మాట్లాడుతున్న కె. సురేష్‌బాబు, చిత్రంలో మేడా మల్లికార్జునరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు
కడప కార్పొరేషన్: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎన్నికల ముందే బీసీలు గుర్తొస్తారని వైఎస్‌ఆర్‌సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబు విమర్శించారు. గురువారం కడపలోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. నాలుగేళ్ల పదినెలల టీడీపీ పాలనలో ఏనాడు చంద్రబాబుకు బీసీలు గుర్తుకురాలేదని, మరో 65రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయని బీసీలు మా పేటెంట్ అంటూ కల్లబొల్లి మాటలు చెబుతున్నారన్నారు. 14నెలల సుదీర్ఘ పాదయాత్రలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ బీసీల ఇబ్బందులు, వారి సమస్యలను గుర్తించారని తమ ప్రభుత్వం వస్తే బీసీల్లోని అన్ని కులాలకు కార్పొరేషన్లు ప్రకటిస్తామని హామీ ఇచ్చారన్నారు.
దాన్ని కాపీ కొడుతూ చంద్రబాబు 11 కులాలకు కార్పొరేషన్లు ప్రకటించి, నిన్ననే చైర్మన్లను కూడా నియమించారన్నారు. బీసీలను అవమానించడానికే ఆదరణ పథకం ప్రవేశపెట్టారని ధ్వజమెత్తారు. వెనుకబడిన వర్గాల వారు కులవృత్తుల్లోనే మగ్గిపోకూడదు, వారు కూడా ఉన్నత చదువులు చదవాలని కాంక్షించిన నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ఆయన ప్రవేశపెట్టిన ఫీజురీయింబర్స్‌మెంట్ పథకం వల్లే ఎంతోమంది బీసీ విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగాల్లో ఉన్నారని తెలిపారు. అలాగే ఐదు కులాలకు ఫెడరేషన్లు ఏర్పాటు చేశారని, ఎంతోమంది బీసీల ను రాజకీయంగా పైకితెచ్చారన్నారు.
నేను మారాను, నా అనుభవంతో కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానంటేనే రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు అధికారం ఇచ్చారన్నారు. కానీ ఆయన దాన్ని సద్విని యోగం చేసుకోలేదన్నారు. తన విలాసాలు, విదేశీటూర్ల కోసం వేలకోట్లు ఖర్చు పెట్టి, కమీషన్లు దండుకొని అవినీతిలో ఏపీని నంబర్‌వన్ చేశారన్నారు. పయ్యావుల కేశవ్, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, నారాయణ. తన కొడుకు నారా లోకేష్‌లకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి మంత్రులను చేసిన చంద్రబాబుకు 52 శాతం ఉన్న బీసీల్లో ఒక్క నాయకుడు కూడా కనిపించకపోవడం బాధాకరమన్నారు. ప్రయివేటు కళాశాలల్లో ఫీజులు అధిక సంఖ్యలో ఉన్నా రాష్ట్రప్రభుత్వం మాత్రం వైఎస్‌ఆర్ ఉన్నప్పు డు ఇస్తున్న రూ.32వేలను మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్‌గా ఇస్తోందని చెప్పా రు. ఫీజులు చెల్లించలేక చాలా మంది చదువులకు స్వస్తి పలకాల్సి వస్తోందని ఆవేధన వ్యక్తం చేశారు. టీడీపీ విధానాల పట్ల విసిగివేసారిన బీసీలు వైఎస్ జగన్‌కు పేటెంట్‌గా మారుతున్నారని తెలిపారు.
జనాన్ని మోసగించడానికే కొత్త కొత్త హామీలు: మేడా మల్లికార్జునరెడ్డి
జనాలను మోసగించడానికే సీఎం చంద్రబాబు కొత్త హామీలిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి అన్నారు. రైతులకు పదివేలు ఇస్తామని చెప్పడం కూడా మోసమేనన్నారు. రెండు నెలల్లో ఎన్నికలు వస్తున్నందున ఇవేవీ మంజూరయ్యే పరిస్థితి లేదన్నారు. ఎమ్మెల్యేలను, మంత్రులను డమ్మీలుగా చేసిన చంద్రబాబును ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరన్నారు. అందుకే ఎన్ని హామీలిస్తున్నా నిన్ను నమ్మం బాబు అంటున్నారని ఎద్దేవా చేశారు.
వైఎస్ జగన్ సీఎం అయితేనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. బీసీ సెల్ రాష్ట్ర నాయకులు యానాదయ్య, జిల్లా అధ్యక్షుడు బంగారు నాగయ్య మాట్లాడుతూ ప్రత్యామ్నాయ రాజకీ య వేదిక లేకనే ఇన్నాళ్లు బీసీలు టీడీపీని మోశారన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బీసీసబ్‌ప్లాన్ ప్రకటించడమే బాబు మోసానికి తార్కాణమన్నా రు. వైఎస్‌ఆర్‌సీపీ బీసీ గర్జన ఒక విప్లవాత్మక కార్యక్రమమని, వైఎస్‌ఆర్‌సీపీ బీసీలకు మేనిఫెస్టోలో ప్రకటించే అంశాలను ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ఆ సభలో ప్రకటిస్తారన్నారు.
వైఎస్‌జగన్ పాదయాత్ర బీసీలకు భరోసా యాత్రలా మారిందని తెలిపారు. బీసీగర్జన సభ ను వెనుకబడిన వర్గాలు, ఆయా సం ఘాల నాయకులు జయప్రదం చే యా లని పిలుపునిచ్చారు. వెఎస్‌ఆర్‌సీపీ బీసీసెల్ నగర అధ్యక్షుడు చినబాబు, యూత్ వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చల్లా రాజశేఖర్, జిల్లా అధ్యక్షుడు బి. నిత్యానందరెడ్డి, మల్లికార్జున, చీర్ల సురేష్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment