సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ బుధవారం రహస్యంగా ఢిల్లీ పర్యటనకు వచ్చారు. విమానాశ్రయం నుంచి నేరుగా జన్‌పథ్–1లోని సీఎం (చంద్రబాబు) నివాసానికి చేరుకున్నారు. 3.30 గంటలకు రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులతో రహస్యంగా భేటీ అయినట్లు తెలిసింది.
అనంతరం రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ లోకేశ్‌ను కలిశారు. అర్ధరాత్రి వరకూ భేటీలు కొనసాగడం.. ఎవరెవరు కలుస్తున్నారు అనే విషయాలు గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిచ్చి0ది. కాగా, ఎన్‌డీఏ ప్రముఖులను కలిసేందుకు లోకేశ్ ఢిల్లీ వచ్చారని ఎల్లో మీడియా ప్రచారం చేసినప్పటికీ, ఆయన ఎన్‌డీఏ ప్రముఖులు ఎవర్నీ కలవలేదు.
అంతా రహస్యమే..
ముఖ్యమంత్రి, మంత్రులు అధికారిక పర్యటన నిమిత్తం ఢిల్లీ వచ్చినప్పుడు రెసిడెంట్ కమిషనర్ ఎయిర్‌పోర్టుకు వెళ్లి ఆహా్వనిస్తారు. ఇక్కడ ఉన్న పోలీసు సిబ్బంది వీఐపీ ఫెసిలిటేషన్ చేస్తారు. లోకేశ్ పర్యటనలో ఇవేమీ కనిపించలేదు. కాగా, లోకేశ్ కొందరు బీజేపీ ప్రముఖులతో వేర్వేరుగా భేటీ అయినట్లు తెలిసింది.
బుధవారం అర్ధరాత్రి వరకు లోకేశ్ ఇక్కడే ఉండటంతో గురువారం అధికారికంగా ఎన్డీఏ నేతలను కలిసే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉండగా, రాత్రి 10 గంటల సమయంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయుష్ వేద్ ప్రకాష్ గోయల్‌తో మంత్రి లోకేశ్ భేటీ అయినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment