- ఏర్పాటుకు కేంద్రం అంగీకారం
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు కార్యకలాపాలను నివారించేందుకు వీలుగా విశాఖపట్నంలో సరిహద్దు భద్రతా దళాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ అంగీకరించింది.ప్రస్తుతం బలిమెలలో ఉన్న సరిహద్దు భద్రతాదళం మావోయిస్టుల కార్యకలాపాలపై హెలికాప్టర్ల ద్వారా నిఘా ఉంచడంతోపాటు నివారణకు చర్యలు చేపడుతోంది.తాజాగా మావోయిస్టులు ఉత్తరాంధ్రవైపు దృష్టి సారించారు. విశాఖ దిశగా కార్యకలాపాలకు ఉపక్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు, డీజీపీ జె.వి.రాముడు బుధవారం ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఎల్.సి.గోయల్‌ను కలసి విశాఖపట్నం వైపు కూడా సరిహద్దు భద్రతా దళాన్ని ఏర్పాటు చేయాలని, మావోయిస్టుల కదలికలపై నిఘా ఏర్పాటు చేయాలని కోరగా గోయల్ అంగీకరించారు.