సాక్షి, వైఎస్సార్ కడప : రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద బుధవారం నివాళులర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు మేడా మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ఈ నెల 31 హైదరాబాద్‌లోని కేంద్రకార్యాలయంలో తన అనుచరులతో కలిసి పార్టీలో చేరుతున్నట్టు వెల్లడించారు.
ప్రజలకు సేవ చేసే వాళ్లకు టీడీపీలో స్థానం లేదని మల్లికార్జున రెడ్డి వాపోయారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. ఆ మహా నేతకు నివాళులర్పించి ఆశీర్వాదం తీసుకున్నానని తెలిపారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు నడుచుకుంటానని, వచ్చే ఎన్నికల్లో రాజంపేటలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment