మహానేతకు కుటుంబ సభ్యుల ఘన నివాళి | YSR's family members pay grand tribute to YSR at Idupulapaya | Sakshi
Sakshi News home page

మహానేతకు కుటుంబ సభ్యుల ఘన నివాళి

Published Tue, Aug 6 2013 10:58 AM | Last Updated on Fri, Sep 1 2017 9:41 PM

మహానేతకు కుటుంబ సభ్యుల ఘన నివాళి

మహానేతకు కుటుంబ సభ్యుల ఘన నివాళి

ఇడుపులపాయ : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్న షర్మిలతో పాటు కుటుంబ సభ్యులు ఈరోజు ఉదయం ఇడుపులపాయ చేరుకున్నారు. వైఎస్ఆర్ ఘాట్ సందర్శించి అక్కడ ప్రార్ధనలు జరిపారు. ఈ కార్యక్రమంలో షర్మిలతో పాటు  బ్రదర్ అనిల్‌, వైఎస్ విజయమ్మ, జగన్ సతీమణి వైఎస్ భారతి,  వైఎస్ వివేకానందరెడ్డి తదితరులు ఉన్నారు.
 
ప్రజల కష్టాలు తెలుసుకుంటూ, బాధలు పంచుకుంటూ షర్మిల 3112 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు . ఈ నెల 4న శ్రీకాకుళంజిల్లా ఇచ్ఛాపురంలో మరోప్రజాప్రస్థానం ముగిసింది. అనంతరం హైదరాబాద్‌ వచ్చిన షర్మిల నేరుగా చంచల్‌గూడలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలిశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement