Delhi trip
-
హస్తినలో లోకేశ్ రహస్య పర్యటన!
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ బుధవారం రహస్యంగా ఢిల్లీ పర్యటనకు వచ్చారు. విమానాశ్రయం నుంచి నేరుగా జన్‌పథ్–1లోని సీఎం (చంద్రబాబు) నివాసానికి చేరుకున్నారు. 3.30 గంటలకు రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులతో రహస్యంగా భేటీ అయినట్లు తెలిసింది. అనంతరం రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ లోకేశ్‌ను కలిశారు. అర్ధరాత్రి వరకూ భేటీలు కొనసాగడం.. ఎవరెవరు కలుస్తున్నారు అనే విషయాలు గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిచ్చి0ది. కాగా, ఎన్డీఏ ప్రముఖులను కలిసేందుకు లోకేశ్ ఢిల్లీ వచ్చారని ఎల్లో మీడియా ప్రచారం చేసినప్పటికీ, ఆయన ఎన్డీఏ ప్రముఖులు ఎవర్నీ కలవలేదు. అంతా రహస్యమే.. ముఖ్యమంత్రి, మంత్రులు అధికారిక పర్యటన నిమిత్తం ఢిల్లీ వచ్చినప్పుడు రెసిడెంట్ కమిషనర్ ఎయిర్‌పోర్టుకు వెళ్లి ఆహా్వనిస్తారు. ఇక్కడ ఉన్న పోలీసు సిబ్బంది వీఐపీ ఫెసిలిటేషన్ చేస్తారు. లోకేశ్ పర్యటనలో ఇవేమీ కనిపించలేదు. కాగా, లోకేశ్ కొందరు బీజేపీ ప్రముఖులతో వేర్వేరుగా భేటీ అయినట్లు తెలిసింది. బుధవారం అర్ధరాత్రి వరకు లోకేశ్ ఇక్కడే ఉండటంతో గురువారం అధికారికంగా ఎన్డీఏ నేతలను కలిసే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉండగా, రాత్రి 10 గంటల సమయంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయుష్ వేద్ ప్రకాష్ గోయల్‌తో మంత్రి లోకేశ్ భేటీ అయినట్లు తెలిసింది. -
అప్రమత్తంగా ఉండండి
-
అప్రమత్తంగా ఉండండి
మంత్రులు, అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం పంట నష్టం అంచనాలు సిద్ధం చేయండి నగర మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండాలి జిల్లా కేంద్రాల్లో కంట్రోల్‌రూంలు ఏర్పాటు చేయండి మిషన్ కాకతీయ సత్ఫలితాలిచ్చింది ప్రాజెక్టుల వద్ద 24 గంటల పర్యవేక్షణ ఉండాలి సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో మంత్రులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీఎం శుక్రవారం రాత్రి.. రాష్ట్రంలో వర్షాలపై సమీక్ష జరిపారు. మంత్రులందరితో స్వయంగా ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, జీహెచ్ఎంసీ క మిషనర్ జనార్దన్ రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు తదితరులతో మాట్లాడారు. మరో రెండ్రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని మంత్రులకు సూచించారు. హైదరాబాద్‌లో రేయింబవళ్లు పరిస్థితిని పర్యవేక్షించాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను ఆదేశించారు. నగరానికి చెందిన మంత్రులంతా ప్రజలకు అందుబాటులో ఉంటూ సహాయక చర్యల్లో పాలు పంచుకోవాలన్నారు. జిల్లాల్లో మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి ప్రజల సూచనలు, ఫిర్యాదులపై స్పందించాలని ఆదేశించారు. ప్రజలు కూడా అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని సూచించారు. చెరువులు, ప్రాజెక్టుల్లోకి నీటిపై సంతృప్తి భారీ వర్షాలతో చాలా ప్రాజెక్టుల్లోకి నీరు వస్తోందని, చెరువులు నిండుతున్నాయని సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల వద్ద ప్రవాహ ఉధృతిని గమనిస్తూ, నీటి నిల్వ స్థారుులను బట్టి నీటిని బయటకు వదలాలని మంత్రి హరీశ్‌కు సీఎం సూచించారు. ఎస్సారెస్పీ, ఎల్ఎండీ, నిజాంసాగర్, సింగూరు, ఎల్లంపల్లి, మిడ్ మానేరు తదితర రిజర్వాయర్ల వద్ద 24 గంటల పర్యవేక్షణ ఉంచాలని పేర్కొన్నారు. మిషన్ కాకతీయ పనులు సత్ఫలితాలిచ్చాయని, దీంతో చెరువులు నిండడంతో పాటు, కట్టలు కూడా బలంగా తయారయ్యాయన్నారు. లేకుంటే చాలా కట్టలు తెగి ఉండేవన్నారు. చెరువు కట్టలు తెగినా, గండ్లు పడినా వెంటనే స్పందించాలని పేర్కొన్నారు. సీఎం ఆదేశం మేరకు మంత్రి హరీశ్ ప్రాజెక్టుల వారీగా పర్యవేక్షణాధికారులను నియమించారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువుల పరిస్థితిని గమనించి, సమాచారం సేకరించి, తగు ఆదేశాలు ఇవ్వడానికి జలసౌధలో కంట్రోల్ రూమ్ (040-23390794) ఏర్పాటు చేశారు. నిజాంసాగర్, ఎల్ఎండీ, ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ, సింగూరు, మిడ్ మానేరు వద్ద కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి సీఈ స్థారుు అధికారులను నియమించారు. అంటువ్యాధులపై జాగ్రత్త జనావాసాల్లో నీరు రావడంతో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి లక్ష్మారెడ్డిని సీఎం ఆదేశించారు. దోమలు వ్యాపించకుండా, నీటి కాలుష్యంతో రోగాలు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని ప్రాంతాల్లో అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని, అత్యవసర సేవలకు అధికారులను సిద్ధం చేయాలని పేర్కొన్నారు. విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని జెన్కో సీఎండీ ని సీఎం ఆదేశించారు. జెన్కో, ట్రాన్ ్స కో కూడా కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసుకుని, ప్రజల నుంచి వచ్చే వినతులు, సలహాలు స్వీకరించాలన్నారు. పోలీస్ శాఖ కూడా అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. హైదరాబాద్ బయల్దేరేందుకు ముందు ఢిల్లీ నుంచి కూడా సీఎం అధికారులతో సమీక్ష జరిపారు. వర్షాలతో జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని సూచించారు. పంట నష్టం వివరాలు సేకరించిన నివేదిక సిద్ధం చేయాలని, ఆ నివేదికను కేంద్రానికి సమర్పించి తగిన సాయం కోరుతామని చెప్పారు. -
రేపు ఢిల్లీలో పర్యటించనున్న కేటీఆర్
హైదరాబాద్ సిటీ : రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖా మంత్రి కె.తారక రామావు ఒక రోజు పర్యటన నిమిత్తం గురువారం ఢిల్లీ వెళుతున్నారు. ఆయన కేంద్ర మంత్రులు రవి శంకర్ ప్రసాద్, నితిన్ గడ్కరీ, వెంకయ్యనాయుడులతో భేటీ కానున్నారు. వీరితో పాటు హడ్కో చైర్మన్ రవికాంత్‌ను కలిసి వాటర్‌గ్రిడ్‌కు అదనపు ఆర్ధిక సాయం గురించి చర్చించనున్నారు. ఈ ముగ్గురు కేంద్ర మంత్రులతో మంత్రి కేటీఆర్ శాఖా పరమైన అంశాలపై చర్చిస్తారు. టి-హబ్ ప్రారంభోత్సవానికి రాష్ట్రానికి రావాల్సిందిగా కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను ఆహ్వానిస్తారు. -
ప్రైవేట్ హోటల్లో చంద్రబాబు బస
ఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సాధారణంగా బస చేసే ఏపీ భవన్లో కాకుండా ఓ ప్రైవేట్ హోటల్లో దిగారు. ఓటుకు నోటు కేసు విషయంలో పలువురు ముఖ్యనేతలను ప్రైవేట్ గా కలుసుకోవడానికే ఇలా చేశారని సమాచారం. దీనిలో భాగంగా బుధవారం ఢిల్లీలో గంటకో కేంద్రమంత్రిని కలిసి ఓటుకు నోటు కేసులో ఆడియో టేపు విడుదల విషయంలో తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఫిర్యాదు చేయనున్నారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలు గవర్నర్ చేతికి ఇవ్వాలని కోరనున్నారు. అంతేకాకుండా గవర్నర్ నరసింహన్ పై కూడా ఫిర్యాదు చేయనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు కేంద్రమంత్రి ఉమాభారతితో భేటీకానున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. 5:30 కు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తో భేటీ అవ్వనున్నారు. రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సమావేశం కానున్నారు. అంతేకాకుండా కేంద్రమంత్రి అరుణ్ జైట్లీతో పాటు పలువురు ముఖ్యనేతలను కూడా కలుసుకోనున్నారు. -
విశాఖలో సరిహద్దు భద్రతా దళం
ఏర్పాటుకు కేంద్రం అంగీకారం సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు కార్యకలాపాలను నివారించేందుకు వీలుగా విశాఖపట్నంలో సరిహద్దు భద్రతా దళాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ అంగీకరించింది.ప్రస్తుతం బలిమెలలో ఉన్న సరిహద్దు భద్రతాదళం మావోయిస్టుల కార్యకలాపాలపై హెలికాప్టర్ల ద్వారా నిఘా ఉంచడంతోపాటు నివారణకు చర్యలు చేపడుతోంది.తాజాగా మావోయిస్టులు ఉత్తరాంధ్రవైపు దృష్టి సారించారు. విశాఖ దిశగా కార్యకలాపాలకు ఉపక్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు, డీజీపీ జె.వి.రాముడు బుధవారం ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఎల్.సి.గోయల్‌ను కలసి విశాఖపట్నం వైపు కూడా సరిహద్దు భద్రతా దళాన్ని ఏర్పాటు చేయాలని, మావోయిస్టుల కదలికలపై నిఘా ఏర్పాటు చేయాలని కోరగా గోయల్ అంగీకరించారు. -
పార్లమెంట్ ఓబీసీ కమిటీ చైర్మన్‌గా నిమ్మల కిష్టప్ప!
