్నారు. మహానేత అడుగుజాడల్లో మచ్చుకు కొన్ని... ► పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నిలుపుకునే దిశగా సీఎం వైఎస్ జగన్ చర్యలు చేపట్టారు. నవరత్నాలతోపాటు 90 శాతం హామీలను ఇప్పటికే అమలు చేస్తున్నారు. ► మహానేత చేపట్టిన ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను మరింత బలోపేతం చేశారు. ఫీజు ఎంతైనా సరే రీయింబర్స్ చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి రెండు వేల చికిత్సలను చేర్చి.. చికిత్స బిల్లు రూ.1,000 దాటితే.. ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. త్వరలో రాష్ట్రమంతటా ఈ విధానం అమలు కానుంది. ► అవ్వాతాతల పెన్షన్‌ను రూ.వెయ్యి నుంచి రూ.2,250కు పెంచి.. ఏటా రూ.250 చొప్పున రూ.మూడు వేలకు పెంచే ఫైలుపై సంతకం చేశారు. ప్రతి నెలా ఒకటో తేదీన ఉదయాన్నే అర్హులైన అవ్వాతాతలు, వికలాంగులు, వితంతవులకు వలంటీర్ల ద్వారా ఇళ్ల వద్దకే పెన్షన్ అందిస్తున్నారు. ► మహానేత తరహాలోనే ఉచిత విద్యుత్.. తక్కువ వడ్డీకే పంట రుణాలు.. తదితర విషయాల్లో సీఎం వైఎస్ జగన్.. అన్నదాతలకు దన్నుగా నిలుస్తున్నారు. రైతు భరోసా కింద రూ.13,500ను పెట్టుబడిగా ఇస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుతో వ్యవసాయాన్ని పండగగా మార్చారు. ► మహానేత పొదుపు సంఘాలకు భారీ ఎత్తున రుణాలను పావలా వడ్డీకే అందిస్తే.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో అడుగు ముందుకేసి వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు. 2019 ఏప్రిల్ 11 నాటికి బ్యాంకుల్లో పొదుపు సంఘాల మహిళలకు ఉన్న రుణాలను నాలుగు విడతల్లో చెల్లించేలా వైఎస్సార్ ఆసరా పథకాన్ని చేపట్టారు. 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వైఎస్సార్ చేయూత పథకం కింద ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలను అందించే పథకానికి శ్రీకారం చుట్టారు. ఇడుపులపాయ చేరుకున్న సీఎం జగన్ సాక్షి ప్రతినిధి కడప: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబ సభ్యులతో కలసి ఇడుపులపాయకు చేరుకున్నారు. కడప విమానాశ్రయం, ఇడుపులపాయ హెలిప్యాడ్‌లో ఆయనకు ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, నేతలు ఘన స్వాగతం పలికారు. ఇడుపులపాయ హెలిప్యాడ్ వద్ద సీఎం ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. అక్కడి నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులు, నేతలతో కలిసి నడుస్తూ అతిథి గృహానికి చేరుకున్నారు. బుధవారం ఉదయం 9.45 గంటలకు వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం వైఎస్ జగన్ కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించి, ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు తిరిగి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి చేరుకోనున్నారు. (వేగంగా నైపుణ్యాభివృద్ధి కాలేజీలు) -
ఇడుపులపాయకు చేరుకున్న సీఎం జగన్
సాక్షి, వైఎస్సార్ జిల్లా : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం ఇడుపుల పాయ చేరుకున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఇడుపులపాయకు వచ్చిన సీఎం జగన్‌కు ఘన స్వాగతం లభించింది. ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రఘురామిరెడ్డి, ఇతర అధికారులు సీఎం జగన్ కు స్వాగతం పలికారు. వారితో కాసేపు ముచ్చటించిన సీఎం.. తర్వాతా వైఎస్సార్ ఎస్టేట్‌లో బస చేసేందుకు వెళ్లారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతిని పురస్కరించుకుని రేపు(సెప్టెంబర్ 2) ఉదయం 9.45 గంటలకు వైఎస్సార్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించి, ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడ్నుంచి బయల్దేరి మధ్యాహ్నం 12.30కి సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. -
వైఎస్సార్ జిల్లాకు బయలుదేరిన సీఎం జగన్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ జిల్లా పర్యటనకు బయలుదేరారు. సాయంత్రం 4 గంటలకు ఆయన గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి సాయంత్రం 4. 45గంటలకు కడప ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. సాయంత్రం 5.15 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఎస్టేట్‌కు చేరుకొని రాత్రికి అక్కడే బస చేస్తారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతిని పురస్కరించుకుని 2వ తేదీ ఉదయం 9.45 గంటలకు వైఎస్సార్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించి, ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడ్నుంచి బయల్దేరి మధ్యాహ్నం 12.30కి సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. -
నేడు ఇడుపులపాయకు సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం(నేడు) సాయంత్రం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయకు వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి కడపకు బయల్దేరుతారు. 5.16 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఎస్టేట్‌కు చేరుకొని రాత్రికి అక్కడే బస చేస్తారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతిని పురస్కరించుకుని 2వ తేదీ ఉదయం 9.45 గంటలకు వైఎస్సార్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించి, ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడ్నుంచి బయల్దేరి మధ్యాహ్నం 12.30కి సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. -
మదిలో మహానేత
-
వైఎస్సార్‌కు ఘన నివాళి
47 ఏళ్లుగా వైఎస్సార్‌తో, వైఎస్సార్ కుటుంబంతో పెనవేసుకున్న అనుబంధం ఉన్న వారందరికీ ఈ పుస్తకాన్ని అందిస్తాను. సహృదయంతో అందరూ చదవాలి. వైఎస్సార్ నాకు స్ఫూర్తి. ఆయన మాటలు మీ అందరిలోనూ స్ఫూర్తి నింపుతాయని నమ్ముతున్నాను. రాజశేఖరరెడ్డి నావాడే కాదు. అందరి వాడని గర్వంగా చెబుతున్నా. ఈ అనుబంధం కలకాలం నిలవాలని, మీ ప్రేమ, మీ ఆశీర్వాదాలు నా బిడ్డలకు సదా ఉండాలని కోరుకుంటున్నాను. – వైఎస్ విజయమ్మ వైఎస్సార్ ప్రతి మాట, ప్రతి అడుగు గురించి చాలా మంది తెలుసుకుని ఆచరణలో పెట్టాలి. నాతోనే కాకుండా, రాష్ట్ర ప్రజలందరితోనూ ఆయనకు చెరగని బంధం ఉంది. ఆయన సహచర్యం ఒక మార్గదర్శకం. ఆయన పిలుపు ఓ భరోసా. ఆయన మాట విశ్వసనీయతకు మారుపేరు. వైఎస్సార్ నాయకత్వం, దార్శనికత, విలువలు మన జీవితాలను నడిపిస్తాయి. –వైఎస్ విజయమ్మ నాలో.. నాతో.. వైఎస్సార్’ అని అమ్మ.. నాన్నలో ఉన్న ఒక తండ్రి, ఒక భర్త, ఒక మంచి వ్యక్తి గురించి రాసింది. నాన్న జయంతిని పురస్కరించుకుని అమ్మ రాసిన ఈ పుస్తకాన్ని ఈ రోజు ఆవిష్కరించా. నాన్న బయట ప్రపంచానికి ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా పరిచయమయ్యారు. నాన్నతోపాటు ప్రయాణం చేసిన సుదీర్ఘ ప్రయాణంలో ఆమె తెలుసుకున్న, చూసిన దానిని ఈ పుస్తకంలో రాశారు. – భావోద్వేగంతో సీఎం వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, కడప: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 71వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం రాత్రి ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌లో బస చేసిన ముఖ్యమంత్రి, కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం 8.50 గంటల ప్రాంతంలో వైఎస్సార్ ఘాట్‌కు చేరుకున్నారు. పూలమాలలు వేసి దివంగత వైఎస్‌కు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వైఎస్ విజయమ్మ రాసిన ‘నాలో.. నాతో.. వైఎస్సార్’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుస్తకం గురించి వైఎస్ జగన్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయి. సీఎం భావోద్వేగాన్ని గమనించిన కుటుంబ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అక్కడున్న వారందరూ చలించిపోయారు. అందరి కళ్లలోనూ నీళ్లు తిరిగాయి. అనంతరం 9.30 గంటలకు సీఎం సమీపంలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ ప్రాంగణానికి చేరుకున్నారు. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్న సీఎం వైఎస్ జగన్, వైఎస్ భారతమ్మ, షర్మిల. జగన్‌ను ముద్దాడుతున్న వైఎస్ విజయమ్మ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ► గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు సాంకేతిక విద్యనందించేందుకు ఇడుపులపాయ ఆర్కే వ్యాలీలోని ట్రిపుల్ ఐటీలో రూ.139.83 కోట్ల వ్యయంతో అత్యాధునికంగా నిర్మించిన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తరగతి భవనాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ► రూ.10.10 కోట్ల అంచనాతో నిర్మించనున్న కంప్యూటర్ సెంటర్‌కు, రూ.40 కోట్ల అంచనాతో అంతర్జాతీయ స్థాయిలో నిర్మించనున్న డాక్టర్ వైఎస్సార్ ఆడిటోరియంకు సీఎం శంకుస్థాపన చేశారు. ఆరు ఎకరాల్లో రెండస్తుల్లో ప్రపంచ స్థాయి ఆడిటోరియం నిర్మిస్తున్నారు. ► 3 మెగా వాట్ల సామర్థ్యంతో నిర్మించిన సోలార్ పవర్ ప్లాంట్‌ను సీఎం ప్రారంభించారు. దీని ద్వారా విద్యుత్ బిల్లులు మరింత తగ్గి సంవత్సరానికి విశ్వవిద్యాలయానికి రూ.1.51 కోట్ల విద్యుత్ ఖర్చు ఆదా కానుంది. అనంతరం ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దివంగత డాక్టర్ వైఎస్సార్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ► తిరిగి 10 గంటలకు ఇడుపులపాయ హెలిప్యాడ్‌కు చేరుకున్న సీఎం.. 10.15 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. కార్యక్రమంలో వైఎస్ విజయమ్మ, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ భారతమ్మ, షర్మిల, వైవీ సుబ్బారెడ్డి, ఇతర కుటుంబ సభ్యులతోపాటు జిల్లా ఇన్చార్జ్ మంత్రి సురేష్, చీఫ్ విప్ గడికోట, విప్ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వైఎస్సార్ జీవితం అందరికీ ఆదర్శం : వైఎస్ విజయమ్మ వైఎస్సార్ జీవితం అందరికీ ఆదర్శనీయమని వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. ‘నాలో.. నాతో.. వైఎస్సార్’ పుస్తకం ఆవిష్కరణ అనంతరం ఆమె ప్రసంగించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ► నేను ఆయనలో చూసింది.. ఆయన మాటల్లో విన్నది.. నా 37 ఏళ్ల సహచర్యంలో ఆయన గురించి రాయాలనిపించింది. ఆయన మాటకిచ్చే విలువ గురించి రాయాలనిపించింది. ఎంతో మంది మా జీవితాల్లోకి వచ్చారు. ఎంతో మంది జీవితాలకు విలువనిచ్చారు ఆయన. ఆ విలువ నేను చూశాను. నేను విన్నాను. ఎంతో మంది మా జీవితాలకు వేసిన బాటలు అనుకుంటాను. ► ప్రతి ఒక్కరూ ఆయన జీవితం తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. ఆయన ప్రతి మాట, ప్రతి అడుగు చాలా మంది తెలుసుకుని దాన్ని ఆచరణలో పెట్టారు. ఆయనతో చెరగని బంధం నాకే కాదు... చాలా చాలా మందికి కూడా. ► చెరగని చిరునవ్వు, స్వచ్ఛతకు మారుపేరు ఆయన చిరునవ్వు. వైఎస్సార్ స్థైర్యం, దక్షత సాటిలేనివి. అందుకే ఆయన అందరిలో యుగయుగాలుగా నిలిచి ఉంటాడు. రాజశేఖరరెడ్డి గారి నుంచి నేను, నా పిల్లలు చాలా చాలా నేర్చుకున్నాము. ► ఈ రోజుకు నా పిల్లలు.. కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు ప్రతి సమయంలో ప్రతి పరిస్థితిలో మన నాన్న ఏం చేసేవాడు.. మా మామయ్య ఏం చేసేవాడు.. అని ఆలోచించి ముందుకు వెళతారు. మీకు ఏదైనా సందేహం వచ్చినా, సంశయం వచ్చినా, ఏదై నా కష్టం వచ్చినా మీలో బాధ తొలిచి వేస్తున్నప్పుడు ఒక్కసారి ఈ పుస్తకం చదవమని మిమ్మల్ని కోరుతున్నా.. తప్పకుండా మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అలాంటిది ఆయన జీవితం. ► ‘తనకు మాత్రమే సొంతమైన కోణం నుంచి నాన్నను లోకానికి అమ్మ కొత్తగా పరిచయం చేసింది. పుస్తకం చదువుతున్నంత సేపు అమ్మతో, నాన్నతో కలసి ప్రయాణిస్తున్నట్లే అనిపించింది. నిజం చెప్పడం సులభం కాదు. అయినా అమ్మ ధైర్యంగా నిజం చెప్పింది. అందుకే ఈ బయోగ్రఫీ అందరం చదవాలి. ఈ పుస్తకాన్ని ప్రచురించిన ఎమెస్కో పబ్లిషర్ విజయ్‌కుమార్‌కు ధన్యవాదాలు’ అని షర్మిల పేర్కొన్నారు. -
నేడు వైఎస్సార్ 71వ జయంతి
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, కడప: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 71వ జయంతిని పురస్కరించుకుని బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలు జరగనున్నాయి. తన తండ్రికి నివాళులర్పించడానికి సీఎం వైఎస్ జగన్ కుటుంబ సభ్యులతో కలసి మంగళవారం సాయంత్రం ఇడుపులపాయకు చేరుకున్నారు. బుధవారం ఉదయం 8.10 గంటలకు తన కుటుంబసభ్యులు, బంధువులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలసి వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం వైఎస్ జగన్ నివాళులర్పిస్తారు. అనంతరం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇడుపులపాయలో పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీఎం పాల్గొనే కార్యక్రమాలివీ... ► గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు సాంకేతిక విద్యనందించేందుకు ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో రూ.139.83 కోట్ల వ్యయంతో అత్యాధునికంగా నిర్మించిన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తరగతి భవనాలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ► ట్రిపుల్ ఐటీకి వాడే విద్యుత్ వ్యయాన్ని తగ్గించేందుకు ఇడుపులపాయ నెమళ్ల పార్కు పక్కన మూడు మెగావాట్ల సామర్థ్యంతో రెస్కో కోలబ్రేషన్ సిస్టమ్‌తో సోలార్ విద్యుత్ ప్లాంటు నిర్మించారు. ఇందుకు 18 ఎకరాల ట్రిపుల్ ఐటీ స్థలాన్ని కేటాయించారు. ప్రస్తుతం ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీకి యూనిట్‌కు రూ.7.66తో విద్యుత్ బిల్లును చెల్లిస్తున్నారు. ఈ సోలార్ ప్లాంటు ద్వారా యూనిట్‌కు రూ.3.45తో బిల్లును చెల్లించవచ్చు. దీంతో ఏటా రూ.1.81 కోట్ల మేరకు ఆర్జీయూకేటీ యూనివర్సిటీకి ఆదా అవుతుంది. ఇందుకు సంబంధించిన శిలాఫలాకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు. ► ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని కూడా ఆయన ఆవిష్కరిస్తారు. ► ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో చదివే విద్యార్థులు ప్రపంచస్థాయికి ఎదగాలనే లక్ష్యంతో రూ.10.10 కోట్లతో ఏర్పాటు చేసే కంప్యూటర్ సెంటర్‌కు శంకుస్థాపన చేస్తారు. ► అలాగే క్యాంపస్‌లో రూ.40 కోట్ల అంచనా వ్యయంతో 2,500 మంది విద్యార్థులు పట్టేలా ఏర్పాటు చేస్తున్న వైఎస్సార్ ఆడిటోరియంకు కూడా శంకుస్థాపన చేస్తారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో... ఇదిలా ఉండగా, వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఉదయం 9.15 గంటలకు మహానేతకు ఘనంగా నివాళులర్పిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డితోపాటుగా పలువురు సీనియర్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. -
మహానేత వైఎస్సార్‌కు ఘన నివాళులు
పులివెందుల/వేంపల్లె: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ జిల్లా పర్యటనలో భాగంగా రెండోరోజు మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. వారు ఉదయం 9.30 గంటలకు వైఎస్సార్ ఘాట్‌కు చేరుకున్నారు. ముందుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వైఎస్సార్ ఘాట్ వద్ద మౌనం పాటించి వైఎస్ రాజశేఖరరెడ్డిని గుర్తు చేసుకున్నారు. అనంతరం వైఎస్ జగన్మోహన్రెడ్డి వఎస్సార్ ఘాట్ వద్ద పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన వెంట కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మంత్రులు అంజాద్ బాషా, నారాయణస్వామి, ఆదిమూలపు సురేష్, వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ గంగుల ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, కడప పార్లమెంటరీ అధ్యక్షుడు సురేష్‌బాబు, జిల్లా కలెక్టర్ హరికిరణ్, జాయింట్ కలెక్టర్ గౌతమి తదితరులు ఉన్నారు. వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డి, కుమార్తెలు హర్ష, వర్ష, చెల్లెలు షర్మిలమ్మ, ఆమె కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజలి, ఇతర కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు వైఎస్సార్ ఘాట్ వద్ద ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వైఎస్ కుటుంబ సభ్యులు ఇడుపులపాయ చర్చిలో ముందస్తు క్రిస్మస్ వేడుకలకు హాజరయ్యారు. -
ఇడుపులపాయ: మహానేతకు నివాళులర్పించిన సీఎం జగన్
-
మహానేతకు సీఎం వైఎస్ జగన్ నివాళి
-
మహానేతకు నివాళులర్పించిన సీఎం జగన్
సాక్షి, వైఎస్సార్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఉదయం ఇడుపులపాయలో తన తండ్రి, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించారు. వైఎస్సార్ ఘాట్‌పై పూల మాల ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అలాగే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రులు ఆదిమూలపు సురేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, వైఎస్ ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ గంగులా ప్రభాకర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.00 గంటలకు సీఎం వైఎస్ జగన్ రాయచోటికి వెళతారు. రాయచోటి జూనియర్ కళాశాల మైదానం సమీపంలో పలు అభివృద్ది పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి, సోదరి వైఎస్ షర్మిల ఇతర కుటుంబ సభ్యులు కూడా వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన విజయమ్మ.. అంతకుముందు వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. అలాగే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. -
నక్షత్రానికో మొక్క.. రాశికో చెట్టు
పూర్వం నుంచి కొనసాగుతున్న సంప్రదాయాలతో కొన్ని జీవులు, నదులు, వృక్షాలను పూజించడంతో అవి ఎంతో పవిత్రతను సంతరించుకున్నాయి. వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి. చెట్లలో కూడా దేవుణ్ని చూశారు. కొన్ని చెట్లను దేవతా వృక్షాలన్నారు. చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ఒకటి. అవి మనకు కాయలు, పండ్లు, పువ్వులు, ఔషధాలు ఇవ్వడంతో పాటు మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతున్నాయి. జీవవైవిధ్యంలో ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి. పురాణాల్లో, ఇతిహాసాల్లో దేవతా వృక్షాలు, మొక్కలు గురించి వివరించారు. వాటి ప్రాముఖ్యతను భవిష్యత్ తరాలకు వివరించేందుకు నల్లకాల్వ సమీపంలోని వైఎస్ఆర్ స్మృతివనంలో పవిత్ర వనం, నక్షత్ర వనాలు ఏర్పాటు చేశారు. అరుదైన వృక్షజాతులను కాపాడుతున్నారు. సీతమ్మ సేదదీరిన అశోక వృక్షం.. శ్రీరాముడి పత్ని సీతను అపహరించిన రావణాసురుడు లంకలోని అశోకవనంలో నిర్భందించిన సమయంలో జీవవైవిధ్యానికి ప్రతిరూపమైన అశోకవనంలో అశోక వృక్షం కిందనే సేదదీరారు. ఈ వృక్షాన్నే సరాక్ అశోకంగా కూడా చెబుతారు. ఈ అరుదై వృక్షం భారతదేశంలోని పశ్చిమ కనుమల్లో మాత్రమే ఉందని ఇంతవరకు అనుకునే వారు. కాని తూర్పు కనుమల్లో భాగమైన నల్లమలలో కూడా కనిపిస్తోంది. ఈ వృక్షాన్ని వైఎస్ఆర్ స్మృతివనంలోని పవిత్రవనంలో నాటి పెంచి పోషించడం స్మృతివనంలో ఆధ్యాత్మిక ప్రశాంతతకు సూచికగా చెప్పుకో వచ్చు. ఆఫ్రికా మహావృక్షం.. చెంతనే వీక్షణం ఆఫ్రికా ఖండంలోని పలు అరణ్యాలలో కనిపించే భారీ వృక్షం అడెన్ సోనియా. దీనిని ఏనుగు చెట్టు అని కూడా అంటారు. వరపగ్గం తిరిగే వలయం ఉన్న ఈ చెట్టు ఆఫ్రికాలో 2500 ఏళ్లకు పైగానే జీవిస్తుందని నిర్ధారణ అయ్యింది. ఈ వృక్షాలు మన దేశంలో కూడా అక్కడక్కడా కనిపిస్తున్నాయి. ఎవరో ఎపుడో తెచ్చినాటిన ఈ వృక్షాలు జిల్లాలోని గార్గేయ పురం వద్ద కూడా ఉన్నాయి. వాటిలోని ఒక వృక్షాన్ని ట్రీ ట్రాన్స్ లొకేషన్ పద్ధతిలో తీసుకు వచ్చి వైఎస్ఆర్ స్మృతివనంలో పునఃప్రతిష్టించారు. అశోక చెట్టు, ఆఫ్రీకన్ భారీ వృక్షం(అడెన్ సోనియా) సర్వమత వృక్షాలు.. వైఎస్ఆర్ స్మృతివనాన్ని బహుళ అభిరుచుల ఆలవాలంగా నెలకొల్పేందుకు నిర్మాణ కర్తలు కొన్ని కచ్చితమైన మార్గ దర్శనాలను అనుసరించారు. అందులో ఆధ్యాత్మిక ప్రశాంతత ఒకటి. జీవవైవిధ్యంతో పాటు హిందూ, క్రిష్టయన్, ఇస్లాం మత గ్రంథాల్లో , ప్రవచనాల్లో, పురాణాల్లో కనిపించిన, ప్రస్తావించిన మొక్కలను, వృక్షాలను చాలా మటుకు పవిత్ర వనంలో చేర్చారు. అందులో మహాశివుడి కళ్ల నుంచి పుట్టిందని చెప్పబడే రుద్రాక్ష, అమరకోశంలో ప్రస్తావించ బడిన పొగడ, మత్స్య పురాణంలో చెప్పబడిన శతావరి, మహాభారత, వాయు, వరాహ, వామన పురాణాలలో మహాభారత ఇతిహాసంలో కనపడే పారిజాతంతో పాటు ముస్లింలు దంతావధానానికి వినియోగించే మిష్వాక్, క్రిస్మస్ ట్రీకి పాకించే పిల్లి తీగల వంటి అనేక పౌరాణిక సంబంధ వృక్షజాతులను వైఎస్ఆర్ స్మృతివనంలోని పవిత్రవనంలో ఉంచారు. రుద్రాక్ష వృక్షం, ఎర్రచందన వృక్షం జన్మ నక్షత్రం.. వృక్ష సంబంధం ప్రతి మనిషికి జన్మించిన ఘడియలను బట్టి ఓ జన్మనక్షత్రం ఉండి తీరుతుంది. 27 నక్షత్రాలకు అనుసంధానమైన వృక్షాలను వైఎస్ఆర్ స్మృతివనంలో ఒక చోట చేర్చి దాన్ని నక్షత్రవనంగా నామకరణం చేశారు. తమ జన్మ నక్షత్రానికి అనుసంధానమైన వృక్షం కింద యోగా చేసుకుని మానసిక ప్రశాంతత పొందేందుకు ఎందరో ఇక్కడికి వస్తుంటారు. ఇవే కాకుండా ఆరు రాశులకు, సప్తరుషులకు, నవగ్రహాలకు కూడా ప్రత్యేక అనుసంధాన మొక్కలు వృక్షాలు, మొక్కలు వైఎస్ఆర్ స్మృతివనంలో ఉన్నాయి. స్మృతివనం సందర్శనకు వచ్చే పర్యాటకులు ఈ విషయాలు తెలుసుకుని కాసేపు ఇక్కడ సేద తీరి మానసిక ప్రశాంతతను పొందుతున్నారు. -
పర్యాటక కేంద్రంగా ఇడుపులపాయ
ప్రొద్దుటూరు : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ ఉన్న ఇడుపులపాయ ప్రాంతాన్ని రాష్ట్రంలోనే గొప్ప పర్యాటక కేంద్రంగా మార్చుతామని ఏపీ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఎండీ నరాల చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. ఆయన తన సిబ్బందితో కలిసి గురువారం ఇడుపులపాయ ప్రాంత పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడారు. గతంలో తాము శ్రీశైలం సమీపంలోని నల్లకాలువ వద్ద వైఎస్సార్ స్మృతివనాన్ని గొప్పగా అభివృద్ధి చేశామన్నారు. నిధుల మంజూరులో ఆలస్యం కావడంతో కొంత జాప్యం జరిగిందన్నారు. వైఎస్సార్ స్మృతివనానికి గూగుల్ రేటింగ్ 4.3గా ఉందన్నారు. గత వారంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి ఇడుపులపాయ అభివృద్ధి గురించి చర్చించామన్నారు. కేవలం వైఎస్ఆర్ ఘాట్ మాత్రమే కాకుండా పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేస్తే పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకుంటుందన్నారు. గతంలోనే ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభమైనా.. నిధులు లేని కారణంగా ఆగిపోయాయని తెలిపారు. ఇడుపులపాయ అభివృద్ధిలో భాగంగా రెస్టారెంట్, ఆట వస్తువులు, జిమ్, ఆడియో విజువల్ థియేటర్‌ను నిర్మించాలనే యోచనలో ఉన్నామన్నారు. పచ్చదనాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. సమీపంలో ఉన్న గండి క్షేత్రం, పాపాగ్ని నది, నెమళ్ల ప్రాజెక్టు, చుట్టూ ఉన్న కొండలు ఇడుపులపాయకు అదనపు ఆకర్షణగా నిలిచాయని తెలిపారు. మళ్లీ ఇడుపులపాయను సందర్శించిన తర్వాత నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. నిధులు మంజూరైన తర్వాత ప్రాజెక్టు పనులు చేపడుతామన్నారు. ఎప్పటిలోగా పనులు పూర్తవుతాయనే విషయంపై ఇప్పుడే అంచనాకు రాలేమని చెప్పారు. ఎండీ వెంట ప్రిన్సిపల్ ల్యాండ్ స్కేప్ ఆర్కెటెక్ బలరామిరెడ్డి, జనరల్ మేనేజర్లు శివరాం, బాలసుబ్రహ్మణ్యం, టూరిజం డిపార్ట్మెంట్ ఈఈ ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. -
మహానేత వైఎస్సార్‌కు కుటుంబం ఘన నివాళి
-
మహానేతకు తనయుడి ఘన నివాళి
సాక్షి, ఇడుపులపాయ: దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆయన కుటుంబసభ్యులు సోమవారం ఘనంగా నివాళులు అర్పించారు. నేడు వైఎస్సార్ 70వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయన తనయుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి రెడ్డి, వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే రవీంద్రారెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డితో పాటు పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అలాగే రైతు బాంధవుడు, వైఎస్సార్ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో రైతు దినోత్సవం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. -
దర్శనీయ ప్రాంతంగా ఇడుపులపాయ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్, ఎకో టూరిజం కేంద్రాన్ని పచ్చని ఉద్యానవనంలా ఆహ్లాదకర దర్శనీయ ప్రాంతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. గతంలో ఇడుపులపాయంలో ఎకోటూరిజం కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని రూపకల్పన చేసి మధ్యలో వదిలేశారని, దీన్ని ఇప్పుడు అభివృద్ధి చేయాలని సూచించారు. ఇందుకవసరమైన ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కర్నూలు జిల్లాలోని వైఎస్సార్ స్మృతివనం విశేషాలపై రూపొందించిన ‘మహానేతకు హరిత హారం’ (గ్రీన్ ట్రిబ్యూట్ టు ఎ గ్రేట్ లీడర్) పుస్తకాన్ని శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. 2009 సెప్టెంబర్ 2న వైఎస్ రాజశేఖరరెడ్డి హైదరాబాద్ నుంచి రచ్చబండలో పాల్గొనేందుకు చిత్తూరు జిల్లాకు వెళుతుండగా కర్నూలు జిల్లా ఆత్మకూరు అభయారణ్యంలో హెలికాప్టర్ కూలిపోయి మరణించడం తెలిసిందే. ఆయన స్మారక చిహ్నంగా నల్లకాలువ సమీపంలో వైఎస్సార్ స్మృతివనం ఏర్పాటు చేయాలని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించి నిధులు కేటాయించింది. వైఎస్సార్ స్మృతివనం ప్రాజెక్టు డైరెక్టర్‌గా అప్పట్లో పనిచేసిన ఎన్.చంద్రమోహన్‌రెడ్డి (ప్రస్తుతం ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్) చక్కటి ప్రణాళికతో స్మృతివనాన్ని అభివృద్ధిచేశారు. మొత్తం 3,500 ఎకరాల అభయారణ్యాన్ని వైఎస్సార్ స్మృతి వనంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అయితే అభయారణ్యంలో కట్టడాలు ఉండరాదన్న నిబంధన నేపథ్యంలో దీనిపక్కనే 22.20 ఎకరాల ప్రైవేటు భూమిని కొనుగోలు చేసి ఇందులో 20 అడుగుల ఎత్తయిన వైఎస్సార్ విగ్రహం, బయో డైవర్సిటీ పార్కు, వాటర్ ఫౌంటెన్లు, ఉద్యానవనాలు, బటర్‌ఫ్లై పార్కు లాంటివి ఏర్పాటు చేశారు. ఐదంతస్తులతో వ్యూపాయింట్ కూడా నిర్మించారు. మొత్తం పార్కుతోపాటు వైఎస్సార్ మరణించిన కొండ కూడా కనిపించేలా వ్యూపాయింట్‌ను రూపొందించారు. ఈ వివరాలన్నింటితో దివంగత ముఖ్యమంత్రికి నివాళిగా ఈ పుస్తకాన్ని రూపొందించినట్లు ఎన్.చంద్రమోహన్‌రెడ్డి ముఖ్యమంత్రికి వివరించారు. దీన్ని మరింత అభివృద్ధి చేయాల్సి ఉందని, ఇందుకు రూ.10 కోట్లు అవసరమన్నారు. అన్ని అంశాలను ఆసక్తిగా విన్న సీఎం జగన్ తాను స్మృతివనాన్ని సందర్శించానని, చాలా బాగా అభివృద్ధి చేశారని ప్రశంసించారు. ఇదేతరహాలో ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్, ఎకో టూరిజం ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని సూచించారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ధనుంజయరెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీరు బలరామిరెడ్డి కూడా పాల్గొన్నారు. -
మహానేతకు నివాళులు అర్పించిన వైఎస్ జగన్
-
ఇడుపులపాయ చేరుకున్న వైఎస్ జగన్
-
కడప సీఎస్ఐ చర్చిలో వైఎస్ జగన్ ప్రార్థనలు
-
మహానేత ఆశీస్సులు తీసుకున్న వైఎస్ జగన్
సాక్షి, ఇడుపులపాయ: మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డి ఘనంగా నివాళులు అర్పించి ఆశీర్వాదం పొందారు. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ సమాధిపై పూలమాల వేసి ఆయన కొద్దిసేపు మౌనంగా ప్రార్థనలు చేశారు. జగన్‌తో పాటు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పలువురు పార్టీ నేతలు ఉన్నారు. అంతకు ముందు ఇడుపులపాయ చేరుకున్న జననేతకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. వైఎస్ జగన్‌ను కలుసుకునేందుకు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. వారందరికీ అభివాదం చేస్తూ ఆయన ముందుకు కదిలారు. అంతకు ముందు జగన్ పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఇక సాయంత్రం ఇడుపులపాయ నుంచి హెలికాప్టర్లో కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ బయల్దేరి వెళతారు. కాగా వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయతో వైఎస్ఆర్ కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉంది. ఇడుపులపాయ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఇష్టమైన తన వ్యవసాయ భూమి ఉన్న ప్రాంతం. ఇప్పుడు ఆయన సమాధి ఉన్న నేల అది. అందుకే జగన్ ఏ కార్యక్రమం తలపెట్టినా ఇడుపులపాయ కేంద్రం అవుతోంది. అక్కడ వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించి తండ్రి ఆశీర్వాదం తీసుకున్న తర్వాతే తొలి అడుగు వేయడం జగన్మోహన్రెడ్డికి ఆనవాయితీగా మారింది. గురువారం విజయవాడలో 'జగన్ అనే నేను' అంటూ.. ప్రమాణస్వీకారం చేసి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తున్న సందర్భంగా ఆయన తండ్రి వైఎస్ఆర్ ఆశీస్సులు తీసుకుంటున్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : మహానేతకు నివాళులు అర్పించి వైఎస్ జగన్ -
సీఎస్ఐ చర్చిలో వైఎస్ జగన్ ప్రార్థనలు
సాక్షి, పులివెందుల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, నిశ్చయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ జిల్లా పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీతో గెలుపొందడంతో చర్చి పాస్టర్లు జగన్‌ను ఆశ్వీరదించారు. కడప నుంచి పులివెందుల చేరుకున్న ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. వైఎస్ జగన్‌తో పాటు ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ప్రార్థనల్లో పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం ఇడుపులపాయకు చేరుకుని తన తండ్రి, దివంగత నేత వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పిస్తారు. సాయంత్రం తిరిగి విజయవాడ చేరుకోనున్నారు. కాగా అంతకు ముందు తిరుపతి నుంచి కడప చేరుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్ద దర్గాను సందర్శించారు. ఆయనకు పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, దర్గా పీఠాధిపతి ఘన స్వాగతం పలికారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : కడప సీఎస్ఐ చర్చిలో వైఎస్ జగన్ ప్రార్థనలు -
రేపు తిరుమల వెళ్లనున్న వైఎస్ జగన్
-
రేపు తిరుమలకు వైఎస్ జగన్
సాక్షి, తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్రెడ్డి తిరుమల వెళ్లనున్నారు. ఈనెల 28వ తేదీ (మంగళవారం) సాయంత్రం 5 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో ఆయన తిరుమలకు బయలుదేరి వెళతారు. సాయంత్రం ఏడు గంటలకు తిరుమలకు చేరుకుంటారు. రాత్రికి తిరుమలలో బసచేసి 29వ తేదీ ఉదయం స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం వైఎస్సార్ జిల్లాలోని ఇడుపులపాయకు చేరుకుని దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధికి నివాళులర్పించి ఆశీస్సులు తీసుకుంటారు. అనంతరం కడప పెద్ద దర్గాను దర్శించి ఆశీస్సులు పొందుతారు. ఆ తర్వాత తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. 30వ తేదీ మధ్యాహ్నం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : రేపు తిరుమల వెళ్లనున్న వైఎస్ జగన్ టీటీడీ పాలకమండలిని రద్దు చేయాలి కాగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న వైఎస్ జగన్ శ్రీవారిని దర్శించుకోనున్నట్లు జీడీ నెల్లూరు ఎమ్మెల్యే నారాయణ స్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం రద్దు అయిన వెంటనే నామినేటెడ్ పోస్ట్‌ల్లో ఉన్నవారు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే టీడీపీ పాలకమండలిని కూడా వెంటనే రద్దు చేయాలని, వారు తమ పదవులుకు రాజీనామా చేయాలన్నారు. అలాగే రేపు ఉదయం జరిగే పాలకమండలి సమావేశాన్ని కూడా రద్దు చేయాలని నారాయణస్వామి అన్నారు. రాజీనామా చేసిన రాఘవేంద్రరావు శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ పదవికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రాజీనామా చేశారు. వయోభారం వల్ల చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్టు ఆయన తెలిపారు. టీటీడీ యాజమాన్యానికి, సిబ్బందికి ఆ తిరుమలేశుడి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. తనకు ఇన్నాళ్లు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన వైఎస్ జగన్
-
మహానేతకు వైఎస్ జగన్ ఘన నివాళి
వేంపల్లె : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఉదయం ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు. పులివెందుల నుంచి రోడ్డు మార్గాన ఉదయం 9 గంటలకు ఆయన ఇడుపులపాయకు చేరుకున్నారు. వైఎస్సార్ సమాధి వద్ద పూలమాల వేసి కొద్దిసేపు శ్రద్ధాంజలి ఘటించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేశారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అనంతరం వేంపల్లె మీదుగా రోడ్డు మార్గాన కడప విమానాశ్రయం చేరుకుని స్పెషల్ ఫ్లైట్‌లో ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. ఆయన పర్యటనలో కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కొరముట్ల శ్రీనివాసులు, శ్రీకాంత్‌రెడ్డి, అంజాద్బాష, ఎమ్మెల్యే అభ్యర్థులు వెంకటసుబ్బయ్య, సుధీర్‌రెడ్డి, మేయర్ సురేష్‌బాబు, చక్రాయపేట మండల ఇన్చార్జి వైఎస్ కొండారెడ్డి, రైతు విభాగపు జిల్లా అధ్యక్షుడు ఎస్.ప్రసాద్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ఎస్ఎఫ్ బాషా, మండల కన్వీనర్ చంద్ర ఓబుళరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు షబ్బీర్‌వలి, మాజీ ఎంపీపీ కొండయ్య, పాస్టర్ రవికుమార్, మైనార్టీ కన్వీనర్ మునీర్, నాయకులు రుద్రభాస్కర్‌రెడ్డి, రామగంగిరెడ్డి, ప్రసాద్‌రెడ్డి, షేక్షావలి, మునేష్, రామాంజనేయరెడ్డి తదితరులున్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
విలువలు, విశ్వసనీయతకు పట్టం కట్టాలి: వైఎస్ విజయమ్మ
సాక్షి, వైఎస్సార్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ శుక్రవారం ఉదయం ఇడుపులపాయలోని దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించారు. అనంతరం విజయమ్మ మీడియాతో మాట్లాడుతూ.. ‘వైఎస్సార్ పాలనతో పోల్చినప్పుడు ప్రస్తుత పాలన చూస్తే చాలా బాధ వేస్తుంది. రాజన్న పాలన మళ్లీ చూడాలంటే అది వైఎస్ జగన్‌తోనే సాధ్యమని నమ్ముతాను. ఈ పదేళ్ల పాటు వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబం మధ్య కంటే ప్రజలతోనే ఎక్కువ మమేకమై ఉన్నారు. ప్రజాసంకల్పయాత్రలో ప్రజల కష్టాలు చూశాడు.. విన్నాడు. ప్రతి ఒక్కరికి నేనున్నానే భరోసా ఇచ్చాడు. విలువలకు, విశ్వసనీయతకు ప్రజలు పట్టం కట్టాలి. తాను చేసిన అభివృద్ధి కూడా చెప్పుకోలేని చంద్రబాబు.. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు వైఎస్ జగన్ జపం చేస్తున్నార’ని తెలిపారు. నేడు ప్రకాశం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో విజయమ్మ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు కందుకూరులో జరిగే ప్రచార సభలో ఆమె పాల్గొన్ని ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు కనిగిరిలో జరిగే సభలో విజయమ్మ పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు మార్కాపురంలో జరిగే ప్రచార సభలో పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రికి విజయమ్మ మర్కాపురంలోనే బస చేస్తారు. శనివారం ఉదయం 10 గంటలకు యర్రగొండపాలెంలో జరిగే ఎన్నికల ప్రచార సభలో విజయమ్మ పాల్గొననున్నారు. -
ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్‌కు వైఎస్ జగన్
-
వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ జగన్ నివాళి
సాక్షి, ఇడుపులపాయ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కొద్దిసేపటి క్రితం ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించారు. వైఎస్ విగ్రహానికి కూడా పూలమాల వేసి అంజలి ఘటించారు. తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి అంత్యక్రియలు ముగిసిన తర్వాత వైఎస్ జగన్.. నేరుగా ఇడుపులపాయకు వెళ్లారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద కాసేపు గడిపారు. మరికాసేపట్లో వైఎస్ జగన్ ఇడుపులపాయ నుంచి హైదరాబాద్ బయలుదేరనున్నారు. ఈ సాయంత్రం వైఎస్ జగన్ నేతృత్వంలోని పార్టీ ప్రతినిధి బృందం రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలవనుంది. మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో సహా టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రాజకీయ హత్యలను, రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతల అంశాన్ని గవర్నర్ దృష్టికి ప్రతినిధి బృందం ఈ సందర్భంగా తీసుకెళ్లనుంది. -
పెద్దాయన ఆశీర్వాదం తీసుకున్నా : మేడా
సాక్షి, వైఎస్సార్ కడప : రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద బుధవారం నివాళులర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు మేడా మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ఈ నెల 31 హైదరాబాద్‌లోని కేంద్రకార్యాలయంలో తన అనుచరులతో కలిసి పార్టీలో చేరుతున్నట్టు వెల్లడించారు. ప్రజలకు సేవ చేసే వాళ్లకు టీడీపీలో స్థానం లేదని మల్లికార్జున రెడ్డి వాపోయారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. ఆ మహా నేతకు నివాళులర్పించి ఆశీర్వాదం తీసుకున్నానని తెలిపారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు నడుచుకుంటానని, వచ్చే ఎన్నికల్లో రాజంపేటలో వైఎస్సార్సీపీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. -
పోటెత్తిన పులివెందుల
సాక్షి ప్రతినిధి కడప: పద్నాలుగు నెలలపాటు జరిగిన ప్రజాసంకల్ప యాత్రను విజయవంతంగా ముగించుకుని తిరిగి సొంత నియోజకవర్గం వైఎస్సార్ జిల్లా పులివెందులకు వచ్చిన రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసేందుకు స్థానిక ప్రజలు పోటెత్తారు. తండోపతండాలుగా తరలివచ్చారు. అసలే పులివెందులకు ముద్దబిడ్డ.. మధ్యలో హత్యాయత్నం ఘటన.. ఆపై పద్నాలుగు నెలల నిరీక్షణ అనంతరం ఆయన రాకతో మిద్దె, మేడా, చెట్టు, పుట్ట అనే తేడా లేకుండా జనం ఎగబడ్డారు. పట్టణంలోని సీఎస్ఐ చర్చికి వైఎస్ జగన్ వెళ్తున్నారని తెలుసుకున్న పులివెందుల వాసులు అధిక సంఖ్యలో చేరుకోవడంతో ఇసుకేస్తే రాలనట్లుగా ప్రధాన రహదారి కిక్కిరిసిపోయింది. ఆర్టీసీ బస్టాండ్ నుంచి సీఎస్ఐ చర్చి వరకు భారీగా ప్రజానీకం చేరుకున్నారు. దీంతో అభిమాన తరంగానికి ముగ్థుడైన జననేత తన వాహనం నుంచి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. దారిపొడవునా చిరునవ్వులతో పలకరిస్తూ చర్చికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున బాణాసంచా పేలుస్తూ, భారీ ఊరేగింపు చేపట్టారు. అప్పటికే చర్చికి చేరుకున్న వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతీరెడ్డి, వైఎస్ ప్రమీలమ్మ, వైఎస్ ప్రకాష్‌రెడ్డి, వైఎస్ ప్రతాప్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, వైఎస్ మధుసూధనరెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, నర్రెడ్డి శివప్రకాష్‌రెడ్డి, వైఎస్ అభిషేక్‌రెడ్డి తదితర వైఎస్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం అక్కడ నుంచి గండి ఆంజనేయస్వామి దర్శనానికి బయల్దేరారు. అభిమానులు అడుగుడుగునా కాన్వాయ్‌ని ఆపడంతో ఎంతో ఓపిగ్గా వారిని పలకరిస్తూ యోగక్షేమాలు తెలుసుకుంటూ ముందుకు కదిలారు. ఈ క్రమంలో బెస్తవారిపల్లె సమీపంలో ఉన్న మదరసా విద్యార్థులు, అక్కడి ముస్లిం మతపెద్దలు రోడ్డుపైకి వచ్చి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్మించిన మదరసాలోకి వచ్చి వెళ్లాలని అభ్యర్థించారు. వారి ఆహ్వానాన్ని మన్నించిన వైఎస్ జగన్ లోపలికి వెళ్లగా మతపెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. గండి అంజన్నను దర్శించుకున్న వైఎస్ జగన్ అక్కడ నుంచి ప్రసిద్ధ గండి క్షేత్రంలోని ఆంజనేయస్వామిని వైఎస్ జగన్మోహన్రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, పూజారులు పూర్ణఫలంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గండి దేవస్థానం ప్రధాన అర్చకులు విశేషపూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో గండి ఆంజన్న ఆశీస్సులు పొందిన ఆయన అక్కడ నుంచి ఇడుపులపాయకు బయల్దేరారు. 14 నెలల అనంతరం వైఎస్సార్ ఘాట్‌కు.. ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభించే ముందు 2017 నవంబరు 6న తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన వైఎస్ జగన్.. పాదయాత్ర ముగింపు అనంతరం, 14 నెలలు తర్వాత శనివారం కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులతో కలిసి మరోసారి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అప్పట్లో తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని అక్కడ నుంచి నేరుగా కడప పెద్దదర్గా, పులివెందుల సీఎస్ఐ చర్చి, గండి క్షేత్రంలో ప్రార్థనలు నిర్వహించారు. పాదయాత్ర ముగిశాక అదే క్రమంలో తిరిగి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కాగా, ఇడుపులపాయలో శనివారం చేపట్టిన ప్రార్థనల్లో తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి షర్మిలమ్మ, సతీమణి వైఎస్ భారతీరెడ్డి, మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, శెట్టిపల్లె రఘురామిరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, ఎస్బి అంజాద్‌బాషా, రాజంపేట, కడప పార్లమెంటు అధ్యక్షులు ఆకేపాటి అమర్నాథరెడ్డి, కె సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, కమలాపురం సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి తదితరులు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసిన వారిలో ఉన్నారు. వైఎస్సార్సీపీలోకి భారీగా వలసలు ఇదిలా ఉంటే.. రాష్ట్రంలోని ప్రకాశం, అనంతపురం, వైఎస్సార్ జిల్లాలలోని అనేకమంది నాయకులు వందలాది వాహనాల్లో తరలివచ్చి వైఎస్సార్సీపీలో చేరారు. ప్రకాశం జిల్లాలోని కనిగిరి వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి భారీగా వచ్చి చేరారు. ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ గఫార్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు శ్రీరాం సతీష్, రాష్ట్ర ముదిరాజు సంఘ ప్రధాన కార్యదర్శి ఈర్ల గురవయ్య, రాష్ట్ర నాయీ బ్రాహ్మణ గౌరవాధ్యక్షులు చింతలపూడి వెంకటేశ్వర్లు తదితరులతోపాటు వందలాది మంది కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరాయి. వైఎస్ జగన్ అందరికీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్సార్ జిల్లా రాయచోటి, జమ్మలమడుగు, కమలాపురం నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు భారీ కాన్వాయ్‌తో వచ్చి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సంబేపల్లె మాజీ జెడ్పీటీసీ, టీడీపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు జి.ఉపేంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, ఎంపీటీసీ లక్ష్మీదేవమ్మ తదితరులూ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు చిదంబరరెడ్డి, వెంకటరమణారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ ఆవుల విష్ణువర్థన్‌రెడ్డిలు కూడా ఉన్నారు. అలాగే, జమ్మలమడుగు నియోజకవర్గం ఇన్చార్జి డాక్టర్ సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 100కు పైగా వాహనాల్లో వచ్చి పార్టీలో చేరారు. మాజీమంత్రి శిల్పా మోహన్‌రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ పీపీ నాగిరెడ్డి పాల్గొన్నారు. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, సమన్వయకర్త మల్లికార్జునరెడ్డి నేతృత్వంలో కూడా మాజీ ఎంపీపీ శివరామిరెడ్డి తన అనుచరులతో చేరారు. అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి దాదాపు 200 వాహనాల్లో తన అనుచరులతో ఇడుపులపాయ వచ్చారు. మాజీ జెడ్పీటీసీ శ్రీకాంత్‌రెడ్డి, పలువురు కార్పొరేటర్లు కూడా వందలాది తమ అనుచరులతో పార్టీలో చేరారు. మీ ఆశీస్సులు ఎల్లప్పుడు తోడుండాలి: వైఎస్ జగన్ కాగా, పులివెందుల సీఎస్ఐ చర్చిలో ప్రార్థనల సందర్భంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభించే ముందు రోజు మీ అందరి దీవెనలు, ప్రార్థనలవల్లే దాదాపు 3650 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయగలిగానని చెప్పారు. కలకాలం మీ ఆశీస్సులు, ప్రార్థనలు నాకు, మా కుటుంబానికి తోడుండాలని ఆకాంక్షించారు. -
వైఎస్ఆర్ ఘాట్‌లో కుటుంబ సభ్యుల ప్రార్ధనలు
-
ఏసు ఆశీస్సులు ప్రజలందరికీ అందాలి : వైఎస్ విజయమ్మ
వేంపల్లె: ఏసు ప్రభువు ఆశీస్సులు ప్రజలందరికీ అందాలని వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆకాంక్షించారు. సోమవారం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో కుటుంబసభ్యులతో కలిసి ఆమె సెమీ క్రిస్మస్ వేడుక ల్లో పాల్గొన్నారు. వైఎస్ విజయమ్మ, కుమార్తె షర్మిల, మనుమడు రాజారెడ్డి, మనుమరాలు అంజలి, వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ రవీంద్రనాథరెడ్డి, ఆయన సతీమణి వైఎస్ జయమ్మ, వైఎస్ సుధీకర్‌రెడ్డి, సోదరి వైఎస్ విమలమ్మ, దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, వైఎస్ సునీల్‌రెడ్డి, వైఎస్ ప్రతాప్‌రెడ్డి, వైఎస్ థామస్‌రెడ్డి, వైఎస్ వివేకా సతీమణి వైఎస్ సౌభాగ్యమ్మ, వైఎస్ మనోహర్‌రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి, కమలాపురం నియోజక సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి ఇడుపులపాయకు వచ్చారు. సోమవారం ఉదయం వైఎస్సార్ ఘాట్‌లో మహానేత, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ విజయమ్మ తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆమె క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యంగా వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిలను ప్రేమించే వారందరిని కూడా ఏసు ప్రభువు సంతోషం, ప్రేమ, సమాధానం అందించాలని కోరుకుంటున్నానని తెలిపారు. అనంతరం నెమళ్ల పార్కు పక్కనున్న ఓపెన్ ఎయిర్ చర్చిలో జరిగిన సెమీక్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. పాస్టర్ బెనహర్, నరేష్‌ల ఆధ్వర్యంలో వైఎస్ కుటుంబసభ్యులు, బంధువులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
మహానేత వైఎస్సార్‌కు ఘన నివాళి
-
వైఎస్సార్‌కు కుటుంబసభ్యులు ఘన నివాళి
-
మహానేత వైఎస్సార్‌కు ఘన నివాళి
సాక్షి,ఇడుపులపాయ : దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తొమ్మిదో వర్థంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయన కుటుంబసభ్యులు ఆదివారం ఉదయం ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్సార్ సతీమణి విజయమ్మ, కోడలు వైఎస్ భారతి, కుమార్తె షర్మిల, అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్, ఇతర కుటుంబ సభ్యులతోపాటు వైఎస్సార్సీపీ నేతలు వైఎస్ సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. నివాళులు అర్పించినవారిలో మాజీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, అంజాద్ బాషా, కడప మేయర్ సురేష్ బాబు, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి తదితరులు ఉన్నారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్సార్‌కు నివాళులర్పించేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఈ సందర్భంగా మహానేత సేవలను, ప్రజాసంక్షేమ పథకాలను గుర్తుచేసుకున్నారు. వైఎస్సార్ కారణజన్ముడు: వైఎస్ విజయమ్మ దివంగత మహానేత వైఎస్సార్ ఒక కారణజన్ముడని, ఆయన చేసిన కార్యక్రమాలు, పథకాలు కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోయాయని వైఎస్సార్ సతీమణి, వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ సమాధి వద్ద నివాళులర్పించిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ రాజశేఖరరెడ్డిగారు ఇవాళ దేవుడి దగ్గర ఉన్నారు. ఆయన చేసిన కార్యక్రమాలు ప్రజల గుండెల్లో ఉన్నాయి. ఆయన నిజంగా ఒక కారణజన్ముడు. ఆయన వచ్చి.. చేయాల్సిన కార్యాలన్నీ చేసి.. దేవుడి దగ్గరికి వెళ్లిపోయారు. వైఎస్సార్ ఆశయాలను కాపాడేందుకు జగన్‌బాబు ప్రజాసంకల్పయాత్రలో ప్రజలందరి దగ్గరకు వస్తున్నారు. ఆయనను ఆశీర్వదించండి. జగన్ ప్రజలందరికీ అండగా ఉంటాడు. మీ అందరికి ఒక అన్నగా, తమ్ముడిగా, ఒక మనవడిగా కాపాడుతాడు. రాజశేఖరరెడ్డి రాజ్యాన్ని మరల తెచ్చుకుందాం. వైఎస్ జగన్‌కు అండగా నిలువండి’ అని విజయమ్మ విజ్ఞప్తి చేశారు. -
వైఎస్ఆర్ ఘాట్‌కు చేరుకున్న వైఎస్ జగన్
-
మహానేతకు కుటుంబసభ్యుల నివాళులు..
