meda mallikarjuna reddy
-
ఒంటిమిట్టలో మార్మోగిన రామనామ స్మరణ
ఒంటిమిట్ట: ఆంధ్రా భద్రాద్రిగా విరాజిల్లుతున్న వైఎస్సార్ జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి ఆలయంలో గురువారం శ్రీరామనవమి సందర్భంగా రామనామ స్మరణ మార్మోగింది. టీటీడీ డిప్యూటీ ఈవో నటేష్‌బాబు ఆధ్వర్యంలో రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి సతీసమేతంగా శ్రీకోదండరామస్వామికి ప్రభుత్వ లాంఛనాలతో పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఎమ్మెల్యే అందజేసిన ముత్యాల తలంబ్రాలను స్వామి కల్యాణవేదిక వద్ద తలంబ్రాలలో కలిపారు. అనంతరం స్వామి స్నపన తిరుమంజనంలో ఎమ్మెల్యే మేడా దంపతులు పాల్గొన్నారు. రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు, జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి దంపతులు.. ఆర్టీసీ చైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, పెన్నా సిమెంట్స్ అధినేత వేణుగోపాల్‌రెడ్డి తదితరులు స్వామిని దర్శించుకుని గర్భాలయంలోని మూలమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీరామనవమి కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా తాగునీరు, అన్నప్రసాదం, క్యూలైన్ల వంటి ఏర్పాట్లు టీటీడీ చేసింది. శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ ఏకశిలానగరి (ఒంటిమిట్ట)లో శ్రీ కోదండరామస్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు గురువారం శ్రీరామనవమి సందర్భంగా ఆలయ టీటీడీ డిప్యూటీ ఈవో నటేష్‌బాబు ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. శుక్రవారం ధ్వజారోహణ చేయనున్నారు. -
సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా: మేడా మల్లికార్జునరెడ్డి
సాక్షి, రాజంపేట (అన్నమయ్య): మనసున్న ముఖ్యమంత్రి అని వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి నిరూపించుకున్నారని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి అన్నారు. గురువారం తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ చెయ్యేరులో వరద బీభత్సానికి సర్వం కోల్పోయిన వారికి ఇంటి స్థలంతోపాటు, ఇంటి నిర్మాణానికి అదనంగా రూ.5లక్షలు మంజూరు చేయాలని సీఎంను కోరామన్నారు. దీంతో ఒక్కో ఇంటికి రూ.5లక్షలు పెంచుతూ ప్రభుత్వం జీఓ జారీ చేసిందన్నారు. ఇందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లు వివరించారు. పులపుత్తూరులో మొదటి లే అవుట్లో 160, రెండవ లే అవుట్లో 101, మూడవ లే అవుట్లో 62, తొగురుపేటలో 69, రామచంద్రాపురంలో 56 ఇళ్లను మంజూరు చేశారని ఎమ్మెల్యే తెలిపారు. రాజంపేట నుంచి ఏ కార్యాలయం తరలింపు లేదు పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రం రాజంపేట నుంచి ఏ కార్యాలయం తరలించేది లేదని ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి స్పష్టంచేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పీసీ యోగీశ్వరరెడ్డి, ఏరియా హాస్పిటల్ డైరెక్టర్ ఉమామహేశ్వరరెడ్డి, మాజీ చైర్మన్ పోలి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మేడాకు బ్రహ్మరథం పట్టిన ప్రజలు,అభిమానులు
-
రాజంపేట: రీపోలింగ్ జరగాలి
సాక్షి, రాజంపేట: రాజంపేట మండలం లోని వైబీఎన్పల్లె, డీబీఎన్పల్లె, శవనవారిపల్లె, కొల్లావారిపల్లె, మిట్టమీదపల్లెలోని 170, 172, 171, 196,199, 192,193 పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగి, తమకు అనుకూలంగా మలుచుకున్నారని, అందువల్ల వాటిలో రీపోలింగ్ నిర్వహిం చాలని వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థి మేడా మల్లికార్జునరెడ్డి విన్నవించారు. పార్టీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డితో కలిసి అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలలో ఆర్ఓ నాగన్నకు వినతిపత్రం అందచేశారు. ఈసందర్భంగా మేడా మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతవరణంలో వినియోగించుకోలేకపోయారంటే ఇందులో పోలీసులు వైఫల్యం ఉందన్నారు.గ్రామాల్లోకి వైఎస్సార్సీపీకి చెందిన నాయకులు జనరల్ ఏజెంటగా వెళితే రాకుండా అడ్డుకోవడం ఎలాంటి సంస్కృతికి దారితీస్తుందన్నారు. ఆకేపాటి అమర్నాథ్రెడ్డి మాట్లాడుతూ రాజంపేట చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఈ సారి దౌర్జన్యకర వాతవరణంలో పోలింగ్ జరగడం విచాకరమన్నారు. టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారంటే వారిలో ఓడిపోతున్నామనే భయం వెంటాడుతోందన్నారు. తాము కోరుతున్న పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ జరపాల్సిన ఆవశ్యకత ఉందని, దీనిని ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకోవాలన్నారు. టీడీపీ ఎన్నికుట్రలు చేసినా వైఎస్సార్సీపీ విజయాన్ని అడ్డుకోలేరన్నారు. ఈ రాష్ట్రానికి సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి కావడం తధ్యమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు పాపినేని విశ్వనాథ్‌రెడ్డి, పోలిమురళీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా పోలింగ్ సందర్భంగా వచ్చిన పిర్యాదులపై విచారణ చేయడం జరుగుతుందని ఆర్వో నాగన్న ఇక్కడి విలేకరులకు తెలియచేశారు. -
నా జీవితం..ప్రజాసేవకే అంకితం
ప్ర: రాజంపేట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు? మీ విజయ అవకాశాలు ఏ విధంగా ఉంటాయనుకుంటున్నారు? వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి నేతృత్వంలో అత్యధికమెజార్టీ సాధించే గెలుపు దిశగా దూసుకుపోతున్నాను. వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తోడ్పాటుతోపాటు ప్రజల దీవెన ఉంది. అంతేగాకుండా జననేత జగన్మోహన్రెడ్డిని సీఎం చేసుకోవాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ విధంగా నా విజయానికి కలిసివచ్చే అంశం. ప్ర: రాజంపేటలో ప్రస్తుతం ఉన్న రాజకీయాలపై, అలాగే ఇక్కడి ప్రజల మనోగతం ఎలా ఉంది? మా నియోజకవర్గ ప్రజలు మహాతెలివైన వారు. రాజకీయచైతన్యం కలిగిన వారు. ప్రజలు ఇప్పటికే లోకల్ అయిన నావైపే మొగ్గుచూపుతున్నారు. నాన్‌లోకల్ లీడర్లు వస్తారు.. పోతారు. వారి గోగాకు, పుల్లకూర, ఉప్మా మాటలు రాజంపేట నియోజకవర్గ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ప్ర: రాజంపేట వాసులు ఫ్యాక్షన్ ప్రభావితం చేసే, కన్నింగ్, మాటల మాయగాళ్లను ప్రజలు నమ్ముతారా? ఫ్యాక్షన్ ప్రభావితం చేసే వ్యక్తులను రాజంపేట ఓటర్లు దూరంపెడతారు. తొలివాగ్గేయకారుడు అన్నమయ్య నడిచిన నేల ఇది. అటువంటి ప్రాంతంలో ఉన్నవారు మంచిని, నిజాయితీని, ధర్మాన్ని ఆచరిస్తారు. కన్నింగ్, మాటలమాయగాళ్ల చేతిలో మోసపోయేందుకు ఇక్కడి ఓటర్లు సిద్ధంగాలేరు. ప్ర: రాజంపేటలో ఎన్నడూలేని రీతిలో ఈ ఎన్నికలో ఓ సామాజికవర్గం పాలిట్రిక్స్ జరుగుతున్నాయి. మైండ్‌గేమ్, క్యాస్ట్గేమ్ను ఎన్నడూలేని రీతిలో ఇప్పుడు జరుగుతున్నాయనే ఆరోపణలు సర్వత్రా వెలువడుతున్నాయి.దీనిపై మీ స్పందన? నేను అందరివాడిని.. అందరిని ప్రేమగా, ఆప్యాయతగా పలుకురిస్తాను. సామాజికవర్గాల భేదాబిప్రాయాలు లేవు. మైండ్‌గేమ్, క్యాస్ట్గేమ్లకు నేను దూరం. ఏ కులమైనా.. ఏ మతమైనా అందరూ నావాళ్లే అనుకునే మనసత్త్వం నాది. ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకోవాలనే భావనతో ప్రజాసేవ చేస్తున్నాను. కుట్రలు, కుతంత్రాలకు దూరం. మంచిని ప్రేమిస్తాను. ధర్మాన్ని ఆచరిస్తాను. ప్ర: ఇప్పటి వరకు మీ ప్రజాసేవ కొనసాగిందిలా..! భవిష్యత్తులో ఏ విధంగా ముందుకెళతారు? ప్రజల సొమ్మును దోచుకునే స్వభావం లేదు. సొంత డబ్బులతో ప్రజాసేవచేస్తూ ముందుకెళుతున్నాను. అదే రీతిలో భవిష్యత్తులో ముందుకెళతాను. ప్రజల కోసం నిరంతరం నా జీవితాన్ని అంకితం చేస్తున్నాను. ప్రజలే నా ఉపిరి, శ్వాస అనే భావనతో నడుచుకునేందుకు ఇష్టపడతాను. ప్ర: రాజంపేట అసెంబ్లీ జనానికి రైల్వేకోడూరులో అమలుకాబడిన దుర్మార్గపు రాజకీయశైలి భయం వెంటాడుతోందని భావనలు వెలువడుతున్నాయా? నిజమేనా? నిజమే కదా? చందాలు వసూలు, సుంకాల చెల్లింపులు లాంటివి వస్తే ఇబ్బందిపడతామని వ్యాపారవర్గాలతోపాటు విభిన్న వర్గాలు భయాందోళన చెందతున్నారు. అందుకే కదా స్థానికుడు అయిన నాకే ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చేందుకు ప్రజలు మొగ్గుచూపుతున్నారు. ప్ర: టీడీపీకి రాజంపేటలో అభ్యర్థులు కరువయ్యారనే ఆరోపణలు ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఇందువల్లనే పక్క నియోజకవర్గనేతను బరిలోకి దింపారనే వాదన ఆపార్టీ వర్గాల్లోనే ఉంది. దీనికి మీరు ఏమంటారు? వైఎస్సార్సీపీకి బలమైన ఆదరణ, అభిమానం కలిగి ఉన్న నియోజకవర్గం రాజంపేట. అటువంటి ప్రాంతంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు పోటీ చేసే నాయకుడు లేక, దిగుమతి చేసుకున్న నాయకున్ని ఎన్నికల బరిలోకి దింపిందనే విషయం అందరికీ తెలిసిందే కదా. ప్ర: ఎన్నికల వేళలో చాలామంది క్షత్రియ సామాజికవర్గంతోపాటు ఇతర సామాజికవర్గాలకు చెందిన అధికారులను ఆకస్మికబదిలీ చేయించారనే వాదన రాజంపేటలో వినిపిస్తోంది. నిజమేనా? ఎక్కడ ఓడిపోతామనే భావనతో అధికారపార్టీ మాకు వ్యతిరేక సామాజికవర్గాలకు చెందిన అధికారులను ఆకస్మికంగా బదిలీ చేయిస్తున్నారు. వేధింపులకు గురిచేస్తున్నారు. ఇది నిజం. ఇప్పుడు ఎన్నికలసంఘం నేతృత్వంలో అధికారులు నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్ర: చంద్రబాబు పాలనపై జనంలో వ్యతిరేకత వెల్లుబుకుతోంది. 650 హామీలు ఇచ్చి నట్టేట ముంచేశారని జనం బహిర్గతంగానే విమర్శిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం? బాబు పాలన దోపిడీ, అవినీతితో కూడుకున్నదని రాష్ట్ర ప్రజలందరూ గ్రహించారు. ఈ ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో బాబు దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే రాజంపేటను ఏ విధంగా అభివృద్ధి చేయాలనే యోచన ఉంది? రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం తథ్యం. జగన్ సీఎం అయితే అన్ని వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతారు. నేను రాజంపేట నియోజకవర్గంలో దివంగత సీఎం వైఎస్సార్‌ను ఆశయంగా తీసుకొని శాశ్వత అభివృద్ధికి దోహదపడతాను. మీ రాజకీయ ప్రవేశం ఎలా జరిగింది? మాది నందలూరు మండలం చెన్నయ్యగారిపల్లె. నేను దివంగత సీఎం వైఎస్‌రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో నందలూరు సింగల్‌విండో చైర్మన్ ఎన్నికతో రాజకీయ ప్రవేశం చేశాను. ఆనాటి నుంచి మా కుటుంబానికి వైఎస్సార్ కుటుంబం అంటే ఎనలేని అభిమానం, ప్రేమ. దివంగత సీఎం వైఎస్సార్ ప్రతిపక్షనేతగా ఉన్న హయాంలో బస్సు యాత్రకు మా ఇంటికి వచ్చారు. ఇప్పటికీ ఆయన రాజకీయశైలిని మరిచిపోలేకున్నాను. ఆయన ఆశయాలకు పాటుపడుతూ, జగన్ అడుగుజాడల్లో నడుచుకుంటూ వెళుతున్నాను. మీ ప్రచారం ఎలా జరుగుతోంది? వైఎస్సార్సీపీ వస్తున్న జనాదరణ ఏలా ఉంది? ఆరుమండలాల్లో ప్రచారానికి జనంనుంచి విశేషస్పందన లభిస్తోంది. నాయకుల నేతృత్వంలో పార్టీలోకి భారీగా వలసలు వస్తున్నాయి. బాబు సామాజికవర్గంతోపాటు, కాపు, క్షత్రియ సామాజికవర్గానికి చెందిన వారు వైఎస్సార్సీపీ వైపే మొగ్గుచూపుతున్నారు. ఏగ్రామానికి వెళ్లినా జనం అపూర్వస్వాగతం, ఆపాయ్యతలు, అభిమానాలు చూపుతున్నారు. -
కడప: రెండు నెలలు ఓపిక పట్టండి
సాక్షి,రాజంపేట: ‘‘రెండు నెలలు ఓపికపట్టండి.. అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది’’అంటూ వైఎస్సార్సీపీ రాజంపేట అసెంబ్లీ అభ్యర్థి మేడా మల్లికార్జునరెడ్డి భరోసా ఇచ్చారు. ఆదివారం రాత్రి రాజంపేట రూరల్ ఏరియాలోని ఎస్.ఎర్రబల్లి సర్కిల్లో వైఎస్సార్సీపీ జెండా రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డితో కలిసి ఎగురవేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రానున్నది వైఎస్సార్ పాలన అన్నారు. అన్ని వర్గాలకు మేలు జరిగే విధంగా సంక్షేమపాలన ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ వైఎస్సార్సీపీని అధికారంలోకి తెచ్చుకునేందుకు కృషిచేయాలన్నారు. అనంతరం ఎర్రబల్లికి చెందిన 35 కుటుంబాల వారికి కండువాలను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనరు పోలా శ్రీనివాసులురెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు ఆకేపాటి మురళీరెడ్డి, చొప్పాఎల్లారెడ్డి, సీనియర్ నాయకుడు కొండూరు శరత్‌కుమార్‌రాజు, మండల కన్వీనరు భాస్కరరాజు తదితరులు పాల్గొన్నారు. -
రాజన్న రాజ్యానికే రాజంపేట మద్దతు
రాజంపేట నియోజకవర్గంలో దివంగత వైఎస్సార్ హయాంలో శాశ్వత అభివృద్ధి జరిగింది. మాజీ ఎమ్మెల్యేలు కొండూరు ప్రభావతమ్మ, ఆకేపాటి అమర్నాథ్రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కింది. తాగు, సాగునీటి ప్రధానసమస్యలను తీర్చారు. అటువంటి రాజంపేటలో మళ్లీ రాజన్న రాజ్యానికే మద్దతు పలకనున్నారు. ఎమ్మెల్యేగా మేడా మల్లికార్జునరెడ్డి తనదైనశైలిలో అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజాసమస్యల పరిష్కారానికి కృషిచేశారు. 1952–55 కాలంలో ఈ నియోజకవర్గంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహించారు. 1952లో జరిగిన ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి పంజం నరసింహారెడ్డి , కాంగ్రెస్ తరఫున పోలా వెంకటసుబ్బయ్య గెలుపొందారు. 1955లో జరిగిన ఎన్నికలలో పార్థసారథి, పీవీ సుబ్బయ్య కాంగ్రెస్‌పార్టీ తరఫున పోటీచేసి చెరో 40వేలకుపైగా ఓట్లు సాధించి భారీ విజయం సాధించారు. 1962లో స్వతంత్ర అభ్యర్థిగా కొండూరు మారారెడ్డి 14,335 ఓట్లు సాధించి కాంగ్రెస్ అభ్యర్థి పార్థసారథిపై విజయం సాధించారు. 1967లో స్వతంత్ర అభ్యర్థిగా బండారు రత్నసభాపతి 35,845 ఓట్లతో గెలుపొందారు. 1972లో రెండోసారి కూడా ఈయన గెలుపొందారు. 1997 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కొండూరు ప్రభావతమ్మ గెలుపొందారు. 1978లోరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రభావతమ్మ పోటీ చేసి, స్వతంత్ర అభ్యర్థి సభాపతిపై విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తరువాత ఎన్టీఆర్ ప్రభంజనంలోనూ రాజంపేటలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రభావతమ్మ, టీడీపీ అభ్యర్థి సభాపతిపై గెలుపొందారు. ఇది రాష్ట్రంలో చారిత్రాత్మక ఘట్టం. 1989లో కాంగ్రెస్ టికెట్ దక్కని ప్రభావతమ్మ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయగా.. కాంగ్రెస్ అభ్యర్థి కె.మదన్‌మోహన్‌రెడ్డి విజయం సాధించారు. 1994, 1999లో టీడీపీ తరఫున పసుపులేటి బ్రహ్మయ్య గెలుపొందారు. 2004 జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రభావతమ్మ టీడీపీ అభ్యర్థి బ్రహ్మయ్య పై సుమారు 24వేల ఓట్లపై చిలుకు మెజార్టీతో గెలుపొందారు. 2009లో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి 12వేల మెజారిటీతో గెలుపొందారు. ఆతర్వాత జరిగిన ఉపఎన్నికల్లో ఆకేపాటి గెలుపొందారు. 2014లో మేడా మల్లికార్జునరెడ్డి విజయం సాధించారు. వైఎస్సార్సీపీ చేపట్టనున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితుడైన మల్లికార్జున రెడ్డి పార్టీలో చేరారు. బరిలో స్థానికేతరుడు టీడీపీ నుంచి ఈసారి రైల్వేకోడూరుకు చెందిన బత్యాల చెంగల్రాయుడును చంద్రబాబు బరిలోకి దింపారు. రాజంపేటకు ఎలాంటి సంబంధంలేని ఈయనపై పార్టీలో అసంతృప్తి నెలకొంది. స్థానిక నాయకత్వాన్ని కాదని బత్యాలను పోటీకి దింపారు. ఈ సారి ఎన్నడూలేని రీతిలో సామాజికవర్గరాజకీయాలు రాజంపేటలో రాజ్యమేలుతున్నాయి. మేడా వైపే.. రాష్ట్ర విభజన అనంతరం రాజంపేట తొలి ఎమ్మెల్యేగా మేడా మల్లికార్జునరెడ్డి గుర్తింపు పొందారు. ఎమ్మెల్యేగా రాజంపేటలో అభివృద్ధికి పెద్దపీట వేశారు. ఆంధ్ర భద్రాద్రిగా రామాలయానికి అధికారిక గుర్తింపుతోపాటు టీటీడీలో విలీనం చేయడంలో తనదైన పాత్ర పోషించారు. ఒంటిమిట్ట చెరువుకు సోమశిల జలాలను తీసుకొచ్చి జలకళను తెప్పించారు. పేదలకు ముఖ్య మంత్రి సహాయ నిధిని ఇప్పించడంలో కృషి చేశారు. నందలూరు మండల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చారు. సౌమ్యుడిగా పేరొందడంతో పాటు సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తిగా ప్రజల్లో మంచి గుర్తింపు పొందారు. నిరంతరం ప్రజలసమస్యలను పరిష్కరించడంలో ఐదేళ్లపాటు నిర్విరామంగా కృషిచేశారు. – మోడపోతుల రామ్మోహన్, సాక్షి, రాజంపేట -
నామినేషన్ దాఖలు చేసిన రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి
-
చంద్రబాబు పాలన మోసపూరితం
సాక్షి, ఒంటిమిట్ట (వైఎస్సార్) : చంద్రబాబు నాయుడు ఎన్నికల వేళ కొత్త నాటకానికి తెరలేపారని, బాబుది మోసపూరిత పాలన అని వైఎస్సార్ సీపీ రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి మేడా మల్లికార్జున రెడ్డి విమర్శించారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడా మల్లికార్జున రెడ్డి, మేడా మధుసూదన్ రెడ్డి మండలంలోని సాలాబాద్, మలకాటిపల్లె, బందారుపల్లె, కుడమలూరు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలకు నవరత్నాల పథకాలపై అవగాహన కల్పించారు. వైఎస్సార్ సీపీని గెలిపించాలని, వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుందామని, రాజన్న రాజ్యం వస్తుందని ప్రజలకు పిలుపునిచ్చారు. నవరత్నాలతో ప్రతిఒక్కరికీ లబ్ధి చేకూరుతుందని చెప్పారు. 130 సీట్లలో విజయం తథ్యం సాధారణ ఎన్నికల్లో వైఎసార్సీపీ 130 అసెంబ్లీ సీట్లలో విజయం సాధిస్తుందని రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి మేడా మల్లికార్జునరెడ్డి అభిప్రాయపడ్డారు. మండలంలోని మాచుపల్లె, తురకపల్లె, ఉక్కాయపల్లె, శాంతినగర్, ఎస్సీకాలనీలు, సంటిగారిపల్లె, మూలపల్లె గ్రామాల్లో బుధవారం వైఎస్ఆర్సీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, మేడా వెంకటమల్లికార్జునరెడ్డి, మేడా మధుసూదన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్‌గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. కార్యక్రమంంలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ నీలకంఠారెడ్డి, రైతు విభాగం మండల కన్వీనర్ పల్లె సుబ్బారామిరెడ్డి, జిల్లా కార్యదర్శి జ్యోతి వెంకటసుబ్బారెడ్డి, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి ఎన్. శ్రీనివాసులరెడ్డి, పాల్గొన్నారు. -
