ysr kadapa
-
కూటమి దౌర్జన్యాలకు తెర.. తిరిగింది ఫ్యాన్ గిరగిర
సాక్షి నెట్వర్క్: అధికార కూటమి ప్రభుత్వ బెదిరింపులు, దౌర్జన్యాలు, అడ్డంకుల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా గురువారం జరిగిన ‘స్థానిక’ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తన హవాను చాటుకుంది. అత్యధిక స్థానాల్లో విజయకేతనం ఎగుర వేసింది. ఎక్కడికక్కడ అధికార కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు, నేతలు తీవ్ర బెదిరింపులకు పాల్పడినా చాలా చోట్ల వారి ఆటలు సాగలేదు. పలు చోట్ల ఎంతగా ఒత్తిడి ఎదురైనా ఎంపీటీసీ/జెడ్పీటీసీ/వార్డు సభ్యులు వైఎస్సార్సీపీ అభ్యర్థులు, మద్దతుదారుల పక్షానే నిలిచి ప్రభుత్వ పెద్దలకు బుద్ధి చెప్పారు. తీవ్ర నిర్బంధాలు.. ప్రలోభాలు.. భయపెట్టడాలు.. దాడులు.. వైఎస్సార్సీపీ సభ్యులపైకి పోలీసుల ప్రయోగాలు.. అయినప్పటికీ అధికార కూటమి పార్టీలకు స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఆశించిన ఫలితం దక్కలేదు. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేసినా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు తాము గెలిచిన పార్టీ వైఎస్సార్సీపీ జెండాను గట్టిగా పట్టుకుని మరోసారి చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. ఎన్ని రకాలుగా ప్రలోభపెట్టినా అధికార టీడీపీ వైపు పెద్దగా మొగ్గు చూపలేదు. ఒక జడ్పీ చైర్మన్, 24 ఎంపీపీ, 17 వైస్‌ఎంపీపీ, 8 కో ఆప్షన్ సభ్యుల స్థానాలు మొత్తం కలిపి 50 స్థానాలకు గురువారం ఎన్నికలు జరగగా, 40 స్థానాల్లో (ఇందులో ఒక వైస్ ఎంపీపీ రెబల్) వైఎస్సార్సీపీ గెలిచింది. ఆరు స్థానాల్లో టీడీపీ, రెండు చోట్ల జనసేన, ఒకచోట బీజేపీ.. ప్రలోభాలతో గట్టెక్కారు. 7 స్థానాల్లో ఎన్నిక వివిధ కారణాలతో వాయిదా పడింది. 210 గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచు పదవులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గురువారం ఎన్నికలు నిర్వహించింది. ఇందులో 184 పంచాయతీల్లో ఉప సర్పంచు ఎన్నిక పూర్తయింది. వార్డు సభ్యుల పదవి ఖాళీగా ఉండటం వల్ల 16 పంచాయతీల్లో ఉప సర్పంచు ఎన్నిక రద్దయింది. మరో పది పంచాయతీల్ల్లో ఉప సర్పంచు ఎన్నిక వాయిదా పడింది. తీవ్ర ఉత్కంఠ మధ్య జరిగిన వైఎస్సార్ కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ముత్యాల రామగోవిందరెడ్డి ఏకీగ్రవంగా ఎన్నికయ్యారు. దౌర్జన్యకాండ.. వైఎస్సార్ జిల్లా గోపవరంలో వైఎస్సార్సీపీ మద్దతుదారుడైన ఉప సర్పంచ్ అభ్యర్థి రాఘవేంద్రారెడ్డిపై దాడి చేస్తున్న టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ జెడ్పీ పీఠంపై ఫ్యాన్ రెపరెపలు వైఎస్సార్ జిల్లా జెడ్పీ చైర్మన్‌గా బ్రహ్మంగారిమఠం జెడ్పీటీసీ సభ్యుడు ముత్యాల రామగోవిందురెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ డిక్లరేషన్ అందజేసి, ప్రమాణ స్వీకారం చేయించారు. గురువారం ఉదయం 10 గంటలకు సహాయ ఎన్నికల అధికారి, జెడ్పీ సీఈఓ ఓబుళమ్మ వద్ద నామినేషన్ దాఖలు చేశారు. 11 గంటలకు ఎన్నికల ప్రక్రియ మొదలైంది. రామగోవిందురెడ్డి అభ్యరి్థత్వాన్ని మాత్రమే జెడ్పీటీసీ సభ్యులు ప్రతిపాదించడం, బలపర్చడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కలెక్టర్ ప్రకటించారు. జిల్లాలోని 48 మంది జెడ్పీటీసీ సభ్యుల్లో ఒక్కరు మాత్రమే టీడీపీ సభ్యుడు. ఐదుగురు వైఎస్సార్సీపీ సభ్యులను టీడీపీ నేతలు బలవంతంగా, ప్రలోభాలతో ఆ పారీ్టలోకి లాక్కున్నారు. ఈ లెక్కన వైఎస్సార్సీపీకి నికరంగా 42 సభ్యుల మద్దతు ఉండగా, వేంపల్లె జెడ్పీటీసీ సభ్యుడు రవికుమార్‌రెడ్డి మాతృమూర్తి వియోగంతో ఎన్నికకు హాజరు కాలేకపోయారు. దీంతో 41 మంది జెడ్పీటీసీ సభ్యులు రామగోవిందురెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దాడులకు తెగబడ్డ టీడీపీ శ్రేణులు వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని గోపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికలో గురువారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ కార్యకర్తలు యథేచ్ఛగా దాడులకు తెగించారు. రెండు కార్లలో వైఎస్సార్సీపీ మద్దతుదారులైన 14 మంది వార్డు సభ్యులు రాగా, గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలోని పెద్దమ్మ గుడి వద్ద పోలీసులు వారిని నిలిపేశారు. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లాలని చెప్పడంతో వైఎస్సార్సీపీ మద్దతుదారుడైన ఉప సర్పంచ్ అభ్యర్థి బీరం రాఘవేంద్రారెడ్డి కారు దిగబోయాడు. అంతలోనే వందల సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు కారు వద్దకు వచ్చి అతడిపై దాడి చేస్తూ ఈడ్చుకెళ్లారు. తర్వాత ఆయన అక్కడి నుంచి తప్పించుకుని గ్రామ పంచాయతీ కార్యాలయంలోకి చేరుకున్నారు. కానీ మిగిలిన వార్డు సభ్యులు కారులోనే ఉండిపోయారు. దీంతో టీడీపీ నేతలు కారు అద్దాలను రాళ్లతో ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో వాహన డ్రైవర్‌తో పాటు వార్డు మెంబర్లకు గాయాలయ్యాయి. పంచాయతీ కార్యాలయంలోకి చొరబడిన టీడీపీ నాయకులు టీడీపీ నాయకులు బచ్చల పుల్లయ్య, బచ్చల ప్రతాప్, తోట మహేశ్వరరెడ్డి, వంగనూరు మురళీధర్‌రెడ్డి, చీమల రాజశేఖరరెడ్డి, గంటా వెంకటేశ్వర్లు, బొగ్గుల సుబ్బారెడ్డి, ఈవీ సుధాకర్‌రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు ఎన్నిక జరుగుతున్న కార్యాలయంలోకి దౌర్జన్యంగా వెళ్లారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను అక్కడి నుంచి తరిమేశారు. ఎన్నికల అధికారి రామాంజనేయరెడ్డి కోరం తప్పకుండా ఉండాలని చెప్పడంతో టీడీపీ నాయకులు 10వ వార్డు మెంబర్ కందుల బీబీ, 9వ వార్డు మెంబర్ షేక్ ఖాదర్ బాషా, 4వ వార్డు మెంబర్ కేశవ స్థానంలో నకిలీ గుర్తింపు కార్డులతో కొత్త వ్యక్తులను వార్డు సభ్యులు అని చెప్పి కార్యాలయంలోకి పంపారు. విచారణలో వారు వార్డు సభ్యులు కాదని నిర్ధారించారు. ఈ క్రమంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలోకి వచ్చేందుకు కారులో ఉన్న వైఎస్సార్సీపీ వార్డు సభ్యులు ప్రయతి్నంచగా టీడీపీ నాయకులు మళ్లీ దాడులకు పాల్పడ్డారు. కోరం లేకపోవడంతో ఎన్నికల అధికారి రామాంజనేయరెడ్డి ఎన్నికలను శుక్రవారానికి వాయిదా వేశారు. ఇదిలా ఉండగా, ఒంటిమిట్ట వైస్ ఎంపీపీ ఉప ఎన్నికలో టీడీపీ బెదిరింపులు, ప్రలోభాల పర్వంతో చేజిక్కించుకుంది. ఖాజీపేట ఉప మండలాధ్యక్షురాలిగా వైఎస్సార్సీపీ (రెబల్) అభ్యర్థి ముమ్మడి స్వప్న విజయం సాధించారు. రాయచోటి రూరల్ మండల ఉపాధ్యక్షురాలు–2గా వైఎస్సార్ సీపీకి చెందిన శిబ్యాల ఎంపీటీసీ సభ్యురాలు నాగ సుబ్బమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.త్రిపురాంతకంలో టీడీపీకి దిమ్మ తిరిగేలా షాక్ప్రకాశం జిల్లాలో గురువారం రెండు ఎంపీపీలు, ఒక వైస్ ఎంపీపీ, కో–ఆప్షన్, నాలుగు ఉప సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరిగాయి. రెండు ఎంపీపీలతో పాటు వైస్ ఎంపీపీ, కో–ఆప్షన్ సభ్యుడిని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. మార్కాపురం ఎంపీపీగా బండి లక్ష్మిదేవి, త్రిపురాంతకం ఎంపీపీగా ఆళ్ల సుబ్బమ్మ, పుల్లలచెరువు వైస్ ఎంపీపీగా లింగంగుంట్ల రాములు, యర్రగొండపాలెం కో–ఆప్షన్ సభ్యునిగా సయ్యద్ సాధిక్లు వైఎస్సార్సీపీ తరుఫున ఎన్నికయ్యారు. సృజన, కృష్ణలతో ఎంపీపీ సుబ్బమ్మ త్రిపురాంతకంలో ఎంపీటీసీ సభ్యురాలు ఎం.సృజనను భయపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూసిన టీడీపీకి ఆమె దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఎంపీపీ ఉప ఎన్నికలో పాల్గొనేందుకు టీడీపీ మద్దతు వర్గంతో వచ్చిన ఆమె వైఎస్సార్సీపీ అభ్యర్థినిగా పోటీ చేసిన ఆళ్ల సుబ్బమ్మకు మద్దతుగా చేయి ఎత్తారు. దీంతో మాజీ ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డి ఆమె చున్నీ పట్టుకుని లాగాడు. చేయిదించమని గట్టిగా అరుస్తూ గద్దించినా సృజన చలించలేదు. దీంతోపాటు మేడపి గ్రామానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇండిపెండెంట్ ఎంపీటీసీ సభ్యుడు పి.కృష్ణ నేరుగా వచ్చి సుబ్బమ్మకు మద్దతిచ్చారు. ఫలితంగా వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆళ్ల సుబ్బమ్మ ఎంపీపీగా ఎన్నికైంది. పుల్లలచెరువులో కూడా బలం లేకపోయినా టీడీపీ కుయుక్తులు పన్నింది. రెండు వర్గాలకు సమానంగా ఓట్లు రావడంతో లాటరీలో వైఎస్సార్సీపీ వైస్ ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకుంది.జగనన్న పార్టీకే జై ‘మాజీ ఎంపీపీ ఆళ్ల ఆంజనేయరెడ్డి వెంటే ఉంటానని మాట ఇచ్చాను. నిలబెట్టుకున్నాను. నేను మొదటి నుంచి జగనన్న అభిమానిని. ఆయన చరిష్మాతోనే ఎంపీటీసీ సభ్యురాలిగా గెలిచా. కొంత మంది నన్ను మభ్య పెట్టాలని చూశారు. మూడు రోజులుగా హౌస్ అరెస్ట్ చేసి ఇప్పుడు ఎన్నిక సందర్భంగా ఇక్కడికి తీసుకొచ్చారు. – ఎం.సృజన, ప్రకాశం జిల్లా త్రిపురాంతకం–2 ఎంపీటీసీ సభ్యురాలుధీరనారి... నాగేంద్రమ్మప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం వైస్ ఎంపీపీ పదవికి గురువారం జరిగిన ఉప ఎన్నికలో టీడీపీకి ఓటు వేయాలని భర్త ఒత్తిడి తెచ్చినా, భార్య మాత్రం వైఎస్సార్సీపీ అభ్యర్థికి ఓటు వేసి అటు నుంచి అటే పల్నాడులోని పుట్టింటికి వెళ్లింది. పుల్లల చెరువు మండలం ముటుకుల విద్యుత్ సబ్ స్టేషన్లో పోలయ్య నైట్ వాచ్‌మన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన భార్య వి.నాగేంద్రమ్మ మర్రివేముల ఎంపీటీసీ సభ్యురాలు. మండల వైస్ ఎంపీపీగా పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని ఆ పార్టీ నేతలు పోలయ్యపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. చేసేదిలేక పోలయ్య తన భార్యతో ఓటు వేయిస్తానని చెప్పారు. ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగానే ఆమె వైఎస్సార్సీపీ అభ్యర్థిగా వైస్ ఎంపీపీ పోటీలో ఉన్న రాములుకు మద్దతుగా చేయి ఎత్తారు. ఆ తర్వాత తన భర్తతో మాట పడాల్సి వస్తుందని అటునుంచి అటే పల్నాడు జిల్లా దాచేపల్లిలోని తన పుట్టింటికి వెళ్లారు.రామగిరిలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీల అడ్డగింతశ్రీ సత్యసాయి జిల్లాలో మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత చిల్లర రాజకీయం చేశారు. రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్‌ను అడ్డు పెట్టుకుని వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులను బెదిరించారు. ప్రలోభాలకు గురిచేసే యత్నం చేశారు. మొత్తంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడేలా చేసి ఎంపీపీ పదవి చేజిక్కించుకోవాలని భావించారు. తీవ్ర గందరగోళం మధ్య ఎన్నిక శుక్రవారానికి వాయిదా పడింది. కంబదూరు ఎంపీపీగా ఎన్నికైన లక్ష్మీదేవితో వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు, మాజీ ఎంపీ తలారి రంగయ్య రామగిరి మండలంలో మొత్తం 10 ఎంపీటీసీ స్థానాలకు గానూ 9 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలిచారు. ఎంపీపీ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. ఈ క్రమంలో ఎంపీపీగా ఉన్న మీనుగ నాగమ్మ ఇటీవల మరణించారు. దీంతో ఎన్నిక అనివార్యమైంది. అయితే టీడీపీ తరఫున ఒక్క మహిళా సభ్యురాలు కూడా లేకపోవడంతో ఫిరాయింపు రాజకీయాలకు తెరలేపారు. టీడీపీ తరఫున ఒక్కరే ఉన్నారు. భయపెట్టి, ప్రలోభాలకు గురిచేసి ఇద్దరు వైఎస్సార్సీపీ ఎంపీటీసీలకు టీడీపీలోకి లాక్కున్నారు. ముగ్గురూ పురుషులే కావడంతో టీడీపీ తరఫున నామినేషన్ వేసేందుకు అభ్యర్థి కూడా లేరు. ఈ క్రమంలో బెంగళూరులో ఉన్న వైఎస్సార్సీపీ సభ్యులు ఆరుగురు రామగిరికి వస్తుండగా.. కర్ణాటక సరిహద్దులోని బాగేపల్లి టోల్ ప్లాజా వద్దకు పోలీసులు చేరుకుని అడ్డుకున్నారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు బందోబస్తు మధ్య రామగిరికి తామే తీసుకెళ్తామని, మిగతా వాళ్లు రాకూడదని చెప్పారు. ఈ క్రమంలో ఆలస్యం కావడంతో నామినేషన్ దాఖలు చేసేందుకు గడువు మీరిందని.. ఎన్నికను మరుసటి రోజుకు (శుక్రవారానికి) వాయిదా వేస్తున్నట్లు ప్రిసైడింగ్ ఆఫీసర్ సంజీవయ్య ప్రకటించారు. దీంతో మార్గం మధ్యలో ఉన్న వైఎస్సార్సీపీ సభ్యులను పెనుకొండ తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. ఈ నేపథ్యంలో ఎస్ఐ సుధాకర్ యాదవ్ అక్కడికి చేరుకుని వైఎస్సార్సీపీ సభ్యులతో పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్‌కు వీడియో కాల్ కలిపారు. డబ్బులు, పదవులు ఆశ చూపి.. పార్టీ మారాలని వారు కోరగా.. వైఎస్సార్సీపీ సభ్యులు ఒప్పుకోలేదు. ఈ క్రమంలో అనారోగ్యంగా ఉందని.. వాంతి వస్తోందని పేరూరు–2 ఎంపీటీసీ సభ్యురాలు భారతి వాహనం నుంచి కిందకు దిగారు. వెనుకే వస్తున్న టీడీపీ నేతలు ఆమెను బలవంతంగా వారి వాహనం ఎక్కించుకుని ఉడాయించారు. మిగిలిన ఐదుగురు వైఎస్సార్సీపీ సభ్యులను కర్ణాటక సరిహద్దు వరకు పోలీసులు వదిలివచ్చారు. కాగా, కూటమి పార్టీల నేతలు చెప్పినట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని.. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వ్యవస్థకు చెడ్డపేరు తెస్తోన్న ఎస్ఐ మొన్నటి వరకు సెలవులో ఉన్న రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ ఉన్నఫలంగా ఎంపీపీ ఎన్నికల సమయంలో విధులకు రావడం దేనికి? బందోబస్తులో భాగంగా రామగిరిలో డ్యూటీ ముగించుకుని వెంటనే.. ప్రత్యేక వాహనాల్లో వైఎస్సార్సీపీ సభ్యుల వెంట వెళ్లడం.. పరిటాల సునీత, శ్రీరామ్‌తో వీడియో కాల్స్ మాట్లాడించి.. బెదిరింపులకు దిగడం సబబు కాదు. రక్షణ కల్పించాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. కానీ న్యాయ వ్యవస్థకే మచ్చ తెచ్చేలా ఎస్ఐ సుధాకర్ యాదవ్ ప్రవర్తించాడు. గత ఎన్నికల్లోనూ ఆయన అనంతపురం జిల్లాలో టీడీపీ తరఫున బరిలో దిగేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత కూడా టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు.– తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేకర్నూలు జిల్లాలో ఫ్యాన్ ప్రభంజనంఉమ్మడి కర్నూలు జిల్లాలోని స్థానిక సంస్థల్లో ఏర్పడిన నాలుగు ఖాళీలకు గురువారం నిర్వహించిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. జెడ్పీ కోఆప్షన్ సభ్యునిగా శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడుకు చెందిన మదర్ఖాన్ ఇలియాజ్‌ఖాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కృష్ణగిరి కోఆప్షన్ సభ్యునిగా వైఎస్సార్సీపీ మద్దతుదారుడు చిన్నషాలును సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తుగ్గలి మండల పరిషత్ అధ్యక్షురాలిగా మండలంలోని శభాష్‌పురం ఎంపీటీసీ సభ్యురాలు రాచపాటి రామాంజనమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వెల్దుర్తి ఎంపీపీగా ఎల్.నగరం ఎంపీటీసీ దేశాయి లక్ష్మిదేవమ్మను ఎన్నుకున్నారు. నందిగామ పీఠం వైఎస్సార్సీపీదే ఎనీ్టఆర్ జిల్లా నందిగామ మండల పరిషత్ పీఠాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. గురువారం నిర్వహించిన ఎన్నికలో రాఘవాపురం ఎంపీటీసీ సభ్యురాలు పెసరమల్లి రమాదేవి ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కిడ్నాప్ చేసి దక్కించుకున్న టీడీపీ పల్నాడు జిల్లా అచ్చంపేటలో మొత్తం 17 మంది ఎంపీటీసీ సభ్యుల్లో 16 మంది వైఎస్సార్ సీపీ, ఒక్కరు టీడీపీ. వారిలో గ్రంధశిరి ఎంపీటీసీ సభ్యుడు చిలకా జ్ఞానయ్య అనారోగ్యంతో మృతి చెందారు. మిగిలిన 16 మందితో ఎన్నిక నిర్వహించవలసి ఉంది. అయితే బుధవారం పోలీసుల సహాయంతో టీడీపీ నేతలు తొమ్మిది మంది వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను కిడ్నాప్ చేశారు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ వారికి పచ్చ కుండువాలు కప్పి బలవంతంగా ఎన్నికకు తీసుకువచ్చారు. వైఎస్సార్సీపీకి మద్దతిస్తున్న ఆరుగురు ఎంపీటీసీలను ఆలస్యంగా వచ్చారన్న సాకుతో ఎన్నికకు రాకుండా అధికారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో నూతన ఎంపీపీగా భూక్యా స్వర్ణమ్మ భాయి ఎంపీపీగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. నరసరావుపేటలో ఎన్నిక బాయ్‌కాట్ నరసరరావుపేట వైస్ ఎంపీపీ ఎన్నిక కోరం లేదన్న కారణంతో ఆగిపోయింది. మొత్తం 17 మంది ఎంపీటీసీలకు గాను అన్ని స్థానాలు వైఎస్సార్సీపీ ఖాతాలోనే ఉన్నాయి. ఇందులో గతంలో వైస్ ఎంపీపీగా గెలిచిన యాంపాటి లక్ష్మీ మరణించడంతో గురువారం ఎన్నికకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే బుధవారం రాత్రి ఎంపీపీ భర్త మూరబోయిన శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ మండల కనీ్వనర్ తన్నీరు శ్రీనిసవారావు, పాలపాడు ఎంపీటీసీ మెట్టు రామిరెడ్డిలను పోలీసుల సహాయంతో టీడీపీ నేతలు అపహరించారు. దీనికి నిరసనగా ఎన్నికలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు పాల్గొనలేదు. విడవలూరులో ఏకపక్షంగా ఎన్నిక నెల్లూరు జిల్లా విడవలూరు ఎంపీపీని గురువారం ఏకపక్షంగా ఎన్నుకున్నారు. మొత్తం 14 స్థానాల్లో వైఎస్సార్సీపీ 12, సీపీఎం 2 స్థానాల్లో గతంలో విజయం సాధించాయి. అయినప్పటికీ బెదిరింపులతో టీడీపీ బలపరిచిన ఏకుల శేషమ్మను ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దగదర్తిలో వాయిదా వేశారు. విశాఖలో వైఎస్సార్సీపీకి నాలుగుఉమ్మడి విశాఖ జిల్లాలో జరిగిన ఎంపీపీ ఉప ఎన్నికల్లో ఫ్యాన్ జోరు పెంచింది. మొత్తం 5 ఎంపీపీ, 2 వైఎస్ ఎంపీపీ, ఒక కోఆప్షన్ మెంబర్‌కు గురువారం ఎన్నికలు జరిగాయి. వీటిలో 4 ఎంపీపీ, ఒక వైఎస్ ఎంపీపీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది.సీఎం సొంత జిల్లాలో టీడీపీ అరాచకం తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో గురువారం జరిగిన నాలుగు మండలాల ఎంపీపీ ఉప ఎన్నికల్లో మూడింట్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం పరిధిలోని రామకుప్పం ఎంపీపీ స్థానాన్ని, వైస్ ఎంపీపీ స్థానాన్ని టీడీపీ అడ్డదారిలో కైవశం చేసుకుంది. రామకుప్పంలో ఉప ఎన్నిక సందర్భంగా ఎనిమిది మంది ఎంపీటీసీలతో ఎమ్మెల్సీ భరత్‌కృష్ణ మండల పరిషత్ కార్యాలయానికి బయలు దేరారు. వీరి వాహనాన్ని టీడీపీ మూకలు పథకం ప్రకారం పట్రపల్లి క్రాస్, అన్నవరం క్రాస్, రాజుపేట క్రాస్‌లో అడ్డుకున్నారు. ఎంపీటీసీల వాహనానికి ముందు, వెనుక కార్లు, ట్రాక్టర్లు, టెంపో వాహనాలను అడ్డుపెట్టి ముందుకు కదలకుండా చేశారు. మరి కొన్నిచోట్ల చెట్లను నరికి రోడ్డుకు అడ్డుగా వేశారు. అడ్డుగా ఉన్న వాహనాలు, చెట్లను తొలగించుకుంటూ రామకుప్పం మండల పరిషత్ కార్యాలయం చేరేసరికి మధ్యాహ్నం ఒంటి గంట అయ్యింది. ఆ లోపు టీడీపీ ఆరుగురు ఎంపీటీసీలతో ఎంపీపీ ఎన్నికను పూర్తి చేయించుకున్నారు. చివరకు ఎంపీపీగా టీడీపీ బలపరచిన సులోచనమ్మ, వైస్ ఎంపీపీగా టీడీపీ బలపరచిన వెంకట్రామయ్య గౌడ్ గెలుపొందారు. ఆ మూడు మండల పరిషత్‌లు వైఎస్సార్సీపీ ఖాతాలోకే.. తిరుపతి జిల్లాలోని తిరుపతి రూరల్ మండల అధ్యక్షుడిగా మూలం చంద్రమోహన్‌రెడ్డి, చిత్తూరు జిల్లా సదుం మండల పరిషత్ అధ్యక్షురాలిగా మాధవి, తవణంపల్లి ఎంపీపీగా ప్రతాప్సుందర్రాయల్ రెడ్డి విజయం సాధించారు. వీరు ముగ్గురూ వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థులే. చిత్తూరు జిల్లా విజయపురం మండల ఉపాధ్యక్షురాలిగా వైఎస్సార్సీపీ బలపరిచిన కన్నెమ్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం కో–ఆప్షన్ సభ్యురాలిగా వైఎస్సార్సీపీ బలపరచిన నసీమా ఎన్నికయ్యారు. తిరుపతి జిల్లా యర్రావారిపాళెం మండలంలోని చింతగుంట పంచాయతీ ఉప సర్పంచ్‌గా వైఎస్సార్సీపీ మద్దతుదారు అన్నపూర్ణ గెలుపొందారు. చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లె ఉప సర్పంచ్‌గా టీడీపీ బలపరచిన వెంకటరమణ గెలుపొందారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం తాళ్లపల్లె పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక కోరం లేక వాయిదాపడింది. భయపెట్టినా..నిలబడ్డారు నామమాత్రపు బలం లేకపోయినా బాపట్ల నియోజకవర్గంలోని పిట్టలవానిపాలెం ఎంపీపీ స్థానాన్ని దక్కించుకునేందుకు టీడీపీ పన్నిన కుట్రలు భగ్నమయ్యాయి. పిట్టలవానిపాలెం ఎంపీపీ పరిధిలో 11 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, 10 మంది ఎంపీటీసీలు వైఎస్సార్సీపీ తరఫున పోటీకి దిగిన దిందుకూరి సీతారామరాజుకు మద్దతుగా నిలిచి ఓట్లేశారు. ఆయన ఎంపీపీగా ఎన్నికయ్యారు. భట్టిప్రోలు మండల పరిషత్ కో–ఆప్షన్ సభ్యుడిగా వైఎస్సార్సీపీ మద్దతుదారుడు సయ్యద్ నబీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చెరుకుపల్లి మండలం తుమ్మలపాలెం ఉప సర్పంచ్‌గా వైఎస్సార్సీపీ మద్దతుదారుడు శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికకాగా, రేపల్లె మండలం పేటేరు ఉప సర్పంచ్‌గా టీడీపీ మద్దతు దారు శ్రీదేవి ఎన్నికయ్యారు. భట్టిప్రోలు మండలం పెదపులివర్రు ఉప సర్పంచ్‌గా టీడీపీ మద్దతు దారుడు శ్రీనివాసరావు, పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం ఉప సర్పంచ్‌గా టీడీపీ మద్దతు పలికిన వాసంతి విజయం సాధించారు. పశ్చిమగోదావరిలో ప్రజాస్వామ్యం ఖూనీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో గురువారం జరిగిన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఉప సర్పంచ్ ఎన్నికల్లో ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేస్తూ పచ్చమూకలు రెచి్చపోయాయి. అత్తిలిలో 20 ఎంపీటీసీ స్థానాలకు గాను ఒక ఎంపీటీసీ గల్ఫ్‌లో ఉండగా, ప్రస్తుతం వైఎస్సార్సీపీకి 13, కూటమికి ఆరుగురు సభ్యుల సంఖ్యాబలం ఉంది. ఐదుగురు సభ్యులను తమవైపు తిప్పుకొనేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించి ఎన్నిక జరగకుండా అడ్డుకున్నారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నివాసం నుంచి ఉదయం 13 మంది సభ్యులు బయలుదేరుతుండగా అధిక సంఖ్యలో కూటమి శ్రేణులు ఇంటిని చుట్టుముట్టారు. రోడ్డుకు మోటారు సైకిళ్లు అడ్డంగా పెట్టి దమ్ముంటే తీసుకువెళ్లమంటూ గొడవకు దిగారు. ఒకానొక దశలో గేట్లు తోసుకుంటూ లోపలకు వచ్చే ప్రయత్నం చేయడంతో ఎంపీటీసీ సభ్యులు కారుమూరి నివాసంలోకి వెళ్లి తలదాచుకోవాల్సి వచి్చంది. మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నిక వాయిదా వేసినట్టు సమాచారం అందాక కూటమి శ్రేణులు కారుమూరి నివాసం నుంచి వెళ్లారు.యలమంచిలిలో హైడ్రామాకూటమి హైడ్రామా నడుమ యలమంచిలి ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. 17 మంది ఎంపీటీసీలకు గాను 13 మంది వైఎస్సార్సీపీ సభ్యులు కాగా, నలుగురు కూటమి సభ్యులు ఉన్నారు. వైఎస్సార్సీపీ ఎంపీపీ ఎన్నిక లాంఛనమే కావాల్సి ఉంది. తమకు ఓటేయాలని వైఎస్సార్సీపీ నాయకుల నుంచి తమకు బెదిరింపులు వస్తున్నాయంటూ కూటమి సభ్యులు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయగా, అధికారులు ఎన్నికను శుక్రవారానికి వాయిదా వేశారు. కైకలూరు వైస్ ఎంపీపీ ఎన్నికల్లో కూటమి నేతలు అరాచకానికి తెగబడ్డారు. వైఎస్సార్సీపీకి చెందిన భుజబలపట్నం ఎంపీటీసీ సభ్యుడు పెన్మత్స సూర్యనారాయణరాజును కూటమి నేతలు ఓటింగ్‌కు రాకుండా అడ్డుకున్నారు. ఈ సన్నివేశాన్ని ఫొటోలు తీస్తున్న స్థానిక జర్నలిస్ట్ కురేళ్ల కిషోర్‌ను కూటమి నేతలు చితకబదారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీని రాకుండా అడ్డుకోవడంతో నియోజకవర్గ ఇన్చార్జి దూలం నాగేశ్వరరావు నిరసన వ్యక్తం చేశారు. కూటమి పార్టీకి చెందిన తొమ్మిది మంది మాత్రమే ఎన్నికకు హాజరుకావడంతో కోరం లేక ఎన్నికను శుక్రవారానికి వాయిదా వేశారు. -
ఎల్లో మీడియాపై వైఎస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి ధ్వజం
సాక్షి,పులివెందుల: ఎల్లో మీడియాపై మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి మండిపడ్డారు. వైఎస్ వివేకా హత్య కేసు విచారణను తప్పుదోవ పట్టించేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. మాజీ ఎంపీ వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో ఎల్లో మీడియా చేస్తున్న విష ప్రచారంపై వివేకా పీఏ కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘తప్పుడు సాక్ష్యం ఇవ్వాలని గతంలో నన్ను విపరీతంగా కొట్టారు. తప్పుడు సాక్ష్యం చెప్పాలని సీబీఐ ఎస్పీ రాంసింగ్... నాపై ధర్డ్ డిగ్రీ ప్రయోగించాడు.సీబీఐ ఎస్పీ రాంసింగ్ చెప్పినట్లుగా తప్పుడు సాక్ష్యం చెప్పాలని వివేకా కుమార్తె సునీతారెడ్డి నన్ను బెదిరించింది. నేను తప్పుడు సాక్ష్యం చెప్పకపోతే.. తన భర్త జైలుకు వెళ్తాడని సునీతారెడ్డి చెప్పింది’ అని అన్నారు. -
నా భర్తకు ఏం జరిగినా అందుకు హోంమంత్రి అనితదే బాధ్యత
సాక్షి, వైఎస్సార్‌జిల్లా : నా భర్తకు ఏం జరిగినా అందుకు హోంమంత్రి అనిత బాధ్యత వహించాలని వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డి భార్య కల్యాణి హెచ్చరించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ప్రజల్ని చైతన్య పరుస్తున్న వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లను వేధించడమే లక్ష్యంగా అక్రమ కేసులు బనాయిస్తోంది. విచారణ పేరుతో వేధిస్తోంది. తాజాగా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేయించింది. ఇంతవరకూ వర్రా రవీంద్రారెడ్డి ఆచూకీ లభించలేదు. పైగా విచారణ పేరుతో అతని కుటుంబసభ్యులను నిన్నంతా స్టేషన్లో ఉంచిన పోలీసులు వేధింపులకు గురి చేశారు. దీంతో తన కుమారుడు ఆచూకీ చెప్పాలని వర్రా రవీంద్రారెడ్డి కుటుంబ సభ్యులు పోలీసులను డిమాండ్ చేశారు. పోలీసుల నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో కుమారుడికి కోసం వర్రా రవీంద్రారెడ్డి తల్లి దండ్రులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. ఈ సందర్భంగా రవీంద్రారెడ్డికి ఏదైనా జరిగితే హోంమంత్రి అనితే బాధ్యత వహించాలని అతని భార్య కల్యాణి స్పష్టం చేశారు. -
ఇదేం రాజ్యం చంద్రబాబూ.. బద్వేల్ ఘటనపై వైఎస్ జగన్ ఆవేదన
సాక్షి,తాడేపల్లి : బద్వేల్లో కాలేజీ విద్యార్థినిని హత్యాచారం చేసిన ఘటనపై వైఎఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేమి రాజ్యం చంద్రబాబు అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.బద్వేల్ కాలేజీ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడి ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన రాష్ట్రంలో సంచలన రేకెత్తించింది. వరుసగా రాష్ట్రంలో అరాచక శక్తుల అగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోవడాన్ని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఈ మేరకు ట్వీట్ చేసిన వైఎస్ జగన్.. కూటమి ప్రభుత్వాన్ని కడిగిపారేశారు.రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌ను కాపాడలేకపోతున్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలలకు, బాలికలకు రక్షణ లేకుండా పోయింది. నిత్యం ప్రతి రోజు ఎక్కడో ఒక చోట హత్యలు,అత్యాచారాలు, వేధింపులు జరుతూనే ఉన్నాయి. బద్వేల్లో కాలేజీ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారని, ఈ దారుణ ఘటన హేయం, అత్యంత దుర్మార్గమన్నారు. ఈ ఘటన వెనుక ప్రభుత్వం, పోలీసుల వైఫల్యం ఉందన్నారు. ఒక పాలకుడు ఉన్నాడంటే ప్రజలు ధైర్యంగా ఉండాల్సింది పోయి నిరంతరం భయపడే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.లా అండ్ ఆర్డర్‌ను కాపాడలేకపోతున్నారు.. ఇదేమి రాజ్యం @ncbn గారూ? మహిళలకు, బాలికలకు రక్షణకూడా ఇవ్వలేకపోతున్నారు… ఇదేమి రాజ్యం? ప్రతిరోజూ ఏదోచోట హత్యాచారాలు, హత్యలు, వేధింపులు సర్వసాధారణమైపోయాయి. బద్వేలులో కాలేజీ విద్యార్థినిపై పెట్రోలుపోసి, నిప్పుపెట్టి ప్రాణాలు తీసిన ఘటన అత్యంత…— YS Jagan Mohan Reddy (@ysjagan) October 20, 2024 ‘చంద్రబాబు మీరు వైఎస్సార్సీపీమీద కక్షకొద్దీ, మా పథకాలను, కార్యక్రమాలను ఎత్తివేస్తూ రాష్ట్రంమీద, రాష్ట్ర ప్రజలమీద కక్ష సాధిస్తున్నారు. ఇది అన్యాయం కాదా? వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బాలికలు, మహిళల భద్రతకు పూర్తి భరోసానిస్తూ తీసుకొచ్చిన విప్లవాత్మక “దిశ’’ కార్యక్రమాన్ని ఉద్దేశపూర్వకంగా నీరుగార్చడం దీనికి నిదర్శనం కాదా? దీనివల్ల మహిళలు, బాలికల భద్రతను ప్రశ్నార్థకం చేసిన మాట వాస్తవం కాదా? “దిశ’’ యాప్‌లో SOS బటన్ నొక్కినా, చేతిలో ఉన్న ఫోన్‌ను 5సార్లు అటూ, ఇటూ ఊపినా వెంటనే కమాండ్ కంట్రోల్ రూంకు, అక్కడినుంచి దగ్గర లోనే ఉన్న పోలీసులకు సమాచారం వెళ్తుంది. వెంటనే పోలీసులు వారికి ఫోన్ చేస్తారు. వారు ఫోన్ ఎత్తకపోయినా లేదా ఆపదలో ఉన్నట్టు ఫోన్లో చెప్పినా ఘటన స్థలానికి నిమిషాల్లో చేరుకుని రక్షణ కల్పించే పటిష్ట వ్యవస్థను మీరు ఉద్దేశపూర్వకంగా నీరుగార్చలేదా? “దిశ’’ ప్రారంభం మొదలు 31,607 మహిళలు, బాలికలు రక్షణ పొందితే దాన్ని ఎందుకు దెబ్బతీశారు చంద్రబాబుగారూ? 1.56కోట్ల మంది డౌన్లోడ్ చేసుకుని భరోసా పొందుతున్న “దిశ’ ’పై రాజకీయ కక్ష ఎందుకు?దిశ కార్యక్రమాన్ని బలోపేతం చేయడానికి ప్రత్యేకంగా 13 పోక్సో కోర్టులు, 12 మహిళా కోర్టులు, ఫొరెన్సిక్ ల్యాబులు ఏర్పాటు చేశాం. ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాం. 900 బైక్‌లు, 163 బొలేరో వాహనాలను “దిశ’’ కార్యక్రమం కోసమే పోలీసులకు అందించి పెట్రోలింగ్‌ను పటిష్ట పరిచాం. 18 “దిశ’’ పోలీస్స్టేషన్లను పెట్టి, 18 క్రైమ్ మేనేజ్మెంట్ వాహనాలను సమకూర్చాం. వీటిని పోలీస్ కమాండ్ కంట్రోల్‌రూమ్‌కు అనుసంధానం చేశాం. మా హయాంలో శాంతిభద్రతలపై నేను చేసిన సమీక్ష సమావేశాలలో “దిశ’’ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే వాళ్లం. దీంతో పోలీసులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండేవారు.వీటన్నిటినీ నిర్వీర్యం చేసి ఏం సాధించాలనుకుంటున్నారు చంద్రబాబు? మీరు చేస్తున్నదల్లా మహిళల రక్షణ, సాధికారతకోసం అమలవుతున్న కార్యక్రమాలను, స్కీంలను ఎత్తివేసి, ఇప్పుడు ఇసుక, లిక్కర్ లాంటి స్కాంలకు పాల్పడుతూ పేకాట క్లబ్బులు నిర్వహించడం లాంటివి చేస్తున్నారు. ఇటు పోలీసు వ్యవస్థ కూడా అధికారపార్టీ అడుగులకు మడుగులొత్తుతూ ప్రతిపక్షంపై తప్పుడు కేసులు పెడుతూ వేధింపులకు దిగడమే పనిగా పెట్టుకుంది తప్ప మహిళలు, బాలికలు, చిన్నారుల రక్షణ బాధ్యతలను పట్టించుకోవడంలేదు. ఇదేమి రాజ్యం చంద్రబాబు?’అంటూ నిలదీశారు వైఎస్ జగన్.AP: మరో ప్రేమోన్మాది ఘాతుకం.. గాయపడిన విద్యార్థిని మృతి -
ఇచ్చిన హామీలు అడుగుతారని డైవర్షన్ పాలిటిక్స్: రాచమల్లు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైనా పెన్షన్ తప్ప చెప్పిన పథకాలు ఒక్కటీ అమలు కావడం లేదని మండిపడ్డారు వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. విజయవాడ వదరపాలు కావడానికి సీఎం చంద్రబాబు నాయుడే కారణమని ధ్వజమెత్తారు. కొవ్వొత్తులకు రూ. 26 కోట్లు, పులిహోరకు రూ. 360 కోట్లు ఖర్చు అంటూ మోసం చేస్తున్నారని విమర్శించారు.వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి శివప్రసాద్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చాక చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని, రాష్ట్రంలో శాంతిభద్రతలను గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అడుగుతారని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని దుయ్యబట్టారు.‘తెలంగాణాలో హైడ్రాలాగా, ఏపీలో తిరుమల లడ్డూ వ్యవహారం బయటకు తెచ్చారు. ఎన్ని రోజులు వీటితో తప్పించుకు తిరుగుతారు? నాలుగు నెలల కాలంలోనే ఇంతగా ఒక ప్రభుత్వ గ్రాఫ్ పడిపోవడం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదు. లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు ఈ దేశ ప్రజలనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీ వారి భక్తులను నమ్మకాన్ని దెబ్బ తీసే ప్రయత్నం చేశారు. నాణ్యత లేదని నాలుగు నెయ్యి ట్యాంకర్లు వెనక్కు పంపినామని ఈఓ స్పష్టంగా చెప్పినా సీఎం కల్తీ జరిగిందని ఎలా చెబుతారని సుప్రీం కోర్టు కూడా ప్రశ్నించింది.లడ్డూ ప్రసాదం వ్యవహారంలో చంద్రబాబు తన తప్పుడు ప్రచారంతో అబాసు పాలయ్యారు. సుప్రీంకోర్టు ప్రభుత్వ తీరును నిలదీయడంతో శ్రీవారి భక్తులు లడ్డూ అపవిత్రత కాలేదని తేలిపోయింది. చంద్రబాబు తప్పుడు ప్రచారాలతో అపవిత్రుడు అయ్యాడు.. ఆయన జీవితం అంతా అపవిత్రమే. ఇచ్చిన వాగ్దానాలను ప్రజలకు అందే వరకు వైఎస్సార్సీపీ పోరాడుతూనే ఉంటుంది’ అని పేర్కొన్నారు. -
‘కడప, రాయలసీమపై చంద్రబాబు కక్ష సాధింపు’
వైఎస్సార్ కడప, సాక్షి: చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కడప, రాయలసీమపై కక్ష సాధింపునకు దిగుతున్నారని కడప వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. కొప్పర్తి సేజ్‌కి వచ్చిన ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ తరలింపు చంద్రబాబు నైజానికి నిదర్శనమని దుయ్యబట్టారు. వైఎస్సార్ కడప జిల్లాలోని కొప్పర్తి సేజ్‌కు కేటాయించిన ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ తరలింపుపై గురువారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం ఆయన మాట్లాడారు.‘‘ఇది సీమ యువత అవకాశాలను దెబ్బ తీయడమే. ప్రభుత్వం జీవో నంబర్ 56 వెనక్కి తీసుకునే వరకు ఉద్యమిస్తాం. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కడప, రాయలసీమపై కక్ష సాధింపునకు దిగుతున్నారు. దానికి కొప్పర్తి సేజ్‌కి వచ్చిన ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ తరలింపే నిదర్శనం’’ అని అన్నారు.కేంద్రం కేటాయించిన టెక్నాలజీ సెంటర్‌ను మార్చాల్సిన అవసరం ఏమి వచ్చిందని మాజీ డిప్యూటీ సీఎం ఆంజాద్ బాషా నిలదీశారు. రాయలసీమకు వచ్చిన ప్రతి ఒక్క సంస్థను తీసుకెళ్ళిపోతున్నారు. పులివెందుల మెడికల్ సీట్లు వెనక్కి పంపారు. రాయలసీమ వాడిని అని చెప్పుకునే చంద్రబాబు.. ఇలాంటి చర్యలకు పాల్పడటం దౌర్భాగ్యం. రాజకీయాలకు అతీతంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని అన్నారాయన.కేంద్రం ఇక్కడి యువతకు ఇచ్చిన టెక్నాలజీ సెంటర్‌ను తరలించడానికి చంద్రబాబు ఎవరని కడప సీపీఐ జిల్లా కార్యదర్శి జి చంద్ర ప్రశ్నించారు. ‘‘ ఇది క్షమించరాని నేరం. ఇలాంటి చర్యలు యువత అవకాశాలను దెబ్బ తీస్తాయి. ఈ అంశంపై అఖిలపక్షంగా పోరాడతాం’ అని అన్నారు.ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ను తరలించడం అంటే సీమకు అన్యాయం చేయడమేనని కడప జిల్లా సీపీఎం కార్యదర్శి చంద్రశేఖర్ అన్నారు. ‘‘ ఇలాంటి కక్ష్య సాధింపు చర్యలు చేపట్టడం దారుణం. నైపుణ్యాలను రాయలసీమ యువతకు అందించాల్సిన అవసరం లేదా?. ప్రభుత్వం మారగానే ఇలా చేయడం సరికాదు’ అని అన్నారు.రౌండ్ టెబుల్ సమావేశానికి కడప వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సిఎం అంజాద్ బాషా, మేయర్ సురేష్ బాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి జి.చంద్ర, సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, కాంగ్రెస్ నాయకుడు సత్తార్, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు హాజరయ్యారు. -
వైఎస్సార్ జిల్లాపై సీఎం చంద్రబాబు మరోమారు కక్ష సాధింపు
వైఎస్సార్ కడప, సాక్షి: వైఎస్సార్ జిల్లాపై సీఎం చంద్రబాబు మరో మారు కక్షసాధింపుకు దిగారు. జిల్లాలోని కొప్పర్తి సెజ్‌లో కేంద్రం కేటాయించిన ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ను అమరావతికి తీసుకెళ్లారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కొప్పర్తి నార్త్ బ్లాక్‌లో 19.5 ఎకరాల్లో టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. అయితే, ప్రభుత్వం మారగానే కొప్పర్తికి మంజూరైన టెక్నాలజీ సెంటర్‌ను సీఆర్డీఏ పరిధిలోకి తీసుకెళ్తూ చంద్రబాబు ప్రభుత్వం జీవో జారీ చేసింది. టెక్నాలజీ పార్క్ వల్ల యువతకు స్కిల్ ట్రైనింగ్, ప్రపంచ స్థాయి ఇంజనీరింగ్ నైపుణ్యాలు అందాల్సి ఉంది. కానీ చంద్రబాబు కడప యువత అవకాశాలను దెబ్బతీస్తూ జీవో నంబర్ 56ను విడుదల చేశారు. చదవండి : తిరుమల లడ్డు వివాదం : సిట్‌తో నిజాలు నిగ్గు తేల్చలేం -
కడపలో టీడీపీ చెత్త పాలిటిక్స్.. భగ్గుమన్న వైఎస్సార్సీపీ
వైఎస్సార్ కడప, సాక్షి: వైఎస్సార్ కడపలో టీడీపీ నేతలు ఓవర్ యాక్షన్‌కు పాల్పడ్డారు. మేయర్ సురేష్ బాబు ఇంటి ముందు చెత్త వేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. గత మూడు రోజులుగా చెత్తపై ఎమ్మెల్యే మాధవి రెడ్డి అనవసర రాజకీయం చేస్తున్నారు. మూడు రోజుల క్రితం చెత్తను కార్పొరేటర్లు మేయర్ ఇంటి ముందు వెయ్యాలని టీడీపీ నేతలను మాధవి రెడ్డి రెచ్చగొట్టారు. దీంతో ఇవాళ టీడీపీ నేతలను మేయర్ ఇంటి వద్దకు పంపించి చెత్తను వేయాలని ఆదేశించారు. టీడీపీ ఎమ్మెల్యే, నేతలు చేస్తున్న చెత్త పాలిటిక్స్‌పై వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రశాంతంగా ఉన్న కడప నగరంలో ఇలాంటి రెచ్చగొట్టి రాజకీయాలు చేయవద్దని వైఎస్సార్సీపీ నేతలు సూచిస్తున్నారు. ఇన్ని ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెచ్చగోట్ట రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు.మేయర్ ఆగ్రహంతన ఇంటి ముందు చెత్త వేసిన టీడీపీ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ ఎదుట మేయర్ సురేష్ బాబు ధర్నాకు దిగారు. ఆయనకు మద్దతుగా వైఎస్సార్సీపీ శ్రేణులు భారీగా చేరి ధర్నాలో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై సురేష్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘చెత్త పై టీడీపీ నేతలను రెచ్చగొట్టి తన ఇంటి ముందు చెత్త వేసేలా ఎమ్మెల్యే చేయడం దుర్మార్గం. హుందాగా వ్యవహరించాలని గతంలోనూ ఆమెను మేం కోరాం. గెలిచిన మూడు నెలలకే ఇలాంటి నీచపు రాజకీయాలా?. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది. కడపలో టీడీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పనులు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు మునుపెన్నడూ లేవు. టీడీపీ రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోంది. ఇంటికొచ్చి చెత్త వేస్తుంటే.. పోలీసులు ఏం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కడపలో అల్లర్లు చేస్తున్నారు. హత్యారాజకీయాలు చేస్తున్నారు. నా ఇంటి ముందు చెత్త వేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి. కఠినంగా శిక్షించాలి. -
‘పవన్ కల్యాణ్ గ్రామ సభలకు ప్రజల స్పందన శూన్యం’
వైఎస్సార్ కడప, సాక్షి: కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సభలకు ప్రజల నుంచి స్పందన శూన్యమని కడప జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. పదవులు లేకపోయినా పచ్చ కండువాలు వేసుకుని గ్రామసభల్లో పెత్తనం చెలాయిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు.‘అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రూ. 13 వేల కోట్ల అప్పు చేశారు. ప్రతి మంగళవారం అప్పుల రోజుగా చంద్రబాబు ప్రభుత్వం ముందుకు వెళ్లుతోంది. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నేరవేర్చలేదు. ఖరీఫ్ సీజన్ అయిపోతున్నా ఇంతవరకు రైతు భరోసా ఇవ్వలేదు. ఎందుకు చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకున్నామా అని ప్రజలు బాధ పడుతున్నారు. .. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి మద్దతు పలికిన వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చిన గ్రామ సభకు కూడా ప్రజల నుండి స్పందన లేదు. సూపర్ సిక్స్ పథకాలను పక్కాగా అమలు చేయాలి. లేకుంటే ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ పోరాటాలు చేసేందుకు సిద్ధం. చంద్రబాబు 2014లో మోసం చేశారు.. ఇప్పుడు కూడా ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు’’ అని అన్నారు. -
పగలు బీజేపీతో, రాత్రి కాంగ్రెస్‌తో బాబు కాపురం చేస్తాడు: సీఎం జగన్
‘వైఎస్సార్ చనిపోయాక ఆయనపై కుట్రలు చేసింది ఎవరు?, మహానేత వైఎస్సార్ పేరు ఛార్జ్‌షీట్‌లో పెట్టింది ఎవరు?, వైఎస్సార్ కుటుంబాన్ని అణగదొక్కాలని కుట్రలు పన్నింది ఎవరు?, వైఎస్సార్ శత్రువులతో చేతులు కలిపిన వీరా వైఎస్సార్ వారసులు.., కాంగ్రెస్‌కు వైఎస్సార్ అభిమానులు ఏనాడో సమాధి కట్టారు..’ అంటూ వైఎస్సార్ కడప జిల్లా ఎన్నికల ప్రచార సభ వేదికగా కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. వైఎస్సార్ పేరును సమాధి చేయాలని కాంగ్రెస్ చూస్తోందని, రాజకీయ స్వలాభం కోసం, ఇన్నేళ్ల తర్వాత ఎన్నికల సమయంలో నాన్న సమాధి దగ్గరకు వెళ్తారంట అంటూ ధ్వజమెత్తారు. వైఎస్సార్ మరణం తర్వాత తనను, తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారని, తనను అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టారని పేర్కొన్నారు.నోటా ఓట్లు కూడా రాని కాంగ్రెస్‌కు ఎవరైనా ఓటు వేస్తారా అని సీఎం జగన్ ప్రశ్నించారు. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌కు ఎవరైనా ఓటు వేస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే.. మన కళ్లను మనం పొడుచుకున్నట్లేనని అన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే.. టీడీపీని గెలిపించడమేనని పేర్కొన్నారు. వైఎస్సార్ వారసులని వస్తున్న వారి కుట్రలను చూస్తున్నామన్న వైఎస్ జగన్.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు మనిషేనని తెలిపారు. పగలు బీజేపీతో, రాత్రి కాంగ్రెస్‌తో బాబు కాపురం చేస్తాడని మండిపడ్డారు. చంద్రబాబు కోసమే కాంగ్రెస్ పనిచేస్తుందని దుయ్యబట్టారు.సీఎం జగన్ పూర్తి ప్రసంగంవచ్చే ఎన్నికలు అయిదేళ్ల భవిష్యత్తును నిర్ణయించేవి. మరో మూడు రోజుల్లో బ్యాలెట్ బద్దలు కొట్టడానికి సిద్ధమా?ఈ జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేందుకు జరగుతున్న ఎన్నికలు కావు.. రాబోయే అయిదేళ్ల ఇంటింటి అభివృద్ధి, పథకాల కొనసాగింపును నిర్ణయించేవి.ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటికి అభివృద్ధి, పేదవాడి భవిష్యతుకు భరోసా.చంద్రబాబు ఓటేస్తే పథకాలన్నింటికి ముగింపు, మళ్లీ మోసపోవడమే.చంద్రబాబుకు ఓటేయడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమే59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాంఎన్నికలయ్యాక మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేస్తాడు.మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించాం99 శాతం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలను నెరవేర్చాంరాజకీయాల్లో విశ్వసనీయత అనే పదానికి అర్థం తీసుకొచ్చాంవివిధ పథకాలకు మీ బిడ్డ 130 సార్లు బటన్ నొక్కాడు.అక్కాచెల్లెమ్మలను గత ప్రభుత్వం పట్టించుకోలేదు.2 లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాం.అక్కచెల్లెమ్మలకు నేరుగా రూ.2లక్షల 70 వేల కోట్లు అందించాం.నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చాంప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం3వ తరగతి నుంచే టోఫెల్ క్లాసులు, సబ్జెక్ట్ టీచర్లుప్రభుత్వ స్కూళ్లలో 6వ తరగతి నుంచే డిజిటల్ బోధనబడులు తెరిచే నాటికే విద్యాకానుక, గోరుముద్దఅమ్మ ఒడి, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా మార్పులువిద్యారంగంలో మేం చేసిన అభివృద్ధి బాబు హయాంలో జరిగిందా?అక్కాచెల్లెమ్మలకు తోడుగా ఉన్నాంఅక్కాచెల్లెమ్మల కోసం ఆసరా, సున్నావడ్డీ,చేయూత.అక్కాచెల్లెమ్మల కోసం కాపు నేస్తం, ఈబీసీ నేస్తంఅక్కాచెల్లెమ్మల పేరుపై 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చాంఅందులో 22 లక్షల ఇళ్లు కడుతున్నాంగతంలో ఎప్పుడైనా ఇంత మంచి జరిగిందా?అవ్వాతాతలకు ఇంటి వద్దకే రూ. 3 వేల పెన్షన్‌ఇంటి వద్దకే పౌరసేవలు, సంక్షేమ పథకాలుసకాలంలో ఇన్పుట్ సబ్సిడీ అందిస్తున్నాంవిత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నకు తోడుగా నిలిచాంగతంలో రైతన్నకు ఇంత మంచి జరిగిందా?పెట్టుబడి సాయంతో రైతన్నకు తోడుగా ఉన్నాంరైతులకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాంగ్రామస్థాయిలోనే రైతులను చేయి పట్టుకొని నడిపించే ఆర్బీకే వ్యవస్థస్వయం ఉపాధికి అండగా వాహనమిత్ర, నేతన్న నేస్తం,మత్స్యకార భరోసాన్యాయవాదులకు లా నేస్తంజగనన్న తోడు, చేదోడుతో చిరువ్యాపారులకు అండగానిలిచాంగతంలో ఈ పథకాలు ఉన్నాయా?నాడు-నేడు ద్వారా ప్రభుత్వాసుపత్రుల రూపురేఖలు మార్చాంఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 25 లక్షల వరకు పెంచాంపేషెంట్ విశ్రాంతి సమయంలోనూ ఆర్థిక సాయం అందించాంఆరోగ్య ఆసరా, ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్‌విలేజ్ క్లినిక్‌ల ద్వారా పేదవాడిని ఆదుకున్నాంగతంలో ఇంత అభివృద్ధి జరిగిందాపేదవాడి ఆరోగ్యం కోసం ఇంతగా పరితపించిన ప్రభుత్వం ఉందా?14 ఏళ్లు సీఎంగా చేశానని చెప్పుకునే చంద్రబాబు ఏం చేశాడు?చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా?6 వందల సేవలు అందిస్తున్న గ్రామ సచివాలయం, వాలంటీర్ వ్యవస్థఅవ్వాతాతలకు ఇంటింటికీ అందుతున్న పెన్షన్, ఇంటి వద్దకే రేషన్, చంద్రబాబుది ఊసరవెళ్లి రాజకీయం చంద్రబాబు బాగా ముదిరిపోయిన తొండముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీతో ఎలా జతకడతారు.మరోవైపు మైనార్టీల ఓట్ల కోసం బాబు దొంగ ప్రేమ కురిపిస్తున్నాడు.ఆరునూరైనా ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు కొనసాగించాల్సిందే. NRC, CAA అంశాల్లోనూ మైనార్టీలకు అండగా ఉంటాంమోదీ సభలో చంద్రబాబు ఇలా చెప్పగలడా?మైనార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని చెప్పిన బాబు.. ఇంకా ఎందుకు ఎన్డీయేలో కొనసాగుతున్నారు?ముస్లింలకు మతప్రాతిపదికన 4శాతం రిజర్లేషన్లు ఇవ్వలేదు.వెనుకబాటుతనం ఆధారంగా ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చారుమైనార్టీల మనోభావాలకు అండగా మీ బిడ్డ తోడుగా ఉంటాడు.రాజకీయం కోసం వారి జీవితాలతో చెలగాటం ఆడటం న్యాయమేనా?మైనార్టీ సోదరి శాసన మండలి ఉపాధ్యక్షురాలిగా కూడా ఉంది.175 స్థానాల్లో మైనార్టీలకు ఏడు అసెంబ్లీ స్థానాలు ఇచ్చాం.నలుగురికి ఎమ్మెల్యేలు,నలుగురు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చాం.కడప రాజకీయాల్లో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు కడప జిల్లాలో ఉన్న రాజకీయ చైతన్యం ఏపీలో అతికొద్ది జిల్లాల్లోనే ఉంటుందివైఎస్సార్ చనిపోయిన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు పెట్టింది.అదే సమయంలో నేనుు ఎంపీగా నిలబడినప్పుడు నన్ను భారీ మెజార్టీతో గెలిపించారు.నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీలతో, రాష్ట్ర విభజన చేసిన ద్రోహులతో ప్రజలు జతకట్టాలా?రాజకీయంగా వైఎస్సార్ కుటుంబాన్ని అణగదొక్కాలని దేశంలోని అన్ని వ్యవస్థలను మన మీద ప్రయోగించిన వారితో కలిసిపోయి అదే కాంగ్రెస్, అదే టీడీపీతో కలిసిపోయి వైఎస్సార్ అనే పేరే కనపడకుండా చేయాలనే కుట్ర జరుగుతోంది.వైఎస్ అవినాష్ రెడ్డి నాకన్న 13 ఏళ్లు చిన్నవాడు .ఈయన భవిష్యత్తును నాశనం చేయడానికి ఈనాడు, చంద్రబాబు, ఆంధ్రజ్యోతి నుంచి కుట్రలు వేస్తున్నారు. వీళ్లంతా మనుషులేనా?అవినాష్ ఎలాంటి వాడో నాకు, మీ అందరికి తెలుసు.గొప్ప మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా 2014లో ఆయన చేసిన మోసాలు గుర్తున్నాయా?రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?పొదుపు సంఘాల రుణాలు మాఫీ అన్నాడు.. చేశాడా?ఆడబిడ్డ పుడితే రనూ. 25 వేలు డిపాజిట్ చేస్తానన్నాడు.. చేశాడా?ఇంటింటికీ జాబు.. లేదంటే నిరుద్యోగ భృతి అన్నాడు.. ఇచ్చాడా?పేదలకు 3 సెంట్ల స్థలం అన్నాడు. సెంటు స్థలమైనా ఇచ్చాడా?సింగపూర్‌ను మించి అభివృద్ధి చేస్తానన్నాడు.. చేశాడా?ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తానన్నాడు.. నిర్మించాడా?మళ్లీ ఇప్పుడు కొత్త కొత్త మోసాలతో వస్తున్నారు..నమ్ముతారా?చంద్రబాబు సూపర్ సిక్స్, సెవెన్ అంటున్నాడు, నమ్ముతారా?ఇంటింటికి కేజీ బంగారం, బెంజ్ కారు ఇస్తారంట.. నమ్ముతారా?బాబు జీవితమంతా అబద్దాలు, మోసాలు, కుట్రలు.చంద్రబాబు చేసింది.. దోచుకోవడం, దాచుకోవడం.చంద్రబాబు దగ్గర దోచుకున్న డబ్బులు దండిగా ఉన్నాయి.చంద్రబాబు డబ్బులు ఇస్తే వద్దనకండి.. తీసుకోండి.ఓటేసే ముందు మీకు ఎవరి వల్ల మంచి జరిగిందోదో ఆలోచన చేయండి.వాలంటీర్ల సేవలు కొనసాగాలంటే రెండు బటన్లు ఫ్యాన్‌పై నొక్కాలి.పేదవాడి భవిష్యత్ కోసం రెండు బటన్లు ఫ్యాన్ గుర్తుపై నొక్కాలి.175కు 175 అసెంబ్లీ, 25కు, 25 ఎంపీ సీట్లు గెలవాల్సిందే. -
సీఎం జగన్ రాయల్ ఎంట్రీ @మైదుకూరు
-
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తరఫున పులివెందులలో నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ మనోహర్‌రెడ్డి.. ఇంకా ఇతర అప్డేట్స్
-
నామినేషన్లకు సర్వం సిద్ధం...
-
షర్మిల, సునీత అసత్య ప్రచారాలు మానుకోవాలి: రమేష్ రెడ్డి
సాక్షి, కడప: వివేకా కుమార్తె సునీతను చంద్రబాబు పావుగా వాడుకుంటున్నారని వైఎస్సార్సీపీ రాష్ట అదికార ప్రతినిధి రమేష్ రెడ్డి మండిపడ్డారు. క్రిమినల్ బ్రెయిన్ తో ప్రవర్తించే వ్యక్తి చంద్రబాబని నిప్పులు చెరిగారు. కుంటుంబాల్లో చిచ్చు పెట్టడమే చంద్రబాబు పని అని విమర్శించారు. ఎల్లో మీడియాతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎంపీ అవినాష్‌రెడ్డి సాయంతో బురద జల్లిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలు వాస్తవాలను పక్కదారి పట్టిస్తున్నాయని రమేష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినాష్ రెడ్డి ఎంపీగా గెలవాలని వివేకానందరెడ్డి కూడా ప్రచారం చేశారన్నారు. అయితే వివేకా కేసును బాబు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఎవరిపై కక్ష సాధించేందుకు షర్మిల ఏపీ వచ్చారని ప్రశ్నించారు. షర్మిల, సునీత అసత్య ప్రచారాలు మానుకోవాలని సూచించారు. అవసరం తీరాకా తిట్టడం ‘చంద్రబాబుది నీచ రాజకీయం. వ్యవస్దలను ధ్వంసంచేసి అనుకూలంగా వాడుకునే వ్యక్తి. లక్ష్మీపార్వతిని ఉపయోగించి ఎన్టీఆర్‌ను వెన్నుపొటు పొడవటమే కాకుండా అయన మరణానికి కారకుడై పార్టీని అక్రమించి కుటుంబ పార్టీగా మలచుకున్నాడు. ప్రతిసారి కూటమి ఏర్ఫాటు చెయ్యడం, అవసరం తీరాకా అదే పార్టీలను తిట్టడం అలవాటు. అందుకే నేడు షర్మిల పీసీసీ అద్యక్షురాలైంది. కేసును పక్కదారి పట్టిస్తున్నాడు చంద్రబాబు సృష్టించిన వ్యవస్దల ద్వారా కేసును పక్కదారి పట్టిస్తున్నాడు. కేసు కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. వివేకం సినిమాను ఎంతో నీచంగా చిత్రీకరించారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని చిన్నప్పటి నుంచి షర్మిల, సునీతలు చూశారు. ఎనాడైనా నేరప్రవర్తన కనపడిందా? స్దానికంగా ఫ్యాక్షన్‌తో సంబంధం ఏమైనా ఉందా? కేవలం వైఎస్ జగన్‌ను ఎదుర్కొనేందుకే షర్మిల, సునీతను పావులుగా వాడుకుంటున్నారు. షర్మిల, సునీత రాజకీయ పోరాటం కోసం వచ్చారా? న్యాయపోరాటం చేసేటప్పుడు రాజకీయ పోరాటం అపాలి. ? లేదంటే తప్పుడు సంకేతాలు పోతాయి’ అని అన్నారు. వివేకా హత్య కేసులో సునీత చెప్పేవన్నీ అబద్ధాలే వివేకా హత్య కేసులో సునీత చెప్పేవన్నీ అబద్దాలేనని, దస్తగిరి వాంగ్మూలాన్ని నిజం చేసే ప్రయత్నం జరుగుతుందన్నారు. దేవిరెడ్డి శంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డి. సీబీఐ వద్ద దస్తగిరి స్టేట్ మెంట్ తప్ప ఏ ఒక్క ఆధారం లేదన్నారు. సునీత దస్తగిరిని అడ్డంపెట్టుకుని ఓ బూటకం ఆడుతుందని మండిపడ్డారు. ఇంటి తలుపులు బద్దలైతే అన్నీ బాగున్నాయని సీబీఐకి చెప్పిందని గుర్తు చేశారు. ఇంటి తలుపులు బద్దలు కొట్టారనేది విడిచిపెట్టి ఇంట్లో వాళ్లే చంపారని సునీత ప్రస్తావిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంపినప్పుడు లెటర్ రాశాడన్నారు, చేతి వేళ్లు నరికితే రక్తపు మరకలు ఉండవా.. అసలు ఎలా రాయగలడు? - దస్తగిరి, రంగన్న చెప్పిన సమాచారం పూర్తి విరుద్ధంగా ఉంది. రెండో భార్య సమీమ్‌కు ఆస్తి గొడవలున్నాయి. ఆస్తి పత్రాలు దొంగిలించాల్సిన అవసరం ఎవరికి ఉంది? దీన్ని కూడా సీబీఐ పట్టుకోలేకపోయింది’ అని చైతన్యరెడ్డి మండిపడ్డారు. -
శ్రీరామనవమి వైభవంగా జరిగే ఒంటిమిట్ట రామాలయం స్పెషల్ ఫొటోలు
-
కడప తహసీల్దార్ అక్రమాస్తులపై ఏసీబీ దాడులు
సాక్షి, తిరుపతి/కడప అర్బన్: వైఎస్సార్ జిల్లా కడప మండల తహసీల్దార్ సిద్దల శివప్రసాద్ అక్రమాస్తులపై ఏసీబీ అధికారులు శనివారం ఏకకాలంలో 9చోట్ల సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీజీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు తిరుపతి, పీలేరు, రేణిగుంట, కడపతో పాటు మొత్తం తొమ్మిది చోట్ల దాడులు చేశారు.కడపలోని ఆయన ఇంట్లో రూ.36 లక్షలను స్వా«దీనం చేసుకున్నారు. కాగా, ఎన్నికల ఖర్చుకోసం ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఈఆర్ఓ) కడప ఆర్డీఓ మధుసూదన్ నిధులను విడుదల చేసినట్లు తహసీల్దార్ అధికారులకు తెలియజేసినట్లు సమాచారం. ఈ విషయంపై ఏసీబీ అధికారులు ఆర్డీఓను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అలాగే ఆయన కుటుంబం నివాసముంటున్న తిరుపతి వైకుంఠపురంలోని ఇంట్లో విలువైన ల్యాండ్ డాక్యుమెంట్లు, ఆభరణాలు స్వా«దీనం చేసుకున్నారు. తిరుపతి వైకుంఠపురంలో 266.66స్క్వయర్ యార్డుల విస్తీర్ణం కలిగిన జీప్లస్1 భవంతి, మాతృత్వ ఆస్పత్రి ప్రాంగణం, పీలేరులో 158.89స్క్వయర్ యార్డుల విస్తీర్ణంలో నిర్మాణ దశలో ఉన్న జీప్లస్2 భవనం, తిరుపతి, రేణిగుంటలో 5 ఇంటిస్థలాలు, తిరుపతి దామినేడు పరిధిలో 33 సెంట్ల స్థలం, తిరుపతి చెర్లోపల్లిలో 1,685 అడుగుల స్థలం, తిరుపతి వైకుంఠపురంలోని అలంకృతి మాల్ తదితర స్థిరాస్తులను గుర్తించారు. అలాగే టొయోటా ఇన్నోవా, మహింద్రా థార్ కార్లు, మూడు ద్విచక్ర వాహనాలు, రూ.2.31లక్షలు, 390 గ్రాముల బంగారు ఆభరణాలను గుర్తించి స్వా«దీనం చేసుకున్నారు. వారి అనుచరులు, బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నట్లు వివరించారు. సోదాలు కొనసాగుతున్నాయని, ఇంకా పెద్ద సంఖ్యలో అక్రమాస్తులు, లాకర్లలో దాచిన డాక్యుమెంట్లు, నగదు, బంగారు ఆభరణాలను కూడా గుర్తించినట్లు వివరించారు. రేణిగుంట మండలం తహసీల్దార్‌గా పనిచేసిన సమయంలో విలువైన ప్రభుత్వ భూములను రియల్టర్లకు ధారాదత్తం చేసి పెద్దమొత్తంలో అక్రమాస్తులను కూడబెట్టినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. -
Proddatur Meeting Photos: దద్దరిల్లిన ప్రొద్దుటూరు.. విపక్షాలకు వణుకు పుట్టేలా..(ఫొటోలు)
-
తరగని అభిమానం.. చెదరని ప్రేమ.. ఇది కేవలం జగనన్నకు మాత్రమే సాధ్యం (ఫొటోలు)
-
CM Jagan Bus Yatra Photos: బస్సు యాత్రలో జననేత జగనన్నకు సాదర స్వాగతం (ఫొటోలు)
-
‘మేమంతా సిద్ధం’ వైఎస్సార్ ఆశీస్సులు తీసుకున్న సీఎం జగన్ (ఫొటోలు)
-
అందరి బాగు కోసం రెండు బటన్లు నొక్కండి: సీఎం జగన్
Memantha Siddham Bus Yatra Updates పేదల భవిష్యత్ ఈ ఎన్నికలపై ఆధారపడి ఉంది: సీఎం జగన్ 2014లోనూ ఈ కూటమి మోసపూరిత హామీలిచ్చాయి. రైతు రుణమాఫీ అన్నాడు.. మోసం చేశాడు పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానన్నాడు.. చేశాడా? పేదల ఖాతాల్లో బాబు ఒక్క రూపాయి అయినా వేశారా? నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు.. ఇచ్చాడా? మూడు సెంట్లు స్థలం ఇస్తానన్నాడు.. ఇచ్చాడా? ఇదే బ్యాచ్.. మళ్లీ ఇప్పుడు ఒక్కటయ్యారు ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి.. సైకిల్‌ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ సింకులోనే ఉండాలి ప్రతి ఇంటికి సంక్షేమం అందాలంటే మళ్లీ మీ జగనే రావాలి ప్రతి ఇంటికి రేషన్ రావాలంటే మళ్లీ జగనన్నే రావాలి పేదల భవిష్యత్ బాగుండాలంటే మళ్లీ మీ జగనన్నే రావాలి మీరే నాకు స్టార్ క్యాంపెయినర్లు ప్రతి ఇంటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని చెప్పాలి గవర్నమెంట్ హాస్పిటల్స్ బాగుపడాలన్నా మళ్లీ జగన్‌ను గెలిపించండి జగనన్న ముఖ్యమంత్రి అయితేనే రైతన్న ముఖంలో సంతోషం నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నగదు పడాలన్నా జగన్ననే ముఖ్యమంత్రి అవ్వాలి చంద్రముఖి చెడద పోవాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓటేయాలి చంద్రబాబు చేసేది శవ రాజకీయాలు, కుట్రలు: సీఎం జగన్ ఈనాడు పేపర్‌ను చూస్తే.. ఛీ ఇదీ ఒక పేపరేనా అనిపిస్తోంది చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ, నా ఇద్దరు చెల్లెలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 కలిసి ఒకే ఒక్కడిపై యుద్ధం చేస్తున్నారు. వీరెవరికి ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదు నాకు దేవుడు, ప్రజలు అండగా ఉన్నారు అధికారం కోసం చంద్రబాబు అందరికి కాళ్లు పట్టుకుంటున్నారు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ప్రతి గ్రామంలోనూ అభివృద్ధి, సంక్షేమాన్ని చేసి చూపించాం ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన్ ఇస్తున్నాం రూ.3 వేలు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం, దేశంలోనే ఎక్కడా లేదు పెన్షన్ కోసం ప్రతి ఏడాది రూ.24 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం సీఎం జగన్ ప్రసంగం@ ప్రొద్దుటూరు బహిరంగ సభ నా విజయాలకు కారణమైన మీ అందరికీ కృతజ్ఞతలు: సీఎం జగన్ 58 నెలల పాలనలో ప్రతి రంగంలోనూ మార్పులు తీసుకొచ్చాం రూ.2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో జమ చేశాం వైఎస్సార్ జిల్లా నేలమీద.. ఈ పొద్దుటూరు గడ్డమీద.. నన్ను మీ బిడ్డగా భావించి నిరంతరం కాపాడుకుని ఎవరు ఎన్ని కష్టాలు పెట్టినా.. వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఎన్ని సమస్యలు సృష్టించినా నన్ను కాపాడుకున్న మీకు పేరు పేరునా కృతజ్ఞతలు ఈ రోజు నా ముందు కనిపిస్తున్న స్థాయిలో ఈ జిల్లాలో ఎప్పుడూ సమావేశం జరిగి ఉండదు. ఓ మహా సముద్రం కనిపిస్తోంది. మంచికి మద్దతు పలికే ఇంతటి మహా ప్రజా సైన్యం మధ్య మన ప్రజా జైత్రయాత్రకు ముందు వరసలో మన వైఎస్సార్సీపీ పార్టీ జెండా తలెత్తుకుని ఎగురుతోంది ఇక్కడే అధికారాన్ని పేదల భవిష్యత్తు కోసం రైతులు, అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, భావితరాలు, మన గ్రామాలు, ఇంటింటి అభివృద్ధి, సంక్షేమం కోసం ఒక బాధ్యతగా ఈ 58 నెలల పాలనలో ప్రతి రంగంలోనూ విప్లవానికి మారుపేరుగా మార్పులు తీసుకొచ్చాం. ఎప్పుడూ జరగని విధంగా.. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా రూ.2.70 లక్షల కోట్ల రూపాయలు లంచాలు, వివక్ష అనేవి లేకుండా నేరుగా ప్రజల చేతుల్లో ఉంచి ప్రజా ప్రభుత్వ అజెండా.. ఇక్కడ కనిపిస్తున్న మన జెండా కాబట్టే చెబుతున్నా ఈ జెండా తలెత్తుకుని ఎగురుతోంది అని.. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా, చూసినా కోట్ల గుండెలు, మన పార్టీకి, ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ 2024 ఎన్నికల సమరానికి సిద్ధం అంటున్నాయి! కాబట్టే ఈ జెండా మరే ఇతర జెండాతోనూ జతకట్టడం లేదు.. లక్షల సింహాల గర్జన... చరిత్రలో చిరస్థాయిగా గుర్తుండి పోతుంది. గట్టిగా గర్జించండి.. మేమంతా సిద్ధమేనని! పేదల ఇంటింటి అభివృద్ధికి అడ్డుపడుతున్నా ఈ దుష్ట చతుష్టయాన్ని చిత్తుగా ఓడించేందుకు పాంచజన్యం పూరించేందుకు శ్రీకృష్ణుడిలా మీరంతా సిద్ధమేనా? మీ అర్జునుడు సిద్ధంగానే ఉన్నాడు! మే 13న ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేసి మరో వంద మందికి చెప్పి ఓట్లు వేయించి మనందరి పార్టీని గెలిపించేందుకు, అభివృద్ధి నిరోధకులను పేదల వ్యతిరేకులను ఓడించేందుకు మీరంతా సిద్ధమేనా? 2024 ఎన్నికల సమరానికి సిద్ధంగా ఉన్నాం నమ్మించి మోసం చేయడంలో చంద్రబాబు 45 ఏళ్ల అనుభవం ఎన్నికలప్పుడు మాత్రమే చంద్రబాబుకు మేనిఫెస్టో గుర్తుకొస్తుంది ఎన్నికలయ్యాక బాబు ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తాడు వైఎస్ వివేకాను ఎవరు చంపారో అందరికి తెలుసు హంతకుడికి నా వాళ్లు మద్దతిస్తున్నారు పేదల భవిష్యత్తుకు అడ్డుపడుతున్న దుష్ట చతుష్టయాన్ని ఓడించాలి దుష్టచతుష్టయాన్ని ఓడించేందుకు మీ అర్జునుడు సిద్ధం నేను దేవుడు, ప్రజలనే నమ్ముకున్నా చంద్రబాబు మేనిఫెస్టోలోని 10 శాతం హామీలను కూడా నెరవేర్చలేదు మన మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చిన ఘనత మనది చంద్రబాబు వదిన గారి చుట్టం కంపెనీకి బ్రెజిల్ నుంచి డ్రగ్ వచ్చాయి తప్పు చేసేది వారు.. నెపం నెట్టేది మనపై ప్రొద్దుటూరులో వైఎస్సార్సీపీ భారీ బహిరంగ సభ పేదల సొంతింటి కలను సీఎం జగన్ నెరవేర్చారు: రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి 175కు 175 సీట్లు గెలవడమే మన టార్గెట్ సీఎం జగన్‌కు అండగా మేమంతా సిద్ధం: వైఎస్ అవినాష్‌రెడ్డి ఇచ్చిన ప్రతీ హామీని సీఎం జగన్ నెరవేర్చారు ప్రొద్దుటూరుకి చేరుకున్న సీఎం జగన్ ప్రొద్దుటూరు లోకి ప్రవేశించిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర సీఎం జగన్‌కు సాదర స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు, అభిమానులు మరికాసేపట్లో బహిరంగ సభ ప్రాంగణంకు చేరుకోనున్న సీఎం జగన్ ఎర్రగుంట్ల రోడ్డులోని రెడ్డి కల్యాణ మండపం వద్ద సీఎం జగన్‌కు స్వాగతం పలికేందుకు ఎదురు చూస్తున్న ప్రొద్దుటూరు ఎమ్మేల్యే రాచమల్లు శివప్రసాద్ బస్సుయాత్రకు జనం జైత్ర యాత్ర అశేషంగా కదలివచ్చిన ప్రజలు పల్లెపల్లెల నుంచి కదం తొక్కిన జనం జనంతో కిక్కిరిసిన వేంపల్లె ప్రధాన రహదారి బస్సు యాత్రకు ఘనస్వాగతం పలికేందుకు మారుమూల గ్రామాల నుంచి ప్రధాన రహదారికి తరలివచ్చిన పల్లె ప్రజల జగన్‌ను చూసేందుకు సుదీర్ఘ నిరీక్షణ.. టెంట్లు వేసుకుని, భోజనాలు ఏర్పాటు చేసుకుంటూ దారిపొడవునా సీఎం జగన్ కోసం నిరీక్షణ రోడ్‌షోలో జగన్‌ను చూసిన వెంటనే హర్షధ్యానాలు, కేరింతలతో స్వాగతం పలికిన జనం అడుగడుగునా పూలతో సీఎం జగన్‌కు ఆత్మీయ స్వాగతం పలికిన ప్రజలు వెల్లువెత్తిన జనంతో అనుకున్న సమయం కన్నా ఆలస్యంగా నడుస్తున్న బస్సుయాత్ర జనసంద్రంగా మారిన ఎర్రగుంట్ల మెయిన్ రోడ్డు ఎర్రగుంట్లలో రోడ్డుకిరువైపులా కిక్కిరిసిన జనం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అపూర్వస్వాగతం ప్రొద్దుటూరులో జయహో జగన్ జయహో జగన్ నినాదాలతో మారుమోగుతున్న ప్రొద్దుటూరు సభా ప్రాంగణం కాసేపట్లో ప్రొద్దుటూరుకు చేరుకోనున్న మేమంతా సిద్ధం యాత్ర బహిరంగ సభలో అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించనున్న సీఎం జగన్ ఎండను సైతం లెక్క చేయకుండా.. జనసంద్రంగా యర్రగుంట్ల రోడ్లు మధ్యాహ్నం 2గంటల నుండి రోడ్ల మీద బారులు తీరిన ప్రజలు సీఎం జగన్ రాక కోసం వేచి ఎదురుచూపులు సాయంత్రానికి భారీగా వచ్చిన జనం కాసేపట్లో ప్రొద్దుటూరు బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం జగన్ ► యర్రగుంట్ల మండల పెద్దనపాడు దాటిన బస్సు యాత్ర ► మేమంతా సిద్ధం మొదటి రోజు.. వీరపనాయనిపల్లి మండలంలో ముగిసిన సీఎం జగన్ బస్సు యాత్ర జగనన్న సాయ గుణం మరువడు ఎన్నికల వేళ.. జన క్షేత్రంలోకి సీఎం జగన్ మేమంతా సిద్ధం ప్రచార యాత్ర ప్రారంభం దారి పొడవునా స్వాగతం పలుకుతున్న జనం ప్రచారంలోనూ సాయ గుణం మరువని జగన్ తనను కలిసి సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వారి నుంచి వినతిపత్రాలు స్వీకరించిన సీఎం వైఎస్ జగన్ ప్రొద్దుటూరులో బహిరంగ సభ కాసేపట్లో వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభ సభకు భారీగా తరలివస్తున్న పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అభిమాన నాయకుడ్ని చూసేందుకు పోటెత్తుతున్న అబిమాన గణం కాసేపట్లో సభా వేదిక వద్దకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా చేరుకోనున్న సీఎం జగన్ రేపటి మేమంతా సిద్ధం యాత్ర షెడ్యూల్ రెండోరోజు.. రేపు కర్నూల్, నంద్యాలలో సీఎం జగన్ ప్రచార యాత్ర ఉదయం 9గం.30ని. ఆళ్లగడ్డ నుంచి బయల్దేరనున్న సీఎం జగన్ 10గం.30ని.కి ఎర్రగుంట్లకు చేరిక గంటపాటు ఎర్రగుంట్లలో ప్రజలతో మమేకం 11గం.30ని. ఎర్రగుంట్ల వేదిక నుంచి బయల్దేరనున్న సీఎం జగన్ వెంకటపురం, గోవిందపల్లి నుంచి రైతునగరం క్రాస్‌కు చేరిక రైతునగరం క్రాస్ వద్ద భోజన విరామం రైతు నగరం క్రాస్ నుంచి నూనెపల్లి, ఎస్పీజీ గ్రౌండ్స్ మీదుగా నంద్యాల చేరిక నంద్యాలలో బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం జగన్ సాయంత్రం నంద్యాల సభా వేదిక నుంచి పాణ్యం, కల్వబుగ్గ, ఓర్వకల్, కర్నూల్ క్రాస్, పెద్దటేకురు మీదుగా నాగలపురం చేరిక రాత్రికి నాగలపురంలోనే బస ప్రొద్దుటూరులో సభాస్థలి వద్ద దృశ్యాలు ప్రొద్దుటూరు లో జరుగనున్న మేమంతా సిద్ధం బహిరంగ సభకు తరలి వస్తున్న అశేష జనవాహిని కమలాపురం నియోజకవర్గంలో కొనసాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్ర వీరపునాయుని పల్లెలో సీఎం జగన్ బస్సు యాత్ర కోసం వేచి ఉన్న ప్రజలు కాసేపట్లో ప్రొద్దుటూరుకు.. కొనసాగుతున్న సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కాసేపట్లో ప్రొద్దుటూరులో భారీ బహిరంగ సభ కడప పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం తొలి బహిరంగ సభ లక్షల మంది హాజరవుతారనే అంచనా ప్రొద్దుటూరు క్రాస్ వద్దకు చేరుకున్న బస్సు యాత్ర సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రొద్దుటూరు క్రాస్ వద్దకు చేరుకుంది వేంపల్లి హనుమాన్ జంక్షన్ వద్ద ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం జగన్ వేంపల్లి హనుమాన్ జంక్షన్ వద్ద బారులు తీరిన జనం వేంపల్లెలో సీఎం జగన్ వేంపల్లె నాలుగు రోడ్ల కూడలికి చేరుకున్న సీఎం జగన్ బస్సు యాత్ర భారీగా జన సందోహం కడప పార్లమెంట్ స్థానాల పరిధిలో సాగుతున్న ప్రచార యాత్ర సాయంత్రం ప్రొద్దుటూరులో భారీ బహిరంగ సభ కాసేపట్లో వీరపునాయునిపల్లె, యర్రగుంట్ల మీదగా పొద్దుటూరు చేరుకోనున్న బస్సు యాత్ర కుమ్మరాంపల్లె వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు స్వాగతం పలికిన ప్రజలు. జగనన్నకు స్వాగతం పలికేందుకు.. సీఎం జగన్ బస్సు యాత్రకు స్వాగతం పలికేందుకు తరలిన ప్రజానీకం మేమంతా సిద్ధం పేరుతో జనంలోకి సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర వీరపనాయనిపల్లి మండలంలోని తంగేడు పల్లి క్రాస్ రోడ్డు వద్ద ఎదురు చూస్తున్న మహిళలు ప్రారంభమైన సీఎం జగన్ బస్సు యాత్ర ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన మేమంతా సిద్ధం యాత్ర ఎన్నికల ప్రచారం ప్రారంభించిన సీఎం జగన్ వైఎస్సార్ ఘాట్ ప్రాంగణం నుంచి కదిలిన ‘మేమంతా సిద్ధం’ జగన్నాథ రథచక్రాలు ఇవాళ కడప పార్లమెంట్ స్థానాల పరిధిలో సాగనున్న ప్రచార యాత్ర సాయంత్రం ప్రొద్దుటూరులో భారీ బహిరంగ సభ వైఎస్సార్ ఘాట్ వద్ద అభిమానుతో సీఎం జగన్ సెల్ఫీ అన్న తో సెల్ఫీ కాదు.. అన్నే తీసిన సెల్ఫీ! వైఎస్సార్ ఘాట్ వద్ద మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభానికి ముందు అభిమానుల ఉత్సాహం సెల్ఫీ కోసం యత్నించిన యువకుల ఫోన్ తీసుకుని తానే సెల్ఫీ దించిన సీఎం జగన్ సీఎం జగన్ సర్వమత ప్రార్థనలు వైఎస్సార్ ఘాట్ వద్ద సర్వమత ప్రార్థనల్లో పాల్గొంటున్న సీఎం జగన్ మూడు మతాల పెద్దల నుంచి ఆశీర్వాదం తీసుకున్న సీఎం జగన్ మేమంతా సిద్ధం.. తొలిరోజు ఇలా.. ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ నుంచి మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభం వేంపల్లి మీదుగా.. కమలాపురం నియోజకవర్గం వీఎన్ పల్లి మీదుగా.. జమ్మలమడుగు నియోజకవర్గం, యెర్రగుంట్ల ప్రొద్దుటూరు జంక్షన్ మీదుగా.. జమ్మలమడుగు నియోజకవర్గం పొట్లదుట్టి మీదుగా.. ప్రొద్దుటూరు నియోజకవర్గం ప్రొద్దుటూరు టౌన్‌కు చేరిక సాయంత్రం ప్రొద్దుటూర్ టౌన్లో సిద్ధం సభ ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్ వైఎస్సార్ విగ్రహానికి పూలతో నివాళులు అర్పించిన సీఎం జగన్ మరికాసేపట్లో బస్సు యాత్ర ప్రారంభం మరికాసేపట్లో సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం వైఎస్సార్ ఘాట్ వద్ద ముగిసిన ప్రార్థనలు మరికాసేపట్లో మేమంతా సిద్ధం బస్సు యాత్ర మొదలుపెట్టనున్న సీఎం జగన్ ఎన్నికల ప్రచార భేరికి శ్రీకారం చుట్టనున్న సీఎం జగన్ మహానేత వైఎస్సార్‌కు నివాళులర్పించి..ఆశీస్సులు తీసుకున్న సీఎం జగన్ వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళులు ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద తండ్రి, దివంగత మహానేత వైఎస్సార్‌కు నివాళులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న సీఎం జగన్ ప్రార్థనల్లో సీఎం జగన్ తల్లి విజయమ్మ, పార్టీ నేతలు దివంగత వైఎస్సార్, తల్లి విజయమ్మ ఆశీస్సులతో యాత్ర ప్రారంభించనున్న సీఎం జగన్ మేమంతా సిద్దం పేరుతో రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర.. బహిరంగ సభలు 21 రోజుల పాటు క్షేత్రస్థాయిలోనే ఉండనున్న సీఎం జగన్ వైఎస్ఆర్ ఘాట్ వద్ద సీఎం జగన్ తల్లి విజయమ్మతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్న సీఎం జగన్ వైఎస్సార్ ఘాట్ వద్ద.. ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభం ప్రార్థనల్లో వైఎస్ విజయమ్మ, వైఎస్సార్సీపీ నేతలు ఇడుపులపాయ చేరుకున్న సీఎం జగన్ హెలిప్యాడ్ వద్ద నుంచి ఘాట్ వద్దకు చేరుకుంటున్న సీఎం జగన్ కడపకు చేరుకున్న సీఎం జగన్ మరికాసేపట్లో ఇడుపులపాయకు 'సీఎం జగన్ దివంగత మహానేత వైఎస్సార్‌కు వైఎస్ ఘాట్ వద్ద ప్రార్దనలు నిర్వహించనున్న సీఎం జగన్ అనంతరం మేము సైతం బస్సు యాత్రను ప్రారంభించనున్న సీఎం జగన్ ఇడుపులపాయ చేరుకున్న వైఎస్ విజయమ్మ ఇడుపులపాయ చేరుకున్న వైఎస్ విజయమ్మ వైఎస్ ఘాట్ వద్ద కాసేపట్లో ప్రత్యేక ప్రార్థనలు సీఎం జగన్‌తో కలిసి ప్రార్థనల్లో పాల్గొననున్న విజయమ్మ ►తాడేపల్లి నుంచి ఇడుపులపాయకు బయలుదేరిన సీఎం జగన్. ►గన్నవరం విమానాశ్రయం చేరుకున్న సీఎం జగన్. అక్కడి నుంచి కడపకు బయలుదేరిన జగనన్న. ►వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్న వస్తున్నాడు 🔥✊🏻#MemanthaSiddham pic.twitter.com/c4vJKgwwLq — Jagananna Connects (@JaganannaCNCTS) March 27, 2024 ►అనంతరం బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ►కాసేపట్లో తాడేపల్లి నుంచి ఇడుపులపాయకు బయలుదేరనున్న సీఎం జగన్. ►ఇడుపులపాయలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోసం భారీగా తరలివచ్చిన అభిమానులు. ప్రజాక్షేత్రంలో పేదోళ్లని గెలిపించేందుకు.. మేమంతా సిద్ధం యాత్రకి తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరిన జగనన్న!#MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/f3SwjPEkQ3 — YSR Congress Party (@YSRCParty) March 27, 2024 ►సీఎం జగన్ కోసం ప్రత్యేకంగా లెదర్ చెప్పులు తయారుచేసుకుని తెచ్చిన ఓ అభిమాని. ►ఇడుపులపాయ.. సీఎం జగన్ బస్సుయాత్రకు ముస్తాబైన ఇడుపులపాయ pic.twitter.com/kZBbYLmvID — Rahul (@2024YCP) March 27, 2024 ►పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రగతిపథంలో నిలిపేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచారభేరి మోగించనున్నారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నివాళులు అర్పించిన అనంతరం ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రను ప్రారంభిస్తారు. తొలి రోజు బస్సు యాత్ర కడప పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో జరగనుంది. Memantha Siddham - Day 1 ఈరోజు నుంచి మేమంతా సిద్ధం యాత్రతో జనంలోకి జగనన్న! జననేతతో చేయి కలిపేందుకు మీరంతా సిద్ధమా✊🏻#MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/K3NyVdRZPe — YSR Congress Party (@YSRCParty) March 27, 2024 ►ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం 21 రోజులపాటు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తూ ‘సిద్ధం’ సభలు నిర్వహించిన నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు మినహా మిగతా పార్లమెంట్ స్థానాల పరిధిలో బస్సు యాత్రను నిర్వహించనున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తాను చేసిన ప్రజా సంకల్ప పాదయాత్ర తరహాలోనే బస్సు యాత్రలోనూ రోజూ ఉదయం వివిధ వర్గాల ప్రజలు, మేధావులతో సీఎం జగన్ మమేకమవుతారు. ప్రభుత్వ పనితీరును మరింతగా మెరుగుపర్చుకోవడానికి వారి నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. సాయంత్రం ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. A special illustration will be released today at 10:00 AM in tribute to our leader, @ysjagan garu, as he kickstarts the #MemanthaSiddham Yatra. Stay tuned!#YSJaganAgain pic.twitter.com/f0UmuPTXiW — YSR Congress Party (@YSRCParty) March 27, 2024 తొలి రోజు యాత్ర ఇలా.. ► సీఎం జగన్ ఈరోజు ఉదయం తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు ఇడుపులపాయకు చేరుకుంటారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు. ►మధ్యాహ్నం 1.30 గంటలకు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రను సీఎం వైఎస్ జగన్ ప్రారంభిస్తారు. ► ఇడుపులపాయ నుంచి కుమారునిపల్లి, వేంపల్లి, సర్వరాజుపేట, వీరపునాయనిపల్లి (కమలాపురం), గంగిరెడ్డిపల్లి, ఊరుటూరు, యర్రగుంట్ల (జమ్మలమడుగు), పోట్లదుర్తి మీదుగా సాయంత్రం 4.30 గంటలకి ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డు సమీపంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభ వద్దకు సీఎం జగన్ చేరుకుంటారు. బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ► అనంతరం సున్నపురాళ్లపల్లి, దువ్వూరు, జిల్లెల, నాగలపాడు, బోధనం, రాంపల్లె క్రాస్, చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన శిబిరం వద్దకు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. ఇది నాయకుడి మీద నమ్మకంతో వచ్చిన సైన్యం🔥 దుష్ట చతుష్టయంతో యుద్ధానికి నేను సిద్ధం.. మరో గొప్ప ప్రజా విజయాన్ని సాధించేందుకు మీరు సిద్ధమా✊🏻#MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/cBrPETLAGn — YSR Congress Party (@YSRCParty) March 26, 2024 వైఎస్సార్సీపీ శ్రేణుల్లో జోష్ ►చేసిన మంచిని ప్రతి ఇంటికి వివరించి ప్రజల ఆశీర్వాదం తీసుకునేందుకు చేపట్టిన గడప గడపకూ మన ప్రభుత్వం, వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాలకు జనం బ్రహ్మరథం పట్టారు. సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో బలంగా నాటుకుపోయిన నమ్మకాన్ని ఈ రెండు కార్యక్రమాలు ప్రతిబింబించాయి. గత 58 నెలల పాలనలో సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా ప్రతి ఇంటా.. ప్రతి గ్రామం.. ప్రతి నియోజకవర్గంలో విప్లవాత్మక మార్పులు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నప్పుడు 175కు 175 శాసనసభ స్థానాలు, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయబావుటా ఎగురవేయడం కచ్చితంగా సాధ్యమేనని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ సీఎం జగన్ సిద్ధం సభలు నిర్వహించారు. ►భీమిలి (ఉత్తరాంధ్ర), దెందులూరు (ఉత్తర కోస్తా), రాప్తాడు (రాయలసీమ), మేదరమెట్ల (ఉత్తర కోస్తా)లలో నిర్వహించిన నాలుగు సభలకు జనం కడలితో పోటీపడుతూ పోటెత్తడంతో ఒకదానికి మించి మరొకటి గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఉమ్మడి రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల చరిత్రలో రాప్తాడు, మేదరమెట్ల సభలు అతి పెద్ద ప్రజాసభలుగా నిలిచిపోయాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందే వైఎస్సార్సీపీ మరోసారి ప్రభంజనం సృష్టించడం ఖాయమని సిద్ధం సభలతో తేటతెల్లమైందని రాజకీయ పరిశీలకులు విశ్లేషించారు. ►జనసేన–బీజేపీతో టీడీపీ జతకట్టినా... సార్వత్రిక ఎన్నికల్లో వార్ వన్‌సైడేనని, వైఎస్సార్సీపీ మరోసారి చారిత్రక విజయం సాధించడం తథ్యమని టైమ్స్‌నౌ–ఈటీజీ, జీన్యూస్–మాట్రిజ్ లాంటి డజనుకుపైగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థల సర్వేలు తేల్చి చెప్పాయి. ఇప్పటికే 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించిన సీఎం జగన్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి ముందే బస్సు యాత్ర ద్వారా తొలి విడత ప్రచారాన్ని పూర్తి చేసేందుకు సిద్ధమవడంతో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నయా జోష్ కనిపిస్తోంది. -
ఈ మమకారం ఎప్పటికీ తీరదు: వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, కడప: అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనంగా తీర్చిదిద్దిన పులివెందుల పట్టణం రాష్ట్రానికే ఆదర్శనీయమని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత గడ్డపై సగర్వంగా ప్రకటించారు. ఒక్క రోజు పర్యటనలో భాగంగా సోమవారం వైఎస్సార్ కడప జిల్లాకు చేరుకున్న సీఎం జగన్ పులివెందుల నియోజకవర్గ పరిధిలో రూ.861.84 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించి మాట్లాడారు. ఈ రోజు సొంత గడ్డపై ముఖ్యమంత్రిగా నిలుచున్నానంటే మీ అందరి అభిమానం, ఆశీస్సులు, దీవెనలే కారణమన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి పులివెందులలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టానని, సొంతగడ్డపై మమకారం ఎప్పటికీ తీరేది కాదని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ ప్రారంభించినవి ఇవీ.. పులివెందుల మోడల్ టౌన్ ప్రాజెక్టులో భాగంగా రూ.20.69 కోట్లతో అధునాతన వసతులతో 4,595 చదరపు మీటర్లలో నిర్మించిన వైఎస్ జయమ్మ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ భవన సముదాయాన్ని సీఎంజగన్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్లో 58 షాపులు, మొదటి ఫ్లోర్ లో 32 షాపులతో పాటు టాయిలెట్ బ్లాకులను ఏర్పాటు చేశారు. పులివెందులలో 2.79 ఎకరాల్లో రూ.38.15 కోట్లతో ఆధునిక హంగులతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ మినీ సెక్రటేరియేట్ కాంప్లెక్స్ భవనాన్ని సీఎం ప్రారంభించారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఆర్డీవో, స్పందన హాల్, అగ్రికల్చర్, పే–అకౌంట్స్, సబ్‌ట్రెజరీ, 3 కాన్ఫరెన్స్ హాళ్లు, రెండు టాయిలెట్ బ్లాక్స్ ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఫ్లోర్లో పాడా ఆఫీస్, పీఆర్, ఆర్‌డబ్ల్యూస్ ఇంజనీరింగ్, సీడీపీవో కార్యాలయాలు, రెండు కాన్ఫరెన్స్ హాళ్లున్నాయి. రూ.500 కోట్లతో నాబార్డ్, ఆర్ఐడీఎఫ్–37 నిధులతో నూతనంగా నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్) భవనాలను ముఖ్యమంత్రి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఏటా 150 మంది వైద్య విద్యార్థులకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రవేశాలు కల్పిస్తారు. 627 పడకల కెపాసిటీతో టీచింగ్ హాస్పిటల్, మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల, బాయ్స్, గర్ల్స్ హాస్టల్ భవనాలను ఏర్పాటు చేశారు. మెడికల్ కాలేజీ ప్రాంగణంలో ప్రధానంగా ఓపీడీ బ్లాక్, ఐపీడీ బ్లాక్, 24/7 అక్యూట్ కేర్ బ్లాక్ భవనాలున్నాయి. పులివెందులలో డాక్టర్ వైఎస్సార్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్) ఎదుట సిబ్బంది, అధికారులతో సీఎం వైఎస్ జగన్ ► పులివెందుల మైన్స్ సమీపంలో అరటి ప్రాసెసింగ్ యూనిట్ వద్ద రూ.20.15 కోట్లతో అత్యాధునిక సదుపాయాలతో 5 ఎకరాల్లో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ బనానా ప్యాక్ హౌస్ (పులివెందుల మార్కెట్ కమిటీ) భవనాన్ని సీఎం ప్రారంభించారు. ఇందులో 600 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యమున్న నాలుగు (4/150) కోల్డ్ రూములు, 126 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఆరు (6/21) ప్రీ కూలింగ్ ఛాంబర్లు, లేబర్ క్వార్టర్స్, మిషనరీ రూమ్స్, 60 మెట్రిక్ టన్నుల వేయింగ్ బ్రిడ్జితో పాటు బనానా, స్వీట్ లైమ్కు సంబంధించి వేర్వేరుగా నాలుగు గ్రేడింగ్, క్లీనింగ్, ప్యాకింగ్ లైన్స్ ఏర్పాటయ్యాయి. ► పులివెందుల పట్టణం నడిబొడ్డున రూ.70 లక్షలతో నిర్మించిన వైఎస్ఆర్ జంక్షన్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇందులో ఆకర్షణీయంగా ల్యాండ్ స్కెప్ మధ్యలో చూపరులను ఆకట్టుకునేలా డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ► పులివెందుల మోడల్ టౌన్ ప్రాజెక్ట్‌లో భాగంగా రూ.11.04 కోట్లతో అభివృద్ధి చేసిన సెంట్రల్ బౌలే వార్డుకు ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం నిర్వహించారు. వైఎస్ఆర్ జంక్షన్‌కు 500 మీటర్ల దూరంలో అభివృద్ధి చేసిన ఈ మార్గంలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్, రోడ్డుకు ఇరువైపులా 3 మీటర్ల ఫుట్‌పాత్, 2.25 మీటర్ల సీటింగ్ ఏరియా, బెంచ్‌లు, 3 మీటర్ల పార్కింగ్ ఏరియా, స్టోన్ బొల్లార్డ్స్, రోడ్డుకు ఇరువైపులా నగిïÙలతో తయారైన విద్యుత్ దీపాలు, పూల కుండీలతో 6 మీటర్ల బీటీ క్యారేజ్ వే వంటి ప్రత్యేకతలు పులివెందుల పట్టణ సరికొత్త జీవనశైలికి నాంది కానున్నాయి. ► పులివెందుల మోడల్ టౌన్ ప్రాజెక్టులో భాగంగా పట్టణ నడిబొడ్డున రూ.80 లక్షల వ్యయంతో నిర్మించిన గాంధీ జంక్షన్‌ను సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సర్కిల్లో అత్యంత సుందరంగా, జీవకళ ఉట్టి పడేలా నెలకొల్పిన మహాత్మాగాంధీ విగ్రహం, పూలమొక్కలతో ల్యాండ్ స్కేప్, లైటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యమంత్రి పర్యటనలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, జిల్లా ఇంచార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితో పాటు వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ ఎంటీ కృష్ణబాబు, కలెక్టర్ వి.విజయ్‌రామరాజు, ఎస్పీ సిద్దార్థ్ కౌశల్, జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్, పాడ ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, శాసనమండలి డిప్యూటీ మాజీ చైర్మన్ ఎస్వీ సతీష్ కుమార్‌రెడ్డి, మాజీ మండలాధ్యక్షుడు బలరామిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్‌తోపాటు పలువురు అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. పర్యటన పూర్తి చేసుకుని తిరిగి తాడేపల్లి బయలుదేరిన సీఎం జగన్‌కు కడప విమానాశ్రయంలో సాదరంగా వీడ్కోలు పలికారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, రాజంపేట ఎంపీ మి«థున్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ అమర్నాథరెడ్డి, శాసనమండలి వైస్ చైర్మన్ జకియాఖానం, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్సీలు పి.రామసుబ్బారెడ్డి, రామచంద్రారెడ్డి, డీసీ గోవిందురెడ్డి, రమేష్ యాదవ్, ఎమ్మెల్యేలు దాసరి సుధా, పి.రవీంద్రనాథరెడ్డి, ఎస్.రఘురామిరెడ్డి, మల్లికార్జునరెడ్డి, డాక్టర్ సు«దీర్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, రాచమల్లు శివప్రసాదరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, మేయర్ సురేష్‌బాబు వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు. పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా రూ.175 కోట్ల పెట్టుబడితో 16.63 ఎకరాల్లో నిర్మించిన ఆదిత్య బిర్లా రెడీమేడ్ సూట్స్ తయారీ యూనిట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. ఈ పరిశ్రమ స్థాపనతో ఇప్పటికే 500 మంది ఉద్యోగాలను పొందగా మొత్తం 2,100 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఇడుపులపాయ ఎస్టేట్‌లో రూ.39.13 కోట్లతో 16 ఎకరాల్లో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్‌ను సీఎం జగన్ ప్రారంభించారు. నెమళ్ల పార్కు, పచ్చదనంతో ఆకట్టుకుంటున్న ఇడుపులపాయ ఎస్టేట్ దీనిద్వారా పర్యాటక శోభను సంతరించుకుంది. 48 అడుగుల వైఎస్ఆర్ విగ్రహం, ఆడియో విజువల్ బ్లాక్, ఫోటో గ్యాలరీ, ఎంట్రన్స్ బ్లాక్, పెవిలియన్ బ్లాక్, చిల్డ్రన్ పార్క్, ట్రాపికల్ గార్డెన్ లోటస్ పాండ్, ఫ్లోరల్ పార్క్, పాదయాత్రకు సంబంధించి 21 విగ్రహాల సమూహం ఉన్నాయి. పులివెందుల మోడల్ టౌన్ ప్రాజెక్టులో భాగంగా రూ.65.99 కోట్లతో వంద ఎకరాల్లో ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్ఆర్ ఉలిమెల్ల లేక్ ఫ్రంట్‌ను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఇందులో ఎంట్రన్స్ ప్లాజా, ఎంట్రన్స్ వాటర్ ఫౌంటెన్, ఐ లవ్ పులివెందుల, ఎలివేటెడ్ స్టెప్స్, ఓ.ఏ.టి. ఏరియా, బ్రిడ్జి, మ్యూజికల్ లేజర్ ఫౌంటెన్, మేజ్ గార్డెన్, కిడ్స్ ప్లే ఏరియా, కనెక్టింగ్ బ్రిడ్జి, బోటింగ్ జెట్టీ, అర్బన్ ఫారెస్ట్ తదితర ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. -
ఆంధ్రప్రదేశ్‌లో వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ..ఇంకా ఇతర అప్డేట్స్
-
వైఎస్సార్ కడప జిల్లాలో ముగిసిన సీఎం జగన్ పర్యటన
Live Updates.. 3:28PM. సోమవారం, Dec 25, 2023 ►వైఎస్సార్ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన ముగిసింది. కడప ఎయిర్‌పోర్టు నుంచి గన్నవరానికి సీఎం బయల్దేరారు. 12:40PM, సోమవారం, Dec 25, 2023 ► మైదుకూరు చేరుకున్న సీఎం జగన్ ► వైఎస్సార్ జిల్లా వక్ఫ్ బోర్డు ఛైర్మన్ దస్తగిరి నివాసానికి చేరుకున్న సీఎం జగన్ ► ఆయన కుమారుడు, కుమార్తెల వివాహ వేడుకలో పాల్గొన్న సీఎం జగన్ ► నూతన దంపతులను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ► పులివెందుల పర్యటన ముగించుకుని మైదుకూరుకు బయలుదేరిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ► కాసేపట్లో వక్ఫ్ బోర్డు చైర్మన్ దస్తగిరి కుమారుడు, కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొననున్న సీఎం జగన్ ► 2024 నూతన సంవత్సర క్యాలెండర్‌ను సీఎం జగన్, వైఎస్ విజయమ్మ ఆవిష్కరించారు. వారితోపాటు ఎంపీ అవినాష్ రెడ్డి, డిప్యూటి సీఎం అంజాద్ బాషా, మంత్రి అదిమూలపు సురేష్ ఉన్నారు. ► ప్రార్థనల అనంతరం సీఎం జగన్, వైఎస్ విజయమ్మ కేక్ కట్ చేశారు. ► సీఎస్ఐ చర్చిలో ప్రార్థనల అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ► సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్. ►పులివెందులలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్, కుటుంబ సభ్యులు. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కడప జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈరోజు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా సీఎం జగన్ పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్ (ఫొటోలు) మూడో రోజు పర్యటన ఇలా.. ‘మూడో రోజు జిల్లా పర్యటనలోభాగంగా.. సోమవారం ఉదయం ఇడుపులపాయ ఎస్టేట్ నుండి హెలికాప్టర్ ద్వారా బాకరపురం హెలిప్యాడ్, అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా పులివెందుల టౌన్ చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఉదయం 9.30 గంటలకు సిఎస్ఐ చర్చి ప్రాంగణం చేరుకుని.. అక్కడికి హాజరైన వారిని ఆప్యాయంగా చిరునవ్వుతో పలకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ పండుగ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఇక్కడికి విచ్చేసిన బందువర్గానికి, స్నేహితులు, ఆప్తులు, అభిమానులకు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్బంగా ఇక్కడికి విచ్చేసిన అందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలను, ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ప్రతి ఏడాది ఈ క్రిస్మస్ పర్వదినం రోజున తన సొంత గడ్డపై కుటుంబ సభ్యులు, బందుగణం, స్నేహితులతో.. కలిసి పండుగ వేడుకలో పాల్గొనడం తన మనసుకు ఎంతో ఆనందాన్నిచ్చిందని సంతోషం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రిగా సొంత ఊరిలో.. అందరితో కలిసి క్రిస్మస్ ప్రార్థనలు చేయడం తనకు ఎంతో ఆనందాన్ని, సంతృప్తినిచ్చిందని, అలాగే.. మీ అందరి అభిమానం, ఆశీస్సులు, దేవుని చల్లని దీవెనలేలు తనకు ఎల్లవేళలా అందాలని కోరుకుంటున్నానని ప్రార్థించిన ముఖ్యమంత్రి. రాష్ట్ర ప్రజల రుణం తీర్చుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజాసేవలో తరిస్తున్నానని.. ఎప్పటికీ మీ హృదయాల్లో ప్రియమైన నాయకుడిగా సుస్థిర స్థానాన్ని పొందగలనని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేసిన ముఖ్యమంత్రి.. 2024 చర్చి క్యాలెండర్ ను ఆవిష్కరించారు. క్రిస్మస్ వేడుకలో పాల్గొన్న ముఖ్యమంత్రి తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతమ్మ లతో పాటు.. వైఎస్ ప్రకాష్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి తదితర బంధువర్గాలు, ఆత్మీయులు, మిత్రులు, పురప్రజలు వేడుకలో పాల్గొన్న రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా, జిల్లా ఇంచార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, జెడ్పి చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ఎమ్మెల్యే డా.డి. సుధా, తదితరులు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్, పాడా ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి, పలువురు జిల్లాస్థాయి అధికారులు, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు తదితరులు) -
సీమ సిగలో ‘సెంచురీ’
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో పేరున్న కంపెనీలు రాష్ట్రంలో తమ యూనిట్లను ఏర్పాటు చేసి ఉత్పత్తిని ప్రారంభించాయి. ఈ కోవలో రాయలసీమ యువత, రైతులకు ప్రయోజనం చేకూరే మరో భారీ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చింది. ప్లే ఉడ్ ప్యానల్స్ తయారీలో అగ్రగామి సంస్థగా పేరున్న సెంచురీ ప్యానల్స్ వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధమైంది. వైఎస్సార్ జిల్లా బద్వేల్ వద్ద గోపవరం పారిశ్రామిక పార్కులో రూ.1,000 కోట్ల పెట్టుబడితో 100 ఎకరాల్లో ఏర్పాటు చేసిన సెంచురీ ప్యానల్స్‌ను శనివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ యూనిట్ ద్వారా 2,266 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. అలాగే అంతకు రెట్టింపు సంఖ్యలో పరోక్ష ఉపాధి కల్పిస్తోంది. సెంచురీ ప్యానల్స్‌కు డిసెంబర్ 23, 2021న సీఎం వైఎస్ జగన్ భూమి పూజ చేశారు. వెనుకబడిన ప్రాంతంలో ఒక భారీ పరిశ్రమ ఏర్పాటు అవుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల మౌలిక వసతులను కల్పించింది. అంతేకాకుండా అనుమతులను వేగంగా మంజూరు చేసింది. దీంతో రెండేళ్లలోనే సెంచురీ ప్యానెల్స్ ఉత్పత్తిని ప్రారంభించడానికి సిద్ధమైంది. కలప ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడానికి మొత్తం 490 ఎకరాల్లో గోపవరం వద్ద ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేసింది. ఇందులో యాంకర్ యూనిట్‌గా సెంచురీ ప్యానల్స్‌కు 100 ఎకరాలను 33 ఏళ్ల లీజుకు కేటాయించారు. రైతులకు ప్రయోజనం సెంచురీ ప్యానల్స్‌లో హై ప్రెజర్ లామినేట్స్ (హెచ్పీఎల్) మీడియం డెన్సిటీ ఫైబర్ బోర్డ్స్ (ఎండీఎఫ్) తయారవుతాయి. రోజుకు 950 టన్నుల సామర్థ్యం గల ఎండీఎఫ్‌లను తయారు చేస్తారు. ఇందుకోసం భారీ సంఖ్యలో కలప అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో 150 కి.మీ పరిధిలోని వైఎస్సార్, అన్నమయ్య, నంద్యాల, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల రైతుల నుంచి యూకలిప్టస్ను సేకరించనుంది. ఇందుకోసం సుమారు 80,000 ఎకరాల్లో యూకలిç³్టస్ పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు సెంచురీ ప్యానల్స్ జనరల్ మేనేజర్ రమేష్ కుమార్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధరకు తక్కువ కాకుండా యూకలిప్టస్ను కొనుగోలు చేస్తామన్నారు. దీనివల్ల సుమారు 25,000 రైతు కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనం దక్కుతుందని చెప్పారు. ఇప్పటికే రైతులకు 50 లక్షల విత్తన మొక్కలను సబ్సిడీ ధరలకు అందించినట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఉద్యోగ నియామకాల్లో 80 శాతం మంది స్థానిక యువతనే తీసుకుంటున్నామన్నారు. తొలుత గోపవరం, బద్వేలు మండలాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, ఆ తర్వాత వైఎస్సార్ జిల్లాతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. అలాగే ఈ యూనిట్‌కు అవసరమైన ముడి సరుకును అందించే రీసిన్ తయారీ యూనిట్‌ను నాయుడుపేట వద్ద రూ.50 కోట్లతో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇ ఫిబ్రవరి నాటికి అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ బాగా వెనుకబడిన ప్రాంతమైన బద్వేల్లో యూనిట్ ఏర్పాటుకు సెంచురీ ప్యానల్స్ ముందుకు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ నుంచి 0.07 టీఎంసీల నీటిని కేటాయించడంతోపాటు 132 కేవీ విద్యుత్ సరఫరా, రహదారులు నిర్మాణం వంటి మౌలిక వసతులను కల్పించాం. పరిశ్రమలకు ఇచ్చే రాయితీ, సబ్సిడీపై విద్యుత్ ఇచ్చాం. – ఎన్.యువరాజ్, కార్యదర్శి, పరిశ్రమలు, మౌలిక వసతుల శాఖ సొంతూరులోనే ఉపాధి లభించింది.. 2018లో ఎలక్ట్రికల్ డిప్లొమా పూర్తి చేశాను. అప్పటి నుంచి ఉపాధి కోసం బయటి నగరాలకు వెళ్లలేక ఊర్లోనే ఉంటూ కూలి పనులు చేసుకుంటున్నా. ఇప్పుడు గోపవరంలో సెంచురీ ప్యానల్స్ ఏర్పాటుతో నాలాంటి ఎంతోమందికి స్థానికంగానే ఉపాధి లభించింది. సొంత ఊరిలో ఉద్యోగం చేస్తానని కలలో కూడా ఊహించలేదు. సీఎం వైఎస్ జగన్ వల్లే నాకు ఉద్యోగం వచ్చింది. – కాళ్ల రాజేష్, బుచ్చనపల్లె, గోపవరం మండలం, వైఎస్సార్ జిల్లా ఇక ఉద్యోగం రాదనుకున్నా.. ఐటీఐ ఎలక్ట్రికల్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఐదేళ్లపాటు ఎదురుచూశాను. ఇక ఉద్యోగం రాదనుకున్నా. సెంచురీ ప్యానెల్స్ ఏర్పాటుతో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వడంతో నన్ను ఉద్యోగం వెతుక్కుంటూ వచ్చింది. దీంతో మా కుటుంబం ఆనందానికి అవధులు లేవు.– గుడి మెగురయ్య, కలసపాడు, వైఎస్సార్ జిల్లా నిరుద్యోగులకు ఉద్యోగాలు.. రైతులకు మేలు.. సెంచురీ ప్యానెల్స్‌కు అవసరమయ్యే రా మెటీరియల్ కోసం జామాయిల్ చెట్లు సాగు చేసుకునేందుకు పరిశ్రమ వారు రైతులను ప్రోత్సహిస్తున్నారు. ఎలాంటి రవాణా ఖర్చు లేకుండా మొక్కలను సబ్సిడీ ద్వారా నేరుగా రైతు పొలాల వద్దకే తెచ్చిస్తామన్నారు. దళారీ వ్యవస్థ లేకుండా కనీస మద్దతు ధరకు వారే కొనుగోలు చేస్తామన్నారు. జామాయిల్ సాగుపై ఇప్పటికే రైతులకు అవగాహన కల్పించారు. – రూకల దేవదాసు, గోపవరం ప్రాజెక్టు కాలనీ, గోపవరం మండలం, వైఎస్సార్ జిల్లా -
వైఎస్సార్ జిల్లాలో సీఎం జగన్ మూడు రోజుల పర్యటన.. షెడ్యూల్ ఇదే
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రోజులపాటు వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవం, శంకుస్ధాపనలు, క్రిస్మస్ వేడుకల్లో సీఎం జగన్ పాల్గొననున్నారు. 23.12.2023 షెడ్యూల్ ఉదయం 9.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కడప చేరుకుంటారు, అక్కడి నుంచి గోపవరం చేరుకుని సెంచురీ ప్లై పరిశ్రమలోని ఎండీఎఫ్, హెచ్పీఎల్ ప్లాంట్లను ప్రారంభించి, చైర్మన్, ఉద్యోగులతో మాట్లాడతారు. ఆ తర్వాత కడప రిమ్స్ వద్ద డాక్టర్ వైఎస్సార్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. దాంతోపాటు డాక్టర్ వైఎస్సార్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్‌ను ప్రారంభిస్తారు. అనంతరం అదే రిమ్స్ ప్రాంగణంలో డాక్టర్ వైఎస్సార్ క్యాన్సర్ కేర్ బ్లాక్ ప్రారంభోత్సవం, ఆ తర్వాత ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ప్రారంభోత్సవం, అనంతరం వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో కొత్తగా ఏర్పాటుచేసిన ఫ్లడ్లైట్లను ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఆధునికీకరించిన కలెక్టరేట్ భవనాన్ని, నవీకరించిన అంబేద్కర్ సర్కిల్, వై జంక్షన్, కోటిరెడ్డి సర్కిల్, సెవెన్ రోడ్స్ సర్కిల్ ప్రారంభిస్తారు, మరికొన్ని అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్ధాపనలు చేసిన అనంతరం ఇడుపులపాయ చేరుకుని వైఎస్సార్ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్‌లో రాత్రికి బసచేస్తారు. 24.12.2023 షెడ్యూల్ ఇడుపులపాయ గెస్ట్‌హౌస్ నుంచి బయలుదేరి వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులర్పిస్తారు. ఆ తర్వాత ఇడుపులపాయ ప్రేయర్ హాల్లో జరిగే ప్రార్ధనల్లో పాల్గొంటారు, అనంతరం మధ్యాహ్నం సింహాద్రిపురం చేరుకుని పలు ప్రారంభోత్సవాలు చేస్తారు, ఆ తర్వాత ఇడుపులపాయ చేరుకుని ఎకో పార్క్‌లో పులివెందుల మండల ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. అనంతరం రాత్రికి అక్కడి గెస్ట్‌హౌస్‌లో బస చేస్తారు. 25.12.2023 షెడ్యూల్ ఉదయం ఇడుపులపాయ గెస్ట్‌హౌస్ నుంచి బయలుదేరి పులివెందుల చేరుకుంటారు, అక్కడ సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ ప్రార్ధనల్లో పాల్గొంటారు, అనంతరం బయలుదేరి మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు. -
CM Jagan: వైఎస్సార్ జిల్లాలో ముగిసిన పర్యటన
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ జిల్లాలో తన రెండు రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు శుక్రవారం ఉదయం ఇడుపులపాయ ఆర్కే వ్యాలీలో రూ.1.75 కోట్లతో నిర్మించిన ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్, రూ.2.75 కోట్లతో నిర్మించిన జమ్మలమడుగు పోలీస్ స్టేషన్లను సీఎం జగన్ ప్రారంభించారు. అనంతరం అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్. బి. అంజాద్ బాషా, జిల్లా ఇంచార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ అవినాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, డీఐజీ శెంథిల్ కుమార్, ఎస్పీ శిద్దార్థ్ కౌశల్, జమ్మలమడుగు ఎమ్యెల్యే డాక్టర్ సుధీర్‌రెడ్డి, ఎంపీటీసీ గంగ రత్నమ్మ, జడ్పీటీసీ రవికుమార్ రెడ్డి, ఎంపిపి లక్ష్మీ గాయత్రి, ఇడుపులపాయ సర్పంచ్ నాగమ్మ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఎకో పార్కులో పులివెందుల నియోజకవర్గం అభివృద్ధి పనులపై సమీక్షలో భాగంగా.. వేముల మండలం ప్రజాప్రతినిధులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. సీఎం జగన్ వైఎస్సార్ జిల్లా రెండు రోజుల పర్యటన ముగిసింది. గురు, శుక్రవారాల్లో పలు అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం.. ఇడుపులపాయ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని అక్కడ నుంచి తాడేపల్లి నివాసానికి బయలుదేరి వెళ్లారు. ఇదీ చదవండి: పులివెందులో సీఎం జగన్ చేతుల మీదుగా రూ. 64.54 కోట్ల పనులు -
పులివెందులలో శ్రీకృష్ణుడి ఆలయం ప్రారంభంలో సీఎం జగన్
-
వైఎస్ఆర్ కడప జిల్లాకు సీఎం జగన్.. పులివెందులలో పర్యటించనున్న సీఎం జగన్
-
పులివెందులలో పర్యటించిన సీఎం జగన్
సాక్షి, పులివెందుల: అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనంగా తీర్చిదిద్దిన పులివెందుల పట్టణాన్ని దేశానికే ఆదర్శనీయం.. అని సగర్వంగా తెలుపుకుంటున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా గురువారం జిల్లాకు విచ్చేసిన సీఎం జగన్.. మొదటి రోజు పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో రూ. 64.54 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ముందుగా అన్నమయ్య జిల్లా రాయచోటి నుంచి హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 1.30 గంటలకు పులివెందుల భాకరాపురం హెలిప్యాడ్‌కు చేరుకున్న ముఖ్యమంత్రికి ఘన స్వాగతం లభించింది. ►భాకరాపురం రింగురోడ్డు సర్కిల్ లో 4 ఎకరాల విస్తీర్ణంలో రూ.4.54 కోట్ల వ్యయంతో నూతనంగా, అద్భుతంగా నిర్మించిన శ్రీకృష్ణ దేవాలయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేశారు. ఆలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో అర్చకులు స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకుని ముఖ్యమంత్రి పూజలు చేశారు. అనంతరం తీర్థప్రసాదాలను అందించగా, వేదపండితులు ముఖ్యమంత్రికి ఆశీర్వచనాలు అందించారు. ►రూ.9.96 కోట్ల పాడా నిధులతో ఏపీ కార్ల్ నందు నిర్మించిన అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ కాలేజీలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ►అగ్రికల్చర్ కళాశాలలో ...60 సీట్లు బీఎస్సీ (Hon) అగ్రికల్చర్, హార్టికల్చర్ కు సంభంధించి బీఎస్సీ (Hon) హార్టికల్చర్ 61 సీట్లతో కోర్సులను అందిస్తున్నాయి. ►ఏపీ కార్ల్ నందు రూ. 11 కోట్ల వ్యయం నిర్మించిన స్టేట్ ఆఫ్ ఆర్ట్ సెంట్రల్ టెస్టింగ్ లాబొరేటరీని ముఖ్యమంత్రి ప్రారంభించారు. పాలు, పాల ఉత్పత్తుల కల్తీని తనిఖీ చేయడం, నాణ్యతా పరీక్ష డయాగ్నస్టిక్ సేవలు, నిర్దిష్ట వ్యాధికారక క్రిములను ఉత్పత్తులను పరీక్షించడం , టెక్నో కమర్షియల్ మార్గాల్లో అమలు చేయడం, ఆహార ధాన్యాలు, తృణధాన్యాలు పప్పుల నమూనాలను , ఫార్మా అప్లికేషన్ పరీక్షల నిర్వహణకై దీన్ని ఏర్పాటు చేశారు. ►పులివెందుల వాసులకు అత్యంత ఆహ్లాదకర, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పిస్తూ..మొత్తం 38 ఎకరాలలో రూ .14.04 కోట్లతో నిర్మించిన శిల్పారామం నందు ఫేస్ లిఫ్టింగ్ పనులను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇందులో 28 ఎకరాల్లో శిల్పారామం కాగా 10 ఎకరాల్లో ఫంక్షన్ హాల్ ►మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్ విత్ గ్యాలరీ, హిల్ టాప్ టవర్ విత్ 16.5 అడుగుల దివంగత ముఖ్యమంత్రి డా.వై ఎస్ .రాజశేఖర్ రెడ్డి విగ్రహం, హిల్ టాప్ పార్టీ జోన్, జిప్ లైన్ (రోప్ వే), బోటింగ్ ఐలాండ్ పార్టీ జోన్, చైల్డ్ ప్లే జోన్ ,వాటర్ ఫాల్, ఫుడ్ కోర్ట్, ఆర్టిసన్స్ స్టాల్ల్స్ తో పాటు 5 అడుగుల దివంగత ముఖ్యమంత్రి డా.వై ఎస్ .రాజశేఖర్ రెడ్డి కూర్చున్న విగ్రహం తో ఆకట్టుకునే ఎంట్రీ ప్లాజా, సిసి రోడ్లు, పార్కింగ్ ఏరియా, ఆహ్లాదకరమైన గ్రీనరీ ఈ శిల్పారామం ప్రత్యేకతలు. శిల్పారామంలో ఆకట్టుకున్న ప్రదర్శనలు సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి శిల్పారామం వద్దకు రాగానే సంప్రదాయ వాయిద్యాలైన సన్నాయి, డోలు బృందంతో ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో శిల్పారామంలోకి ఘన స్వాగతం పలికారు. అక్కడే శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సంప్రదాయ సంగీత వాయిద్యాలైన బూర వాయిద్యాలు, డప్పు కళాకారుల దరువు, మోరగల్లు ప్రదర్శనలు, తోలు బొమ్మలాట , చెక్క భజనలు, జానపద నృత్యాల నడుమ పల్లెసీమ ఉట్టి పడేలా ప్రదర్శనలు చేపట్టారు. అనంతరం అక్కడి నుంచి కొద్ది దూరంలోనే చేతి వృత్తుల తయారీ అయిన జూట్ బ్యాగ్‌లు, కలంకారి పెయింటింగ్, మిల్లెట్స్ , కలంకారీ చీరలు, ఆకట్టుకునే సంపద్రాయ ఆభరణాలు కళ్లకు మిరుమిట్లు గొలిపేలా ప్రదర్శించారు. అక్కడే బోటింగ్ వద్ద పెద్ద స్క్రీన్ పై క్రికెట్ మ్యాచ్ లైవ్ ప్రసారాలను ప్రదర్శించారు. అక్కడికి సమీపంలోనే ఎంబీ థియేటర్ వద్ద పులివెందుల ఉమెన్స్ డిగ్రీ కాలేజీ విద్యార్థినుల చేత సాంస్కృతిక ప్రదర్శనలు కనులపండువగా నిర్వహించారు. అక్కడి నుంచి హిల్ టాప్ పైకి వెళ్లగానే ముందుగా కీలుగుర్రాలు, ఎద్దు వేషాలు డప్పు దరువుల మధ్య సాదర స్వాగతం ఆకట్టుకుంది. అనంతరం హిల్ టాప్‌పైన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడి నుంచే శిల్పారామం వ్యూ పాయింట్‌ను పరిశీలించారు. దిగువన మ్యూజిక్ వాటర్ ఫౌంటెన్‌ను ప్రదర్శించగా సీఎం వీక్షించారు. అనంతరం సీఎం అధికారులతో గ్రూప్ ఫోటో దిగి ఉత్సాహంగా శిల్పారామం కలియతిరిగారు. శ్రీస్వామి నారాయణ గురుకుల పాఠశాలకు శంకుస్థాపన రూ. 60 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న శ్రీ స్వామి నారాయణ గురుకుల పాఠశాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. మొదటి దశలో రూ.25 కోట్లు, రెండవ దశలో రూ.35 కోట్లు ఈ పాఠశాల నిర్మాణానికి ఖర్చు చేయనున్నారు. ఇందులో కేజీ నుంచి 12వ తరగతి వరకు ఉండగా, వసతి గృహం, ఇండోర్ ఔట్ డోర్ క్రీడా మైదానాలు, డైనింగ్ హాల్, డిజిటల్ లైబ్రరీ, కంప్యూటర్, మాథ్స్ లాబ్స్, ఆక్టివిటీ రూమ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ రూమ్, ఓపెన్ ఎయిర్ థియేటర్ తదితర నిర్మాణాలు చేయనున్నారు. ఆదిత్య బిర్లా యూనిట్‌ను సందర్శించిన సీఎం సీఎం జగన్ పర్యటనలో భాగంగా ఆదిత్య బిర్లా గార్మెంట్స్‌ను సందర్శించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చి ఇందులో లో దాదాపు 500 మంది పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా మహిళలతో సీఎం కాసేపు ముచ్చటించారు. అలాగే సిబ్బందితో గార్మెంట్స్ ఉత్పత్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడ పని చేస్తున్న మహిళలు, సిబ్బందిని ముఖ్యమంత్రి అభినందించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, జిల్లా ఇంచార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలతో పాటు ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి ధనుంజయ రెడ్డి, పులివెందుల ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు. ►అన్నమయ్య జిల్లా రాయచోటిలో మాజీ ఎంపీపీ గౌస్ మహ్మద్ రఫీ కుటుంబ సభ్యుల వివాహా వేడుకకు సీఎం జగన్ హాజరయ్యారు. రాజధాని ఫంక్షన్ హాల్లో జరిగిన వేడుకల్లో వరుడు మహ్మద్ నిహాజ్, వధువు నూర్ ఈ చష్మిలను సీఎం ఆశీర్వదించారు. ►శాసన మండలి డిప్యూటీ చైర్ పర్సన్ జకియా ఖానం కుమారుడి వివాహ వేడుకకు సీఎం జగన్ హాజరయ్యారు. నూతన దంపతులను సీఎం ఆశీర్వదించారు. -
ప్రొద్దుటూరులో టీడీపీ నేతల వీరంగం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: జిల్లాలోని ప్రొద్దుటూరులో టీడీపీ నేతలు వీరంగం చేశారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు బెనర్జీపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. బెనర్జీకి తీవ్ర గాయాలవ్వగా.. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. దాడికి తెగబడిన వ్యక్తిని టీడీపీ ఇంచార్జి ప్రవీణ్ ముఖ్య అనుచరుడు భరత్‌గా గుర్తించారు. -
కడపలో విషాదం.. కుటుంబంతో సహా హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
సాక్షి, వైఎస్సార్ కడప జిల్లా: కడప కో-ఆపరేటివ్ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి నలుగురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. కడప టూ టౌన్ హెచ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు.. కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య, ఇద్దరు పిల్లలను, రివాల్వర్ తో కాల్చి తానూ కాల్చుకునీ ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
కొప్పర్తిలో ఈఎంసీ క్లస్టర్లో ఆల్ డిక్సన్ యూనిట్‌ను ప్రారంభించిన సీఎం జగన్ (ఫొటోలు)
-
వైఎస్సార్ జిల్లాలో ముగిసిన సీఎం జగన్ పర్యటన
Live Updates: ►వైఎస్సార్ జిల్లాలో సీఎం జగన్ మూడు రోజుల పర్యటన ముగిసింది. ఈరోజు(సోమవారం) కొప్పర్తిలో పారిశ్రామికవాడ పరిశీలన, అభివృద్ధి పనులను ప్రారంభించారు సీఎం జగన్. అనంతరం తాడేపల్లికి తిరుగుపయనమయ్యారు. ► సీఎం జగన్ కడప జిల్లా కొప్పర్తి పర్యటనలో భాగంగా పారిశ్రామికవాడ పరిశీలన, అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించారు. వైఎస్సార్ ఈఎంసీ క్లస్టర్లో ఆల్ డిక్సన్ యూనిట్‌తోపాటు పలు పారిశ్రామిక యూనిట్లను సీఎం జగన్ ప్రారంభించారు. ఆల్ డిక్సన్ టెక్నాలజీస్ యూనిట్లో సర్వైలెన్స్ కెమెరాలు, డిజిటల్ రికార్డర్, లాప్టాప్ తయారీ కేంద్రాలను పరిశీలించారు. సీఎం వెంట సీఎస్ జవహర్ రెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నారు. ►ఆల్ డిక్సన్ సి.పి ప్లస్ యూనిట్ లో 2 నుంచి 3 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. చైనా తర్వాత ప్రపంచ వ్యాప్తంగా మూడవ అతిపెద్ద యూనిట్ కొప్పర్తిలో ఏర్పాటు కానుంది. ► సీఎం వైఎస్ జగన్ కొప్పర్తి బయలుదేరి వెళ్లారు. మరికొద్దిసేపటిలో డిక్సన్ యూనిట్‌ను ఆయన ప్రారంభిస్తారు. ► కడప నగరంలో రూ.871.77కోట్ల అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అందులో భాగంగా రూ.1.37 కోట్లతో పూర్తయిన రాజీవ్ పార్కు అభివృద్ధి పనులను, రూ. 5.61 కోట్లతో పూర్తయిన రాజీవ్ మార్గ్ అభివృద్ధి పనులను సీఎం జగన్ ప్రారంభించారు. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కడపకు చేరుకున్నారు. సీఎంకు మంత్రులు అంజాద్ భాషా, ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, మేడా మల్లికార్జున రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, మేయర్ సురేష్ బాబు, జడ్పీ ఛైర్మన్ ఆకేపాటి అమర్నాధ్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. కాసేపట్లో రాజీవ్ మార్గ్, రాజీవ్ పార్క్‌లను వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. నేటి సీఎం పర్యటన వివరాలు వైఎస్సార్ కడప జిల్లాలో నేడు (సోమవారం) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడో రోజు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. ► ఉదయం 8.50 గంటలకు హెచ్‌సీఎం రెసిడెన్స్ నుంచి బయలుదేరి హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ► 9.20 గంటలకు కడప ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. ► 9.25 నుంచి 10.00 గంటల వరకు ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. ► 10.00 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 10.10 గంటలకు రాజీవ్ మార్గ్ చేరుకుంటారు. ► 10.20 గంటల వరకు రాజీవ్ మార్గ్ రోడ్డు ప్రారంభోత్సవంలో గడుపుతారు. ► 10.25కు రాజీవ్ పార్కు చేరుకుంటారు. ► 10.35 గంటల వరకు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేస్తారు. ► 10.50 గంటలకు హెలిప్యాడ్ నుంచి బయ లుదేరి 11.00 గంటలకు కొప్పర్తి హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ► 11.10 గంటలకు అల్ డిక్సన్ యూనిట్‌కు చేరుకుని ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ► 11.35 నుంచి 11.45 గంటల వరకు పారిశ్రామిక యూనిట్ల శంకుస్థాపన కార్యక్రమాల్లో గడుపుతారు. ► 11.55 గంటలకు హెలిప్యాడ్ నుంచి బయలుదేరి 12.10 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. ► 12.15 గంటలకు విమానాశ్రయం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.00 గంటకు గన్నవరం విమానాశ్రయానికి వెళతారు ► 1.30 గంటలకు తాడేపల్లిలోని సీఎం నివాసానికి వెళతారు. రూ.871.77కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం సాక్షి, కడప: కడప నగరంలో రూ.871.77కోట్ల అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. అందులో రూ.1.37 కోట్లతో పూర్తయిన రాజీవ్ పార్కు అభివృద్ధి పనులను, రూ. 5.61కోట్లతో పూర్తయిన రాజీవ్ మార్గ్ అభివృద్ధి పనులను ప్రారంభించి కడప ప్రజలకు అంకితం చేయబోతున్నారు. అలాగే రూ.15కోట్లతో రెజూవనేషన్ ఆఫ్ పుట్లంపల్లె లేక్(అమృత్ 2.0),పాత మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో రూ.31.17కోట్లతో నిర్మించనున్న కడప నగరపాలక సంస్థ నూతన కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. రూ.106.44కోట్లతో కడప కార్పొరేషన్ బలహీనవర్గాల హౌసింగ్ కాలనీలకు నీటిసరఫరా మరియు సీవర్ నెట్వర్క్ ఏర్పాటు చేసేందుకు, రూ.20కోట్లతో బుగ్గవంకపై రెండు నూతన వంతెనల నిర్మాణానికి, రూ.50.22కోట్లతో కడపలో సీవరేజ్,సెపె్టడ్ మేనేజ్మెంట్కు, బ్రహ్మంసాగర్ నుంచి కడప కార్పొరేషన్‌కు నీటి సరఫరా చేసేందుకు అమృత్ 2.0 కింద రూ.572.76కోట్లతో రూపొందించిన ప్రాజెక్టుకు, రూ.69.20కోట్లతో మేజర్ స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ సిస్టమ్‌కు శంకుస్థాపన చేయనున్నారు. సర్వాంగ సుందరంగా ముస్తాబైన రాజీవ్ మార్గ్, రాజీవ్ పార్కు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభోత్సవం చేయనున్న నేపథ్యంలో కడప నగరం ఏపీహెచ్‌బీ కాలనీలో నూతనంగా నిర్మించిన రాజీవ్ మార్గ్, రాజీవ్ పార్కులు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. రాజీవ్ మార్గ్‌లో ఫుట్‌పాత్‌లు, పార్కింగ్, డివైడర్లు, వీధి దీపాలతో అందంగా తయారైంది. అలాగే కిడ్స్ జోన్, ఓపెన్ జిమ్, యోగా జోన్, ఓఏటీ, రిక్రియేషన్ లాన్, రెస్ట్ రూమ్‌లతో కళాత్మకంగా తీర్చిదిద్దిన రాజీవ్ పార్కు సందర్శకులకు ఆహ్వానం పలుకుతోంది. సీఎం పర్యటనకు భారీ బందోబస్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా చివరిరోజున సోమవారం కడప నగరంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కడప ఒన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆర్ట్స్ కళాశాల మైదానం, రాజీవ్‌మార్గ్, రాజీవ్ పార్క్, కొప్పర్తి పారిశ్రామిక వాడ, కడప విమానాశ్రయాల వద్ద జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది భారీగా బందోబస్తు విధులను నిర్వహిస్తున్నారు. ఈ విధులలో ఎస్పీతో పాటు, కడప డీఎస్పీ ఎం.డి. షరీఫ్, సీఐలు, ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
వైఎస్సార్ స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించిన సీఎం జగన్
Live Updates ►పులివెందులలో నూతనంగా రూ. 26.12కోట్లతో నిర్మించిన వైఎస్సార్ స్పోర్ట్స్ అకాడమీ ప్రారంభోత్సవం చేసిన సీఎం జగన్ ►రాష్ట్రంలో రెండవ హాకీ టర్ఫ్ కోర్టును ప్రారంభించిన సీఎం జగన్ ►హాకీ టర్ఫ్ కోర్టు, బాస్కెట్ బాల్ కోర్టు, టెన్నిస్ కోర్టు,ఆర్చరీ బ్లాక్, హ్యాండ్ బాల్, ఖో ఖో, ఇండోర్ బ్యాట్ మింటన్ కోర్టు ప్రారంభించిన సీఎం జగన్ ►ఇడుపులపాయకు తిరుగు ప్రయాణమైన సీఎం జగన్ ►పులివెందులలో ఇస్టా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్ ►కార్యక్రమానికి హాజరైన మంత్రి అంజాద్ భాషా, ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు ►పులివెందులలో వైఎస్సార్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం జగన్ ► గండికోటలో ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన అనంతరం పులివెందులలో పలు ప్రారంభోత్సోవాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. పులివెందుల మున్సిపల్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం కౌన్సిలర్లతో సమావేశమయ్యారు. ►ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రదేశం గండికోట: సీఎం జగన్ ►ఒబెరాయ్ గ్రూప్ హోటల్స్ పెట్టుబడులు పెట్టడం శుభపరిణామం ►స్టార్ గ్రూపుల రాకతో గండికోటను టూరిజం మ్యాప్‌లోకి తీసుకెళ్తాం ►గండికోట అంతర్జాతీయ మ్యాప్‌లోకి వెళ్తుంది ►ఒబెరాయ్ సెవెన్ స్టార్స్ హోటల్స్ ద్వారా ఉపాధి అవకాశాలు ►గండికోటకు మరో స్టార్ గ్రూప్‌ను కూడా తీసుకొస్తాం ►కొప్పర్తి డిక్సన్ కంపెనీ ద్వారా మరో వెయ్యి మందికి ఉద్యోగాలు ►కొప్పర్తిలో పలు కంపెనీలతో రేపు(సోమవారం) ఎంవోయూలు చేసుకుంటాం ► గండికోట చారిత్రాత్మక ప్రదేశం: సీఎస్ జవహర్‌రెడ్డి ► పర్యాటక రంగంలో కొత్త అధ్యాయానికి సీఎం శ్రీకారం చుట్టారు ► పోలవరం ప్రాంతాల్లో కూడా పర్యాటక అభివృద్ధి ► గండికోట దేశంలోనే గొప్ప పర్యాటక కేంద్రంగా నిలుస్తుంది ► రాష్ట్రంలో అభివృద్ధిని సీఎం జగన్ పరుగులు పెట్టిస్తున్నారు: మంత్రి రోజా ► అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలన చేస్తున్నారు ►ఏపీలో పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం ►రికార్డు సృష్లించాలన్నా.. బద్ధలుగొట్టాలన్నా సీఎం జగన్‌కే సాధ్యం ► ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి పరుగులు పెడుతోంది. ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. వైఎస్సార్ జిల్లా గండికోటలో సీఎం భూమి పూజ చేశారు. విశాఖ, తిరుపతి ఒబెరాయ్ హోటల్స్‌కు వర్చువల్‌గా సీఎం శంకుస్థాపనం చేశారు. ఈ కార్యక్రమంలో ఒబెరాయ్ హోటల్స్ ఎండీ విక్రమ్‌సింగ్ ఒబెరాయ్, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రులు ఆర్కే రోజా, ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. ► మూడు చోట్ల ఒబెరాయ్ గ్రూప్ సెవెన్ స్టార్ హోటల్స్ నిర్మించనుంది. గండికోట, తిరుపతి, విశాఖపట్నంలో సెవెన్ స్టార్ట్స్ హోటల్స్ నిర్మాణం జరగనున్నాయి. ► గండికోట చేరుకున్న సీఎం జగన్.. ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకు శుంకుస్థాపన చేశారు. అనంతరం వ్యూపాయింట్‌ను పరిశీలించారు. ►ఇడుపులపాయ నుంచి సీఎం జగన్ గండికోట బయల్దేరారు. సాక్షి, కడప: వైఎస్సార్ కడప జిల్లాలో నేడు(ఆదివారం) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండో రోజు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. ఉదయం 9.20 నిమిషాలకు గండికోటకు చేరుకోనున్నారు. అక్కడ ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం వ్యూ పాయింట్‌ను పరిశీలించనున్నారు. తర్వాత పులివెందులలో నూతనంగా నిర్మించిన మున్సిపల్ కార్యాలయ భవనానికి ప్రారంభోత్సవం చేయనున్నారు. అనంతరం పులివెందుల రాణితోపు చేరుకొని నగరవనాన్ని ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి గరండాల రివర్ ఫ్రంట్ చేరుకొని.. గరండాల కెనాల్ డెవలప్మెంట్ ఫేజ్-1 పనులను సీఎం జగన్ ప్రారంభిస్తారు. తర్వాత పులివెందులలో నూతనంగా నిర్మించిన(వైఎస్ఆర్ ఐఎస్‌టీఏ) స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ప్రారంభించనున్నారు అనంతరం పులివెందులలోని ఏపీ కార్ల్‌లో ఏర్పాటు చేసిన న్యూటెక్ బయో సైన్సెస్‌ను ప్రారంభిస్తారు. తిరిగి మధ్యాహ్నం 2.30 గంటలకుపులివెందులలో వైఎస్సార్ స్పోర్ట్స్ అకాడమీకి ప్రారంభోత్సవం చేస్తారు. ఈ కార్యక్రమాల అనంతరం ఇడుపులపాయ చేరుకోనున్నారు. చదవండి: ఏపీయే స్ఫూర్తి.. దేశవ్యాప్తంగా జనరిక్ పశు ఔషధ కేంద్రాలు -
చంద్రబాబూ.. అలా చెప్పే ధైర్యంగా ఉందా?: ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి
సాక్షి, వైఎస్సార్: కొన్ని వేల హామీలు ఇచ్చి అమలు చేయకుండా అధికారంలోకి వచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కిందని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ పథకం అమలు చేశాను అని ధైర్యంగా బాబు చెప్పగలరా.. 14 సంవత్సరాల సీఎం కావడం ఏపీ ప్రజల దురదృష్టమని మండిపడ్డారు. చదుకునే రోజుల్లో ఆయన ఆస్తులు ఎంత, ఈనాడు ఆయన ఆస్తి ఎంతో ప్రజలకు తెలుసు.. బాబు హయాంలో అవినీతి రాష్ట్రంగా పేరు గాంచిందన్నారు. లోకేష్ రాష్ట్రానికి చేసింది ఏమి లేదని, మంగళగిరిలో ఓడిన వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసినా ఫలితం శూన్యమన్నారు. గత ప్రభుత్వంలో ఆఖరికి దేవాలయాల్లో స్వీపర్ పోస్టుల విషయంలో కూడా అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. బాబు హయాంలో కుప్పం నియోజకవర్గం అభివృద్ధి శూన్యం కాగా.. సీఎం జగన్ పాలనలో రెవెన్యూ డివిజనల్, కుప్పం నగర అభివృద్ధి జరిగిందని తెలిపారు. తండ్రి కొడుకులు ఉండేది హైదరాబాద్‌లో పోటీ చేసేది కుప్పం, మంగళగిరిలో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వీళ్లు సీఎంపై ఆరోపణలు చేయడం తప్ప.. రాష్ట్రానికి చేసిందేమి లేదన్నారు. దేశంలో ఎక్కడ లేనివిధంగా 51 శాతంతో అధికారంలోకి వచ్చిన ఘనత వైఎస్సార్సీపీకే దక్కిందన్నారు. అధికార వికేంద్రీకరణ చేయడం వల్ల సీఎం జగన్ అభివృద్ధికి నాంది పలికారన్నారు. గాలిని ఆపింది, తుఫాన్ ఆపింది నేనె అని గాలి కబుర్లు చెప్పే వ్యక్తి జగన్ కాదని.. అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించే వ్యక్తి అని అన్నారు. ఐదు సంవత్సరాలు పాలన చేసిన దివంగత వైఎస్సార్‌ను నేడు ప్రజలు దేవుడిలా పూజిస్తున్నారు... మరి 14 సంవత్సరాలుగా సీఎంగా ఉన్న బాబును ఏ ఒక్కరైనా పూజిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. చదవండి: చట్టానికి లోబడే దర్యాప్తు.. ఈనాడు, ఈటీవీ ఆరోపణలు అవాస్తవం: ఏపీ సీఐడీ -
చింపేస్తాం.. పీకేస్తాం.. నారా లోకేష్ ఓవర్ యాక్షన్
సాక్షి, వైఎస్సార్(చాపాడు): టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర ఆదివారం వైఎస్సార్ జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో ఈవెనింగ్ వాక్‌లా సాగింది. మూడు రోజులపాటు సాయంత్రం 5 గంటల తర్వాతే లోకేశ్ పాదయాత్ర జరిగింది. ఇదేం పాదయాత్ర అని స్థానికులు పెదవి విరుస్తున్నారు. ఇలా అయితే ప్రజా సమస్యలు ఎలా తెలుస్తాయని వారు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. పాదయాత్ర పొడవునా ప్రతి గ్రామం వద్ద అక్కడికి వచ్చే కొద్దిపాటి మందిని లోకేశ్ దగ్గరకు రప్పించుకుని సెల్ఫీలు తీయించుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. సీఎం ఫ్లెక్సీపై లోకేశ్ వాగ్వాదం.. రాత్రికి చించివేత ఇదిలా ఉంటే.. మండల కేంద్రమైన చాపాడులో శనివారం రాత్రి జరిగిన పాదయాత్రలో చాపాడు వద్ద వెలసిన పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధం పేరుతో ఉన్న సీఎం వైఎస్ జగన్ ఫ్లెక్సీపై పోలీసులతో లోకేశ్ వాగ్వాదం చేశారు. తమ తండ్రిని కించపరిచేలా ఉన్న ఫ్లెక్సీని చింపేస్తాం.. పీకేస్తాం.. అంటూ మైదుకూరు అర్బన్ సీఐ చలపతి, రూరల్ సీఐ నరేంద్రరెడ్డిలతో ఆయన వాగ్వాదం చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో చాపాడు కూడలిలో ఉన్న ఇద్దరు పోలీసులను కారులో వచ్చిన కొందరు వ్యక్తులు బెదిరించి అక్కడి సీఎం జగన్ ఫ్లెక్సీని చించేశారు. దీనిపై స్థానిక వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేయగా ఆదివారం పోలీసులు ఖాజీపేట ప్రాంతంలో ఆ కారును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు.. ఖాజీపేట మండలంలోనూ వైఎస్సార్సీపీ ఫ్లెక్సీనీ టీడీపీ కార్యకర్త చించివేయడం వివాదాస్పదమైంది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. చదవండి: RBI Report: అలర్ట్.. నకిలీ నోట్లపై ఆర్బీఐ కీలక రిపోర్ట్ -
1902 నెంబర్‌ను ప్రతి గడపకు తీసుకెళ్ళేలా చర్యలు: కలెక్టర్లు
సాక్షి, అమరావతి: ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాంప్ కార్యాలయం నుంచి మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా 1902 టోల్ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు, ఎస్పీలు మాట్లాడారు. ఏమన్నారో వారి మాటల్లోనే.. ఈ కార్యక్రమాన్ని మరింతగా ముందుకు తీసుకెళతాం గడిచిన ఆరు నెలలుగా మీరు ఇస్తున్న సూచనల మేరకు మా జిల్లాలో జిల్లా స్ధాయిలో ప్రత్యేక యూనిట్‌ను ఏర్పాటుచేశాం, కలెక్టర్, జేసీల నేతృత్వంలో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ పనిచేస్తుంది, ఇందులో ఒక స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కన్వీనర్‌గా ఉన్నారు, అన్ని ప్రభుత్వ విభాగాలలో వస్తున్న వినతులు, ఫిర్యాదులు పరిశీలించడం, మండల స్ధాయిలో కూడా పరిశీలించేలా చర్యలు తీసుకున్నాం, ప్రతి గ్రీవియెన్స్‌ను పరిశీలించడం, మానిటరింగ్ చేయడం జరుగుతుంది. సంబంధిత వార్త: ప్రజలకు సేవ చేసేందుకే సేవకుడిగా ఇక్కడికి వచ్చాను: సీఎం జగన్ మా జిల్లాలో వస్తున్న గ్రీవియెన్స్‌ను పరిష్కరించడం, రీ ఓపెన్ అయిన వాటిని పరిష్కరించడం చేస్తున్నాం. మీ సూచనల ప్రకారం గ్రామ సచివాలయం నుంచి జిల్లా కేంద్రం వరకు అందరూ పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మీ పేరు ఉండడం వల్ల నాణ్యతతో కూడిన పరిష్కారం వచ్చేలా చర్యలు తీసుకున్నాం, ప్రతి సచివాలయంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు, మీ సూచనలు సలహాలు పాటించి ఈ కార్యక్రమాన్ని మరింతగా ముందుకు తీసుకెళతాం. మా జిల్లా యంత్రాంగం అంతా సర్వసన్నద్ధంగా ఉంది. థాంక్యూ సార్. -దినేష్ కుమార్, కలెక్టర్, ప్రకాశం జిల్లా ఎలాంటి జాప్యం లేకుండా పరిష్కారం సార్, ఈ కార్యక్రమాన్ని జిల్లా అధికార యంత్రాంగం అంతా వీక్షిస్తుంది. మేం మా దగ్గరకు వచ్చే గ్రీవియెన్స్ పరిష్కారానికి పూర్తి మెకానిజాన్ని సిద్దం చేసుకున్నాం, 24 గంటలు పనిచేసేలా కాల్ సెంటర్ ఏర్పాటుచేశాం, స్పెషల్ ఆఫీసర్ కూడా పరిశీలిస్తున్నారు, ఫిర్యాదు చేసిన వ్యక్తి సమస్య పరిష్కారం అవగానే చిరునవ్వుతో వెనుదిరగాలి అనే విధంగా ముందుకెళుతున్నాం, గడిచిన కొద్ది వారాలుగా మేం ఈ కార్యక్రమానికి పూర్తి సన్నద్దమై ఉన్నాం. జిల్లా స్ధాయి నుంచే కాదు మండల స్ధాయి నుంచి కూడా అధికారులు సిద్దంగా ఉన్నారు, ఎలాంటి జాప్యం లేకుండా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నాం, ఇప్పటికే జిల్లా అధికారులకు తగిన విధంగా శిక్షణ కూడా ఇచ్చాం, గ్రీవియెన్స్ పరిష్కారం తర్వాత ఇతరులకు ఉపయోగపడేలా మార్గదర్శకాలు కూడా రూపొందిస్తున్నాం. ఇది ఒక కొత్త శకానికి నాంది పలుకుతుంది.! -నిషాంత్‌కుమార్, కలెక్టర్, పార్వతీపురం మన్యం జిల్లా 1902 నెంబర్‌ను ప్రతి గడపకు తీసుకెళ్ళేలా చర్యలు జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాం, జిల్లా స్ధాయిలో, మండల స్ధాయిలో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లలో అవసరమైన పోలీస్ సిబ్బందిని నియమించాం, ఇప్పటికే అవగాహన తరగతులు నిర్వహించాం, 1902 నెంబర్‌ను ప్రతి గడపకు తీసుకెళ్ళేలా చర్యలు తీసుకున్నాం, డైలీ స్టేటస్ రిపోర్ట్‌ను తీసుకుని పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తాం, పిటీషన్‌ను నిర్ణీత కాలపరిధిలో పరిష్కరిస్తున్నారా లేదా అని జిల్లా స్ధాయిలో పర్యవేక్షణ జరుగుతుంది, అన్ని శాఖల సమన్వయంతో పిటీషనర్‌కు న్యాయం జరిగేలా చూస్తాం, సివిల్ కేసుల పరిష్కారానికి మండల, జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సహకారం తీసుకుంటాం. ఫీడ్ బ్యాక్ మెకానిజాన్ని కూడా ఏర్పాటుచేశాం, ఈ కార్యక్రమం దేశానికే రోల్‌మోడల్ అవుతుందని భావిస్తున్నాం. అన్భురాజన్, ఎస్పీ, వైఎస్సార్ కడప జిల్లా -
నేటి నుంచి ఒంటిమిట్ట కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాలు
సాక్షి, వైఎస్సార్: ఆంధ్రా భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి (మార్చి 30) నుంచి ప్రారంభం కానున్నాయి. పది రోజుల పాటు ఈ వేడుకలను అంగరంగ వైభవంగా జరిపేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అన్ని ఏర్పాటు చేస్తోంది. శ్రీరామనవమి సందర్భంగా గురువారం అంకురార్పణతో ప్రారంభమై.. ఏప్రిల్ 9వ తేదీ పుష్పయాగంతో ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఏప్రిల్ 5న ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. -
రెండో వివాహంతోనే కుటుంబంలో తీవ్ర విభేదాలు!
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ తనను శుక్రవారం విచారణకు హాజరు కావాలనడంపై కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి గురువారం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పిటిషన్లో ఆయన కీలక అంశాలను కూడా ప్రస్తావించారు. వివేకా, సునీత మధ్య మనస్పర్థలు ‘2010లో షేక్ షమీమ్‌ను వైఎస్ వివేకా రెండో వివాహం చేసుకున్నారు. 2015లో వీరికి ఓ కుమారుడు కూడా పుట్టాడు. అప్పటి నుంచి వివేకా కుటుంబంలో తీవ్ర విభేదాలు తలెత్తాయి. షమీమ్‌ను సునీత, ఆమె భర్త ఎన్.రాజశేఖరరెడ్డి, బావ ఎన్.శివప్రకాశ్‌రెడ్డి శత్రువుగా చూసేవారు. సునీత, రాజశేఖరరెడ్డితో పాటు వివేకా పలు కంపెనీల్లో డైరెక్టర్‌గా ఉన్నారు. వారు వివేకానందరెడ్డి చెక్ పవర్‌ను కూడా రద్దు చేశారు. దీంతో ఆయన ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వివేకా మొదటి భార్య, కూతురు హైదరాబాద్‌లో ఉండగా, ఆయన మాత్రం పులివెందులలోనే ఎక్కువ రోజులు గడిపేవారు. ఒక దశలో ఆయన వారసుడిగా షమీమ్ కుమారుడినే ప్రకటిస్తారని, ఆ మేరకు విల్లు కూడా రాశారని పుకార్లు వచ్చాయి. హత్య అనంతరం నిందితుల (ఏ1 నుంచి ఏ4) ఇళ్లలో ఈ పత్రాల కోసం వెతికినట్లు కూడా సమాచారం. ఇవన్నీ పరిశీలిస్తే.. సొంత కుటుంబ సభ్యులే ఆయన్ని వదలించుకునే పథకం వేసినట్లు అర్థమవుతుంది. వివేకా మరణానంతరం సునీత, ఆమె కుటుంబీకులు బెదిరించినట్లు షమీమ్ దర్యాప్తు అధికారులకు కూడా చెప్పారు. తన కుమారుడి పేరుమీద రూ.2 కోట్లు బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తానని వివేకా చెప్పినట్లు వెల్లడించారు’ అని అవినాశ్‌రెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు. బీటెక్ రవి, చంద్రబాబు ప్రభావంతోనే.. ‘వివేకా హత్య తర్వాత సునీత, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డి టీడీపీ ఎమ్మెల్సీ ఎం.రవీంద్రనాథ్‌రెడ్డి (బీటెక్ రవి)ని కలిశారు. రవి ద్వారా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో మంతనాలు జరిపారు. హత్య జరిగిన సంవత్సరం వరకు సునీత నాపై ఆరోపణలు చేయలేదు. పైగా, ప్రెస్‌మీట్ పెట్టి నా విజయం కోసం వివేకా చాలా శ్రమించారని, జమ్మలమడుగులో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారని ఆమె చెప్పారు. కానీ చంద్రబాబు ప్రభావానికి లోనైన తర్వాతే నాపై ఆరోపణలు చేశారు’ అని తెలిపారు. వారికి నచ్చినట్లు దర్యాప్తు ‘దస్తగిరి అక్కడా ఇక్కడా విని చెప్పిన మాటల ఆధారంగానే సీబీఐ దర్యాప్తు సాగుతోంది. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినా ఈ కేసులో నన్ను ఇరికిస్తున్నారు. సునీల్ యాదవ్ గూగుల్ టేక్ఔట్ ఫోన్ లొకేషన్ అనే పేరుతో సీబీఐ నన్ను వేధిస్తోంది. హత్య జరిగిన ప్రాంతంలో దొరికిన లేఖపై దర్యాప్తు చేయటంలేదు. దర్యాప్తు అధికారి తప్పుడు ప్రచారానికి ప్రభావితమై ఆ కోణంలోనే, పక్షపాతంతో విచారణ చేస్తున్నారు. తప్పుడు సాక్ష్యాలు చెప్పేలా కొందరిపై ఒత్తిడి తెస్తున్నారు. నేను విచారణలో చెప్పిన విషయాలను విచారణ అధికారి మార్చి వారికి అవసరమైనట్లుగా మీడియాకు లీకులిస్తున్నారు. నోటీసుల దశలో దర్యాప్తు సాగుతుండగా చార్జిషీట్లో నేరస్తునిగా సీబీఐ చిత్రీకరిస్తోంది. రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు ఈ కేసు దర్యాప్తును తప్పుదోవ పట్టిస్తున్నారు. అందువల్ల నిష్పక్షపాతంగా విచారణ జరిగేలా దర్యాప్తు అధికారులను ఆదేశించాలి’ అని అవినాశ్‌రెడ్డి పిటిషన్లో కోరారు. -
16వ శతాబ్దం నాటి వినాయక విగ్రహం గుర్తింపు
సాక్షి,మైదుకూరు: వైఎస్సార్ జిల్లా మైదుకూరు మండలం ఉత్సలవరం గ్రామంలో 16వ శతాబ్దం నాటి వినాయక విగ్రహాన్ని గుర్తించినట్టు ఔత్సాహిక పరిశోధకుడు బొమ్మిశెట్టి రమేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి పశువుల దొడ్డిలో ఈ విగ్రహాన్ని కనుగొన్నట్టు పేర్కొన్నారు. విగ్రహం ఎడమ చేతిలో శంఖం, కుడి చేతిలో డమరుకం ఉన్నట్టు తెలిపారు. మైసూరు పురావస్తు శాఖ డైరెక్టర్ మునిరత్నం రెడ్డికి విగ్రహం గురించి తెలియజేయగా, అది 16వ శతాబ్దం నాటిదని ఆయన చెప్పినట్టు రమేష్ తెలిపారు. -
వైఎస్సార్ జిల్లా: వివాహ రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్
సాక్షి, వైఎస్సార్: వైఎస్సార్ జిల్లా పర్యటనలో.. బుధవారం పులివెందులలో ఓ వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. నల్లపురెడ్డి గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నేత బలరామిరెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్లో ఎస్సీఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులు అశ్వినిరెడ్డి, రామతేజేశ్వర్ రెడ్డిలను ఆశీర్వదించారు సీఎం జగన్. నూతన వధూవరూలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. వేడుకకు హాజరైన వారికి అభివాదం చేసిన సీఎం జగన్.. అక్కడికి వచ్చిన వాళ్లను అక్కున చేర్చుకుని ఆప్యాయంగా పలకరించారు కూడా. -
కడప విమానాశ్రయ అభివృద్ధి పనులు పూర్తి
కడప కోటిరెడ్డిసర్కిల్(వైఎస్సార్ జిల్లా): కడప నగర శివార్లలోని విమానాశ్రయంలో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. ఇటీవల కొత్తగా చేపట్టిన కడప విమానాశ్రయం రన్‌వే విస్తరణ, ట్యాక్సీ వే, నాలుగు కొత్త ఆఫ్రాన్లు (విమానాల పార్కింగ్) పనులు పూర్తయ్యాయి. దీంతో ఇక్కడ నైట్ ల్యాండింగ్ అందుబాటులోకి వచ్చింది. విమానాశ్రయం విస్తరణకు అవసరమైన 70 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వేగంగా సేకరించి కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పడంతో అభివృద్ది పనులు శరవేగంగా పూర్తయ్యాయి. ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు ఒనగూరనున్నాయి. (చదవండి: గోల్ కొట్టి అమెరికాకు.. మెరిసిన ప్రొద్దుటూరు బాలిక) -
సీబీఐ నోటీసులపై స్పందించిన ఎంపీ అవినాష్ రెడ్డి
సాక్షి, వైఎస్సార్ కడప: సీబీఐ నోటీసులపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్పందించారు. మంగళవారం మధ్యాహ్నం విచారణకు హాజరవ్వాలని కోరుతూ సీబీఐ అధికారులు సోమవారం నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. అయితే ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల షెడ్యూల్స్ ప్రకారం నేడు విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు సీబీఐ అధికారులకు వెల్లడించినట్లు తెలిపారు. విచారణకు అయిదు రోజుల సమయం కావాలని కోరినట్లు చెప్పారు. తరువాత సీబీఐ ఎప్పుడు పిలిచినా విచారణకు తప్పకుండా హాజరవుతానని, వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తానని వెల్లడించారు. గత రెండున్నర సంవత్సరాలుగా తనపై, తన కుటుంబపై ఓ సెక్షన్ ఆఫ్ మీడియా అసత్యపు ఆరోపణలు చేస్తోందని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై వచ్చిన అభియోగాలు జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. తనేమిటో, తన వ్యవహార శైలి ఏంటో జిల్లా ప్రజలందరికీ బాగా తెలుసని అన్నారు. న్యాయం గెలచి, నిజానిజాలు వెల్లడి కావాలన్నదే తన ధ్యేయమన్నారు. ‘మీడియా ముఖ్యంగా కోరుకుంటున్న నిజం బయటకు తేలాలని నేను కూడా భగవంతుడుని కోరుకుంటున్నా. ఆరోపణలు చేసేవారు మరొకసారి ఆలోచించుకోవాలి.. ఇలాంటి నిరాధారమైన ఆరోణలు చేస్తే మీ కుటుంబ సభ్యులు కూడా ఎలా ఫీల్ అవుతారో ఒకసారి ఊహించుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. కాగా మాజీ మంత్రి, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వై.ఎస్. అవినాష్‌రెడ్డికి సీబీఐ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. తాజాగా ఈ నోటీసులపై అవినాష్ రెడ్డి స్పందించారు. చదవండి: YSR Aarogyasri: 39 నిమిషాల్లో ఆరోగ్యశ్రీ కార్డు -
వైఎస్సార్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఆగివున్న లారీని టెంపో వాహనం ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లాలోని చాపాడు వద్ద శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. తిరుపతికి వెళ్లి ప్రొద్దుటూరుకు తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మృతి చెందిన వారిని అనూష (35), ఓబుళమ్మ (50), రామలక్ష్మి (55) గా పోలీసులు గుర్తించారు. తీవ్రంగా గాయపడిన మరో 8 మందిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ట్రాన్స్ఫార్మర్లపై పచ్చ మీడియా తప్పుడు లెక్కలు
సాక్షి, అమరావతి: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు, నిల్వలపై ‘కేరాఫ్ కడప.. విచ్చలవిడిగా ట్రాన్స్ఫార్మర్ల కొనుగోళ్లు’ శీర్షికతో అర్ధం లేని రాతలు, పొంతనలేని లెక్కలతో పచ్చి అబద్ధాలను ప్రచురించి పచ్చ పత్రిక అడ్డంగా దొరికిపోయింది. డిస్కమ్‌లపై బురద చల్లేందుకు ప్రయత్నించి అభాసుపాలైంది. తప్పుడు రాతల వెనుక వాస్తవాలను ‘ఏపీసీపీడీసీఎల్’ వెల్లడించింది. ఆరోపణ: 2021 ఏప్రిల్ 1 నాటికి రూ.145.86 కోట్ల విలువైన 88,88,203 ట్రాన్స్ఫార్మర్లు డిస్కమ్ పరిధిలోని వివిధ స్టోర్లలో ఉన్నాయి. వాస్తవం: 2021 ఏప్రిల్ 1 నాటికి రూ.10.77 కోట్లు విలువైన 633 ట్రాన్స్ ఫార్మర్లు మాత్రమే ఉన్నాయి. ఆరోపణ: 2021 ఏప్రిల్ నుంచి 2022 డిసెంబర్ 31 మధ్య రూ.956.69 కోట్లతో 4,44,09,492 ట్రాన్స్ఫార్మర్లను కొనుగోలు చేశారు. వాస్తవం: 2021 ఏప్రిల్ నుంచి 2022 డిసెంబర్ 31 మధ్య రూ.358.97 కోట్లతో 32,728 ట్రాన్స్ఫార్మర్లను మాత్రమే కొనుగోలు చేశారు. ఆరోపణ: 2022 డిసెంబర్ 31 నాటికి విజయవాడ, గుంటూరు, సీఆర్డీఏ, ఒంగోలు స్టోర్స్‌లో రూ.385.38 కోట్ల విలువైన 1,22,61,706 ట్రాన్స్ ఫార్మర్లు నిల్వ ఉంచారు. వాస్తవం: గత డిసెంబర్ 31 నాటికి అన్ని స్టోర్స్‌లో కలిపి రూ.149.86 కోట్ల విలువైన 16,634 ట్రాన్స్ ఫార్మర్లు మాత్రమే నిల్వ ఉన్నాయి. ఆరోపణ: ఏడాదిన్నరలోనే ఏపీసీపీడీసీఎల్ పరిధిలో రూ.కోట్ల విలువైన ట్రాన్స్ ఫార్మర్ల కొనుగోలు చేయడం వెనుక భారీ వ్యూహం ఉంది. వాస్తవం: ప్రస్తుతం స్టోర్లలో నిల్వ ఉన్న 16,634 ట్రాన్స్ఫార్మర్ల నుంచి 13,361 ట్రాన్స్ఫార్మర్లను కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం, చోరీకి గురైన చోట్ల కొత్తవి ఏర్పాటు, రోలింగ్ స్టాక్ కోసం వినియోగించనున్నారు. వర్షాలతో పొలాల్లో నీరు చేరడం, కోతల సమయం కావడంతో ట్రాన్స్ఫార్మర్లు బిగించడానికి అవకాశం లేక కొంత జాప్యం జరిగింది. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. వేసవి చివరి కల్లా పెండింగ్‌లో ఉన్న అన్ని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేందుకు నిల్వ చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు వినియోగిస్తారు. ఆరోపణ: ఏబీవీ, బీహెచ్ఈఎల్, ఎల్ అండ్ టీ లాంటి ప్రముఖ కంపెనీలు తక్కువకే ఇస్తుంటే ఎక్కువ ధర చెల్లించి కొంటున్నారు. వాస్తవం: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించిన కొనుగోళ్లు పూర్తిగా టెండర్ల ద్వారా మాత్రమే జరుగుతాయి. ఓ పత్రికలో పేర్కొన్న సంస్థలు టెండర్ల ప్రక్రియలో ఇప్పటి వరకూ పాల్గొనలేదు. 11 కేవీ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను రూ.5 లక్షలకు, 33 కేవీ ట్రాన్స్ ఫార్మర్లను రూ.8.5 లక్షలకు కొనుగోలు చేయడం లేదు. -
ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థులకు సాయమందించిన సీఎం జగన్
సాక్షి, వైఎస్సార్ కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కడప ఫాతిమా కాలేజీ విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. 2015లో ఇబ్బందులు పడిన 46 మంది ఫాతిమా కాలేజీ మెడికల్ విద్యార్థులకు ఫీజుల కింద రూ.9.12 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. విద్యార్థుల సమస్యలను డిప్యూటీ సీఎం అంజాద్ భాష.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో సానుకూలంగా స్పందించారు. దీంతో కాలేజీ ఆవరణలో విద్యార్థులు కేక్ కట్ చేసి, థ్యాంక్యూ సీఎం సార్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. చదవండి: (TDP Drama: ఛీ..ఛీ.. మరీ ఇంత అన్యాయమా!) -
APSRTC: ఆర్టీసీలో ఆఫర్లు.. టిక్కెట్లో 25 వరకు శాతం రాయితీ
కడప (వైఎస్ఆర్ జిల్లా): ప్రజా రవాణా సంస్థ ప్రయాణికులను ఆకర్శించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం వివిధ రకాల ఆఫర్లను ప్రకటించింది. ప్రయాణికులు ప్రైవేటు ఆపరేటర్ల వైపు వెళ్లకుండా అనేక చర్యలు చేపడుతోంది. మరోవైపు ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) మెరుగు పరుచుకునేందుకు పాటుపడుతోంది. అలాగే సీనియర్ సిటిజన్ల (వయో వృద్ధులు)కు టిక్కెట్లో 25 శాతం రాయితీ కల్పిస్తోంది. దీంతోపాటు ఇప్పుడు మరికొన్ని రాయితీలను కల్పించింది. నలుగురు ప్రయాణికులు (పిల్లలతోసహా) ఒకేసారి టిక్కెట్ తీసుకుంటే ఛార్జి మొత్తంలో 5 శాతం రాయితీ కల్పించింది. ఇది కుటుంబాలతో కలిసి ప్రయాణం చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది. మరోవైపు ఈ–వ్యాలెట్ ద్వారా టిక్కెట్‌ను బుక్ చేసుకుంటే ఛార్జిలో ఐదుశాతం సొమ్ము తగ్గించే వెసులుబాటు కల్పించింది. ప్రయాణికులు రానుపోను టిక్కెట్‌ను ముందుగా రిజర్వు చేసుకుంటే తిరుగు ప్రయాణ ఛార్జిలో పది శాతం తగ్గిస్తోంది. ఈ సదుపాయాన్ని సంక్రాంతి, దసరా వంటి పండుగల సీజన్లలో నడిపే ప్రత్యేక సర్వీసులకు వర్తింపజేస్తోంది. ప్రస్తుతం సంక్రాంతి సీజన్ కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. దీంతో ప్రయాణికులకు, ఆర్టీసీకి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. ఆర్టీసీ అధికారులు ఇప్పటికే రానున్న సంక్రాంతికి కడప జోన్‌లోని కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల నుంచి 400–450 ప్రత్యేక సర్వీసులను నడపనున్నారు. ఈ బస్సుల్లో రెగ్యులర్ ఛార్జీలే తప్ప మునుపటిలా టిక్కెట్‌పై 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయబోమని ఆర్టీసీ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఆర్టీసీ అందిస్తున్న రాయితీ సదుపాయాలను వినియోగించుకోవాలని కడప జోన్ ఈడీ గోపీనాథ్‌రెడ్డి కోరారు. (క్లిక్ చేయండి: సంక్రాంతి సంబరాలు షురూ.. గిరి పల్లెల్లో మొదలైన సందడి) -
వైఎస్సార్ జిల్లాలో రెండో రోజు సీఎం జగన్ పర్యటన (ఫోటోలు)
-
24 గంటలు గడవక ముందే బాధితునికి అందిన సాయం
సాక్షి, వైఎస్సార్ కడప: కడప జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి శుక్రవారం రోజున భూమయ్యపల్లె గ్రామానికి చెందిన ఓబులేసు తన కుమారుని అనారోగ్య సమస్యను సీఎం దృష్టికి తీసుకొచ్చాడు. దీనిపై స్పందించిన సీఎం జగన్ తక్షణమే లక్ష రూపాయలు మంజూరు చేయడంతో పాటు వైద్య ఖర్చులు భరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అయితే ఈ రోజు (శనివారం) ఉదయం బాధితుల కుటుంబానికి డిప్యూటీ సీఎం అంజాబాద్, కడప నగర మేయర్ సురేష్ బాబు, జెడ్పీ ఛైర్మన్ ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, రాష్ట్ర నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ సిద్ధవటం యానాదయ్య లక్ష రూపాయల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, ఉద్యానశాఖ వ్యవసాయ సలహాదారులు ప్రసాద్ రెడ్డి, కార్పొరేటర్లు&డివిజన్ ఇంఛార్జిలు, తదితరులు పాల్గొన్నారు. చదవండి: (మరోమారు సీఎం జగన్ మానవత్వం) -
ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన సీఎం జగన్
-
మీరంతా ప్రపంచంతో పోటీ పడేలా ఉండాలి: సీఎం జగన్
అహోబిలపురం స్కూల్‌ను ప్రారంభించిన తర్వాత సీఎం జగన్ మాట్లాడుతూ.. ►నాడు-నేడుతో స్కూల్స్ రూపురేఖలు మార్చాం ►రాబోయే రోజుల్లో మన పిల్లల తలరాతలు మారతాయి ►విద్యకు సంబంధించి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నాం ►విద్యార్థులు భవిష్యత్తు బావుండాలనే తపనతోనే విద్యకు పెద్ద పీట వేస్తున్నాం ►మనం కాంపిటేషన్‌తో ఉండేది పులివెందులతోనో, ఆంధ్ర రాష్ట్రంతోనో కాదు.. ►మీరంతా ప్రపంచంతో పోటీ పడేందుకే ఈ తరహా మంచి కార్యక్రమాలు చేపట్టాం ►అందుకే అంతా చక్కగా చదువుకోవాలి. ►విద్యార్థుల తల్లులకు ఒక అన్నగా, విద్యార్థులకు మేనమామగా అండగా ఉంటా 03:53PM అహోబిలపురం స్కూల్‌ను ప్రారంభించిన సీఎం జగన్ 03:16PM పులివెందులలో బస్టాండ్‌ను ప్రారంభించిన తర్వాత ప్రజలనుద్దేశించి మాట్లాడిన సీఎం జగన్ ►మనం చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం చేస్తున్నాం ►జరుగుతున్న అభివృద్ధి వారికి కనిపించడం లేదు ►గతంతో పోలిస్తే అప్పుల్లో పెరుగుదల ఇప్పుడే తక్కువ ►గతంలో అదే బడ్జెట్.. ఇప్పుడూ అదే బడ్జెట్ ►గత ప్రభుత్వం ఇన్ని పథకాలు ఎందుకు ఇవ్వలేకపోయింది ►గ్లాసులో 75 శాతం నీళ్లున్నా.. నీళ్లే లేవని బాబు ప్రచారం చేస్తున్నారు ►అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం ►విద్యార్థులు, పేదలు, రైతుల తలరాతలు మారుతున్నాయి ►మనకు ఓటు వేయని వారికి కూడా సంక్షేమ పథకాలు ఇస్తున్నాం ►కేవలం సీఎం మారడంతోనే పేదల తలరాతలు మారుతున్నాయి ►రూ. 1.71లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేశాం ►గత ఎన్నికల్లో 151 సీట్లు.. ఈసారి వైనాట్ 175కి 175 సీట్లు ►లంచాలకు తావులేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం ►నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోనే నగదు జమ చేస్తున్నాం ►గతంలో అదే బడ్జెట్.. ఇప్పుడూ అదే బడ్జెట్ ►గత ప్రభుత్వం ఇన్ని పథకాలు ఎందుకు ఇవ్వలేకపోయింది ►పులి వెందులను ఆదర్శవంత నియోజకవర్గంగీ తీర్చిదిద్దుతున్నాం ►అత్యాధునిక వసతులతో వైఎస్సార్ బస్ టెర్మినల్‌ను ప్రారంభించాం ►రాష్ట్రంలోని బస్ టెర్మినల్‌కు పులివెందుల బస్ టెర్మినల్ ఆదర్శం 03.14PM ►పులివెందులలో సీఎం జగన్ ►కదిరి రోడ్డు జంక్షన్, విస్తరణను ప్రారంభించిన సీఎం జగన్ ►పులివెందులలో కూరగాయల మార్కెట్‌ను ప్రారంభించిన సీఎం జగన్ ►పులివెందుల బస్టాండ్‌ను ప్రారంభించిన సీఎం జగన్ 02:11PM ►వైఎస్సార్ కడప జిల్లా కూరగాయల మార్కెట్ అనుకుని నూతనంగా నాలుగుకోట్ల 30 లక్షలతో నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ మెమోరియల్ పార్క్‌ను ప్రారంభించిన సీఎం జగన్ 01: 58 PM ►పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో కోటి ఇరవై లక్షలతో నూతనంగా నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ కూరగాయల మార్కెట్‌ను ప్రారంభించిన సీఎం జగన్ 01: 15 PM వైఎస్సార్ జిల్లా ►పులివెందులకు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ►విజయ హోమ్ వద్ద జంక్షన్‌ను, దివంగత నేత రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్ 10: 25 AM ►వైఎస్సార్ జిల్లాలో రెండో రోజు సీఎం జగన్ పర్యటన ►ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన సీఎం జగన్ ►పులివెందులలో పలు అభివృద్ధి పనులకు సీఎం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ►పులివెందులలో ఆర్టీసీ బస్టాండ్‌ను ప్రారంభించనున్న సీఎం జగన్ సాక్షి, పులివెందుల: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం పులివెందులకు రానున్నారు. పులివెందులలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు.సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం మధ్యాహ్నం 12.30గంటలకు ఇడుపులపాయ నుంచి భాకరాపురం హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. 1.10గంటల నుంచి 1.20 వరకు విజయ హోమ్స్ వద్ద ఉన్న జంక్షన్‌ను ప్రారంభిస్తారు. 1.30 నుంచి 1.45గంటల వరకు కదిరి రోడ్డు జంక్షన్, విస్తరణ రోడ్డును, 1.50 నుంచి 2గంటల వరకు నూతన కూరగాయల మార్కెట్‌ను, 2.05 నుంచి 2.20 గంటల వరకు మైత్రి లేఅవుట్లో వైఎస్సార్ మెమోరియల్ పార్కును ప్రారంభిస్తారు. 2.35 నుంచి 2.50 గంటల వరకు రాయలాపురం నూతన బ్రిడ్జిని ప్రారంభిస్తారు. 3గంటల నుండి 3.30గంటల వరకు డాక్టర్ వైఎస్సార్ బస్ టర్మినల్‌ను ప్రారంభించి బస్టాండు ఆవరణంలో ప్రజలనుద్ధేశించి ప్రసంగిస్తారు. 3.35గంటల నుంచి 3.55గంటల వరకు నాడు – నేడు ద్వారా అభివృద్ధి చేసిన అహోబిలాపురం స్కూలును ప్రారంభిస్తారు. 4.05గంటల నుంచి 4.20గంటల వరకు మురుగునీటిశుద్ధి కేంద్రాన్ని, 4.30గంటల నుంచి 4.45గంటల వరకు గార్బేజీ ట్రాన్స్ఫర్ స్టేషన్‌ను ప్రారంభిస్తారు. అనంతరం 5.00గంటలకు భాకరాపురం హెలీఫ్యాడ్‌కు చేరుకుని అక్కడ నుంచి ఇడుపులపాయకు బయలుదేరి వెళతారు. సీఎస్ఐ చర్చిలో ప్రార్థనలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం క్రిస్మస్ పండుగ సందర్భంగా పులివెందుల సీఎస్ఐ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. అనంతరం అక్కడే క్రిస్మస్ కేక్‌ను కట్ చేయనున్నారు. సీఎం పర్యటనా ప్రాంతాల పరిశీలన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శని, ఆదివారాలు పులివెందుల పర్యటన దృష్ట్యా అందుకు సంబంధించిన ఏర్పాట్లను కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మున్సిపల్ ఇన్చార్జి వైఎస్ మనోహర్‌రెడ్డి, పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డిలతో కలిసి శుక్రవారం ఉదయం పరిశీలించారు. నూతనంగా నిర్మించిన ఆర్టీసీ బస్టాండులో సీఎం బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభించే అభివృద్ధి పనులను కూడా ఆయన పరిశీలించారు. సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇడుపులపాయకు చేరుకున్న ముఖ్యమంత్రి వేంపల్లె: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 23 నుంచి 25వ వరకు మూడు రోజులపాటు జిల్లా పర్యటనలో భాగంగా ఇడుపులపాయకు చేరుకున్నారు. శుక్రవారం కడప, కమలాపురం ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ముగించుకుని హెలీకాప్టర్ ద్వారా ఇడుపులపాయకు వచ్చారు. సాయంత్రం 5.51 గంటలకు ఇడుపులపాయలోని వ్యవసాయ క్షేత్రంలో ఉన్న హెలీపాడ్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, డీసీఓ సుభాషిణి, స్పెషల్ కలెక్టర్ రోహిణి, జమ్మలమడుగు ఆర్డీఓ శ్రీనివాసులు తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి వాహనం ద్వారా రోడ్డు మార్గాన బయలుదేరి వైఎస్సార్ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రికి అక్కడే బస చేశారు. -
మరోమారు సీఎం జగన్ మానవత్వం
సాక్షి, కడప: ఆపదలో ఉన్న ఓ అభాగ్యుడి కుటుంబానికి భరోసా కల్పించడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. రోజూ కూలి పనికి వెళ్తూ జీవనం సాగిస్తున్న తనకు పెద్ద ఆపద వచ్చి పడిందని, తన కుమారుడు నరసింహ (12) నరాల సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నాడని భూమాయపల్లె గ్రామానికి చెందిన ఓబులేసు కడప పర్యటనలో ఉన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో శుక్రవారం గోడు వెళ్లబోసుకున్నాడు. వెంటనే స్పందించిన సీఎం.. బాలుడికి మెరుగైన చికిత్స కోసం ఎంత ఖర్చు అయినా ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. మంచి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. తక్షణ సాయంగా రూ.లక్ష ఇవ్వాలని చెప్పారు. సీఎం మేలును తాము జీవితాంతం మరచిపోమని బాధిత కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది. చదవండి: (ఇదే నా రాష్ట్రం.. ఇక్కడే నా నివాసం) -
నూతన వధూవరులకు సీఎం జగన్ ఆశీర్వాదం
సాక్షి, వైఎస్సార్ కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడపలో మూడు నూతన జంటలను ఆశీర్వదించారు. ప్రభుత్వ సలహాదారు (పరిశ్రమలు) రాజోలి వీరారెడ్డి కుమారుడు, కోడలు సాయి శరణ్‌రెడ్డి, జయశాంతిలను ఆశీర్వదించారు. అనంతరం ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి ఇంటికి వెళ్లి.. ఆయన కుమార్తె హారిక, అల్లుడు పవన్ కుమార్‌రెడ్డిలకు పుష్పగుచ్ఛం అందజేసి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత మాధవీ కన్వెన్షన్ సెంటర్లో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్ఖాన్ కుమారుడు రషీద్‌ఖాన్, కోడలు డా.నిషా షేక్‌లను ఆశీర్వదించారు. -
వైఎస్ఆర్ జిల్లా : అమీన్ పీర్ దర్గాలో సీఎం జగన్ (ఫొటోలు)
-
కొప్పర్తిలో ఇండస్ట్రీయల్ పార్క్ పూర్తయితే 2 లక్షల ఉద్యోగాలు: సీఎం జగన్
CM Jagan Kadapa Tour Live Updates 04:23PM కమలాపురం బహిరంగసభలో సీఎం జగన్ ప్రసంగం ►కమలాపురం నియోజకవర్గంలో ప్రారంభోత్సవాలు చేయడం సంతోషంగా ఉంది ►కమలాపురంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం ►దేవుడు ఆశీస్సులతో అందరికీ మంచి చేస్తున్నా ►వైఎస్సార్ జిల్లాకు కృష్ణా నీటిని తీసుకురావడానికి మహానేత వైఎస్సారే కారణం ►గాలేరు-నగరిని తీసుకొచ్చేందుకు వైఎస్సార్ ఎంతో కృషి చేశారు ►మహానేత వైఎస్సార్ కృషితోనే గండికోట ప్రాజెక్టును పూర్తి చేశాం ►గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టులు నిలిచిపోయాయి ► గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను పట్టించుకోలేదు ► రూ. 550 కోట్లతో బ్రహ్మంసాగర్ లైనింగ్ పనులు చేపట్టాం ► మేం వచ్చాకే చిత్రావతి ప్రాజెక్టులో నీటిని నిల్వ చేశాం ► కొప్పర్తిలో ఇండస్ట్రీయల్ పనులకు శంకుస్థాపన చేశాం ► ఇండస్ట్రీయల్ పార్క్ పూర్తయితే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి ►కమలాపురంలో రూ. 1017 కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం ►వివక్ష చూపించకుండా అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు ►బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నాం ►రాష్ట్ర విభజన సమయంలో స్టీల్‌ప్లాంట్ కడతామని హామీ ఇచ్చారు ►విభజన చట్ట హామీలను గత పాలకులు పట్టించుకోలేదు ►జనవరి నెలాఖరులో కడప స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి అడుగులు పడతాయి ►కడప స్టీల్‌ప్లాంట్ నిర్మాణ పనులకు శ్రీకారం చుడతాం ►జిందాల్ కంపెనీ ఆధ్వర్యంలో రూ. 8,800 కోట్లతో స్టీల్‌ప్లాంట్ నిర్మాణం ►గత ప్రభుతంలో లంచాలు ఇస్తేనే పెన్షన్లు వచ్చేవి ►గత ప్రభుత్వంలో ఏ పథకం కావాలన్నా లంచాలే ►గత ప్రభుత్వంలో రైతులకు ట్రాక్టర్లు ఇవ్వాలన్నా లంచాలే ►గతంలోనూ అదే బడ్జెట్.. ఇప్పుడు అదే బడ్జెట్ ►గత ప్రభుత్వం ఇన్ని పథకాలు ఎందుకు ఇవ్వలేకపోయింది ►గత ప్రభుత్వ విధానం దోచుకో, పంచుకో, తినుకో ►గజ దొంగల మాదిరి దోచుకోవడం, పంచుకోవడమే వారి పని ►గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి తేడా గమనించండి ►రాజకీయ నాయకుడికి విశ్వసనీయత ఉండాలి ►ఇదే నా రాష్ట్రం.. ఇదే నా కుటుంబం ►ప్రజా సంక్షేమమే నా విధానం ►చంద్రబాబు మాదిరిగా ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రమని నేను అనడం లేదు ►ఈ పార్టీ కాకపోతే, మరో పార్టీ అని నేను అనడం లేదు ►ఇదే నా రాష్ట్రం..ఇక్కడే నా నివాసం ►5 కోట్ల మంది ప్రజలే నా కుటుంబం ►చంద్రబాబులా దత్తపుత్రుడిని, ఎల్లోమీడియాను నమ్ముకోలేదు ►చంద్రబాబు మాదిరిగా ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రమని... ఈ పార్టీ కాకపోతే, మరో పార్టీ అని,దత్తపుత్రుడిలా ఈ భార్య కాకపోతే మరో భార్య అని నేను అనడం లేదు 04.10PM ►పులివెందులకు మించి కమలాపురానికి సీఎం నిధులిచ్చారు: రవీంద్రనాథ్‌రెడ్డి ►అర్హలైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి: రవీంద్రనాథ్‌రెడ్డి ►రూ.900 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించడం సంతోషంగా ఉంది: రవీంద్రనాథ్‌రెడ్డి ►సచివాలయ వ్యవస్థతో గడప గడపకూ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం: రవీంద్రనాథ్‌రెడ్డి 03:20PM ►కమలాపురంలో సీఎం జగన్ ►పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్ శ్రీకారం ►రూ. 900 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్ శంకుస్థాపన 02:50PM ►వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఆఫ్జల్ ఖాన్ కుమారుడి వివాహ వేడుకలకు హాజరైన సీఎం జగన్ 02:15PM ►పటేల్ రోడ్ లోని ఆర్టీసీ చైర్మన్ మల్లిఖార్జున రెడ్డి ఇంటికి చేరుకున్న సీఎం జగన్. ►మల్లిఖార్జున రెడ్డి కుమార్తె హారిక వివాహానికి హాజరైన సీఎం జగన్.. నూతన దంపతులను ఆశీర్వదించారు. 01:18 PM ►కడప అమీన్‌పీర్ దర్గాలో సీఎం వైఎస్ జగన్ ►దర్గాలో చాదర్ సమర్పించి.. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న సీఎం జగన్ ►కడప, కమలాపురం, పులివెందుల నియోజకవర్గాల్లో పర్యటించనున్న సీఎం ► మొదటిరోజు పర్యటనలో కమలాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్న సీఎం ►రూ.900 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన 01:05 PM ►అమీన్ పీర్ దర్గాకు చేరుకున్న సీఎం జగన్ ►సీఎంకు స్వాగతం పలికిన దర్గా పీఠాధిపతి అరీఫుల్లా హుస్సేనీ 12:52 PM ►కడప చేరుకున్న సీఎం జగన్ ►మరికొద్దిసేపటిలో పెద్ద దర్గా చేరుకుని ప్రత్యేక పూజలు చేయనున్న సీఎం జగన్ సాక్షి, కడప: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ జిల్లాలో మూడు రోజులపాటు (డిసెంబర్ 23, 24, 25) పర్యటిస్తున్నారు. అందులో భాగంగానే శుక్రవారం సీఎం జగన్ వైఎస్సార్ కడప జిల్లాకు చేరుకున్నారు. జిల్లాలో మూడు రోజుల పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. -
నెరవేరనున్న నాలుగు దశాబ్దాల మెట్ట ప్రాంతీయుల కల
సాక్షి ప్రతినిధి, కడప: కరువుతో అల్లాడుతున్న రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కలలు కన్నారు. అధికారిక పగ్గాలు అందుకోగానే కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించారు. జలయజ్ఞం పేరుతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సంకల్పించారు. తక్కువ కాలంలో ఎక్కువ అభివృద్ధి పనులు చేసిన నాయకుడిగా ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించారు. ఫలాలు అందుతాయని ఆశించిన తరుణంలో ఆయన ఆకస్మిక మరణం అశనిపాతంలా మారింది. తండ్రి స్వప్నం సాకారం చేసేందుకు తనయుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందడుగు వేశారు. గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం ఫలాలు ప్రజలకందించేందుకు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రాజెక్టులకు జీవం పోసిన వైఎస్ఆర్ మెట్ట ప్రాంతమైన రాయలసీమకు జీఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాణప్రదం. టీడీపీ పాలకులకు ఆ విషయం తెలిసినా చరణలో విఫలమయ్యారు. ఈ పరిస్థితుల్లో ఆ పథకాలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవం పోశారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యం విస్తరించి, శరవేగంగా రెండు పథకాల పనులను పరుగెత్తించారు. ఇది జగమెరిగిన సత్యం. మెట్ట ప్రాంతాల్లో నీరు పుష్కలంగా కన్పిస్తోందంటే అందుకు వైఎస్సార్ ఏకైక కారణమని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. నిండు కుండలా గండికోట ప్రాజెక్టు.. జీఎన్ఎస్ఎస్ పథకంలో జిల్లాకు ఆయువు పట్టు ఎద్దుల ఈశ్వరరెడ్డి గండికోట ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నిండు కుండలా దర్శనమిస్తోంది. తద్వారా అటు మైలవరం ప్రాజెక్టు, ఇటు పైడిపాలెం, వామికొండ, సర్వారాయసాగర్‌లలో సైతం పుష్కలంగా నీరు నిల్వ ఉంది. తద్వారా భూగర్భజలాలు సమృద్ధిగా ఉన్నాయి. కాగా డి్రస్టిబ్యూటరీ కెనాల్స్ పూర్తి అయితే ఆయకట్టుకు నీరు అందించే వెసులుబాటు కలగనుంది. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి డి్రస్టిబ్యూటరీ కెనాల్స్‌కు శుక్రవారం కమలాపురంలో శంకుస్థాపన చేయనున్నారు. 2023 అక్టోబర్ నాటికి పనులు పూర్తి చేసి, ఆయకట్టుకు నీరు అందించాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. సర్వరాయసాగర్ పునరావాసానికి గ్రీన్‌సిగ్నల్.. 3.06 టీఎంసీలతో నిర్మించిన నర్రెడ్డి శివరామిరెడ్డి ప్రాజెక్టు (సర్వరాయసాగర్) దిగువనున్న రెండు గ్రామాలకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. వీరపునాయునిపల్లె మండలంలోని ఒంటిగారిపల్లె, ఇందుకూరు గ్రామాల్లో నీటి జౌకులు లభిస్తున్నాయి. జౌకులు కారణంగా వ్యవసాయానికి ప్రతిబంధకంగా మారింది. దీంతో ఈ రెండు గ్రామాలకు పునరావాసం సుస్థిర నివాసం ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదించగా ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పాదయాత్ర హామీ అమలు... ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర చేపట్టిన విషయం పాఠకులకు తెలిసిందే. అందులో వామికొండ, సర్వరాయసాగర్ ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని, ఇక్కడి రైతాంగానికి సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆమేరకు సీఎం హోదాలో వైఎస్ జగన్ పెండింగ్ పనుల పూర్తి కోసం రూ.212 కోట్లు నిధులు మంజూరు చేశారు. నేడు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. వైఎస్ కుటుంబానికి కమలాపురంపై ప్రత్యేక శ్రద్ధ కమలాపురం ప్రజలన్నా, ఈ ప్రాంతమన్నా వైఎస్ కుటుంబానికి ప్రత్యేక శ్రద్ధ. నాడు వైఎస్సార్ కమలాపురం ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని సంకలి్పంచగా, తండ్రి ఆశయాన్ని తనయుడు సీఎం వైఎస్ జగన్ నెరవేరుస్తున్నారు. 2019–22 మధ్య మూడేళ్ల కాలంలో నియోజకవర్గం అభివృద్ధి కోసం సుమారు రూ.1284 కోట్లు వివిధ పనుల కోసం వెచ్చించారు. శుక్రవారం దాదాపు రూ.902 కోట్లతో పలు అభివృద్ధి పనులకు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. –ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి యుద్ధప్రాతిపదికన భూ సేకరణ వామికొండ, సర్వరాయసాగర్ పరిధిలో డి్రస్టిబ్యూటరీ కెనాల్స్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణను యుద్ధప్రాతిపదికన చేపడతాం. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసి రైతాంగానికి సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే భూ సేకరణ చాలా వరకు పూర్తయింది. మిగిలిన భూ సేకరణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. –వి.విజయరామరాజు, కలెక్టర్ అక్టోబరు నాటికి సాగునీరు వామికొండ, సర్వరాయసాగర్ ప్రాజెక్టు పరిధిలో మిగులు పనులకు రూ. 212 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తాం. డి్రస్టిబ్యూటరీ కెనాల్స్ పనులు పూర్తి చేసి వచ్చే అక్టోబరు నాటికి కనీసం 20 వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ప్రణాళికలు రూపొందించాం. –మల్లికార్జునరెడ్డి, ఎస్ఈ, జీఎన్ఎస్ఎస్, కడప జిల్లాకు రానున్న సీఎం వైఎస్ జగన్ మూడు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాకు రానున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి కడపకు 11.30 గంటలకు చేరుకుంటారు. 11.50 గంటలకు రోడ్డు మార్గాన కడప పెద్ద దర్గాకు చేరుకోనున్నారు. ప్రత్యేక ప్రార్థనలు, పీఠాధిపతితో సమావేశం అనంతరం 12.20 గంటలకు బయలుదేరి, 12.35 గంటలకు ఏపీఐఐసీ సలహాదారు రాజోలి వీరారెడ్డి ఇంటికి వెళతారు. 12.45 గంటలకు బయలు దేరి ఏపీఎస్‌ఆరీ్టసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి నివాసానికి చేరుకొని నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి 1.15 గంటలకు మాధవి కన్వెన్షన్ హాల్లో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్ఖాన్ కుమారుడి వివాహ వేడుకలకు హాజరు కానున్నారు. అనంతరం 1.45 గంటలకు ఎయిర్‌పోర్టు చేరుకొని హెలికాప్టర్లో 2.05 గంటలకు కమలాపురం చేరుకుంటారు. 2.15 గంటలకు బహిరంగ సభా ప్రాంగణం చేరుకొని 2.25 వరకు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన శిలాఫకాలను ఆవిష్కరించనున్నారు. 2.30 గంటల నుంచి 3.45 గంటల వరకూ బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. 3.55 గంటలకు కమలాపురం హెలిప్యాడ్‌కు చేరుకొని 4.30 గంటల వరకూ స్థానిక నాయకులతో మాట్లాడతారు. 4.35 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 4.50 గంటలకు ఇడుపులపాయ చేరుకోనున్నారు. 5 గంటలకు ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌కు చేరుకొని రాత్రికి అక్కడే బస చేయనున్నారు. -
వైఎస్సార్ జిల్లాలో సీఎం జగన్ మూడు రోజుల పర్యటన.. షెడ్యూల్ ఖరారు
సాక్షి, కడప సిటీ: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ జిల్లాలో ఈనెల 23, 24, 25 తేదీలలో మూడు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన వివరాలను జిల్లా కలెక్టర్ విజయరామరాజు పత్రికలకు విడుదల చేశారు. ముఖ్యమంత్రి పర్యటన వివరాలు ఇలా.. ఈనెల 23వ తేదీన ►ఉదయం 10.15 గంటలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి 10.35 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. ►10.45 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 11.30 గంటలకు కడప ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ►11.35 గంటలకు అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 11.50 గంటలకు కడపలోని అమీన్‌పీర్ దర్గాకు చేరుకుంటారు. ►11.50 నుంచి మధ్యాహ్నం 12.20 గంటల వరకు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ►12.20 గంటలకు దర్గా నుంచి బయలుదేరి 12.35 గంటలకు రాష్ట్ర పరిశ్రమల సలహాదారు రాజోలి వీరారెడ్డి స్వగృహానికి చేరుకుంటారు. ►12.35 నుంచి 12.45 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు. ►12.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి ఇంటికి 12.50 గంటలకు చేరుకుని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. ►1.00 గంటకు మల్లికార్జునరెడ్డి ఇంటి నుంచి బయలుదేరి 1.15 గంటలకు మాధవి కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుంటారు. ►1.15 నుంచి 1.25 గంటల వరకు వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్ఖాన్ కుమారుడి వివాహ వేడుకలకు హాజరవుతారు. ►1.25 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ►1.45 గంటలకు కడప ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి 2.05 గంటలకు కమలాపురంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ►2.15 గంటలకు బహిరంగసభ వేదిక వద్దకు చేరుకుంటారు. ►2.15 నుంచి 2.25 గంటల వరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ►2.30 నుంచి 3.45 గంటల వరకు బహిరంగసభలో పాల్గొని ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. ►3.55 గంటలకు కమలాపురం హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ►4.00 నుంచి 4.30 గంటల వరకు స్థానిక నేతలతో మాట్లాడతారు. ►4.35 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 4.50 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. ►5.00 గంటలకు ఇడుపులపాయ వైఎస్సార్ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. 24వ తేదీన ►ఉదయం 9.00 గంటలకు వైఎస్సార్ గెస్ట్‌హౌస్ నుంచి బయలుదేరి వైఎస్సార్ ఘాట్‌కు చేరుకుంటారు. ►9.10 నుంచి 9.40 గంటల వరకు వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ►9.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 10.00 నుంచి 12.00 గంటల వరకు ఇడుపులపాయలోని చర్చిలో ప్రార్థనల్లో పాల్గొంటారు. ►మధ్యాహ్నం 12.05 గంటలకు వైఎస్సార్ ఎస్టేట్‌కు చేరుకుని 12.15 నుంచి 12.30 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు. ►12.35 గంటలకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి 12.40 గంటలకు పులివెందులలోని భాకరాపురంలోగల హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ►1.10 నుంచి 1.20 గంటల వరకు విజయ హోమ్స్ జంక్షన్‌ను ప్రారంభిస్తారు. ►1.30 నుంచి 1.40 గంటల వరకు కదిరిరోడ్డు జంక్షన్‌ను, విస్తరణ రోడ్డును ప్రారంభిస్తారు. ►1.50 నుంచి 2.00 గంటల వరకు కూరగాయల మార్కెట్ ప్రారంభిస్తారు. ►2.05 నుంచి 2.20 గంటల వరకు మైత్రి లే అవుట్‌ను ప్రారంభిస్తారు. ►2.35 నుంచి 2.50 గంటల వరకు రాయలాపురం వంతెనను ప్రారంభిస్తారు. ►3.00 నుంచి 3.30 గంటలవరకు డాక్టర్ వైఎస్సార్ బస్టాండును ప్రారంభించి ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. ►3.35 నుంచి 3.55 గంటల వరకు అహోబిలపురం స్కూలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ►4.05 నుంచి 4.20 గంటల వరకు 10 ఎంఎల్డీ ఎస్టీపీని ప్రారంభిస్తారు. ►4.30 నుంచి 4.45 గంటల వరకు జీటీఎస్‌ను ప్రారంభిస్తారు. ►5.00 గంటలకు భాకరాపురం హెలిప్యాడ్ చేరుకుని 5.40 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. 25వ తేదీన ►ఉదయం 8.40 గంటలకు ఇడుపులపాయ ఎస్టేట్ నుంచి బయలుదేరి 9.05 గంటలకు పులివెందుల భాకరాపురం హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ►9.15 నుంచి 10.15 గంటల వరకు సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొంటారు. ►10.25 గంటలకు పులివెందుల నుంచి బయలుదేరి 11.00 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ►11.00 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి 11.55 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని 12.20 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. -
అత్తతో వివాహేతర సంబంధం.. నేనుండగా మరో పెళ్లి ఎలా చేసుకుంటావంటూ..
సాక్షి, వైఎస్సార్ కడప(రాజుపాళెం): వివాహేతర సంబంధం ఓ యువకుడిని బలి తీసుకుంది. అత్త వరుసైన మహిళే ఇందుకు కారణమైంది. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రమైన రాజుపాళెంలో నివాసముంటున్న పర్లపాడు నరసమ్మకు కొన్నేళ్ల క్రితం భర్త చనిపోయాడు. ఓ కుమార్తె, కుమారుడున్నారు. కుమార్తెను పక్కవీధిలోని ఎస్సీకాలనీకి చెందిన ఫొటోగ్రాఫర్ మిద్దె పెద్దదస్తగిరికిచ్చి పెళ్లిచేసింది. అతడికి తల్లి మాబున్ని, తమ్ముడు చిన్న దస్తగిరి(28) ఉన్నారు. తండ్రి కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. ఈ నేపథ్యంలో నరసమ్మకు, చిన్న దస్తగిరికి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. కుట్టుమిషన్లు రిపేరు చేసే చిన్నదస్తగిరికి ఇటీవల పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం నరసమ్మ అతడి ఇంటి వద్దకు వచ్చి తనుండగా వేరేవారిని ఎలా పెళ్లి చేసుకుంటావంటూ వాగ్వాదానికి దిగింది. ఆవేశంతో కత్తి తీసుకుని చిన్నదస్తగిరిని పొడవటంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. హతుడి తల్లి మిద్దె మాబున్ని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని రూరల్ సీఐ మధుసుదన్ గౌడ్, ఎస్ఐ రాజగోపాల్ పరిశీలించారు. చదవండి: (సాఫ్ట్వేర్ భర్త నిర్వాకం.. స్నేహితులతో గడపాలని భార్యను బలవంతం) -
దక్షిణ భారత అజ్మీర్.. కడప అమీన్‌పీర్ దర్గా
కడప కల్చరల్: ఇస్లాం సూఫీ తత్వాన్ని బోధిస్తూ కులమతాలకు అతీతంగా ప్రజల్లో ఆధ్యాత్మిక చింతనను పెంచుతూ మానవత్వానికే పెద్దపీట వేస్తున్న కడప అమీన్‌పీర్ దర్గాకు విశిష్టమైన పేరుంది. దీన్ని దక్షిణ భారత అజ్మీర్‌గా కూడా కొనియాడుతారు. ఈ దర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాలు ఈనెల 7, 8 తేదీలలో నిర్వహిస్తారు. 12వ తేదీ వరకు ఉత్సవాలు కొనసాగుతాయి. చరిత్ర.. 16వ శతాబ్దంలో కర్ణాటకలోని బీదర్ ప్రాంతం నుంచి మహా ప్రవక్త (సొ.అ.వ) వంశీయులైన ఖ్వాజాయే ఖాజుగా నాయబె రసూల్ అతాయే రసూలుల్లాహ్ హజరత్ ఖ్వాజా సయ్యద్‌షా పీరుల్లామాలిక్ సాహెబ్ తన సతీమణి, కుమారులు హజరత్ ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్, హజరత్ అహ్మద్ హుసేనీ సాహెబ్తోపాటు భక్తగణంతో ఈ ప్రాంతానికి వచ్చారు. ఆధ్యాత్మిక బోధనలతో అందరినీ ఆకట్టుకున్నారు. నాటి నవాబులు వీరి మహిమలను గమనించి ప్రియ భక్తులు అయ్యారు. వారి కోరిక మేరకు గురువులు కడప నగరంలో స్థిరపడ్డారు. జీవసమాధి.. హజరత్ పీరుల్లా మాలిక్ సాహెబ్ పట్ల ఈర‡్ష్యతో స్థానికుల్లో కొందరు సవాలు విసిరారు. దాని ప్రకారం ఆయన జీవ సమాధి అయి మూడవరోజున దర్శనం ఇవ్వడంతో శత్రువులు సైతం ప్రియమైన భక్తులుగా మారారు. కాగా, హజరత్ అమీనుల్లా హుసేనీ సాహెబ్ 10వ పీఠాధిపతిగా వ్యవహరించారు. ఆయన పేరుతోనే దర్గాను అమీన్‌పీర్ సాహెబ్ దర్గాగా పేర్కొనేవారు. కాలక్రమంలో అది అమీన్‌పీర్ దర్గాగా మారింది. ప్రస్తుతం దర్గా 11వ పీఠాధిపతి హజరత్ ఖ్వాజా సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ నిర్వహణలో ఉంది. దర్గాలో మొత్తం గురువులు, వారి వారసుల పేరిట ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం యేటా మొత్తం 11 చిన్న ఉరుసులు, గంధం ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రస్తుతం పెద్ద ఉరుసును వారం రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, పలు ఇస్లామిక్ దేశాల నుంచి కూడా ఈ ఉరుసుకు హాజరవుతారు. -
డిసెంబర్ 6న వైఎస్సార్ జిల్లాలో సీఎం జగన్ పర్యటన
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిసెంబర్ 6న వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ప్రఖ్యాత అమీన్ పీర్ దర్గాను సీఎం సందర్శిస్తారు. దర్గా ఉరుసు సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు కూడా చేస్తారు. అనంతరం కడప నగర శివారులోని మాధవి కన్వెన్షన్‌లో ఆర్టీసీ ఛైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జున రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు జిల్లాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చదవండి: (సీఎం జగన్ ప్రమాణ స్వీకారం వీడియో చూస్తూ ఆపరేషన్) -
CM Jagan YSR District Tour: ప్రణాళిక మేరకే సంక్షేమాభివృద్ధి
సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలను సంతృప్తికరంగా ప్రజల గడప వద్దకే అందిస్తున్నామని చెప్పారు. ఈ వ్యవస్థ సక్రమంగా నడవాలంటే ఎక్కడా వివక్షకు తావివ్వకూడదని, పరిపాలన పారదర్శకంగా సాగినపుడే ప్రజా వ్యవస్థ పటిష్టంగా ఉంటుందన్నారు. వైఎస్సార్ జిల్లాలో రెండు రోజుల పర్యటనకు గాను శుక్రవారం సతీమణి భారతితో కలిసి మధ్యాహ్నం 12 గంటలకు సీఎం కడపకు చేరుకున్నారు. అనంతరం లింగాల మండలం పార్నపల్లె పరిధిలోని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (సీబీఆర్) వద్ద పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు గావించి, పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. తొలుత సీబీఆర్ వద్ద పర్యాటక శాఖ రూ.4.1 కోట్ల పాడా (పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) నిధులతో అధునాతనంగా నిర్మించిన వైఎస్సార్ లేక్ వ్యూ రెస్టారెంట్, అందులోని అతిథి గృహాలు, పార్కుతోపాటు రూ.1.5 కోట్లతో ఏర్పాటు చేసిన నాలుగు సీట్ల స్పీడ్ బోటు, 18 సీట్ల ఫ్లోటింగ్ జెట్టి, పర్యాటక బోటింగ్ సిస్టమ్‌ను ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన శిలా ఫలకాలను, లేక్ వ్యూ పార్కులో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. రిజర్వాయర్‌లో జలకళను, చుట్టూ ఆహ్లాదకరమైన పచ్చటి కొండల అందాలను తిలకిస్తూ కొద్దిసేపు సేద తీరారు. పాంటున్ బోటులో కూర్చొని కాసేపు రిజర్వాయర్‌లో షికారు చేశారు. లేక్ వ్యూ రెస్టారెంట్లో జిల్లా నీటి పారుదల శాఖ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఆ శాఖ అధికారులు జిల్లాలోని మేజర్ రిజర్వాయర్లు, ఇతర ప్రాజెక్టుల పరిస్థితిని ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం పార్నపల్లెలోని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (సీబీఆర్)ను సుప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. పర్యాటకానికి అత్యంత అనువైన ఈ ప్రాంతంలో అన్ని రకాల వనరులు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించేలా పర్యాటక శాఖ ద్వారా మరింత అభివృద్ధి చేస్తామన్నారు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం వైఎస్ జగన్ పేరు పేరున పలకరింపు.. పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాప్రతినిధులు, అధికారులు, లింగాల మండల నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం నేతలను పేరుపేరునా ఆప్యాయంగా పలకరించారు. వారి నుంచి వినతులను స్వీకరించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి గురించి వివరించారు. అవినీతి ఆశ్రిత పక్షపాతానికి తావు లేకుండా.. కుల, మత, వర్గ, ప్రాంతాలకు అతీతంగా ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్న స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులు, అధికారులను ఈ సందర్భంగా సీఎం అభినందించారు. ఆ తర్వాత అందరితో ఫొటోలు దిగారు. సాయంత్రం 5.40 గంటలకు అక్కడి నుంచి ఇడుపులపాయకు చేరుకున్నారు. అక్కడికి విచ్చేసిన ప్రజాప్రతినిధులు, నేతలను పేరుపేరునా పలకరించారు. పలువురి నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, కలెక్టర్ విజయరామరాజు, ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ తదితరులు పాల్గొన్నారు. చిన్నారి లివర్ మార్పిడికి సీఎం భరోసా ఎదుటి వారి కష్టం వినాలే కానీ, వెంటనే స్పందించడంలో తన తర్వాతే ఎవరైనా అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోమారు నిరూపించుకున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం చిగిచర్లకు చెందిన దివాకర్‌రెడ్డి దంపతుల మూడున్నరేళ్ల కుమారుడు యుగంధర్‌రెడ్డికి లివర్ దెబ్బతింది. చాలా మంది వైద్యుల వద్దకు తిరిగారు. ఈ క్రమంలో బెంగుళూరులోని సెయింట్ జాన్ ఆస్పత్రికి వెళ్లగా.. లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలని, పెద్ద మొత్తంలో ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. దివాకర్‌రెడ్డి కుటుంబం అంత పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చించలేని పరిస్థితి. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని కలిశారు. ఆయన శుక్రవారం వైఎస్సార్ జిల్లా లింగాల మండలం పార్నపల్లెకు వచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వద్దకు బాధిత కుటుంబాన్ని తీసుకుని వచ్చారు. వీరి కష్టం విన్న సీఎం.. వైద్యానికి ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇచ్చారు. తక్షణమే బాలుడికి వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయరామరాజును ఆదేశించారు. దీంతో దివాకర్‌రెడ్డి దంపతులు ఆనంద బాష్పాలతో ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. – సాక్షి ప్రతినిధి, కడప నేడు వివాహ వేడుకకు హాజరు కానున్న ముఖ్యమంత్రి తొలిరోజు పర్యటన అనంతరం శుక్రవారం రాత్రి ఇడుపులపాయలో బస చేసిన సీఎం వైఎస్ జగన్.. శనివారం ఉదయం పులివెందులలోని ఎస్పీఎస్ఆర్ కల్యాణ మండపంలో తన వ్యక్తిగత కార్యదర్శి రవిశేఖర్ యాదవ్ కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. -
ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న వారందరికీ ధన్యవాదాలు : సీఎం జగన్
వైఎస్సార్ జిల్లా పులివెందులలో సీఎం జగన్ పర్యటన అప్డేట్స్ 04:15PM పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై.. లింగాల మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం జగన్ సమీక్షా సమావేశం. పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిలో, సంక్షేమ పథకాల అమలులో అలుపెరగకుండా శ్రమిస్తున్న లింగాల మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులకు.. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా సహకరిస్తున్న ప్రజలకు, ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న అందరికీ ఈ సందర్భంగా సీఎం జగన్ ధన్యవాదాలు తెలియజేశారు. 02:05PM పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం ప్రజలు, ముఖ్య నేతలతో సమావేశమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వివరించిన స్థానికులు. 01:35PM వైఎస్సార్ లేక్‌వ్యూ రెస్టారెంట్ వద్ద దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్ 01:20PM సీఎం జగన్ బోటింగ్ సీబీఆర్ వద్ద బోటింగ్ జెట్టీలో సీఎం జగన్.. ఎంపీ అవినాష్ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, ఇతర అధికారులతో కలిసి బోటింగ్ చేశారు. 01:15PM ►సీబీఆర్ వద్ద బోటింగ్ జెట్టీని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్ 01:00PM వైఎస్సార్ జిల్లా: పార్నపల్లి రిజర్వాయర్‌కు చేరుకున్న సీఎం జగన్ ►కాసేపట్లో బోటింగ్ జెట్టిని ప్రారంభించనున్న సీఎం జగన్ ►చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో రూ.6.50 కోట్లతో అభివృద్ధి పనులు ►రిజర్వాయర్ వద్ద టూరిజం పార్క్, రెస్టారెంట్, బోటింగ్ ఏర్పాటు 12:50PM వైఎస్సార్ జిల్లా: చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ►స్వాగతం పలికిన కడప ఎంపి వైయస్ అవినాష్ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, జిల్లా అధికారులు. 11:42AM ►గన్నవరం విమానాశ్రయం నుంచి వైఎస్సార్ కడప జిల్లాకు బయల్దేరిన సీఎం జగన్ 11:20AM కృష్ణాజిల్లా: తాడేపల్లి నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ ►గన్నవరం విమానాశ్రయం నుంచి కాసేపట్లో వైఎస్సార్ కడప జిల్లా బయల్దేరనున్నారు. సాక్షి, కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కడప జిల్లా పర్యటనకు బయలుదేరారు. డిసెంబరు 2, 3వ తేదీల్లో జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. నేటి పర్యటన ఇలా.. ►లింగాల మండలంలోని పార్నపల్లె వద్ద సీబీఆర్ రిజర్వాయర్ వద్ద బోటింగ్ జెట్టిని ప్రారంభిస్తారు. ►అనంతరం వైఎస్సార్ లేక్ వ్యూ పాయింట్‌కు చేరుకుని వైఎస్సార్ లేక్ వ్యూ రెస్టారెంట్‌ను ప్రారంభిస్తారు. ►అనంతరం లింగాల మండల నాయకులతో మాట్లడతారు. అంతేకాకుండా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి ఇడుపులపాయలోని గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రి అక్కడ బస చేస్తారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సీఎం జగన్ రెండు రోజుల కడప పర్యటన.. షెడ్యూల్, పూర్తి వివరాలు..
సాక్షి, కడప: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 2, 3 తేదీల్లో (శుక్ర, శని) వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ ఖరారు కాగా కలెక్టర్ విజయరామరాజు, జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ తదితర అధికారులు ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేశారు. ఇడుపులపాయలో 2వ తేదీ రాత్రి బస చేయనున్న నేపథ్యంలో అక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. లింగాల మండలంలోని పార్నపల్లెలోని సీబీఆర్ రిజర్వాయర్ వద్ద సీఎం వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనుండటంతో అక్కడ కూడా పటిష్ట పోలీసు బందోబస్తు నియమించారు. నేటి పర్యటన ఇలా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఉదయం 10.00 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అప్పటికే సిద్ధంగా ఉన్న ప్రత్యేక హెలికాప్టర్లో ఇక్కడి నుంచి బయలుదేరి 11.50 గంటలకు లింగాల మండలంలోని పార్నపల్లె వద్ద సీబీఆర్ రిజర్వాయర్ వద్దకు చేరుకుంటారు. 12.00 నుంచి 12.30 గంటల వరకు బోటింగ్ జెట్టిని ప్రారంభిస్తారు. అనంతరం వైఎస్సార్ లేక్ వ్యూ పాయింట్‌కు చేరుకుని 12.40 నుంచి 1.00 గంట మధ్యలో వైఎస్సార్ లేక్ వ్యూ రెస్టారెంట్‌ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు లింగాల మండల నాయకులతో మాట్లాడతారు. అంతేకాకుండా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి ఇడుపులపాయలోని గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రి అక్కడ బస చేస్తారు. రేపటి పర్యటన: శనివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదయం 8.30 గంటలకు ఇడుపులపాయ వైఎస్సార్‌ఎస్టేట్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 8.55 గంటలకు పులివెందుల భాకరాపురం చేరుకుంటారు. 9.15 నుంచి 9.30 గంటల మధ్య కదిరిరోడ్డులోని ఎస్సీఎస్ఆర్ గార్డెన్స్‌కు చేరుకుని సీఎం వ్యక్తిగత సహాయకుడు డి.రవిశేఖర్ కుమార్తె వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదిస్తారు. 9.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అనంతరం ఇక్కడి నుంచి బయలుదేరి 11.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. సీఎం పర్యటనకు పోలీసుల రిహార్సల్స్ లింగాల: లింగాల మండలం పార్నపల్లె చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో శుక్రవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఆధ్వర్యంలో సీఎం పర్యటించే ప్రాంతాల్లో సీఎం కాన్వాయ్‌తో రిహార్సల్స్ నిర్వహించారు. అలాగే ఆయా ప్రాంతాలను జిల్లా కలెక్టర్ విజయరామరాజు, పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డిలు పరిశీలించారు. కార్యక్రమంలో ప్రొద్దుటూరు అడిషనల్ ఎస్పీ ప్రేర్ణా, నీటిపారుదల శాఖ ఈఈ రాజశేఖర్, పర్యాటక శాఖ ఈఈ ఈశ్వరయ్య, ఆర్డీఓ వెంకటేశ్వర్లు, పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు, డ్వామా పీడీ యదుభూషణ్‌రెడ్డి, తహసీల్దార్ శేషారెడ్డి, ఎంపీడీఓ సురేంద్రనాథ్, పీఆర్ ఏఈ మనోహర్‌రెడ్డి, మత్ప్యశాఖ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సీబీఆర్‌పై భారీ పోలీసు బందోబస్తు: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన సందర్భంగా సీబీఆర్‌పై భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. నలుగురు అడిషనల్ ఎస్పీలు, 10మంది డీఎస్పీలు, 20 మంది సీఐలు, 50మంది ఎస్‌ఐలతోపాటు 1500 మంది పోలీసు బలగాలు సీబీఆర్‌కు చేరుకున్నాయని పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. -
సీఎం జగన్ వైఎస్సార్ కడప జిల్లా పర్యటన ఖరారు.. రెండు రోజుల పాటు..
సాక్షి, కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు పర్యటన వివరాలను కలెక్టర్ విజయరామరాజు మంగళవారం వెల్లడించారు. ముఖ్యమంత్రి డిసెంబరు 2, 3 వ తేదీల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. ముఖ్యమంత్రి పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి ►డిసెంబర్ 2న ఉదయం సీఎం వైఎస్ జగన్ తన నివాసం నుంచి 10.20 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి బయలుదేరి 11.15 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ►11.15 నుంచి స్థానిక నేతలతో మాట్లాడతారు. ►11.30 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి 11.50 గంటలకు లింగాల మండలంలోని సీబీఆర్ రిజర్వాయర్ వద్దకు చేరుకుంటారు. ►మధ్యాహ్నం 12.00 గంటలకు అక్కడ బోటింగ్ జెట్టిని ప్రారంభిస్తారు. ►12.35 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి డాక్టర్ వైఎస్సార్ లేక్ వ్యూ పాయింట్‌కు బయలుదేరుతారు. ►12.40 గంటలకు అక్కడికి చేరుకుని వైఎస్సార్ లేక్ వ్యూ రెస్టారెంట్‌ను ప్రారంభిస్తారు. ►1.00 నుంచి 1.30 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు. ►1.30 నుంచి 4.30 గంటల వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. ►4.35 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 5.00 గంటలకు హెలికాఫ్టర్‌లో ఇడుపులపాయ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ►5.00 నుంచి 5.10 గంటల వరకు స్థానిక నేతలతో మాట్లాడతారు. అనంతరం 5.20 గంటలకు ఇడుపులపాయలోని గెస్ట్‌హౌస్ చేరుకుని రాత్రికి అక్కడ బస చేస్తారు. ►డిసెంబర్ 3వ తేదీ ఉదయం 8.30 గంటలకు వైఎస్సార్ ఎస్టేట్ నుంచి బయలుదేరి 8.35 గంటలకు అక్కడ ఉన్న హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ► 8.40 గంటలకు అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి 8.55 గంటలకు పులివెందుల భాకరాపురంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ►అక్కడి నుంచి 9.00 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి కదిరిరోడ్డులోని ఎస్సీఎస్ఆర్ గార్డెన్స్‌కు చేరుకుంటారు. ►అక్కడ 9.15 నుంచి 9.30 గంటల వరకు సీఎం వ్యక్తిగత కార్యదర్శి డి.రవిశేఖర్ కుమార్తె వివాహ వేడుకలకు హాజరై వధూవరులను ఆశీర్వదిస్తారు. ►9.35 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి భాకరాపురంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ►అక్కడి నుంచి 9.45 గంటలకు హెలికాఫ్టర్‌లో బయలుదేరి 10.10 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ►10.15 గంటలకు అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని 11.30 గంటలకు తన నివాసానికి చేరుకుంటారు. -
YSR Kadapa: గెలుపే లక్ష్యంగా.. వ్యూహాలకు పదును
సాక్షి, కడప: 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకు పదును పెడుంతోంది. ఈ మేరకు ఏడాదిన్నర ముందే రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు ఎన్నికల పరిశీలకులను నియమించింది. సంస్థాగత ఎన్నికల నిర్వహణలో అనుభవం ఉన్నవారిని ఎంపిక చేసి ఈ పదవుల్లో నియమించారు. గతంలో ఏ జిల్లాకు సంబంధించిన నాయకులు ఆ జిల్లాకే పరిశీలకులుగా నియమించగా ప్రస్తుతం పొరుగు జిల్లాల వారిని నియమించారు. వైఎస్సార్ జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు ఏడుగురిని పరిశీలకులుగా నియమించారు. కడప నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే కొండూరు ప్రభావతమ్మ కుమారుడు, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ చైర్మెన్ అజయ్ కొండూరును, ప్రొద్దుటూరు నియోజకవర్గానికి కదిరి పట్టణానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కడవల మోహన్‌రెడ్డిని, బద్వేల్ నియోజకవర్గానికి ఆళ్లగడ్డకు చెందిన విజయ పాల డెయిరీ అధినేత ఎస్వీ జగన్మోహన్రెడ్డిని, పులివెందుల నియోజవర్గానికి రాజంపేట మున్సిపల్ చైర్మన్, వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనర్ పోలా శ్రీనివాసులరెడ్డిని ఎన్నికల పరిశీలకులుగా నియమించారు. అలాగే కమలాపురం నియోజకవర్గానికి కర్నూలు జిల్లాకు చెందిన జగదీశ్వర్‌రెడ్డిని, జమ్మలమడుగు నియోజకవర్గానికి కర్నూలు జిల్లాకు చెందిన పామిరెడ్డిగారి పెద్ద నాగిరెడ్డిని, మైదుకూరు నియోజకవర్గానికి రాజంపేటకు చెందిన అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాల అధినేత, వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చొప్పా యల్లారెడ్డిని ఎన్నికల పరిశీలకులుగా నియమించారు. వీరంతా వారికి కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించనున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, స్థానిక సమస్యల పరిష్కారం, కార్యకర్తలు, నేతల మధ్య సమన్వయం తదితర వ్యవహారాలను సైతం చక్కబెట్టి సమష్టిగా అందరూ పార్టీని తిరిగి అధికారంలోకి తేవడమే ధ్యేయంగా పనిచేయనున్నారు. వైఎస్సార్ జిల్లా నుంచి పదిమంది పరిశీలకులు ఇతర జిల్లాల నాయకులను వైఎస్సార్ జిల్లాలోని పలు నియోజకవర్గాలకు ఎన్నికల పరిశీలకులుగా నియమించినట్లే ఈ జిల్లాకు చెందిన పలువురు వైఎస్సార్సీపీ నేతలను ఇతర జిల్లాల్లోని నియోజకవర్గాలకు ఎన్నికల పరిశీలకులుగా నియమించారు. నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు నియోజకవర్గానికి మాజీ మంత్రి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డిని, బనగానపల్లె నియోజకవర్గానికి వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్‌ఖాన్‌ను, ఆళ్లగడ్డ నియోజకవర్గానికి ప్రొద్దుటూరుకు చెందిన వైఎస్సార్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డిని ఎన్నికల పరిశీలకులుగా నియమించారు. బద్వేల్‌కు చెందిన అడా చైర్మన్ గురుమోహన్‌ను, నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గానికి, ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గానికి బద్వేలుకు చెందిన బంగారు శ్రీనును పరిశీలకులుగా నియమించారు. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గానికి ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ పులి సునీల్‌కుమార్‌ను, రాయచోటి నియోజకవర్గానికి ఏపీ వేర్‌హౌస్ కార్పొరేషన్ చైర్మన్ ఎస్ఏ కరిముల్లాను, తంబళ్లపల్లె నియోజకవర్గానికి మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిని, తిరుపతి నియోజకవర్గానికి కమలాపురానికి చెందిన జిల్లా వ్యవసాయ సలహామండలి చైర్మన్ సంబటూరు ప్రసాద్‌రెడ్డిని, అనంతపురం(అర్బన్) నియోజకవర్గానికి పులివెందులకు చెందిన యాదవ కార్పొరేషన్ చైర్మన్ హరీష్ కుమార్ యాదవ్‌లను పరిశీలకులుగా నియమించారు. -
ఇదేం ఖర్మ బాబూ!
సాక్షి, కడప: టీడీపీ అధిష్టానం తీరుపై జిల్లాలోని ఆ పార్టీ నేతలు, ప్రధానంగా నియోజకవర్గ ఇన్చార్జిలు ఆగ్రహంతో ఉన్నారు. ఆది నుండి పార్టీ కోసం పనిచేస్తున్నా రాబోయే ఎన్నికల్లో టిక్కెట్ విషయంపై అధిష్టానం స్పష్టత ఇవ్వకపోవడంతో నేతలు జీర్ణించుకోలేకున్నారు. నియోజకవర్గ ఇన్చార్జిల హోదాలో పార్టీ ఎదుగుదల కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టుకున్నా.. ఇప్పుడు సర్వేల పేరుతో టిక్కెట్ విషయం తేల్చకపోవడంపై నేతలు గుర్రుగా ఉన్నారు. మరో ఆరు నెలలపాటు పార్టీ అభివృద్ధి కోసం ఎవరు బాగా పనిచేస్తే రాబిన్‌శర్మ బృందం సర్వేలో వారి పేరే వస్తుందని, అలాంటి వారికే టిక్కెట్ అంటూ అధిష్టానం మెలిక పెట్టింది. సర్వే సాకుతో ఇన్నాళ్లు పార్టీని మోసిన తమకు చివరి నిమిషంలో అధిష్టానం వంచించే పరిస్థితికి చేరడంపై సదరు నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. జిల్లాలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది. దీంతో నియోజకవర్గ ఇన్చార్జిల్లో నిర్లిప్తత నెలకొంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ అధిష్టానం కార్యక్రమాలకు పిలుపునిచ్చినా ఆ పార్టీ నేతలు స్పందించే పరిస్థితి లేదు. తాజాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ అధిష్టానం ప్రకటించిన ‘ఇదేం ఖర్మ’ కార్యక్రమం తమ పార్టీ పరిస్థితికి అద్దం పడుతుందని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. మరోవైపు రాబోయే ఎన్నికల్లో టిక్కెట్ నాకంటే నాకంటూ ఉన్న కొద్దిమంది నేతలు ప్రచారం చేసుకుంటుడడంతో పార్టీలో మరింత గందరగోళం నెలకొంది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఉన్న క్యాడర్ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఒకరిపై ఒకరు చంద్రబాబు, లోకేష్‌లకు ఫిర్యాదులు చేసుకుంటూ రోడ్డెక్కుతున్నారు. ►కమలాపురం నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి పలుమార్లు ఓటమి చెందిన పుత్తా నరసింహారెడ్డిని కాదని మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డికి రాబోయే ఎన్నికల్లో టిక్కెట్ లభిస్తుందని ఆయన వర్గం ప్రచారం చేస్తోంది. ఇప్పటికే వీరశివారెడ్డి చంద్రబాబును కలిశారు. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన తమ నేతకే పార్టీ టిక్కెట్ అంటూ పుత్తా నరసింహారెడ్డి వర్గం చెబుతోంది. ►ప్రొద్దుటూరులో వీరశివారెడ్డి సోదరుడి కుమారుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ఇటీవల కాలంలో రాబోయే ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ కోసం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఆది నుండి పార్టీలోనే ఉన్న మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి తనకే టిక్కెట్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. గతంలో టీడీపీ తరుపున పోటీ చేసి ఓటమి చెందిన మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వర్గం రాబోయే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ తమకేనంటూ ప్రచారం చేసుకుంటోంది. అయితే వరదరాజులరెడ్డి ఇటీవల కర్నూలు జిల్లాలో రాహుల్‌గాంధీని కలిసి ఆయనతో కలిసి పాదయాత్రలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిస్థితుల్లో వరద రాజులరెడ్డి రాజకీయ భవిష్యత్తు ఏమిటన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ►మైదుకూరు నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్చార్జి పుట్టా సుధాకర్‌యాదవ్ ఈసారి కూడా తనకే టిక్కెట్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటికే పలుమార్లు టీడీపీ అధినేతను కలిసిన మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సైతం రాబోయే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ నాకేనంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే డీఎల్ అవుట్ డేటెడ్ నేతగా గుర్తించిన టీడీపీ ఆయనకు టిక్కెట్ ఇచ్చే పరిస్థితి కానరావడం లేదన్న ప్రచారమూ ఉంది. ఇక్కడ ఎవరికి టిక్కెట్ ఇస్తారన్న విషయం అధిష్టానం తేల్చలేదు. ►ఎస్సీ రిజర్వుడు స్థానమైన బద్వేలు నియోజకవర్గం నుండి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఓబులాపురం రాజశేఖర్‌కు నియోజకవర్గంలో కీలకంగా ఉన్న దివంగత వీరారెడ్డి కుటుంబంతో విభేదాలు పొడచూపినట్లు తెలుస్తోంది. దీంతో రాబోయే ఎన్నికల్లో కొత్త అభ్యర్థి తెరపైకి వచ్చే అవకాశం ఉంది. అభ్యర్థి ఎవరన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ►కడప నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసిన అమీర్‌బాబు ఈ దఫా కూడా టీడీపీ టిక్కెట్ ఆశిస్తుండగా, నాన్ మైనార్టీ కోటాలో ఈ దఫా తనకే టిక్కెట్ ఇవ్వాలంటూ ఆలంఖాన్‌పల్లె లక్ష్మిరెడ్డి కుటుంబం గట్టిగా పట్టుబడుతోంది. ఇక్కడ కూడా ఎవరికి టిక్కెట్ విషయమై అధిష్టానం స్పష్టత ఇవ్వలేదు. ►ఇప్పటికే కడప పార్లమెంటు అభ్యర్థిగా రెడ్డెప్పగారి శ్రీనివాసులురెడ్డిని ఆరు నెలల క్రితమే చంద్రబాబు ప్రకటించారు. అయినా శ్రీనివాసులురెడ్డి మొక్కుబడిగా మాత్రమే కనిపిస్తున్నారు. మరోవైపు అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికల్లో సీనియర్లను కాదని, కొత్త వారికి టిక్కెట్లు ఇప్పించేందుకు శ్రీనివాసులురెడ్డి ప్రయత్నిస్తున్నారని ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం, బద్వేలు తదితర ప్రాంతాలకు చెందిన నేతలు ఆయనపై అధిష్టానానికి ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. రోజురోజుకు ఆ పార్టీలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ వర్గ విభేదాలు రోడ్డున పడుతున్నాయి. ఇంత జరుగుతున్నా టీడీపీ అధిష్టానం ఎటూ తేల్చక చోద్యం చూస్తుండడంతో ఆ పార్టీ నేతలు ఎటూ తేల్చుకోలేక సందిగ్ధావస్థలో పడ్డారు. -
ఏం జరిగిందో.. కాలేజీకి వెళ్లకుండా ఇంట్లోనే.. అంతలోనే అదృశ్యం
సిద్దవటం(వైఎస్సార్ జిల్లా): మండల పరిధి కడపాయపల్లె గ్రామ పంచాయతీలోని మంగనవాండ్లపల్లె గ్రామానికి చెందిన సౌమ్య(20) అదృశ్యమైనట్లు తండ్రి నరసింహులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ తులసీనాగప్రాద్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సౌమ్య కడప నగరంలోని ఓ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. మంగళవారం కళాశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంది. తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లి వచ్చేలోపు ఇంట్లో లేక పోవడంతో గాలించారు. గ్రామంలో కనిపించక పోవడంతో సిద్దవటం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఉసురు తీసిన ఇద్దరితో వివాహేతర సంబంధం.. ద్రోహం చెయ్యొద్దంటూ.. -
రూ.కోటి విలువైన సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు చోరీ
కడప అర్బన్: ఓ కంటైనర్ నుంచి రూ.కోటి విలువైన సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను చోరీచేసి దానిని వదిలేసి వెళ్లిపోయిన దుండగుల ఉదంతం వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలిలా వున్నాయి.. కడప నగర శివార్లలోని దేవుని కడప ఆర్చి సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద ఓ కంటైనర్ (హెచ్ఆర్ 38వై 3224)ను పదిరోజుల క్రితం కొందరు వదిలేసి వెళ్లారు. నిజానికి.. న్యూఢిల్లీ నుంచి చెన్నైకి వెళ్లాల్సిన ఈ కంటైనర్ ముంబై, హైదరాబాద్, దువ్వూరు, నెల్లూరు మీదుగా చెన్నై చేరుకోవాల్సి వుంది. ఈ కంటైనర్‌లో ఎంతో విలువైన సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను భద్రపరిచి, కోడింగ్‌తో లాక్‌చేసి మరీ నిర్వాహకులు ఎంతో పకడ్బందీగా పంపించారు. కానీ, ఈ కంటైనర్‌లోని రూ.కోటి విలువైన సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను నిందితులు హైదరాబాద్–దువ్వూరు మార్గమధ్యంలో అపహరించారు. కంటైనర్ సకాలంలో చేరకపోయేసరికి నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హైదరాబాద్–దువ్వూరు మధ్యలో సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టి కడప శివార్లలో కంటైనర్‌ను కనుగొన్నారు. కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ చోరీలో కంటైనర్ డ్రైవర్ ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై కడప డీఎస్పీ బి. వెంకటశివారెడ్డిని వివరణ కోరగా.. చోరీ జరిగిన విషయం వాస్తవమేనని, సోమవారం సాయంత్రానికి పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. -
YSR Kadapa: చిన్న పాపకు పెద్ద జబ్బు.. గొప్ప మనసుతో ఆదుకోండి
సాక్షి, జమ్మలమడుగు: గాలిపోతుల పావని. కేవలం పదేళ్ల వయసు గల పాప. ప్రైవేట్ పాఠశాలలో చదువుతూ ఉన్న పాపను.. తల్లి గాలిపోతుల సునీత ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించింది. ప్రస్తుతం బాలికల ఉన్నత పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. ఇటీవల గాలిపోతుల పావనికి జ్వరం రావడంతో.. తిరుపతికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. అక్కడ రక్త పరీక్షలు చేసి బ్లడ్ క్యాన్సర్ అని గుర్తించారు. కొంత కాలం హైదరాబాద్‌లోని బసవతారకం ఆసుపత్రిలో చికిత్స చేయించారు. పాప కోలుకుందంటూ తిరిగి జమ్మలమడుగు వచ్చేశారు. పాపకు బాగుంది అనుకునేలోపే తిరిగి అనారోగ్యానికి గురి కావడంతో మళ్లీ బసవతారకం ఆసుపత్రిలో చూపించారు. బ్రెయిన్ క్యాన్సర్ అని గుర్తించారు. దీంతో తల్లి గాలిపోతుల సునీత ఎటూపోలేక పాపకు చికిత్స చేయించలేని ఆర్థిక పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. భర్త ఉన్నా తప్పని కష్టాలు గాలిపోతుల సునీతకు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని చాగలమర్రి మండలం చింతలచెరువు గ్రామవాసి అయిన బాబుతో వివాహం జరిగింది. ఆయన బేల్దారి పని చేస్తూ వచ్చిన డబ్బుతో మద్యం తాగుతూ కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశారు. దీంతో రెండేళ్ల నుంచి సునీత తనకున్న ఇద్దరు పిల్లలను పోషించుకుంటూ వస్తోంది. తన బిడ్డకు ఆరోగ్యం సక్రమంగా లేకపోవడంతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుండటంతో.. చింతల చెరువులోని అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా ఉన్న సునీతను తొలగించేశారు. దీంతో అక్కడ సునీతను, పిల్లలను పట్టించుకునే వారు లేకపోవడంతో పుట్టినిల్లు అయిన జమ్మలమడుగుకు వచ్చి చేరింది. అయితే ఇక్కడ కూడా నిరాదరణకు గురైంది. దీంతో తన బిడ్డను కాపాడుకునేందుకు నానా ఇబ్బందులు పడుతోంది. తన పాప పావనిని కాపాడాలంటూ తల్లి సునీత వేడుకుంటోంది. సాయం చేయదలచిన వారు సెల్ నంబర్: 9121393846ను సంప్రదించాలని ఆమె కోరుతోంది. -
బుసిరెడ్డి శ్వేత.. కొలువుల్లో ఘనత.. వరుసగా మూడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
సాక్షి, వైఎస్సార్ కడప(వైవీయూ): కడప నగరానికి చెందిన బుసిరెడ్డి శ్వేత వరుసగా మూడో కేంద్ర ప్రభుత్వ కొలువు సాధించింది. కడప నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాలలో భౌతికశాస్త్ర ఆచార్యులు డా. బుసిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నాగేశ్వరి దంపతుల కుమార్తె అయిన శ్వేత ప్రస్తుతం భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో బెంగళూరు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌లో అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్‌గా పనిచేస్తోంది. ఈమె ఎస్ఎస్సీ కంబైన్డ్ గ్రాడ్యుయల్ లెవల్–2019లో ఆలిండియా స్థాయిలో 410వ ర్యాంకు సాధించిన విషయం తెలిసిందే. కాగా 2020లో బ్యాంక్ పరీక్షల్లో అర్హత సాధించి బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహించారు. తాజాగా విడుదలైన ఎస్ఎస్స్సీ సీజీఎల్–2022 పరీక్షా ఫలితాల్లో ఆలిండియాస్థాయిలో 998వ ర్యాంకు సాధించింది. దీంతో భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ రెవిన్యూ, సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ కార్యాలయంలో ప్రివెంటివ్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శ్వేత మాట్లాడుతూ తల్లిదండ్రుల ప్రోత్సాహం, ప్రణాళికబద్ధంగా చదవడంతోనే వరుసగా కొలువులు సాధించిగలిగినట్లు ఆమె తెలిపారు. కాగా వీరి స్వస్థలం చింతకొమ్మదిన్నె మండలం గూడవాండ్లపల్లె కాగా, ప్రస్తుతం కడప నగరంలోని రాజీవ్‌మార్గ్ సమీపంలో నివాసం ఉన్నారు. ఈమె పదోతరగతి వరకు నాగార్జున మోడల్ స్కూల్లోను, ఇంటర్ కడప నారాయణ, బీటెక్ హైదరాబాద్‌లోని నారాయణమ్మ ఇంజినీరింగ్ కళాశాలలో చదివారు. శ్వేతకు ఉత్తమ ర్యాంకు లభించడం పట్ల కుటుంబసభ్యులు అభినందనలు తెలిపారు. -
గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే.. ఆ రైతులకు ఎకరానికి రూ.9.20లక్షలు
సాక్షి, వైఎస్సార్ కడప(చాపాడు): గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోయే రైతులకు ఎకరాకు రూ.9.20లక్షల నష్టపరిహారాన్ని కేంద్రం ఇవ్వనున్నట్లు తహసీల్దారు సుభాని తెలిపారు. మండలంలోని సిద్దారెడ్డిపల్లె పంచాయతీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం పిచ్చపాడు రెవెన్యూ పొలాల పరిధిలోని రైతులతో తహసీల్దారు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం భూములు సేకరిస్తోందన్నారు. భూములు కోల్పోయే రైతులకు ఎకరాకు రూ.9.20లక్షల నష్ట పరిహారం చెల్లించేందుకు నిర్ణయించిందన్నారు. రైతులకు అభ్యంతరాలుంటే రాత పూర్వకంగా తెలియజేయాలన్నారు. రైతులు భూములకు సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు పాసు పుస్తకం రెవెన్యూ సిబ్బందికి అందించాలన్నారు. త్వరలోనే రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ఐ ప్రవీణ్, వీఆర్ఓ సుబ్బన్న తదితరులు పాల్గొన్నారు. -
Balaji Division: బాలాజీ పట్టాలెక్కేనా!
సాక్షి, రాజంపేట: విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ప్రకటించడంపై అన్ని వర్గాల్లో హర్షం వ్యక్తమవుతున్నా తమ చిరకాల వాంఛ నెరవేరలేదనే భావన ఉమ్మడి వైఎస్సార్ జిల్లా రైలు ప్రయాణికులు, ఉద్యోగులు, కార్మికులు, అధికారులను వేధిస్తోంది. కొత్త జోన్ ఏర్పడిన తరుణంలో కొత్త డివిజన్‌గా యేళ్లతరబడి ప్రతిపాదనలో ఉన్న బాలాజీ డివిజన్‌ను ఏర్పాటు చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. తూర్పుకోస్తా పరిధిలోని వాల్తేరు డివిజన్లో కొంతభాగం విశాఖ రైల్వేజోన్‌లో కలపడం కన్నా, తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్‌గా చేయాలని సీమ వాసుల నుంచి కేంద్రానికి వినతులు వెళుతున్నాయి. గుంతకల్‌కు వెళ్లాలంటే దూరాభారం... తరచూ సమావేశాలకు గుంతకల్ డివిజన్ కేంద్రానికి వెళ్లి రావాలంటే అధికారులు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. గుంతకల్, గుంటూరు, విజయవాడ నాలుగు డివిజన్లతోపాటు కొత్తగా బాలాజీ డివిజన్ ఏర్పాటు చేసి విశాఖజోన్‌లో కలిపితే బాగుంటుందని రైల్వే నిపుణులు అంటున్నారు. ఆ దిశగా ఎంపీలు రైల్వేమంత్రిత్వశాఖపై వత్తిడి తీసుకురావాలని సీమవాసులు కోరుతున్నారు. బాలాజీ డివిజన్ ఏర్పాటైతే.. బాలాజీ డివిజన్ ఏర్పాటైతే ఇందులో తిరుపతి–గూడూరు (92.96 కి.మీ), తిరుపతి–కాట్పాడి (104.39 కి.మీ), పాకాల–మదనపల్లె (83 కి.మీ), రేణిగుంట–కడప (125 కి.మీ)లైను కలిపే అంశాన్ని గతంలోనే రైల్వే అధికారులు పరిశీలించారు. నంద్యాల–పెండేకల్లు (102 కి.మీ)లైను గుంటూరు డివిజన్‌లోకి విలీనం చేయాలని పరిశీలించారు. కాగా జిల్లా మీదుగా వెలుగొండ అడవుల్లో నుంచి వెళ్లే కృష్ణపట్నం రైల్వేలైన్ కూడా విజయవాడ డివిజన్‌లోకి వెళ్లింది. కొత్తడివిజన్ ఏర్పడితే నందలూరుకు పూర్యవైభవం.. కొత్త డివిజన్ ఏర్పడితే బ్రిటీషు కాలం నాటి రైల్వేకేంద్రానికి పూర్వవైభవం సంతరించుకుంటుంది. బాలాజీ డివిజన్ కేంద్రానికి దగ్గరలో ఉన్న రేణిగుంట జంక్షన్ తర్వాత నందలూరు రైల్వేకేంద్రం రైల్వేపరమైన ప్రాముఖ్యత కలిగి ఉంది. డివిజన్‌కు రైల్వే ప్రత్యామ్నాయ పరిశ్రమను ఏర్పాటు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గతంలో రైల్వేమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ స్వయంగా రాజ్యసభలో నందలూరులో రైల్వేపరిశ్రమ ఏర్పాటును ప్రకటించిన సంగతి తెలిసిందే. రైల్వేపరిశ్రమ వస్తే గుంతకల్‌కు ప్రాధాన్యత తగ్గిపోతుందని రైల్వే ఉన్నతాధికారులు భావించినట్లు తెలుస్తోంది. విశాఖ జోన్ ఏర్పడిన నేపథ్యంలో గుంతకల్ డివిజన్ నుంచి వేరుచేసి ఉమ్మడి వైఎస్సార్ జిల్లా వరకు బాలాజీ డివిజన్‌గా ఏర్పాటుచేసే ప్రతిపాదన కార్యరూపం దాల్చేందుకు పాలకులు నడుం బిగించాలని పలువురు కోరుతున్నారు. బాలాజీ డివిజన్ ఏర్పాటు అవసరం బాలాజీ డివిజన్ ఏర్పాటు ఎంతైనా అవసరం. విశాఖజోన్ ఏర్పడుతున్న క్రమంలో కొత్త డివిజన్లను ఏర్పాటు చేయాల్సి వస్తే అది ముందుగా బాలాజీ డివిజన్ ఉంటుంది. డివిజన్ కావడానికి అన్ని అర్హతలు బాలాజీ డివిజన్‌కు ఉన్నాయి. అందరికి ఉపయోగకరం. కేంద్ర రైల్వేమంత్రిత్వశాఖ ఆ దిశగా అడుగులు వేయాలి. –షేక్ కమాల్‌బాషా, మాజీ కార్మికనేత, రైల్వే మజ్దూర్ యూనియన్ దశాబ్దాల నుంచి బాలాజీ డివిజన్ ప్రతిపాదన బాలాజీ డివిజన్ ఏర్పాటైతే నందలూరుకు మళ్లీ పూర్వవైభవం సంతరించుకున్నట్లే. రైల్వేపరిశ్రమ పెట్టేందుకు మార్గం సుగమమవుతుంది. బాలాజీ డివిజన్లో రేణిగుంట తర్వాత ప్రాముఖ్యత కలిగిన రైల్వేకేంద్రం నందలూరు. ఈ డివిజన్ ప్రతిపాదన దశాబ్దాల కాలం నాటిది. –పులి భాస్కరయ్య, రిటైర్డ్ లోకోపైలెట్, నందలూరు బాలాజీ డివిజన్‌ను బలపరచాలని ఎంపీలను కోరుతాం విశాఖ జోన్ ఏర్పాటు నిర్ణయం శుభపరిణామం. ఈ నేపథ్యంలో బాలాజీ డివిజన్ ప్రతిపాదనను బలపరచాలని ఎంపీలను కోరతాము. గుంతకల్ కారణంగా నందలూరుకు ప్రాముఖ్యత లేకుండా పోయింది. బాలాజీ డివిజన్ ఏర్పాటు వల్ల నందలూరుకు పూర్వవైభవం వస్తుందని రైల్వేనిపుణులు చెబుతున్నారు. –సయ్యద్‌అమీర్, వైఎస్సార్సీపీ, మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లాలు: వైఎస్సార్, అన్నమయ్య ప్రధాన రైల్వేకేంద్రం: నందలూరు ప్రధాన స్టేషన్లు: కడప, ఎర్రగుంట్ల, ఓబులవారిపల్లె ఉమ్మడి వైఎస్సార్ జిల్లా మీదుగా నడిచే రైళ్లు: 30 (డౌన్, అప్) గూడ్స్రైళ్లు: 40 స్టేషన్లు: 25 కార్మికులు: 4000 కిలోమీటర్లు: 180 -
వైఎస్ఆర్ జిల్లాలో ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు
-
టీడీపీలో వర్గ విభేదాలకు ఆజ్యం పోస్తున్న వాసు, బీటెక్ రవి
సాక్షి, కడప: ఉమ్మడి వైఎస్సార్ జిల్లా తెలుగుదేశం పార్టీలో రోడ్డెక్కిన రచ్చకు ఆ పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్య నేతలే కారణమని జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ పార్టీ క్యాడర్‌లోనూ వారి పెత్తనం చర్చనీయాంశంగా మారింది. దీంతో పలువురు నియోజకవర్గ ఇన్చార్జిలు ఏకమై సదరు నేతలపై పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లకు ఏకంగా ఫిర్యాదు చేసినట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, అన్నమయ్య జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాసులురెడ్డి (వాసు), పులివెందులకు చెందిన బీటెక్ రవిలు పార్టీలో మితిమీరిన జోక్యంతో టీడీపీలో వర్గ విభేదాలు తారా స్థాయికి చేరాయి. పలు నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉన్న నియోజకవర్గ ఇన్చార్జిలను కాదని సదరు నేతలు వారి వ్యతిరేకులను ప్రోత్సహిస్తున్నారు. దీంతో ఆ రెండు వర్గాల మధ్య విభేదాలు నెలకొన్నాయి. వాసు, బీటెక్‌ల ప్రోత్సాహంతో కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు, రాయచోటి, రాజంపేట, కడప, బద్వేలు నియోజకవర్గాల పరి«ధిలోని రెండవ శ్రేణి నేతలు ఇన్చార్జిలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు ఆ పార్టీలోనే ప్రచారం సాగుతోంది. ఇన్చార్జిలను కాదని ఈసారి ఎన్నికల్లో మీకే టిక్కెట్లు అంటూ ఆ ఇద్దరు నేతలు ప్రచారం చేస్తుండడంతో ప్రస్తుతమున్న ఇన్చార్జిలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ►మైదుకూరు నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్చార్జి పుట్టా సుధాకర్‌యాదవ్ ఈసారి కూడా తనకే టిక్కెట్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటికే పలుమార్లు టీడీపీ అధినేతను కలిసిన మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సైతం రాబోయే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ తనకేనంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వాసు, బీటెక్ రవిలు పుట్టాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు పుట్టా వర్గం ఆరోపిస్తోంది. ►ఎస్సీ రిజర్వుడు స్థానమైన బద్వేలు నియోజకవర్గంలో కీలకంగా ఉన్న దివంగత వీరారెడ్డి కుటుంబంతోనూ వాసు, బీటెక్ రవిలకు విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో ప్రస్తుతం కీలకంగా వ్యవహరిస్తున్న విజయమ్మ తనయుడు నితేష్కుమార్రెడ్డి వాసు వ్యవహార శైలిని తప్పుబడుతున్నట్లు తెలుస్తోంది. ►ఇక రాజంపేట నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో చెంగల్రాయులు తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఆశిస్తున్నారు. అయితే ఇక్కడి నుంచి వచ్చే ఎన్నికల్లో కొత్త అభ్యర్థిని బరిలో నిలపాలని పార్టీ జిల్లా అధ్యక్షుని హోదాలో వాసు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రైల్వేకోడూరు నియోజకవర్గంలోనూ గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థికి అక్కడున్న కొందరు నేతల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. ఇక్కడ కూడా వాసు మితిమీరిన జోక్యంతోనే ఆ పరిస్థితి తలెత్తినట్లు సొంత పార్టీలోనే ప్రచారం సాగుతోంది. ►కడప నియోజకవర్గంలోనూ వాసు జోక్యంతో వర్గ విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. రాబోయే ఎన్నికల్లో కడప పార్లమెంటు అభ్యర్థిగా వాసు పోటీలో ఉంటారని ఇప్పటికే టీడీపీ అధిష్టానం ప్రకటించింది. అయితే కడప అసెంబ్లీ స్థానం నుంచి మైనార్టీలను కాదని ఈసారి ఎన్నికల్లో తన సతీమణిని నిలబెట్టాలని వాసు ఉద్దేశంగా కనబడుతోంది. ఇప్పటికే కడప అసెంబ్లీ టిక్కెట్టును ఆశిస్తున్న ఆలంఖాన్‌పల్లె లక్ష్మిరెడ్డి, అమీర్‌బాబు తదితరులు వాసు తీరుపై ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ►పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వాసు, అటు బీటెక్ రవిలు అన్ని నియోజకవర్గాల్లో వేలుపెట్టి వర్గాలను ప్రోత్సహిస్తూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని ఇప్పటికే పుత్తా నరసింహారెడ్డి, పుట్టా సుధాకర్‌యాదవ్, మల్లెల లింగారెడ్డి, నితీష్‌కుమార్‌రెడ్డి తదితరులు చంద్రబాబు, లోకేష్‌లకు ఫిర్యాదు చేసినట్లు ఆ పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. వీరిద్దరి మితిమీరిన జోక్యంతోనే జిల్లాలో అరకొరగా ఉన్న తెలుగుదేశం పార్టీలో విభేదాలు మరింత తీవ్ర రూపం దాల్చాయని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ►ఉమ్మడి జిల్లాలోని రాయచోటి నియోజకవర్గంలో మాజీమంత్రి పాలకొండ్రాయుడు తనయుడు సుగవాసి ప్రసాద్‌తోపాటు మండిపల్లి రాంప్రసాద్రెడ్డిలు రాబోయే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ ఆశిస్తున్నారు. రాంప్రసాద్‌రెడ్డి ఇప్పటికే పలుమార్లు చంద్రబాబును కలిశారు. అయితే వాసు స్వయాన సోద రుడైన రమేష్‌రెడ్డి సైతం టిక్కెట్ రేసులో ఉన్నారు. వాసు, బీటెక్‌లు రమేష్‌రెడ్డికి మద్దతు పలుకుతున్నట్లు తెలుస్తోంది. ►ప్రొద్దుటూరులో వీరశివారెడ్డి సోదరుడి కుమారుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ఇటీవల చంద్రబాబును కలిసిన ఆయన టిక్కెట్ తనకేనంటూ బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో టిక్కెట్ తనకేనంటూ మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. పిట్టపోరు పిల్లి తీర్చిన చందంగా ఈ దఫా ఎన్నికల్లో తమ నేతకే టిక్కెట్ వస్తుందని వరదరాజులరెడ్డి వర్గం సైతం ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే పొలిట్‌బ్యూరో సభ్యులు వాసు, బీటెక్ రవిలు ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి టిక్కెట్ ఇప్పించేందుకు పావులు కదుపుతున్నట్లు జోరుగా చర్చ సాగుతోంది. ►కమలాపురం నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి పలుమార్లు ఓటమి చెందిన పుత్తా నరసింహారెడ్డిని కాదని మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డికి రాబోయే ఎన్నికల్లో టిక్కెట్ లభిస్తుందని ఒక వర్గం ప్రచారం చేస్తోంది. ఇప్పటికే వీరశివారెడ్డి చంద్రబాబును కలిశారు. ఈ నేపథ్యంలో ఈసారి టీడీపీ అభ్యర్థి తమ నేతేనని వీరశివారెడ్డి వర్గం ప్రచారం చేస్తోంది. దీని వెనుక వాసు, బీటెక్ రవి జోక్యం ఉన్నట్లు ఆ పార్టీలోనే ప్రచారం సాగుతోంది. -
టీడీపీలో ఆధిపత్య పోరు.. అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి
సాక్షి, కడప: తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు రోడ్డెక్కింది. దాదాపు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నియోజకవర్గ ఇన్చార్జిలు, ఆ పార్టీ సీనియర్ నేతలకు మధ్య “పచ్చ’గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. సీనియర్ నేతలు తమను ఓవర్ టేక్ చేసి ఏకపక్షంగా కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా తాము పనిచేయడం లేదంటూ అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారని నియోజకవర్గ ఇన్చార్జిలు ఆరోపిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో రాబోయే ఎన్నికల్లో టిక్కెట్ తమకేనంటూ సీనియర్లు ప్రచారం చేయడమే కాకుండా తమకు వ్యతిరేకంగా వర్గాన్ని కూడగడుతున్నారని ఇన్చార్జిలు ధ్వజమెత్తుతున్నారు. తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. ప్రధానంగా కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు, కడప నియోజకవర్గాల్లో ఆ పార్టీలో వర్గపోరు తారా స్థాయికి చేరింది. అసలే వైఎస్సార్ జిల్లాలో అంతంత మాత్రంగా ఉన్న పార్టీలో ఉన్న కాస్త మంది నేతలు పరస్పర ఆరోపణలతో రోడ్డున పడడంతో అధిష్టానం తలలు పట్టుకుంటోంది. కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సాయినాథశర్మ, నియోజకవర్గ ఇన్చార్జి పుత్తా నరసింహారెడ్డిల మధ్య సఖ్యత లేకుండా పోయింది. ఇరువురికి ఒకరంటే ఒకరికి గిట్టడం లేదు. సాయినాథ్కు రాష్ట్రస్థాయి పదవి ఇవ్వడాన్ని పుత్తా జీర్ణించుకోలేకపోయారు. పైపెచ్చు సాయినాథ్‌శర్మ పుత్తాను పరిగణనలోకి తీసుకోకుండా సొంతంగానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా తాజాగా కమలాపురం టీడీపీ టిక్కెట్ ఆశిస్తున్న వీరశివారెడ్డితో చేయి కలిపారు. ఇద్దరూ నిత్యం సమావేశమవుతున్నారు. ఇది పుత్తాకు మింగుడు పడలేదు. దీంతో సాయినాథ్‌శర్మ తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని, అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పుత్తా అధిష్టానంపై ఒత్తిడి పెంచారు. ఎట్టకేలకు అధిష్టానం మంగళవారం సాయినాథ్‌శర్మను పార్టీ రాష్ట్ర పదవి నుంచి తొలగించింది. పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తున్న సాయినాథ్‌శర్మను పదవి నుంచి తొలగించడం సరికాదని, ఆయన వర్గం అధిష్టానాన్ని తప్పుబడుతోంది. ఇక మైదుకూరు నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. టీడీపీ ఆవిర్భావం నుంచి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి పార్టీలో ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. దీన్ని గుర్తించిన పార్టీ అధిష్టానం ఆయనకు పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి పదవి కట్టబెట్టింది. అయితే రెడ్యం వెంకట సుబ్బారెడ్డికి, నియోజకవర్గ ఇన్చార్జి పుట్టా సుధాకర్ యాదవ్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. రెడ్యం తన గెలుపు కోసం పనిచేయలేదని పుట్టా ఆరోపిస్తుంటే, పుట్టా మైదుకూరు నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధి కోసం అసలు పనిచేయడం లేదని రెడ్యం ప్రత్యారోపణలు చేస్తున్నారు. రెడ్యంను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని సుధాకర్‌యాదవ్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం రెడ్యంను అధిష్టానం పార్టీ పదవి నుంచి తొలగించింది. పనిచేస్తున్న వారికే గుర్తింపు అని చెబుతున్న చంద్రబాబు, పార్టీ కోసం పనిచేస్తున్న రెడ్యంను పార్టీ నుంచి తొలగించడం సరికాదని ఆయన వర్గం ఆరోపిస్తోంది. ప్రొద్దుటూరు నియోజకవర్గంలోనూ పార్టీలో వర్గ విభేదాలు ఇటీవల కాలంలో పతాక స్థాయికి చేరాయి. పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తున్న తనకే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ అని నియోజకవర్గ ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి చెబుతున్నారు. ఈ మేరకు చంద్రబాబు హామీ ఇచ్చినట్లు కూడా ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. నూటికి లక్షసార్లు టిక్కెట్ తనకేనని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి ప్రెస్మీట్లు పెట్టి మరీ తేల్చి చెప్పారు. అటు లింగారెడ్డి, ఇటు ప్రవీణ్కుమార్రెడ్డిల మధ్య ఆధిపత్య పోరు రోడ్డున పడింది. ఈసారి ఎన్నికల్లో టిక్కెట్ తమకేనంటూ మరోవైపు వరద రాజులురెడ్డి వర్గం వాదిస్తోంది. దీంతో కార్యకర్తలు వర్గాలుగా విడిపోయారు. ఇక కడప నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఆ పార్టీ తరుపున పోటీ చేసి ఓటమి చెందిన అమీర్‌బాబు ప్రస్తుతం టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో టిక్కెట్ తనకేనని ఆయన చెబుతున్నారు. ఈ దఫా ఎన్నికల్లో కడప టిక్కెట్ మైనార్టీలకు కాకుండా నాన్ మైనార్టీలకు ఇవ్వాలని టీడీపీలోని మరో వర్గం డిమాండ్ చేస్తోంది. ఇదే జరిగితే తమకే టిక్కెట్ అంటూ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులురెడ్డి, సీనియర్ నాయకులు ఆలంఖాన్‌పల్లె లక్ష్మిరెడ్డిలు ప్రచారం చేస్తున్నారు. శ్రీనివాసులురెడ్డి రాబోయే ఎన్నికల్లో కడప పార్లమెంటు అభ్యర్థిగా ఉంటారని అధిష్టానం ఇప్పటికే ప్రకటించింది. అయితే తాను పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయాలంటే కడప టిక్కెట్ తన సతీమణికి ఇవ్వాలని శ్రీనివాసులురెడ్డి మెలిక పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కడప టిక్కెట్‌ను ఆశిస్తున్న లక్ష్మిరెడ్డి శ్రీనివాసులురెడ్డిపై అలక బూనినట్లు సమాచారం. రాబోయే ఎన్నికల్లో టీడీపీ తరుపున లక్ష్మిరెడ్డి కోడలు పోటీలో ఉంటుందని ఆయన వర్గం ప్రచారం చేస్తోంది. దీంతో కడపలో ఉన్న కాస్త క్యాడర్ వర్గాలుగా చీలిపోయింది. దాదాపు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ పచ్చ పార్టీలో వర్గ విభేదాలు తీవ్ర రూపం దాల్చాయి. -
ఏటీఎం వ్యాన్‌లో చోరీ కేసులో ఒకరి అరెస్ట్
కడప అర్బన్: కడపలో ఏటీఎం వ్యాన్‌లోని డబ్బుల చోరీ కేసులో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కడపలో ఆదివారం ఎస్పీ అన్బురాజన్ ఈ కేసు వివరాలు చెప్పారు. ఖాజీపేట మండలం పుల్లూరు గ్రామానికి చెందిన చెన్నూరు మహబూబ్‌బాషా (36), కడపలోని సత్తార్ కాలనీకి చెందిన షేక్ ఉమర్ ఫరూక్ స్నేహితులు. ఇద్దరు కలిసి సులభంగా డబ్బులు సంపాదించాలని భావించారు. ఫరూక్ ఎస్బీఐ ఏటీఎంలలో నగదు లోడ్ చేసే సీఎంఎస్ కంపెనీ వ్యాన్‌కు గతంలో యాక్టింగ్ డ్రైవర్‌గా వెళ్లాడు. వ్యాన్ డ్రైవర్‌గా మళ్లీ అవకాశం వస్తే నగదు చోరీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 16న ఫరూక్ యాక్టింగ్ డ్రైవర్‌గా వెళ్లాడు. అతను పథకం ప్రకారం ముందుగానే ఓ కారు అద్దెకు తీసుకుని వినాయక్‌నగర్ సమీపంలో పార్కింగ్ చేసి వెళ్లాడు. లోహియానగర్‌లోని ఏటీఎంలో సీఎంఎస్ సంస్థ ఉద్యోగులు నగదు లోడ్ చేసే సమయంలో ఫరూక్ వ్యాన్‌ను రివర్స్ చేసి పెట్టుకుంటానని చెప్పి అందులో మిగిలి ఉన్న రూ.56 లక్షలతో ఉడాయించాడు. వినాయక్‌నగర్ సమీపంలో సిద్ధంగా ఉంచిన కారులోకి డబ్బుల పెట్టెను మార్చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. వైవీయూ సమీపంలో వేచి ఉన్న మహబూబ్‌బాషా నగదు పెట్టెను పగులగొట్టి నగదును కారులో నింపి ఫరూక్‌ను బెంగళూరుకు వెళ్లాలని చెప్పాడు. సీఎంఎస్ కార్యాలయంలో ఏటీఎంకు కస్టోడియన్‌గా ఉన్న ఎం.సునీల్‌కుమార్ తాలూకా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వ్యాన్‌కు ఉన్న జీపీఎస్ సహాయంతో వినాయక్‌నగర్ దగ్గర షెడ్డులో ఉన్నట్లు గుర్తించారు. కారులో పారిపోయిన ఫరూక్ సెల్ నంబర్, సీడీఆర్ డేటా, సీసీ కెమెరాలను పరిశీలించి కర్ణాటకలోని బాగేపల్లి టోల్‌గేటు వద్ద ఉన్నట్లు నిర్ధారించి అక్కడ ఉద్యోగులను అప్రమత్తం చేశారు. దీన్ని పసిగట్టిన ఫారూక్ టోల్‌గేటుకు కొంతదూరంలో కారును, నగదును వదిలేసి పారిపోయాడు. పోలీసులు వెళ్లి కారును, రూ.53.50లక్షలు స్వా«దీనం చేసుకున్నారు. చెన్నూరు మహబూబ్‌బాషాను ఆదివారం కడప నగర శివారులో అరెస్ట్ చేశారు. షేక్ ఉమర్ ఫరూక్ కోసం గాలిస్తున్నారు. -
షుక్రియా.. సీఎం సార్
కడప కార్పొరేషన్/సాక్షి, విశాఖపట్నం: పేదింటి యువతుల వివాహాలను గౌరవంగా జరిపించేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెడుతున్న వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకంపై హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం కడపలో మహిళలు ‘కృతజ్ఞతా ర్యాలీ’ నిర్వహించారు. ‘షుక్రియా సీఎం సార్.. థ్యాంక్యూ సీఎం సార్’ అంటూ నినాదాలు చేస్తూ.. సీఎం జగన్‌పై తమ అభిమానాన్ని చాటుతూ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ ఆడిటోరియం వద్ద ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా దీనిని ప్రారంభించారు. అలాగే విశాఖలోని లక్ష్మీటాకీసు వద్ద సీఎం జగన్ చిత్రపటానికి మహిళలు క్షీరాభిషేకం చేసి సంతోషం వ్యక్తం చేశారు. పేదల పెన్నిధి సీఎం క్షేమం కోరుతూ శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్పర్సన్ సింహాచలం కొబ్బరికాయలు కొట్టారు. -
కడప నగరంలో సౌరకాంతులు.. రూ.113.46 కోట్లతో..
సాక్షి, కడప: జిల్లా కేంద్రమైన కడప నగరంలో సౌరకాంతులు విరజిమ్మనున్నాయి. రూ.113.46కోట్ల వ్యయంతో సోలార్ పవర్ ప్లాంటు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ఆ ప్లాంటు నిర్మాణానికి అవసరమయ్యే 95 ఎకరాల భూమిని కూడా కేటాయిస్తూ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కడప నగరం చిన్నచౌకు గ్రామ పొలంలో 1151 నుంచి 1159 వరకూ ఉన్న సర్వేనంబర్లలో ఈ 95 ఎకరాల భూమి ఉంది. వీధి దీపాలు, తాగునీటి సరఫరా, పంపింగ్ ఇతర అవసరాల కోసం కడప నగరపాలక సంస్థ ప్రతినెలా సుమారు రూ.2కోట్ల మేర విద్యుత్ చార్జీల రూపంలో చెల్లించాల్సి వస్తోంది. తద్వారా ఒక ఏడాదికి రూ.24కోట్లు కరెంటు చార్జీలకే పోతోంది. కార్మికుల జీతాలు, కరెంటు చార్జీలకే సాధారణ నిధులన్నీ ఖర్చయి పోతుండటంతో నగరంలో అభివృద్ధి పనులు చేసేందు కు నిధులు మిగలడం లేదు. అధిక భారంగా మారిన కరెంటు చార్జీలను ఆదా చేసేందుకు నగర మేయర్ సురేష్‌బాబు, డిప్యూటీ సీఎం అంజద్‌బాషాల ఆధ్వ ర్యంలో ఈ ప్రాజెక్టుకు ప్రతిపాదన చేశారు. నగరపాలక సంస్థకు ప్రతి సంవత్సరం సుమారు 3కోట్ల యూనిట్ల కరెంటు అవసరమవుతోంది. దానికి తగినట్లుగా విద్యుత్ ఉత్పత్తి చేసేలా పవర్ ప్లాంటు ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్‌కు చెందిన ది సిస్ట్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ వారు 17 మెగా వాట్ల సామర్థ్యంతో ప్రాజెక్టు నెలకొల్పేందుకు ముందుకు వచ్చారు. ఆరు సంవత్సరాల(72 నెలలు)పాటు ఈ ప్రాజెక్టు కొనసాగనుంది. ఈ ఆరేళ్లలో వీధిదీపాలు, మోటార్లు, తాగునీటి సరఫరా, పంపింగ్ వంటి వాటన్నింటికీ సోలార్ పవర్‌నే వినియోగించనున్నారు. ఇందుకోసం నగరపాలక సంస్థ భూమిని కేటాయించడంతోపాటు 72 నెలలపాటు రూ.1.50కోట్ల చొ ప్పున ఆ ప్రాజెక్టు నిర్వహిస్తున్నవారికి చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రతినెలా కరెంటు చార్జీల రూపేణా కార్పొరేషన్ విద్యుత్ శాఖకు చెల్లిస్తున్న మొత్తాన్ని ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్న సంస్థకు చెల్లించాల్సి ఉంటుందన్నమాట. ఆరేళ్ల తర్వాత అనగా నెలవారీ చెల్లింపులు పూర్తయిన పిమ్మట ఆ ప్రాజెక్టు నగరపాలక సంస్థ సొంతమవుతుంది. ఒకవేళ ప్రాజె క్టు నిర్వహణ, ఆపరేషన్ కా లం పెంచవలసి వస్తే అందుకు తగిన సర్వీసు చార్జీలను నగరపాలక సంస్థ వారికి చెల్లించాల్సి ఉంటుంది. కరెంటు చార్జీలను తగ్గించుకోవడానికి ఇది మంచి అవకాశం కడప నగరపాలక సంస్థకు ప్రతినెలా వస్తున్న కరెంటు చార్జీలను తగ్గించుకోవడానికి సోలార్ ప్రాజెక్టు చాలా ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదించి భూమి కేటాయించడం శుభ పరిణామం. ప్రతినెలా కార్పొరేషన్ కరెంటు చార్జీల కింద విద్యుత్‌శాఖకు చెల్లిస్తున్న మొత్తాన్ని ఆ పవర్ ప్రాజెక్టుకు చెల్లిస్తాం. ఆరేళ్ల తర్వాత ఆ ప్రాజెక్టు నగరపాలక సంస్థకు సొంతమై కరెంటు చార్జీలు మిగులుతాయి. అతి త్వరలోనే దీని పనులు ప్రారంభించి పూర్తి చేసేలా కృషి చేస్తాం. ఈ ప్రాజెక్టు మంజూరు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు. – కొత్తమద్ది సురేష్‌బాబు, మేయర్, కేఎంసీ -
ఒక్కసారిగా టమాట ధరలు పైపైకి
సాక్షి, కడప: ఖరీఫ్‌లో సాగు చేసిన టమాట పంట ప్రస్తుతం చివరి దశకు చేరడంతో దిగుబడులు తగ్గాయి. దీంతోపాటు మార్కెట్‌కు సరుకు తక్కువగా వస్తుండటంతో ధర కొంచెం కొంచెం ఎగబాకుతోంది. ఆగస్టు 1న రైతు బజారులో కిలో కిలో రూ.11 ఉండేది. అది కాస్త కాస్తా పెరుగుతూ ప్రస్తుతం కిలో రూ. 28 పలుకుతోంది. బయటి మార్కెట్లో 30కి పైగా ఉంది. జిల్లాలో 470 ఎకరాల్లో.. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 470 ఎకరాల్లో టమాట సాగు చేశారు. మైలవరం, కలసపాడు, ఎర్రగుంట్ల, ఖాజీపేట, సింహాద్రిపురం, వీఎన్‌పల్లె, లింగాల, తొండూరు, సికేదిన్నె, పెండ్లిమర్రి, చక్రాయపేట మండలాల పరిధిలో ఎక్కువగా వేశారు. ఈ పంట ఈ నెల చివరి కంటే ముందే ముగియనుంది. దీంతో ఒక్కసారిగా టమాట ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. జూలైలో 20 నుంచి 25 తేదీల్లో కిలో 10 రూపాయలకే దొరికిన టమాట.. ప్రస్తుతం కిలో రూ.28 నుంచి రూ.32 దాకా ఉంది. రానురాను ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉందని రైతు బజార్‌లోని కూరగాయల షాపుల నిర్వాహకులు తెలిపారు. చదవండి: (స్థపతి వడయార్‌కు స్వర్ణ కంకణం బహూకరించిన సీఎం జగన్) -
సీఎం జగన్ చేతుల మీదుగా సచివాలయ కాంప్లెక్స్ ప్రారంభం(ఫొటోలు)
-
AP: స్ఫూర్తి సముదాయం.. ఒకేచోట అన్ని భవనాలు
సాక్షి ప్రతినిధి, కడప: అధునాతన హంగులతో వైఎస్సార్ జిల్లా వేల్పుల గ్రామంలో రూపుదిద్దుకున్న గ్రామ సచివాలయ భవన సముదాయం రాష్ట్రానికి స్ఫూర్తిదాయకంగా నిలిచిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశంసించారు. పులివెందుల నియోజకవర్గం వేముల మండలం వేల్పులలో నిర్మించిన మోడల్ సచివాలయ భవన ప్రాంగణాన్ని ముఖ్యమంత్రి జగన్ గురువారం సాయంత్రం సందర్శించి ప్రారంభించారు. రూ.3.22 కోట్లతో అత్యాధునిక వసతులతో ఒకే ప్రాంగణంలో గ్రామ సచివాలయ వ్యవస్థకు సంబంధించిన భవన సముదాయాలను ఇక్కడ నిర్మించారు. సచివాలయ భవనంతో పాటు ఆర్బీకే, వైఎస్సార్ హెల్త్‌క్లినిక్, వ్యవసాయ సహకార పరపతి సంఘం, డిజిటల్ లైబ్రరీ, తపాలాశాఖ కార్యాలయం, శుద్ధి నీటి కేంద్రం, ఓవర్ హెడ్ ట్యాంక్, బస్సు షెల్టర్ తదితరాలతో రాష్ట్రంలో మోడల్ ప్రాంగణంగా నిర్మాణం చేపట్టారు. కడప–పులివెందుల ప్రధాన మార్గం పక్కనే ఎకరం స్థలంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో సచివాలయ భవన సముదాయాన్ని అధునాతన హంగులతో తీర్చిదిద్దడం అభినందనీయమని సీఎం జగన్ పేర్కొన్నారు. స్థానిక నాయకులు, జిల్లా యంత్రాంగం తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ భవనాల నిర్మాణంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోందన్నారు. వలంటీర్లను పలుకరిస్తూ.. కలియదిరుగుతూ.. మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా గురువారం మధ్యాహ్నం 3.15 గంటలకు ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి కడప చేరుకున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, పలువురు ఉన్నతాధికారులు ఆయన వెంట ఉన్నారు. వర్షం పడుతుండటంతో 3.25 గంటలకు కడప నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరారు. 4.40 గంటలకు వేల్పుల చేరుకుని సచివాలయ సముదాయాన్ని ప్రారంభించి అన్ని భవనాలను క్షుణ్నంగా పరిశీలించారు. సచివాలయం, వైఎస్సార్ విలేజ్ హెల్త్‌క్లినిక్, రైతు భరోసా కేంద్రంతో పాటు అన్ని కార్యాలయాలలో కలియదిరిగారు. గ్రామ సచివాలయంలో సీఎం జగన్ అరగంటకు పైగా గడిపారు. వలంటీర్లు, సిబ్బందితో మాట్లాడారు. విధులపై ఆరా తీశారు. వైఎస్సార్ చేయూత ఎంత మందికి ఇచ్చారని ప్రశ్నించారు. ప్రభుత్వ పథకాలు అందుకున్న లబ్ధిదారుల వివరాలను ప్రదర్శించాలని ఆదేశించారు. ఈ–క్రాప్ ఎలా చేస్తున్నారని ఆరా తీశారు. ఆర్బీకేలో 20 నిమిషాలకు పైగా గడిపి అందరినీ పేరుపేరునా పలుకరించారు. 2021–22కి సంబంధించి 650 మందికి ఇన్సూరెన్స్ అందలేదని స్థానిక నేతలు వినతిపత్రం అందచేయడంతో తగిన చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లో డాక్టర్, సిబ్బందిని పలకరించి ప్రజలకు అందిస్తున్న సేవలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఏ ఒక్కరికీ ఇబ్బంది లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అన్ని కార్యాలయాల్లో సిబ్బందిని పేరుపేరునా పలుకరించారు. ఉద్యోగులు, సిబ్బంది ఎంతమంది ఉన్నారని ప్రశ్నించారు. వసతులపై ఆరా తీశారు. సక్రమంగా సేవలు అందించడంపై జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజుకు పలు సూచనలు చేశారు. దాదాపు 2.20 గంటల పాటు ముఖ్యమంత్రి అక్కడే గడిపారు. సచివాలయ ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్దిన ప్రజాప్రతినిధులు, అధికారులను అభినందించారు. స్థానిక నేతలు, కార్యకర్తలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. తానున్నానంటూ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అవినాష్‌రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. గాంధీ, వైఎస్సార్ విగ్రహాల ఆవిష్కరణ సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మాగాంధీ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను సీఎం జగన్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజద్‌బాష, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాత్రి 7.00 గంటలకు ముఖ్యమంత్రి జగన్ రోడ్డు మార్గంలో బయలుదేరి 7.35 గంటలకు ఇడుపులపాయ చేరుకున్నారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు అక్కడ సీఎంకు స్వాగతం పలికారు. వేల్పులలో సీఎం జగన్ ప్రారంభించిన వివిధ భవనాలు ఇవీ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో.. ♦ రూ.40 లక్షలతో గ్రామ సచివాలయం ♦ రూ.21.80 లక్షలతో రైతు భరోసా కేంద్రం ♦ రూ.16 లక్షలతో వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీ పాడా నిధులతో.... ♦ రూ. 40 లక్షలతో వ్యవసాయ సహకార పరపతి సంఘం ♦ రూ. 19.50 లక్షలతో వైఎస్సార్ హెల్త్ క్లినిక్ ♦ రూ. 17 లక్షలతో పోస్టాఫీసు బిల్డింగ్ ♦ రూ. 13 లక్షలతో వేదిక, విశ్రాంతి గది ♦ రూ. 8 లక్షలతో బస్సు షెల్టర్ ♦ రూ. 13 లక్షలతో వెయిటింగ్‌హాలు ♦ రూ. 16 లక్షలతో సీసీ రోడ్డు, పార్కింగ్‌టైల్స్ ♦ రూ. 32 లక్షలతో ప్రహరీ గోడ నిర్మాణం ♦ రూ. 3.10 లక్షలతో బోర్వెల్, పైపులైన్ పనులు ♦ రూ. 16.50 లక్షలతో ఓవర్‌హెడ్ ట్యాంకు ♦ రూ. 3 లక్షలతో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ ♦ రూ. 29 లక్షలతో ఆర్వో ప్లాంట్ పైపులైన్ ♦ రూ. 35 లక్షలతో ఫర్నిచర్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
YSR Kadapa: మూడు రోజుల పాటు సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే
సాక్షి, కడప సిటీ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో మూడు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ విజయరామరాజు.. పర్యటన వివరాలను వెల్లడించారు. వైఎస్సార్ జిల్లాలో సెప్టెంబరు 1 నుంచి 3వ తేదీవరకు ముఖ్యమంత్రి వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సెప్టెంబరు 1వ తేదీ సాయంత్రం వేముల మండలంలోని వేల్పుల గ్రామ సచివాలయ కాంప్లెక్స్‌ను ప్రారంభించనున్నారు. 2వ తేదీన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్బంగా వైఎస్సార్ ఘాట్‌లో ప్రత్యేక పార్థనలు నిర్వహిస్తారు. అదేరోజు పులివెందుల నియోజకవర్గంలోని అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించనున్నారు. 3వ తేది ఇడుపులపాయ ఎస్టేట్ నుంచి బయలుదేరి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో కడప విమా నాశ్రయానికి చేరుకుంటారు. ఉదయం 9.20 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన వివరాలు సెప్టెంబరు 1న ►మధ్యాహ్నం 2.00 గంటలకు ముఖ్యమంత్రి తన నివాసం నుంచి బయలుదేరి 2.20 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ►అక్కడి నుంచి విమానంలో 2.30 గంటలకు బయలుదేరి 3.20 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ►3.30 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి 3.50 గంటలకు వేముల మండలంలోని వేల్పుల గ్రామానికి చేరుకుంటారు. ►అక్కడ 3.50 నుంచి 4.05 గంటల వరకు స్థానిక నాయకులతో మాట్లాడతారు. ►4.10 నుంచి 5.10 గంటల వరకు వేల్పులలోని సచివాలయ కాంప్లెక్స్‌ను ప్రారంభిస్తారు. ►అనంతరం అక్కడి నుంచి 5.35 గంటలకు హెలికాఫ్టర్‌లో వేంపల్లె మండలంలోని ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. 2వ తేదీన ►ఉదయం 8.50 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ గెస్ట్‌హౌస్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 9 గంటలకు వైఎస్సార్ ఘాట్‌కు చేరుకుంటారు. ►9 నుంచి 9.40 గంటల వరకు వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. ►ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 1.30 నుంచి 3 గంటల వరకు, 3.30 నుంచి 5 గంటల వరకు ఇడుపులపాయలో పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహిస్తారు. ►5.10 గంటలకు గెస్ట్‌హౌస్ చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. 3వ తేదీన ►ఉదయం 8.50 గంటలకు ఇడుపులపాయ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి అక్కడే ఉన్న హెలిప్యాడ్ వద్దకు 9 గంటలకు చేరుకుంటారు. ►అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి 9.15 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ►9.20 గంటలకు ప్రత్యేక విమానంలో కడప నుంచి బయలుదేరి 10.10 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుని తన నివాసానికి బయలుదేరి వెళతారు. -
ఎస్బీఐ క్యాషియర్ నిర్వాకం.. నకిలీ బంగారంతో రూ.60 లక్షలు స్వాహా
రామాపురం: నకిలీ బంగారం పెట్టి కుటుంబ సభ్యుల ఖాతాలతో రూ.60 లక్షలు స్వాహా చేశాడు ఎస్బీఐలో పని చేసే ఓ క్యాషియర్. ఈ సంఘటన అన్నమయ్య జిల్లాలోని మండల కేంద్రమైన రామాపురంలో సోమవారం వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి. ఎస్బీఐ రామాపురం బ్రాంచ్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు రవికుమార్. డబ్బు కాజేయాలనే దుర్బుద్ధితో ఓ ఎత్తుగడ వేశాడు. తనకు అనుకూలురైన సిబ్బందితో కథ నడిపాడు. నకిలీ బంగారాన్ని కుదువపెట్టి తన కుటుంబసభ్యుల ఖాతాల ద్వారా లోన్ల పేరిట దాదాపు రూ.60 లక్షలు స్వాహా చేసినట్లు ప్రాథమిక అంచనా. కొందరు ఖాతాదారుల పేర్లతో కూడా డబ్బు స్వాహా చేసినట్లు తెలుస్తుండటంతో ఈ మొత్తం కోటి రూపాయలు దాటుతుందని సమాచారం. ఈ నేపథ్యంలో 15 రోజుల క్రితం అధికారులు ఈ విషయాన్ని గుర్తించి క్యాషియర్ రవికుమార్‌ను సస్పెండ్ చేసి విచారణ జరుపుతున్నారు. ఈ విషయంపై ఎస్ఐబీఐ ఆర్ఎమ్ రామకృష్ణ, రామాపురం శాఖ మేనేజర్ నాగసుబ్రహ్మణ్యంలను వివరణ కోరగా నకిలీ బంగారంతో క్యాషియర్ రవికుమార్ డబ్బు తీసుకున్నమాట వాస్తవమేనని, అతడిని సస్పెండ్ చేసి విచారణ జరుపుతున్నామన్నారు. పూర్తయిన తర్వాత వివరాలు వెల్లడిస్తామన్నారు. ఖాతాదారుల్లో ఆందోళన నకిలీ బంగారంతో రుణాల పేరిట క్యాషియర్ రవికుమార్ భారీ మొత్తం స్వాహా చేసిన విషయం తెలిసిన ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. బ్యాంకులో నగదు డిపాజిట్ చేసేందుకు, బంగారం దాచుకునేందుకు జంకుతున్నారు. ఇప్పటికే బ్యాంకులో దాచుకున్న బంగారం విడిపించుకోవాలని ఖాతాదారులు బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు అత్యవసర పరిస్థితుల్లో బ్యాంకులో బంగారు తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవాలనుకున్నవారిని బ్యాంక్ అధికారులు వారిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే బంగారంపై పొందిన రుణాన్ని తిరిగి చెల్లించడానికి వెళ్లినా వారు స్పందించడం లేదు. చదవండి: ప్రాణం పోసుకుంటున్న నల్ల రాతి శిలలు! -
YSR Kdapa-Renigunta: వడివడిగా హైవే.. రూ.4వేల కోట్లతో రోడ్డు నిర్మాణం
సాక్షి, రాజంపేట : శేషాచలం అటవీ ప్రాంతంలో పచ్చటి ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన ప్రయాణం చేసే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. రాయలసీమ జిల్లాలకు ముఖ్య రహదారిగా ప్రాచుర్యం పొందిన 716 కడప–రేణిగుంట జాతీయరహదారిని 2024 నాటికి పూర్తిగా అందుబాటులో తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. తక్కువ వ్యవధిలోనే తిరుపతి.. కడప–రేణిగుంట ఎన్‌హెచ్ ఏర్పడిన తర్వాత తక్కువ వ్యవధిలో తిరుపతికి చేరుకోవచ్చు. ఫలితంగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణా రాష్ట్రాల నుంచి వచ్చేవారు తిరుపతి, చెన్నై నగరాలకు వెళ్లే వారికి కడప–రేణిగుంట రహదారి ఎన్‌హెచ్ చేయడం వల్ల త్వరితగతిన గమ్యానికి చేరుకునే వీలు కలుగుతుంది. రెండు ప్యాకేజీలుగా..హైవే నిర్మాణం కడప నుంచి చిన్నఓరంపాడు(64.2కేఎం), చిన్నఓరంపాడు నుంచి రేణిగుంట వరకు రెండుప్యాకేజీలుగా హైవే నిర్మాణపనులు జరుగుతాయి. నాలుగులేన్లుగా రోడ్డు నిర్మితం కానుంది. ఇందు కోసం టెండర్లను కూడా కేంద్రం పిలిచింది. రెండు ప్యాకేజీలకు కలిపి రూ.4వేల కోట్లు వ్యయం చేయనుంది. సెప్టెంబరు 16 తర్వాత టెండర్ల ఖరారును నిర్ణయిస్తారు. రాజంపేట, రైల్వేకోడూరులో బైపాస్ రహదారి కడప–రేణిగుంట రహదారిలో రాజంపేట, రైల్వేకోడూరులో బైపాస్ రహదారి నిర్మించాలని యోచిస్తున్నారు. ముంబై–చెన్నై రైలుమార్గం వెంబడి (పడమర వైపు )భాకరాపేట నుంచి చిన్నఓరంపాడు వరకు మార్గం నిర్మితం కానున్నది.ఇది పూర్తిగా అటవీమార్గంలోనే కొనసాగుతుంది. మార్గమధ్యలో ఆర్వోబీలు, చెయ్యేరునదిపై వంతెనలు, చిన్న చిన్న బ్రిడ్జిల నిర్మాణాలు ఉన్నాయి. త్వరతగితిన హైవే నిర్మాణానికి ఎంపీ మిథున్‌రెడ్డి కృషి కడప–రేణిగుంట నేషనల్ హైవే త్వరితగతిన నిర్మితమయ్యేలా రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి తన వంతు కృషిచే శారు. కేంద్రం తీసుకున్న ప్రయార్టీలో కడప–రేణిగుంట ఎన్‌హెచ్‌ను చేర్చేలా ఎంపీ విశ్వప్రయత్నాలు చేశారు. ఫలితంగా భూసేకరణ, మరోవైపు టెండర్ల ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది. రెండేళ్లలో ఎన్‌హెచ్‌ను అందుబాటులోకి తీసుకురావాలన్నదే అభిమతంగా ఎంపీ ప్రయత్నిస్తున్నారు. ఒంటిమిట్ట, నందలూరు ప్రాంతాలకు స్పెషల్ కనెక్టిటివిటీ అవసరం జిల్లాలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలైన నందలూరు, ఒంటిమిట్ట కేంద్రాలకు ఎన్‌హెచ్ నుంచి కనెక్టిటివిటీ రోడ్ (సర్వీసురోడ్డు) అవసరమని పలువురు భక్తులు కేంద్రాన్ని కోరుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి వెళ్లే యాత్రీకులు ఒంటిమిట్ట రామయ్య, సౌమ్యనాథుని దర్శించుకుంటారు. అంతేగాకుండా రాయలసీమలో తొలిసారిగా బయల్పడిన బౌద్ధారామాలున్నాయి. ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. ప్రస్తుతం కడప–రేణిగుంట హైవేలో ట్రాఫిక్ పెరుగుతోంది. ఈ మార్గం మీదుగా తిరుపతి, చెన్నై, ముంబై, హైదరాబాదులకు రాకపోకలు జరుగుతున్నాయి. నిత్యం 17వేలకు పైగా వాహనాలు పరుగులు తీస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్‌కు హైవే కెపాసిటీ సరిపోవడంలేదు. ఫలితంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతేగాకుండా కడప–రేణిగుంట రోడ్డు ప్రయాణం మూడు నుంచి నాలుగు గంటలకుపైగా పడుతోంది. సకాలంలో గమ్యాలకు చేరలేని పరిస్ధితి. నాలుగులైన్లరోడ్డు నిర్మాణంతో ట్రాఫిక్ తగ్గుతుంది. ప్రమాదాలు తగ్గుముఖం పడతాయి. భూసేకరణ ప్రక్రియ ప్రారంభం కడప–రేణిగుంట ఎన్‌హెచ్‌కు 1,066 ఎకరాల భూసేకరణ చేపట్టారు. ఇప్పటికే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పూర్తి అయింది. డ్రాఫ్ట్ డిక్లరేషన్ చేయాల్సి ఉంది. పరిహారం చెల్లింపు ప్రక్రియను రెవెన్యూ అధికారులు చేపట్టారు. అన్నమయ్య జిల్లా జేసీ తమీమ్ అన్సారియాలు పరిహారం అందజేసే అంశంపై కసరత్తు చేస్తున్నారు. వైఎస్సార్ జిల్లా జాయింట్ కలెక్టర్ కూడా భూసేకరణపై దృష్టి సారించారు. త్వరగా అందుబాటులోకి తీసుకొస్తాం రాజంపేట, రైల్వేకోడూరులో బైపాస్‌రోడ్డు నిర్మితం కానుంది. రూ.4వేల కోట్లతో రెండు ప్యాకేజీలుగా నిర్మాణ పనులు జరుగుతాయి. గ్రీన్‌హైవే ఎక్స్‌ప్రెస్‌లో పచ్చటి ప్రకృతిలో.. ఆహ్లాదకరమైన వాతవరణంలో త్వరితగతిన గమ్యాలకు చేరుకోవచ్చు. 2024 నాటికి అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. –పీవీ మిథున్‌రెడ్డి, ఎంపీ, రాజంపేట ప్రమాదాలు తగ్గుతాయి కడప–రేణిగుంట ఎన్‌హెచ్ నిర్మాణంతో ప్రమాదాలు తగ్గుముఖం పడతాయి. కడప–తిరుపతి మధ్య ప్రయాణ వ్యవధి తగ్గిపోతుంది. ప్రసిద్ధి చెందిన దేవాలయాలు ఒంటిమిట్ట, నందలూరులో ఉన్నందున ప్రత్యేకంగా స్పెషల్ సర్వీసు రోడ్డు నిర్మిచాల్సిన అవసరం ఉంది. త్వరగా అందుబాటులోకి వస్తే ఉభయ వైఎస్సార్ జిల్లా వాసులే కాకుండా, ఉత్తరభారతదేశం వారికి సకాలంలో తిరుపతి,గా చెన్నైలకు వెళ్లే వీలు ఉంటుంది. –మేడారఘునాథరెడ్డి, అధినేత, ఎంఆర్‌కెఆర్ సంస్థ, నందలూరు -
YSR Kadapa: కడప జిల్లా పర్యటనకు సీఎం జగన్
సాక్షి, వేంపల్లె (వైఎస్సార్ కడప): సెప్టెంబర్ 1, 2 తేదీలలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా ఇడుపులపాయకు రానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజు పేర్కొన్నారు. మంగళవారం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్, గెస్ట్ హౌస్, నెమళ్ల పార్కు తదితర ప్రాంతాలను ఆయన జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ, పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, పులివెందుల ఆర్డీఓ వెంకటేశులు, జెడ్పీటీసీ రవికుమార్‌రెడ్డిలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం పర్యటనకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నిర్ణయించిన మేరకే అధికారులను, ప్రజాప్రతినిధులను అనుమతించాలన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సీఎం పర్యటనను విజయవంతం చేయాలని తెలిపారు. ఇంకా అధికారికంగా ముఖ్యమంత్రి షెడ్యూల్ వివరాలు రావాల్సి ఉందన్నారు. అధికారులు నిర్లక్ష్యంగా ఉండకుండా చురుగ్గా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్‌డబ్లు్యఎస్ ఈఈ సిద్ధారెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖరరెడ్డి, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. చదవండి: (మహనీయులకు మరణం ఉండదు: సీఎం జగన్) -
'ప్రజలు తరిమి తరిమి కొడతారు.. ఖబడ్దార్ పవన్ కల్యాణ్'
సాక్షి, వైఎస్సార్ కడప: చంద్రబాబు దత్తపుత్రుడు రైతులకు మేలు చేయడానికి రాలేదని, కులాల మధ్య చిచ్చు పెట్టడానికే వచ్చారంటూ పవన్ కల్యాణ్‌పై డిప్యూటీ సీఎం అంజాద్ భాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లాలో కులాలు, మతాలు లేవు అందరూ ఒకటే అన్న విధంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక రైతుల కోసం ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం అంజాద్ భాషా మాట్లాడుతూ.. రైతు విత్తనం మొదలు గిట్టు బాటు ధర వరకు ప్రభుత్వం సాయం అందిస్తోంది. ప్రశ్నించడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో రైతులు అత్మహత్యలు చేసుకున్నా, నీళ్ళు లేకపోయినా ఎందుకు ఆ రోజు ప్రశ్నించ లేదు. ప్యాకేజీ నాయకుడు పవన్ కళ్యాణ్. ప్యాకేజీ కుదిరాక ఏదో పర్యటన చేసి విమర్శిస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో 45 వేల బెల్టు షాపులు పెట్టి, మద్యం ఏరులై పారినపుడు.. పవన్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం బెల్టు షాపులు రద్దు చేసింది. ఇది తెలియక పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారని అన్నారు. చదవండి: (బీసీ-డీగా మున్నూరు కాపులు.. ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు) ఖబడ్దార్ పవన్ కల్యాణ్ వారసత్వ రాజకీయాలు చేస్తున్నాడని చెబుతున్నారు ఇది సరైంది కాదు. కాంగ్రెస్ కేంద్ర మంత్రి పదవి ఇస్తానంటే వద్దని పార్టీ పెట్టి, ప్రజాబలంతో అధికారంలోకి వస్తే వారసత్వ రాజకీయాలు అనడం ఏమిటి. నువ్వు ఏం రాజకీయాలు చేస్తున్నావు.. అన్న పేరు చెప్పుకుని రాజకీయాలు చేస్తున్నావు. కులాలకు, మతాలకు, వర్గాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం వైఎస్సార్సీపీ. మా ప్రభుత్వంలో కరుడు గట్టిన టీడీపీ కార్యకర్తలకు కూడా మంచి చేస్తున్నారు. నువ్వు, చంద్రబాబు కలిసి వైసీపీకి కులం, మతం అంట గడుతున్నారు. షర్మిల ఎప్పుడైనా జగన్ అన్యాయం చేసారని చెప్పారా. కానీ మీ భార్య మీపై బహిరంగంగా విమర్శలు చేసిన విషయం మర్చిపోవద్దు. కులాల, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తే ఈ జిల్లా ప్రజలు తరిమి తరిమి కొడతారు. ఖబడ్దార్.. పవన్ కల్యాణ్ అంటూ హెచ్చరించారు. చదవండి: (మంత్రి ఆర్కే రోజాని మర్యాదపూర్వకంగా కలిసిన పీవీ సింధు) సవాల్‌కు సిద్ధమా? ఒక కులానికి, వర్గానికి కొమ్ము కాస్తున్నావు. నీకు ఒక హిడెన్ అజెండా ఉంది. చంద్రబాబుకు గంప గుత్తగా నీ కులం ఓట్లు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నావు. ఆత్మాభిమానం అని మోసపు మాటలు వద్దు. వైఎస్సార్ హయాంలో పోతిరెడ్డిపాడు వెడల్పు చేశాకే రాయలసీమకు నీళ్ళు వస్తున్నాయి. కౌలు రైతులకు కూడా భరోసా ఇస్తూ న్యాయం చేసిన ప్రభుత్వం వైఎస్సార్సీపీ. కౌలు రైతులకు కార్డు ఉండి, ప్రభుత్వ సాయం అందక పోయినట్లు నిరూపిస్తే నువ్వు ఏం చెబితే అది చేస్తాం.. నిరూపించేందుకు సిద్ధమా అంటూ అని పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎం అంజాద్ భాషా సవాల్ విసిరారు. -
రెప్పపాటులో ప్రమాదం.. వివాహ వేడుకకు వెళ్తుండగా..
సాక్షి, చింతకొమ్మదిన్నె (కడప): కడప నగర శివార్లలోని రింగురోడ్డుపై ఉన్న పబ్బాపురం గ్రామ సమీపంలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కడప డీఎస్పీ బీవీ శివారెడ్డి తెలిపిన సమాచారం మేరకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ప్రాజెక్టు డైరెక్టర్ రామమోహన్ రెడ్డితో పాటు ఆయన భార్య నళిని దేవి, మెప్మా సీఈఓ సుబ్బారెడ్డి, డ్రైవర్ వెంకట రమణారెడ్డి, ఏఓ పి.సురేష్ రెడ్డిలు కడప నగరంలోని యర్రముక్కపల్లి నుంచి పులివెందులకు ఎతియోస్ కారులో వివాహ వేడుకకు బయలుదేరారు. పబ్బాపురం సమీపంలోని వంతెనపై ముందు వెళుతున్న లారీని ఓవర్ టేక్ చేస్తుండగా లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపి లారీని కారుపైకి రానివ్వడంతో కారు వంతెనకు ఉన్న రక్షణ గోడల మధ్య ఇరుక్కుని ధ్వంసం అయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు వ్యక్తులు ఇరుక్కు పోవడంతో వారిని వెలికి తీసేందుకు పోలీసులతో పాటు, ఫైర్ సిబ్బంది, ఆ మార్గంలో వెళుతున్న ప్రయాణికులు తీవ్రంగా శ్రమించి బయటకు తీశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ నళిని దేవి(42) మృతి చెందారు. ఆమె అన్నమయ్య జిల్లా పీలేరులోని గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఈమెకు భర్త రామమోహన్‌రెడ్డితో పాటు కుమారుడు ఉదయ్ కుమార్‌రెడ్డి, కుమార్తె మహిజలు ఉన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీకేదిన్నె ఎస్ఐ భూమా అరుణ్‌రెడ్డి తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలాన్ని చింతకొమ్మదిన్నె, కడప తహసీల్దార్లు గంగయ్య, శివరామిరెడ్డిలు పరిశీలించారు. భార్య చనిపోయిన విషయం తెలియకుండానే.. కడప కార్పొరేషన్:రామమోహన్‌రెడ్డి తలకు బలమైన గాయాలు కావడంతో పాటు, కుడికన్ను దెబ్బతిని మూసుకుపోయింది. కాలు కూడా విరిగింది. ప్రమాదంలో గాయపడిన ఆయనకు రిమ్స్‌లో ఎంఆర్ఐ స్కాన్ చేసి నడుం దగ్గర గాయాలు ఉండటంతో వైద్యులు హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించారు. భార్య నళిని మరణించిందనే విషయం తెలియకుండానే ఆయనను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ సిటీ న్యూరో కేర్ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో మిగిలిన ముగ్గురిలో కారు డ్రైవర్ కె. వెంకట రమణారెడ్డి రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఇతనికి రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఇతను కడప నగరం బాలాజీనగర్‌లో నివాసం ఉంటున్నాడు. సురేష్‌రెడ్డి, సుబ్బారెడ్డిలను తిరుపతి ఆస్పత్రికి తీసుకెళ్లారు. శ్రమించిన పోలీసులు, రెస్క్యూ టీం ప్రమాద విషయాన్ని తెలుసుకున్న సీకేదిన్నె పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని కారులో ఇరుక్కున్న వారిని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. అయినా ఫలితం లేకపోవడంతో, వెంటనే డీఎఫ్ఓ రాం ప్రకాష్‌కు సమాచారం అందించారు. ఆయన వెంటనే తమ సిబ్బందితో అక్కడికి చేరుకుని హైడ్రాలిక్ యంత్రాలతో పాటు, జేసీబీని ఉపయోగించి కారులో ఇరుక్కున్న వారిని బయటకు తీశారు. రిమ్స్‌లో మిన్నంటిన రోదనలు కడప అర్బన్: రోడ్డు ప్రమాదంలో మెప్మా పీడీ రామ్మోహన్‌రెడ్డి సతీమణి నళినీదేవి మృతి చెందారన్న విషయం తెలుసుకుని వారి బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, వేంపల్లి, చక్రాయపేట మండలాలకు చెందిన వారంతా తరలివచ్చారు. క్యాజువాలిటీ, మార్చురీ వద్ద వారి రోదనలు మిన్నంటాయి. క్షతగాత్రులను పరామర్శించిన నగర పాలక కమిషనర్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన మెప్మా పీడీ రామమోహన్‌రెడ్డి, మెప్మా సీఈఓ సుబ్బారెడ్డి, డ్రైవర్ వెంకట రమణారెడ్డితో పాటు ఏఓ పి.సురేష్ రెడ్డిలను కడప నగర పాలక సంస్థ కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్ పరామర్శించారు. అలాగే ప్రమాదంలో మృతి చెందిన నళిని దేవి మృతదేహానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. కొండావాండ్లపల్లెలో విషాద ఛాయలు రామాపురం: కడప సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మెప్మా పీడీ రామ్మోహన్ రెడ్డి సతీమణి నళినిదేవి మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే కొండావాండ్లపల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ గ్రామం ఆమె పుట్టిన ఊరు కావడంతో పాటు లక్కిరెడ్డిపల్లె వెలుగు గురుకుల పాఠశాలలో సుదీర్ఘ కాలంపాటు ఆమె ఉపాధ్యాయురాలిగా పని చేశారు. ఈ విధంగా ఆమె అందరికీ సుపరిచితురాలు కావడంతో ఆమె మరణ వార్త తెలియగానే విషాదంలో మునిగిపోయారు. -
YSR Kadapa: రిజిస్ట్రేషన్లపై నిఘా నేత్రం
సాక్షి, కడప కోటిరెడ్డిసర్కిల్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత మూడేళ్లుగా అవినీతి రహిత పాలన చేస్తున్నారు. నాడు ప్రతిపక్ష నేతగా చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజలకు నవరత్నాల పథకాల్లో భాగంగా ఇంటి వద్దకే సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు. అవినీతికి అడ్డాగా ఉన్న శాఖల్లో ఒకటైన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌లో భూములు, స్థలాల క్రయ విక్రయదారుల నుంచి అధికారులతోపాటు దస్తావేజు లేఖర్లు వేలల్లో లంచాలు వసూలు చేసి వారి జేబులను ఖాళీ చేసేవారు. దీంతో ఆ శాఖలో అవినీతికి చెక్ పెట్టేందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆ శాఖ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలో కెమెరాల ఏర్పాటు వైఎస్సార్ జిల్లాలో కడప అర్బన్, కడప రూరల్, కడప చిట్స్, సిద్దవటం, బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, వేంపల్లె, కమలాపురం, దువ్వూరు, అన్నమయ్య జిల్లాలో చిట్వేలి, పుల్లంపేట, రాజంపేట, రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, సుండుపల్లె, మదనపల్లె, పీలేరు, బి.కొత్తకోట, కలికిరి, వాయల్పాడు, తంబళ్లపల్లెలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. మొత్తం 24 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీంతో కార్యాలయాలకు ప్రతిరోజు వచ్చి వెళ్లే వారిని పరిశీలించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా అవినీతికి చెక్ పెట్టేందుకు అవకాశం ఉంటుంది. చదవండి: (ఆర్ఎంపీల చేతిలో అస్త్రాలివే.. ఇష్టమొచ్చినట్లు వాడితే అంతే సంగతులు) వెబ్సైట్లో దస్తావేజు నమూనా స్థిరాస్తుల కొనుగోలు వ్యవహారంలో క్రయ విక్రయదారులు ఎక్కువగా దస్తావేజుల లేఖర్లను ఆశ్రయించడంతో పదుల సంఖ్యలో దస్తావేజు లేఖర్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ తిరిగేవారు. వారితోపాటు కొంతమంది రిజిస్ట్రేషన్ సిబ్బంది కాకుండా బినామీలు కార్యాలయాలు తెరిచి తమ వారితో నిర్వహిస్తున్నారు. దీంతో దస్తావేజుల తయారీ సమయంలో లేఖర్లు చెప్పిందే వేదంగా అక్కడి వ్యవహారాలు నడిచేవి. క్రయ విక్రయదారులను లేఖర్ల బాధ నుంచి తప్పించడానికి రాష్ట్ర వ్యాప్తంగా నమూనా దస్తావేజులను ఆ శాఖ వెబ్సైట్లో పొందుపరిచారు. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు స్థిరాస్తి, రిజిస్ట్రేషన్ ప్రక్రియ సమయంలో ప్రజలు లంచాల బారిన పడకుండా వారి సొంత గ్రామాల్లో వార్డుల పరి«ధిలోనే స్థిరాస్తులకు సంబంధించి రిజిస్ట్రేషన్లు జరిగేలా ప్రభుత్వం గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించింది. ఇప్పటికే ఈ ప్రక్రియకు సంబంధించి సచివాలయ సిబ్బందికి శిక్షణ కూడా పూర్తి చేసుకున్నారు. అవినీతిపై ఫిర్యాదు చేయవచ్చు వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలో రిజిస్ట్రేషన్లకు సంబంధించి అధికారులు, సిబ్బంది తీరుపై ఏవైనా ఫిర్యాదులు ఉంటే నేరుగా ఫోన్ చేసి సమాచారం అందించవచ్చు. లంచాలపై ఫిర్యాదు చేయాలనుకుంటే 14400 నంబరుకుగానీ, జిల్లా రిజిస్ట్రార్‌కుగానీ నేరుగా సమాచారం అందించవచ్చు. ఫిర్యాదులపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. – బి.శివరాం, డీఐజీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ, కడప 14400 నంబరుతో ఫ్లెక్సీల ఏర్పాటు అవినీతికి అడ్డుకట్ట వేసేలా, అలాగే లంచగొండితనంపై ఫిర్యాదు చేసేందుకు ప్రభుత్వం తీసుకు వచ్చిన టోల్ ఫ్రీ నంబరు 14400పై ప్రజ లకు అవగాహన కలిగేలా వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలోని 24 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. -
ఆ వైద్యుడు పేదల కంటి వెలుగు.. వందల మందికి ఉచిత ఆపరేషన్లు
సాక్షి, కడప సెవెన్‌రోడ్స్: గోరంత సాయం చేసి కొండంత ప్రచారం పొందాలనుకునేవారు చాలామంది. తమను తాము ప్రముఖ సంఘ సేవకులుగా చెప్పుకునే ఈ కోవకు చెందిన వారిని నిత్యం చూస్తుంటాం. కానీ అందుకు భిన్నంగా నిస్వార్థ సేవలు అందిస్తూ కూడా పబ్లిసిటీకి ఇష్టపడని వ్యక్తులు సైతం ఉంటారంటే ఒకింత ఆశ్చర్యమేస్తుంది. రెండు దశాబ్దాలకు పైబడి పేదలకు ఉచిత వైద్య పరీక్షలు, ఆపరేషన్లు నిర్వహిస్తున్న కడప నగరానికి చెందిన ప్రముఖ కంటి వైద్యులు గగ్గుటూరు ప్రదీప్‌కుమార్ ఇందుకు నిదర్శనం. కడప నగరం రమేష్ థియేటర్ ఎదురు వీధిలో డాక్టర్ ప్రదీప్ కుమార్ తన తండ్రిపేరిట శ్రీ గగ్గుటూరు పిచ్చయ్య నేత్ర వైద్యశాలను చాలా ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. తన ఆస్పత్రికి వచ్చే రోగులకు ఎంతో ఓపికగా కంటి పరీక్షలు నిర్వహిస్తూ అవసరమైన సేవలు అందిస్తుంటారు. 20 ఏళ్లుగా ఉచిత సేవలు పేదలకు వారంలో ఒకరోజు ఉచిత వైద్య పరీక్షలు, అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు నిర్వహించాలని ఆయన నిర్ణయించుకున్నారు. అలా 2001 నుంచి ప్రతి ఆదివారం ఉచిత కంటి పరీక్షలు, వైద్యం అందించేవారు. మాజీమంత్రి బిజివేముల వీరారెడ్డి అల్లుడు డాక్టర్ రవికుమార్‌రెడ్డి క్లాస్మేట్. దీంతో ప్రతి ఆదివారం బద్వేలులోని వీరారెడ్డి ఆస్పత్రికి వెళ్లి ఉచిత కంటి పరీక్షలతోపాటు అవసరమైన వారికి ఆపరేషన్లు చేసేవారు. ఇలా 19 సంవత్సరాలు అక్కడ సేవలు అందించారు. ఇప్పుడు ప్రతి శనివారం కడప నగరం ఎర్రముక్కపల్లెలోని తన ఇంటి వద్ద ఉచిత పరీక్షలు చేస్తున్నారు. ప్రారంభంలో ఉచిత ఆపరేషన్లు చేశారు. అయితే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వద్ద అనుమతులు పెండింగ్‌లో ఉన్నందున ప్రస్తుతానికి ఆపరేషన్లు నిర్వహించడం లేదు. కంటి పరీక్షలు నిర్వహించి ఆపరేషన్లు అవసరమైతే ఇతర వైద్యుల వద్దకు పంపుతున్నారు. ప్రతి శనివారం ఉచిత క్యాంపునకు 60–90 మంది పేషంట్లు వస్తుంటారు. కడప నగరంతోపాటు కమలాపురం, మైదుకూరు, ఎర్రగుంట్ల, గుత్తి, బ్రహ్మంగారిమఠం ప్రాంతాల నుంచి రోగులు వస్తారు. గతంలో బద్వేలులో పనిచేయడం వల్ల ఆ ప్రాంతం వారు ఎక్కువ వస్తారు. ఉదయం 7 నుంచి 12 గంటల వరకు అవసరమైతే మరికొంత సమయాన్ని ఉచిత సేవలకు వినియోగిస్తున్నారు. చదవండి: (ఫలించిన ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి కృషి.. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు) సామాజిక బాధ్యతగా భావించాను నేను పుట్టి పెరిగింది కడప నగరం ఎర్రముక్కపల్లె. వైద్య పట్టా పుచ్చుకున్నాక మా ఇంటి చుట్టుపక్కల ఉన్న పేదలకు ఉచిత పరీక్షలు, ఆపరేషన్లు నిర్వహించడం బాధ్యతగా భావించాను. ఇప్పుడు కడపకు చెందిన వారేకాకుండా ఇతర ప్రాంతాల వారు కూడా వస్తున్నారు. శుక్లాలు, అద్దాల చెకప్, గ్లాకోమా తదితర కంటి పరీక్షలు నిర్వహిస్తాను. – డాక్టర్ ప్రదీప్‌కుమార్, కంటి వైద్య నిపుణులు, కడప పేదలకు ఎంతో మేలు ఇప్పుడున్న పరిస్థితుల్లో వైద్యం ఖరీదై పోయింది. డబ్బున్న వారికే వై ద్యం అన్నట్లు తయారైంది. గతంలో ఒకటి లేదా రెండు రూపాయల నామమాత్రపు ఫీజు తీసుకునే వైద్యులను చూశాను. ఇప్పుడు డాక్టర్ ప్రదీప్‌కుమార్ వారంలో పూర్తిగా ఒకరోజు ఉచిత సేవలు అందించడం పేదలకు ఎంతో మేలు చేసే అంశం. – సీఆర్వీ ప్రసాద్‌రావు, నాగరాజుపేట, కడప -
వైఎస్ భారతికి చిత్రపటం బహూకరణ
సాక్షి, కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి.. సాక్షి దినపత్రిక, టీవీ, భారతి గ్రూప్ చైర్పర్సన్ వైఎస్ భారతికి ఆమె చిత్రాన్ని ప్రొద్దుటూరుకు చెందిన సేవ్‌గర్ల్ చైల్డ్ ప్రాజెక్టు అధ్యక్షుడు తుపాకుల రామాంజనేయరెడ్డి అందించారు. గురువారం పులివెందులలో వైఎస్ భారతిని రామాంజనేయరెడ్డి కలిశారు. సేవ్ గర్ల్ చైల్డ్ ప్రాజెక్టులో భాగంగా తాము చేపట్టిన చైతన్య కార్యక్రమాల గురించి వివరించారు. కార్యక్రమంలో ఆర్టిస్టు కుమారి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. చదవండి: (YSR Kadapa: వైఎస్ విజయమ్మ, షర్మిలకు ఘన స్వాగతం) -
YSR Kadapa: వైఎస్ విజయమ్మ, షర్మిలకు ఘన స్వాగతం
సాక్షి, కడప: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని గురువారం కడప ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, షర్మిలకు ఘన స్వాగతం లభించింది. శుక్రవారం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించడంతోపాటు ప్రత్యేక ప్రార్థనల్లో వీరు పాల్గొంటారు. వీరికి జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి, కడప నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డి సాదర స్వాగతం పలికారు. కొంత మంది అభిమానులు వారితో సెల్ఫీలు దిగారు. అనంతరం గజమాలతో సత్కరించారు. తరువాత వారు రోడ్డు మార్గాన ఇడుపులపాయకు బయలుదేరి వెళ్లారు. ఇడుపులపాయకు చేరుకున్న వైఎస్ జగన్, కుటుంబ సభ్యులు వేంపల్లె : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, తల్లి వైఎస్ విజయమ్మ, చెల్లెలు షర్మిల సాయంత్రం ఇడుపులపాయకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఇడుపులపాయ ఎస్టేట్ ఆవరణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చదవండి: (వైఎస్సార్సీపీ శ్రేణులకు సీఎం జగన్ ఆప్యాయ పలకరింపు) -
వైఎస్సార్ జిల్లా: అభివృద్ధి పనులకు అంకురం (ఫోటోలు)
-
వేంపల్లి: రూ. 40 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు శంఖు స్థాపన చేసిన సీఎం జగన్
-
గొప్పగా చదవాలి, ప్రపంచంతో పోటీ పడాలి..ఆల్ ది వెరీ బెస్ట్: సీఎం వైఎస్ జగన్
-
వేంపల్లి పిల్లలకు ఆల్‌ది వెరీ బెస్ట్: సీఎం జగన్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లా పర్యటనలో భాగంగా గురువారం సాయంత్రం వేంపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా.. రాష్ట్రంలోనే మోడల్ పాఠశాల గుర్తింపు పొందిన వేంపల్లి జెడ్పీ స్కూల్‌కు వెళ్లి.. అక్కడి పిల్లలతో ముఖాముఖి నిర్వహించారు. రూ. 15 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వేంపల్లి జెడ్పీ పాఠశాలను సీఎం జగన్ ప్రారంభించారు. నాడు-నేడులో భాగంగా.. స్కూల్ రూపురేఖలు గతంలో ఎలా ఉండేవో? ఇప్పుడు ఎలా మారాయో.. స్వయంగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు చూపించారు సీఎం జగన్. అంతేకాదు పిల్లలందరూ బాగా చదవాలని కోరుకుంటూ ఆల్‌ది వెరీ బెస్ట్ తెలియజేశారు. ‘అందరూ బాగా చదవాలి. ఈరోజు మీరు వేసే అడుగులు.. పెద్ద పెద్ద స్కూల్స్‌లో చదివే పిల్లల చదువులకు ఏమాత్రం తీసిపోకూడదు. గొప్పగా చదవాలి. ప్రపంచంతో పోటీ పడాలి’ అని కోరుకుంటూ మరోసారి ఆల్ ది వెరీ బెస్ట్ తెలియజేశారు. వైఎస్సార్ పర్యటనలో భాగంగా.. వేంపల్లిలో బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలను సీఎం జగన్ ప్రారంభించారు. దాదాపు రూ.40 కోట్ల వ్యయంతో కూడిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారాయన. -
విత్తన్నం నుంచి విక్రయం వరకూ ప్రభుత్వమే..
-
ప్రకృతి వ్యవసాయం గ్రామ స్థాయి నుంచి శిక్షణ: సీఎం వైఎస్ జగన్
-
ప్రకృతి వ్యవసాయంలో రైతులకు అండగా ఉంటాం: సీఎం జగన్
సాక్షి, వైఎస్సార్: ప్రకృతి వ్యవసాయమే ఈరోజుల్లో శ్రేయస్కరమని.. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం అన్ని విధాల రైతులకు ప్రోత్సాహం అందిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్ జిల్లా పర్యటనలో భాగంగా.. గురువారం మధ్యాహ్నాం పులివెందులలో ఏపీకార్ల్ వద్ద న్యూటెక్ బయోసైన్సెస్‌కు శంకుస్థాపన చేసి ఆయన ప్రసంగించారు. ‘రసాయనాలతో కూడిన ఆహారం వల్ల ఎన్నో రకాల క్యాన్సర్లు వస్తున్నాయి. ఆహార ఉత్పత్తుల్లో రసాయనాలను తగ్గించాలి. ప్రకృతి వ్యవసాయమే ఈ రోజుల్లో అన్నివిధాలా శ్రేయస్కరం. ఏపీలో ఆరు లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు గ్రామాలపై మరింత దృష్టిసారించాలి. గ్రామస్థాయి నుంచి శిక్షణ అవసరం. ప్రకృతి వ్యవసాయంపై రైతుల్లో అవగాహన పెంచాలి. ఆర్బీకేల ద్వారా అవసరమైన శిక్షణ అందిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయంపై అంతర్జాతీయ సంస్థలతో మన ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. రైతుల పెట్టుబడి వ్యయాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం తరపున పలు చర్యలు చేపడుతున్నాం. విత్తు నుంచి విక్రయం వరకూ ఆర్బీకేలు అండగా నిలుస్తున్నాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు పథకాలు అమలు చేస్తున్నాం’’ అని సీఎం జగన్ తెలియజేశారు. -
రచ్చ రచ్చ.. మైదుకూరు టీడీపీలో డీఎల్ ‘చిచ్చు’
సాక్షి ప్రతినిధి, కడప: రాబోయే ఎన్నికల్లో మైదుకూరు టీడీపీ టిక్కెట్ నాకంటే నాకంటూ మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పుట్టా సుధాకర్ యాదవ్‌లు పోటీపడి ప్రచారం చేస్తున్నారు. దీంతో పచ్చ పార్టీలో రచ్చ రోడ్డెక్కింది. పార్టీలో చేరకుండానే సీనియర్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి టీడీపీలో వర్గ రాజకీయాలకు ఆజ్యం పోశారు. ఔట్‌డేటెడ్ డీఎల్‌కు టీడీపీ టిక్కెట్ ఇచ్చే ప్రసక్తే లేదని, రాబోయే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని పుట్టా సుధాకర్ యాదవ్ వర్గం తేల్చి చెబుతోంది. దీంతో మైదుకూరు నియోజకవర్గంలో టీడీపీ రెండు వర్గాలుగా చీలిపోయింది. చదవండి: టీడీపీ నాయకుడి కొడుకు నిర్వాకం.. ‘రూ.40 లక్షలు తెస్తేనే కాపురం చేస్తా’ వచ్చే ఎన్నికల్లో మైదుకూరు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయమని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి విస్తృత ప్రచారం చేస్తున్నారు. జులై నెల నుంచి నియోజకవర్గం మొత్తం తిరిగి ప్రచారం చేయనున్నట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. దశాబ్దకాలంగా క్రీయాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న డీఎల్ ఇటీవలి కాలంలో అధికార పార్టీపై పనిగట్టుకుని విమర్శలకు దిగుతూ తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ మధ్యే ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లను డీఎల్ హైదరాబాదులో కలిశారు. తర్వాత నియోజకవర్గానికి వచ్చి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తన అనుయాయులతోపాటు మీడియాకు వెల్లడించారు. త్వరలోనే నియోజకవర్గంలో తిరుగుతానని చెప్పిన డీఎల్ అందుకోసం వేద పండితులను సంప్రదించి ముహూర్తం సైతం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈలోగా మైదుకూరు టీడీపీ అభ్యర్థిగా తనను ప్రకటించాలని టీడీపీ అధిష్టానంపై డీఎల్ ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇదే సందర్భంలో మైదుకూరులో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి తప్ప మిగిలిన వ్యక్తులు ఇప్పటివరకు గెలువలేదని చంద్రబాబు, లోకేష్‌లకు గణాంకాలతో డీఎల్ వివరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తనకే టిక్కెట్ ఇవ్వాలని, ఒకవేళ సుధాకర్ యాదవ్‌కు ఇచ్చినా గెలిచే ప్రసక్తే లేదని డీఎల్ తేల్చి చెప్పినట్లు సమాచారం. చంద్రబాబు ఎటూ తేల్చకపోవడంతో వెనుదిరిగి వచ్చిన ఆయన తనకే టిక్కెట్టు అంటూ మైదుకూరు నియోజకవర్గంలో ప్రచారం మొదలు పెట్టారు. డీఎల్‌ది మైండ్ గేమ్....టిక్కెట్ నాదే! రాబోయే ఎన్నికల్లోనూ మైదుకూరు టిక్కెట్ తనకేనని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పుట్టా సుధాకర్ యాదవ్ ధీమాగా ఉన్నారు. డీఎల్‌కు టీడీపీ టిక్కెట్ అన్న ప్రచారం నేపథ్యంలో ఆయన మూడు రోజుల కిందట పార్టీ అధినేత చంద్రబాబును కలిశారు. అనంతరం డీఎల్ మైండ్ గేమ్ మాటలు ఎవరూ నమ్మవద్దని నియోజకవర్గంలోని తన వర్గీయులకు తేల్చి చెప్పారు. సుధాకర్ యాదవ్ ఇన్నాళ్లు పార్టీని నమ్ముకుని ఆర్థికంగా నష్టపోయాడని, రెండుసార్లు ఓడిపోయాడన్న సానుభూతితోపాటు ఆర్థికంగా బలోపేతంగా ఉండడం ఆయనకు రాబోయే ఎన్నికల్లో కలిసి వస్తుందని ఆయన వర్గీయులు చెబుతున్నారు. బీసీ సామాజిక వర్గం మొత్తం సుధాకర్ యాదవ్‌కు అండగా నిలవనుందని వారు చెబుతున్నారు. ఇదే సమయంలో సుధాకర్‌యాదవ్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఓ వర్గం ఈ దఫా ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. మరోవైపు డీఎల్ చెప్పిన రెడ్డి సామాజిక వర్గ సెంటిమెంట్‌ను పదేపదే చంద్రబాబు, లోకేష్ చెవిలో వేస్తున్నట్లు తెలుస్తోంది. రచ్చకెక్కిన వర్గ విబేధాలు మైదుకూరు టీడీపీ టిక్కెట్ తనకేనంటూ డీఎల్ రవీంద్రారెడ్డి తెరపైకి రావడంతో పార్టీలో వర్గ విబేధాలు రచ్చకెక్కాయి. సుధాకర్‌యాదవ్‌ను వ్యతిరేకిస్తున్న కొన్ని వర్గాలు డీఎల్‌కు టిక్కెట్ అంటూ ప్రచారం చేస్తుండగా సుధాకర్‌యాదవ్‌కు టిక్కెట్ ఇ వ్వకపోతే పార్టీనే వీడుతామని ఆయన అనుచరవ ర్గం అంటున్నారు. ఒకవేళ డీఎల్‌కు టిక్కెట్టు ఇచ్చినా ఆయనను ఓడగొట్టడం ఖాయమని చెబుతున్నారు. మొత్తంగా మైదుకూరు టీడీపీ టిక్కెట్ ఎవరికి ఇచ్చినా ప్రత్యర్థి వర్గం సహకరించే పరిస్థితి లేదు. -
సీఎం జగన్ ఆశయం.. పార్టీ లక్ష్యం తప్పక నెరవేరుతాయి
సాక్షి, వైఎస్సార్: ప్రతి ఒక్కరూ ఉన్నతంగా చదవాలన్నది సీఎం జగన్ ఆశయమని, రాష్ట్రంలో నిరుద్యోగి ఉండకూడదన్నది వైఎస్సార్సీపీ లక్ష్యమని రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. జిల్లాలోని ప్రొద్దుటూరు సీబీఐటీలో శనివారం ఉదయం పార్టీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాను ఎంపీ విజయసాయిరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్య ప్రతి ఒక్కరి అవసరం. ఉద్యోగాల కోసం ప్రతీ ఒక్కరూ పోటీ పడుతున్న పరిస్థితుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరం. మహిళా సాధికారత కోసం సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. ఉద్యోగం పొందితేనే కుటుంబాలు ఆర్థికంగా ఎదుగుతాయి. రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుతుందని చెప్పారాయన. అలాగే.. ఇంటర్వ్యూలను ధైర్యంగా ఎదుర్కొవాలని, ఇప్పుడు రానంత మాత్రాన మళ్లీ అవకాశం ఉంటుందని, బాబ్ మేళా నిరంతర ప్రక్రియ అని విజయసాయిరెడ్డి యువతకు భరోసా ఇచ్చారు. జాబ్ మేళాలో వందకు పైగా కంపెనీలు పాల్గొనగా.. ఉద్యోగాల కోసం 13 వేలమంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో.. ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎంపీ అవినాష్‌రెడ్డి పాల్గొన్నారు. పార్టీ ఆధర్వ్యంలో నిర్వహిస్తున్న జాబ్ మేళాలకు అపూర్వ స్పందన లభిస్తోందని డిప్యూటీ సీఎం అమ్జాద్ బాషా పేర్కొనగా.. జగన్ ఆశయ సాధనకు అనుగుణంగా జాబ్ మేళా నిర్వహిస్తామని, నిరుద్యోగిరహిత లక్ష్య సాధన కోసం పార్టీ కృషి చేస్తుందని కడప ఎంపీ అవినాష్ రెడ్డి తెలిపారు. -
ఇద్దరితో పెళ్లి.. మరొకరితో సహజీవనం.. చివరకు..
వేంపల్లె: వేంపల్లె పట్టణం భరత్‌నగర్ వీధికి చెందిన షేక్ ఫర్హనా (28) అనే వివాహిత దారుణ హత్యకు గురైంది. మృతురాలి తల్లి షహారున్నీషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఫర్హనా 11ఏళ్ల క్రితం పట్టణ పరిధిలోని రాజీవ్ నగర్‌కాలనీకి చెందిన ప్రవీణ్‌తో ప్రేమ వివాహం చేసుకుంది. వీరిద్దరికి లతీఫ్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. అనంతరం జావీద్ ఉరఫ్ మహ్మద్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వీరిద్దరికి జహీన్ షే అనే కుమారుడు ఉన్నాడు. మూడేళ్ల క్రితం భర్త జావీద్ జీవనోపాధి కోసం కువైట్‌కు వెళ్లాడు. భర్త పట్టించుకోకపోవడంతో షేక్ బాష ఉరఫ్ ఇడ్లీ బాషతో పరిచయం ఏర్పడి సహజీవనం చేస్తుండేది. ఈ నేపథ్యంలో డబ్బుల విషయమై ఇడ్లీ బాషతో గొడవ జరిగేది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. చదవండి: (Hyderabad: స్పా ముసుగులో వ్యభిచారం, ఐదుగురి అరెస్టు) ఫర్హనాకు కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో ఇడ్లీ బాష బుధవారం రాత్రి ఆమె ఇంటికి వెళ్లి వాదనకు దిగాడు. గురువారం తెల్లవారుజామున ఇడ్లీ బాష ఫర్హనా గొంతు కోసి అతికిరాతకంగా చంపినట్లు పర్హనా తల్లి షేక్ షహారున్నీషా పోలీసులకు వివరించింది. అనంతరం ఫర్హనా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు, వేంపల్లె సీఐ సీతారామిరెడ్డి, ఎస్ఐ తిరుపాల్ నాయక్ పరిశీలించారు. షేక్ బాష ఉరఫ్ ఇడ్లీ బాషను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చదవండి: (Hyderabad: ఎవరికైనా చెబితే చంపేస్తా.!) -
కడపలో ‘జాతిరత్నాలు’ బ్యూటీ ఫరియా సందడి
Actress Faria Abdullah Visits YSR Kadapa: కడప నగరంలో జాతిరత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా సందడి చేసింది. గురువారం ఇక్కడి అల్మాస్‌పేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘వావ్ హీరో’ ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హజరై షో రూంను ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు స్థానికులు పెద్దఎత్తున తరలివచ్చారు. చదవండి: అల్లు అర్జున్‌పై కేసు, తప్పుదోవ పట్టించారంటూ పోలీసులకు ఫిర్యాదు డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మేయర్ సురేశ్ బాబు, ఎండీ నవీన్‌లో కలిసి ఆమె జ్యోతి ప్రజ్వలన చేసింది. అయితే షోరూం ప్రారంభోత్సవానికి వచ్చిన ఫరియా ఈ సందర్భంగా కడపలోని అమీన్ పీర్ దర్గాను దర్శించుకుంది. దర్గా సంపద్రాయం ప్రకారం ఫరియాకు దర్గా ముజావార్లు ఘనంగా స్వాగతం పిలికారు. దర్గా మాజర్ల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ఫరియా అనంతరం దర్గా విశిష్టతను అడిగి తెలుసుకుంది. -
పవన్ కల్యాణ్‌కి చురకలంటించిన కేవీపీ
సాక్షి, వైఎస్సార్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు విమర్శలు గుప్పించారు. జనసేన పవన్ కల్యాణ్‌కు చెందిన పార్టీ, కనుక జనసేన పొత్తుల గురించి మాట్లాడే అధికారం ఆయనకు ఉంటుందని అన్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్ళారని గుర్తు చేశారు. అయితే గతంలో ఆంధ్రప్రదేశ్‌కి పాచిపోయిన లడ్లు ఇచ్చారని విమర్శించి, నేడు అదే బీజేపీతో పొత్తులో ఉన్నాడని ధ్వజమెత్తారు. ‘బద్వేలు ఉప ఎన్నికల్లో పవన్ బీజేపీకి మద్దతిచ్చారు. ఇప్పుడేమో టీడీపీతో కూడా పొత్తు అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ఎవరితో పొత్తులు పెట్టుకుంటారో ఆయనకే అవగాహన లేదని’ వ్యంగాస్త్రాలు సంధించారు. పవన్‌ని విమర్శించేంత స్థాయి, మెచ్యూరిటీ తనకు లేదంటు చురకలంటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ముందుకు వెళ్తుందని తెలిపారు. చదవండి: ‘చంద్రబాబు ట్రాప్‌లో కోదండరాం, హరగోపాల్ ఎలా పడ్డారో, అర్థం కావడం లేదు’ -
ప్రకృతి సేద్యం విస్తరణకు ఏపీ ప్రభుత్వం చర్యలు
సాక్షి, కడప: రైతు శ్రేయస్సే పరమావధిగా, ప్రజల ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి సేద్యం విస్తరణకు చర్యలు తీసుకుంటోంది. రసాయనాలు వద్దు– ప్రకృతి సేద్యం ముద్దు అనే రీతిలో ప్రోత్సహిస్తూ, ప్రకృతిసాగులో సలహాలు, సూచనలు అందిస్తూ అధిక పెట్టుబడులు పొందేలా భరోసాగా నిలుస్తోంది. ఫలితంగా ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల సంఖ్య ఏటా పెరుగుతోంది. మొదట్లో వరి సాగుకే పరిమితం కాగా ప్రస్తుతం ఉద్యాన పంటలకూ ఈ విధానంలో సాగు విస్తరించింది. గతం కంటే మెరుగ్గా.. జిల్లా ప్రకృతి వ్యవసాయ అధికారులు గతం కంటే మిన్నగా ప్రకృతి సేద్యాన్ని ప్రజలకు, రైతులకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల ప్రకృతి వ్యవసాయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నీతి ఆయోగ్ సదస్సులో ప్రత్యేకించి ప్రసంగించడం తెలిసిందే. అంతేకాదు వైఎస్సార్‌జిల్లా నుంచి ముగ్గురు రైతులు నీతి ఆయోగ్‌లో అవార్డు అందుకున్నారు. ఇందులో మైదుకూరు మండలం టి. కొత్తపల్లెకు చెందిన రైతు శివరామయ్య, పెండ్లిమర్రికి చెందిన గంగిరెడ్డి, కలసపాడు మండలం బ్రహ్మణపల్లెకు చెందిన కోటేశ్వరరావు ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యతపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఖరీఫ్ సాగు లక్ష్యమిలా.. ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 68700 మంది రైతులకు సంబంధించి 78,310 ఎకరాల్లో వ్యవసాయ పంటలతోపాటు ఉద్యాన పంటలను సాగు లక్ష్యం పెట్టుకున్నారు. ఇందులో 23700 మంది రైతులకు సంబంధించి 27059 ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేయాలని నిర్ణయించారు. దీంతోపాటు 51,251 ఎకరాల్లో వ్యవసాయ పంటల సాగు లక్ష్యంగా ప్రణాళికలను సిద్ధం చేశారు. ఇందులో 28,650 మంది రైతులకు సంబంధించి 30920 ఎకరాల్లో వరి, 5720 మంది రైతులకు సంబంధించి 6920 ఎకరాల్లో వేరుశనగ పంటను, 4800 మంది రైతులకు సంబంధించి 6570 ఎకరాల్లో శనగ, మినుములు, 5830 మంది రైతులకు సంబంధించి 6850 ఎకరాల్లో కూరగాయలను సాగు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేసి వారికి కావా ల్సిన సూచనలు, సలహాలను ఇవ్వనున్నారు. కిచెన్ గార్డెన్స్‌పై ప్రత్యేక దృష్టి.. జిల్లా అధికారులు కేవలం రైతులతో ప్రకృతి సాగు చేయించి సరిపెట్టకుండా మహిళలను కూడా ప్రకృతి సాగు వాటి ఉపయోగాల వైపు మరల్చి మహిళా సంఘాల ద్వారా కిచెన్ గార్డెన్స్ ఏర్పాటు చేయిస్తున్నారు. తద్వారా ప్రతి మహిళా ఆకుకూరలు, కూరగాయలను ఎలాంటి రసాయనాలు, పురుగుమందులు లేకుండా పండించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇలా ఉమ్మడి జిల్లాలో కలుపుకుని 75 వేల దాకా కిచెన్గార్డెన్లను ఏర్పాటు చేశారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిన నాణ్యమైన కూరగాయలు, ఆకుకూరలు తినడంవల్ల మనకు కావాల్సిన మిటమిన్స్, మినరల్స్ అధికంగా లభించే అవకాశం ఉంది. లక్ష్యం అధిగమించేందుకు కృషి ఖరీఫ్ సీజన్లో 73310 ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటల సాగు లక్ష్యంగా ప్రణాళికలను సిద్ధం చేశాము. ఆ దిశగా సిబ్బందిని అప్రమత్తం చేశాము. ప్రకృతి వ్యవసాయ సాగులో రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా రైతులను అప్రమత్తం చేయనున్నాం. వీటి స్థానంలో ఘన జీవామృతం, జీవామృతాలను వాడే విధంగా రైతుల్లో చైతన్యాన్ని తీసుకుని వచ్చి లక్ష్య సాధనకు కృషి చేస్తాం. – రామకృష్ణమరాజు, డీపీఎం, ప్రకృతి వ్యవసాయం, వైఎస్సార్ జిల్లా. -
పాలనలో ప్రవీణ్ ముద్ర
సాక్షి, విజయవాడ: ప్రజా సమస్యలను సత్వరం ఎలా పరిష్కరించవచ్చో.. పారదర్శకంగా పని చేస్తే ఎలాంటి ఫలితాలొస్తాయో.. చేసి చూపించారాయన. మారువేషంలో వెళ్లి అక్రమాలు బట్టబయలు చేశారు. అర్ధరాత్రి ఆస్పత్రులు సందర్శించారు. ఏడాది పాలనలో విజయవాడ సబ్ కలెక్టర్‌గా యువ ఐఏఎస్ అధికారి జి.సూర్య సాయి ప్రవీణ్ చంద్ర పాలనలో తనదైన ముద్ర వేశారు. ప్రజల సమస్యలపై సత్వరమే స్పందించి, వాటి పరిష్కారానికి కృషి చేశారు. ప్రభుత్వాస్పత్రి ప్రక్షాళన.. విజయవాడ ప్రభుత్వాస్పత్రికి వచ్చే రోగులకు అందుతున్న వైద్య సేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేవారు. అర్ధరాత్రి ఆస్పత్రిని సందర్శించడం, ఉదయం 6 గంటలకు, రాత్రి 10 గంటలు ఇలా అన్ని వేళల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి వైద్య సేవల్లో పురోగతికి కృషి చేసారు. కోవిడ్ సమయంలో ఐసోలేషన్ వార్డుల్లోకి వెళ్లి, అక్కడ కోవిడ్ రోగులకు అందుతున్న సేవలను వారినే అడిగి తెలుసుకున్నారు. కొత్తగా సూపర్‌స్పెషాలిటీ విభాగాలు తీసుకు రావడం, పోస్టులు మంజూరు వంటి అంశాల్లో ఎంతో కృషి చేసారు. తన పాలనతో ప్రభుత్వాస్పత్రిని ప్రక్షాళన చేసారు. చదవండి: (పరిశ్రమలకు 'పవర్' ఫుల్) ఎరువుల అక్రమాలకు అడ్డుకట్ట... విజయవాడ సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలినాళల్లో మారువేషంలో వెళ్లి ఎరువుల అక్రమాలను వెలుగులోకి తెచ్చారు. నాటి కలెక్టర్ నివాస్ ఆదేశాలతో కైకలూరులో రైతు వేషంలో బైక్‌పై ఎరువుల దుకాణానికి వెళ్లి , వారి అక్రమాలను బట్టబయలు చేశారు. స్పందన అర్జీలకు సత్వర పరిష్కారం.. ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో తనకు వచ్చే అర్జీలపై సత్వరమే స్పందించి చర్యలు తీసుకునే వారు. దీంతో సబ్‌కలెక్టర్ ప్రవీణ్‌చంద్‌కు అర్జీ ఇస్తే సమస్య పరిష్కారం అవుతుందని భావించిన ప్రజలు పెద్ద ఎత్తున స్పందనలో వినతులు ఇచ్చేందుకు వచ్చేవారు. ప్రస్తుతం సబ్ కలెక్టర్ ప్రవీణ్‌చంద్ వైఎస్సార్ కడప నగరపాలక సంస్థ కమిషనర్‌గా బదిలీపై వెళ్లనుండటంతో ఆయన చేసిన సేవలను పలువురు కొనియాడుతున్నారు. -
జనాన్ని బాదింది మీరు కాదా..బాబూ!