-
నామినేషన్ ముందు వైఎస్సార్‌కు వైఎస్ వివేకా నివాళి
-
వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ జగన్ నివాళులు
-
నేడు మహానేత వైఎస్సార్ ఆరో వర్ధంతి
కడప: నేడు దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరో వర్ధంతి కార్యక్రమాన్ని వైఎస్సార్ ఘాట్ వద్ద నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయకు చేరుకున్నారు. వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ జగన్, ఇతర కుటుంబసభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. -
పెద్దాయనకు కుటుంబ సభ్యుల నివాళి
ఇడుపులపాయ: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆయన కుటుంబ సభ్యులు బుధవారం ఘనంగా నివాళులు అర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ఆర్ సతీమణి వైఎస్ విజయమ్మతో పాటు కుమార్తె షర్మిల, కోడలు వైఎస్ భారతి, అల్లుడు బ్రదర్ అనిల్‌కుమార్‌తో పాటు పలువురు అంజలి ఘటించారు. అంతకు ముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు ఎంపీ అవినాష్ రెడ్డి కూడా వైఎస్ఆర్ ఘాట్ సందర్శించి మహానేతకు నివాళులు అర్పించారు. -
వైఎస్ఆర్ కి వైఎస్ జగన్ నివాళి
-
తండ్రికి తనయుడి ఘన నివాళి..
ఇడుపులపాయ : దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. బుధవారం ఉదయం ఇడుపులపాయ చేరుకున్న ఆయన .. వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వైఎస్ఆర్ సమాధి వద్ద కొద్దిసేపు మౌనంగా ప్రార్థించారు. వైఎస్ జగన్ వెంట ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారు. కాగా వైఎస్ జగన్ కుటుంబ సభ్యులతో కలిసి నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలులో బయలుదేరి ఈరోజు ఉదయం ఎర్రగుంట్లకు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ఇడుపులపాయకు వెళ్లారు. మధ్యాహ్నం వరకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో గడపనున్నారు. అనంతరం ఇటీవల చక్రాయపేట మండలం దేవరగట్టుపల్లెలో గుండె పోటుతో మృతి చెందిన వైఎస్ఆర్ సీపీ మండల యూత్ కన్వీనర్ వెంకటసుబ్బయ్య సోదరుడు నాగభూషణం కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఆ తర్వాత వైఎస్ జగన్ పులివెందులకు చేరుకుంటారు. 25వ తేదీన (గురువారం) ఉదయం పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం నుంచి వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. -
ఇడుపులపాయలో వైఎస్ఆర్ కు వైఎస్ జగన్ నివాళి
-
మహానేతకు కుటుంబ సభ్యుల ఘన నివాళి
-
వైఎస్ఆర్కు కుటుంబ సభ్యుల ఘన నివాళి
-
వైఎస్ఆర్కు కుటుంబ సభ్యుల ఘన నివాళి
ఇడుపులపాయ : దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అయిదో వర్థంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు మంగళశారం ఉదయం ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ, కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కోడలు వైఎస్ భారతి, కుమార్తె షర్మిల ఇతర కుటుంబ సభ్యులతో పాటు పార్టీ నేతలు వైఎస్ సమాధి వద్ద అంజలి ఘటించారు. నివాళులు అర్పించినవారిలో వైఎస్ వివేకనందరెడ్డి, వైఎస్ విమలమ్మ, వైఎస్ సుధాకర్ రెడ్డి, వైఎస్ పురుషోత్తమరెడ్డి, వైఎస్ ప్రకాష్ రెడ్డి, బ్రదర్ అనిల్ కుమార్, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, మేయర్ సురేష్ బాబు తదితరులు ఉన్నారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మరోవైపు వైఎస్ వర్థంతిని పురస్కరించుకుని పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు నాయకులు ఏర్పాట్లు చేశారు. అంతే కాకుండా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ ను ప్రత్యేకంగా అలంకరించటంతో పాటు వచ్చే అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. -
మహానేతకు జగన్, విజయమ్మ నివాళులు
-
మహానేతకు జగన్, విజయమ్మ నివాళులు
ఇడుపులపాయ : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ, కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వైఎస్ఆర్ ఘాట్ లోని ఆయన సమాధి వద్ద అంజలి ఘటించారు. కాగా సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం(వైఎస్సార్ సీఎల్పీ) తొలిసారి బుధవారం సమావేశం కానుంది. ఇందుకోసం ఇడుపులపాయలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సమావేశంలో పార్టీ శాసనసభా పక్ష నేతను ఎన్నుకోనున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం శాసనసభలో నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ సమావేశంలో నేతలకు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు.ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్ర ఏర్పాటు, ఎదురయ్యే సమస్యలు, సవాళ్ల నేపథ్యంలో గట్టి ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ ప్రజల పక్షాన నిలవాలన్నదే సమావేశం ప్రధాన ఎజెండాగా నిర్ణయించారు. సభలో ఏకైక ప్రతిపక్షంగా ఉన్న నేపథ్యంలో భవిష్యత్తులో మరింత గట్టిగా ప్రజల పక్షాన పోరాటాలు చేయాలన్న ఆలోచనలో పార్టీ నేతలున్నారు. -
మహానేతకు జగన్, షర్మిళ ఘన నివాళి
-
YSRCP ప్లీనరీకు ఏర్పాట్లు పూర్తి
-
మహానేతకు జగన్ ఘన నివాళి
మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘన నివాళులర్పించారు. ఆదివారం ఉదయం ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఆ మహానేత సమాధికి జననేత జగన్ తో పాటు ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, షర్మిల తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మరికాసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండవ ప్లీనరీ సమావేశం ప్రారంభం కానుంది. తొలుత వైఎస్ రాజశేఖరరెడ్డి, మృతి చెందిన పార్టీ నేతలకు సంతాప ప్రకటన చేయనున్నారు. ఆపై వైఎస్ విజయమ్మ ప్రారంభోపన్యాసం చేస్తారు. అనంతరం షర్మిల ప్రసంగించనున్నారు. -
మహానేతకు నివాళులర్పించిన వైఎస్ కుటుంబ సభ్యులు
దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆయన కుటుంబసభ్యులు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‌లో మంగళవారం ఉదయం ఘనంగా నివాళులు ఆర్పించారు. ఆ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ భారతి, వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్లతోపాటు ఇతర కుటుంబసభ్యులు పాల్గొన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం ఇడుపులపాయ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా వైఎస్ రాజశేఖరరెడ్డికి ఘనంగా నివాళులు ఆర్పించారు. -
తండ్రి సమాధి వద్ద జగన్ ప్రత్యేక ప్రార్థనలు
ఇడుపులపాయ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం ఇడుపులపాయలోని తన తండ్రి వైఎస్ సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనంతరం జగన్, ఆయన సతీమణి భారతి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. జగన్ రాక సందర్భంగా అక్కడకు వచ్చిన పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలను ఆయన పేరు పేరునా పలకరించారు. అనంతరం పులివెందుల బయల్దేరారు. కాగా సుదీర్ఘ విరామం తర్వాత జిల్లాకు వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో ఎర్రగుంట్లలో దిగిన ఆయన అక్కడ నుంచి ఇడుపులపాయ చేరుకున్నారు. -
వైఎస్ఆర్ ఘాట్ వద్ద జగన్, భారతి ప్రార్థనలు
-
తండ్రికి నివాళులు అర్పించిన జగన్