రాజంపేట.. ఒకేబాట..
రాజంపేట : వైఎస్సార్సీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి శుక్రవారం ఒక్కటయ్యారు. వీరి ఆత్మీయ సమావేశానికి మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి హాజరయ్యారు. తొలుత మల్లికార్జునరెడ్డి తన అనుచరవర్గంతో ఆకేపాటి స్వగృహానికి చేరుకున్నారు.అక్కడ నేతలు భేటీ అయ్యారు. తర్వాత వారిని మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి కలుసుకున్నారు. అనంతరం వారు విలేకర్లతో మాట్లాడారు. దీంతో రాజంపేట వైఎస్సార్సీపీలో నూతనోత్సహం వెల్లివిరిసింది. ఆకేపాటి స్వగృహంలో పార్లమెంటరీ బీసీ విభాగం కన్వీనర్ పసుపులేటి సుధాకర్, పార్టీ నేతలు భాస్కరరాజు, పాపినేని విశ్వనాథ్‌రెడ్డి, గోవిందుబాలకృష్ణ, పోలిమురళీరెడ్డి,సుబ్బరాజు, దండుగోపి, మైనార్టీనేతలు ఖలీల్, యూసఫ్‌తోపాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మేడాను ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి: మిథున్‌రెడ్డి ఈ సందర్భంగా మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి సహకారంతో రాజంపేటలో మేడా మల్లికార్జునరెడ్డిని ఎమ్మెల్యేగా అత్యధికమెజార్టీతో గెలిపించుకుంటామని వెల్లడించారు. జిల్లాలో పదికి పదిసీట్లు గెలవడం ఖాయమన్నారు. జననేతవైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం చేసుకోవడమే ధ్యేయంగా పార్టీ శ్రేణులు పనిచేయాలన్నారు. జగన్ సీఎం కావడం వల్లనే ఈ రాష్ట్రానికి మంచిరోజులు వస్తాయన్నారు. ఆకేపాటి అమర్నాథ్రెడ్డి మాట్లాడుతూ రాజన్న ఆశయాలను కొనసాగించడానికి వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రి చేయడానికి కృషిచేస్తానన్నారు. చంద్రబాబు జగన్ నవరత్నాలు కాపి కొడుతూ ఎన్నికల ముందు పథకాలను ప్రకటిస్తున్నారన్నారు. రాయలసీమకు అన్ని విధాలుగా టీడీపీ హయాంలో అన్యాయం జరిగిందన్నారు. జగన్మోహన్రెడ్డి సీఎం అయితే సీమకు వైఎస్సార్ హయాంలో నాటి స్వర్ణయుగం వస్తుందన్నారు. కులరాజకీయాలకు పెట్టిందిపేరు టీడీపీ: మేడా తాజా మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ కుల రాజకీయాలకు పెట్టింది పేరు టీడీపీ అని విమర్శించారు. దానిపీడ వదలించి జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రి చేసేందుకు అమర్నాథ్రెడ్డి సహకారంతో పనిచేస్తామన్నారు. సమావేశంలో మేడా సోదరుడు మధురెడ్డి, మేడా చిన్నాయన మేడా భాస్కర్‌రెడ్డి, మహిళనేత ఏకులరాజేశ్వరి, మాజీ ఎంపీపీ లక్ష్మీనరసయ్య, ఏరియా ఆసుపత్రి కమిటి చైర్మన్ వడ్డెరమణ, వడ్డీ శ్రీను, మైనార్టీ నేతలు గుల్జార్‌బాష, ఖాజా, పార్టీ నేతలు కసిరెడ్డి అశోక్‌రెడ్డి, ఉమామహేశ్వరరెడ్డి, యానాదిరెడ్డి, పిచ్చిరెడ్డి,గంగిరెడ్డి,శివరామరాజు, మామిళ్లరవి, మధు,పోలి సుబ్బారెడ్డి, ప్లీడర్ కృష్ణకుమార్, ఒంటిమిట్ట నేత గడ్డం జనార్ధన్‌రెడ్డి, నందలూరు కో–ఆప్షన్‌సభ్యుడు మున్వర్ తదితరులు పాల్గొన్నారు. నేతలకు ఘనస్వాగతం.. ఆకేపాటి, మేడా, మిథున్‌రెడ్డి బైపాస్‌లోని వైజంక్షన్ సమీపంలోని మేడా స్వగృహం వద్దకు చేరుకున్నారు. వీరికి పార్టీలో చేరిన అనుచరులు పెద్దఎత్తున స్వాగతం పలికారు. మేడా భవన్లో వీరునాయకులను, కార్యకర్తలను కలుసుకొని ఆపాయ్యంగా పలకరించారు. వైఎస్సార్సీపీ క్యాడర్‌తో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తల కోలాహలం నెలకొనింది. ఇటు మేడా, అటు ఆకేపాటి అనుచరులు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు ఒక్కటయ్యారు. పరస్పరం పలుకరించుకున్నారు. -
ఎన్నికల ముందే బాబుకు బీసీలు గుర్తొస్తారు
కడప కార్పొరేషన్: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎన్నికల ముందే బీసీలు గుర్తొస్తారని వైఎస్ఆర్సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబు విమర్శించారు. గురువారం కడపలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. నాలుగేళ్ల పదినెలల టీడీపీ పాలనలో ఏనాడు చంద్రబాబుకు బీసీలు గుర్తుకురాలేదని, మరో 65రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయని బీసీలు మా పేటెంట్ అంటూ కల్లబొల్లి మాటలు చెబుతున్నారన్నారు. 14నెలల సుదీర్ఘ పాదయాత్రలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ బీసీల ఇబ్బందులు, వారి సమస్యలను గుర్తించారని తమ ప్రభుత్వం వస్తే బీసీల్లోని అన్ని కులాలకు కార్పొరేషన్లు ప్రకటిస్తామని హామీ ఇచ్చారన్నారు. దాన్ని కాపీ కొడుతూ చంద్రబాబు 11 కులాలకు కార్పొరేషన్లు ప్రకటించి, నిన్ననే చైర్మన్లను కూడా నియమించారన్నారు. బీసీలను అవమానించడానికే ఆదరణ పథకం ప్రవేశపెట్టారని ధ్వజమెత్తారు. వెనుకబడిన వర్గాల వారు కులవృత్తుల్లోనే మగ్గిపోకూడదు, వారు కూడా ఉన్నత చదువులు చదవాలని కాంక్షించిన నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ఆయన ప్రవేశపెట్టిన ఫీజురీయింబర్స్‌మెంట్ పథకం వల్లే ఎంతోమంది బీసీ విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగాల్లో ఉన్నారని తెలిపారు. అలాగే ఐదు కులాలకు ఫెడరేషన్లు ఏర్పాటు చేశారని, ఎంతోమంది బీసీల ను రాజకీయంగా పైకితెచ్చారన్నారు. నేను మారాను, నా అనుభవంతో కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానంటేనే రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు అధికారం ఇచ్చారన్నారు. కానీ ఆయన దాన్ని సద్విని యోగం చేసుకోలేదన్నారు. తన విలాసాలు, విదేశీటూర్ల కోసం వేలకోట్లు ఖర్చు పెట్టి, కమీషన్లు దండుకొని అవినీతిలో ఏపీని నంబర్‌వన్ చేశారన్నారు. పయ్యావుల కేశవ్, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, నారాయణ. తన కొడుకు నారా లోకేష్‌లకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి మంత్రులను చేసిన చంద్రబాబుకు 52 శాతం ఉన్న బీసీల్లో ఒక్క నాయకుడు కూడా కనిపించకపోవడం బాధాకరమన్నారు. ప్రయివేటు కళాశాలల్లో ఫీజులు అధిక సంఖ్యలో ఉన్నా రాష్ట్రప్రభుత్వం మాత్రం వైఎస్ఆర్ ఉన్నప్పు డు ఇస్తున్న రూ.32వేలను మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్‌గా ఇస్తోందని చెప్పా రు. ఫీజులు చెల్లించలేక చాలా మంది చదువులకు స్వస్తి పలకాల్సి వస్తోందని ఆవేధన వ్యక్తం చేశారు. టీడీపీ విధానాల పట్ల విసిగివేసారిన బీసీలు వైఎస్ జగన్‌కు పేటెంట్గా మారుతున్నారని తెలిపారు. జనాన్ని మోసగించడానికే కొత్త కొత్త హామీలు: మేడా మల్లికార్జునరెడ్డి జనాలను మోసగించడానికే సీఎం చంద్రబాబు కొత్త హామీలిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి అన్నారు. రైతులకు పదివేలు ఇస్తామని చెప్పడం కూడా మోసమేనన్నారు. రెండు నెలల్లో ఎన్నికలు వస్తున్నందున ఇవేవీ మంజూరయ్యే పరిస్థితి లేదన్నారు. ఎమ్మెల్యేలను, మంత్రులను డమ్మీలుగా చేసిన చంద్రబాబును ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరన్నారు. అందుకే ఎన్ని హామీలిస్తున్నా నిన్ను నమ్మం బాబు అంటున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ సీఎం అయితేనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. బీసీ సెల్ రాష్ట్ర నాయకులు యానాదయ్య, జిల్లా అధ్యక్షుడు బంగారు నాగయ్య మాట్లాడుతూ ప్రత్యామ్నాయ రాజకీ య వేదిక లేకనే ఇన్నాళ్లు బీసీలు టీడీపీని మోశారన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బీసీసబ్‌ప్లాన్ ప్రకటించడమే బాబు మోసానికి తార్కాణమన్నా రు. వైఎస్ఆర్సీపీ బీసీ గర్జన ఒక విప్లవాత్మక కార్యక్రమమని, వైఎస్ఆర్సీపీ బీసీలకు మేనిఫెస్టోలో ప్రకటించే అంశాలను ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ఆ సభలో ప్రకటిస్తారన్నారు. వైఎస్జగన్ పాదయాత్ర బీసీలకు భరోసా యాత్రలా మారిందని తెలిపారు. బీసీగర్జన సభ ను వెనుకబడిన వర్గాలు, ఆయా సం ఘాల నాయకులు జయప్రదం చే యా లని పిలుపునిచ్చారు. వెఎస్ఆర్సీపీ బీసీసెల్ నగర అధ్యక్షుడు చినబాబు, యూత్ వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చల్లా రాజశేఖర్, జిల్లా అధ్యక్షుడు బి. నిత్యానందరెడ్డి, మల్లికార్జున, చీర్ల సురేష్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
బాబు మాటలను నమ్మవద్దు
వైఎస్ఆర్ జిల్లా, సుండుపల్లె: డ్వాక్రా మహిళలను మోసం చేయడానికి చంద్రబాబు మళ్లీ చెక్కులపేరుతో కుట్రపన్నారని రాజంపేట మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి ఆరోపించారు. సుండుపల్లె మండలంలో జీకే రాచపల్లెలో వివాహ వేడుకలకు ఆయన హాజరయ్యారు. అదేవిధంగా బెస్తపల్లి, పింఛా, పొలిమేరపల్లె పలుప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోస్ట్‌డేటెడ్ చెక్కులను మూడు విడతలుగా ఇస్తామనడంలో వారి బండారం బయటపడుతోందని ఎద్దేవా చేశారు. ఇది మహిళలను బురిడీకొట్టించడానికే తప్పా దేనికీ పనికిరాదు. అబద్ధపు మాటలు, మోసాలు చేయడం బాబుకు అలవాటని విమర్శించారు. నిత్యం ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తున్న టీడీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలన్నారు. అందరితో కలసిమెలసి 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే ధ్యేయంగా పనిచేస్తానన్నారు. ఆర్థికసాయం: పొలిమేరపల్లి గ్రామపంచాయతీ చిన్నరెడ్డిగారిపల్లెకు చెందిన రవి అనే యువకుడు పెరాలసిస్‌తో భాధపడుతుండటంతో మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి ఆస్పత్రి ఖర్చులకుగానూ రూ.5వేలు ఆర్థికసాయం చేశారు. -
‘బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు’
సాక్షి, వైఎస్సార్: వైఎస్సార్సీపీలో ఎలాంటి గ్రూపులు లేవని రాజంపేట మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. రాజంపేటలో కొంతమంది బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇక్కడి ప్రజలు రౌడీయిజం, ఫ్యాక్షనిజాన్ని ఒప్పుకోరని, మంచిని ప్రోత్సహిస్తారని అభిప్రాయపడ్డారు. వైఎస్సార్సీపీ సీనియర్ నేత, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు ఆకెపాటి అమర్నాథ్ రెడ్డితో కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని మేడా వెల్లడించారు. టీడీపీ నేతలకు రాజంపేటలో నేతలు లేక బయటి నుంచి దిగుమతి చేసుకుంటున్నారని పేర్కొన్నారు. -
రాష్ట్రంలో దోపిడీ పాలన
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో దోపిడీ పాలన సాగుతోందని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి పేర్కొన్నారు. సీఎం చంద్రబాబును ప్రజలు ఛీ కొడుతున్నారని చెప్పారు. ‘నిన్ను నమ్మం బాబూ.. నమ్మంగాక నమ్మం’ అని అంతా ముక్తకంఠంతో నినదిస్తున్నారన్నారు. దివంగత వైఎస్సార్ ఆశయాల మేరకు సుపరిపాలన సాధించేందుకు టీడీపీకి రాజీనామా చేసినట్లు మేడా తెలిపారు. రాష్ట్రానికి తదుపరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనడంలో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. బడుగు, బలహీన వర్గాలను ఆదరించే సీఎంగా వైఎస్ జగన్ ముందుకు వెళ్తారని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లో వైఎస్సార్ సీపీలో చేరిన అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఆరోజు నుంచి ఈరోజు వరకు ఒకటే మాట చెబుతున్నా. వైఎస్ జగన్ ఏపీకి కాబోయే సీఎం’ అని పేర్కొన్నారు. రాజంపేట, రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలని నిర్ణయించుకుని వైఎస్సార్ సీపీలో చేరానన్నారు. తాము టీడీపీ మాదిరిగా ప్రజాస్వామ్య విలువలు తెలియని వాళ్లం కాదని మేడా వ్యాఖ్యానించారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా.. వైఎస్సార్ సీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి టీడీపీ కొనుగోళ్లకు పాల్పడితే ఈరోజు దాకా వారి విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని మేడా పేర్కొన్నారు. ‘వైఎస్ జగన్ నాకు ఒకే మాట చెప్పారు. పార్టీలో చేరే ముందు టీడీపీ ద్వారా వచ్చిన అన్ని పదవులకు రాజీనామా చేసి రమ్మని కోరారు. ఈ నెల 22వ తేదీనే ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశా. ఈరోజు స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా పంపా’ అని మేడా వివరించారు. అన్ని వర్గాలకూ టీడీపీ దగా.. రాష్ట్రాన్ని సశ్యశ్యామలం చేసి అన్ని వరాలకు మంచి జరిగే పరిపాలన రావాలన్నది తన అభిమతమని మేడా చెప్పారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ప్రతి వర్గాన్ని దగా చేశారని ధ్వజమెత్తారు. రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగ యువత, కాపులు.. ఇలా అందరినీ టీడీపీ మోసగించిందన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లాలో వైఎస్సార్ సీపీ పదికి పది స్థానాలు గెలుస్తుందని ప్రకటించారు. రాజకీయంగా అనుభవజ్ఞుడైన మాజీ ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డితో కలసి రాజంపేట నియోజకవర్గంలో ముందుకు వెళ్తానని మేడా చెప్పారు. భారీగా తరలివచ్చిన మేడా అనుచరులు రాజంపేట శాసనసభ్యుడు మేడా మల్లికార్జునరెడ్డి వైఎస్సార్ సీపీలో చేరిక సందర్భంగా ఆయన అనుచరులు పెద్ద ఎత్తున తరలి రావడంతో హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం కిక్కిరిసింది. రాజంపేట నుంచి భారీగా వాహనాల్లో తరలి రావడంతో ట్రాఫిక్ స్తంభించింది. మేడాకు లోటస్‌పాండ్‌లో వైఎస్ జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగన్ ప్రతి ఒక్కరినీ సాదరంగా పలకరించారు. పార్టీలో చేరిన వారందరికీ తోడుగా ఉంటానని భరోసా ఇచ్చారు. అంతా కలసి మళ్లీ రాజన్న రాజ్యాన్ని తెచ్చుకుందామన్నారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్ జిల్లాలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక అభ్యర్థి మేడా మల్లికార్జునరెడ్డి కావడం గమనార్హం. కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులుతోపాటు మేడా రఘునాథ్‌రెడ్డి, మేడా విజయభాస్కర్‌రెడ్డి, పార్టీ నేతలు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీలో చేరిన మేడా మల్లికార్జునరెడ్డి
-
వైఎస్సార్సీపీలోకి మేడా మల్లికార్జునరెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజంపేట శాసనసభ్యుడు మేడా మల్లికార్జునరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో అనుచరులతో కలిసి వైఎస్సార్సీపీలోకి వచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీలో కొందరు నేతల దుశ్చర్యలు చూడలేకపోయానని, తనను అన్యాయంగా పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఇదివరకే మేడా మల్లికార్జునరెడ్డి చెప్పారు. వైఎస్సార్సీపీ నుంచి రాజంపేట అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టినా కలిసి పనిచేస్తామన్నారు. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ జిల్లాలో పోటీ చేసి.. గెలిచిన ఏకైక టీడీపీ అభ్యర్థి మేడా మల్లికార్జునరెడ్డి. ఆయనతోపాటు రాజంపేట నుంచి భారీ ఎత్తున వచ్చిన ఆయన అనుచరులు వైఎస్సార్సీపీలో చేరారు. ప్రతి ఒక్కరినీ పలకరించిన వైఎస్ జగన్.. కండువాలు కప్పి వారిని పార్టీలో ఆహ్వానించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సందడి నెలకొంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశా: మేడా వైఎస్సార్సీపీలో చేరిన సందర్భంగా మేడా మల్లికార్జునరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేసినట్టు ఆయన వెల్లడించారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖను తాను పంపానని తెలిపారు. వైఎస్ జగన్‌తోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని చెప్పారు. గత నాలుగున్నరేళ్లుగా అమలు చేయని హామీలు ఇప్పుడు ఎలా చంద్రబాబు అమలు చేస్తారని మేడా ప్రశ్నించారు. ఎన్నికల నేపథ్యంలోనే చంద్రబాబు కొత్త వాగ్దానాలు ఇస్తున్నారని, ఆయన హామీలను ప్రజలు నమ్మబోరని పేర్కొన్నారు. గతవారం వైఎస్ జగన్‌తో భేటీ! వైఎస్సార్ సీపీ జిల్లా రాజంపేట నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వ విప్ మేడా మల్లిఖార్జున రెడ్డి గత మంగళవారం వైఎస్ జగన్‌ను కలిసిన సంగతి తెలిసిందే. టీడీపీలో ఇమడలేకపోతున్నానని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతానని ఆయన వైఎస్ జగన్‌ను కోరారు. ఎమ్మెల్యే సహా అధికార పదవులన్నింటికీ రాజీనామా చేయాలని ఈ సందర్భంగా ఆయనకు వైఎస్ జగన్ సూచించారు. తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్టు కొని చంద్రబాబు విలువలు దిగజార్చారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలు, విశ్వసనీయత ముఖ్యమని పునరుద్ఘాటించారు. చదవండి: బాబును నమ్మితే రాష్ట్రం సర్వనాశనమవుతుంది : మేడా -
‘వైఎస్ జగన్‌ను సీఎం చేయటమే అంతిమ లక్ష్యం’
సాక్షి, వైఎస్సార్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయటమే తన అంతిమ లక్ష్యమని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 1500 నుంచి 2000 మందితో గురువారం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలతో ముందుకు వెళతానని చెప్పారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది దుశ్చర్యలు, దుష్ప్రచారం చూడలేక పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనుకున్నానని, కింది స్థాయి నుంచి పై స్థాయి నాయకుల వరకు టీడీపీలో తనపై దౌర్జన్యం చేశారని వాపోయారు. అన్యాయంగా తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారన్నారు. రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం క్యాడర్ మొత్తం తన వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరుతుంటే కార్యకర్తలు అందరూ తన వెంట ఉంటానన్నారని చెప్పారు. రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవర్ని పెట్టినా కలిసి పనిచేస్తామని తెలిపారు. రాజంపేట ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ జగన్‌కు కానుకగా ఇవ్వనున్నామని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను, మోసాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళని, చంద్రబాబును ప్రజలు నమ్మరన్నారు. చంద్రబాబు చెప్పేది ఒకటి చేసేది ఒకటంటూ ఎద్దేవా చేశారు. -
అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా
సాక్షి, హైదరాబాద్: రాజంపేట శాసనసభ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విషయంలో పార్టీ అధిష్టానవర్గం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానని మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి స్పష్టం చేశారు. కడప జిల్లా నేతలు పలువురు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమైన అనంతరం ఆకేపాటి జగన్ నివాసం బయట మీడియాతో మాట్లాడారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ ప్రస్తుత రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున్‌రెడ్డి వైఎస్సార్ సీపీలో చేరడం వల్ల తనకు ఎలాంటి ఇబ్బంది లేదని తామంతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరమని అమరనాథరెడ్డి అన్నారు. జగన్ వద్ద టికెట్ల విషయం చర్చించలేదని ఈ విషయమై అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానన్నారు. ఒకవేళ మేడాకు టికెట్ ఇస్తే మీరు మద్దతు ఇస్తారా? అని ప్రశ్నించగా..‘ఒకరికి మద్దతు అనేది ఇక్కడ అంశం కాదు.. నామద్దతు ఎల్లప్పుడూ జగన్‌కే..’ అని స్పష్టం చేశారు. -
పెద్దాయన ఆశీర్వాదం తీసుకున్నా : మేడా
సాక్షి, వైఎస్సార్ కడప : రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద బుధవారం నివాళులర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు మేడా మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ఈ నెల 31 హైదరాబాద్‌లోని కేంద్రకార్యాలయంలో తన అనుచరులతో కలిసి పార్టీలో చేరుతున్నట్టు వెల్లడించారు. ప్రజలకు సేవ చేసే వాళ్లకు టీడీపీలో స్థానం లేదని మల్లికార్జున రెడ్డి వాపోయారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. ఆ మహా నేతకు నివాళులర్పించి ఆశీర్వాదం తీసుకున్నానని తెలిపారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు నడుచుకుంటానని, వచ్చే ఎన్నికల్లో రాజంపేటలో వైఎస్సార్సీపీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. -
దటీజ్ వైఎస్ జగన్!
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్య విలువలకు పట్టం కట్టడంలో రాజీ పడబోనని రాజన్న తనయుడు మరోసారి నిరూపించారు. కుళ్లు రాజకీయాలు చేయబోమని ఇచ్చిన మాటకు కట్టుబడ్డారు. రాజకీయాల్లో విలువలకు కట్టుబడతామన్న మాటను అక్షరాల పాటించి ఆదర్శంగా నిలుస్తున్నారు. చెడిపోయిన రాజకీయ వ్యవస్థ ప్రక్షాళనకు మడమ తిప్పని పోరాటం చేస్తానని జనం సాక్షిగా ఇచ్చిన మాటకు అనుక్షణం కట్టుబాటు చాటుతున్నారు. ఏపీ రాజకీయాల్లో చోటుచేసుకున్న తాజా పరిణామమే దీనికి తిరుగులేని రుజువు. (రాజీనామా చేసిన తర్వాతే పార్టీలో చేరమన్నారు) వైఎస్సార్ సీపీ జిల్లా రాజంపేట నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వ విప్ మేడా మల్లిఖార్జున రెడ్డి మంగళవారం వైఎస్ జగన్‌ను కలిశారు. టీడీపీలో ఇమడలేకపోతున్నానని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతానని వైఎస్ జగన్‌ను కోరారు. ఎమ్మెల్యే సహా అధికార పదవులన్నింటికీ రాజీనామా చేయాలని ఆయనకు వైఎస్ జగన్ సూచించారు. తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్టు కొని చంద్రబాబు విలువలు దిగజార్చారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలు, విశ్వసనీయత ముఖ్యమని పునరుద్ఘాటించారు. వైఎస్ జగన్ సూచనతో పదవులకు రాజీనామా చేసేందుకు మల్లికార్జున రెడ్డి అంగీకరించారు. అధికార పదవులు వదులుకున్న తర్వాతే వైఎస్సార్ సీపీలో చేరతానని ప్రకటించారు. వైఎస్ జగన్ ప్రజాస్వామ్య విలువలు కలిగిన నాయకుడని ప్రశంసించారు. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా కూడా ఇదే స్ఫూర్తిని వైఎస్ జగన్ చాటారు. టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న శిల్పా చక్రపాణిరెడ్డిని రాజీనామా చేసిన తర్వాత పార్టీలో చేర్చుకున్నారు. వేరొక పార్టీ నుంచి తమ పార్టీలోకి వచ్చే నాయకులు ఆయా పార్టీల కారణంగా వచ్చిన పదవులను వదులుకోవాల్సిందేనంటూ స్పష్టం చేయడం ద్వారా రాజకీయాల్లో విలువలకు పెద్దపీట వేశారు వైఎస్ జగన్. మాటకు కట్టుబడి విలువలు పాటిస్తున్న జననేతకు జనం జేజేలు పలుకుతున్నారు. అభిమానులు ‘దటీజ్ వైఎస్ జగన్’ అంటూ పొంగిపోతున్నారు. -
టీడీపీలో నాలుగన్నరేళ్లు నరకయాతన అనుభవించా
-
31న వైఎస్సార్ సీపీలో చేరుతున్నా: ఎమ్మెల్యే మేడా
సాక్షి, హైదరాబాద్ : చంద్రబాబు గంజాయి వనం నుంచి జగన్ తులసి వనంలోకి వచ్చినట్లుగా ఉందని రాజంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జున రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్య విలువలు లేని చంద్రబాబు దగ్గర ఉండలేకపోయామని అందుకే ఇన్నాళ్లు పార్టీకి దూరంగా ఉన్నానని తెలిపారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఈనెల 31న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశమైనట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా అన్ని పదవులకు రాజీనామా చేసిన తర్వాతే పార్టీలో చేరమని జగన్ సూచించారని.. ఈ క్రమంలో విప్, ఎమ్మెల్యే పదవులకు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన లేఖను బుధవారం టీడీపీ అధిష్టానానికి పంపిస్తానన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని ప్రస్తుతం సొంత ఇంటికి వచ్చిన భావన కలుగుతోందని ఆనందం వ్యక్తం చేశారు. నరకయాతన అనుభవించా టీడీపీలో నాలుగన్నరేళ్లు నరకయాతన అనుభవించానని మేడా ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబును నమ్మి ఇంకా అక్కడ ఉండలేనని, ఆయన చెప్పేది ఒకటి చేసేది ఇంకోటి అని విమర్శించారు. రైతులకు, డ్వాక్రా రుణమాఫీ చేస్తామని, కాపులకు రిజర్వేషన్ ఇస్తామంటూ కల్లబొల్లి మాటలు చెప్పి గెలిచిన చంద్రబాబును ప్రజలు ఇప్పుడు నమ్మడం లేదని ఎద్దేవా చేశారు. బాబును ఇంకా నమ్మితే రాష్ట్రం సర్వనాశనం అవుతుందని అన్నారు. వైఎస్సార్ రాజకీయ భిక్షం పెడితే ఆదినారాయణ రెడ్డి గెలిచారని.. తర్వాత వంచన చేసి, టీడీపీలో చేరి.. మంత్రి అయ్యారని గుర్తుచేశారు. అటువంటి వ్యక్తికి తనను విమర్శించే అర్హత లేదని ఘాటుగా విమర్శించారు. తనను గెలిపించిన ప్రజల కోసం నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడ్డానని మేడా వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్, షర్మిల చేపట్టిన పాదయాత్రలు చరిత్ర సృష్టించాయని.. ప్రజలు వైఎస్సార్ సీపీ వైపే ఉన్నారని పేర్కొన్నారు. -
రాజంపేట ఎమ్మెల్యే మేడాపై సస్పెన్షన్ వేటు
సాక్షి, వైఎస్సార్ జిల్లా : మంత్రి ఆదినారాయణ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తిన నేపథ్యంలో రాజుకున్న రాజంపేట గొడవ అమరావతికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజంపేట టీడీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో టికెట్ ఆశావహులు వేమన సతీశ్ తన అనుచర వర్గంతో అమరావతికి తరలివెళ్లారు. మాజీ ఎమ్మెల్యే పసుపులేటి బ్రహ్మయ్య, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు, చరణ్‌రాజ్ తదితరులు కూడా అక్కడికి చేరుకున్నారు. కాగా సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు నాయుడు ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. (రాజంపేట టీడీపీలో రభస!) కాగా ఆర్అండ్బీ బంగ్లా వేదికగా జరిగిన సమావేశం సాక్షిగా రాజంపేట టీడీపీ శ్రేణులు రెండు వర్గాలుగా విడిపోయిన సంగతి తెలిసిందే. స్థానిక ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డికి తెలియకుండా మంత్రి ఆదినారాయణ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి సమావేశం నిర్వహించడం, రాజంపేట నియోజకవర్గంలో మేడా కంటే బలమైన అభ్యర్ధిని రానున్న ఎన్నికల్లో పోటీకి దింపుతామని వ్యాఖ్యానించడంతో రభస జరిగింది. ఈ క్రమంలో సీఎంతో మాట్లాడిన తర్వాతే భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందంటూ మేడా పేర్కొన్న సంగతి తెలిసిందే. -
వారి ఉడత బెదిరింపులకు బెదరను: ఎమ్మెల్యే మేడా
-
వారి ఉడత బెదిరింపులకు బెదరను: ఎమ్మెల్యే మేడా
సాక్షి, రాజంపేట: వైఎస్ఆర్ జిల్లా రాజంపేట టిడిపిలో విభేదాలు భగ్గుమన్నాయి. స్థానిక ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డిని పిలవకుండానే మంత్రి ఆదినారాయణరెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో మేడా వర్గీయులు మంత్రిని నిలదీశారు. సమావేశాన్ని బహిష్కరించి నిరసన తెలిపారు. పొమ్మనలేక పొగబడుతున్నారంటూ మేడా వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డిని పార్టీ నుంచి బయటకు పంపేందుకు టీడీపీ అధిష్టానం తనదైన శైలిలో రాజకీయం ప్రారంభించింది. అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎంపిక చేసేందుకు నియోజకవర్గాల వారీగా చంద్రబాబునాయుడు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో రాజంపేట నియోజకవర్గ సమావేశం కూడా ఉంది. దీని కోసం నిన్న రాత్రి ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి తన అనుచరులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సమావేశాన్ని ఆసరాగా చేసుకుని ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ప్రచారం చేపట్టింది. అంతటితో ఆగకుండా ఆయన వ్యతిరేకులతో మంత్రి ఆదినారాయణరెడ్డి సారథ్యంలో రాజంపేటలోనే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి స్థానిక ఎమ్మెల్యే మేడాను పిలువలేదు. దీంతో ఆయన వర్గీయులు నేరుగా సమావేశం వద్దకు వెళ్లి.. మంత్రి ఆదినారాయణరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిని నిలదీశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు సమావేశం వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా టీడీపీ నేతలు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, రాజంపేటలో సమావేశం గురించి తనకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి స్పష్టం చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసిన వారితో కలిసి ఆదినారాయణరెడ్డి సమావేశం నిర్వహించారని, తనకు వ్యతిరేకంగా జిల్లా నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయమై సీఎం చంద్రబాబుతో భేటీ అవుతానని చెప్పారు. జిల్లా నేతల ఉడత బెదిరింపులకు తాను బెదరనని, కార్యకర్తలతో చర్చించి వారి నిర్ణయం మేరకు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.