K suresh babu
-
ఎన్నికల ముందే బాబుకు బీసీలు గుర్తొస్తారు
కడప కార్పొరేషన్: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎన్నికల ముందే బీసీలు గుర్తొస్తారని వైఎస్ఆర్సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబు విమర్శించారు. గురువారం కడపలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. నాలుగేళ్ల పదినెలల టీడీపీ పాలనలో ఏనాడు చంద్రబాబుకు బీసీలు గుర్తుకురాలేదని, మరో 65రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయని బీసీలు మా పేటెంట్ అంటూ కల్లబొల్లి మాటలు చెబుతున్నారన్నారు. 14నెలల సుదీర్ఘ పాదయాత్రలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ బీసీల ఇబ్బందులు, వారి సమస్యలను గుర్తించారని తమ ప్రభుత్వం వస్తే బీసీల్లోని అన్ని కులాలకు కార్పొరేషన్లు ప్రకటిస్తామని హామీ ఇచ్చారన్నారు. దాన్ని కాపీ కొడుతూ చంద్రబాబు 11 కులాలకు కార్పొరేషన్లు ప్రకటించి, నిన్ననే చైర్మన్లను కూడా నియమించారన్నారు. బీసీలను అవమానించడానికే ఆదరణ పథకం ప్రవేశపెట్టారని ధ్వజమెత్తారు. వెనుకబడిన వర్గాల వారు కులవృత్తుల్లోనే మగ్గిపోకూడదు, వారు కూడా ఉన్నత చదువులు చదవాలని కాంక్షించిన నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ఆయన ప్రవేశపెట్టిన ఫీజురీయింబర్స్‌మెంట్ పథకం వల్లే ఎంతోమంది బీసీ విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగాల్లో ఉన్నారని తెలిపారు. అలాగే ఐదు కులాలకు ఫెడరేషన్లు ఏర్పాటు చేశారని, ఎంతోమంది బీసీల ను రాజకీయంగా పైకితెచ్చారన్నారు. నేను మారాను, నా అనుభవంతో కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానంటేనే రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు అధికారం ఇచ్చారన్నారు. కానీ ఆయన దాన్ని సద్విని యోగం చేసుకోలేదన్నారు. తన విలాసాలు, విదేశీటూర్ల కోసం వేలకోట్లు ఖర్చు పెట్టి, కమీషన్లు దండుకొని అవినీతిలో ఏపీని నంబర్‌వన్ చేశారన్నారు. పయ్యావుల కేశవ్, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, నారాయణ. తన కొడుకు నారా లోకేష్‌లకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి మంత్రులను చేసిన చంద్రబాబుకు 52 శాతం ఉన్న బీసీల్లో ఒక్క నాయకుడు కూడా కనిపించకపోవడం బాధాకరమన్నారు. ప్రయివేటు కళాశాలల్లో ఫీజులు అధిక సంఖ్యలో ఉన్నా రాష్ట్రప్రభుత్వం మాత్రం వైఎస్ఆర్ ఉన్నప్పు డు ఇస్తున్న రూ.32వేలను మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్‌గా ఇస్తోందని చెప్పా రు. ఫీజులు చెల్లించలేక చాలా మంది చదువులకు స్వస్తి పలకాల్సి వస్తోందని ఆవేధన వ్యక్తం చేశారు. టీడీపీ విధానాల పట్ల విసిగివేసారిన బీసీలు వైఎస్ జగన్‌కు పేటెంట్గా మారుతున్నారని తెలిపారు. జనాన్ని మోసగించడానికే కొత్త కొత్త హామీలు: మేడా మల్లికార్జునరెడ్డి జనాలను మోసగించడానికే సీఎం చంద్రబాబు కొత్త హామీలిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి అన్నారు. రైతులకు పదివేలు ఇస్తామని చెప్పడం కూడా మోసమేనన్నారు. రెండు నెలల్లో ఎన్నికలు వస్తున్నందున ఇవేవీ మంజూరయ్యే పరిస్థితి లేదన్నారు. ఎమ్మెల్యేలను, మంత్రులను డమ్మీలుగా చేసిన చంద్రబాబును ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరన్నారు. అందుకే ఎన్ని హామీలిస్తున్నా నిన్ను నమ్మం బాబు అంటున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ సీఎం అయితేనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. బీసీ సెల్ రాష్ట్ర నాయకులు యానాదయ్య, జిల్లా అధ్యక్షుడు బంగారు నాగయ్య మాట్లాడుతూ ప్రత్యామ్నాయ రాజకీ య వేదిక లేకనే ఇన్నాళ్లు బీసీలు టీడీపీని మోశారన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బీసీసబ్‌ప్లాన్ ప్రకటించడమే బాబు మోసానికి తార్కాణమన్నా రు. వైఎస్ఆర్సీపీ బీసీ గర్జన ఒక విప్లవాత్మక కార్యక్రమమని, వైఎస్ఆర్సీపీ బీసీలకు మేనిఫెస్టోలో ప్రకటించే అంశాలను ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ఆ సభలో ప్రకటిస్తారన్నారు. వైఎస్జగన్ పాదయాత్ర బీసీలకు భరోసా యాత్రలా మారిందని తెలిపారు. బీసీగర్జన సభ ను వెనుకబడిన వర్గాలు, ఆయా సం ఘాల నాయకులు జయప్రదం చే యా లని పిలుపునిచ్చారు. వెఎస్ఆర్సీపీ బీసీసెల్ నగర అధ్యక్షుడు చినబాబు, యూత్ వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చల్లా రాజశేఖర్, జిల్లా అధ్యక్షుడు బి. నిత్యానందరెడ్డి, మల్లికార్జున, చీర్ల సురేష్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
మానవమాత్రులు ఇన్ని రోజులు దీక్ష చేయలేరు!
కడప కార్పొరేషన్: మానవమాత్రులు ఇన్ని రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేయలేరని, బీపీ, షుగర్ ఉన్నవారు ఒక్కరోజు కూడా దీక్ష చేయడం కష్టమని, ఇది ఎలా సాధ్యమని వైఎస్ఆర్సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబు అన్నారు. గురువారం కడపలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో కమలాపురం, కడప ఎమ్మెల్యేలతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం రమేష్‌కి దేవుడు అతీంద్రియ శక్తులు ఇచ్చాడో, చంద్రబాబు శక్తి ఇచ్చాడో తెలియదుగానీ ఇన్ని రోజులు దీక్ష చేస్తున్నారని ఎద్దేవా చేశారు. భారతదేశంలో పొట్టి శ్రీరాములు తర్వాత అత్యధిక రోజులు చేసిన దీక్ష ఇదేనన్నారు. సీఎం రమేష్ దీక్షపై వైద్యులు ప్రతిరోజూ హెల్త్ బులెటిన్ ఎందుకు విడుదల చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ఎక్కువ రోజులు దీక్ష చేస్తే కీటోన్స్ పెరిగిపోయి కిడ్నీలపై ప్రభావం చూపి ప్రాణాలకే ప్రమాదమని, కానీ సీఎం రమేష్ మాత్రం ఎంతో చలాకీగా, నిత్య పెళ్లికొడుకులా చెవిలో హియర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటున్నాడని ఎద్దేవా చేశారు. అధికారాన్ని దుర్వినియోగం చేసి సంఘీభావం పేరుతో అన్ని ప్రభుత్వ కార్యాలయాల నుంచి అ«ధికారులను, డ్వాక్రాసంఘాల సభ్యులను, ఆశా వర్కర్లను, డిగ్రీ కాలేజీ లెక్చరర్లను తరలించడం అత్యంత దారుణమన్నారు. అదేమైనా ప్రభుత్వ కార్యక్రమమా...ప్రభుత్వ శాఖల అధికారులను అక్కడికి ఎందుకు పంపుతున్నారు, కలెక్టర్, ఎస్పీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు సీఎంరమేష్ ఎందుకు మాట్లాడలేదని ఆయన నిలదీవారు. నాలుగేళ్లుగా పోలవరం, అమరావతి పేరుతో లక్షల కోట్లు దండుకొని ఇప్పుడు తగుదునమ్మా అని దీక్ష చేయడం హాస్యాస్పదమన్నారు. ఉక్కు పరిశ్రమ కోసం తమ ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, టీడీపీ ఎమ్మెల్యేలు కూడా అందుకు సిద్ధమవుతారేమో చెప్పాలని సవాల్ విసిరారు. నాలుగేళ్లు ప్రజలను మోసం చేసిన టీడీపీ ప్రజలకు క్షమాపణ చెప్పి పోరాటం చేయాలని సూచించారు. అధికారులు విధులు మరిచి ప్రవర్తించవద్దు: ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు విధులు మరిచి ప్రవర్తించవద్దని కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి హితవు పలికారు. ఈ ప్రభుత్వం ఎన్నాళ్లో ఉండదని, వన్‌సైడ్‌గా వ్యవహరించిన అధికారులు జవాబు చెప్పుకోవాల్సిన రోజు వస్తుందని హెచ్చరించారు. బాబు కనుసన్నల్లో సీఎం రమేష్ దీక్ష కొనసాగుతోందని, అధికారులను ఆఫీసుల్లో పనిచేయకుండా వారి చుట్టూ తిప్పుకోవడం సరికాదన్నారు. గతంలో డ్వాక్రా మహిళలను తరలించేవారని, ఇప్పుడు ఆ పరిధి దాటిపోయి ప్రభుత్వ ఉద్యోగులను తరలిస్తున్నారన్నారు. ఇది అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అన్నారు. నాలుగేళ్లుగా టీడీపీ వైఖరి ఎలా ఉందో ప్రజలకు బాగా తెలుసని, సీఎం రమేష్ చేస్తున్నది నయవంచన దీక్ష అని విమర్శించారు. షుగర్, బీపీ లేనివారే ఏడు రోజులు దీక్ష చేయడం కష్టమని, 250 షుగర్ ఉన్న సీఎం రమేష్ 9 రోజులు దీక్ష చేయడం ఆశ్చర్యకరమన్నారు. ఆయన వాడే నీళ్ల బాటిల్ రూ.3వేలట, ప్రతి అరగంటకొకసారి లోపలికి పోయి వస్తుంటారట, ఇదేమి దీక్ష అని ఎద్దేవా చేశారు. మనిషికి రూ.500నోటు, మద్యం, బిర్యానీ ఇచ్చి దీక్షకు పిలిపించుకోవడాన్ని ఎవరూ హర్షించరని చెప్పారు. అది కార్పొరేట్ దీక్ష అని, ప్రభుత్వ ధనాన్ని కూడా దీనికి ఖర్చుపెట్టడం దారుణమన్నారు. ప్రతిరోజూ దీక్షకు ఎంత ఖర్చు చేస్తున్నారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆరేళ్లలో ఒక్కసారైనా నోరు విప్పారా: ఎమ్మెల్యే అంజద్‌బాషా ఆరేళ్లు రాజ్యసభ సభ్యునిగా ఉన్న సీఎం రమేష్ ఏనాడైనా ఉక్కు పరిశ్రమ గూరించిగానీ, ఈ ప్రాంత అభివృద్ధి గూర్చి నోరు విప్పారా అని కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా ప్రశ్నించారు. సీఎంకి సన్నిహితంగా ఉంటూ, ఆయనతోపాటు స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతూ జిల్లాకు ఒక్క పరిశ్రమ తెచ్చేందుకు కృషి చేశారా అని నిలదీశారు. నాలుగేళ్లేపాటు తాము అఖిలపక్షంతో కలిసి ప్రత్యేకహోదా, విభజన హామీలపై పోరాటం చేస్తుంటే అరెస్టులు చేసి, అక్రమ కేసులు బనాయించారని ధ్వజమెత్తారు. చివరకు ప్రధాని దిష్టిబొమ్మ కాల్చేందుకు కూడా అనుమతి ఇవ్వలేదని గుర్తుచేశారు. రాష్ట్రానికి బీజేపీ ఎంత అన్యాయం చేసిందో, టీడీపీ అంతకు రెట్టింపు చేసిందన్నారు. 29 సార్లు ఢిల్లీకి వెళ్లిన సీఎం అసెంబ్లీ సీట్ల పెంపు, పోలవరం కాంట్రాక్టుల గూర్చే మాట్లాడారే తప్పా ప్రత్యేక హోదా, విభజన హామీల గూర్చి మాట్లాడలేదని దుయ్యబట్టారు. 55 ఏళ్ల వయసులో దీక్ష చేస్తున్న సీఎం రమేష్ 250కిపైగా షుగర్ లెవెల్స్ ఉండి 11 రోజులు దీక్ష చేస్తానని చెప్పడం వింతగా ఉందన్నారు. తనకు షుగర్ అటాక్ కానప్పుడు 43ఏళ్ల వయసులో ఆరు రోజులు దీక్ష చేస్తేనే కీటోన్స్ పెరిగిపోయి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిందని, సీఎం రమేష్ మాత్రం అదేదో సిన్మా తీస్తున్నట్లు ప్రీ ప్లాన్డ్గా చెప్పేయడం అనుమానాలకు తావిస్తోందన్నారు. శక్తినిచ్చే ఫ్లూయిడ్స్ తీసుకుంటే తప్పా ఇన్ని రోజులు దీక్ష చేయలేరని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి, వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు పులి సునీల్‌కుమార్, మాజీ అధ్యక్షుడు బి.నిత్యానందరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, ఎం.రాజగోపాల్‌రెడ్డి, షఫీ, ఖదీర్ పాల్గొన్నారు. -
ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం
కడప అర్బన్ : ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, ముఖ్యంగా 40 సంవత్సరాలు పైబడిన వారు ఆరు నెలలకు ఒక సారి వైద్య పరీక్షలు చేయించుకోవడం ఎంతైనా అవసరమని కడప ఎమ్మెల్యే ఎస్బి అంజద్‌బాష, కడప నగర మేయర్ కె.సురేష్‌బాబు అన్నారు. ఆదివారం నగరంలోని తిరుమల హాస్పిటల్స్‌లో గోసుల కృష్ణారెడ్డి ఫౌండేషన్, తిరుమల హాస్పిటల్స్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని వారు ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మేయర్ మాట్లాడతూ కడప నగరంలో ఒకటిన్నర సంవత్సరాల కాలంలో డాక్టర్ గోసుల శివభారత్‌రెడ్డి 209 మందికి మోకాళ్ల కీళ్ల మార్పిడి సర్జరీలు విజయవంతంగా నిర్వహించినందుకు అభినందించారు. కడప ఎమ్మెల్యే అంజద్‌బాష మాట్లాడుతూ 50 సంవత్సరాలు పైబడిన వారికి మెకాళ్ల నొప్పులు రావడం సహజమన్నారు. డాక్టర్ సురేంద్రబాబు సారధ్యంలో ఏర్పాటైన తిరుమల హాస్పిటల్స్‌లో డాక్టర్ గోసుల శివభారత్‌రెడ్డి 209 కీళ్ల మార్పిడి ఆపరేషన్లు నిర్వహించడం సంతోషకరమన్నారు. ఈ నెల 26న 210 మందిలో కీళ్లమార్పిడి శస్త్ర చికిత్సను చేయించుకున్న వారిలో 2కే రన్ నిర్వహిస్తుండడంపై హర్షం వ్యక్తం చేశారు. డాక్టర్ గోసుల శివభారత్‌రెడ్డి, తిరుమల హాస్పిటల్స్ డాక్టర్ పి.సురేంద్రబాబు మాట్లాడారు. ఈ సమావేశంలో తిరుమల హాస్పిటల్స్ పరిపాలనాధికారి (ఏవో)మారుతితేజ, వైఎస్ఆర్సీపీ నేతలు షఫి, కార్పొరేటర్ రామలక్ష్మణ్‌రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.