lokesh
-
గురూ.... కొత్త కాంబినేషన్ షురూ
జానర్ మాత్రమే కాదు... ఒక్కోసారి కాంబినేషన్స్ కూడా ఆడియన్స్‌ను థియేటర్స్‌కు రప్పిస్తాయి. అలాంటి క్రేజీ కాంబినేషన్ మూవీస్‌కు ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్నాయి. కొందరు తెలుగు స్టార్ హీరోలు ఇప్పటివరకు తమతో సినిమాలు చేయని దర్శకులతో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ ఇండస్ట్రీలో చర్చ జరుగుతున్న కొన్ని కొత్త కాంబినేషన్స్ కథా కమామీషుపై ఓ లుక్ వేయండి.ప్రభాస్‌తో లోకేశ్ ‘రాజా సాబ్, ఫౌజి’ సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రభాస్. ఈ రెండు సినిమాల చిత్రీకరణలు తుది దశకు చేరుకుంటున్నాయి. దీంతో త్వరలోనే సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లోని ‘స్పిరిట్’ మూవీ చిత్రీకరణలో పాల్గొంటారు ప్రభాస్. ‘స్పిరిట్’ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. అయితే తనతో ‘సలార్’ వంటి మాస్ సినిమాను నిర్మించిన హోంబలే ఫిలింస్‌తో ప్రభాస్ మూడు సినిమాలు కమిటయ్యారు. ఈ మూడు సినిమాలు వరుసగా 2026, 2027, 2028లలో విడుదల కానున్నాయి.కాగా వీటిలో ఓ చిత్రాన్ని తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ డైరెక్ట్ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే లోకేశ్ కార్తీతో ‘ఖైదీ 2’ చేయాల్సి ఉంది. మరోవైపు ప్రభాస్ కమిట్మెంట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ప్రభాస్–లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లోని మూవీ చిత్రీకరణ కాస్త ఆలస్యంగా ప్రారంభం అయ్యే చాన్సెస్ ఉన్నాయి.అలాగే ‘హనుమాన్’ తో భారీ బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన ప్రశాంత్ వర్మతో ప్రభాస్ ఓ మూవీ చేయనున్నారు. ప్రస్తుతం ‘జై హనుమాన్’తో బిజీగా ఉన్నారు ప్రశాంత్ వర్మ. ఈ సినిమా పూర్తయిన తర్వాత ప్రభాస్‌తో ప్రశాంత్ వర్మ సినిమా చేసే అవకాశం ఉందని ఫిల్మ్‌నగర్ సమాచారం.గ్రీన్ సిగ్నల్తమిళంలో రజనీకాంత్‌తో ‘జైలర్’ సినిమా తీసి సూపర్‌హిట్ అందుకున్నారు దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్. ప్రస్తుతం రజనీకాంత్‌తోనే ‘జైలర్ 2’ సినిమా చేసే పనుల్లో నిమగ్నమయ్యారు నెల్సన్. అయితే ‘జైలర్’కు, ‘జైలర్ 2’కు మధ్య తనకు లభించిన గ్యాప్‌లో ఓ కథ రాసుకున్నారట నెల్సన్. ఈ కథను ఎన్టీఆర్‌కు వినిపించగా, ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.అయితే ఇటీవలే హిందీలో ‘వార్ 2’ (ఈ చిత్రంలో హృతిక్ రోషన్ మరో హీరో) సినిమాను పూర్తి చేసిన ఎన్టీఆర్, ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో తాను కమిటైన ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) మూవీ సినిమా కోసం కావాల్సిన మేకోవర్ పనుల్లో బిజీగా ఉన్నారు. వచ్చే నెలలో ‘డ్రాగన్’ మూవీ రెగ్యులర్ షూటింగ్లో జాయిన్ అవుతారు ఎన్టీఆర్.ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసిన తర్వాత నెల్సన్ సినిమాను ఎన్టీఆర్ సెట్స్‌కు తీసుకువెళతారని ఊహించవచ్చు. అలాగే ‘హాయ్ నాన్న’ వంటి ఫీల్‌గుడ్ మూవీ తీసిన శౌర్యువ్ కూడా ఎన్టీఆర్కుప్రాథమికంగా ఓ లైన్ చెప్పారని, స్టోరీ కుదిరితే శౌర్యువ్‌తోనూ ఎన్టీఆర్ మూవీ చేస్తారనే వార్త ప్రచారంలోకి వచ్చింది.అర్జున్‌తో అట్లీ‘పుష్ప: ది రూల్’ సినిమా సక్సెస్‌తో మంచి జోష్‌లో ఉన్నారు అల్లు అర్జున్. ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేసేందుకు ప్రస్తుతం స్పెయిన్‌లో ఉన్నారు అల్లు అర్జున్. కాగా ‘పుష్ప’ సినిమా నిర్మాణం సమయంలోనే దర్శకుడు త్రివిక్రమ్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగాలతో అల్లు అర్జున్ సినిమాలు చేయనున్నట్లుగా అధికారిక ప్రకటనలు వెల్లడయ్యాయి. అయితే ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీతో సందీప్ రెడ్డి వంగా బిజీగా ఉండటంతో అల్లు అర్జున్ తన నెక్ట్స్ మూవీని త్రివిక్రమ్‌తో చేస్తారనే టాక్ వినిపించింది.కానీ త్రివిక్రమ్‌తో అల్లు అర్జున్ చేయాల్సిన సినిమాకు మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్ ఉంటుందట, చాలా గ్రాఫిక్స్ వర్క్ అవసరం అవుతుందట. ఇలా ఈ సినిమా ప్రీప్రోడక్షన్ వర్క్స్ ఇంకా సమయం పడుతుందట. దీంతో తన నెక్ట్స్ మూవీ కోసం తమిళ టాప్ డైరెక్టర్ అట్లీతో చర్చలు జరిపారట అల్లు అర్జున్. అట్లీ డైరెక్షన్లోనే అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుందని టాక్. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తారని, సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనుందని భోగట్టా. అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమా రూ. 1871 కోట్ల వసూళ్లు రాబట్టింది.మరోవైపు దర్శకుడిగా షారుక్ ఖాన్‌తో రూ. 1000 కోట్ల ‘జవాను’ను తీశారు అట్లీ. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్–అట్లీ కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. అల్లు అర్జున్ స్పెయిన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ మూవీ పై మరింత సమాచారం బయటకు రానుందని తెలిసింది. అలాగే ప్రముఖ హిందీ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని ఇటీవల ముంబైలో కలిశారు అల్లు అర్జున్. వీరి మధ్య ఓ సినిమాకు సంబంధించిన చర్చలు జరిగాయి. సో... భన్సాలీతో కూడా అల్లు అర్జున్ సినిమా చేసే చాన్స్ ఉందని ఊహించవచ్చు.మాస్ ప్లస్ క్లాస్ ఎక్కువగా మాస్, వీలైనప్పుడు క్లాస్ మూవీస్ చేస్తుంటారు రవితేజ. అయితే రీసెంట్ టైమ్స్‌లో రవితేజ మాస్ సినిమాలే ఆడియన్స్ ముందుకు వచ్చాయి. ప్రస్తుతం రవితేజ చేస్తున్న ‘మాస్ జాతర’ మాస్ అప్పీల్ ఉన్న సినిమాయే. దీంతో ఓ క్లాస్ మూవీ చేయాలని రవితేజ అనుకుంటున్నారట. ఇందులో భాగంగానే కిశోర్ తిరుమల రెడీ చేసిన ఓ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ మూవీకి రవితేజ పచ్చజెండా ఊపారని, త్వరలోనే ఈ వీరి కాంబినేషన్లోని మూవీపై స్పష్టత రానుందని ఫిల్మ్‌నగర్ సమాచారం.ఓకే చెప్పిన నానీశివ కార్తికేయన్‌తో తమిళంలో ‘డాన్’ (2022) వంటి క్యాంపస్ డ్రామా ఫిల్మ్ తీసి హిట్ సాధించారు తమిళ యంగ్ డైరెక్టర్ సిబీ చక్రవర్తి. అప్పట్నుంచి సిబీ చక్రవర్తితో ఓ మూవీ చేయాలని నానీ అనుకుంటున్నారట. ఆ సమయం ఇప్పడు వచ్చిందని, నానీ–సిబీ చక్రవర్తి కాంబినేషన్లోని మూవీకి సన్నాహాలు జరుగుతున్నాయని, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ప్రస్తుతం నానీ ‘హిట్ 3’ మూవీతో బిజీగా ఉన్నారు.మే 1న ఈ చిత్రం రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ మూవీ తర్వాత తనకు ‘దసరా’ వంటి హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలతో నానీ ‘ప్యారడైజ్’ అనే మూవీ చేస్తారు. అయితే ‘ప్యారడైజ్’ చిత్రానికి సమాంతరంగా సిబీ సినిమాను కూడా నానీ చేస్తారా? లేక ‘ప్యారడైజ్’ చిత్రాన్ని పూర్తి చేశాక సిబీ చక్రవర్తి సినిమాను స్టార్ట్ చేస్తారా? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.అలాగే దర్శకుడు శేఖర్ కమ్ముల చెప్పిన ఓ కథ నానీని ఇంప్రెస్ చేసిందని, నానీ ప్రస్తుత కమిట్మెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత శేఖర్ కమ్ములతో చేసే మూవీపై ఓ స్పష్టత వస్తుందని సమాచారం. ఈ నెల 24న నానీ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ హీరో తదుపరి చిత్రాలపై అధికారిక అప్డేట్స్ ఏమైనా వస్తాయా? అనేది చూడాలి.కిల్ డైరెక్టర్‌తో..!హిందీలో ‘కిల్’ వంటి మాస్ యాక్షన్ ఫిల్మ్ తీసి, ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది బాలీవుడ్ అయ్యారు దర్శకుడు నిఖిల్ నగేశ్ భట్. ఈ దర్శకుడు ఇప్పుడు ఓ క్రేజీ తెలుగు హీరోతో భారీ బడ్జెట్ మూవీ తీయాలని ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల హైదరాబాద్‌లో విజయ్ దేవరకొండను కలిశారు నిఖిల్ నగేశ్. వీరి మధ్య ఓ కొత్త సినిమా గురించిన చర్చలు జరిగాయి. ప్రస్తుతం ‘కింగ్డమ్’ మూవీ చేస్తున్నారు విజయ్ దేవరకొండ.మే 30న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ మూవీ తర్వాత దర్శకుడు రాహుల్ సంకృత్యాన్‌తో రాయలసీమ నేపథ్యంలో ఓ పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్, రవికిరణ్ కోలాతో ఓ విలేజ్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ కమిటయ్యారు విజయ్ దేవరకొండ. ఈ సినిమాలు పూర్తయ్యాక విజయ్ దేవరకొండ–నిఖిల్ నగేశ్‌ల కాంబినేషన్లోని మూవీపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
పరిశ్రమలు మూతపడుతున్నాయ్..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి తిరోగమనంలో ఉందని.. ఉన్న పరిశ్రమలు సైతం మూతబడుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. మిగతా అన్ని రాష్ట్రాల్లో పారిశ్రామిక వృద్ధి ఎంతో కొంత పాజిటివ్‌గా ఉంటే.. ఏపీలో మాత్రం మైనస్ 2.94 శాతంగా ఉందని వెల్లడించారు. మంగళవారం సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ముందస్తు అంచనాల మేరకు రాష్ట్ర వృద్ధి 12.94 శాతంగా ఉన్నప్పటికీ.. పారిశ్రామిక వృద్ధిలో మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఏపీ వెనకబడి ఉందన్నారు. దీనివల్ల చాలా సమస్యలు వస్తాయని, దీన్ని అధిగమించేందుకు పాలనలో స్పీడ్ పెంచి వినూత్న ఆలోచనలు చేయాలని అధికార యంత్రాంగానికి స్పష్టం చేశారు. ఫైళ్ల క్లియరెన్స్‌కు కొంత మంది వ్యక్తులు, కార్యదర్శులు ఏడాది నుంచి ఆర్నెల్లు, మూడు నెలలు సమయం తీసుకుంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్థికేతర ఫైళ్లు ఎట్టి పరిస్థితిలోనూ పెండింగ్‌లో ఉండకూడదన్నారు. వ్యవస్థను మెరుగు పరిచేందుకే ఇటీవల ఫైళ్ల క్లియరెన్స్ డేటా విడుదల చేసినట్లు చెప్పారు. కేంద్ర బడ్జెట్ పథకాలతో రాష్ట్ర బడ్జెట్‌ను అనుసంధానం చేసుకోవాలని సూచించారు.కేంద్ర పథకాల నుంచి రెండు శాతం నిధులు తెస్తే రాష్ట్రానికి పెద్ద బలం చేకూరుతుందన్నారు. యూసీలు అందచేసి మార్చిలోగా అదనంగా నిధులు రాబట్టేలా అన్ని శాఖలు చర్యలు తీసుకోవాలన్నారు. ఏటా 15 శాతం వృద్ధి సాధించడం ద్వారా 2047 నాటికి ప్రపంచంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఉన్నట్లు చెప్పారు. ఏటా 15 శాతం వృద్ధి సాధిస్తేనే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చగలమని చెప్పారు.అటవీ మార్గంలో శ్రీశైలం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలిగించవద్దని ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. రోడ్ల మరమ్మతులకు అటవీ అధికారులు పూర్తిస్థాయిలో సహకరించాలన్నారు. నకిలీ విత్తనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు. త్వరలోనే డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ నియామకాలు చేపడతామని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులున్నా ఎనిమిది నెలల్లోనే రూ.22,507 కోట్ల బకాయిలు చెల్లించామని తెలిపారు. వాట్సాప్‌లో మరిన్ని సేవలు.. రాబోయే రోజుల్లో ప్రజలెవరూ ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే అవసరం లేకుండా ప్రభుత్వ సేవలన్నీ వాట్సాప్‌లోనే అందుబాటులో ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రస్తుతం వాట్సాప్‌లో 161 సేవలిస్తున్నామని, రాబోయే 45 రోజుల్లో 500 సేవలు కల్పించే అవకాశాన్ని పరిశీలించాలన్నారు. టీటీడీ సేవలను కూడా వాట్సాప్ గవర్నెన్స్‌లోకి తెస్తామన్నారు. ప్రభుత్వం పనితీరుపై ప్రజాభిప్రాయాన్ని కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారానే సేకరించాలన్నారు. వాట్సాప్‌లో క్యూ ఆర్ కోడ్ లేదా పౌరుల ఆధార్ అథెంటిఫికేషన్ కోరే అవకాశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. అఖిల భారత సర్విస్ అధికారుల నుంచి గ్రూప్ వన్ అధికారుల వరకు ఏప్రిల్‌లో గ్రామాల్లో బస చేయాలని, దీనికి సంబం«ధించి త్వరలోనే విధివిధానాలను సీఎస్ జారీ చేస్తారని తెలిపారు. గతంలో నిర్వహించిన హ్యాపీ సండే కార్యక్రమాలను కూడా త్వరలో ప్రారంభిస్తామన్నారు. అంతకు ముందు అర్జీల పరిష్కారంపై సీఎస్ విజయానంద్ ప్రజెంటేషన్ ఇస్తూ ఇప్పటి వరకు 7,42,301 అర్జీలు వస్తే 60.7 శాతమే పరిష్కారం అయ్యాయని వెల్లడించారు. శ్రీకాకుళం, పార్వతీపురం, చిత్తూరు జిల్లాల నుంచే ఎక్కువ అర్జీలు వస్తున్నాయని, పల్నాడు, కృష్ణా జిల్లాల నుంచి అతి తక్కువ ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు.వాట్సాప్‌లోనే అన్ని రకాల ధ్రువపత్రాలిస్తాం మంత్రి లోకేశ్ వెల్లడిసాక్షి, అమరావతి: ప్రజలకు కావాల్సిన అన్ని రకాల ధ్రువపత్రాలను వాట్సాప్ ద్వారా అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి నారా లోకేశ్ చెప్పారు. మంగళవారం జరిగిన మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో ఆయన వాట్సాప్ గవర్నెన్స్ గురించి మాట్లాడారు. వాట్సాప్ గవర్నెన్స్ కోసం శాఖలన్నీ తమ సమాచారాన్ని ఆర్టీజీఎస్‌లోని డేటా లేక్‌కు అనుసంధానం చేయాలని కోరారు. వాట్సాప్ ద్వారా సర్టిఫికెట్లు జారీ చేయా లంటే అన్ని శాఖల సహకారం అవసరమన్నారు. రేషన్ కార్డులు మొదలు అన్నీ కూడా ప్రజలకు సులభంగా ఆన్లైన్లోనే అందించే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో డిజిటల్ రేషన్ కార్డులు అందజేస్తామని.. తద్వారా క్యూఆర్ కోడ్‌తోనే రేషన్ పొందే సదుపాయం లభిస్తుందని తెలిపారు. ప్రజాభిప్రాయాన్ని, ప్రజల సంతృప్తి శాతాలను కూడా వాట్సాప్ ద్వారా మదింపు వేసే అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. వేధింపులు, రెడ్‌బుక్‌తోనే తిరోగమనంఒకవైపు పరిశ్రమలు రాకుండా అడ్డుకుంటూ.. పారిశ్రామికవేత్తలను బెదిరిస్తూ.. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వ పెద్దలు ఏపీ పారిశ్రామిక వృద్ధి తిరోగమనంలో ఉందని.. అధికారుల్లో స్పీడ్ పెరగాలని వ్యాఖ్యలు చేయడంపై ప్రభుత్వ యంత్రాంగంలో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ కాకుండా రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని చూపించడమే ఈ దుస్థితికి కారణమని పేర్కొంటున్నారు. రెడ్‌బుక్ పాలన చేసింది మీరు..! అధికారంలోకి రాగానే దాడులు, అరెస్టులతో విధ్వంసానికి తెర తీసింది మీరు..! ఇక మేం ఏం చేయగలం..? అని అధికారులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. నిజానికి మెరుగు పడాల్సింది తమ పనితీరు కాదని.. ప్రభుత్వంలో ఉన్న వారే కక్షపూరిత ధోరణిని విడనాడాలని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతి పరిశ్రమ, ప్రతి టెండర్‌ను ప్రభుత్వ పెద్దలకు నచ్చినవారికే కట్టబెడుతూ అర్హతలు లేకపోయినా ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని, దీనివల్ల పెద్ద పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చే పరిస్థితి లేదని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి రెడ్‌బుక్ పాలన సాగిస్తామని పదేపదే ప్రకటనలు చేయడం ఏమిటని అధికారులు విస్తుపోతున్నారు. తమ మాట వినని పారిశ్రామికవేత్తలను వేధిస్తూ అరెస్టులకూ వెనుకాడకపోవటాన్ని ప్రస్తావిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గంలో పర్సంటేజీల కోసం కింగ్ ఫిషర్ బీర్ల కంపెనీ యాజమాన్యాన్ని తీవ్రంగా వేధించిన టీడీపీ నేతలు, ఎమ్మెల్యే అనుచరులు తమకు కప్పం చెల్లించలేదని ఫ్యాక్టరీపై దాడులకు తెగబడటాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు ఫిర్యాదు సైతం తీసుకోలేదు. ఇక విశాఖలో కాలుష్య నియంత్రణ మండలిని ముందుపెట్టి అరవిందో ఫార్మాను తీవ్రంగా వేధించారు. దేశంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఉన్న సజ్జన్ జిందాల్‌ను ముంబై మోడల్ తప్పుడు ఫిర్యాదు ఆధారంగా తీవ్ర వేధింపులకు గురి చేయడంతో ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయి. పారిశ్రామికవేత్తలను లక్ష్యంగా చేసుకుని తప్పుడు నివేదిక ఇవ్వాలన్న ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్ తలొగ్గకపోవడంతో ఆయన సెలవుపై వెళ్లాల్సిన పరిస్థితి కల్పించారు. మరోవైపు కూటమి ప్రభుత్వం వచ్చాక డజను మందికిపైగా సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్‌లకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా కక్షపూరితంగా వేధింపులకు దిగింది. ఇక ఏ నియోజకవర్గంలోనూ కూటమి ఎమ్మెల్యేల ఆమోదం లేకుండా ఒక్క పని కూడా జరిగే పరిస్థితి లేదు. జ్యుడీషియల్ ప్రివ్యూను ఎత్తివేసి నచ్చినోళ్లకు పనులు కట్టబెడుతున్నారు. ఇవన్నీ చేస్తూ ప్రభుత్వ పెద్దలు తిరిగి తమకు క్లాస్ తీసుకోవడం ఏమిటని అధికార యంత్రాంగం విస్తుపోతోంది. -
రెడ్‌బుక్ కుట్రకే ‘పచ్చ’ సిట్!
సాక్షి, అమరావతి: రెడ్ బుక్ కుట్రలో తాజా అంకానికి చంద్రబాబు ప్రభుత్వం తెరతీసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం కొనుగోళ్లపై అక్రమ కేసు నమోదు చేసిన సీఐడీ చేతులెత్తేయడంతో టీడీపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. దాంతో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణ పేరిట కొత్త పన్నాగం పన్నింది. తాము చూసి రమ్మని చెబితే.. కాల్చి వచ్చేసేంతటి టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో సిట్‌ను నియమించడం గమనార్హం. సిట్ చీఫ్‌గా నియమించిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్బాబుతోపాటు అందులోని సభ్యుల ట్రాక్ రికార్డే చంద్రబాబు ప్రభుత్వ కుట్రను తేటతెల్లం చేస్తోంది. తాము లక్ష్యంగా చేసుకున్న వైఎస్సార్సీపీ నేతలకు వ్యతిరేకంగా తప్పుడు నివేదికలు ఇప్పించి, అక్రమ కేసులతో వేధించడమే ధ్యేయంగా సిట్‌ను నియమించారన్నది సుస్పష్టం. అందుకే సిట్‌కు అపరిమిత అధికారాలు కట్టబెడుతూ మరీ కుతంత్ర కార్యాచరణకు ఉపక్రమించింది. సిట్ సభ్యుల ట్రాక్ రికార్డు ఇలా ఉంది.అక్రమ కేసులు పెట్టడంలో అందెవేసిన చేయి అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక మెతుకు పట్టి చూస్తే చాలు అన్నట్టుగా సిట్ చీఫ్‌ను చూస్తే చాలు చంద్రబాబు ప్రభుత్వ కుట్ర తేటతెల్లమవుతుంది. టీడీపీ వీర విధేయుడిగా గుర్తింపు పొందిన అత్యంత వివాదాస్పద అధికారి ఎస్వీ రాజశేఖర్ బాబు. అనంతపురం జిల్లాలో పోస్టింగు నుంచి నేటి వరకు ఆయన టీడీపీకి అత్యంత అనుకూల అధికారిగా ముద్ర పడ్డారు. ఆ ముద్రను తొలగించుకునేందుకు ఆయన ఏనాడూ ప్రయత్నించక పోవడం గమనార్హం. గత ఏడాది టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ఆయన్ను ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్‌గా నియమించింది. అప్పటి నుంచి ఆయన రెడ్‌బుక్ కుట్రను అమలు చేయడమే ఏకైక లక్ష్యంగా చెలరేగిపోతున్నారు. రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసుల నమోదు వెనుక మాస్టర్‌మైండ్‌గా పని చేశారు. బీఎన్ఎస్ సెక్షన్ 111 కింద వ్యవస్థీకృత నేరాల చట్టాన్ని ప్రయోగించడం దేశ వ్యాప్తంగా విస్మయ పరిచింది. టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా కార్యకర్తలపై బనాయించిన అక్రమ కేసుల్లో 75 శాతం ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే నమోదు కావడం గమనార్హం. అక్రమంగా నిర్బంధించి రోజుల తరబడి శారీరకంగా హింసించడం పోలీసుల బరితెగింపునకు నిదర్శనం. ఇలా కేసుల నమోదు చెల్లదని హైకోర్టు స్పష్టం చేయడంతో రాజశేఖర్‌బాబు అక్రమ కేసుల కుట్రకు తెరపడింది. ఇక వలపు వల (హనీట్రాప్) విసిరి బడా బాబులను బురిడీ కొట్టించే నేర చరిత్ర ఉన్న ముంబయికి చెందిన కాదంబరి జత్వానీని అడ్డం పెట్టుకుని అక్రమ కేసులను దగ్గరుండీ పర్యవేక్షించిందీ రాజశేఖర్ బాబే. చంద్రబాబు ఆదేశాలతో ఆయన చేసిన నిర్వాకంతో ప్రముఖ పారిశ్రామికవేత్త, జేఎస్‌డబ్ల్యూ గ్రూపు అధినేత సజ్జన్ జిందాల్‌ను వేధించారు. దాంతో హడలిపోయిన జేఎస్‌డబ్ల్యూ గ్రూపు రాష్ట్రంలో పెట్టాల్సిన రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులను మహారాష్ట్రకు తరలించేసింది. ఇలా ప్రభుత్వ పెద్దలు చెబితే చాలు ఎంతటి అక్రమానికైనా తెగించే ఏకైక అర్హతతోనే రాజశేఖర్ బాబును సిట్ చీఫ్‌గా నియమించారు.పట్టుబట్టి తెలంగాణ నుంచి రప్పించి..సిట్‌లో మరో సభ్యుడు ఎల్.సుబ్బారాయుడు టీడీపీ వీరవిధేయ కుటుంబీకుడు. అనంతపురం జిల్లాకు చెందిన ఆయన కుటుంబం టీడీపీ తరఫున రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంది. అందుకే తెలంగాణ క్యాడర్‌కు చెందిన సుబ్బారాయుడును పట్టుబట్టి చంద్రబాబు మరీ ఏపీకి రప్పించుకున్నారు. అనంతరం రెడ్‌బుక్ కుట్ర కేసుల నమోదు బాధ్యతలను అప్పగించారు. సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు, అక్రమ నిర్బంధాలతో ఆయన హడలెత్తించారు.ఇటీవల తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ ప్రక్రియలో తొక్కిసలాట జరిగి, ఆరుగురు భక్తులు దుర్మరణం పాలవ్వడం పూర్తిగా పోలీసు వైఫల్యమే. అందుకు సుబ్బారాయుడిని సస్పెండ్ చేయాల్సిన ప్రభుత్వం కేవలం బదిలీతో సరిపెట్టింది. అది కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్ ఫోర్స్ ఎస్పీగా నియమించి చిత్తూరు జిల్లాలోనే పోస్టింగ్ ఇచ్చింది. తాజాగా సిట్‌లో సభ్యుడిగా నియమించింది. టీడీపీ ఎంతంటే అంతే..సిట్‌లో మరో సభ్యుడు నంద్యాల డీఎస్పీ పి.శ్రీనివాస్ తీరు మొదటి నుంచి అత్యంత వివాదాస్పదం. సత్యసాయి జిల్లా కదిరికి చెందిన ఆయన కుటుంబం టీడీపీలో క్రియాశీలకంగా ఉంది. ఎస్సై, సీఐగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో విధులు నిర్వహించిన శ్రీనివాస్.. టీడీపీకి అనుకూల అధికారిగా ముద్ర పడ్డారు. గత ఏడాది ఎన్నికల ముందు కూడా ఆయన పలువురు పోలీసు అధికారులకు ఫోన్లు చేసి మరీ టీడీపీకి అనుకూలంగా పని చేయాలని ఒత్తిడి తేవడం వివాదాస్పదమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శ్రీనివాస్ మాటే నంద్యాల జిల్లాలో శాసనంగా మారింది. జిల్లాలో సీఐలు, ఎస్సైల పోస్టింగుల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. అసాంఘికాలకు ఊతంఒంగోలు విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్ విభాగం అదనపు ఎస్పీగా ఉన్న కొల్లి శ్రీనివాస్‌ను కూటమి ప్రభుత్వం సిట్‌లో సభ్యునిగా నియమించింది. గతంలో విజయవాడలో అదనపు డీసీపీగా ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడిన చరిత్ర ఆయన సొంతం. స్పాలలో అసాంఘిక కార్యకలాపాలకు అనుమతించడం వెనుక ఆయనదే ప్రధాన పాత్ర. దాంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆయన్ను బదిలీ చేసి వీఆర్‌కు పంపింది. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం ఆయన్ను సిట్ సభ్యునిగా నియమించింది. అక్రమంగా కాల్ రికార్డ్స్ ఆయన ఘనతసిట్లో మరో సభ్యుడు ప్రస్తుతం సీఐడీ అదనపు ఎస్పీగా ఉన్న ఆర్. శ్రీహరి బాబు ట్రాక్ రికార్డు మరింత వివాదాస్పదం. గతంలో ఆయన గురజాల డీఎస్పీగా ఉన్నప్పుడు పలువురు ఎమ్మెల్యేల కాల్ రికార్డుల వివరాలను అక్రమంగా సేకరించి ఇతరులకు చేరవేశారు. బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడే ఉద్దేశంతోనే కాల్ రికార్డుల డేటాను అక్రమంగా సేకరించడం అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది. ఈ కాల్ రికార్డుల కుట్ర వెనుక సూత్రధారి నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కావడం గమనార్హం. దాంతో శ్రీహరిబాబును వైఎస్సార్సీపీ ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనకు ఫోకల్ పోస్టింగు ఇవ్వకుండా పక్కన పెట్టింది. ఇలాంటి ట్రాక్ రికార్డు కలిగిన శ్రీహరి బాబును సిట్ సభ్యునిగా చేర్చడం కూటమి ప్రభుత్వం కుట్రకు తార్కాణం. -
రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోవడానికి రెడ్ బుక్ రాజ్యాంగమే కారణం
-
లోకేశ్ ‘డిప్యూటీ’ కాదు.. కాబోయే సీఎం!
సాక్షి, అమరావతి: మంత్రి నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ ఇవ్వాలంటూ టీడీపీ నేతలు చేసిన హడావుడితో కూటమిలో కాక రేగడంతో సీఎం చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. ఇకపై ఈ విషయం గురించి మాట్లాడొద్దంటూ దావోస్ నుంచి పార్టీ నేతలను హెచ్చరించారు. తన సమక్షంలోనే పార్టీ నేతలు ఈ డిమాండ్ చేసినప్పుడు స్పందించని చంద్రబాబు... రాజకీయంగా నష్టం జరిగే పరిస్థితి ఉండడంతో దావోస్ నుంచి స్పందించడం గమనార్హం. మరోవైపు ఇదే వేదికగా మంత్రి టీజీ భరత్ మరో అడుగు ముందుకేసి కాబోయే సీఎం లోకేశేనని తాజాగా వ్యాఖ్యానించడం టీడీపీ పెద్దల రెండు నాల్కల ధోరణికి నిదర్శనంగా నిలుస్తోంది. డిప్యూటీ కాదు.. కాబోయే సీఎం టీడీపీ పెద్దల రాజకీయాలు కూటమి పార్టీల్లో రక్తి కట్టిస్తున్నాయి. డిమాండ్ చేసేదీ.. వార్నింగ్‌లు ఇచ్చేదీ పచ్చ నేతలేనని జనసేన శ్రేణులు మండిపడుతున్నారు. లోకేశ్‌ని డిప్యూటీ సీఎంగా చేయాలని నాలుగు రోజులుగా టీడీపీ నేతలు పోటీలు పడి ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. మైదుకూరులో ఎన్టీఆర్ వర్ధంతి సభలో మొదలైన ఈ డిమాండ్ల పర్వం.. తాజాగా దావోస్‌కి చేరింది. కాబోయే సీఎం లోకేశేనని మంత్రి టీజీ భరత్ ప్రకటించేశారు. చంద్రబాబు సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయటాన్ని బట్టి ఇదంతా టీడీపీ పెద్దలు ఆడుతున్న డ్రామాగా స్పష్టమవుతోంది. స్పందన తెలుసుకునేందుకే.. లోకేశ్‌ను డిప్యూటీ సీఎంగా చేయాలని మైదుకూరులో ఎన్టీఆర్ వర్ధంతి సభ సందర్భంగా టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి.. సీఎం చంద్రబాబు ఎదుటే డిమాండ్ చేశారు. ఆ సమయంలో చంద్రబాబు వారించలేదు. ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తదితరులు ఇదే పల్లవి వినిపించారు. ఎల్లో మీడియా, సోషల్ మీడియాలో ఈ అంశం హోరెత్తుతున్నా చంద్రబాబు పట్టించుకోలేదు. దీన్నిబట్టి ఆయన ప్రోత్సాహంతోనే టీడీపీ నేతలు ఈ డిమాండ్లు చేస్తున్నట్లు వెల్లడైంది. తనయుడికి ప్రమోషన్ ఇచ్చేందుకు సిద్ధమై కూటమిలో నేతల స్పందన తెలుసుకునేందుకే తన పార్టీ నేతలతో డిమాండ్లు చేయించినట్లు తెలుస్తోంది. జనసేన నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం, కూటమిలో చిచ్చు రగిలే పరిస్థితి కనిపించడంతో ఒక్కసారిగా రూటు మార్చారు. ఇదంతా చంద్రబాబు, ఆయన తనయుడు ఆడిస్తున్న నాటకాలేనని జనసేన నేతలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.జన సైనికులు ‘రివర్స్’.. టీడీపీ నేతల డిమాండ్లపై జనసేనకు నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. వైఎస్సార్ జిల్లాకు చెందిన విశ్వం రాయల్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయడంతోపాటు తమ నేత పవన్ కళ్యాణ్‌ను సీఎం చేయాలనే వాదన వినిపించారు. పవన్ సీఎం కావాలని తమకు కోరిక ఉన్నట్లు తిరుపతికి చెందిన జనసేన నాయకుడు కిరణ్ రాయల్ చెప్పారు. సోషల్ మీడియాలో ఇది రెండు పార్టీల మధ్య పెద్ద వార్‌గా మారిపోయింది. లోకేశ్ డిప్యూటీ సీఎం ఏంటని జనసేన శ్రేణులు సెటైర్లు వేస్తుంటే.. పవన్‌కు సీఎం పదవా? ఆయనకు అంత సీనుందా? అంటూ టీడీపీ నేతలు విమర్శనా్రస్తాలు సంధిస్తున్నారు. -
అమిత్‌షా ఏం మాట్లాడారో మాకు తెలుసు: అంబటి రాంబాబు
సాక్షి,తాడేపల్లి:అందితే జుట్టు అందకపోతే కాళ్లు అనేది చంద్రబాబుకు తెలిసిన విద్య అని మాజీ మంత్రి,వైఎస్సార్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఆదివారం(జనవరి19) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.‘నాడు తిరుమల దర్శనానికి వచ్చినపుడు అమిత్‌షాపై రాళ్ల వర్షం కురిపించారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నాయి. విభజన సమస్యలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి. ఇలాంటి సమయంలో చంద్రబాబు, పవన్‌కల్యాణ్ సమస్యల గురించి మాట్లాడకుండా విందులేంటో. సమస్యలన్నీ పక్కనపెట్టి వైఎస్ జగన్ ప్యాలెస్‌ల గురించి మాట్లాడుతున్నారు. అమిత్ షాతో చంద్రబాబు వైజాగ్ స్టీల్‌ప్లాంట్ విషయం మాట్లాడలేదు.లోకేష్‌ను అదుపులో పెట్టుకోమని అమిత్ షా వార్నింగ్..అమిత్‌షా ఏం మాట్లాడారో మాకు సమాచారం ఉంది. లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేస్తానని చంద్రబాబు అమిత్‌షాను అడిగారట. లోకేష్ అన్ని శాఖల్లో వేలు పెడుతున్నారని, ఆయనను ముందు అదుపులో పెట్టుకోవాలని అమిత్‌షా చంద్రబాబును హెచ్చరించారు. లోకేష్ వసూళ్ల కార్యక్రమంలో నిమగ్నమైనందున స్పీడ్ తగ్గించుకోవాలని అమిత్ షా బాబుకు సూచించారు.అమిత్ షా సలహాలు బయటికి రాకుండా కథలు వండి వారుస్తున్నారు. గత్యంతరం లేకే చంద్రబాబు పవన్‌కల్యాణ్‌ను డిప్యూటీ సీఎం చేశారు. చంద్రబాబు తప్పిదం వల్లే పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది.వైఎస్ జగన్ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా జరిగాయి’అని అంబటి తెలిపారు.అంబటి రాంబాబు ఇంకా ఏమన్నారంటే..చంద్రబాబు అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే రకంరాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నాయ్విభజన సమస్యలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయిరాష్ట్రంలోని సమస్యలను వదిలేసి జగన్ ఆస్తుల గురించి అమిత్ షా అడిగారని ప్రచారం చేస్తున్నారుఆవు కథ మాదిరి వైఎస్ జగన్ పై బురదజల్లడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారుచంద్రబాబు నివాసముండేదే అక్రమ కట్టడంఅక్రమకట్టడంలోనే విందు ఇస్తున్నామని అమిత్ షాకు ఎందుకు చెప్పలేదుఆ ఇల్లు క్విడ్ ప్రోకోలో కొట్టేసిందని అమిత్ షాకు ఎందుకు చెప్పలేదుకృష్ణమ్మ వరద ముంచేసిన ఇంట్లోనే మీరు కూర్చున్నారని ఎందుకు చెప్పలేదుహైదరాబాద్లో ఇల్లు కట్టుకున్న చంద్రబాబు ఎవరికైనా చూపించాడాచంద్రబాబు మాదిరి జగన్ మోహన్ రెడ్డి క్విడ్ ప్రోకోలో ఇళ్లు తీసుకోలేదులోకేష్ ను ఉపముఖ్యమంత్రిగా చేయాలని అమిత్ షా ను చంద్రబాబు అడిగారుమీ అబ్బాయి లోకేష్ స్పీడ్ ను తగ్గించుకోమని అమిత్ షా చెప్పారుఎక్కడపడితే అక్కడ వేలు పెడుతున్నాడు...కొంచెం తగ్గమని చెప్పారువైఎస్ జగన్ ఇళ్ల గురించి పాతచింతకాయ పచ్చడి కథలెందుకుపోలవరం రెండవ డయాఫ్రమ్ వాల్ పనులు నిన్న ప్రారంభించారుడయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి చంద్రబాబు అవివేకంటీడీపీలో చేసిన తప్పిదమే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందిచంద్రబాబు,దేవినేని ఉమా , టీడీపీ తప్పిదాన్ని జగన్ పై నెట్టడం తప్పువైఎస్ జగన్ హయాంలోనే పోలవరం పనులు అద్భుతంగా జరిగాయిస్పిల్ వే , కాఫర్ డ్యామ్ లు జగన్ హయాంలోనే పూర్తి చేశారుతిరుపతి ఘటన మానవతప్పిదంతిరుపతికి ఇప్పుడు రమ్మని చెప్పండి ఎన్డీయేనుతిరుపతి పై ఈ ప్రభుత్వం పూర్తిగా పట్టు కోల్పోయిందిలడ్డూలో కల్తీ నెయ్యి కలిపారని మాపై అభాండాలు వేశారుఆ పాపమే ఇప్పుడు కూటమి పాలనను వెంటాడుతోందిచెప్పేటందుకే చంద్రబాబు నీతులుచంద్రబాబు, ఆయన కుమారుడు ఒక్కొక్కరినే కంటారుపేదలు మాత్రం ఇద్దరు ముగ్గురు కనమంటున్నారుఏపీలో అసమర్ధపాలన సాగుతోందిలోకేష్ భజన తగ్గించాడు...పవన్ చంద్రబాబు భజన మొదలు పెట్టాడుఅలా భజన చేస్తున్నాడు కాబట్టే బాగా లబ్ధి పొందుతున్నాడుమళ్లీ మీరే ఉంటారని గ్యారంటీ ఇవ్వాలని కంపెనీలు లోకేష్ ను అడుగుతున్నాయంటున్నారు ఈ ప్రభుత్వం మీద పారిశ్రామికవేత్తలకు నమ్మకం లేదువైఎస్ జగన్ మళ్లీ రావడం ఖాయమని పారిశ్రామికవేత్తలకు అర్ధమైపోయిందిజగన్ హయాంలోనే పెట్టుబడులు పెడదామని పారిశ్రామిక వేత్తలు ఎదురు చూస్తున్నారుచంద్రబాబు అనుభవజ్ఞుడే అవ్వొచ్చు ...కానీ అసమర్ధుడు -
లోకేశ్ సేవలో తరిస్తున్న ఏసీఏ
సాక్షి, అమరావతి: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) గురించి అందరికీ తెలుసు.. మరి మంగళగిరి ప్రీమియర్ లీగ్(ఎంపీఎల్) గురించి మీకు తెలుసా? సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) ప్రత్యేక ఆసక్తితో నిర్వహిస్తున్న లీగ్ ఇది. తన స్వామి భక్తిని చాటుకునేందుకు ఏసీఏ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) ఈ లీగ్‌కు రూపకల్పన చేశారు. ఈ నెల 23న లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా 22 మ్యాచ్‌లతో ఈ లీగ్‌ను నిర్వహిస్తున్నారు. మంగళగిరిలోని ఏసీఏ స్టేడియంలో ఆదివారం కేశినేని చిన్ని దీనిని ప్రారంభించారు. 22వ తేదీ వరకు లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయని.. 23న ఫైనల్స్ నిర్వహించి విజేతకు అవార్డు ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఏసీఏ నిధులు దుర్వినియోగం!కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ఏసీఏను లోకేశ్ కోటరీ తమ గుప్పెట్లోకి తీసుకుంది. కేశినేని చిన్నిని అధ్యక్షుడిగా, తన సన్నిహితుడు, లాబీయిస్టు అయిన సానా సతీశ్‌ను ప్రధాన కార్యదర్శి పీఠంపై కూర్చోబెట్టారు లోకేశ్. అప్పటి నుంచి కేశినేని చిన్ని, సానా సతీశ్ క్రికెట్ ప్రయోజనాలను పక్కనపెట్టి.. లోకేశ్ కోసమే ఏసీఏను ఉపయోగిస్తున్నారు. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గం కోసం ఏకంగా ప్రీమియర్ లీగ్ నిర్వహించడమే ఇందుకు నిదర్శనం. బీసీసీఐ మార్గదర్శకాల ప్రకారం గవర్నింగ్ బాడీ సమావేశంలో షెడ్యూల్‌ను రూపొందించి లీగ్‌లు నిర్వహిస్తుంటారు. కానీ కేశినేని చిన్ని అవేమీ చేయకుండా.. ఎవరినీ సంప్రదించకుండానే ఈ లీగ్‌ను ప్రకటించారు. ఏసీఏ నిధులు, వనరులను పూర్తిస్థాయిలో ఉపయోగిస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో లోకేశ్ ఫొటోలతో భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. వీటన్నింటికీ ఏసీఏ నిధులు ఉపయోగిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క నియోజకవర్గమే ముఖ్యమా?వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు, క్రీడాకారులకు చేయూత అందించేందుకు ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో పోటీలు నిర్వహిస్తే కూటమి నేతలు అవాకులు, చెవాకులు పేలారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, దాదాపు అన్ని క్రీడలతో ‘ఆడుదాం ఆంధ్రా’ నిర్వహిస్తే విమర్శలు చేసిన కూటమి నేతలు.. ఇప్పుడు కేవలం సీఎం తనయుడి కోసం ఆయన నియోజకవర్గంలో మాత్రమే లీగ్ పెట్టడం, దానికి ఏసీఏను ఉపయోగించుకోవడం గమనార్హం. రాష్ట్రమంతటికీ ప్రాతినిధ్యం వహించి పనిచేయాల్సిన ఏసీఏ.. కేవలం ఒక నియోజకవర్గంలో ఒక నేత కోసమే పని చేయడమేమిటని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
తిరుమలలో ‘లక్ష్మణ’ లీలలు!
అమరావతి: తిరుమల తిరుపతి దేవ స్థానం (టీటీడీ)లో ప్రైవేట్ వ్యక్తుల హవాకు సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. 2014– 19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫైబర్‌నెట్ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న వేమూరి హరికృష్ణ ఓ పక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో దేవస్థానంలో చక్రం తిప్పుతుంటే మరోవైపు లోకేశ్ మనిషిగా ముద్రపడ్డ లక్ష్మణ్‌కుమార్ ఏకంగా ‘సూడో’ అదనపు ఈఓగా చెలరేగిపోతున్నారు. అదన ఈఓ వెంకయ్య చౌదరి పక్కనే ఈయనకు కుర్చీవేసి ప్రొటోకాల్ మర్యాదలు అందిస్తున్నారంటే ఈయన హవా ఏ స్థాయిలో నడుస్తోందో అర్థంచేసుకోవచ్చు.లక్ష్మణ్‌కుమార్‌కు ఛాంబర్, వాహనం, ఇతర సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఏ అధికారిక ఉత్తర్వులు లేకపోయినా టీటీడీలో తిష్టవేసి అందరినీ శాసిస్తున్న లక్ష్మణ్‌కుమార్ వ్యవహారం ఇప్పుడు టీటీడీలో హాట్ టాపిక్. టీటీడీలో ఎలాంటి ఉత్తర్వుల్లేకుండా అధికారిక సమావేశంలో పాలొ్గనడం, ఏఈఓతోపాటు సమీక్షల్లో ఉండడం.. నిఘా, ముఖ్యభద్రతాధికారి పాల్గొన్న సమావేశానికీ హాజరైన ఈ సూడో అడిషనల్ ఈఓ కథా కమామిషు ఇదీ..అంతటా ఆయనే..సీఎం కార్యాలయం నుంచి వచ్చే సిఫార్సు లేఖలతో పాటు, టీటీడీకి ప్రపంచం నలుమూలలు నుంచి వచ్చి దాతలిచ్చే విలువైన కానుక లపై ఈ సూడో ఏఈఓ ప్రత్యేక దృష్టిపెట్టినట్లు సమాచారం. కొందరు అజ్ఞాత భక్తులు స్వామివారికి కానుకలిచ్చే సమయంలో తమ పేరు చెప్పడానికి సైతం ఇష్టపడరు. అలాంటి వాటిపై సూడో ఏఈఓ అవతారమెత్తిన లక్ష్మణ్‌కుమార్ ఈ వ్యవహారాలన్నీ చక్కబెడుతున్నట్లు తెలుస్తోంది. తిరుమలలో వైకుంఠ ఏకాదశి నాడు విద్యుత్ దీపాలంకరణ బాధ్యతను దాత సహాయంతో అంతా లక్ష్మణ్‌కుమారే నడిపించినట్లు టీటీడీ వర్గాలు తెలిపాయి.ఆయన చూస్తేనే అదనపు ఈఓ సిఫారసు..తిరుమలలో అదనపు ఈఓ కార్యాలయంలో ఏ పని జరగాలన్న లక్ష్మణ్‌కుమార్ కనుసన్నల్లోనే జరగాలని.. ఆ తర్వాతే ఏఈఓ వెంకయ్యచౌదరి సంతకాలు చేస్తారని టీటీడీ ఉద్యోగులు చెబుతున్నారు. అసలు ఏ అర్హతతో ఈయన్ను ఏఈఓ కార్యాలయంలో ప్రత్యేక చాంబర్ ఏర్పాటుచేయాల్సి వచ్చింది? స్పెషల్ టైప్–05 నెంబర్ గెస్ట్‌హౌస్‌ను ఆయనకు ఎందుకు నివాసంగా ఏర్పాటుచేశారని వారు చర్చించుకుంటున్నారు. పైగా.. ఈయన ఏఈఓ కార్యాలయంలోనే అపవిత్ర కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపిస్తున్నారు.టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తామేంచేసినా చెల్లుబాటవుతుందనేలా వీరు రాజ్యాంగేతర శక్తులుగా అవతరిస్తున్నారు. వ్యవస్థల్ని శాసిస్తూ, దోచుకునేందుకు తిరుమల కొండపై తిష్టవేశారని ఉద్యోగులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఇక తిరుమలను ప్రక్షాళన చేస్తానంటూ ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబునాయుడు.. అధికారంలోకి వచ్చాక టీటీడీని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పెట్ట డమే ప్రక్షాళనా అని వారు సూటిగా ప్రశ్నిస్తున్నారు. అదనపు ఈఓకు అనుభవంలేకపోవడంతో..నిజానికి.. టీటీడీ అదనపు ఈఓగా ఉన్న వెంకయ్యచౌదరికి పాలనా అనుభవంలేకపోవడం, నిత్యం కార్యాలయ పనులపై పూర్తిస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడంతో లక్ష్మణ్‌కుమార్ సూడో అడిషనల్ ఈఓ చెలామణి అవుతున్నారు. అసలు కస్టమ్స్ ఆఫీసర్‌గా పనిచేసిన వ్యక్తిని టీటీడీ అదనపు ఈఓగా ఎలా నియమిస్తారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. పైగా.. తిరుమలలో జేఈఓ కార్యాలయంలో పనిచేసేందుకు ఐఏఎస్ అధికారులు ఎవరూ లేన్నట్లు ఐఆర్ఎస్ అధికారిని అదనపు ఈఓగా తీసుకురావడం.. దీనికితోడు మరో సూడో అదనపు ఈఓకు పెత్తనం ఇవ్వడం పవిత్ర తిరుమల భ్రష్టుపట్టిపోవడానికి దారితీస్తోందని కార్యాలయ సిబ్బంది మండిపడుతున్నారు.తిరుమలను చెప్పుచేతల్లో పెట్టుకునేందుకే..టీటీడీకి సంబంధించిన ప్రతి విషయం ఎంతో గోప్యంగా, భద్రంగా ఉంటుంది. కానీ, చంద్రబాబు ఈ మొత్తం వ్యవస్థను తన చెప్పుచేతుల్లో పెట్టుకునేందుకే లక్ష్మణ్‌కు ప్రత్యేక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఆయన పరకామణి, పోటు, దాతలిచ్చే విరాళాలు, టీటీడీ ఈ– ఫైల్స్, టీటీడీ టెండర్లు తదితర వాటిపై పెత్తనం సాగిస్తున్నారు. రహస్య సమాచారం అంతా ఆయన చేతుల్లోకి తీసుకున్నారు. అలాగే, సిఫార్సు లేఖలు కూడా ఎవరికివ్వాలి, ఎవరికి ఇవ్వకూడదనే విషయాలనూ ఆయనే చూసుకుంటున్నారు. ఈయన చూసి ఓకే చేసిన తర్వాతే టీటీడీ ఏఈఓ, ఈఓ నిర్ణయం తీసుకునేలా వ్యవస్థను తన చెప్పుచేతల్లో పెట్టుకున్నారు. ఇలా కీలక వ్యవహారాలన్నీ చంద్రబాబు ఓ ప్రైవేట్ వ్యక్తికి అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమలలో ఏ స్కాం జరిగినా బయటకు రాకుండా వ్యవస్థను ఏర్పరుచుకున్నారని టీటీడీ సిబ్బంది చర్చించుకుంటున్నారు. -
మంత్రులు వేస్ట్..కాదుకాదు పాలన వేస్ట్
సాక్షి, అమరావతి: ఆరునెలల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా చేయించుకున్న సర్వేలోనూ అదే విషయం వెల్లడికావడం అధికార పార్టీ వర్గాలను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. పాలనను ప్రతిబింబించే మంత్రుల పనితీరు మీద సర్కారు ఇటీవల సర్వే చేయించి వారికి ర్యాంకింగ్ ఇచ్చింది. ఇదే విషయాన్ని సీఎం స్వయంగా కేబినెట్ సమావేశంలో మంత్రులకు వెల్లడించారు. తాజాగా.. మంత్రుల పనితీరు మీద ర్యాంకులు ఇచ్చిన నివేదికను ప్రభుత్వ పెద్దలు లీక్ చేశారు. కేవలం ఆరుగురు మంత్రుల పనితీరు మాత్రమే సంతృప్తికంగా ఉందని, మిగతా 18 మంది ర్యాంకులు ఆధ్వానంగా ఉన్నాయని ఆ నివేదిక పేర్కొంది. సహజంగా.. ప్రభుత్వ పాలన తీరుకు మంత్రివర్గం పనితీరును గీటురాయిగా తీసుకుంటారు. మంత్రివర్గంలో 75 శాతం మంది సభ్యుల తీరు ఏమాత్రం బాగోలేదని, సర్వేలో ర్యాంకులు అధ్వానంగా రావడం మంచి పరిణామం కాదని అధికార పార్టీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. ర్యాంకులు మరీ అధ్వానంగా ఉన్న మంత్రుల జాబితాలో ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, సీఎం కుమారుడు లోకేశ్ కూడా ఉండటం గమనార్హం. ప్రభుత్వానికి అన్నీ తామై వ్యవహరిస్తున్న ఈ ఇద్దరి పనితీరు, ప్రభుత్వ పనితీరును వేరుచేసి చూడలేమని, ప్రభుత్వం చేయించిన సర్వేలో తేలిన విషయమే ప్రజల్లోనూ స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల్లో అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఒక్క హామీని కూడా అమలుచేయకుండా కబుర్లతో కాలక్షేపం చేస్తున్న తీరును ప్రజలు గుర్తించారు. ప్రజాసంక్షేమం దిశగా ప్రభుత్వం ఏమీచేయలేక చేతులెత్తేసిన విధానమే మంత్రుల పనితీరు మీద ప్రతిబింబించిందనే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తించకుండా, ‘అధ్వాన్న పనితీరు’ పేరిట తమను నిందించడంలో అర్థంలేదని మంత్రులు తమ సన్నిహితుల దగ్గర వాపోతున్న విషయం అధికార పార్టీ వర్గాలకు తెలుసు. పైపెచ్చు.. లోకేశ్ అన్ని మంత్రిత్వ శాఖల్లో జోక్యం చేసుకుంటే తాము చేయడానికి ఏముంటుందని.. తమ చేతులు కట్టేసి తాము అసమర్థులమని సర్వేల్లో తేల్చి ర్యాంకింగ్ ఇవ్వడం ఏమిటని మంత్రులు ప్రశ్నిస్తున్నారు. సర్వే చేశామని చెప్పి, ర్యాంకులంటూ లీకులు ఇస్తే ప్రయోజనం ఏమీ ఉండదని.. ప్రభుత్వమే ప్రజా సంక్షేమం గురించి ఆలోచించి హామీలు అమలుచేస్తే ప్రభుత్వ సామర్థ్యం పెరిగిందని ప్రజలు భావిస్తారని, అప్పుడు ప్రజలు అడిగిన పనులు చేశామని తమ పనితీరు కూడా బ్రహ్మాండంగా ఉంటుందని మంత్రులు చెబుతున్నారు.పవన్ పనితీరుపైనా అసంతృప్తి..డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ పనితీరు అంత బాగోలేదని నివేదిక తేల్చడమంటే.. అన్ని శాఖల కంటే అత్యధిక బడ్జెట్ ఉన్న పంచాయతీరాజ్ శాఖను ఇచ్చినా ఆయన అందుకు తగ్గ రీతిలో పనిచేయడంలేదని, అంటే ప్రభుత్వ పనితీరు అధ్వానంగా ఉందనే అర్థమని పరిశీలకులు చెబుతున్నారు. హామీలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడమే మంత్రుల ర్యాంకింగ్ అద్దంపడుతోందని, అది కేవలం పవన్‌కళ్యాణ్ ఒక్కడి వ్యక్తిగత సామర్థ్యం తక్కువనే భావన కాదని జనసేన వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు తనయుడు లోకేశ్ నిర్వహిస్తున్న కీలకమైన మానవవనరుల (విద్యా శాఖలు) శాఖలో అన్నీ సమస్యలే ఉండడంతో ఆయన పనితీరుపైనా పెదవి విరుస్తున్నారు. విద్యారంగంలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలకు గండికొట్టడంతో ఆయన పనితీరు మీద తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తోందని అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.పెత్తనం లోకేశ్‌ది.. తిట్లు మాకా!?ఈ ర్యాంకింగ్లపై మంత్రులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రాతిపదికన తమ పనితీరు అంచనా వేసిందో తెలీడంలేదని సీనియర్ మంత్రులు అచ్చెన్నాయుడు, ఆనం రాంనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు వంటి నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు సమాచారం. ప్రభుత్వంలోని అన్ని వ్యవహారాల్లో లోకేశ్ తలదూరుస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఇక తమకు పనిచేయడానికి అవకాశమెక్కడ ఉందని వారు ప్రశ్నిస్తున్నారు. తమ శాఖలకు చెందిన కీలక నిర్ణయాలు లోకేశే తీసుకుంటుంటే వాటికి తమను బాధ్యులను చేయడం ఏమిటని ఆందోళన చెందుతున్నారు. చివరికి.. తమ శాఖల కార్యదర్శులు, కమిషనర్లు తమను పట్టించుకోకుండా.. లోకేశ్ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని వీరు చెబుతున్నారు. అన్ని పనులూ వారే చేసుకుంటూ తమ పనితీరు బాగోలేదని ఎలా చెబుతారని ఈ మంత్రులు మండిపడుతున్నారు. పనిచేసేది ఈ ఆరుగురే..ఇక రాష్ట్ర కేబినెట్లో ఆరుగురు మంత్రులు మాత్రమే బాగా పనిచేస్తున్నట్లు నివేదిక తేల్చింది. అందులో మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ ముందున్నారు. చంద్రబాబుకు బాగా దగ్గరగా ఉంటూ రాజధాని నిర్మాణ వ్యవహారాల్లో ఆయన మనసెరిగి పనిచేస్తుండడంతో నారాయణకు అగ్రతాంబూలం దక్కింది. అలాగే..» విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంఎస్ఎంఈ శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా బాగా పనిచేస్తున్నారని మంచి ర్యాంకింగ్ దక్కింది. » కూటమిలో జనసేన పార్టీ తరఫున మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్, బీజేపీ తరఫున మంత్రిగా ఉన్న సత్యకుమార్ పనితీరు కూడా బాగుందని నివేదిక పేర్కొంది. » కలెక్టర్ల సదస్సు, ఇతర సమావేశాల్లో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మరో మంత్రి లోకేశ్ బాగాపనిచేస్తున్నారంటూ సీఎం పొగుడుతూ ఆకాశానికెత్తేస్తున్న విషయం తెలిసిందే. కానీ, ప్రభుత్వ సర్వే నివేదికలో అందుకు భిన్నమైన ఫలితాలొచ్చాయి. పనితీరులో వీరిద్దరూ వెనుకబడ్డారని నివేదిక తేల్చేయడం గమనార్హం. -
ఉద్యోగం కావాలా.. లోకేశ్‌ను కలవండి!
సాక్షి, అమరావతి: బలవంతంగా సెలవుపై పంపిన గనుల శాఖాధికారులు లోకేశ్‌ను కలిస్తేనే ఉద్యోగంలో చేరడానికి అవకాశం ఉంటుందంటూ మధ్యవర్తులు రాయబారాలు నడుపుతుండటం చర్చనీయాంశంగా మారింది. లేనిపోని ఆరోపణలు మోపి గనుల శాఖ అధికారులను సెలవుపై పంపి.. ఇప్పుడు లోకేశ్‌ను కలవాలంటూ ఒత్తిడి చేయడం ముడుపుల కోసమేననే ప్రచారం జరుగుతోంది. గత ప్రభుత్వానికి దగ్గరగా పని చేశారనే ఆరోపణలు సృష్టించి 26 మంది అధికారులను రెండు నెలల క్రితం గనుల శాఖ డైరెక్టర్ బలవంతంగా సెలవుపై పంపారు. తాము ఏం తప్పు చేశామని ప్రశ్నించినా.. అవన్నీ తమకు తెలియదని వెంటనే సెలవుపై వెళ్లిపోవాలని మౌఖికంగా ఆదేశించారు. గనుల శాఖ మంత్రి పేషీ నుంచి కూడా హెచ్చరికలు అందడంతో గత్యంతరం లేక వారంతా సెలవులో వెళ్లారు. వారిలో పలువురు డిప్యూటీ డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, ఇతర స్థాయిల్లో పనిచేసే అధికారులు ఉన్నారు. నిజానికి కొద్దినెలల క్రితమే వారికి టీడీపీ ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చింది. ఆ పోస్టింగ్‌లు ఇవ్వడానికి భారీగా ముడుపులు వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. లోకేశ్ తరఫున అన్ని వ్యవహారాలు చక్కబెట్టే వ్యక్తి ఈ బదిలీల్లో కీలకంగా మారి వేలం నిర్వహించి మరీ పోస్టింగ్‌లు ఇచ్చారు. పోస్టింగ్‌లకు ముందే వారితో బేరం కుదుర్చుకుని సొమ్ములు తీసుకున్నారు. అనంతరం ఆ పోస్టుల్లో చేరిన కొద్దిరోజుల తర్వాత రెండు విడతలుగా వారిని బెదిరించి బలవంతంగా సెలవు పెట్టించారు. చెప్పినట్టు చేస్తేనే తిరిగి ఉద్యోగం కొన్ని వారాల తర్వాత లోకేశ్‌కు మధ్యవర్తిగా పనిచేసే వ్యక్తి నుంచి వారికి సమాచారం ఓ అందింది. మళ్లీ విధుల్లో చేరాలంటే తాను చెప్పినట్టు చేయాలని ఆయన సూచించారు. వెళితే మళ్లీ భారీగా ముడుపులు ముట్టజెప్పాలనే భయంతో మొదట్లో ఎవరూ వెళ్లలేదని సమాచారం. దీంతో ఆ వ్యక్తే వారిని కలిసి గత ఐదేళ్లలో వారు పనిచేసిన స్థానాలు, అక్కడ ఎంత సంపాదించారు వంటి వివరాలు చెప్పి బెదిరింపులకు దిగారు. ఐదేళ్లలో అంత సంపాదించారు కాబట్టి అందులో కొంత ఇవ్వాలని స్పష్టం చేశారు. మీరు చెప్పినంత సంపాదన తమకు లేదని, రెండవసారి మళ్లీ డబ్బులు ఇచ్చుకోలేమని చెప్పినా కీలకమైన పోస్టుల్లో అన్ని సంవత్సరాలు పని చేశారు కాబట్టి తాము చెప్పినట్టు వినాల్సిందేనని ఒత్తిడి చేసినట్టు సమాచారం. కొన్నిరోజులుగా దీనిపై చర్చలు జరిగినా బేరం కుదరకపోవడంతో వారిని తిరిగి విధుల్లోకి చేరేందుకు అనుమతించడంలేదు.రెండవసారి ముడుపులు ఇచ్చుకోలేంబదిలీల సమయంలో పోస్టింగ్ ఇచ్చినందుకు ముడుపులు తీసుకుని ఆ తర్వాత సెలవుపై పంపడం అన్యాయని, ఇప్పుడు మళ్లీ డబ్బులు ఇస్తేనే విధుల్లో చేరాలనడం ఏమిటని అధికారులు వాపోతున్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని బయటకు చెప్పుకోలేక, ఉన్నతాధికారులతో మాట్లాడలేక సతమతమవుతున్నారు. గనుల శాఖలో బదిలీలన్నీ లోకేశ్ మనుషుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. లోకేశ్‌కి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి ఆదేశాల ప్రకారమే గనుల శాఖ డైరెక్టర్ పని చేస్తున్నారు. గనుల శాఖ మంత్రి చెప్పినా పట్టించుకోకుండా కేవలం లోకేశ్, ఆయన సన్నిహితుడు చెప్పిన పనులు మాత్రమే చేస్తున్నట్టు సమాచారం. లీజుల మంజూరు, బిల్లులు, ఇతర వ్యవహారాలు ఏమైనా తనకు లోకేశ్ చెప్పాల్సిందేనని స్పష్టం చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు సెలవుపై పంపిన అధికారులతో బేరాలు కుదరకపోవడంతో వారి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. -
Jada Sravan: చంద్రబాబు, లోకేష్, పవన్ మీకు నిద్ర ఉండదు..
-
లోకాయుక్త బిల్లు.. ప్రజాస్వామ్య స్ఫూర్తికి భిన్నం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త చట్టానికి సవరణలు తీసుకొస్తూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతిపాదనలు పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగాలేవని పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణ్‌రావు అభిప్రాయపడ్డారు. సీఎం పేరుతో మంత్రి నారా లోకేశ్ లోకాయుక్త చట్ట సవరణ బిల్లు ఆమోదం కోసం శుక్రవారం ‘మండలి’లో ప్రవేశపెట్టగా, దానిపై కొద్దిసేపు చర్చ జరిగింది. బిల్లులో సవరణలపై లోకేశ్ వివరిస్తూ.. లోకాయుక్త, సభ్యుల నియామక కమిటీలో సీఎం చైర్మన్‌గా, అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్, శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు, హోంమంత్రి లేదా సీఎం నామినేట్ చేసే మంత్రి సభ్యులుగా ఉంటారని.. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత లేనిపక్షంలో మిగతా నలుగురు సభ్యులతో లోకాయుక్త కమిటీ సమావేశం ఏర్పాటుకు ఈ బిల్లును ప్రవేశపెడుతున్నట్లు వివరించారు. దీనిపై లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ.. ‘ప్రజాస్వామ్యంలో అధికార పక్షం, ప్రతిపక్షం రెండూ జోడు గుర్రాల్లా వెళ్లాలని ఓ రాజనీతిశాస్త్ర అధ్యాపకుడిగా నేను భావిస్తున్నా. బిల్లు సారాంశం నాకు అర్థమైనంత వరకు.. ప్రతిపక్ష నాయకుడు లేరు కాబట్టి ఆయనను మినహాయిస్తూ, మిగిలిన నలుగురితో చేయాలని అనుకుంటున్నట్లుగా ఉంది. నిజానికి.. ప్రతిపక్ష నాయకుడు లేకపోయినా, ప్రతిపక్షం ఉంది. ప్రతిపక్షం నుంచి ఎవరైనా ఒక సభ్యుడు ఉండేలా కమిటీ ఉంటే బాగుంటుంది అని నా అభిప్రాయం. దానికి ప్రతిపక్ష హోదా అక్కరలేదు. ప్రతిపక్ష పార్టీ అక్కడ ఉంది. ఆ పార్టీని ఎవరో ఒక సభ్యుడిని నామినేట్ చేయమని అడగొచ్చు. మీ ప్రతిపాదనలు ప్రజాస్వామ్య స్పిరిట్ కాదు’ అంటూ మాట్లాడారు. ఈ సమయంలో పలువురు టీడీపీ సభ్యులు పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయగా.. లక్ష్మణరావు స్పందిస్తూ.. ‘వాదనలు చేయాలంటే చాలా చెయ్యొచ్చు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య సూత్రం చెబుతున్నా. ఆచరిస్తే ఆచరించండి లేకపోతే లేద’ని తెలిపారు.ప్రజాస్వామ్యయుతంగానే ముందుకు..లక్ష్మణరావు చేసిన సూచనపై లోకేశ్ స్పందిస్తూ.. ‘ప్రతిపక్ష నేత లేనిపక్షంలో అని బిల్లులో పేర్కొన్నాం.. అంతేగానీ ఏమీ తీసివేయడంలేదు. ఆయన లేనిపక్షంలో నలుగురుతో జరుగుతుందని మాత్రమే బిల్లులో పేర్కొన్నాం’.. అని చెప్పారు. ప్రజాస్వామ్యయుతంగానే లోకాయుక్తను తమ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందన్నారు. మాజీ సీఎం జగన్ రెండు సమావేశాల నుంచి సభకు రాని పరిస్థితి అని.. అన్నీ పరిగణనలోకి తీసుకునే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. చర్చ అనంతరం, సభ మూజువాణితో బిల్లు ఆమోదం పొందినట్లు మండలి చైర్మన్ ప్రకటించారు.మరో ఏడు బిల్లులు కూడా.. జ్యుడీషియల్ ప్రివ్యూకు రద్దుఇప్పటికే అసెంబ్లీ ఆమోదం పొందిన లాండ్ గ్రాబింగ్ సవరణ బిల్లు, పీడీ యాక్ట్ సవరణ బిల్లు, దేవదాయశాఖ పాలక మండలి కమిటీ అదనపు సభ్యుల నియామకం సవరణ బిల్లు, జ్యుడీషియల్ ప్రివ్యూకు సంబంధించిన బిల్లులతో పాటు మున్సిపల్ చట్ట సవరణ బిల్లు, జీఎస్టీ చట్ట సవరణ బిల్లు, వ్యాట్ చట్ట సవరణ బిల్లులు కూడా శుక్రవారం మండలిలో ఆమోదం పొందాయి. -
జెన్కోలో ‘రెడ్ బుక్’ రాజ్యం
సాక్షి, అమరావతి: అధికారంలోకి వ చ్చిన నాటి నుంచి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని విద్యుత్ సంస్థలకు అన్వయిస్తోంది. ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీ జెన్కో)లో గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారనే నెపంతో గత రెండు నెలల్లో 135 మంది ఉద్యోగులను బదిలీ చేశారు.వీరిలో దాదాపు 90 శాతం ఎస్సీ, బీసీ సామాజికవర్గం వారే ఉండటం గమనార్హం. రాజకీయ ముద్ర వేసి ఇంతమంది ఉద్యోగులను బదిలీ చేయడం విద్యుత్ సంస్థల చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. లోకేశ్ రెడ్‌బుక్‌లో పేరుందని అధికారులపై ఒత్తిడి తెచ్చి బదిలీలు! వాస్తవానికి ఏపీజెన్కో ఉద్యోగులకు రాజకీయ నాయకులతో ఎలాంటి ప్రత్యక్ష సంబంధాలు ఉండవు. అలాంటి సంస్థలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులని కొందరిపై ముద్ర వేసి ఒకేసారి వేరే ప్రాజెక్టులకు అర్ధాంతరంగా బదిలీ చేస్తున్నారు. ఒక అసోసియేషన్‌లో కీలకంగా ఉన్న నేతను పార్టీ ముద్ర వేసి ఏకంగా విజయవాడ జెన్కో కార్యాలయం నుంచి నెల్లూరుకు బదిలీ చేశారు. ఏపీ పవర్ జనరేటింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అన్నె శ్రీనివాసకుమార్‌కు నిబంధనల ప్రకారం బదిలీ ప్రొటెక్షన్ (మినహాయింపు) ఉన్నప్పటికీ... ఆయన్ను సీలేరుకు బదిలీ చేశారు. ఈ బదిలీలను యూనియన్ ప్రాంతీయ కార్యదర్శి ఎన్.వెంకట్రావు తీవ్రంగా ఖండించారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం, యాజమాన్యం తీరును తప్పుబట్టారు. యూనియన్ బాధ్యతల్లో భాగంగా ఉద్యోగ సంఘాల నాయకులు వెళ్లి ప్రజాప్రతినిధులను కలుస్తుంటారని, తమ యూనియన్‌కు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని ఆయన స్పష్టంచేశారు. రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను ఆయన కోటరీలోని కొందరు వ్యక్తులు తప్పుదోవ పట్టిస్తున్నారని, అదేవిధంగా లోకేశ్ రెడ్‌బుక్‌లో పేర్లు ఉన్నాయని అధికారులపై ఒత్తిడి తెచ్చి ఈ బదిలీలు చేయిస్తున్నారని వెంకట్రావు ఆరోపించారు. బదిలీలకు గడువు ముగిసిన తర్వాత...ఉద్యోగుల బదిలీలకు గడువు ముగిసిన తర్వాత... అసలు బదిలీలే వద్దనుకున్న ఏపీ జెన్కో యాజమాన్యం... రెండు నెలలుగా డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎనీ్టటీపీఎస్)తోపాటు విద్యుత్ సౌధ (జెన్కో ప్రధాన కార్యాలయం)లోను పెద్ద ఎత్తున బదిలీలు చేస్తోంది. దీనికి పరిపాలన, క్రమశిక్షణ అనే రెండు కారణాలను అధికారులు సాకుగా చూపుతున్నారు. ఈ విధంగా రెండు నెలల్లో విద్యుత్ సౌధలో 85 మందిని బదిలీ చేశారు. వీరిలో 31 మందిని దూర ప్రాంతాలకు పంపించారు. ఎన్టీపీఎస్‌లో బుధవారం వరకు 50 మందిని బదిలీ చేయగా, వారిలో 15 మందిని దూర ప్రాంతాలకు పంపించారు. ఈ క్రమంలో బదిలీల వెనుక తమ ప్రమేయమే ఉందని టీడీపీకి చెందిన ఓ ట్రేడ్ యూనియన్ బాహాటంగా ప్రకటించుకుంది. తాము ఇ చ్చిన జాబితాల మేరకే బదిలీలు జరుగుతున్నాయని ఆ యూనియన్ నేరుగా ఉద్యోగులను భయపెడుతోంది. దీంతో ఏ క్షణాన తమపై ఏ ముద్ర వేసి వేధిస్తారోనని ఉద్యోగులు భయాందోళనలకు గురవుతున్నారు. -
నడిపేది..నడిపించేది లోకేష్.. ఇది వాస్తవం: విజయసాయిరెడ్డి
సాక్షి,తాడేపల్లి:నిజానికి,వాస్తవానికి చాలా తేడా ఉందని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం(నవంబర్ 9) ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు.‘చెప్పిన అబద్దాలు మళ్ళీ చెప్పకుండా ఉత్తిత్తి హామీలు, సూపర్ డూపర్ సిక్స్‌తో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడన్నది ‘నిజం’. చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా అన్ని తానై నడిపేది, నడిపించేది లోకేష్ అన్నది ‘వాస్తవం’. నిజానికి-వాస్తవానికి మధ్య ఉన్న ఆ సన్నటి గీతని అర్ధం చేసుకోవడం ‘ప్రజాధర్మం’ అని ట్వీట్ చేశారు.నిజానికి వాస్తవానికి చాలా తేడా ఉంది! చెప్పిన అబద్దాలు మళ్ళీ చెప్పకుండా ఉత్తిత్తి హామీలతో సూపర్ డూపర్ సిక్స్ తో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడన్నది "నిజం".చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా అన్ని తానై నడిపేది, నడిపించేది లోకేష్ అన్నది "వాస్తవం".నిజానికి - వాస్తవానికి మధ్య ఉన్న ఆ…— Vijayasai Reddy V (@VSReddy_MP) November 9, 2024 ఇదీ చదవండి: పాషాణ ప్రభుత్వం.. దుర్మార్గ రాజ్యం -
నువ్వు ప్రశ్నించాల్సింది చంద్రబాబుని
-
‘సాక్షి’పై కేసు సరికాదు
ఇటీవల విజయవాడలో వరద సహాయక చర్యల్లో జరిగిన అవినీతిని ఎండగట్టినందుకు సాక్షి ఎడిటర్‌పై కేసు నమోదు చేయడాన్ని పలు సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. ఇది సరికాదని పేర్కొన్నారు. ఈకేసునుఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. –సాక్షి, అమరావతి/విశాఖ సిటీ కేసు ఉపసంహరించుకోవాలి: ఏపీయూడబ్ల్యూజేమీడియా కథనాలపై కేసు నమోదు చేయడం మంచిది కాదని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఐ.వి.సుబ్బారావు, చందు జనార్దన్ పేర్కొన్నారు. ఈ మేరకు వారు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సాక్షి కథనాల్లో అవాస్తవాలు ఉంటే వివరణ ఇచ్చుకోవచ్చని తెలిపారు. అలా కాకుండా ఎడిటర్ వర్ధెల్లి మురళిపై కేసు పెట్టడం సరైనచర్య కాదని పేర్కొన్నారు. కేసును ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ కేసును వ్యతిరేకిస్తున్నాం: ఏపీడబ్ల్యూజేఎఫ్ పత్రికల్లో ప్రచురితమైన వార్తాకథనాలపై అనుమానాలు, తప్పులు, పొరపాట్లు ఉంటే వాటిని ఎత్తిచూపే పద్ధతిని విస్మరించి పోలీసు కేసులు పెట్టే వైఖరిని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) వ్యతిరేకిస్తోందని ఆ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎస్.వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు తెలిపారు. ఈ సంస్కృతిని ఖండిస్తున్నట్లు తెలిపారు. ‘సాక్షి’ ఎడిటర్ వర్ధెల్లి మురళిపై పోలీసులు కేసు బనాయించటం సరికాదు. పత్రికల్లో ప్రచురితమయ్యే వార్తా కథనాలకు సంపాదకుడిదే బాధ్యత అయినా పత్రిక ప్రధాన లక్ష్యం ప్రజలకు సమాచారాన్ని చేరవేయడం. ఆ ప్రక్రియలో లోటుపాట్లుంటే సరిదిద్దే ప్రయత్నాలు జరగాలి. పోలీసు కేసులు పెట్టడం మీడియాను భయపెట్టే చర్యగా భావిస్తున్నాం. మీడియాను భయపెట్టేందుకు చేసే ఇటువంటి ప్రయత్నాలు విరమించుకోవాలి. సాక్షి సంపాదకులు వర్ధెల్లి మురళిపై పెట్టిన కేసు ఆ కోవలోకే వస్తుంది. ఇటువంటి ధోరణులను పోలీసు యంత్రాంగం మానుకోవాలి..’ అని వారు చెప్పారు. ఈ కేసు సరికాదని ఏపీడబ్ల్యూజేఎఫ్ విశాఖ జిల్లా అధ్యక్షుడు పోతుమహంతి నారాయణ్, కార్యదర్శి జి.శ్రీనివాస్ పేర్కొన్నారు. కేసు అక్రమం: స్సామ్నా మీడియా స్వేచ్ఛను హరించే విధంగా కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు తాజాగా జరిగిన కొన్ని ఘటనలు రుజువు చేస్తున్నాయని చిన్న, మధ్యతరహా వార్తాపత్రికల సంఘం (స్సామ్నా) శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఒక వార్తా కథనం పేరుతో ‘సాక్షి’ ఎడిటర్ వి.మురళిపై విజయవాడలో పోలీస్ కేసు నమోదు చేయడం అక్రమమని స్సామ్నా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నల్లి ధర్మారావు, సిహెచ్.రమణారెడ్డి తీవ్రంగా ఖండించారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక జర్నలిస్టుపై ఈ మాదిరిగానే నమోదు చేసిన కేసును ఇటీవల సుప్రీంకోర్టు కొట్టేసిన సంగతిని కూటమి ప్రభుత్వం గుర్తుచేసుకోవాలని హితవు పలికారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాసే విధంగా ఆదిలోనే కూటమి ప్రభుత్వం అడుగులు వేయడం ప్రజాస్వామ్యానికి మేలు చేసేది కాదన్నారు. గతంలోను చట్టాలు, జీవోలు, అధికార ఒత్తిళ్లతో కొన్ని చానళ్ల ప్రసారాలు నిలిపేయించడం, జర్నలిస్టులపై కేసులు బనాయించడం వంటి ప్రయత్నాలు జరిగాయని చెప్పారు. ఇప్పటికైనా సాక్షి ఎడిటర్, జర్నలిస్టులపై పెట్టిన కేసును ఉపసంహరించాలని, చానళ్ల ప్రసారాల విషయంలో కేబుల్ టీవీ ఏజెన్సీలపై ఒత్తిళ్లను మానుకోవాలని డిమాండ్ చేశారు. మీడియా స్వేచ్ఛను హరించే ప్రయత్నం సరికాదని, జర్నలిస్టులపై కేసుల విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని స్సామ్నా విజయవాడ నగర అధ్యక్షుడు ఎం.వి.సుబ్బారావు, కార్యదర్శి ఎస్.గంగరాజు కోరారు. సాక్షి ఎడిటర్‌పై కేసు అన్యాయం: ఏపీడబ్ల్యూజేయూ సాక్షి ఎడిటర్ మురళిపై విజయవాడలో కేసు నమోదు చేయడం అన్యాయమని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (ఏపీడబ్ల్యూజేయూ) విశాఖ జిల్లా యూనిట్ ఒక ప్రకటనలో పేర్కొంది. స్వేచ్ఛను హరించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆ యూనిట్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.రాము, ఆర్.రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వార్తా కథనం పేరుతో సాక్షి ఎడిటర్ వి.మురళిపై కేసు నమోదు అక్రమమని పేర్కొన్నారు. గతంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇదేరీతిలో ఒక జర్నలిస్టుపై నమోదుచేసిన కేసును సుప్రీంకోర్టు కొట్టేసిన సంగతిని ప్రభుత్వం గుర్తుచేసుకోవాలని సూచించారు. ప్రభుత్వాలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తే జర్నలిస్టు సంఘాలు అంగీకరించే పరిస్థితి లేదని హెచ్చరించారు. సాక్షి ఎడిటర్‌పై కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సంయమనంతో వ్యవహరించాలి: జాతీయ జర్నలిస్టుల సంఘం పత్రికల్లో ప్రచురితమైన వార్తా కథనాలపై అనుమానాలు, తప్పులు, పొరపాట్లు ఉంటే వాటిని ఎత్తిచూపే పద్ధతిని విస్మరించి.. పోలీసు కేసులు పెట్టే వైఖరి సరికాదని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు పేర్కొన్నారు. సమాజంలో వైషమ్యాలు, అంతరాలు మరింతగా పెరిగేందుకు దోహదపడే చర్యలకు పాల్పడకుండా పోలీసులు సంయమనంతో వ్యవహరించాలని ఆయన సూచించారు. -
లోకేష్ దందాలు కప్పిపుచ్చేందుకే.. చంద్రబాబుపై ఆర్కే రోజా ఫైర్
సాక్షి, అమరావతి: చంద్రబాబు, లోకేష్‌ల తీరుపై ఎక్స్ వేదికగా మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. ‘‘ఆత్మస్తుతి పరనింద ముఖ్యమంత్రి చంద్రబాబుకు మొదటి నుంచి ఉన్న అలవాటు ఈ విషయంలో మనా తనా అనే భేదం కూడా ఉండదు. ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత నిర్వహించిన మొదటి కలెక్టర్లు ఎస్పీలు, ఉన్నతాధికారుల సమావేశంలో మాది పొలిటికల్ గవర్నెన్స్ మా వారు చెప్పిందే చేయండి అని చెప్పి విచ్చలవిడిగా దందాలకు, అరాచకాలకు ఆజ్యం పోశారు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసరికి ఆ తప్పులు ఎమ్మెల్యేల మీద నెట్టుతున్నారు.’’ అంటూ ఆర్కే రోజా దుయ్యబట్టారు.తన మీడియాతోనే తమ ఎమ్మెల్యేల మీద బురదజల్లి తప్పంతా వారిదే అన్నట్లు ప్రచారం చేయిస్తున్నారు. ఈ మాటున తన తప్పులు, వైఫల్యాలు, కుమారుడు లోకేష్ దందాలను చర్చకు రానివ్వడం లేదు. ఎమ్మెల్యేల అవినీతిపై ఉదయం కథనాలు, చర్చ చేస్తున్న సదరు మీడియానే సాయంత్రం ముఖ్యమంత్రి వీరుడు, శూరుడు అంటూ ఎంపిక చేసుకున్న వందిమాగాదులతో చిలకపలుకల మాటలతో రక్తికట్టిస్తున్నారు.’’ అంటూ ఆర్కే రోజా ఎండగట్టారు.‘‘అధికారంలోకి రావడం కోసం మాయ మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేయడం. అధికారంలోకి వచ్చిన తర్వాత తన వైఫల్యాలను, తన కుమారుడి దందాలను కప్పిపుచ్చుకోవడానికి తమ ఎమ్మెల్యేలకి వ్యతిరేకంగా తన మీడియాతోనే ప్రచారం మొదలెట్టిన ముఖ్యమంత్రికి నిజంగా చిత్తశుద్ది ఉంటే ఏ కలెక్టర్ల, ఎస్పీల సమావేశంలో తమ టీడీపీ పార్టీ వారు చెప్పిందే చేయాలని చెప్పినట్లు, తప్పు ఎవరు చేసినా కఠినంగా వ్యవహరించాలని, వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ సమానమేనని వైఎస్ జగన్లాగా చెప్పాలి’’ అని ఆర్కే రోజా ట్వీట్ చేశారు.ఆత్మస్తుతి పరనింద ముఖ్యమంత్రి @ncbn గారికి మొదటి నుంచి ఉన్న అలవాటు ఈ విషయంలో మనా తనా అనే భేదం కూడా ఉండదు. ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత నిర్వహించిన మొదటి కలెక్టర్లు ఎస్పీలు మరియు ఉన్నతాధికారుల సమావేశంలో `మాది పొలిటికల్ గవర్నెన్స్ మా వారు చెప్పిందే చేయండి` అని చెప్పి…— Roja Selvamani (@RojaSelvamaniRK) October 10, 2024 -
నిజం చెప్పేసిన లోకేష్ షాక్ లో చంద్రబాబు..
-
లోకేష్, పవన్ కలిసి . బాబును ఇరికించారు..!
-
హస్తినలో లోకేశ్ రహస్య పర్యటన!
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ బుధవారం రహస్యంగా ఢిల్లీ పర్యటనకు వచ్చారు. విమానాశ్రయం నుంచి నేరుగా జన్‌పథ్–1లోని సీఎం (చంద్రబాబు) నివాసానికి చేరుకున్నారు. 3.30 గంటలకు రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులతో రహస్యంగా భేటీ అయినట్లు తెలిసింది. అనంతరం రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ లోకేశ్‌ను కలిశారు. అర్ధరాత్రి వరకూ భేటీలు కొనసాగడం.. ఎవరెవరు కలుస్తున్నారు అనే విషయాలు గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిచ్చి0ది. కాగా, ఎన్డీఏ ప్రముఖులను కలిసేందుకు లోకేశ్ ఢిల్లీ వచ్చారని ఎల్లో మీడియా ప్రచారం చేసినప్పటికీ, ఆయన ఎన్డీఏ ప్రముఖులు ఎవర్నీ కలవలేదు. అంతా రహస్యమే.. ముఖ్యమంత్రి, మంత్రులు అధికారిక పర్యటన నిమిత్తం ఢిల్లీ వచ్చినప్పుడు రెసిడెంట్ కమిషనర్ ఎయిర్‌పోర్టుకు వెళ్లి ఆహా్వనిస్తారు. ఇక్కడ ఉన్న పోలీసు సిబ్బంది వీఐపీ ఫెసిలిటేషన్ చేస్తారు. లోకేశ్ పర్యటనలో ఇవేమీ కనిపించలేదు. కాగా, లోకేశ్ కొందరు బీజేపీ ప్రముఖులతో వేర్వేరుగా భేటీ అయినట్లు తెలిసింది. బుధవారం అర్ధరాత్రి వరకు లోకేశ్ ఇక్కడే ఉండటంతో గురువారం అధికారికంగా ఎన్డీఏ నేతలను కలిసే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉండగా, రాత్రి 10 గంటల సమయంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయుష్ వేద్ ప్రకాష్ గోయల్‌తో మంత్రి లోకేశ్ భేటీ అయినట్లు తెలిసింది. -
ఈ ‘బరితెగింపు’.. ఎల్లో మీడియాకు కనబడలేదా?
ఏమిటి ఈ బరి తెగింపు.. ఏమిటీ అరాచకం. చివరికి రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా వదలిపెట్టరా! ఏపీలో జరుగుతున్న దుష్టపాలనకు ఇది నిలువుటద్దంగా నిలుస్తుంది. ఏపీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా విజయవాడ నడిబొడ్డున భాసిల్లుతున్న అంబేద్కర్ విగ్రహం. అక్కడే ఉన్న పార్కు, లైబ్రరీ అంతా ఒక విజ్ఞాన సంపదగా ఉన్న టూరిస్టు స్పాట్‌పై గురువారం రాత్రి దాడి జరగడం అత్యంత శోచనీయం.ఏపీ సమాజంలో అశాంతి రోజురోజుకు పెరిగిపోతున్న తరుణంలో అంబేద్కర్ విగ్రహంపై దాడి మరింత ప్రమాదకరంగా ఉంది. ఒకవైపు గవర్నర్ బంగళా, మరో వైపు ఐఎఎస్, ఐపీఎస్ అధికారుల నివాసాలు, కార్యాలయాలు ఉన్న విజయవాడ స్వరాజ్మైదాన్లోని అంబేద్కర్ విగ్రహంపై దుండగులు దాడికి సాహసించారంటే కచ్చితంగా దీని వెనుక ఎవరో కొందరు పెద్దల హస్తం ఉందన్న అనుమానం సహజంగానే వస్తుంది. ప్రత్యేకించి అంబేద్కర్ కేంద్రాన్ని ప్రారంభించిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరును శిలాఫలకం నుంచి తొలగించడానికి జరిగిన యత్నం చూస్తే ఇది టీడీపీ అల్లరి మూకల పనేనన్న సంగతి అర్ధం అవుతుందని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్‌ల ప్రమేయంతోనే ఇలాంటి నీచమైన అకృత్యాలు జరుగుతున్నాయని ఆ పార్టీ ధ్వజమెత్తుతోంది. అంబేద్కర్‌ను దేశ వ్యాప్తంగా ప్రజలు గౌరవిస్తారు. అంతర్జాతీయంగా కూడా అనేక దేశాలలో ఆయన విగ్రహాలు ఉన్నాయి. అగ్రరాజ్యమైన అమెరికాలో సైతం ఆయన విగ్రహాలు ఉన్నాయంటే ఆయన పట్ల మానవ సమాజం ఎంత అభిమానంతో ఉండేదో తెలుస్తుంది. అలాంటి మహనీయుడి విగ్రహాన్ని భారీ ఎత్తున ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచన రావడం, దానిని ఎక్కడో మారుమూల కాకుండా విజయవాడ నడి బొడ్డున ఏర్పాటు చేసి ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయడానికి జగన్ ప్రభుత్వం సంకల్పించి పూర్తి చేసింది. వేలాది మంది ప్రజలు రాష్ట్రం నలుమూల నుంచి తరలిరాగా, విగ్రహం.. అంబేద్కర్ లైబ్రరీ, పార్కు మొదలైనవాటిని జగన్ ఆవిష్కరించారు.నిత్యం వేలాది మంది అక్కడకు వెళ్లి అనుభూతి పొందుతారు. 2014 టరమ్‌లో చంద్రబాబు ప్రభుత్వం కూడా అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించాలని, ఆయన పేరుతో స్మృతివనం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. కాని విజయవాడ వంటి సెంటర్లో కాకుండా, అమరావతిలో ఎక్కడో మారుమూల ఒక గ్రామంలో నెలకొల్పాలని ప్రతిపాదించారు. చంద్రబాబు ప్రభుత్వం చివరికి దానిని కూడా ఏర్పాటు చేయలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన. జగన్ ప్రభుత్వం ఏదో కుగ్రామంలో కాకుండా, విజయవాడ నగరంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు సముచితంగా ఉంటుందని భావించింది. స్వరాజ్మైదాన్ను అటు అంబేద్కర్ కేంద్రంగాను, ఇటు పార్కు, వాకింగ్ ట్రాక్ మొదలైనవాటితో టూరిస్టు స్పాట్‌గా అభివృద్ది చేయాలని ప్లాన్ చేసి సుమారు రూ.400కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తి చేసింది.సామాజిక న్యాయానికి ప్రతిరూపంగా అంబేద్కర్‌ను అంతా చూసుకుంటారు. పేదల గుండెల్లో, ప్రత్యేకించి దళితుల హృదయాలలో ఆయన కొలువై ఉన్నాడంటే ఆశ్చర్యం కాదు. స్వరాజ్మైదాన్ను అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం చైనా మాల్గా మార్చాలని ప్రయత్నించింది. కాని విజయవాడ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడంతో ముందుకు వెళ్లలేదు. జగన్ ప్రజలందరికి ఉపయోగపడేలా దానిని తీర్చిదిద్దారు. అంతే కాక అంబేద్కర్ పేరుతో కోనసీమ జిల్లాను ఏర్పాటు చేశారు. అప్పుడు కూడా రాజకీయం జరిగింది.తొలుత అమలాపురం కేంద్రంగా ఏర్పాటు చేసిన జిల్లాకు కోనసీమ జిల్లా అని పేరు పెట్టగా దళితవర్గాలు అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేసి ఆందోళనలకు దిగాయి. ఆ ఉద్యమంలో టీడీపీ, జనసేన వంటివి కూడా పాల్గొని దళితవర్గాలను రెచ్చగొట్టాయి. జగన్ ప్రభుత్వం అందరి అభిప్రాయాల మేరకు కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు కూడా జత చేసింది. అప్పుడు ఇదే టీడీపీ, జనసేన నేతలు ఇతర వర్గాలను రెచ్చగొట్టి కల్లోలం సృష్టించాయి. చివరికి అప్పటి మంత్రి, ఒక ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి చేసి నిప్పు పెట్టి అరాచకానికి పాల్పడ్డాయి. టీడీపీ, జనసేనలు డబుల్‌గేమ్ ఆడినా జగన్ ప్రభుత్వం నిర్దిష్ట విధానంతో ముందుకు వెళ్లింది. దాని వల్ల వైఎస్సార్సీపీకి కొంత నష్టం కూడా వాటిల్లింది. ఆ తర్వాతకాలంలో విజయవాడలో అంబేద్కర్ విగ్రహం నిర్మాణాన్ని భారీ ఎత్తున చేపట్టారు.విజయవాడకు ఎటువైపు నుంచి ఎంటర్ అవుతున్నా విగ్రహం కనబడుతుంటుంది. అలాంటి టూరిస్ట్ స్పాట్ పై టీడీపీకి చెందిన కొందరు గూండాలు దాడి చేయడం, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడం దారుణంగా ఉంది. అంబేద్కర్ కేంద్ర సిబ్బంది నుంచి సెల్ పోన్లు లాక్కుని మరీ టీడీపీ కార్యకర్తలు రౌడీయిజానికి పాల్పడ్డారు. ఈ విగ్రహాన్ని ప్రారంబించిన జగన్ పేరు అక్కడ ఉండడం వారికి నచ్చలేదు. అంతే ఆ అక్షరాలను పీకేశారట. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు సమాచారం అంది పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా, వారు పట్టించుకోకపోవడం శోచనీయం. టీడీపీ గూండాలు హత్యలు, దాడులు, విద్వంసాలకు పాల్పడుతున్నప్పటికీ పోలీసులు చూసి-చూడనట్లు ఉండడం, పైగా వాటిని ప్రోత్సహించే విదంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు వ్యాఖ్యలు చేస్తున్నట్లు వార్తలు వస్తుండడంతో టీడీపీ రౌడీలకు అడ్డు, ఆపు లేకుండా పోయిందన్న విమర్శలు ఉన్నాయి.ఇక తెలుగుదేశం మీడియా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా ఇంగితం లేకుండా వ్యవహరిస్తున్నాయి. చివరికి ఆంద్రజ్యోతి మీడియా ఈ దాడిని సైతం సమర్ధించే రీతిలో కదనాలు ఇస్తోందంటే అది ఏ రకంగా తయారైంది అర్థం చేసుకోవచ్చు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ వారు ఎంత అరాచకం చేసినా కనీస స్థాయిలో కూడా స్పందించడం లేదు. ఆయనకు పదవి రావడం పరమాన్నంగా మారింది. ఇక్కడ ఒక సంగతి గమనించాలి. గతంలో ఎప్పుడూ ఇలా విగ్రహాలపై, శిలాఫలకాలపై ఏ రాజకీయ పార్టీ దాడి చేయలేదు. ఒక్కడైనా ఒకటి, అరా జరిగినా, పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకునేవారు. కాని ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను దగ్ధం చేయడం, ధ్వంసం చేయడం, జగన్ పేరు, అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు ఉన్న శిలాఫలకాలను ద్వసం చేయడం వంటి అల్లర్లతో టీడీపీ అరాచక శక్తులు రెచ్చిపోయాయి.గుంటూరులో స్వయంగా ఒక టీడీపీ ఎమ్మెల్యేనే గుణపం పట్టుకుని శిలాఫలకాన్ని కూల్చుతున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వ్యాప్తిలోకి వచ్చాయి. రాజమండ్రిలో అప్పటి ఎంపీ భరత్ ఆద్వర్యంలో ఒక వంతెన నిర్మాణం జరిగింది. దానికి సంబంధించిన శిలాఫలకాన్ని కూడా టీడీపీ గూండాలు ద్వంసం చేశారు. ఇలా ఒకటి కాదు. అనేక చోట్ల టీడీపీ కార్యకర్తలు నీచంగా వ్యవహరిస్తుంటే నిరోధించవలసిన నాయకత్వం వారిని ఎంకరేజ్ చేసేలా కామెంట్స్ చేస్తూ వచ్చింది. టీడీపీ దళిత నేతలు సైతం నోరు విప్పడం లేదు. గతంలో ఎన్టీఆర్ విగ్రహానికి ఎవరైనా కొద్దిపాటి అపచారం చేసినా ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసేవి. అలా వార్తలు ఇవ్వడం తప్పు కాదు. ఏ నాయకుడి విగ్రహంపైన ఎవరూ దాడులు చేయకూడదు. కాని వైఎస్ విగ్రహాలను ద్వంసం చేసినా, చివరికి అంబేద్కర్ విగ్రహంపై దాడి జరిగినా ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి మీడియా ప్రముఖంగా వార్త ఇవ్వలేదంటే వారు ఏ స్థాయికి దిగజారింది అర్ధం చేసుకోవచ్చు.టీడీపీ మీడియాలో ఈ ఘటనలు రిపోర్టు చేయకపోతే, పోలీసులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇలా టీడీపీ రౌడీ గ్యాంగ్‌లు, టీడీపీ మీడియా మాఫియా మాదిరి ప్రవర్తిస్తున్న తీరు ఏపీ బ్రాండే ఇమేజీని నాశనం చేస్తున్నాయి. చంద్రబాబు ఈ వయసులో మంచి పేరు తెచ్చుకోకపోతే మానే, ఇలాంటి అరాచకాలను ప్రోత్సహిస్తున్నారన్న అప్రతిష్టను మూటకట్టుకుంటున్నారు. ఇదంతా ఆయన కుమారుడు లోకేష్ కనుసన్నలలో జరుగుతోందని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది. ఇప్పుడు టీడీపీ ఇష్టారీతిన విధ్వంసానికి పాల్పడితే, అప్పటి సీఎం పేరును, మంత్రుల పేర్లను ఫలకాల నుంచి తొలగించి ఆనందపడితే, భవిష్యత్తులో టీడీపీ ఓడిపోయి వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే, అప్పుడు ఇదే పరిస్తితి వారికి ఎదురు కాదా అన్న ప్రశ్న వస్తుంది. కాని సంకుచిత స్వభావంతో వ్యవహరిస్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రస్తుతం విచక్షణ కోల్పోయి ఉన్మాదులుగా మారారు. ప్రజాస్వామ్యంలో ఎవరి అధికారం శాశ్వతం కాదు. ఈ విషయం పలుమార్లు అనుభవం అవుతున్నా, టీడీపీకి చెందిన కొందరు మూర్ఖులు ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతుండడం దురదృష్టకరం.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
చంద్రబాబు, లోకేశ్‌లే ముద్దాయిలు
సీతారామాపురంలో సుబ్బరాయుడు హత్యను చూస్తే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని స్పష్టంగా అర్థమవుతోంది. లా అండ్ ఆర్డర్ ఎలా ఉండకూడదో అన్నదానికి చరిత్రలో ఈ ఘటన ఓ ఉదాహరణగా నిలిచిపోతుంది. పోలీసుల సమక్షంలోనే హత్య జరిగింది. హత్య జరుగుతుందనే విషయం ఎస్ఐ, సీఐ, డీఎస్పీలకు చెప్పినా అదనపు బలగాలు పంపలేదు. హత్యను ఎస్ఐ, కానిస్టేబుళ్లు నివారించలేకపోయారు. పథకం ప్రకారం పోలీసులు, రాజకీయ నేతలు కలిసి ఇలాంటి ఘటనలతో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. మండలానికి ఇద్దరిని చంపండని స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి చెప్పాడు. అయినా అతనిపై కేసులు లేవు. చంపిన వారితో పాటు వారి వెనుక ఉన్న వారిని కూడా కేసుల్లో చేర్చాలి. చంపిన వారికి మద్దతు ఇచ్చిన నారా లోకేశ్, చంద్రబాబు నాయుడులను కూడా ముద్దాయిలుగా చేస్తేనే లా అండ్ ఆర్డర్ బతుకుతుంది. – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి ప్రతినిధి కర్నూలు : రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అధికార పార్టీ నేతలు ఎవరంతకు వారు రెడ్ బుక్ అమలు చేస్తూ స్వైర విహారం చేస్తున్నారని.. హత్యలు, దాడులకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ప్రజలు చైతన్యవంతులై వీటిని అరికట్టకపోతే ప్రజాస్వామ్య ఉనికికే ప్రమాదమని, శాంతి భద్రతలు మరింతగా అదుపు తప్పక ముందే అందరూ సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామాపురంలో టీడీపీ ప్రభుత్వం చేతిలో దారుణ హత్యకు గురైన వైఎస్సార్సీపీ కార్యకర్త పసుపులేటి సుబ్బరాయుడు కుటుంబాన్ని శుక్రవారం ఆయన పరామర్శించారు. కుటుంబ సభ్యులతో అరగంటకుపైగా మాట్లాడి ఓదార్చారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, మండల స్థాయిలో మండల నాయకులు, గ్రామ స్థాయిలో గ్రామ నాయకులు వారి వారి రెడ్‌బుక్‌లు తెరిచి ఊళ్లలో ఆధిపత్యం కోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను నిస్తేజులుగా చేసి, వారి సమక్షంలోనే లా అండ్ ఆర్డర్‌ను నాశనం చేసిన పరిస్థితి సీతారామాపురంలో సుబ్బరాయుడి హత్య, ఆ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని చూస్తే స్పష్టమవుతోందన్నారు. ‘సుబ్బరాయుడు కుటుంబం ఎన్నికల సమయంలో బూత్‌లో ఏజెంట్లుగా కూర్చున్నారు. వీరితో పాటు మరో మూడు కుటుంబాల వారు ఏజెంట్లుగా కూర్చున్నారు. దీంతో పెద్దిరెడ్డి, పల్లం శేఖర్, నారపురెడ్డి వీరందరిని చంపాలనే దారుణ రాజకీయాలు చూస్తే ఆశ్చర్యమనిపిస్తోంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏమైంది? సుబ్బరాయుడిని హత్య చేసేందుకు బయట నుంచి వచ్చిన వారితో పాటు 35–40 మంది రాడ్లు, రాళ్లు, కత్తులు, కర్రలు పట్టుకుని స్వైర విహారం చేసేందుకు ఏకమయ్యారు. ఇది చూసి నారపురెడ్డి 9.30 గంటలకు ఎస్ఐకి ఫోన్ చేశాడు. ‘గ్రామంలో వాతావరణం సరిగా లేదు. బయట నుంచి వ్యక్తులు వచ్చారు. రాడ్లు, తుపాకులు, కత్తులు కన్పిస్తున్నాయి. ఏదో జరగబోతోంది. పోలీసులు త్వరగా రావాలి’ అని చెప్పాడు. కొద్దిసేపటికి ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చారు. ఎస్ఐ గ్రామంలోని పరిస్థితులన్నీ చూశారు. సీఐ, డీఎస్పీలకు ఫోన్ చేశారు. అయినా బందోబస్తు పంపలేదు. ఎస్ఐ, కానిస్టేబుళ్ల ముందు టీడీపీ నేతల స్వైర విహారం కన్పిస్తున్నా ఆపే ప్రయత్నం చేయలేదు. కత్తులు, కట్టెలు కన్పిస్తున్నా ఎస్ఐ, కానిస్టేబుళ్లు ప్రేక్షక పాత్ర పోషించారు. అదనపు బలగాలు రాలేదు’ అని నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. పోలీసుల సమక్షంలోనే హత్య నంద్యాలకు కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే సీతారామాపురం ఉంది. ఎస్పీ, డీఎస్పీ వచ్చేందుకు 10 నిమిషాలే పడుతుంది. సరైన సమయంలో పోలీసులను పంపి ఉంటే ఘటన జరిగేది కాదు. అదనపు బలగాలు రాకపోవడంతో ఎస్ఐ, కానిస్టేబుళ్లు చూస్తుండగానే అర్ధరాత్రి 12.20 గంటలకు సుబ్బరాయుడిని హతమార్చారు. మరో రెండు కుటుంబాలపై దాడి చేశారు. సుబ్బరాయుడు భార్యను నరికి గాయపరిచారు. ఇవన్నీ జరుగుతున్నా ఎస్ఐ, కానిస్టేబుళ్లు ఆపలేదు. లోకేశ్, చంద్రబాబునాయుడు అండదండలతోనే పోలీసులు ఎవ్వరూ గ్రామంలోకి రాకుండా పథకం వేసినట్లు అన్పిస్తోంది. నారపురెడ్డిని పోలీసు స్టేషన్‌కు వెళ్లిపో అని ఎస్ఐ చెప్పాడు. నారపురెడ్డి స్టేషన్‌కు వెళ్లిన తర్వాత హత్య జరిగింది. హత్య ఘటన తెలిసి 12.59కి పోలీసుస్టేషన్ నుంచి ఎస్పీకి నారపురెడ్డి ఫోన్ చేశాడు. ‘మా ఊళ్లో మనుషులను చంపారు. ఇప్పుడే తెలిసింది. మా ఇంటి వద్ద సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ దృశ్యాలు మీకు పంపిస్తున్నా. చూడండి’ అని చెప్పినా అదనపు బలగాలు రాలేదు. చంపిన వారు దర్జాగా ఊరు వదిలే పరిస్థితి. వాళ్లను పట్టుకున్న నాథుడే లేడు. పట్టుకునేందుకు పోలీసులు రాలేదు. 1.08 గంటలకు మళ్లీ నారపురెడ్డి ఫోన్ చేశాడు. ఎస్పీ ఆఫీసుకు వస్తున్నామని చెప్పారు. ఆపై 3.18 గంటలకు మళ్లీ ఫోన్ చేశాడు. ‘హంతకుల ముఠాలో రమణ అనే వ్యక్తిని అతి కష్టం మీద పట్టుకున్నాం. అతన్ని అదుపులోకి తీసుకుని మిగిలిన వారిని అరెస్టు చేయండి’ అని చెప్పారు. చివరకు 3.28 గంటలకు ఎస్పీ నారపురెడ్డికి ఫోన్ చేసి మీరు పట్టుకున్న రమణను నంద్యాల త్రీటౌన్‌లో అప్పగించాలని చెప్పారు. చివరకు పోలీసులు రమణను ఎస్పీ ఆఫీసులోపలికి తీసుకెళ్లారు. ఈ ప్రశ్నలకు సమాధానాలేవీ? » గ్రామంలో ఘటన జరుగుతుందని పోలీసులకు ఫోన్ వచ్చింది. పోలీసుల సమక్షంలో హత్య జరుగుతున్నా ఎందుకు అదనపు బలగాలు రాలేదు? » హత్య చేసి పలువురిని గాయపరిచిన వారంతా గ్రామం వదిలిపోయేదాకా వారిని పట్టుకునే ప్రయత్నం పోలీసులు ఎందుకు చేయలేదు? » ఈ హత్య వెనుక ఎవరి ప్రోద్బలం ఉంది? ఎవరు ఆడిస్తున్నారు? » సీఐ, డీఎస్పీ, ఎస్పీ ఏ ఒక్కరూ అదనపు బలగాలు పంపించకుండా ఆపగలిగారంటే నాయకులు, పోలీసులు కలిసి ఏ స్థాయిలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారనేది స్పష్టమవుతోంది. అసలు ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఉందా? » రాష్ట్రంలో ప్రతీ ఘటన ఇలాగే ఉంది. వినుకొండలో రషీద్ అనే వ్యక్తిని నడిరోడ్డుపై నరికారు. ఇదే శ్రీశైలం నియోజకవర్గంలోని దాసు (హత్య ఫొటోలు చూపిస్తూ)ను చంపారు. దాసు కుమారుడు నా వద్దకు వచ్చి మా నాన్నను జూన్ 26న పట్టపగలే చంపారు అని చెప్పాడు. నాయకులు, పోలీసులు కలిసే ఘటనలు జరిగేలా చేస్తారు.. భయానక వాతావరణం సృష్టిస్తారు.. తప్పనిసరి కేసు పెట్టాల్సి వచ్చినపుడు చిన్న చిన్న ముద్దాయిలను చేర్చి కేసును ఆపేస్తున్నారు. చేయించిన వారు ఎవరు? ఎమ్మెల్యే పేరు ఎందుకు కేసుల్లో చేర్చడం లేదు? » సుబ్బరాయుడిని చంపిన శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డికి ఫోన్ చేసి ఉండడా? హత్యకు ముందు.. ఆ తర్వాత అతను ఎవరితో మాట్లాడారో కాల్ డేటాను ఎందుకు పరిశీలించలేకపోతున్నారు? కేసును ఎందుకు వారి వద్దకు పోకుండా ఆపుతున్నారు? ఎమ్మెల్యే బుడ్డాపై ఎందుకు కేసు పెట్టలేదు? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పింది. ఈ ఘటనలపై హైకోర్టుతో పాటు అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తాం. కోర్టుల ద్వారా పికెటింగ్ ఏర్పాటు చేసి బాధితులకు రక్షణ కలిగేలా చేస్తాం. అప్పడే కొద్దోగొప్పో ప్రజాస్వామ్యం బతుకుతుంది. హత్య చేసిన వారితో పాటు చేయించిన వారిని కూడా ముద్దాయిలుగా చేరుస్తూ జైల్లో పెట్టాలి. అప్పుడే రాష్ట్రంలో అరాచకాలు ఆగుతాయి. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి విజయోత్సవ సభ అని కౌంటింగ్ తర్వాత మీటింగ్ పెట్టారు. ఆయన ఎలా మాట్లాడారో చూడండి. (ఫోన్లో బుడ్డా మాట్లాడిన వీడియోను చూపుతూ) ‘మాంచి పట్టుడు కట్టెలు పెట్టుకోండి. మండలానికి ఇద్దరిని పీకండి. చేతకాకపోతే చెప్పండి. నేను మనుషులను పంపిస్తా. కండువా వేసుకుని మన పార్టీలో చేరితే మనకు అభ్యంతరం లేదు. లేదంటే తోలు తీయడమే’ అని ఆ పార్టీ వాళ్లను రెచ్చగొట్టారు. మండలానికి ఇద్దరిని చంపండి.. దాడులు చేయండి.. కేసులు, పోలీసులు నేను చూసుకుంటా.. అంటున్నాడు. స్థానిక ఎమ్మెల్యే మీటింగ్‌లు పెట్టి ఇంత దారుణంగా చంపమని చెబుతుంటే పోలీసులు ఎందుకు కేసులు పెట్టలేదు? చంపిన వారిపై మాత్రమే కాదు.. వారికి రక్షణ ఇచ్చే వారిపై కూడా కేసులు పెడితేనే లా అండ్ ఆర్డర్ నిలబడుతుంది. ప్రభుత్వ వైఫల్యాలు ప్రశ్నించకూడదనే.. ఎన్నికల వేళ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, ప్రజలకు మంచి చేసి.. వారి మనసులో స్థానం సంపాదించుకోవాలనే ఆలోచనే ప్రభుత్వంలో కన్పి0చడం లేదు. రెండు నెలలుగా రాష్ట్రంలో అరాచకం, మారణహోమం సృష్టించే పాలన నడుస్తోంది. ఎన్నికలప్పుడు చంద్రబాబునాయుడు ఏం మాటలు చెప్పారో, ప్రజలను ఎలా మోసం చేస్తూ ఓట్లు వేయించుకున్నారో అందరికీ తెలుసు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతో, ప్రశ్నించకూడదనే ఆలోచనతో భయానక వాతావరణాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సృష్టిస్తున్నారు. ఎన్నికలప్పుడు చంద్రబాబు, ఆయన పార్టీ అభ్యర్థులు క్యాంపెయిన్ చేస్తూ చిన్న పిల్లలు కన్పిస్తే చాలు ‘నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు నీకు రూ.15 వేలు’ అని చెప్పి ప్రలోభ పెట్టారు. అక్క చెల్లెమ్మలు కన్పిస్తే ‘ప్రతి అక్కచెల్లెమ్మకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు సంతోషమేనా?’ అని అడిగారు. నిరుద్యోగి కన్పిస్తే ‘రూ.3 వేల నిరుద్యోగ భృతి సంతోషమా?’ అని.. రైతులు కన్పిస్తే ‘మీకు రూ.20 వేలు సంతోషమా?’ అని అడిగారు. ఇలాంటి ఆలోచనలు, మాటలతో ఇంటింటికీ టీడీపీ శ్రేణులను పంపించి చంద్రబాబు ప్రచారం చేయించారు. ఎన్నికల తర్వాత చిన్న పిల్లలను మోసం చేశారు. అదే జగనన్న ఉండి ఉంటే ఇప్పటికే రూ.15 వేలు అమ్మ ఒడి అంది ఉండేది. తల్లికి వందనం అని చెప్పి పిల్లలందరినీ మోసం చేయడమే కాకుండా తల్లికి పంగనామం పెట్టారు. వ్యవసాయ సీజన్ మొదలైంది. రైతులు ముమ్మరంగా వ్యవసాయం చేస్తున్నారు. జగన్ ఉండి ఉంటే ఈ పాటికే రైతు భరోసా సొమ్ము అందేది. ఆ సొమ్మూ పోయింది. చంద్రబాబు ఇస్తామన్న రూ.20 వేలు పోయింది. 18 ఏళ్లు నిండిన ప్రతి అక్కచెల్లెమ్మకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తానని చెప్పి అడ్డగోలుగా మోసం చేశాడు.జగనే ఉండి ఉంటే ఈ పథకాలు రావడంతో పాటు చదువుకుంటున్న పిల్లలకు విద్యా దీవెన, వసతి దీవెన కింద ఫీజులు కూడా కట్టేవాడు. ఇవి కూడా ఇవ్వకుండా, పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ కింద డబ్బులు జమ చేయకుండా చంద్రబాబు మోసం చేశాడు. ఇలా రైతులు, చిన్న పిల్లలు, అక్క చెల్లెమ్మలు అందరినీ మోసం చేశారు. ఏ ఒక్కరూ ప్రశ్నించకూడదు.. రోడ్డుపైకి రాకూడదు.. నిలదీయకూడదు.. అని రాష్ట్ర వ్యాప్తంగా రెడ్‌బుక్ పాలన సాగిస్తున్నారు. దారి పొడవునా ఘన స్వాగతం ఉదయం 10.15 గంటలకు ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు చేరుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి ఓర్వకల్లు మీదుగా హుస్సేనాపురం, తమ్మరాజుపల్లె, పాణ్యం డొంక, బలపనూరు, వెంకటేశ్వరపురం, టోల్గేట్, నంద్యాల బైపాస్, అయ్యలూరి మెట్ట, నందిపల్లె మీదుగా సీతారామాపురం చేరుకున్నారు. ఓర్వకల్లు నుంచి సీతారామాపురం చేరుకోవడానికి మామూలుగా గంట పడుతుంది. అలాంటిది అడుగడుగునా ప్రజాభిమానం వెల్లువెత్తడంతో 5 గంటలకు పైగా పట్టింది. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, అభివాదం చేస్తూ 3.20 గంటలకు సీతారామాపురం చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, ఇసాక్, ఎమ్మెల్యే విరూపాక్షి, జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి, మేయర్ బీవై రామయ్య, మాజీ ఎంపీలు పోచా బ్రహా్మనందరెడ్డి, బుట్టారేణుక, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి, శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి, గంగుల బిజేంద్రారెడ్డి, కాటసాని రామిరెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కంగాటి శ్రీదేవి, హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయ హత్యలతో రాష్ట్రం అట్టుడుకుతోంది
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘గత ప్రభుత్వంలో వేసిన అభివృద్ధి శిలాఫలకాలను టీడీపీ ఎమ్మెల్యేలు ధ్వంసం చేస్తున్నారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. ఎవరైతే శిలాఫలకాలను కూల్చివేస్తారో.. మళ్లీ వాళ్లేతోనే నిర్మింపజేస్తాం. టీడీపీ నాయకులు ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు కృషి చేయాలి. లేకపోతే ప్రజలకు అండగా నిలిచి.. పోరాటం చేస్తాం’ అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి హెచ్చరించారు. ఆయన మంగళవారం నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. రాజకీయ హత్యలతో రాష్ట్రం అట్టుడికిపోతోందని.. లోకేశ్ రెడ్‌బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నాడని కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. ‘ఎన్నికల హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చడం కుదరదని కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు పరోక్ష సంకేతాలు ఇచ్చారు. మైసూర్ బోండాలో మైసూర్లాగా.. ఉచిత ఇసుకలో ఉచితం కన్పిస్తోంది. ఉచిత ఇసుక ఇస్తున్నట్లు చంద్రబాబు రోజూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఆ ఉచిత ఇసుక ఎక్కడ దొరుకుతుందో చంద్రబాబుకే తెలియాలి. టీడీపీ మూకలు మాత్రం ఇసుక రేవుల్లో పడి ఇష్టారాజ్యంగా దోచేస్తున్నాయి. రాష్ట్రంపై రూ.14 లక్షల కోట్ల అప్పు భారం ఉందంటూ రచ్చ చేసిన చంద్రబాబు.. గవర్నర్ ప్రసంగంలో మాత్రం రూ.10 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పించారు. ఇష్టారీతిన హామీలు ఇచ్చినప్పుడు గుర్తుకు రాలేదా అప్పుల గురించి? అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యేలు చెప్పినట్లుగా నడుచుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలకు చెప్పడం ద్వారా చంద్రబాబు కూడా అవినీతికి వంతపాడుతున్నారు. దాడులు, అవినీతి, అక్రమాల్లో టీడీపీ నేతలు ఆరితేరిపోయారు’ అని కాకాణి ధ్వజమెత్తారు. -
మీ గొంతు మూగబోయిందా లోకేశ్?
నెల్లూరు(టౌన్): ‘ఫీజు రీయింబర్స్మెంట్ గురించి యువగళంలో మాట్లాడిన మీ గొంతు మంత్రి పదవి రాగానే మూగబోయిందా లోకేశ్..’ అని ఏబీవీపీ నాయకులు ప్రశి్నంచారు. ‘యువగళంలో మాట్లాడిన నోరు మంత్రి పదవి రాగానే మూగబోయిందా..’ అనే బ్యానర్ చేతపట్టుకుని ఏబీవీపీ నాయకులు సోమవారం నెల్లూరులోని వీఆర్సీ సెంటర్లో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కనీ్వనర్ రాహుల్ మాట్లాడుతూ తాము అధికారంలోకి వచి్చన వెంటనే జీవో నంబర్ 77ను రద్దు చేస్తామని లోకేశ్ యువగళం పాదయాత్రలో హామీ ఇచ్చారని చెప్పారు.ఫీజు రీయింబర్స్మెంట్ లేని కారణంగా ఎంతోమంది విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని, అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేశ్ మాట్లాడటం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయంపై మంత్రి లోకేశ్ వెంటనే స్పందించాలని, లేకపోతే ఎక్కడికక్కడ ఆయన పర్యటనలను అడ్డుకుంటామని, సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. రోడ్డుపై బైఠాయించిన ఏబీవీపీ నాయకులను పోలీసులు బలవంతంగా ఈడ్చి పక్కన పడేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు సమీర్, సుమన్, రాబర్ట్, వినోద్, హేమంత్, సుకుమార్, నవీన్ పాల్గొన్నారు. -
‘సెల్ ఫోన్’తో సొల్లు కథ
మంత్రి అనగాని సత్యప్రసాద్, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లో ఆ పార్టీ నేతల పేకాట, కోడి పందేల కేంద్రాల వ్యవహారాన్ని మరుగున పరిచేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, ఇతర టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారన్న విషయం విస్పష్టంగా బయటపడింది. చిన్న లాజిక్ మిస్సయిన టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపోయారు. – సాక్షి ప్రతినిధి, బాపట్లనగరం మండలం వెలమవారిపాలెంలో ఇటీవల ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి పేకాట కేంద్రంలో రోజుకు కోట్లలో ఆట ఆడిస్తున్నారు. ఈ ఒక్క కేంద్రం నుంచే స్థానిక టీడీపీ నేతకు నెలకు రూ. 60 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. దీనిని స్థానిక పోలీసుల సహకారంతో నడిపిస్తున్నారు. ఈ కేంద్రాల బారిన పడి వందలాది మంది ఆరి్థకంగా చితికిపోతున్న విషయాన్ని వైఎస్సార్సీపీ నేత వరికూటి అశోక్‌బాబు బయటపెట్డడంతో టీడీపీ నేతలు బహిరంగ సవాళ్లు విసిరారు. పోలీసులు అశోక్‌బాబును గృహ నిర్బంధం చేయగా, టీడీపీ నేత సాయిబాబు, ఆయన అనుచరులు భట్టిప్రోలులో టీడీపీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున చేరారు. వారిని నిలువరించే సందర్భంలోనే పోలీసులపై టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు.నగరం ఎస్సైని టీడీపీ కార్యకర్త చొక్కా పట్టుకొని నెట్టిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. దీంతో ఉలిక్కిపడిన అధికార పార్టీ నేతలు దాని నుంచి తప్పించుకునేందుకు అది ఫేక్ అంటూ ఓ సెల్ ఫోన్ కథ అల్లారు. వాస్తవంగా ఈ ఘర్షణను వీడియో తీసింది టీడీపీ నేతలే. గొప్ప కోసం వారు సోషల్ మీడియా గ్రూపుల్లో పెట్టుకున్నారు. టీడీపీ కార్యకర్త నగరం ఎస్ఐ చొక్కా పట్టుకోవడం, వారిద్దరి పెనుగులాట వాటిలో స్పష్టంగా ఉంది.సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఇతర టీడీపీ నేతలు మాత్రం ఆ వీడియోను ఎడిట్ చేసి, కొత్త కథ అల్లారు. సెల్ ఫోనుకిందపడితే టీడీపీ కార్యకర్త తీసి ఇవ్వబోయాడంటూ కట్టుకథ అల్లారు. కలెక్టర్ల సమావేశంలోనూ సీఎం చంద్రబాబు ఎడిట్ చేసిన వీడియో క్లిప్‌ను చూపించి సాక్షి మీడియా, ప్రతిపక్ష వైఎస్సార్సీపీపై బురద జల్లే ప్రయత్నం చేశారు. సెల్ కిందపడితే కిందికి వంగి తీసివ్వాలి తప్ప ఎస్సైతో పెనుగులాడాల్సిన అవసరం ఏముందన్న వాస్తవాన్ని వారు మరిచారు.పైగా, నలుగురు పోలీసుల మధ్య నుంచి టీడీపీ కార్యకర్త దూరి మరీ ఎస్సై చొక్కా పట్టుకొన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. వీటన్నింటినీ మరుగునపెట్టి, పేకాట, కోడిపందాల వ్యవహారాన్ని తొక్కి పెట్టేందుకే చంద్రబాబు, లోకేశ్ కొత్త డ్రామాకు తెరలేపినట్లు టీడీపీ వారి వీడియోలను పరిశీలిస్తే స్పష్టంగా అర్థమవుతుంది. -
అబ్బో.. ఇదేనా బాబు.. మీ రెడ్ బుక్ బ్రాండ్ పాలన!
సాక్షి, గుంటూరు: బ్రాండ్ ఏపీని దెబ్బతీసేలా గత ఐదేళ్ల పాలన సాగిందని సీఎం చంద్రబాబు చేసిన అసత్య ఆరోపణలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అబ్బో.. ఇదేనా మీ రెడ్ బుక్ బ్రాండ్ పాలన అని వైఎస్సార్సీపీ నేతలు చంద్రబాబు ప్రస్తుత, గతంలో చేసిన అరాచక పాలనపై మండిపడుతున్నారు. ‘బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలులో శనివారం (ఆగష్టు 3,2024)తేదీన టీడీపీ కార్యకర్త ఆదిన తాండవకృష్ణ నగరం ఎస్ఐ కోటేశ్వరరావు చొక్కా పట్టుకుని నెట్టివేశాడు. అక్రమ ఇసుక తవ్వకాన్ని అడ్డుకున్నారని(జులై 10 2015)తేదీన ఎమ్మార్వో వనజాక్షిని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ఇసుకలో వేసి కొట్టించాడు. విజయవాడ ట్రాన్స్‌పోర్టు కమీషనర్ అయిన ఐపీఎస్ అధికారి బాలసుబ్రమణ్యం మీదికి వెళ్లి టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ(మార్చి 26 2017) తేదీన ఆయన సెక్యూరిటీ గార్డును తోసివేశాడు. నన్ను రామసుబ్బారెడ్డిని నలుగురు ఐఏఎస్‌ల సమక్ష్మ లో కూర్చోబెట్టి (అక్రమంగా ) సంపాదించిన దానిలో చెరి సగం పంచుకోమని చెప్పాడు మా పెద రా (నా) యుడు అని అప్పటి టీడీపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి చెప్పిన వీడియో ఉంది. అమరావతి డిజైన్ల కోసం అని చంద్రబాబు ఏరికోరి తెచ్చుకున్న జపాన్ మాకీ సంస్థ చైర్మన్ పుమిహికో అయితే.. ఏపీ కంటే బీహార్ నయం, ప్రతిదానికి లంచం ఇవ్వాలి అని విసిగి వేసారి లేఖ రాసి వెళ్లిపోలేదా? ’అని వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.ఎవరీ పాలన బ్రాండ్ ఏపీ ప్రతిష్ట దెబ్బతీసిందో తెలుసుకోవాలని, రాజకీయల కోసం అసత్య ఆరోపణలు చేయవద్దని వైఎస్సార్సీపీ నాయకులు మండిపడుతున్నారు. చంద్రబాబు గ్రాఫిక్స్ పాలన ప్రజలందరికీ తెలుసని ఎద్దేవా చేస్తున్నారు. -
టోఫెల్ శిక్షణ ఎత్తివేత
సాక్షి, అమరావతి: పాఠశాలల విద్యా బోధనలో కీలకమైన నూతన విద్యా సంవత్సరం (2024–25) కేలండర్‌ను నెలన్నర ఆలస్యంగా విడుదల చేశారు. వాస్తవానికి జూన్ 12న పాఠశాలలు తెరిచేందుకు కనీసం ఒక్క రోజు ముందైనా ఆ కేలండర్‌ను విడుదల చేయాలి. కానీ ఈసారి సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం కోసమని ముందుగా నిర్ణయించిన తేదీ కంటే ఒక రోజు ఆలస్యంగా బడులు తెరిచారు. అంతేకాకుండా విద్యార్థులకు బోధించాల్సిన రోజువారీ పాఠ్యాంశాలు, నిర్వహించాల్సిన పిరియడ్స్, పరీక్షలతో పాటు సెలవులు వంటి సమగ్ర సమాచారంతో కూడిన అకడమిక్ కేలండర్ ప్రకటన సైతం వాయిదా వేశారు. కేలండర్పై ఇంతకాలం ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారు. సోషల్ మీడియా గ్రూపుల్లో తప్పుడు కేలండర్ వైరల్ కావడం, అది వాస్తవమని ఉపాధ్యాయులు నమ్మడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.ఫార్మెటివ్ అసెస్మెంట్–1 ఆగస్టు ఒకటో తేదీ నుంచి అన్న అంశం ఉపాధ్యాయ గ్రూపుల్లో రావడంతో సిలబస్ పూర్తి చేసేందుకు ఒత్తిడి పెరిగింది. ఎట్టకేలకు ప్రస్తుత విద్యా పాఠశాల అకడమిక్ కేలండర్‌ను సోమవారం విద్యాశాఖ మంత్రి లోకేశ్ విడుదల చేశారు. గత విద్యా సంవత్సరంలో ప్రారంభించిన టోఫెల్– ప్రైమరీ/జూనియర్ శిక్షణను ఈసారి తొలగించారు. కేజీబీవీల్లో ఖాళీలను భర్తీ చేయండి: లోకేశ్ కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. అకడమిక్ కేలండర్ విడుదల సందర్భంగా లోకేశ్ ఉండవల్లిలోని నివాసంలో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు పూర్తిచేయాలన్నారు. పాఠశాలల్లో మధ్యా హ్న భోజనం నాణ్యత, మౌలిక సదుపాయాల మెరుగుదల పర్యవేక్షణ బాధ్యతను పేరెంట్స్ కమిటీలకు అప్పగించాలని సూచించారు. స్కూళ్లలో టాయిలెట్స్ మెరుగుపర్చాలని, అవసరమైన ఉపకరణాల కొనుగోలుకు టెండర్లు పిలవాలని ఆదేశించారు. సీబీఎస్ఈ స్కూళ్ల పనితీరుపై సుదీర్ఘంగా చర్చించారు.ఆటలకు గంట కేటాయింపు ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలు 232 రోజులు పనిచేయనున్నాయి. 88 వివిధ సెలవులు ఉన్నాయి. కేలండర్లో పేర్కొన్న విధంగా ఫార్మెటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ), సమ్మెటివ్ అసెస్మెంట్(ఎస్ఏ) పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. పదో తరగతి వార్షిక పరీక్షలు సమ్మెటివ్ అసెస్మెంట్–2 (ఎస్ఏ) వచ్చే ఏప్రిల్ 7 నుంచి 17 వరకు నిర్వహించనున్నారు. ఉన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బోధన, 4 నుంచి 5 గంటల వరకు ఆటలకు కేటాయించాలి. ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 3.30 వరకు అనంతరం గంట సమయాన్ని క్రీడలకు కేటాయిస్తారు.అక్టోబర్ 4 నుంచి దసరా సెలవులు » ఒంటిపూట బడుల సమయంలో పాఠశాలలు ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటాయి. » అక్టోబర్ 4 నుంచి 13 వరకు దసరా సెలవులు, మైనార్టీ విద్యా సంస్థలకు డిసెంబర్ 22 నుంచి 29 వరకు క్రిస్మస్ సెలవులు ఉంటాయి. జనవరి 11 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. » అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఉన్న పాఠశాలలు వారానికి వరుసగా రెండు పిరియడ్స్‌ను సైన్స్ పిరియడ్స్‌కు కేటాయించాలి. » పర్యావరణ విద్య సబ్జెక్టును 6, 7 తరగతులకు భౌతికశాస్త్రం ఉపాధ్యాయులు, 8, 9, 10 తరగతులకు జీవశాస్త్రం టీచర్లు బోధించాలి. » ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు ప్రతి నెల మొదటి, రెండో శనివారం ‘నో బ్యాగ్ డే’ పాటించాలి. ఈ సమయంలో విద్యార్థులతో పేపర్ కటింగ్, క్లే మౌల్డింగ్, డ్రాయింగ్, సింగింగ్, గార్డెనింగ్ వంటి యాక్టివిటీస్ చేయించాలి. » ప్రాథమిక పాఠశాలల పిల్లలకు లాంగ్వేజ్ పిరియడ్స్‌లో మంచి చేతి రాతను ప్రాక్టీస్ చేయించాలి. వారానికి రెండు పిరియడ్స్‌ను గూగుల్ రీడ్ యాప్ ద్వారా వినడం, మాట్లాడడం కోసం ఇంగ్లిష్ లాంగ్వేజ్ ల్యాబ్ నిర్వహించాలి. -
అరాచకం.. ఆటవికం.. ‘రెడ్’ రూల్!
సాక్షి, అమరావతి: ‘‘ఏపీ’’ అంటే ఈరోజు అరాచకం, ఆటవికం, రెడ్‌బుక్ పాలన అన్నట్లుగా కూటమి సర్కారు మార్చేసిందని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దునుమాడారు. ఎన్నికల్లో కూటమి నేతలు ఇచ్చిన హామీల అమలుపై ఏ ఒక్కరూ ప్రశ్నించకూడదని ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేందుకు నరమేధం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అధఃపాతాళానికి దిగజారినా ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సీఎం కుమారుడు, మంత్రి లోకేశ్ రెడ్‌బుక్ పేరిట రాష్ట్రవ్యాప్తంగా హోర్డింగ్‌లు పెట్టారు. వీటి ద్వారా పోలీసులకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? హత్యలు, ఆస్తుల ధ్వంసానికి పాల్పడతాం..! పోలీసులు ప్రేక్షక పాత్ర వహించండని చెబుతున్నట్లే ఉంది! ఆయా ఘటనలపై కేసులు పెడితే తోలు తీస్తాం..! బాధితులపైనే తిరిగి కేసులు పెట్టండి అని అనడానికి ఇది నిదర్శనం కాదా?’ అని నిలదీశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..రెడ్‌బుక్ పేరిట హత్యలు..హత్యాచారాలు.. దాడులులోకేశ్ రెడ్‌బుక్‌ను చూసి గ్రామాల్లో టీడీపీ నాయకులు రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. దీనిపై ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. టీడీపీ విధ్వంసకాండపై మేం ఢిల్లీలో నిరసన తెలుపుతుంటే పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ సాంబిరెడ్డిపై దాడి చేశారు. కాళ్లు, చేతులు విరగ్గొట్టారు. ఆయన చనిపోయాడని భావించి వదిలేశారు. రాజకీయంగా విభేదించారని ఇలా దాడులు చేస్తారా? ప్రతిపక్షం అనేదే లేకుండా చేయాలని దాడులకు తెగబడటం «ధర్మమేనా? చంద్రబాబు ఇచ్చిన అలవిగాని హామీలపై ఎవరూ ప్రశ్నించకూడదు! ఒకవేళ రోడ్డు ఎక్కి అడిగితే ఏం జరుగుతుందోనని భయం కల్పించేందుకే ఇలా కిరాతకంగా వ్యవహరిస్తున్నారు.పల్నాడులో పరాకాష్టకు సాధింపులువినుకొండలో రషీద్‌ను హత్య చేసిన నిందితుడు జిలాని స్థానిక ఎమ్మెల్యే భార్యకు కేక్ తినిపిస్తూ ఫోటోలు దిగాడు. ఎమ్యెల్యే, టీడీపీ నాయకులతో నిందితుడు అంటకాగినా కేసులో ఎక్కడా వారి పేర్లు లేవు. మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అక్రమ కేసులు బనాయించారు. పోలింగ్‌కు ముందు అక్కడ ఎస్పీగా ఉన్న రవిశంకర్‌రెడ్డి సమర్థంగా పని చేస్తుండటంతో ఆయన్ను బదిలీ చేయించి బిందుమాధవ్‌ను తెచ్చుకున్నారు. ఆయన చేసిన ఆకృత్యాలు తెలుసుకుని ఈసీ సస్పెండ్ చేసింది. అనంతరం వచ్చిన మలికాగార్గ్ టీడీపీ నాయకుల మాట వినడం లేదని శ్రీనివాస్‌ను ఎస్పీగా తెచ్చారు. ఆ తరువాత మూడో రోజే రషీద్‌ను నడి రోడ్డు మీదే దారుణంగా నరికేశారు. మహిళల భద్రత గాలికికేవలం గత 45 రోజుల వ్యవధిలో ఎనిమిది మంది మహిళలు, బాలికలపై అత్యాచార ఘటనలు రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి. నలుగురిపై అత్యాచారం, హత్యా ఘటనలు జరిగాయి. 12 మంది మహిళలు, చిన్నారి బాలికలపై అత్యంత దారుణమైన ఘటనలు కూడా వెలికి చూశాయి. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి మహిళకు దిశ యాప్ రక్షణ కవచంలా నిలిచింది. 1.41 కోట్ల మంది ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఎవరైనా ప్రమాదంలో ఉన్న మహిళలు, యువతులు ఫోన్‌ను షేక్ చేసినా.. ఎస్‌వోఎస్ బటన్ నొక్కినా వెంటనే పోలీసులకు అలెర్ట్ వెళ్లేది. పోలీసులు తక్షణమే బాధిత మహిళకు ఫోన్ చేసేవారు. ఒకవేళ బాధితులు ఫోన్ లిఫ్ట్ చేసే పరిస్థితిలో లేకుంటే పోలీసులే నేరుగా ఘటనా స్థలికి వెళ్లి రక్షించేవారు. ప్రతి గ్రామంలోనూ మహిళా పోలీసులు ఉండేవారు. ప్రస్తుతం మహిళల భద్రత గురించి కూటమి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దిశ యాప్‌తో జగన్‌కు క్రెడిట్ వస్తోందనే దుగ్ధతో దాన్ని వదిలేశారు. దిశ పోలీస్ స్టేషన్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లది ఇదే పరిస్థితి! చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్సీఎం చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. దారుణ హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని నేను పరామర్శించడం, రాష్ట్రంలోని అరాచక పరిస్థితులపై ఢిల్లీలో ధర్నాకు సిద్ధమవడంతో ప్రజల దృష్టి మళ్లించేందుకు మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో అగ్ని ప్రమాదంపై సీఎం రెండుసార్లు సమీక్ష నిర్వహించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై నిందలు మోపుతూ దుష్ప్రచారం చేశారు. హుటాహుటిన డీజీపీ, సీఐడీ ఏడీజీని చంద్రబాబు అక్కడికి హెలికాప్టర్లో పంపారు. ఆర్డీవో కార్యాలయంలో రికార్డులు కాలిపోతే కలెక్టరేట్, సీసీఎల్ఏలో రికార్డులు ఉంటాయి కదా? చివరకు ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంటాయి. అయినా కూడా ఏదో జరిగిపోతున్నట్లు హైడ్రామా సృష్టించారు.పెద్దిరెడ్డిని ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఆయన కుమారుడు మిథున్‌ను మూడు సార్లు ఎంపీగా ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజాదరణ ఉన్న కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు నిందలు మోపుతున్నారు. మిథున్ కారును ధ్వంసం చేయడంతో పాటు మాజీ ఎంపీ రెడ్డెప్ప కారును కాల్చి వేసి రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తే తిరిగి బాధితులపైనే కేసులు బనాయిస్తున్నారు. పెద్దిరెడ్డిపై చంద్రబాబుకు ఎందుకంత కోపం అంటే.. కాలేజీలో చదువుకునే సమయంలో ఆయన కొట్టాడట! ఆ కక్షతో పెద్దిరెడ్డి ఏ శాఖకు మంత్రిగా పనిచేసినా ఆ శాఖపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తారు. మదనపల్లెలో అగ్నిప్రమాదం జరిగితే డీజీపీని ప్రత్యేక హెలికాప్టర్లో పంపిన చంద్రబాబు నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో మైనర్ బాలిక అదృశ్యమైతే ఆ కుటుంబానికి న్యాయం చేయడానికి మాత్రం ముందుకు రారు. జూలై 7న బాలిక అదృశ్యమైతే 16న ఎస్పీ ప్రెస్‌మీట్ పెడతారు. దళితుడిని లాకప్ డెత్ చేశారు. కేసు విచారణ జరుగుతుండగానే ఎస్పీని బదిలీ చేశారు. -
ఈ ఏడాది డీఎస్సీ పోస్టుల భర్తీ లేనట్లే!?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డీఎస్సీ అభ్యర్థుల భవిష్యత్తుతో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్ర భుత్వం ఆడుకుంటోంది. ఈ ఏడాది డిసెంబర్ లోగా 16 వేల టీచర్ పోస్టులు భర్తీచేస్తామని గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే చంద్రబాబు ఈ ఫైల్‌పైనే తొలి సంతకం చేసి అభ్యర్థులో ఆశలు కల్పించారు. దీంతో వీలైనంత త్వరగా పోస్టుల భర్తీ జరుగుతుందని వారంతా ఆశించారు. అదంతా హంబక్కేనని.. ప్ర కటించిన గడువులోగా పోస్టుల భర్తీ చేపట్టే యోచనలో ప్రభుత్వం లేదని తెలుస్తోంది. మంగళవారం అసెంబ్లీలో మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ చేసిన ప్రకటనే చూస్తే ప్రభుత్వం ఉద్దేశం స్పష్టమవుతోంది. వచ్చే ఏడాది విద్యా సంవ త్సరం ప్రారంభం అయ్యేనాటికి టీచర్ పోస్టు లు భర్తీ చేసేలా ప్రణాళికలున్నాయని ఆయన అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా వెల్లడించారు. లోకేశ్ ఏమన్నారంటే..‘నాడు–నేడు’పై విచారణ జరుగుతోంది..జగన్ ప్రభుత్వ హయాంలో నాడు–నేడు కింద రెండు దశల్లో 38 వేల పాఠశాలల్లో రూ.15 వేల కోట్ల పనులకు శ్రీకారం చుట్టారని.. అందులో రూ.9,425 కోట్ల పనులు పూర్తయ్యాయన్నారు. నాడు–నేడు పనులపై విచారణ జరుగుతోందని నివేదిక అందాక, తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రైవేట్ పాఠశా లలకు దీటుగా ప్రభుత్వ బడులను బలోపేతం చేయడానికి కృషిచేస్తామ న్నారు. పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలను దత్తత తీసుకుంటామని ముందుకొస్తున్నారని, దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ.. 2018 గ్రూప్–1 రిక్రూట్మెంట్పై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. నియామక ప్రక్రియలో రూ.300 కోట్లు చేతులు మారాయని ఆరోపించారు. 781 కి.మీ.ల యూజీడీ పనులు పూర్తి.. గ్రేటర్ విశాఖ పరిధిలో 781 కి.మీ యూజీడీ పనులు పూర్తయినట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. విశాఖలో 19 ఎస్టీపీలు ఉన్నాయని, వీటిద్వారా 179 ఎంఎల్డీ శుద్ధిచేసిన నీటిని పరిశ్రమలకు సరఫరా చేస్తున్నామన్నారు. అలాగే, అన్ని జిల్లాల్లో ఎస్టీపీల కోసం రూ.300 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.కేంద్ర నిధులు దుర్వినియోగం కాలేదు..రాష్ట్రంలో కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు దుర్వినియోగం కాలేదని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రాష్ట్రంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు మళ్లింపు జరగలేదని సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎస్సీల సంక్షేమ కోసం ఐదేళ్లలో రూ.58,249 కోట్లు ఖర్చుచేశారన్నారు. -
రెడ్ బుక్ కాదది బ్లడ్ బుక్
సాక్షి, అమరావతి : ‘పోలింగ్, కౌంటింగ్ మధ్య రెడ్ బుక్ టీజర్ చూపించాం.. చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత రెడ్ బుక్ ట్రైలర్ చూపించాం.. అంతటితో అయిపోలేదు.. అసలు రెడ్ బుక్ సినిమా ముందుంది’ అని టీడీపీ రౌడీ మూకలు బరి తెగిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వ అధికార గూండాగిరీకి పోలీసు శాఖ దాసోహమవడంతో టీడీపీ రెడ్‌బుక్ ఏకంగా బ్లడ్ బుక్‌గా రూపాంతరం చెంది విశృంఖలత్వం సృష్టిస్తోంది. రెడ్‌బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో రక్తపుటేరులు పారిస్తూ టీడీపీ నేతల రక్తదాహం తీరుస్తోంది. అయినా సరే ఇది చాలదు.. అంతకు మించి అంటూ ప్రభుత్వ నేతే వ్యాఖ్యానించడంతో పచ్చ మూకలు మరింతగా మరణ మృదంగం మోగించేందుకు బరి తెగిస్తున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో ఇప్పటికే 36 హత్యలు.. నలుగురిపై అత్యాచారం, ఆపై హత్యలు.. 16 అత్యాచారాలు.. వెయ్యికి పైగా దాడులతో రాష్ట్రం హడలెత్తిపోతోంది. అరాచకం రాజ్యం చేస్తుంటే రాక్షస గణం గంగవెర్రులెత్తిపోతూ సృష్టిస్తున్న విధ్వంసకాండకు రాజ్యాంగబద్ధ వ్యవస్థలు మౌన సాక్షిగా మిగిలి పోతుండటం పరిస్థితిని మరింతగా దిగజారుస్తోంది.ఎదురు దాడి చేయండని మంత్రులకు ఆదేశంహత్యలు, హత్యాయత్నాలు, దాడులతో రాష్ట్రం అట్టుడుకుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం బాధ్యతాయుతంగా స్పందించనే లేదు. పోలీసు ఉన్నతాధికారులతో శాంతిభద్రతలపై సమీక్షించ లేదు. పైగా విధ్వంసకాండను వెనకేసుకొచ్చే రీతిలో మంత్రి మండలి సమావేశంలో మాట్లాడటం విభ్రాంతి కలిగించింది. హత్యలు జరుగుతున్నా జరగలేదన్నట్టుగా మాట్లాడాలి కదా.. అని మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేయడం విస్మయ పరుస్తోంది. అసలు 36 హత్యలు ఎక్కడ జరిగాయని ఎందుకు ప్రశ్నించలేదని కూడా ఆయన మంత్రులను నిలదీశారు. వినుకొండలో వైఎస్సార్సీపీకి చెందిన రషీద్‌ను టీడీపీ వర్గీయుడు జిలానీ.. నడి వీధిలో దారుణంగా హత్య చేస్తే, అది అసలు రాజకీయ హత్యేకాదని వితండవాదం చేయడం టీడీపీకే చెల్లింది. టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో క్రియాశీలకంగా పాల్గొన్న జిలానీ, అసలు తమ పార్టీకి చెందిన వ్యక్తే కాదని అడ్డగోలు వాదన చేయడం విడ్డూరం. అతను టీడీపీ ఎమ్మెల్యే సతీమణి జన్మదిన వేడుకల్లో పాల్గొని ఆమెకు కేకు తినిపిస్తున్న ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చినా సరే తమ పార్టీ నేత కాదనడం కంటే బుకాయింపు ఇంకేముంటుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే హోమ్ మంత్రి అనిత ఆదివారం హడావిడిగా మీడియా సమావేశం నిర్వహించి, అసలు 36 హత్యలు ఎక్కడ జరిగాయని ప్రశ్నించడం చంద్రబాబు పన్నాగానికి నిదర్శనం.దాడులు, విధ్వంసానికి చంద్రబాబు ‘పచ్చ’జెండాపచ్చ మూకలు 45 రోజులకుపైగా యథేచ్ఛగా సాగిస్తున్న విధ్వంసకాండతో చంద్రబాబు ప్రభుత్వం సంతృప్తి చెందినట్టు లేదు. అందుకే ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గిన పోలీసులు బాధితుల ఫిర్యాదులే స్వీకరించడం లేదు. హత్యలు, హత్యాయత్నాలు, విధ్వంసం సృష్టిస్తున్న టీడీపీ, జనసేన నేతలపై కేసులు పెట్టే ధైర్యం పోలీసులకు లేదన్నది సుస్పష్టం. తద్వారా దాడులు కొనసాగించండి.. మేమున్నాం.. అనే రీతిలో టీడీపీ గూండాలను ప్రభుత్వ పెద్దలు ప్రోత్సహిస్తున్నారు. వినుకొండలో నడి వీధిలో హత్య చేసిన టీడీపీ వర్గీయుడు జిలానీని పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అతని అరెస్ట్ చూపిస్తూ పోలీసులు కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్ట లేదు! ప్రెస్ మీట్ పెడితే ఎందుకు హత్య చేశారని మీడియా ప్రతినిధులు అతన్ని, పోలీసులను అడుగుతారు. అప్పుడు రాజకీయ కక్షతోనే హత్య చేశాడనే విషయం చెప్పాల్సి వస్తుంది. అందుకే గోప్యంగా రిమాండ్‌కు తరలించారు. చిత్తూరు జిల్లాలో టీడీపీ గూండాలు 37 ప్రదేశాల్లో రాళ్ల దాడులతో బీభత్సం సృష్టించారు. ఆ దాడుల్లో పాల్గొన్న ఒక్క టీడీపీ నేత, కార్యకర్త మీద కూడా కేసు నమోదు చేయనే లేదు. ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్పపై హత్యాయత్నానికి పాల్పడిన వారిపై కూడా పోలీసులు కేసు నమోదు చేయలేదు. పైగా బాధితులైన ఎంపీ మిథున్‌రెడ్డి, రెడ్డెప్పపైనే అక్రమ కేసులు బనాయించడం గమనార్హం. తిరుపతి జిల్లాలో టీడీపీ రౌడీ మూకలు 40 చోట్ల దాడులకు పాల్పడ్డాయి. ఒక్క సంఘటనలో కూడా టీడీపీ వర్గీయులను పోలీసులు అరెస్ట్ చేయలేదు. పైగా బాధితులైన 35 మంది వైఎస్సార్సీపీ వర్గీయులపై అక్రమ కేసులు పెట్టారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం శంకరనగరంలో టీడీపీ నేతలు వైఎస్సార్సీపీకి చెందిన సర్పంచ్, ఆయన బంధువులపై దాడి చేస్తే.. ఆ కేసులో వైఎస్సార్సీపీ వర్గీయులు 13 మందిని అరెస్ట్ చేశారు. నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో టీడీపీ నేతలు వందల సంఖ్యలో దాడులకు తెగబడినా సరే వారిపై కేసులు నమోదు చేయనే లేదు. ఇటువంటి ఉదంతాలు రాష్ట్ర వ్యాప్తంగా వందల్లో ఉన్నాయి. తద్వారా రానున్న రోజుల్లో మరింత పెను విధ్వంసం సృష్టించేందుకు.. దాడులతో తెగబడేందుకు.. పచ్చ రౌడీలకు ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చినట్టేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి, సామాన్యుల ప్రాణాలకు న్యాయ వ్యవస్థ, రాజ్యాంగబద్ధ సంస్థలే అండగా నిలబడాలని వారు కోరుతున్నారు. -
రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం
పులివెందుల: రాష్ట్రంలో సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ బీహార్‌కంటే ఘోరంగా మారుస్తున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. వారి రెడ్‌బుక్ రాజ్యాంగం మనిషి స్వేచ్ఛగా బతకాలన్న ప్రాథమిక హక్కును హరిస్తోందన్నారు. ఓవైపు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు, మరోవైపు అభం శుభం తెలియని చిన్నారులపై అత్యాచారం, హత్యలతో రాష్ట్రం అరాచకంగా మారిపోయిందని చెప్పారు. రాష్ట్రంలో అరాచకాలపై ఢిల్లీ స్థాయిలో గళమెత్తుతామని తెలిపారు. అవినాశ్ రెడ్డి శుక్రవారం వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలంలో ఇటీవల అధికార పార్టీ దాడిలో గాయపడిన అబ్బాస్, ప్రతాప్‌రెడ్డి, హాజీవలిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ పిలుపు మేరకు అబ్బాస్, ప్రతాప్‌రెడ్డి, హాజీవలిని పరామర్శించి, వారిలో ధైర్యం కల్పించి, వైఎస్ జగన్ తరపున భరోసా ఇచ్చినట్లు చెప్పారు. వారికి ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామని చెప్పామన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై వరుస దాడులు చేస్తున్నారన్నారు. వినుకొండలో వందల మంది చూస్తుండగా వైఎస్సార్సీపీ కార్యకర్త రషీద్ చేతులు, తర నరకడం టీడీపీ నేతల అరాచకానికి పరాకాష్ఠ అని దుయ్యబట్టారు. వేంపల్లెలో వైసీపీ కార్యకర్త అజయ్‌కుమార్ రెడ్డిని 20 మంది టీడీపీ కార్యకర్తలు హాకీ స్టిక్స్‌తో విచక్షణా రహితంగా కొట్టారని, స్టిక్స్ విరిగిపోతే బండరాళ్లతో తలపై దాడి చేశారన్నారు. బుధవారం పుంగనూరులో గాయపడిన వైఎస్సార్సీపీ కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్లిన ఎంపీ మిథున్‌రెడ్డి పైనా రాళ్లతో దాడులు చేశారన్నారు. తాము గత ఐదేళ్లు ఇదే విధంగా ఆలోచించి ఉంటే తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు ఉండేవారా అని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ నాయకత్వం ఏ రోజూ అరాచకాలను ప్రోత్సహించలేదని, ఎంతసేపూ కుల, మత, ప్రాంత, పార్టీలకు అతీతంగా సంక్షేమాన్ని అందించడంపైనే దృష్టి పెట్టిందని తెలిపారు. వినుకొండలో రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన వైఎస్ జగన్‌కు ఉన్న సెక్యూరిటీని 80 శాతం తొలగించారన్నారు. సెక్యూరిటీని తొలగించినా, ఇంకా ఏమి చేసినా వైఎస్ జగన్మోహన్రెడ్డిని, వైఎస్సార్సీపీ కార్యకర్తలను ఆపలేరని ఆయన తెలిపారు. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ తర్వాత పులివెందులలో 70వేల టన్నుల ఇసుకను టీడీపీ వారు దోచేశారని చెప్పారు. మైన్స్, బార్ల పైనాపడిపోతున్నారని చెప్పారు. -
‘నారా’రూప రాక్షసం.. యథేచ్ఛగా నరమేధం!
మధ్య యుగాల్లో గజినీలు, ఘోరీలు దండెత్తి సృష్టించిన మారణహోమాన్ని రాష్ట్రంలో చంద్రబాబు రాక్షసపాలన గుర్తుకు తెస్తోంది. ఆధునిక కాలంలో యూదు జాతి మొత్తాన్ని తుదముట్టించాలని జర్మన్ నాజీ నియంత హిట్లర్ చేసిన ఘోరకలిని తలపిస్తూ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో పచ్చమూక మరణమృదంగం మోగిస్తోంది. ‘నారా’సుర పాలన విశృంఖలత్వం సృష్టిస్తోంది. అధికారబలం ఉన్నవాడిదే అరాచకం... అన్న అడవినీతిని తలపిస్తూ యథేచ్చగా నరమేధం సాగిస్తోంది. హత్యలతో రాష్ట్రం అట్టుడికిపోతోంది. ప్రజాప్రతినిధుల నుంచి సామాన్యుల ప్రాణాలకు రక్షణ లేకుండాపోయింది. ప్రభుత్వ ఆస్తుల విధ్వంసకాండ కొనసాగుతోంది. ప్రైవేటు ఆస్తుల ధ్వంస రచన అడ్డూ అదుపు లేకుండా సాగుతోంది. పచ్చ ముఠాలు సభ్యులు రాష్ట్రంపై తెగబడి ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. ఇళ్లను ముట్టడిస్తున్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను నేలమట్టం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్యాలయాలపై దండెత్తుతున్నారు. సచివాలయాలు, ఆర్బీకేలు, తాగునీటి ట్యాంకులు వంటి ప్రభుత్వ ఆస్తులను కూలగొడుతున్నారు. టీడీపీ అధికార మదానికి పోలీసు శాఖ దాసోహమైంది. ప్రభుత్వ ప్రేరేపిత దాడులు కావడంతో చేష్టలుడిగి చూస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. గోడు వెళ్లబోసుకునేందుకు ఏ వ్యవస్థా అందుబాటులో లేకుండా పోయింది. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో రాజ్యాంగ ధర్మాన్ని కాలరాస్తోంది. టీడీపీ రెడ్‌బుక్ రాజ్యాంగ అరాచకమే రాజ్యమేలుతోంది. – సాక్షి, అమరావతి నేడువరుసగా మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని గురువారం ఆయన సొంత నియోజకవర్గంలోనే హత్య చేసేందుకు టీడీపీ గూండాలు బరితెగించారు. పక్కా పన్నాగంతో కత్తులు, రాళ్లు చేతబట్టి మాటు వేశారు. మూకుమ్మడిగా దాడిచేశారు. టీడీపీ రౌడీమూకలను వారించబోయిన మాజీ ఎంపీ రెడ్డప్పను బూతులు తిడుతూ దాడికి తెగబడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ఓ ఎంపీ ప్రాణాలకే రక్షణలేని పరిస్థితి. నిన్నపల్నాడు జిల్లా వినుకొండలో నడిరోడ్డుపై వైఎస్సార్సీపీ కార్యకర్త రషీద్‌పై టీడీపీ గూండా జిలానీ కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. రెండు చేతులు తెగనరికాడు. అనంతరం కత్తితో మెడ నరికి పాశవికంగా హత్య చేశాడు. ఆంధ్రప్రదేశ్‌లో ఓ సామాన్యుడికి ప్రాణాలకు ఏమాత్రం రక్షణ లేదనడానికి తాజా తార్కాణం ఈ దురాగతం. కక్ష కట్టి కత్తివేటు... హత్యలు31 హత్యాయత్నాలు 300టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 40 రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 31 మంది దారుణ హత్యకు గురయ్యారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగనాథహళ్లిలో మాల గుండమ్మ అనే దళిత మహిళను ఆమె పొలంలోనే టీడీపీ నేత రాఘవేంద్రారెడ్డి, ఆయన కుమారుడు శ్రీధర్‌రెడ్డి దారుణంగా ట్రాక్టర్‌తో తొక్కించి చంపేశారు. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగొండువానిపాలెంలో సురేష్ అనే ఉన్మాది 9వ తరగతి చదువుతున్న బాలికను కత్తితో పొడిచి హత్యచేశాడు. అదేవిధంగా హిందూపురం నియోజకవర్గం గోళపురం గ్రామంలో వైఎస్సార్సీపీ నేత సతీష్... విజయనగరం జిల్లా సీతానగరం మండలం పెద్ద భోగిలే హడ్కో కాలనీలో గుజ్జల హేమంత్... శ్రీకాకుళం రెల్లివీధికి చెందిన నల్లపిల్లి గౌరీశంకర్.. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం కొర్లాం జాతీయ రహదారి సమీపంలోని ఓ దాబాలో రాంబాబు అనే వ్యక్తి...అనంతపురం జిల్లా కోమటికుంట్ల గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్త ఎరికలయ్య.. విశాఖపట్నంలోని అగనంపూడిలో కిరణ్ అనే యువకుడు... బాపట్ల జిల్లా చీరాలలో ఓ వ్యాపారి... ఒంగోలులో ఓ యువకుడు... పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం మిట్టపల్లెలో హనిమిరెడ్డి, దాచేపల్లిలో గుమ్మడి నాగిరెడ్డి... ఇలా 40 రోజుల్లో 31 మంది హత్యకు గురయ్యారు. శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా ఐదు హత్యలు జరిగాయి. మరో 300 మందిపై హత్యాయత్నాలు జరిగాయి.భరించలేక.. బలవన్మరణాలు ఆత్మహత్యలు 35 వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై మాత్రమే కాదు... చిరు వ్యాపారులు, చిన్నాచితక ఉద్యోగులు, సామాన్యులపై సైతం టీడీపీ నేతలు తమ ప్రతాపం చూపుతున్నారు. ‘ఇక మా ప్రభుత్వం వచ్చింది.. మీరు తప్పుకోండి..’ అంటూ బెదిరిస్తున్నారు. తమకు ఎదురు చెబితే తప్పుడు కేసులు పెట్టి కుళ్ల»ొడిపిస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో ఉపాధి కోల్పోతామని... పరువు పోతుందనే భయంతో తీవ్ర ఆవేదనకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. టీడీపీ నేతలు ఉద్యోగానికి రాజీనామా చేయాలని బెదిరించడంతో చిలకలూరిపేట నియోజకవర్గంలో ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ జడ ఆనంద్ పురుగులమందు తాగి చనిపోయాడు. పోలీసుల వేధింపులతో పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల ఉప సర్పంచ్ కోరుకుంట్ల నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా 40 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 35మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. టీడీపీ నేతల వేధింపుల కారణంగా అత్యధికంగా వైఎస్సార్ జిల్లాలో 16 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో 11 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు.చిన్నారులనేకనికరం లేకుండా.. లైంగిక దాడులు20టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో లైంగికదాడులుఘోరంగా జరుగుతున్నాయి. చిన్నారులు అనే కనికరం కూడా లేకుండా ఉన్మాదులు చెలరేగిపోతున్నారు. కేవలం 40 రోజుల్లోనే 20 మందిపైలైంగికదాడులు జరిగాయి. వారిలో నలుగురిని దుండగులు చంపేశారు. చీరాలలో జూన్ 21వ తేదీన ఓ చేనేత కుటుంబానికి చెందిన యువతి బహిర్భూమికి వెళ్లగా, ఆమెపై దుండగులు అత్యాచారం చేసి హతమార్చారు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో పది రోజుల కిందట ఎనిమిదేళ్ల గిరిజన బాలికను దుండగులు అపహరించి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ బాలిక ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. అనంతపురం జిల్లా అరకటివేములలో టీడీపీ కార్యకర్త రవితేజ ఓ బాలికను జూన్ 24న అపహరించి తాడిపత్రి మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న వాహనంలోకి తీసుకువెళ్లి తన స్నేహితుడు నాగేంద్రతో కలిసిలైంగికదాడికి పాల్పడ్డారు. ఇలా వయసుతో సంబంధం లేకుండా 20 మందిపై లైంగిక దాడులు జరిగాయి.అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం నవభారత్ జంక్షన్లో జూన్ 17న ఓ మహిళపై దాడి చేసి ఒళ్లంతా కారం చల్లి ఆటోలోకి బలవంతంగా ఎక్కించి శ్రీకాకుళం పట్టణంలోకి తీసుకువెళ్లి నడివీధిలో వివస్త్రను చేసి ఊరేగించారు. అనకాపల్లి జిల్లా దర్మసాగరంలో టీడీపీ వర్గీయులు కుమారి అనే మహిళ ఇంటికి వెళ్లి ఆమెను వివస్త్రను చేసి కొట్టారు. ఇవన్నీ అధికారిక లెక్కలు. కానీ ఫిర్యాదులు చేసేందుకు పలువురు బాధితులు వెనుకంజ వేస్తున్నారు. బాధితులు అందరూ ఫిర్యాదులు చేస్తే కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. -
మెడికోలకు వెన్నుపోటు
సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో ప్రభుత్వమే ఎంబీబీఎస్ సీట్లను అమ్మడం దారుణం. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక నిరుపేదలకు ఆ సీట్లను అందజేస్తాం. అధికారంలోకి వచ్చాక మొదటి వంద రోజుల్లో జీవోలను రద్దు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఈ సీట్లను అందేలా చూస్తాను. – 2023 ఆగస్టు 16న మంగళగిరిలో నారా లోకేశ్ ప్రభుత్వం వైద్య కళాశాలల్లో మెడికల్ సీట్లను అమ్ముకోవడం చాలా దురదృష్టకరం. ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర వర్గాలకు ఇవ్వాల్సిన సీట్లను డబ్బులకు అమ్ముకోవడం అన్యాయం. – 2023 అక్టోబర్ 4వ తేదీన కృష్ణా జిల్లాపెడనలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు తీరు ఏరు దాటాక తెప్ప తగలేసినట్లుంది. హామీలకు తిలోదకాలిచ్చే పరంపరలో భాగంగా తాజాగా యువతకు రాష్ట్ర ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు ఇ చ్చిన హామీకి తూట్లు పొడిచింది. నేటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంబీబీఎస్ సీట్లను అమ్మడం దురదృష్టకరం అని గతంలో చిలక పలుకులు పలికారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లకు సంబంధించిన 107, 108 జీవోలను రద్దు చేస్తామని ప్రస్తుత విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ గతంలో ప్రగల్భాలు పలికారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేయబోమంటూ శుక్రవారం హైకోర్టులో ప్రభుత్వం స్పష్టం చేయడం ద్వారా యువతను దగా చేసింది. దీంతో తమ పిల్లలను డాక్టర్లుగా చూసుకోవాలనే కోరిక ఉండే పేద, మధ్యతరగతి తల్లిదండ్రులు, విద్యార్థులు వీరి మాయమాటలు నమ్మి మోసపోయారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటులో భాగంగా గత విద్యా సంవత్సరం నంద్యాల, మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు, విజయనగరం కళాశాలలను సీఎం జగన్ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ క్రమంలో ఆయా కళాశాలల్లో 50 శాతం సెల్ఫ్ ఫైనాన్స్ కోటాగా నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని అప్పట్లో టీడీపీ, జనసేన పారీ్టలు తీవ్రంగా వ్యతిరేకించాయి. సెల్ఫ్ ఫైనాన్స్ కోటాను రద్దు చేయాలంటూ టీడీపీ నాయకులు, ఆ పార్టీ శ్రేణులు అప్పట్లో నిరసనలు వ్యక్తం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈ జీవోలను రద్దు చేస్తామని నమ్మించి ఓట్లు వేయించుకుని.. తీరా గద్దెనెక్కాక మాట తప్పారు. ఇ చ్చిన హామీ నెరవేర్చాలి సెల్ఫ్ ఫైనాన్స్ ఎంబీబీఎస్ సీట్ల విధానాన్ని టీడీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. నారా లోకేశ్ సహా పలువురు ముఖ్య నాయకులు ఈ విధానాన్ని రద్దు చేస్తామన్నారు. ఈ క్రమంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలి. నీట్ మార్కుల ఆధారంగా ప్రతిభ కలిగిన విద్యార్థులకు కొత్త వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లను కేటాయించాలి. – డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు,రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ -
రాష్ట్రంలో అరాచక పాలన
సాక్షి,, అమరావతి: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, లోకేశ్ రెడ్ బుక్‌లో రాసుకున్న విధంగా కక్ష సాధింపులు, అక్రమ కేసులు బనాయిస్తూ రాక్షస పాలన చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. వికృతానందంతోనే వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై అక్రమంగా కేసు పెట్టారని ధ్వజమెత్తారు. ఈ కేసును చట్టపరంగానే ఎదుర్కొంటామన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా కుట్రలు, కుతంత్రాలు, కక్ష సాధింపులు, దాడులు, దౌర్జన్యాలతోనే చంద్రబాబు పాలన సాగిస్తున్నారని చెప్పారు. ‘రెడ్ బుక్ పాలనని కాదు.. మేనిఫెస్టో అమలు చేయండి’ అంటూ హితవు పలికారు. ఆయన శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. లోకేశ్ ఓ రెడ్‌బుక్‌లో కొందరి పేర్లు రాసి, వారిపై కేసులు పెట్టి తాట తీస్తానని ఎన్నికల్లో చెప్పారని, ఇప్పుడు దాన్ని అమలు చేయడంపైనే ప్రభుత్వ యంత్రాంగం నిమగ్నమైందని అన్నారు. కీలకమైన పోస్టింగ్‌లు తెచ్చుకొన్న కొందరు పోలీసులు రెడ్ బుక్‌ను అమలు చేస్తున్నారని, ఇది ప్రమాదకరమని, సమాజానికి మంచిది కాదని, అ«ధికారుల వైఖరి మారకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. తప్పులు చేసిన వారిని న్యాయస్థానాలు ప్రశ్నిస్తాయని తెలిపారు. వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తుంటే సీఎం చంద్రబాబు అడ్డు చెప్పకపోగా ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు.చంద్రబాబు, లోకేశ్, రఘురామ.. ముగ్గురూ కలిసి జగన్‌ని ఇబ్బంది పెట్టడానికే తప్పుడు కేసు రిజిస్టర్ చేశారని చెప్పారు. మూడేళ్ల క్రితం జరిగిన ఘటనను సుప్రీంకోర్టు తోసిపుచ్చినా, గత నెల రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచిత్రంగా జగన్‌పై కేసు నమోదు చేశారని అన్నారు. పోలీసు కస్టడీలో రఘురామను టార్చర్ చేయలేదని ఆనాడే వైద్య పరీక్షల్లో తేలిందన్నారు. అప్పట్లో గుంటూరు కోర్టులో న్యాయమూర్తి ఎదుట ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా రఘురామ ఇప్పుడు ఫిర్యాదు చేశారని తెలిపారు. నాయకుల ఒత్తిడితో ఫాల్స్ కేసులు పెడితే ఆ పాపం ఊరికే పోదని, కబళించేస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని మేధావులు దీనిపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపైనా రెండు తప్పుడు కేసులు పెట్టారని తెలిపారు. పిన్నెల్లి ఎవరిపైనా దాడి చేయకపోయినా, అసత్య ఆరోపణలతో ఎన్నికలు జరిగిన 10 రోజుల తరవాత కేసులు నమోదు చేశారని చెప్పారు. సూపర్ సిక్స్ అమలు చేయకపోతే వెంటాడుతాంఇంట్లో ఎందరు పిల్లలున్నా అందరికీ రూ.15 వేల చొప్పున తల్లికి వందనం పథకంలో ఆర్థిక సాయం చేస్తామని ఎన్నికల్లో ఊదరగొట్టిన టీడీపీ, ఇప్పుడు మాట తప్పి, తల్లికి మాత్రమే రూ.15 వేలు ఇస్తామంటున్నారని అన్నారు. కుటుంబంలో అందరు పిల్లలకు ఆర్థిక సాయం చేసేలా వెంటనే జీవో మార్చాలని డిమాండ్ చేశారు. తల్లికి వందనంపై విధివిధానాలు ఖరారు కాలేదని చెబుతున్న మంత్రి నిమ్మల రామానాయుడు ఒకసారి ఆ జీవో చదువుకోవాలని అన్నారు. ఎన్నికల్లో టీడీపీ ఆర్భాటంగా ప్రచారం చేసిన సూపర్ సిక్స్‌లో ఇప్పటికే ఒకటి ఫెయిల్ అయిందని, మిగతా వాటిని అమలు చేయకపోతే ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని వెంటాడుతామని ప్రకటించారు.జగన్ ప్రజల మనిషిమాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల మనిషి అని, ఆయన నిత్యం ప్రజలతోనే మమేకమై ఉంటారని మాజీ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. జగన్ అంటే జనం.. జనం అంటే జగన్ అని స్పష్టంచేశారు. నాడైనా, నేడైనా, అప్పుడైనా, ఇప్పుడైనా వైఎస్ జగన్ ప్రజల మనిషి అని చెప్పారు. ఈ నెల 15 నుంచి జగన్మోహన్రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహిస్తారంటూ ఈనాడులో ఒక బురద కథనం రాశారని ఆక్షేపించారు. నిత్యం జగన్‌పై విషం చిమ్ముతూ, చంద్రబాబును మోయడమే ఈనాడు లక్ష్యమని అన్నారు.ఏనాడూ దూరంగా లేరువాస్తవానికి జగన్ ఏనాడూ జనానికి దూరంగా లేరని రాంబాబు చెప్పారు. చంద్రబాబు ఇప్పటివరకు ఆయన జీవితంలో ఎంత మందిని కలిశారో, అంతకన్నా 10 రెట్లు ఎక్కువ మందిని జగన్ కలిశారని తెలిపారు. రోజూ ప్రజల మధ్య ఉంటూ అందరితో మమేకమయ్యే మనిషి జగన్ అని చెప్పారు.కోకొల్లలుగా ఘటనలు..వైఎస్ జగన్ పర్యటనల్లో బస్సులో వెళ్తుంటే, రోడ్డుపై ఎవరైనా కాగితం పట్టుకుని చెయ్యి పైకెత్తితే చాలు, వెంటనే బస్సును ఆపేసి వారిని కలుసుకుంటారని గుర్తు చేశారు. అలా ఎందరో బాధలను ఆయన తీర్చారని, దీనికి సంబంధించి ఎన్నెన్నో ఘటనలు ఉన్నాయని తెలిపారు. జగన్‌ని కలుసుకునేందుకు తాము జనాలను తీసుకురావాల్సిన అవసరం ఎంత మాత్రం లేదని, ప్రజలే జగన్‌ను కలుసుకొనేందుకు తండోపతండాలుగా వస్తున్నారని చెప్పారు.ఇప్పుడూ కలుస్తున్నారువైఎస్ జగన్ ఇప్పుడు కూడా క్యాంప్ ఆఫీస్‌లో ప్రతి రోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు అందరినీ కలుస్తున్నారని, ప్రతి ఒక్కరినీ ఓపికతో పలకరిస్తున్నారని, వారితో మాట్లాడుతున్నారని రాంబాబు వెల్లడించారు. నాయకులతో పాటు సామాన్యులను కూడా ఆయన కలుస్తున్నారని చెప్పారు. నిత్యం ప్రజల మధ్యే ఉంటున్న వైఎస్ జగన్‌పై పిచ్చి రాతలు రాసి, ఏదో ఒక విధంగా ఆయన్ని అభాసుపాలు చేసే ప్రయత్నం మానుకోవాలని ఎల్లోమీడియాకు, ముఖ్యంగా ఈనాడు పత్రికకు రాంబాబు హితవు చెప్పారు. -
తక్షణమే తప్పుకోండి..
అనంతపురం/విశాఖ సిటీ/గుడుపల్లె (చిత్తూరు జిల్లా)/కోనేరు సెంటర్ (మచిలీపట్నం) : అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే కక్ష సాధింపు చర్యలకు తెగబడుతున్న టీడీపీ ప్రభుత్వం.. చివరకు సరస్వతీ నిలయాలైన విశ్వవిద్యాలయాలపైనా విరుచుకుపడుతోంది. విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దే విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న వైస్ ఛాన్సలర్లు వెంటనే రాజీనామా చేసి వెళ్లిపోవాలని అల్టిమేటం జారీచేసింది. ఈ మేరకు ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ పీఏ నుంచి రిజిస్ట్రార్లకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. వెంటనే ఆయా పదవులకు వీసీలు, రిజిస్ట్రార్లు రాజీనామా చేసి వెళ్లిపోవాలని చెప్పారు. అధికారికం కాదులే అని ఆగినా..లోకేశ్ పీఏ పేరుతో ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకోదని వీసీలు తొలుత భావించారు. అదే నిజమైతే అధికారికంగా ఉత్తర్వులు ఇస్తారు కదా అని అనుకున్నారు. ఎవరో ప్రాంక్ కాల్చేసి ఉండవచ్చని వీసీలు మిన్నకుండిపోయారు. దీంతో నేరుగా వైస్‌ఛాన్సలర్ల వాట్సాప్ గ్రూపులో అధికారికంగా మెసేజ్ పెట్టారు. తక్షణమే వీసీలు, రిజిస్ట్రార్లు తప్పుకోవాలని అందులో ఆదేశించారు. ఈ నేపథ్యంలో.. జేఎన్టీయూ (ఏ), ఎస్కేయూ వీసీలు, రిజిస్ట్రార్లు తమ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో..» జేఎన్టీయూ (ఏ) వీసీ ప్రొఫెసర్ జీవీఆర్ శ్రీనివాసరావు గురువారం సాయంత్రమే తన పదవికి రాజీనామా చేశారు. రిజిస్ట్రార్ ప్రొ. సి.శశిధర్ సైతం రిలీవ్ అయ్యారు. దీంతో ఇన్చార్జ్ రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణను నియమించిన వీసీ శ్రీనివాసరావు.. అనంతరం తన రాజీనామా పత్రాన్ని ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపారు. » అలాగే, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె. హుస్సేన్‌రెడ్డి కూడా శుక్రవారం సాయంత్రం తన పదవికి రాజీనామా చేశారు. ఎస్కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎంవీ లక్ష్మయ్య మాత్రం పదవిలో కొనసాగేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. » ద్రవిడ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఆచార్య కొలకలూరి మధుజ్యోతి కూడా శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల వీసీలు రాజీనామా చేస్తున్నారు కాబట్టి మీరు కూడా రాజీనామా చేయాలని శుక్రవారం ఉదయం ఎవరో ఫోన్ ద్వారా ఆమెను ఒత్తిడి చేశారని సమాచారం. రాజీనామా చేయకపోతే వచ్చే సోమవారం ద్రవిడ వÆటీలో ఆందోళన చేస్తామని వీసీని హెచ్చరించారని తెలిసింది. దీంతో ఆమె శుక్రవారం స్వచ్ఛందంగా రాజీనామా చేసి, రాజీనామా పత్రాన్ని ఫ్యాక్స్ ద్వారా గవర్నరుకు పంపించారు. సాయంత్రమే ద్రవిడ వర్సిటీ వదిలి వెళ్లిపోయారు. » అలాగే, కృష్ణా యూనివర్శిటీ వీసీ జి. జ్ఞానమణి సైతం శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. పైనుంచి వచ్చిన ఒత్తిళ్లకు తలొగ్గి ఆయన తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అప్పటికీ, ఇప్పటికీ అదే తేడా..నిజానికి.. జేఎన్టీయూ (ఏ)లో అప్పటి వీసీ ప్రొ. శ్రీనివాస్‌కుమార్ టీడీపీ ప్రభుత్వ హయాంలోనే నియమితులయ్యారు. 2019లో రాష్ర్టంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చినా.. శ్రీనివాస్‌కుమార్‌ను వీసీగానే కొనసాగించారు. ఎవరూ రాజీనామా చేయాలని కోరలేదు. ఏపీపీఎస్సీ చైర్మన్‌గా ఉదయ్‌భాస్కర్ కూడా 2015లో నియమితులైనా.. ఆరేళ్లపాటు చైర్మన్ పదవీ కాలం పూర్తయ్యే వరకు ఆయన పదవిలో కొనసాగారు. కానీ, టీడీపీ ప్రభుత్వం మాత్రం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకంగా వైస్ఛాన్సలర్లనే తప్పుకోమనే సంస్కృతికి తెరతీసింది. ప్రజా వ్యతిరేక పాలనను టీడీపీ ప్రభుత్వం తన మార్క్‌గా చూపించేందుకు ఇదే నిదర్శనమని విద్యావేత్తలు భావిస్తున్నారు.పదవి కోసం వైఎస్సార్ విగ్రహం తాకట్టు..ఇక ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఎందరో జీవితాలకు బాటలు వేసిన డాక్టర్ వైఎస్సార్ విగ్రహాన్ని ఈ ఏడాది ఆరంభంలో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో ఏర్పాటుచేశారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన మూడో రోజే విగ్రహాన్ని తొలగించాలని టీఎన్ఎస్ఎఫ్ నేతలు, టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. విగ్రహం తొలగిస్తే మీరు పదవుల్లో కొనసాగుతారని వీసీ, రిజిస్ట్రార్లను హెచ్చరించారు. దీంతో వారు 24 గంటల్లో వైఎస్సార్ విగ్రహాన్ని అధికారికంగా తొలగించారు. అయినప్పటికీ వారిని ఇంటికి పంపేందుకు ఏర్పాట్లుచేయడం గమనార్హం. ఇదిలా ఉంటే.. జేఎన్టీయూ (ఏ)లో అధునాతనంగా నిర్మించిన ఆడిటోరియానికి ఎన్టీఆర్ పేరు పెట్టారు. అక్కడే ఎన్టీఆర్ విగ్రహాన్ని సైతం ఏర్పాటుచేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత రాష్ర్టంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరినప్పటికీ ఎన్టీఆర్ విగ్రహం ఔన్నత్యాన్ని కాపాడారు. కానీ, టీడీపీ మాత్రం ఎస్కేయూలో ఏర్పాటుచేసిన వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించడాన్ని అందరూ తప్పుపడుతున్నారు.ఏయూ వీసీ ప్రసాదరెడ్డి రాజీనామా విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రొ. పీవీజీడీ ప్రసాదరెడ్డి శుక్రవారం రాజీనామా చేశారు. లేఖను గవర్నర్ కార్యాలయానికి పంపించారు. ఆయనతో పాటు రిజిస్ట్రార్ స్టీఫెన్ కూడా తన పదవి నుంచి వైదొలిగారు. వెంటనే ఆయన రాజీనామాకు ఆమోదం తెలిపారు. ఇన్చార్జ్ రిజిస్ట్రార్‌గా ఏయూ అకడమిక్ డీన్‌గా ఉన్న ప్రొ.కిషోర్‌బాబును నియమించారు. ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. వాస్తవానికి.. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రసాదరెడ్డికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఒకవైపు స్థానిక టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు ప్రసాదరెడ్డిపై రాజకీయ ఆరోపణలు ఎక్కుపెట్టగా.. మరోవైపు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ నుంచి ముఖ్య కార్యదర్శి కార్యాలయం నుంచి ఫోన్లుచేసి రాజీనామా చేయాలని ఒత్తిడి చేశారు. రాజీనామా చెయ్యకపోతే దాడులకు తెగబడతామని పార్టీ శ్రేణులు సైతం హెచ్చరించాయి. దీనిపై ఆయన మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెదిరింపులకు పాల్పడింది హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించినప్పటికీ అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అలాగే, ఏయూలోని వీసీ కార్యాలయం వద్ద నిత్యం నిరసనల పేరుతో టీడీపీ నేతలు, కార్యకర్తలు హడావుడి చేసూ్తనే ఉన్నారు. పలుమార్లు వీసీని అడ్డుకోడానికి ప్రయత్నించారు. -
లోకేశ్ పిటిషన్‌పై విచారణ వాయిదా
సాక్షి, అమరావతి: నిధుల దుర్వినియోగం, ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టడం, నిధుల వృథా, ప్రభుత్వ సంపదకు, సహజ వనరులకు నష్టం కలిగించడం వంటి విషయాల్లో తగిన చర్యలు తీసుకునేందుకు వీలుగా అధీకృత అధికారుల నియామకం కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అప్పటి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ రఘురామిరెడ్డి రాసిన లేఖను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు మరోసారి ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు వీలుగా నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకోవడం, ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టడం, నిధుల వృథా, ప్రభుత్వ సంపదకు, సహజ వనరులకు నష్టం కలిగించడం వంటి విషయాల్లో ఏ సంస్థలోకైనా వెళ్లేందుకు, సోదాలు చేసేందుకు, సమాచారం సేకరించేందుకు, రికార్డులను పరిశీలించేందుకు, జప్తు చేసేందుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో పనిచేసేలా గెజిటెడ్ అధికారులందరినీ అధీకృత అధికారులుగా నియమించాలని కోరుతూ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ జనరల్ హోదాలో కొల్లి రఘురామిరెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఈ లేఖను సవాల్ చేస్తూ టీడీపీ తరఫున నారా లోకేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపింది. తాజాగా గురువారం ఈ వ్యాజ్యంపై జస్టిస్ చీమలపాటి రవి విచారణ జరిపారు.న్యాయమూర్తి అసహనంలోకేశ్ తరఫు న్యాయవాది అఖిల్ చౌదరి వాదనలు వినిపిస్తూ.. కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చిందన్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయలేదన్నారు. ఈ వ్యవహారంపై విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ప్రభుత్వం గతంలో చెప్పిందని పేర్కొన్నారు. విధానపరమైన నిర్ణయం తీసుకున్నారా?, తీసుకోబోతున్నారా?, అసలు ఈ వ్యవహారంలో ఏం చేయబోతున్నారో తెలియచేస్తూ కౌంటర్ దాఖలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీనిపై న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వం ఏం చెప్పాలో మీరే పేరాల వారీగా కౌంటర్ దాఖలు చేసి ఇవ్వండి. దాన్నే ప్రభుత్వం దాఖలు చేస్తుంది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏయే అంశాలపై కౌంటర్ దాఖలు చేయాలో కోర్టు ఎలా చెబుతుందని ప్రశ్నించారు. కౌంటర్ దాఖలు నిమిత్తం విచారణను జూలై 8వ తేదీకి వాయిదా వేశారు. -
అంబేడ్కర్ రాజ్యాంగం కాదు.. లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగం అమలవడం లేదని, లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. ఆయన శనివారం ఎండాడలోని పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణితో కలిసి మీడియాతో మాట్లాడారు. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన మరుక్షణం నుంచి ఈరోజు వరకు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కూటమి దమనకాండ చూస్తూనే ఉన్నామన్నారు.హైకోర్టు ఆదేశాలున్నప్పటికీ, తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని కూలి్చవేయడం కూటమి నేతల విధ్వంసకాండకు పరాకాష్టగా చెప్పారు. విశాఖ, అనకాపల్లి జిల్లాల వైఎస్సార్సీపీ కార్యాలయాలకు అనుమతులున్నప్పటికీ, జీవీఎంసీ అధికారులతో నోటీసులు జారీ చేయించారన్నారు. వీటిపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని, తమ పార్టీ దేవాలయాలను రక్షించుకుంటామని అన్నారు. అనుమతులున్నా.. లేవంటూ నోటీసులు విశాఖ, అనకాపల్లి పార్టీ కార్యాలయాలకు విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) అనుమతులున్నప్పటికీ, జీవీఎంసీ అనుమతుల్లేవంటూ నోటీసులు జారీ చేశారని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే 33 ఏళ్లకు డబ్బు చెల్లించి పార్టీ కార్యాలయానికి స్థలాలు లీజుకు తీసుకున్నామన్నారు. విశాఖ కార్యాలయానికి రూ.15 లక్షలు, అనకాపల్లి కార్యాలయానికి రూ.38 లక్షలు వీఏంఆర్డీఏకి చెల్లించి గతేడాది ఫిబ్రవరి నెలలోనే అనుమతి కోరామన్నారు.గతంలో టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు తీసుకొచ్చిన జీవో ప్రకారమే ఏదైనా పార్టీ కార్యాలయాలకు లీజు పద్ధతిలో ప్రభుత్వ స్థలాన్ని తీసుకోవచ్చనేది ఉందని, దాని ప్రకారమే 33 ఏళ్లకు లీజుకు తీసుకొని, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పార్టీ కార్యాలయాలు నిరి్మస్తున్నామని తెలిపారు. గజాల్లో స్థలం ఉంటే జీవిఎంసీ అనుమతి కావాలని, కానీ 2 ఎకరాల స్థలంలో నిర్మాణం చేయాలంటే వీఎంఆర్డీఏ అనుమతి తీసుకోవాలన్నారు.దాని ప్రకారమే డబ్బులు చెల్లించి వీఎంఆర్డీఏ అనుమతి కోరామన్నారు. సెప్టెంబర్‌లో మార్టగేజ్ కూడా చేశామని తెలిపారు. ఈ నిర్మాణాలు తమ పరిధిలోకి రావని వీఎంఆర్డీఏ చెప్పి ఉంటే అప్పుడే జీవిఎంసీ అనుమతి కోరేవాళ్లమని అన్నారు. రూల్ ప్రకారం వీఎంఆర్డీఏ ద్వారానే జీవీఎంసీకి కూడా అనుమతికి పంపిస్తారని తెలిపారు. విశాఖ టీడీపీ కార్యాలయాన్ని అక్రమ పద్ధతుల్లో నిర్మించారు విశాఖలో టీడీపీ కార్యాలయానికి నిర్మాణం చేపట్టిన 16 ఏళ్ల వరకు అనుమతే తీసుకోలేదని, అనుమతుల్లేకుండా అక్రమ పద్ధతిలో దాన్ని నిర్మించారని చెప్పారు. తాము అధికారంలో ఉన్న సమయంలో అక్రమంగా నిరి్మంచిన టీడీపీ కార్యాలయాలను కూల్చడం క్షణాల్లో పని అని, కానీ తాము ఆ పని చేయలేదని అన్నారు. 2015–19 మధ్య ఏపీలో 10 టీడీపీ కార్యాలయాల కోసం లీజు పద్ధతిలో స్థలం తీసుకుని నిర్మాణాలు చేపట్టారని తెలిపారు.ఇది బుల్డోజర్ల ప్రభుత్వమని, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఈ ప్రభుత్వం అక్రమాలతో పాలన సాగిస్తోందని శుక్రవారం తమ పారీ్టకి చెందిన 4వ వార్డు కార్పొరేటర్ కొండబాబు ఇంటిపై రాళ్లతో టీడీపీ మూకలు దాడి చేశాయన్నారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని చెప్పారు.ఇది ప్రజాస్వామ్యమేనా? హైకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ అధికార బలంతో తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని కూల్చేయడం కక్ష సాధింపు చర్యేనని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అన్న అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు.దేవాలయం లాంటి పార్టీ కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూలి్చవేశారని మండిపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వం నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కాదని, నారా డిస్ట్రక్టివ్ అలయన్స్ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నివసిస్తున్న కరకట్ట బిల్డింగ్ కూడా అక్రమ నిర్మాణమేనన్నారు. టీడీపీ కార్యాలయాలు చాలావరకు అనుమతుల్లేకుండా నిరి్మంచినవేనని తెలుసుకుని, అప్పుడు తమ పార్టీ ఆఫీస్‌కి నోటీసులిస్తే బెటర్ అని సూచించారు. -
ఎంతో కష్టపడ్డాం.. మంత్రి పదవి ఇవ్వండి
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవులపై ఉత్కంఠ నెలకొంది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ రాజకీయాలపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడంతో రాష్ట్ర మంత్రివర్గంపై ఇంకా పూర్తిస్థాయి కసరత్తు జరపలేదని చెబుతున్నారు. మంత్రులుగా ఎవరిని తీసుకోవాలనే దానిపై ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చినా ఇంకా కచ్చితమైన నిర్ణయం తీసుకోలేదని సమాచారం. అయితే, మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న చాలామంది తమకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా కష్టపడ్డామని, ఎంతో చేశామని తమకు అవకాశం ఇవ్వాల్సిందేనని పలు జిల్లాలకు చెందిన సీనియర్లు ఆయన్ను కోరుతున్నారు. నేరుగా ఆయన్ను కలిసి తమకు అవకాశం కల్పించాలని కోరడంతోపాటు వివిధ మార్గాల ద్వారా ఆయనపై ఒత్తిడి పెంచుతున్నారు. లోకేశ్ చుట్టూ చక్కర్లు..చంద్రబాబుతోపాటు ఆయన తనయుడు లోకేశ్ పార్టీలో కీలకంగా ఉండడంతో అనేకమంది ముందు ఆయన్ను కలుస్తున్నారు. ఎన్నికలకు ముందు లోకేశ్ పలువురికి మంత్రి పదవులు ఇస్తానని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇప్పుడు వారంతా తమకిచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతున్నారు. నిత్యం ఆయన్ను కలుస్తూ తమ గురించి ఆలోచించాలని విన్నవించుకుంటున్నారు. అయితే, ఫలితాల తర్వాత ఇప్పటివరకు ఎవరికీ చంద్రబాబు ఆయన తనయుడు లోకేశ్ మంత్రి పదవి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. జనసేన, బీజేపీకి మంత్రి పదవులు ఇవ్వాల్సి వుండడం, టీడీపీలోనే ఆశావహులు ఎక్కువగా ఉండడంతో ఎవరికీ ఏ విషయం చెప్పకుండా ఇంకా ఏమీ ఆలోచించలేదని సర్దిచెబుతున్నారు. తమ సంగతి చూడాలంటున్న సీనియర్లు..ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత చంద్రబాబు మంత్రివర్గ కూర్పుపై దృష్టిపెడతారని చెబుతున్నారు. భవిష్యత్తులో తాము పోటీచేసే అవకాశం ఉండకపోవచ్చని, ఈసారి ఎలాగైనా మంత్రిగా అవకాశం ఇవ్వాలని పలువురు సీనియర్లు ఆయన్ను కోరుతున్నారు. గోరంట్ల బుచ్చయ్యచౌదరి, కళా వెంకట్రావు, అయ్యన్నపాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వంటి నేతలు ఈ కోవలో ఉన్నారు. సామాజికవర్గ నేపథ్యంలో తమకు అవకాశం ఇవ్వాలని బొండా ఉమామహేశ్వరరావు వంటి నేతలు గట్టిగా అడుగుతున్నట్లు సమాచారం. క్లిష్ట సమయంలో పార్టీ కోసం పనిచేసిన తమకు ఎలాగైనా మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్ర, నిమ్మల రామానాయుడు వంటి నేతలు ఒత్తిడి తెస్తున్నారు.లోకేశ్‌పై ఆశలు పెట్టుకున్న జూనియర్లు..మరోవైపు.. లోకేశ్ అండతో పార్టీలో ఎదిగిన నేతలు, ఆయన ద్వారా సీటు దక్కించుకుని గెలిచిన జూనియర్లు తమకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని అడుగుతుండడం చర్చనీయాంశమైంది. పెదకూరపాడు నుంచి గెలిచిన భాష్యం ప్రవీణ్ వంటి నేతల ఇలాంటి వారిలో ఉన్నారు. అయితే, అందరికీ మంత్రి పదవులు ఇవ్వలేమని చూస్తామని మాత్రమే లోకేశ్ చెబుతున్నట్లు తెలిసింది. సీనియర్ నాయకులకు సైతం ఇప్పటివరకు మంత్రి పదవుల హామీ లభించలేదు. సాధారణంగా అయితే చంద్రబాబు ఈపాటికి మంత్రి పదవుల కోసం అభిప్రాయ సేకరణ, సామాజిక సమీకరణలు, సీనియారిటీ వంటి అంశాల ప్రాతిపదికగా కసరత్తు చేయాల్సి వుంది. కానీ, ఇప్పుడు అదేమీ లేకపోవడంతో ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయో, ఆయన మనసులో ఏముందోనని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సీనియర్లు తమకు అవకాశం వస్తుందా? లేదా? అని చంద్రబాబుకి సన్నిహితంగా ఉండే వారి నుంచి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, మంత్రివర్గం, కీలక పదవుల గురించి ఎలాంటి విషయాలు బయటకు చెప్పకపోవడంతో పార్టీ నేతలు ఉత్కంఠకు లోనవుతున్నారు. -
కేబినెట్ లో చోటు ఎవరికి?
-
ఓటు తెచ్చిన చేటు..
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి : పేద రైతులకు ముఖ్యంగా కౌలుదారులకు మొన్న జరిగిన సాధారణ ఎన్నికలు ఎక్కడాలేని కష్టం తెచ్చిపెట్టాయి. తమ యజమానులు చెప్పిన వారికి ఓటు వేయకపోవడం.. తమ మనస్సాక్షి ప్రకారం వారు నడుచుకోవడమే వారు చేసిన నేరం. తమ మాటకు విలువ ఇవ్వలేదని, తాము చెప్పినట్లు ఓట్లు వేయలేదన్న అక్కసుతో తెలుగుదేశం పార్టీకి కొమ్ముకాసే ఓ ప్రధాన సామాజికవర్గానికి చెందిన వారు బరితెగించి ఇక నుంచి మా భూముల్లోకి అడుగుపెట్టొద్దని చెప్పేస్తున్నారు.మీకు మా భూములను కౌలుకు ఇవ్వడంలేదని తేల్చిచెప్పేయడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలురైతులు వ్యవసాయ సీజన్ ఆరంభంలో ఒక్కసారిగా రోడ్డునపడ్డారు. తాత, తండ్రుల నుంచి ఇప్పటివరకు ఆ భూముల్లో పంటలు పండించుకుంటూ క్రమం తప్పక కౌలు చెల్లిస్తున్న తమను రావద్దని చెప్పడం ఎంతవరకు సమంజసమని వారు ఆవేదనకు లోనవుతున్నారు. మాకిష్టమైన వారికి ఓటు వేసుకునే స్వేచ్ఛ కూడా లేదా అని వాపోతున్నారు.భూమి వారిదైనప్పుడు మా ఓటు మాది కాదా అని యువ కౌలుదారులు ప్రశ్నిస్తున్నారు. ఇలా మాలాంటి పేదలపై పెత్తందారుల దాష్టీకాలు ఇంకెంత కాలమని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ దారుణాలు మంగళగిరి నియోజకవర్గంలోనే చోటుచేసుకుంటున్నాయా? లేక ఇతర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి దాపురించిందా అని గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కౌలురైతులు ‘సాక్షి’ వద్ద తమ ఆవేదన వ్యక్తంచేశారు.కౌలురైతు: బుల్లా శ్రీనివాసరావు సామాజికవర్గం - ఎస్సీ (మాదిగ)భూ యజమాని - గుంటుపల్లి సరస్వతిగ్రామం - పెదపాలెంసాగుచేస్తున్న భూమి- రెండెకరాలుఎప్పటి నుంచి - 15 ఏళ్లుగాకౌలు మొత్తం (ఎకరానికి) - రూ.35 వేలుకౌలురైతు: గొడవర్తి ప్రతాప్సింగ్సామాజికవర్గం - ఎస్సీ (మాదిగ)భూ యజమాని - వాసిరెడ్డి వాసుగ్రామం - పెదపాలెంసాగు చేస్తున్న భూమి - మూడెకరాలుఎప్పటి నుంచి - ఏళ్లుగా చేస్తున్నారుకౌలు మొత్తం - 22 బస్తాలుకౌలురైతు: షేక్ సద్దాం హుస్సేన్ సామాజికవర్గం - ముస్లిం భూ యజమాని - గద్దె శ్రీనివాసరావుగ్రామం - చిలువూరుసాగు చేస్తున్న భూమి - నాలుగెకరాలుఎప్పటి నుంచి - ఐదేళ్లుగా..కౌలు మొత్తం - 16 బస్తాలుకౌలురైతు: షేక్ ఖాదర్ భాషాసామాజికవర్గం - ముస్లిం భూ యజమాని - యడ్ల హర్షవర్థన్రావుగ్రామం - తుమ్మపూడిసాగుచేస్తున్న భూమి - 10 ఎకరాలు ఎప్పటి నుంచి - 35 ఏళ్లుగాకౌలు మొత్తం - 70 వేలు (నిమ్మతోట)కౌలురైతు: చిలకా తిమోతిసామాజికవర్గం - ఎస్సీ (మాదిగ)భూ యజమాని - పాటిబండ్ల హరిప్రసాద్ గ్రామం - పెదపాలెంసాగు చేస్తున్న భూమి - ఒకటిన్నర ఎకరంఎప్పటి నుంచి - 30 ఏళ్లుగాకౌలు మొత్తం - 22 బస్తాలుకౌలురైతు: షేక్ ఖాంసాసామాజికవర్గం - ముస్లిం భూ యజమాని - లంక గోపాలరావుగ్రామం - కంఠంరాజు కొండూరుసాగుచేస్తున్న భూమి - నాలుగెకరాలుఎప్పటి నుంచి - 14 ఏళ్లుగాకౌలు మొత్తం - 18 బస్తాలుకౌలురైతు: గంపల శ్రీనివాసరావుసామాజికవర్గం - బీసీ (యాదవ)భూ యజమాని - పుతుంబాక సాయికృష్ణగ్రామం - పేరకలపూడి సాగు చేస్తున్న భూమి - నాలుగెకరాలుఎప్పటి నుంచి - 22 ఏళ్లుగాకౌలు మొత్తం - 35,000కౌలురైతు: యలమాటి ప్రసాద్కుమార్సామాజికవర్గం - ఎస్సీ (మాదిగ)భూ యజమాని - గుంటుపల్లి సరస్వతిగ్రామం - పెదపాలెంసాగుచేస్తున్న భూమి - మూడెకరాలుఎప్పటి నుంచి - 35 ఏళ్లుగా (తండ్రి నుంచి)కౌలు మొత్తం - 5 బస్తాలు మొదలు 23 బస్తాల వరకు / 30 వేలుకౌలురైతు: దేశబోయిన బాబుయాదవ్సామాజికవర్గం - బీసీ (యాదవ)భూ యజమాని - గుండిమెడ బసవయ్యగ్రామం - కంఠంరాజు కొండూరుసాగు చేస్తున్న భూమి - నాలుగెకరాలుఎప్పటి నుంచి - 35 ఏళ్లుగాకౌలు మొత్తం - 18 బస్తాలుమంగళగిరి నుంచి లోకేశ్ పోటీతో..టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు తనయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేశ్ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీచేసిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమిపాలై, మూడు శాఖల మంత్రిగా పనిచేసిన ఆయన మరోసారి అదే స్థానం నుంచి బీసీ వర్గానికి చెందిన మురుగుడు లావణ్యతో ఈసారి పోటీపడ్డారు. చాలాకాలంగా మంగళగిరి టౌన్, రూరల్, తాడేపల్లి, దుగ్గిరాల మండలాల్లోని తన సామాజికవర్గంపై ఆయన ప్రధానంగా దృష్టిసారించారు.ఈ నేపథ్యంలో.. పెదపాలెంకు చెందిన పాటిబండ్ల కృష్ణప్రసాద్ (కేపీ) వైఎస్సార్సీపీ నాయకుడిగా కొనసాగుతూ కొద్దినెలల కిందట లోకేశ్ పక్షాన చేరారు. అలాగే, దుగ్గిరాల మండలవాసి, మాజీ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లోని పారిశ్రామికవేత్తలు, విద్య, వైద్య రంగ సంస్థల ముఖ్యులు, వ్యాపారస్తులు, ఎన్ఆర్ఐల సహకారం కూడా లోకేశ్‌కు తోడైంది. తమ వాడైన లోకేశ్‌కు మద్దతిస్తే ఇవ్వండి, లేదంటే మా సంస్థల్లో మీరు చేస్తున్న ఉద్యోగాలను వదిలేసుకోండని స్పష్టంగా చెప్పారని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. అంతేకాదు.. ఇళ్లలోని పెద్దలకు, మహిళలకు కూడా ఫోన్లుచేసి ఇదే విషయమై బెదిరించారని చెప్పారు.వైఎస్సార్సీపీకి మద్దతుగా ఉన్నామని..దుగ్గిరాల మండలంలోని వివిధ గ్రామాల్లో పెత్తందారులుగా చలామణి అవుతున్న పలువురు టీడీపీ నాయకులు, మద్దతుదారులు తమను అనేక విధాలుగా బెదిరింపులకు పాల్పడ్డారని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారు వాపోయారు. మండలంలోని పెదపాలెం, తుమ్మపూడి, చిలువూరు, కంఠంరాజు కొండూరు, పేరకలపూడి, శృంగారపురం, పెనుమోలి, మోరంపూడి, చిన్నపాలెం తదితర 12 పల్లెల్లోని పేద రైతులకు ఈ ఏడాది నుంచి కౌలుకు భూమి ఇవ్వడంలేదని వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందు టీడీపీ సామాజికవర్గానికి రైతులు చెప్పడం పరిశీలనాంశం. ‘ఎన్నికలు జరగడం కొత్తేమీ కాదు. దశాబ్దాలుగా జరుగుతున్నాయి. ఎవరికిష్టమైన పార్టీకు వారు ఓట్లు వేసుకుంటున్నారు. ఆ తరువాత ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. ఈసారే కులాలు, మతాలు అంటూ దారుణంగా పరిస్థితులు మారాయి’.. అని వైఎస్సార్సీపీ నాయకుడు వీరయ్య వ్యాఖ్యానించారు.నియోజకవర్గ ఓటర్లకు డబ్బులు..ఇక మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని వాటితో పాటు విజయవాడ, గుంటూరు, ఇతర ముఖ్య నగరాల్లోని కార్పొరేట్ విద్యా సంస్థలు, ఆసుపత్రులు, పెద్ద రెస్టారెంట్లు, హోటళ్లు, వ్యాపార సముదాయాల్లో పనిచేసే నియోజకవర్గ ఓటర్లకు ఎన్నికల బోనస్ అందింది. టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలంటూ ఆయా ఉద్యోగి స్థాయిని బట్టి 2,500 నుంచి 5,000 వరకు డబ్బులు అకౌంట్లలో పడ్డాయి. చేతికి కూడా ఇచ్చారు. అడక్కపోయినా తమకు ఎన్నికల బోనస్ అందిందని ఆయా గ్రామాలకు చెందిన ఉద్యోగుల నుంచి ‘సాక్షి’కి సమాచారం అందింది. పదవులు వచ్చాయని పగబట్టారు..మండలంలోని ఓ ప్రధాన సామాజికవర్గం వారు దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్ (పసుపు) యార్డు చైర్మన్ పదవిని దశాబ్దాలుగా అనుభవించారు. ఆ పదవిని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈసారి ఎస్సీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారికిచ్చారు. అప్పటి నుంచే ఆ సామాజికవర్గం జీర్ణించుకోలేకపోతోంది. నియోజకవర్గంలోని ఇతర పదవుల విషయంలోనూ వారిది అదే తీరు.ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి మద్దతు ఇచ్చినందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన కౌలు దారులకు మండలంలో సుమారు 200 ఎకరాల వరకు కౌలుకు ఇవ్వడంలేదనేది మా అంచనా. గత ఎన్నికల్లో నారా లోకేశ్ పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో బీసీ వర్గీయురాలిపై పోటీచేశారు. ఫలితం తేలాల్సి ఉంది. ఆయన సామాజికవర్గీయులకు చెందిన భూములు కౌలుకు ఇవ్వడంలేదంటే వారి ఆలోచనా తీరును అర్థంచేసుకోవాలి. ఆయన మంగళగిరి నియోజకవర్గ నాయకుడా? లేక రాష్ట్రస్థాయి లీడరా? అనేది ఆయనే తేల్చుకోవాల్సిన విషయం. – దుగ్గిరాల వీరయ్య, వైఎస్సార్సీపీ, దుగ్గిరాలరెడ్బుక్లో పేరు ఎక్కిందంటూ బెదిరింపులు..35 ఏళ్లుగా మా తాత తండ్రుల కాలం నుంచి మూడెకరాలను కౌలుకు చేస్తున్నాం. వాళ్ల ఇళ్లలో అన్నిరకాల పనులూ చేశాం. వైఎస్సార్సీపీ వైపు నిలిచినందుకు మాకు భూమి కౌలుకు ఇచ్చేది లేదంటున్నారు. అమరావతి భూముల అంశంలో మాట్లాడినందుకు.. ‘నీ పేరు లోకేశ్ రెడ్‌బుక్‌లో ఎక్కింది. ఎన్నికల ఫలితాలు వచ్చాక నీ సంగతి తేలుస్తా’..మని బెదిరిస్తున్నారు. ఏం జరుగుతుందో, ఏమో! – యలమాటి ప్రసాద్‌కుమార్, పెదపాలెంఇల్లు కట్టుకుంటున్నా ఓర్వలేకున్నారు..మేం ఇల్లు కట్టుకుంటున్నాం. నిర్మాణ సమయంలో పొరుగు ఇంటిపై కాస్త నీళ్లు పడినా, దుమ్ము రేగినా తట్టుకోలేకపోతున్నారు. పనిచేసే భవన కార్మికులను, పనివాళ్లను తిడుతున్నారు. కారణం మేం వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలిచామని. – షేక్ బాజీ, చిలువూరుమీరు పార్టీ మారారని మేమూ మారాలా?‘మీరు ఎందుకు జగన్‌కు మద్దతుగా ఉంటున్నారు? ఆ పార్టీని వదిలేసి లోకేశ్‌కు ఓట్లు వేయండి’.. అని మా గ్రామ పెత్తందారు హుకుం జారీచేశారు. మేం జగన్‌ను వదిలే ప్రసక్తిలేదని నాతో పాటు మా బంధువర్గానికి చెందిన వారందరం స్పష్టంగా చెప్పాం. మీరు పార్టీ మారారని, మమ్మల్ని కూడా మారాలని ఆదేశిస్తే అంగీకరించేదిలేదన్నాం. దీంతో పదిహేనేళ్లుగా కౌలుచేస్తున్న రెండెకరాలను ఇచ్చేదిలేదన్నారు. కౌలు డబ్బులు సీజన్‌కు ముందే చెల్లిస్తాం. ఓట్లు వేయనందుకు పొలం ఇవ్వడంలేదనడం వ్యవసాయ సీజన్ మొదలయ్యే ముందు చెప్పడం ఎంతవరకు న్యాయమో వారే ఆలోచించుకోవాలి. – బుల్లా శ్రీనివాసరావు, పెదపాలెండబ్బులు వెనక్కు ఇచ్చేశారు..భూమి సత్తువ కోసం జొన్న మొదుళ్లను కట్టర్‌తో పనిచేయించాం. రూ.5వేలు ఖర్చయ్యింది. ఆ మొత్తాన్ని మా భూ యజమాని తిరిగి ఇచ్చేశారు. మూడెకరాలను ఈ ఏడాది కౌలుకు ఇచ్చేది లేనిదీ ఇరవై రోజులు తరువాత చెప్తామన్నారు. ఇక వారు చెప్పేదేంటో అర్థమైపోయింది. – గొడవర్తి ప్రతాప్‌సింగ్, పెదపాలెంమేమే సాగు చేసుకుంటామంటున్నారు..పద్నాలుగేళ్లుగా సాగుచేసుకుంటున్న నాలుగెకరాల పొలాన్ని ఈ దఫా కౌలుకు ఇచ్చేలా లేరు. మేమే సాగు చేసుకుంటామని చెబుతున్నారు. మొన్న ఎన్నికల్లో మేం ఫ్యాన్‌కు ఓట్లేశామని వారికి మాపై కోపం.– షేక్ ఖాంసా, కంఠంరాజుకొండూరుమా నాన్నకు వీడియోలు చూపించి బెదిరించారు..మీ అబ్బాయి వైఎస్సార్సీపీలో తిరుగుతున్నాడు. పోలింగ్ కేంద్రంలో ఆ పార్టీ తరఫున గట్టిగా మాట్లాడాడు. ఇవిగో వీడియోలు చూడండని ఇంటికెళ్లి మా నాన్న ఇస్మాయిల్‌కు వాటిని చూపించారు. దీంతో.. ఐదేళ్లుగా చేస్తున్న నాలుగెకరాలను ఇక నుంచి కౌలుకు ఇచ్చేదిలేదని చెప్పారు. – షేక్ సద్దాం హుస్సేన్, చిలువూరుసర్పంచ్గా గెలిచానని..మాది తుమ్మపూడి. మా అన్న షేక్ ఖాదర్ బాషా. ప్రస్తుతం ఏడాదికి ఎకరానికి రూ.70 వేలు చొప్పున నిమ్మతోటకు కౌలు చెల్లిస్తూ వచ్చాం. పదెకరాలకు 35 ఏళ్ల పాటు ఎప్పటి కౌలు అప్పుడు ఇచ్చేవాళ్లం. నేను సర్పంచ్‌గా పోటీచేసి గెలిచినందుకు మూడేళ్ల నుంచి నిమ్మతోటను మా అన్నకు ఇవ్వలేదు. – జానీ బాషా, తుమ్మపూడి సర్పంచ్మీవి భూములైనప్పుడు మావి ఓట్లు కావా?మా బాబాయి గంపల శ్రీనివాసరావు 22 ఏళ్లుగా రెండెకరాలు కౌలుకు చేసేవారు. ఎకరానికి రూ.35 వేలు చొప్పున ముందస్తు కౌలు క్రమం తప్పక చెల్లించేవారు. ఎంబీఏ చేసిన నేను బీసీ వర్గం నుంచి పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసి సర్పంచ్‌గా గెలుపొందాను. అంతమాత్రాన కౌలుకు భూమి ఇచ్చేదిలేదంటే ఎలా? భూములు వారివి అయినప్పుడు ఓట్లు మావి కావా? వారికి మాత్రమే పార్టీ.. మాకు పార్టీ అంటే ఇష్టం ఉండదా? ఇదెక్కడి న్యాయమో అర్థంకావడంలేదు. – గంపల గంగాధరరావు, పేరుకలపూడి, సర్పంచ్ -
ఎన్నికల సంఘం సఛ్చీలతను నిరూపించుకోవాలి
సాక్షి, అమరావతి: మాచర్లతో పాటు పల్నాడు ప్రాంతంలో పోలింగ్ సందర్భంగా చోటు చేసుకున్న బూత్ క్యాప్చరింగ్, రిగ్గింగ్, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోకుండా అడ్డుకున్న ఘటనలపై సమగ్ర దర్యాప్తు జరపాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ కోరింది. అత్యంత గోప్యంగా ఉంచాల్సిన పాల్వాయిగేట్ పోలింగ్ స్టేషన్‌లోని వెబ్ కామ్ ఫుటేజి బయటకు ఎలా వచ్చిందో దర్యాప్తు చేయాలని కోరింది. ఈవీఎంల ధ్వంసానికి సంబంధించి వెబ్ కామ్‌లో రికార్డయిన వీడియో ఓ పార్టీ నేత అయిన లోకేశ్‌కు ఎలా చేరిందో ఎన్నికల కమిషన్ స్పష్టం చేయాలని అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు డిమాండ్ చేశారు. సున్నితమైన అంశం వీడియోను లోకేశ్ ఎక్స్ ఖాతా ద్వారా పబ్లిక్ డొమైన్లో పెట్టడమే కాకుండా, ట్వీట్ చేయడం చూస్తుంటే పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ వ్యవహారం వెనుక కొంతమంది ఎన్నికల కమిషన్ అధికారుల హస్తం కూడా ఉందనే అనుమానం కలుగుతోందన్నారు. కోర్టుకు మాత్రమే సమర్పించాల్సిన ఈ వీడియోను బహిర్గతం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. మాచర్ల నియోజకవర్గంలోని ఇతర పోలింగ్ స్టేషన్లలో జరిగిన ఘటనల వీడియోలను కూడా విడుదల చేయాలని కోరారు. ఈ పరిణామాలన్నీ నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్ అధికారుల సఛ్చీలతపై అనుమానాలు కలిగిస్తున్నాయని తెలిపారు. ఒక్క మాచర్లలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని, కొన్ని చోట్ల పోలింగ్ సిబ్బంది, పోలీస్ అధికారులు సైతం ఓ పార్టికి కొమ్ముకాసేలా వ్యవహరించారని ఈసీ దృష్టికి తీసుకొచ్చారు. పౌరులకు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి లేనప్పుడు ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఏ విధంగా సగటు ఓటరుకు నమ్మకం కలుగుతుందని ప్రశి్నంచారు. ఇతర పోలింగ్ స్టేషన్లలో జరిగిన ఘటనలపైనా ఇదే తరహాలో చర్యలు తీసుకుంటే ఎన్నికల కమిషన్‌పై విశ్వాసం పెరుగుతుందన్నారు. ఇతర వీడియోలను బయటపెట్టడంతో పాటు ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి బా«ధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ఎన్నికల సంఘం సఛ్చీలతను నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. -
దుష్ప్రచారం చేయడం డాక్టర్ లోకేశ్‌కు అలవాటే..
సాక్షి, అమరావతి: ప్రముఖులపై దుష్ప్రచారం చేయడం డాక్టర్ ఉయ్యూరు లోకేశ్‌కు అలవాటని ప్రముఖ ఎన్ఆర్ఐ డాక్టర్ వాసుదేవరెడ్డి తెలిపారు. ఏపీలో ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని మేధావిగా చలామణి అవుతున్నారని ఎద్దేవా చేశారు. అయితే అమెరికాలో 18 ఏళ్లుగా ఆయన ప్రాక్టీస్‌పై నిషేధం కొనసాగుతోందని తెలిపారు. టీడీపీ సానుభూతిపరుడైన లోకేశ్ ఇటీవల గన్నవరం విమానాశ్రయంలో లండన్‌కు వెళుతున్న సీఎం జగన్‌ను అడ్డుకునేందుకు కుట్ర పన్నారు. ఈ సందర్భంగా అతని గురించి పలు విస్తుపోయే వాస్తవాలను డాక్టర్ వాసుదేవరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. గుంటూరు మెడికల్ కాలేజీలో 1983లో లోకేశ్ గ్రాడ్యుయేట్ అయ్యాడు. గ్యాస్ట్రో విభాగంలో ఎండీ పూర్తిచేసిన ఆయన అమెరికాలోని వర్జీనియాలో తొలుత ప్రాక్టీస్ మొదలెట్టాడు. అప్పటి నుంచే ఎదుటి వ్యక్తులపై అవాస్తవ ఆరోపణలు చేయడం, కోర్టుల్లో తప్పుడు కేసులు ఫైల్ చేయడం లోకేశ్‌కు అలవాటు. ప్రాక్టీస్ ప్రారంభించిన తొలినాళ్లలో ఆస్పత్రి యాజమాన్యంపై, సహచర వైద్యులపై కోర్టులో కేసులు వేసి, ఆ ఆరోపణలను రుజువు చేయడంలో విఫలమయ్యాడు. ఇదే తరహాలో 2022లో భారత ప్రధాని మోదీ, ఏపీ సీఎం వైఎస్ జగన్, అదానీ మీద వాషింగ్టన్ డీసీ కోర్టులో కేసులు ఫైల్ చేశాడు. ఇండియా నుంచి కంటైనర్లలో డబ్బుతో పాటు, ఇజ్రాయిల్ నుంచి స్పైవేర్ కొనుగోలు చేసి అమెరికాకు అక్రమంగా తరలిస్తున్నారంటూ ఆరోపణలు చేశాడు. తప్పుడు ఆరోపణలతో కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నావని లోకేశ్‌కు కోర్టు చీవాట్లు పెట్టడంతో పాటు జరిమానా విధించింది. ప్రాక్టీస్‌పైనా నిషేధం వైద్య నిబంధనలకు విరుద్ధంగా రోగులకు చికిత్సలు అందించి పలువురి మరణానికి లోకేశ్ కారకుడయ్యాడు. 2006లో వర్జీనియా బోర్డ్ ఆఫ్ మెడిసిన్ లోకేశ్ మెడికల్ లైసెన్స్‌ను రద్దు చేసింది. అనంతరం న్యూయార్క్, న్యూజెర్సీ వంటి ఇతర ప్రాంతాలకు వెళ్లాడు. ఆయా రాష్ట్రాల్లోనూ లైసెన్స్‌ను రీవోక్ చేశారు. అయితే ఈ వాస్తవాలను కప్పిపుచ్చి అమెరికాలో ప్రముఖ వైద్యుడిగా చలామణి అవుతూ ఏపీ సీఎం జగన్‌పై అవాస్తవ ఆరోపణలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు వాస్తవాలను ఓ సారి తెలుసుకోవాలి. మేధావులుగా చలామణి అవుతున్న లోకేశ్ వంటి కులోన్మాదులు సీఎం జగన్‌పై దాడులకు పాల్పడుతున్నారు. -
అమెరికా పారిపోయిన అయ్యా.. కొడుకులు
-
మరోసారి పోలీసుల అదుపులో ఉయ్యూరు లోకేష్
సాక్షి, కృష్ణాజిల్లా: గన్నవరం ఎయిర్‌పోర్టులో ఉయ్యూరు లోకేష్ బాబును మరోసారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల క్రితం ఎయిర్‌పోర్టులో ఉయ్యూరు లోకేష్ అనుమానాస్పదంగా తిరిగిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ పర్యటన ఎయిర్ పోర్ట్‌కు వస్తున్న సమయంలో ఆందోళన చేసేందుకు లోకేష్ ప్లాన్ చేయగా, తనిఖీల్లో భాగంగా సరైన టికెట్ లేకపోవడం, సరైన సమాధానం లేకపోవడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం 41ఏ నోటిస్ ఇచ్చిన శనివారం పంపించారు.తిరిగి ఆదివారం మరోసారి ఢిల్లీ వెళ్లేందుకు గన్నవరం ఎయిర్ పోర్టుకు లోకేష్ వచ్చాడు. ఎయిర్ పోర్ట్ అధికారుల తనిఖీల్లో లోకేష్ నుంచి శాటిలైట్ ఫోన్ బయటపడింది. దీంతో ఎయిర్‌పోర్టు అధికారులు గన్నవరం పోలీసులకు సమాచారం ఇవ్వగా, లోకేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా లోకేష్ శాటిలైట్ ఫోన్ వినియోగిస్తున్నాడు. తుళ్ళూరు మండలం వెంకటాయపాలెంకు చెందిన లోకేష్.. గతంలో అమెరికాలో డాక్టర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. లోకేష్‌ను గన్నవరం పోలీసులు విచారిస్తున్నారు.లోకేష్ గురించి షాకింగ్ నిజాలు..గన్నవరం ఎయిర్‌పోర్టులో అరెస్టయిన ఎన్ఆర్ఐ డాక్టర్ ఉయ్యూరు లోకేష్ గురించి విస్తుపోయే నిజాలను బయటపెట్టారు ప్రముఖ వైద్య నిపుణులు వాసుదేవరెడ్డి నలిపిరెడ్డి. తప్పుడు ఆరోపణలు, ఫిర్యాదులు చేయడం.. కోర్టు చేత చివాట్లు తినడం.. టీడీపీ సానుభూతిపరుడైన ఇతగాడి చరిత్ర.. రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలపై ఆధారాలు లేకుండా వేసిన తప్పుడు కేసులను వాషింగ్టన్ డీసీ కోర్టు కొట్టివేయడంతో పాటు లోకేష్‌కు ఫైన్ కూడా వేసిందని వాసుదేవారెడ్డి తెలిపారు. వైద్య వృత్తిలో నిర్లక్ష్యం కారణంగా గతంలో న్యూయార్క్, వర్జీనియా వంటి కొన్ని రాష్ట్రాలు.. లోకేష్ మెడికల్ లైసెన్స్ కూడా రద్దు చేశాయి.. లోకేష్ గురించి షాక్ అయ్యే నిజాలను పూర్తి వీడియోలో చూడొచ్చు. -
అవినీతి సొమ్ముకు హెరిటేజ్ ముసుగు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఎందుకిన్ని మోసాలు? బతుకంతా అబద్ధాలేనా? మేనిఫెస్టో సరే.. అఫిడవిట్లో కూడా అబద్ధాలేనా? తరచి చూస్తే తండ్రీ కొడుకులు చంద్రబాబు నాయుడు... లోకేశ్ నాయుడు ఇద్దరూ ఇప్పుడే కాదు... 2019లోనూ అబద్ధాల అఫిడవిట్లే వేశారు. 2019లో హెరిటేజ్ షేర్ విలువ రూ.260.81 ఉండగా... అఫిడవిట్లో మాత్రం ఏకంగా రూ.511.90 ఉన్నట్టుగా చూపించారు. పైపెచ్చు వీళ్లకు ఉన్నవి ఒకటీరెండూ షేర్లు కాదు. 2019లో చంద్రబాబుకు 1,06,61,652 షేర్లు... లోకేశ్ నాయుడికి 4,73,800 షేర్లు ఉన్నాయి. అప్పట్లో వీటి వాస్తవ విలువ చంద్రబాబుది రూ.278 కోట్ల పైచిలుకు కాగా... లోకేశ్‌ది రూ.12.40 కోట్లు. కానీ చంద్రబాబు తన షేర్ల విలువను ఏకంగా రూ.545 కోట్లుగా చూపించారు. తానేమీ తక్కువ తినలేదన్నట్లు లోకేశ్ కూడా తన షేర్ల విలువను రూ.24.25 కోట్లుగా చూపించారు. అంటే ఇద్దరూ కలిసి తమ హెరిటేజ్ షేర్ల విలువను దాదాపు రూ.279 కోట్లు ఎక్కువగా చూపించారు. ఇదంతా ఎందుకో తెలుసా?ఐటీ కళ్లు కప్పడానికి ముసుగు...నిజానికి 2014 నుంచి 2019 వరకూ చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నారు. ఆ సమయంలో ఆయన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం సహా పలు కుంభకోణాలకు తెరతీశారు. ఈ స్కాముల్లో చాలా నిధులు రకరకాల మార్గాల్లో మళ్లీ తన దగ్గరికే రప్పించుకున్నారు. ఈ సొమ్ముతో ఆస్తులు పెంచుకున్నా... అవేవీ రికార్డుల్లో కనపడకుండా జాగ్రత్త పడ్డారు. చాలా ఆస్తుల్ని బినామీల పేరిట పెట్టారు. అయితే షాపుర్జీ పల్లోంజీ సహా కొన్ని కంపెనీల నుంచి తీసుకున్న డబ్బులు నేరుగా చంద్రబాబు ఖాతాల్లోకే రావటంతో దానికి ఐటీ శాఖ నోటీసులు కూడా జారీ చేసింది.ఆ నోటీసులకు జవాబిచ్చేటపుడు కూడా... నాకు నోటీసులిచ్చే అధికారం మీకు లేదంటూ బుకాయించడం... అదే కారణంతో కోర్టులో సవాల్ చేయటం తప్ప ఆదాయానికి సంబంధించిన సమాధానాలేవీ ఇవ్వలేదు. అయితే ఆ డబ్బులు పెరిగిన ఆస్తుల్లో, తన బ్యాంకు ఖాతాల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉండటంతో వాటికి ఈ హెరిటేజ్ ముసుగు వేసినట్లుగా నిపుణులు చెబుతున్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో అధికారికంగా అన్ని ఆస్తులు ఎలా పెరిగాయనే ప్రశ్న వస్తుంది కాబట్టి... హెరిటేజ్ షేర్లకు అంత విలువ లేకపోయినా వాటి పేరిట చూపిస్తే సరిపోతుందని ఈ పన్నాగం పన్నినట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.ఈ సారి అఫిడవిట్లో షేర్ల సంఖ్య పెంచేసి మరో అక్రమం...ఇలాంటి తప్పుల్ని, మోసాల్ని సహించలేమంటూ 2019 ఎన్నికల్లో జనం బాబుకు బుద్ధి చెప్పి ఓడించటం అందరికీ తెలిసిందే. కాకపోతే మళ్లీ ఈ సారి ఎన్నికల్లో మునుపటిలాగే షేరు విలువను ఎక్కువ చేసి చూపిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని అనుకున్నారో ఏమో... షేర్ల సంఖ్యను పెంచి చూపించారు. అప్పట్లో ఉన్న షేర్ల సంఖ్య 1,06,61,652 కాగా... ఇపుడా షేర్ల సంఖ్య ఏకంగా 2,26,11,525కు పెరిగినట్లు చంద్రబాబు చూపించారు.అంటే రెట్టింపుకన్నా ఎక్కువన్న మాట. అప్పట్లో వీటి మొత్తం విలువను రూ.545 కోట్లుగా చూపించిన చంద్రబాబు... ఇప్పుడు 2,26,11,525 షేర్లను ఒక్కొక్కటీ రూ.337.85గా చూపిస్తూ... హెరిటేజ్‌లోని తన షేర్ల విలువ రూ.. 767.44 కోట్లుగా పేర్కొన్నారు. లోకేశ్ కూడా తన షేర్లు 4,73,800 నుంచి 1,00,37,453కు పెరిగినట్లుగా... వాటి విలువ రూ.337.85 చొప్పున రూ.339 కోట్లుగా చూపించారు.బోనస్, స్ప్లిట్.. ఏమీ లేకుండానేనిజానికి 2019 తరువాత హెరిటేజ్ షేర్ల విభజన జరగలేదు. అంటే ఒక షేరును విభజించి రెండుగా చేయటమో ఏదో జరిగితే తప్ప చంద్రబాబు నాయుడి షేర్లు అలా రెట్టింపయ్యే అవకాశం లేదు. పోనీ బోనస్ షేర్లను జారీ చేశారా అంటే... అది కూడా లేదు. ఈ రెండూ కాకుండా ఈ మధ్యలో చంద్రబాబు ఎవరి వద్దనుంచైనా హెరిటేజ్ షేర్లను కొనుగోలు చేశారా అంటే... అది కూడా లేదు. మరి ఎలా పెరిగాయి? 2019లో హెరిటేజ్ షేర్లకు లేని విలువను ఉన్నట్టుగా చూపించి వాటిని ఏకంగా రూ.545 కోట్లుగా పేర్కొన్న చంద్రబాబు... ఇప్పుడు వాటి విలువ రూ.337 ప్రకారం కోటి షేర్లుగా చూపిస్తే మొత్తం విలువను రూ.337 కోట్లుగా చూపించాలి. అంటే ఐదేళ్లలో హెరిటేజ్ షేర్ల విలువను తగ్గినట్లు చూపించాలి. ఇది కంపెనీకి కూడా ఇబ్బందికరంగా మారవచ్చని, తన 2019 అఫిడవిట్ బాగోతం బయటపడే అవకాశం ఉందని భావించి... ఈ సారి కూడా అబద్ధం చెప్పి ఉండొచ్చనేది ఆర్థిక నిపుణుల అంచనా. తండ్రి బాటలోనే లోకేశ్ కూడా తన షేర్ల సంఖ్యను అమాంతం పెంచేసి... 4 లక్షల షేర్లను కోటి షేర్లుగా చూపించారని, ఇదంతా అవినీతి సొమ్ముకు అధికారిక ముసుగు వేయటానికేనని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే కంపెనీలో ప్రమోటర్ల వాటా అప్పుడు ఎంత ఉందో ఇప్పుడూ అంతే ఉంది. మరి వాటా పెరగకుండా షేర్ల సంఖ్య పెరగటం ఎలా సాధ్యం? నిజానికి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పుడు అఫిడవిట్లను సమర్పించడం చట్టరీత్యా నేరం. ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు అఫిడవిట్లు సమర్పిస్తే.... సెక్షన్ 125 ఏ ప్రకారం... అభ్యర్థిపై విచారణ జరపవచ్చని కొన్ని కేసుల్లో కోర్టులు స్పష్టంగా తీర్పునిచ్చాయి కూడా. -
నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రజల మద్దతు లేదేని, ఓటమి ఖాయమని తేలిపోవడంతో చంద్రబాబు తన నల్ల ఖజానా గేట్లు ఎత్తేశారు. పచ్చ నోట్ల వరద పారిస్తున్నారు. ఇందుకు నిదర్శనాలివి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు, ఎన్నికల అధికారుల తనిఖీల్లో తెలుగుదేశం పార్టీ నేతలు, అనుచరుల వద్ద భారీ మొత్తంలో అక్రమ నగదు, కానుకలు పట్టుబడ్డాయి.వెలుగులోకి రాని అక్రమాలు, పట్టుబడకుండా టీడీపీ నేతల వద్ద గుట్టలు గుట్టలుగా ఉన్న అక్రమ సొమ్ముకు లెక్కే లేదు. ఎన్నికల కమిషన్ (ఈసీ)ని బురిడీ కొట్టిస్తూ కొత్తదారుల్లో పచ్చ నోట్లు వెదజల్లుతున్నారు. అందుకోసం షెల్ కంపెనీల నుంచి రామోజీరావుకు చెందిన మార్గదర్శి, నారాయణ విద్యా సంస్థలు, ఇతర టీడీపీ నేతల వ్యాపార సంస్థల్లోకి భారీగా అక్రమ నిధులు మళ్లిస్తున్నారు.గొల్లపూడిలో దొరికింది పెద్దమొత్తమే!భవానీపురం (విజయవాడ పశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి వసంత కృష్ణప్రసాద్ అనుచరుడు ఆలూరి సురేష్ ఇంటిపై ఫ్లయింగ్ స్క్వాడ్, పోలీసు అధికారుల దాడిలో దొరికింది రూ. కోటి అని చెబుతున్నప్పటికీ, ఇంకా పెద్దమొత్తంలోనే నగదు బయటపడినట్లు భావిస్తున్నారు. సురేష్ ఇంట్లో భారీ మొత్తంలో నగదు ఉన్నట్లు భవానీపురం పోలీసులకు అందిన సమాచారాన్ని ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారిణి సుధకు తెలియజేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్, పోలీసులు బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో గొల్లపూడి టెలికాం కాలనీలోని సురేష్ ఇంట్లో సోదాలు చేశారు.దాదాపు నాలుగు గంటలపాటు సోదాలు చేసి, సురేష్‌ను విచారించారు. సొమ్మును లెక్కించేందుకు కౌంటింగ్ మిషన్ కూడా తెప్పించారు. దీంతో పెద్ద మొత్తమే దొరికి ఉండవచ్చని భావిస్తున్నారు. సాయంత్రం 6.30 తరువాత ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారిణి సుధ బయటకు వచ్చి తమ సోదాలో కోటి రూపాయలు దొరికాయని ముక్తసరిగా చెప్పారు. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు దాటవేసి వెళ్లిపోయారు. అసలు ఈ డబ్బు సురేష్ వద్దకు ఎలా వచ్చింది, ఇతర విషయాలు గోప్యంగా ఉంచడం అనేక అనుమానాలకు తావిచ్చింది. మైలవరం నియోజకవర్గంలో పంచాయితీరాజ్ డీఈఈగా ఉన్న సుధకు ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్‌తో పరిచయాలు ఉండటం వల్లే ఇంత గోప్యంగా వ్యవహరించారన్న అనుమానాలు కలుగుతున్నాయి. కృష్ణప్రసాద్ ఇదే విధంగా తన సామాజికవర్గానికి చెందిన పలువురి వద్ద పెద్ద మొత్తంలో డబ్బు డంప్ చేసినట్లు సమాచారం.ఉప్పందించింది దేవినేని ఉమా వర్గమే!ఎన్టీఆర్ జిల్లా కవులూరుకు చెందిన ఆలూరి సురేష్ కొన్నేళ్లుగా గొల్లపూడిలో శ్రీనివాస లారీ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ నడుతున్నాడు. గతంలో టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, బొమ్మసాని సుబ్బారావు వెంట ఉండేవారు. వసంత కృష్ణప్రసాద్ టీడీపీలోకి వచ్చి మైలవరం అభ్యర్ధిగా పోటీ చేస్తుండటంతో ఆయనకు అనుచరుడిగా మారారు. సురేష్ బుల్లెట్ బైక్ వెనుక నంబరు కూడా లేదు. ‘మన మైలవరం..మన వసంత’ అని స్టిక్కర్ ఉంది. మైలవరం నియోజకవర్గంలో కృష్ణప్రసాద్‌కు, మాజీ మంత్రి దేవినేని ఉమా వర్గానికి పడదు. దీంతో దేవినేని వర్గమే సురేష్ వద్ద ఉన్న డబ్బు సమాచారాన్ని పోలీసులకు చేరవేసి ఉంటారని భావిస్తున్నారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఓటర్లకు టీడీపీ పంపిణీ చేస్తున్న ఓటర్ల స్పిప్పులు ఇవి. ఎన్నికల్లో ఓటర్ల స్లిప్పుల పంపిణీ సాధారణమే. కానీ అక్కడే ఉంది చంద్రబాబు మాయోపాయం. ఓటర్లకు పంచుతున్న ఆ ఓటరు స్లిప్పుల మీద హోలోగ్రామ్ ముద్రించారు. ఈ డబ్బు ఇచ్చేందుకు ప్రతి బూత్‌కు ఓ ఏజెంటును నియమించారు. ఓటరు స్లిప్పును ఆ ఏజెంటుకు ఇస్తే, ఆయన దానికి స్కాన్ చేసి, ఓటరు ఖాతాలో రూ.3 వేలు వేస్తారు. ఇలా నియోజకవర్గంలోని 1.70 లక్షల మంది ఓటర్లకు ఓటుకు రూ.3 వేలు చొప్పున రూ. 51 కోట్ల పంపిణీకి చంద్రబాబు బరితెగించారన్నది సుస్పష్టం. పోలింగ్ రోజు వరకు మద్యం పంపిణీ, చోటా మోటా నేతలు, బూత్ కమిటీలకు యథేచ్ఛగా డబ్బుల పందేరం అదనం. ఇలా నియోజకవర్గంలో ఎన్నికల అక్రమాలకు చంద్రబాబు రూ.100 కోట్లతో పకడ్బందీ స్కెచ్ వేసినట్టు స్పష్టమైంది. మాచర్లలో పోలీసులు దాడులు చేసి టీడీపీ నేతల ఇళ్లలో ఉన్న ఈ స్లిప్పులను స్వాధీనం చేసుకోవడంతో చంద్రబాబు పన్నాగం బట్టబయలైంది. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్‌కు అత్యంత సన్నిహితుడు ఆలూరి సురేశ్ బాబు నివాసంలో ఫ్లయింగ్ స్క్వాడ్, పోలీసు అధికారులు తనిఖీ చేసి, రూ.కోటి స్వాధీనం చేసుకున్నారు. ఆయన విజయవాడలోని స్వీట్ మ్యాజిక్ హోటల్స్ భాగస్వామి. మైలవరం నియోజకవర్గంలో ఓట్లు కొనేందుకే ఈ నిధులు అక్రమంగా తరలించినట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులకు దొరికింది రూ. కోటే అయినా, స్వీట్ మ్యాజిక్ హోటల్స్ యజమానుల ద్వారా షెల్ కంపెనీలను ఉపయోగించి దాదాపు రూ.10 కోట్ల వరకు తరలించాలని కుతంత్రం పన్నినట్టు భావిస్తున్నారు. మిగిలిన నిధుల కోసం పోలీసులు సోదాలు ముమ్మరం చేశారు.రాష్ట్రం అంతటా మాచర్ల ఫార్మూలానే!మాచర్ల ఫార్మూలానే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని చంద్రబాబు పకడ్బందీ ప్రణాళిక రచించారు. హోలోగ్రామ్‌లు ముద్రించిన ఓటర్ల స్లిప్పులతో ఓట్లు కొనుగోలుకు రంగం సిద్ధం చేశారు. దీంతోపాటు మద్యం, నేతలకు ముడుపులకూ నల్ల ధనాన్ని తరలిస్తున్నట్లు సమాచారం. ఇలా నియోజకవర్గానికి రూ.100 కోట్లు చొప్పున 175 నియోజకవర్గాలకు మొత్తం రూ.17,500 కోట్లు వెదజల్లి ఎన్నికల అక్రమాలకు బరితెగించాలన్నది చంద్రబాబు లక్ష్యం. అందుకోసం ఎంతకైనా తెగించాలని, ఎంతటి బీభత్సమైనా సృష్టించాలని ఆయన స్పష్టం చేసినట్టు సమాచారం. ఈమేరకు నియోజకవర్గాల్లో దౌర్జన్యాలకు, చివరికి హత్యలకు కూడా తెగించేందుకు టీడీపీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందుకోసం ఓ రిటైర్డ్ రాష్ట్ర పోలీస్ బాస్, రిటైర్డ్ డీఐజీ, సస్పెన్షన్‌లో ఉన్న సీనియర్ ఐపీఎస్‌లతో ఓ ముఠాను తయారు చేసి పచ్చ పన్నాగం అమలు బాధ్యతను అప్పగించారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో చంద్రబాబుతో కలసి చదువుకున్న ఓ రిటైర్డ్ ప్రొఫెసర్, ఓ రిటైర్డ్ ఐఏఎస్ (ఈయన చంద్రబాబు కేసుల్లో సహా నిందితుడు కూడా), టీడీపీ ప్రభుత్వంలో సలహాదారుగా వ్యవహరించిన ఆర్థిక నిపుణుడు ఈ కుట్ర అమలు కోసం టీడీపీ నేతలతో సమన్వయం చేస్తున్నట్లు సమాచారం.అంతా చంద్రబాబు, లోకేశ్ కనుసన్నల్లోనేఎన్నికల అక్రమాలకు పాల్పడేందుకు నల్ల ధనం తరలింపు వ్యవహారం మొత్తం చంద్రబాబు, లోకేశ్ కనుసన్నల్లోనే సాగుతోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో యథేచ్చగా కుంభకోణాలకు పాల్పడి కొల్లగొట్టిన నిధులను చంద్రబాబు వివిధ షెల్ కంపెనీల ద్వారా తరలించారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం ద్వారా కొల్లగొట్టిన నిధులను షెల్ కంపెనీల ద్వారా హైదరాబాద్‌లోని నాలుగు బ్యాంకుల్లో ఉన్న టీడీపీ ఖాతాల్లో జమ చేసిన విషయాన్ని సీఐడీ అధికారులు ఇప్పటికే ఆధారాలతోసహా గుర్తించిన విషయం తెలిసిందే. అదే విధంగా అమరావతి భూములు, మద్యం, ఇసుక, ఫైబర్ నెట్ తదితర కుంభకోణాల ద్వారా కొల్లగొట్టిన లక్షల కోట్ల రూపాయలను షెల్ కంపెనీల ద్వారా తరలించారు. ఆ అక్రమ ఖజానా నుంచే ప్రస్తుతం ఎన్నికల అక్రమాల కోసం నిధులను వివిధ రూపాల్లో తరలిస్తున్నారన్నది తేటతెల్లమవుతోంది. మార్గదర్శి, నారాయణ, రాయల్ మెరైన్ సీఫుడ్స్, సోమా అగ్రిటెక్, స్వీట్ మ్యాజిక్... ఇలా వివిధ సంస్థల ద్వారా నియోజకవర్గాలకు తరలిస్తున్న వేల కోట్ల రూపాయలు చంద్రబాబు అక్రమ ఖజానా నుంచి మళ్లిస్తున్నవేనన్నది సుస్పష్టం. పోలింగ్‌నాటికి చంద్రబాబు ఇంకెంతగా బరితెగిస్తారో.. ఈ అక్రమాలను ఈసీ, పోలీసులు ఎలా కట్టడి చేస్తారో అన్నది చూడాల్సిందే.ఇటీవలి కాలంలో పట్టుబడ్డ ‘పచ్చ’ ధనంలో ప్రధానమైనవి మరికొన్ని..» అనంతపురం జిల్లా కదిరిలో టీడీపీ అభ్యర్థి కందికుంట ప్రసాద్ వాహనంలో తరలిస్తున్న రూ.2 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. » బాపట్ల టీడీపీ అభ్యర్థి వేగేశ్న నరేంద్రవర్మకు చెందిన రాయల్ మెరైన్ ఫుడ్స్ కంపెనీ కంటైనర్లలో భారీ మొత్తంలో తరలిస్తున్న నగదును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. » ఏకంగా చంద్రబాబు రాజగురువు రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల నుంచే గుట్టుచప్పుడు కాకుండా నల్లధనం పంపిణీ జరుగుతుండటం గమనార్హం. విశాఖపట్నంలో మార్గదర్శి చిట్‌ఫండ్స్ సిబ్బంది అక్రమ నిధులు తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. రాష్ట్రంలోని 37 మార్గదర్శి చిట్‌ఫండ్స్ శాఖల ద్వారా నెలకు రూ.200 కోట్ల టర్నోవర్ అని అక్రమంగా చూపిస్తూ.. కొన్ని నెలలుగా టీడీపీ ఎన్నికల అక్రమాలకు భారీగా నల్లధనాన్ని వెదజల్లేలా సాగిస్తున్న కుట్ర బట్టబయలైంది. » టీడీపీ సీనియర్ నేత, నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణకు చెందిన విద్యా సంస్థల తరపున ఏర్పాటు చేసిన ఇన్‌స్పైరా కంపెనీ వ్యవహారాల ముసుగులో ఎన్నికల అక్రమాలకు భారీగా నల్లధనాన్ని మళ్లించిన బాగోతం ఇటీవల బట్టబయలైంది. పోలీసులు సోదాల్లో నగదుతోపాటు, షెల్ కంపెనీల ద్వారా భారీగా నల్లధనం తరలించినట్లు వెలుగులోకి వచ్చింది.» బీజేపీ తరపున పోటీ చేస్తున్న చంద్రబాబు ముఠా సభ్యులు సీఎం రమేశ్, సుజనా చౌదరి నల్లధనం పంపిణీకి ఏకంగా ప్రత్యేక వ్యవస్థను నెలకొల్పారు. ఓట్ల కొనుగోలు, ఇతర అక్రమాల కోసం సుజనా చౌదరికి ఉమ్మడి కృష్ణా జిల్లా, సీఎం రమేశ్‌కు ఉత్తరాంధ్ర జిల్లాల బాధ్యతలను అప్పగించారు.» బాపట్ల జిల్లా పర్చూరు టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు తన నోవా అగ్రిటెక్ కంపెనీ బ్యాంకు ఖాతాల్లోకి అక్రమ నిధులు మళ్లించి, ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డ బాగోతం కూడా డీఆర్ఐ అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. కంపెనీ వ్యాపార లావాదేవీల ముసుగులో ఓట్లు కొనుగోలు, ఇతర ఎన్నికల అక్రమాలకు నిధులు తరలించిన కుతంత్రం ఆధారాలతోసహా బయటపడింది. -
ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసేలా దుష్ప్రచారానికి కుట్ర పన్నినట్లు నిర్ధారణ అయింది. భూములకు సంపూర్ణ భద్రత కల్పించే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను వక్రీకరించి అవాస్తవాలు ప్రచారం చేయడం ద్వారా ఓటర్లను ప్రభావితం చేయాలన్న కుతంత్రం వెనుక ప్రధాన కుట్రదారు చంద్రబాబేనని నిగ్గు తేలింది. టీడీపీ దుష్ప్రచారంపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేయడంతో ఎన్నికల కమిషన్ తక్షణం స్పందించింది.ఈ అంశంపై తక్షణం తగిన చర్యలు తీసుకుని తమకు నివేదించాలని సీఐడీని ఆదేశించిన విషయం తెలిసిందే. సీఐడీ చేపట్టిన దర్యాప్తులో ఈ కుట్ర గుట్టు వీడింది. చంద్రబాబు, లోకేశ్ పన్నాగం ప్రకారమే టీడీపీ, ఆ పార్టీ ఎన్నికల ప్రచార బృందాలు ఈ కుట్రకు తెరతీశాయని సీఐడీ నిర్ధారించింది. దాంతో ఏ 1గా చంద్రబాబు, ఏ 2గా లోకేశ్, ఏ 3గా టీడీపీ, ఆ పార్టీ ఎలక్ట్రానిక్ క్యాంపెయిన్ టీమ్‌లతోపాటు పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్లు 171(ఎఫ్),(జి), 188, 505(2) రెడ్‌విత్ 120 (బి) కింద అభియోగాలు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేసింది. కుట్రదారు చంద్రబాబే..అవాస్తవాలు, అభూత కల్పనలతో ప్రచారం చేయడం ఎన్నికల నియమావళికి విరుద్ధం. భయభ్రాంతులకు గురి చేయడం, ప్రలోభాలకు గురి చేయడం, సమాజంలో విద్వేషాలను రేకెత్తించేలా ప్రచారం చేయకూడదని ఎన్నికల నియమావళి స్పష్టంగా చెబుతోంది. భూ హక్కు చట్టం (ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్)పై పక్కా పన్నాగంతో చంద్రబాబు దుష్ప్రచార కుట్రకు తెర తీశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురద చల్లేందుకు పన్నిన కుట్రలన్నీ బెడిసి కొట్టడంతో ఆయనకు దిక్కు తోచడం లేదు.సచివాలయ వ్యవస్థ, వలంటీర్లు, వృద్ధాప్య పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలపై టీడీపీ చేసిన దుష్ప్రచారం బెడిసికొట్టింది. చంద్రబాబు అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని ప్రజలు గుర్తించారు. దీంతో బెంబేలెత్తిన చంద్రబాబు కొత్త కుట్రకు తెరతీశారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై అపోహలు వ్యాప్తి చేయాలని పథకం వేశారు. లోకేశ్, టీడీపీ ఎలక్ట్రానిక్ ప్రచార విభాగంతోపాటు ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు, సాంకేతిక నిపుణులు ఇందులో భాగస్వాములు అయ్యారు.ఈ చట్టం ద్వారా ప్రజల భూములను గుంజుకుంటారని, కబ్జా చేసేస్తారని, పత్రాలు మాయం చేస్తారని, ఇళ్ల నుంచి వెళ్లగొడతారని ప్రజలను బెదిరింపులకు గురి చేసేలా ఈ ముఠా దుష్ప్రచారానికి తెగించింది. ఏకంగా ఓటర్లకు ఫోన్లు చేసి మరీ భయాందోళనలకు గురి చేస్తోంది. మంగళగిరితోపాటు హైదరాబాద్, బెంగళూరు, ఇండోర్, చండీఘడ్ తదితర ప్రాంతాల నుంచి రాష్ట్రంలోని ఓటర్లకు ఫోన్లు చేస్తూ హడలెత్తించేందుకు యత్నించారు. టీడీపీకి వంతపాడే ఈనాడు, ఈటీవీ, ఎల్లో మీడియా పత్రికలు, చానళ్లతోపాటు టీడీపీ సోషల్ మీడియా విభాగం పక్కా పన్నాగంతో ఈ దుష్ప్రచారాన్ని తీవ్రతరం చేశాయి. ఈసీ ఆదేశాలతో..ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై టీడీపీ దుష్ప్రచారంపై వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేసింది. ఐవీఆర్ కాల్ రికార్డింగులతోపాటు ఇతర ఆధారాలను అందచేసింది. దీనిపై తీవ్రంగా స్పందించిన ఎన్నికల సంఘం ఈ అంశంపై దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని సీఐడీని ఆదేశించింది. ఐవీఆర్ఎస్ కాల్స్, ఇతర ఆధారాలను పరిశీలించి విశ్లేషించిన సీఐడీ దర్యాప్తు అధికారులు ఈ కుట్ర వెనుక చంద్రబాబు, లోకేశ్, టీడీపీ ఎలక్ట్రానిక్ ప్రచార విభాగం కీలక పాత్ర పోషించినట్లు ఆధారాలతో నిగ్గు తేల్చారు.టీడీపీ కార్యాలయానికి నోటీసులుల్యాండ్ టైట్లింగ్ చట్టంపై దుష్ప్రచారం వెనుక చంద్రబాబు, లోకేశ్ తదితర కుట్ర ఉన్నట్లు నిర్ధారణ కావడంతో సీఐడీ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో నిందితులకు నోటీసులు జారీ చేసి విచారించేందుకు సిద్ధమైంది. ఈమేరకు సీఐడీ బృందం ఆదివారం నోటీసులు అందించేందుకు మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లగా ఆ సమయంలో ఎవరూ అందుబాటులో లేరు. పార్టీ ప్రధాన కార్యాలయం వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబుతో సీఐడీ అధికారులు ఫోన్లో మాట్లాడి కార్యాలయ సిబ్బందికి నోటీసులు అందించారు.టీడీపీ ఎలక్ట్రానిక్ ప్రచార విభాగం ప్రతినిధులు సోమవారం సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. ఈ కేసులో ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్‌తోపాటు ఇతర టీడీపీ నేతలను కూడా విచారించాలని సీఐడీ నిర్ణయించింది. ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో ఈ కేసు దర్యాప్తులో సీఐడీ దూకుడు పెంచింది. త్వరలోనే ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం.నేరపూరిత కుట్రే.. నియమావళికి విరుద్ధంకఠిన సెక్షన్ల కింద కేసు నమోదు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై టీడీపీ సాగిస్తున్న దుష్ప్రచారం ఎన్నికల నియమావళి ఉల్లంఘనే కాకుండా నేరపూరిత కుట్రగా సీఐడీ నిర్ధారించింది. ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసి అక్రమంగా ఎన్నికల లబ్ధికి యత్నించడంతోపాటు సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు టీడీపీ కుతంత్రం పన్నినట్టు నిగ్గు తేల్చింది. ఐపీసీ సెక్షన్లు 171(ఎఫ్),(జి), 188, 505(2) రెడ్‌విత్ 120(బి) కింద అభియోగాలు నమోదు చేసింది. 171(ఎఫ్)(జి): ఎన్నికల్లో అసత్య ప్రచారం, అభ్యంతకరమైన రీతిలో ప్రచారం ద్వారా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు కుట్ర పన్నడం. 188: ఎన్నికల కమిషన్ ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం. చట్టాన్ని ఉల్లంఘించి ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు కుట్ర పన్నడం505(2): అసత్య ప్రచారం ద్వారా సమాజంలో వర్గ విభేదాలు రెచ్చగొట్టడం, సామరస్య వాతావరణానికి విఘాతం కల్పించడం, పరస్పర శతృత్వాన్ని ప్రేరేపించడం.120(బి): కుట్రపూరితంగా వ్యవహరించడం, నేరానికి పాల్పడటం.టీడీపీ ఫిర్యాదుపై నివేదిక ఇవ్వండితమ పార్టీపై ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ టీడీపీ చేసిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం మర్నాడే స్పందించింది. ఐవీఆర్ కాల్స్ ద్వారా వైఎస్సార్సీపీ తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై తప్పుడు ప్రచారం చేస్తోందంటూ టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య శనివారం ఫిర్యాదు చేశారు. దీనిపై పరిశీలన జరిపి ఎన్నికల నియమావళి మేరకు తగిన చర్యలు తీసుకొని నివేదిక ఇవ్వాలని సీఐడీని ఆదేశించింది.స్వయంగా లోకేశ్ దుష్ప్రచారం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై దుష్ప్రచార కుట్రను నారా లోకేశ్ స్వయంగా అమలు చేయడం గమనార్హం. చట్టం గురించి అవాస్తవాలు, అభూత కల్పనలతో ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసేలా లోకేశ్ మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ ఐవీఆర్ కాల్స్‌గా ఓటర్ల సెల్ ఫోన్లకు వస్తున్నాయి. టీడీపీ పేరిట వస్తున్న ఈ ఐవీఆర్ఎస్ కాల్స్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈసీ శనివారం ఆదేశించిన నేపథ్యంలో సీఐడీ ఆదివారం ఉదయం కేసు నమోదు చేసింది.అయినా సరే ఆదివారం రాత్రి కూడా లోకేశ్ మాటలతో ఐవీఆర్ కాల్స్ రావడం గమనార్హం. 7313771502 అనే నంబర్ నుంచి లోకేశ్ కాల్ రికార్డింగులు ఓటర్ల సెల్ ఫోన్లకు వచ్చాయి. ఈసీ ఆదేశాలను ఖాతరు చేయకుండా టీడీపీ ఎంతగా బరితెగించిందో స్పష్టమవుతోంది. లోకేశ్‌ను ఏ2గా పేర్కొంటూ దీనిపై ఇప్పటికే కేసు నమోదు కాగా స్వయంగా లోకేశ్ మాట్లాడి రికార్డ్ చేసిన కాల్స్ రావడంతో ఈ కేసులో తీవ్రత మరింత పెరిగింది. -
బూతులు.. దాడులు
సాక్షి, అమరావతి : తీవ్రమైన ఫ్ర్రస్టేషన్ కారణంగా చంద్రబాబు తన పార్టీ శ్రేణులను రెచ్చగొడుతున్నారు. సీఎంను రాళ్లతో కొట్టండి.. అడ్డొచ్చిన వారిని గాజు గ్లాసుతో పొడవండి అంటూ.. పిలుపులిస్తున్నారు. ఈ పిలుపును అందుకుని తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. చంద్రబాబు కుమారుడు లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గం కుంచనపల్లిలో గురువారం ప్రచారంలో ఉన్న వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ గూండాలు మూకుమ్మడి దాడికి దిగారు. ఈ దాడిలో వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్ మేకా వెంకటరెడ్డి మృతి చెందడం కలకలం రేపింది. ఓటమి భయంతో లోకేశ్ హింసా రాజకీయాలకు పాల్పడుతున్నట్లు, చంద్రబాబు వ్యాఖ్యలు అందుకు తోడైనట్లు ఈ ఘటన రుజువు చేసింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోనూ గురువారం టీడీపీ గూండాలు రోడ్‌షో చేస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను చంపేందుకు ప్రయత్నించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య రోడ్‌షోను టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్ర అనుచరులు అడ్డుకునేందుకు ప్రయత్నించి వీరంగం సృష్టించారు. ఈ దాడిలో నలుగురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. శృతిమించిన చంద్రబాబు వ్యాఖ్యలతో దాడులు చంద్రబాబు శృతి మించి చేస్తున్న వ్యాఖ్యలే ఈ దాడులకు కారణమని సొంత పార్టీ నేతలే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎంను రాళ్లతో కొట్టాలని చంద్రబాబు బహిరంగ సభలో చెప్పిన తర్వాతే విజయవాడలో సీఎం వైఎస్ జగన్‌పై రాయితో హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఒకపక్క సీఎం జగన్ తన పాలనలో ప్రతి ఒక్కరికీ చేసిన మేలును వివరిస్తూ మీ ఇంటికి మంచి జరిగిందనుకుంటేనే తనకు ఓటు వేయాలని హుందాగా కోరుతుండగా.. ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం హింసను ప్రేరేపించడాన్ని టీడీపీ నేతలే తప్పుపడుతున్నారు. తమ పార్టీ విధానాలను ప్రస్తావించకుండా వ్యక్తిగత దుర్భాషలకు దిగడం ఎన్నికల వేళ పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘బాబు గారేమిటి ఇలా మాట్లాడుతున్నారు? ఆయనకేమైనా మతి పోయిందా?’ అని అంతర్గతంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఎన్నికలను హింసాత్మకంగా మార్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు కనబడుతోందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దున్నపోతు అంటూ దిగజారుడు మాటలు ఇటీవల రాజధాని ప్రాంతమైన తాడికొండ సభలో ‘ఆ దున్నపోతును మనిషిని ఒక రాయి తీసుకుని ఏది దొరికితే అది తీసుకుని కొట్టండి’ అంటూ చంద్రబాబు రెచ్చగొట్టారు. ముఖ్యమంత్రిని దున్నపోతు అంటూ సంభోదించడం ఏమిటని, ఇలాంటి వ్యాఖ్యలతో రాజకీయ మలి సంధ్యలో చంద్రబాబు మరింత దిగజారిపోతున్నారని టీడీపీ నేతలు వాపోతున్నారు. ఇటీవలే మరో సభలో గాజు గ్లాసు తీసుకుని పొడవాలంటూ సైగలు చేయటాన్ని చూసి పక్కనున్న నేతలే విస్తుపోయారు. ఈ సమయంలో ఆయన హావభావాలు కూడా నీచంగా ఉన్నాయని తప్పుబడుతున్నారు. ప్రతి సభలో సీఎం జగన్‌పై అక్కసుతో కక్ష పూరితంగా మాట్లాడటం పార్టీకి చాలా మైనస్‌గా మారిందని అంటున్నారు. ప్రసంగాల్లో సైకో అని సంభోదిస్తూ గల్లీ లీడర్కంటే దిగజారిపోవటాన్ని ప్రజలు ఎలా సహిస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాబు తీరుతో నష్టపోతున్నాం ఒకవైపు సీఎం జగన్ ప్రసంగాలు హుందాగా, పద్ధతిగా, ప్రజల్లో ఆలోచన రేకెత్తించేలా ఉన్నాయి. చంద్రబాబు మాత్రం ఊకదంపుడు ఉపన్యాసాలు, హింసాత్మక వ్యాఖ్యలతో నిండిపోతున్నాయి. వీటన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని, చంద్రబాబు గ్రాఫ్ బాగా పడిపోవడానికి ఆయన దిగజారుడు మాటలే కారణమని టీడీపీ నేతలు అంటున్నారు. సీఎం జగన్ తన పాలనలో చేసిన మంచి పనులు, సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ, చంద్రబాబు వైఫల్యాలు, పాత మేనిఫెస్టోను చూపించి ఎండగడుతున్నారని, దీనికి సమాధానం చెప్పకుండా చంద్రబాబు అదే పనిగా నోరు పారేసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదని పేర్కొంటున్నారు. సీఎం జగన్ మేనిఫెస్టోలను పోల్చి చూపడం, బాబు మోసాలను వివరిస్తున్న విధానం ప్రజల్లోకి బాగా వెళుతోందనే అభిప్రాయం టీడీపీ నేతల్లో ఉంది. దీనికి కౌంటర్ ఇచ్చే పరిస్థితి తమ పార్టీకి లేకుండా పోయిందని, దానికి తోడు చంద్రబాబు శ్రేణులను రెచ్చగొడుతున్న తీరుతో తాము రాజకీయంగా కోలుకోలేని దెబ్బ తింటున్నామని టీడీపీ సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 40 ఏళ్ల సీనియర్ నాయకుడినని చెప్పుకొనే చంద్రబాబు విజ్ఞత కోల్పోవడం వల్ల ప్రజల్లో బాగా చులకనవుతున్నామని చెబుతున్నారు. -
‘మంగళగిరి’లో టీడీపీ దాష్టీకం
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో గురువారం రాత్రి టీడీపీ వర్గీయులు వీరంగం చేశారు. టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్‌కు, ఆయన అనుచరులకు ఓటమి భయం పట్టుకోవడంతో వైఎస్సార్సీపీ వర్గీయులపై దాడులకు తెగబడ్డారు. నియోజకవర్గంలోని తాడేపల్లి రూరల్ మండలం కుంచనపల్లిలో ఎన్నికల ప్రచారం చేస్తున్న వైఎస్సార్సీపీ వర్గీయులను దుర్భాషలాడటమేగాక ద్విచక్ర వాహనాలతో ఢీకొట్టారు. ఈ దాడిలో ముగ్గురు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వైఎస్సార్సీపీ నేత మేకా వెంకటరెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. స్థానిక సీఎస్ఆర్ రోడ్లో ప్రచారం చేస్తున్న వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను కొందరు దుండగులు అడ్డుకున్నారు. ఇక్కడ ప్రచారం చేయవద్దన్నారు. మద్యం మత్తులో ద్విచక్ర వాహనాలపై వచ్చినవారు.. ఇక్కడ లోకేశ్ గెలవాలంటూ కేకలు వేశారు. టీడీపీకి, లోకేశ్‌కు అనుకూలంగా, వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ప్రచారం చేస్తున్న వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్ మేకా వెంకటరెడ్డి, జేసీఎస్ కన్వీనర్ కృష్ణారెడ్డి తదితరుల చుట్టూ ద్విచక్ర వాహనాలను తిప్పారు. వీరిని పట్టించుకోకుండా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, ఆ ప్రాంతంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ ప్రచారం కొనసాగించారు. ఈ క్రమంలో ఓ యువకుడు ద్విచక్ర వాహనంపై వచ్చి బూతులు తిడుతూ ఎన్నిసార్లు చెప్పాలిరా ప్రచారం చేయవద్దని అని అంటూ దురుసుగా ప్రవర్తించాడు. జేసీఎస్ కన్వీనర్ కృష్ణారెడ్డి కలగజేసుకుని ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మనడంతో అతడిపై దాడిచేశారు. అంతలో మరో ఐదుగురు యువకులు ద్విచక్ర వాహనాలపై వచ్చారు. వారిలో ఒక యువకుడు మోటారు సైకిల్‌తో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను ఢీకొట్టాడు. ముగ్గురు వైఎస్సార్సీపీ నాయకులు, బూత్ కన్వీనర్లు రోడ్డుపై పడిపోయారు. కుంచనపల్లికి చెందిన బూత్ కన్వీనర్ మేకా వెంకటరెడ్డిని మరోసారి ద్విచక్రవాహనంతో ఢీకొట్టడంతో ఆయన కిందపడిపోయారు. తలకు తీవ్రంగా గాయమైంది. వచ్చిన ఆరుగురిలో ఇద్దరు యువకులు రోడ్డుపై రక్తపుగాయాలతో ఉన్న మేకా వెంకటరెడ్డిని కాళ్లతో తన్నారు. వెంకటరెడ్డిని కొడుతుంటే ఆపేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడిచేసి కొట్టి ద్విచక్ర వాహనాలపై పరారయ్యారు. ద్విచక్ర వాహనంపై పారిపోతున్న వారిలో ఒక యువకుడిని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పట్టుకున్నారు. అది గమనించిన టీడీపీ కార్యకర్తలు ద్విచక్రవాహనాలపై వెనక్కివచ్చి పట్టుకున్న వారిని ఢీకొట్టేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో పట్టుబడిన వ్యక్తి విడిపించుకుని పరారయ్యాడు. తలకు తీవ్ర గాయమై కోమాలోకి వెళ్లిన వెంకటరెడ్డిని తాడేపల్లి పట్టణ పరిధిలోని మణిపాల్ ఆస్పత్రిలో చేర్చారు. అతడికి వైద్యులు శస్త్రచికిత్స చేస్తున్నారు. ఈ విషయం తెలిసి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. వైద్యులను అడిగి వెంకటరెడ్డి పరిస్థితి తెలుసుకున్నారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని, 24 గంటలు గడిస్తే తప్ప చెప్పలేమని వైద్యులు తెలిపారు. బయటి నుంచి దించారు ఓటమి భయంతో ఉన్న టీడీపీ నేతలు ఇప్పటికే బయట ప్రాంతాల నుంచి పలువురిని తీసుకొచ్చారు. కొందరు స్థానికులు, బయట నుంచి వచ్చినవారు కలిసి ఈ దాడికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దుండగులు వచ్చిన ద్విచక్ర వాహనాల్లో ఒకటి ఏపీ 39 ఎఫ్వై 2192 నంబరుతో ఉంది. ఇది విశాఖ అడ్రస్‌తో ఉందని తెలిసింది. ఈ సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షుడు బుర్రముక్కు వేణుగోపాలసోమిరెడ్డి మాట్లాడుతూ టీడీపీ అభ్యర్థి లోకేశ్ నియోజకవర్గంలో ప్రచారం చేసే సమయంలో వారి కార్యకర్తలను రెచ్చగొడుతూ ప్రసంగించారని, ఎవరూ ఎక్కడా తగ్గవద్దు.. నేను చూసుకుంటానంటూ చెప్పారని గుర్తుచేశారు. లోకేశ్ అలా మాట్లాడబట్టే ఆ పార్టీ వారు ఇలా దాడులు చేస్తున్నారని చెప్పారు. -
ఓం భూం స్వాహా!
‘నా పరిశీలనకు వచ్చిన, తెలియవచ్చిన విషయాల్ని ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అని చెబుతూ 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం కుర్చిలో కూర్చున్నాక.. కుట్రలు చేయడంలో, నమ్మిన ప్రజల్ని మోసగించడంలో సిద్ధ హస్తుడైనచంద్రబాబు ఆ ప్రమాణాన్ని నిస్సిగ్గుగా ఉల్లంఘించారు. అత్యంత కీలకమైన రాజధాని రహస్యాన్ని ఎల్లో గ్యాంగ్‌కు లీక్ చేసి సీఎం పదవికే కళంకం తెచ్చారు. అంతర్జాతీయ రాజధాని అంటూ ప్రధానితో పాటు ప్రముఖుల్ని పిలిచి హడావుడి చేసినప్పుడు.. బాబు కుట్రల్ని జనం పసిగట్టలేకపోయారు. ఇదంతా పేదల అసైన్డ్ భూముల స్వాహాకు, ఇన్సైడర్ ట్రేడింగ్ కోసం చంద్రబాబు వేసిన ఎత్తులు, జిత్తులని అప్పుడు వారికి తెలియలేదు. ‘రాజధాని ఫైల్స్’ డ్రామాలో పేద రైతుల అసైన్డ్ భూములను బెదిరించి బినామీల రూపంలోసొంతం చేసుకుని కథ నడిపించారు. ఎవరికీ చెందని ప్రభుత్వ అసైన్డ్ భూములు తమ వారివే అంటూ రికార్డులు సృష్టించి స్వాహా చేశారు. తన పని పూర్తయ్యాక.. గ్రాఫిక్స్ రాజధాని కట్టలేక చేత్తులేత్తేసి ఎన్నికల ముందు కొత్త డ్రామాలు అందుకున్నారు. ఈ డ్రామాలో బాబు బృందంలోనిమంత్రులు, ఎమ్మెల్యేలు...ఆయనకు ఆప్తులు అందరూ పాత్రధారులే.. ‘చేసేది నువ్వు.. చేయించేది నేను..’ రాజధాని ఫైల్స్‌లో చంద్రబాబు డైలాగ్ ఇదే. తెరముందు రాజధాని రూపశిల్పి.. తెరవెనుక రాజధాని లీక్స్ సూత్రధారి. అసలు సూత్రధారులు చంద్రబాబు, లోకేశ్ కాగా.. పాత్రధారులు నారాయణ, లింగమనేని రమేష్, ప్రత్తిపాటి పుల్లారావు, సుజనా చౌదరి, వేమూరి రవికుమార్, మాగంటి మురళీ మోహన్, కొమ్మాలపాటి శ్రీధర్, ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్, బాలకృష్ణ వియ్యంకుడు ఎంఎస్పీ రామారావు ఇలా 1,336 మంది బినామీలున్నారు. అసైన్డ్ భూముల దోపిడీ, ఇన్సైడర్ ట్రేడింగ్‌తో రూ.లక్షల కోట్ల భూ దందాకు తెగించారు. అసైన్డ్ దోపిడీ, ఇన్సైడర్ ట్రేడింగ్‌లో 1,336 మంది బినామీ ‘బాబు’ల బాగోతం సాక్షి, అమరావతి : అమరావతి భూదోపిడీకి కర్త, కర్మ, క్రియ చంద్రబాబే. అసైన్డ్ భూములు, ప్రైవేటు భూములు, క్విడ్ ప్రోకో భూములు, బంగ్లాలు.. ఇలా ఒకటేమిటి.. చంద్రబాబు అక్రమ సామ్రాజ్యంలో అన్నీ భాగమే. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో అక్రమాలతో క్విడ్ ప్రోకో ద్వారా చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్‌కు 14 ఎకరాలు దక్కాయి. కృష్ణానది కరకట్ట మీద ఉన్న లింగమనేని బంగ్లా ఆయన పరమైంది. ఎస్సీ, ఎస్టీ, రైతులను భయపెట్టి బినామీల పేరిట కొల్లగొట్టిన వందలాది ఎకరాలు చంద్రబాబు ఖాతాలోకే వెళ్లాయి. సింగపూర్ కంపెనీ పేరిట స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులోని భూముల అసలు హక్కుదారూ చంద్రబాబు కుటుంబమే. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌కు ఇరువైపులా, అమరావతి సీడ్ క్యాపిటల్ పరిధి దాటి బినామీల పేరిట కొనుగోలు చేసిన దాదాపు 5 వేల ఎకరాల అసలు యజమాని చంద్రబాబు కుటుంబమే. చినబాబుది పెద్ద వాటానే అమరావతి భూ కుంభకోణంలో లోకేశ్‌ది పెద్ద వాటానే. తన బినామీ, ఎన్నారై వ్యవహారాల సలహాదారుగా వ్యవహరించిన వేమూరి రవికుమార్‌తో పాటు మరికొందరు బినామీల పేరిట వేలాది ఎకరాలు దక్కించుకున్నారు. వేమూరి రవికుమార్‌తోపాటు ఆయన భార్య అనూరాధ గోష్పాది గ్రీన్‌ఫీల్డ్స్ పేరిట అమరావతిలోని కోర్ క్యాపిటల్ ప్రాంతంలోనే 500 ఎకరాలకుపైగా స్వాహా చేశారు. అవినీతి తిమింగలం లింగమనేని అమరావతిలో అవినీతి తిమింగలం లింగమనేని రమేశ్. చంద్రబాబు భూ దోపిడీలో ఇతనూ ఒక ప్రధాన పాత్రధారి. ఆయన కుటుంబానికి చెందిన 355 ఎకరాలను ఆనుకునే ఇన్నర్ రింగ్ రోడ్డు నిరి్మంచేలా అలైన్మెంట్ ఖరారు చేశారు. తన కుటుంబ సభ్యులు, బినామీల పేరిట కొనుగోలు చేసిన వందలాది ఎకరాలను భూ సమీకరణ ప్రక్రియ నుంచి తప్పించారు. అమరావతిలో దాదాపు వెయ్యికి పైగా ఎకరాలు లింగమనేని హస్తగతం చేసుకున్నారు. నారాయణ తంత్రం.. సుజనా, ప్రత్తిపాటి భూదందా చంద్రబాబు తరువాత అమరావతి భూ దోపిడీలో రెండో పెద్ద దోపిడీదారు నారాయణ. లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కో లో ప్రధాన పాత్రధారు. కృష్ణా నదికి ఇటువైపు.. అటువైపు, కృష్ణా జిల్లా పరిధిలో ఇన్నర్ రింగ్‌రోడ్ అలైన్‌మెంట్‌కు దగ్గరలో వేలాది ఎకరాలు కొనుగోలు చేశారు. అక్కడ నారాయణ విద్యా సంస్థల భూములు ఉన్నాయి. రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా తన ఉద్యోగులను బినామీలుగా చేసి 162 ఎకరాల అసైన్డ్ భూములను హస్తగతం చేసుకున్నారు. అసైన్డ్, ప్రైవేటు భూములు కలిపి దాదాపు 3 వేల ఎకరాల వరకు బినామీల పేరిట గుప్పిట పట్టారు. నారాయణ బినామీ కంపెనీ రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్‌ది అమరావతి భూ కుంభకోణంలో కీలక పాత్ర. అసైన్డ్ భూముల దోపిడీలో ఆ కంపెనీ ఎండీ అంజనీకుమార్ కీలకంగా వ్యవహరించారు. అమరావతిలో దాదాపు 2 వేల ఎకరాలను బినామీలు, ఉద్యోగుల పేరిట రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ కొల్లగొట్టింది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు సుజనా చౌదరి అమరావతి భూ దోపిడీలో అతిపెద్ద వాటాదారు. ఆయన తన కుటుంబ సభ్యులు, బినామీల పేరిట ఏకంగా 700 ఎకరాల వరకు కొల్లగొట్టారు. అమరావతి భూదోపిడీలో బినామీల పేరిట అసైన్డ్ భూములతో సహా 196 ఎకరాలు దోచుకున్నారు. -
ఆ రాయి ప్రజల గుండెలపై పడినట్లే..
సత్తెనపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విజయవాడ నడిబొడ్డున జరిగిన హత్యాయత్నంతో రాష్ట్రం నివ్వెరపోయిందని, ఆయనపై విసిరిన రాయి తెలుగుప్రజల గుండెలపై పడినట్లేనని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని వైఎస్సార్సీపీ నియోజకవర్గ కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్‌పై దాడి జరిగి ఆయన నుదిటికి బలమైన గాయం తగిలితే.. ఇది ఎన్నికల ముందు సింపతీ కోసం డ్రామా అని చంద్రబాబు, లోకేశ్, పవన్‌కళ్యాణ్ విమర్శించడాన్ని ఖండించారు. దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లోకెల్లా అత్యంత ప్రజాదరణ, ప్రజాబలం ఉన్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని చెప్పారు. ఆయనకు సింపతీ అవసరమేంటని ప్రశ్నించారు. జగన్ అధికారంలో ఉన్నంతకాలం ఆర్థికంగా దెబ్బతినిపోతామని భావించి చంద్రబాబు వర్గీయులు తమ నాయకుడిపై కక్షగట్టి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. 175 స్థానాల్లో గెలుస్తామనే ప్రగాఢమైన విశ్వాసం తమకుందని చెప్పారు. కూటమి పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఎద్దేవా చేశారు. జగన్‌కు వస్తున్న ప్రజాదరణను చూసి ఆయన్ని హత్యచేయడానికి చంద్రబాబు కుట్ర చేస్తున్నాడనేది వాస్తవమన్నారు. చంద్రబాబునాయుడు అధికారం లేకుంటే సహించలేడని, బతకలేడని చెప్పారు. తాను కలలుగనే అధికారం దక్కడం లేదనే కక్షతో, ఈర్షితో కుట్రలు, దారుణాలకు ఒడిగడుతున్నాడని ధ్వజమెత్తారు. హింసను ప్రోత్సహిస్తూ కుట్రలు పన్నుతున్నాడన్నారు. ఈసారి తమ నాయకుడిపై రాయిగానీ, మరొకటేదైనా పడితే రాష్ట్ర ప్రజలు చంద్రబాబును క్షమించరని చెప్పారు. రాష్ట్రంలో 175 స్థానాల్లో 151 గెల్చుకుని అధికారంలోకొచి్చన ప్రజాదరణ గలిగిన తెలుగు నాయకుడు జగన్‌కు గాయం అయితే తెలుగుప్రజలకు గాయమైనట్లు కాదా.. అని ప్రశ్నించారు. జనసేన అభ్యర్థి మనోహర్ గెలిస్తే తెనాలి సర్వనాశనమేనన్నారు. రాజకీయ పరిజ్ఞానం లేని తిక్కలోడు పవన్‌కళ్యాణ్ అని ఎద్దేవా చేశారు. పవన్ ప్రసంగాలన్నీ బూతులేనన్నారు. బూతులు మాట్లాడే నేతల్ని పిఠాపురం ప్రజలు శాసనసభకు ఎందుకు పంపుతారని ప్రశ్నించారు. ఏది నాటకమో, ఏది నిజమో ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారన్నారు. కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్న పవన్, చంద్రబాబుకు ఎన్నికల కౌంటింగ్ తర్వాత రాజకీయ సమాధి తప్పదని జోస్యం చెప్పారు. -
టీడీపీ హత్యా రాజకీయాలపై.. ఎగసిన నిరసన
సాక్షి, అమరావతి/నెట్వర్క్ : సీఎం వైఎస్ జగన్‌పై హత్యాయత్నానికి తెగబడటాన్ని నిరసిస్తూ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. స్కూలు పిల్లల నుంచి వృద్ధులు, అభిమానులు, మహిళలు, పార్టీ నేతలు పెద్దఎత్తున నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీలు నిర్వహించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్, జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ పోద్బలంతోనే ఈ హత్యాయత్నం జరిగిందని మండిపడ్డారు. ప్రజాక్షేత్రంలో జగన్‌ను ఎదుర్కోలేక.. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు వస్తున్న ప్రజాస్పందనను చూసి ఓర్వలేక.. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించడం ఖాయమనే అక్కసుతోనే సీఎంపై హత్యాయత్నానికి పురిగొలిపారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అనేకచోట్ల చంద్రబాబు దిష్టిబొమ్మలను దగ్థం చేశారు. ఇందులో భాగంగా.. సీఎంపై హత్యాయత్నాన్ని ఖండిస్తూ ఆదివారం తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెంలో హోంమంత్రి తానేటి వనిత నేతృత్వంలో పార్టీ శ్రేణులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రిని రాజకీయంగా ఎదుర్కోలేకే దాడిచేయడం బాధాకరమని మంత్రి అన్నారు. దండకున్న తీగ గుచ్చుకుని గాయమైనట్లు కొంతమంది వక్రీకరిస్తున్నారని.. తీగ గుచ్చుకుని గాయమైతే వెనుకనున్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌కు ఎలా గాయమైందని ప్రశ్నించారు. ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే కార్యాలయం వద్ద జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి, నాయకులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కుక్కునూరు మండలం కివ్వాక గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. భీమడోలు మండలం కోడేరుపాడు గ్రామంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం మర్రితిప్ప వద్ద చీఫ్ విప్, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కాకినాడ రూరల్ మండలంలో పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ప్రత్తిపాడులో ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, పెద్దాపురం నియోజకవర్గ అభ్యర్థి దవులూరి దొరబాబు సామర్లకోటలో, పి.గన్నవరంలో జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే అభ్యర్థి వేణుగోపాలరావు, జగ్గంపేట, తునిలో పార్టీ శ్రేణులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. హత్యాయత్నానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. జగన్‌ను టచ్ చేశారు పుట్టగతులుండవు : మంత్రి ‘కొట్టు’ సీఎం జగన్‌ని దాడి ద్వారా టచ్ చేశారు, ఈ కుట్రకు పాల్పడిన వారికి పుట్టగతులుండవని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ హెచ్చరించారు. తాడేపల్లిగూడెంలో ఆయన నల్లరిబ్బన్లు ధరించి విలేకరులతో మాట్లాడారు. సీఎం జగన్‌ను ఎదుర్కోలేక పిరికిపంద చర్యలకు పాల్పతున్నారన్నారు. ఆయనకు వస్తున్న జనాదరణను తట్టుకోలేక ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇక సీఎంపై దాడి ముమ్మాటికీ చంద్రబాబు పనేనని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తణుకులో ఆరోపించారు. పేదలకు సంక్షేమం, విద్య, వైద్యం ఉచితంగా అందిస్తున్నందుకు జగన్‌పై దాడులు చేయిస్తావా చంద్రబాబూ అని నిలదీశారు. వంగవీటి రంగాను అత్యంత కిరాతకంగా చంద్రబాబు అంతమొందించాడని, నేడు అదే కోవలో ప్రయత్నాలు చేస్తున్నాడని మండిపడ్డారు. విజయనగరంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, జామి మండలంలోని పీతలపాలెంలో ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, పార్వతీపురం మన్యం జిల్లాలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి, పాలకొండలో ఎమ్మెల్యే కళావతి నల్లబ్యాడ్జీలు ధరించి శాంతియుతంగా నిరసన తెలిపారు. సీఎంపై జరిగిన దాడి అమానుషమని, ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు హేయమైనవని కోలగట్ల అన్నారు. సీఎం జగన్‌పై జరిగిన దాడికి నిరసనగా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో స్పీకర్ తమ్మినేని సీతారాం, నరసన్నపేటలో ధర్మాన కృష్ణదాస్‌లు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. సోంపేటలో జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, కొత్తూరులో ఎమ్మెల్యే రెడ్డిశాంతి నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. చంద్రబాబు కేడర్‌ను రెచ్చగొడుతున్నారు ఇక సీఎం జగన్‌పై దాడికి నిరసనగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్దఎత్తున నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. ఒంగోలులో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, మేయర్ గంగాడ సుజాత.. సింగరాయకొండలో మంత్రి ఆదిమూలపు సురేష్, చీమకుర్తిలో మంత్రి మేరుగ నాగార్జున, కంభంలో ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి, మార్కాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు, కనిగిరిలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్ నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. చంద్రబాబు పదేపదే తన కేడర్‌ను రెచ్చగొడుతున్నారని, ఇది హేయమైన చర్య అని బాలినేని, ఆదిమూలపు, మేరుగ నాగార్జున ఆరోపించారు. చీరాల, అద్దంకి, పర్చూరు, అధికార పార్టీ అభ్యర్థులు కరణం వెంకటేష్, పానెం హనిమిరెడ్డి, ఎడం బాలాజీ, వేమూరు అభ్యర్థి వరికూటి అశోక్‌బాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఎంపీ మోపిదేవి వెంకటరమణ, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, రేపల్లె అభ్యర్థి ఈవూరి గణేష్‌లు ముఖ్యమంత్రిపై జరిగిన దాడిని ఖండించారు. ఉమ్మడి విశాఖలో ఆగ్రహ జ్వాలలు.. ఉమ్మడి విశాఖ జిల్లా మర్రిపాలెంలో వైఎస్సార్సీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి ఆడారి ఆనంద్‌కుమార్, ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో, మానవహారం నిర్వహించారు. మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. ఎండాడలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, మేయర్ గొలగాని హరివెంకట కుమారి, ఎమ్మెల్సీ రవీంద్రబాబు ఆధ్వర్యంలో మౌన దీక్ష నిర్వహించగా.. విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. గాజువాకలో మంత్రి అమర్నాథ్ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. చంద్రబాబు నీచరాజకీయాలు చెల్లవని.. ఇలాంటి దాడులను తాము సహించబోమన్నారు. అనకాపల్లి జిల్లా మునగపాకలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యంలో రాస్తారోకో, మానవహారం నిర్వహించారు. పాయకరావుపేటలో ఎమ్మెల్యే అభ్యర్థి, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, పార్టీ శ్రేణులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల వ్యాప్తంగా.. జగ్గయ్యపేటలో ఎమ్మెల్యే, విప్ సామినేని ఉదయభాను, తిరువూరులో ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాసు, మైలవరంలో ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు యాదవ్, విజయవాడ పశ్చిమంలో ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్, సెంట్రల్ నియోజకవర్గంలో డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ, కార్పొరేటర్లు, విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఇక మచిలీపట్నం, అవనిగడ్డ, గన్నవరం, గుడివాడ, పామర్రు, పెడన, పెనమలూరు నియోజకవర్గాలోనూ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పెనమలూరు మండలం గంగూరులో మంత్రి జోగి రమేష్, పామర్రులో ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. గుంటూరులో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో.. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా, ఇక్కడి ప్రస్తుత అభ్యర్ధి షేక్ నూరిఫాతిమా ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. పొన్నూరులో ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ, గుంటూరులో ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, మచిలీపట్నం పోర్టు ట్రస్టు ఎండీ మేకతోటి దయాసాగర్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే అభ్యర్థి బలసాని కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇతర మండలాల్లోనూ నల్లబ్యాడ్జీలతో నిరసనలు చేశారు. అలాగే, సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు నాయకత్వంలో నల్లకండువాలు ధరించి ర్యాలీ నిర్వహించారు. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నరసరావుపేటలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అమరావతిలో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు రాస్తారోకోలు, కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. రొంపిచర్ల, వినుకొండలోనూ ఆందోళనలు చేశారు. ఇది ముమ్మాటికీ కూటమి కుట్రే ఇదిలా ఉంటే.. సీఎంపై హత్యాయత్నం ముమ్మాటికీ ప్రతిపక్ష పార్టీల కుట్రేనని తుడా చైర్మన్, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఆరోపించారు. చంద్రగిరిలో ఆయన కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఇందులో పాల్గొన్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సతీమణి లక్ష్మి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి కూడా హాజరయ్యారు. అలాగే, హత్యాయత్నాన్ని ఖండిస్తూ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్, మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ ఆధ్వర్యంలో తిరుపతిలో నల్ల కండువాలు, నల్లబ్యాడ్జీలు ధరించి పెద్దఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. జగనన్నకు హాని జరిగితే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయని వారన్నారు. ఇక అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరులో ప్రభుత్వవిప్ కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. సీఎంపై హత్యాయత్నం వెనుక కుట్రకోణం ఉందన్నారు. వైఎస్సార్ జిల్లా వేంపల్లెలో శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీ‹Ùకుమార్‌రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు నల్లబ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు. మరోవైపు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలు కూడా తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆదివారం రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ, తాడిపత్రి, శింగనమల, గుంతకల్లు, అనంతపురం, రాప్తాడు నియోజకవర్గాల్లో భారీఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అలాగే శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి, ధర్మవరం, కదిరి, హిందూపురం, మడకశిర, పెనుకొండ నియోజకవర్గాల్లోనూ నిరసనలు జరిగాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు ధరించి శాంతియుత ఆందోళనలు జరిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనూ జనాగ్రహం పెల్లుబికింది. ఆత్మకూరు పట్టణంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి ఆధ్వర్యంలో.. ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నల్లరిబ్బన్లను ధరించి నిరసన వ్యక్తంచేశారు. నెల్లూరు నగరంలోనూ నిరసన ర్యాలీలను నిర్వహించారు. -
తెలుగుదేశందే కుట్ర
ప్రజాదరణ చూసి ఓర్వలేకే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం వెనుక కుట్ర ఉంది. అందుకు టీడీపీ నాయకుడు లోకేశ్ వ్యాఖ్యలే నిదర్శనం. లోకేశ్ ట్విటర్లో 2019లో కోడికత్తి, 2024లో రాయిదాడి అని పెట్టారు. లోకేశ్ వ్యాఖ్యలను గమనిస్తే ఈ హత్యాయత్నం వెనుక టీడీపీ కుట్ర ఉందని తెలుస్తోంది. ప్రజాదరణను చూసి ఓర్వలేక సీఎం వైఎస్ జగన్‌పై ఈ దారుణానికి పాల్పడ్డారు. సిద్ధం సభలు, బస్సుయాత్రలో సీఎం వైఎస్ జగన్‌కు వస్తున్న ప్రజాదరణ ప్రతిపక్షాలకు మింగుడుపడడంలేదు. చంద్రబాబు, లోకేశ్, పవన్‌కళ్యాణ్, పురందేశ్వరి అంతా నైరాశ్యంలో ఉన్నారు. బస్సుయాత్రకు వస్తున్న స్పందన చూసి కూటమి నేతలు కుట్రకు తెరతీశారు. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రి కడుపుమంటతోనే దారుణానికి ఒడిగట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహిస్తున్న బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతుండటంతో.. ఎలాగైనా దాన్ని ఆపాలనే కుట్రతోనే ఈ హత్యాయత్నం చేశారు. కూటమి నేతల సభలు జనం లేక వెలవెలబోతున్నాయి. కదిలి రా అని ఎంత పిలిచినా జనం కదలడం లేదు. ఇదే సమయంలో వైఎస్ జగన్‌కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కడుపుమంటతో ఈ దారుణానికి పాల్పడ్డారు. ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేయడం బాబుకు కొత్త కాదు. – ఎస్బి అంజద్‌బాషా, ఉప ముఖ్యమంత్రి సీఎం జగన్‌పై హత్యాయత్నం చేసింది టీడీపీ గూండాలే.. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పేందుకు మేమంతా సిద్ధం బస్సుయాత్ర ద్వారా ప్రజల్లోకి వస్తుంటే చూసి ఓర్వలేక తెలుగుదేశం పార్టీ గూండాలే ఆయనపై హత్యాయత్నం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్ని కూటములు కట్టినా ప్రజాగళంçసభలు వెలవెలబోతున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియక నిరాశ, నిస్పృహలతో టీడీపీ గుండాలు ఈ అరాచకానికి పాల్పడ్డారు. ఇటువంటి వాటితో జగన్ మనోధైర్యాన్ని దెబ్బతీయలేరు. – విశ్వరూప్, రవాణాశాఖ మంత్రి ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలి సీఎం జగన్మోహన్రెడ్డిపై విజయవాడలో జరిగిన హత్యాయత్నాన్ని ప్రజాస్వామ్యవాదులందరూ తీవ్రంగా ఖండించాలి. ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పనిచేసే పాలకులపై దాడులు చేయించే విషసంస్కృతిని ప్రతిపక్షాలు పెంచి పోషిస్తున్నాయి. ప్రజల్లో అత్యంత విశ్వాసం కలిగిన నాయకుడు జగన్మోహన్రెడ్డి బస్సుయాత్రలో ప్రజలు సంద్రం మాదిరిగా ఆయన వెంట రావడం చూసి ఓర్వలేక ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఆ వస్తువు కొంచెం కిందకు తగిలితే సీఎం జగన్ కన్ను దెబ్బతినేది. దీనిపై విజ్ఞులైన ప్రజలందరూ ఆలోచించాలి. – చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణ, బీసీ సంక్షేమశాఖ మంత్రి హింసను ప్రేరేపిస్తున్న బాబు సీఎం జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం వెనుక చంద్రబాబు కుట్ర ఉంది. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్మోహన్రెడ్డిపై కత్తితో దాడి జరిగింది. అబద్ధాలు చెప్పడం, హింసను ప్రేరేపించడం, అధర్మాన్ని పాటించడం ద్వారా మరోసారి అధికారంలోకి రావచ్చని చంద్రబాబు భ్రమిస్తున్నారు. ఆయన ఇప్పటికీ గుణపాఠాలను నేర్చుకోకపోవడం శోచనీయం. – విజయసాయిరెడ్డి, ఎంపీ, వైఎస్సార్సీపీ నెల్లూరు లోక్‌సభ అభ్యర్థి ఎన్నికల కమిషన్ సత్వర చర్యలు తీసుకోవాలి సీఎం జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై ఎన్నికల కమిషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలి. హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలి. 15 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం చేస్తున్న జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణను చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు. 2019 ఎన్నికల ముందు జగన్‌పై టీడీపీ అభిమాని విశాఖ ఎయిర్‌పోర్టులో కత్తితో దాడిచేశాడు. – వై.వి.సుబ్బారెడ్డి, ఎంపీ, వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ ప్రతిపక్షాల ప్రకటనలు దారుణం సంక్షేమ పథకాలతో పేదల గుండెల్లో నిలుస్తూ, ప్రజాభిమానంతో అప్రతిహతంగా సాగుతున్న బస్సుయాత్రలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే ఆయనపై హత్యాయత్నం చేశారు. ఇది రాజకీయ కుట్రే. ఈ హత్యాయత్నంపై ప్రతిపక్షాల ప్రకటనలు దారుణం. అధికారుల వైఫల్యం అనటం అర్థంలేని మాట. సమగ్రంగా విచారించి దోషులను పట్టుకున్న తరువాత వారికి ప్రతిపక్షాలు మద్దతుగా నిలవకుండా ఉండాలి. అప్పుడే ఇటువంటి చర్యలు పునరావృతం కావు. – పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎంపీ, వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ సీఎం జగన్ జోలికి వస్తే అంతు చూస్తాం పోరాటాలతో పుట్టిన వైఎస్సార్సీపీకి యుద్ధం కొత్త కాదు. ఇటువంటి ఉడత బెదిరింపులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భయపడరు. జగనన్న జోలికి వస్తే అంతు చూస్తాం. ప్రజాగ్రహంలో ప్రతిపక్షాలు కొట్టుకుపోతాయి. రాజకీయాల్లో సింహలా గర్జిస్తూ ముందుకు సాగుతున్న సీఎం జగనన్నను చూసి తట్టుకోలేక ఆయనపై టీడీపీ హత్యాయత్నం చేయించింది. నేను తలుచుకుంటే నువ్వు ఏమై పోతావో జగన్.. అంటూ ఇటీవల చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యల అంతరార్థం ఇదేనేమో. ఇటువంటి దుర్మార్గులకు అధికారం దక్కకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. – విడదల రజిని, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి -
పథకం ప్రకారమే హత్యాయత్నం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను అంతమొందించడమే లక్ష్యంగా పక్కా పథకం ప్రకారం హత్యాయత్నం చేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఈ ఘటనలో క్యాటర్ బాల్ కంటే శక్తివంతమైన ఆయుధాన్ని వాడి ఉండొచ్చన్నారు. గురి తప్పకుండా కాల్చగల షార్ప్ షూటర్లే ఇలాంటి పనులు చేస్తారని చెప్పారు. ఎవరో శక్తివంతమైన వ్యక్తుల మద్దతు లేకుండా ఆగంతకులు ఈ పనిచేయరన్నారు. ఈ దారుణ ఘటనలో అదృష్టం బాగుండి సీఎం జగన్ బయటపడ్డారని తెలిపారు. తాము అనుకున్నది జరగలేదు కాబట్టే టీడీపీ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఇంతటి దుర్ఘటనను కూడా ఆ పార్టీ డ్రామాగా కొట్టిపారేయడం దారుణమన్నారు. ఎవరైనా తమ సునిశిత శరీర భాగంలో దాడి చేయించుకుంటారా అని నిలదీశారు. చంద్రబాబును చేయించుకోమనండి చూద్దామన్నారు. ఈ మేరకు ఆదివారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్‌పై దాడి చేయాలని టీడీపీ శ్రేణులను రెచ్చగొడుతూ చంద్రబాబు చేసిన పలు ప్రసంగాల వీడియో క్లిప్పులను మీడియాకు ప్రదర్శించారు. సజ్జల ఇంకా ఏమన్నారంటే.. చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే.. సీఎం జగన్‌పై దాడిని దేశవ్యాప్తంగా పలు పార్టీల నేతలు ముక్తకంఠంతో ఖండించారు. ఇక్కడ చంద్రబాబు ఖండించినా.. ఆయన తనయుడు లోకేశ్, టీడీపీ నేతలు డ్రామా అంటూ హేళన చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. అసలు వీళ్లు మనుషులేనా అని అనిపిస్తోంది.. రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు జనం ప్రభంజనంలా తరలివస్తున్నారు. ఇది చూసి తట్టుకోలేక చంద్రబాబు రగిలిపోతున్నారు. ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో దూషిస్తూ ఉక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు. రెండు రోజుల క్రితం కూడా ‘రాళ్లతో కొట్టి, ఫ్యాన్ గుర్తు లేకుండా చేయండి.. జగన్‌ను మసి చేయండి.. టీడీపీ మీతో ఉంటుంది’ అని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. దీన్నిబట్టి సీఎం జగన్‌పై ఆయన హత్యాయత్నానికి పురిగొలిపినట్టనిపిస్తోంది. ఇవన్నీ ఎన్నికల సంఘానికి నివేదించి.. దాడులకు పురిగొలిపేలా చంద్రబాబు వ్యాఖ్యలు చేయడాన్ని తక్షణం అడ్డుకోవాలని కోరాం. గతంలో చంద్రబాబు అలిపిరి ఘటనను తానే చేసుకుని, సానుభూతి పొంది ఎన్నికలకు వెళ్లాలని చూశారా?.. నాడు చంద్రబాబు విషయంలో ఇలాంటి చిల్లర మాటలు ఎవరూ మాట్లాడలేదు. ఇప్పుడు సీఎం జగన్‌ను అనడానికి నోరెలా వస్తుంది? గతకొద్ది రోజులుగా చంద్రబాబు నిరాశ, నిస్పృహలతో సీఎం జగన్‌పై విద్వేషపూరిత, రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు. దీనివల్లే విజయవాడ సింగ్‌నగర్‌లో సీఎం జగన్‌పై ‘ప్రీమెడిటేటెడ్ కోల్డ్ బ్లడెడ్ అటెంప్ట్’ జరిగింది. ఇది రాష్ట్రం మొత్తాన్ని కుదిపేసింది. అంతా షాక్‌కు గురయ్యారు. ఆగంతకుడు విసిరిన పదునైన వస్తువు తగిలి సీఎం జగన్‌కు ఎడమ కనుబొమ పైభాగాన తీవ్ర గాయమైంది. అదే కొంచెం కింద తగిలి ఉంటే కంటి చూపే పోయేది. కణతకు తగిలితే ప్రాణానికే ప్రమాదం జరిగేది. అదృష్టం బాగుండి సీఎం జగన్ బయటపడ్డారు. బురదజల్లడమే టీడీపీ, జనసేన పని.. ప్రభుత్వంపై టీడీపీ, జనసేన బురదజల్లడమే పనిగా పెట్టుకున్నాయి. ముఖ్యమంత్రిపై హత్యాయత్నం జరిగితే దానికి కూడా వక్రభాష్యం చెబుతున్నాయి. ఎన్నికలు కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి రోజువారీ కార్యకలాపాల నుంచి ప్రభుత్వం దూరం జరిగింది. చంద్రబాబులా మేమెప్పుడూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని బెదిరించి, దబాయించ లేదు. ఇలాంటప్పుడు ఎవరినీ ప్రభావితం చేసి, ప్రలోభపెట్టే అవకాశమే లేదు. రాత్రి 8 గంటల సమయంలో సీఎం జగన్‌పై హత్యాయత్నం జరిగితే.. గంటన్నర తర్వాత ఫొటోలు బయటకు ఇచ్చాం. ఇది ఆకతాయిల పనికాదని గాయం తీవ్రత చూశాకే తెలిసింది. షార్ప్ షూటర్లతోనే ఇలాంటివి సాధ్యం.. సీఎం జగన్‌పై జరిగిన హత్యాయత్నానికి సంబంధించి పదునైన వస్తువును చేతితో విసరడం, క్యాటర్ బాల్ వాడటం కంటే మరేదో శక్తివంతమైన ఆయుధాన్ని ఉపయోగించి ఉండొచ్చు. సీఎంను అంతమొందించే కుట్రతోనే కణతను లక్ష్యంగా చేసుకుని పదునైన వస్తువుతో హత్యాయత్నం చేశారు. గురి తప్పకుండా కొట్టగలిగే షార్ప్ షూటర్లు మాత్రమే ఇలాంటివి చేయగలరు. దీనికి శక్తివంతమైనవారి మద్దతు ఇవ్వకుండా ఇదంతా సాధ్యపడదు. సింగ్‌నగర్ ప్రాంతంలో సీఎం జగన్ యాత్ర వెళ్తుందని తెలుసుకుని.. పక్కా ప్రణాళిక ప్రకారం ఓ ప్రైవేటు పాఠశాల వెనుక నక్కిన ఆగంతకులు సీఎం కణతపై గురిపెట్టి పదునైన వస్తువుతో హత్యాయత్నం చేశారు. సీఎం జగన్ టక్కున తల తిప్పడంతో ప్రాణాపాయం తప్పింది. పదునైన వస్తువు చాలా వేగంగా రావడంతోనే సీఎం ఎడమ కనుబొమ పైభాగాన బలంగా తగిలి.. పక్కనే ఉన్న వెలంపల్లి శ్రీనివాస్ ఎడమ కంటికీ తీవ్ర గాయమైంది. వెలంపల్లి కంటి కార్నియాకు బలంగా తాకడంతో 48 గంటలు అబ్జర్వేషన్లో ఉండాలని వైద్యులు సూచించారు. ఒక వస్తువు ఇద్దరు వ్యక్తులను బలంగా గాయపరిచిందంటే.. ఎంతటి శక్తివంతమైన ఆయు«దాన్ని ఉపయోగించారో తెలుస్తోంది. ఇవన్నీ దర్యాప్తులో బయటపడతాయి. నిందితులను పట్టుకోవాలని ప్రతిపక్ష నేతలెవరూ కోరలేదు సీఎం జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడిన నిందితులను పట్టుకోవాలని ప్రతిపక్ష నాయకులు ఎవరూ కోరట్లేదు. చంద్రబాబు సైతం సీఎం త్వరగా కోలుకోవాలని కాకుండా అధికారులపై చర్యలు తీసుకోవాలంటున్నారు. సీఎం తన రోడ్‌షోలో కరెంటు తీయించుకుని ఆయనే చేతులారా ఈ ఘటనకు కారణమయ్యారని టీడీపీ నేతలు అనడం దారుణం. రోడ్‌షోల్లో చంద్రబాబు బస్సు ఎక్కినా కరెంట్ తీస్తారు.. లేదంటే ప్రమాదం జరిగి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. సీఎం జగన్‌పై హత్యాయత్నాన్ని భద్రతా వైఫల్యంగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం దుర్మార్గం. ఆ విషయాన్ని పోలీసు శాఖ, ప్రభుత్వం చూసుకుంటుంది. చంద్రబాబుపై అలిపిరి ఘటన సమయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సంఘీభావంగా వెళ్లి మౌన దీక్ష చేశారు. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజాస్వామ్యంలో చర్చల ద్వారా విభేదించాలి తప్ప ఇలాంటి ఘటనలను ప్రోత్సహించకూడదు. కానీ, టీడీపీ వ్యవహారశైలి పూర్తి భిన్నంగా ఉంది. ఇలాంటి దుశ్చర్యలను సీఎం జగన్ ధైర్యంగా ఎదుర్కొంటూ ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటారు. సోమవారం నుంచి యధావిధిగా బస్సుయాత్ర ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మరోసారి అఖండ విజయం సాధిస్తుంది. ఎన్నికల సంఘానికి, డీజీపీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై దాడి ఘటనలో టీడీపీ సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆదివారం సచివాలయంలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. టీడీపీ సోషల్ మీడియా, ఐటీడీపీ.. వివేకం సినిమా సీన్లను పోస్టు చేసి దుష్ప్రచారం చేస్తున్నాయని.. వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై హత్యాయత్నం ఘటనకు సంబంధించి దోషులను తక్షణమే పట్టుకోవాలని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని వైఎస్సార్సీపీ కోరింది. ఈ మేరకు ఆదివారం ఆయన క్యాంపు కార్యాలయంలో డీజీపీని వైఎస్సార్సీపీ నేతల బృందం కలిసి ఫిర్యాదు చేసింది. అనంతరం ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. ముఖ్యమంత్రిని కించపరిచేలా ఫొటోలు మార్ఫింగ్ చేయడం, గొడ్డలితో పోస్టులు పెట్టడం, టీడీపీ పాటలు సహా పలు అంశాలపై డీజీపీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రజలకు టీడీపీ చేస్తున్న ఫోన్ కాల్స్, వాయిస్ మెసేజ్‌లు, బల్క్ మెసేజ్‌ల గురించి డీజీపీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి సీఎం, వైఎస్సార్సీపీపై చేస్తున్న దుష్ప్రచారాన్ని కట్టడి చేయాలని కోరామని తెలిపారు. సీఎం జగన్‌పై జరిగిన హత్యాయత్నం వెనుక టీడీపీ గూండాల హస్తం ఉందని ఆరోపించారు. నేర చరిత్ర కలిగిన టీడీపీ నేతలు పక్కా ప్రణాళికతో ఈ దారుణానికి పాల్పడ్డారన్నారు. రాష్ట్రంలో హింసను ప్రేరేపించేలా చంద్రబాబు పదేపదే చేస్తున్న బహిరంగ వ్యాఖ్యలు హత్యాయత్నానికి మూలకారణమన్నారు. ఈ కార్యక్రమాల్లో వైఎస్సార్సీపీ నేతలు నందిగం సురేష్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, రావెల కిశోర్‌బాబు, మనోహర్‌రెడ్డి ఎ.నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
రాజధానిని మింగేసిన బాబు భూదందా
సినిమా క్లైమాక్స్‌లో విలన్ తన ఆచూకీని హీరోకు చెప్పే ముందు ముప్పుతిప్పలు పెడుతుంటాడు.. ఇక్కడున్నాను.. అబ్బే.. మరోచోట ఉన్నానంటూ కన్ఫ్యూజ్ చేస్తుంటాడు.. చంద్రబాబు తీరు కూడా అచ్చం ఇలానే ఉంది. అమరావతిని రాజధానిగా ప్రకటించే ముందు ఈ పెద్దమనిషి కూడా రాష్ట్ర ప్రజానీకంతో ఓ ఆట ఆడుకున్నాడు. ఈ ఆటలో ఎక్కువగా నష్టపోయింది బాబు మాయాజాలం తెలియని సామాన్య రియల్టర్లు, ప్రజలే. అదిగో అక్కడే రాజధాని.. అరెరె కాదు కాదు.. దొనకొండ.. అబ్బే అక్కడా కాదు.. నూజివీడు..తూచ్.. అక్కడొద్దన్నారు.. ఏలూరు సమీపంలో పెడుతున్నాం..లేదు నాగార్జున యూనివర్సిటీ వద్ద అయితే మేలు.. అక్కడే ఫిక్స్.. ఇలా తన ఎల్లో మీడియాకు రోజుకో లీకు ఇచ్చి కథనాలు రాయించారు.. చివరికి లోపాయికారీగా తన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి బ్రోచర్ సిద్ధం చేసుకుని.. మన రాజధాని ‘అమరావతి’ అంటూ బాంబు పేల్చారు.. బాబు అండ్ గ్యాంగ్, ఆయన వంది మాగధులంతా సూపర్.. డూపర్.. అంటూ కీర్తనలు ఆలపిస్తూ భజనలు చేయసాగారు.. ఇదంతా బాబు అండ్ కోకు మాత్రమే వినోదం. రాజధాని ఎక్కడ ఏర్పాటవుతుందో వారికి ముందే తెలుసు కనుక, వారు ముందస్తుగా అమరావతి చుట్టుపక్కల భూములను కొనేశారు. అదీ రూ.2 లక్షల కోట్ల విలువైన భూములపై పచ్చదండు భూ దండయాత్ర చేసింది. చంద్రబాబు కుట్రలు గ్రహించలేని రియల్టర్లు దారుణంగా మోసపోయి, కోట్లకు కోట్లు నష్టపోయారు. కొందరి జీవితాలు విషాదాంతంగా మిగిలాయి. బాబు అండ్ కో మాత్రం తమ పాచిక పారినందుకు.. రూ.లక్షల కోట్ల భూములను చౌకగా కొట్టేయగలిగినందుకు పగలబడి నవ్వుకుంటూ డబ్బులు లెక్కబెట్టుకునే పనిలో బిజీ అయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్ని రకాలుగా భూ దోపిడీకి పాల్పడవచ్చో ప్రపంచానికి చాటారు. శ్రీకృష్ణ కమిషన్, శివరామకృష్ణన్ కమిటీ సూచనలను బుట్టదాఖలు చేశారు. స్విస్ చాలెంజింగ్ విధానం అంటూ ఊడ్చేశారు. సినిమా సెట్టింగుల్లో పేరుగాంచిన దర్శకుడు రాజమౌళిని రప్పించి ఇదిగిదిగో రాజధాని అంటూ గ్రాఫిక్స్‌తో మాయ చేశారు. మిడతల దండు దాడి చేసి పచ్చని పంటలను నాశనం చేసినట్టు చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, నాటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రులు, టీడీపీ నేతలు, వారి బినామీలు అమరావతి భూములపై దాడికి తెగబడ్డారు. చంద్రబాబు, లోకేశ్‌లతో పాటు టీడీపీ నేతలు, నారాయణ, సుజనా చౌదరి, ప్రత్తిపాటి పుల్లారావు, మాగంటి మురళీ మోహన్, కొమ్మాలపాటి శ్రీధర్, కోడెల శివ ప్రసాద్ కుమారుడు శివరామకృష్ణ, ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్, బాలకృష్ణ వియ్యంకుడు ఎంఎస్పీ రామారావులతో కూడిన పచ్చ దండు భూములను కొల్లగొట్టింది. రాజధాని విషయంలో నాడు బాబు అండ్ గ్యాంగ్ ఎంత అరాచకంగా, దుర్మార్గంగా, అశాస్త్రీయంగా వ్యవహరించిందో గుర్తు చేస్తూ ఆ బాగోతాలను రేపటి నుంచి ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. -
లోకేశ్ ఐటీ.. రియల్ లూటీ
సాక్షి, అమరావతి: రాజధాని పేరుతో మాటల మరాఠి చంద్రబాబు చూపించిన గ్రాఫిక్స్ పాలనను ప్రజలు ఛీకొట్టారు. అరచేతిలో స్వర్గం చూపిస్తే.. జనం తమ ఓటుతో అసలు వాస్తవం చూపించారు. మన మందళగిరి చినబాబు అయితే ఏకంగా ఐటీ పేరుతో మంగళగిరిలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీస్తే.. గోబెల్స్‌కు రాజగురువు రామోజీ మాత్రం మంగళగిరిని ఏకంగా మాదాపూర్‌లా మార్చేయడానికి మా మాలోకం కష్టపడ్డాడని జాకీలతో పైకెత్తడానికి తెగ ఆరాటపడుతున్నారు. ‘మంగళగిరి ఐటీపై జగన్ వేటు’అంటూ ఈనాడులో విషపు రాతలు రాశారు. చంద్రబాబు హయాంలో మంగళగిరి సింగపూర్‌ను తలదన్నేలా బహుళ అంతస్తుల భవనాల ఐటీ కంపెనీలతో కళకళలాడేదట. కనకదుర్గ వారధి నుంచి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వరకు ఆకాశహర్మ్యాలతో హైదరాబాద్‌లోని మాదాపూర్‌ను తలపించేదట. యువత ఆనందంతో ఉద్యోగాలు చేసుకునేవారట. జగన్ వచ్చాక ఇవన్నీ మాయమయ్యాయట. ఇదీ అసలు నిజం.. ఐటీ కంపెనీలకు ప్రోత్సాహం అంటూ చంద్రబాబు పుత్రరత్నం ఇక్కడ ఐటీ మంత్రిగా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెగబడ్డారు. ఐటీ పార్కుల పేరుతో బిల్డింగ్లు నిర్మించేసి.. ఐటీ కంపెనీలు రాకపోతే ఖాళీగా ఉన్న స్థలానికి ప్రభుత్వమే అద్దె చెల్లించేలా ప్రణాళిక వేశారు. ఇందుకోసం డిజిగ్నేటెడ్ టెక్నాలజీ పార్కుల పేరుతో ప్రత్యేక పాలసీ రూపొందించారు. ఈ పాలసీ ముసుగులో బాబు అనుయాయులు పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ భవనాలు నిర్మించి భారీ ఎత్తున ప్రభుత్వ సొమ్మును కాజేశారు. ఈ విధంగా నిరుపయోగంగా ఉన్న భవనాలకు భారీగా అద్దెను చెల్లించాల్సి వస్తుండటంతో ఈ పథకాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. నిజంగా మంగళగిరిలో ఐటీ కంపెనీలు వచ్చి ఉంటే ఆ కంపెనీల పేర్లు రాయొచ్చు కదా రామోజీ..? ఒక్క కంపెనీ పేరు రాసే ధైర్యం లేదు. ఐటీ, ఎల్రక్టానిక్స్ రంగాల్లో మూడు లక్షల ఉద్యోగాలంటూ లోకేశ్ ప్రచారంలోని డొల్లతనం 2019 జనవరిలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లోనే బయట పడింది. చంద్రబాబు అధికారం చేపట్టినప్పటి నుంచి ఐటీ రంగంలో లక్ష ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంటే 2018 అక్టోబర్ నాటికి కేవలం 8,768 మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. ప్రస్తుత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో 47,908 మందికి ఐటీ రంగంలో ఉపాధి కల్పించినా అవేవీ మీకు పట్టవా రామోజీ? -
ఓటమి భయంతోనే ట్యాపింగ్ డ్రామా
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం తథ్యమని స్పష్టం కావడంతో చంద్రబాబు కోటరీ బెంబేలెత్తుతోంది. ప్రజల దృష్టిని మళ్లించేందుకు కొత్త పన్నాగాలు పన్నుతోంది. టీడీపీ అధికారంలో ఉండగా ఫోన్ ట్యాపింగ్ కుట్రలకు పాల్పడిన చరిత్ర ఉన్న చంద్రబాబు తిరిగి అవే ఆరోపణలతో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దు్రష్పచారం చేసేందుకు యత్నిస్తున్నారు. చంద్రబాబు కుమారుడు లోకేశ్ ఐ ఫోన్‌ను ట్యాపింగ్ చేస్తున్నారంటూ టీడీపీ ఎన్నికల కమిషన్ (ఈసీ)కి ఫిర్యాదు చేయడం ఆ కుట్రలో భాగమేనన్నది సుస్పష్టం. వాస్తవం ఏమిటంటే అసలు ఫోన్లు ట్యాపింగ్ చేసే టెక్నాలజీ ప్రస్తుత ఏపీ ప్రభుత్వం వద్ద లేనే లేదు. ఈ విషయాన్ని కేంద్రం కూడా ఇటీవల స్పష్టంగా చెప్పింది. అసలు వాస్తవానికి వస్తే డాటా చోరీ, ఫోన్ల ట్యాపింగ్‌లో చంద్రబాబే సిద్ధహస్తుడు. ఇందుకోసం ఆయన సీఎంగా ఉండగా ఇజ్రాయెల్ నుంచి స్పైవేర్ 2019ను కొనుగోలు చేశారన్నది బహిరంగ రహస్యం. ఆ విషయాన్ని పశ్చిమ బెంగాల్ సీఎం మమత ఆ రాష్ట్ర అసెంబ్లీలోనే వెల్లడించారు కూడా. భద్రతా చట్టాలను ఉల్లంఘించి పెగసస్ సాఫ్ట్వేర్ కొన్న చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఫోన్ ట్యాపింగ్ జాడ్యానికి ఆద్యుడు చంద్రబాబే. 2004 ఎన్నికల్లో అప్పటి సీఎంగా ఉన్న ఆయన ప్రతిపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్ కోసం ఏకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన తరువాత 2014లో ఆంధ్రప్రదేశ్‌కు సీఎం అయిన చంద్రబాబు మరోసారి ఫోన్ ట్యాపింగ్ అక్రమాలకు పాల్పడ్డారు. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు నేతృత్వంలో ప్రత్యేకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ నేతల ఫోన్ల ట్యాపింగ్‌తోపాటు ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడటం ఆ వ్యవస్థ లక్ష్యం. ఐటీ గ్రిడ్స్ అనే ప్రైవేటు కంపెనీ, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కుమారుడు భాగస్వామిగా ఉన్న ఆకాశ్ ఎంటర్ప్రైజెస్ కంపెనీల ద్వారా ఏరోస్టాట్ బెలూన్లు, ఇతర ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ కొనుగోలుకు ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్‌తో సంప్రదింపులు జరిపారు. అందుకోసం ఏబీవీ బృందం ఇజ్రాయెల్‌లో పర్యటించింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం విదేశీ కంపెనీల నుంచి ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ కొనాలంటే కేంద్ర రక్షణ శాఖ అనుమతి తప్పనిసరి. జాతీయ భద్రత చట్టాన్ని సైతం చంద్రబాబు ప్రభుత్వం ఉల్లంఘించింది. రక్షణ శాఖకు సమాచారం ఇవ్వకుండానే ఐటీ గ్రిడ్స్ కంపెనీ ద్వారా ఫోన్ ట్యాపింగ్ పరికరాలు కొనుగోలు చేసి, వాటిని టీడీపీ కార్యాలయాల్లో పెట్టుకుంది. 35 లక్షల మంది డేటా చౌర్యం అక్రమంగా కొన్న ఫోన్ ట్యాపింగ్, డేటా చౌర్యం సాఫ్ట్‌వేర్‌తో చంద్రబాబు ప్రభుత్వం బరితెగించింది. అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌తో పాటు వైఎస్సార్సీపీకి చెందిన 65 మంది నేతల ఫోన్ల ట్యాపింగ్‌కు పాల్పడింది. దీనిపై పూర్తి ఆధారాలతో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2019 ఎన్నికలకు ముందు వివిధ కేసుల దర్యాప్తు ముసుగులో ఏకంగా వైఎస్సార్సీపీకి చెందిన 150 మంది ఫోన్లను ట్యాప్ చేయడం చంద్రబాబు దుర్మార్గ రాజకీయాలకు నిదర్శనం. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన ప్రజా సాధికార సర్వే ద్వారా సేకరించిన ఓటర్ల సమాచారం మొత్తాన్ని టీడీపీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం రూపొందించిన సేవా మిత్ర యాప్‌నకు అనుసంధానించారు. ఇలా రాష్ట్రంలోని ఓటర్ల వ్యక్తిగత సమాచారం చౌర్యానికి పాల్పడ్డారు. మరోవైపు టీడీపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్న 35 లక్షల మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు కుట్ర పన్నారు. ఈ కుట్రకు వ్యతిరేకంగా అప్పట్లోనే వైఎస్సార్సీపీ ఆందోళనలు చేసింది. పోలీసులు, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పూర్తి ఆధారాలతో ఫిర్యాదులు చేసింది. నిగ్గు తేల్చిన శాసన సభ ఉప సంఘం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ ప్రభుత్వం చేసిన డేటా చౌర్యంపై విచారణకు శాసన సభ ఉప సంఘాన్ని నియమించింది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి నేతృత్వంలోని ఈ కమిటీ హోం, ఆర్థిక, సమాచార–పౌర సంబంధాల శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులను విచారించింది. అప్పటి సీఎం చంద్రబాబు ఆదేశాలతోనే తాము ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని టీడీపీ సేవా మిత్ర యాప్‌నకు బదీలీ చేశామని ఆ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇజ్రాయెల్ నుంచి ఫోన్ ట్యాపింగ్, డేటా చౌర్యం సాఫ్ట్‌వేర్‌ను అక్రమంగా కొన్న మాట వాస్తవమేనని, అందుకే ఆ దేశంలో పర్యటించామని తెలిపారు. ఈ వ్యవహారంపై శాసన సభా ఉప సంఘం మధ్యంతర నివేదికను కూడా శాసన సభకు సమరి్పంచింది. ఐ ఫోన్‌ను ట్యాప్ చేసే టెక్నాలజీ ఏపీ వద్ద లేదు ఫోన్ల ట్యాపింగ్ అంశంపై కేంద్ర హోమ్ శాఖ ఇటీవల కీలక ప్రకటన చేసింది. ఐ ఫోన్లను ట్యాప్ చేసే టెక్నాలజీ ఏపీ ప్రభుత్వం వద్ద లేదని తెలిపింది. ఆ టెక్నాలజీ కేంద్ర హోం, రక్షణ శాఖల వద్దే ఉంది. ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించడం, దేశ భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం అత్యున్నతస్థాయిలో ఆ పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. మరి లోకేశ్ ఐ ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారని యాపిల్ కంపెనీ అలెర్ట్ మెస్సేజ్ పంపిందని టీడీపీ అంటోంది. అంటే లోకేశ్ ఫోన్‌ను ట్యాప్ చేసే అవకాశం కేంద్ర ప్రభుత్వానికే ఉందని పరిశీలకులు చెబుతున్నారు. మరి కేంద్ర ప్రభుత్వాన్నిగానీ, బీజేపీనిగానీ ప్రశ్నించే ధైర్యం టీడీపీకి ఉందా? బీజేపీ నేతలతో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్న చంద్రబాబు ఆ సమయంలోనే వారిని లోకేశ్ ఫోన్ ట్యాపింగ్‌పై నిలదీయవచ్చు. చంద్రబాబు అంత ధైర్యం చేయగలరా? కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈసీకి ఫిర్యాదు చేస్తారా? లేకపోతే తాము వైఎస్సార్సీపీపై చేస్తున్న ఆరోపణలను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్తారా? చంద్రబాబు పెగసస్ సాఫ్ట్వేర్ కొన్నారు: మమతా బెనర్జీ ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం రూ.25 కోట్లు వెచ్చించి పెగసస్ నుంచి అక్రమంగా ఫోన్ ట్యాపింగ్, డేటా చౌర్యం సాఫ్ట్వేర్ కొన్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా ప్రకటించడం జాతీయ స్థాయిలో పెను సంచలనం సృష్టించింది. 2022లో పశ్చిమ బెంగాల్ శాసన సభలో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ డేటా చౌర్యం సాఫ్ట్వేర్ కొనాలని పెగసస్ కంపెనీ ప్రతినిధులు తనను సంప్రదించినా, తిరస్కరించినట్టు వెల్లడించారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఆ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసిందని, మీరు కూడా కొనాలంటూ ఆ సంస్థ ప్రతిపాదించిందని తెలిపారు. చట్ట విరుద్ధమైన ఆ పనిని తాను చేయలేనని తిరస్కరించానని ఆమె చెప్పారు. ఇవన్నీ చంద్రబాబు కుతంత్రాలను బయటపెట్టే వాస్తవాలు. -
టీడీపీలో కోట్లకు సీట్లు
సాక్షి, అమరావతి: టీడీపీలో ‘కోట్లుకు టికెట్లు’ వ్యవహారం రచ్చకెక్కింది. కోరినన్ని కోట్లిస్తేనే ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెండు చోట్ల డబ్బు డిపాజిట్ చేస్తేనే టికెట్లు ఇస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. గతంలో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ‘మా వాళ్లు బ్రీఫ్డ్ మీ’.. అన్న తరహాలోనే ఇప్పుడూ పెద్ద నేతకు ‘బ్రీఫింగ్’ వెళ్తేనే టికెట్ ఖరారవుతోందని చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పార్టీకి విధేయులుగా ఉండే నేతలు సైతం ఈ డబ్బు దందాపై రగిలిపోతున్నారు. పార్టీ కోసం పని చేసిన వారిని కాదని బయటి వ్యక్తులకు వేలం పాట పెట్టి మరీ సీట్లు అమ్మేసినట్లు టీడీపీ నేతలు వాపోతున్నారు. వారి ఆవేదన హద్దులు దాటి దాడులు చేసే స్థాయికి చేరింది. అనంతపురం అర్బన్ సీటును అక్కడి ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకరచౌదరికి కాకుండా దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌కి ఇవ్వడంపై అనంతపురం టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. పార్టీ కార్యాలయాలపై దాడులు చేసి నిప్పు పెట్టి, చంద్రబాబు, లోకేశ్ ఫొటోలను దహనం చేస్తున్నారు. ఈ సీటును లోకేశ్ రూ.30 కోట్లకు అమ్మేసినట్లు పార్టీ నేతలు మీడియాలోనే చెబుతున్నారు. గుంతకల్లు అసెంబ్లీ సీటును కూడా ఇలాగే వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకి కేటాయించారు. పార్టీ కోసం ఎప్పటి నుంచో పనిచేస్తున్న ఇన్‌ఛార్జి జితేంద్రగౌడ్కి మొండిచేయి చూపి అప్పటికప్పుడు పార్టీలో చేరిన జయరాంకి ఇచ్చేశారు. ఇందుకోసం ఆయన చంద్రబాబు, లోకేశ్‌కి భారీగా డబ్బు ముట్టజెప్పినట్లు టీడీపీ నేతలే చెబుతున్నారు. దర్శి సీటు స్థానికేతరురాలికి ఇవ్వడం వెనుక ! ఒంగోలు జిల్లా దర్శి సీటును కూడా వేరే ప్రాంతానికి చెందిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి కేటాయించారు. నిజానికి ఈ సీటును చాలాకాలం క్రితమే బేరం పెట్టినా కొనేందుకు ఎవరూ రాలేదు. ఇతర పార్టీల నుంచి ఎవరైనా వస్తారేమోనని ఎదురు చూశారు. ఆఫర్లు ప్రకటించినా లాభం లేకపోయింది. ఈ నేపథ్యంలో నర్సరావుపేట సీటు ఆశించిన డాక్టర్ లక్ష్మి కుటుంబానికి ఆ సీటు కాకుండా దర్శి కేటాయించారు. నిర్దేశించిన రేటు ముట్టజెప్పడంతో స్థానికేతరురాలు అయినా ఆమెకు సీటు ఇచ్చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఏ సీటూ ఇవ్వకూడదనుకున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఆయన కోరుకున్న భీమిలి సీటు ఇవ్వడం వెనుకా భారీ డీల్ ఉన్నట్లు తెలుస్తోంది. గంటాను విశాఖ నుంచి పూర్తిగా దూరంగా పంపడానికి చంద్రబాబు ప్రయత్నించారు. అందుకోసం విజయనగరం జిల్లా చీపురుపల్లిలో పోటీ చేయాలని తీవ్ర ఒత్తిడి చేశారు. ఆయన ససేమిరా అన్నారు. విశాఖ జిల్లాలోనే ఏదో ఒక సీటు కావాలని కోరారు. అందుకు మొదట ఒప్పుకోని చంద్రబాబు.. మొదటి మూడు జాబితాల్లోనూ అవకాశం కల్పించలేదు. ఇక ఆయనకు సీటు రాదనుకునే పరిస్థితి ఏర్పడింది. అయితే గంటా ఇచ్చిన భారీ ఆఫర్‌కి చంద్రబాబు, లోకేశ్ తలొగ్గినట్లు ఆరోపణలు వస్తున్నాయి. జనసేనకు ఇవ్వాల్సిన భీమిలి సీటును పొత్తులో లేకుండా చేసి మరీ ఆఖరి జాబితాలో గంటాకు కట్టబెట్టారని సమాచారం. ఒంగోలు లోక్‌సభ సీటును ఫిరాయింపు నేత మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఇవ్వడం వెనుకా డబ్బు డీల్ ఉన్నట్లు చెబుతున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి సీటు ఇవ్వడాన్నిబట్టి దానికి గట్టి రేటు పెట్టి డబ్బు దండుకున్నారని పార్టీ నేతలు అంటున్నారు. మొదట ఆయన కుమారుడు రాఘవరెడ్డికి సీటు ఇవ్వడానికి ఒప్పుకున్నా, అరెస్టయి బెయిల్‌పై ఉన్న వ్యక్తికి టికెట్టిస్తే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో శ్రీనివాసులరెడ్డినే పోటీ చేయించాలని నిర్ణయించారు. ఇలా అంతకుముందు ప్రకటించిన లోక్‌సభ సీట్లకు సైతం పెద్దఎత్తున డబ్బు చేతులు మారినట్లు టీడీపీలో చర్చ జరుగుతోంది. ఎంపీ టికెట్ రేటు రూ.100 నుంచి రూ.200 కోట్లు ఏలూరు, విజయవాడ, గుంటూరు, నర్సరావుపేట, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, నంద్యాల ఎంపీ సీట్ల ఖరారు వెనుక వందల కోట్ల డీల్ ఉన్నట్లు టీడీపీలో ప్రచారం జరుగుతోంది. ఒక్కో ఎంపీ సీటు కోసం రూ.100 నుంచి రూ.200 కోట్ల డీల్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలో పని చేసిన నేతలను కాదని ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సీట్లు ఇవ్వడానికి డబ్బు తప్ప మరో కారణం లేదని తెలుస్తోంది. సగానికిపైగా అసెంబ్లీ సీట్ల ఖరారులోనూ ఇదే సూత్రాన్ని పాటించారు. రెండు రకాల డిపాజిట్లు చేస్తేనే కాని సీటు ఖరారు కాలేదని అనంతపురం జిల్లాకు చెందిన ఒక టీడీపీ అభ్యర్థి తన అనుచరుల వద్ద వాపోయారు. ఒక డిపాజిట్ ఎన్నికల్లో ఖర్చు చేయడానికి, మరొకటి చినబాబుకు చేశాకే చాలామంది సీట్లు దక్కించుకున్నారని చెబుతున్నారు. ఇందుకోసం ఆయన వేలం పాట పెట్టి ఎవరు ఎక్కువ ఇస్తామంటే వారికి సీట్లు ఖరారు చేసినట్లు సమాచారం. దీనిపై టీడీపీలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ కోసం అహర్నిశలూ కష్టపడి పని చేస్తే సీట్లతోపాటు తమను కూడా అమ్మేస్తున్నారని వాపోతున్నారు. అందుకే పలుచోట్ల కార్యకర్తలు చంద్రబాబు, లోకేశ్‌పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వారిని బూతులు కూడా తిడుతున్నారు. -
చంద్రబాబు, లోకేష్ దమ్ముంటే గుడివాడలో పోటీ చెయ్యండి: Kodali Nani
-
టీడీపీలో ఆగ్రహ జ్వాల
సాక్షి నెట్వర్క్: టీడీపీలో మూడోవిడత టికెట్ల జాబితాపై ఆపార్టీ శ్రేణుల్లో ఆగ్రహ జ్వాలలు మిన్నంటాయి. టికెట్ మంటలు రాజుకుంటున్నాయి. ఇప్పటికే టికెట్ వస్తుందని ఆశపెట్టుకున్నవారంతా జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో ఆందోళనబాట పట్టారు. తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. వారి అనుయాయులు పార్టీ జెండాలను, ఫ్లెక్సీలను మంటల్లో వేసి తగులబెట్టారు. మొత్తమ్మీద రాష్ట్ర వ్యాప్తంగా తలెత్తిన వ్యతిరేక పవనాలు పార్టీ అధిష్టానం కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. శ్రీకాకుళంలో గుండ లక్ష్మీదేవి, పాతపట్నంలో కలమట వెంకటరమణను కాదని రూ. కోట్లు ముట్టచెప్పినవారికి టికెట్లు ఇచ్చారంటూ టీడీపీలోని సీనియర్ కేడర్ రగిలిపోయింది. పార్టీ కరపత్రాలు, బ్రోచర్లు, ఇతరత్రా మెటీరియల్‌ను తగలబెట్టి తమ నిరసన తెలియజేశారు. ‘తెలుగుదేశం పార్టీ వద్దు.. సైకిల్ గుర్తు అసలొద్దు.. టీడీపీ జెండాలు.. చంద్రబాబు అజెండా మనకొద్దు’ అంటూ శ్రీకాకుళంలో ఆ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శ్రీకాకుళంలో సీనియర్ నాయకుడు గుండ అప్పల సూర్యనారాయణ, లక్ష్మీదేవి దంపతులకు పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని, ఆమెకు సీటు రాకుండా అచ్చెన్నాయుడు, రామ్మోహన్నాయుడు అడ్డుకున్నారని తెలుగు తమ్ముళ్లు ఒంటి కాలితో లేచారు. ఏ మాత్రం పట్టులేని గొండు శంకర్‌కు టికెట్ ఇచ్చి, సీనియర్లకు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. చంద్రబాబు, లోకేశ్ ఫొటోలను ధ్వంసం చేసి, మంటల్లో తగలెట్టారు. రానున్న ఎన్నికల్లో ఎంపీ రామ్మోహన్నాయుడిని ఓడించి తీరుతామని శపథం చేశారు. ఈ సందర్భంగా ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని గుండ ఫ్యావిులీపై అనుచరులంతా ఒత్తిడి చేశారు. లేదంటే వైఎస్సార్సీపీలో చేరాలని కోరారు. శుక్రవారం సాయంత్రం తన అనుయాయుల అభీష్టం మేరకు ఇండిపెండెంట్‌గా పోటీకి దిగనున్నట్టు మాజీ శాసనసభ్యురాలు గుండ లక్ష్మీదేవి ప్రకటించారు. అప్పలసూర్యనారాయణ కూడా ఇండిపెండెంట్‌గా ఎంపీగా బరిలోకి దిగాలని కార్యకర్తలు కోరగా ఆదివారం దీనిపై నిర్ణయం తీసుకుందామని చెప్పారు. పాతపట్నంలో మూకుమ్మడి రాజీనామాలు పాతపట్నంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణకు చంద్రబాబు మొండి చేయి చూపడంతో ఆయన అనుచరులు మండిపడ్డారు. పది కార్లు వేసుకుని, పదిమందిని వెంట బెట్టుకుని, నియోజకవర్గంలో షో చేసిన మామిడిగోవిందరావుకు టికెట్ ఇవ్వడంపై వారు నిరసన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో టీడీపీ ఎలా గెలుస్తుందో చూస్తామని సవాల్ చేశారు. ఈ సందర్భంగా పాతపట్నం, మెళియాపుట్టి, హిరమండలం, ఎల్‌ఎన్‌పేట, కొత్తూరులో కలమటకు మద్దతుగా రోడ్డెక్కి టీడీపీ ఫ్లెక్సీలు, కరపత్రాలను తగలబెట్టారు. పార్టీ మండలాధ్యక్షులు సైతం రాజీనామా చేశారు. చంద్రబాబు, లోకేశ్, అచ్చెన్నాయుడు తదితరుల ఫ్లెక్సీలను మంటల్లో దహనం చేశారు. నిరసన ర్యాలీలు చేసి, కలమట అనుచరులంతా మూకుమ్మడిగా పార్టీకి రాజీనామాలు చేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర కార్యదర్శి పదవికి గొంపకృష్ణ రాజీనామా విజయనగరం జిల్లా శృంగవరపుకోట అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పేరును ఖరారు చేయడంతో ఇప్పటివరకూ అక్కడి టికెట్‌కోసం ఎదురుచూసిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ అసంతృప్తితో రగిలిపోయారు. పార్టీ పదవికి రాజీనామా చేసి, ఇండిపెండెంట్‌గా బరిలో దిగనున్నట్టు ప్రకటించారు. ఆయనతో పాటు వేపాడ, కొత్తవలస, జామి మండలాల టీడీపీ అధ్యక్షులు గొంప వెంకటరావు, గొరపల్లి రాము, లగుడు రవికుమార్, విశాఖ పార్లమెంట్ ఉపాధ్యక్షుడు రాయవరపు చంద్రశేఖర్, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గుమ్మడి భారతి వారి పదవులకు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం తన అభిమానులతో ఏర్పాటు చేసిన సమావేశంలో గొంపకృష్ణ మాట్లాడుతూ ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతానని ప్రకటించారు. టీడీపీ కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి ఉన్న తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తును పెయింట్‌తో చెరిపేశారు. అమలాపురంలో అసంతృప్తి జ్వాలలు అమలాపురం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా అయితాబత్తుల ఆనందరావును, పార్లమెంట్ అభ్యర్థిగా గంటి హరీష్‌ను పార్టీ అధిష్టానం ఎంపిక చేయడంపై అక్కడి నాయకులు మండిపడుతున్నారు. ఆనందరావుకు సీటు రాకుండా రాజప్ప సోదరుడు నిమ్మకాయల జగ్గయ్యనాయుడు ఆధ్వర్యంలో పరమట శ్యామ్‌కుమార్ గట్టి ప్రయత్నం చేశారు. అయినా ఆయనకే టికెట్ కేటాయించడంతో నాయకులు, కార్యకర్తలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఎన్నికలలో తగిన గుణపాఠం చెబుతామని వారు హెచ్చరించారు. ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన వారిలో జనసేన నాయకులు కూడా ఉండటం గమనార్హం. ఆదిమూలంను మార్చాలని డిమాండ్ తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోనేటి ఆదిమూలంను ప్రకటించడంపై సత్యవేడు, నాగలాపురం మండలాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మదనంబేడులో శుక్రవారం సాయంత్రం పంచాయతీ పరిధిలో తెలుగు తమ్ముళ్లు నిరసన తెలిపారు. ఆదిమూలం టీడీపీ కార్యకర్తలపై చిన్నపాటి గొడవలను భూతద్దంలో చూపించి అట్రాసిటీ కేసులు పెట్టించారని గుర్తుచేశారు. అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేశారు. నాగలాపురంలో కూడా పలువురు తెలుగు తమ్ముళ్లు ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించారు. రగిలిపోతున్న పోతిన మహేష్ విజయవాడ వెస్ట్ నుంచి సీటు ఆశిస్తున్న పోతిన మహేష్ భంగపాటుకు గురయ్యాడు. కానీ పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయిస్తున్నట్లు పవన్ తేల్చి చెప్పారు. ఈ ప్రకటనతో కంగుతిన్న మహేష్ డివిజన్ ఇన్చార్జిలు, కార్యకర్తలతో సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ నమ్మించి మోసం చేశారని, ఇలాగైతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని హెచ్చరికలు పంపారు. పురందేశ్వరి కోసం మమ్మల్ని బలి చేస్తారా? విపక్ష కూటమిలో రాజమహేంద్రవరం పార్లమెంటరీ స్థానం అభ్యర్థిత్వం కలకలం రేపుతోంది. టీడీపీ ప్రకటించిన మూడో జాబితాలో టీడీపీ నేత బొడ్డు వెంకట రమణ చౌదరి పేరు లేకపోవడంపై ఆ వర్గం నేతలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. జనసేన కోసం ఇప్పటికే రాజానగరం ఎమ్మెల్యే సీటును త్యాగం చేసిన ఆయనకు.. ఇప్పుడు బీజేపీ కోసం ఎంపీ స్థానం వదుకోవాల్సి వస్తుందన్న ఆందోళన నెలకొంది. ఎంపీ టికెట్ అయినా వస్తుందనుకుంటే అదీ దక్కే అవకాశం కనిపించకపోవడంతో ఆ వర్గం టీడీపీ అధినేతపై మండిపడుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిని రాజమహేంద్రవరం ఎంపీగా బరిలోకి దింపేందుకు కమలనాథులు పావులు కదుపుతూండటంతో తన రాజకీయ భవిష్యత్తు ఏమిటని ఆయన కార్యకర్తల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని నమ్ముకుంటే నట్టేట ముంచారని ఆయన పేర్కొన్నట్టు తెలిసింది. ఎక్కడ ‘పుట్టా’వో మాకెందుకు? ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా, టీటీడీ మాజీ చైర్మన్, కడప జిల్లా టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు పుట్టా మహేష్‌ను ఎంపిక చేయడంపై అక్కడి బీజేపీ నేతలు మండిపడుతున్నారు. టికెట్ ఇస్తామని సింగపూర్‌లో ఉన్న తనను రాజకీయాల్లోకి తీసుకువచ్చి ఆర్థికంగా ఉపయోగించుకున్నారని, టీడీపీ జెండా మోయటానికే జనాలు ముందుకు రాని సందర్భంలో ఏడాది పాటు కష్టపడి పనిచేశానని ఎన్ఆర్ఐ గోరుముచ్చు గోపాల్ యాదవ్ చెప్పారు. తన అసంతృప్తిని వీడియో రూపంలో విడుదల చేశారు. బీసీలంటే యనమల కుటుంబం ఒక్కటేనా, ఆయన కుటుంబంలోనే మూడు టికెట్లు ఇస్తారా, మిగతా వెనకబడిన కులాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చాలా గ్రేట్ అని.. ఆయన ధైర్యాన్ని ఎప్పుడూ మెచ్చుకుంటానని, తాను ఆయనపై ఏమైనా విమర్శలు చేసి ఉంటే పార్టీ పరంగా తప్ప వేరేగా కాదని వివరించారు. ఈ నెల 25న కామవరపుకోటలో దగాపడ్డ బీసీ సోదరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ‘కడప నేత వద్దు– స్ధానిక బీజేపీ నేతలకే టికెట్ ఇవ్వాల’ని పార్లమెంట్ బీజేపీ కన్వీనర్ గాది రాంబాబు, దెందులూరు, చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్లు, పార్టీ వివిధ విభాగాల నేతలు విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. స్థానిక అశోక్ నగర్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ ఏలూరు టికెట్ విషయంలో బీజేపీ రాష్ట్ర, జాతీయ నాయకత్వాలు పునరాలోచన చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా కామవరపుకోట చెక్‌పోస్ట్ సెంటర్లో గోరుముచ్చు గోపాల్ యాదవ్ మద్దతుదారులు శుక్రవారం రాత్రి టైర్లకు నిప్పంటించి నిరసన తెలిపారు. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. -
'మత్తు' చుట్టూ చుట్టాలే
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, ఒంగోలు/గాంధీ నగర్ (విజయవాడ సెంట్రల్)/ పిఠాపురం/ చీరాల/ విశాఖ సిటీ/ సాక్షి ప్రతినిధి,గుంటూరు: విశాఖలో బట్టబయలైన డ్రగ్స్ దందాలో వేళ్లన్నీ టీడీపీవైపే చూపుతున్నాయి. బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకు భారీగా డ్రగ్స్‌ను దిగుమతి చేసిన సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ చైర్మన్ కూనం వీరభద్ర చౌదరి, అధిపతి కూనం కోటయ్య చౌదరి టీడీపీలో ప్రముఖులైన నారా, నందమూరి, రాయపాటి, ఆలపాటి, దామచర్ల, లావు కుటుంబాలకు అత్యంత సన్నిహితులన్నది బహిర్గతమైంది. డ్రగ్స్ మాఫియా బండారం బట్టబయలు కావడంతో బెంబేలెత్తిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్సార్సీపీపై దుష్ప్రచారానికి దిగి విషయాన్ని పక్కదారి పట్టించాలని కుట్ర పన్నారు. ఈ అంకంలో భాగంగా ఒకపక్క సీబీఐ అధికారుల సోదాలు కొనసాగుతుండగానే గురువారం రాత్రే చంద్రబాబు, లోకేశ్ వరుస ట్వీట్లు చేస్తూ టీడీపీ శ్రేణులతోపాటు టీడీపీ అనుకూల మీడియాకు సంకేతాలు ఇచ్చారు. ఆ వెంటనే టీడీపీ అనుకూల మీడియా అవాస్తవాలు, అభూత కల్పనలు జోడిస్తూ దుష్ప్రచారానికి తెరతీసింది. తద్వారా డ్రగ్స్ దందా వెనుక తాము ఉన్నామనే విషయాన్ని కప్పిపుచ్చవచ్చని చంద్రబాబు భావించారు. అయితే కూనం కోటయ్య చౌదరితో టీడీపీ నేతల వ్యాపార బంధం వెలుగు చూడటంతో బాబు కుట్ర బెడిసికొట్టింది. చంద్రబాబు వదిన, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబంతో కూనం కుటుంబానికి ఉన్న వ్యాపార బంధం ఇప్పటికే వెలుగులోకి వచ్చింది. రాయపాటి, దామచర్ల, లావు కుటుంబ సభ్యులతో కూనం కోటయ్య చౌదరి కలసి ఉన్న ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కూనం వీరభద్ర చౌదరితో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజాకు ఉన్న బంధాన్ని రుజువు చేసే వ్యాపార లావాదేవీల పత్రాలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో టీడీపీ, బీజేపీ పొత్తు కుదురుతుందనే సంకేతాలు అందిన వెంటనే బ్రెజిల్ నుంచి భారీగా డ్రగ్స్ దిగుమతికి తెర తీసినట్లు ప్రాథమికంగా నిర్ధారణ కావడం గమనార్హం. కింగ్ పిన్ కోటయ్య చౌదరి.. డ్రగ్స్ దందాలో కీలక పాత్రధారులైన సంధ్యా ఆక్వా కంపెనీ చైర్మన్ కూనం వీరభద్ర చౌదరి, ఎండీ కోటయ్య చౌదరి టీడీపీ పెద్దలకు అత్యంత సన్నిహితులని ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చింది. ఆయన సన్నిహితులు, వ్యాపార భాగస్వాముల జాబితాను చూస్తే ఆ విషయం తేలిపోతోంది. దామచర్ల సత్యం (ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్థన్ సోదరుడు), రాయపాటి జీవన్ (టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తమ్ముడు గోపాలకృష్ణ కుమారుడు), లావు శ్రీకృష్ణ దేవరాయలు (నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి)లకు ఆయన అత్యంత సన్నిహితుడు. వారంతా ఓ కోటరీగా పెద్ద ఎత్తున వ్యవహారాలు సాగించారన్నది వెల్లడైంది. వారు విదేశాల్లో అత్యంత సన్నిహితంగా తిరిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దామచర్ల సత్య టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు అత్యంత సన్నిహితుడు. చంద్రబాబుతోనూ సాన్నిహిత్యం ఉంది. సంధ్యా ఆక్వా కంపెనీ చైర్మన్ కూనం వీరభద్ర చౌదరితోపాటు టీడీపీ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత ఆలపాటి రాజాకు వ్యాపార బంధం ఉంది. వారిద్దరూ సంతకాలు చేసిన పలు పత్రాలు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విశాఖ కేంద్రంగా వ్యవహారాలు సాగిస్తున్న సంధ్యా ఆక్వా కంపెనీకి నందమూరి కుటుంబంతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు బయటపడింది. బాలకృష్ణ చిన్నల్లుడు, లోకేశ్ తోడల్లుడు, విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి ఎం.భరత్‌కు కూనం కోటయ్య చౌదరి అత్యంత సన్నిహితుడు. ఆయన కుటుంబం సహకారంతోనే విశాఖ కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. సంధ్యా ఆక్వా కంపెనీతో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబానికి వ్యాపార బంధం ఉందన్నది ఇప్పటికే బయటపడింది. పురందేశ్వరి కుమారుడు చెంచురామ్, వియ్యంకుడు భాగస్వాములుగా కూనం వీరభద్ర చౌదరి, కోటయ్య చౌదరి ఆక్వా వ్యాపారాన్ని ప్రారంభించారు. దీంతో డ్రగ్స్ దందాలో తీగ లాగితే చంద్రబాబు, దగ్గుబాటి పురందేశ్వరి కోటరీ అక్రమాల డొంకంతా కదులుతోంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలోనూ.. దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణంలోనూ సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ పాత్ర ఉన్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలో మద్యం కుంభకోణానికి పాల్పడిన సిండికేట్‌లో ఆ కంపెనీ కూడా భారీగా పెట్టుబడులు పెట్టినట్లు తేలింది. ఆ కేసును కూడా సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఇప్పుడు విశాఖ డ్రగ్స్ దందాను కూడా కలిపి మొత్తంగా మద్యం, డ్రగ్స్ మాఫియా గుట్టును ఛేదించే పనిలో నిమగ్నమైంది. పొత్తుతోనే బరితెగింపు.. ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు ఎప్పుడో సిద్ధపడ్డారు. అందుకోసం కాళ్ల బేరానికి కూడా దిగజారతానని గతేడాదే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. పొత్తును అవకాశంగా చేసుకుని భారీగా డ్రగ్స్ దందాకు పచ్చ మాఫియా బరితెగించింది. ఎన్నికల ముందు భారీగా డ్రగ్స్‌ను రాష్ట్రంలోకి తరలించేందుకు పథకం వేసింది. ఈ ఏడాది ప్రారంభంలోనే సంధ్యా ఆక్వా కంపెనీ ద్వారా బ్రెజిల్ నుంచి 25 వేల కిలోల ఈస్ట్ దిగుమతి ముసుగులో భారీగా డ్రగ్స్‌ను చేరవేసేందుకు ప్రణాళిక రూపొందించింది. రెండు నెలల్లో డ్రగ్స్ విశాఖ చేరుకునేలా అంతా సిద్ధమైంది. అటు దగ్గుబాటి ఇటు చంద్రబాబు కుటుంబాలు సహకారం ఉండటంతో తమ దందాకు అడ్డు ఉండదని భావించారు. డ్రగ్స్ మాఫియాపై అంతర్జాతీయ దర్యాప్తు సంస్థ ఇంటర్‌పోల్‌కు ఉప్పందడంతో ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయాన్ని అప్రమత్తం చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ అధికారుల బృందం విశాఖ పోర్టులో నిర్వహించిన తనిఖీల్లో డ్రగ్స్ బాగోతం బట్టబయలైంది. పచ్చ కుట్ర బెడిసికొట్టింది. ఎన్నికల కమిషన్‌కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు చంద్రబాబు, టీడీపీ అనుకూల మీడియా దుష్ప్రచారంపై వైఎస్సార్సీపీ తక్షణమే ప్రతి స్పందించింది. డ్రగ్స్ దందాతో నారా, నందమూరి, దగ్గుబాటి కుటుంబాలకు ఉన్న బంధాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లింది. చంద్రబాబు, టీడీపీ అనుకూల మీడియా చేస్తున్న దుష్ప్రచారంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. నియమావళిని ఉల్లంఘిస్తూ చంద్రబాబు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆధారాలతో నివేదించింది. దీనిపై జాతీయ ప్రెస్ కౌన్సిల్‌కు కూడా ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. డ్రగ్స్ దందాపై సత్వరం సమగ్రంగా దర్యాప్తు చేయాలని సీబీఐని కోరింది. నిష్పక్షపాతంగా దర్యాప్తు నిర్వహించి పాత్రధారులతోపాటు సూత్రధారులను నిగ్గు తేల్చాలని విజ్ఞప్తి చేసింది. కూనం కుటుంబం కథ... విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో ప్రధాన పాత్రధారులైన సంధ్యా ఆక్వా ఫుడ్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ అధినేతలు కూనం వీరభద్ర చౌదరి, కుమారుడు కూనం కోటయ్య చౌదరి స్వగ్రామం ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఈదుమూడి. ఆక్వా రంగంలో ఉత్థాన పతనాలను చూసిన వీరభద్ర చౌదరి డ్రగ్స్ వ్యాపారంలో కాలు మోపాడు. కాకినాడ ప్రధాన కేంద్రంగా ఆక్వా ఫుడ్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్, ప్రీ ప్రోసెసింగ్ ప్లాంట్ల ముసుగులో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అటు టీడీపీ ఇటు రాష్ట్ర బీజేపీ అగ్రనేతల అండదండలతో తన కార్యకలాపాలను విస్తరించాడు. కూనం కుటుంబానికి ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సంధ్యా ఆక్వా ప్రీ ప్రోసెసింగ్ ప్లాంట్లతో పాటు ఆక్వా కల్చర్ చెరువులు కూడా ఉన్నాయి. వీరి వ్యాపార లావాదేవీలు కొండపి, ఒంగోలు, కందుకూరు, పర్చూరు నియోజకవర్గాల్లోనూ సాగుతున్నాయి. ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సోదరుడు దామచర్ల సత్యనారాయణ(సత్య)తో కూనం కుటుంబానికి వ్యాపార లావాదేవీలున్నాయి. టంగుటూరు టోల్ ప్లాజా సమీపంలో దామచర్ల సత్యకు చెందిన పొగాకు గోడౌన్లో సంధ్యా ఆక్వా పేరుతో ప్రీ ప్రాసెసింగ్ ప్లాంటు ఏర్పాటైంది. కూనం కుటుంబానికి విజయవాడకు చెందిన సౌమ్యుడిగా పేరున్న ఓ టీడీపీ నేతతోనూ సంబంధాలున్నట్లు సమాచారం. కోటయ్య చౌదరి, టీడీపీ నేత తనయుడు తనయుడు విదేశాల్లో మంచి సన్నిహితులని తెలిసింది. కాకినాడ తీరంలో కలకలం డ్రగ్స్ తీగ లాగితే కాకినాడ జిల్లా కొత్తపల్లి తీరంలోని మూలపేటలో డొంక కదిలింది. మూలపేటలోని సంధ్య ఆక్వా కంపెనీలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు 10 మంది సీబీఐ అధికారులు స్థానిక పోలీసుల సహకారంతో సోదాలు జరిపారు. సీబీఐ ఇన్స్పెక్టర్ బల్వీందర్ సింగ్ ఆధ్వర్యంలో సీబీఐ బృందం ఈ తనిఖీలు చేసింది. జిల్లాలోని శంఖవరం మండలం కత్తిపూడి సమీపాన ఉన్న సంధ్య ఆక్వా సీడ్ తయారీ కంపెనీ, కృష్ణా జిల్లా పామర్రు తదితర ప్రాంతాల్లో ఉన్న సంధ్య ఆక్వా కంపెనీల్లో తనిఖీలు నిర్వహించినట్లు చెబుతున్నారు. కత్తిపూడి సమీపంలోని సంధ్య ఆక్వా సీడ్ కంపెనీని ఇటీవలే ప్రారంభించారు. దీనిలో ఆక్వా సీడ్ తయారీకి అవసరమైన ముడి సరుకును బ్రెజిల్ నుంచి దిగుమతి చేయడంతో ఆ సరకు నౌక ద్వారా విశాఖకు కంటైనర్లలో చేరింది. వాటిలో డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించిన సీబీఐ అధికారులు సంధ్య కంపెనీలన్నింటిపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో మూలపేటలోని సంధ్య ఆక్వా కంపెనీని క్షుణ్ణంగా పరిశీలించి మందులు, ఇతర శాంపిల్స్ సేకరించారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకూ సంధ్య ఆక్వా కంపెనీని క్షుణ్ణంగా పరిశీలించిన సీబీఐ అధికారులు తిరిగి సోదాలు చేస్తామని తెలిపారు. చీరాలకు లింకు? డ్రగ్స్ దందాకు చీరాలతో కూడా లింకులు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. సంధ్యా ఆక్వా పేరుతో వాడరేవులో గత రెండేళ్లుగా కంపెనీ నడుస్తోంది. దీన్ని పురందేశ్వరి అల్లుడు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. గత పది రోజులుగా ఈ కంపెనీ కార్యకలాపాలు నిలిచిపోయాయని సమాచారం. మూడోసారి 150 బ్యాగుల్లో శాంపిల్స్ పరీక్ష డ్రగ్స్ కేసులో సీబీఐ దూకుడు పెంచింది. శుక్రవారం మరికొన్ని శాంపిల్స్‌ను పరీక్షించగా ఫలితాలు పాజిటివ్‌గా వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో న్యాయమూర్తి సమక్షంలో 25 వేల కేజీల సరుకుతో కూడిన కంటైనర్‌ను సీజ్ చేశారు. బ్రెజిల్‌లోని శాంటోస్ పోర్టు నుంచి రవాణా నౌక ద్వారా విశాఖకు వచ్చిన కంటైనర్‌లో డ్రగ్స్ ఉన్నట్లు ఇంటర్‌పోల్ ఇచ్చిన సమాచారంతో సీబీఐ అధికారులు తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 19, 20వ తేదీల్లో 49 బ్యాగుల్లో శాంపిల్స్‌ను పరీక్షించగా డ్రగ్స్ ఉన్నట్లు నిర్ధారణైంది. దీంతో ఈ నెల 21వ తేదీన సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేటు లిమిటెడ్‌పై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. తాజాగా శుక్రవారం మరోసారి వీసీటీపీఎల్కు వెళ్లి మూడోసారి 150 బ్యాగుల్లో శాంపిల్స్‌ను పరీక్షించారు. వాటి ఫలితాలు కూడా పాజిటివ్‌గా వచ్చినట్లు సమాచారం. న్యాయమూర్తి సమక్షంలో రికార్డులతో పాటు శాంపిల్స్‌ను సైతం పరిశీలించినట్లు తెలుస్తోంది. న్యాయమూర్తి సమక్షంలోనే బ్యాగులను సీజ్ చేశారు. మరికొన్ని సీబీఐ బృందాలు సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించాయి. ఈ నేపథ్యంలోమరిన్ని ఆధారాలతో సీబీఐ అధికారులు త్వరలోనే అరెస్టులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ‘ఆలపాటి’ ఆర్థిక బంధం విశాఖ డ్రగ్స్ కేసులో కీలక పాత్రధారి కూనం వీరభద్ర చౌదరి(వీరభద్రరావు)తో మాజీ మంత్రి ఆలపాటి రాజాకు ఉన్న ఆర్థిక సంబంధాలు చర్చనీయాంశంగా మారాయి. ఆలపాటి రుణాలకు కూనం సెక్యూరిటీ ఇవ్వడంతోపాటు ఎన్ఆర్ఐ అకాడమీతో భాగం పంపిణీ చేసుకోవడం వంటి వ్యవహారాలు చోటు చేసుకున్నాయి. 2015 అక్టోబరు 31న ఆలపాటి రాజేంద్రప్రసాద్ గుంటూరు అరండల్‌పేట విజయా బ్యాంకు బ్రాంచ్‌లో రూ.2 కోట్లు రుణం (దస్తావేజు నంబరు 11158/2015) తీసుకున్నారు. అదే ఏడాది డిసెంబరు 9న మరో రూ.12 కోట్లు అదే బ్యాంకు నుంచి రుణాన్ని పొందారు. దీనికి ఆలపాటి రాజా భార్య ఆలపాటి మాధవితోపాటు కూనం వీరభద్రరావు, ఎన్ఆర్ఐ అకాడమీ ఆస్తులను (దస్తావేజు నంబరు 12521/2015) తనఖా పెట్టారు. 2021లో కూనం వీరభద్రరావుకు ఎన్నారై అకాడమీకి సంబంధించి పార్టీషన్ దస్తావేజు కూడా నమోదైనట్లు తెలుస్తోంది. కూనం వీరభద్రరావు తమ ఆస్తులను తనఖా పెట్టి 2017లో బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు రుణాన్ని ఇప్పించారు (దస్తావేజు నంబరు 4581/2017). ఇదే దస్తావేజును 2021లో (నంబరు 12205/2021) రద్దు చేసుకున్నారు. దీంతోపాటు మరికొన్ని ఆర్థిక లావాదేవీలు కూడా వీరిద్దరి మధ్య జరిగినట్లు తెలుస్తోంది. -
చీరాల టీడీపీలో నాలుగు స్తంభాలాట
చీరాల: చీరాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అయోమయంగా తయారైంది. పార్టీ అధిష్టానం ఆశావాహులందరికీ అనేక ఆశలు పెడుతోంది. ఇందులో చంద్రబాబు దగ్గరకు కొందరు వెళ్లి బీసీ కార్డు చూపుతుంటే మరికొందరు మాత్రం సామాజిక సమీకరణాల పేరుతో లోకేష్‌ను ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రతి ఎన్నికల మాదిరిగానే చీరాల్లో టీడీపీ టికెట్ చివరి వరకు దోబూచులాడుతూనే ఉంది. తండ్రీ, కొడుకులు ఆశావాహులకు గంపెడాశలు పెట్టడంతో చీరాల్లో టీడీపీ మూడు వర్గాలు.. ఆరు ముఠాలుగా మారింది. రెండేళ్ల కిందట నుంచి కందుకూరు ప్రాంతానికి చెందిన ఎంఎం కొండయ్యను చీరాల టీడీపీ ఇన్చార్జిగా నియమించారు. చీరాల టీడీపీ టికెట్ నీకేనని చంద్రబాబు గట్టిగా హామీ ఇవ్వడంతో అప్పటి నుంచి ఆయనే పార్టీని నడిపిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ కొండయ్యను విజయవాడ, హైదరాబాద్ తిప్పుతున్నారే కానీ టికెట్ ఖరారు చేయలేదు. ఇదిలా ఉంటే చేనేతలకు టికెట్ ఇవ్వాలని ఆ వర్గానికి చెందిన మునగపాటి బాబు, సజ్జా హేమలత, మంగళగిరికి చెందిన తిరువీధుల శ్రీనివాసరావులు పట్టుబడుతున్నారు. చీరాల టికెట్ ఇస్తే చేనేతలకే ఇవ్వాలని శుక్రవారం రజనీబాబాతో కలిసి చంద్రబాబును కలిశారు. అయినప్పటికీ వారికి చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వలేదు. సర్వేలు, ఆర్థిక బలాలు, కుల సమీకరణాలను పరిగణలోకి తీసుకుని మళ్లీ కబురు పెడుతామని, టికెట్ ఆశిస్తున్న బీసీ నేతలను తండ్రీ, కొడుకులు వెనక్కి పంపించారు. తల పట్టుకుంటున్న ఆశావహులు.. అయితే అద్దంకికి చెందిన మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య, తనయుడు కృష్ణచైతన్య వైఎస్సార్ సీపీని వీడి చీరాల టీడీపీ కోసం ఆశిస్తున్నారు. ఇందులో భాగంగా చీరాలలోని కొంతమంది ప్రముఖులు మాజీ మంత్రి పాలేటిని వెంటబెట్టుకుని కలుస్తున్నారు. దీంతో చీరాల సీటు ఓసీలకు ఇస్తారా? బీసీలకు ఇస్తారా? బీసీల్లోని చేనేత వర్గానికి ఇస్తారా? అని డోలాయమానంగా ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం డీఎస్పీగా పనిచేస్తున్న ఓ వ్యక్తి చంద్రబాబుకు అనుకూలంగా ఉండే ఓ అధికారి యాదవ సామాజికవర్గానికి సీటు ఇస్తే తనకే కేటాయించాలని చంద్రబాబు వద్ద పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే వైఎస్సార్ సీపీ 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ మాత్రం చీరాల నుంచి ఎవరూ పోటీ చేస్తారో అనే సందేహంతో నాయకులు, కార్యకర్తలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటికి చీరాల టీడీపీ అభ్యర్థి వ్యవహారంలో చంద్రబాబు మైండ్ గేమ్ ప్రదర్శించడం చీరాల ఆశావాహులకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లుగా ఉంది. శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో చీరాలకు చెందిన మాజీ మంత్రి పాలేటి రామారావు, మాజీ ఎమ్మెల్యే చెంచుగరటయ్య, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డితో కలిసి టీడీపీలో చేరారు. -
తగ్గేదే లే.. తాడోపేడో!
సాక్షి నెట్వర్క్: పొత్తుల కత్తులు తెలుగుదేశం పార్టీని రోడ్డున పడేసింది. చంద్రబాబు, లోకేశ్ డబ్బుకు అమ్ముడు పోయారని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నమ్మకంగా పనిచేసిన వారికి వెన్నుపోటు పొడిచారని చంద్రబాబు, లోకేశ్‌పై తమ్ముళ్లు నిప్పులు చెరిగారు. తన స్వలాభం కోసం పొత్తు అంటూ తమను నట్టేట ముంచారని, డబ్బు సంచులతో వచ్చిన వారికి, పక్క పార్టీలు చెత్త అని పక్కన పెట్టిన వారిని తీసుకొచ్చి టికెట్లు కట్టబెడతారా? అంటూ ఆగ్రహ జ్వాలలు వ్యక్తం చేశారు. దీనికి ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరికలు జారీ చేశారు. నమ్మించి గొంతుకోసిన బాబుకు బుద్ధి చెబుతామని, రెబల్‌గా పోటీ చేసి తమ సత్తా చూపిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం తెలుగు తమ్ముళ్లు రోడ్డెక్కి పార్టీ జెండాలు పీకేసి నిరసన తెలిపారు. దీంతో చంద్రబాబు పరిస్థితి కొరివితో తలగొక్కున్నట్లయ్యింది. బుజ్జగింపుల పర్వానికి పిలుపునిచ్చినా.. అసమ్మతి నాయకులు వెనక్కి తగ్గేది లేదనడంతో బాబుకు గుబులు పట్టుకుంది. స్వయంగా చంద్రబాబు రమ్మని పిలిచినా చాలా మంది ముఖం చాటేశారు. వచ్చినవారు ఎంత బతిమిలాడినా తగ్గేదే లేదని.. తాడేపేడో తేల్చుకుంటామని తెగేసి చెప్పారు. నేను పోటీ చేయడం ఖాయం! తాను కచ్చితంగా పోటీలో ఉంటానని టీడీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కేఎస్ జవహర్ ప్రకటించారు. కొవ్వూరులో శుక్రవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. కొంతమంది మాటలు విని చంద్రబాబు తనను పక్కన పెట్టారని, పైరవీలు చేసిన వారికి ప్రాధాన్యం కల్పించారని ఆరోపించారు. ప్రజలను, నాయకులను నమ్ముకున్నానని, క్యాడర్‌తో మాట్లాడిన తర్వాత నిర్ణయం వెల్లడిస్తానని చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చాక ఇల్లు అమ్ముకున్నానని, పౌల్ట్రీ వేలానికి వెళ్లిందని, అన్ని రకాలుగా ఆర్థికంగా దెబ్బతిన్నానని చెప్పారు. టీడీపీలో పెత్తందారులదే రాజ్యమని.. జిల్లా నాయకులు కుట్రలు చేసి తప్పు చేయకపోయినా తనను మంత్రి పదవి నుంచి తొలగించారని టీడీపీ నాయకురాలు పీతల సుజాత ఆవేదన వ్యక్తం చేశారు. తనకు టిక్కెట్ ఇవ్వకపోవడం చాలా బాధగా ఉందంటూ శుక్రవారం వీడియో విడుదల చేశారు. ఎన్నారైలు, పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఎన్నికలయ్యాక వెళ్లిపోతారని చెప్పారు. చంద్రబాబు చుట్టూ బ్రోకర్లే.. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా ఎన్.రాఘవేంద్రరెడ్డిని ప్రకటించడంతో నియోజకవర్గ ఇన్చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి అనుచరులు ఆందోళన బాట పట్టారు. శుక్రవారం మంత్రాలయంలో అనుచరులతో భారీ ర్యాలీ, రాస్తారోకో నిర్వహించి టైర్లను తగలబెట్టారు. ఈ సందర్భంగా పాలకుర్తి మాట్లాడుతూ చంద్రబాబు చుట్టూ బ్రోకర్లు ఉన్నారని.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానన్నారు. కృష్ణాలో ఆరని మంటలు విజయవాడ వెస్ట్ సీటు తనకే ఖరారయ్యిందని జనసేన నేత పోతిన మహేష్ ఇంటింటికి ప్రచారం చేశారు. పోతినకు టికెట్ ఇవ్వలేకపోతున్నట్లు ప్రకటించి పవన్ హైదారాబాద్ వెళ్లిపోయారు. దీంతో మహేష్ డివిజన్ ఇన్చార్జిలు, కార్యకర్తలతో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేసి ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలు బోరున విలపించారు. పవన్ తీరుపై పోతిన మహేష్, జనసేన కార్యకర్తలు మండిపడ్డారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని మహేష్ హెచ్చరించారు. పెనమలూరు టికెట్ ఇవ్వడం లేదని బోడే ప్రసాద్‌కు అధిష్టానం చెప్పగా.. చంద్రబాబు పిలుపు మేరకు ఆయన శుక్రవారం మధ్యాహ్నం వెళ్లి కలిశారు. బాబు ఆయనకు సృష్టమైన హామీ ఇవ్వలేదు. చంద్రబాబు ఎంత నచ్చజెప్పినా బోడె ప్రసాద్ వెనక్కితగ్గలేదు. నమ్మకున్న వారికి ద్రోహం చేసి పార్టీని ఎలా గెలిపించుకుంటారని చంద్రబాబును ఎదురు ప్రశ్నించినట్టు సమాచారం. సీటు లేదు.. ఓటు వేయండంటూ యనమలకుదురు నుంచి ఆయన పాదయాత్ర చేపట్టారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మైలవరం టీడీపీ ఇన్చార్జి దేవినేని ఉమాను గురువారం రాత్రి కూడ బాబు పిలిపించినట్లు సమాచారం. వసంతకు సహకరించాలని చెప్పినట్లు తెలిసింది. దీంతో ఆయన రగిలిపోతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు పిలుపునకు పలకని వర్మ పిఠాపురం సీటులో పవన్ కళ్యాణ్ పోటీకి సిద్ధమయ్యారు. దీంతో అక్కడి టీడీపీ ఇన్చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి తన నివాసానికి రావాలని పిలిచినా ముఖం చాటేశారు. తనను బుజ్జగించే కంటే సీటు ఇస్తేనే పరిస్థితి సద్దుమణుగుతుందని వర్మ గట్టిగా చెప్పారు. సీటు దక్కక పోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేసి తన సత్తా చూపిస్తానని సవాల్ విసిరారు. పెదకూరపాడులో గెలుపు ఎలా సాధ్యం? పెదకూరపాడు అభ్యర్థి భాష్యం ప్రవీణ్‌కు కేటాయించగా.. అక్కడ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ను ఎలాగైన ఒప్పించి, ప్రవీణ్‌కు సహకరించేలా ఆయనను చంద్రబాబు దగ్గర తీసుకొచ్చారు. పార్టీ అధికారంలోకి రాగానే తగిన ప్రాధాన్యం ఇస్తామని చంద్రబాబు చెప్పినా.. అసలు గెలుపు ఎలా సాధ్యమని శ్రీధర్ ప్రశ్నించినట్లు సమాచారం. ఎచ్చెర్ల టీడీపీ ఇన్చార్జిగా ఉన్న కళా వెంకట్రావు పేరుకూడా రెండో జాబితాలో లేకపోవడంతో ఆయన వర్గం ఆందోళనకు దిగింది. చంద్రబాబు బుజ్జగించి..చీపురుపల్లి వెళ్లాలని సూచించినప్పటికీ అంగీకరించలేదని సమాచారం. నమ్మించి గొంతు కోశారు కష్టకాలంలో పార్టీని, కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చానని, అయినా తనకు టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేశారని కోవూరు నియోజకవర్గ టీడీపీ నేత పోలంరెడ్డి దినేష్‌రెడ్డి అన్నారు. కొడవలూరులో ఆత్మీయులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. పలుమార్లు ఎమ్మెల్యే అభ్యర్థి అని ప్రకటించి చివరికి నడిబజారులో గొంతు కోశారని ఆవేదన వ్యక్తం చేశారు. దినేష్‌రెడ్డి ఇండిపెండెంట్‌గా పోటీచేయాలని కార్యకర్తలు కోరారు. యాదవులపై చిన్నచూపు పుంగనూరు నుంచి తానే పోటీలో ఉంటానని బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్ ఆశించగా.. టీడీపీ నాయకుడు చల్లా రామచంద్రారెడ్డినే ఖరారు చేయటంతో యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంకటగిరి టికెట్ ఈ సారి బీసీలకు కేటాయించాలని మస్తాన్ యాదవ్, మరి కొందరు చేనేత కార్మికులు గట్టిగా ప్రయత్నాలు చేశారు. చివరకు చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ రెండో భార్య కుమార్తె లక్ష్మీసాయి ప్రియ పేరును ప్రకటించటంతో బీసీ సామాజికవర్గానికి చెందిన వారంతా రగిలిపోతున్నారు. డాలర్ దివాకర్‌రెడ్డి చంద్రగిరి నుంచి పోటీ చేయాలని కొంత కాలంగా బ్యానర్లు, ఫ్లెక్సీలతో హంగామా చేస్తూ వచ్చారు. చివరకు చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన పులివర్తి నానికి కేటాయించటంతో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఏలూరు బీజేపీలో ముసలం ఏలూరు ఎంపీ సీటు ఆశిస్తున్న గారపాటి సీతారామాంజనేయ చౌదరికి షాకివ్వడంతో ఆయన అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇక్కడ నుంచి సుజనా చౌదరి, సీఎం రమేష్ తదితరులు పోటీకి ఆసక్తి చూపుతున్నారు. శుక్రవారం ఏలూరు మినీ బైపాస్‌లోని క్రాంతి కళ్యాణ మండపంలో ఆత్మీయ సమావేశం పేరుతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల సమయంలో వలస పక్షుల మాదిరిగా రాబందులు డబ్బు సంచులతో వాలిపోతారని, గెలిస్తే ఢిల్లీలో ఉంటారని, లేకపోతే అడ్రస్ ఉండరని ఘాటుగా విమర్శించారు. ఆరు నూరైనా పోటీ చేసి తీరుతానని స్పష్టం చేశారు. చోడవరంలో జనసేన ఆగ్రహ జ్వాల చోడవరం టికెట్ టీడీపీకి ఇవ్వడంపై జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు. జనసేన సమన్వయకర్త పీవీఎస్ఎన్ రాజు అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో శుక్రవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఐదేళ్లుగా అనేక ఉద్యమాలు చేశామని, తమకు కాకుండా టీడీపీకి ఎలా కేటాయిస్తారని సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ సరైన నిర్ణయం తీసుకోకపోతే టీడీపీ అభ్యర్థికి పనిచేయడానికి జనసేన సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. జనసేన నేతలకు అవమానం చిత్తూరుకు చెందిన ఆరణి శ్రీనివాసులు అనుచరులు తిరుపతి జనసేన నేతలను తీవ్రంగా అవమానించారు. జనసేనకు తిరుపతి అసెంబ్లీని కేటాయించినా.. పోటీ చేసేందుకు బలమైన నాయకులు లేరని, అందుకే చిత్తూరు నుంచి చీరలు, గాజులు పంపిస్తున్నామంటూ అవమానించారని జనసేన నేత కిరణ్‌రాయల్ పార్టీ అంతర్గత సమావేశంలో వెల్లడించారు. ఆరణికి టికెట్ ఇస్తే పనిచేసేది లేదంటూ తీర్మానం చేసి ఆ లేఖను అమరావతికి పంపారు. పార్టీ పదవులకు పరుచూరి రాజీనామా జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు పరుచూరి భాస్కరరావు చెప్పారు. ఐదేళ్లుగా పార్టీ కోసం కష్టపడితే పవన్‌కళ్యాణ్ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదన్నారు. కొత్తగా వచ్చిన కొణతాలకు టికెట్ ఇవ్వడం అన్యాయమన్నారు. వంతలకు భంగపాటు రంపచోడవరం టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ వంతల రాజేశ్వరి, మాజీ ఎమ్మెల్యే శీతంశెట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం చంద్రబాబును కలిసేందుకు వెళ్లారు. వారికి భంగపాటు ఎదురైంది. బాబును కలిసేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకోవడంతో మధ్యాహ్నం వరకు ఆందోళన చేశారు. పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు లేదని ధ్వజమెత్తారు. నలుగురికి చంద్రబాబును కలిసే అవకాశం రాగా.. శిరీష భర్త మఠం భాస్కర్‌పై వారు ఫిర్యాదు చేశారు. రెబల్‌గా పోటీ చేస్తా! ‘చంద్రబాబు గారు.. మేం చేసిన పాపం ఏమిటి? భార్య బిడ్డలను వదిలి పార్టీ కోసం కష్టపడి పనిచేశా. సత్యవేడు సీటు ఎందుకు ఇవ్వలేదు. ఆదిమూలం చెత్త అని వైఎస్సార్సీపీ టికెట్ ఇవ్వలేదు. ఆ చెత్తను మనం ఎందుకు నెత్తిన వేసుకోవాలి. నేను రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తాను. కోనేటి ఆదిమూలాన్ని ఓడించి తీరుతాను’ అని సత్యవేడు టీడీపీ మాజీ ఇన్చార్జి జేడీ రాజశేఖరరెడ్డి స్పష్టం చేశారు. జేడీ రాజశేఖరరెడ్డి గురువారం కుటుంబ సభ్యులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. 2019 నుంచి పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని, ఆదిమూలం ఎమ్మెల్యేగా గెలుపొందాక.. కేసులు పెట్టి వేధించారని గుర్తుచేశారు. తాను వ్యాపారం చేసుకునేదానిని, టీడీపీ గెలుపు కోసం అన్నీ వదిలేసి కష్టపడి పనిచేశాని జేడీఆర్ కుమార్తె మౌనిక కన్నీరు మున్నీరైంది. సత్యవేడు సీటు కోసం నాలుగేళ్లుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే హేమలత కుమార్తె డాక్టర్ హెలెన్ మనస్తాపంతో నివాసానికే పరిమితమయ్యారు. ఎంపీ ఇంటి ముందు అర్ధనగ్న ప్రదర్శన శ్రీకాకుళం అసెంబ్లీ టికెట్ మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవికి ఇవ్వాలంటూ టీడీపీ నాయకులు ఎంపీ రామ్మోహన్నాయుడు ఇంటి ముందు శుక్రవారం అర్ధనగ్న ప్రదర్శన చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎంపీ ఇంటి గేటు ముందు బైఠాయించడంతో పాటు కార్యాలయంలోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. లక్ష్మీదేవి అభ్యర్థిత్వం ఖరారు కాకపోతే ఎంపీ రామ్మోహన్నాయుడు గెలవరంటూ నినాదాలు చేశారు. విజయవాడ వెళ్లి పరిస్థితులను చంద్రబాబుకు వివరిస్తానని రామ్మోహన్నాయుడు తెలిపారు. అమలాపురంలో నువ్వా.. నేనా అమలాపురం అసెంబ్లీ స్థానంపై సర్వేలో శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అభ్యర్థిత్వంపై అభిప్రాయ సేకరణ చేశారు. మధ్యాహ్నం నుంచి సీన్ మారింది. మాజీ ఎంపీ ఏజేవీబీ మహేశ్వరావు కుమార్తె పాము సత్యశ్రీ అభ్యర్థిత్వంపై ఐవీఆర్ఎస్ సర్వే మొదలైంది. ఒకే రోజు ఇద్దరి పేర్లపై సర్వేతో పార్టీ క్యాడర్లో గందరగోళం నెలకొంది. మరోవైపు జనసేన పార్టీ ఇన్చార్జి శెట్టిబత్తుల రాజబాబు, పార్లమెంటరీ ఇన్చార్జి డీఎంఆర్ శేఖర్లు తమకే టికెట్ దక్కుతుందనే ఆశతో ఉన్నారు. ఈ సమయంలో టీడీపీ ఐవీఆర్ఎస్ సర్వే చేపట్టడం జనసేనలో ఆగ్రహాన్ని కలిగించింది. దీంతో వారు అమలాపురం గడియారస్తంభం సెంటర్లో ఆందోళనకు దిగారు. అమలాపురం సీటు జనసేనకు కేటాయించాల్సిందేనని, లేకుంటే పొత్తు పక్కన పెట్టి టీడీపీని ఓడిస్తామని హెచ్చరించారు. -
పొత్తులే కత్తులై..
సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్ : పొత్తుల కోసం వెంపర్లాడిన తెలుగుదేశం పార్టీ పుట్టి మునుగుతోంది. పొత్తుల పోటు గట్టిగా తగలడంతో సీనియర్ల సీట్లకు అధిష్టానం ఎసరుపెట్టింది. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. సీనియర్లు బజారుకెక్కి పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం టికెట్ వసంత కృష్ణప్రసాద్కేనని అధిష్టానం చెప్పడంతో ఉమా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు తెలిసింది. పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌కూ టికెట్ లేదని పార్టీ సంకేతాలిచ్చింది. దీంతో ఆయన తన అనుచరులతో సమావేశమయ్యారు. రాజీనామాకు సిద్ధమవుతున్నారు. తనను కాదని పార్టీ ఎలా గెలుస్తుందో చూస్తానని సవాల్ విసిరారు. అవసరమైతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానంటూ హెచ్చరించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని తొలుత జనసేనకు కేటాయించినట్టు పార్టీ సమాచారం ఇవ్వడంతో బుద్దా వెంకన్న, జలీల్‌ఖాన్, ఎంకే బేగ్ ఖంగుతిన్నారు. బుద్దా వెంకన్న అనుచరులతో సమావేశం నిర్వహించి మరీ పార్టీకి పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. జలీల్‌ఖాన్ పార్టీ వీడతానని బెదిరించారు. ఇప్పుడు ఈ సీటును బీజేపీ కోరుతున్నట్టు తెలియడంతో సీటుపై ఆశలు పెట్టుకున్న జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్కూ షాక్ తగిలింది. అవనిగడ్డ సీటును జనసేనకు కేటాయించడంతో మండలి బుద్ధప్రసాద్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బండారుకు చుక్కెదురు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి గట్టి షాక్ తగిలింది. విశాఖ జిల్లా పెందుర్తి సీటును జనసేనకు కేటాయించడంతో ఆయన రగిలిపోతున్నారు. ఈ సీటును పంచకర్ల రమేష్‌బాబుకు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ప్రకటించడంతో బండారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంటికే పరిమితమయ్యారు. దీంతో పంచకర్లను ఓడిస్తామని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. టీడీపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి కళావెంకట్రావుకు ఎచ్చెర్ల సీటు ఖరారు చేయకుండా ఇంకా గాల్లోనే పెట్టారు. వయసు రీత్యా ఆయనను పక్కనపెట్టాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఉత్తరాంధ్రకు చెందిన మరో కీలక నేత గంటా శ్రీనివాసరావు సీటును ఇంకా ఖరారు చేయలేదు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు సీటు నిరాకరించి ఆ స్థానాన్ని జనసేనకు ఇవ్వడంపై ఆయన రంకెలు వేస్తున్నారు. మెలవరం సీటు గందరగోళంగా మారింది. పల్నాడు జిల్లాలో ఆశావహుల డీలా పల్నాడు జిల్లాలో సైకిల్ పార్టీ డీలా పడింది. నరసరావుపేట అసెంబ్లీ సీటుపై ఇంకా సందిగ్ధం వీడలేదు. టీడీపీ నేత చదలవాడ అరవిందబాబు ఆందోళన చెందుతున్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తనకు సీటు దక్కకుండా చేస్తున్నారని ఆయన సన్నిహితుల వద్ద వాపోతున్నట్టు సమాచారం. మరోవైపు ఈ సీటులో బీజేపీ పోటీ చేస్తుందన్న ప్రచారం ఊపందుకుంది. గురజాల అభ్యర్థిగా యరపతినేని శ్రీనివాసరావు పేరు ఖరారు కావడంతో వైఎస్సార్సీపీకి దూరం జరిగి టీడీపీతో సన్నిహితంగా ఉంటున్న జంగా కృష్ణమూర్తి డైలమాలో పడ్డారు. జవహర్‌కు అవమానం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు సీటు కోసం ఆశలు పెట్టుకున్న మాజీ మంత్రి కేఎస్ జవహర్‌ను ఆ పార్టీ అధిష్టానం ఘోరంగా అవమానించింది. ఈ సీటును గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు కేటాయించింది. దీంతో జవహర్ వర్గీయులు అధిష్టానం తీరుపై మండిపడుతున్నారు. నిడదవోలు సీటు ఆశిస్తున్న శేషారావుకు శరాఘాతం తగిలింది. ఈ సీటును జనసేనకు కేటాయించడంతో ఆయన వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది. గోపాలపురం సీటును మద్దిపాటు వెంకట్రాజుకు కేటాయించడంతో అక్కడ పార్టీ శ్రేణుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. మాజీ జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు వర్గం వెంట్రాజు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తోంది. పరిటాలకు బాబు ఝలక్ అనంతపురం జిల్లా ధర్మవరం సీటు ఆశించిన పరిటాల శ్రీరామ్ చతికిలపడ్డారు. సీటును బీజేపీకి కేటాయించడంతో వరదాపురం సూరి ఎగరేసుకుపోయారు. దీంతో ఏం చేయాలో పాలుపోక శ్రీరామ్ తల్లడిల్లుతున్నారు. పుట్టపర్తి సీటును పల్లె రఘునాథరెడ్డి కోడలు సింధూరరెడ్డికి కేటాయించడంతో బీసీ వర్గాలు భగ్గుమంటున్నాయి. ఇక్కడ వడ్డెర సామాజికవర్గ నేతలు టికెట్ ఆశించారు. కదిరిలో 2009లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన కందికుంట వెంకట ప్రసాద్‌కు డీడీల కేసులో శిక్ష పడింది. ఆయన భార్యకు ఇప్పుడు పార్టీ టికెట్ ఇవ్వడంపై ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. అనంతపురం, గుంతకల్లు సీట్లపై టీడీపీ ఇంకా సస్పెన్స్ కొనసాగిస్తోంది. జనసేనకు అన్ని టికెట్లా.. తీవ్ర అసంతృప్తి ♦ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేనకు ఆరు టికెట్లు కేటాయించడంపై టీడీపీ కేడర్ రగిలిపోతోంది. ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ శ్రేణుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. పోలవరాన్ని కూడా జనసేనకు కేటాయిస్తున్నట్టు సమాచారం. ♦ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఆత్మకూరు, కోవూరు, కావలి, ఉదయగిరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాలలో టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. ఆత్మకూరు నియోజకవర్గంలో సీనియర్‌నేతలు కొమ్మి లక్ష్మయ్యనాయుడు, కన్నబాబు అసంతృప్తితో ఉన్నారు. ఇక్కడ వలస నేత ఆనం రామనారాయణరెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కోవూరు, కావలిల్లోనూ ఆ పార్టీ ఆశావహులు టికెట్ల కేటాయింపుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కోవూరు సీటును ఇటీవలే టీడీపీలో చేరిన ప్రభాకర్‌రెడ్డి సతీమణి ప్రశాంతిరెడ్డికి ఇవ్వడంతో ఇన్నాళ్లూ అక్కడ పార్టీ కోసం పనిచేసిన పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి కుటుంబం రగిలిపోతోంది. సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని పార్టీ అధిష్టానం పూర్తిగా పక్కన పెట్టేసింది. ♦ ఉమ్మడి చిత్తూరులో చిచ్చు రేగింది. సత్యవేడు సీటును టీడీపీలో కూడా చేరని ఆదిమూలంకు ఇవ్వడంపై తెలుగుదేశం ఆశావహుల్లో ఆగ్రహ జ్వాలలు రేగాయి. గతంలో బాబు నుంచి హామీ పొందిన మాజీ ఎమ్మెల్యే హేమలత కుమార్తె డాక్టర్ హెలెన్, జేడీ రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే తలారి ఆదిత్య వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కడప జిల్లా ప్రొద్దుటూరు స్థానాన్ని వరదరాజులరెడ్డికి కేటాయించడం పట్ల లింగారెడ్డి, సురేష్, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ♦ తిరుపతి సీటును ఆరణి శ్రీనివాసులుకు జనసేన కేటాయించడంపై ఆ పార్టీలో అసంతృప్తి రగులుతోంది. దీంతో ‘ఆరణి’ గో బ్యాక్’ అనే నినాదాలతో నగరంలో ఫ్లెక్సీలు వెలిశాయి. చంద్రగిరి సీటును పులవర్తి నానికి కేటాయించడంతో రియల్టర్ డాలర్ దివాకర్‌రెడ్డి నీరుగారారు. ♦ వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి నుంచి ప్రతిసారీ ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉంటావని నారాయణరెడ్డి తనయుడు, పార్టీ ఇన్చార్జి భూపేష్‌రెడ్డిని ఊరించి, చివరికి జమ్మలమడుగు సీటు బీజేపీ(ఆదినారాయణరెడ్డి)కి కేటాయించినట్లు వెల్లడించడంతో నారాయణరెడ్డి కుటుంబం సంకట స్థితిలో పడింది. -
కొడుకు కళ్లెదుటే తండ్రి ఉరేసుకుని
కౌడిపల్లి (నర్సాపూర్): ఆర్థిక ఇబ్బందులు భరించలేక నాలుగేళ్ల కన్నకొడుకు కళ్ల ముందే తండ్రి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లిలో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ రంజిత్‌కుమార్‌రెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నవీన్(34), అతని తల్లి లలిత వ్యవసాయం, కూలీ పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. నవీన్ భార్య.. కుమారుడు లోకేష్ పుట్టిన తర్వాత వీరికి దూరంగా వెళ్లిపోయింది. కాగా, ఇటీవల లలిత కాలుకు గాయమై తీవ్ర అస్వస్థతకు గురికావడంతో తొలుత మెదక్‌లో వైద్యం చేయించారు. అక్కడ తగ్గకపోవడంతో వైద్యులు.. గాంధీ ఆసుపత్రికి రెఫర్ చేశారు. కొన్ని రోజులుగా చికిత్స పొందుతోంది. కాలుకు ఇన్ఫెక్షన్ అయిందని, తొలగించాల్సి వస్తుందని వైద్యులు చెప్పారు. ఆసుపత్రి ఖర్చులు, కుటుంబ అవసరాలకు డబ్బులు లేకపోవడంతో నవీన్ అప్పులు చేశాడు. దీంతో రోజురోజుకూ ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలో ఉదయం నవీన్ తన కొడుకు లోకేష్‌తో కలిసి చింతకాయలు తెంపుకొద్దామని తీసుకెళ్లాడు. గ్రామ సమీపంలో కొడుకు చూస్తుండగానే.. చింతచెట్టు ఎక్కి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాలుడు ఏడుస్తుండటంతో అటుగా వెళుతున్న గ్రామస్తులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు దర్యాప్తులో ఉంది. -
‘సిద్ధం’కాని సైకిల్
సాక్షి, అమరావతి: ఒకవైపు ‘సిద్ధం’ పేరుతో వైఎస్సార్సీపీ అధినేత, సీఎం జగన్ ఎన్నికల శంఖారావాన్ని పూరించి మొదటి దశను దిగ్విజయంగా పూర్తి చేసే దశలో ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఇంకా ఆ ఘట్టాన్ని ప్రారంభించలేక సతమతమవుతున్నారు. సీట్ల ఖరారు నుంచి, ఎన్నికల సన్నాహక సభల వరకు ఏ విషయంలోనూ ఆయన అధికార పార్టీకి కనీస పోటీ ఇవ్వలేక చతికిలపడుతున్నారు. వైఎస్ జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోలేననే భయంతో ఇంకా పొత్తుల కోసం పాకులాడుతుండడం ఆయన బేలతనాన్ని స్పష్టం చేస్తోంది. ఎవరు ఏ స్థానాల్లో పోటీ చేస్తారో తెలియక, అసలు పోటీ చేసే స్థానాలు ఏవో అర్థంకాక టీడీపీ నేతలు క్షేత్ర స్థాయిలో తీవ్ర నిరుత్సాహంలో మునిగిపోయారు. త్వరలో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్నా ఇంకా ఎన్నికలకు సిద్ధం కాలేకపోవడం కచ్చితంగా వెనుకబాటేనని, వైఫల్యానికి ఇది నాంది అని ఆ పార్టీ సీనియర్ నేతలు ఆందోళన చెందుతున్నారు. అభ్యర్థులు దొరక్క సతమతం అభ్యర్థుల ఎంపిక కోసం తాను ఇంతగా ఎప్పుడూ కష్టపడలేదని చంద్రబాబు చెబుతున్న విషయం తెలిసిందే. అభ్యర్థులు దొరక్క ఇతర పార్టీల నేతలు, ఎన్ఆర్ఐలు, పారిశ్రాకవేత్తల వైపు ఆశగా చూస్తుండడం టీడీపీ దీన స్థితిని తెలియజేస్తోంది. వైఎస్సార్ సీసీ వరుసగా అభ్యర్థుల జాబితాలు ప్రకటిస్తున్నా టీడీపీ అభ్యర్థుల జాబితాలపై చర్చ కూడా లేక క్యాడర్ నీరుగారిపోవడంతో అప్పటికప్పుడు జనసేనతో కలిసి తొలి జాబితా చంద్రబాబు విడుదల చేశారు. దానిపైనా తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తమవుతుండడంతో టీడీపీ మరింత ఇరకాటంలో పడింది. పొత్తులో భాగంగా కొన్ని సీట్లు వదులుకోవడాన్ని టీడీపీ నాయకులు జీరి్ణంచుకోలేక రోడ్డెక్కి రచ్చ చేస్తున్నారు. ఈ కారణంతోపాటు క్షేత్ర స్థాయిలో పట్టు కోల్పోవడంతో పలువురు సీనియర్లకు చంద్రబాబు మొండిచేయి చూపడంతో వారి నుంచి తిరుగుబాటు స్వరం వినిపిస్తోంది. దీంతో చంద్రబాబు వారిని బుజ్జగించలేక సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన అభ్యర్థులను ఖరారు చేయడం చంద్రబాబుకు కత్తి మీద సాములా మారింది. బీజేపీతో పొత్తు కోసం ఎదురుచూస్తుండడం, ఆ పార్టీ ఏ విషయాన్ని ఇంకా తేల్చకపోవడంతో టీడీపీలో అసహనం రోజురోజుకీ పెరిగిపోతోంది. ఆ పొత్తు కోసం కీలకమైన ఎంపీ స్థానాలు, పలు ఎమ్మెల్సీ స్థానాలకు చంద్రబాబు అభ్యర్థులను ఖరారు చేయలేదు. ముక్కీమూలిగి ఎలాగోలా కొందరు ధనబలం ఉన్న అభ్యర్థులను పట్టుకున్నా బీజేపీతో పొత్తు తేలకపోవడంతో ఏ విషయాన్ని తేల్చలేకపోతున్నారు. దీంతో నియోజకవర్గాల్లో టీడీపీ కేడర్ ఆందోళనలో మునిగిపోయింది. ఎన్నికలు సమీపిస్తున్నా ఇంకా పొత్తులు కొలిక్కి రాకపోవడం, అభ్యర్థులను ఖరారు చేయలేకపోవడం ఆ పార్టీని దెబ్బతీస్తోంది. సభలు విఫలంతో విలవిల మరోవైపు ‘రా కదలిరా’ పేరుతో చంద్రబాబు నిర్వహించిన సభల వైఫల్యం టీడీపీ వాస్తవ బలాన్ని తేటతెల్లం చేసింది. ప్రతి పార్లమెంటు పరిధిలోనూ ఒక సభ నిర్వహించడానికి ప్రణాళిక రూపొందించినా దాన్ని అమలు చేయడానికి అష్టకష్టాలు పడుతున్నామని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క సభకూ జనం ఆశించిన స్థాయిలో రాకపోవడంతో చంద్రబాబు అక్కడి నేతలపై రుసరుసలాడడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. 20కిపైగా నిర్వహించిన సభల్లో చంద్రబాబుకు ఖాళీ కుర్చీలే స్వాగతం పలికాయి. కేవలం టీడీపీ మాత్రమే సభ పెడితే జనం రావడంలేదని జనసేనతో కలిసి ఇటీవల తాడేపల్లిగూడెంలో ‘తెలుగు జన కేతన జెండా’ పేరుతో ఉమ్మడి సభ నిర్వహించారు. కానీ ఆ సభనూ జనం పట్టించుకోలేదు. చంద్రబాబు తనయుడు లోకేశ్ ‘శంఖారావం’ పేరుతో నిర్వహించిన యాత్ర టీడీపీ గాలిని పూర్తిగా తీసివేసింది. వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న ‘సిద్ధం’ సభలు ఒకదాన్ని మించి ఒకటి సూపర్ హిట్ అవుతున్నా టీడీపీ, జనసేన సభలు విఫలమవడం క్షేత్ర స్థాయిలో టీడీపీ పరిస్థితిని కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. వీటన్నింటి కంటే ముందు భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో చంద్రబాబు ప్రకటించిన ముందస్తు మేనిఫెస్టోనూ జనం పట్టించుకోలేదు. వైఎస్ జగన్ ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాల పేర్లనే మార్చి టీడీపీ మేనిఫెస్టోలో పెట్టి అభాసుపాలయ్యారు. ఈ పరిస్థితుల్లోనూ జనం నమ్మడం లేదని అర్థమై బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకుని అయినా రేసులో నిలబడి పోటీ ఇవ్వవచ్చనే ఉద్దేశంతో చేస్తున్న యత్నాలు ఫలితాన్ని ఇవ్వడంలేదు. వరుస వైఫల్యాలతో ఎన్నికలకు సిద్ధంగా లేని చంద్రబాబు దు్రష్పచారాన్ని మాత్రమే నమ్ముకున్నారు. ఎల్లో మీడియా, సోషల్ మీడియా అండతో వైఎస్ జగన్‌పై కనీవినీ ఎరుగని రీతిలో అబద్ధాలు, విష ప్రచారాలకు దిగారు. తాను అధికారంలో లేకపోవడం వల్ల ఆంధ్ర రాష్ట్రం నాశమైనపోయిందనే రీతిలో తన మేనేజ్మెంట్ నైపుణ్యంతో ప్రచారం చేస్తున్నా జనానికి మాత్రం వాస్తవం కళ్లెదుటే కనిపిస్తోంది. అందుకే చంద్రబాబు ఇంకా ఎన్నికలకు సిద్ధం కాలేక తన పాతకాలపు వ్యూహాలను నూరుతూనే ఉన్నారు. -
బాబు, లోకేష్, పవన్ ల అబద్దాలు వినాల్సిన అవసరం లేదు: ఎంపీ మోపిదేవి
-
Babu : కరకట్టపై పొత్తులు.. బాబు ఏమన్నాడంటే.?
కరకట్ట నివాసం వేడేక్కింది. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత వారం రోజులుగా హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని స్వగృహానికే పరిమితమయిన చంద్రబాబు.. ఇవ్వాళ ఉండవల్లిలోని కరకట్ట నివాసానికి వచ్చాడు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో పొత్తులపై ఆధారపడి అత్యధికంగా ప్రయోజనం పొందిన చంద్రబాబులో.. ఈ సారి మాత్రం ఆ వెలుగు కనిపించడం లేదు. రాజ్యసభలో సైకిల్ మాయం రాజ్యసభ ఎన్నికలకు రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంది. గత పది రోజులుగా తెలుగుదేశం వర్గాలు పోటీ చేస్తామంటూ రంకెలేస్తున్నాయి. మా బాబు మామూలోడు కాదని నేతలు పకడ్భందీగా ప్రకటనలిచ్చేశారు. చంద్రబాబు మీద పార్టీ సీనియర్లకు ఎంత నమ్మకం అంటే.. తమ పార్టీ తరపున గెలిచింది 23 మందే అయినా.. తమకు బలం లేదని తెలిసినా.. తమకు అవకాశమిస్తే.. గెలుస్తామని చెప్పుకున్నారు. ఓటుకు కోట్లు విషయంలో చంద్రబాబుకు ఉన్న అపారమైన అనుభవానికి ఇది ఒక నిదర్శనం. ఎన్నిక ఏదైనా ఎమ్మెల్యే ఎవరైనా.. ఎంత డబ్బైనా ముట్టజెప్పి.. తమవైపుకు తీసుకురాగల శక్తి చంద్రబాబుకు ఉందని నమ్మారు. అయితే ఇవ్వాల్టి కరకట్ట మీటింగ్‌లో ఈ విషయం తేలిపోయింది. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన ఏదీ లేదని చంద్రబాబు ప్రకటించారు. YSRCPకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేల కోసం తెరవెనక టిడిపి బృందం ఆహర్నిశలు కృషి చేసినా.. ఫలితం దక్కలేదన్న ఆవేదన బాబు మాటల్లో కనిపించింది. పొత్తులుంటాయి.. కానీ..! కరకట్ట మీటింగ్‌లో ప్రధానంగా చర్చ జరిగిన రెండో అంశం పొత్తులు. బీజేపీ-జనసేన పొత్తులో ఉన్నాయంటున్నారు, మరి మనతో ఎవరున్నారని చంద్రబాబును పార్టీ సీనియర్లు అడిగారు. దీనిపై సుదీర్ఘంగా మాట్లాడిన చంద్రబాబు.. పొత్తులు ఉంటాయని, ఆయా పార్టీల వాళ్లకు సీట్లు కేటాయించాలన్నారు. అయితే బీజేపీతో పొత్తు ఉంటుందా? ఉండదా అన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు. కొత్త వాళ్లు పోటీ చేయడం వల్ల ఇప్పటివరకున్న కొందరికి సీట్లు దొరకవని, అయితే వారికి నష్టం కలగకుండా ఉండేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చినట్టు తెలిసింది. (వాలంటైన్స్ డే సందర్భంగా చంద్రబాబు పొత్తుల గురించి సోషల్ మీడియాలో చురకలు) ఇంకా మారని తీరు చంద్రబాబు అంటేనే ఫిరాయింపులు. ఫిరాయింపులు అంటేనే చంద్రబాబు. ఎంత సేపు పక్కపార్టీ నేతలపై కన్నేసి పెట్టే చంద్రబాబు.. తాజాగా కరకట్ట మీటింగ్‌లో YSRCP నేతలెవరయినా వస్తారా అంటూ ఆరా తీసినట్టు తెలిసింది. నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జ్‌ల మార్పు నిర్ణయం తర్వాత YSRCP నుంచి భారీగా ఎంపీలు, ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తారని భావించామని నేతలు ప్రస్తావించినట్టు తెలిసింది. కొందరు నేతలకు అక్కడ టికెట్ లేదనడంతో తమ దగ్గరకు వస్తున్నారని, అక్కడ గెలవలేని వాళ్లు.. ఇక్కడ కూడా గెలుస్తారని అనుకోలేమని, అయినా అవకాశం ఉన్నచోట వారే పార్టీకి పెద్ద దిక్కని చెప్పినట్టు తెలిసింది. లోకేష్‌తో లాభమా? నష్టమా? ఎన్నికలు మరీ దగ్గరకు వచ్చాయని, ఇప్పటివరకు అభ్యర్థులు సరికదా.. పొత్తులు కూడా ఖరారు కాలేదని సీనియర్లు ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. అలాగే పార్టీ ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ఒక్క సభ కూడా పెట్టలేదని చెప్పినట్టు తెలిసింది. త్వరలో ‘‘రా....కదలి రా’’ పేరిట తాను సభలు పెట్టబోతున్నట్టు చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. అలాగే లోకేష్ శంఖారావం మీటింగ్ గురించి నేతలతో ప్రస్తావించినప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమయినట్టు తెలిసింది. తరచుగా లోకేష్ చేస్తున్న ప్రకటనలు అసలుకే మోసం తెచ్చేలా ఉన్నాయంటూ కొందరు బాబుకు చెప్పినట్టు తెలిసింది. ఎన్నికలకు కేవలం 56 రోజులే ఉన్నాయని, ఇంకా పార్టీ నేతలు ఎలక్షన్ మూడ్ లోకి రాకపోతే ఎలా అని చంద్రబాబు అడిగినట్టు సమాచారం. పొత్తులపై క్లారిటీ ఎప్పుడు.? బీజేపీతో పొత్తు పై ఇప్పుడే క్లారిటీ వచ్చే అవకాశం లేదంటున్నారు టీడీపీ నేతలు. ఈనెల 16 సాయంత్రం నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీలో బీజేపీ జాతీయ విస్తృతస్థాయి సమావేశాలున్నాయి. ఈ సమావేశాలు ముగిసేవరకు ఢిల్లీకి రావొద్దని పవన్, బాబులకు పైనుంచి ఆదేశాలు వచ్చాయి. బీజేపీ హైకమాండ్ పిలుపు కోసం వారం రోజుల నుంచి వేచి చూస్తున్నా పవన్‌ను పట్టించుకోవడం లేదు. బీజేపీ సమావేశాలు ముగిశాక ఢిల్లీ వెళ్లాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ తహతహలాడుతున్నారు. ఈలోగా 17న పర్చూరులో రా కదలిరా సభకు భారీగా జనాన్ని తీసుకురావాలని చంద్రబాబు నేతలకు ఆదేశాలిచ్చాడు. పార్టీలో ఎవరైనా చేరేవాళ్లుంటే.. తీసుకురావాలని చంద్రబాబు సూచించినట్టు తెలిసింది. -
మోదీ, షా కాళ్లు పట్టుకోవడానికి సిద్ధమయ్యాడు: మంత్రి ఆర్కే రోజా
సాక్షి, విజయవాడ: ఈ దేశంలోనే చంద్రబాబు డర్టీ పొలిటీషియన్ అని మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. ఆమె బుధవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ‘ప్రధాని మోదీ తల్లి, భార్యని తిట్టిన వ్యక్తి చంద్రబాబు. మోదీని తిట్టి, నల్ల జెండాలు ఎగురవేశాడు. మళ్ళీ ఇప్పుడు మోదీ కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధపడ్డాడు. మోదీని దేశంలో లేకుండా చేస్తానని చంద్రబాబు గతంలో అన్నాడు. అమిత్ షాపై తిరుమలలో చంద్రబాబు రాళ్లు వేయించాడు. ఇప్పుడు అమిత్ షా కాళ్ళు పట్టుకుంటున్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు కాళ్ళు పట్టుకోవడానికి తన కొడుకు లోకేష్‌ను పంపాడు. ఇప్పుడు చంద్రబాబుతో కలిస్తే బీజేపీకే నష్టం’ అని రోజా దుయ్యబట్టారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఎన్ని పార్టీలు కలిసినా వైఎస్ జగన్.. మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని మంత్రి రోజా ధీమా వ్యక్తం చేశారు. -
‘టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు.. ఆ పార్టీ పని అయిపోయింది’
ఎన్టీఆర్ జిల్లా: టీడీపీకి ఇవే చివరి ఎన్నికలని, చంద్రబాబు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని ఎంపీ కేశినేని నాని అన్నారు. ఆయన తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం మండలం వినగడపలో కట్లేరు బ్రిడ్జి పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడారు. చంద్రబాబు, ఆయన పనికిమాలిన కొడుకు కలలు కంటున్నారని మండిపడ్డారు. టీడీపీ పార్టీ పని అయిపోయిందని, అమరావతి కడతానన్న చంద్రబాబు ఏపీలో సొంతిల్లు కూడా కట్టుకోలేదని ఎద్దేవా చేశారు. ఇక్కడ సీట్లను అమ్ముకుని ఆ వచ్చిన డబ్బుతో చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్ పోతారని దుయ్యబట్టారు. 2024 ఎన్నికలవ్వగానే మేలో ఫలితాలొస్తాయని, ఫలితాలు రాగానే చంద్రబాబు, లోకేష్ వాళ్ల సొంత రాష్ట్రం తెలంగాణ పోవడం ఖాయమని మండిపడ్డారు. టీడీపీ పార్టీ ఈనాడు,ఆంధ్రజ్యోతి,టీవీ5, సోషల్ మీడియా మీదే ఆధారపడిందని, టీడీపీ పార్టీకి గ్రౌండ్ లెవల్లో పనిచేసే వారియర్స్ ఎవరూ లేరని ఎద్దేవా చేశారు. తన చిన్నప్పుడు ఎన్టీఆర్ సభల్లో చూసినంత జనం ‘సిద్ధం’ సభలో చూశానని తెలిపారు. గుడివాడలో చంద్రబాబు సభ పెడితే 3 వేల మంది కూడా రాలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాట్లాడేసరికి ఉన్నవాళ్లు కూడా వెళ్లిపోయారని, చంద్రబాబుకు అమెరికా నుంచి పార్టీ ఫండ్ ఇవ్వడానికి కమ్మోళ్లు కొంతమంది ఉన్నారని విమర్శించారు. చంద్రబాబు మాటలు నమ్మడానికి జనం సిద్ధంగా లేరని, సీఎం జగన్మోహన్రెడ్డి పేదల కోసం పనిచేసే వ్యక్తి అని గుర్తుచేశారు. ధనికుల కోసం.. పనికిమాలిన కొడుకు కోసం.. పనిచేసే వ్యక్తి చంద్రబాబ అని ధ్వజమెత్తారు. వాళ్లు బాగా సంపాదించి కొనుకున్న రోల్స్ రాయిల్స్ కార్లలో తిరగాలి కాబట్టి.. ఈనాడు, టీవీ5, ఆంధ్రజ్యోతికి నున్నటి రోడ్ల కోసం చంద్రబాబు తపనపడుతున్నారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో మనం నొక్కే బటన్ దెబ్బకు ఏపీలో టీడీపీ తుడిచిపెట్టుకుపోవాలని ప్రజలు కేశినేని పిలునిచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ కేసుపెడతారని అర్ధరాత్రి తెలంగాణ నుంచి ఏపీకి చంద్రబాబు పారిపోయి వచ్చాడని విమర్శించారు. ఇప్పుడు జగనన్న దెబ్బకు ఏపీ నుంచి తెలంగాణ పారిపోవడం ఖాయమని అన్నారు. కట్లేరు బ్రిడ్జి కోసం రూ. 25 కోట్లు మంజూరు చేసిన సీఎం జగన్మోహన్రెడ్డి అని ఎంపీ కేశినేని నాని గుర్తుచేశారు. కట్లేరు బ్రిడ్జి కోసం ప్రజలు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నారని తెలిపారు. స్వామిదాస్ వైఎస్సార్సీపీలో చేరగానే కట్లేరు బ్రిడ్జి సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లారని అన్నారు. సీఎం జగన్ తక్షణమే స్పందించి రూ. 25 కోట్లు మంజూరు చేశారని అన్నారు. ఫిబ్రవరి నెలాఖరుకల్లా టెండర్ల ప్రక్రియ పూర్తి అవుతుందని చెప్పారు. సంక్రాంతి లోగా బ్రిడ్జిని పూర్తిచేస్తామని అన్నారు. తిరువూరులో 25వేల మెజార్టీతో స్వామిదాస్ చరిత్ర సృష్టించడం ఖాయమని అన్నారు. -
వ్యూహం" సినిమాపై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్
-
విమానంలో చంద్రబాబు భార్య.. గాల్లో 20 నిమిషాలు గందరగోళం
విజయవాడ: గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద మంగళవారం ఇండిగో విమానంలో గందరగోళం నెలకొంది. ల్యాండ్ అయ్యేందుకు రన్‌వే పైకి వచ్చిన విమానం మళ్లీ గాల్లోకి ఎగిరింది. దీంతో విమానంలోని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. విమానంలో చంద్రబాబు భార్య భువనేశ్వరీ ఉండడంతో సోషల్ మీడియా ఈ వార్తకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఏం జరిగింది.? హైదరాబాద్ నుంచి విజయవాడకు ఉదయం ఇండిగో విమానం వచ్చింది. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఇండిగో విమానాన్ని లాండింగ్ చేసేందుకు పైలట్ ప్రయత్నించాడు. అయితే టేకాఫ్ సమయంలో విమానం చక్రాలు ఉన్న ప్యానెల్ తెరుచుకోలేదు. రెండు మార్లు ప్రయత్నించినా.. వీల్ ప్యానెల్ ఓపెన్ కాకపోవడంతో పైలట్ విమానాన్ని మళ్లీ పైకి లేపాడు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు (ATC) సమాచారం ఇవ్వడంతో పాటు ప్రయాణీకులకు కూడా విషయాన్ని వివరించాడు. సుమారు 20 నిమిషాల పాటు విమానాన్ని గాల్లోనే తిప్పి.. వీల్ ప్యానెల్‌ను చెక్ చేసుకున్నాడు. అంతా ఓకే అయిన తర్వాత రెండో సారి విమానాన్ని సురక్షితంగా రన్‌వేపై దించాడు పైలట్. ఎలాంటి ప్రమాదం జరక్కుండా క్షేమంగా దిగడంతో ఊపిరి పీల్చుకున్నారు ప్రయాణీకులు. భువనేశ్వరీ ప్రయాణం ఇవ్వాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు నిజం చెబుతానంటూ నారా భువనేశ్వరీ పర్యటనలను షెడ్యూల్ చేసుకున్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత మనస్తాపంతో కొందరు చనిపోయారని అప్పట్లో ఎల్లోమీడియా ప్రచారం చేసింది. ఆ కుటుంబాలను పరామర్శిస్తానని అప్పట్లో భువనేశ్వరీ ఓ రెండు రోజులు పర్యటించి సుదీర్ఘ విరామం ఇచ్చారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో మళ్లీ పర్యటనలు పునఃప్రారంభించారు. ఇవ్వాళ్టి నుంచి బాపట్ల, ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లో భువనేశ్వరి పర్యటించనున్నారు. కేరాఫ్ హైదరాబాద్ హైదరాబాద్‌లో చంద్రబాబు కుటుంబం జూబ్లీహిల్స్‌లో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకుంది. కేవలం సభలు, సమావేశాలు, పర్యటనలున్నప్పుడే మాత్రమే చంద్రబాబు కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించడం పరిపాటే. నిజం గెలవాలి పర్యటనలో భాగంగా ఈ ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వస్తున్నప్పుడు విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సురక్షితంగా విమానం లాండవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
‘సొమ్ము’ సిల్లెను బాబయో!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆడిన డబుల్ గేమ్‌కు కీలక నాయకులు బలయ్యారు. నిర్వీర్యమైన పార్టీ కోసం ఇన్నాళ్లూ డబ్బులు ఖర్చుపెట్టిన నేతలు ఇప్పుడు టికెట్ కోసం అర్రులు చాస్తున్నారు. అధిష్టానం పెడుతున్న కండిషన్లు, చేస్తున్న పైరవీలు చూసి ఖిన్నులవుతున్నారు. రొక్కమాడితేనే రాజకీయం, భారీగా ముట్టజెప్పినోడికే టికెట్లు అనే పరిస్థితి పార్టీలో నెలకొనడంతో తీవ్రంగా కలత చెందుతున్నారు. ప్రస్తుతానికి వారు నిశ్శబ్దంగా ఉన్నా.. టికెట్లు ఖరారు చేశాక పార్టీలో ముసలం తప్పదనే వాదన అంతర్గతంగా వ్యక్తమవుతోంది. గుండ, గొండుల్లో ఎవరికి! శ్రీకాకుళం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, యువ నాయకుడు గొండు శంకర్ టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటివరకు వీరిలో ఒకరిని చంద్రబాబు, మరొకరిని లోకేశ్ ప్రోత్సహించారు. ఇద్దరూ పార్టీ కోసం గట్టిగానే ఖర్చు పెట్టారు. అయితే ఇప్పుడు ఎక్కువ ఖర్చుపెట్టిన వారికే టికెట్ అంటూ లీకులు ఇస్తుండడంతో లక్ష్మీదేవి, శంకర్ ఖిన్నులవుతున్నారు. ‘గోవిందా’.. వెంకటరమణ పాతపట్నం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, యువ నాయకుడు మామిడి గోవిందరావు టికెట్ రేసులో ఉన్నారు. వీరిలో కలమట వెంకటరమణను కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్నాయుడు ప్రోత్సహిస్తుండగా, మామిడి గోవిందరావును లోకేశ్ ప్రోత్సహిస్తున్నారు. వీరిలో మామిడి గోవిందరావుతో చాలా ఖర్చు పెట్టించారు. ఇప్పుడు టికెట్‌కు రేటుగట్టి బేరసారాలకు దిగడంతో ఆశావహులు బిత్తరపోతున్నారు. కలిశెట్టి ‘కళా’విహీనం ఎచ్చెర్ల నియోజకవర్గంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకటరావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కలిశెట్టి అప్పలనాయుడి మధ్య టికెట్ పోరు నడుస్తోంది. 2019లో అధికారం కోల్పోయాక కొన్నాళ్లు కళా స్తబ్ధుగా ఉండిపోవడంతో కలిశెట్టి క్రియాశీలకం అయ్యారు. పార్టీ కోసం భారీగా ఖర్చుపెట్టారు. ఒక దశలో టికెట్‌కు హామీ కూడా లభించింది. ఇప్పుడు అధిష్టానం మాట మార్చడంతో కలిశెట్టి అప్పలనాయుడు సందిగ్ధంలో పడ్డారు. ‘బగ్గు’.. భగ్గు నరసన్నపేట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తిని ఒకవైపు ప్రోత్సహిసూ్తనే మరోవైపు మాజీ ఎమ్మెల్యే బగ్గు లక్ష్మణరావు కుమారుడు, డాక్టర్ బగ్గు శ్రీనివాసరావును చంద్రబాబు, లోకేశ్ తెరపైకి తెచ్చారు. తండ్రీకొడుకులు చెరోవైపున ఉండి గేమ్ ఆడారు. చివరకు ఇప్పుడు ఎంతైనా ఖర్చుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని బగ్గు శ్రీనివాస్‌వైపే మొగ్గు చూపిస్తుండడంతో బగ్గు రమణమూర్తి ఆందోళన చెందుతున్నారు. వద్దన్న వజ్జ.. తాతారావు టాటా.. పలాస నియోజకవర్గంలో గౌతు శిరీష, వజ్జ బాబూరావు, జుత్తు తాతారావులను టికెట్ ఆశ చూపి పెదబాబు, చినబాబు ప్రోత్సహించారు. అయితే ఇప్పుడు భారీగా డబ్బులు పెట్టాలి్సన వ్యవహారం కావడంతో వజ్జ బాబూరావు, జుత్తు తాతారావు వెనక్కి తగ్గినట్టు సమాచారం. ఆశ చూపిన తండ్రీకొడుకులు ఇన్నాళ్లూ ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరు, ముగ్గురికి టికెట్ల ఆశ చూపిన టీడీపీ అధినేత బాబు, ఆయన తనయుడు లోకేశ్ ఇప్పుడు డబ్బుంటేనే తమ వద్దకు రావాలని కరాఖండీగా చెబుతున్నారు. పార్టీకెంత ఇస్తారు? ఎంత ఖర్చుపెడతారంటూ బేరసారాలు ఆడుతున్నారు. దీంతో విస్తుపోవడం నేతల వంతవుతోంది. ఇప్పటివరకు పార్టీ కోసం ఖర్చు పెట్టించి ఇప్పుడు ఇలా చేయడం న్యాయం కాదని కొందరు నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
లోకేశ్ ‘రెడ్ డైరీ’ కేసు 30కి వాయిదా
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో కుంభకోణాలపై కేసుల దర్యాప్తును ప్రభావితం చేసేలా, కీలక సాక్షులను భయభ్రాంతులకు గురిచేసేలా నారా లోకేశ్.. అధికారులను బెదిరిస్తున్నారన్న సీఐడీ పిటిషన్‌పై విచారణను విజయవాడ ఏసీబీ న్యాయస్థానం ఈ నెల 30కి వాయిదా వేసింది. గతంలో ఆయనకు ఇచ్చిన 41ఏ నోటీసులకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని సీఐడీ అధికారులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గతంలో 41ఏ నోటీస్ కింద సీఐడీ విచారణకు హాజరైన సందర్భంగా విధించిన ఆంక్షలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం, ఈ కేసుల్లో కీలక సాక్షులుగా ఉన్న అధికారులు, న్యాయస్థానంలో వాంగ్మూలాలు ఇచ్చిన అధికారుల పేర్లను రెడ్‌బుక్‌లో రాశానని.. వారి సంగతి తేలుస్తానని లోకేశ్ పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో బెదిరించిన విషయాన్ని ఆధారాలతో సహా నివేదించింది. రెడ్ డైరీ పేరుతో కీలక సాక్షులను బెదిరిస్తున్న లోకేశ్‌ను అరెస్ట్ చేసేందుకు అనుమతించాలని పిటిషన్లో కోరింది. కాగా ఈ కేసులో జారీ చేసిన నోటీసులను తీసుకునేందుకు లోకేశ్ సుముఖత చూపలేదు. ఆ నోటీసులు అందించేందుకు వెళ్లిన సీఐడీ అధికారులకు ఆయన అందుబాటులోకి రాలేదు. దాంతో నోటీసులను పోస్టులో లోకేశ్ నివాసానికి పంపారు. ఆ నోటీసులను తీసుకునేందుకు లోకేశ్ నిరాకరించారు. నోటీసులను లోకేశ్ మొబైల్ నంబర్‌కు వాట్సాప్ ద్వారా పంపించినా కూడా ఆయన స్పందించలేదు. దాంతో ఆ విషయాన్ని కూడా సీఐడీ అధికారులు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో న్యాయస్థానం ద్వారా నోటీసులు జారీ చేయాలని కోర్టు రిజిస్ట్రార్ ను న్యాయమూర్తి ఆదేశించారు. లోకేశ్ గానీ, ఆయన తరఫు న్యాయవాదులు గానీ విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు కావాలని లోకేశ్ తరఫు న్యాయవాదులు ఏసీబీ న్యాయస్థానాన్ని మంగళవారం కోరారు. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. -
నా ప్రాణానికి ఏదైనా జరిగితే లోకేశ్‌దే బాధ్యత
నగరంపాలెం: తనను కిరాయి మూకలతో హతమార్చేందుకు టీడీపీ రూ.50 లక్షల చందాలు వసూలు చేసిందని, దీనిపై గుంటూరు ఎస్పీ, డీఎస్పీలకు ఫిర్యాదు చేశానని టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడు రాయపాటి రంగారావు తెలిపారు. గుంటూరు లక్ష్మీపురంలోని నివాసంలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈనెల 13న గుంటూరు రీజినల్ సీఐడీ కార్యాలయానికి చంద్రబాబు వచ్చిన క్రమంలో ఈ చందాలు వసూలు చేశారన్నారు. వైజాగ్ నుంచి ఓ వ్యక్తి ఫోన్ చేసి , చంద్రబాబుపై విమర్శలు మానుకోవాలని, లేకపోతే అంతు చూస్తామని బెదిరించారని చెప్పారు. ఇలాంటి బెదిరింపులకు భయపడే వాడిని కాదన్నారు. తన ప్రాణానికి ఏదైనా జరిగితే అందుకు నారా లోకేశ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెట్టడం చంద్రబాబుకి కొత్తకాదని, అందులో భాగంగానే రాయపాటి శైలజతో మాట్లాడిస్తున్నారని ధ్వజమెత్తారు. లోకేశ్ ఎక్కడా గెలవడని జ్యోస్యం చెప్పారు. యువగళానికి ఒక్క రోజు కూడా తాను వెళ్ళలేదన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలిచి ఏ బాధ్యత అప్పగించినా చేస్తానని పేర్కొన్నారు. -
చంద్రబాబు, లోకేశ్ దొంగలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆయన కొడుకు లోకేశ్ దొంగలని, ఆ పార్టీ ఓ దిక్కుమాలిన పార్టీ అని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి రాయపాటి రంగారావు చెప్పారు. ఆయన శుక్రవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు, లోకేశ్ ధన దాహానికి తమ కుటుంబం సర్వనాశనం అయిపోయిందని తెలిపారు. చంద్రబాబు, లోకేశ్‌కు డబ్బే ముఖ్యమని, మరేమీ అవసరం లేదని అన్నారు. ఇక టీడీపీలో ఉండలేనని స్పష్టం చేశారు. పార్టీ కీ, పదవికి రాజీనామ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ వెంటనే తన కార్యాలయంలో ఉన్న చంద్రబాబు ఫొటోను నేలకేసి కొట్టి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీడీపీలో చేరిన తాము ఆ పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశామన్నారు. గత ఎన్నికలకు ముందు తమ నుంచి రూ. 150 కోట్లు తీసుకున్నారని తెలిపారు. లోకేశ్, చంద్రబాబునాయుడు ఎంతెంత తీసుకున్నారో తమ వద్ద లెక్కలున్నాయన్నారు. తండ్రి, కొడుకు ఒకరికి తెలియకుండా మరొకరు డబ్బులు తీసుకున్నారన్నారు. డబ్బులు తీసుకుని కూడా పోలవరం ప్రాజెక్టు విషయంలో తమను సర్వ నాశనం చేశారన్నారు. చంద్రబాబు కమీషన్ల కోసం పోలవరాన్ని వాడుకున్నారని చెప్పారు. సోమవారం పోలవారం అని చంద్రబాబు చెప్పడం ఉత్త బోగస్ అని అన్నారు. చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరంపై సమీక్ష చేసింది కేవలం లంచాల కోసమేనని చెప్పారు. ప్రతి వారం డబ్బులు వసూలు చేశారని తెలిపారు. తమని హింసించి మరీ డబ్బులు వసూలు చేశారన్నారు. తమ ఆస్తులన్నీ బ్యాంకులో పెట్టుకున్నారని అన్నారు. డబ్బులు వాడుకుని మూడు సంవత్సరాల తర్వాత మమ్మల్ని ప్రాజెక్టు నుంచి తప్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనులు 75 శాతం పూర్తి చేసినట్లుగా చంద్రబాబు చెబుతున్నది పచ్చి అబద్ధమని స్పష్టం చేశారు. పేదల కోసం పని చేస్తున్న సీఎం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల కోసం పనిచేస్తున్నారని రంగారావు చెప్పారు. కోవిడ్ సమయంలో ప్రజలు ఇబ్బంది పడకూడదని సీఎం జగన్ ఒక సంవత్సరం బడ్జెట్ మొత్తం ఖర్చు పెట్టారని చెప్పారు. ఆ రెండేళ్లు ఆంధ్రప్రదేశ్ జీడీపీ ఎక్కువగా ఉందని రిజర్వ్ బ్యాంక్ వెబ్‌సైటే చెబుతోందని తెలిపారు. అదే సమయంలో ఇతర రాష్ట్రాల్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయన్నారు. జగన్ అంటే తమకు ఇష్టమని, ఆయన సీటు ఇస్తే పోటీ చేస్తానని చెప్పారు. టీడీపీ ఫక్తు వ్యాపార సంస్థ తెలుగుదేశం రాజకీయ పార్టీ యే కాదని, ఫక్తు వ్యాపార సంస్థ అని ఆరోపించారు. ఆ పార్టీ ఉంది ప్రజల కోసం కాదని, కేవలం వాళ్లు బాగుపడటం కోసమేనని చెప్పారు. లక్ష ఉద్యోగాలు తెచ్చామని, శ్రీసిటీ కట్టించామన్నారని, కియా కంపెనీ తెచ్చామని చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారన్నారు. కియా కంపెనీ తెస్తే అనంతపురంలో ఎందుకు ఓడిపోయారని అన్నారు. లోకేశ్ రాయలసీమలో కాకుండా మంగళగిరి ఎందుకొచ్చాడని ప్రశ్నించారు. లోకేశ్‌కు ధైర్యం ఉంటే రాయలసీమలో పోటీ చేయాలని సవాల్ చేశారు. మంగళగిరిలో లోకేశ్‌ను ఓడిస్తానని చెప్పారు. గతంలో మంగళగిరిలో కాండ్రు కమల, మురుగుడు హనుమంతరావులను తామే గెలిపించుకున్నామని అన్నారు. బాబు, లోకేశ్ గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కులచిచ్చు లేపుతున్నారని ఆరోపించారు. టీడీపీని నమ్ముకున్న వాళ్లంతా అప్పుల్లో ఉన్నారు తమ కుటుంబం 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉందని, ఎవరినీ మోసం చేయలేదని తెలిపారు. తాను సత్తెనపల్లి సీటు అడిగినా, కన్నా లక్ష్మీనారాయణను నియమించారన్నారు. కన్నా నియామకంతో 83 ఏళ్ల తమ తండ్రి రాయపాటి సాంబశివరావు ఆవేదన చెందారన్నారు. 2014లో రాయపాటి సాంబశివరావు ఎంపీగా గెలిచాక కూడా టీడీపీలో అనేక అవమానాలు ఎదుర్కొన్నారని తెలిపారు. వినుకొండలో మంచినీటి పథకం తెస్తామని ఇచి్చన హామీని నిలబెట్టుకోవడానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును అడిగితే చినబాబును అడగాలని చెప్పారన్నారు. ఇదేం పద్ధతని, లోకేశ్ ఏమైనా డైరెక్ట్ ఎలక్షన్లో గెలిచారా అని నిలదీశారు. తామే కాదని, పార్టీని నమ్ముకున్న అనేకమంది అప్పుల్లో ఉన్నారని తెలిపారు. చనిపోయిన వారికి ఇన్సూ్యరెన్స్ ఇస్తానని డబ్బులు వసూలు చేసిన లోకేశ్ ఎంతమందికి ఇచ్చారని నిలదీశారు. చంద్రబాబు జన్మభూమి కమిటీల పేరుతో రాష్ట్ర ప్రజలను దోచుకున్నారని ఆరోపించారు. రెండు, మూడు లక్షల కోట్లు ఖర్చు చేశామన్నారని, ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. -
లోకేశ్ ‘రెడ్‌బుక్’ బెదిరింపులపై విచారణ జరపాలి
సాక్షి, అమరావతి: రెడ్ బుక్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, యంత్రాంగాన్ని బెదిరిస్తూ భయోత్పాతానికి గురి చేస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైఎస్సార్సీపీ కోరింది. చంద్రబాబు, లోకేశ్, టీడీపీ నేతలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి అభ్యంతరకర, అసభ్యకర వ్యాఖ్యలు చేయకుండా నిరోధించాలని కోరింది. చంద్రబాబు, లోకేశ్ ప్రభుత్వ అధికారులకు.. ప్రధానంగా పోలీసు అధికారులకు రాజకీయ దురుద్దేశాలు అంటగడుతూ వారిని బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ రాష్ట్రంలో సామరస్యపూరిత వాతావరణాన్ని దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతున్నారని కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లింది. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్ సభలో పార్టీ విప్ మార్గాని భరత్‌తో కూడిన వైఎస్సార్సీపీ బృందం కేంద్ర ఎన్నికల కమిషన్‌తో విజయవాడలో మంగళవారం సమావేశమైంది. ఈ సందర్బంగా చంద్రబాబు, లోకేశ్ అప్రజస్వామిక విధానాలపై కమిషన్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. వారు ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని బెదిరిస్తూ రాజకీయ లబ్ధి పొందేందుకు యత్నిస్తున్నారని తెలిపింది. రెడ్‌బుక్ పేరుతో లోకేశ్ బెదిరింపులకు పాల్పడుతూ చేసిన ప్రసంగాలు, బహిరంగ సభల్లో చంద్రబాబు, లోకేశ్ ప్రసంగాలు, మీడియా, సోషల్ మీడియాలో టీడీపీ దు్రష్పచారానికి సంబంధించిన ఆధారాలను కూడా ఫిర్యాదుతోపాటు సమర్పించింది. ఆ ఫిర్యాదులో పేర్కొన్న ప్రధాన అంశాలు ఇవీ.. ♦ 2019 ఎన్నికల్లో అఖండమైన ప్రజా మద్దతుతో ప్రజాస్వామ్యబద్ధంగా అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా టీడీపీ కుట్రలు పన్నుతోంది. టీడీపీ అధికారం కోల్పోయిందన్న దుగ్దతో చంద్రబాబు, లోకేశ్ ముఖ్యమంత్రిని ఉద్దేశించి అసభ్యకర, అవమానకర వ్యాఖ్యలు చేస్తూ రాష్ట్రంలో సామరస్య పూరిత వాతావరణాన్ని దెబ్బతీస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేసేందుకు అవకాశం లేకపోవడంతో వారిద్దరూ అప్రజాస్వామిక విధానాలకు పాల్పడుతున్నారు. చంద్రబాబు, లోకేశ్, ఇతర టీడీపీ నేతలు బహిరంగ సభలు, మీడియా సమావేశాల్లో సీఎం వైఎస్ జగన్ వ్యక్తిత్వానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రజల మనసులను కలుషితం చేయాలన్న కుట్రతో సీఎం వైఎస్ జగన్‌ను వ్యక్తిగతంగా దూషిస్తున్నారు. ♦ చంద్రబాబు జిల్లాల పర్యటనలో, లోకేశ్ పాదయాత్రలోనూ దురుద్దేశపూర్వకంగా ప్రభుత్వ ఉన్నతాధికారులు, అధికార యంత్రాంగంపై నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం విధులు నిర్వర్తిస్తున్న అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అధికారుల పేర్లను ఓ రెడ్‌బుక్‌లో రాస్తున్నానని, అధికారంలోకి వస్తే వారి సంగతి తేలుస్తానని లోకేశ్ బహిరంగ సభల్లో హెచ్చరించారు. మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలలోనూ రెడ్‌బుక్ పేరుతో అధికారులపై బెదిరింపులకు పాల్పడ్డారు. ప్రధానంగా పోలీసు అధికారులను లక్ష్యంగా చేసుకుని హెచ్చరికలు జారీ చేస్తుండటం అధికార యంత్రాంగాన్ని కలవరపరుస్తోంది. బదిలీ అయి వెళ్లిపోతామని అధికారులు భావిస్తే పొరపాటేనని, వారు ఎక్కడ ఉన్నా వదిలి పెట్టేదేలేదంటూ రెడ్‌బుక్‌ను చేతిలో పట్టుకుని చూపిస్తూ మరీ లోకేశ్ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ♦ సమర్థవంతమైన పరిపాలన, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ప్రభుత్వ అధికారులు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారులు పూర్తి స్వేచ్ఛతో, సంతోషంగా, సమర్ధవంతంగా విధులను నిర్వర్తిస్తున్నారు. పోలీసు అధికార యంత్రాంగం పూర్తిగా చట్టబద్ధంగా వ్యవహరిస్తూ శాంతిభద్రతలు, సామరస్య పూరిత వాతావరణాన్ని పరిరక్షిస్తోంది. అటువంటి ఉన్నతాధికారులు, ప్రత్యేకించి పోలీసు అధికారులపై చంద్రబాబు, లోకేశ్ నిరాధార ఆరోపణలు చేస్తూ వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు. అందుకోసం ప్రత్యేక బృందాలను నియమించి మరీ కుట్రపూరిత విధానాలతో పోలీసు అధికారులు విధులను సక్రమంగా నిర్వర్తించకుండా ఆటంకాలు సృష్టించేందుకు యత్నిస్తున్నారు. పోలీసు అధికారులపై ప్రైవేటు ఫిర్యాదులు ఇప్పిస్తూ, అనుకూల మీడియాలో వారిపై దుష్ప్రచారం చేయిస్తున్నారు. టీడీపీకి కొమ్ము కాసే పత్రికలు, ఛానళ్లలో అధికారులపై తీవ్రస్థాయిలో విష ప్రచారం చేస్తూ వారిని బెదిరిస్తున్నారు. ♦ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శిగా చంద్రబాబు, లోకేశ్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కానీ రాజకీయ దురుద్దేశంతో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న వారిద్దరినీ కట్టడి చేయాలని కోరుతున్నాం. దేశంలో ప్రజాస్వామ్య విలువలు, సంప్రదాయాలను పాటించాల్సిన బాధ్యత టీడీపీపై ఉంది. కానీ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ సమాజంలో సామరస్యపూరిత పరిస్థితులను టీడీపీ దెబ్బతీస్తోంది. ప్రజాస్వామ్య ప్రమాణాలను ధ్వంసం చేసేలా లోకేశ్ వ్యవహరిస్తున్నారు. -
కోర్టు ద్వారా లోకేశ్‌కు నోటీసులు ఇవ్వండి
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో కుంభకోణాలపై నమోదైన కేసుల దర్యాప్తును ప్రభావితం చేసేలా, కీలక సాక్షులను బెదిరించేలా వ్యాఖ్యలు చేసిన కేసులో నారా లోకేశ్‌కు నోటీసులు అందించాలని విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం మంగళవారం కోర్టు అధికారులను ఆదేశించింది. నోటీసులు తీసుకునేందుకు నిరాకరించిన లోకేశ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రెడ్ డైరీ పేరుతో కీలక సాక్షులను బెదిరిస్తున్న లోకేశ్‌ను అరెస్ట్ చేసేందుకు అనుమతించాలన్న సీఐడీ పిటిషన్ విచారణ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో 41ఏ నోటీస్ కింద సీఐడీ విచారణకు హాజరైన సందర్భంగా విధించిన ఆంక్షలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం, ఈ కేసుల్లో కీలక సాక్షులుగా ఉన్న అధికారులు, న్యాయస్థానంలో వాంగ్మూలాలు ఇచ్చిన అధికారుల పేర్లను రెడ్‌బుక్‌లో రాశానని.. వారి సంగతి తేలుస్తానని లోకేశ్ పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో బెదిరించడం కలకలం రేపింది. ‘ఉద్దేశపూర్వకంగానే నోటీసులు తీసుకోవడం లేదు’ కాగా.. ఈ కేసులకు సంబంధించి గతంలో విధించిన ఆంక్షలను ఉల్లంఘించడంతోపాటు కేసు దర్యాప్తును ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్న లోకేశ్‌ను అరెస్ట్‌కు అనుమతి కోరుతూ సీఐడీ విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో ఇటీవల పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం ఈ అంశంలో లోకేశ్‌కు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. ఆయన్ని అరెస్ట్ చేసేందుకు అనుమతించాలన్న సీఐడీ పిటిషన్‌పై సమాధానం చెప్పాలని ఆ నోటీసుల్లో పేర్కొనాలని తెలిపింది. కాగా.. ఆ నోటీసులు అందించేందుకు వెళ్లిన సీఐడీ అధికారులకు లోకేశ్ అందుబాటులోకి రాలేదు. రెండుసార్లు ఆయన నివాసానికి వెళ్లినా అధికారులను కలిసేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. దాంతో నోటీసులను పోస్టులో లోకేశ్ నివాసానికి పంపారు. ఆ నోటీసులను తీసుకునేందుకు లోకేశ్ నిరాకరించారు. నోటీసులను లోకేశ్ మొబైల్ నంబర్‌కు వాట్సాప్ ద్వారా పంపించినా కూడా ఆయన స్పందించలేదు. దాంతో ఈ విషయాన్ని సీఐడీ తరఫు న్యాయవాదులు ఏసీబీ న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. లోకేశ్ ఉద్దేశపూర్వకంగానే నోటీసులను తీసుకోవడం లేదని వివరించారు. ఈ అంశంపై తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం లోకేశ్‌కు స్వయంగా నోటీసులు అందించాలని కోర్టు అధికారులను ఆదేశించింది. -
‘రా కదలిరా’ అంటే వచ్చేవారెవరూ లేరు.. బాబుకు అంబటి చురకలు
సాక్షి, గుంటూరు: పంటల సాగుకు నీటిని విడుదల చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆయన ఆదివారం గుంటూరులో మీడియాతో మాట్లాడారు. మూడు విడతలుగా 15 టీఎంసీల నీటిని విడుదల చేస్తామని చెప్పారు. చంద్రబాబు వ్యాఖ్యలపై మంత్రి అంబటి కౌంటర్ ఇచ్చారు. ఆంబోతులకు ఆవులను సప్లయి చేసి ఎదిగిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. ‘రా కదలిరా’ అంటే వచ్చేవారెవరూ లేరంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేష్‌కు ప్రజాదరణ లేదని ధ్వజమెత్తారు. అధికారం కోసం ఏ గడ్డైనా కరిచే వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. చంద్రబాబును ప్రజలు నమ్మె పరిస్థితి లేదన్నారు. ఎన్నికల తర్వాత చంద్రబాబు, లోకేష్, పవన్ హైదరాబాద్‌కు పోవాల్సిందేనని తెలిపారు. చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకోవాలని అంబటి హెచ్చరించారు. అఫీషియల్, అనఫీషియల్‌గా పొత్తులు పెట్టుకోవటం పవన్‌కు అలవాటేనని ఎద్దేవా చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం తమదని అంబటి తెలిపారు. ఇచ్చిన ఏ హామీని నెరవేర్చని వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. ఎంతమంది కలిసి వచ్చినా సీఎం జగన్‌ను ఓడించలేరని అన్నారు. చంద్రబాబు ఇన్నాళ్లు కుప్పంను ఎందుకు పట్టించుకోలేదని సూటిగా ప్రశ్నించారు. ఇప్పుడు అధికారంలోకి వస్తే కుప్పంలో ఎయిర్ పోర్టు కడతారట అంటూ అంబటి ఎద్దేవా చేశారు. చదవండి: AP: మూడు రోజులపాటు కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యటన -
అంగన్వాడీల సమ్మెపై చంద్రబాబు నీచ రాజకీయాలు
సాక్షి అమరావతి: అంగన్వాడీల సమ్మెపై చంద్రబాబు, లోకేశ్ నీచ రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. సమ్మె విరమించాలని అంగన్వాడీలకు విజ్ఞప్తి చేశామన్నారు. వారు అత్యవసర సర్విసుల కిందకు వస్తారని, అందుకే ఎస్మా తీసుకొచ్చామని చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బాలింతలు, గర్భిణిలకు సేవల్లో ఇబ్బంది రాకూడదనే ఎస్మా తీసుకొచ్చామని చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ‘గర్భిణిలు, బాలింతలు, పిల్లలకు ఆహారం ఇవ్వడం అత్యవసర సేవ కాదా? అందుకే అలా చేశాం. వారి డిమాండ్లలో 90 శాతం నెరవేర్చాం. ఒకటి రెండు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. ఎన్నికల ముందు చెప్పింది అధికారంలోకి రాగానే అమలు చేశాం. ఇప్పుడు ఎన్నికల తర్వాత మిగతా డిమాండ్లు కూడా కచ్చితంగా అమలుచేస్తామనే చెప్పాం. ఇప్పుడే కావాలని వారు అంటున్నారు. ఆ బరువు ఇప్పుడు ప్రభుత్వం మోయలేదు. ముందు సమ్మె విరమించండి అని రిక్వెస్ట్ చేశాం. ఇంతకంటే పొలైట్‌గా గతంలో ఏ ప్రభుత్వం అయినా ఉందా?. చంద్రబాబు ఏనాడైనా ఇంత సంయమనంతో ఉన్నాడా? తుపాకులతో కాల్పులు జరిపింది ఎవరు. గుర్రాలతో తొక్కించింది ఎవరు అంటే చంద్రబాబే కనిపిస్తారు. చంద్రబాబు నైజాన్ని పుణికి పుచ్చుకున్న లోకేశ్ మా గురించి సీఎం జగన్ గురించి విమర్శలు చేయడం విడ్డూరం. ఇక అంబటి రాయుడు కొద్దిరోజుల క్రితమే పార్టీలో చేరారు. ఆయన ఏ రీజన్‌తో వచ్చారో, దేనికి రాజీనామా చేశారో అనేది తెలియదు. కొద్దికాలంపాటు రాజకీయాలకు దూరంగా ఉంటానని ట్వీట్లో తెలిపారు. పూర్తి వివరాలు తెలిశాక స్పందిస్తాం.