సాక్షి,తాడేపల్లి:అందితే జుట్టు అందకపోతే కాళ్లు అనేది చంద్రబాబుకు తెలిసిన విద్య అని మాజీ మంత్రి,వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఆదివారం(జనవరి19) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.
‘నాడు తిరుమల దర్శనానికి వచ్చినపుడు అమిత్‌షాపై రాళ్ల వర్షం కురిపించారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నాయి. విభజన సమస్యలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి. ఇలాంటి సమయంలో చంద్రబాబు, పవన్‌కల్యాణ్ సమస్యల గురించి మాట్లాడకుండా విందులేంటో. సమస్యలన్నీ పక్కనపెట్టి వైఎస్ జగన్ ప్యాలెస్‌ల గురించి మాట్లాడుతున్నారు. అమిత్ షాతో చంద్రబాబు వైజాగ్ స్టీల్‌ప్లాంట్ విషయం మాట్లాడలేదు.
లోకేష్‌ను అదుపులో పెట్టుకోమని అమిత్ షా వార్నింగ్..
అమిత్‌షా ఏం మాట్లాడారో మాకు సమాచారం ఉంది. లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేస్తానని చంద్రబాబు అమిత్‌షాను అడిగారట. లోకేష్ అన్ని శాఖల్లో వేలు పెడుతున్నారని, ఆయనను ముందు అదుపులో పెట్టుకోవాలని అమిత్‌షా చంద్రబాబును హెచ్చరించారు. లోకేష్ వసూళ్ల కార్యక్రమంలో నిమగ్నమైనందున స్పీడ్ తగ్గించుకోవాలని అమిత్ షా బాబుకు సూచించారు.
అమిత్ షా సలహాలు బయటికి రాకుండా కథలు వండి వారుస్తున్నారు. గత్యంతరం లేకే చంద్రబాబు పవన్‌కల్యాణ్‌ను డిప్యూటీ సీఎం చేశారు. చంద్రబాబు తప్పిదం వల్లే పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది.వైఎస్ జగన్ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా జరిగాయి’అని అంబటి తెలిపారు.
అంబటి రాంబాబు ఇంకా ఏమన్నారంటే..
- చంద్రబాబు అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే రకం
- రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నాయ్
- విభజన సమస్యలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి
- రాష్ట్రంలోని సమస్యలను వదిలేసి జగన్ ఆస్తుల గురించి అమిత్ షా అడిగారని ప్రచారం చేస్తున్నారు
- ఆవు కథ మాదిరి వైఎస్ జగన్ పై బురదజల్లడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారు
- చంద్రబాబు నివాసముండేదే అక్రమ కట్టడం
- అక్రమకట్టడంలోనే విందు ఇస్తున్నామని అమిత్ షాకు ఎందుకు చెప్పలేదు
- ఆ ఇల్లు క్విడ్ ప్రోకోలో కొట్టేసిందని అమిత్ షాకు ఎందుకు చెప్పలేదు
- కృష్ణమ్మ వరద ముంచేసిన ఇంట్లోనే మీరు కూర్చున్నారని ఎందుకు చెప్పలేదు
- హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకున్న చంద్రబాబు ఎవరికైనా చూపించాడా
- చంద్రబాబు మాదిరి జగన్ మోహన్ రెడ్డి క్విడ్ ప్రోకోలో ఇళ్లు తీసుకోలేదు
- లోకేష్ ను ఉపముఖ్యమంత్రిగా చేయాలని అమిత్ షా ను చంద్రబాబు అడిగారు
- మీ అబ్బాయి లోకేష్ స్పీడ్ ను తగ్గించుకోమని అమిత్ షా చెప్పారు
- ఎక్కడపడితే అక్కడ వేలు పెడుతున్నాడు...కొంచెం తగ్గమని చెప్పారు
- వైఎస్ జగన్ ఇళ్ల గురించి పాతచింతకాయ పచ్చడి కథలెందుకు
- పోలవరం రెండవ డయాఫ్రమ్ వాల్ పనులు నిన్న ప్రారంభించారు
- డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి చంద్రబాబు అవివేకం
- టీడీపీలో చేసిన తప్పిదమే డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది
- చంద్రబాబు,దేవినేని ఉమా , టీడీపీ తప్పిదాన్ని జగన్ పై నెట్టడం తప్పు
- వైఎస్ జగన్ హయాంలోనే పోలవరం పనులు అద్భుతంగా జరిగాయి
- స్పిల్ వే , కాఫర్ డ్యామ్ లు జగన్ హయాంలోనే పూర్తి చేశారు
- తిరుపతి ఘటన మానవతప్పిదం
- తిరుపతికి ఇప్పుడు రమ్మని చెప్పండి ఎన్డీయేను
- తిరుపతి పై ఈ ప్రభుత్వం పూర్తిగా పట్టు కోల్పోయింది
- లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారని మాపై అభాండాలు వేశారు
- ఆ పాపమే ఇప్పుడు కూటమి పాలనను వెంటాడుతోంది
- చెప్పేటందుకే చంద్రబాబు నీతులు
- చంద్రబాబు, ఆయన కుమారుడు ఒక్కొక్కరినే కంటారు
- పేదలు మాత్రం ఇద్దరు ముగ్గురు కనమంటున్నారు
- ఏపీలో అసమర్ధపాలన సాగుతోంది
- లోకేష్ భజన తగ్గించాడు...పవన్ చంద్రబాబు భజన మొదలు పెట్టాడు
- అలా భజన చేస్తున్నాడు కాబట్టే బాగా లబ్ధి పొందుతున్నాడు
- మళ్లీ మీరే ఉంటారని గ్యారంటీ ఇవ్వాలని కంపెనీలు లోకేష్ ను అడుగుతున్నాయంటున్నారు
- ఈ ప్రభుత్వం మీద పారిశ్రామికవేత్తలకు నమ్మకం లేదు
- వైఎస్ జగన్ మళ్లీ రావడం ఖాయమని పారిశ్రామికవేత్తలకు అర్ధమైపోయింది
- జగన్ హయాంలోనే పెట్టుబడులు పెడదామని పారిశ్రామిక వేత్తలు ఎదురు చూస్తున్నారు
- చంద్రబాబు అనుభవజ్ఞుడే అవ్వొచ్చు ...కానీ అసమర్ధుడు
Comments
Please login to add a commentAdd a comment