సాక్షి ప్రతినిధి, కడప : తన పాలనలో రాష్ట్ర ప్రజలను అన్ని రకాలుగా బాది అష్టకష్టాలపాలు చేసింది చంద్రబాబు. అలాంటి ఆయన తగుదునమ్మా అని ఇప్పుడు జనరంజక పాలన సాగిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై బాదుడే బాదుడు పేరుతో దుమ్మెత్తి పోయడానికి జిల్లాకు రావడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు తీరుపై అటు విశ్లేషకులు, పరిశీలకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ►చంద్రబాబు పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రకృతి సైతం కనికరించలేదు. ప్రభుత్వం ఏమాత్రం చేయూతనివ్వకపోవడంతో రైతాంగం దుర్భర పరిస్థితులు ఎదుర్కొంది. టీడీపీ హయాంలో జిల్లాలో సంక్షేమంతోపాటు అభివృద్ధిని అటకెక్కించారు. ►జీఎన్ఎస్ఎస్, తెలుగుగంగ ప్రాజెక్టుల పరిధిలోని సాగునీటి వనరుల పెండింగ్ పనులను ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో సాగుకు చుక్కనీరు అందని పరిస్థితి. రైతులు, వ్యవసాయ కూలీలు సైతం పనులు దొరక్క వలసలు వెళ్లాల్సి వచ్చింది. తాగునీటికి జిల్లా ప్రజలు అల్లాడి పోయారు. పాలనా కాలంలో మిన్నకుండిపోయి తీరా ఎన్నికల సమయంలో స్టీల్ ప్లాంటు తెస్తున్నామని ప్రగల్బాలు పలికారు తప్ప దాని ఊసే లేకుండా పోయింది. చదవండి: (బిడ్డ పుట్టిన తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగి నట్టేట ముంచాడు) ►బాబు హయాంలో జిల్లాలో ఒక్క పరిశ్రమ రాలేదు...ఒక్క ఉద్యోగం లేదు....ఉపాధి లేదు. అర్హులైన వారికి ఒక్క పక్కా గృహం కూడా నిర్మించిన పాపాన పోలేదు. జాతీయ రహదారులు, జిల్లా రహదారుల పనులను గాలికొదిలారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు మరింత దూరమయ్యాయి. ఆస్పత్రుల అభివృద్ధి లేదు. వైఎస్సార్ నెలకొల్పిన ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. ఇక పాఠశాలల అభివృద్ధిని పట్టించుకోలేదు. ముఖ్యంగా అన్నదాతల కష్టాలను గురించి ఏనాడు ఆలోచించలేదు. సబ్సిడీ ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు లేవు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. పెట్టుబడి సాయం ఇచ్చింది లేదు. మొత్తంగా వివక్షతో వైఎస్సార్ జిల్లా అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలారు. జిల్లాలో టీడీపీ భూస్థాపితం ►ప్రజలు టీడీపీని జిల్లాలో భూస్థాపితం చేశారు. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంటు స్థానాల్లో ఆ పార్టీకి ఒక్కస్థానం కూడా దక్కలేదు. పైపెచ్చు చాలాచోట్ల డిపాజిట్లు కోల్పోయింది. ఆ తర్వాత జరిగిన సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ తదితర స్థానిక ఎన్నికల్లోనూ టీడీపీకి నామమాత్రపు స్థానాలు కూడా దక్కలేదు. ప్రజల ఛీత్కారంతోనే ప్రతిపక్ష పార్టీకి ఈ పరిస్థితి ఎదురైందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ►అధికారంలో ఉన్నన్నాళ్లు ఏనాడూ జిల్లాను, జిల్లా అభివృద్ధిని చంద్రబాబు పట్టించుకోలేదు. అధికారం కోల్పోయాక ఇప్పుడు ఉనికి కోసం జిల్లాను ఉద్దరించినట్లుగా.. ప్రజారంజక పాలన సాగిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడమే లక్ష్యంగా జిల్లా పర్యటనకు రావడంపై జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేడు చంద్రబాబు రాక కడప రూరల్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ నాయకులు చినరాజప్ప మంగళవారం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం కడపలోని డీఎన్ఆర్ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు బుధవారం జిల్లా పర్యటన సందర్భంగా కడప, కమలాపురంలో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. పార్టీ శ్రేణులు చంద్రబాబు పర్యటనను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి, లింగారెడ్డి ,పుట్టా సుధాకర్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: (SPSR Nellore District: నీరు చెట్టు.. కనిపిస్తే ఒట్టు) సభా స్థలిని పరిశీలించిన చినరాజప్ప కమలాపురం: కమలాపురం పట్టణంలోని గ్రామ చావిడి వద్ద బుధవారం చంద్రబాబు నాయుడి బహిరంగ సభ జరగనుంది. ఈ మేరకు సభా స్థలిని టీడీపీ నేత, మాజీ హోం మంత్రి చినరాజప్ప పరిశీలించారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డితో చర్చించారు. -
శీఘ్రమేవ కల్యాణ ప్రాప్తిరస్తు.. జూన్ దాటితే మళ్లీ డిసెంబరే
జిల్లాలో ఎక్కడ చూసినా కల్యాణ మండపాలు పెళ్లి సందడితో కళకళలాడుతున్నాయి. సుముహూర్తాలకు ఇక కొద్ది రోజులే గడువు ఉండటంతో శుభకార్యానికి ఆలస్యమెందుకు అంటూ తల్లిదండ్రులు తమ పిల్లలకు వివాహాలు జరిపించేందుకు సిద్ధమవుతున్నారు. బంగారు, వస్త్ర దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. కడప కల్చరల్ : శీఘ్రమేవ కల్యాణ ప్రాప్తిరస్తు...అంటున్నారు పురోహితులు. అవును మరి...వచ్చేనెల (జూన్) దాటితే తిరిగి డిసెంబరు వరకు వేచి చూడాల్సిందే. లేదా వచ్చే సంవత్సరమే. ఈ ముహూర్తాలు దాటితే ఐదు నెలలపాటు ఉండవు. అందుకే తల్లిదండ్రులు హడావుడి పడుతున్నారు. ఇప్పుడు కాకపోతే మళ్లీ వచ్చే సంవత్సరం వరకు ఎదురుచూడక తప్పదు గనుక ఉన్నంతలో ఈ ముహూర్తాలకే తమ బిడ్డల పెళ్లిళ్లు కానిచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ముమూర్తాలు తక్కువ కావడం...ఉన్నా...కరోనా కారణంగా పెళ్లిళ్లు జరగకపోవడం, నిబంధనల కారణంగా వివాహాల సంఖ్య తగ్గడం, వాయిదాపడటంతో రెండేళ్లుగా పెళ్లి సందడి పూర్తి స్థాయిలో కనిపించడం లేదు. కరోనా ఉధృతి తగ్గడం, ముహూర్తాలు విరివిగా ఉండడంతో ఈ సంవత్సరం ప్రారంభం నుంచే పెళ్లి బాజాలు మార్మోగాయి. రికార్డు స్థాయిలో పెళ్లిళ్లు జరిగాయి.. జరుగుతున్నాయి.. ఈ నెల (మే) తర్వాత జూన్ మినహా (ఆగస్టులో కొద్దిగా) డిసెంబరు వరకు ముహూర్తాలు లేవు. ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్న వారు ఆరు నెలలపాటు ఎదురు చూడటం మంచిది కాదన్న ఆలోచనలు తల్లిదండ్రుల్లో ఒత్తిడిని పెంచుతున్నాయి. పైగా ప్రస్తుతం ఇతర దేశాల్లో విజృంభిస్తున్న కరోనా ఈ మధ్య కాలంలో మళ్లీ మన వైపు చూస్తుందేమోనన్న భయం కూడా తల్లిదండ్రుల్లో ఆందోళనను పెంచుతోంది. ఆ.. ఏం కాదు...నిదానమే ప్రధానమని భావిస్తున్న వారు కూడా లేకపోలేదు. కానీ నానాటికి పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకుని పలుచోట్ల డిసెంబరు వరకు కల్యాణ మండపాలు రిజర్వు అయిపోయాయి. డెకరేషన్, కేటరింగ్ తదితరాలకు కూడా టోకన్ అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు. గండం దాటుకుంటాం ఐదు నెలలుగా జరుగుతున్న వివాహాల వల్ల జిల్లాలో వ్యాపారాలు జోరందుకున్నాయి. కూరగాయల నుంచి కిరాణా సరుకుల దాక ధరలు రోజురోజుకు పెరుగుతున్నా పెళ్లిళ్ల కారణంగా డిమాండ్ తగ్గడం లేదు. వరుసగా రెండేళ్లపాటు దారుణంగా దెబ్బతిన్న వ్యాపారాలు ఈ వివాహాల ద్వారా కోలుకునే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే రూ. 1000 కోట్లకు పైగా వ్యాపారాలు ఈ వివాహాల ద్వారానే జరిగాయి. దీంతో వ్యాపారులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. భయపెడుతున్న బంగారం రోజురోజుకు పెరుగుతున్న బంగారం ధరలను దృష్టిలో పెట్టుకుని పిల్లల పెళ్లిళ్లకు సిద్ధమైన తల్లిదండ్రులు అవసరమైన బంగారం కొంటున్నారు. ప్రస్తుత ధరల్లో తులం బంగారంతో ఆభరణం చేయించాలంటే రూ. 55–60 వేలు వెచ్చించాల్సి వస్తోంది. కానీ వివాహాలలో బంగారం ప్రధానపాత్ర పోషిస్తుండడంతో దాన్ని కొనేందుకు తల్లిదండ్రులకు తప్పడం లేదు. దీంతో ఇటీవల బంగారం ధర పెరిగినా కొనుగోలు కూడా పెరుగుతోందని వ్యాపారులు తెలుపుతున్నారు. రికార్డు స్థాయిలో గత ఐదేళ్లలో ఏ సంవత్సరం జరగనన్ని వివాహాలు ఈ సంవత్సరంలో జరుగుతున్నాయి. ముహూర్తాలు కూడా ఈ ఐదు నెలలపాటు వరుసగా ఉండడంతో వివాహాలకు సంబంధించిన వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సంవత్సరం మే నెల 18 వరకు మొత్తం 37 ముహూర్తాలు ఉండగా, జిల్లా వ్యాప్తంగా చిన్న, ఓ మోస్తరు వివాహాలు ఇప్పటివరకు ఐదు వేలు జరగ్గా, భారీ వివాహాలు దాదాపు 1000 వరకు జరిగినట్లు ఆయా వర్గాల సమాచారం. వీటి ద్వారా ఇప్పటివరకు దాదాపు రూ. 1000 కోట్ల వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది. ఇక మే 18 నుంచి డిసెంబరు చివరి ముహూర్తంలోపుగా జిల్లా వ్యాప్తంగా మరో మూడు వేల చిన్న, పెద్ద వివాహాలు జరగనున్నట్లు తెలుస్తోంది. వీటి ద్వారా మరో రూ. 150 కోట్ల మేర వ్యాపారం జరుగుతుందని వ్యాపార వర్గాల అంచనా. -
చంద్రబాబు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు.. అందుకే ఇలా: గడికోట శ్రీకాంత్ రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: చంద్రబాబు దిగజారి ఉన్మాద భాష మాట్లాడుతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. కుప్పం పర్యటనలో జనం లేకపోవడంతో చంద్రబాబుకు ఫ్రస్ట్రేషన్‌లోకి వెళ్లిపోతున్నారని ఎద్దేవా చేశారు. తన తాబేదార్లకు మించి దిగజారుడు భాషలో ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్దం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం ప్రజలకు అందుతుంటే చంద్రబాబుకు ఆక్రోశం వస్తోందని, గడప గడపకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమన్ని వివరిస్తుంటే తట్టుకోలేక అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కుల, మత, ప్రాంత భేదం లేకుండా అందరికీ సంక్షేమం అందిస్తున్నాం. చంద్రబాబులాగా విడగొట్టి సంక్షేమాన్ని నిర్వీర్యం చేయలేదు. నువ్వు చేయలేనిది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తుంటే ఓర్వలేకపోతున్నారు. నారాయణ సంస్థలు నారాయణవి కాదంటే ప్రజలు విస్తుపోతున్నారు. తప్పు చేస్తున్న వారిని శిక్షిస్తే కక్ష సాధింపు చర్యలు అంటారు. ముఖ్యమంత్రి సమీప బంధువు అయినా కూడా తప్పు చేస్తే శిక్ష పడింది. నీ హయాంలో తప్పు జరిగిన వారిని వెనకేసుకొచ్చి రాజీ పంచాయితీలు చేశావు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం ఎంతో అద్భుమైనది. చంద్రబాబు ఏడుసార్లు కుప్పం నుంచి గెలిచినా సమస్యలు తీర్చలేదు. కుప్పం నియోజకవర్గాన్ని సీఎం జగన్ అభివృద్ధి చేస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. హంగు ఆర్భాటం లేకుండా ప్రజల్లోకి వెళ్లి మంచి చేయాలన్నదే సీఎం జగన్ ఆలోచన’ అని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. -
సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
సాక్షి, వైఎస్సార్ కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కాపులపట్ల అనుసరిస్తున్న విధానం చాలా బాగుందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పుత్తా నరసింహారెడ్డి ప్రశంసించారు. కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ పార్టీ కాపులకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వడానికి సీఎం వైఎస్ జగన్ కారణమని అన్నారు. వైఎస్సార్ జిల్లా కమలాపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన టీడీపీ కాపు కార్యాలయాన్ని పుత్తా నరసింహారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కాపులకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారంటూ ప్రశంసల వర్షం కురిపించారు. చదవండి: (రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్) -
Horsley Hills: షూటింగ్‌లకు ఆద్యుడు కృష్ణ
బి.కొత్తకోట(వైఎస్సార్ కడప): పర్యాటక, వేసవి విడిది కేంద్రంగా బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్ అందరికీ సుపరిచితమే. అయితే ఇక్కడ సినిమా షూటింగులకు ఆద్యుడు, చిత్రపరిశ్రమకు ఈ అందమైన ప్రాంతాన్ని పరిచయం చేసింది మాత్రం సూపర్ కృష్ణనే. మొట్టమొదటగా ఆయన సినిమాలు ఇక్కడ చిత్రీకరించడం మొదలయ్యాకే.. మిగిలిన నటులు హార్సిలీహిల్స్ దారిపట్టారు. కృష్ణ షూటింగుల వల్లే హార్సిలీహిల్స్‌కు ప్రాచు ర్యం వచ్చింది. అప్పటి వరకు సినిమా స్టూడియోలకే పరిమితమైన షూటింగులను ఔట్‌డోర్ చిత్రీకరణ మొదలైందని చెప్పవచ్చు. 1966లో కృష్ణ నటించిన కన్నెమనసు సినిమా చాలా భాగం హార్సిలీహిల్స్‌లో చిత్రీకరణ జరిగింది. కొండపై కృష్ణ తొలి సినిమా షూటింగ్ ఇదేనని చెప్పవచ్చు. చల్లటి వాతావరణం, సముద్రమట్టానికి 4,141 అడగుల ఎత్తులో ప్రకృతి అందాలకు నిలయమైన కొండపై గాలిబండ, పాత వ్యూపాయింట్, ఘాట్‌రోడ్డు ప్రాంతాల్లోనే సిని మా చిత్రీకరణలు జరిగాయి. కృష్ణ నట జీవితంలో హార్సిలీహిల్స్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. నటుడిగా అప్పుడప్పుడే గుర్తింపు లభిస్తున్న రోజుల నుంచే తాను నటించే చిత్రాలను హార్సిలీకొండపై చిత్రీకరించే వారు. కన్నెమనసులు చిత్రం ఎక్కువ భాగం కొండపైనే చిత్రీకరించారు. కొండపై తొలి సినిమా సెట్టింగ్ వేసింది ఈ సినిమాకే. గాలిబండపై వెదురుకట్టెలు, పైకప్పు గడ్డితో గాజులమ్మ గుడిని నిర్మించి ఓ పాట, గుడి మంటల్లో కాలిపోయే దృశ్యాలను చిత్రీకరించారు. గవర్నర్‌బంగ్లా, ఆవరణలో కృష్ణ, ఇతరా నటులతో చివరి భాగం నిర్మించారు. అప్పటి నుంచే కృష్ణకు కొండపై అనుబంధం ఏర్పడిందని చెప్పవచ్చు. ఆ తర్వాత నటించిన అసాధ్యుడు, అఖండుడు, నేనంటేనేనే, దొంగలదోపిడి, సింహగర్జన, పులిజూదం, ఏకలవ్య, గూడుపుఠాణి, పట్నవాసం ఇలా సుమారు 25కు పైగా సినిమాల నిర్మాణం జరుపుకొంది. ఎన్.శంకర్ దర్శకత్వంలో కృష్ణ నటించిన ఎన్కౌంటర్ సినిమా అత్యధిక భాగంగా, పాటలను కొండపైన, అడవిలో చిత్రీకరించారు. కొండపై కృష్ణ చివరి చిత్రం ఇదే. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే కొండపై జన్మదిన వేడుకలు జరుపుకొన్నారు. కృష్ణ తర్వాత ఎన్టీఆర్, శోభన్‌బాబు, నాగార్జున, రాజేంద్రప్రసాద్, కాంతారావు ఇలా ఎందరో నటుల సినిమాలు ఇక్కడ చిత్రీకరించారు. కర్ణాటక, తమిళనాడుకు చెందిన సినిమాలు అత్యధికంగా ఇక్కడ నిర్మాణం జరుపుకొన్నాయి. కాగా హార్సిలీహిల్స్‌తో తనకు ప్రత్యేక అనుబంధముందని 1997లో ఎన్కౌంటర్ సినిమా షూటింగ్ సమయంలో చెప్పుకొన్నారు. చివరగా కృష్ణ 2007లో విజయనిర్మల, నరేష్‌తో కలిసి హార్సిలీహిల్స్ వచ్చివెళ్లారు. కొండపై నటుడు శరత్‌బాబు ఇంటి నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోయింది. ఇక్కడ నిర్మించుకొన్న ఇంటిని ప్రముఖ నటి జమున విక్రయించుకొన్నారు. అయినప్పటికీ ఇప్పటికి జమునా బిల్టింగ్ అనే పిలుస్తారు. -
విజయవాడ - బెంగళూరు మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే
నూతన జిల్లా శ్రీసత్యసాయి నుంచి ఇటు విజయవాడకు, అటు పొరుగున ఉన్న కర్ణాటక రాజధాని బెంగళూరుకు వెళ్లేందుకు ‘మార్గం’ సుగమమైంది. బెంగళూరు, కడప, విజయవాడ (బీకేవీ) ఎక్స్‌ప్రెస్ వేకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో దూరాభారం తగ్గనుంది. ప్రస్తుతం విజయవాడకు చేరాలంటే దాదాపు 8 గంటల ప్రయాణం చేయాల్సి వస్తోంది. గ్రీన్ ఫీల్డ్ హైవేపై గంటకు 120 కి.మీ. వేగంతో వెళ్లేలా నాలుగు వరుసల రహదారి నిర్మించనుండటంతో నాలుగు నుంచి ఐదు గంటల్లోనే విజయవాడ చేరుకునే అవకాశం ఉంటుంది. సాక్షి, పుట్టపర్తి: బెంగళూరు, కడప, విజయవాడను కలుపుతూ కొత్తగా జాతీయ రహదారి ఏర్పాటవుతోంది. జిల్లాలో 75 కి.మీ మేర విస్తరించనున్న ఈ రహదారిపై 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించేలా నిర్మించనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కోడూరు నుంచి ప్రకాశం జిల్లా ముప్పవరం వరకు నాలుగు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మించనున్నారు. దీంతో ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా సుఖవంతంగా సాగేలా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. శ్రీసత్యసాయి జిల్లాలోని చిలమత్తూరు, గోరంట్ల, ఓడీచెరువు, నల్లమాడ, ముదిగుబ్బ , కదిరి మండలాల్లో సాగే గ్రీన్‌ఫీల్డ్ హైవే కోసం భూసేకరణకు సంబంధించి అధికారులు మార్కింగ్ చేస్తున్నారు. జిల్లాలో మొత్తంగా 2 వేల ఎకరాలు సేకరించనున్నారు. కోడూరు నుంచి ప్రారంభం.. చిలమత్తూరు మండలం కోడూరు వద్ద బెంగళూరు– హైదరాబాద్ జాతీయ రహదారి –44 నుంచి నాలుగు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే మొదలవుతుంది. అక్కడి నుంచి వైఎస్సార్ జిల్లా పులివెందుల సమీపంలోని వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల, కమలాపురం, మైదుకూరు, పోరుమామిళ్ల, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సీతారాంపురం, ప్రకాశం జిల్లా సీఎస్‌పురం మీదుగా పామూరు, కనిగిరి, చీమకుర్తి, పెద్ద ఉయ్యాలవాడ, బొద్దికూరపాడు, నాగంబొట్లపాళెం, కంకుపాడు, అద్దంకి, ముప్పవరం వరకు రోడ్డు నిర్మాణం సాగనుంది. జిల్లాలోని ఎనిమిది మండలాల మీదుగా.. జిల్లాలో 75 కిలోమీటర్ల మేర గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే విస్తరించనుంది. చిలమత్తూరు మండలం కోడూరు వద్ద ఎన్‌హెచ్–44 వద్ద మొదలై చాగిలేరు, గోరంట్ల మండలంలోని బూదిలి, జక్కసముద్రం, పుట్టపర్తి మండలంలోని అమగొండపాళ్యం, సాతర్లపల్లి, ఓడీచెరువు మండలం కొండకమర్ల, నల్లమాడ మండలం వేళ్లమద్ది, కదిరి మండలంలోని పట్నం, తలుపుల మండలంలోని లక్కసముద్రం, ముదిగుబ్బ మండలంలోని దేవరగుడి వరకు రోడ్డు నిర్మాణం జరగనుంది. భూసేకరణ ఇలా... జాతీయ రహదారి నిర్మాణానికి 90 మీటర్ల వెడల్పున భూమిని సేకరించనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో 2 వేల ఎకరాల భూసేకరణకు త్వరలోనే 3–ఏ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. భూసేకరణలో భాగంగా ప్రభుత్వ, అటవీ, పట్టా భూముల వారీగా వివరాలు సిద్ధం చేస్తున్నారు. డీపీఆర్ ప్రకారం ఏయే రెవెన్యూ గ్రామాల మీదుగా ఈ రోడ్డు వెళ్తుందనే వివరాలతో నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. పెరిగిన భూమి విలువ... నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) బీకేవీ ఎక్స్‌ప్రెస్ వే కోసం సర్వే ప్రారంభించింది. భూసేకరణకు సంబంధించిన రాళ్లు ఏర్పాటు చేసింది. దీంతో ఆయా ప్రాంతాల్లో భూముల విలువ బాగా పెరిగింది. భూముల క్రయ, విక్రయాలు ఊపందుకున్నాయి. ఈ రహదారి పూర్తయితే విజయవాడ – బెంVýæళూరు మధ్య ప్రయాణం సుఖవంతంగా సాగనుంది. రహదారిపైకి వెళ్లేందుకు 13 చోట్లే అనుమతి.. బీకేవీ ఎక్స్‌ప్రెస్ వే పైకి వెళ్లేందుకు వాహనదారులు అన్ని చోట్ల అవకాశం ఉండదు. వాహనాల స్పీడ్, భద్రతా ప్రమాణాల మేరకు... మూడు జిల్లాల్లో కేవలం 13 చోట్ల మాత్రమే రహదారిలోకి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు అవకాశం కల్పిస్తూ రూపకల్పన చేశారు. డీపీఆర్ రూపకల్పన విజయవాడ– బెంగళూరు జాతీయ రహదారికి సంబంధించిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీ.పీ.ఆర్)రూపకల్పనలో ఉన్నాం. త్వరలోనే భూసేకరణ పూర్తవుతుంది. –రామకృష్ణ , ప్రాజెక్డ్ డైరెక్టర్, ఎన్హెచ్ఏఐ -
ఐరన్‌లెగ్ అన్నారు.. ఇప్పుడు మంత్రిని అయ్యా: ఆర్కే రోజా
సాక్షి, వైఎస్సార్ కడప: మహానేతతో కలిసి పని చేసే అదృష్టం దక్కకపోయినా.. వైఎస్ జగన్ ఆశీర్వాదంతో మంత్రిని అయ్యానని సంతోషం వ్యక్తం చేశారు పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా. శుక్రవారం ఇడుపులపాయలో దివంగత నేత వైఎస్సార్‌కు నివాళులు అర్పించిన అనంతరం.. ఆమె మీడియాతో మాట్లాడారు. కడప నేను పుట్టిన ఊరు. టీడీపీలో ఉన్నప్పుడే మహానేత వైఎస్సార్ నన్ను తన పార్టీలోకి రమ్మని ఆహ్వానించారు. ఆయనతో కలిసి రాజకీయాల్లో పని చేయాలని కలగన్నా. ఆయన అకాలమరణంతో ఆ అవకాశం రాకపోవడంతో చాలా బాధపడ్డా. ఆ టైంలో ఐరన్ లెగ్ అంటూ నన్ను టీడీపీ వాళ్లు అవహేళన చేశారు. వైఎస్సార్ నాకు దేవుడు. ఆయన ఆశయాల సాధన కోసం పుట్టిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్. ఆ దివంగత మహానేత ఆశీస్సుల కోసమే ఇడుపులపాయనూ సందర్శించా. ఎమ్మెల్యే కావాలన్నది తన కల అని, ఏకంగా రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యానని, ఇప్పుడు సీఎం జగన్ ఆశీర్వాదరంతో మంత్రిని కూడా అయ్యానంటూ ఆమె సంతోషం వ్యక్తం చేశారు. జగనన్న మంత్రి వర్గంలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్న మంత్రి ఆర్కే రోజా.. పార్టీ విజయం కోసం అహర్నిశలు పని చేస్తానని చెప్పారు. గతంలో ఒంటిమిట్ట రథోత్సవానికి వచ్చినప్పుడు.. వైఎస్ జగన్‌ను సీఎం చేయాలని భగవంతుడ్ని వేడుకున్నానని, ఆ కోరిక నెరవేర్చినందుకు కళ్యాణోత్సవానికి హజరయ్యానని ఆమె చెప్పారు. ఇకపై జబర్దస్త్ చేయరా అని చాలా మంది అడుతున్నారని, కానీ.. పది మందికి ఉపయోగ పడటం కోసం ఒకటి వదులుకోక తప్పదని ఆమె చెప్పారు. ఆర్థిక పురోగతి సాధించే విధంగా ఏపీలో పథకాలు అమలు అవుతున్నాయని పేర్కొన్న మంత్రి రోజా.. లోకల్ బాడీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అవడానికి జగనన్న అమలు చేసిన సంక్షేమ పథకాలే కారణమని స్పష్టం చేశారు. -
వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో సీఎం పర్యటన
కడప సిటీ/కర్నూలు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 15, 16వ తేదీల్లో వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో పర్యటించనున్నారు. 15వ తేదీ సాయంత్రం గన్నవరం నుంచి బయలుదేరి కడప ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వెళ్లి.. ఒంటిమిట్టలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణోత్సవానికి హాజరవుతారు. పట్టు వస్త్రాలను సమర్పించి కల్యాణోత్సవాన్ని తిలకిస్తారు. రాత్రికి కడప నగరానికి చేరుకుని, ఆర్అండ్బీ గెస్ట్ హౌస్‌లో బస చేస్తారు. 16వ తేదీ ఉదయం రెండు వివాహ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి.. అక్కడి నుంచి కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అనంతరం ఓ వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదిస్తారు. -
AP New Cabinet: అంజద్‌బాషాను రెండోసారి వరించిన మంత్రిపదవి
కడప కార్పొరేషన్: కడప గడపకు మరోమారు మంత్రి హోదా దక్కింది. సమర్థత, విశ్వాసం, సామాజిక సమతుల్యత నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గంలో కడప ఎమ్మెల్యే ఎస్బీ అంజద్‌బాషాకు రెండోసారి అరుదైన అవకాశం లభించింది. ఈయనను మంత్రివర్గంలోకి తీసుకొని ముస్లీం మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అగ్రపీఠం వేశారు. శనివారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించనున్నారు. కాగా, రాష్ట్ర రాజధానికి ఎమ్మెల్యే అభిమానులు, వైఎస్సార్సీపీ శ్రేణులు తరలివెళ్లాయి. వ్యాపారవేత్తగా కడప వాసులకు సుపరిచితుడైన అంజద్‌బాషా 2005లో రాజకీయ ఆరంగ్రేటం చేశారు. కాంగ్రెస్ కార్పొరేటర్‌గా ప్రారంభమైన ఆయన ప్రస్థానం, వైఎస్ కుటుంబాన్ని అనుసరిస్తూ వైఎస్సార్సీపీ పార్టీలో క్రియాశీలక భూమిక పోషించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. కడప నియోజకవర్గ సమన్వయకర్తగా ఎంపికై వైఎస్సార్సీపీ ఉన్నతికి కృషి చేశారు. అనంతరం 2014లో శాసనసభకు పోటీచేసే అవకాశం దక్కింది. కడప నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనా రాష్ట్రంలో ఆపార్టీ అధికారం చేజేక్కించుకోలేకపోయింది. నిరంతరం ప్రజల పక్షాన నిలిచి, ప్రత్యక్ష పోరాటాల్లో తనవంతు పాత్రను పోషించారు. ఈనేపథ్యంలో రాష్ట్ర మైనార్టీ సెల్ విభాగం అధ్యక్షుడిగా బాధ్యతలు కట్టబెట్టారు. తర్వాత వైఎస్సార్సీపీ స్టేట్ జనరల్ సెక్రెటరీగా ఎంపికయ్యారు. అనంతరం 2019 ఎన్నికల మేనిఫేస్టో కమిటీ మెంబర్‌గా అంజద్‌బాషా నియమితులయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసిన ఆయన మరోమారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించారు. ఆనక ఉప ముఖ్యమంత్రి పదవి వరించింది. ఆయనకు రెండవసారి మంత్రి పదవి లభించడం పట్ల పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. విధేయుత..విశ్వాసం..సమర్థత పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్ల విశ్వాసం, ముస్లీం మైనార్టీ వర్గీయుడైనా అత్యంత సమర్థత కల్గిన నాయకుడుగా ఎస్బి అంజద్‌బాషా గుర్తింపు దక్కించుకున్నారు. 2014లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రాకపోగా, వైఎస్సార్ జిల్లాలో ఆ పార్టీని విచ్ఛిన్నం చేయాలనే దిశగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్ని ప్రలోభాలు పెట్టిన అటువైపు మొగ్గు చూపకుండా విశ్వాసంగా ఉండడం, పార్టీ కోసం శక్తికి మించి శ్రమించడం ఇవన్నీ కలిసివచ్చాయని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. పాతవారిని తొలగించి కొత్తవారిని మంత్రులుగా తీసుకుంటారని ప్రచారం సాగినా సామాజిక సమీకరణల నేపథ్యంలో అంజద్‌బాషాను మళ్లీ మంత్రిపదవి వరించిందని పరిశీలకులు భావిస్తున్నారు. చేపట్టిన పదవులు అంజద్‌బాషా మదీనా ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్‌గా,బుఖారియా విద్యాసంస్థ ఉపాధ్యక్షుడిగా, అల్ హజ్ ఎస్బి అబ్దుల్ ఖాదర్ ఎడ్యుకేషనల్ సొసైటీకి, హరూన్ ఛారిటబుల్ ట్రస్టు, నిర్మలా ఇంగ్లీషు మీడియం స్కూల్ అల్యూమిని అసోషియేట్లకు అధ్యక్షుడిగా ఉన్నారు. హౌస్ మసీదు కమిటీ కోశాధికారిగా, ఏపీ ముస్లిం కౌన్సిల్ ఉపాధ్యక్షుడిగా, ఏపీఎస్ఆర్టీసీలో నేషనల్ మజ్దూర్ యూనియన్‌కు గౌరవాధ్యక్షుడిగా, కడప మున్సిపల్ కార్పొరేషన్ ఫైనాన్స్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. 2005లో కాంగ్రెస్ పార్టీ తరపున కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలుపొందారు. 2012లో వైఎస్సార్సీపీ కడప సమన్వయకర్త. 2014లో వైఎస్ఆర్సీపీ తరుపున పోటీ చేసి 45వేలపైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. 2016లో వైఎస్సార్సీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు. 2018లో జనరల్ సెక్రెటరీ,2019 ఎన్నికల మేనిఫెస్టో కమిటీ మెంబర్. సార్వత్రిక ఎన్నికల్లో 54వేల మెజార్టీతో విజయం సాధించారు. కుటుంబ నేపథ్యం కడప జిల్లా సిద్దవటంకు చెందిన జనాబ్ ఎస్బి హరూన్ సాహెబ్ 1935 నుంచి 1953 వరకు సుమారు 18 సంవత్సరాలు సిద్దవటం సర్పంచ్‌గా పనిచేశారు. సిద్దవటంలో హరూన్ సాహెబ్ అందించిన సేవలకు అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ఆయన్ను బహదూర్ అనే బిరుదుతో సత్కరించింది. హరూన్ సాహెబ్ కుమారుడైన అబ్దుల్ ఖాదర్ పెద్ద కుమారుడే ఎస్బి అంజద్‌బాషా. 1963లో వారి కుటుంబం వ్యాపార పరమైన సౌకర్యాల కోసం కడప నగరంలో స్థిరపడ్డారు. కడప, కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో వీరికి వ్యాపారాలు ఉన్నాయి. నిర్మలా ఇంగ్లీషు మీడియం స్కూలులో ఆయన విద్యాభ్యాసం కొనసాగించారు. సెయింట్ జోసెఫ్స్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్, ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో బీఏ పూర్తి చేశారు. పూర్వీకుల అడుగుజాడల్లో నడుస్తూ క్రమశిక్షణ, అంకిత భావం, కష్టపడే తత్వం, నాయకత్వ లక్షణాలు, సేవాగుణంతో అంజద్‌బాషా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకొన్నారు. వీరి సేవా తత్పరతను గుర్తించి ఆనాటి ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. 2005లో కాంగ్రెస్ తరపున కార్పొరేటర్‌గా పోటీ చేసే అవకాశం కల్పించారు. కడపకు మరో అవకాశం.. కడప ఎమ్మెల్యే అంజద్‌బాషాకు మంత్రిహోదా దక్కడంతో కడప నియోజకవర్గానికి మరోసారి అవకాశం దక్కింది. ఇదివరకు కడప నుంచి ఎమ్మెల్యేగా ఎంపికై మంత్రి హోదా దక్కించుకున్న వారి జాబితాలో అంజద్‌బాషా రెండోసారి చేరారు. ఎస్ రామమునిరెడ్డి(1983), సి రామచంద్రయ్య(1985), డాక్టర్ ఎస్ఏ ఖలీల్‌బాషా(1999), ఎస్ఎండీ అహమ్మదుల్లా (2009), ఇదివరకు మంత్రి పదవులు అలంకరించారు. తాజాగా 2019లో అంజద్‌బాషాకు ఆ హోదా దక్కింది. ఇప్పుడు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మళ్లీ మంత్రిగా అవకాశం దక్కింది. కడప నుంచి మంత్రి హోదా దక్కించుకున్న వారిలో ఈయన ఐదో ఎమ్మెల్యే కాగా, గడిచిన 3 పర్యాయాలు పరిశీలిస్తే పదేళ్లకు ఓమారు కడప నియోజకవర్గానికి మంత్రి హోదా దక్కుతూ రావడం మరో విశేషం. -
ఆ'క్యాష్' మిర్చి: రూటే సపరేటు.. కిలో రూ.120 నుంచి రూ.140
కారంలోనే కాదు.. లాభాల్లోనూ నాలుగు రెట్లు ఘాటు అధికం..ఆ మిర్చి. ఆ రకం వంగడానికి కార్పొరేట్ కంపెనీలే దాసోసం అన్నాయి. అందుకే ఆ మిర్చి రకం కాయలు అధిక ధరలు పలుకుతున్నాయి. ఫలితంగా కర్షకుడి ఇంట సిరులు పంట పండుతోంది. సాగుదారుకు అధిక క్యాష్ ఇస్తున్నదే.. ఆకాష్ మిర్చి వంగడం. దీనిపై ప్రత్యేక కథనం. గుర్రంకొండ: కొత్తరకం ఆకాష్ మిర్చి(డెమెన్ ఎఫ్–1) సాగు రైతులకు సిరులు కురిపిస్తోంది. ప్రస్తుతం కిలో మిర్చి మార్కెట్లో రూ.120 నుంచి రూ.140 వరకు ధర పలుకుతోంది. సాధారణ మిర్చితో పోల్చితే ఈ రకం మిర్చి నాలుగు రెట్లు అధికంగా కారం ఉంటుంది. బయట రాష్ట్రాల్లో ఈ రకం మిర్చికి అధికంగా డిమాండ్ ఉంది. సాధారణ మిర్చి కొమ్మకు కింది వైపు కాయగా ఆకాష్ మిర్చి కొమ్మకు పైభాగంలో ఆకాశాన్ని చూస్తుండటం వీటి ప్రత్యేకత. పంట సాగుతో రైతుకు నిలకడైన ఆదాయం వస్తుండడంతో గత మూడేళ్లుగా ఈ ప్రాంతం రైతులు మిర్చి పంట సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. కర్ణాటకలో కొత్త వంగడం: ఆకాష్ మిర్చి రకం విత్తనాలు మొదట కర్ణాటక రాష్ట్రంలో నాలుగేళ్ల కిందట కనుగొన్నారు. ఓ ప్రైవేట్ కంపెనీ వారు ఈ రకం విత్తనాలు ఉత్పత్తి చేసి, మార్కెట్లో విక్రయిస్తున్నారు. మూడేళ్లుగా అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె, పెద్దమండ్యం, గుర్రంకొండ మండలాల్లో రైతులు ఈ పంట సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఎక్కువగా కారం ఉండడంతో ప్రముఖ కంపెనీలైన ఆశీర్వాద్, ఆచీ కంపెనీలు తాము తయారు చేసే కారం పొడుల్లో ఆకాష్ మిర్చిని ఎక్కువగా వినియోగస్తుండడంతో వీటికి మంచి డిమాండ్ ఏర్పడింది. ఎకరా సాగుకు రూ. 1.50 లక్షలు ఖర్చు ఆకాష్ మిర్చి ఎకరం సాగుకు రూ.1.50 లక్షలు వరకు ఖర్చు అవుతుంది. సాధారణంగా ఈ ప్రాంతంలో రబీ సీజన్ అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ 10వ తేదీలోగా నారు నాటుకోవాలి. ఎకరం పొలానికి రూ.10 వేల మొక్కల నారు అవసరం. మార్కెట్లో 10 వేల మొక్కల నారుకు రూ.10 వేలు చెల్లించాలి. దుక్కి నుంచి మల్చింగ్, డ్రిప్ పైపులు, వారానికి రెండు సార్లు పురుగు నివారణ మందుల పిచికారీ, ఎరువులు తదితర అన్ని ఖర్చులు ఎకరాకు రూ. 1.50 లక్షలు వరకు అవుతాయి. ఎకరానికి సుమారు రూ.20 లక్షల ఆదాయం ప్రస్తుతం మార్కెట్లో కిలో మిర్చి రూ. 120 నుంచి రూ.130 వరకు ధరలు పలుకుతున్నాయి. ఈ సీజన్ అంతా సరాసరి రూ.80 నుంచి రూ.100 వరకు ధరలు తగ్గకుండా పలుకుతుంటాయి. దీంతో సాగు ఖర్చు పోను ఎకరానికి సరాసరి కనీసం రూ. 10 లక్షల నుంచి అత్యధికంగా రూ.20 లక్షల వరకు రైతులకు మిగులుతోంది. ఒక వేళ ధరలు లేక పోయినా ఎండుమిర్చి కింద వీటిని వాడుకున్న రైతులకు సాగు పెట్టుబడికి ఢోకా ఉండదు. నాలుగు రెట్లు అధిక కారం ఆకాష్ మిర్చి సాధారణ మిర్చి కంటే నాలుగు రెట్లు అధికంగా కారం ఉంటుంది. సా«ధారణ మిర్చి తొడిమి ఒక ఇంచి లోపు ఉండగా ఈ రకం మిర్చి తొడిమి రెండు నుంచి రెండున్నర అంగుళాల పొడవు ఉండడం విశేషం. సాధారణ మిర్చి నాలుగు కిలోలకు ఆకాష్మిర్చి ఒక కిలో సమానం అవుతుంది. దీంతో బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో వీటికి మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా హోటళ్లు, పీజీ హాస్టళ్లలో వీటిని ఎక్కువగా వినియోగిస్తుంటారు. మొక్కలో ఆకాశం వైపు చూస్తున్న మిరప కాయలు ఎకరానికి 10 నుంచి 20 టన్నుల దిగుబడి మొక్క నాటిన 80 నుంచి 90 రోజులకు పంట దిగుబడి ప్రారంభమవుతుంది. సాధారణంగా ఎకరం పంటకు అత్యల్పంగా 10 టన్నుల నుంచి అత్యధికంగా 20 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. సుమారు రెండు నుంచి మూడు నెలల వరకు కాయల దిగుబడి వస్తుంది. మంచి ఎరువులు వాడుతూ పంటను కాపాడుకుంటే అత్యధికంగా నాలుగు నెలల వరకు దిగుబడి వస్తుంది. లాభదాయక పంట ఆకాష్ మిర్చి మంచి లాభదాయక పంట. మిగిలిన పంటలతో పోల్చితే ఈ రకం మిర్చి సాగుతో ఎప్పుడు నష్టం ఉండదు. మార్కెట్లో సాధారణ ధరలు ఉన్నా కిలో రూ. 70 వరకు ధర పలుకుతుంది. మంచి డిమాండ్ ఉంటే కిలో రూ.120 నుంచి రూ.140 వరకు ధర పలుకుతుంది. – జయమ్మ, మహిళా రైతు, దిగువ పల్లె మూడేళ్లుగా సాగు చేస్తున్నా ఆకాష్ మిర్చి పంటను మూడేళ్లుగా సాగు చేస్తున్నా. ఎకరానికి రూ. 1.20 లక్షల నుంచి రూ. 1.50 లక్షల వరకు ఖర్చు వస్తుంది. అయితే ఎప్పుడూ నష్టాలు రాలేదు. అన్ని సార్లు పెట్టుబడి పోను లాభాలే వచ్చాయి. – చెంగల్రాయులు, రైతు, కొత్తపల్లె ఇక్కడి వాతావరణం అనువైంది కొత్త రకం ఆకాష్ మిర్చి పడమటి మండలాల వాతావరణానికి అనువైంది.మార్కెట్లో ఈ రకం మిర్చికి మంచి గిట్టుబాటు ధరలున్నాయి. దీంతో నిలకడైన ఆదాయం ఉన్న ఈ పంట రైతులకు మంచి ఆదాయం తెచ్చిపెడుతోంది. – శైలజ, ఉద్యానవనశాఖాధికారి, వాల్మీకిపురం క్లస్టర్ -
అనుమానం పెనుభూతమై.. భార్యను హత్య చేసిన భర్త
ఒంటిమిట్ట: అనుమానం పెనుభూతమై ఓ వ్యక్తి కట్టుకున్న భార్యనే కడతేర్చిన ఉదంతం శుక్రవారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్ఐ సంజీవరాయుడు తెలిపిన వివరాలు.. 2015లో షేక్రేష్మా(24)కు పెనగలూరు మండలం, నారాయణ నెల్లూరు గ్రామ వాసి అయిన షేక్ ఇస్మాయిల్‌తో వివాహమైంది. వీరికి తైబా తస్నిమ్, జైనబ్ అనే ఇద్దరు చిన్నారులు ఉన్నారు. రేష్మాపై ఇస్మాయిల్ అనుమానం పెంచుకోవడంతో చాలా రోజులుగా వారి మధ్య కలతలు రేగాయి. మూడు నెలల క్రితం రేష్మా తల్లిదండ్రులు షేక్ మహ్మద్ రఫీ, షేక్ అమ్ములు ఉంటున్న ఒంటిమిట్ట మండలం దిగువ వీధిలోకే వారు కూడా వచ్చి బాడుగ ఇంట్లో ఉంటున్నారు. అయినా వారిద్దరి మధ్య గొడవలు ఆగకపోగా ఎప్పటిలానే శుక్రవారం ఉదయం కూడా ఇంట్లో గొడవ పడ్డారు. ఆ సమయంలో క్షణికావేశానికి గురైన ఇస్మాయిల్ కత్తి తీసుకుని రేష్మా గొంతు కోసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న సీఐ రాజా ప్రభాకర్, ఎస్ఐ సంజీవరాయుడు ఘటనా స్థలానికి చేరుకుని రేష్మా మృతదేహాన్ని పరిశీలించి, పోస్ట్‌మార్టం నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడు ఇస్మాయిల్ ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. రేష్మా మృతి చెందడం, ఆమె భర్త పరారీలో ఉండడంతో ఇద్దరు బిడ్డలు బిక్కుబిక్కుమంటూ ఉండడం చూసి స్థానికులు కన్నీటి పర్యంతం అయ్యారు. -
రాయచోటి.. ప్రత్యేకతల్లో మేటి
అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఆవిర్భవిస్తున్న రాయచోటి ప్రాంతానికి పలు ప్రత్యేకతలు ఉన్నాయి. పూర్వం కడప జిల్లాలో ఉన్న తాలూకాలు ఇతర జిల్లాల్లో కలిశాయే తప్ప ఏవీ జిల్లా కేంద్రాలుగా ఏర్పాటు కాలేదు. ఇప్పుడు ఆ అవకాశం రాయచోటికి మాత్రమే దక్కింది. కొత్త జిల్లాల ఏర్పాటు ఆలోచన ఇప్పటిది కాదు. కొన్ని దశాబ్దాల నుంచి దీనిపై చర్చలు జరుగుతున్నాయి. పునర్విభజన అంటూ జరిగితే కడప, ప్రొద్దుటూరు కేంద్రాలుగా రెండు జిల్లాలు ఏర్పాటు అవుతాయని ఇంతకాలం అందరూ భావిస్తూ వచ్చారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఆ మహదవకాశం రాయచోటిని వరించింది. – కడప సెవెన్‌రోడ్స్ సరిహద్దులిలా.. కడప జిల్లా ఉదక మండలంగా పిలువబడే ఈ ప్రాంతం 14.0586 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 78.7519 డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. సముద్ర మట్టానికి సుమారు 1185 అడుగుల ఎత్తులో ఈ ప్రాంతం ఉంది. కొత్తగా ఆవిర్భవిస్తున్న అన్నమయ్య జిల్లాకు తూర్పున తిరుపతి, నెల్లూరు జిల్లాలు, ఉత్తరాన వైఎస్సార్ జిల్లా, పడమర పుట్టపర్తి, దక్షిణాన చిత్తూరు జిల్లాతోపాటు కర్నాటక సరిహద్దులుగా ఏర్పాటు కానున్నాయి. పరవశింపజేసే ప్రకృతి అందాలు రాయచోటి అంటే అందరికీ గుర్తుకొచ్చేది కొండలు, గుట్టలు. ఇక్కడ ఎటుచూసినా వివిధ ఆకృతులతో అందంగా ప్రకృతి తీర్చిదిద్దిన రాక్ గార్డెన్స్ చూపరులను ఆకట్టుకుంటాయి. ఉత్తరం, తూర్పు దిశన తూర్పు కనుమలు పెట్టని కోటలా ఉంటాయి. వీటిని ఈ ప్రాంతంలో పాలకొండలు లేదా శేషాచలం కొండలుగా పిలుస్తారు. దుప్పులు, జింకలు, మనుబోతులు, కోతులు, ఎలుగుబంట్లు, చిరుతలు, అడవి పందులు, నక్కలు, రేచు కుక్కలు తదితర వన్యమృగాలు సందడి చేస్తుంటాయి. ఔష«ధి వృక్షాల సౌరభాలతో, వనపుష్పాల సోయగాలతో ఈ కొండలు కనువిందు చేస్తాయి. ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన, అత్యంత నాణ్యతగల ఎర్రచందనం చెట్లు విస్తారంగా ఉన్నాయి. ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నందున ఎర్రచందనానికి చైనా, జపాన్ తదితర గ్లోబల్ మార్కెట్లో విపరీత డిమాండ్ ఉంది. ఎర్రబంగారంగా పిలిచే ఈ సంపదను సక్రమంగా వినియోగించుకోగలిగితే పెద్ద ఎత్తున విదేశీ మాదక ద్రవ్యాన్ని ఆర్జించవచ్చు. వీటిపై పరిశోధనలు సాగాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. నదుల సంగమం.. కర్నాటక రాష్ట్రం కోలార్ జిల్లా రాయలపాడు కొండల్లో ఉద్భవించే బహుదానది ఇక్కడి సుండుపల్లె మండలంలోకి ప్రవేశిస్తుంది. పుంగనూరు ప్రాంతంలోని ఆవులకొండలో జన్మించే పింఛా నది కూడా ఇదే మండలంలోకి ప్రవేశించి రాయవరం గ్రామ సమీపంలో బహుదాలో కలుస్తుంది. పింఛాపై సుండుపల్లె మండలంలో చిన్న ప్రాజెక్టు నిర్మించారు. బహుదాను నందలూరు ప్రాంతంలో చెయ్యేరుగా పిలుస్తారు. చిత్తూరు జిల్లా రెక్కలకొండలో జన్మించే మాండవ్యనది చిన్నమండెం మండలం కేశాపురం బంగ్లా వద్ద ప్రవేశించి ప్రవహిస్తుంది. గంగనేరు, ఎర్రవంకలాంటి చిన్న వాగులు ఇందులో కలుస్తాయి. మాండవ్యనది పాలకొండల సానువుల ద్వారా ప్రవహిస్తూ చెయ్యేరులో విలీనమవుతుంది. కర్నాటక రాష్ట్రం కోలార్ జిల్లా నంది దుర్గపు ఉత్తరానగల స్కంధగిరిలో జన్మించే పాపాగ్ని నది చిత్తూరు, అనంతపురం జిల్లాలను దాటుకుని గాలివీడు మండలం వెలిగల్లు వద్ద జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఇది సురభి వ్యాలీ, గండిక్షేత్రం మీదుగా సాగుతూ కమలాపురం సమీపంలో పెన్నాలో ఐక్యమవుతుంది. ఇవి కాకుండా గంగనేరు, కుషావతి లాంటి చిన్నచిన్న నదులు ఉన్నాయి. వీరబల్లి బేనీషాతో అంతర్జాతీయ ఖ్యాతి కొండలు, గుట్టలు, ఎత్తు పల్లాలతో కూడిన ఈ ప్రాంతంలో అధికశాతం ఇసుకతో కూడిన ఎర్ర నేలలు ఉన్నాయి. ఇక్కడ అత్యధికశాతం వర్షాధారంపైనే పంటలు సాగు చేస్తారు. ప్రధానంగా వేరుశనగ, కంది, పెసర, అనప, మినుము, ఉలవ, అలసంద, జొన్న, ఆముదం పంటలు వేస్తారు. గతంలో సాగు చేస్తుండిన అరికలు, సామలు, బరిగలు, కొర్రలు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. చెరువులు, కుంటలు, బోరు బావుల కింద వరి పంట సాగవుతుంది. తరుచూ కరువులతో వేరుశనగ దెబ్బతినడం వల్ల రైతులు ఉద్యాన పంటలవైపు దృష్టి సారిస్తున్నారు. చిన్నమండెం, వీరబల్లి, సుండుపల్లె మండలాల్లో మామిడి తోటలు అధికంగా ఉంటాయి. వీరబల్లి బేనీషాకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇక చిన్నమండెం, సంబేపల్లె మండలాల్లో టమాటా విస్తారంగా సాగవుతోంది. ఖనిజ సృష్టి.. ఆదాయంపై దృష్టి ఈ ప్రాంతంలో తక్కువ నాణ్యతగల గ్రానైట్ లభ్యమవుతుంది. దీనికి మార్కెట్లో అంతగా డిమాండ్ లేదు. ఇక్కడి కొండలు, గుట్టల నుంచి తవ్వే తెల్లరాయి ఇళ్ల నిర్మాణాల్లో ఉపయోగిస్తారు. దీని నుంచి తయారు చేసే కంకర రోడ్ల నిర్మాణాల్లో వాడుతారు. గాలివీడు మండలం వెలిగల్లు వద్ద బంగారు ఖనిజం ఉన్నట్లు గుర్తించారు. ఒక మెట్రిక్ టన్ను ఖనిజం వెలికితీస్తే అందులో తొమ్మిది గ్రాముల బంగారం లభ్యమైతే తవ్వకాలు లాభసాటిగా ఉంటాయి. అయితే ఇక్కడ తక్కువ మోతాదులో బంగారు లభ్యమవుతుండడం వల్ల ఆర్థికంగా లాభసాటి కాదని మైన్స్ అండ్ జియాలజీ అధికారులు అంటున్నారు. పలుగురాయి, పెల్స్పర్, ఫైరోఫిలైట్ నిక్షేపాలు ఇక్కడ ఉన్నాయి. అధిక ఉష్ణోగ్రతలు.. ఈశాన్యం నుంచి వచ్చే గాలులతో జనవరి, ఫిబ్రవరి నెలల్లో వాతావరణం పొడిగా, చల్లగా ఉంటుంది. మార్చి నుంచి వేసవి తీవ్రత పెరుగుతుంది. ఏప్రిల్, మే మాసాల్లో ఎండలు మండిపోతుంటాయి. పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. వేడిగాలులు, ఉక్కపోత అధికం. జూన్‌లో నైరుతి రుతు పవనాల ప్రవేశంతో వాతావరణం చల్లబడుతుంది. ప్రధానంగా ఈ రుతు పవనాల ద్వారానే వర్షపాతం నమోదవుతుంది. తుఫాన్లు సంభవిస్తే ఈశాన్యంలో వర్షాలు కురుస్తాయి. రాయచోటిలో సాధారణ వర్షపాతం 650 మిల్లీమీటర్లు. సాధారణ వర్షపాతం 750 మిల్లీమీటర్ల కన్నా తక్కువ ఉండడం వల్ల క్రానికల్లీ ›డ్రౌట్ ప్రోన్ ఏరియా కింద ఈ ప్రాంతం ఉంది. -
అంతర్జాతీయ ప్రయాణికులకు శుభవార్త
న్యూఢిల్లీ: కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత పూర్తిస్థాయి అంతర్జాతీయ విమాన సర్వీసులు నేటి (ఆదివారం) నుంచి పునఃప్రారంభమయ్యాయి. రెండేళ్ల తర్వాత విమానాల రాకపోకలు జరగనున్నాయి. ఈ మేరకు విమానాశ్రయాలు, విమానయాన సంస్థలు రెడీ అయ్యాయి. మహమ్మారి ప్రభావంతో ఒడిదుడుకులు గురైన విమానయాన పరిశ్రమ నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకుంటున్న క్రమంలో అంతర్జాతీయ సర్వీసుల పునరుద్దరణ ఆ రంగానికి మరింత ఊతమివ్వనుంది. ఇప్పటికే భారతీయ విమానయాన సంస్థలు విమానలు నడిపేందుకు ఏర్పాట్లు చేయగా.. వివిధ విదేశీ సంస్థలు సైతం భారత్ నుంచి రాకపోకలకు ప్రణాళికలు రచించాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చి 20, 2020 నుంచి భారత్ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేసింది. కడప విమానాశ్రయం నుంచి పునః ప్రారంభమైన విమాన సర్వీసులు వైఎస్సార్ జిల్లా: కడప విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు పునః ప్రారంభమయ్యాయి. ఇండిగో సంస్థ ఆధ్వర్యంలో విమాన సేవలను ప్రారంభించారు. చెన్నై నుంచి తొలి విమానం కడప చేరుకుంది. అనంతరం కడప నుంచి విజయవాడకు విమాన సర్వీసు బయల్దేరనుంది. కడప విమానాశ్రయంలో ప్రయాణికులకు విమానాశ్రయ అధికారులు ఇండిగో ఫ్లైట్ టికెట్లను అందజేశారు. కడప నుంచి చెన్నై, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరుకు నేటి నుంచి ఇండిగో సంస్థ విమాన సర్వీసులను ప్రారంభించింది. -
భార్యపై అనుమానం.. మద్యం సేవించి..
సాక్షి, ప్రొద్దుటూరు క్రైం : అనుమానం పెనుభూతంగా మారడంతో చింతాకు మాబున్ని (24) అనే వివాహితను భర్త హత్య చేసిన ఘటన కొత్తపల్లె పంచాయతి పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. రూరల్ పోలీసుల కథనం మేరకు.. రాజుపాళెం మండలంలోని వెంగళాయపల్లె గ్రామానికి చెందిన మాబున్నికి 11 ఏళ్ల క్రితం ప్రొద్దుటూరు మండలంలోని గోపవరం గ్రామానికి చెందిన దస్తగిరిబాషాతో వివాహమైంది. అతను ఆటో నడుపుకొని జీవనం సాగిస్తున్నాడు. వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. రెండేళ్ల క్రితం కొత్తపల్లె బైపాస్ రోడ్డులోని ధనియాల ఫ్యాక్టరీలో మాబున్ని వాచ్‌మెన్‌గా చేరింది. అప్పటి నుంచి ఫ్యాక్టరీ ప్రాంగణంలోని ఇంట్లో వారు నివాసం ఉంటున్నారు. ఆమె తండ్రి సుబ్బరాయుడు కూడా పక్కనే ఉన్న రైస్‌మిల్లులో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త దస్తగిరిబాషా మద్యం సేవించి రోజూ చిత్రహింసలకు గురి చేసేవాడు. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి 1 గంట సమయంలో ఇంట్లో నుంచి కేకలు వినిపించడంతో తండ్రి పరుగెత్తుకుంటూ వెళ్లాడు. చదవండి: (నిర్మాత అని చెప్పి పెళ్లి చేసుకుని వ్యభిచారం చేయమంటున్నాడు: సహాయనటి) అప్పటికే మాబున్ని పైపునకు చుట్టిన చీరకు ఉరేసుకొని వేలాడుతోంది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యుడు తెలిపాడు. తన కుమార్తెను భర్త దస్తగిరిబాషా గొంతుకు చీర కట్టి చంపేశాడని తండ్రి సుబ్బరాయుడు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సంజీవరెడ్డి తెలిపారు. మాబున్ని (ఫైల్) -
వివాహమైన నెలకే వేధింపులు.. తల్లిదండ్రులకు ఫోన్‌చేసి..
చింతకొమ్మదిన్నె (కడప): జీవితాంతం తోడు నీడగా నిలవాల్సిన భర్త వేధింపులు, అత్త మామల సతాయింపులతో ఓ మహిళ చిన్న వయస్సులోనే బలవన్మరణం చెందింది. మండలంలోని కడప–పులివెందుల ప్రధాన రహదారి సమీపంలోని బృందావనం కాలనీలో గురువారం నవిత(24)అనే వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కడప డీఎస్పీ బి. వెంకట శివారెడ్డి కథనం మేరకు సింహాద్రిపురం మండలం అంకాలమ్మ గూడురుకు చెందిన నవితకు కడపకు చెందిన వెంకట బాబారెడ్డికి ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. వివాహం జరిగిన నెల తర్వాత నుంచి అత్త మామలు, భర్త అదనపు కట్నం కోసం వేధించసాగారు. ఈ విషయం ఆమె తల్లిదండ్రులకు తెలపడంతో అదనపు కట్నం సైతం అందించారు. అయినప్పటికీ ఆమెను మానసికంగా వేధిస్తూ ఇబ్బందులకు గురి చేసేవారు. దీంతో ఆమె మనోవేదనకు గురైంది. గురువారం ఉదయం తల్లి దండ్రులకు ఫోన్ చేసి ఇంటిలో ఉరి వేసుకుని మృతి చెందింది. కడప రూరల్ సీఐ శ్రీరామ శ్రీనివాసులు, సీకె దిన్నె ఎస్ఐ ఎం.మంజునాధ్రెడ్డిలు ఘటనా స్ధలాన్ని పరిశీలించారు. మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. తహసీల్దార్ విజయ్ కుమార్ సమక్షంలో పంచనామా నిర్వహించారు. మృతురాలి తండ్రి సుబ్బారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసినట్లు డీఎస్సీ తెలిపారు. చదవండి: (మా కుమార్తె ఏం తప్పు చేసింది.. ఎందుకు తీసుకెళ్లరు) -
మా కుమార్తె ఏం తప్పు చేసింది.. ఎందుకు తీసుకెళ్లరు
సాక్షి, కడప(చెన్నూరు): అత్త, భర్త పెట్టే వేధింపులు భరించలేకపోవడంతోపాటు సంసారానికి తీసుకెళ్లడంలేదని ఓ వివాహిత ముండ్లపల్లె గ్రామంలోని అత్త ఇంటి ముందు ధర్నా చేపట్టింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని రామనపల్లె గ్రామానికి చెందిన పెడబల్లి సుబ్బారెడ్డి, సరోజనమ్మ రెండో సంతానమైన సుస్మితను ముండ్లపల్లె గ్రామానికి చెందిన బండి వెంకట కృష్ణారెడ్డి, మాధవిల కుమారుడు బండి సురేంద్రనాథ్‌రెడ్డికి ఇచ్చి పెద్దల సమక్షంలో 2020 ఆగస్టు 5వ తేదీన వివాహం జరిపించారు. వివాహ సమయంలో కట్నకానుకల కింద రూ.15 లక్షల నగదు, 20 తులాల బంగారు నగలు ఇచ్చారు. వివాహమైనప్పటి నుంచి అత్త మాధవి, భర్త సురేంద్రనాథ్‌రెడ్డి వేధింపులకు గురి చేస్తున్నారని సుస్మిత వాపోయింది. వివాహమైన రెండు నెలల నుంచే బిడ్డలు పుట్టలేదని, పుట్టకపోతే నా కుమారుడికి వేరే పెళ్లి చేస్తామని అత్త నన్ను మానసిక ఇబ్బందులకు గురి చేసేదని చెప్పారు. తాను గర్భం దాల్చడంతో కాన్పు కోసం పుట్టింటికి వెళ్లానన్నారు. బాబు పుట్టి తొమ్మిది నెలలైనా అత్త, భర్త ఇంటికి తీసుకెళ్లలేదని వాపోయింది.మా అమ్మానాన్నలు పెద్ద మనుషులను పంపించి తనను తీసుకెళ్లాలని చెప్పినప్పటికీ వాళ్లు ససేమిరా అన్నారన్నారు. తమ కుమార్తెను ఎందుకు తీసుకెళ్లరని, ఏ తప్పు చేసిందో చెప్పాలని నిలదీయడంతో వారు మండ్లపల్లె నుంచి కడపకు వెళ్లారన్నారు. చదవండి: (ఆ దంపతులేమయ్యారు?.. దారి తప్పి తప్పారా లేక మరేదైనా..!) తన భర్తను అత్త చెప్పుచేతల్లో పెట్టుకుని ఇబ్బందులకు గురి చేస్తోందని సుస్మిత ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎంబీఏ వరకు చదివానని, బెంగళూరులో రెండేళ్లు ఉద్యోగం చేశానని చెప్పారు. తనను ఉద్యోగం మాన్పించిందన్నారు. తన భర్తకు రైల్వేలో ఉద్యోగం వచ్చిందని, నెలకు రూ.30 వేలు జీతం అని తెలిసి కూడా ఉద్యోగం వద్దని, ఇంటి వద్దనే వ్యాపారం చేసుకోమని సలహా ఇచ్చిందని సుస్మిత తెలిపారు. మా అత్త ఎందుకు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తోందో తెలియడంలేదన్నారు. ఇప్పుడు తొమ్మిది నెలల పసికందును కూడా చూడలేదంటే వారెంత కర్కోటకులో అర్థం చేసుకోవవచ్చన్నారు. విజేత మహిళా మండలి అధ్యక్షురాలి సంఘీభావం సుస్మితకు విజేత మహిళా మండలి అధ్యక్షురాలు అరుణకుమారి సంఘీభావం తెలిపి అండగా నిలిచారు. ఆమెకు న్యాయం జరిగే వరకు పోరాటాలు కొనసాగిస్తామన్నారు. బాధితురాలు సుస్మిత సమస్య తన దృష్టికి రావడంతో ఎస్ఐ శ్రీనివాసులురెడ్డి భార్యాభర్తలిద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి ఆమెకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. -
‘నా భర్తను ఇండియాకు పిలిపించండి.. అన్యాయంగా ఇరికించారు’
సాక్షి, కడప అర్బన్: దేశం కాని దేశంలో బతుకుదెరువుకోసం వెళ్లిన తన భర్తను కువైట్ వాసులు ఒకే కుటుంబానికి చెందిన మూడు హత్యకేసుల్లో అన్యాయంగా ఇరికించారని, ఎలాంటి శిక్ష పడనీయకుండా తన భర్తను ఇండియాకు రప్పించి న్యాయం చేయాలని వెంకటేష్ భార్య స్వాతి విజ్ఞప్తి చేసింది. వైఎస్సార్ జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం దిన్నెపాడు కస్పాకు చెందిన పిలోళ్ల శ్రీరాములు కుమారుడు వెంకటేష్ కువైట్‌లో ఓ సేఠ్ వద్ద టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆర్దియా పట్టణంలోని ఒకే కుటుంబానికి చెందిన సేఠ్ అహ్మద్ (80), అతని భార్య కాల్దా (62) కుమార్తె అసుమ (18)ను దారుణంగా హత్య చేశాడనే ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేసి అక్కడి జైల్లో ఉంచారు. ఆయన భార్య స్వాతి కూడా కువైట్‌లోని ఓ న్యాయవాది ఇంట్లో పనిచేస్తోంది. అయితే న్యాయవాది సహాయంతో ఈ నెల 10న కువైట్ నుంచి వైఎస్సార్ జిల్లాకు వచ్చిన వెంకటేష్ భార్య స్వాతి శుక్రవారం తన పిల్లలు జయవర్ధన్, విష్ణువర్ధన్, అత్తామామలు శ్రీరాములు, రమణమ్మ, కుటుంబసభ్యులతో కలిసి కడపలోని కలెక్టరేట్‌కు వచ్చారు. దీంతో జిల్లా జాయింట్ కలెక్టర్ గౌతమి వారివద్దకు వచ్చి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాగా, అమాయకుడైన తన భర్త వెంకటేష్‌ను ప్రభుత్వం చొరవ తీసుకుని కాపాడి ఇండియాకు రప్పించాలని కలెక్టర్ వి.విజయకుమార్ రాజుకు స్వాతి విజ్ఞప్తి చేసింది. స్పందించిన కలెక్టర్ ప్రభుత్వానికి, విదేశాంగశాఖకు విషయాన్ని వివరిస్తూ వినతిపత్రాన్ని పంపిస్తామని చెప్పారు. -
వైఎస్ఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
-
డబ్బు ఇవ్వలేదని.. జబ్బు అంటగట్టింది
ప్రొద్దుటూరు: కాన్పు చేసినందుకు డబ్బు ఇవ్వలేదనే అక్కసుతో బాలింతకు ఏకంగా ఎయిడ్స్ వ్యాధిని అంటకట్టింది ఒక ఎఫ్ఎన్ఓ (స్టాఫ్‌నర్స్ సహాయకురాలు). దీంతో భార్య, పసికందు తనకు వద్దని భర్త తీవ్ర ఆవేదనతో ఆస్పత్రి నుంచి వెళ్లిపోయాడు. కొద్ది సేపటి తర్వాత తీరిగ్గా వచ్చిన ఎఫ్ఎన్ఓ ఆమెకు ఎయిడ్స్ లేదని, డబ్బు ఇవ్వలేదనే కోపంతో ఆ వ్యాధి సోకినట్లు చెప్పానని తెలిపింది. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చాపాడు మండలం, సోమాపురం గ్రామానికి చెందిన బొజ్జ సుభాషిణి పురిటి నొప్పులు రావడంతో ఆదివారం జిల్లా ఆస్పత్రికి వచ్చింది. అదే రోజు రాత్రి ఆమె సాధారణ ప్రసవమై ఆడపిల్లకు జన్మనిచ్చింది. కొంత సేపటి తర్వాత ఎఫ్ఎన్ఓ లత వారి వద్దకు వచ్చి రూ. 2 వేలు ఇవ్వాలని అడిగింది. ప్రస్తుతానికి తన వద్ద డబ్బులు లేవని, ఉదయం భర్త రాగానే ఇస్తానని సుభాషిణి తెలిపింది. ఈ క్రమంలో సుభాషిణి, పసికందును చూసేందుకు సోమవారం ఆమె భర్త గురుప్రసాద్, అత్త జిల్లా ఆస్పత్రికి వచ్చారు. ఇంతలోనే వారి వద్దకు వచ్చిన ఎఫ్ఎన్ఓ లత మీ భార్యకు ఎయిడ్స్ ఉందని గురుప్రసాద్‌కు చెప్పింది. భార్య, పాప వద్దని రోదిస్తూ వెళ్లిపోయిన భర్త భార్యకు ఎయిడ్స్ ఉందని ఆమె చెప్పడంతో భర్త తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు. రోదిస్తూ ఆస్పత్రిలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కొద్ది సేపటి తర్వాత తేరుకొని నాకు భార్య, బిడ్డ వద్దని ఆస్పత్రి నుంచి వెళ్లిపోయాడు. దీంతో సుభాషిణి ఏడుస్తూ ఉండిపోయింది. కొద్ది సేపటి తర్వాత ఆమె వద్దకు వచ్చిన ఎఫ్ఎన్ఓ లత నాకు డబ్బులు ఇవ్వనందుకే నీకు ఎయిడ్స్ ఉందని చెప్పానని, ఎలాంటి వ్యాధి లేదని తెలిపింది. ఈ విషయం మీ అత్త, భర్తకు చెప్పు అని సూచించి తిన్నగా అక్కడి నుంచి జారుకుంది. లతపై గతంలో కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. కాన్పు అయిన వారి వద్ద డబ్బు డిమాండు చేస్తోందని పలు మార్లు ఆస్పత్రి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. ఆరోపణలు వచ్చిన ప్రతిసారి అధికారులు చర్యలు తీసుకోకుండా మందలించి పంపిస్తూ వచ్చారు. సుభాషిణి గర్భం దాల్చిన నాటి నుంచి జిల్లా ఆస్పత్రిలోనే పరీక్షలు చేయించుకునేది. ఈ క్రమంలోనే ఆమెకు ఈ ఏడాది జనవరి 31 హెచ్ఐవీ పరీక్షలు చేయగా నెగిటివ్‌గా నిర్ధారణ అయింది. సోమవారం కూడా ఆమెకు మరోసారి పరీక్షలు చేయగా నెగిటివ్ రిపోర్టు వచ్చింది. మా అత్తోళ్లు నన్ను వద్దంటున్నారు..ఇప్పుడేం చేయాలి ‘డబ్బులు కావాలంటే ఇస్తాం కదా.. రూ. 2 వేల కోసం నా జీవితాన్ని నాశనం చేస్తారా.. ఇప్పుడు నా పరిస్థితి ఏంటీ’ అని సుభాషిణి రోదించసాగింది. డబ్బు ఇవ్వలేదనే అక్కసుతో ఉదయం నుంచి ఎఫ్ఎన్ఓ నోటికి వచ్చినట్లు దుర్భాషలాడుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మా అత్తోళ్లు నన్ను వద్దంటున్నారని గుండె పగిలేలా విలపిస్తోంది. డబ్బు కోసం లేని జబ్బును తనకు అంట కట్టిందని ఆమె తెలిపింది. తనను, తన కుంటుంబ సభ్యులను మానసిక క్షోభకు గురి చేసిన ఎఫ్ఎన్ఓ లతపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని సుభాషిణి జిల్లా అధికారులను వేడుకుంటోంది. ఈ విషయమై ఆమె టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. లతపై కేసు నమోదు చేయాలని పోలీసులను కోరింది. విచారణ చేసి చర్యలు తీసుకుంటాం ఈ విషయమై ఇప్పటికే విచారణ చేశాను. బాధితురాలితో మాట్లాడి వివరాలు సేకరించాం. జనవరి 31న, ఈ రోజు హెచ్ఐవీ పరీక్షలు చేయగా ఆమెకు నెగిటివ్ అని రిపోర్టు వచ్చింది. జరిగిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాను. పూర్తి స్థాయి విచారణ చేసి చర్యలు తీసుకుంటాను. – డేవిడ్ సెల్విన్‌రాజ్, జిల్లా ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ -
టీడీపీ కార్యకర్తల వీరంగం.. పెట్రోల్ బంక్‌పై దాడి
సాక్షి, వైఎస్సార్ కడప : మండల పరిధిలోని అంకాలమ్మగూడూరులో టీడీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. ఇక్కడి పెట్రోల్ బంకులో పనిచేస్తున్న ఇద్దరిపై దాడి చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సింహాద్రిపురం మండలం దిద్దెకుంట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు రామచంద్రారెడ్డి కుమార్తె వివాహానికి మూడు వాహనాలలో శనివారం రాత్రి బయలుదేరారు. అంకాలమ్మ గూడూరులో ఉన్న పెట్రోల్ బంకులో రాత్రి 11 గంటల సమయంలో వాహనాలకు డీజిల్ నింపాలని అక్కడి సిబ్బందిని అడిగారు. వారు డీజిల్ పట్టేలోపే ఆలస్యమైందని వారితో వాగ్వాదానికి దిగి దాడి చేశారు. పెట్రోల్ బంకు యజమాని ఫిర్యాదు మేరకు సీసీ పుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
డిప్యూటీ సీఎం అంజాద్బాష కూతురు వివాహ వేడుకల్లో సీఎం జగన్
మధ్యాహ్నం 12.50: వైఎస్సార్ కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కడప పర్యటన ముగిసింది. కడప విమానాశ్రయం నుంచి సీఎం జగన్ గన్నవరం విమానాశ్రయానికి బయల్దేరారు. 12:20PM ►డిప్యూటీ సీఎం అంజాద్బాష కుమార్తె వివాహ వేడుకకు సీఎం జగన్ హాజరయ్యారు. 11:50AM ►పుష్పగిరి కంటి ఆస్పత్రిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. 11:45AM ►పుష్పగిరి విట్రియో రెటీనా ఐ ఇనిస్టిట్యూట్‌కు చేరకున్న సీఎం జగన్ 11:30AM ►సీఎం వైఎస్ జగన్ కడప జిల్లాకు చేరుకున్నారు. కాసేపట్లో పుష్పగిరి కంటి ఆస్పత్రిని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. 10:00AM సాక్షి, కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కడప జిల్లా పర్యటనకు బయల్దేరారు. తాడేపల్లిలోని నివాసం నుంచి గన్నవరం విమానశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి కడప బయల్దేరి వెళ్లారు. డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్‌బాషా కుమార్తె పెళ్లి వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. అలాగే రిమ్స్ వద్ద ఏర్పాటు చేసిన పుష్పగిరి విట్రియో రెటీనా ఐ ఇన్స్టిట్యూట్ను ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన నేపధ్యంలో అధికారులకు సూచనలిస్తున్న జిల్లా కలెక్టర్ విజయరామరాజు 08:50AM సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఆదివారం జిల్లా కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటిస్తున్న నేపథ్యంలో శనివారం సాయంత్రం అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ విజయరామరాజు ఏర్పాట్లను పరిశీలించారు. మొదట కడప విమానాశ్రయం, రిమ్స్‌లోని జీజీహెచ్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద బారికేడ్లు, వీఐపీ, వీవీఐపీ గ్యాలరీ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. నూతనంగా నిర్మించిన పుష్పగిరి కంటి ఆస్పత్రికి చేరుకుని అక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను, అనంతరం ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజద్‌బాష కుమార్తె వివాహం జరిగే జయరాజ్ గార్డెన్స్ వద్దకు చేరుకుని పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లు, బందోబస్తుకు పటిష్ట చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేసీలు గౌతమి, సాయికాంత్‌వర్మ, ధ్యానచంద్ర, శిక్షణ కలెక్టర్ కార్తీక్, ఆర్డీఓలు ధర్మచంద్రారెడ్డి, శ్రీనివాసులు, వెంకట రమణ, డ్వామా పీడీ యదుభూషణరెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ మహేశ్వర్‌రెడ్డి, ఐసీడీఎస్, ఏపీఎంఐపీ పీడీలు పద్మజ, మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అప్రమత్తంగా ఉండండి : ఎస్పీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటన నేపధ్యంలో విధుల్లో పాల్గొనే పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బు రాజన్ ఆదేశించారు. శనివారం జయరాజ్ గార్డెన్స్‌లో పోలీసు అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. సీఎం జిల్లాలో అడుగు పెట్టినప్పటి నుంచి తిరిగి పర్యటన ముగించుకుని వెళ్లే వరకు ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం ఎస్పీ అధికారులకు పలు సూ చనలు చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) దేవప్రసాద్, కడప డీఎస్పీ వెంకట శివారెడ్డి, ఏఆర్ డీఎస్పీ రమణయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు వెంకట కుమార్, రెడ్డెప్ప తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఎస్పీ కడప విమానాశ్రయం తదితర ప్రదేశాల్లో జిల్లా భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పోలీసు అధికారులు, సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. కడపకు పలువురు మంత్రుల రాక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజద్‌బాష కుమార్తె వివాహం ఆదివారం జరగనున్న నేపథ్యంలో పలువురు మంత్రులు జిల్లాకు చేరుకోనున్నట్లు కలెక్టర్ విజయరామరాజు తెలిపారు. వివరాలు.. ►స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మంత్రి తానేటి వనిత ఆదివారం రేణిగుంట నుంచి రోడ్డు మార్గాన కడపకు చేరుకుంటారు. జయరాజ్ గార్డెన్స్‌లో వివాహానికి హాజరవుతారు. రాత్రికి కడపలో బస చేస్తారు. 21వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు పరీడానగర్, నిరంజన్‌నగర్, శివానందపురంలలో ఏర్పాటు చేసిన స్థానిక కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటారు. అనంతరం కడపలోని బాయ్స్ చిల్డ్రన్ హోం, దిశా పోలీసుస్టేషన్, రిమ్స్‌లోని సఖి వన్‌స్టాప్ సెంటర్లో జరిగే కార్య క్రమాల్లో పాల్గొంటారు. అలాగే స్వధార్ హోం, భారతరత్న మహిళా మండలిని సందర్శిస్తారు. అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించి ఆ రోజు రాత్రి తిరుపతికి బయలుదేరి వెళతారు. సమావేశంలో పాల్గొన్న పోలీసు అధికారులు, సిబ్బంది (ఇన్సెట్) మాట్లాడుతున్న ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ►రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ శనివారం రాత్రి కర్నూలు నుంచి రోడ్డు మార్గాన కడపకు చేరుకుంటారు. ఆదివారం జరిగే వివాహ కార్యక్రమంలో పాల్గొని అనంతరం నెల్లూరు మీదుగా విజయవాడకు వెళతారు. ►రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు ఆదివారం ఉదయం కడపకు చేరుకుని డిప్యూటీ సీఎం అంజద్‌బాష కుమార్తె వివాహానికి హాజరవుతారు. అనంతరం ఆయన పోరుమామిళ్ల, గిద్దలూరు మీదుగా నరసరావుపేటకు బయలుదేరి వెళతారు. ►మంత్రి శంకరనారాయణ తిరుమల నుంచి రోడ్డు మార్గంలో ఉదయం 10 గంటలకు కడపకు చేరుకుంటారు. వివాహం వేడుకల్లో పాల్గొని 3 గంటలకు పెనుగొండకు బయలుదేరుతారు. ►మంత్రి అనికుమార్ యాదవ్ హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన కడపకు చేరుకుని వివాహ వేడుకల్లో పాల్గొని రాత్రి 8 గంటలకు నెల్లూరుకు బయలుదేరుతారు. జయరాజ్ గార్డెన్స్‌లో ఏర్పాట్లను పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, మేయర్ సురేష్ బాబు ఏర్పాట్ల పరిశీలన కడప నగర శివార్లలోని జయరాజ్ గార్డెన్స్‌లో జరుగుతున్న ఏర్పాట్లను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్బి అంజద్‌బాషా, మేయర్ సురేష్ బాబు పరిశీలించారు. అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు రామమోహన్‌రెడ్డి, యల్లారెడ్డి, శివకేశవ పాల్గొన్నారు. -
కడప జిల్లా పర్యటనకు సీఎం జగన్.. ముమ్మర ఏర్పాట్లు
సాక్షి, కడప: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 20వ తేదీన ఆదివారం జిల్లాకు వచ్చే అవకాశం ఉందని కలెక్టర్ విజయరామరాజు తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ప్రణాళికా బద్ధంగా ఏర్పాట్లు పూర్తి చేసి పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని స్పందన హాలులో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై జేసీలు గౌతమి, సాయికాంత్‌వర్మ, ధ్యానచంద్ర, డీఆర్వో మాలోల, ఆర్డీఓ ధర్మచంద్రారెడ్డితో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 20వ తేదీన కడప నగరంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజద్‌బాషా కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేసేందుకు జిల్లా అధికారులకు వివిధ బాధ్యతలు అప్పగించామన్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో స్పెషల్ కలెక్టర్ రామ్మోహన్, డ్వామా, ఏపీఎంఐపీ, మెప్మా పీడీలు యదుభూషణరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, డీఎంహెచ్ఓ నాగరాజు, సీపీఓ వెంకట్రావు, టూరిజం అధికారి రాజశేఖర్‌రెడ్డి, అడిషనల్ ఎస్పీ మహేష్‌కుమార్, డీఎస్పీ శివారెడ్డి, సమగ్ర శిక్ష పీడీ ప్రభాకర్‌రెడ్డి, ఆర్టీఓ శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు. టౌ చదవండి: (సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి) పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు చింతకొమ్మదిన్నె: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 20న డిప్యూటీ సీఎం అంజద్‌బాషా కుమార్తె వివాహ వేడుకకు కడపకు రానున్న నేపథ్యంలో నగర సమీపంలోని జయరాజ్ గార్డెన్స్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు డీఎస్పీ బి.వెంకట శివారెడ్డి తెలిపారు. మంగళవారం బందోబస్తు విషయమై కింది స్థాయి సిబ్బందికి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఐలు అశోక్‌రెడ్డి, సదాశివయ్య, శ్రీరాం శ్రీనివాసులు, సీకేదిన్నె ఎస్ఐ ఎం.మంజునాథ్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
అన్నమయ్య జిల్లాపై పచ్చ పాలిట్రిక్స్
టీడీపీ నాయకులు ఆ పార్టీ అధినేత కంటే రెండాకులు ఎక్కువే చదివినట్టున్నారు. ఆయన రెండు కళ్ల సిద్ధాంతంతో ప్రసిద్ధి చెందితే వీరు ప్రాంతానికో పాత్ర వేస్తూ రాద్ధాంతం చేస్తున్నారు. అక్కడో మాట.. ఇక్కడో మాట.. పూటకో మాట.. మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా ఏర్పాటుపై పాలి‘ట్రిక్స్’ చేస్తున్నారు. వీరి వ్యవహారం ఇపుడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మదనపల్లె కేంద్రంగా జిల్లా కావాలని, రాజంపేట కేంద్రంగా ఉండాలని, రాయచోటి ఎంపిక సరైనదంటూ ఆయా ప్రాంతాల్లో పాలిట్రిక్స్ చేస్తున్నారు. అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాల్సిన ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. రాజంపేట: అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలన సౌలభ్యత.. భౌగోళిక పరిస్ధితులు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే అజెండాగా ప్రభుత్వం కొత్త జిల్లాలను ప్రకటించింది. అన్ని ప్రాంతాలకు అనుకూలంగా ఉండేలా శాస్త్రీయ అధ్యయనాలతో పునర్విభజన ప్రక్రియ చేపట్టింది. ఈ క్రమంలో రాజంపేట లోక్‌సభ పరిధిలో రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు, పీలేరు, తంబళ్లపల్లె, మదనపల్లె అసెంబ్లీ సెగ్మెంట్లతో పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల పేరిట జిల్లా ఏర్పాటుకు ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో అన్నమయ్య జిల్లా విషయంలో టీడీపీ నేతలు మాత్రం తమదైన శైలిలో విషం కక్కుతున్నారు. రాజకీయ లబ్ధి కోసం ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ప్రజలను రెచ్చగొట్టేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. ఎవరెవరు..ఎలా రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా ప్రకటనపై రాజంపేట పార్లమెంటరీ టీడీపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాసులరెడ్డి తదితర నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రభుత్వ ప్రకటనపై హర్షం వ్యక్తంచేస్తున్నారు. రాజంపేట, రైల్వేకోడూరులో రాజంపేట కేంద్రంగా ప్రకటించాలని రాజంపేట టీడీపీ ఇన్చార్జి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బత్యాల చెంగల్రాయుడు అండ్ కో ఉద్యమం ముసుగేసుకొని రాజకీయచలి కాచుకుంటున్నారనే విమర్శలున్నాయి. అలాగే మదనపల్లెలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ నానాయాగీ చేస్తున్నారు. మరోవైపు నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి కూడా జిల్లాల పునర్విభజనపై టీడీపీ ట్రిపుల్ యాక్షన్ ఎపిసోడ్లో తనవంతు పాత్ర పోషిస్తున్నారు. ఒక నిర్ణయమంటూ లేకుండా, స్పష్టమైన వైఖరిని ప్రదర్శించకుండా ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా వీరు వ్యవహరించడం సరికాదని పలువురు మండిపడుతున్నారు. ఒక్కో చోట.. ఒక్కో మాట.. రాజకీయ పార్టీలు కీలక విషయాలకు సంబంధించి ఒక స్టాండ్ తీసుకుంటారు. ఆ పార్టీ నిర్ణయం మేరకు శ్రేణులు కట్టుబడతాయి. కానీ చంద్రబాబు సంగతి అలా కాదు. ఆయన ఒకే విషయంపై పలు రకాలుగా స్టాండ్ తీసుకుంటారు. రాజకీయలబ్ధి కోసం ఎలాంటి ప్రకటనలకైనా తెగబడిపోతారు. బాబుస్ఫూర్తితో ఆయనను మించి టీడీపీ నేతలు ప్రాంతానికి తగ్గట్టు స్వరాలను మారుస్తున్నారు. ప్రజలను గందరగోళానికి గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మదనపల్లెలో జిల్లా కేంద్రం ఉండాలని అక్కడి తెలుగుదేశం నేతలు, రాజంపేటను కేంద్రంగా చేయాలని ఇక్కడి టీడీపీ శ్రేణులు నానా యాగీచేస్తున్నారు. రాయచోటిలో మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రకటనలు చేయడమే కాకుండా సంబరాలు జరుపుకుంటున్నారు. వీరి తీరును పలువురు విమర్శిస్తున్నారు. ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా వ్యవవహరిస్తున్నారని మండిపడుతున్నారు. టీడీపీ వైఖరి స్పష్టంచేయాలి అన్నమయ్య జిల్లా విషయంలో టీడీపీ వైఖరి స్పష్టం చేయాలి. ఆ నేతల తీరు అనుమానంగా ఉంది. ఒక పక్క రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని కోరుతున్నారు. మరోపక్క మదనపల్లెలోనూ అదే పాట పాడుతున్నారు. ఇంకోపక్క రాయచోటిలో ఆపార్టీ వారే కృతజ్ఞతలను తెలుపుతున్నారు. రాజకీయపార్టీలు స్పష్టమైన వైఖరి లేకుండా మాట్లాడటం సరైన విధానం కాదు. –మేడా విజయశేఖర్‌రెడ్డి, జేఏసీ నాయకుడు, రాజంపేట ఒకే నిర్ణయానికి కట్టుబడాలి ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా కాకుండా అన్నమయ్య జిల్లాపై టీడీపీ స్పష్టమైన వైఖరి తెలపాలి. రాజకీయపార్టీల నాయకులు ఒకే నిర్ణయానికి కట్టుబడాలి. మూడు ప్రాంతాల్లో మూడు రకాలుగా ట్రిపుల్ యాక్షన్ చేస్తున్న టీడీపీ తీరును ప్రజలు గుర్తించాలి. –దాసరి చిదానందగౌడ్, రాష్ట్రబీసీ సంక్షేమసంఘం నేత, రాజంపేట -
Tomato Price: నెల క్రితం 3టన్నుల టమాటా లక్ష రూపాయలు.. మరి నేడు..?
సాక్షి, కడప: టమోట ధరలు భారీగా క్షీణించాయి. నెల రోజుల క్రితం 114 బాక్సుల లోడు గల బోలేరో వాహనంలో సుమారు 3టన్నుల టమాటాలు లక్ష రూపాయలు పలికాయి. ప్రస్తుతం అదే బోలేరో వాహనంలోని 114 బాక్సుల టమోటాలు రూ.6వేల ధర కూడా పలకడంలేదు. వాహనంలోకి లోడు ఎక్కించేందుకు కూలీలకు రూ.2,800, మార్కెట్‌కు తరలించడానికి వాహన బాడుగ రూ.4వేలు కలిపి మొత్తం రూ.6,800 చెల్లించాలి. లోడు టమాటాల ధర రూ.6వేలు పలికితే రైతు అదనంగా రూ.800 చేతినుంచి వేసుకుని చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో లింగాల మండలం కోమన్నూతలకు చెందిన వెంకటేష్ అనే రైతు తాను పండించిన టమాటాలను ఇలా మేకలకు మేతగా పడేశాడు. చదవండి: (జులై 1 నాటికి వారికి కొత్త జీతాలు అందాలి: సీఎం జగన్) -
కెమెరాల సాక్షిగా.. చివరి వరకు చెరగని చిరునవ్వు..
సాక్షి, కడప కోటిరెడ్డిసర్కిల్: బలవన్మరణం చెందాలనుకున్న వారు ఇటీవల ఎక్కువగా రైలు పట్టాలను ఆశ్రయిస్తున్నారు. అవి కూడా జిల్లా కేంద్రమైన కడపలోనే ఎక్కువగా జరుగుతున్నాయి. పట్టాలపై క్షణాల్లో ప్రాణాలు గాలిలో కలుస్తున్నా...జీవితంపై ఎందుకింతలా విరక్తి చెందుతున్నారో అంతు చిక్కడం లేదు. తాజాగా సోమవారం కడపలో గూడ్స్ రైలు కిందపడి ఇరువురు విద్యార్థినులు ఒకేసారి ఆత్మహత్య చేసుకున్న సంఘటను పరిశీలిస్తే....వారికి వచ్చిన కష్టమేమో ఎవరికీ అర్థం కావడం లేదు. పోలీసులు, బంధువులు, స్థానికులు, తోటి విద్యార్థులు ఇలా ప్రతి ఒక్కరూ ఎందుకిలా జరిగిందబ్బా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు తప్ప అసలు కారణాలు ఎంత వెతికినా దొరకడం లేదు. మంచి చదువులు అభ్యసిస్తూ... అనంతపురం జిల్లా యాడికి మండలం కమలపాడుకు చెందిన కల్యాణి (18) గుత్తి గేట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతోంది. యాడికి పట్టణం హాస్పిటల్ కాలనీలో నివాసముంటున్న పూజిత (18) తాడిపత్రి సరస్వతి డిగ్రీ కళాశాలలో బీఎస్సీ కంప్యూటర్స్ చదువుతోంది. చదువులో ఇరువురు తెలివైన వారే. ఉన్నత లక్ష్యాలను సాధించాలనే దిశగానే వారి విద్యాభ్యాసం కొనసాగుతోంది. ఈ క్రమంలో వీరికి ఎందుకిలాంటి ఆలోచన వచ్చిందో అంతుచిక్కడం లేదు. ఏదైనా ప్రేమ వ్యవహారమా? అనడానికి ఆధారాల్లేవు. అలాగని కుటుంబ సమస్యలు ఏవైనా ఉన్నాయనుకుంటే అవీ లేవు. తాడిపత్రి నుంచి కడపకు వచ్చి మరీ ఆత్మహత్య చేసుకోవాల్సినంత పరిస్థితి వీరికి ఎందుకొచ్చిందో కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది. చదవండి: (ఒకరు బీటెక్, మరొకరు బీఎస్సీ.. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్.. ఏ కష్టమొచ్చిందో.!) చివరి వరకు చెరగని చిరునవ్వు.. కల్యాణి, పూజితలు కడపలో బస్సు దిగి రైల్వేస్టేషన్ చేరుకునే వరకు వారి ముఖాల్లో చిరునవ్వు ఏమాత్రం చెరగలేదన్నది సీసీ కెమెరాల సాక్షిగా స్పష్టమవుతోంది. బస్టాండులో దిగిన తర్వాత ఇద్దరూ కలిసి సంతోషంగా కొన్ని సెల్ఫీ ఫొటోలు కూడా తీసుకున్నారు. మాస్క్ పెట్టుకుని ఒకసారి..లేకుండా మరోసారి...ఇలా ఒకరిపై ఒకరు ఆప్యాయతను కనబరుస్తూ జ్ఞాపకాలు మిగిల్చిపోయారు. అది వారి చివరి ఫొటోగా చెప్పవచ్చు. కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు మాత్రం తీరని శోకాన్ని మిగిల్చి వారిని కన్నీటి సంద్రంలో ముంచిపోయారు. సంఘటనపై పోలీసుల ఏమంటున్నారంటే.. కల్యాణి, పూజిత ఆత్మహత్యలపై రైల్వే ఎస్ఐ రారాజును వివరణ కోరగా ఈ సంఘటనపై తల్లిదండ్రుల నుంచి అన్ని వివరాలు సేకరించామన్నారు. అయితే వారి వద్ద మృతికి సంబంధించిన ఎలాంటి సమాచారం లేదన్నారు. వీరి కళాశాల ప్రిన్సిపాల్స్‌తోపాటు స్నేహితులతో మాట్లాడాల్సి ఉందని వివరించారు. అలాగే మృతి చెందిన విద్యార్థినుల ఫోన్‌కాల్ డేటా గురించి కూడా ఆరా తీస్తున్నామని తెలిపారు. పూర్తి సమాచారం అందగానే మీడియాకు తెలియజేస్తామని ఆయన వివరించారు. -
ఒకరు బీటెక్, మరొకరు బీఎస్సీ.. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్.. ఏ కష్టమొచ్చిందో.!
సాక్షి, అనంతపురం/ కడప కోటిరెడ్డిసర్కిల్: వారిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. యాడికిలో ఒకే బడిలో చదువుకున్నారు. ప్రాణం కంటే మిన్నగా వారి మధ్య స్నేహం చిగురించింది. ఆ స్నేహమే చివరికి వారిద్దరి ప్రాణాలను ఒకేసారి తీసుకునేటట్లు చేసింది. అనంతపురం జిల్లా యాడికి ప్రాంతానికి చెందిన ఇద్దరు స్నేహితురాళ్లు సోమవారం మధ్యాహ్నం కడప నగర పరిధిలోని భాకరాపేట రైల్వే గేటు వద్ద గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన కన్నవారికి తీరని శోకం మిగిల్చింది. రైల్వే ఎస్ఐ రారాజు కథనం మేరకు... యాడికి మండలం కమలపాడు గ్రామానికి చెందిన కల్యాణి (18) గుత్తిలోని గేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ ఈసీఈ చదువుతోంది. ఈమె తండ్రి రామాంజనేయులు యాడికిలో కూల్‌డ్రింక్ షాపు నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. యాడికి పట్టణంలోని హాస్పిటల్ కాలనీలో నివాసముంటున్న పూజిత (18) తాడిపత్రిలోని సరస్వతి డిగ్రీ కళాశాలలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుతోంది. వీరిద్దరూ వేములపాడు మోడల్ స్కూలులో ఇంటర్ వరకు కలిసి చదివారు. చదవండి: (బ్యూటీ పార్లర్లో ఉద్యోగం అన్నారు.. రిసార్టులకు పంపి..) ఈ క్రమంలో సోమవారం ఉదయం 9 గంటలకు యాడికిలో బయలుదేరి మధ్యాహ్నం కడపకు చేరుకున్నారు. 1.30 గంటల ప్రాంతంలో కడప సమీపంలోని భాకరాపేట (ఎర్రముక్కపల్లె) రైలు పట్టాల వద్దకు వెళ్లారు. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని ఆ సమయంలో వస్తున్న గూడ్స్ రైలు కిందపడ్డారు. సంఘటన స్థలంలోనే కల్యాణి మృతి చెందింది. శరీర భాగాలు విడిపోయాయి. మరో యువతి పూజిత ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండగా రిమ్స్‌కు తరలిస్తుండగా మృతి చెందింది. ఇద్దరూ ఒకేసారి ప్రాణాలు ఎందుకు తీసుకున్నారో తెలియరాలేదు. రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కడప నుంచి ఇండిగో విమాన సర్వీసులు
సాక్షి, అమరావతి: కడప నుంచి విజయవాడ, చెన్నైలకు ఇండిగో విమాన సర్వీసులు నడిపేందుకు ఆ సంస్థ ఏపీ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీడీసీఎల్)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటివరకు ఈ మార్గాల్లో విమానాలు నడిపిన ట్రూజెట్ సంస్థ తాము సర్వీసులు నడపలేమని ఒప్పదం రద్దుచేసుకోవడంతో ఇండిగోకు అవకాశం కల్పించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థకు వయబిలిటీ గ్యాప్ ఫండ్ (వీజీఎఫ్) కింద రూ.20 కోట్లు చెల్లించనుంది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇండిగో సంస్థ మార్చి 27 నుంచి వారానికి నాలుగు విమానాలను చెన్నై–కడప, విజయవాడ–కడప మధ్య నడపనుంది. -
కన్న కూతురిపై తండ్రి అత్యాచారయత్నం
సాక్షి, కడప: కన్నకూతురిపై తండ్రి అత్యాచారయత్నానికి పాల్పడిన దారుణఘటన ఖాజీపేట పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు ఖాజీపేటకు చెందిన శివ ప్రాసద్కు భార్య, పదకొండేళ్ల కూతురు ఉంది. కామంతో కళ్లు మూసుకుపోయిన అతను కూతురిపై కన్నేశాడు. శుక్రవారం రాత్రి నిద్రపోతున్న సమయంలో అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక కేకలు వేయడంతో తల్లి గమనించింది. కుమార్తె ద్వారా విషయం తెలుసుకొని శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసునమోదు చేసినట్లుఎస్ఐ కుళ్లాయప్ప తెలిపారు. అనంతరం చిన్నారిని పిలిపించి విచారించారు. నిందితుడు తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదవండి: 15 ఏళ్ల కిందట ప్రేమించి పెళ్ళి, విడాకులు.. కూలి పనులకు వెళ్లి వస్తుండగా.. -
రాయలసీమ ప్రజలకు క్షమాపణలు: సోము వీర్రాజు
సాక్షి, అమరావతి: హత్యలు చేసే కడప వాళ్లకు ఎయిర్‌పోర్టా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాయలసీమ ప్రజలను క్షమాపణలు కోరారు. 'రాయలసీమ రతనాల సీమ ఈ పదం నా హృదయంలో పదిలం. రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరు విమర్శించే విషయంలో వాడిన పదాల వల్ల రాయలసీమ ప్రజలు మనసులు గాయపడ్డాయి. ఈ పదాలను వెనక్కి తీసుకుంటున్నాను. ఈ విషయంలో క్షమాపణలు చెబుతున్నాను. నేను నిరంతరం రాయలసీమ అభివృద్ధి విషయంలో అనేక వేదికలపై ప్రస్తావిస్తూ వస్తున్న విషయం ఆ ప్రాంత వాసులకు తెలుసు. రాయలసీమకు నికర జలాలు, పెండింగ్ ప్రాజెక్టుల విషయాలను అనేక సందర్భాల్లో ప్రస్తావించాను. రాయలసీమ అభివృద్ధి ఇంకా వేగవంతం కావాలనేదే బీజేపీ ఆలోచన' అని సోమువీర్రాజు అన్నారు. చదవండి: (పాడి రైతులకు మంచి రోజులు : సీఎం జగన్) ఇదిలా ఉండగా, ప్రతి జిల్లాకు ఒక ఎయిర్‌పోర్టు నిర్మించాలన్న ప్రణాళికలో ఉన్నట్లు తెలిపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఈ నిర్ణయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ జిల్లాలకు ఎయిర్‌పోర్టులు ఎందుకంటూ వ్యాఖ్యానించారు. విశాఖలోని బీజేపీ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో.. ‘జిల్లాకో ఎయిర్‌పోర్టు ఎందుకు? కర్నూలులో ఎయిర్‌పోర్టు.. బస్సులు వెళ్లడానికి దారిలేనటువంటి కర్నూలులో ఎయిర్‌పోర్టు.. రాయలసీమకు ఎయిర్పోర్టులంట.. కడపలో ఎయిర్‌పోర్టు.. ప్రాణాలు తీసేసే వాళ్ల జిల్లాలో కూడా ఎయిర్‌పోర్టు.. వాళ్లకు ప్రాణాలు తీయడమే వచ్చు. మేం ఎయిర్‌పోర్టు వేస్తాం. ఏం వేస్తారండి ఎయిర్‌పోర్టు.. మీరు రోడ్లు వెయ్యండి..’ అంటూ రాయలసీమ ప్రజలను కించపరిచే విధంగా వీర్రాజు వ్యాఖ్యలు చేశారు. వీర్రాజు వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో అన్ని వర్గాల ప్రజలు మండిపడుతుండడంతో తన వ్యాఖ్యలపై వెనక్కు తగ్గారు. -
క్యాసినో పేరుతో చంద్రబాబు రాజకీయం: చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
సాక్షి, వైఎస్సార్ కడప: టీడీపీ అధినేత చంద్రబాబు సీనియారిటీతో దేశానికి, రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు క్యాసినో పేరుతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం కడపలో శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సంక్రాంతి అయిపోయి పదిరోజులైనా జూదం, క్యాసినోలని మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూదాన్ని ప్రభుత్వం ఎప్పుడూ ప్రోత్సహించలేదన్నారు. ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తుందని ధ్వజమెత్తారు. చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ.. తాను ముఖ్యమంత్రి అయిన తరువాతే హైదరాబాద్‌లో నైట్ లైఫ్ కల్చర్ ఏర్పాటు చేశానని చెప్పారని గుర్తు చేశారు. డిస్కోలు, బార్లు, పబ్‌లు, క్యాసినోలే నైట్ లైఫ్ అన్నారు. నైట్ లైఫ్ ఉంటేనే మనకు పరిశ్రమలు వస్తాయని మాట్లాడిన చంద్రబాబు ఇవాళ ప్రభుత్వంపై చంద్రబాబు కవాలనే బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ఇదే చంద్రబాబు హయాంలో జరిగి ఉంటే ప్రజల సంతోషాన్ని కాలరాస్తున్నారు అని మాట్లాడే వాడని విమర్శించారు. ‘ఉద్యోగులు టీడీపీ హయాంలో సంఘాలు ఏర్పాటు చేసుకుంటే..చంద్రబాబు ఈ సంఘాల అంతు చూస్తా..తోకలు కత్తరిస్తానని బెదిరించాడు. ఈ రోజు సంఘాలన్ని ఏకతాటిపైకి రండి అని పిలుపునిస్తున్నారు. ఈ రోజురాష్ట్రంలో ప్రెండ్లీ ప్రభుత్వం ఉంది. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకుందామని ప్రభుత్వం కోరుతోంది. కరోనా లేని సమయంలో ఉద్యోగులు అడగకపోయినా కూడా వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే ఐఆర్ 27 శాతం ఇచ్చారు. ఇప్పుడున్న పరిస్థితిలో ఐదు డీఏలు ఇస్తే వెసులుబాటు ఉంటుందని ఇలా చేస్తున్నారు. వైఎస్ జగన్ ఇస్తున్న రూ.10 వేల కోట్ల భారం ఎక్కడికి వెళ్తుంది. ప్రభుత్వానికి భారమైన ఉద్యోగుల సంక్షేమాన్ని సీఎం వైఎస్ జగన్ ఆలోచిస్తున్నారని చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. -
వైఎస్సార్ జిల్లాకు ‘జల’ అవార్డు
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ జల అవార్డుల్లో ఉత్తమ జిల్లాగా ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ జిల్లా నిలిచింది. సౌత్ జోన్ పరిధిలో ఉత్తమ జిల్లా కేటగిరీలో రెండో స్థానం సాధించింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ జాతీయ జల అవార్డులు–2020ను ప్రకటించారు. ఇందులో ఉత్తమ రాష్ట్ర విభాగంలో ఉత్తరప్రదేశ్‌కు ప్రథమ బహుమతి లభించగా, ఆ తర్వాతి స్థానాల్లో రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాలు నిలిచాయి. ఈ సందర్భంగా షెకావత్ మాట్లాడుతూ ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా 18 శాతం కంటే ఎక్కువగా ఉండగా, పునరుత్పాదక నీటి వనరుల్లో మాత్రం కేవలం నాలుగు శాతమే ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే ‘జల్ సమృద్ధ్ భారత్’ సాధనలో దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, జిల్లాలు, వ్యక్తులు, సంస్థలు చేసిన ఆదర్శప్రాయమైన పనులు, ప్రయత్నాలను గుర్తించి ప్రోత్సహించేందుకు జాతీయ జల అవార్డులను ప్రధానం చేస్తున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు. ఉపరితల జలాలు, భూగర్భ జలాలు జల చక్రంలో అంతర్భాగంగా ఉన్నాయన్న వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకుంటూ నీటి వనరుల నిర్వహణలో సమగ్ర విధానాన్ని అవలంబించేలా ఏకీకృత జాతీయ జల అవార్డును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి చెప్పారు. -
మహానేత వైఎస్సార్‌కు సీఎం ఘన నివాళి
వేంపల్లె : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా రెండోరోజు శుక్రవారం ఉదయం ఇడుపులపాయలోని మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు. అంతకు ముందు వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డిలు నివాళులర్పించారు. అనంతరం ఇడుపులపాయలోని నెమళ్ల పునరుత్పత్తి కేంద్రం పక్కన ఉన్న చర్చిలో ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో సీఎం జగన్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. పాస్టర్లు బెనహరబాబు, నరేష్, మృత్యుంజయలు ప్రార్థనలు చేశారు. అనంతరం సీఎం జగన్ బంధువులతో కొద్దిసేపు ముచ్చటించారు. ఆ తర్వాత వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పులివెందుల వెళ్లారు. తిరిగి సాయంత్రం 5.45 గంటలకు ఇడుపులపాయ చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద సుమారు గంటపాటు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులతో ఆప్యాయంగా మాట్లాడారు. ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం గెస్ట్‌హౌస్ చేరుకుని రాత్రికి అక్కడే బస చేశారు. నేడు శనివారం పులివెందుల సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్నారు. ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి -
AP: బిర్లాతో ఉపాధికి ఊతం
ప్రగతి పతాకాలతో రెపరెపలాడుతున్న పులివెందుల సొంత గడ్డను, వైఎస్సార్ జగనన్న హౌసింగ్ లే అవుట్‌ను హెలికాప్టర్లో ప్రయాణిస్తూ చూస్తుంటే గర్వంగా ఉంది. నామీద మీకున్న అభిమానం, ప్రేమ, మమకారం, ఆప్యాయతల మధ్య ఈ రోజు వైఎస్సార్ జిల్లా పులివెందులలో 7,309 మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. పక్కనే బ్రాహ్మణపల్లెలో మరో 733 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇవన్నీ కూడా మొదట్లోనే (గత క్రిస్మస్ రోజున) అందరితోపాటు చేద్దామనుకున్నాం. కానీ రకరకాల కోర్టు కేసులు, గిట్టని వారు రకరకాల ఇబ్బందులు పెట్టిన పరిస్థితుల్లో ఆ చిక్కుముడులన్నింటినీ విప్పుకుని ఈ క్రిస్మస్ సందర్భంగా మొత్తం 8,042 మంది అక్కచెల్లెమ్మల చేతుల్లో ఈ ఆస్తిని పెడుతున్నాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, కడప/ పులివెందుల/టౌన్/రూరల్: బిర్లా పరిశ్రమ రాకతో వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి అవుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా రెండవ రోజు శుక్రవారం ఆయన పులివెందులలోని సంయు గ్లాస్ ఫ్యాక్టరీ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్ లిమిటెడ్ కంపెనీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆదిత్య బిర్లా గ్రూపు వస్త్ర ఉత్పత్తి కేంద్రం పులివెందులలో ఏర్పాటు చేయడం చరిత్రాత్మకమని, సంతోషదాయకమని అన్నారు. ప్రపంచంలోనే 500 పెద్ద కంపెనీల్లో ఆదిత్య బిర్లా కంపెనీ ఒకటి అని తెలిపారు. ఈ కంపెనీలో 85 శాతం మంది మహిళలకే ప్రాధాన్యత ఇస్తూ సుమారు 2 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. ఈ కంపెనీకి దేశ వ్యాప్తంగా 3031 ఫ్యాషన్ రిటైల్ స్టోర్స్ ఉన్నాయని, 25 వేల మల్టీ బ్రాండ్స్ దుకాణాలు, 6,500 డిపార్ట్మెంట్స్ స్టోర్స్‌ను నడుపుతోందన్నారు. వ్యాన్ హ్యుసేన్, అలెన్ సోలీ వంటి పెద్ద, పెద్ద బ్రాండ్లను ఈ కంపెనీ ఉత్పత్తి చేస్తూ.. 2020–21లో రూ.8,700 కోట్ల టర్నోవర్‌తో ముందుకు సాగిందని చెప్పారు. మా సహకారం ఎప్పుడూ ఉంటుంది పులివెందులలో రూ.110 కోట్ల పెట్టుబడితో 2112 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నందుకు కుమార మంగళం బిర్లా, అశిష్, చీఫ్ సప్లయ్ ఆఫీసర్ స్వామినాథన్, కార్పొరేట్ ఎఫైర్స్ హెడ్ వివేక్, అతని బృంద సభ్యులకు సీఎం వైఎస్ జగన్ ధన్యవాదాలు తెలిపారు. ‘ఇక్కడికి సమీపంలో పెద్ద హౌసింగ్ కాలనీ రాబోతోంది. 7400 ఇళ్లు నిర్మించబోతున్నాం. దాదాపు 25 వేల మంది ప్రజలు ఇక్కడ నివసించబోతున్నారు. ఇప్పటికే పనులు కూడా మొదలయ్యాయి. ప్రభుత్వమే స్కిల్ డెవలప్మెంట్ కళాశాలలు నిర్మిస్తోంది. ఇది మీకు కచ్చితంగా ఉపయోగపడుతుంది. దీని సహాయంతో మీరు మా వాళ్లకు శిక్షణ ఇచ్చే అవకాశం ఉంది. వీటన్నింటితో పాటు నేను కూడా అందుబాటులో ఉంటాను. భవిష్యత్‌లో మరింత మెరుగైన ఫలితాలు సాధించడానికి, సత్సంబంధాలు నెలకొల్పే దిశగా ఇరువైపులా ఇది ఉపయోగపడుతుంది’ అని అన్నారు. అనంతరం ఆయన ఆదిత్య బిర్లా కంపెనీ ప్రతినిధులకు భూమి కేటాయింపు పత్రాలు అందజేశారు. వారు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్ర పటాన్ని సీఎం వైఎస్ జగన్‌కు అందించారు. ఆ తర్వాత ఆదిత్య బిర్లా ఎండీ ఆశిష్ దీక్షిత్ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం తమకు అన్ని విధాలా సహకరిస్తోందని చెప్పారు. త్వరలోనే పరిశ్రమను నెలకొల్పి ఎక్కువ శాతం మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. మార్కెట్ యార్డులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో నాగలితో సీఎం జగన్ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం సీఎం వైఎస్ జగన్ శుక్రవారం పులివెందుల వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ.10.50 కోట్లతో నిర్మించిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. చీనీ రైతుల సౌకర్యార్థం రూ.4 కోట్ల 79 లక్షలతో నిర్మించిన షెడ్డును ప్రారంభించారు. ఆర్అండ్బీ బంగ్లా ఎదురుగా రూ.3.64 కోట్లతో నిర్మించిన మోడల్ పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించారు. పెద్దముడియం, శ్రీ అవధూత కాశినాయన మండలాల్లో పోలీసుస్టేషన్లను ఇక్కడి నుంచే ప్రారంభించారు. అంబకపల్లె రోడ్డులోని రాణితోపు పార్కు ఎదురుగా రూ.2.60 కోట్లతో నిర్మించిన ఫిష్ ఆంధ్ర అక్వా హబ్‌ను ప్రారంభించారు. నియోజకవర్గంలో 100కు పైగా ఫిష్ కియోస్క్‌లు ఏర్పాటు చేస్తున్నామని సీఎం చెప్పారు. రీటైల్ షాపులు త్వరలోనే అన్నిచోట్ల రాబోతున్నాయన్నారు. రాష్ట్రంలో 70 ఆక్వా హబ్‌లు, 14 వేల రీటైల్ షాపులు పెడుతున్నామన్నారు. దీనివల్ల చేపలు, రొయ్యలు పండించే రైతులకు మంచి ధర వస్తుందని చెప్పారు. మోడల్ పోలీస్‌స్టేషన్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంతింటి కల నెరవేర్చడం ఆనందంగా ఉంది పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నందుకు ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. పులివెందుల సమీపంలోని మెగా టౌన్షిప్ లే అవుట్ కాలనీలో 8,042 మంది మహిళలకు ఇంటి పట్టాలు, ఇల్లు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ► హెలికాప్టర్లో వస్తున్నప్పుడు 323 ఎకరాల్లో ఉన్న ఈ కాలనీ మొత్తం చూశాను. ఇంత మందికి ఇక్కడ ఇళ్లు కట్టించే అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు ఆనందంగా ఉంది. ఒక్కో ఇంటి పట్టా విలువ రూ.2 లక్షలు.. ఇల్లు కట్టడానికి మరో రూ.2 లక్షలు.. ఆ తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఏడు వార్డు సచివాలయాలు, రెండు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ఏడు ప్రాథమిక పాఠశాలలు, 15 ఎకరాల్లో మంచి పార్కులు, ఒక పోలీసుస్టేషన్, ఒక పోస్టాఫీసు, 10 ఎకరాల్లో మంచి ఆటస్థలం.. ఇవన్నీ ఇక్కడ ఏర్పాటు అవుతున్నాయి. ► రూ.28 కోట్లతో నీటి సరఫరా, రూ.49 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, రూ.69 కోట్లతో రోడ్ల నిర్మాణం మొత్తం కలిపి రూ.147 కోట్లు ఇక్కడ ఖర్చు చేస్తున్నాం. ఇందులో ఇంటికి సగటున మరో రూ.2 లక్షలు ఖర్చుపెడుతున్నాం. మొత్తంగా రూ.6 లక్షలు. ఇవన్నీ పూర్తయ్యాక ఇక్కడ ఇంటి విలువ కనీసం రూ.10 లక్షలు ఉంటుంది. ఈ మొత్తాన్ని అక్కచెల్లెమ్మల చేతిలో పెట్టినట్లవుతుంది. మెగా టౌన్షిప్ లే అవుట్ కాలనీలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమ ప్రారంభోత్సవంలో సీఎం జగన్ ఈ పక్కనే ఇండస్ట్రియల్ పార్క్ ఈ కాలనీ పక్కనే ఇండస్ట్రియల్ పార్కు రాబోతోంది. అపాచీ అంటే అడియాస్ షూ తయారు చేసే కంపెనీని తీసుకువచ్చాం. ఆ పనులు కూడా జరుగుతున్నాయి. అక్కడ దాదాపు 2 వేల మందికి ఉద్యోగ అవకాశాలు దొరకుతాయి. ఆదిత్య బిర్లా కంపెనీ కూడా ఇక్కడే వస్తుంది. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాక ఈ కంపెనీలకు నడుచుకుంటూ వెళ్లి ఉద్యోగాలు చేసుకోవచ్చు. నెలకు కనీసంగా రూ.10 వేలో, రూ.15 వేలో సంపాదించొచ్చు. మంచి జీతాలతో ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి. ఫిష్ ఆంధ్ర ఆక్వా హబ్‌లో ఉత్పత్తులను పరిశీలిస్తున్న సీఎం వైఎస్ జగన్ శరవేగంగా అభివృద్ధి పనులు ► పులివెందులలో రూ.500 కోట్లతో చేపట్టిన వైఎస్సార్ ప్రభుత్వ వైద్య కళాశాల పనులు వేగంగా సాగుతున్నాయి. 500 పడకల ఈ మెడికల్ కాలేజీ 2023 డిసెంబర్ నాటికి అందుబాటులోకి వస్తుంది. ► నూతన బస్సు డిపో, బస్సు స్టేషన్ నిర్మాణ పనులు, శిల్పారామం ఆధునీకరణ పనులు, పులివెందుల క్రీడా మైదానం (ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్) పనులు, ఉలిమెల్ల సరస్సు అభివృద్ధి పనులు, పులివెందుల యూజీబీ నిర్మాణ పనులు, సమగ్ర నీటి సరఫరా పథకం పనులు గడువులోగా పూర్తి చేస్తాం. ► ఇడుపులపాయ పర్యాటక సర్క్యూట్, వైఎస్సార్ మెమోరియల్ గార్డెన్ అభివృద్ధి పనులు, గండి వీరాంజనేయస్వామి దేవస్థానం పునర్నిర్మాణ పనులు, వివిధ కళాశాలల్లో, పాఠశాలల్లో నిర్మాణ పనులు గడువులోగా పూర్తవుతాయి. ► రూ.480 కోట్లతో పులివెందుల నియోజకవర్గంలో వాటర్ గ్రిడ్ పనులు 2022 జూన్ నాటికి, రూ.5,036 కోట్లతో పులివెందుల, రాయచోటి, తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాల్లోని ఆయకట్టును స్థిరీకరించేందుకు చేపట్టిన జీఎన్ఎస్ఎస్ ప్రధాన కాలువ నుండి హెచ్ఎన్ఎస్ఎస్ కాలువకు నీటి ఎత్తిపోతల పథకం పనులు 2023 జూన్ నాటికి పూర్తవుతాయి. ► రూ.1,100 కోట్లతో చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి ఎర్రబల్లి చెరువుకు నీటిని నింపడం ద్వారా వేంపల్లె మండలంలోని యురేనియం ప్రభావిత ఏడు గ్రామాలకు నీటి సరఫరా నిమిత్తం చేపట్టిన ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు 2022 డిసెంబరు నాటికి పూర్తవుతాయి. ► ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు ఎస్బీ అంజద్‌బాష, ధర్మాన కృష్ణదాస్, మంత్రులు ఆదిమూలపు సురేష్, రంగనాథరాజు, సీదిరి అప్పలరాజు, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నన్ను గుండెల్లో పెట్టుకున్నారు సభ ప్రారంభంలో వైఎస్ జగన్.. చేతిలో ఉన్న మైకును చేతితో కొడుతూ.. ‘ఇలా పులివెందులలో కొట్టడం ద్వారా వచ్చే ఆనందం మరెక్కడా రాదు. నన్ను మీ గుండెల్లో పెట్టుకుని ఆప్యాయత చూపిస్తున్న ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అవ్వ, తాత, ప్రతి సోదరుడు, స్నేహితుడికి శిరస్సు వంచి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’ అన్నారు. సభానంతరం ముఖ్యమంత్రి.. రేణుక, షేక్ అప్సాబి, ఓబిగారి బీల అనే మహిళలకు ఇంటి పట్టాలు, గృహ మంజూరు పత్రాలను అందజేశారు. జగనన్న మా దైవం.. మెగా టౌన్షిప్ లే అవుట్లో ఇంటి స్థలంతోపాటు ఇంటి మంజూరు పత్రాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందుకోవడం సంక్రాంతి పండుగ ఈరోజే వచ్చినంత సంబరంగా ఉంది. నా భర్త ఆటో డ్రైవర్. తొమ్మిదేళ్లుగా అద్దె ఇంట్లో నివసిస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో అనేక సార్లు తిరిగినా మాకు ఇంటి పట్టా మంజూరు కాలేదు. అయితే జగనన్న పుణ్యమా అని ఇవాళ ఆయన చేతుల మీదుగా ఏకంగా ఇంటి మంజూరు పత్రాలు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. అమ్మ ఒడి, ఆసరా వంటి ప్రభుత్వ పథకాల వల్ల మా లాంటి వాళ్లందరం చాలా సంతోషంగా ఉన్నాం. కరోనా సమయంలో జగనన్న చాలా బాగా ఆదుకున్నారు. ఆయన మేలు ఎప్పటికీ మరచిపోం. జగనన్న మా దైవం. ఎన్ని కష్టాలున్నా ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజలకు మేలు చేస్తున్న జగనన్నకు వందనం. – రేణుక, పులివెందుల -
పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం జగన్
-
మహానేత వైఎస్సార్‌కు సీఎం వైఎస్ జగన్ నివాళి
-
తొమ్మిదేళ్లు ఆఫీసుల చుట్టూ తిరిగా అన్నా..మీరు చెప్పినట్లు చేశారన్నా
పులివెందుల పర్యటనలో భాగంగా జగనన్న కాలనీ ఇళ్ల పట్టా పంపకాల సందర్భంగా లబ్ధిదారుల ముఖంలో సంతోషం వెల్లివిరిసింది. సీఎం వైఎస్ జగన్ స్వయంగా పట్టాలు అందిస్తున్న తరుణంలో ఓ ఆడపడుచు మైకు అందుకుని భావోద్వేగానికి లోనైంది. ఇంటి పట్టా అందుకున్న సందర్భంగా సంక్రాంతి పండుగ చేసుకున్నట్లు ఉందని హుషారుగా మాట్లాడింది లబ్దిదారురాలు రేణుక. తన భర్త ఒక ఆటోడ్రైవర్ అని, సొంత ఇల్లు కోసం తొమ్మిదేళ్లు ఆఫీసుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందని చెప్పిందామె. అలాంటి సమయంలో ముఖ్యమంత్రిగా వచ్చిన జగనన్న.. ఇచ్చిన హామీకి కట్టుబడి పట్టాలు అందించడం సంతోషంగా ఉందని తెలిపిందామె. అంతేకాదు కరోనా కష్టకాలంలో నిర్లక్క్ష్యం చేయకుండా ఆదుకోవడం, నెలకు రెండుసార్లు రేషన్ ఇవ్వడం, ఇంకా ఇస్తుండడంపై రేణుక సంతోషం వ్యక్తం చేసింది. కష్టకాలంలో ఆసరాగా నిలిచిన వైఎస్ అవినాష్ రెడ్డికి సైతం ధన్యవాదాలు తెలిపింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం వైఎస్సార్ కుటుంబానికి మాత్రమే సాధ్యమని, పులి కడుపునా పులే పుడుతుందని సంబురంగా మాట్లాడిందామె. ఒక అన్నలాగా, తమ్ముడిలాగా, తండ్రిలాగా ఆడవాళ్ల రక్షణ కోసం చట్టం చేశారని తెలిపిందామె. చివరగా.. శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నా అని పేర్కొందామె. -
పులి కడుపున పులే పుడుతుంది
-
ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ కంపెనీకి సీఎం జగన్ శంకుస్థాపన
-
పులివెందులలో 323 ఎకరాల్లో జగనన్న కాలనీ: సీఎం జగన్
సాక్షి, వైఎస్సార్ కడప: మూడు రోజుల కడప జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం పులివెందుల నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. పులివెందులలో 323 ఎకరాల్లో జగనన్న కాలనీ నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఒక్కో ఇంటి పట్టా విలువ కనీసం రూ. 2 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. రూ. 147 కోట్లతో జగనన్న కాలనీ అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. జగనన్న కాలనీలో 8042 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినట్లు సీఎం జగన్ తెలిపారు. ప్రభుత్వం ఒక్కో ఇంటిపై రూ. 6 లక్షలు ఖర్చు పెడుతోందని పేర్కొన్నారు. కోర్టు కేసుల కారణంగా కార్యక్రమం ఆలస్యమయిందన్నారు. జగనన్న కాలనీలో అన్ని రకాల మౌలిక సదుపాయల అభివృద్ధి చేపట్టినట్లు తెలిపారు. జగనన్న కాలనీకి సమీపంలోనే ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు, నివాస ప్రాంతాలకు సమీపంలోనే ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. చదవండి: ప్రభుత్వం ఒక్కో ఇంటిపై రూ. 6 లక్షలు ఖర్చు పెడుతోంది: సీఎం జగన్ నియోజక వర్గంలో ఆక్వాహబ్ సహా అనేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. పులివెందులలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్‌కు రూ. 100 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. పులివెందులలో రూ. 65 కోట్లతో సమగ్రనీటి పథకం, నియోజకవర్గంలో ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా అందించనున్నట్లు చెప్పారు. ప్రతి మండలానికి మర్కెటింగ్ గిడ్డంగి నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగంలో మరిన్ని ముఖ్యాంశాలు: ►చినీ రైతుల కోసం 6వేల టన్నుల నిల్వ చేసే పెద్ద షెడ్డూ ఏర్పాటు ►పెద్దముడియం, కాశీనాయన పోలీసుస్టేషన్లు ప్రారంభం ►రూ.34 కోట్లతో కొత్త బస్‌స్టేషన్ ఏర్పాటు ►పులివెందులలో శిల్పారామం అభివృద్ధికి రూ.13 కోట్లు ►రూ.18 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం ►రూ.44 కోట్లతో పార్క్ ఏర్పాటు ►2023 నాటికి గండి వీరాంజనేయ ఆలయం పునర్నిర్మాణం ►మార్కెట్ యార్డులో రూ.10.5 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వైఎస్ఆర్ ఘాట్‌లో మహానేతకు సీఎం వైఎస్ జగన్ నివాళులు
-
వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో ఎంఐహెచ్, ఈఎంసీలు ప్రారంభం
-
సీమకు మేలు జరిగేలా సీఎం జగన్ అడుగులు
-
ప్రభుత్వం ఒక్కో ఇంటిపై రూ. 6 లక్షలు ఖర్చు పెడుతోంది: సీఎం జగన్
3.35PM 8042 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం ఇళ్ల పట్టాల పంపీణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ 3.00PM పులివెందులలో 323 ఎకరాల్లో జగనన్న కాలనీ: సీఎం జగన్ ప్రభుత్వం ఒక్కో ఇంటిపై రూ. 6 లక్షలు ఖర్చు పెడుతోంది: సీఎం జగన్ రూ. 147 కోట్లతో రూపాయలతో జగనన్న కాలనీ అభివృద్ధి.. ఒక్కో ఇంటి పట్టా విలువ కనీసం రెండు లక్షల రూపాయలు ఉంటుంది: సీఎం జగన్ 2.40 జగనన్న హౌసింగ్ కాలనీకి చేరుకున్న సీఎం జగన్. అక్కడ హౌసింగ్ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేయనున్న సీఎం జగన్ 2.25PM దీనిలో భాగంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. పులివెందులలో ఆదిత్యా బిర్లా పెట్టుబడులు చారిత్రాత్మక ఘటనగా అభివర్ణించారు. ప్రస్తుతం ఈ కంపెనీ ద్వారా సుమారు రెండువేల మందికి ఉద్యోగావకాశాల లభించినున్నట్లు తెలిపారు..ఒక్క పులివెందులలోనే భవిష్యత్తులో 10వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. ప్రపంచంలోని ప్రముఖ సంస్థల్లో ఆదిత్య బిర్లా ఒకటి. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ కంపెనీకి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ ఏర్పాటు:చేయనున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 2.20PM పులివెందుల ఇండస్ట్రియల్ పార్క్‌లో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ కంపెనీకి సీఎం జగన్ శంకుస్థాపన. ఆదిత్య బిర్లా గ్రూప్ రూ. 110 కోట్ల పెట్టుబడులు.. 2112 మందికి ఉపాధి. మహానేతకు ఘన నివాళి 11.00 AM ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిని వైఎస్ భారతి 9.30 AM ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు. సీఎం జగన్ వెంట మంత్రులు అంజాద్ భాషా, ఆదిమూలపు సురేష్, అప్పలరాజు ఉన్నారు. 09:25AM ►వైఎస్సార్ ఘాట్ వద్ద మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి వైఎస్ విజయమ్మ నివాళులర్పించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 08:50AM సాక్షి, కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం పులివెందుల నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం పులివెందులలోని జగనన్న హౌసింగ్ కాలనీకి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సీఎం వైఎస్ జగన్ నేటి పర్యటన వివరాలు ఇలా.. ►24వ తేదీ శుక్రవారం ఉదయం 9.10 గంటల నుంచి 9.40 గంటల వరకు ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొంటారు. ►10 గంటలనుంచి 12.00 గంటలవరకు ఇడుపుపాయ వైఎస్సార్ గెస్ట్‌హౌస్‌లో నిర్వహించే ప్రార్థనలలో పాల్గొంటారు. ►మధ్యాహ్నం 2గంటలకు పులివెందులలోని ఏపీఐఐసీ భూముల వద్దకు చేరుకుంటారు. ►2.10 గంటలకు ఆదిత్య బిర్లా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ యూనిట్‌కు శంకుస్థాపన చేస్తారు. ►2.40 గంటలకు జగనన్న హౌసింగ్ కాలనీకి చేరుకుని అక్కడ హౌసింగ్ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. ►3.35నుంచి 3.50గంటలవరకు పులివెందుల టీటీడీ కల్యాణ మండపం ఎదురుగా ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డును ప్రారంభిస్తారు. ►3.55 గంటలకు పులివెందులలోని నూతన మోడల్ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభిస్తారు. ►4.15గంటలకు అంబకపల్లె రోడ్డులోని రాణితోపు పార్కు ఎదురుగా ఉన్న ఆంధ్ర ఆక్వా హబ్‌ను ప్రారంభిస్తారు. ►5.05 గంటలకు ఇడుపులపాయ హెలీప్యాడ్వద్ద వైఎస్సార్సీపీ నాయకులతో కాసేపు మాట్లాడి వైఎస్సార్ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. -
వైఎస్సార్ జిల్లాలో సీఎం జగన్ పర్యటన(ఫోటోలు)