
సాక్షి, వైఎస్సార్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు విమర్శలు గుప్పించారు. జనసేన పవన్ కల్యాణ్‌కు చెందిన పార్టీ, కనుక జనసేన పొత్తుల గురించి మాట్లాడే అధికారం ఆయనకు ఉంటుందని అన్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్ళారని గుర్తు చేశారు.
అయితే గతంలో ఆంధ్రప్రదేశ్‌కి పాచిపోయిన లడ్లు ఇచ్చారని విమర్శించి, నేడు అదే బీజేపీతో పొత్తులో ఉన్నాడని ధ్వజమెత్తారు. ‘బద్వేలు ఉప ఎన్నికల్లో పవన్ బీజేపీకి మద్దతిచ్చారు. ఇప్పుడేమో టీడీపీతో కూడా పొత్తు అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ఎవరితో పొత్తులు పెట్టుకుంటారో ఆయనకే అవగాహన లేదని’ వ్యంగాస్త్రాలు సంధించారు. పవన్‌ని విమర్శించేంత స్థాయి, మెచ్యూరిటీ తనకు లేదంటు చురకలంటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ముందుకు వెళ్తుందని తెలిపారు.
చదవండి: ‘చంద్రబాబు ట్రాప్‌లో కోదండరాం, హరగోపాల్ ఎలా పడ్డారో, అర్థం కావడం లేదు’