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్‌లోని ఓబీసీ సంక్షేమ కమిటీ చైర్మన్‌గా హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్పను నియమించనున్నారు. ఈ నెల 7న ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు.. ఓబీసీ సంక్షేమ కమిటీ చైర్మన్‌గా నిమ్మలను నియమిం చాలని ప్రధానిని కోరినట్లు టీడీ పీ వర్గాల సమాచారం. గతంలో ఈ పదవిని ఎంపీ దత్తాత్రేయ నిర్వహించారు. ఆయన్ను కేంద్ర కేబినెట్లోకి తీసుకున్న నేపథ్యంలో నిమ్మల పేరును బాబు సూచించినట్లు తెలిసింది. -
ఢిల్లీకి కేసీఆర్
ప్రధాని, కేంద్ర మంత్రులతో , భేటీ అయ్యే అవకాశం రాష్ర్ట సమస్యలను ప్రస్తావించనున్న సీఎం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తుతోనూ సమావేశం హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం, ఇతర సమస్యల నేపథ్యంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మూడు రోజుల పర్యటన కోసం గురువారం రాత్రి ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, విద్యుత్ శాఖ మంత్రి పీయూష్‌గోయల్‌తో సమావేశం కావాలని ఆయన భావిస్తున్నారు. కాగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవలే నియమితులైన జస్టిస్ హెచ్ఎల్ దత్తును కూడా ముఖ్యమంత్రి కలువనున్నారు. ఈ పర్యటనలోభాగంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కేంద్ర మంత్రుల దృష్టికి కేసీఆర్ తీసుకురానున్నారు. నెల కిందట ఢిల్లీకి వెళ్లినప్పుడు కేంద్రానికి చేసిన పలు విజ్ఞప్తుల్లో ఏ ఒక్కటి కూడా నెరవేరని నేపథ్యంలో ఆయన మరోసారి కేంద్ర మంత్రులను కలసి ఆయా అంశాలను గుర్తు చేయనున్నారు. వాస్తవానికి టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాల తర్వాత 13న ఢిల్లీ వెళ్లాలని ముఖ్యమంత్రి మొదట నిర్ణయించారు. అయితే ‘హుదూద్’ తుపాను కారణంగా ప్లీనరీ వాయిదా పడటంతో ఢిల్లీ పర్యటనను ఖరారు చేశారు. కాగా, ఢిల్లీలోనే ముఖ్యమంత్రి కంటి పరీక్షలు చేయించుకోనున్నట్లు సమాచారం. కేసీఆర్‌తో పాటు ఆయన భార్య, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు తదితరులు వెళ్లారు. -
ఢిల్లీ యాత్ర విజయవంతం
నల్లగొండ కల్చరల్, న్యూస్‌లైన్ : ఫ్లోరైడ్ బాధితుల పట్ల పాలకులు ప్రదర్శిస్తున్న నిర్లక్ష వైఖరికి నిరసనగా ఈ నెల 16, 17 తేదీల్లో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిర్వహించిన ధర్నా విజయవంతమైందని జలసాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం నల్లగొండ పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయస్థాయి నాయకులు ఎంతో మంది తమకు ఆందోళనకు మద్దతు ప్రకటించారన్నారు. పార్లమెంటు సభ్యులు ప్రకాష్ జవదేకర్, వివేక్, ఆనంద్‌భాస్కర్, హన్మంతరావులు జిల్లాలోని ఫ్లోరైడ్ బాధితులకు జరుగుతున్న హక్కుల ఉల్లంఘన పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారన్నారు. కానీ, జిల్లాకు చెందిన ఏ ఒక్క నాయకుడూ అటు తిరిగైనా చూడలేదని, పైగా జిల్లాలో ఫ్లోరిన్ ఎక్కడుందని అంటున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు కనీసం పౌష్టికాహారం, తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఫ్లోరైడ్ మండలానికి ఒక్కంటికి *200 కోట్లు అందిస్తే.. వాటిని ఫ్లోరైడ్ నివారణకు ఖర్చు చేయకుండా రాజకీయ నాయకులు పంచుకున్నారని విమర్శించారు. జలసాధన సమితి రాజకీయంగా ఎదగాల్సిన అవసరం గురించి యావత్ తెలంగాణ నుంచి ఒత్తిడి వస్తుందని, ఆ దిశగా ఆలోచిస్తున్నామని తెలి పారు. రచయితల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు అంబటి వెంకన్న ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. సమావేశంలో అంజయ్య, దుబ్బ కొండమ్మ, అలుగుబెల్లి భిక్షారెడ్డి, మారం హేమచందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు ఢిల్లీలో ఏవాదం వినిపించడానికి వెళ్తున్నారు ?