ప్రజాదరణ చూసి ఓర్వలేకే..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం వెనుక కుట్ర ఉంది. అందుకు టీడీపీ నాయకుడు లోకేశ్ వ్యాఖ్యలే నిదర్శనం. లోకేశ్ ట్విటర్‌లో 2019లో కోడికత్తి, 2024లో రాయిదాడి అని పెట్టారు. లోకేశ్ వ్యాఖ్యలను గమనిస్తే ఈ హత్యాయత్నం వెనుక టీడీపీ కుట్ర ఉందని తెలుస్తోంది. ప్రజాదరణను చూసి ఓర్వలేక సీఎం వైఎస్ జగన్‌పై ఈ దారుణానికి పాల్పడ్డారు. సిద్ధం సభలు, బస్సుయాత్రలో సీఎం వైఎస్ జగన్‌కు వస్తున్న ప్రజాదరణ ప్రతిపక్షాలకు మింగుడుపడడంలేదు. చంద్రబాబు, లోకేశ్, పవన్‌కళ్యాణ్, పురందేశ్వరి అంతా నైరాశ్యంలో ఉన్నారు. బస్సుయాత్రకు వస్తున్న స్పందన చూసి కూటమి నేతలు కుట్రకు తెరతీశారు. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రి
కడుపుమంటతోనే దారుణానికి ఒడిగట్టారు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతుండటంతో.. ఎలాగైనా దాన్ని ఆపాలనే కుట్రతోనే ఈ హత్యాయత్నం చేశారు. కూటమి నేతల సభలు జనం లేక వెలవెలబోతున్నాయి. కదిలి రా అని ఎంత పిలిచినా జనం కదలడం లేదు. ఇదే సమయంలో వైఎస్ జగన్‌కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కడుపుమంటతో ఈ దారుణానికి పాల్పడ్డారు. ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేయడం బాబుకు కొత్త కాదు.
– ఎస్‌బి అంజద్‌బాషా, ఉప ముఖ్యమంత్రి
సీఎం జగన్‌పై హత్యాయత్నం చేసింది టీడీపీ గూండాలే..
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పేందుకు మేమంతా సిద్ధం బస్సుయాత్ర ద్వారా ప్రజల్లోకి వస్తుంటే చూసి ఓర్వలేక తెలుగుదేశం పార్టీ గూండాలే ఆయనపై హత్యాయత్నం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్ని కూటములు కట్టినా ప్రజాగళంçసభలు వెలవెలబోతున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియక నిరాశ, నిస్పృహలతో టీడీపీ గుండాలు ఈ అరాచకానికి పాల్పడ్డారు. ఇటువంటి వాటితో జగన్ మనోధైర్యాన్ని దెబ్బతీయలేరు.
– విశ్వరూప్, రవాణాశాఖ మంత్రి
ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలి
సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై విజయవాడలో జరిగిన హత్యాయత్నాన్ని ప్రజాస్వామ్యవాదులందరూ తీవ్రంగా ఖండించాలి. ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పనిచేసే పాలకులపై దాడులు చేయించే విషసంస్కృతిని ప్రతిపక్షాలు పెంచి పోషిస్తున్నాయి. ప్రజల్లో అత్యంత విశ్వాసం కలిగిన నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి బస్సుయాత్రలో ప్రజలు సంద్రం మాదిరిగా ఆయన వెంట రావడం చూసి ఓర్వలేక ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఆ వస్తువు కొంచెం కిందకు తగిలితే సీఎం జగన్ కన్ను దెబ్బతినేది. దీనిపై విజ్ఞులైన ప్రజలందరూ ఆలోచించాలి. – చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణ, బీసీ సంక్షేమశాఖ మంత్రి
హింసను ప్రేరేపిస్తున్న బాబు
సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం వెనుక చంద్రబాబు కుట్ర ఉంది. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్‌మోహన్‌రెడ్డిపై కత్తితో దాడి జరిగింది. అబద్ధాలు చెప్పడం, హింసను ప్రేరేపించడం, అధర్మాన్ని పాటించడం ద్వారా మరోసారి అధికారంలోకి రావచ్చని చంద్రబాబు భ్రమిస్తున్నారు. ఆయన ఇప్పటికీ గుణపాఠాలను నేర్చుకోకపోవడం శోచనీయం. – విజయసాయిరెడ్డి, ఎంపీ, వైఎస్సార్‌సీపీ నెల్లూరు లోక్‌సభ అభ్యర్థి
ఎన్నికల కమిషన్ సత్వర చర్యలు తీసుకోవాలి
సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై ఎన్నికల కమిషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలి. హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలి. 15 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం చేస్తున్న జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణను చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు. 2019 ఎన్నికల ముందు జగన్‌పై టీడీపీ అభిమాని విశాఖ ఎయిర్‌పోర్టులో కత్తితో దాడిచేశాడు. – వై.వి.సుబ్బారెడ్డి, ఎంపీ, వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్
ప్రతిపక్షాల ప్రకటనలు దారుణం
సంక్షేమ పథకాలతో పేదల గుండెల్లో నిలుస్తూ, ప్రజాభిమానంతో అప్రతిహతంగా సాగుతున్న బస్సుయాత్రలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే ఆయనపై హత్యాయత్నం చేశారు. ఇది రాజకీయ కుట్రే. ఈ హత్యాయత్నంపై ప్రతిపక్షాల ప్రకటనలు దారుణం. అధికారుల వైఫల్యం అనటం అర్థంలేని మాట. సమగ్రంగా విచారించి దోషులను పట్టుకున్న తరువాత వారికి ప్రతిపక్షాలు మద్దతుగా నిలవకుండా ఉండాలి. అప్పుడే ఇటువంటి చర్యలు పునరావృతం కావు. – పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎంపీ, వైఎస్సార్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్
సీఎం జగన్ జోలికి వస్తే అంతు చూస్తాం
పోరాటాలతో పుట్టిన వైఎస్సార్‌సీపీకి యుద్ధం కొత్త కాదు. ఇటువంటి ఉడత బెదిరింపులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భయపడరు. జగనన్న జోలికి వస్తే అంతు చూస్తాం. ప్రజాగ్రహంలో ప్రతిపక్షాలు కొట్టుకుపోతాయి. రాజకీయాల్లో సింహలా గర్జిస్తూ ముందుకు సాగుతున్న సీఎం జగనన్నను చూసి తట్టుకోలేక ఆయనపై టీడీపీ హత్యాయత్నం చేయించింది. నేను తలుచుకుంటే నువ్వు ఏమై పోతావో జగన్.. అంటూ ఇటీవల చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యల అంతరార్థం ఇదేనేమో. ఇటువంటి దుర్మార్గులకు అధికారం దక్కకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. – విడదల రజిని, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment