
రేపు ఢిల్లీలో పర్యటించనున్న కేటీఆర్
హైదరాబాద్ సిటీ : రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖా మంత్రి కె.తారక రామావు ఒక రోజు పర్యటన నిమిత్తం గురువారం ఢిల్లీ వెళుతున్నారు. ఆయన కేంద్ర మంత్రులు రవి శంకర్ ప్రసాద్, నితిన్ గడ్కరీ, వెంకయ్యనాయుడులతో భేటీ కానున్నారు. వీరితో పాటు హడ్కో చైర్మన్ రవికాంత్‌ను కలిసి వాటర్‌గ్రిడ్‌కు అదనపు ఆర్ధిక సాయం గురించి చర్చించనున్నారు.
ఈ ముగ్గురు కేంద్ర మంత్రులతో మంత్రి కేటీఆర్ శాఖా పరమైన అంశాలపై చర్చిస్తారు. టి-హబ్ ప్రారంభోత్సవానికి రాష్ట్రానికి రావాల్సిందిగా కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను ఆహ్వానిస్తారు.